Gopichand
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ 'విశ్వం'
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో గోపీచంద్ ఒకడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'విశ్వం'. అప్పట్లో కామెడీ చిత్రాలతో తనదైన ట్రెండ్ చేసిన శ్రీనువైట్ల.. దాదాపు ఆరేళ్ల తర్వాత చేసిన సినిమా ఇది. థియేటర్లలో రిలీజైన ఇరవై రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది.(ఇదీ చదవండి: సూర్య 'కంగువ'.. తెలుగులోనే ముందు!)గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ఈ సినిమాని ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్గా తీశారు. చెప్పడం అయితే కామెడీ అన్నారు గానీ రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీ అయ్యేసరికి జనాలు రిజెక్ట్ చేశారు. దీపావళి సందర్భంగా తొలుత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.'లౌక్యం' సినిమా వచ్చి పదేళ్లు దాటిపోయింది. ఈ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్.. ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు. కాకపోతే అవి వచ్చి వెళ్తున్నాయి తప్పితే ఒక్కటి గుర్తుంచుకోదగ్గ స్థాయిలో లేదు. మరోవైపు శ్రీనువైట్ల కూడా ఎంతో నమ్మకంతో ఈ సినిమా తీశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం వీళ్లిద్దరి చేతిలోనూ మరో ప్రాజెక్ట్ లేదు. (ఇదీ చదవండి: OTT Review: ఊహకందని థ్రిల్లింగ్ వెకేషన్)Feel every emotion in one film! Viswam is the perfect blend for your weekend watchlist.Watch #Gopichand and #kavyathapar starrer #viswam now on #aha@YoursGopichand @SreenuVaitla @KavyaThapar @vishwaprasadtg @peoplemediafcy @VenuDonepudi pic.twitter.com/Xyk9PPLV7y— ahavideoin (@ahavideoIN) November 2, 2024 -
ఓటీటీలో 'విశ్వం'.. అప్పుడే స్ట్రీమింగ్కు రానుందా..?
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. బాక్సాఫీస్ వద్ద కాస్త పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న చాలా సినిమాలు థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. దీంతో విశ్వం చిత్రాన్ని దాదాపు అన్ని స్క్రీన్స్ నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.దసరా సందర్భంగా అక్టోబర్ 11న విడుదలైన 'విశ్వం' పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు నష్టాలు తప్పలేదని సమాచారం. ఇప్పుడు కాస్త త్వరగా ఓటీటీలో అయినా విడుదల చేస్తే కొంతైనా సేఫ్ కావచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నవంబర్ 1న 'విశ్వం' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయునున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కథ పెద్దగా ఆకట్టుకోకపోయినా కామెడీతో ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు. -
గోపీచంద్ 'విశ్వం'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘విశ్వం’ మూవీ రివ్యూ
టైటిల్: విశ్వంనటీనటులు: గోపీచంద్, కావ్యథాపర్, నరేశ్, సునీల్, వెన్నెల కిశోర్, సుమన్, ప్రగతి తదితరులునిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడిదర్శకత్వం: శ్రీనువైట్లసంగీతం: చైతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్విడుదల తేది: అక్టోబర్ 11, 2024శ్రీనివైట్లకు ఈ మధ్యకాలంలో సరైన హిట్ సినిమాలే లేదు. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ(2018)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ‘విశ్వం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బారిగా చేయడంతో ‘విశ్వం’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? విజయదశమి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం శ్రీను వైట్లకు విజయం దక్కిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేటంటే..కేంద్ర మంత్రి సీతారామరాజు(సుమన్)కు హత్యకు గురవుతాడు. ఈ హత్యను దర్శన అనే బాలిక కళ్లారా చూస్తుంది. హంతకులు ఆ బాలికను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఓ రోజు దర్శన ప్యామిలి మొత్తం కొండగట్టుకు వెళ్ళ్తుండగా కొంతమది వారిపై అటాక్ చేస్తారు. గోపిరెడ్డి(గోపీచంద్) వచ్చి వారిని రక్షిస్తాడు. అనంతరం తాను బిల్డర్ బుల్ రెడ్డి కొడుకునని పరిచయం చేసుకొని దర్శన ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అసలు గోపిరెడ్డి ఎవరు? దర్శనను ఎందుకు కాపాడుతున్నాడు? కేంద్రమంత్రిని చంపిందెవరు? ఈ హత్యకు ఇండియాలో జరగబోయే ఉగ్రవాద చర్యలకు గల సంబంధం ఏంటి? ఇండియాలో సెటిలైన పాకిస్తాన్ ఉగ్రవాది ఖురేషి(జిష్షుసేన్ గుప్తా) చేస్తున్న కుట్ర ఏంటి? ఈ కథలో బాచిరాజు(సునీల్) పాత్ర ఏంటి? కాస్ట్యూమ్ డిజైనర్ సమైరా (కావ్యథాపర్)తో గోపిరెడ్డి ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి హిట్ కొట్టిన చరిత్ర శ్రీనువైట్లది. ఆయన సినిమాలో కామెడీతో పాటు కావాల్సినన్ని కమర్శియల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. అయితే గత కొన్నాళ్లుగా శ్రీనువైట్ల మ్యాజిక్ తెరపై పని చేయడం లేదు. అందుకే ఈ సారి తన పంథా మార్చుకొని ‘విశ్వం’ తెరకెక్కించానని ఓ ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల చెప్పారు. సినిమాలో కామెడీ కొత్తగా ఉంటుందని బలంగా చెప్పారు. మరి సినిమాలో నిజంగా కొత్త కామెడీ ఉందా? కొత్తకథను చెప్పాడా? అంటే లేదనే చెప్పాలి.శ్రీనువైట్ల గత సినిమాల మాదిరే విశ్వం కథనం సాగుతుంది. టెర్రరిస్ట్ బ్యాగ్డ్రాప్ స్టోరీకి చైల్డ్ సెంటిమెంట్ జోడించి, తనకు అచ్చొచ్చిన కామెడీ పంథాలోనే కథనం నడిపించాడు. పాయింట్ బాగున్నా.. తెరపై చూస్తే మాత్రం పాత సినిమాలే గుర్తొస్తుంటాయి. ఫస్టాఫ్‌లో జాలిరెడ్డి(పృథ్వి), మ్యాంగో శ్యామ్(నరేశ్) కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. హీరోయిన్లో ప్రేమాయణం, యాక్షన్ సీక్వెన్స్ రొటీన్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరో ప్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. ట్రైన్ ఎపిసోడ్ కూడా ప్రమోషన్స్‌లో చెప్పినంత గొప్పగా ఏమీ ఉండదు కానీ..కొన్ని చోట్ల మాత్రం నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్ కామెడీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. విలనిజం బలంగా లేకపోవడం కూడా సినిమాకు మైనస్సే. క్లైమాక్స్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. గోపిరెడ్డి పాత్రకి గోపిచంద్ పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటి మాదిరే యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. స్టెప్పులు కూడా బాగానే వేశాడు. ప్లాష్‌బ్యాక్ స్టోరీలో గోపీచంద్ నటన బాగుంటుంది. కావ్యథాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. నరేశ్, పృథ్వీల కాంబోలో వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్లస్ అయింది. సునీల్ పాత్ర ఇంపాక్ట్ సినిమాపై అంతగా ఏమి ఉండదనే చెప్పాలి. సుమన్, ప్రగతి, వెన్నెల కిశోర్‌తో పాటు మిలిగిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. భీమ్స్ కంపోజ్ చేసిన 'గుంగురూ గుంగురూ' పాట థియేటర్లో ఈళలు వేయిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో తొలగించాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. -రేటింగ్: 2.25/5 -
విశ్వం అన్ని వర్గాలను అలరిస్తుంది: నిర్మాత కామెంట్స్
హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం విశ్వం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వేణు దోనేపూడి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 11న విడుదలవుతోన్న ఈ మూవీ విశేషాలను చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మీడియాతో పంచుకున్నారు.నిర్మాత వేణు మాట్లాడుతూ.. విశ్వం ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి కమర్షియల్ అంశాలతో అందరినీ అలరిస్తోంది. శ్రీను వైట్ల స్క్రిప్ట్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా కథనాన్ని శ్రీను వైట్ల తన స్టైల్లో రూపొందించారని అన్నారు.అనంతరం మాట్లాడుతూ.. ఇటలీలోని మిలాన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్. ఇందులో గోపీచంద్ అద్భుతంగా నటించారు. అతని కామెడీ టైమింగ్,యాక్షన్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతారు. అతని కెరీర్లోనే విశ్వం అద్భుతంగా ఉంటుంది. శ్రీను వైట్ల, గోపీచంద్‌లతో కలిసి ఎన్నో విషయాల గురించి నేర్చుకున్నా. సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే విశ్వం సినిమాను నిర్మించాను. చిత్రాలయం స్టూడియోలో అద్భుతమైన కథలు, సంగీతంతో ఆకట్టుకునే చిత్రాలను నిర్మించడం నా లక్ష్యం అని అన్నారు. -
'విశ్వం' నుంచి మాస్ సాంగ్ రిలీజ్
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి ఆదరణ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. -
నవ్వు ఆపుకోలేక.. చాలామంది ఆర్టిస్టులకి సారీ చెప్పా : గోపీచంద్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత 'విశ్వం' కథ లైన్ గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్ గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్ కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన ఏడు నెలలు సమయం తీసుకొని విశ్వం కథని ఫాం చేరు. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల గారి మార్క్ తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్ గా వున్నాయి. → లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ విశ్వంలో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్ కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్ గా వచ్చాయి.→ శ్రీను వైట్ల గారి వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఇందులో ఉంది. అయితే అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్ కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. టర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, వీటి గణేష్, నరేష్ గారు, ప్రగతి గారు.. ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ట్రైన్ సీక్వెన్స్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న టెన్షన్ కూడా రన్ అవుతుంది. అది చాలా బాగుంటుంది.→ బేసిక్ గా ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. పాపకి ఏడేళ్లు ఉంటాయి. కానీ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పెర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. ఆ పాప కూడా ఈ సినిమాకి చాలా ప్లస్.→ శ్రీను వైట్ల గారి సినిమాల్లో కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ అయి ఉంటుంది. ఆయన ఈ రెండిటిని పర్ఫెక్ట్ బ్లడ్ తో తీసుకొస్తారు. మనం చెప్పాలనుకున్న కథని ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ఆడియన్స్ చక్కగా రిసీవ్ చేసుకుంటారని ఆయన నమ్మకం. అలానే ఆయన సక్సెస్ అయ్యారు. విశ్వం కూడా అంత బాగుంటుందని మా నమ్మకం.→ శ్రీను వైట్ల గారిలో నేచురల్ గానే ఒక సెటైరికల్ కామెడీ ఉంటుంది. ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంటుంది. ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది, ఆయన ప్రతి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. షూటింగ్ చేసేటప్పుడు ఆయన టైమింగ్ పట్టుకోవడానికి ఫస్ట్ టుడేస్ నాకు కొంచెం కష్టం అనిపించింది.→ ఇందులో నా క్యారెక్టర్ పేరు విశ్వం. అయితే రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లగారికి చెప్పాను. అయితే ఈ సినిమాకి 'విశ్వం' టైటిల్ యాప్ట్ అని ఆయన చెప్పారు.→ స్టోరీ విన్నప్పుడు బోర్ కొట్టకూడదు. ఎంగేజింగ్ గా ఉండాలి. కథని నేను ఒక ఆడియన్ లాగే వింటాను. బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ అనిపించినప్పుడు అలాంటి స్క్రిప్ట్ చేయడానికి ఇష్టపడతాను.→ ప్రభాస్‌తో సినిమా చేయాలని నాక్కుడా ఉంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం. -
ప్రేక్షకులకు నవ్వు ఆగదు: గోపీచంద్
‘‘విశ్వం’ చిత్రం షూటింగ్లో ప్రతి సన్నివేశం చేసేటప్పుడు నవ్వుకుంటూనే ఉన్నాం. వినోదం, యాక్షన్ అద్భుతంగా వచ్చాయి. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు నవ్వు ఆగదు... చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్క మాట చెప్పగలను... శ్రీను వైట్లగారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్’’ అని గోపీచంద్ అన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘శ్రీను వైట్లగారి సినిమా లో ఎంత వినోదం ఆశిస్తారో... అంతకు మించి ఇవ్వడానికి ఆయన ‘విశ్వం’ స్క్రిప్ట్‌పై దాదాపు 7 నెలలు పని చేశారు. నేను చాలా సినిమాలు చేశాను. ఆయన వద్ద ఉండే సౌకర్యం ఎక్కడా ఫీల్ అవ్వలేదు. రాజీ పడకుండా ఈ సినిమా తీసిన విశ్వప్రసాద్, చక్రపాణిగార్లకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ–‘‘విశ్వం’ అందమైన ప్రయాణం. ఈ సినిమాని అనుకున్నట్లు తీయగలిగా. ఈ చిత్రం అందర్నీ నవ్విస్తుందని వంద శాతం నమ్మకం ఉంది’’అని చెప్పారు. ‘‘విశ్వం’ పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. అందరూ మా సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘మా కుటుంబం 86 ఏళ్ల నుంచి సినిమాల్లో ఇన్వాల్వ్ అయింది. ‘విశ్వం’ నాకు తొలి సినిమా. ఇది మా హీరో సినిమా అని గోపీచంద్ అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుంది’’ అని వేణు దోనేపూడి పేర్కొన్నారు. -
గోపీచంద్ ‘విశ్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యాక్షన్ సినిమా చేయాలని ఉంది:కావ్యా థాపర్
‘‘ఓ నటిగా నాకు యాక్షన్, సైకో కిల్లర్, డీ గ్లామరస్.. ఇలా విభిన్న తరహాపాత్రలు చేయాలని ఉంది. అయితే నాకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ వస్తున్నాయి. ‘విశ్వం’లో నాకు మంచి క్యారెక్టర్ దక్కింది’’ అని అన్నారు హీరోయిన్ కావ్యా థాపర్. గోపీచంద్, కావ్యా థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వంలో వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కావ్యా థాపర్ చెప్పిన విశేషాలు.⇒ ఈ సినిమాలో నేను కాస్ట్యూమ్ డిజైనర్ రోల్ చేశాను. మోడ్రన్‌గా ఉండే అమ్మాయి. కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్ కనిపిస్తుంది... ఫన్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో సీనియర్ నరేశ్, పవిత్రగార్లు నా తల్లిదండ్రులు. శ్రీను వైట్లగారు మంచి నటన రాబట్టుకున్నారు. మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఈ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్లో నా క్యారెక్టర్లో కూడా ఫన్ ఉంటుంది. ఈ సినిమాలో పదిహేను మంది హాస్యనటులు నటించారు. ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. కథలో ఎమోషన్, యాక్షన్ కూడా ఉన్నాయి.⇒ ‘విశ్వం’ సినిమాను మల్టిపుల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. మైనస్ 15 డిగ్రీల వాతావరణంలో సినిమా టీమ్ అందరూపాల్గొన్నాం. విదేశాల్లోనూ షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను నటించిన ‘ఈగిల్’కి కూడా విశ్వప్రసాద్‌గారే నిర్మాత. ఓ రకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీని హోమ్ బ్యానర్‌గా భావిస్తుంటాను. ఇక నాకు తెలుగు భాష అర్థం అవుతుంది. ఓ టీచర్‌ను నియమించుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. మూడు కొత్త సినిమాలకు సైన్ చేశాను. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. -
గోపీచంద్ యాక్షన్‌కు శ్రీను వైట్ల మార్క్ డైరెక్షన్‌తో 'విశ్వం' ట్రైలర్
గోపీచంద్ హీరోగా రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి భారీ యాక్షన్ ట్రైలర్ విడుదలైంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ సీన్స్‌తో పాటు మంచి కామెడీ కూడా ట్రైలర్లో చూపించారు. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి ఈ మూవీని నిర్మించారు. 'హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘విశ్వం’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది.ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారని చెప్పవచ్చు. శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్‌కు గోపీచంద్ యాక్షన్, కామెడీతో ఈ సినిమా ఉండనుంది. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో దర్శకుడు చూపించారు. ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో నటించారు. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోయేలా ఉంది. -
విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల
‘‘దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కానీ నా గత సినిమాల సన్నివేశాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఆడియన్స్ సినిమాలను చూసే తీరు మారిపోయింది. నా కామెడీ, యాక్షన్ సన్నివేశాలను ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. కానీ నా థీమ్ వారిని అలరించడం లేదని తెలుసుకున్నాను. ఆ దిశగా మార్పులు చేసుకుని, కొత్త థీమ్‌తో నా స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాను. ‘విశ్వం’లో నా మార్క్ యాక్షన్, ఎమోషన్, ఆడియన్స్‌కు నచ్చే కొత్త థీమ్‌ను మేళవించేందుకు స్ట్రగుల్ అయ్యాను. కానీ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనెపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘విశ్వం’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన విశేషాలు.∙విశ్వం అనే ఓ క్యారెక్టర్ చేసే జర్నీయే ఈ సినిమా కథ. ఈ విశ్వంలో ఎన్నో సీక్రెట్స్ ఉంటాయంటారు. అలానే మా సినిమాలోని విశ్వం క్యారెక్టర్లోనూ ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. అవి థియేటర్స్‌లో చూడండి. నా గత చిత్రాల్లో కామెడీ, యాక్షన్ బలంగా ఉంటాయి. ఈ అంశాలతోపాటు మంచి ఎమోషనల్ డెప్త్ కూడా ఈ చిత్రంలో ఉంది. ఇలాంటి ఎమోషనల్ డెప్త్ ఉన్న సినిమా నేను చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలోనిపాప సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాగే ఓ అంతర్జాతీయ సమస్యని ఈ సినిమాలో ప్రస్తావించడం జరిగింది. ∙‘విశ్వం’లో గోపీచంద్ అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్‌గా ఉంటుంది. నా గత చిత్రం ‘వెంకీ’లోని ట్రైన్ ఎపిసోడ్ సక్సెస్ అయ్యింది.ఇప్పటికీ ఆ ఎపిసోడ్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ‘విశ్వం’లో కథ ప్రకారమే ట్రైన్ ఎపిసోడ్ పెట్టాం. ఈ చిత్రంలో ఆర్గానిక్ కామెడీ మాత్రమే ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ రియలిస్ట్‌గా ఉంటాయి. డిఫరెంట్ లేయర్స్, వేరియేషన్స్ ఉన్న ‘విశ్వం’ తరహా సినిమాకు మ్యూజిక్ చేయడం కష్టం. చేతన్ భరద్వాజ్ మంచి సంగీతం ఇచ్చారు. ఆర్ఆర్ ఇంకా బాగా చేశారు. అలాగే నా పని తీరు తెలిసిన గోపీ మోహన్‌తో మళ్లీ ఈ సినిమాకు పని చేశాను. ∙‘అమర్ అక్బర్ ఆంటోని’ (2018) సినిమా వల్ల నిర్మాతలకు నష్టం లేదు. కానీ ఈ సినిమా థియేటర్స్‌లో సరిగా ఆడకపోవడంతో ఆ ఎఫెక్ట్ నాపై పడింది. సినిమా అంటే ఆడియన్స్‌కు నచ్చేలా కూడా తీయాలని నాకు మరింత అర్థమైంది. వీటన్నింటినీ సదిదిద్దుకుని ‘విశ్వం’ చేశానని నేను నమ్ముతున్నాను. మా టీమ్ కూడా నమ్ము తోంది. ప్రేక్షకులు కూడా నమ్మి, ‘విశ్వం’ను హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ‘ఢీ’ సీక్వెల్‌గా ‘ఢీ2’ ప్రకటించాం. కానీ శ్రీహరిగారిపాత్రకు రీప్లేస్మెంట్ కుదరడం లేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను. -
'వస్తాను వస్తానులే' అంటోన్న గోపిచంద్.. రొమాంటిక్ సాంగ్ చూశారా!
టాలీవుడ్ స్టార్ గోపిచంద్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ చిత్రంలో డబుల్ ఇస్మార్ట్ భామ కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: 'మీరు అదే పనిలో ఉండండి'.. పవన్ కల్యాణ్‌కు మరోసారి కౌంటర్!)ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 'మొరాకన్ మగువా' అంటూ సాగే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'వస్తాను వస్తానులే' అంటూ సాగే లవ్ అండ్ రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించగా.. వెంగి లిరిక్స్ అందించారు. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్, ఎమోషన్స్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. ఈనెల 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. -
Viswam Movie: హార్ట్ టచ్చింగ్‌గా ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్
గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వం. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా బ్యానర్స్‌పై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువా' కూడా మంచి హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్ ని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసే హార్ట్ టచ్చింగ్ నంబర్ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.(చదవండి: ఓటీటీలో 'దేవర'.. అన్ని రోజుల తర్వాతేనా?)'అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు. మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపిచంద్ కు వున్న బాండింగ్ ని రివిల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. -
చిన్నారి తల్లీ.. కలకు భయపడకు
గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’ అంటూ సాగేపాటని విడుదల చేసింది చిత్రయూనిట్.‘మొండి తల్లి పిల్ల నువ్వు.. అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి, కలకు భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈపాటని సాహితీ చాగంటిపాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందిన చిత్రం ‘విశ్వం’. ఇటీవల విడుదలైన తొలిపాట ‘మొరాకో మగువా..’ కి మంచి స్పందన వచ్చింది. ‘తల్లి, కూతురు నేపథ్యంలో వచ్చే ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’పాట కథలోని భావోద్వేగాల లోతును తెలియజేస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్. -
గోపిచంద్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో గోపిచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: 'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ)ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మొరాకన్ మగువా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇప్పటికే విశ్వం టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్, ఎమోషన్స్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దసరాకు విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ వేట్టైయాన్తో పోటీపడనుంది. అయితే తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోవడం గోపిచంద్‌కు కలిసొచ్చే అవకాశముంది. అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కాగా.. ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. -
'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ
గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. శ్రీనువైట్ల దర్శకుడు. అప్పట్లో 'వెంకీ', 'దుబాయ్ శీను', 'ఢీ' తదితర సినిమాలతో తెలుగులో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీనువైట్ల.. ఆ తర్వాత రొటీన్ మూస తరహా స్టోరీలతో మూవీస్ తీశాడు. అవి ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'విశ్వం'.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?)దసరా కానుకగా అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ చూస్తే శ్రీనువైట్ల మార్క్ కామెడీ కనిపించింది. అలానే తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే 'విశ్వం' కోసం మరోసారి నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు యాక్షన్, నాన్న అనే ఎమోషన్ కూడా చూపించారు.టీజర్ చూస్తే పర్వాలేదనిపిస్తోంది గానీ స్టోరీ ఏ మాత్రం రొటీన్‌గా ఉన్నాసరే ప్రేక్షకులు తిరస్కరించే ఛాన్స్ ఉంది. మరి 'విశ్వం' సినిమాతో గోపీచంద్-శ్రీనువైట్ల కాంబో ఏం చేస్తుందో చూడాలి? తెలుగులో దసరాకి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేం లేవు. తమిళ నుంచి రజినీకాంత్ 'వేట్టాయాన్' ఉంది. మరి రజనీ మూవీని తట్టుకుని 'విశ్వం' ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం) -
ధూం ధాం పాటలు బాగున్నాయి
‘‘ధూం ధాం’ టీజర్ ఆకట్టుకునేలా ఉంది.. పాటలు బాగున్నాయి. రామ్ కుమార్ మంచి నిర్మాత. డైరెక్టర్ సాయి అంకితభావం ఉన్న వ్యక్తి. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన గోపీమోహన్ ‘లౌక్యం’ సినిమా నుంచి నాతో పని చేస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్ అన్నారు. హెబ్బా పటేల్, చేతన్ కృష్ణ జంటగా సాయికిశోర్ మచ్చ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధూం ధాం’. ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం టీజర్‌ను గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల విడుదల చేశారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. ‘దుబాయ్ శీను’ నుంచి ‘బాద్షా’ వరకు నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడు సాయికిశోర్. రామ్ కుమార్‌గారు సినిమా మీద ప్యాషన్‌తో విదేశాల నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని సాయికిశోర్ మచ్చా తెలిపారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని ఎంఎస్ రామ్ కుమార్ చెప్పారు. -
మీ మద్దతు.. మీరే నా బలం: గోపిచంద్ ఎమోషనల్ పోస్ట్
గతేడాది రామబాణం మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం ఆయన విశ్వం చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనువైట్ల డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియో బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.అయితే గోపిచంద్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ కెరీర్లో సహకరించిన నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. అభిమానుల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని.. మీరే నా బలం అంటూ పోస్టులో రాసుకొచ్చారు. మీడియా మిత్రుల సపోర్ట్ మరువలేదని గుర్తు చేసుకున్నారు. మీ మద్దతు నాకు ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తూ.. విశ్వం సినిమాతో మళ్లీ కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. కాగా.. 2001 తొలివలపు మూవీతో గోపించంద్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జయం మూవీతో విలన్‌గా మెప్పించి.. హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 🙏❤️ pic.twitter.com/9XQhJYx7wV— Gopichand (@YoursGopichand) August 3, 2024 -
హై ఓల్టేజ్ యాక్షన్
గోపీచంద్ హీరోగా రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ్ర΄÷డక్షన్స్ చివరి దశలో ఉన్న ‘విశ్వం’ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ది జర్నీ ఆఫ్ విశ్వం’ అనే వీడియోను విడుదల చేశారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘విశ్వం’.శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్, యాక్షన్, కామెడీతో ఈ సినిమా ఉంటుంది. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో చూపిస్తున్నారు దర్శకుడు. సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయో తెలియజేయడంతో పాటు ఆడియన్స్‌లో ఎగ్జయిట్‌మెంట్‌ని క్రియేట్ చేసేలా ఈ వీడియోను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: చేతన్ భరద్వాజ్. -
కమ్‌బ్యాక్ కోసం ట్రైన్ కామెడీనే నమ్ముకున్న శ్రీనువైట్ల!
తెలుగులో కొన్ని క్లాసిక్ సినిమాలు తీస్తే 'వెంకీ' ఇందులో కచ్చితంగా ఉంటుంది. ఈ మూవీలోని కామెడీ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ట్రైన్లో వెంకీ తన గ్యాంగ్‌తో చేసే కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. ఎవరికైనా బోర్ కొడితే ఇప్పటికీ యూట్యూబ్‌లో ఎక్కువగా చూసే కామెడీ సీన్ ఏదైనా ఉందా అంటే అది 'వెంకీ ట్రైన్ కామెడీ'నే. ఇప్పుడు హిట్ కొట్టడం కోసం శ్రీనువైట్ల మళ్లీ దీన్ని నమ్ముకున్నారా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో అజిత్.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!)'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు' లాంటి సినిమాల్లో కామెడీతో తనకంటూ సెపరేట్ ట్రేడ్ మార్క్ సృష్టించిన శ్రీనువైట్ల.. ఆ తర్వాత వరస ప్లాఫులతో డౌన్ అయిపోయారు. ఓ దశలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయాడా అనుకున్నారు. కానీ ప్రస్తుతం గోపీచంద్‌తో 'విశ్వం' సినిమా తీస్తున్నాడు. తాజాగా 'జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో నిమిషం నిడివి ఉన్న వీడియోని రిలీజ్ చేశారు.వీడియో చూస్తుంటే ఫారెన్ లొకేషన్స్, ఫైట్స్ లాంటి కమర్షియల్ అంశాలు కనిపించాయి. కానీ ట్రైన్ కామెడీ సీన్స్ కూడా కనిపించాయి. టీటీఈతో హీరో అండ్ గ్యాంగ్ చేసే కామెడీ తరహా విజువల్స్ చూపించారు. అయితే హిట్ కోసం తహతహలాడుతున్న శ్రీనువైట్ల.. మళ్లీ తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే నమ్ముకున్నాడా అనిపిస్తుంది. 'వెంకీ' వచ్చినప్పటితో పోలిస్తే జనాల మైండ్ సెట్ మారిపోయింది. మరి వింటేజ్ శ్రీనువైట్ల తరహాలో ఈ ట్రైన్ కామెడీ బిట్ ఉంటుందా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
గోపీచంద్ 'విశ్వం' టీజర్ రిలీజ్.. కామెడీ కాదు ఈసారి యాక్షనే!
శ్రీనువైట్ల.. ఈ పేరు చెప్పగానే ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మీమ్స్ లో ఉండే సగం సినిమాలు ఈయన తీసినవే. కానీ తర్వాత తర్వత ట్రెండ్ కి తగ్గ మూవీస్ చేయలేక సైడ్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత సినిమా చేశాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. (ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!) అప్పుడెప్పుడో 'బాద్ షా'తో ఓ మాదిరి హిట్ కొట్టిన శ్రీనువైట్ల.. ఆగడు, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి చిత్రాలతో వరస ఫ్లాప్స్ దెబ్బకు సైడ్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు ఇక సినిమాలు చేయడేమో అని అందరూ అనుకున్నారు. కానీ గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకి 'విశ్వం' అని టైటిల్ ఫిక్స్ చేసి, టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే శ్రీనువైట్ల ఈసారి కామెడీని కాకుండాయాక్షన్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు శ్రీనువైట్లతో పాటు గోపీచంద్ కి కూడా చాలా అవసరం. మరి ఏం చేస్తారో చూడాలి? బహుశా ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఎట్టకేలకు ఓటీటీకి గోపిచంద్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అభిమానులు అంతా భావించారు. గతవారమే ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో భీమా ఓటీటీ కొత్త తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఉగాది సందర్భంగా అఫీషియల్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 25 నుంచి భీమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. Surprise surprise! Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024 -
కొత్త పాయింట్‌తో...
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి చిత్రాలయం స్టూడియోస్‌పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్‌బస్టర్స్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
ఓటీటీలో గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఆ రోజేనా..?
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన భీమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.