Lal Salaam Movie
-
'లాల్ సలామ్' ఓటీటీ ఆలస్యానికి కారణం చెప్పిన ఐశ్వర్య
సౌత్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రజనీకాంత్ 'లాల్ సలామ్' విడుదలైంది. అయితే, ప్రేక్షకుల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్‌సలామ్ ఓటీటీ రిలీజ్ గురించి చిత్ర డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఆప్డేట్ ఇచ్చారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొస్తామని ఆమె ఇలా ప్రకటించారు.'లాల్ సలాం' చిత్రాన్ని తెరకెక్కించడంలో మేము చాలా కష్టపడ్డాం. కానీ, మేము అనుకున్నంతగా విజయం పొందలేకపోయాం. మొదటి మేము అనుకున్నట్లుగా థియేటర్లో విడుదల చేయలేదు. కొన్ని సీన్లు లేకుండానే మీ ముందుకు తీసుకొచ్చాం. ఆ సీన్లు అన్నీ సినిమాకు చాలా ముఖ్యమైనవి. హార్డ్ డిస్క్ కనిపించకపోవడం వల్లే ఈ ఇబ్బందులు పడ్డాం. అయితే, అందులో మిస్ అయిన సీన్లు ఇప్పుడు రికవీరే చేశాం. వాటిని సినిమాకు యాడ్ చేసి సరికొత్తగా ఓటీటీ వర్షన్లో విడుదల చేస్తాం. ఇప్పటికే ఆ సీన్లకు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌ను రెహమాన్ ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.' అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.లాల్ సలామ్ చిత్రంలో మొయిదీన్ భాయ్ పాత్ర నిడివి మొదట్లో 10 నిమిషాలే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన(రజనీకాంత్) ఆ రోల్ చేస్తానన్నాడో తన రేంజ్‌కు పది నిమిషాలు పెడితే ఏం బాగుంటుందని విడుదలకు రెండురోజుల ముందు అనుకున్నాం. ఈ క్రమంలో ఆయన పాత్రకు సంబంధించి నిడివి పెంచాలని డిసైడయ్యాం. దీంతో స్క్రిప్ట్ మారిపోయింది. ఆపై హార్డ్ డిస్క్ కనిపించకుండా పోయింది. దీంతో తప్పని పరిస్థితిలో సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్కథలో బలం ఉన్నప్పటికీ చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయాల వల్లే సినిమాకు మైనస్‌గా మిగిలింది. ఇప్పుడు ఓటీటీ వర్షన్లో అలాంటి ఇబ్బంది ఉండదు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 20న సన్ నెక్ట్స్, నెట్‌ఫ్లిక్స్‌లో లాల్ సలామ్ స్ట్రీమింగ్కు రానుందని టాక్. థియేటర్లో చూడని వారికి తప్పకుండా నచ్చుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. మరోవైపు రంజాన్ పండగ వచ్చేసింది. దీంతో ఈ హాలీడేస్‌లో సినీ ప్రియులకు పండగే. వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావటం లేదు. ఈ వారంలో గీతాంజలి మళ్లీ వచ్చింది మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతే కాకుండా ఒకటి, రెండు చిన్న చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో సందడి చేసేందుకు హిట్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం విశ్వక్సేన్ గామి, ఓం భీమ్ బుష్, రజినీకాంత్ లాల్ సలామ్, మలయాళ హిట్ మూవీ ప్రేమలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. మీకిష్టమైన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ లాల్ సలామ్(తమిళ డబ్బింగ్ సినిమా)- ఏప్రిల్ 12 అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12 గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్కామ్)- ఏప్రిల్ 12 లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12 స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12 ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్)- ఏప్రిల్ 12 అమెజాన్ ప్రైమ్ ఓం భీం బుష్(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 ఎన్డబ్ల్యూఎస్ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12 జీ5 గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు(తమిళం, మలయాళం, హిందీ వర్షన్)- ఏప్రిల్ 12 -
ఓటీటీలో ఒకేరోజు నాలుగు హిట్ సినిమాలు.. ఈ వారం పండగే
‘ఓమ్ భీమ్ బుష్’: అమెజాన్ ప్రైమ్ శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్ భీమ్ బుష్’ హిట్ టాక్‌తో భారీ హిట్ కొట్టింది. మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా ప్రేక్షకుల చేత ఔరా అనిపించింది.లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. గామి: జీ5 టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గామి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో అఘోరా పాత్రలో మెప్పించారు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన గామి సినిమాను దాదాపు ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'లాల్ సలామ్': నెట్ ఫ్లిక్స్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమా ఓటీటీ కష్టాలు దాటుకుని స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో కొద్దిరోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'లాల్ సలామ్' స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ప్రేమలు: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ.. తెలుగులో మార్చి 8న వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం, హిందీ, తమిళ వెర్షన్లు అందుబాటులోకి రానున్నాయి. -
OTT: 'ఏజెంట్' బాటలో మరో భారీ డిజాస్టర్ సినిమా
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమాకు ఓటీటీ కష్టాలు ఉన్నట్లు సమాచారం. అఖిల్ 'ఏజెంట్' సినిమా మాదిరి ఈ చిత్రం కూడా ఓటీటీలోకి ఇక రాదని వార్తలు వస్తున్నాయి. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరీ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో కొద్దిరోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'లాల్ సలామ్' స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న విడుదలైన 'లాల్ సలామ్' వచ్చి నలభై రోజులు దాటింది. అయినా ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. గతంలో డైరెక్టర్ ఇశ్వర్య రజనీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'లాల్ సలామ్ సినిమాకు సంబంధించి 21 రోజులు షూటింగ్ ఫుటేజీ పోయిందని చెప్పింది. అందులో రజనీకాంత్, విష్ణువిశాల్, విక్రాంత్‌లపై 21 రోజుల పాటు కష్టపడి ఓ క్రికెట్ మ్యాచ్ సీన్ షూట్ చేశాం. 2500 మందితో 10 కెమెరాల సాయంతో ఎంతో ఖర్చుతో వాటిని చిత్రీకరించాం. కానీ, షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ పోయింది. దీంతో రీ షూట్ చేసే అవకాశం కూడా లేకుండాపోయింది. సినిమాను అలానే విడుదల చేయడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడింది.' అని ఆమె తెలిపింది. ఇప్పుడు ఇదే హార్డ్‌డిస్క్ మిస్సింగ్ ప్రభావం ఓటీటీపై పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ముందుగానే నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ కుదుర్చుకోవడం.. ఒప్పందం ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌ను సంప్రదించకుండా సినిమా విషయంలో మేకర్స్ పలు నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడు ఓటీటీ విషయంలో చిక్కులు వచ్చినట్లు సమాచారం. క్రికెట్ సీన్స్ రీ-షూట్ చేయాలనే నిబంధన ముందుగానే నెట్‌ఫ్లిక్స్ పెట్టినట్లు టాక్ ఉంది. అది ఇప్పుడు అవకాశం లేకపోవడంతో లాల్ సలామ ఓటీటీ విడుదలకు చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే. -
రజనీకాంత్ వల్లే నా భార్య బతికి ఉంది: ప్రముఖ నటుడు
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో జె లివింగ్‌స్టన్‌కు మంచి గుర్తింపు ఉంది. స్క్రీన్ రైటర్, నటుడిగా ఆయన చాలా సినిమాలకు పనిచేశారు. దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన గతంలో హీరోగా కూడా పలు సినిమాల్లో కనిపించాడు. రజనీకాంత్, విజయకాంత్, అజిత్ వంటి సూపర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయనకు ప్రస్తుతం చిన్న పాత్రలకే పరిమితం అయ్యారు. కొన్నేళ్లుగా భారీ సినిమాల్లో ఛాన్స్‌లు దక్కడం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆయనకు రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందుకు రజనీనే సాయం చేశారు. రీసెంట్గా 'లాల్ సలామ్' చిత్రంలో చాన్స్ దక్కడంతో అందులో మెప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ గురించి లివింగ్స్టన్ ఇలా మాట్లాడారు. 'లాల్ సలామ్‌లో రజనీకాంత్ స్నేహితుడిగా నేను నటించాను. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నా సతీమణి జెస్సీకి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రిలో అయితే చేర్పించాము కానీ అందుకు సరిపోయే డబ్బు నా వద్ద లేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో నేను ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా ఈ వార్త ఎలాగో రజనీ సర్ చెవులకు చేరింది. ఆ సమయంలో వెంటనే నాకు రజనీ సార్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆపై ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. నేను నిన్ను అన్నయ్యలా చూస్తున్నాను ఎంత అవసరమో చెప్పు అని రజనీ గారు పదేపదే అడిగారు. నా సతీమణి వైద్య ఖర్చుల కోసం అవసరమైన రూ. 15 లక్షల రూపాయలు రజనీ సార్ పంపించారు. నేను ఇప్పటికే అప్పుల్లో ఉన్నానని, మళ్లీ తిరిగి ఇవ్వలేనని ఆయనకు తెలుసు.. అయినా సాయం చేశారు. సూపర్‌స్టార్ సాయం చేయకుంటే నేను నా భార్యను రక్షించేవాడిని కాదు. రజనీ సార్‌ది గోల్డెన్ హార్ట్, నాకే కాదు నాలాంటి ఎంతో మంది ఆర్టిస్టులకు సరైన సమయంలో సహాయం చేసి వారి కుటుంబాల్లో సంతోషం నింపిన గుండె ఆయనది.' అని ఆయన అన్నారు. -
అట్టర్‌ఫ్లాప్‌గా లాల్‌సలామ్.. నాన్నవల్లేనన్న ఐశ్వర్య రజనీకాంత్!
లాల్ సలామ్.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. ఈ మూవీలో రజనీకాంత్‌ది అతిథి పాత్ర మాత్రమే! విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే కూతురే డైరెక్టర్ కావడంతో రజనీ గెస్ట్‌గా నటించేందుకు ఓకే చెప్పాడు. కానీ ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఏం బాగుంటుందని తన పాత్రను బలవంతంగా పొడిగించారట. దానివల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందంటోంది ఐశ్వర్య రజనీకాంత్. రజనీ ఇమేజ్‌కు తగ్గట్లుగా.. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'లాల్ సలామ్ చిత్రంలో మొయిదీన్ భాయ్ పాత్ర నిడివి మొదట్లో 10 నిమిషాలే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన(రజనీకాంత్) ఆ రోల్ చేస్తానన్నాడో తన రేంజ్‌కు పది నిమిషాలు పెడితే ఏం బాగుంటుందనుకున్నాం.. నిడివి పెంచాలని డిసైడయ్యాం. దీంతో స్క్రిప్ట్ మారిపోయింది. మొయిదీన్ భాయ్ చుట్టూ సినిమా తిరిగేలా ప్లాన్ చేశాం. నిజానికి అతడు ఇంటర్వెల్ వస్తాడు. కొన్ని కారణాల వల్ల తనను సినిమా ప్రారంభంలోనే పరిచయం చేశాం. లేదంటే ప్రేక్షకులు ఇంటర్వెల్ వరకు ఓపిక పట్టలేరేమోనని భయపడ్డాం.. అందుకే సినిమా అంతటా ఆయన ఉండేలా రకరకాలుగా ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఆయన్ను చూశాక సినిమా పట్టించుకోలేదు సినిమాలో కంటెంట్ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే రజనీకాంత్‌ను చూపించామో అంతా నీరుగారిపోయింది. ఆయన్ను చూశాక మిగతా కథ గురించి, పాత్రల గురించి ఎవరూ పట్టించుకోలేదు. అంటే రజనీకాంత్ సినిమా అంటే పూర్తిగా ఆయన గురించి మాత్రమే ఉండాలి. అది కాకుండా వేరే వాటిపై ఫోకస్ చేస్తే జనాలు ఒప్పుకోరని నాకు ఈ సినిమాతో తెలిసొచ్చింది. ఆయన ఉంటే మిగతావాటిపై ఎవరూ ఫోకస్ చేయలేరు. అంతగా డామినేట్ చేస్తాడు' అని చెప్పుకొచ్చింది. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న నటి మాజీ భర్త.. ఆశీర్వదించండంటూ పోస్ట్.. -
శివరాత్రికి ఓటీటీల్లో సినిమాల జాతర.. ఒక్క రోజే 9 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ సారి ఏకంగా వీకెండ్ సెలవులు వచ్చేస్తున్నాయి. అంతే కాకుండా మహాశివరాత్రికి కూడా సెలవు రావడంతో మూడు రోజులు ఇక పండగే. ఈ నేపథ్యంలో వీకెండ్ ప్లాన్ ఇప్పటికే వేసుకుని ఉంటారు. ఏయే సినిమాలు చూడాలి? ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? థియేటర్లకు రానున్న చిత్రాలేంటి? అనే తెగ వెతికేస్తుంటారు. మీరు ఆశించినట్టే ఈ సెలవుల్లో ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. టాలీవుడ్లో భీమా, గామి లాంటి పెద్ద చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. మరో రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. మరీ ఓటీటీల సంగతేంటీ అనుకుంటున్నారా? థియేటర్ల మాదిరే సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీల్లో సందడి చేసేందుకు స్పెషల్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్, మలయాళ హిట్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. కానీ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హనుమాన్ ఈనెల 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరీ సడన్‌గా స్ట్రీమింగ్ చేసి సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. లేదంటే నెక్ట్స్ వీకెండ్ దాకా ఆగాల్సిందే. వీటితో రజినీకాంత్ లాల్ సలామ్, సందీప్ కిషన్ మూవీ ఊరు పేరు భైరవకోన కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. నెట్‌ఫ్లిక్స్ మేరీ క్రిస్మస్(హిందీ సినిమా)- మార్చి 08 లోన్ అవే(వెబ్ సిరీస్)- సీజన్ 4- మార్చి 08 డామ్ సెల్ (యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 08 అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళ డబ్బింగ్ మూవీ)- మార్చి 08 లాల్ సలామ్(తమిళ సినిమా)- మార్చి 08 ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)- మార్చి 09 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్రూ లవర్(తమిళ సినిమా)- మార్చి 08 షోటైమ్ (హిందీ సినిమా)- మార్చి 08 అమెజాన్ ప్రైమ్ ఊరుపేరు భైరవకోన(తెలుగు సినిమా)- మార్చి 08 జీ5 హనుమాన్(తెలుగు సినిమా)- మార్చి 08 (రూమర్ డేట్) -
పేద ప్రజల కోసం రజనీ బిగ్ ప్లాన్?
పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో భారీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వాస్తంగా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆయన వయసు రిత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు వస్తాయిని వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే.. రాజకీయాల్లోకి రానప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆయన తన రాజకీయ పార్టీని సమాజ్ సేవా సంఘ్‌గా మార్చిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగు తనను అభిమానించే ప్రజలకోసం తాను ఏమైనా చేయాలని ఆలోచించిన రజనీకాంత్.. పేదల కోసం ఒక ఆసుపత్రిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం తమిళనాడులోని చంగల్పట్టు జిల్లా తిరుప్పురూర్‌లో 12 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. కొద్దిరోజుల క్రితమే అక్కడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించి తాను కొనుగోలు చేసిన 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కూడా ఆయన చేయించుకున్నారు. చెన్నై, తిరుప్పురూర్ మధ్య ఉన్న దూరం దాదాపు 45 కి.మీ ఉంది. అందరికీ అందుబాటులో అక్కడ ఆసుపత్రిని నిర్మించాలని రజనీ ఉన్నారట. త్వరలో భూమి పూజ కూడా రజనీ ప్రారంభించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ స్థలంపై కచ్చితమైన సమాచారం ఇంకా బయటకు రానప్పటికీ ఆసుపత్రి నిర్మాణం కోసమే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇక రజనీకాంత్ సినిమాల టాపిక్‌లోకి వస్తే.. ఇటీవల ఆయన నటించిన 'లాల్ సలామ్' సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఇక కొత్త చిత్రం 'వెట్టయాన్' విషయానికొస్తే, అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో నెలలో షూటింగ్ కూడా పూర్తి కానుంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ ఓ చిత్రంలో నటిస్తారు. -
లాల్ సలామ్ డిజాస్టర్.. ఆ హీరోతో ప్లాన్ చేస్తోన్న ఐశ్వర్య!
కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్ మరో నటుడితో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారా? అని అంటే ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. గతంలో ధనుష్ కథానాయకుడిగా ఒక చిత్రం, గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా వై రాజా వై అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఐశ్వర్య రజనీకాంత్. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో ఐశ్వర్య తర్వాత చిత్రానికి కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత ఇటీవల తన తండ్రి రజనీకాంత్‌ను గౌరవ పాత్రలో నటింపజేసి రూపొందించిన చిత్రం లాల్ సలామ్. ఇందులో నటుడు విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. క్రికెట్లోని అసమానతలు, మత విభేదాల గురించి చర్చించిన ఈ చిత్రం కూడా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది. తాజాగా ఐశ్వర్య మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సిద్ధార్థ్‌ను కథానాయకుడిగా నటింపచేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైనట్లు, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పైన ఐశ్వర్యకు హిట్ అందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. -
కలెక్షన్సే లేని సినిమాకు సక్సెస్ పార్టీ.. ఇది మరీ విడ్డూరం!
సూపర్‌స్టార్ రజనీకాంత్ అతిథిగా పవర్ ఫుల్ పాత్రను పోషించిన చిత్రం లాల్ సలామ్. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. నటి నిరోషా, జీవిత రాజశేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన లాల్ సలామ్ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం అంతంతమాత్రంగానే వసూళ్లు రాబడుతోంది. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వరుసగా మూడవ వారంలోకి అడుగు పెట్టడంతో చిత్ర యూనిట్ శుక్రవారం చైన్నెలో సక్సెస్ పార్టీని జరుపుకుంది. ఈ పార్టీలో రజనీకాంత్‌తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొనడం విశేషం. హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ఇందులో పాల్గొనలేదు. కాగా లాల్ సలామ్ చిత్రం సక్సెస్ పార్టీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కలెక్షన్సే లేని సినిమాకు సక్సెస్ పార్టీయా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. மக்களின் பேரன்பிற்கும், பேராதரவிற்கும் நன்றி!!! 🙏🏻😇 Successful 2 weeks of LAL SALAAM, into the 3rd week today! 📽️✨#LalSalaam 🫡 Running Successfully 💥📽️@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @Ananthika108 @LycaProductions #Subaskaran… pic.twitter.com/fcCdDYDmMu — Lyca Productions (@LycaProductions) February 23, 2024 చదవండి: నాన్న వల్లే నా జీవితం నాశనం అయింది: వనితా విజయ్ కుమార్ -
ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!
సూపర్‌స్టార్ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మధ్య థియేటర్లలోకి వచ్చిన 'లాల్ సలామ్'.. ఇప్పుడు అంతే ఫాస్ట్‌గా ఓటీటీలోకి కూడా వచ్చేయబోతుందనే న్యూస్.. మూవీ లవర్స్ మధ్య డిస్కషన్ జరుగుతోంది. ఎంత త్వరగా వస్తే అంతే త్వరగా చూసేయాలని అనుకుంటున్నారు. ఇంతకీ ఏ ఓటీటీలో ఎప్పుడు రాబోతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. రజినీకాంత్ సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఆయన్ని.. తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశాడు. అలాంటి సమయంలో 'జైలర్' సినిమాతో గతేడాది కమ్ బ్యాక్ ఇచ్చాడు. రూ.600 కోట్ల వరకు వసూళ్లు సాధించాడు. ఇంతలా హిట్ సినిమా తర్వాత వస్తున్నాడంటే మినిమమ్ బజ్ అయినా ఉండాలి. కానీ ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చిన 'లాల్ సలామ్' పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైంది. తమిళంలో అంతంత మాత్రంగా ఆడితే తెలుగులో పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'బిగ్‌బాస్' ప్రియాంక.. ఆ తప్పు వల్లే ఇలా!) క్రికెట్ నేపథ్య కథకి తోడు కులం బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ సినిమాలో రజినీకాంత్‌ది గెస్ట్ రోల్ కంటే కాస్త గుర్తింపు ఉన్న పాత్ర. ఈయన కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అట్టర్ ప్లాఫ్గా నిలిచింది. అయితే ఫలితం ఇలా రావడంతో అనుకున్న సమయాని కంటే ముందే ఓటీటీలోకి తీసుకొచ్చేయాలని ఫిక్సయ్యారట. రజినీకాంత్ 'లాల్ సలామ్' సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. లెక్క ప్రకారం మార్చి మధ్యలో స్ట్రీమింగ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అది మార్చి తొలివారానికి మారినట్లు సమాచారం. అంటే మార్చి 2న ఓటీటీ రిలీజ్ ఉండొచ్చు. ఒకవేళ ఇది కాకపోతే మార్చి 9న గ్యారంటీగా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. (ఇదీ చదవండి: బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ రకుల్ పెళ్లి.. ఈ జోడీ ఆస్తి ఎంతో తెలుసా?) -
లాల్ సలామ్: రజనీకాంత్ మాయ పనిచేయలేదా?
లాల్ సలామ్ చిత్రం రజనీకాంత్ సినిమా కెరియర్లోనే బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో ఆయన నటించింది ప్రత్యేక పాత్ర అయినప్పటికీ సినిమాకు హైప్ వచ్చిందే ఆయన వల్ల. జైలర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో 'లాల్ సలామ్' చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌లోనే దారుణమైన కలెక్షన్స్‌ను తెచ్చుకుంది. ఇక తెలుగు, కన్నడలో అయితే చెప్పాల్సిన పనిలేదు. చాలా చోట్ల ప్రేక్షకుల లేకపోవడంతో ఈ సినిమాను తీసేసి వేరే చిత్రాన్ని తీసుకున్నారు. జైలర్ చిత్రానికి మొదటి వారంలో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లు గ్రాస్ వచ్చింది. ఫైనల్‌గా రూ. 650 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు లాల్ సలామ్ విషయంలో తెడా కొట్టేసింది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 27 కోట్లు రాబట్టింది. నెట్ పరంగా చూస్తే కేవలం రూ. 15 కోట్లు మాత్రమే. దీంతో ఈ సినిమా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. రజనీ ఇమేజ్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయింది. ఓవర్సీస్లో ఈ సినిమా రూ. 4 కోట్లు రాబడితే తమిళనాడులో రూ. 19 కోట్లు సాధించింది. తెలుగులో మాత్రం కేవలం రూ. 2 కోట్లకే పరిమితం అయింది. కన్నడలో కూడా రూ. 2 కోట్లతోనే ముగింపు పలికింది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో ఒక పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచిపోనుంది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దీనికి సంగీతం భారతదేశంలో అగ్ర సంగీత దర్శకుడు అయిన ఏఆర్ రహమాన్ అవటం ఇంకో విశేషం. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ రెండు ముఖ్య పాత్రలు పోషించారు. జీవితా రాజశేఖర్ కూడా ఇందులో కొంత సమయం పాటు కనిపిస్తారు. -
బిగ్ డీల్‌తో ఓటీటీలోకి 'లాల్ సలామ్'.. భారీగా రజనీకాంత్ రెమ్యునరేషన్
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన మూడో చిత్రం 'లాల్ సలామ్'. ఈ చిత్రంలో యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా.. రజనీకాంత్ అతిధి పాత్రలో మెప్పించారు. లైకా ప్రొడక్షన్స్ ద్వారా సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఫిబ్రవరి 9న విడుదలైంది. కానీ ప్రేక్షకులను నిరాశపరిచింది. సాధారణంగా రజనీకాంత్ చిత్రాలకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ చిత్రంలో మొయిదీన్ భాయ్ అనే కీలక పాత్రలో నటించారు. రజినీకాంత్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక కోలీవుడ్‌లో అయితే చెప్పాల్సిన పనిలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో లాల్ సలాం సినిమాను చూసే వాళ్లు లేకపోవడంతో భారీగా స్క్రీన్స్ తగ్గించేశారు. కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ చేసి డబ్బు కూడా ప్రేక్షకులకు రిటర్న్ ఇచ్చేశారు. ఓటీటీలో ఎప్పుడు అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఓ వార్త ప్రచారం జరుగుతుంది. లాలా సలాం ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన 60 రోజులకు స్ట్రీమింగ్ చేయాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. కానీ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో కేవలం 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందట. నిమిషానికి రూ. 1.30 కోట్ల రెమ్యునరేషన్ లాల్ సలామ్ సినిమా కోసం రజనీకాంత్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో అంటూ ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. ఈ సినిమాలో ఆయన కేవలం 30 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. రజనీ ఉన్నంత సేపు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ కోసం రజనీకాంత్ సుమారు రూ. 40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన నిమిషానికి రూ. 1.30 కోట్లు రజనీ తీసుకున్నట్లు తెలుస్తోంది. -
లాల్ సలామ్ ను పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు..!
-
కూతురు కోసం రజనీకాంత్ మరో సాహసం.. ఈ సారి రిజల్ట్ ఏంటో?
ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నటుడు రజనీకాంత్. ఈయనకు దళపతి విజయ్ పోటీ అంటూ ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంతో నటుడు రజనీకాంత్ లాల్ సలామ్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై గట్టిగానే కౌంటర్ ఇచ్చిన విషయం విధితమే. కాగా ఇప్పుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి పార్టీ పేరును కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఒకటి రెండు చిత్రాలు చేసి నటనకు స్వస్తి పలకబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రజనీకాంత్ సూపర్‌స్టార్ పట్టానికి మరి కొంతకాలం ఎలాంటి ఢోకా ఉండబోదనేది కోలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ విషయాన్ని పక్కన పెడితే రజనీకాంత్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ఈయన ప్రస్తుతం జై భీమ్ చిత్ర ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత లోకేష్ కనకరాజ్‌తో తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల తన పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్ సలామ్ చిత్రంలో రజనీకాంత్ అతిథిగా పవర్ఫుల్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి..తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే పెద్ద కూతురు చిత్రంలో నటించిన రజనీకాంత్ తాజాగా ఆయన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ అతిథి పాత్రలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. సౌందర్య ఇంతకు ముందే తన తండ్రి కథానాయకుడిగా కోచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కాగా తాజాగా సౌందర్య రజనీకాంత్ మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు, ఈ చిత్రానికి పది రోజులు కాల్షీట్స్ కూడా కేటాయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. -
సూపర్ స్టార్ సినిమాకు షాక్.. ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదు!
సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సలామ్. గతేడాది జైలర్ సినిమాతో హిట్ కొట్టిన తలైవా ఈ ఏడాది తన కూతురి దర్శకత్వంలో నటించారు. యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో తలైనా మొహిద్దీన్ భాయ్ అనే కీలక పాత్రలో నటించారు. రజినీకాంత్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక కోలీవుడ్‌లో అయితే చెప్పాల్సిన పనిలిదు. రజినీకాంత్ మూవీ అంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దవ్వాల్సిందే. కానీ ఎవరు ఊహించని లాల్ సలామ్ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. కోలీవుడ్‌లో ఫర్వాదలేనిపించినా.. తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ మూవీని అస్సలు పట్టించుకోలేదు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా మార్నింగ్ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూపర్ స్టార్ సినిమా తొలి రోజే చాలా చోట్ల మార్నింగ్ షోలు రద్దయ్యాయి. దీంతో హైదరాబాద్‌లో అయితే మల్టీప్లెక్స్‌ల్లో రజినీ సినిమా చూడాలనుకున్న తెలుగు ఆడియన్స్‌కు నిరాశే మిగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల టికెట్లు కొనేవాళ్లు లేక మార్నింగ్ షోలు రద్దు చేశారు. అయితే ఇప్పటికే కొంత మంది టికెట్స్ బుక్ చేసుకోగా.. థియేటర్ల యాజమాన్యాలు వాళ్లకు డబ్బులు రీఫండ్ చేయడం గమనార్హం. తలైవా నటించిన సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోలకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రవితేజ ఈగల్, జీవా, మమ్ముట్టి యాత్ర-2 సినిమాలు రిలీజ్ కావడం ఒక కారణమని తెలుస్తోంది. ఏది ఏమైనా రజినీకాంత్ ఉన్న ఇమేజ్ ప్రకారం కనీసం సగం థియేటర్లు అయినా నిండి ఉండాల్సింది. ఏకంగా స్టార్ హీరో సినిమాకు ఫస్ట్ షోలు రద్దు కావడంతో ఆడియన్స్ షాక్‌కు గురవుతున్నారు. మరి వీకెండ్లోనైనా లాల్ సలామ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. గతంలో రజనీకాంత్ సినిమాలను తెలుగు ఆడియన్స్ బాగానే ఆదరించారు. గతేడాది వచ్చిన జైలర్ మూవీ టాలీవుడ్లో మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.47 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. -
Lal SalaamTwitter Review: 'లాల్ సలాం' ట్విటర్ రివ్యూ
మొయిద్దీన్ భాయ్‌గా థియేటర్లో అడుగుపెట్టేశారు రజనీకాంత్. ఆయన కీలక పాత్ర పోషించిన 'లాల్ సలాం' నేడు ఫిబ్రవరి 9న విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థలో సుభాస్కరణ్ ఈ మూవీని నిర్మించారు. విష్ణు విశాల్ , విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అతిథిగా మెప్పించారు. ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ బిగ్ స్క్రీన్‌పై కనిపించారు. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు తమిళనాడులోని అన్ని ప్రదేశాల్లో ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో. మానవత్వాన్ని అందరితో పంచుకో. భారతీయుడిగా నేర్చుకోవల్సింది ఇదే అని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. మత సామరస్యం ప్రధాన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది అని చాలా జాగ్రత్తగా ఈ కథన ఐశ్వర్య డైరెక్ట్ చేశారని నెటిజన్లు తెలుపుతున్నారు. లాల్ సలాం ఇచ్చిన సామాజిక సందేశం అందరినీ మెప్పిస్తుందని తెలుపుతున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ ఎంట్రీ సీన్ మామూలగా ఉండదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ సమయంలో అందరికీ భాషా సినిమా గుర్తుకొస్తుందని తెలుపుతున్నారు. లాల్ సలాం చిత్రంలో రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించినా కథలో పూర్తిగా ఆయనే ఆక్రమించేశాడని చెప్పవచ్చు. ఇందులో ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అదరగొట్టేశాడని అంటున్నారు. ఆయన అందించిన బీజీఎమ్‌తో రజనీకాంత్ ఎలివేషన్ సీన్స్ పీక్స్‌కు చేరుకుంటాయని తెలుపుతున్నారు. లాల్ సలాం కథ అనేది పవర్ఫుల్ సబ్జెక్ట్ కానీ దానిని చెప్పడంలో కొంత వరకు ఐశ్వర్య విఫలం అయ్యారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. రజనీకాంత్‌ను చాలా తక్కువ సమయంలో చూపించారని అంటున్నారు. విష్ణు - విక్రాంత్‌ల సీన్లు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయని అంటున్నారు. సినిమాలో పెద్దగా ఎమోషనల్ కనెక్షన్ లేదని తెలుపుతూ ఫైనల్‌గా సాధారణ ఆడియెన్స్‌కు నిరాశ కలిగిస్తుందని చెబుతున్నారు. #LalSalaam - 🙏 Powerful Subject, Powerless Narration. Superstar more than extended cameo, Vishnu - Vikranth Neat. Sadly Poor Characterization. Scattered scenes & Abrupt Edits. Emotional Connect is missing. DISAPPOINTMENT! — Christopher Kanagaraj (@Chrissuccess) February 9, 2024 #LalSalaam 2nd Half 🔥🔥🔥🔥 A Tribute Film To All The Muslim Friends #Thalaivar Getup 💥🥵🙆♂️ We Won @ash_rajinikanth Akka 🏆 Social Message Was Very Well Told #LalSalaamFDFS #SuperstarRajinikanth pic.twitter.com/CdXZenCnzt — 𝐀𝐥𝐥𝐚𝐫𝐢 𝐑𝐚𝐦𝐮𝐝𝐮 𝐍𝐓𝐑 (@AllariRamuduNTR) February 9, 2024 Unexpected 🔥 THALAIVAR Entry #LalSalaam pic.twitter.com/TKSzbzSfm8 — 𝗘𝗻𝗶𝘀𝗵𝗠𝗦𝗗 (@enish_7) February 9, 2024 #LalSalaamReview Humanity should defeat religion Second half was disappointing in recent movies But #LalSalaam scores better post interval . Climax was hard ✨🔥 Winner ✨✨✨ pic.twitter.com/4uiWL1usi0 — Matt.S (@mattskumar) February 9, 2024 #LalSalaam Good watch! Strong story, ok screenplay and powerful climax. ARR songs are wonderful. #Thalaivar as usual rocks. Valiant attempt by the newbie director #AishwaryaRajinikanth 🤘🏼👍🏻👏🏻#LalSalaamFDFS #RegalTimesSquare #LalSalaamUSA@LycaProductions — Kodes (@KodesOn) February 9, 2024 Thank you Ethiraj College ♥️🤗#LalSalaam pic.twitter.com/n5fzI5gqsr — Vikranth Santhosh (@vikranth_offl) February 8, 2024 2nd Half increased the standards ✅ Climax will be talk of the town Overall, Vere Level Film 🔥🔥🙏 Not even a single flaw to point Kudos to @ash_rajinikanth 👏👏#LalSalaam #LalSalaamFDFS @rajinikanth #SuperstarRajinikanth pic.twitter.com/8wyJ3JXUsz — 𝐀𝐥𝐥𝐚𝐫𝐢 𝐑𝐚𝐦𝐮𝐝𝐮 𝐍𝐓𝐑 (@AllariRamuduNTR) February 9, 2024 -
'అలాంటి వాడే చాలా ప్రమాదకరం'.. ఆసక్తిగా లాల్ సలామ్ ట్రైలర్!
సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటించిన చిత్రం లాల్ సలామ్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో రిలీజవుతోంది. మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ కనిపించనున్నారు. టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ విడుదల చేస్తోంది. తాజా ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతుంది. ‘ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలో వేశారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అయింది. ఊర్లోని రకరకాల మతాలకు చెందిన మనుషులు, రాజకీయ నాయకులు, క్రికెట్, మత ఘర్షణల మధ్య మొయినుద్దీన్ భాయ్ రాక వంటి అంశాలతో పవర్ ఫుల్ ట్రైలర్‌గా నిలిచింది. ‘మందిని కూడ బెట్టేవాడి కన్నా.. ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడ్ని ప్రాణాలతో వదిలి పెట్టకూడదు’ అనే డైలాగ్‌తో రజినీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది. కాగా.. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో సెంథిల్, తంబి రామయ్య, అనంతిక, వివేక్ ప్రసన్న, తంగ దురై కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
'మా నాన్నకు అలాంటి అవసరం లేదు'.. సూపర్ స్టార్ కూతురు ఆసక్తికర కామెంట్స్!
రజనీకాంత్ పవర్ఫుల్ పాత్ర పోషించిన తాజా చిత్రం లాల్ సలామ్. ఈ చిత్రంలో ఆయన అతిథిగా మొహిద్దీన్ అనే పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ ఎత్తున నిర్మించారు. విక్రాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నటి నిరోషా, జీవిత, తంబిరామయ్య, సెంథిల్, తంగదురై ముఖ్య పాత్రలు పోషించారు. కాగా సీనియర్ క్రికెట్ కళాకారుడు కపిల్ దేవ్ కూడా ఇందులో అతిథి పాత్ర పోషించడం మరో విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన లాల్ సలామ్ చిత్ర షూటింగ్ ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ.. లాల్ సలామ్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమ వేదికపై తను మాట్లాడింది తన తండ్రి రజనీకాంత్‌కు తెలియదన్నారు. అయితే చిత్ర ప్రమోషన్ కోసమే తాను మాట్లాడినట్టు ఆ తర్వాత చైన్నె విమానాశ్రయంలో కొందరు మీడియా వారు తన తండ్రి వద్ద ప్రస్తావించారన్నారు. అందుకు చిన్న వివరణ ఇస్తున్నానని తెలిపారు. తన ద్వారానో.. లేదంటే చిత్రంలోని రాజకీయ అంశాల వల్లనో సూపర్ స్టార్ చిత్రం ఆడాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి రాజకీయాలు లేని జైలర్ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. వ్యక్తిగత భావాలకు గౌరవం ఇచ్చే వ్యక్తి తన తండ్రి రజనీకాంత్ అని పేర్కొన్నారు. కాగా రాజకీయాలు అన్నవి ప్రతి రంగంలోనూ ఉంటాయని.. కానీ అలాంటి రాజకీయంతో కూడిన క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగే కథా చిత్రం లాల్ సలామ్ అని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించిన లైకా ప్రాడక్షన్న్స్ అధినేత సుభాస్కరన్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో నటుడు విష్ణు విశాల్, విక్రాంత్, తంబి రామయ్య, సెంథిల్ పాల్గొన్నారు. -
రజనీకాంత్ 'లాల్ సలాం' ట్రైలర్ విడుదల
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లాల్ సలాం'. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జైలర్ తర్వాత రజనీకాంత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కోలీవుడ్‌లో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 9న లాల్ సలాం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల స్పీడ్ పెంచేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమళ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రజనీ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది. ఏడేళ్ల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సంగీతంతో ప్రయోగాలు చేసే మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ చిత్రంతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్‌ల గాత్రాన్ని కృత్రిమ మేధస్సు సాంకేతికత ద్వారా పునఃసృష్టించి 'లాల్ సలామ్' చిత్రంలో వినిపించారు. 'తిమిరి ఎళుడా..' అనే ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 'లాల్ సలాం'లో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో ప్రముఖ సీనియర్ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె నటించనుండడంతో అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?
ఈ వారం థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో సూపర్‌స్టార్ రజినీకాంత్ మూవీ కూడా ఒకటుంది. ఏంటి నిజమా? అని మీరు అనొచ్చు. కానీ అదే నిజం. 'లాల్ సలామ్' పేరుతో తీసిన ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమో వాయిదా వేశారు. ఇప్పుడు థియేటర్లలో తీసుకొస్తున్నా సరే ఒక్కడూ పట్టించుకోవట్లేదు. పేరుకే సూపర్‌స్టార్ గానీ అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? రజినీకాంత్ అంటే తెలుగులోనూ క్రేజ్ ఉంది. కానీ అదంతా ఒకప్పుడు. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాల వల్ల మన ప్రేక్షకులు ఈయన్ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. సరిగ్గా అలాంటి టైంలోనే.. అంటే గతేడాది 'జైలర్' రిలీజైంది. విడుదలకు ముందు దీనిపై ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒక్క పాట, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ పుణ్యామా అని మూవీ హిట్ అయిపోయింది. రజినీ కమ్ బ్యాక్ అని హడావుడి చేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది. (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) ఇప్పుడు అదే రజినీ నుంచి 'జైలర్' లాంటి హిట్ తర్వాత మరో సినిమా వస్తుంటే అసలు హైప్ అనేదే ఎక్కడా కనిపించట్లేదు. ఈ చిత్రంలో రజినీకాంత్‌ది గెస్ట్ రోల్ అయినప్పటికీ.. దీన్ని ఈయన మూవీగానే చూస్తారు. కానీ ఎందుకో అది జరగట్లేదు. రజినీ కూతురు ఐశ్వర్య.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా అనేది ఒకటి థియేటర్లలోకి వస్తోందనేది కూడా చాలామందికి ఇప్పటికీ తెలియదు. తమిళనాడులో ఆడియో లాంచ్ పేరిట ఓ ఈవెంట్ నిర్వహించారు కానీ తెలుగులో కనీస ప్రమోషన్స్ చేయట్లేదు. ఇదంతా చూస్తుంటే రజినీకాంత్.. తెలుగు ప్రేక్షకుల్ని లైట్ తీసుకుంటున్నారా? లేదంటే ఈ సినిమా మీద నమ్మకం లేదా అనే డౌట్ వస్తోంది. అందువల్లనే తెలుగులో కనీస పబ్లిసిటీ చేయట్లేదా అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. రజినీకాంత్ సినిమాకు ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడం ఏంటా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?) -
12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్
యంగ్ హీరోయిన్.. సినీ ప్రేక్షకులకు క్షమాపణ చెప్పింది. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం పెట్టిన పోస్ట్‌పై ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చేసింది. తనకు తమిళ ఆడియెన్స్ అంటే ఎంతో గౌరవమని చెప్పింది. అలానే అప్పట్లోని స్టేట్మెంట్తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ అప్పుడేం జరిగింది? నటి ధన్య ఇప్పుడెందుకు సారీ చెప్పిందో తెలుసా? (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా.. డేట్ ఫిక్స్) బెంగళూరులో పుట్టి పెరిగిన ధన్య బాలకృష్ణ.. తెలుగు, తమిళంలో బోలెడన్ని సినిమాలు చేసింది. హీరోయిన్, సహాయ పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. ఈమె నటించిన 'లాల్ సలామ్' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. సరిగ్గా ఇప్పుడు ఓ పాత గొడవ బయటకొచ్చింది. గతంలో తమిళ ప్రేక్షకులని కించపరిచేలా 2012లో ఫేస్బుక్లో ఈమె పోస్ట్ పెట్టిందని చెబుతూ ఓ స్క్రీన్ షాట్‌ని వైరల్ చేశారు. దీని వల్ల తమిళ నెటిజన్స్.. ఈమెకు చుక్కలు చూపించారు. దీంతో ధన్య ఆ పోస్టుపై క్లారిటీ ఇచ్చేసింది. 12 ఏళ్ల పోస్ట్‌లో ఏముంది? 'ప్రియమైన చెన్నై, మీరు అడుక్కుంటే మేం నీళ్లిచ్చాం. మీరు అడుక్కుంటే కరెంట్ ఇచ్చాం. మీరు వచ్చి మా అందమైన నగరాన్ని ఆక్రమించారు. క్షమాపణ చెబితే మేం దయతలచి ఫ్లే ఆఫ్స్‌కి వెళ్లేలా చేస్తాం. మీరు అడుక్కుంటే మేం ఇస్తాం' అని అప్పట్లో ధన్య బాలకృష్ణ రాసిన ఫేస్బుక్ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. తాజాగా ఈ స్క్రీన్ షాట్‌పై స్పందించిన నటి ధన్య.. సోషల్ మీడియాలో పెద్ద నోట్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఇప్పుడు ఏం చెప్పింది? 'నా వృత్తి, తినే తిండి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ కామెంట్స్ నేను చేయలేదు. అది నా అభిప్రాయం కాదు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. అది ట్రోలింగ్కి సృష్టించిన స్క్రీన్ షాట్. ఇన్నేళ్లు ఎందుకు దీనిపై స్పందించలేదా అని మీరనుకోవచ్చు. కానీ ఇన్నేళ్లలో నాకు, నా కుటుంబానికి చాలా బెదిరింపులు వచ్చాయి. వాళ్లని కాపాడుకోవడంలో భాగంగా నేను సైలెంట్‌గా ఉండిపోవాల్సి వచ్చింది' 'కానీ ఇప్పుడు ఆ కామెంట్స్ నేను చేయలేదని పక్కాగా చెబుతున్నాను. నేను తమిళ ఇండస్ట్రీలోనే నటిగా కెరీర్ మొదలుపెట్టాను. ఇక్కడ పనిచేస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను. నాకు తమిళ ప్రేక్షకులే ఫస్ట్ ఆడియెన్స్. ఓ మహిళగా నేను ఎవరినీ హర్ట్ చేయలేదు. చేయను కూడా. ఈ స్టేట్మెంట్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నేను ఇందులో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తమిళ ప్రేక్షకులందరికీ క్షమాపణ చెబుతున్నాను' అని నటి ధన్య బాలకృష్ణ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) -
'లాల్ సలామ్' పాటలో ఆ దివంగత సింగర్స్ గాత్రం
రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'తిమిరి ఎలుదా' అనే పాటను ఏఐ టెక్నాలజీతో రూపొందించారు. ఈ పాటలో దివంగత గాయకులు షాహుల్ హమీద్, బాంబ భక్య స్వరాలను ఉపయోగించడంతో ఆ పాటపై అందరిలో ఆసక్తి నెలకొంది. సంగీత ప్రపంచంలో ఇదొక అద్భుతం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. ఇదెలా సాధ్యం అంటూ కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో తాజాగా ఏఆర్ రెహమాన్ వివరణ ఇచ్చారు. లాల్ సలామ్ ఆడియోను కొద్దిరోజుల క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలోని పాటలకు మంచి టాక్ వచ్చింది. కానీ ఇందులోని తిమిరి ఎలుదా అనే పాట కోసం గతంలో మరణించిన వారి వాయిస్ ఉపయోగించడంతో ఆయనపై కొంతమేరకు విమర్శలు వచ్చాయి. 'గతంలో మరణించిన ఆ ఇద్దరి సింగర్స్ వాయిస్ అల్గారిథమ్‌లను ఉపయోగించేందుకు వారి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకున్నాము. అందుకు గాను ఆ కుటుంబాలకు తగినంత పారితోషకాన్ని కూడా అందించడం జరిగింది. మంచి కోసం టెక్నాలజీని ఉపయోగించడంలో ఎలాంటి తప్పులేదు.' అని రెహమాన్ తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. మరణించిన సింగర్స్ వాయిస్‌తో పాటలు రూపొందించడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 1990లలో తన మ్యాజికల్ వాయిస్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన షాహుల్ హమీద్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌లో పలు సాంగ్స్ పాడటం జరిగింది. 1997లో ఆయన తుది శ్వాస విడిచారు. బాంబ భక్య కూడా రెహమాన్ మ్యూజిక్‌లో పాటలు పాడారు. ముఖ్యంగా రోబో, బిగిల్,పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాల్లో ఆయన గాత్రం పాపులర్ అయింది. 2022లో ఆయన కూడా మరణించిన విషయం తెలిసిందే. అమ అభిమాన సింగర్స్ గాత్రాన్ని ఏఐ టెక్నాలజీతో మళ్లీ మరోసారి వినేలా చేసిన రెహమాన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక లాల్ సలామ్ సినిమా విషయానికి వస్తే.. రజనీకాంత్, లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఇందులో నటించారు. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. -
కూతురు మాటలకు క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్
రజనీకాంత్ అతిథిగా పవర్ఫుల్ పాత్రను పోషించిన చిత్రం లాల్ సలాం. విష్ణు విశాల్, విక్రాంత్ నటించిన ఈ చిత్రానికి రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇటీవల ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు. దర్శకురాలు ఐశ్వర్య మాట్లాడుతూ నిజానికి తన తండ్రి సంగీ కాదని ఆయన సూపర్‌స్టార్ అని అన్నారు. సంఘీ అయితే లాల్ సలాం చిత్రంలో ఆయన నటించే వారే కాదని పేర్కొన్నారు. సంఘీ అంటే మతవాది అనే అర్థం వస్తుంది. కాగా రజనీకాంత్ సోమవారం ఉదయం జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్న వేట్టైయాన్ చిత్ర షూటింగ్ కోసం ఏపీలోని కడప వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో మీడియాతో ఐశ్వర్య మాట్లాడిన సంఘీ అంశం గురించి ప్రశ్నించగా సంఘీ అంటే చెడ్డ పదం కాదని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఐశ్వర్య ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. తన తండ్రి ఒక ఆధ్యాత్మిక భావాలు కల వ్యక్తి అని.. ఎందుకు అలాంటి దృష్టిలో చూస్తారని మాత్రమే అన్నారని వివరించారు. అయినా ఈ చర్చ లాల్ సలాం చిత్ర ప్రచారం కోసం కాదని, లాల్ సలాం చిత్రం అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు. -
విజయ్‌తో కాదు...నాతో నాకే పోటీ
‘‘నాకు, విజయ్‌కు మధ్య పోటీ లేదు. తనకు తానే పోటీ అని విజయ్ అంటుంటాడు. నేనూ అంతే. నాకు పోటీ నేనే’’ అన్నది రజనీకాంత్ లేటెస్ట్ స్టేట్మెంట్. ‘లాల్‌సలామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రజనీకాంత్ ఈ విధంగా మాట్లాడారు. దీనికి ఓ కారణం ఉంది. ‘జైలర్’ సినిమా ఆడియో ఫంక్షన్ వేదికగా రజనీకాంత్ ఓ డేగ, కాకి కథ చెప్పారు. ‘కాకులు ఎంత అరిచినా వాటి అరుపులు పట్టించుకోకుండా డేగ ఆకాశానికి ఎగురుతూనే ఉంటుంది’ అంటూ తన జర్నీని ఉద్దేశించి ఆ కథ చెప్పారు రజనీ. దాంతో విజయ్ను ఉద్దేశించే ఆ కథ చెప్పారని కొందరు విజయ్ ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. ఈ విషయంపై తాజాగా చెన్నైలో జరిగిన ‘లాల్‌సలామ్’ ఆడియో లాంచ్ వేదికగా రజనీకాంత్ స్పందించారు. ‘‘జైలర్’ ఫంక్షన్లో నేను చెప్పిన కథ తప్పుగా ప్రచారంలోకి వెళ్లింది. విజయ్‌ని ఉద్దేశించే నేను ఆ కథ చెప్పానని ప్రచారం జరగడం బాధగా అనిపించింది. ‘ధర్మత్తిన్ తలైవన్’ సినిమా షూటింగ్ టైమ్‌లో విజయ్ తండ్రి చంద్రశేఖర్ నాకు అతన్ని పరిచయం చేసి, విజయ్ నటనపట్ల ఆసక్తిగా ఉన్నాడని చెప్పారు. చదువు పూర్తి చేశాక ఇండస్ట్రీలోకి రావాలని విజయ్‌కి సలహా ఇచ్చాను. తన చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. ప్రతిభ, క్రమశిక్షణ, కష్టంతో విజయ్ పెద్ద స్టార్‌గా ఎదిగాడు. ఇకపై మా ఇద్దరి మధ్య పోటీ పెట్టొద్దని ఫ్యాన్స్‌ని కోరుతున్నాను’’ అన్నారు. ఇక ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ‘లాల్ సలామ్’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. -
'అర్థమైందా రాజా' వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: రజనీకాంత్
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన మూడో చిత్రం 'లాల్ సలామ్' ఆడియో ఆవిష్కరణ శుక్రవారం చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో విక్రాంత్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలలో నటించారు, ఇందులో రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ ద్వారా సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి లాల్ సలామ్ రానుంది. లాల్ సలామ్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. లాల్ సలామ్ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. "నా పాత్ర, మొయిదీన్ భాయ్, దక్షిణాది జిల్లాలో నివసించిన ఒక వ్యక్తి ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం 1992లో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. కానీ అవకాశవాదులు అతని పేరును తెరపై లేకుండా చూడాలని కోరుకున్నారు. వారు అతని గుర్తింపును దాచారు. మత సామరస్యంతో ఈ చిత్రం నిండి ఉంటుంది.' అని రజనీ చెప్పారు. నాకు ఎవరూ పోటీ కాదు జైలర్ సినిమా ఈవెంట్లో భాగంగా 'అర్థమైందా రాజా' అంటూ నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని వైరల్ చేశారు. సాధారణంగా చెప్పిన మాటలను దళపతి విజయ్‌పై కావాలనే నేను ఆ వ్యాఖ్యలు చేసినట్లు వ్యాప్తి చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను అతన్ని చిన్నతనం నుంచి చూస్తున్నాను. విజయ్ నా కళ్ల ముందే పెరిగాడు. ఎంతో పట్టుదలతో కష్టపడి నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. అలాంటి వ్యక్తిపై నేను ఎందుకు కామెంట్లు చేస్తాను. నాకు ఎవరితోనూ పోటీ ఉండదు. నాకు నేనే పోటీగా కొనసాగుతాను. ఈ సమయంలో నా అభిమానులకు చెప్పేది ఒక్కటే.. మా ఇద్దరినీ పోల్చి చూడకండి.' అని రజనీకాంత్ వివరణ ఇచ్చారు. జైలర్ ఈవెంట్లో రజనీకాంత్ మాట్లాడుతూ.. 'మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా..' అంటూ తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ కామెంట్ చేశారు. ఆ సమయంలో విజయ్, ఆయన ఫ్యాన్స్‌ను ఉద్దేశించే రజనీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో రజనీపై విజయ్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. Clarification from Superstar Rajinikanth at the #LalSalaamAudioLaunch about the KAAKA KAZHUGU speech. pic.twitter.com/8NzNC7Psz0 — Actor Vijay Universe (@ActorVijayUniv) January 26, 2024 -
మా నాన్న అలాంటి వారు కాదన్న ఐశ్వర్య.. కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలామ్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా భారీ ఎత్తున జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్, ఆయన భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సెలందర్య, మనవళ్లు యాత్ర, లింగ పాల్గొన్నారు. వీరితో పాటు దర్శకులు నెల్సన్, కేఎస్ రవికుమార్, నిర్మాత కలైపులి ఎస్ థాను సహా ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. లాల్ సలామ్ చిత్రానికి దర్శకురాలు అయిన ఐశ్వర్య రజనీకాంత్ తన తండ్రి గురించి, సినీరంగంలో తనకు ఎదురవుతున్న సవాళ్ల గురించి ఓపెన్‌గానే మాట్లాడింది. 'మా నాన్నగారు 35 ఏళ్లుగా వెండితెరపై నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ పేరుకు భంగం కలిగించే హక్కు ఏ కూతురికి ఉండదు. ఈ సినిమా కథ నచ్చడంతో లాల్ సలామ్‌లో నటించడానికి ఆయన అంగీకరించారు. అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన నా కోసం ఈ చిత్రంలో నటించలేదు. ఈ సినిమా కోసం పనిచేసిన టీమ్‌ను నమ్మి రజనీకాంత్, సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారిద్దరు కలిసి ఉన్న ప్రాజెక్ట్‌లో పనిచేయడం మా అందరికి గొప్ప వరం. ఒక స్టార్‌కు అమ్మాయి అని గుర్తింపు ఉంటే చాలు ఇక్కడ ఎవరూ సినిమా అవకాశం ఇవ్వరు. చిత్ర పరిశ్రమలో మీరు పెద్ద వ్యక్తి అయినప్పటికీ, వారు మీకు సినిమా ఛాన్స్ ఇవ్వరు. కారణం ఎంటో నాకు తెలియదు. కొత్తవారికే ఛాన్సులు ఇస్తారు కానీ మాకు సినిమా అవకాశం ఇవ్వరు. ఆ విషయం చిత్రపరిశ్రమలో ఉన్నవారికే తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఎన్నో అవాంతరాలు వచ్చినా ముందుకు సాగాం. ఈ క్రమంలో దాదాపు 2 ఏళ్ల పాటు ఈ సినిమాకు పని చేస్తున్నప్పుడు నా పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. వారి పాఠశాలలో సమావేశానికి కూడా హాజరు కాలేదు. అయినా వారు నన్ను సపోర్ట్ చేస్తారు. నా పిల్లలే నా గొప్ప బహుమతి.' అని ఐశ్వర్య తెలిపింది. నాన్న అలాంటి వారు కాదు: ఐశ్వర్య సోషల్‌మీడియా వేదికగా తన నాన్నగారిపైన చాలా నెగటివిటీని వ్యాప్తి చేస్తున్నారని ఐశ్వర్య బాధపడింది. ' నాన్నగారిపై వస్తున్న నెగటివిటీ గురించి నా టీమ్ ద్వారా తెలుసుకున్నాను. ఒక్కోసారి అలాంటి వాటిపై చాలా కోపం వస్తుంది. మేము కూడా మనుషులమే కదా.. మాకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. చాలా మంది నా తండ్రిని సంఘీ (మతవాది) అంటూ ప్రచారం చేస్తుంటే బాధేస్తుంది. దానికి అర్థం కూడా నాకు తెలియదు. ఒక మతానికి మద్దతు ఇచ్చేవారిని సంఘీ అని పిలుస్తారని తర్వాత తెలుసుకున్నాను. దీంతో ఆయనపై చెడుగా వ్యాప్తి చేశారు. రజనీకాంత్ ఎప్పటికీ సంఘీ కాదు.. ఆయన అలాంటి వారే అయితే లాల్ సలామ్ చిత్రంలో నటించే వారే కాదు.' అని ఐశ్వర్య చెప్పింది. స్టేజీపై తన కూతురు మాటలు వింటూనే రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ కుటుంబంలో అయినా అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే నాన్న డబ్బులు ఇస్తారేమో కానీ సినిమా ఛాన్స్ ఇవ్వరు. నా కోసం మాత్రమే ఈ చిత్రాన్ని రజనీకాంత్ ఒప్పుకోలేదు. కథ చెప్పిన తర్వాత ఆయనకు నచ్చే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. నాన్నేం చిన్న పిల్లవాడు కాదు. ఆయనకు అన్నీ తెలుసు. కథలో బలం ఉంది కాబట్టే ఒప్పుకున్నారు. మానవత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ కథకు సెట్ అవుతారు. అందుకే నాన్నగారిని ఈ పాత్ర కోసం కలిశాం. ఆయన కూడా బాగుంది నేను చేస్తానని ముందుకు వచ్చారు.' అని ఐశ్వర్య చెప్పింది. లాల్ సలామ్ చిత్రంలో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌గా హీరోయిజం చూపనున్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. విష్ణు విశాల్, విక్రాంత్ కీలక పాత్రలు పోషించారు. కపిల్‌దేవ్, జీవిత రాజశేఖర్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ரஜினிகாந்த் சங்கி கிடையாது" - ஐஸ்வர்யா ரஜினிகாந்த் #AishwaryaRajinikanth | #Rajinikanth𓃵 | #LalSalaamAudioLaunch | #LalSalaam pic.twitter.com/fDF2Bfa1jg — Jerold (@Jerold25961839) January 26, 2024 -
రజనీకాంత్ ‘లాల్ సలామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
రజనీకాంత్, లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని తొలుత చిత్రం యూనిట్ ప్రకటించింది. తాజాగా ‘లాల్ సలామ్’ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేస్తామని మంగళవారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ‘‘హిందూ, ముస్లిం యువకులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట విషయంలో మతం పేరుతో గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవలను మొయిద్దీన్ భాయ్ (సినిమాలో రజనీ పాత్ర) ఎలా సర్దుబాటు చేశాడు? అన్నదే చిత్రకథాంశం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఎ.ఆర్. రెహమాన్. -
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు షాక్.. సంక్రాంతి రేసు నుంచి అవుట్!
గతేడాది జైలర్ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన తలైవా రజినీకాంత్. కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు తలైవా రెడీ అయిపోయారు. తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ స్పోర్ట్స్ డ్రామా లాల్ సలామ్ చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచారు. సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలు క్యూ కట్టడం సర్వసాధారణం. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో అదే రేంజ్లో పోటీ ఉంటుంది. అయితే పొంగల్ బరి నుంచి రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ తప్పుకుంటున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని ఐశ్వర్య రజినీకాంత్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. కొత్త రిలీజ్ తేదీని ఆమె ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజీనీకాంత్.. మొయిద్దీన్ భాయ్ క్యారెక్టర్ చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో క్రికెట్, రాజకీయాల చుట్టూ తిరిగే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీమిండియా దిగ్గజం కపిల్‌దేవ్ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేశారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ఐశ్వర్య వెల్లడించారు. కాగా.. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. కాగా.. కొన్నేళ్లపాటు విరామం తీసుకున్న తర్వాత రజినీకాంత్ కూతురు ఐశ్వర్య లాల్ సలామ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో విఘ్నేశ్, లివింగ్స్టన్, సెంథిల్, జీవిత, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య, నిరోష. వివేక్ ప్రసన్న, ధన్య బాలకృష్ణన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. 9-2-2024 ! #LalSalaam pic.twitter.com/3pk9jWb8MG — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) January 9, 2024 -
ఏడేళ్ల తర్వాత తెలుగులో...
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా, సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకురాలు. శనివారం (జనవరి 6) కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారనే వార్త ఎప్పట్నుంచో ఉంది. శనివారం (జనవరి 6) రెహమాన్ బర్త్ డే సందర్భంగా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (2016) తర్వాత ఏడేళ్లకు రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే. -
సంక్రాంతి నుంచి తప్పుకున్న 'లాల్ సలాం'.. కారణం ఇదేనా?
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 'లాల్ సలామ్' 2024 సంక్రాంతి బరిలో ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. కానీ సమయం దగ్గర పడుతున్నా లాల్ సలాం సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. దీనికి ప్రధాన కారణం రజనీకాంత్ ఇందులో అతిథి పాత్రలో కనిపించడమే అని చెప్పవచ్చు. తాజాగా సంక్రాంతి రేసు నుంచి లాల్ సలాం చిత్రాన్ని తప్పిస్తున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి చాలా వరకు భారీ సినిమాలు ఉన్నాయి. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివ కార్తికేయన్ 'అయలాన్' చిత్రాలు కోలీవుడ్‌లో రెడీగా ఉన్నాయి. అంతే కాకుండా జైలర్ సినిమాతో తెలుగులో కూడా రజనీ మార్కెట్ భారీగానే పెరిగింది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి గుంటూరు కారం, ఈగల్, నా సామిరంగా,సైంధవ్, హనుమాన్ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. దీంతో తెలుగు స్ట్రెయిట్ సినిమాలకే థియేటర్లు సరిపోవని పరిస్థితి టాలీవుడ్లో ఉంది. ఇలాంటి టైమ్‌లో మరో మూడు తమిళ సినిమాలు అంటే థియెటర్ల కొరత ఏర్పడటం జరుగుతుందని లాల్ సలాం టీమ్ ఆలోచిస్తుందట. దీంతో లాల్ సలాం వెనక్కు తగ్గడమే మేలని వారు భావించారట. భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో తేడా వస్తే బిజినెస్‌పై ప్రభావం పడుతుందని భావించిన మేకర్స్ ఫైనల్‌గా పొంగల్ నుంచి డ్రాప్ కావడమే బెటర్ అని నిర్ణయించుకున్నారట. కొద్దిరోజుల పాటు లాల్ సలాం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలకు కూడా తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం. విక్రమ్ తంగలాన్ సినిమా కూడా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. జనవరి 26 విడుదల చేస్తామని చెప్పిన తంగలాన్ మేకర్స్ మరోసారి వాయిదా వేశారు. కాబట్టి 2024 జనవరి 26న లాల్ సలాం వచ్చే అవకాశం ఉంది. -
రజనీకాంత్‌తో పోటీకి దిగుతున్న ధనుష్
నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. నటి ప్రియాంక అరుణ్ మోహన్ నాయకిగా నటించగా నివేదిత సతీస్, జాన్ కొక్కెన్, సుమేష్కుమార్, శివరాజ్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అరుణ్ మాదేశ్వరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ముందుగా నిర్మాతలు ప్రకటించారు. ఇదే సమయంలో రజనీకాంత్ సినిమా కూడా విడుదల కానుంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా కూడా పొంగల్‌కు రెడీ అయిపోయింది. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ సినిమాతో పోటీ ఎందుకని కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ముందుగానే అంటే డిసెంబర్ నెలలోనే విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయింది. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారమే అంటే సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంక్రాంతి పండుగరోజు రజనీకాంత్‌కు, ధనుష్‌కు మధ్య పోటీ తప్పనిసరిగా మారింది. లాల్ సలామ్ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అదే విధంగా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్ర టీజర్, పాటలు విడుదలై ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్స్ పైనే సినీ వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. కెప్టెన్ మిల్లర్ 2024 జనవరి 15న విడుదల అవుతుండగా... లాల్ సలామ్ సంక్రాంతికి విడుదల అని మాత్రమే ప్రకటించారు. -
రజనీకాంత్ 'లాల్ సలామ్'లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం చిత్రం 'లాల్ సలామ్'. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. రజనీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రత్యేక పాత్రలో కపిల్ దేవ్: క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించాడు. ఇందులో కపిల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా కపిల్ దేవ్ తన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. లాల్ సలామ్‌లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే డబ్బింగ్ స్టూడియోలో ఉన్న కపిల్ ఫొటోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది.. లెజెండరీ స్పోర్ట్స్ మ్యాన్ మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌తో పాటు జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు. ఇందులో రజనీకాంత్ సోదరిగా ఆమె కనిపించనున్నారు. నిరోషా, తంబి రామయ్య, సెంథిల్, తంగదురై సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పలు భాషల్లో జనవరి 2024లో విడుదల కానుంది. రజనీకాంత్ కూడా గతంలో కపిల్ గురించి ఇలా చెప్పారు. 'భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ కెప్టెన్ (విజేత) కపిల్ దేవ్ ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషం. క్రికెట్ లెజెండ్‌తో కలిసి పనిచేయడం నాకు గౌరవప్రదమైన క్షణం. కపిల్ దేవ్ అతని చారిత్రాత్మక విజయాలను ఎప్పటికీ మరిచిపోలేం.' అని రజనీ అన్నారు. దీంతో కపిల్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్‌తో కలిసి దిగిన ఫొటోను కపిల్ కూడా పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ చివరిగా జైలర్ సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 'లాల్ సలామ్' టీజర్ విడుదలై అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మొయిదీన్ భాయ్ పాత్రలో ప్రముఖ నటుడు కనిపించారు. -
'లాల్ సలాం' టీజర్ రిలీజ్.. మొయిద్దీన్ భాయ్‌గా మెప్పించిన రజినీకాంత్
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జైలర్‌తో భారీ హిట్ అందుకున్న రజనీ కాంత్.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'లాల్ సలామ్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తాజాగా లాల్ సలాం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. జైలర్‌తో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ ఈ చిత్రంలో ముస్లిం నాయకుడిగా కనిపించనున్నాడు. క్రికెట్‌తో మొదలైన గొడవలు సమాజంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఎందుకు మారాయి..? అనేది కథాంశం. టీజర్లో రజనీ సీరియస్ లుక్‌లో కనిపించగా.. విష్ణు విశాల్ ఏదో గొడవలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆటతో ముడిపడి ఉన్న ఓ యాక్షన్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే పాత్రలో రజనీకాంత్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి లాల్ సలాం విడుదల కానుంది. -
'లాల్ సలాం' హార్డ్ డిస్క్‌లు మాయం.. రజనీ కాంత్‌కు సినిమాకు బ్రేకులు
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 'లాల్ సలామ్' చిత్రం చివరి దశకు చేరుకుంటుండగా.. రజనీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు హార్డ్ డిస్క్‌లో కనిపించకుండా పోయాయని ప్రచారం జరుగుతుంది. జైలర్‌తో భారీ హిట్ అందుకున్న రజనీ కాంత్.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'లాల్ సలామ్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. హిందీ చిత్రం 'కై పో చే'కి (Kai Po Che) రీమేక్ అని అంటున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో రజనీ మొయిదీన్ భాయ్‌గా ప్రత్యేక పాత్రలో కనిపించారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 'లాల్ సలామ్' చిత్రీకరణ పూర్తయి చివరి దశకు చేరుకుంటుండగా.. సినిమాలో రజనీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు హార్డ్ డిస్క్ నుంచి మాయమైనట్లు సమాచారం. ఎంతో కష్టపడి రజనీ మీద చిత్రీకరించిన దృశ్యాలు ఎక్కడా హార్డ్ డిస్క్‌లలో కనిపించడం లేదట. ఆ దృశ్యాలను వెలికి తీసేందుకు విదేశాల నుంచి సాంకేతిక నిపుణులను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో 2024 సంక్రాంతి రేసు నుంచి ‘లాల్ సలామ్ ’ సినిమా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పొంగల్‌కు ఇప్పటికే ప్రకటించినట్లుగా, శివకార్తికేయన్ నటించిన అయాలన్, జయం రవి నటించిన సైరన్ మాత్రమే కోలీవుడ్ విడుదల కానున్నాయి. ‘లాల్ సలాం’లో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె నటించనుండడంతో అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
ఆ హీరో చేతికి రజనీకాంత్ 'లాల్ సలామ్' మూవీ
'జైలర్' లాంటి హిట్ తర్వాత రజనీకాంత్ నటించిన సినిమా 'లాల్ సలామ్'. ఇందులో ఆయన హీరో కాదు, మొయ్దీన్ బాయ్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య.. ఈ మూవీకి డైరెక్టర్. విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. టీమిండియా దిగ్గజం కపిల్‌దేవ్ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేశారు. (ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్) క్రికెట్ నేపథ్య కథతో తీసిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంక్రాంతి బరిలోకి ఉన్న ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కుల్ని.. ప్రముఖ హీరో, రాజకీయ నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కి చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సొంతం చేసుకుంది. దీంతో లాల్‌సలామ్ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: స్టార్ హీరో షూటింగ్లో ప్రమాదం.. ఆయన మృతి!) -
కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి
కొడితే కొట్టాలి రా కప్పు కొట్టాలి అనే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నారు క్రికెటర్లు. క్రికెట్ వరల్డ్ కప్ హంగామా మొదలైపోయింది. ఇటు సిల్వర్ స్క్రీన్ క్రికెట్ కూడా రెడీ అవుతోంది. కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి అంటూ కొందరు స్టార్స్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. గ్రౌండ్లో డాన్ ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ క్రికెట్ గ్రౌండ్లోకి దిగాడు. ఏం చేశాడనేది వచ్చే ఏడాది వెండితెరపై చూడాలి. విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ క్రికెటర్స్‌గా నటించగా, ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా రజనీ నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170వ చిత్రం ప్రారంభమైంది. అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ కీలక పాత్రల్లో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ముత్తయ్య 800 లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోముత్తయ్య మురళీధరన్‌గా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. మురళీధరన్ భార్య మది మలర్ పాత్రను మహిమా నంబియార్ పోషించారు. ఈ సినిమాలో తన క్రికెట్ లైఫ్ గురించి 20 శాతం ఉంటే, తన జీవితంలోని ఆసక్తికర సంఘటనలు 80 శాతం ఉంటాయని మురళీధరన్ ఇటీవల పేర్కొన్నారు. అలాగే మురళీధరన్గారిలా నటించేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆయన అన్ని వీడియోలను చూశానని, తీవ్రంగా బౌలింగ్ సాధన చేశానని, మేకప్ కోసమే మూడు గంటలు పట్టేదనీ మధుర్ మిట్టల్ తెలిపారు. అంతేకాదు.. కొన్నాళ్ల క్రితం తనకు యాక్సిడెంట్ జరగడం వల్ల తన ఎల్బో కూడా ముత్తయ్య తరహాలోకే వచ్చిందనీ మధుర్ మిట్టల్ చెప్పుకొచ్చారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ది టెస్ట్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో తమిళంలో ‘టెస్ట్’ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్ చేస్తుండగా, నిర్మాత శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్ పోస్టర్‌ను బట్టి ఈ సినిమా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఉంటుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్లలో ఎవరు క్రికెటర్స్‌గా కనిపిస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. చక్దా ఎక్స్‌ప్రెస్ దాదాపు రెండు దశాబ్దాల పాటు హిట్ క్రికెట్ ఆడారు జులన్ గోస్వామి. ఆమె జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘చక్దా ఎక్స్‌ప్రెస్’. జులన్గా అనుష్కా శర్మ నటించారు. నాలుగేళ్ల తర్వాత అనుష్కా శర్మ నటించిన చిత్రం ఇదే. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానుందట. క్రికెటర్ మహి జాన్వీ కపూర్ క్రికెటర్‌గా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’. రాజ్‌కుమార్ రావు మరో లీడ్ రోల్లో నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం క్రికెట్లో ఆరు నెలల పాటు జాన్వీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇలా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
సంక్రాంతికే సలాం కొట్టిన రజనీకాంత్
సంక్రాంతికి ‘లాల్ సలాం’ అంటున్నారు రజనీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీకాంత్, కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘‘లాల్ సలాం’ చిత్రంలో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
డిసెంబర్ 12న విడుదల కానున్న రజనీకాంత్ మరో సినిమా
రజనీకాంత్ పేరు ఇప్పుడు సినీ ప్రపంచంలో దద్దరిల్లిపోతోంది. కారణం ఆయన తాజాగా నటించిన జైలర్ చిత్రం కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టడమే. కాగా తదుపరి 'లాల్‌సలామ్' చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో రజనీకాంత్ మొయిదీన్ బాబాగా అతిథిపాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిని ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడం విశేషం. (ఇదీ చదవండి: ఏళ్ల తరబడి షూటింగ్.. సుజితకు అరకొర పారితోషికం?!) లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి కొన్ని కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ముందుగా రజనీకాంత్ గెస్ట్‌గా నటిస్తున్నారన్న ప్రచారం జరగ్గా తాజాగా ఆయనది ఈ చిత్రంలో ఎక్సెంట్ క్యామియో పాత్ర అని తెలిసింది. ఇంతకు ముందు రజనీకాంత్ భాషాలో పోషించిన పాత్రకు 10 రెట్లు పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈయన పాత్ర చిత్రం విలువ భాగంలో ఫుల్లుగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జైలర్ చిత్రం తరువాత విడుదలవుతున్న లాల్‌సలామ్ చిత్రంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
రజినీకాంత్ 'లాల్ సలాం'.. పవర్ఫుల్ రోల్‌కు తలైవా బై బై!
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. చేస్తున్నారు. ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తుండటం విశేషం. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘మీతో సినిమా చేయటం ఓ అద్భుతం. నాన్నా.. మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు... ‘లాల్ సలాం’లో మొయిద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి’. అని ఆమె పేర్కొన్నారు. రజినీకాంత్ సహా ఎంటైర్ యూనిట్ కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో రజినీకాంత్ నటించటం మాకెప్పుడూ గర్వకారణంగానే ఉంటుంది. లాల్ సలాం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాలని ఆయన్ని రిక్వెస్ట్ చేయగానే వెంటనే చేస్తానని అన్నారు. ఆయన్ని ఓ పవర్ఫుల్ పాత్రలో చూడబోతున్నారు. ఐశ్వర్యా రజనీకాంత్‌గారు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈ మూవీలో రజినీకాంత్‌గారి పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. త్వరలోనే మరిన్ని విషయాలను తెలియజేస్తామన్నారు. భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ చిత్రాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. రీసెంట్గా విడుదలైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించి సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి రానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో వైపు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’, అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘మిషన్ చాప్టర్ 1’, కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌తో చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విడా ముయర్చి’ , 2018 వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించి దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలోనూ ఓ భారీ చిత్రం.. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్‌ని కూడా లైకా ప్రొడక్షన్స్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. -
రజనీకి జోడీ?
‘ఒక బృందావనం సోయగం..’ అంటూ ఈత కొలనులో హొయలొలికించి, కుర్రకారు మనసుల్లోకి చొచ్చుకుపోయారు నిరోషా. ‘ఘర్షణ’ (1988) చిత్రంలోని ఈ పాటతో పాటు ఈ చిత్రంలో నాయికగా నిరోషాకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ‘సింధూరపువ్వు’లోనూ ఆమె కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయని నిరోషా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆ మధ్య ఎంట్రీ ఇచ్చారు. కాగా రజనీకాంత్ కీ రోల్ చేసిన ‘లాల్ సలామ్’లో ఆయనకు జోడీగా నిరోషా కనిపిస్తారన్నది కోలీవుడ్ టాక్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో మొయుద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్. ఆయనకు చెల్లెలి పాత్రను జీవిత చేస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. భార్య పాత్రను నిరోషా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కోలీవుడ్‌లో నటి రీఎంట్రీ, రజనీకాంత్‌కు భార్యగా..
లాల్‌సలాం చిత్రంలో రేర్ కాంబినేషన్న్స్ సెట్ చేస్తున్నారని చెప్పవచ్చు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న చిత్రం లాల్‌సలాం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రజనీకాంత్ మొయ్దీన్భాయ్ అనే ముస్లిం పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటి జీవిత చాలాకాలం తర్వాత తమిళంలోకి రీఎంట్రీ అవుతున్నారు. ఈమె ఈ చిత్రంలో రజనీకాంత్ చెల్లెలిగా నటిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్‌ది అతిథి పాత్ర కావడంతో ఆయనకు జోడీ ఉంటుందా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటూ వచ్చింది. దీనికి సంబంధించిన హాట్ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. 1980 ప్రాంతంలో యువ కథానాయకిగా వెలిగిన నిరోషా దివంగత ప్రఖ్యాత నటుడు ఎమ్మార్ రాధా కూతురు, నటి రాధిక సోదరి అయిన ఈమె అప్పట్లో నటుడు కమల్ హాసన్, విజయ్‌కాంత్, ప్రభు, కార్తీక్ వంటి కథానాయకుల సరసన నటించారు. అదేవిధంగా తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. అలాంటిది చాలాకాలం తర్వాత లాల్ సలాం చిత్రంలో రజనీకాంత్‌కు భార్యగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తిచేసుకుంది. కాగా త్వరలో రజనీకాంత్, నిరోషాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చదవండి: రేంజ్ రోవర్ కారు కొన్న సూపర్ స్టార్.. ఐదున్నర కోట్లపైమాటే -
రోజురోజుకీ మీపై ప్రేమ రెట్టింపవుతోంది, ఈ రోజు వస్తుందని ఊహించలేదు
‘‘నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను. కానీ మీతో షూటింగ్ చేసే రోజు వస్తుందని ఊహించలేదు. మీరంటే నాకు ఆరాధన.. స్ఫూర్తి... ఒక్కోసారి నేను ప్రపంచాన్ని మీ ద్వారా చూస్తాను. కానీ ఎక్కువసార్లు మీతో పాటు ప్రపంచాన్ని చూస్తాను. ఈ క్రమంలో నేను గ్రహించింది ఏంటంటే.. ‘నేను మీరే’ అని. అప్పా (నాన్న) రోజు రోజుకీ నాకు మీ మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతోంది’’ అంటూ ‘సూపర్ స్టార్‌తో షూటింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేశారు రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’ చిత్రంలో మొయుద్దీన్ భాయ్‌గా రజనీకాంత్ కీ రోల్ చేస్తున్నారు. సూపర్ స్టార్‌ని డైరెక్ట్ చేయడం ఏ డైరెక్టర్‌కి అయినా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ఇక స్వయానా కూతురు అయితే.. ఆ ఫీలింగ్ రెండింతలు ఉంటుంది. ఆ భావాన్నే ఐశ్వర్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘లాల్ సలామ్’లో స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక ΄పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ పాత్ర ముంబై నేపథ్యంలో ఉంటుంది. రజనీ–కపిల్ పాల్గొనగా ఇటీవల ముంబైలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. View this post on Instagram A post shared by Aishwaryaa Rajinikanth (@aishwaryarajini) -
సినిమాలకు గుడ్ బై? ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్
-
భాయ్ ముంబైలో అడుగుపెట్టారు!
రజనీకాంత్ కెరీర్లో గుర్తుంచుకోదగ్గ చిత్రాల్లో ‘బాషా’ ఒకటి. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ముంబైలో ‘మాణిక్ బాషా’గా కనిపించారు రజనీకాంత్. బాషా భాయ్‌గా రజనీ నటన, స్టయిల్ని మరచిపొలేం. ఇప్పుడు మొయుద్దీన్ భాయ్‌గా రజనీ కనిపించనున్న చిత్రం ‘లాల్ సలామ్’. ముంబై బ్యాక్‌డ్రాప్ ఉన్న ఈ చిత్రాన్ని రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీ చేస్తున్న మొయుద్దీన్ భాయ్ పాత్ర కీలకం. ‘అందరి ఫేవరెట్ అయిన భాయ్ మళ్లీ ముంబైలో అడుగుపెట్టారు’ అంటూ ఆయన లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ చిత్రంలో రజనీకాంత్ రాకింగ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించనున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: విష్ణు రామస్వామి. -
క్రికెటర్లుగా మారిన సినీతారలు.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందండోయ్!
ఆటకు వేళాయె అంటూ కొందరు స్టార్స్ ప్లేయర్స్‌గా మారారు. క్రికెటర్లుగా, కోచ్‌లుగా మౌల్డ్ అయిపోయారు. అయితే ఈ ఆట అంతా సినిమాల కోసమే. ప్రస్తుతం క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. కొన్ని కాల్పనిక కథలు కాగా, కొన్ని బయోపిక్స్ కూడా ఉన్నాయి. ఇక వెండితెరపై క్రికెటర్లుగా అలరించనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ మీద ఉన్నారు. ‘లాల్ సలామ్’ చిత్రం కోసమే ఇదంతా. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో, రజనీకాంత్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తారనీ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా కనిపిస్తారనీ ప్రచారం జరుగుతోంది. మరి.. రజనీ ఏ పాత్రలో కనిపిస్తారో చూడాలి. ‘లాల్ సలామ్’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ► క్రికెట్ గ్రౌండ్లో బిజీగా ఉంటున్నారు మాధవన్, సిద్ధార్థ్, నయనతార. ఈ ముగ్గురూ కలిసి సిల్వర్ స్క్రీన్‌పై ఆడనున్న మ్యాచ్ ‘ది టెస్ట్’. తమిళ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ► శ్రీలంక మాజీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలో సలీమ్ మాలిక్ పాత్ర చేసిన మధుర్ మిట్టల్ ఈ చిత్రంలో మురళీధరన్ పాత్ర చేస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. ‘‘మురళీధరన్ జీవితంలోని పలు కోణాలను ఈ చిత్రంతో వెండితెరపై ఆవిష్కరించనున్నాం. 800 వికెట్లు తీసిన ఏకైక ఆఫ్ స్పిన్ బౌలర్‌గా మురళీధరన్ పేరిట రికార్డు ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ► భారత ప్రముఖ మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ మూవీ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’. ఇందులో జులన్ గోస్వామిగా అనుష్కా శర్మ నటించారు. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. పశ్చిమ బెంగాల్ చక్దా ప్రాంతానికి చెందిన జులన్ గోస్వామి దాదాపు రెండు దశాబ్దాలు మహిళా క్రికెటర్‌గా, కెప్టెన్‌గా సక్సెస్ఫుల్ కెరీర్‌ను లీడ్ చేశారు. ఉమెన్స్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జులన్ రికార్డు సాధించారు. ► యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం క్రికెట్ బ్యాట్ పట్టారు. ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్‌గా నటిస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. రియల్ క్రికెటర్స్ దగ్గర శిక్షణ తీసుకుని జాన్వీ కపూర్ ఈ సినిమా చేశారు. వీరితోపాటు మరికొందరు క్రికెటర్ల బయోపిక్‌లు, క్రికెట్ ఆధారంగా సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సలాం'. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హోలీ రోజున ప్రారంభమైంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. 'విభిన్నమైన సినిమాలు నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ముందుంటుంది. అందులో భాగంగా లాల్ సలాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ పవర్ఫుల్ పాత్ర ఉంది. అందుకే సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయన ఈ రోల్లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు.'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. Lights 💡 Camera 🎥 🎬 Action 😎✨#LalSalaam 🫡 Shoot starts today! 😌 Happy #HOLI everyone! 💫 🎬 @ash_rajinikanth 🎶 @arrahman 🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl 🤝 @gkmtamilkumaran 🪙 @LycaProductions #Subaskaran pic.twitter.com/SHYXxnGYod — Lyca Productions (@LycaProductions) March 7, 2023 -
రజనీకాంత్‌కు షాకింగ్ రెమ్యునరేషన్.. 7 రోజులకే అన్ని కోట్లా?
సూపర్ స్టార్ రజనీకాంత్ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడు పదుల వయసు దాటిన ఆయన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తలైవా తెరపై కనిపిస్తే చాలు.. కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది.ఆ స్థాయిలో వెండితెరను శాసిస్తాడు కాబట్టే పారితోషికం కూడా అదే స్థాయిలో తీసుకుంటాడు. ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు లాల్ సలామ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా కాకుండా.. గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్ కోసం రజనీకాంత్ వారం రోజుల కాల్షీట్ను కేటాయించారట. అయితే ఈ ఏడు రోజులకు గాను ఆయన భారీగానే పారితోషికం పుచ్చుకుంటున్నారట. వారం రోజులకుగాను రూ.25 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు లైకా సంస్థ సూపర్‌స్టార్‌తో డీల్ కుదుర్చుకుందట. త్వరలోనే లాల్ సలామ్ సెట్లోకి రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరోవైపు ‘జైలర్’ మూవీ కోసం కూడా రజనీకాంత్ భారీగానే డిమాండ్ చేశారట. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ.140 కోట్లు తీసుకుంటున్నాడట. దక్షిణాదికి చెందిన హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్‌లో రజనీకాంత్ మొదటి స్థానంలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్.