‘ఓమ్ భీమ్ బుష్’: అమెజాన్ ప్రైమ్
శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్ భీమ్ బుష్’ హిట్ టాక్‌తో భారీ హిట్ కొట్టింది. మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా ప్రేక్షకుల చేత ఔరా అనిపించింది.లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
గామి: జీ5
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గామి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో అఘోరా పాత్రలో మెప్పించారు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన గామి సినిమాను దాదాపు ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
'లాల్ సలామ్': నెట్ ఫ్లిక్స్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమా ఓటీటీ కష్టాలు దాటుకుని స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్‌లలో కొద్దిరోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'లాల్ సలామ్' స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.
ప్రేమలు: డిస్నీ ప్లస్ హాట్‍స్టార్
మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
రూ.5 కోట్ల లోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ.. తెలుగులో మార్చి 8న వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‌లో మలయాళం, హిందీ, తమిళ వెర్షన్‍లు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment