హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్‌ | Director A.S. Ravi Kumar Chowdary Shocking Comments On Hero Gopichand - Sakshi
Sakshi News home page

హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్‌

Published Thu, Aug 31 2023 2:56 PM | Last Updated on Sat, Sep 2 2023 2:15 PM

Director Ravi Kumar Viral Comments On Gopichand - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ ‘తిరగబడరాసామీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా మాల్వీ మల్హోత్రా ఉండగా మున్నారా చోప్రా నెగటివ్‌ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్‌ కార్యక్రమంలో మున్నారా చోప్రాను డైరెక్టర్‌  ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి   ముద్దు పెట్టుకోవడంతో చాలరోజుల తర్వాత ఆయన పేరు వైరల్‌ అయింది.

గోపీచంద్‌తో యజ్ఞం,సౌఖ్యం... సాయి ధరమ్‌తేజ్‌తో పిల్లా నువ్వులేని జీవితం.. బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాలకు  ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించారు.  సుమారు పదేళ్ల తర్వాత రాజ్‌తరుణ్‌తో  ‘తిరగబడరాసామీ’ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. తాజాగ ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా హీరో గోపీచంద్‌పై ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు ఇలా చేశాడు. 

గతంలో అందరం చెట్టు కింద కూర్చోని భోజనం చేసేవాళ్లం.. ఒకరోజు  అతని కోసం వెళ్తే కొంతసేపు వెయిట్‌చేయమను అన్నాడు అని గోపీచంద్‌ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఇలా విమర్శలు చేశాడు.  'ఒరేయ్‌ అంత బలిసిందా రా మీకు..? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్‌.. ఇప్పుడు నీ దగ్గరకు నేను  రావాలంటే ఐయిదారుగురిని దాటుకుని రావాల్నా.. వాడిని హీరోగా నేనే చేశాను (యజ్ఞం). అప్పటివరకు వాడు విలన్‌గా నటించేవాడు (జయం,నిజం,వర్షం).

నా సినిమాతో వాడు హీరోగా గుర్తింపు పొందాడు. ఆ సినిమాకు నేను తీసుకున్న రెమ్యునరేషన్‌ కంటే వాడికి తక్కువ. అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకో అర్థం కాదు.. వాడు ఇప్పుడు ఎదరుపడినా ఇలానే మాట్లాడుతాను.  ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు నేడు పూర్తిగా మారిపోయాడు. 2016 సంవత్సరంలో కోఠి ఉమెన్స్‌ కాలేజీలో 'రారాజు' సినిమా షూటింగ్‌​ జరుగుతుంది. ఆ సమయంలో నేను కూడా అక్కడికి వెళ్లాను. అప్పటికే నేను  బాలకృష్ణతో వీరభద్ర సినిమా తీసి ప్లాప్‌లో ఉన్నాను. ఈ కారణంతో మరో సినిమా తీద్దామని అడిగిన నన్ను దూరం పెట్టాడు. మంచి కథ చేసి రండి చూద్దాం అని అవమానించాడు. ఇదంతా జరిగిన సమయంలో ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ కూడా అక్కడే ఉన్నారు.' అని ఆయన పేర్కొన్నాడు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో గోపిచంద్‌ ఫ్యాన్స్‌ కూడా ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరిపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే హీరోయిన్‌ మున్నారా చోప్రాను ముద్దు పెట్టుకుని విమర్శలు ఎదుర్కొంటుండగా.. తాజాగ చేసిన వ్యాఖ్యలతో ఆయనపై  గోపీచంద్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు గోపీచంద్‌పై ఎలాంటి రిమార్క్‌ లేదని... అతనిపై ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి కామెంట్లు కూడా చేయలేదని వారు తెలుపుతున్నారు. వ్యక్తిగతంగా ఏదో కారణం పెట్టుకుని పబ్లిగ్‌ ప్లాట్‌ఫామ్‌పై ఇలా మాట్లాడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

చిరంజీవి, బాలకృష్ణ కంటే గొప్పోళ్లా..?
ఇండస్ట్రీలో మొఖం మీద మేకప్‌ వేసుకున్న తర్వాత మేకలాంటి చేష్టలు చాలమందికి ఉన్నాయని ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి తెలిపాడు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న  వారిలో చాలమంది రీల్‌ హీరోస్‌ మాత్రమే అని రియల్‌ కాదన్నాడు. తలపొగరు నెత్తికెక్కి డెమీగాడ్స్‌లా కొందరు హీరోలు విర్రవీగుతున్నారంటూ.. చిరంజీవి, బాలకృష్ణ కంటే వీళ్లందదు గొప్పోళ్లా..? అంటూ ఫైర్‌ అయ్యాడు. కానీ అల్లు అర్జున్‌ మాత్రం చాలా డిసిప్లెన్‌ కలిగిన వ్యక్తి అంటూ పేర్కొంన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement