Vikrant
-
సాఫ్ట్వేర్ ఉద్యోగులు వద్దు
పేరు ఓరుగంటి కల్యాణి. ప్రభుత్వోద్యోగి కావాలనే లక్ష్యంతో గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ తనకు కాబోయే వరుడు ప్రభుత్వోద్యోగి అయ్యుండాలని, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉండకూడదని, వెజిటేరియన్ అయ్యుండాలని ఆశ పడుతుంది కల్యాణి. అంతే కాదండోయ్... సాఫ్ట్వేర్ ఉద్యోగి అసలే వద్దు అంటోంది. మరి... కల్యాణి ఆకాంక్షకు తగ్గ వరుడు దొరికాడా? లేదా అనేది ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో చూడొచ్చు. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఇది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. బుధవారం (అక్టోబరు 23) చాందినీ చౌదరీ బర్త్ డే సందర్భంగా ‘సంతాన ప్రాప్తిరస్తు’లో ఓరుగంటి కల్యాణి పాత్రలో ఆమె నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం చాలామంది ఫేస్ చేస్తున్న సంతానలేమి సమస్య ఆధారంగా ‘సంతాన ్రపాప్తిరస్తు’ తీస్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది’’ అని తెలిపారు మేకర్స్. -
విశాఖ సముద్ర జలాల్లో ఒళ్లు గగుర్పొడిచేలా యుద్ధ విన్యాసాలు (ఫొటోలు)
-
ఏడేళ్ల తర్వాత తెలుగులో...
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా, సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకురాలు. శనివారం (జనవరి 6) కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారనే వార్త ఎప్పట్నుంచో ఉంది. శనివారం (జనవరి 6) రెహమాన్ బర్త్ డే సందర్భంగా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (2016) తర్వాత ఏడేళ్లకు రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే. -
నాకు కొత్తగా అనిపించింది
‘‘స్పార్క్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ మూవీలో నేను లేఖ పాత్రలో కనిపిస్తాను. ఎంతోప్రాధాన్యత ఉన్న రోల్ నాది. సినిమా నాతోనే ప్రారంభం అవుతుంది.. నాతోనే ముగుస్తుంది.. ఇలాంటి థ్రిల్లర్ మూవీలో నటించటం నాకు కూడా కొత్తగా అనిపించింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ మెహరీన్ అన్నారు. విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్సపై లీల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహరీన్ పంచుకున్న విశేషాల.. ► కొత్తవాళ్లు, అనుభవం ఉన్న నటీనటులతో పని చేసే క్రమంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. ‘స్పార్క్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న విక్రాంత్ ఓ రోజు ఫోన్ చేసి, ‘మీతో కలిసి నటించాల నుంది’ అన్నారు. కథ నాకు నచ్చడంతో ఓకే చెప్పాను. విక్రాంత్‌గారు ఈ మూవీ కోసం చేసిన పరిశోధన నన్ను ఆకట్టుకుంది. నా పాత్ర, లుక్ కొత్తగా ఉంటుందని చెప్పారు.. నా లుక్, పాటలు తెరకెక్కించిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. విక్రాంత్ చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని నాకు అర్థమైంది. లీల గారు ఎక్కడా రాజీపడకుండా ఈ మూవీ తీశారు. ► విక్రాంత్ అమెరికాలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. అయితే సినిమా చేయాలనే కలని పూర్తి చేసుకోవటానికి ఇక్కడకు వచ్చారు. అమెరికాలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంలో ‘స్పార్క్’ కథను తయారు చేసుకున్నారు విక్రాంత్. ఈ కథకి కమర్షియల్ అంశాలు జోడించి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. తొలిసారి హీరోగా చేస్తూనే డైరెక్షన్ చేయటం ఎంతో కష్టం. కానీ, విక్రాంత్ ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు. తను ఓ డెబ్యూ హీరోగా, డెబ్యూ డైరెక్టర్‌గా మెప్పిస్తాడు. ►జీవితంలో ఉన్నతి స్థాయికి ఎదగాలని ప్రతి మనిషి కలలు కంటుంటారు.. నేను కూడా అంతే. నా కలలను నిజం చేసుకునే క్రమంలోనే ముందుకు వెళుతున్నాను. ఈ సినిమాలో నేను చేసిన లేఖ పాత్ర కూడా అలాగే ఉంటుంది.. అందుకే ఈ పాత్రకు నేను కనెక్ట్ అయ్యాను. నటిగా ప్రతి సినిమా నాకెంతో ప్రత్యేకమైనదే. కథ, నా పాత్ర నచ్చితేనే చేస్తాను.. లేకుంటే చేయను. అది నా కెరీర్‌కి ఎంతో సాయపడుతోంది. నన్ను ఇష్టపడేవారు, ప్రేక్షకులే నాలో స్ఫూర్తి నింపుతుంటారు. పాత్ర ఏదైనా నటిగా రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాను. ∙నేను ఏదైనా వేడుకలకి వెళ్లినప్పుడు, నా సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు ఎవరైనా నేను చేసిన పాత్ర పేరుతో పిలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ నా తొలి చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లోని మహాలక్ష్మి పాత్ర పేరుతో పిలుస్తుండటం హ్యాపీ. -
స్పార్క్ నా ఎమోషనల్ జర్నీ
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్: ఎల్.ఐ.ఎఫ్.ఈ’. ఇందులో మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. డెఫ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై లీల నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకులు హరీష్ శంకర్, మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం సాధించాలని కోరారు. ఈ వేడుకలో విక్రాంత్ మాట్లాడుతూ– ‘‘అమెరికాలో జరిగిన కొన్ని ఘటనలకు కమర్షియల్ అంశాలు జోడించి ‘స్పార్క్’ కథ రాసుకున్నాను. నేనే కథ రాసుకుని, హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తానన్నప్పుడు కొందరు వద్దన్నారు. కానీ ఈ సినిమా నా కల. నా కలకు మా కో డైరెక్టర్ స్వామిగారి అనుభవాన్ని జోడించి ఈ సినిమాను పూర్తి చేశాను. కొన్ని కష్టాలు పడ్డాను. లీల ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా నాకు పెద్ద ఎమోషనల్ జర్నీ’’ అన్నారు విక్రాంత్. ‘‘ఈ సినిమాలో సైంటిస్ట్ రోల్ చేశాను’’ అన్నారు సుహాసిని. ‘‘సినిమా చూశాను. బాగా వచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు లీల. -
నా మూడేళ్ల కల స్పార్క్
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం నవంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విక్రాంత్ మాట్లాడుతూ – ‘‘నాకు సినిమాలంటే ఇష్టం. అమెరికాలో జాబ్ చేస్తున్న క్రమంలో సంపాదనలో పడి కలను మర్చిపోకూడదని ఈ సినిమా తీశాను. ఏడాదిన్నర పాటు ‘స్పార్క్’ కథ రాసుకుని, కష్టపడి మరో ఏడాదిన్నర పాటు ఈ సినిమాను నిర్మించాం. ‘స్పార్క్’ నా మూడేళ్ల కల. యాక్షన్, థ్రిల్, లవ్, కామెడీ, డ్రామా.. అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. యూనివర్సల్ అప్పీల్ ఉన్న మల్టీజానర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు తమిళ నటుడు గురు సోమసుందరం. ‘‘టైటిల్‌కు తగ్గట్లే మా సినిమా ‘స్పార్క్’లా ఉంటుంది’’ అన్నారు మెహరీన్. ‘‘ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్. -
సంక్రాంతికే సలాం కొట్టిన రజనీకాంత్
సంక్రాంతికి ‘లాల్ సలాం’ అంటున్నారు రజనీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీకాంత్, కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘‘లాల్ సలాం’ చిత్రంలో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
ఏమా అందంఏమా అందం
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్.. ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్ ఫిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. డెఫ్ ఫ్రాగ్ ్ర΄÷డక్షన్స్పై రూ΄÷ందిన ఈ చిత్రం నవంబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఏమా అందం.. ఏమా అందం.. భామా నీకు భువితో ఏమి సంబంధం’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విక్రాంత్, రుక్సార్ కాంబినేషన్లో ఈ పాట చిత్రీకరించారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, సిధ్ శ్రీరామ్ పాడారు. -
ప్రేమకు గ్రీన్ సిగ్నల్!
