Mehreen
-
నాకు కొత్తగా అనిపించింది
‘‘స్పార్క్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ మూవీలో నేను లేఖ పాత్రలో కనిపిస్తాను. ఎంతోప్రాధాన్యత ఉన్న రోల్ నాది. సినిమా నాతోనే ప్రారంభం అవుతుంది.. నాతోనే ముగుస్తుంది.. ఇలాంటి థ్రిల్లర్ మూవీలో నటించటం నాకు కూడా కొత్తగా అనిపించింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ మెహరీన్ అన్నారు. విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్సపై లీల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహరీన్ పంచుకున్న విశేషాల.. ► కొత్తవాళ్లు, అనుభవం ఉన్న నటీనటులతో పని చేసే క్రమంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. ‘స్పార్క్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న విక్రాంత్ ఓ రోజు ఫోన్ చేసి, ‘మీతో కలిసి నటించాల నుంది’ అన్నారు. కథ నాకు నచ్చడంతో ఓకే చెప్పాను. విక్రాంత్‌గారు ఈ మూవీ కోసం చేసిన పరిశోధన నన్ను ఆకట్టుకుంది. నా పాత్ర, లుక్ కొత్తగా ఉంటుందని చెప్పారు.. నా లుక్, పాటలు తెరకెక్కించిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. విక్రాంత్ చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని నాకు అర్థమైంది. లీల గారు ఎక్కడా రాజీపడకుండా ఈ మూవీ తీశారు. ► విక్రాంత్ అమెరికాలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. అయితే సినిమా చేయాలనే కలని పూర్తి చేసుకోవటానికి ఇక్కడకు వచ్చారు. అమెరికాలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంలో ‘స్పార్క్’ కథను తయారు చేసుకున్నారు విక్రాంత్. ఈ కథకి కమర్షియల్ అంశాలు జోడించి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. తొలిసారి హీరోగా చేస్తూనే డైరెక్షన్ చేయటం ఎంతో కష్టం. కానీ, విక్రాంత్ ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు. తను ఓ డెబ్యూ హీరోగా, డెబ్యూ డైరెక్టర్‌గా మెప్పిస్తాడు. ►జీవితంలో ఉన్నతి స్థాయికి ఎదగాలని ప్రతి మనిషి కలలు కంటుంటారు.. నేను కూడా అంతే. నా కలలను నిజం చేసుకునే క్రమంలోనే ముందుకు వెళుతున్నాను. ఈ సినిమాలో నేను చేసిన లేఖ పాత్ర కూడా అలాగే ఉంటుంది.. అందుకే ఈ పాత్రకు నేను కనెక్ట్ అయ్యాను. నటిగా ప్రతి సినిమా నాకెంతో ప్రత్యేకమైనదే. కథ, నా పాత్ర నచ్చితేనే చేస్తాను.. లేకుంటే చేయను. అది నా కెరీర్‌కి ఎంతో సాయపడుతోంది. నన్ను ఇష్టపడేవారు, ప్రేక్షకులే నాలో స్ఫూర్తి నింపుతుంటారు. పాత్ర ఏదైనా నటిగా రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాను. ∙నేను ఏదైనా వేడుకలకి వెళ్లినప్పుడు, నా సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు ఎవరైనా నేను చేసిన పాత్ర పేరుతో పిలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ నా తొలి చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లోని మహాలక్ష్మి పాత్ర పేరుతో పిలుస్తుండటం హ్యాపీ. -
స్పార్క్ నా ఎమోషనల్ జర్నీ
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్: ఎల్.ఐ.ఎఫ్.ఈ’. ఇందులో మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. డెఫ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై లీల నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకులు హరీష్ శంకర్, మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం సాధించాలని కోరారు. ఈ వేడుకలో విక్రాంత్ మాట్లాడుతూ– ‘‘అమెరికాలో జరిగిన కొన్ని ఘటనలకు కమర్షియల్ అంశాలు జోడించి ‘స్పార్క్’ కథ రాసుకున్నాను. నేనే కథ రాసుకుని, హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తానన్నప్పుడు కొందరు వద్దన్నారు. కానీ ఈ సినిమా నా కల. నా కలకు మా కో డైరెక్టర్ స్వామిగారి అనుభవాన్ని జోడించి ఈ సినిమాను పూర్తి చేశాను. కొన్ని కష్టాలు పడ్డాను. లీల ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా నాకు పెద్ద ఎమోషనల్ జర్నీ’’ అన్నారు విక్రాంత్. ‘‘ఈ సినిమాలో సైంటిస్ట్ రోల్ చేశాను’’ అన్నారు సుహాసిని. ‘‘సినిమా చూశాను. బాగా వచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు లీల. -
సినిమా కోసం జాబ్ వదిలేసి వచ్చేసా: హీరో విక్రాంత్
-
Mehreen Pirzada Birthday: మెహరీన్ బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ
-
ధర్మవరంలో అనసూయ, మెహ్రీన్ సందడి (ఫొటోలు)
-
యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ పూర్తి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. విక్రాంత్ డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్స్పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో–డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. భావోద్వేగాలు, ప్రేమ, భారీ ఫైట్స్‌తో ఈ మూవీ రూపొందింది. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతినిచ్చే సినిమా ఇది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 17న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది – మంత్రి జగదీశ్వర్ రెడ్డి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏ సినిమానైనా విమర్శనాత్మక కోణంలో చూసే వ్యక్తిని నేను. ‘స్పార్క్’ టీజర్ప్రారంభం చూడగానే నాకు ‘శివ’ సినిమా గుర్తొచ్చింది. విక్రాంత్‌లో, ఈ సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది. ఈ సినిమా కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేయడంతో పాటు విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘యూఎస్‌లో చదువుకుని, అక్కడే జాబ్ చేసినా సినిమాలపై ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ ప్రేమతోనే ‘స్పార్క్’ కథ రెడీ చేసుకున్నాను. నేను ప్రేమతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమతో హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విక్రాంత్. తుంగతుర్తి ఎమ్మేల్యే కిశోర్, రచయిత అనంత శ్రీరామ్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడారు. -
Mehreen Pirzada Photos : మెహ్రీన్ ఘాటు పోజులు.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ (ఫోటోలు)
-
'విశ్వాసం’ సినిమా అజిత్ కూతురితో మెహరీన్
‘ఎఫ్ 3’ (2022) తర్వాత మెహరీన్ తెలుగులో సినిమాలు కమిట్ కాలేదు. తాజాగా తమిళంలో ఓ కొత్త చిత్రంలో హీరోయిన్గా నటించడానికి అంగీకరించారు. శబరీష్ నంద దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో వసంత్ రవి హీరో. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. ఇందులో సునీల్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ‘విశ్వాసం’లో హీరో అజిత్ కూతురి పాత్రలో కనిపించిన అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. -
మెహ్రీన్‌తో బ్రేకప్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో భవ్య భిష్ణోయ్ ఎంగేజ్మెంట్
హీరోయిన్ మెహ్రీన్‌కు ఈమధ్య పెద్దగా కలిసిరావడం లేదనే చెప్పాలి. ఎఫ్-3 సక్సెస్ సాధించినా ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. రీసెంట్గా బరువు తగ్గి బాగా నాజుగ్గా తయారైంది ఈ భామ. గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నా చేతిలో సరైన అవకాశాలు లేవు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 మార్చిలో మెహరీన్-భవ్య భిష్ణోయ్ నిశ్చితార్థం జైపూర్‌లో ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ అయిన కొద్దిరోజులేక ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా మారారు. మెహ్రీన్ హీరోయిన్గా కంటిన్యూ చేస్తుంటే, 2022లో జరిగిన బైపోల్ ఎలక్షన్స్‌లో బీజేపీ తరపున పోటీ చేసిన భవ్య భిష్ణోయ్ ప్రస్తుతం హర్యానా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ పరి భిష్ణోయ్‌తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా హర్యానాలో ఘనంగా వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Couldn’t think of a more special place to ask you possibly the most important question of my life… where it all began… and where it begins for us… pic.twitter.com/qWSssP6ljt — Bhavya Bishnoi (@bbhavyabishnoi) May 5, 2023 -
హీరోయిన్ మెహ్రీన్‌కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి?
ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అందం కూడా అంతే ముఖ్యం. అందుకే హీరో,హీరోయిన్లు ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్‌లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా మెస్మరైజ్ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే సో బెటర్ అంటున్నారు. చదవండి: కమెడియన్ మనోబాల మృతికి కారణం ఇదేనా?.. ఆ వ్యసనం వల్లేనా? తాజాగా ఈ లిస్ట్‌లో మెహ్రీన్ కూడా చేరింది. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో బాగా సన్నబడింది. వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్‌కి వచ్చేసింది. లేటెస్ట్గా తన లుక్‌కి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసి.. మెహ్రీన్‌కు ఏమైంది ఇంత సన్నబడింది? అయినా ఒకప్పటిలా బొద్దుగా ఉంటేనే బాగుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మన్ కుటుంబానికి ఆర్థికసాయం -
గమ్యం చేరని ప్రేమ.. బ్రేకప్ చెప్పుకున్న హీరోహీరోయిన్స్..
'నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా..', 'ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని..', 'నువ్వూనేను జంట.. టాక్ ఆఫ్ ద టౌను అంట..', 'అహ నా పెళ్లి అంట, ఓహొ నా పెళ్లి అంట.. నీకునాకు పెళ్లంట టాంటాంటాం..', 'ఏకాకై వెళుతున్నా.. పిలవద్దే పోమ్మాపో..' ఈ ఐదు పాటలతో ఏం చెప్పబోతున్నామో మీకీపాటికే అర్థమైపోయుంటుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా కొందరు తొలిచూపులోనే లవ్‌లో పడతారు. మరికొందరు అవతలి వారి చూపుల్లో, మాటల్లో మ్యాజిక్ వెతుక్కుని మరీ ప్రేమలో పడిపోతుంటారు. ఆ కొంటెచూపులు, ప్రేమవలపులు బానే ఉంటాయేమో కానీ అటుపక్కవారిని ఒప్పించాలిగా. ప్రేమ అనే పరీక్షలో కొందరు ఈజీగా మరికొందరు ఆలస్యంగా పాస్ అవుతుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే ఫెయిల్ అవుతుంటారు. ఆ తర్వాత వారు నిద్రలోనూ ఒకరిగురించి ఒకరు కలవరించడం మొదలవుతుంది. పెళ్లి అంటూ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. ఇంతలోనే కొందరికి అది ప్రేమ కాదని అర్థమై బ్రేకప్ చెప్పుకుంటారు. మరికొందరు ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి మరీ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. సినీపరిశ్రమలో లవ్ బ్రేకప్, ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న తారలెవరో ఓసారి చూసేద్దాం.. రష్మిక మందన్నా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగింది. కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. కానీ ఏడడుగులు వేసేలోపే ఎవరిదారి వారు చూసుకున్నారు. మెహరీన్ హీరోయిన్ మెహరీన్ యువ రాజకీయ నాయకుడు భవ్య భిష్ణోయ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాక ఫోటోషూట్లు కూడా చేసుకున్నారు. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ అంతలోనే అభిప్రాయబేధాలు రావడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అఖిల్ అక్కినేని అఖిల్ శ్రియ భూపాల్‌ను ప్రేమించాడు. ఆమె కూడా అతడి ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక తాము అడ్డు చెప్పేదేముందనుకున్న పెద్దలు పెళ్లి చేస్తామన్నారు. ఎంతో వైభవంగా నిశ్చితార్థం కూడా జరిపారు. కానీ వీరి పెళ్లి కూడా మధ్యలోనే ఆగిపోయింది. త్రిష హీరోయిన్ త్రిష వ్యాపారవేత్త వరుణ్ మానియన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కానీ పెళ్లికి ముందే ఇద్దరూ విడిపోయారు. నయనతార మొదట శింబుతో తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిందంటూ ప్రచారం జరిగింది. కానీ తర్వాత విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో బ్రేకప్ చెప్పింది. మరోవైపు సమంత, నాగచైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ విడిపోయారు. మంచు మనోజ్- ప్రణతి వివాహబంధం కూడా ఎంతోకాలం కొనసాగలేదు. అల్లు శిరీష్, అడివి శేష్, సందీప్ కిషన్, విశ్వక్సేన్.. ఇలా చెప్పుకుంటూ పోతే లవ్ బ్రేకప్ అయినవాళ్లు చాలామందే ఉన్నారు! చదవండి: నాన్న చివరి కోరిక నెరవేర్చే క్రమంలో అమ్మ చనిపోయింది: ఘంటసాల తనయుడు -
ఎఫ్-3 మూవీని వెంకీ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు: పరుచూరి
అనిల్ రావిపూడి తెరెకెక్కించిన ఎఫ్-2తో పోలిస్తే ఎఫ్-3 అంత బాలేదని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాపై పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పరుచూరి పలుకులు వేదికగా ఎఫ్-3 మూవీపై తన రివ్యూను వీడియో ద్వారా విడుదల చేశారు. ఎఫ్-2లో భార్యభర్తల మధ్య పెత్తనం అనే అంశం అందరికీ కనెక్ట్ అయ్యింది. అనిల్ రావిపూడికి మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. కానీ రీసెంట్గా నేను ఎఫ్-3 సినిమాను చేశాను. గతంలో 'శ్రీ కట్న లీలలు'లో మేము చేసిన పొరపాటే అనిల్ రావిపూడి ఈ సినిమాలోని సెకండాఫ్‌లో చేశారనే అనుమానం నాకు కలిగింది. సెకండ్ ఆఫ్‌లో మురళీ శర్మ కొడుకుగా వెంకీని చూపించడం అతకలేదు. మన్నాకి మీసాలు పెట్టి అబ్బాయిలా చూపించడం సహా సెకండాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ అర్థం పర్థం లేనట్లు అనిపించింది. కాస్త లాజిక్ లేకున్నా వెంకటేశ్ ఒప్పుకోడు. ఈ పాత్రను ఎలా ఓకే చేశాడో అర్థం కావడం లేదు. కుటుంబం మొత్తం హోటల్ నడుపుకుంటూ ఉంటే మెహ్రీన్ మాత్రం వేరే ఇంట్లో పనిమనిషిగా చేయడం అంతగా నప్పలేదు. ఇలా ఎన్నో తప్పులున్నా చివరి 20నిమిషాలే ఎఫ్-3ని బతికించాయి అని పరుచూరి చెప్పుకొచ్చారు. -
నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్
ఓ పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు హీరోయిన్లు. సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలకు సంబంధించిన పోస్టులు, వీడియోలు పెడుతూ అభిమానులను, ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ పోస్టులతో మూవీ ప్రమోషన్స్ చేస్తూ కొత్త ఫాలోవర్స్, సినిమా అవకాశాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తను పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. 'ఎఫ్3'తో సక్సెస్ జోష్‌లో ఉన్న బ్యూటిఫుల్ మెహ్రీన్ పిర్జాదా. ఇటీవల తన దగ్గరి బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది హీరోయిన్ మెహ్రీన్. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో నిర్వహించిన బారాత్‌లో నడిరోడ్డుపై స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మరో అమ్మాయితో కలిసి తీన్మార్ ఉత్సాహంగా చిందులేసింది. పెళ్లి బరాత్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది మెహ్రీన్. ఈ పోస్ట్‌కు 'పంజాబీ వెడ్డింగ్ సీన్స్' అనే క్యాప్షన్స్ ఇవ్వగా.. ఈ వీడియో అతి కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. కాగా 'కృష్ణగాడి వీర ప్రేమకథ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ పంజాబీ భామ. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
మూడోవారం కూడా డబ్బులొస్తున్నాయి, సక్సెస్ అంటే ఇదే: హీరో
‘‘ఎఫ్ 3’లో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంది. స్టార్స్‌తో ‘దిల్’ రాజు తీసిన ‘ఎఫ్ 3’ పాన్ ఇండియా సినిమా కింద లెక్క. ఓ హీరోకి రేచీకటి, మరో హీరోకి నత్తి, హీరోయిన్స్‌కు డబ్బు పిచ్చి. ‘ఎఫ్ 3’లో ఇలాంటివి పెట్టి సినిమాను హిట్ చేయడం అనిల్‌కే సాధ్యం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలైంది. సోమవారం జరిగిన ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాఘవేంద్రరావు. ‘‘డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండటం కంటే మించిన ఆనందం ఓ యాక్టర్‌కు ఏదీ ఉండదు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘సక్సెస్ అంటే ఈ కరోనా పరిస్థితుల్లోనూ మూడో వారంలో ఇంకా రెవెన్యూ రావడమే. సక్సెస్ అంటే ఇదే. ‘ఎఫ్ 3’కి అందరూ హ్యాపీ’’ అన్నారు. ‘‘ఇప్పుడు సినిమాకి ప్యారలల్‌గా ఓటీటీ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘ఎఫ్ 3’ని ఆదరిస్తున్నారంటే ఇది రియల్ సక్సెస్’’ అన్నారు అనిల్ రావిపూడి. డిస్ట్రిబ్యూటర్స్‌కి షీల్డ్స్ ప్రదానం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అల్టీమెట్ ఫన్ ఎఫ్-3 ట్రైలర్ వచ్చేసింది..
F3 Movie Trailer: అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ తాజాగా ఎఫ్-3 ట్రైలర్‌ను విడుదల చేశారు. చదవండి: వైజాగ్‌లో రామ్‌చరణ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్ 'ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదే.. కానీ ఆరవ భూతం ఒకటుంది అదే డబ్బు' అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'డబ్బు ఉన్నవాడికి ఫన్.. లేని వాడికి ఫ్రస్టేషన్, సీక్వెల్లో కూడా వీడికి సేమ్ డైలాగ్స్.. అంతేగా, అంతేగా'..వంటి డైలాగులు ఆకట్టకుంటున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. -
నా కెరీర్లో బెస్ట్ పాత్ర ఇదే!: మెహరీన్
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కి జోడీగా మెహరీన్ నటించిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 3’. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ‘ఎఫ్ 2’లో అల్లరి, అమాయకత్వం నిండిన హనీ పాత్రలో కనిపించిన మెహరీన్ ‘ఎఫ్ 3’లో ఈ రెండు షేడ్స్‌తో పాటు పరిణతి చెందిన అమ్మాయిలానూ కనిపించనున్నారు. ‘‘మెహరీన్ క్యారెక్టర్ మెచ్యూర్డ్‌గా డిఫరెంట్ లేయర్స్‌తో ఉంటుంది. అలాగే పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ‘‘నా కెరీర్లో ఇది బెస్ట్ ఎంటర్టైనింగ్ రోల్’’ అని మెహరీన్ అన్నారు. సోనాల్ చౌహాన్ ఓ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే పార్టీ సాంగ్‌లో నటించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి. చదవండి: మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు -
'రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతుంటాయి'.. హీరోయిన్ ఎమోషనల్
Heroine Mehreen Pirzada Opens Up About Troubles In Film Industry: ‘సినిమా ఆర్టిస్టుల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి’ అంటున్నారు హీరోయిన్ మెహరీన్. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ‘‘మేము (ఆర్టిస్టులను ఉద్దేశిస్తూ) అన్నీ తెలిసే అనిశ్చితితో కూడిన జీవితాన్ని ఎంచుకుంటాం. జీవితానికి ఓ గ్యారంటీ ఉండదు. కొన్నిసార్లు సినిమాల్లోని మా పాత్రల లుక్స్ కోసం శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ షెడ్యూల్స్కు తగ్గట్లుగా మా జీవనశైలిలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఇది మా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చలికాలం, వర్షాకాలం, వేసవి.. అనే తేడాలు చూడకుండా సినిమాల కోసం పని చేస్తుంటాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇది చాలా బాధగా ఉంటుంది. మా జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు ఉంటాయి. కెరీర్లో ఓ అద్భుతమైన విజయం దక్కిందనుకునేలోపే మరో వైఫల్యం వస్తుంది. ఒక్కోసారి రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతుంటాయి(సినిమా హిట్ అండ్ ఫెయిల్యూర్లను ఉద్దేశిస్తూ). ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సినిమాను ఓ కళారూపంగానే గౌరవిస్తాను’’ అన్నారు. కాగా తెలుగులో మెహరీన్ ఓ హీరోయిన్గా నటించిన ‘ఎఫ్ 3’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
లబ్ డబ్.. డబ్బు
‘ఎఫ్ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్ 3’ టీమ్. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న ‘ఎఫ్ 3’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మొదటి పాట ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు..’ని ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో మూడో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ కనిపించనున్నారు. -
నాగ్ సరసన మెహరీన్
నాగార్జునకు జోడీగా మెహరీన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపిస్తారు నాగార్జున. ఈ చిత్రంలో హీరోయిన్గా ఫస్ట్ కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. కానీ వ్యక్తిగత కారణాలతో కాజల్ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో అమలా పాల్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఫైనల్‌గా మెహరీన్ ఈ చిత్రంలో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాగా మెహరీన్ ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’, కన్నడంలో శివరాజ్‌కుమార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
'ఓ బేబీ'లో సమంత లాంటి రోల్ చేయాలనుంది: మెహ్రీన్
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా.. అనే తేడాలు చూడను.. నాకు అవకాశం వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలనే భావించి నటిస్తాను’’ అని హీరోయిన్ మెహరీన్ అన్నారు. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మంచి రోజులు వచ్చాయి’లో సాఫ్ట్వేర్ పద్దు పాత్రలో కనిపిస్తాను. ఇది ఓ కాలనీలో జరిగే కథ. ఇందులోని సన్నివేశాలు, పరిస్థితులను చాలామంది కోవిడ్ టైమ్‌లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సాధారణంగానే నేను ఫన్నీగా ఉంటాను. అందుకే అల్లరి సీన్స్, కామెడీ సీన్స్‌లో నటించడం ఈజీగా అనిపిస్తుంది. మా ఇంట్లో మా అమ్మ, నేను కరోనా బారిన పడి, కోలుకున్నాం. ‘మహానటి’లో కీర్తీ సురేశ్, ‘ఓ బేబీ’లో సమంత లాంటి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’, కన్నడలో శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నాను. మరికొన్ని తెలుగు కథలు విన్నాను.. త్వరలో వివరాలు వెల్లడిస్తాను’’ అన్నారు. -
హగ్ అడిగిన అనుపమ..ఫోటో షేర్ చేసిన మెహ్రీన్
►ప్రతీ చీరకు ఓ కథ ఉందంటున్న శిల్పా శెట్టి ► హగ్ అడిగిన అనుపమ ► బిగ్‌బాస్ ఫేం భానుకు విషెస్ తెలిపిన రోహిణి ► సన్ కిస్సింగ్ ఫోటోను షేర్ చేసిన మెహ్రీన్ View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
సిగరెట్ తాగిన సోహేల్, పాములతో డీల్ అంటున్న దీప్తి సునయన
► సైమా అవార్డుల్లో మెరిసిన శివాత్మిక ► చెట్టు వెనుక దాక్కున్న సీరియల్ నటి నవ్య స్వామి ► మండే మూడ్ అంటున్న తమన్నా ► బాధలో ఉన్నానంటున్న అదితి భాటియా ► కలంకారీ చీరలో మంచు లక్ష్మీ ► ఇమ్ పర్ఫెక్ట్గా ఉండటం కంటే తప్పులు చేయడం మంచిదన్న వితిక ► సిగరెట్ తాగిన సోహేల్, నో స్మోకింగ్ అంటూ క్యాప్షన్ ► పాములతో డీల్ చేస్తానంటున్న దీప్తి సునయన ► ఇవాల్టీ కిలాడీ ఇలా అంటున్న దివ్యాంక View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) -
హల్చల్ : కొప్పు వేసుకున్న సమంత..జిమ్‌కు లేట్ అయిన లక్ష్మీ
► డిజైనర్ నీతా లుల్లా కాస్టూమ్స్‌లో సమంత ► 11ఏళ్ల రిలేషన్ షిప్ అంటున్న మహి ► పట్టు ఓణీలో టిక్‌టాక్ స్టార్ బన్నీ ► జిమ్‌కు లేట్ అయిందంటున్న మంచు లక్ష్మీ ► నీ మీద నువ్వు నమ్మకం ఉంచాలంటున్న అనసూయ ► భార్యతో కలిసి ఆట సందీప్ స్టెప్పులు ► ఇంకో రౌండ్ కాఫీ ఉందంటున్న కాజోల్ ► అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్న షెఫాలీ View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) ] View this post on Instagram A post shared by Bunny Vox (@bunnyvox) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Jyoti Raj (@jyoti_raj__sandeep_) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
హల్చల్ :మెహ్రీన్ కవిత్వం..ప్రేమలో ఉన్నానంటున్న రకుల్
► ఏక్ బార్ అంటున్న దీప్తి సునయన ► చీర్స్ అంటున్న బుల్లితెర నటి అష్మిత ► అవి మాత్రం ఎవరికి కనిపించవుంటున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత ► పచ్చని పొదళ్ల మధ్యలో హీరోయిన్ సదా ► దీంతో ప్రేమలో ఉన్నానంటున్న రకుల్ ► క్యాజువల్ లుక్‌లో రాహుల్ సిప్లిగంజ్ ► కవిత్వం చెబుతున్న మెహ్రీన్ ► త్రోబ్యాక్ ఫోటో షేర్ చేసిన రాహుల్ ► మండే మోటివేషన్ అంటున్న శిల్పాశెట్టి View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Swetha (@swethapvs) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Satya Yamini (@satya.yamini) View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
అలాంటి మంచిరోజులు త్వరలోనే వస్తాయి!
Manchi Rojulochaie: ‘‘కరోనా సమయంలో అందరం నవ్వుకు దూరం అయిపోయాం. కరోనా రాకపోయినా భయంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు చూసి ‘మంచి రోజలు వచ్చాయి’ సినిమా తీశాను’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎలాంటి భయం లేకుండా థియేటర్లకు వచ్చి మా ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా చూస్తారని, అలాంటి మంచి రోజులు అతి త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా జర్నలిస్టులను కూడా చేర్చాలి’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా చిత్రాన్ని చూసి ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు మెహరీన్. ‘‘నా ప్రతిభని నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలు వంశీగారు, విక్రమ్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు సంతోష్ శోభన్. నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. -
మెహ్రీన్‌కు ‘మంచి రోజులు వచ్చాయి’..త్వరలోనే అనౌన్స్మెంట్
హీరోయిన్ మెహ్రీన్‌కు మంచి రోజులు వచ్చాయి. ఆమెకు మంచి రోజులు రావడం ఏంటి అనే కదా మీ సందేహం. మరేం లేదండి..రీసెంట్గా మెహ్రీన్ నటిస్తున్న సినిమాకు ఖరారు చేసిన టైటిల్ అది. ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదిచుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్‌తో మెహ్రీన్ జతకట్టింది. తాజాగా ఈ చిత్రానికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిట్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన రానుంది. నిజజీవిత పాత్రలను స్పూర్తిగా తీసుకుని యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తుంది. ఎస్కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఎఫ్3 తప్పా పెద్ద సినిమాలు లేవు. మరోవైపు 'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన సంతోష్ చేతిలో నందినీరెడ్డి సినిమాతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
భవ్య బిష్ణోయ్‌కు షాకిచ్చిన హీరోయిన్ మెహ్రీన్, పెళ్లి క్యాన్సిల్
Mehreen Pirzada Calls Off Engagement: హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు తాజాగా ప్రటించింది. మార్చిలో భవ్య బిష్ణోయ్‌తో ఆమె నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఈ జంట కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి వాయిదా పడటంతో మెహ్రీన్ తన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉందని అని అందరూ భావిస్తుండగా తన నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకున్నట్లు ప్రకటించి మెహ్రీన్ అందరికి షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మెహ్రీన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. ‘భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఈ రోజు నుంచి నాకు , భవ్య బిష్ణోయ్, అతడి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం నా మనసు చెప్పింది విన్నాను. ప్రతి ఒక్కరు నా నిర్ణయాన్ని, అలాగే నా ప్రైవసీకి గౌరవిస్తారని ఆశిస్తున్న. ఇక యదావిధిగా షూటింగ్‌పై దృష్టి పెట్టానుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసి తన అభిమానులు, ఫాలోవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమదైనలో మెహ్రీన్ పోస్టుపై స్పందిస్తున్నారు. pic.twitter.com/OD2p8ZKOpJ — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021 -
హల్చల్ : మెహ్రీన్ నవ్వులు..కామ్నా మేకప్ మెరుపులు..
♦ ఏమన్నావో అంటోన్న భాను ♦ పిల్లి వేషం వేసిన దీప్తి సునయన ♦ నవ్వులు చిందిస్తున్న మెహ్రీన్ ♦ కూతురికి బర్త్‌డే విషెస్ తెలిపిన మంచు లక్ష్మీ ♦ రీల్స్‌తో ఫుల్ ఫన్ అంటోన్న అనన్య ♦ మేకప్ లుక్‌లో కామ్నా ♦ వ్యాక్సిన్ తీసుకున్న ప్రియా వారియర్ View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) -
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న ఎఫ్ 3 భామ!
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ కౌర్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తన్న ఈ సినిమా షూటింగ్ హైదరబాద్‌లో జరుపుకుంటోంది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మెహరీన్‌కు సంబంధించిన ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇకపై మెహరీన్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని దీని సారాంశం. ఎఫ్ 3 తరువాత మరే ఏ సినిమాలోనూ నటించదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తను వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే కారణం అని తెలుస్తోంది. కాగా త్వరలోనే ఈ భామ పెళ్లి పీటలు ఎక్కనుందన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని, మెహరీన్ పెళ్లాడబోతున్నట్లు ఇటీవల ఆవిడే స్వయంగా వెల్లడించారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనువడే భవ్య బిష్ణోయ్. రాజస్థాన్‌లోని జైపుర్ అలీలా కోటలో మార్చి 12న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. అయితే గొప్పింటికి కోడలుగా వెళ్తుంది కాబట్టి మెహరీన్ ఇకపై నటించకపోవచ్చని అంటున్నారు. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకున్న ఆమె సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. అదే విధంగా జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని వివరించారు. చదవండి: మాజీ సీఎం మనువడితో హీరోయిన్ పెళ్లి.. -
మాజీ సీఎం మనువడితో హీరోయిన్ పెళ్లి
తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. బాగా రాజకీయ పలుకుబడి ఉన్న ఓ కుటుంబంలోకి కోడలిగా మెహ్రీన్ వెళ్లనుంది. ఎఫ్ 2లో హనీ పాపగా కనిపించిన మెహ్రీన్ మాజీ ముఖ్యమంత్రి మనువడిని మనువాడనుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే మెహ్రీన్ కొత్త జీవితం ప్రారంభించనుంది. హరియాణా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ బిష్ణోయ్ పని చేశారు. మూడు పర్యాయాలు ఆయన సీఎంగా ఉన్నారు. అతడి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్. హర్యానాలో రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం వీరిది. పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలపడంతో మెహ్రీన్, భవ్య కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా వీరి నిశ్చితార్థం మార్చి 13వ తేదీన జరగనుంది. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలస్ వేదిక కానుంది. ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తెలుస్తోంది. ఎఫ్ 2, కవచం సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉంది. -
అమెజాన్ చేతికి 'ఎఫ్ 3' డిజిటల్ రైట్స్
టాలీవుడ్ లో ఒకటి మూవీ హిట్ అయితే గొప్పగా చెప్పుకుంటారు.. అలాంటిది ఆ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రాలు వరుసగా ఐదు హిట్ అయ్యాయి. దాంతో ఆ డైరెక్టర్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు అతను తీయబోయే కొత్త సినిమాలకు రెమ్యూనరేషన్ ని కూడా పెంచాడట. ఆయన మరెవరో కాదండి దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడు దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 యొక్క సీక్వెల్ తీసేపనిలో పడ్డారు. ఇటీవలే ఈ చిత్రం షూట్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన స్టార్ కాస్ట్ వెంకటేష్ నుంచి అనిల్ రావిపూడి వరకు అందరూ తమ రెమ్యూనరేషన్ పెంచేశారు. దీంతో ఈ చిత్ర బడ్జెట్ రూ.70 కోట్లకుపైగా చేరుకున్నట్లు తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మూడింతల వినోదంతో రాబోతున్న 'ఎఫ్ 3' పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం యొక్క నాన్-థియేట్రికల్ ఒప్పందాలను మేకర్స్ మూసివేస్తున్నట్లు తెలుస్తుంది. "ఎఫ్ 3" పై భారీ అంచనాలు ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రికార్డ్ ధర పలుకుతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఎఫ్ 3' స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం బహుళ భాషలలో విడుదల కాకపోయినప్పటికీ, డీజిటల్ హక్కులు అన్ని భాషలకు అమ్ముడైయినట్లు సమాచారం . ఈ చిత్రాన్ని 2021 దసర విడుదల చేయాలనీ చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. బొమన్ ఇరానీ - సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
అతిథులు వీళ్లేనా బాస్?
బిగ్‌బాస్ సీజన్ 4 ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. రేపే గ్రాండ్ ఫినాలే. విజేత ఎవరో ప్రకటించే రోజు. ప్రతీ సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కి హోస్ట్‌తో పాటు ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్‌గా వస్తుంటారు. సీజన్ 3 ఫైనల్‌కి నాగార్జునతో కలసి చిరంజీవి సందడి చేశారు. ఈసారి నాగార్జునతో పాటు ఫైనల్లో సందడి చేయడానికి ‘లవ్‌స్టోరీ’ జంట రాబోతున్నారని తెలిసింది. నాగచైతన్య, సాయి పల్లవి ఈ సీజన్ ముఖ్య అతిథులుగా ఫైనల్ ఎపిసోడ్లో పాల్గొంటారట. ‘లవ్‌స్టోరీ’ సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరే కాకుండా పలువురు హీరోయిన్లు కూడా కనిపిస్తారట. లక్ష్మీ రాయ్, మెహరీన్లతో పాటు ఇంకొంతమంది హీరోయిన్ల స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటుందని తెలిసింది. ∙ -
నవ్వులకు క్లాప్
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్2’కి ఇది సీక్వెల్. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ‘ఎఫ్3’ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా ‘ఎఫ్2’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. అన్నీ కుదిరితే ‘ఎఫ్3’ చిత్రాన్ని రూపొందిస్తామని అప్పుడే చెప్పాం. అప్పటినుండి దర్శకుడు అనిల్ ఈ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. డిసెంబర్ 23న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’’ అన్నారు. అనిల్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్2’కి మరింత వినోదాన్ని జోడించి ‘ఎఫ్3’ని రూపొందిస్తున్నాం. అద్భుతమైన కథ కుదిరింది. మా ఆర్టిస్టులు మరిన్ని నవ్వుల్లో ప్రేక్షకులను ముంచెత్తుతారు. రాజుగారి బ్యానర్లో మరోసారి వర్క్ చేయటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి. -
వినోదం మూడింతలు
కోబ్రా అంటే పాము అని మనకు తెలుసు. అయితే ‘ఎఫ్2’లో కోబ్రా అంటే కో–బ్రదర్స్ (తోడల్లుళ్లు). వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా ఈ సినిమాలో చేసిన కామెడీ మామూలుగా ఉండదు. వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కి జోడీగా మెహరీన్ నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు వినోదం మూడింతలు అంటూ వెంకీ బర్త్‌డే సందర్భంగా ఆదివారం ‘ఎఫ్ 3’ని ప్రకటించారు. తొలి భాగంలో హీరోలు భార్యల వల్ల ఫ్రస్ట్రేట్ అవుతారు. సీక్వెల్లో ఇద్దరూ డబ్బు కారణంగా ఇబ్బందుల పాలవుతుంటారు. ఆ విషయాన్ని సూచిస్తూ, వెంకీ, వరుణ్ ట్రాలీలో డబ్బుల కట్టలు పట్టుకుపోతున్న పోస్టర్ని విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే రూపొందనున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌లే కథానాయికలు. అదనంగా మరో ముగ్గురు నాయికలు ఉంటారని సమాచారం. ఇద్దరు వెంకీ సరసన, ఇద్దరు వరుణ్ తేజ్ సరసన నటిస్తారట. మరో హీరో అతిథి పాత్రలో కనిపిస్తారని వినికిడి. బహుశా ఆ హీరోకి జోడీగా ఐదో హీరోయిన్ ఉంటుందేమో! -
డోస్ డబుల్ అట!
‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ (ఎఫ్ 2) అంటూ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు పంచిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ‘దిల్’ రాజు నిర్మించారు. దీనికి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ కథను సిద్ధం చేశారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘ఎఫ్2’లో కనిపించిన స్టార్సే ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే డేట్ ఫిక్సయిందని సమాచారం. డిసెంబర్ 14 నుంచి ‘ఎఫ్ 3’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిసింది. ఈ సీక్వెల్లో ఫన్, ఫ్రస్ట్రేషన్ రెండింతలు ఉంటుందట. కామెడీ డోస్ డబుల్ ఉంటుందని టాక్. వచ్చే ఏడాది సమ్మర్‌కి థియేటర్స్‌లోకి ‘ఎఫ్ 3’ను తీసుకురావాలన్నది చిత్రబృందం ప్లాన్. -
అందుకు మేము కారణం కాదు
సినిమా: పటాస్ చిత్రంతో మరోసారి కోలీవుడ్‌లో వార్తల్లో ఉంటున్న నటి మెహ్రీన్. 2016లో నటిగా రంగప్రవేశం చేసిన జాణ ఈమె. అంటే అప్పుడే ఐదో ఏటను టచ్ చేసేసింది. ఈ ఐదేళ్లలో తెలుగు, తమిళం, మాతృభాష పంజాబీ అంటూ పలు భాషల్లో నటిస్తూ బాగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా తెలుగులో మంచి క్రేజ్‌నే సంపాదించుకుంది. పోతే తమిళంలో ఇటీవలే సక్సెస్ రుచిని చూసింది. ఇంతకుముందే సుశీంద్రన్ దర్శకత్వంలో నెంజిల్ తునివిరుందాల్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం కారణం కావచ్చు ఇక్కడ ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది దర్శకుడు దురై సెంథిల్‌కుమార్ కంటపడింది. దీంతో ధనుష్‌తో పటాస్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ సారి పటాస్ చిత్రం సక్సెస్‌ను, గుర్తింపును తెచ్చి పెట్టింది. కానీ మరిన్ని అవకాశాలను మాత్రం అందించలేదు. అందుకోసమేనేమో ఈ అమ్మడు తరచూ వార్తల్లో ఉండేలా చర్చనీయాంశ వ్యాఖ్యలు చేస్తోంది. చిత్ర అపజయాలకు తాము కారణం కాదని అంటోంది. మెహ్రీన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను నటించే ప్రతి చిత్రం విజయం సాధించాలని ఆశిస్తానని చెప్పింది. కథా పాత్రల్లో లీనమై అంకితభావంతో ప్రాణం పణంగా పెట్టి నటిస్తానని అంది. అయినా తాను నటించిన కొన్ని తెలుగు చిత్రాలు ఫ్లాప్ అయ్యి నిరాశకు గురిచేశాయని చెప్పింది. నిజం చెప్పాలంటే అపజయాలకు నటీనటులు కారణం కాదని అంది. ఆ చిత్రాల కథలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, లేకుంటే ఎంతో శ్రమించి నటించినా వృధానే అని పేర్కొంది. ఈ అమ్మడు అంతగా ప్రాణాన్ని పణంగా పెట్టి నటించిన చిత్రాలేమిటో గానీ, ఇటీవల తెలుగు, తమిళంలో నటించిన చిత్రాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అయితే తెలుగులో కల్యాణ్‌రామ్‌కు జంటగా నటించిన ఎంత మంచి వాడివిరా చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్ర రిజల్ట్ పైనే మెహ్రీన్ అసంతృప్తిని వ్యక్తం చేస్తుందేమో. అయినా, ఎన్నో అనుకుంటాం.అన్నీ జరుగుతాయా ఏంటి? లైట్‌గా తీసుకోవాలిగానీ. ఇకపోతే తెలుగులో ఈ బ్యూటీ నటించిన అశ్వథ్థామ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఇది మినహా అక్కడ కూడా చేతిలో చిత్రాలు లేవు. అందుకే ఫ్రస్టేషన్లో ఈ అమ్మడు అలా మాట్లాడుతుందా అన్న భావన కలుగుతోందంటున్నారు సినీ వర్గాలు. -
అశ్వథ్థామ: చివర్లో విజిల్.. అదిరిపోయింది
ఓ ప్రేమ కథ.. లేదంటే, రెండు వర్గాల మధ్య గొడవలు.. ఎప్పుడూ ఇదే కథేనా అనుకునే వారికి రొటీన్ కథతో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నాడు హీరో నాగశౌర్య. అతను తాజాగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు పూరీ జగన్నాధ్ గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ట్రైలర్ ప్రకారం అమ్మాయిల మిస్సింగ్‌తోపాటు, వారిని దారుణంగా చంపుతున్న వారికోసం హీరో వేట మొదలు పెడతాడు. అయితే వీళ్లందరినీ ఆడిస్తున్న ప్రధాన సూత్రధారిని పట్టుకోడానికి హీరో తన ప్రయత్నాలు కొనసాగిస్తాడు. (అశ్వథ్థామ టీజర్) ఈ క్రమంలో నాగశౌర్య ఫైట్లు కూడా చేస్తాడు. అయితే శౌర్య లవర్‌బాయ్ ఇమేజ్ నుంచి ఒక్కసారిగా మాస్ యాంగిల్లో కనిపించడం కాస్త కొత్తగా ఉన్నా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ చివరలో శౌర్య విజిల్ వేసుకుంటూ కనిపించే సీన్ అభిమానులతో ఈల వేయించేట్లు కనిపిస్తోంది. బీజీఎమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘ఎటువైపు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులు... వేట కుక్కల్లా వెంటపడే జాలర్లు.. శకునిలాంటి ఓ ముసలోడు.. వీరందరినీ ఒకే స్టేజ్ మీద ఆడించే ఆ సూత్రధారి ఎవరు?’ వంటి డైలాగ్స్ బాగున్నాయి. నాగశౌర్య ఈ సినిమాతో తప్పకుండా హిట్ ట్రాక్‌లోకి వస్తాడని అభిమానులు మక్తకంఠంతో చెప్తున్నారు. ఇక శౌర్య ఈ సినిమా పేరుని తన ఛాతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్న విషయం తెలిసిందే. కాగా సమాజంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా నాగశౌర్య సొంతంగా కథ రాసుకున్నాడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. -
ఎంత మంచివాడవురా!
-
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చాణక్య’
మ్యాచో హీరో గోపీచంద్, మెహరీన్ జంటగా నటిస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’.. తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రం శనివారం(అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ‘చాణక్య’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రానికి సెన్సార్ నుండి మంచి స్పందన రావడంతో దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’థియేటర్లలో సందడి చేస్తున్న సమయంలో ‘చాణక్య’విడుదల చేసి రిస్క్ చేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ముందుగా అనుకున్న తేదీ ప్రకారం ‘చాణక్య’ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
వెండి వెన్నెల..నువ్వు ఇలా...
‘క్రిష్ణగాడి వీరప్రేమగాథ’తో తెలుగు ప్రేక్షకులకు ‘మహాలక్ష్మి’గా పరిచయమైంది మెహ్రీన్ కౌర్ పీర్జాదా. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘నోటా’ ‘కవచం’, ‘ఎఫ్–2’ చిత్రాలతో చేరువైన మెహ్రీన్ ముచ్చట్లు తన మాటల్లోనే... నన్ను మార్చేసింది కెమెరా ముందు నిల్చున్న క్షణాలన్నీ నా దృష్టిలో ఆనందమయమే. రకరకాల పాత్రలు చేస్తున్న క్రమంలో నన్ను నేను కొత్తగా కనుగొనే ప్రయత్నం చేస్తున్నాను. ‘నటన’ నాలో మార్పు తెచ్చిందా అంటే...యస్ అని అంటాను. క్రమశిక్షణ, ఏకాగ్రత పెరగడం, సమయం సద్వినియోగం చేసుకోవడంతో పాటు నా గురించి నేను కేర్ తీసుకునేలా చేసింది నటన. విధివిలాసం దుస్తులకు, వ్యక్తిత్వానికి సంబంధం లేదని నమ్ముతాను. మోడ్రన్ స్టైల్లో కనిపించినంత మాత్రానా గ్రామీణనేపథ్యం ఉన్న పాత్రలు చేయలేరు అనేది అపోహ మాత్రమే. అలా అయితే నేను మహాలక్ష్మి పాత్ర చేసి ఉండేదాన్ని కాదేమో! పంజాబ్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగాను. న్యూయార్క్, కెనడా నుంచి హైదరాబాద్ వరకు జరిగిన నా జర్నీ అంతా డెస్టినీ అనుకుంటాను. హైదరాబాద్‌లో ఉంటే హోమ్‌సిక్ ఉండదు. హోమ్‌టౌన్‌లో ఉన్నట్లుగానే ఉంటుంది! ఎందుకంటే... ‘మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా’గా ఎన్నికైన తరువాత ఫ్యాషన్ ప్రపంచం నుంచి అవకాశాలు వచ్చాయి. పెద్ద పెద్ద బ్రాండ్లకు పనిచేశాను. అలా ముంబైకి షిఫ్ట్ అయ్యాను. ఆ తరువాత సినిమాల్లోకి! ‘హిందీ సినిమాల్లో కాకుండా తెలుగులో ఎందుకు నటిస్తున్నారు?’ అనే ప్రశ్న ఎదురవుతుంటుంది. ఈరోజుల్లో తెలుగు, హిందీ లేదా ఇతర భాష అనే తేడా లేదు. ఇక్కడ కూడా ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. గలగలమని... ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ధైర్యంగా ముందడుగు వేయగలం. నాకు అలాంటి సపోర్ట్ ఉన్నందుకు గర్వంగా ఉంటుంది. మా కుటుంబసభ్యులు ఎప్పుడూ తమ నిర్ణయాన్ని నా మీద రుద్దే ప్రయత్నం చేయరు.‘నీ మనసు చెప్పినట్లే చెయ్’ అని చెబుతుంటారు. మౌనంగా ఉండడం కంటే ఎప్పుడూ గలగలమని మాట్లాడుతూ ఉండడమే నాకు ఇష్టం. చుట్టూ బంధువులో, స్నేహితులో ఉండాల్సిందే. గన్ అంటే ఇష్టం! ఏదో ఒక ఆట ఎంచుకొని ప్రాక్టీస్ చేయమని అమ్మ చెప్పడంతో ఎయిర్ పిస్టల్ షూటింగ్లో శిక్షణ తీసుకున్నాను. నెయిల్‌పాలిష్, హెయిర్ స్టైల్...మొదలైన వాటి కంటే ‘గన్’ అంటేనే నాకు ఇష్టంగా ఉండేది. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న ఎయిర్ పిస్టల్‌తో ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇప్పటికీ నేను పంజాబ్‌కు వెళితే షూటింగ్ రేంజ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంటాను. -
విజయ్ దేవరకొండ నోటా ట్రైలర్ రిలీజ్
-
‘ముఖ్యమంత్రి పదవా.. మ్యూజికల్ చైర్స్ ఆటా?’
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నోటా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్‌హిట్ తరువాత తెరకెక్కుతున్న నోటాతో విజయ్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. విజయ్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. బుధవారం స్నీక్‌పీక్ పేరుతో 30 సెకన్ల టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఈ రోజు (గురువారం) ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విజయ్ దేవరకొండను తమిళ ఇండస్ట్రీకి ఆహ్వానిస్తూ నోటా తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అదే సమయంలో తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 4న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
బెల్లంకొండ సినిమాలో మెహ్రీన్
ఇటీవల సాక్ష్యం సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తన ఐదో పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూపిస్తున్నాడు ఈ దర్శకుడు. కాజల్ ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ పాత్రలో మెహ్రీన్ నటిస్తున్నారు. ఈ రోజు నుంచి మెహ్రీన్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ ప్రారంభమైంది. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. -
గోపీచంద్ ‘పంతం’ టీజర్
గోపీచంద్ హీరోగా కె.చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా పంతం. ‘ఫర్ ఏ కాస్’ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ యాక్షన్ కథతో పంతం సినిమాను తెరకెక్కించారు. గోపీచంద్ 25వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో మెహరీన్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 5న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
టీజర్ ఆన్ ది వే
గోపీచంద్ హీరోగా నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పంతం’. ‘ఫర్ ఏ కాస్’ అన్నది ఉపశీర్షిక. శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. ఇది గోపీచంద్‌కి 25వ సినిమా. ఈ సినిమా టీజర్‌ను జూన్ 5న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ సిల్వర్‌జూబ్లీ సినిమాను మా బ్యానర్లో నిర్మించడం ఆనందంగా ఉంది. మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. లండన్‌లో పాటల షూట్ జరుగుతోంది. జూలై 5న సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
గోపీచంద్ పంతం!
విలన్స్‌ను రఫ్పాడిస్తున్నారు హీరో గోపీచంద్. ఎక్కడ అంటే... హైదరాబాద్‌లోనే. ఎందుకంటే.. అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. చక్రి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా కేకే రాధామోహన్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెహరీన్ కథానాయిక. ఈ సినిమాకు ‘పంతం’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేయాలన్న ఆలోచనలో చిత్రబృందం ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్. -
స్క్రీన్ టెస్ట్
► ఈ సంవత్సరం (2018) విడుదలవ్వటానికి సిద్ధంగా ఉన్న ‘రజనీకాంత్’ సినిమాలెన్నో తెలుసా? ఎ) ఒకటి బి) రెండు సి) మూడు డి) నాలుగు ► ‘భరత్ అనే నేను’, ‘రంగస్థలం–1985’... ఈ రెండు చిత్రాలకు సంగీత దర్శకుడు ఒక్కరే? ఎవరై ఉంటారో కనుక్కోండి చూద్దాం? ఎ) అనిరుద్ బి) యస్.యస్. తమన్ సి) గోపీసుందర్ డి) దేవిశ్రీ ప్రసాద్ ► 2018 జనవరిలో ‘భాగమతి’ అనే సినిమా రిలీజు కానుంది. ఈ చిత్రంలో ‘ అనుష్క’ హీరోయిన్గా నటించింది? ఏ నిర్మాణ సంస్థ నిర్మించిందో తెలుసా? (ఎ) ఎ) యువీ క్రియేషన్స్ బి) గీతా ఆర్ట్స్ సి) వైజయంతి మూవీస్ డి) 14 రీల్స్ ► ఈ ‘సంక్రాంతి’కి వస్తున్న సినిమాలలో రెండు పెద్ద సినిమాలలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) అనూ ఇమ్మాన్యుయేల్ బి) రాయ్ లక్ష్మీ సి) కీర్తీ సురేశ్ డి) అనుపమాపరమేశ్వరన్ ► ‘స్కెచ్’ అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరో విక్రమ్. హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) సమంత బి) రకుల్ ప్రీత్‌సింగ్ సి) రెజీనా డి) తమన్నా ► ఆయనొక రైటర్. 2017లో మెగా ఫోన్ పట్టాడు. 2018లో దర్శకుడిగా తన మొదటి సినిమా రిలీజవుతుంది? ఎవరా రచయిత–దర్శకుడు? ఎ) విజయేంద్ర ప్రసాద్ బి) శివా నిర్వాణ సి) వక్కంతం వంశీ డి) ఐవీ ఆనంద్ ► 2018లో సాయిపల్లవి నటించే మొదటి సినిమాలో హీరో ఎవరో కనుక్కోండి ? ఎ) శర్వానంద్ బి) నాని సి) కల్యాణ్‌రామ్ డి) వరుణ్‌తేజ్ ► మంచు విష్ణు నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ఈ నెలలో రిలీజవుతోంది. ఆయన ప్రక్కన ఫుల్ లెంగ్త్ పాత్ర చేసిన హాస్య నటుడెవరో తెలుసా? ఎ) పృథ్వీ బి) పోసాని కృష్ణమురళి సి) సప్తగిరి డి) బ్రహ్మానందం ► ఈ నెలలో షూటింగ్ ప్రారంభించనున్న బోయపాటి. శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించనున్న హీరో ఎవరు? ఎ) బాలకృష్ణ బి) మహేశ్‌బాబు సి) రామ్‌చరణ్ డి) యన్టీఆర్ ► చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం ‘దిల్’ రాజుతో కలిసి ఓ అగ్రనిర్మాత ఓ సినిమా నిర్మించనున్నారు. ఎవరా నిర్మాత? చిన్న క్లూ (ఈ చిత్రంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తారు. ఎ) బీవియస్‌యన్ ప్రసాద్ బి) చలసాని అశ్వనీదత్ సి) సురేశ్‌బాబు డి) కేయస్ రామారావు ► పాటల రచయిత కృష్ణ చైతన్య రెండోసారి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరో ఎవరు? ఎ) అల్లు శిరీష్ బి) నితిన్ సి) మంచు మనోజ్ డి) అఖిల్ ► ఈ క్రింద ఉన్న నాలుగు సినిమాలలో ఫిబ్రవరి 9న విడుదల కాని చిత్రం ఏంటో తెలుసా? ఎ) కిరాక్ పార్టీ బి) గాయత్రి సి) తొలిప్రేమ డి) ఛలో ► 2018లో రాబోతున్న పూరి జగన్నాథ్ సినిమా పేరు ‘మెహబుబా’. అందులో హీరో ఎవరు? సి) ఎ)సుమంత్ అశ్విన్ బి) శ్రీ విష్ణు సి) ఆకాష్ పూరి డి) అడవి శేష్ ► రవితేజ కొత్త సినిమా ‘టచ్ చేసి చూడు’లో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రకుల్ ప్రీత్‌సింగ్ బి) రాశీ ఖన్నా సి) శ్రుతీహాసన్ డి) మెహరీన్ ► 2018 ప్రథమార్ధంలో ద్విపాత్రాభినయం చేస్తున్న యంగ్ హీరో ఎవరు ? ఎ) నాగచైతన్య బి) రామ్ సి ) నాని డి) నిఖిల్ ► చిరంజీవి చేస్తున్న ‘సైరా’ నరసింహా రెడ్డి సినిమాలో నరసింహా రెడ్డికి ఎంత మంది భార్యలు? ఎ)ముగ్గురు బి) ఇద్దరు సి) ఒక్కరు డి) నలుగురు ► ఈ సంవత్సరం బాలీవుడ్ మూవీని డైరెక్ట్ చేస్తున్న టాలీవుడ్ దర్శకుడు ఎవరు? ఎ) పూరీ జగన్నాద్ బి) వీవీ వినాయక్ సి) కృష్ణవంశీ డి) క్రిష్ ► విశాల్ హీరోగా నటిస్తున్న ‘అభిమన్యుడు’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) నయనతార బి) కాజల్ సి) తమన్నా డి) సమంత ► నాగార్జున–రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా వీరి కాంబినేషన్లో ఎన్నో చిత్రం? ఎ) 2 బి) 5 సి) 4 డి) 6 ► 2017లో ‘ఘాజీ’ సినిమా ద్వారా సంచలనం సృష్టించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి తదుపరి సినిమాలో హీరో ఎవరు? ఎ) రాజ్ తరుణ్ బి) నాగ శౌర్య సి) వరుణ్ తేజ్ డి) విజయ్ దేవరకొండ సమాధానాలు 1.బి, 2.డి, 3.ఎ, 4.సి, 5.డి,6.సి, 7.ఎ, 8.డి, 9.సి, 10.బి,11.బి, 12.డి, 13.సి, 14.బి,15.ఎ, 16.ఎ, 17.డి, 18.డి, 19.సి, 20.సి -
మెహరీన్‌తో ’ ప్రిన్సెస్ వెడ్డింగ్’ ప్రారంభం
-
లక్కీ స్టార్
మెహరీన్ లక్కీ స్టార్ అట. ఇప్పుడు చాలామంది అంటున్న మాట ఇది. దానికి కారణం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్’... ఇలా ఆమె నటించిన సినిమాలు హిట్ కావడమే. జనరల్‌గా కంటిన్యూస్ ఫ్లాప్స్‌లో ఉన్న హీరోయిన్స్‌ని ‘ఐరెన్ లెగ్’ అంటారు. అయితే, మెహరీన్లా ‘కంటిన్యూస్ హిట్స్’లో ఉన్న హీరోయిన్ని ‘లక్కీ స్టార్’ అంటారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఈ బ్యూటీ మీద వేసిన స్టాంప్ ఇది. హిట్స్‌తో దూసుకెళుతోన్న వాళ్లకు బోలెడన్ని ఆఫర్లు వస్తాయి. మెహరీన్‌కి అలానే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు వచ్చిన ఆఫర్స్‌లో గోపీచంద్ సరసన నటించే ఛాన్స్ ఒకటని ఫిల్మ్‌నగర్ టాక్. గోపీచంద్ హీరోగా చక్రిని దర్శకునిగా పరిచయం చేస్తూ రాధామోహన్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఇటీవల ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ చివరికి మెహరీన్‌ని ఖరారు చేశారట. -
ఇంటికో జవాన్
దేశానికి జవాన్ చాలా అవసరం. అలాగే, ప్రతి ఇంటికి జవాన్ లాంటి కొడుకు ఒకడు ఉండాలి అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘జవాన్’. ‘ఇంటికొక్కడు’ అన్నది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ స్వరాలు అందించారు. ఈ సినిమా థీమ్ సాంగును ఇటీవల సాయిధరమ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘ఓ మధ్య తరగతి యువకుడు తన కుటుంబాన్ని మనోధైర్యంతో, బుద్ధి బలంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టాం. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్టైనింగ్ కమర్షియల్ మూవీ. తమన్ మంచి పాటలిచ్చారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ -
ఆ కోరిక నెరవేరింది
తెలుగులో చిత్రం చేయాలన్న కోరిక కేరాఫ్ సూర్యతో నెరవేరిందని వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సుశీంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. వెన్నెల కబడ్డీ కుళు చిత్రం ద్వారా ఈయన దర్శకుడిగా పరిచయమయ్యారు. కార్తీ హీరోగా తెరకెక్కించిన నాన్ మహాన్ అల్ల చిత్రం తెలుగులో నా పేరు శివ పేరుతో అనువాదం అయ్యి రెండు భాషల్లోనూ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి తాను తెలుగులో చిత్రం చేయాలని కోరుకున్నా అది నెరవేరలేదని దర్శకుడు సుశీంద్రన్ సోమవారం విలేకరులతో వెల్లడించారు. ఈయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రాన్ని తమిళంలో నెంజిల్ తుణివిరుందాల్, తెలుగులో కేరాఫ్ సూర్య పేరుతో తెరక్కెంచారు. నటుడు సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ వివరాలను దర్శకుడు తెలుపుతూ దీపావళి పండుగ అంటే తకు చాలా ఇష్టం అన్నారు. 1991లో రజనీకాంత్ నటించిన దళపతి చిత్రాన్ని చూసేందుకు స్నేహితునితో కలిసి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి, ఇంట్లో దెబ్బలు తిన్నా కూడా తొలిసారిగా దీపావళి పండగను ఎంజాయ్ చేశానన్నారు. ఆ తరువాత చెన్నైకి రావడంతో కొన్నేళ్లు దీపావళికి దూరంగా ఉన్నానని, మళ్లీ తన తొలి చిత్రం వెన్నెలా కబడ్డీ కుళు చిత్ర విడుదల సందర్భంగా 2009లో దీపావళి వేడుకను జరుపుకున్నాన్నారు. అప్పటి నుంచి వరసగా దీపావళిని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటున్నాన్నారు. పాండినాడు చిత్రం 2013లో దీపావళి సందర్భంగా విడుదలై తనకు ఘన విజయాన్ని అందించిందన్నారు. కాగా తాజా చిత్రం నెంజిల్ తుణివిరుందాల్ను ఈ దీపావళికి విడదల చేయాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రస్తుతం ఎంజీనా అనే చిత్రం నిర్మాణంలో ఉందని సుశీంద్రన్ తెలిపారు. -
రాజా ది 'గ్రేట్ డీల్'
లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజా ది గ్రేట్. రవితేజ అంధుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. పటాస్, సుప్రీమ్ సినిమాలతో వరుస విజయాలు సాధించిన అనీల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనీల్ ట్రాక్ రికార్డ్ కు రవితేజ మాస్ ఇమేజ్ తొడవ్వడంతో రాజా ది గ్రేట్ సినిమా రైట్స్ కు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్, శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్మినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూడు రైట్స్ కలిపి 18 కోట్లు పలికినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ సినిమాల డబ్బింగ్ వర్షన్ లకు ఉత్తరాదిలో మంచి డిమాండ్ ఉండటం కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. -
రాశీ... రాకింగ్ స్టెప్స్!
రాశీ ఖన్నా ఫస్ట్ టైమ్ ఓ సాంగ్ షూట్‌కి రెడీ అయ్యారు. అదేంటీ! ఇప్పటికే ఆమె చాలా సాంగ్స్ చేశారు కదా.. ఫస్ట్ టైమ్ సాంగ్ చేయడమేంటి? అనుకుంటున్నారా? అవన్నీ హీరోయిన్గా చేశారు. ఇప్పుడు తాను హీరోయిన్ కాని ఓ సినిమాలో కాలు కదపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ, మెహరీన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘రాజా ది గ్రేట్ ’. ఈ చిత్రంలో రవితేజ, మెహరీన్ కాంబినేషన్లో వచ్చే ఓ పాటలో రాశీ ఖన్నా తళుక్కుమంటారు. ఆ పాటలో కాసేపు కనిపించి, అలరించనున్నారు. స్పెషల్ అప్పియరన్స్ అన్నమాట. రెండేళ్ల క్రితం ‘మనం’ సినిమాలో రాశీ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, సాంగ్‌లో స్పెషల్ అప్పియరన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. ‘‘ మై లవ్లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కోసం ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో షార్ట్ అండ్ స్పెషల్ అప్పియరన్స్లో కనిపించబోతున్నా’’ అని రాశీ ట్వీట్ చేశారు. వెంటనే ‘‘వెల్కమ్ టు అవర్ వరల్డ్’’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఈ సాంగ్‌లో రాకింగ్ స్టెప్స్‌లో రాశీ కనువిందు చేయనున్నారట. -
కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. తోడ్‌దే దుష్మన్ కి హడ్డీ!
కబడ్డీ... కబడ్డీ... ఆటగాళ్లు, వీక్షకులతో ఓ ఇండోర్ స్టేడియంలో సందడి నెలకొంది. ఆ ఆటగాళ్లలో రాజా (రవితేజ) ఒకడు. ‘కబడ్డీ.. కబడ్డీ..’ అంటూ కూత పెడుతూ ప్రత్యర్థి కోర్టులోకి అడుగు పెడతాడు. అప్పటివరకు అది ఆటే అనుకుంటారంతా! కానీ, రాజా అడుగుతో వేటగా మారుతుంది. ‘కబడ్డీ.. కబడ్డీ..’ అనే కూత ‘తోడ్‌దే దుష్మన్ కి హడ్డీ’ (దుష్టుల/విలన్స్ ఎముకలు విరగొట్టేయ్) అనేలా వినబడుతుంది అందరికీ! అప్పుడు తను అంధుడనే సంగతి ఎవ్వరికీ గుర్తు రానంతగా రాజా ఆడిన ఆట... కాదు.. కాదు.. సాగించిన వేట ‘రాజా ది గ్రేట్’ సిన్మా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందట! రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాజా ది గ్రేట్’. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయినా... ప్రేక్షకులు ఆశించే యాక్షన్ సీక్వెన్సులకు ఏమాత్రం లోటు ఉండదట. ముఖ్యంగా కబడ్డీ ఫైట్ చాలా బాగుంటుందని సమాచారం. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం రవితేజ, రాధిక, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీత దర్శకుడు. -
మిస్టర్ క్లీన్!
కుర్రాడి పేరు ఆనంద్. అతనికి ఓసీడీ ఉంది. అంటే... అదేదో బీటెక్, ఎమ్‌టెక్ లాంటి డిగ్రీ అనుకునేరు. ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ అన్నమాట. దీని లక్షణం అతి శుభ్రం. ఆనంద్ ‘మిస్టర్ క్లీన్’. ఈ డిజార్డర్‌తో ఆనంద్ లైఫ్ ఎలా ఉంటుంది? అనేది తెలుసుకోవాలంటే ‘మహానుభావుడు’ చూడాల్సిందే. శర్వానంద్ టైటిల్ రోల్లో మారుతి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ కంప్లీట్ అయిన ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్‌తో చేస్తున్న చిత్రం ఇది. పుల్æకామెడీ అండ్ మ్యూజికల్ లవ్‌స్టోరీ. ఓసీడీ ఉన్న కుర్రాడిగా శర్వానంద్ అద్భుతంగా చేస్తున్నారు. తన కెరీర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఎస్.ఎస్. తమన్ అందించిన ఆడియో సూపర్’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో శర్వానంద్ హీరోగా చేస్తున్న మూడో చిత్రం ఇది. క్యారెక్టరైజేషన్‌తో కామెడీ పండించగల దర్శకుల్లో మారుతి ప్రథముడు. డబ్బింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
దేశానికి మనమేమిచ్చాం!
దేశం మనకేమిచ్చిందన్నది కాదు. దేశానికి మనమేమిచ్చాం అన్నది ముఖ్యం. అయినా మనలోని దేశభక్తి ఒకడు చెప్తే గుర్తుకు రాకూడదు. దేశభక్తి అనేది కిరీటం కాదు.. కృతజ్ఞత. ఇలా ఆలోచించే ఓ కుర్రాడు తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు జవాన్లా మారి శత్రువులపై యుద్ధం చేస్తాడు. జవాన్ దేశభక్తి, దేశం కోసం అతనేం చేశాడు? అనేది సెప్టెంబర్ 1న విడుదల కానున్న ‘జవాన్’ని చూస్తే తెలుస్తుంది. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన చిత్రం ‘జవాన్’. ‘‘ప్రతి ఇంటికీ మా హీరోలా ఒకరు ఉండాలని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఎమోషన్స్‌తో కూడిన చిత్రం. తేజ్ యాక్టింగ్ సూపర్బ్. తమన్ సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు రవి. -
ధైర్యం... బలం అవే ఆయుధం
ఓ యువకుడి ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కుటుంబం, మరొకటి దేశం! రెండిటిలో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోవాల్సిన టైమ్‌లో అతను ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న సినిమా ‘జవాన్’. ఇంటికొక్కడు... అనేది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు బీవీయస్ రవి దర్శకుడు. ఈరోజు దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ చిత్రమిది. ఓ మధ్య తరగతి యువకుడు తనకెదురైన కష్టాలను మనోధైర్యంతో, బుద్ధిబలంతో ఎదుర్కొని కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది చిత్రకథ’’ అన్నారు.‘‘సాయిధరమ్ తేజ్‌కి తగ్గ కథ. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతోంది. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు ‘దిల్’ రాజు. నిర్మాత కృష్ణ మాట్లాడుతూ – ‘‘మా ధైర్యం ‘దిల్’ రాజు గారే. ఆయన ముందుండి మా సినిమాను నడిపిస్తున్నారు. ఇటీవల ఇటలీలో రెండు పాటలు చిత్రీకరించాం. రేపటి నుంచి హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ తీస్తాం. జూలై కల్లా చిత్రీకరణ పూర్తిచేసి, ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. తమిళ హీరో ప్రసన్న విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
మిడిల్ క్లాస్ సూర్య
సందీప్ కిషన్, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ మెహరీన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ‘నా పేరు శివ’ ఫేం సుసీంద్రన్ దర్శకత్వంలో ‘స్వామి రారా’ చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని హీరో సూర్య విడుదల చేశారు. సహ నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సందీప్ కిషన్ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరైన డి. ఇమ్మాన్‌ను టాలీవుడ్‌కి పరిచయం చే స్తున్నాం. జూలైలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె.లక్ష్మణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.సి, సమర్పణ: శంకర్ చిగురుపాటి. -
నాని హీరోయిన్ యమా బిజీ..!
నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహరీన్. తొలి సినిమాలోనే అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది మెహరీన్. అయితే కృష్ణగాడి వీర ప్రేమగాథ తరువాత వెంటనే బిజీ హీరోయిన్ అవుతుందని భావించినా.. పెద్దగా అవకాశాలు రాలేద. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన మెహరీన్ ఫిలౌరీ సినిమాతో ఆకట్టుకుంది. బాలీవుడ్ సినిమా చేస్తుండగానే టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో జవాన్, రవితేజతో రాజా ది గ్రేట్, శర్వానంద్, మారుతిల సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, సందీప్ కిషన్ సరసన నటిస్తున్న సినిమాతో కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు ఇప్పుడు చర్చల దశలో ఉన్నాయి. -
పవన్, త్రివిక్రమ్ సినిమాలో నాని హీరోయిన్
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నాని సరసన హీరోయిన్గా పరిచయం అయిన భామ మెహరీన్. తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ, ఇప్పుడో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్రేట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల సినిమాలో నటించనుంది ఈ బ్యూటి. అయితే మెహరీన్ నటించబోయేది పవన్ సరసన హీరోయిన్గా కాదు. అసలు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలోనే కాదు. ఇటీవల పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు నిర్మాతలుగా నితిన్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించారు. రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మెహరీన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారట. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లై' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నితిన్, ఆ తరువాత కృష్ణచైతన్య సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. -
తరువాతి సినిమా 'జగదేకవీరుని కథ'
'శ్రీరస్తు శుభమస్తు' రిలీజ్ కాకముందే అల్లు శిరీష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎమ్.వి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించనున్న ఆ సినిమాకు 'జగదేకవీరుని కథ' అనే ఆసక్తికర టైటిల్‌ను కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శిరీష్ సరసన 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' ఫేం మెహరీన్ నటించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్. లావణ్య త్రిపాఠితో కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్ 'శ్రీరస్తు శుభమస్తు' ట్రైలర్ ఇటీవలే విడుదలై పలువురు సినీ ప్రముఖుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. వచ్చే వారం సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
మహాలక్ష్మీ బాలీవుడ్ ఎంట్రీ
తొలి సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మెహరీన్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. నాని హీరోగా తెరకెక్కిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో మహాలక్ష్మీగా వెండితెరకు పరిచయం అయిన ఈ భామ, తన నటనతో ఆకట్టుకుంది. తెర మీద కాస్త బొద్దుగా కనిపించినా.., గ్లామర్‌తో పాటు పర్ఫామెన్స్లోనూ మంచి మార్కులు సాధించింది. దీంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్, బీవీయస్ రవి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాల్లో హీరోయిన్గా ఫైనల్ అయ్యింది. వీటితో బాలీవుడ్‌లోనూ ఓ సినిమాను అంగీకరించింది మెహరీన్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో పంజాబీ అమ్మాయిగా నటించనుంది మెహరీన్. పలు ప్రకటనల్లో నార్త్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్గా అలరించడానికి రెడీ అవుతోంది. -
హీరోను తెగ పొగిడేస్తున్న హీరోయిన్
హైదరాబాద్ : భలే భలే మగాడివోయ్ చిత్రం ఇచ్చిన కిక్‌తో మాంచి ఊపు మీదున్న టాలీవుడ్ హీరో నానిని పొగడ్తలతో ముంచేస్తోంది హీరోయిన్ మెహరీన్. అతనితో కలిసి నటించడం తన అదృష్టమని పొంగిపోతోంది. నాని హీరోగా వస్తున్న 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మెహరీన్... నానితో వర్క్ చేయడం చాలా అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చిందంటోంది. సెట్స్ లో తొలిరోజు తనకు నాని చాలా హెల్ప్ చేశాడని మురిసిపోతోంది ఈ పంజాబీ భామ. ఈ సినిమాలో తమ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా పండిందని తెలిపింది. నాని నుండి తాను చాలా నేర్చుకున్నానని చెబుతోంది. నానీ హీరోగా వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం, , భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు చూశాననీ అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడింది. ఆ సినిమాలు చూసిన తరువాత అతనిపై గౌరవం మరింత పెరిగిందని మెహరీన్ ప్రశంసించింది. మరీ ముఖ్యంగా ఈగ సినిమాలోని అతని నటనకు ఫిదా అయిపోయానంటోంది. పనిలో పనిగా దర్శకుడు హను రాఘవపూడిపైన అమ్మడు పొగడ్తలు కురిపించింది. హను విజన్ ఉన్న దర్శకుడని వ్యాఖ్యానించింది. తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చేదాకా రాజీ పడకుండా వర్క్ చేయడం అతని ప్రత్యేకత అని చెప్పుకొచ్చింది. రెండు రోజుల పరిశీలన తరువాత తనను ఈ పాత్రకు ఎంపిక చేయడం తన అదృష్టమని పేర్కొంది. ఈ సినిమాలో తాను మహాలక్షి పాత్రలో లంగా వోణీ గెటప్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తానని చెప్పింది. ఈ అమ్మడు ఇప్పటికే తెలుగు లో రెండు తమిళంలో ఒక ప్రాజెక్టులకు సైన్ చేసి జోరుమీద ఉంది. కాగా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీలో నాని... నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ మంచి మార్కులు కొట్టేసింది. త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.