
మెహరీన్ లక్కీ స్టార్ అట. ఇప్పుడు చాలామంది అంటున్న మాట ఇది. దానికి కారణం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్’... ఇలా ఆమె నటించిన సినిమాలు హిట్ కావడమే. జనరల్‌గా కంటిన్యూస్ ఫ్లాప్స్‌లో ఉన్న హీరోయిన్స్‌ని ‘ఐరెన్ లెగ్’ అంటారు. అయితే, మెహరీన్‌లా ‘కంటిన్యూస్ హిట్స్’లో ఉన్న హీరోయిన్‌ని ‘లక్కీ స్టార్’ అంటారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఈ బ్యూటీ మీద వేసిన స్టాంప్ ఇది.
హిట్స్‌తో దూసుకెళుతోన్న వాళ్లకు బోలెడన్ని ఆఫర్లు వస్తాయి. మెహరీన్‌కి అలానే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు వచ్చిన ఆఫర్స్‌లో గోపీచంద్ సరసన నటించే ఛాన్స్ ఒకటని ఫిల్మ్‌నగర్ టాక్. గోపీచంద్ హీరోగా చక్రిని దర్శకునిగా పరిచయం చేస్తూ రాధామోహన్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఇటీవల ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ చివరికి మెహరీన్‌ని ఖరారు చేశారట.
Comments
Please login to add a commentAdd a comment