ఉత్తరాది అమ్మాయి రాశీ ఖన్నా హీరోయిన్గా దక్షిణాదిలో ఎక్కువ సినిమాల్లో నటించి స్టార్ లిస్ట్‌లో ఉన్నారు. రచ్చ గెలిచిన రాశీ ఖన్నా ఇప్పుడు ఇంట అంటే ఉత్తరాదిలో నటిగా నిరూపించుకోవాలని అనుకుంటున్నట్లున్నారు. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘యోధ’ చిత్రంలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. దిశా పటానీ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. తాజాగా రాశీ మరో కొత్త సినిమాకు పచ్చ జెండా ఊపారని బాలీవుడ్ సమాచారం. నూతన దర్శకుడు బోధయన్ రాయ్ హీరో విక్రాంత్ మెస్సీతో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథను ఇటీవల రాశీకి వినిపించారట. ఈ ప్రేమకథతో ప్రేమలో పడ్డారట ఈ బ్యూటీ. దాంతో ఈ సినిమాలో విక్రాంత్ మెస్సీకి ప్రేయసిగా నటించేందుకు రాశీ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీటౌన్ సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటోందట చిత్ర యూనిట్. -
యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ పూర్తి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. విక్రాంత్ డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్స్పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో–డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. భావోద్వేగాలు, ప్రేమ, భారీ ఫైట్స్‌తో ఈ మూవీ రూపొందింది. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతినిచ్చే సినిమా ఇది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 17న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది – మంత్రి జగదీశ్వర్ రెడ్డి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏ సినిమానైనా విమర్శనాత్మక కోణంలో చూసే వ్యక్తిని నేను. ‘స్పార్క్’ టీజర్ప్రారంభం చూడగానే నాకు ‘శివ’ సినిమా గుర్తొచ్చింది. విక్రాంత్‌లో, ఈ సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది. ఈ సినిమా కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేయడంతో పాటు విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘యూఎస్‌లో చదువుకుని, అక్కడే జాబ్ చేసినా సినిమాలపై ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ ప్రేమతోనే ‘స్పార్క్’ కథ రెడీ చేసుకున్నాను. నేను ప్రేమతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమతో హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విక్రాంత్. తుంగతుర్తి ఎమ్మేల్యే కిశోర్, రచయిత అనంత శ్రీరామ్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడారు. -
రజినీకాంత్ 'లాల్ సలాం'.. పవర్ఫుల్ రోల్‌కు తలైవా బై బై!
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. చేస్తున్నారు. ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తుండటం విశేషం. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘మీతో సినిమా చేయటం ఓ అద్భుతం. నాన్నా.. మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు... ‘లాల్ సలాం’లో మొయిద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి’. అని ఆమె పేర్కొన్నారు. రజినీకాంత్ సహా ఎంటైర్ యూనిట్ కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో రజినీకాంత్ నటించటం మాకెప్పుడూ గర్వకారణంగానే ఉంటుంది. లాల్ సలాం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాలని ఆయన్ని రిక్వెస్ట్ చేయగానే వెంటనే చేస్తానని అన్నారు. ఆయన్ని ఓ పవర్ఫుల్ పాత్రలో చూడబోతున్నారు. ఐశ్వర్యా రజనీకాంత్‌గారు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈ మూవీలో రజినీకాంత్‌గారి పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. త్వరలోనే మరిన్ని విషయాలను తెలియజేస్తామన్నారు. భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ చిత్రాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. రీసెంట్గా విడుదలైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించి సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి రానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో వైపు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’, అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘మిషన్ చాప్టర్ 1’, కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌తో చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విడా ముయర్చి’ , 2018 వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించి దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలోనూ ఓ భారీ చిత్రం.. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్‌ని కూడా లైకా ప్రొడక్షన్స్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. -
రోజురోజుకీ మీపై ప్రేమ రెట్టింపవుతోంది, ఈ రోజు వస్తుందని ఊహించలేదు
‘‘నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను. కానీ మీతో షూటింగ్ చేసే రోజు వస్తుందని ఊహించలేదు. మీరంటే నాకు ఆరాధన.. స్ఫూర్తి... ఒక్కోసారి నేను ప్రపంచాన్ని మీ ద్వారా చూస్తాను. కానీ ఎక్కువసార్లు మీతో పాటు ప్రపంచాన్ని చూస్తాను. ఈ క్రమంలో నేను గ్రహించింది ఏంటంటే.. ‘నేను మీరే’ అని. అప్పా (నాన్న) రోజు రోజుకీ నాకు మీ మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతోంది’’ అంటూ ‘సూపర్ స్టార్‌తో షూటింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేశారు రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’ చిత్రంలో మొయుద్దీన్ భాయ్‌గా రజనీకాంత్ కీ రోల్ చేస్తున్నారు. సూపర్ స్టార్‌ని డైరెక్ట్ చేయడం ఏ డైరెక్టర్‌కి అయినా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ఇక స్వయానా కూతురు అయితే.. ఆ ఫీలింగ్ రెండింతలు ఉంటుంది. ఆ భావాన్నే ఐశ్వర్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘లాల్ సలామ్’లో స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక ΄పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ పాత్ర ముంబై నేపథ్యంలో ఉంటుంది. రజనీ–కపిల్ పాల్గొనగా ఇటీవల ముంబైలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. View this post on Instagram A post shared by Aishwaryaa Rajinikanth (@aishwaryarajini) -
భాయ్ ముంబైలో అడుగుపెట్టారు!
రజనీకాంత్ కెరీర్లో గుర్తుంచుకోదగ్గ చిత్రాల్లో ‘బాషా’ ఒకటి. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ముంబైలో ‘మాణిక్ బాషా’గా కనిపించారు రజనీకాంత్. బాషా భాయ్‌గా రజనీ నటన, స్టయిల్ని మరచిపొలేం. ఇప్పుడు మొయుద్దీన్ భాయ్‌గా రజనీ కనిపించనున్న చిత్రం ‘లాల్ సలామ్’. ముంబై బ్యాక్‌డ్రాప్ ఉన్న ఈ చిత్రాన్ని రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీ చేస్తున్న మొయుద్దీన్ భాయ్ పాత్ర కీలకం. ‘అందరి ఫేవరెట్ అయిన భాయ్ మళ్లీ ముంబైలో అడుగుపెట్టారు’ అంటూ ఆయన లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ చిత్రంలో రజనీకాంత్ రాకింగ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించనున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: విష్ణు రామస్వామి. -
ఫిబ్రవరిలో లాల్ సలామ్లోకి...
‘లాల్ సలామ్’ గ్రౌండ్లోకి రజనీకాంత్ ఎంట్రీ ఫిబ్రవరిలో అని సమాచారం. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌సలామ్’. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య ఓ పది రోజులు షూటింగ్ చేశారు. అయితే రజనీ లేని సీన్స్‌ని చిత్రీకరించారు. ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమా సెట్స్‌లోకి రజనీ అడుగుపెడతారట. ఇక ‘3’ (2012) చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఐశ్వర్య ఆ తర్వాత ‘వై రాజా వై’ (2015), ‘రాజా రాణి’ (2017) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. -
2న నేవీలోకి ఐఏసీ విక్రాంత్
కొచ్చి: మొట్టమొదటిసారిగా దేశీయంగా నిర్మించిన విమానవాహక నౌక(ఐఏసీ)ని సెప్టెంబర్ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్(సీఎస్ఎల్)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధాని మోదీ నావికాదళంలోకి విక్రాంత్‌ను అధికారికంగా ప్రవేశపెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రథమ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ రిటైర్డు సిబ్బంది, నౌకా నిర్మాణ, రక్షణ శాఖల అధికారులు మొత్తం 2,000 మంది వరకు పాల్గొంటారని చెప్పారు. రూ.20వేల కోట్లతో నిర్మించిన ఈ నౌకను జూలై 28న సీఎస్ఎల్ నేవీకి అప్పగించిన విషయం తెలిసిందే. -
నేవీ చేతికి విక్రాంత్
న్యూఢిల్లీ: భారత నావికా దళం కొత్త శక్తిని సముపార్జించుకుంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గురువారం నేవీకి అందజేసింది. షెడ్యూల్ ప్రకారం విక్రాంత్‌ను ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేవీ విధుల్లోకి చేర్చుకుంటారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ విక్రాంత్ చేరికను కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. రూ.20 వేల కోట్లతో నిర్మించిన విక్రాంత్ నాలుగో, తుది దశ సీ ట్రయల్స్‌ను మూడు వారాల క్రితం విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో, యుద్ధ విమాన వాహక నౌకలను దేశీయంగా డిజైన్ చేసి, నిర్మించుకునే సామర్థ్యం సొంతం చేసుకున్న అరుదైన ఘనతను దేశం సొంతం చేసుకుంది. దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సమయాన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహకనౌక(ఐఏసీ) అందడం చారిత్రక సందర్భమని నేవీ పేర్కొంది. ‘త్వరలో నావికాదళంలోకి ప్రవేశించే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో భారతదేశం స్థానం మరింత సుస్థిరం అవుతుంది’అని నేవీ పేర్కొంది. ఐఏసీలో 76% దేశీయంగా తయారు చేసిన సామగ్రినే వినియోగించారు. విక్రాంత్‌లో మెషినరీ ఆపరేషన్, నేవిగేషన్, సర్వైవబిలిటీ గరిష్ట స్థాయి ఆటోమేషన్తో రూపొందాయి. ఫిక్స్డ్ వింగ్, రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనుగుణంగా దీని డిజైన్ ఉందని నేవీ వివరించింది. ఐఏసీ నుంచి మిగ్–29కే యుద్ధ విమానాలతోపాటు కమోవ్–31 హెలికాప్టర్లు, ఎంఐఐ–60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను కలిపి మొత్తం 30 వరకు నిర్వహించవచ్చు. ఐఏసీలో 2,300 కంపార్టుమెంట్లుండగా 1,700 మంది సిబ్బంది పనిచేసేందుకు, ముఖ్యంగా మహిళా అధికారులకు ప్రత్యేక సౌకర్యాలతో డిజైన్ చేశారు. దీని సాధారణ వేగం 18 నాట్స్ కాగా, గరిష్ట వేగం 28 నాట్స్. ఇది 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. -
జైహింద్ స్పెషల్: ఐ.ఎన్.ఎస్. విక్రాంత్
ఇండియన్ నేవీ షిప్ విక్రాంత్ భారత నౌకాదళానికి చెందిన మెజెస్టిక్–క్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్. సంస్కృతంలో విక్రాంత్ అంటే ‘ధైర్యవంతుడు‘ అని అర్థం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ రాయల్ నేవీ కోసం హెచ్.ఎం.ఎస్. హెర్క్యులస్గా దీని నిర్మాణం ప్రారంభించారు. ఆలోపు యుద్ధం ముగియడంతో ఆ యుద్ధనౌక నిర్మాణం పనులు ఆగిపోయాయి. భారతదేశం 1957లో ఆ అసంపూర్ణ విమాన వాహక నౌకను కొనుగోలు చేసింది, 1961లో నిర్మాణం పూర్తయింది. విక్రాంత్ భారత నావికాదళం మొదటి విమాన వాహక నౌకగా ఆ ఏడాదే రంగంలోకి దిగింది. 1971 ఇండో–పాకిస్తాన్ యుద్ధంలో తూర్పు పాకిస్థాన్‌పై నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించింది. తరువాతి సంవత్సరాలలో 1997 జనవరిలో విక్రాంత్ ఆపరేషన్లను నిలిపివేయడానికి ముందు విక్రాంత్‌ను ఆధునిక విమానాల పార్కింగ్ కోసం భారీ స్థాయిలో పునర్నిర్మించారు. విక్రాంత్ 2012 వరకు ముంబైలోని కఫ్ పరేడ్‌లో మ్యూజియం షిప్‌గా భద్రపరిచారు. సుప్రీంకోర్టు తుది అనుమతి అనంతరం 2014 జనవరిలో ఆన్లైన్ వేలం ద్వారా ప్రభుత్వం విక్రాంత్‌ను విక్రయించింది. -
హైదరాబాద్‌లో ప్రారంభమైన మెహరీన్ స్పార్క్ మూవీ
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్పార్క్’. మెహరీన్ హీరోయిన్. సినిమాటోగ్రాఫర్ అరవింద్ కుమార్ రవివర్మ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, దర్శకుడు సురేందర్ రెడ్డి, కెమెరామేన్ రత్నవేలు, నిర్మాత అన్వేష్ రెడ్డి, పారిశ్రామికవేత్త రామరాజు పాల్గొన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రం రూపొందుతోంది. రత్నవేలు దగ్గర అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా చేశారు అరవింద్. దర్శకులు శంకర్, సుకుమార్గార్ల దగ్గర దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
‘విక్రాంత్’ వచ్చేస్తోంది
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్ (ఐఏసీ) సేవలందించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం నిర్వహించిన సీట్రయల్స్ విజయవంతం కావడంతో.. విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ నిలిచింది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. అన్ని హంగులూ పూర్తి చేసుకొని 2022 మార్చినాటికల్లా తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్ సేవలందించనుంది. సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్.. యుద్ధ విమాన వాహక యుద్ధ నౌకల విషయంలో వెనకబడి ఉందన్న గీతని చెరిపేసేలా ఐఏసీ విక్రాంత్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌక ఇది. 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సన్నద్ధమైంది. విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌక డిజైన్ మొదలు పెట్టగా.. కొచ్చి షిప్‌యార్డులో 2009లోనే కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ఏడాది క్రితం బేసిన్ ట్రయల్స్ పూర్తి చేశారు. తొలిసారిగా సముద్ర విహారం ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటిసారిగా విక్రాంత్ సీట్రయల్ నిర్వహణ కోసం బుధవారం సముద్రంలోకి తీసుకొచ్చారు. 2 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. సముద్రంలో మొదటి ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, అంతర్గత కమ్యూనికేషన్ పరికరాలను ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు. చరిత్రాత్మక ఘటనగా భారత నావికాదళం అభివర్ణన న్యూఢిల్లీ: భారత్‌లో నిర్మించిన తొలి యుద్దవిమాన వాహక నౌక (ఇండిజినస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్–ఐఏసీ) విక్రాంత్.. సామర్థ్య పరీక్షలు మొదలయ్యాయి. సముద్రంలో ఐఏసీ విక్రాంత్ ట్రయల్స్ ప్రారంభమవడం చరిత్రాత్మకమని భారత నేవీ బుధవారం వ్యాఖ్యానించింది. సొంతంగా యుద్ధవిమాన వాహక నౌకను డిజైన్ చేసి, నౌకను నిర్మించి, సైన్యంలోకి తీసుకునే సత్తా ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచిందని నేవీ ప్రకటించింది. భారీ యుద్ధనౌకకు 50 ఏళ్ల క్రితం 1971లో పాకిస్తాన్‌తో పోరులో అద్భుత సేవలందించిన విక్రాంత్ నౌక పేరునే పెట్టారు. ఈ నౌక అన్ని స్థాయిల్లో సామర్థ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్నాక వచ్చే ఏడాదిలో భారత నావికాదళంలో చేరనుంది. భారత్‌లో నిర్మించిన అతి పెద్ద, అనేక ప్రత్యేకతలున్న యుద్ధనౌక ఇదేనని నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మథ్వాల్ చెప్పారు. యుద్ధవిమానాల మోహరింపులో ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే అవసరాలను తీరుస్తోంది. కీలక బాధ్యతలు నిర్వర్తించనున్న విక్రాంత్ రక్షణపరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఏసీ విక్రాంత్. విక్రాంత్ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలవనుంది. విక్రాంత్ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. – వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుద్దూర్ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి -
ఆ సీన్లలో నటించడానికి నాకేం భయం లేదు: నటుడు
ముంబై: రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు తాను భయపడతానన్న హీరోయిన్ తాప్సీ పన్ను వ్యాఖ్యలపై నటుడు విక్రాంత్ మాసే స్పందించాడు. నటన తన జీవితంలో భాగమని, తానెప్పుడూ ఇలాంటి వాటికి భయపడనని పేర్కొన్నాడు. తాప్సీ ఏదో సరదాగా అన్న మాటలను కొంతమంది కావాలనే హెడ్‌లైన్స్ వేసి మరీ ప్రచారం చేశారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఏదేమైనా తమకు ఇటువంటి వార్తల వల్ల మరింత పబ్లిసిటి వస్తుందని పేర్కొన్నాడు. కాగా తాప్సీ పన్ను, విక్రాంత్ మాసే, హర్షవర్దన్ రాణె పర్ధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హసీన్ దిల్రూబా’. జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాప్సీ మాట్లాడుతూ... ‘‘విక్రాంత్, హర్షవర్దన్ రొమాంటిక్ సీన్లలో నటించేందుకు భయపడ్డారు. నా ఇమేజ్ గురించి భయపడ్డారో లేదంటే మరేదైనా కారణమో తెలియదు. నేను ప్రతిసారి ఈ విషయం గురించి డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసేదాన్ని’’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై విక్రాంత్ స్పందిస్తూ... ‘‘ అలాంటిదేమీ లేదు. తాప్సీ చాలా సరదా మనిషి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. వాగుడుకాయ కూడా. ఐదు నిమిషాలకు మించి సైలెంట్‌గా ఉండలేదు. తనేదో సరదాకి మా గురించి అలా మాట్లాడింది. కానీ, వార్తల్లోకొచ్చేసరికి తను మా గురించి సీరియస్‌గా కామెంట్ చేసినట్లు వక్రీకరించారు. ఏదైతేనేం మాకు కావాల్సినంత ప్రచారం దొరుకుతోంది. నిజానికి మీడియాతో మా అనుబంధం విడదీయరానిది. మేం దాని గురించి ఎప్పుడూ బాధపడం. నటన నా మొదటి ప్రాధాన్యం. నేను దేనికీ భయపడను. అయితే, కొన్ని సన్నిహిత సన్నివేశాల్లో ఒక్కోసారి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ... ఇద్దరు నటుల మధ్య పరస్పర సహాయసహకారాలు, ప్రొఫెషనలిజం ఉన్నపుడు అదేమీ పెద్ద విషయం కాబోదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా కనికా థిల్లాన్ కథ అందించిన హసీన్ దిల్రూబా సినిమాను వినీల్ మాథ్యూ తెరకెక్కించాడు. -
రాణీ కశ్యప్ కథేంటి?
ఓ హత్య జరిగింది. కానీ ఈ మర్డర్ ఎలా? ఎందుకు జరిగింది? కథేంటి అనేది తాను నటించిన హిందీ చిత్రం ‘హసీన్ దిల్రుబా’లో చూడమని చెబుతున్నారు తాప్సీ. ఈ చిత్రానికి వినిల్ మ్యాథ్యూ దర్శకత్వం వహించారు. విక్రాంత్ మెస్సీ, హర్షవర్థన్ రాణే కీలక పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ చిత్రం జూలై 2 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. నిజానికి గత ఏడాది ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘‘ఇందులో రాణీ కశ్యప్ పాత్రలో కొత్తగా కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది’’ అన్నారు తాప్సీ. -
ఒక రాత్రి... నాలుగు కథలు!
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హిందీలో నటిస్తున్న తొలి చిత్రం ‘ముంబైకర్’. ప్రముఖ కెమెరామ్యాన్ సంతోష్ శివన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో విక్రాంత్ మెస్సీ, తాన్య, సంజయ్ మిశ్రా, రణ్వీర్ షోరే, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విక్రాంత్ మెస్సీ పుట్టినరోజు సందర్భంగా ‘ముంబైకర్’ ఫస్ట్ లుక్‌ను విజయ్‌సేతుపతి షేర్ చేశారు. తమిళ హిట్ మూవీ ‘మా నగరం’కి హిందీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బతుకుతెరువు కోసం ముంబయ్ వచ్చిన నలుగురు వ్యక్తుల నేపథ్యంలో ఒక రాత్రి జరిగే నాటకీయ పరిణామాల సమాహారంగా ‘ముంబైకర్’ సినిమా రూపొందుతోంది. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) -
మేము నిశ్చితార్థం చేసుకున్నాం: హీరో
బాలీవుడ్ నటుడు, 'ఏ డెత్ ఇన్ ది గంజ్' ఫేం విక్రాంత్ మాసే తన పెళ్లి విషయంలో వస్తన్న వదంతులపై క్లారిటీ ఇచ్చాడు. చిన్ననాటి స్నేహితురాలు షీతల్ ఠాకూర్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే వీళ్లిద్దరూ ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న విషయం తెలిసిందే. అంతేగాక తాజాగా వీరు గత నెలలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారనే వార్తలు బీటౌన్‌లో బాగానే వినిపించాయి. వీటన్నింటికి ఫుల్స్టాప్ పెడుతూ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వివాహం ఎప్పుడన్న విషయం మాత్రం చెప్పడానికి నిరాకరించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అవును మా ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీని గురించి ఇప్పుడు ఏం చెప్పలేను. సరైన సమయంలో మాట్లాడాలి అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక విక్రాంత్, షీతల్ బుల్లితెరపై ప్రసారమైన ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ వెబ్ సిరీస్ సీజన్-1లో కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరూ తమకు సంబంధించిన విషయాలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. కాగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొన్ నటించిన ‘చపాక్’ సినియాలో విక్రాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక కనిపించనుంది. ఈ చిత్రం 2020 జనవరి 10 ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram Happy happy birthday to the light of my life♥️ A post shared by Sheetal Thakur (@sheetalthakur) on Apr 2, 2019 at 2:17pm PDT -
వైద్యదేవుడికి సలాం
తమిళసినిమా: వైద్య దేవుడికో సలాం అన్నారు నెంజిల్ తుణివిరుందాల్ చిత్ర యూనిట్. ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదైపోయింది. ఆస్పత్రికి వెళ్లి సగం సొత్తును వైద్యులు పిండేస్తున్న పరిస్థితి. అయితే వైద్యోనారాయణో అంటారు. దాన్ని నిజం చేసిన వైద్యుడొకరు ఉండేవారు. కోవైలోని రాజగణపతి నగర్‌కు చెందిన బాలసుబ్రమణియం వైద్యుడిగా తీసుకున్న తొలి ఫీజు రూ.2. ఆ తరువాత రూపాయి విలువ పడిపోతూ వస్తున్న పరిస్థితుల్లో ఆయన తీసుకున్న చివరి ఫీజు రూ.20.గత ఏడాదే బాల సుబ్రమణియం కన్నుమూశారు. ఆయన్ని అందరూ రూ.20 రూపాయల డాక్టర్ అని పిలిచేవారు. వైద్యమే దైవంగా భావించే బాలసుబ్రమణియం మరణించినప్పుడు ఆ ఊరు అంతా కన్నీటి అంజలి పోస్టర్లు వెలిశాయి. ఆ వైద్యుడి కూతురు, అల్లుడు, మనవడిని నెంజిల్ తుణివిరుందాల్ చిత్ర యూనిట్ సత్కరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ బాలసుబ్రమణియం కుటుంబసభ్యులను అతిథులుగా ఆహ్వానించి సత్కరించారు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం నెంజిల్ తుణివిరుందాల్. సంధీప్కిషన్ కథానాయకుడిగా నటించిన ఇందులో విక్రాంత్ ముఖ్య పాత్రలో నటించారు.నటి లక్ష్మి నాయకిగా, సూరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అణ్నై ఫిలిం ఫాక్టరీ పతాకంపై ఆంటోని నిర్మిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వైద్యం నేపథ్యంలో చిత్రం కావడంతో డాక్టర్ బాలసుబ్రమణియం కుటుంబ సభ్యులను ఆహ్వానించి సత్కరించినట్లు చిత్ర దర్శకుడు సుశీంద్రన్ పేర్కొన్నారు. ఇది ఆయన 10వ చిత్రం కావడం విశేషం.ఈ చిత్ర టైటిల్‌ను సుశీంద్రన్ తండ్రి నల్లసామి ఆవిష్కరించారు.