ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 చిత్రాలు స్ట్రీమింగ్! | This Weekend Ott Release Movies List Only On April 12th | Sakshi
Sakshi News home page

Weekend Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ మూడే కాస్తా స్పెషల్!

Published Wed, Apr 10 2024 9:44 PM | Last Updated on Wed, Apr 10 2024 9:53 PM

This Weekend Ott Release Movies List Only On April 12th - Sakshi

మరో వీకెండ్‌ వచ్చేస్తోంది. మరోవైపు రంజాన్ పండగ వచ్చేసింది. దీంతో ఈ హాలీడేస్‌లో సినీ ప్రియులకు పండగే. వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావటం లేదు. ఈ వారంలో గీతాంజలి మళ్లీ వచ్చింది మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంతే కాకుండా ఒకటి, రెండు చిన్న చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి.

ఈ నేపథ్యంలో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈ వీకెండ్‌లో సందడి చేసేందుకు హిట్‌ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం విశ్వక్‌సేన్ గామి, ఓం భీమ్ బుష్, రజినీకాంత్ లాల్ సలామ్, మలయాళ హిట్ మూవీ ప్రేమలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. మీకిష్టమైన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. 

నెట్‌ఫ్లిక్స్‌

  • లాల్ సలామ్(తమిళ డబ్బింగ్ సినిమా)- ఏప్రిల్ 12
  • అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12
  • గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్‌కామ్)- ఏప్రిల్ 12
  • లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12
  • స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12
  • ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్‌ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్)- ఏప్రిల్ 12


అమెజాన్ ప్రైమ్ 

  • ఓం భీం బుష్(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12
  • ఎన్‌డబ్ల్యూఎస్‌ఎల్‌(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12

జీ5

  • గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 

  • ప్రేమలు(తమిళం, మలయాళం, హిందీ వర్షన్)- ఏప్రిల్ 12

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement