సినిమాలో స్పార్క్‌ ఉందనిపిస్తోంది – మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి  | Spark Life Movie Teaser Release | Sakshi
Sakshi News home page

సినిమాలో స్పార్క్‌ ఉందనిపిస్తోంది – మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి 

Published Fri, Aug 4 2023 1:06 AM | Last Updated on Fri, Aug 4 2023 1:06 AM

Spark Life Movie Teaser Release - Sakshi

∙జగదీశ్వర్‌ రెడ్డి, విక్రాంత్, మెహరీన్, లీలా రెడ్డి, రుక్సార్‌ 

విక్రాంత్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’. మెహరీన్, రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్లు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏ సినిమానైనా విమర్శనాత్మక కోణంలో చూసే వ్యక్తిని నేను. ‘స్పార్క్‌’ టీజర్‌ప్రారంభం చూడగానే నాకు ‘శివ’ సినిమా గుర్తొచ్చింది. విక్రాంత్‌లో, ఈ సినిమాలో స్పార్క్‌ ఉందనిపిస్తోంది. ఈ సినిమా కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేయడంతో పాటు విజయం సాధించాలి’’ అన్నారు.

‘‘యూఎస్‌లో చదువుకుని, అక్కడే జాబ్‌ చేసినా సినిమాలపై ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ ప్రేమతోనే ‘స్పార్క్‌’ కథ రెడీ చేసుకున్నాను. నేను ప్రేమతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమతో హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విక్రాంత్‌. తుంగతుర్తి ఎమ్మేల్యే కిశోర్, రచయిత అనంత శ్రీరామ్, ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషం అబ్దుల్‌ వహాబ్‌ మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement