Aishwarya Rajinikanth shares new BTS photo from 'Lal Salaam' set - Sakshi
Sakshi News home page

నేను మీరే నాన్నా.. ఈ రోజు వస్తుందని ఊహించలేదు: ఐశ్వర్య ఎమోషనల్‌ పోస్ట్‌

Published Tue, Jun 6 2023 3:41 AM | Last Updated on Tue, Jun 6 2023 8:54 AM

Aishwarya Rajinikanth shares new BTS photo from Lal Salaam set - Sakshi

‘‘నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను. కానీ మీతో షూటింగ్‌ చేసే రోజు వస్తుందని ఊహించలేదు. మీరంటే నాకు ఆరాధన.. స్ఫూర్తి... ఒక్కోసారి నేను ప్రపంచాన్ని మీ ద్వారా చూస్తాను. కానీ ఎక్కువసార్లు మీతో పాటు ప్రపంచాన్ని చూస్తాను. ఈ క్రమంలో నేను గ్రహించింది ఏంటంటే.. ‘నేను మీరే’ అని. అప్పా (నాన్న) రోజు రోజుకీ నాకు మీ మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతోంది’’ అంటూ ‘సూపర్‌ స్టార్‌తో షూటింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియా ద్వారా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ని షేర్‌ చేశారు రజనీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్‌.

విష్ణు విశాల్, విక్రాంత్‌  హీరోలుగా ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘లాల్‌ సలామ్‌’ చిత్రంలో మొయుద్దీన్‌ భాయ్‌గా రజనీకాంత్‌ కీ రోల్‌ చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ని డైరెక్ట్‌ చేయడం ఏ డైరెక్టర్‌కి అయినా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ఇక స్వయానా కూతురు అయితే.. ఆ ఫీలింగ్‌ రెండింతలు ఉంటుంది. ఆ భావాన్నే ఐశ్వర్య సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఇక క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘లాల్‌ సలామ్‌’లో స్టార్‌ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ కీలక ΄పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ పాత్ర ముంబై నేపథ్యంలో ఉంటుంది. రజనీ–కపిల్‌ పాల్గొనగా ఇటీవల ముంబైలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement