Raj Tharun
-
రాజ్ తరుణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రం.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్
రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం రామ్ భజరంగ్. సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతిసుధీర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దసరా సందర్భంగా రామ్ భజరంగ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా మాసీగా ఉందని, ఇద్దరు హీరోలు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ఇకమీదట సరికొత్త రాజ్ తరుణ్‌ని చూస్తారు
-
రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే'.. మీరూ చూసేయండి
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’ ట్రైలర్ వచ్చేసింది. ఇందులో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటించారు. జె. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో మారుతి టీమ్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ఇది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించిగా తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.‘భలే ఉన్నాడే’ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 7న రిలీజ్ కానుంది. సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేశ్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. -
కాలితో తన్నాడంటూ శేఖర్ భాషాపై ఫిర్యాదు చేసిన లావణ్య
రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన ఆర్జే శేఖర్ భాషాపై కేసు నమోదైంది. తన స్నేహితుడు రాజ్ తరుణ్‌పై లావణ్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన పలు మీడియా వేదకల మీద కామెంట్లు చేశాడు. లావణ్య వల్లే రాజ్ తరుణ్ చాలా నష్టపోయాడని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్లో డిబేట్లో పాల్గొన్న లావణ్యపై శేఖర్ దురుసుగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు శేఖర్ భాషాపై కేసు నమోదు చేశారు.రాజ్ తరుణ్-లావణ్య వివాదం దారి మళ్లీ ఇప్పుడు శేఖర్ భాషా, లావణ్య గొడవ నెట్టింట వైరల్ అవుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్న లావణ్యపై శేఖర్ భాషా దాడి చేశాడని తెలుస్తోంది. తన కడుపు మీద బలంగా శేఖర్ భాషా తన్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె చెప్పారు.శేఖర్‌పై కేసు సెక్షన్ 74, 115(2) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు.శేఖర్ భాషా- లావణ్య మధ్య గొడవకు ప్రధాన కారణం ఆయన చేసిన ఆరోపణలే అని చెప్పవచ్చు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు శారీరక సంబంధం ఉందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. దీంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్‌కు మద్ధతుగా చాలామంది కామెంట్లు చేశారు. ఆపై ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో పాటు చాలామంది అమ్మాయిలకు డ్రగ్స్ అందించినట్లు ఆయన చెప్పారు. దీంతో లావణ్య, శేఖర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒక మీడియా వేదికపైనే శేఖర్ భాషాను లావణ్య చెప్పుతో కొట్టింది. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. -
రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు
రాజ్ తరుణ్-లావణ్య వివాదం రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుంది. తాజాగా లావణ్యపై నార్సింగ్ పోలీసులకు ప్రీతి ఫిర్యాదు చేసింది. తమకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని ఆమె ఆరోపించింది. తమతో పాటు చాలామంది ఆడపిల్లలకు ఆమె డ్రగ్స్ ఇచ్చారని ఫిర్యాదులో తెలిపింది. ఆమె వల్ల చాలామంది జీవితాలు నరకంగా మారాయని ఆరోపించింది. ప్రీతి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని ఎస్ఐ సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో తాజాగా లావణ్య గురించి రాజ్ తరుణ్ లాయర్ ముధు శర్మ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లావణ్య డ్రగ్స్‌కు అలవాటు పడటమే కాకుండా అనేకమందికి అందించింది. దానిని అడ్డుకునేందుకు రాజ్ తరుణ్ చాలాసార్లు ప్రయత్నించాడు. అమె నిరాకరించింది. లావణ్యకు దూరంగా ఉంటూ వచ్చిన రాజ్ తరుణ్‌పై కక్ష పెంచుకుంది. అందుకే ఇలాంటి డ్రామాలు చేస్తుంది. లావణ్యకు డ్రగ్స్ మూఠాతో సంబంధాలు ఉన్నాయి. వారు డ్రగ్స్ ఎక్కడ తెస్తారు వంటి పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అవన్నీ పోలీసులకు అందిస్తాం. డ్రగ్స్ మత్తులో ఉన్న ఆడపిల్లలపై న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి ఆపై వారి తల్లిదండ్రుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ వివరాలు పూర్తి స్ధాయిలో రాబోతున్నాయి. లావణ్య ఉచ్చులో చిక్కుకొని డ్రగ్స్‌కు అలవాటు పడి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. త్వరలో వారందరూ బయటకు వస్తారు. డ్రగ్స్ గురించి రాజ్ తరుణ్ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. దీంతో లావణ్య నుంచి ఆయనకు ప్రాణహాని ఉంది. రాజ్ తరుణ్ జీవితం మరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా కాకుండా చూసుకోవాలి. అని లాయర్ సూచించారు. -
రాజ్ తరుణ్ వ్యవహారంలో లావణ్యపై కేసు నమోదు..
రాజ్ తరుణ్- లావణ్య వివాదం పలు మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లావణ్య తమ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేస్తున్నట్లు వారు తెలిపారు. తమ ఇంటి వద్దకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించిందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటుంన్న రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లిన లావణ్య గొడవ చేసిందని సమాచారం. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తమను లావణ్య ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి తలుపులు బలంగా కొడతూ తమను ఆందోళనకు గురిచేసినట్లు వారు చెబుతున్నారు. ఆపై ఇంటి ముందు బూతులు తిడుతూ గట్టిగా కేకలు వేసి ఇబ్బందులుకు గురిచేసిందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కృష్ణమోహన్ వెల్లడించారు. అయితే, రాజ్ తరణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తుంది. తనను పెళ్లి చేసుకుని మాల్వీ మల్హోత్రతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె చెబుతుంది. -
లావణ్య కేసు.. హైకోర్టును ఆశ్రయించిన రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఆరోపించడమే కాకుండా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ, తన సినిమా షూటింగ్స్ వల్ల రాలేకపోతున్నానంటూ ఆయన కొంత సమయం అడిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణ హైకోర్టును రాజ్ తరుణ్ ఆశ్రయించారు.లావణ్య పెట్టిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రాజ్ తరుణ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ అనంతరం నార్సింగ్ పోలీసుల ఆదేశాలు తీసుకున్న తర్వాత పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. -
రాజ్ తరుణ్ స్నేహితుడిని చెప్పుతో కొట్టిన లావణ్య
టాలీవుడ్లో రాజ్ తరుణ్- లావణ్య వ్యవహారంలో రచ్చ కొనసాగుతుంది. కొద్దిరోజుల క్రితం రాజ్ తరుణ్‌పై లావణ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకున్న రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో ఎఫైర్ పెట్టుకుని మోసం చేశాడని తెలిపింది. అయితే తాజాగా ఒక మీడియా ఛానల్లో లావణ్య, శేఖర్ భాష మధ్య పెద్ద గొడవే జరిగింది.లావణ్య వివాదంలో రాజ్ తరుణ్ తరపున తన స్నేహితుడు శేఖర్ భాష పలు ఆధారాలతో మీడియా ముందుకు వచ్చాడు. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని ఆయన తెలిపాడు. చిన్నపిల్లలకు కూడా లావణ్య డ్రగ్స్ అమ్మినట్లు మీడియా డిబెట్లో శేఖర్ బాష కామెంట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన లావణ్య దాడికి దిగింది. లైవ్ రన్ అవుతుండగానే శేఖర్ బాషను లావణ్య చెప్పుతో కొట్టింది. దీంతో ఇద్దరూ ఆగ్రహంతో రెచ్చిపోయారు. అయితే, డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని లావణ్య తెలిపింది. కావాలని తనని ఇందులోకి లాగుతున్నారని ఆమె వారించింది. కానీ, ఆమె డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు ఉన్నాయని అందుకు సంబంధించిన లింక్ ఉన్న వ్యక్తి ఇక్కడికి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో లావణ్య డిబెట్ మధ్యలో నుంచి వెళ్లిపోయింది. ఇలా రోజుకో కొత్త గొడవలతో వీరిద్దరి వ్యవహారం నడుస్తుంది. -
నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి.. లావణ్య అబార్షన్‌పై రాజ్ తరుణ్ రియాక్షన్
కొద్దిరోజులుగా రాజ్ తరుణ్‌పై లావణ్య చేస్తున్న ఆరోపణలకు తాజాగా తిరగబడరసామీ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కొన్నింటికి సమాధానాలు దొరికాయి. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జోడీగా నటించిన చిత్రం తిరగబడరసామీ.. ఇందులో మన్నారా చోప్రా కీలకపాత్రలో నటించింది. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మించారు. ఆగష్టు 2న విడుదల కానున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో లావణ్య వివిదాం గురించి రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా స్పందించారు.లావణ్య అబార్షన్ గురించి రాజ్ తరుణ్ కామెంట్లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. అందుకే ప్రతిసారీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. నేను లావణ్యకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం లేదు. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టే ఈ విషయంలో లీగల్‌గా వెళ్తున్నాను. నా వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆమెను చేస్తున్న ఆరోపణలకు సంభంధించి ఇప్పటి వరకు ఎవరూ ఆధారాలు అడగలేదు. లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీలో ఆబార్షన్ గురించి లేదు. నిజమే అయితే, అందుకు సంబంధించిన మెడికల్ అధారాలు బయటపెట్టాలి.ఇక పెళ్లి గురించి మాట్లాడితే నాకు చాలా భయంగా ఉంటుంది. జీవితం లో పెళ్లి గోల వద్దు అనుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల నేను నటించిన పురుషోత్తముడు సినిమా ప్రమోషన్‌కు రాలేకపోయాను. నేను కూడా మనిషినే.. నాపై కావాలనే నిందలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో నేను ఎక్కడికీ వెళ్లలేకపోయాను. నా 32 ఏళ్ల జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదు. వారం , పది రోజులుగా ఇంటికే పరిమితం అయ్యాను.. నాతో పాటు నా తల్లిదండ్రుల కూడా భాదపడుతున్నారు. ' అని రాజ్ తరుణ్ తెలిపారు. ఈ వివాదం గురంచి కాస్త పక్కన పెడితే అంటూ తిరగబడరసామీ సినిమా గురించి రాజ్ తరుణ్ మాట్లాడారు. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా కష్టపడి పనిచేశారు. నిర్మాత కూడా ప్రాణం పెట్టి నిర్మించారు. మాల్వీ మల్హోత్ర చాలా గొప్ప నటి. టాలీవుడ్లో ఆమె ఇదే మొదటి సినిమా. కాబట్టి ఈ వివాదాలన్నీ కాస్త పక్కనపెట్టేసి ఆమెను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు రాజ్ తరుణ్ కోరాడు.నాపై దాడి చేసిన వారితో లావణ్య టచ్‌లో ఉంది: మాల్వీ మల్హోత్రలావణ్య చేస్తున్న ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆమె నాతోపాటు నా సోదరుడిపై చేసిన కామెంట్లకు ఇప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చాను. జులై 24న కూడా లావణ్య మెసేజ్ చేసింది.. అదీ కూడా పోలీసులకు పంపాను. నా ఫ్యామిలీ కానీ, నేను కానీ ఆమెని ఎప్పుడూ కలవలేదు. మాపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందో తెలియదు. 2020లో నాపై దాడి చేసిన కొంతమంది క్రిమినల్స్‌తో ఆమె ఇప్పుడు టచ్‌లో ఉన్నారు. వారితో టచ్‌లో ఉండకూడదని ఆమెకు సలహా కూడా ఇచ్చాను. నా దృష్టిలో ఆమె కూడా ఒక క్రిమినల్ అని అభిప్రాయపడుతున్నాను. లావణ్య గురించి ఇంతకు మించి ఏమీ మాట్లడలేను. లీగల్‌గా ఆమెపై చర్యలు తీసుకుంటాను. -
పోలీసులతో పాటు మీడియా ముందుకు రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కొంత కాలం తర్వాత మీడియా ముందుకు వస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాత్ తరుణ్‌పై ఫిర్యాదు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. తనను ప్రేమించిన తర్వాత హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకొని మోసం చేశాడంటూ నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ క్రమంలో తనకు అబార్షన్ కూడా చేపించాడని ఆమె ఆరోపించింది.రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'తిరగబడర స్వామి' సినిమాకు సంబంధించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి లావణ్య కూడా వస్తుందని సమాచారం ఉంది. తనకు జరిగిన అన్యాయం గురించి మీడియా ముందే రాజ్ తరుణ్‌ను నిలదీయాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఏమైన గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు.'తిరగబడర స్వామి' సినిమాలో మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని లావణ్య ఆరోపించింది. అయితే, తాజాగా జరగనున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రానికి మాల్వీ మల్హోత్రా కూడా వస్తుందా అనేది తేలాల్సి ఉంది.లావణ్యపై ఫైర్ అయిన రాజ్ తరుణ్ స్నేహితుడు'తిరగబడర స్వామి' సినిమా మీడయా సమావేశానికి రాజ్ తరుణ్ స్నేహితుడు rj శేఖర్ బాషా కూడా హజరయ్యాడు. లావణ్య విషయంలో రాజ్ తరుణ్‌కు సంబంధించి ఎలాంటి తప్పులేదని ఆయన చెప్పాడు. ఈ విషయంలో తప్పంతా లావణ్యదే అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. ఆమె గుండెకాయ మస్తాన్ వద్ద ఉందంటూ చెప్పుకొచ్చాడు. రాజ్ తరుణ్‌ను నిలదీసేందుకు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఆమె వస్తుందని ప్రశ్నించాడు. అమె ప్రసాద్ ల్యాబ్ వద్దకు వస్తే ఆమె చేసిన తప్పుల గురించి కచ్చితంగా నిలదీస్తానంటూ ఆర్జే శేఖర్ ఫైర్ అయ్యాడు. అయితే, మరికొంత సమయంలో ప్రారంభం కానున్న ఈ మీడియా సమావేశానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో పాటు రాజ్ తరుణ్ ఇప్పటికే హజరయ్యారు. పోలీసులు సమక్షంలో ఈ మీడియా సమావేశం జరగనుంది. -
కొందరు ఇండస్ట్రీని దోచుకుంటున్నారు: నిర్మాత
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరో హీరోయిన్లుగా, మన్నారా చోప్రా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ– ‘‘మూడు ముళ్ళ బంధానికి భార్యాభర్తలు ఏ విధంగా కట్టుబడి ఉండాలనడానికి నిదర్శనమే ‘తిరగబడర సామీ’. ఓ మామూలు కుర్రాడు ఏ పరిస్థితుల వల్ల వైలెంట్‌గా మారాడు? అనేది కథ. రాజ్ తరుణ్ – మాల్వీల వ్యక్తిగత అంశాలతో ఈ సినిమాకు సంబంధం లేదు. వాళ్లిద్దరి ప్రెజెన్స్‌తో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. జేడీ చక్రవర్తితో ఓ సినిమా ప్లానింగ్ ఉంది. ‘తిరుమల బాలాజీ’, ‘రాహు కేతు’ వెబ్ సిరీస్‌లతో పాటు ఓ హిందీ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘కొందరు సినిమా ఇండస్ట్రీని దోచుకుంటున్నారు. టికెట్ ధరలను తగ్గించి నిర్మాత జ్ఞానవేల్ రాజా (‘బడ్డీ’ సినిమా టికెట్ ధర తగ్గించడాన్ని ఉద్దేశించి) రిలీజ్ చేయడాన్ని సపోర్ట్ చేస్తున్నా. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను’’ అని చెప్పుకొచ్చారు. -
‘పురుషోత్తముడు’ శ్రీమంతుడు కాదు: రామ్ భీమన
రాజ్ తరుణ్, హాసినీ సుధీర్ జంటగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుషోత్తముడు’. డా. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ‘శ్రీ మంతుడు’ సినిమా కథతో పోల్చవద్దు. కోటీశ్వరుడైన యువకుడు ఇంటి నుంచి బయటకు రావడం అనే పాయింట్‌తో చాలా కథలు వచ్చాయి. కానీ కథను ఏం విధంగా చెప్పాం? ఎలా చెప్పాం అనేది ముఖ్యం’’ అన్నారు. ‘‘14 ఏళ్ల వయసులోనే ఆంధ్రా నుంచి ముంబై వెళ్లి, ఇప్పుడు బిజినెస్‌లో రాణిస్తున్నాను. తెలుగు సినిమా నిర్మించాలన్న నా ఆశ ఈ సినిమాతో నెరవేరింది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఈ సినిమా కోసం చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌ను కూడా తీసేశాం. కుటుంబం అంతా కలిసి మా సినిమాను చూడొచ్చు’’ అన్నారు చిత్రనిర్మాత రమేశ్. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘పురుషోత్తముడు’
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. హాసినీ సుధీర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముఖేష్ ఖన్నా ఇతర కీలక పాత్రల్లో నటించారు. రామ్ భీమన దర్శకత్వంలో డా. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నేను ‘ఆకతాయి, హమ్ తుమ్’ అనే రెండు సినిమాలు చేశాను. ఆ తర్వాత ఆరేళ్లకు నాకు ‘పురుషోత్తముడు’ చాన్స్ వచ్చింది. విజయం సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘మంచి క్లీన్ ఎంటర్టైనర్ మూవీ తీశామని గర్వంగా చెప్పగలం’’ అన్నారు రమేశ్ తేజావత్. ‘‘పురుషోత్తముడు’లో మంచి పోలీసాఫీసర్ రోల్ చేశాను. ఈ సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు బ్రహ్మానందం.‘‘ఈ సినిమాలో నటించడాన్ని ఆస్వాదించా. రాజ్ తరుణ్ ఈ ప్రెస్‌మీట్‌కు రాలేదు. త్వరలోనే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడతారు’’ అన్నారు రాజా రవీంద్ర. ‘‘నాది మహా రాష్ట్ర. నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు హాసినీ సుధీర్. -
రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేసిన నార్సింగి పోలీసులు
-
అర్ధరాత్రి లావణ్య నుంచి షాకింగ్ కాల్
-
రాజ్ తరుణ్, లావణ్య కేసులో కీలక ట్విస్ట్
-
రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
-
లావణ్యపై మరో ఫిర్యాదు చేసిన సినీ నటి మాల్వి మల్హోత్రా
-
రాజ్ తరుణ్‌తో ఎఫైర్‌పై స్పందించిన మాల్వి మల్హోత్రా
ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకాపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హీరో రాజ్‌తరుణ్ తనతో సహజీవనం చేస్తూనే మరో పక్క మాల్వి మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా స్పందించింది.మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. 'రాజ్‌తరుణ్‌తో నటించిన ప్రతీ హీరోయిన్ను లావణ్య అనుమానిస్తుంది. ఇప్పటి వరకు ఆమెతో నాకు ఎలాంటి పరిచయం లేదు. నేను తనను బెదిరించలేదు. లావణ్యనే ప్రతిరోజూ నాకు మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తోంది. రాజ్ తరుణ్ నా సహ నటుడు మాత్రమే. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. లావణ్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఆమె చెబుతున్నవన్నీ అబద్దాలే' అని పేర్కొంది.చదవండి: హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో ట్విస్ట్!'రాజ్‌తరుణ్‌తో నాకు పెళ్లి అయినట్లు ఆమె చెబుతున్నదాంట్లో నిజం లేదు. ఆమె ఇలాంటి కథలు చెబుతుంది. లావణ్య చేస్తున్న టార్చర్ భరించలేక ఆమె నంబర్‌ను నేను బ్లాక్ చేశాను. ఈ విషయాన్ని రాజ్‌తరుణ్‌తో కూడా చెప్పాను. ఆ సమయంలో ఆమె నా తల్లదండ్రులకు కూడా ఫోన్ కాల్స్ చేసి వార్నింగ్ ఇచ్చింది. నా కుటుంబ సభ్యులు నంబర్స్ రాజ్‌తరుణ్ వద్ద కూడా లేవు. ఆమె ఎలా సంపాధించిందో తెలాల్సి ఉంది. ఆమె కాల్స్ చేసి భూతులు మాట్లాడుతుంది. తనకు ఎలాంటి సిగ్గులేదు. సమస్య వారిద్దరిదీ. కానీ, ఈ గొడవలు నా పేరు ఎందుకు తీస్తుందో తెలియదు. ఆమె టార్చర్ భరించలేకనే నేను ఎనిమి నెలలుగా రాజ్‌తరుణ్‌తో టచ్‌లో లేను. సినిమా విడుదల సమయంలో మాత్రమే ఆయనతో మాట్లాడుదానిని. మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. ఇలాంటి రూమర్స్ ఇంతటితో ఆపేస్తే మంచిది. ఇప్పుడు నేను కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తా.' అని మాల్వి మల్హోత్రా తెలిపింది. ప్రస్తుతం ఆమె సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. -
రాజ్ తరుణ్ - లావణ్య కేసులో ట్విస్ట్
-
హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో ట్విస్ట్!
ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, తాను పదకొండేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబైకి చెందిన హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ పిర్యాదులో పేర్కొంది. అయితే ఈ కేసులో నార్సింగి పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. పిర్యాదులో పేర్కొన్న ఆధారాలు సమర్పించాలంటూ తిరిగి లావణ్యకే నోటీసులు అందించారు. శుక్రవారం మధ్యాహ్నం లావణ్య ఫిర్యాదు చేయగా.. సాయంత్రమే పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన నాలుగు పేజీల ఫిర్యాదు ఫార్మాట్లో లేదని,నేరం జరిగితే సమయం, ప్లేస్..ఇలాంటి వివరాలేవి అందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. లావణ్య చేసిన ఫిర్యాదుపై ఆధారాలు ఇవ్వమని నోటీసులు ఇచ్చినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు లావణ్య అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది.ప్రాణహానీ ఉంది: లావణ్యహీరో రాజ్‌తరుణ్ తనతో సహజీవనం చేస్తూ మాల్వి మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఆమె మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు రాజ్‌తరుణ్, మాల్వి కలిసి ఇటీవల గోవా, చెన్నై, పాండిచ్చేరిలకు కలిసి వెళ్లారని, ఇదే విషయాన్ని నిలదీస్తే తనను దూరం పెట్టాడని పేర్కొంది. రాజ్‌తరుణ్‌ని వదిలేస్తే కొంత డబ్బు ఇస్తామని, లేదంటే చంపేస్తామని హీరోయిన్ సోదరుడు బెదిరించాడని తెలిపింది. తనకు ప్రాణహానీ ఉందని, కాపాడాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. అయితే అధారాలు సమర్పించాలని పోలీసులు లావణ్యను కోరారు.రిలేషన్లో ఉన్న మాట నిజమే కానీ.. : రాజ్తరుణ్లావణ్య ఫిర్యాదు తర్వాత రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ..గతంలో ఆమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమేనని.. విడిపోయి చాలా కాలం అవుతుందని చెప్పారు. 2014 నుంచి 2017 వరకు లావణ్యతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నానని చెప్పారు. తనకు మందు, సిగరేట్‌తో పాటు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, ఎన్నిసార్లు చెప్పినా మానేకపోవడంతో తాను బయటకు వచ్చానని చెప్పారు. -
వివాదంలో రాజ్‌తరుణ్.. ట్రెండింగ్‌లో హీరోయిన్ (ఫోటోలు)
-
ఓటీటీలోకి 'నా సామిరంగ'.. అఫీషియల్ ప్రకటన
'నా సామిరంగ' అంటూ సంక్రాంతి బరిలో దిగి అక్కినేని నాగార్జున హిట్ కొట్టారు. విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ వంటి చిత్రాలకు గట్టి పోటీగా నా సామిరంగ చిత్రం నిలిచింది. అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి నాగ్ కెరియర్లో మరో హిట్‌ను అందుకున్నారు. నా సామిరంగ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు తాజాగా డిస్నీ+హాట్‌స్టార్ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 17 నుంచి నా సామిరంగ స్ట్రీమింగ్ అవుతుందని హాట్‌స్టార్ అఫీషియల్‌గా ప్రకటించింది. 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 55 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఓపెనింగ్స్ తొలి మూడు రోజుల్లోనే రూ. 28 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. Just one more week until we get to see the King 👑 #NaaSaamiRangaonHotstar Streaming from 17th Feb only on #DisneyPlusHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl… pic.twitter.com/b32dwWbrIH — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 10, 2024 -
‘పురుషోత్తముడు’ మారిన రాజ్ తరుణ్..డబ్బింగ్ పనుల్లో బిజీ
రాజ్ తరుణ్ హీరో గా రామ్ భీమన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పురుషోత్తముడు'. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. రాజమండ్రి లో వేసిన భారి సెట్ లో టాకీ పూర్తి చేసుకున్న సంధర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు ఆదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు. నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో భారీ తారాగణం తో పాటు సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, చిత్రం గొప్ప విజయం సాధించబోతుందని తెలిపారు. తన కెరీర్ లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని కెమెరామెన్ పి.జి.విందా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. -
Naa Saami Ranga Review: ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ
టైటిల్: నా సామిరంగ నటీనటులు: నాగార్జున అక్కినేని,అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, నాజర్, రావు రమేష్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి దర్శకత్వం: విజయ్ బిన్ని కథ: ప్రసన్నకుమార్ బెజవాడ సంగీతం: ఎంఎం కీరవాణి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరధి ఎడిటర్: చోటా కె. ప్రసాద్ విడుదల తేది: జనవరి 14, 2024 ‘నా సామిరంగ’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1963-88 మధ్య కాలంలో జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అంబాజీపేట గ్రామానికి చెందిన కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అంజి వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో.. కిష్టయ్యనే అన్ని తానై పెంచుతాడు. ఒక్కసారి సహాయం చేశాడని ఆ ఊరి పెద్దాయన(నాజర్)దగ్గరే పనిచేస్తుంటాడు. వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు(రావు రమేష్) కూతురు వరాలు(ఆషికా రంగనాథ్) అంటే కిష్టయ్యకు చిన్నప్పటి నుంచి ఇష్టం. వరాలుకు కూడా కిష్టయ్య అంటే ఇష్టమే కానీ.. పదేళ్ల కిందట(1978) జరిగిన ఓ ఘటన కారణంగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఈ మధ్యలో అంజికి అదే గ్రామానికి చెందిన అనాథ అమ్మాయి(మిర్నా మీనన్)తో పెళ్లి జరిగి, పాప కూడా పుడుతుంది. ఇదిలా ఉంటే అంబాజీపేటకు చెందిన భాస్కర్(రాజ్ తరుణ్)..పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురు(రుక్సార్)తో ప్రేమలో పడతాడు. పండగవేళ గోడ దూకి ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్లి దొరికిపోతాడు. ప్రెసిడెంట్ మనుషులు భాస్కర్ని చంపేందుకు ప్రయత్నించగా.. కిష్టయ్య కాపాడుతాడు. అంతేకాదు పెద్దాయన ఆజ్ఞ మేరకు పండగ జరిగేవరకు భాస్కర్‌కు ఎలాంటి హనీ కలగకుండా చూసుకుంటాడు. కట్ చేస్తే..దుబాయ్ నుంచి తిరిగొచ్చిన పెద్దాయన చిన్న కుమారుడు దాసు(డాన్సింగ్ రోజ్) కిష్టయ్య, అంజిని చంపేందుకు కుట్రలు పన్నుతాడు. దాసుతో పక్క ఊరి ప్రెసిడెంట్ కూడా చేతులు కలుపుతాడు.అసలు దాసు అంజి, కిష్టయ్యను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? పదేళ్లుగా వరాలు ఎందుకు ఒంటరిగా ఉంటుంది? పదేళ్ల క్రితం ఏం జరిగింది? పెద్దాయనకి ఇచ్చిన మాట ప్రకారం పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురితో భాస్కర్ పెళ్లిని కిష్టయ్య జరిపించాడా లేదా? చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న కిష్టయ్య కోసం అంజి చేసిన త్యాగమేంటి? అన్నం పెట్టి చేరదీసిన పెద్దాయన కొడుకునే కిష్టయ్య ఎందుకు చంపాల్సి వచ్చింది? వరాలు, కిష్టయ్యల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథ పాతదైన.. తెరపై చూస్తే బోర్ కొట్టదు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా.. అది తెరపై కనిస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటి సినిమానే నా సామిరంగ. కథలో ఎలాంటి కొత్తదనం లేకున్నా.. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని కమర్శియల్ అంశాలను జోడించి సంక్రాంతి పండక్కి కావాల్సిన సినిమాగా తీర్చిదిద్డాడు దర్శకుడు విజయ్ బిన్నీ. (చదవండి: ‘సైంధవ్’మూవీ రివ్యూ) వాస్తవానికి ఇది పొరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్. ఆ సినిమా చూసిన వారికి తప్పా.. మిగతావారందరికి ఇది అచ్చమైన తెలుగు సినిమానే అనిపిస్తుంది. ఎక్కడ పాట పెడితే ఊపొస్తుంది.. ఎక్కడ యాక్షన్ సీన్ పెడితే విజిల్స్ పడతాయి.. ఎలాంటి కామెడీ సీన్స్ పెడితే నవ్వులు పూస్తాయి? ఇలాంటి కమర్షియల్ కొలతలు అన్ని వేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అలా ఒది గొప్ప కథ.. అద్భుతంగా తీర్చి దిద్దారని చెప్పలేం కానీ.. సంక్రాంతి పండక్కి కావాల్సిన సినిమా అని చెప్పొచు. కిష్టయ్య, అంజిల బాల్యం సన్నివేశాలతో చాలా ఎమోషనల్‌గా సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ వెంటనే పాతికేళ్ల ముందు అంటే 1963 నుంచి 1988కి వెళ్తుంది. భారీ ఫైట్ సీన్‌తో నాగార్జున ఎంట్రీ.. తర్వాత భాస్కర్ (రాజ్ తరుణ్) లవ్‌స్టోరీతో సినిమా ఓ మాదిరిగా సాగుతుంది. ఇక కిష్టయ్య, వరాలు లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక.. ప్రేక్షకుడు కథలో లీనమై పోతాడు. వరాలు, కిష్టయ్య మధ్య జరిగే సంభాషణలు , ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. సంక్రాంతి పండక్కి ముడిపెడుతూ.. కథనాన్ని నడిపించారు. ఒక ఎమోషనల్ పాయింట్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ముగుస్తుంది. (చదవండి: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ) ఇక సెకండాఫ్‌లో కథనం రొటీన్‌గా సాగుతుంది. కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. వరాలు, అంజి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక క్లైమాక్స్ ఊహకందేలా, సింపుల్‌గా ఉంటుంది. రెగ్యులర్ రొటీన్ సినిమానే అయినా.. సంకాంత్రి వేళ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. కిష్టయ్య పాత్రలో నాగార్జున కుమ్మేశాడు. రొటీన్ కథే అయినా.. నాగార్జున ఎనర్జీటిక్ యాక్టింగ్‌తో బోర్ కొట్టకుండా కథనం సాగుతుంది. యాక్షన్ తో ఎమోషనల్ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. ఇక నాగార్జున తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర నరేశ్ది. అంజి పాత్రలో నరేశ్ పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ.. మరికొన్ని చోట్ల ఏడిపించాడు. తెరపై నాగార్జున, నరేశ్‌ల బ్రో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయింది. వరాలు పాత్రలో ఆమె ఒదిగిపోయింది. భాస్కర్‌గా రాజ్‌తరుణ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నాజర్, మిర్నా, రుక్సర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. (చదవండి: హను-మాన్ రివ్యూ) సాంకేతిక విషయాలకొస్తే.. కీరవాణి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలు ప్రాణం పోశాడు. పాటలు కూడా కథలో భాగంగానే వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈరోజు మాట్లాడుతున్నారంటే కారణం మీరే సార్
-
కిష్టయ్య వస్తున్నాడు... బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు: నాగార్జున
‘‘టీవీలు రాగానే సినిమాలు చూడరు అన్నారు. ఫోన్ వచ్చినప్పుడు, సీడీ–డీవీడీలు వచ్చినప్పుడు సినిమాలు చూడరు అన్నారు.. చూస్తూనే ఉన్నారు ఆడియన్స్. ఈ మధ్య ఓటీటీ వచ్చింది. అయినా సినిమాలు చూస్తూనే ఉన్నారు. కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తున్నారు. పండగ రోజున సినిమాలు చూడటం అనేది మన ఆనవాయితీ. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సినిమాలు వచ్చినా ప్రేక్షకులు చూస్తారు. మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండగ’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్ , రుక్సార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’, ‘హను–మాన్ ’గా వస్తున్న తేజకు, 75వ సినిమాతో ‘సైంధవ్’గా వస్తున్న మా వెంకీకి ఆల్ ది బెస్ట్. మేం ‘నా సామిరంగ’తో వస్తున్నాం. మేం ఇచ్చే సినిమా మీకు నచ్చితే ఎలా ఆదరిస్తారో సంక్రాంతి పండగలకు నేను చూశాను. మీకు సినిమా నచ్చుతుందని, ఈ సంక్రాంతి పండక్కి కూడా అలానే ఆదరిస్తారని.. నా సామిరంగ. మా సినిమాకి కీరవాణిగారు బ్లాక్‌బస్టర్ పాటలు ఇచ్చారు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయడానికి కారణం కీరవాణిగారు. సినిమా స్టార్ట్ అవ్వకముందే మూడు పాటలు, ఓ ఫైట్‌కు ఆర్ఆర్ చేసి పెట్టారు. విజయ్ బిన్నీని కీరవాణి, చంద్రబోస్‌గార్లు బాగా ప్రోత్సహించారు. మూడు నెలల్లోనే మేం సినిమా తీశాం. సెప్టెంబరు 20 నాన్నగారి నూరవ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ (గత ఏడాది) జరిగింది. ఆ సందర్భంగా దండం పెడుతుంటే ‘వెళ్లి సినిమా చేయరా.. నా సామిరంగ’ అని చెప్పినట్లుగా అనిపించింది. ఆయన చెప్పిన ధైర్యంతోనే సినిమాను పూర్తి చేశాం. ఈసారి సంక్రాంతికి కిష్టయ్య (నాగార్జున పాత్ర పేరు) వస్తున్నాడు... బాక్సాఫీస్ కొడుతున్నాడు. కీరవాణి, చంద్రబోస్‌గార్లు తెలుగు ఇండస్ట్రీని ఆస్కార్ వేదికపై నిలబెట్టారు’’ అని అన్నారు. ‘‘నాగార్జునగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘నా తొలి సినిమా ‘ఉయ్యాలా.. జంపాల’ అన్నపూర్ణ స్టూడియోలో చేశాను. ‘రంగులరాట్నం’, ‘అనుభవించు రాజా’ సినిమాలు చేశాను. ఇప్పుడు నాగార్జునగారితో ‘నా సామిరంగ’ సినిమా చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘నా లైఫ్‌కి ఇంపార్టెంట్ పర్సన్ నాగార్జునగారు. దర్శకుల గత సినిమాల ఫలితాలు చూసి అవకాశాలు ఇచ్చే ఇండస్ట్రీ ఇది. అలాంటిది ఓ కొరియోగ్రాఫర్‌ను అయిన నన్ను నమ్మి, నాకు ఇంత పెద్ద సినిమా చేసేందుకు అవకాశం వచ్చిన రియల్ హీరో నాగార్జునగారు’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘కొత్త దర్శకులు, కొత్త సాంకేతిక నిపుణులను గుర్తించి, వారిని ప్రోత్సహించడంలో నాగార్జునగారు ముందుంటారు’’ అన్నారు కీరవాణి. ‘‘మా అన్నయ్య కీరవాణిగారి స్వరకల్పనలో ఈ సినిమా కోసం మంచిగా నాలుగు పాటలు రాశాను’’ అన్నారు చంద్ర బోస్. -
గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్
మ్యాచో స్టార్ గోపీచంద్‌తో యజ్ఞం,సౌఖ్యం.. వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఆ తర్వాత బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాను తీసి ఇండస్ట్రీలో కంటికి కనిపించకుండా పోయాడు. రాజ్‌తరుణ్‌తో ‘తిరగబడరాసామీ’ సినిమా పుణ్యమా అని మళ్లీ తెరపైకి వచ్చి ఆ సినిమాలో నటించిన మన్నారా చోప్రాను ముద్దు పెట్టడం వంటి చేష్టలతో వైరల్ అయ్యాడు. ఆ వెంటనే గోపీచంద్‌పై పలు అసభ్య పదాలతో వ్యక్తిగతంగా దూషించాడు. (ఇదీ చదవండి: హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్) 'ఒరేయ్ అంత బలిసిందా రా నీకు'.. అంటూ గోపీ చంద్‌పై విరుచుకుపడటమే కాకుండా ఆ ఇంటర్వ్యూలో మొత్తం ఆయన్ను తిట్టడమే పని పెట్టుకున్నాడు. ఇంకేముంది వెంటనే గోపీచంద్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరిని భారీగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తాగి వచ్చి తమ హీరోపై ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సరైన రీతిలో బుద్ధి చెబుతామని సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చారు. ఇలా మాట్లాడే వాడికి ఏ హీరో అయినా సినిమా అవకాశం ఎలా ఇస్తారని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఇలా గోపీచంద్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోయడంతో డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి చివరకు దిగొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ గురించి మళ్లీ ఇలా చెప్పుకొచ్చాడు. 'గోపీతో ఎలాంటి గొడవ లేదు. నాకు ఆయన బిడ్డలాంటి వాడు.. తమ్ముడు లాంటి వాడు.. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు.. ఆ వ్యాఖ్యల వల్ల రిగ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను. గోపీచంద్ విషయంలో నాదే తప్పు. ఆ మాటలు కూడా గోపీపై ఆవేదనతోనే వచ్చాయి. నా వల్ల హర్ట్ అయిన గోపీచంద్ ఫ్యాన్స్ ఫోన్లు చేస్తున్నారు. ఇంతటితో వదిలేయండి.' అని ఆయన అన్నారు. కానీ ఎ.ఎస్.రవికుమార్ చౌదరిపై గోపీ చంద్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు ఏ మాత్రం తగ్గడం లేదు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే స్థితిలో ఉన్నావని ఒకరంటే... ఆరోజు తాగి మాట్లాడితే.. ఈ రోజు తాగకుండా మాట్లాడుతున్నాడని మరోకరు తెలిపారు. ఈ వివాదంపై గోపీచంద్ మాత్రం స్పందించ లేదు. -
హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ ‘తిరగబడరాసామీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో హీరోయిన్గా మాల్వీ మల్హోత్రా ఉండగా మున్నారా చోప్రా నెగటివ్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ కార్యక్రమంలో మున్నారా చోప్రాను డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ముద్దు పెట్టుకోవడంతో చాలరోజుల తర్వాత ఆయన పేరు వైరల్ అయింది. గోపీచంద్‌తో యజ్ఞం,సౌఖ్యం... సాయి ధరమ్‌తేజ్‌తో పిల్లా నువ్వులేని జీవితం.. బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాలకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. సుమారు పదేళ్ల తర్వాత రాజ్‌తరుణ్‌తో ‘తిరగబడరాసామీ’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగ ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా హీరో గోపీచంద్‌పై ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు ఇలా చేశాడు. గతంలో అందరం చెట్టు కింద కూర్చోని భోజనం చేసేవాళ్లం.. ఒకరోజు అతని కోసం వెళ్తే కొంతసేపు వెయిట్చేయమను అన్నాడు అని గోపీచంద్ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఇలా విమర్శలు చేశాడు. 'ఒరేయ్ అంత బలిసిందా రా మీకు..? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్.. ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐయిదారుగురిని దాటుకుని రావాల్నా.. వాడిని హీరోగా నేనే చేశాను (యజ్ఞం). అప్పటివరకు వాడు విలన్‌గా నటించేవాడు (జయం,నిజం,వర్షం). నా సినిమాతో వాడు హీరోగా గుర్తింపు పొందాడు. ఆ సినిమాకు నేను తీసుకున్న రెమ్యునరేషన్ కంటే వాడికి తక్కువ. అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకో అర్థం కాదు.. వాడు ఇప్పుడు ఎదరుపడినా ఇలానే మాట్లాడుతాను. ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు నేడు పూర్తిగా మారిపోయాడు. 2016 సంవత్సరంలో కోఠి ఉమెన్స్ కాలేజీలో 'రారాజు' సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో నేను కూడా అక్కడికి వెళ్లాను. అప్పటికే నేను బాలకృష్ణతో వీరభద్ర సినిమా తీసి ప్లాప్‌లో ఉన్నాను. ఈ కారణంతో మరో సినిమా తీద్దామని అడిగిన నన్ను దూరం పెట్టాడు. మంచి కథ చేసి రండి చూద్దాం అని అవమానించాడు. ఇదంతా జరిగిన సమయంలో ఫైట్ మాస్టర్ విజయ్ కూడా అక్కడే ఉన్నారు.' అని ఆయన పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గోపిచంద్ ఫ్యాన్స్ కూడా ఎ.ఎస్.రవికుమార్ చౌదరిపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే హీరోయిన్ మున్నారా చోప్రాను ముద్దు పెట్టుకుని విమర్శలు ఎదుర్కొంటుండగా.. తాజాగ చేసిన వ్యాఖ్యలతో ఆయనపై గోపీచంద్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు గోపీచంద్‌పై ఎలాంటి రిమార్క్ లేదని... అతనిపై ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి కామెంట్లు కూడా చేయలేదని వారు తెలుపుతున్నారు. వ్యక్తిగతంగా ఏదో కారణం పెట్టుకుని పబ్లిగ్ ప్లాట్‌ఫామ్‌పై ఇలా మాట్లాడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కంటే గొప్పోళ్లా..? ఇండస్ట్రీలో మొఖం మీద మేకప్ వేసుకున్న తర్వాత మేకలాంటి చేష్టలు చాలమందికి ఉన్నాయని ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తెలిపాడు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న వారిలో చాలమంది రీల్ హీరోస్ మాత్రమే అని రియల్ కాదన్నాడు. తలపొగరు నెత్తికెక్కి డెమీగాడ్స్లా కొందరు హీరోలు విర్రవీగుతున్నారంటూ.. చిరంజీవి, బాలకృష్ణ కంటే వీళ్లందదు గొప్పోళ్లా..? అంటూ ఫైర్ అయ్యాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా డిసిప్లెన్ కలిగిన వ్యక్తి అంటూ పేర్కొంన్నాడు. -
కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్!
పాత నీరు పోక, కొత్త నీరు రాక అన్న సామెత సినీ పరిశ్రమకు సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా కొత్త నటీమణులు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి పరితపిస్తుంటారు. అలా చాలా మంది క్రేజీ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. తాజాగా నటి మాల్వీ మల్హోత్రా కోలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. (ఇది చదవండి: మీ క్యాలెండర్లో ఇది మార్క్ చేసుకోండి: చిరంజీవి ) హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఈ పంజాబీ బ్యూటీ ముంబాయిలో నటిగా శిక్షణ పొంది ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. మొదట బుల్లితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ.. అలా వెండితెరలోనూ నాయకిగా నటిస్తున్నారు. ఇప్పటికే పంజాబీ, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న ఈ భామ ఇప్పుడు కోలీవుడ్‌కు ఎంట్రీ షురూ అయ్యిందన్నది తాజా సమాచారం. నటుడు ఆర్కే సరసన నటించే అవకాశం ఈమెను వరించింది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న 'తిరగబడరా సామీ' చిత్రంలో మాల్వీ మల్హోత్రా నటిస్తోంది. ఇందులో మరో కథానాయిక మన్నారా చోప్రా కూడా కనిపించనుంది. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) మలయాళంలో రఫీ దర్శకత్వంలో దిలీప్, కీర్తీసురేశ్, హనీరోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన రింగ్ మాస్టర్ 2014లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ కాబోతోంది. ఇందులో నటుడు ఆర్కే కథానాయకుడిగా నటించనున్నారు. ఈయన ఇంతకు ముందు ఎల్లామ్ అవన్ సెయల్, అళగర్ మలై, వైగో ఎక్స్‌ప్రెస్ వంటి పలు విజయవతమైన చిత్రాల్లో నటించారు. కాగా చిన్న గ్యాప్ తరువాత ఈయన నటిస్తున్న ఈ చిత్రంలో నటి మాల్వీ మల్హోత్రా నాయకిగా నటించనున్నారు. బిగ్‌బాస్ అభిరామి ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఆర్.కన్నన్ దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభం కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by MALVI MALHOTRA (@malvimalhotra) -
చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. యువ హీరోయిన్ ఫిర్యాదు
టాలీవుడ్లో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అర్థనా బిను. 2016లో వచ్చిన ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కు జోడీగా నటించింది. చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది ఈ మలయాళీ బ్యూటీ. ఆ సినిమా తర్వాత ఇంతవరకు తను ఏ తెలుగు మూవీలో నటించలేదు. కానీ తమిళ్,మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక) తాజాగా హీరోయిన్ 'అర్థనా బిను' తన తండ్రి విజయకుమార్‌పై షాకింగ్ ఆరోపణలు చేసింది. తన తల్లి విడాకులు తీసుకోవడంతో తండ్రికి దూరంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి, నటుడు విజయకుమార్ అక్రమంగా ఇంట్లోకి చొరబడిన వీడియోను షేర్ చేసింది. తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ అతను అప్పుడప్పుడు ఇంటికి వచ్చి గందరగోళం చేస్తుంటాడని ఆరోపించింది. తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపింది. 'ఈ రోజు, అతను మా ఇంటి కాంపౌండ్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటికే మేము ఇంటిలోపల నుంచి తలుపు లాక్ చేయడంతో కిటికీ ద్వారా బెదిరింపులకు దిగాడు. నా చెల్లెలుతో పాటు అందరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా సినిమాల్లో నటించడం ఆపేయ్ లేదా తను చెప్పిన సినిమాల్లో మాత్రమే నటించాలని షరతులు పెడుతున్నాడు. నాతో ఉండే నటల గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు. చివరకు మా అమ్మ పనిచేసే ప్రదేశంతో పాటు సోదరి చదువుకునే విద్యా సంస్థ వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించినందుకు అతనిపై కోర్టులో కేసు నడుస్తుండగా ఇప్పుడు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు.' అని తెలిపింది. (ఇదీ చదవండి: స్పై సినిమా ఎఫెక్ట్.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్) తనను సినిమాలు చేయకుండా, నటించకుండా ఆపాలని తండ్రి విజయకుమార్ తనపై కూడా కేసు పెట్టాడని అర్థనా పేర్కొంది. 'నేను నా ఇష్టానికి మాత్రమే సినిమాల్లో నటిస్తున్నాను. మూవీలో నటించడం నా అభిరుచి, నాకు ఆరోగ్యం సహకరించినంత కాలం నటిస్తూనే ఉంటాను. సినిమాల్లో నటించకుండా ఆపాలని నాపై కేసు పెట్టాడు. నేను షైలాక్లో నటించినప్పుడు కూడా, అతను లీగల్‌గా కేసు పెట్టాడు. ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నేను నా సొంత ఇష్టానుసారం సినిమాలో నటించానని అధికారిక చట్టపరమైన పత్రాలపై సంతకం చేయాల్సి వచ్చింది. అని వాపోయింది. View this post on Instagram A post shared by Arthana Binu (@arthana_binu) -
ఆ హీరోతో డేటింగ్.. దుబాయ్‌కు పారిపోయానన్నారు : శివానీ రాజశేఖర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ ప్రియుడితో దుబాయ్‌కు పారిపోయిందని గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి స్వయంగా ఆమె తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వార్తలపై మరోసారి స్పందించింది శివానీ. అహనా పెళ్లంట వెబ్‌సిరీస్‌లో పెళ్లికూతురు లేచిపోతుంది.. ఇదే లైన్‌ను నాకు తగిలేసి శివానీ బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందన, ఇంకోసారి శివానీ కాదు శివాత్మిక పారిపోయిందని ఫేక్ వార్తలు పుట్టించారు. దీంతో ఇంతకీ పారిపోయింది నేనా? లేక శివాత్మికనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరు? కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి అని చెప్పాల్సి వచ్చింది. దీనికి తోడు నేను వెళ్లింది బాయ్‌ఫ్రెండ్‌తో కాదు, నా ఫ్యామిలీతో అని ఫోటోలు కూడా షేర్ చేశారు. అప్పుడు ఈ ఫేక్ న్యూస్‌కి తెరపడింది అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు హీరో రాజ్‌తరుణ్‌తో ఆమె ప్రేమలో ఉందని, వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు కూడా అంగీకరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా శివానీ మాట్లాడుతూ... రాజ్‌తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ అని ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. తమ మధ్య స్నేహం తప్పా ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చేసింది. -
అహ నా పెళ్లంట టీమ్ తో స్పెషల్ " చిట్ చాట్ "
-
‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్‌సిరీస్ టైటిల్ : అహ నా పెళ్ళంట (8 ఎపిసోడ్స్) నటీనటులు : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, దీపాలి శర్మ, మధునందన్, కృతిక సింగ్, 'గెటప్' శ్రీను, భద్రమ్, తదితరులు నిర్మాతలు: సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా కథ, స్క్రీన్ ప్లే : షేక్ దావూద్ జి దర్శకత్వం: సంజీవ్ రెడ్డి సంగీతం : జుడా శాండీ నేపథ్య సంగీతం: పవన్ సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీ ఎడిటర్: మధు రెడ్డి విడుదల తేది: నవంబర్ 17, 2022(జీ5) కెరీర్ బిగినింగ్‌లోనే హ్యాట్రిక్ విజయాలు అందుకొని టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. అయితే ఈ యంగ్ హీరోకి ఈ మధ్య బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన ‘స్టాండప్ రాహుల్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటీటీని నమ్ముకున్నాడు. ఆయన నటించిన తొలి వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్లంట’. శివానీ రాజశేఖర్ హీరోయిన్. నేటి(నవంబర్ 17) నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి రాజ్ తరుణ్ నటించిన తొలి వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘అహ నా పెళ్లంట’ కథేంటంటే.. నారాయణ అలియాస్ నో బాల్ నారాయణ( హర్ష వర్ధన్), సుశీల(ఆమని) దంపతులు ముద్దుల కొడుకు శ్రీను (రాజ్ తరుణ్). చాలా అల్లరిగా ఉండే శ్రీను.. చిన్నప్పుడు స్కూల్లో జరిగిన ఓ సంఘటన కారణంగా ఇకపై అమ్మాయిలతో మాట్లాడనని, వాళ్లని కన్నెత్తి కూడా చూడనని తల్లి సుశీలకు ప్రామిస్ చేస్తాడు. చెప్పినట్లే శ్రీను అమ్మాయిల జోలికి వెళ్లడు. చూడ చూడక ఒక అమ్మాయిని చూస్తే.. ఆ రోజు నాన్న నారాయణకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. దీంతో శ్రీను తను అమ్మాయిలను చూడడం వల్లే నాన్నకు ప్రమాదాలు జరుగుతున్నాయని, పెళ్లి చేసుకుంటే ఇవేవి ఉండవని భావిస్తాడు. తనకు పెళ్లి చేయమని అమ్మానాన్నలను అడుగుతాడు. వారు చూసిన ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. సరిగ్గా పెళ్లి రోజు ఆ అమ్మాయి ‘ప్రేమించిన అబ్బాయితో లేచిపోతున్నాను’అని లేఖ రాసి పారిపోతుంది. పీటలు వరకు వచ్చిన పెళ్లి ఆగడంతో శ్రీనుతో పాటు కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. తన పెళ్లి ఆగడానికి కారణం మహా(శివానీ రాజశేఖర్) అని శ్రీను తెలుసుకుంటాడు. తన కుటుంబం లాగే ఆమె ఫ్యామిలీ కూడా బాధపడాలని పెళ్లికి ఒక్కరోజు ముందు మహాను కిడ్నాప్ చేస్తాడు. అసలు శ్రీను పెళ్లి ఆగిపోవడానికి మహా ఎలా కారణమైంది? కిడ్నాప్ తర్వాత శ్రీను, మహా కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండడానికి కారణమేంటి? మహా ప్యామికీ వచ్చిన ఓ సమస్యను శ్రీను ఎలా పరిష్కరించాడు? ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారు? తనను కిడ్నాప్ చేసింది శ్రీనునే అని మహాకు ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత మహా తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే వరుసగా ఎనిమిది ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'అహ నా పెళ్ళంట' ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. పెళ్లి పీటల దగ్గరు వరుడిని వదిలేసి తన ప్రియుడితో పారిపోయిన ఓ వధువు కథ ఇది. వరుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకోవడంతో కథ ముందుకు సాగుతుంది. వెబ్ సిరీస్‌లా కాకుండా సినిమాలా కథనం సాగుతుంది. దీనికి కారణం దర్శకుడు సంజీవ్ రెడ్డి టేకింగ్ అనే చెప్పాలి. వెబ్ సిరీసే అయినప్పటికీ.. సినిమాలోలాగా పాటలు, కామెడీ, రొమాన్స్..అన్ని ఉండేలా జాగ్రత్త పడ్డాడు. తొలి ఎపిసోడ్ నిడివి ఎక్కువైనప్పటికీ సరదాగా సాగుతుంది. పాటలు, కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. రెండో ఎపిసోడ్ కాస్త నెమ్మగా, రొటీన్‌గా సాగుతుంది. మహా కిడ్నాప్‌తో మూడో ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ సాగుతుంది. కిడ్నాప్ సమయంలో, ఆతర్వాత వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి. నాలుగో ఎపిసోడ్ రొటీన్‌గా సాగినప్పటికీ.. శ్రీను, మహా ఒకే ఫ్లాట్‌లోకి రావడంతో ఆసక్తి పెరుగుతుంది. ఐదో ఎపిసోడ్ కూడా కామెడీగానే సాగుతుంది. ఆరో ఎపిసోడ్ నుంచి కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మహా ఫ్యామిలీకి వచ్చిన సమస్యను తీర్చాలని శ్రీను నిర్ణయించుకోవడం.. ఆ తర్వాత మహా ఇంటికి వెళ్లిపోవడం.. శ్రీనుతో ప్రేమలో పడడం ఇలా ఎమోషనల్‌గా మిగతా ఎపిసోడ్స్ సాగుతాయి. క్లైమాక్స్ కూడా కాస్త డిఫరెంట్‌గా, చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ప్రేమ, ద్రోహం, స్నేహం వంటి అనేక భావావేశాలు ఈ సిరీస్‌లో ఉంటాయి. రొటీన్ స్టోరీనే అయినా.. ఫ్రెష్‌గా, ఎలాంటి అశ్లీలత లేకుండా ఈ వెబ్సిరీస్ని తెరకెక్కించాడు సంజీవ్ రెడ్డి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ని ఎంచుకొని, తెరపై అనుకున్న విధంగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. శ్రీను పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయాడు. తనదైన శైలీలో కామెడీ పండించాడు. మహా పాత్రకు శివానీ రాజశేఖర్ న్యాయం చేసింది. ఆమె పాత్ర కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. రాజ్‌తరుణ్, శివానీ మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. హీరో తల్లిదండ్రులుగా ఆమని, హర్షవర్ధన్ బాగా నటించారు. రాజ్ తరుణ్ స్నేహితులుగా రవి శివతేజ, త్రిశూల్ జీతూరి బాగానే నవ్వించారు. పెళ్లికి ముందు లేచిపోయిన అమ్మాయిగా దీపాలి శర్మ, హీరోతో పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయిగా కృతికా సింగ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. పెళ్లిళ్ల పేరయ్యగా భద్రమ్, సీఐగా రఘు కారుమంచితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీల సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు రిచ్‌గా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి, వెబ్‌డెస్క్ -
రాజ్ తరుణ్ 'అహ నా పెళ్లంట' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్‌సిరీస్ అహ నా పెళ్లంట. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించగా, రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ నవంబర్ 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. కాగా ఈ సిరీస్‌లో నరేష్,పోసాని కృష్ణమురళి, ఆమని కీలక పాత్రలు పోషించారు. -
పెళ్లి, ప్రెగ్నెన్సీపై యంగ్ హీరోయిన్ క్లారిటీ
Varsha Bollamma Clarifies Marriage And Pregnent Rumours: పెళ్లీ, ప్రెగ్నెన్సీ వార్తలపై హీరోయిన్ వర్ష బొల్లమ్మ స్పందించింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. రాజ్ తరుణ్ హీరోగా సాంటో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వర్ష, హీరో రాజ్ తరుణ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్, వర్షలకు సంబంధించిన ఓ ఇంటర్య్వూ వైరల్‌గా మారింది. ఇందులో రాజ్ తరుణ్, వర్షను ఇంటర్య్వూలో చేస్తూ ఆటపట్టించాడు. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల ప్రశ్నల వర్షం కురిపించాడు. చదవండి: ఆ స్టార్ హీరో గురించి చాలా చెప్పాలి: పూనమ్ షాకింగ్ కామెంట్స్ ఇలా ఇంటర్య్వూ మొత్తం వీరిద్దరి ఫన్నీ కన్వర్జేషన్తో సాగుతూ ఆసక్తిని సంతరించుకుంది. ఈ సందర్భంగా వర్ష గురించిన పలు ఆసక్తికర విషయాలపై రాజ్ తరుణ్ ప్రశ్నించాడు. ఈ మధ్య కాలంలో ఆమె గురించి ఎక్కువగా వార్తల్లో నిలిచిన, గూగుల్ సెర్చ్ చేసిన అంశాలపై రాజ్ తరుణ్, వర్షను ప్రశించాడు. అన్ని ప్రశ్నలకు వర్ష తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా తన పెళ్లి, ప్రెగ్నెంట్ వార్తలపై వర్ష అసహనం వ్యక్తం చేసింది. నాకు పెళ్లైయితే ఏంటీ, కాకపోతే ఏంటీ. అది నా వ్యక్తిగత విషయం అంటూ కాస్తా ముక్కుమీదు కోపం తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లి అయ్యింది, కానీ నిజంగా కాదు.. సినిమాల్లో అంటూ చమత్కరించింది. చదవండి: అందుకే సమంత, వరుణ్ ధావన్ కలుసుకున్నారు.. ఇక ప్రెగ్నెంట్ విషయంపై స్పందిస్తూ.. ఇదంతా తన బుగ్గల వల్లే వచ్చిందని, చీక్స్ కాస్తా లావుగా ఉంటే ప్రగ్నెంట్ అని డిసైడ్ అవుతారా? అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే తన వయసు 25 అని, తను 1996లో పుట్టానని చెప్పింది. తన ఎత్తుపై అడిగిన ప్రశ్నకు.. హిల్స్ వేస్తే 6'1, లేకపోతే 5'11 అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. మొత్తానికి తన ఎత్తు 5'3, 5'4 అంటూ రాజ్ తరుణ్ రివీల్ చేశాడు. ఇలా రాజ్ తరుణ్, వర్షల మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇంటర్య్వూ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్లో నంద్ కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. -
అప్పటివరకు సినిమాల్లో నటించకూడదనుకున్నా: ఇంద్రజ
‘‘భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి? ఇప్పటి పిల్లలకు, తల్లిదండ్రులకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా ఉంది? వంటి అంశాలతో ఈ తరం వారికి అర్థమయ్యేలా ‘స్టాండప్ రాహుల్’ సినిమా కథను శాంటో పాజిటివ్‌గా చూపించారు’’ అని ఇంద్రజ అన్నారు. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నటించిన ఇంద్రజ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రాజ్ తరుణ్‌కి తల్లి పాత్ర చేశాను. ఓ కుటుంబంలో తల్లి ప్రాధాన్యత ఎంత ఉంటుందో చక్కగా చూపించారు శాంటో. మురళీ శర్మగారు నా భర్తగా నటించారు. కానీ ఇంటి బాధ్యత నేనే తీసుకుంటాను. భర్తలో లేని క్వాలిటీని కొడుకు దగ్గర చూడాలని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుతుంది తల్లి. అయినా కొడుకు కూడా తండ్రిలానే ఉన్నాడని తెలిసి బాధపడుతుంది. చివరికి ఆ కుమారుడు తల్లిని ఏ విధంగా అర్థం చేసుకున్నాడనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. నేటి యువత పని, ప్యాషన్ అనే వాటిల్లో ఏదో ఒక దానికోసం కష్టపడుతుంటారు.. తమకు ఇష్టమైన పనిని చేస్తూనే ఎలా బతకవచ్చో ఈ సినిమాలో చక్కగా చూపించారు దర్శకుడు. ఈ సినిమా కాకుండా నేను నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న సినిమాతో పాటు నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో నటిస్తున్నాను’’ అన్నారు. అందుకే గ్యాప్ తీసుకున్నా ‘‘తెలుగులో నాకు సక్సెస్ రేటు ఎక్కువ. అయితే మలయాళంలో హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే 2006లో పెళ్లి చేసుకున్నాను. మా పాపకి ఎనిమిదేళ్లు వచ్చేవరకు సినిమాల్లో నటించకూడదనుకుని, గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు తనకి 13 ఏళ్లు. ఇప్పుడు కూడా నెలలో సగం రోజులు కుటుంబంతో, సగం రోజులు షూటింగ్లో ఉంటున్నాను’’ అన్నారు ఇంద్రజ. సహాయ పాత్రలు మగవారికి బాగానే వస్తున్నాయి.. కానీ మహిళలకు సరైన పాత్రలు రావడం లేదు. అందుకే నాకు సినిమాల్లో చాలా గ్యాప్ వచ్చింది. రొటీన్ పాత్రలే రావడంతో కొన్ని వదులుకున్నాను. నటిగా సంతృప్తి అనేది ఎవరికీ ఉండదు. నటిగా నేను చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత. -
ఆ రూల్ పెట్టుకోలేదు.. నాకు వచ్చిన పాత్రలు చేస్తున్నా
‘‘కోవిడ్ తర్వాత అందరూ ఎక్కువ ఒత్తిడిలో ఉంటున్నారు. థియేటర్స్‌కు వచ్చినవారు హాయిగా నవ్వుకోవాలి. మా ‘స్టాండప్ రాహుల్’ సినిమా చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేసి, థియేటర్ల నుంచి నవ్వుతూ బయటికొస్తారు’’ అని వర్ష బొల్లమ్మ అన్నారు. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘స్టాండప్ రాహుల్’లో శ్రేయ పాత్రలో నటించాను. నా పాత్ర స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. శాంటో మామూలు సమయంలో కూల్‌గా ఉన్నా, సెట్లో మాత్రం సినిమా గురించే ఆలోచించేవారు. ఈ చిత్రనిర్మాతలు దర్శకునికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ఔట్పుట్ బాగా వచ్చేలా సహకరించారు. ఆయా ప్రాంతాల కల్చర్, భాష నేర్చుకోవడం నాకు ఇష్టం. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్, స్టాండప్ రాహుల్’ చిత్రాలకు తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను. గ్లామర్ పాత్రలు చేయడం లేదేంటి? అని కొందరు అడుగుతున్నారు. నాకు వచ్చిన పాత్రలు చేస్తున్నాను.. అయితే ఇలాంటి పాత్రలే చేయాలని రూల్ ఏమీ పెట్టుకోలేదు. నా పాత్ర నిడివి ఎక్కువగా లేకపోయినా పాత్ర బలంగా ఉండాలనుకుంటాను. విజయ్ సార్ ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్)లో నా స్క్రీన్ స్పేస్ తక్కువ అయినా పాత్రకు ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘స్వాతి ముత్యం’ అనే సినిమా చేస్తున్నాను. మరో సినిమాకి కూడా సంతకం చేశాను’’ అన్నారు. -
‘అనుభవవించు రాజా’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 26)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ మూవీ దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారం పెద్ద చిత్రాలేవి లేకపోవడం, విడుదలైన చిన్న చిత్రాల్లో ‘అనుభవించు రాజా’కే మంచి స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. దాదాపు 450 పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజే రూ.70 లక్షలకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అనుభవించు రాజా చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సో బ్రేక్ ఈవెన్ కు రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్లో భారీగా వసూళ్లను రాబడితే.. బ్రేక్ ఈవెన్ ఈజీగా అవుతుందనే చెప్పాలి. పోటీగా మరే క్రేజీ మూవీ లేకపోవడం.. అనుభవించు రాజా కి ప్లస్ పాయింట్. -
‘అనుభవించు రాజా’ మూవీ రివ్యూ
టైటిల్ : అనుభవించు రాజా నటీనటులు : రాజ్ తరుణ్, కషీష్ ఖాన్, పోసాని కృష్ణ మురళి, ఆడుగలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, అరియానా తదితరులు నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి నిర్మాత : సుప్రియ యార్లగడ్డ దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి సంగీతం : గోపీసుందర్ సినిమాటోగ్రఫీ : నగేశ్ బానెల్ ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్ విడుదల తేది : నవంబర్26, 2021 యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ సాలిడ్ హిట్‌గా చాలా కష్టపడుతున్నాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాజ్ తరుణ్..ఆ తర్వాత ఆ హవాను కొనసాగించడంలో విఫలమం అయ్యాడు. ఇప్పటి వరకు ఆయన డజన్‌కు పైగా చిత్రాలు చేసినప్పటికీ.. కెరీర్ మొదట్లో వచ్చిన ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ‘అనుభవించు రాజా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు.. సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ శుక్రవారం(నవంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనుభవించు రాజా’ను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘అనుభవించు రాజా’ కథేంటంటే పశ్చిమగోదావరి జిల్లా యండగండికి చెందిన బంగార్రాజు అలియాస్ రాజ్ (రాజ్ తరుణ్) పూర్వికులు కోటీశ్వరులు. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటకీ.. రాజ్ మాత్రం సొంత ఊరిని వదిలి హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తుంటాడు. ఇదే సమయంలో అతన్ని హత్య చేసేందుకు గని గ్యాంగ్‌కు ఓ వ్యక్తి పెద్ద ఎత్తున సుపారీ ఇస్తాడు. అసలు రాజ్ హత్య చేయడానికి సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? కోట్ల ఆస్తులకు అధిపతి అయిన రాజ్..సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఎందుకు చేశాడు? అతను గ్రామం నుంచి పారిపోవడానికి గల కారణాలేంటి? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే... జల్సారాయుడు లాంటి బంగార్రాజు పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయాడు. తనదైన కామిక్ టైమింగ్, ఎగతాళితో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఊర్లో అవారాగా తిరిగే బంగార్రాజుగా, సిటీలో సిన్సియర్‌గా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసే రాజ్‌గా రెండు విభిన్న పాత్రలో కనిపించిన రాజ్ తరుణ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కషీష్ ఖాన్ తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటీ.. ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక గ్రామ ప్రెసిడెంట్‌గా ఆడుగలమ్ నరేన్, సెక్యూరిటీ గార్డ్స్ హెడ్‌గా పోసాని మెప్పించారు. హీరో ఫ్రెండ్‌గా నటించిన సుదర్శన్.. తనదైన పంచ్‌లతో నవ్వించాడు. అజయ్, అరియానా, రవిలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? శ్రీను గవిరెడ్డి, రాజ్ తరుణ్ కాంబినేషన్లో ఇప్పటికే ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ’అనే మూవీ వచ్చింది. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సారి మాత్రం రాజ్ తరుణ్‌కు అచ్చొచ్చిన కామెడీ జానర్లో ‘అనుభవించు రాజా’తో మరో ప్రయత్నం చేశాడు దర్శకుడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించామంటూ.. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని మొదటి నుంచి దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. అయితే సినిమాలో మాత్రం మరీ పగలబడి నవ్వేంత సీన్స్ మాత్రం ఏమీ ఉండవు. ఫస్టాఫ్ అంతా హైదరాబాద్‌లో హీరోగా సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేయడం,అక్కడే హీరోయిన్‌తో ప్రేమలో పడడం లాంటి సన్నివేశాలతో ముగించిన దర్శకుడు.. ఇంటర్వెల్ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచేలా చేశాడు. ఇక సెకండాఫ్ మొత్తం పల్లెటూరి నేపథ్యంలో సాగుంది. అక్కడ కామెడీకి మరింత స్కోప్ ఉన్నప్పటికీ.. రోటీన్‌గానే కథను నడిపించారు. ప్రెసిడెంట్ ఎన్నికల సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. రోటీన్ కామెడీ సీన్స్‌తో లాగించాడు. అయితే ప్రెసిడెంట్ కుటుంబంలో జరిగే హత్య వెనుక ఉన్నదెవరనేది మాత్రం ప్రేక్షకుడికి ఆసక్తిరేకెత్తించేలా తెరకెక్కించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక సాంకేతిక విషయానికొస్తే... గోపీసుందర్ సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నగేశ్ బానెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఊహించనంత గొప్ప సినిమా అయితే కాదనే చెప్పాలి. -
బెట్టింగులు, గ్యాబ్లింగ్ అంటే నచ్చదు కానీ.. : రాజ్ తరుణ్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రాజ్ తరుణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ‘అనుభవించు రాజా’సినిమా ఎలా ఉండబోతుంది? అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ, తండ్రి కొడుకుల సంబంధంతో పాటు విలేజ్ ఎమోషన్స్ కూడా బలంగా ఉన్నాయి. బంగారం క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగా నచ్చింది. ఆ పాత్రను ఎంజాయ్ చేస్తూ సినిమా షూటింగ్ చేశాం. ప్రేక్షకులకు కూడా ఆ పాత్ర బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ మూవీలో సెక్యూరిటీ గార్డుగా చేశారు. ఆ పాత్రకు కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? మామూలుగా మనం సెక్యురిటీ గార్డ్స్ అంటే ఏంటి.. అలా నిల్చుంటారు.. రాత్రంతా ఉంటారు కష్టపడతారు అని అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉండే ప్రిపరేషన్స్ ఏంటో నాకు ఈ సినిమా చేసినప్పుడే అర్థమైంది. వాళ్ల ట్రైనింగ్ ఎలా ఉంటుంది.. వారు ఎంత కష్టపడతారో తెలిసింది. పొద్దున్న మన గేట్ తీసేది సెక్యురిటే, రాత్రి గేట్ వేసిది సెక్యురిటే. వాళ్ళు నవ్వుతూ పనిచేస్తే ఆ రోజంతా మనకు బావుంటుంది. అలా నవ్వుతూ ఆ జాబ్ చేయడం అంత ఈజీ కాదు. ట్రైలర్ చూస్తే కోడి పందాలు ఎలిమెంట్స్ కనిపించాయి. మీ నిజ జీవితంలొ కోడిపందాలు వేశారా? లేదు. బెట్టింగులు, గ్యాబ్లింగ్ అంటే నాకు అస్సలు నచ్చదు. వాటి జోలిని ఎప్పుడు వెళ్లలేదు.వెళ్లను కూడా. సంక్రాంతి కోళ్ళ పందాలు చూశాను. మా సినిమాలో సంక్రాంతి వుంది. ఈ సినిమాలో కోడిని షూటింగ్ కోసం తీసుకొచ్చాం. షూటింగ్ అయిపోయాక ఇంటికి తీసుకెళితే అది తినడం లేదని చెప్పారు. బహుశా దానికి కూడా షూటింగ్ అలవాటైపొయిందేమో (నవ్వుతూ). భీమవరం షూటింగ్ ఎలా అనిపిచింది ? నా కెరీర్ సగం సినిమాలు అక్కడే చేశా. అక్కడ మనుషులు, ఫుడ్ బావుంటుంది. సరదాగా గడిచిపోయింది. దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో రెండో సినిమా. తొలి సినిమాకి ఇప్పటికి అతనితో ఎలా అనిపించింది? శ్రీనివాస్ నా బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ మూవీ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చేసినప్పుడు అతను కుర్రాడు. ఇప్పుడు చాలా మెచ్యురిటీ వచ్చింది. చాలా నెమ్మది వచ్చింది. సినిమాని అర్ధం చేసుకోవడంలో అప్పటికి ఇప్పటికి స్పష్టమైన తేడా కనిపించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో సంబంధం? అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే నేను హీరోగా(ఉయ్యాలా జంపాలా మూవీ) పరిచయమయ్యారు. ఇప్పుడు అదే బ్యానర్‌పై మూడో సినిమా చేస్తున్నాను. అంత పెద్ద బ్యానర్లో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం నాగచైతన్య సినిమా చూశారట కదా? అవును. ఇటీవల నాగచైతన్య ‘అనుభవించు రాజా’ సినిమా చూశారు. ఆయనకు మా సినిమా బాగా నచ్చింది. సినిమా పూర్తయ్యాక.. శ్రీనుతో అరగంట సేపు మాట్లాడారు. సినిమా బాగుందని చెప్పారు కొన్ని ప్రయోగాలు చేశారు. మళ్ళీ పాత జోనర్ కి వచ్చారు. సేఫ్ గేమ్ అనుకోవచ్చా ? అదేంలేదు. మనం అదీ ఇదీ అని లెక్కలు వేసుకుంటే వర్కౌట్ కాదు. కథ బావుంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సినిమాలో వినోదం మీ పాత్ర చుట్టే ఉంటుందా? లేదు, పోసాని, సుదర్శన్, అజయ్ ఇలా చాలా మంది వున్నారు. అన్నీ పాత్రల్లో ఫన్ వుంటుంది. కథంతా నా పాత్ర చుట్టే తిరుతుంది కాబట్టి.. నా కామెడీ కాస్త ఎక్కువగా ఉంటుంది హీరోయిన్ కశిష్‌ఖాన్ గురించి ? తెలుగు రాకపోయిన చాలా బాగా నేర్చుకొని సొంతగా డైలాగులు చెప్పడానికి ప్రయత్నించింది. మంచి మనిషి. షూటింగ్ సమయంలో మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. చాలా ప్రశాంతంగా వుంటుంది. కొత్త సినిమా కబుర్లు ఏంటి? స్టాండప్ రాహుల్ రెడీ అవుతుంది. మాస్ మహారాజా సినిమా షూటింగ్ స్టార్ అయ్యింది. మరిన్ని కథలు వింటున్నా. -
‘నాగార్జున, నాగచైతన్యలకు కథ నచ్చడంతో మా సినిమా మొదలైంది’
‘‘జీవితం చాలా చిన్నది.. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలనేది ‘అనుభవించు రాజా’ కథ’’ అని డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి అన్నారు. రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అనుభవించు రాజా’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీను గవిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘పూరి జగన్నాథ్ స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. నేను దర్శకత్వం వహించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, గరమ్’ సినిమాలు 2016లో విడుదలైనా అంతగా ఆడలేదు. ఆ తర్వాత ‘అనుభవించు రాజా’ కథ రాసుకున్నాను. సుప్రియగారు కథ విని ఓకే అన్నారు. నాగార్జున గారు, నాగచైతన్యలకు కూడా కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. ఇందులో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డ్‌గా కనిపిస్తారు. ‘మనం ఎక్కడుంటే అది మన ఊరు కాదు.. మనం పుట్టిందే మన ఊరు’ అనే ఎమోషన్ ఇందులో ఉంటుంది. ఈ సినిమాను నాగచైతన్య చూసి, బాగుందన్నారు. ఇండస్ట్రీ, సినిమాలు నాకు చాలా నేర్పించాయి. నా బలం ఎంటర్టైన్మెంట్. నా తర్వాతి సినిమా ఓ మంచి బ్యానర్లో ఓకే అయింది’’ అన్నారు. -
చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు: నిర్మాత సుప్రియ యార్లగడ్డ
‘చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. ఒక చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం’అన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుప్రియ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► తాత గారు ఎంత ఇచ్చారు.. దాన్ని చిన్న మామ (నాగార్జున) ఎంతలా పెంచారు.. అనేది ఇప్పుడు తెలుస్తోంది. తాతగారు ఉన్నపుడు విలువ తెలియలేదు. అన్నపూర్ణ స్టూడియోను తాతగారు కట్టారు. చిన్న మామ నిలబెట్టారు. తాతగారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. సుమంత్‌ను ఇంకా ఎక్కువగా గారాభం చేసేశారు. ►అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమా అంటే దాదాపుగా నేనే కథలు వింటాను. ఒకవేళ చిన్న మామ, చైతూ హీరోలుగా కథలు వస్తే ముందు వాళ్లకే వినిపిస్తాను. నాకు కథ నచ్చితేనే ముందుకు వెళ్తాను. ఈ కథ విన్నప్పుడు చాలా నవ్వాను. నేను నవ్వాను అంటే ఓ పది మంది నవ్వుతారనే కదా. అందుకే ఈ సినిమా చేశాను. ►ఈ కథ మీద ఓ ఆరు నెలలు కూర్చోవాలి అని చెబితే కొందరు పారిపోతారు. కానీ శ్రీను ఉన్నాడు. మన జోకులు, మన నేటివిటీని మిస్ అవుతుంటాం. ఈ కథలో అది ఉంటుంది. ఏప్రిల్ 1న విడుదల, లేడీస్ టైలర్ వంటి సినిమాలు చూశాం. పెద్ద వంశీ గారి సినిమాల్లా ఉంటుంది. ►రాజ్ తరుణ్‌లో కామిక్ టైమింగ్, ఆ ఎగతాళి అన్నీ ఉంటాయి. ఈ కథ విన్న తరువాత రాజ్ తరుణ్ మాత్రమే కనిపించాడు. ఈ కథలో తను ఉంటే, తను చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సినిమాకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టాలి. అది స్క్రీన్ మీద కనిపించాలి అని అనుకుంటాను. ►సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నాం. అప్పుడే లాక్డౌన్ మొదలైంది. కానీ కరోనా వల్ల ప్రేక్షకులు చూసే కంటెంట్ కూడా మారింది. ఓటీటీలో రకరకాల కంటెంట్ చూడటం అలవాటు పడ్డారు. ►చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. అందరూ చిన్న సినిమాలు తీయాలి. చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం. ►ప్రస్తుతం ఉన్న సమయంలో అందరూ థియేటర్‌కు రావడమంటే కష్టం. కానీ ఎక్కడో చోట మొదలుపెట్టాలి. మన ఊరు, నేటివిటీ, అక్కడి వాతావరణాన్ని అంతా మిస్ అవుతున్నారు. ఇందులో అవన్నీ ఉంటాయి. పచ్చడన్నం లాంటి సినిమా. ►ఓటీటీలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఇది థియేటర్ సినిమానే. ఈ కథకి ఓటీటీ కరెక్ట్ కాదు. థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా. నాగార్జునకి ఇంకా పూర్తి సినిమాను చూపించలేదు. ►ఈ సినిమా తప్పకుండా గుర్తుండిపోతుంది. సరదాగా ఉంటుంది. పెద్ద జీవితం అనుకున్నదాంట్లో ఓ చిన్న స్పీడు బ్రేకర్.. దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు.. ప్రతీవోడు ప్రెసిడెంట్ అనుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ సత్తా ఉండాలి కదా...అలా సరదా సరదాగా సాగేదే అనుభవించు రాజా సినిమా. ►నాకు అన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్రలే వస్తున్నాయి. ఎన్ని సార్లు అదే పాత్రను చేయాలి. అందుకే ఒప్పుకోవడం లేదు. గూఢచారి 2లో మంచి పాత్ర ఇస్తే తప్పకుండా చేస్తాను. నా పాత్ర ఇంకా అందులో సజీవంగానే ఉంది. ►ఒకప్పుడు ప్రతీ విషయంలో ఎంతో ఆలోచించేదాన్ని. ఇది చేస్తే ఇంత డబ్బులు మిగులుతాయా? ఇంత డబ్బులు పోతాయా? ఇలా ఎన్నో ఆలోచించేదాన్ని. నచ్చిందా? నచ్చలేదా? అనేది మాత్రమే చూడాలని తాతగారు చెప్పేవారు. అప్పటి నుంచి ఎక్కువగా ఆలోచించడం మానేశా. ఎక్కువగా కన్ఫ్యూజన్ అనిపిస్తే.. నచ్చలేదా? నచ్చిందా? అనేది ఆలోచించేదాన్ని. నచ్చితే చేసేయడం లేదంటే లేదు. ►ఫ్యూచర్లో దర్శకత్వం వహిస్తానేమో. కానీ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు తీయాలి. కొత్త కంటెంట్ రావాలి. ప్రేక్షకులు మారారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా మారడం లేదు. మూస ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అందరూ కంటెంట్ అనే పదాన్ని వాడుతున్నారు. అది స్టుపిడ్. కంటెంట్ కాదు.. మంచి కథలను చెప్పండి. -
పండగంతా పాటలో కనిపించింది – నాగచైతన్య
రాజ్‌తరుణ్, కశిష్ ఖాన్ జంటగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను నాగచైతన్య విడుదల చేశారు. గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా రామ్ మిర్యాల ఆలపించారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ పాట చూశాను.. బాగుంది. సినిమా కూడా చూశాను. జీవితాన్ని ఎంజాయ్ చేసే ఓ కుర్రాడి పాత్రను వినోదంగా చూపించారు. కోడి పందేలు, రికార్డింగ్ డ్యాన్సులు, సంక్రాంతి పండగ వాతావరణం టైటిల్ సాంగ్‌లో కనిపించాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఆనంద్ రెడ్డి కర్నాటి వ్యవహరిస్తున్నారు. చదవండి: ఆహాలోకి లవ్‌స్టోరీ మూవీ, స్ట్రీమింగ్ అప్పటి నుంచే -
వర్ష బొల్లమ్మతో రాజ్ తరుణ్ రొమాంటిక్ కామెడీ
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. వర్షా బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తున్నారు. నందకుమార్ అభినేని, భరత్ మగులూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘అలా ఇలా అనాలని..’ అంటూ సాగే పాటని హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి, చిత్రబృందానికి శుభకాంక్షలు తెలిపారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా స్వీకర్ అగస్తి స్వరపరిచారు. సత్య యామిని, స్వీకర్ అగస్తి ఆలపించారు. ‘‘ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సిద్ధు ముద్ద, కెమెరా: శ్రీరాజ్ రవీంద్రన్. -
నవ్వులు పూయిస్తున్న ’స్టాండప్ రాహుల్’ టీజర్
రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో నందకుమార్ అభినేని, భరత్ మగులూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్నారు. జీవితంలో దేనికోసమూ కచ్చితంగా నిలబడని ఒక వ్యక్తి నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకుంటాడు. ఆ ప్రేమ కోసం, తన తల్లిదండ్రుల కోసం, స్టాండ్ అప్ కామెడీ పట్ల ఉన్న అభిరుచి కోసం ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ. వర్ష కూడా స్టాండప్ కామెడీ రోల్ చేస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సిద్ధు ముద్ద, సంగీతం: స్వీకర్ అగస్తి, కెమెరా: శ్రీరాజ్ రవీంద్రన్. -
Raj Tarun: రాహుల్.. కూర్చుంది చాలు!
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అనేది ఉపశీర్షిక. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్. సిద్ధు ముద్ద సమర్పణలో నంద్ కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (మే 11) రాజ్ తరుణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘వెన్నెల’ కిశోర్, ఇంద్రజ, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి స్వీకర్ ఆగస్తి సంగీతం అందిస్తున్నారు. చదవండి : TNR 'ప్లే బ్యాక్', ఆహాలో ఎప్పటినుంచంటే? మా ఇంట్లో ఆరుగురికి కరోనా: నటుడు -
పవర్ ప్లే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఈ సినిమాతో హ్యాట్రిక్ షురూ
‘‘లైఫ్ ప్రతివాడికి ఒక మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ ఇస్తుందట.. ‘ఇద్దరిలోకం ఒకటే’ ట్రైలర్‌లోని డైలాగ్ ఇది. రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.ఆర్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ మధ్యకాలంలో నేను నా జర్నీల్లో ఈ సినిమాలోని పాటలనే వింటున్నాను. మిక్కీ జె.మేయర్ అద్భుతమైన మెలోడీలు ఇచ్చారు. అబ్బూరి రవితో నేను ‘బొమ్మరిల్లు’ చిత్రం నుండి జర్నీ చేస్తున్నాను. ఈ చిత్రానికి కూడా మంచి డైలాగ్‌లు అందించారు. ఈ ఏడాది మా బేనర్లో ‘ఎఫ్–2’, ‘మహర్షి’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టాం. ‘ఇద్దరిలోకం ఒకటే’తో హ్యాట్రిక్ సాధిస్తాం’’ అన్నారు. ‘‘చివరి 30 నిమిషాల సినిమాను ప్రేక్షకులు మరచిపోలేరు. హృదయాలతో చూసే ప్యూర్ లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘హృదయాలను కదిలించే ఫీల్‌గుడ్ మూవీ ఇది’’ అన్నారు రాజ్‌తరుణ్. ‘‘అభినందన’, నీరాజనం’ చిత్రాలను ఈ సినిమా గుర్తు చేస్తుంది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. -
మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్ కారు ప్రమాదం
హైదరాబాద్: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీగా మారింది. వేగంగా దూసుకొచ్చిన ఓ వోల్వో కారు డివైడర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న పిట్టగోడను ఢీకొని ఆగిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో కారులో ప్రముఖ సినీ నటుడు రాజ్‌తరుణ్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలో సైతం ఆ సినీ నటుడి పోలికలు ఉన్న వ్యక్తి ఉండటంతో ఈ కేసు మరింత ఆసక్తిగా మారింది. నార్సింగి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అల్కాపురి కాలనీ గుండా సోమవారం రాత్రి టీఎస్ 09 ఈఎక్స్ 1100 కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టి ఖాళీ స్థలంలో ఆగిపోయింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, కారులో ఉన్న యువకుడు కిందకు దిగి సెల్ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు దాటి వెళ్లిపోయాడు. ఈ పూర్తి సంఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. సంఘటన సమ యంలో రాజ్‌తరుణ్ కారులో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై నార్సింగి పోలీసులు మాత్రం ఎలాంటి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. ప్రస్తుతం విచారిస్తున్నామని చెబుతున్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. కారు నంబర్ ఆధారంగా స్కేజోన్ యజమానికి సమాచారం అందించామని చెప్పారు. యజమాని అనుచరుడు ఫోన్లో సంప్రదించాడని, కానీ ఎలాంటి సమాచారాన్ని అందించలేదన్నారు. -
ఆగస్ట్ నుంచి నాన్‌స్టాప్‌గా...
రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘అధినేత, ఏమైంది ఈ వేళ, బెంగాల్ టైగర్, పంతం’ వంటి మంచి హిట్ చిత్రాల తర్వాత మా బేనర్లో చేస్తున్న మరోమంచి కథా చిత్రమిది. ఆగస్ట్ నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుతాం’’ అన్నారు. ‘‘మూడేళ్లు కష్టపడి తయారు చేసిన కథ ఇది. కథ విని రాధామోహన్‌గారు వెంటనే సినిమా స్టార్ట్ చేద్దాం అన్నారు. రాజ్ తరుణ్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. నా దర్శకత్వంలో వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కంటే మంచి కథ ఇది’’ అని కొండా విజయ్‌కుమార్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఆండ్రూస్. -
రాజ్‌తో అదితి?
‘సమ్మోహనం, అంతరిక్షం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు అదితీరావ్ హైదరీ. ప్రస్తుతం ఆమె ‘వి’ సినిమాలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు, నాని హీరోలు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం అదితీని వరించిందని టాలీవుడ్ టాక్. హీరో రాజ్‌తరుణ్‌కి జోడీగా ఆమె నటించనున్నారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ ప్రస్తుతం జి.ఆర్. కృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు బ్యానర్లో ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట. తాను రాసుకున్న కథకు అదితి అయితేనే న్యాయం చేస్తుందని భావించిన దర్శకుడు, ఆమెతో సంప్రదింపులు జరిపారట. మరి.. అదితీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా? వెయిట్ అండ్ సీ. -
అతని ప్రేమలోకంలో?
ప్రేమికులిద్దరిదీ ఒకటే లోకం. అందులో ఒకరు రాజ్ తరుణ్. మరి రాజ్ తరుణ్ ప్రేమ లోకంలో ఉన్నది ఎవరు? అనే విషయంపై క్లారిటీ దొరికింది. రాజ్‌తరుణ్ హీరోగా జి.ఆర్. కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండేను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే రాజ్ తరుణ్, షాలినీ తొలిసారి జోడీ కట్టినట్లే. ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకులుగా పని చేస్తున్నారు. -
ఇద్దరి లోకం ఒకటే
యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే’ అంటున్నారు. ఆయన హీరోగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిత్రనిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘దిల్’రాజు మనవడు మాస్టర్ ఆరాన్‡్ష గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రాజ్‌తరుణ్‌తో మా బ్యానర్లో చేస్తోన్న రెండో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంతో జి.ఆర్. కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్ సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరా లను తెలియజేస్తాం’’ అన్నారు. -
2020లో ఆ ప్లాన్ ఉంది
‘‘చిన్న సినిమా తీయాలంటే భయం వేస్తోంది. ఎందుకంటే ఆడకపోతే మొత్తం పోతుంది. ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకురావాలంటే వాళ్లకు ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. పెట్టిన డబ్బుతో చిన్న సినిమాను సక్సెస్ చేసి, తిరిగి డబ్బు తెచ్చుకోవడం కష్టమైపోయింది. గతేడాది మిడిల్ రేంజ్ హీరోలతో నాలుగు సినిమాలు తీశాను. రైట్ కంటెంట్‌తో రైట్ సినిమా తీస్తే సినిమా హిట్ అవుతుందని గతేడాది ప్రూవ్ అయ్యింది’’ అన్నారు ‘దిల్’ రాజు. రాజ్‌తరుణ్, రిద్ధి కుమార్ జంటగా అనీష్‌కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ నిర్మించిన సినిమా ‘లవర్’. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు చెప్పిన సంగతలు... ► అనీష్ దర్శకత్వం వహించిన ‘అలా ఎలా?’ చూశాను. బాగుందనిపించింది. ఆ తర్వాత 2016లో అనీష్ ఓ స్టోరీలైన్ చెప్పాడు. గతేడాది ఆరు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కుదరలేదు. సేమ్‌టైమ్ నాలుగేళ్లుగా ప్రాజెక్ట్స్ చూసుకుంటున్న హర్షిత్ కూడా తనకు ఓ సినిమాను అప్పజెప్పమని అడిగాడు. ఎందుకో ఈ సినిమా ఇవ్వాలనిపించింది. మ్యూజిక్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలి, ఒక్కో పాటను ఒక్కో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో చేయిస్తానని హర్షిత్ అన్నప్పుడు షాకయ్యాను. కానీ ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తుంది. సినిమా చూసిన వారందరూ క్లైమాక్స్ బాగుందని చెబుతున్నారు. ఆ రోజు హర్షిత్ అడిగిన వాటికి వంద శాతం పాసయ్యాడు. కానీ ఈ సినిమా బడ్జెట్ ముందుగా అనుకున్నట్లు 5 కోట్లు కాక, దాదాపు 8 కోట్లకు చేరుకుంది. లక్కీగా ఈ రోజుల్లో శాటిలైట్, హిందీ డబ్బింగ్ అంటూ ఇలా మార్కెట్ కూడా పెరిగింది. ఇది మంచి విషయం. ► ఫ్యామిలీ ఎమోషన్స్‌కు దూరమైన ఓ అనాథ కుర్రాడు, తన వారసులకు ఆ సమస్య రాకూడదని ఆలోచిస్తాడు. అలాగే తాను ప్రేమించిన అమ్మాయి తనకు అద్భుతమైన లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాడు. అతని ప్రయాణంలో జరిగిన సంఘటనలే ‘లవర్’ చిత్రం. ► రెగ్యులర్ సినిమాలే ఇండస్ట్రీలో వస్తాయన్న కామెంట్స్ వినిపిస్తుంటాయి. కొత్త సినిమాలు తీయాలని నాకూ ఉంటుంది. కానీ ఫ్యామిలీ అండ్ యూత్ జానర్‌పై నాకు గ్రిప్ ఉంది. అందుకే షిఫ్ట్ అవ్వను. అలా కాకుండా కాస్త బయటికి వెళ్లినప్పుడు ఎకానమీ పరంగా ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడ పెడుతున్నాం? ఎంత వస్తుంది అని ఆలోచించాల్సిందే. ► మా బ్రదర్ వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నో డౌట్.. తన ఫస్ట్ సినిమా ‘దిల్’ రాజు సినిమానే. టైటిల్ ‘పలుకే బంగారమాయెనా’ అనుకుంటున్నాం. కథ రెడీ అవుతోంది. పక్కా నా స్టైల్ సినిమానే. ► డెహ్రాడూన్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత మహేశ్‌బాబు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నాం. ఇంద్రగంటితో ఓ మల్టీస్టారర్ సినిమా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దాగుడుమూతలు’ అనుకున్నాం. వర్క్ జరుగుతోంది. ఈ స్క్రిప్ట్ చేస్తామా? లేక వేరే చేస్తామా? అనేది ఓ పది రోజుల్లో తెలుస్తుంది. గల్లా అశోక్ సినిమా స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యింది. అక్టోబర్ లేదా సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతుంది. ► ఇక సినిమాల రిలీజ్ విషయానికొస్తే... నితిన్ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేస్తాం. వెంకటేశ్, వరుణ్‌తేజ్ మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ని సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నాం. రామ్ హీరోగా ‘çహలో గురు ప్రేమకోసమే’ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేస్తాం. మహేశ్ సినిమా ఏప్రిల్ 5న విడుదల అవుతుంది. మా ప్రొడక్షన్ హౌస్ ఓన్లీ టాలీవుడ్‌కే పరిమితం కాదు. 2020లో బాలీవుడ్లో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాం. నా విషయానికొస్తే... నో యాక్టింగ్ నో డైరెక్షన్. ఈ రెండు విషయాల్లో క్లారిటీ ఉంది. -
రాజ్ తరుణ్ ‘లవర్’
-
స్క్రీన్‌ప్లే.. డైరెక్షన్..సంజనారెడ్డి
టెక్కలి : ఆమె చదివిన చదువుకు, ఎంచుకున్న రంగానికి ఎటువంటి సంబంధం లేదు.. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఇజ్జువరం స్వగ్రామం.. అక్కడి నుంచి సమీప పట్టణమైన టెక్కలిలో స్థిర నివాసం.. డిగ్రీ వరకు అక్కడే కొనసాగిన చదువు.. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ కోర్సు పూర్తి చేసుకుని.. హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానం చివరకు వెండితెర వరకు వెళ్లింది. కొంతకాలం టీవీ చానెళ్లలో జర్నలిస్టుగా పనిచేస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ చివరకు మహిళా దర్శకుల జాబితాలో తనదైన స్థానం సంపాదించుకుని కళామతల్లి సాక్షిగా సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశారామె.. ఆమె మరెవరో కాదు దుక్క సంజనా రెడ్డి. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ రాజ్ తరుణ్, పూజిత, అమైరా దస్తూర్ నటీనటులుగా, రాజేంద్రప్రసాద్, సితార ప్రధాన పాత్రధారులుగా సంజనారెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించి తెరకెక్కిన రాజుగాడు సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె గురించి మరికొన్ని విశేషాలు.. రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో.. సినిమా రంగంలో రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో సంజనారెడ్డి దర్శకత్వం వైపు దృష్టి సారించింది. నటి అక్కినేని అమల ప్రోత్సాహంతో ఓ యాడ్ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా పని చేశారు. అనతి కాలంలోనే రాజ్‌తరుణ్ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించే చాన్స్ దక్కించుకున్నారు. కేవలం 42 రోజుల్లో సినిమాను పూర్తి చేసి చిత్ర పరిశ్రమలో ప్రముఖులతో శభాష్ అనిపించుకున్నారు. జూన్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ ఫిల్మ్ మేకర్ కావాలనే ఆశయం.. భవిష్యత్‌లో పురుషులతో సమానంగా సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ ఫిల్మ్ మేకర్ కావాలనే ఆశయం ఉందని సంజనారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎంచుకున్న సినిమా రంగంపై తనను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారని పేర్కొన్నారు. సందేశాత్మక, కమర్షియల్ సినిమాలు తీయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని చెప్పారు. కష్టపడే స్వభావంతో చేసే పనిపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చునని సంజనారెడ్డి తెలిపారు. కుటుంబ నేపథ్యం.. ఇజ్జువరం గ్రామానికి చెందిన దుక్క తులసీరెడ్డి, అరవిందాక్షి దంపతుల పెద్ద కుమార్తె సంజనారెడ్డి పదో తరగతి వరకు టెక్కలి బాలి కోన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత బీఎస్ అండ్ జేఆర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. అక్కడి నుంచి ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి కొంతకాలం టెక్కలి పరి సర ప్రాంతాల్లో ప్రైవేట్ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేశారు. జీవి తంలో ఏదో సాధించాలనే తపనతో కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులను అభ్యసించి హైదరాబాద్‌లో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యో గం సాధించారు. అక్కడితో తృప్తి చెందక ఎలక్ట్రానిక్ మీడి యా వైపు దృష్టి సారించారు. ఓవైపు చానెళ్లలో పనిచేస్తూ కొన్ని ఇంగ్లీష్ పత్రికలకు కవర్ స్టోరీలు రాసే అలవాటు చేసుకున్నారు. ఈ కోవలో సినీ పరిశ్రమలో ప్రముఖులను కలిసే అవకాశం లభించింది. ఇదే సమయంలో నటుడు మోహన్‌బాబు కుటుంబంతో సంజనారెడ్డికు పరిచయం ఏర్పడింది. రామ్‌గోపాలవర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు, జయసుధ, మంచు విష్ణు ప్రధాన పాత్రదారులుగా నిర్మించిన ‘రౌడీ’ సినిమా సెట్స్‌కు సంజనారెడ్డి అప్పుడప్పుడు వెళ్తుండేవారు. అప్పుడే ఫిల్మ్‌మేకింగ్ చేయాలనే ఆలోచన కలిగిం ది. ముంబై వెళ్లి కొద్ది రోజులు వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నెల రోజుల పాటు ఇతర దేశాల్లో సినిమా నిపుణులను కలిసి ఫిల్మ్ మేకింగ్‌లో మెలకువలు తెలుసుకున్నారు. -
వినోదాల రాజుగాడు
రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా మే 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ –‘‘రాజ్ తరుణ్ మా బ్యానర్లో చేస్తున్న నాలుగో చిత్రమిది. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్‌గారి కామెడీ ప్రత్యేక ఆకర్షణలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి విశేషమైన స్పందన రావడంతో పాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది.ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 11న రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం. మా బ్యానర్లో ‘రాజుగాడు‘ మరో హిట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నాగినీడు, రావురమేష్, పృథ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర–డా.లక్ష్మారెడ్డి. -
గుత్తిలో ‘లవర్’ షూటింగ్
అనంతపురం, గుత్తి : పట్టణంలోని ఎస్సీకాలనీ, కోట ప్రాం తంలో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘లవర్’ సినిమా షూటింగ్ గురువారం జరిగింది. హీరో రాజ్‌తరుణ్‌పై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. హీరోకు, విలన్, రౌడీలకు మధ్య ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేశారు. దర్శకుడిగా నితిష్, నిర్మాతగా దిల్ రాజు, కెమెరా మెన్‌గా సమీరా రెడ్డి వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల పాటు గుత్తిలోనే షూటింగ్ జరుగనుంది. గుత్తికి చెందిన వర్ధమాన సినీ హీరో సి. విజయభాస్కర్, గిల్లీ దండా (ఫేమ్) విలన్ శ్రీకరం నరేష్రాయల్, నటుడు హేమంత్ రాయల్ హీరో తరుణ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
గుత్తిలో సందడి చేసిన రాజ్ తరుణ్
సాక్షి, అనంతపురం: గుత్తిలో గురువారం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న లవర్ సినిమా షూటింగ్ చేశారు. పట్టణంలోని ఎస్సీ కాలనీ, కోట కింద భాగంలో హీరో రాజ్ తరుణ్‌పై పలు సన్నివేశాలు షూట్ చేశారు. ఓ ఇంటి వద్ద గొడవ జరుగుతున్న సమయంలో ఆ గొడవను సద్దుమణచడానికి హీరో అక్కడికి వచ్చే సీన్‌ను చిత్రీ కరించారు. అక్కడే హీరో రాజ్ తరుణ్‌కు, విలన్, రౌడీలకు మధ్య ఫైట్ చిత్రీ కరించారు. మూడు రోజుల పాటు గుత్తిలోనే షూటింగ్ జరుగనుంది. గుత్తికి చెందిన వర్దమాన సినీ హీరో సీ విజయభాస్కర్, గిల్లీ దండా(ఫేమ్) విలన్ శ్రీకరం నరేష్రాయల్, నటుడు హేమంత్ రాయల్లు హీరో తరుణ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లవర్ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. గుత్తిలో షూటింగ్ పూర్తి అయ్యాక తిరిగి అనంతపురంలో షూటింగ్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాకు నితిష్ దర్శకుడిగా,దిల్ రాజు నిర్మాతగా, సమీరా రెడ్డి కెమెరా మ్యాన్‌గా వ్యవహరిస్తున్నారు. -
‘రంగుల రాట్నం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
కన్నడంలో కుమారి
‘‘నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఐయామ్ ఎ ఫీమేల్. ఏం.. నన్ను లవ్ చేయటానికి నేను సరిపోనా. నా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కావాలా...’’ అంటూ ‘కుమారి 21ఎఫ్’ సినిమాలో హెబ్బా పటేల్ పలికిన సంభాషణలను ఎవరూ మర్చిపోలేరు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ‘కుమారి 21ఎఫ్’ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కన్నడంలో అదే టైటిల్‌తో రీమేక్ అయింది. హెబ్బా పటేల్ పోషించిన కుమారి పాత్రను నిధి కుశలప్ప పోషించారు. కుమారి బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ పాత్రలో ప్రణామ్ దేవరాజ్ నటించారు. అవినాష్, మనోజ్, అక్షయ్, రితేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను సంపత్ కుమార్, శ్రీధర్ సంయుక్తంగా నిర్మించగా శ్రీమన్ వేముల దర్శకత్వం వహించారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. -
అబ్బాయిలు.. అమ్మాయిలు కనెక్ట్ అవుతారు – రాజ్ తరుణ్
‘‘అందరికీ కనెక్ట్ అయ్యే కథ ‘రంగులరాట్నం’. లవ్ స్టోరీతో పాటు చిన్న చిన్న ఎమోషన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అని హీరో రాజ్‌తరుణ్ అన్నారు. రాజ్‌తరుణ్, చిత్రా శుక్లా జంటగా శ్రీ రంజని దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘రంగులరాట్నం’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ పంచుకున్న విశేషాలు. ► అన్నపూర్ణ వంటి పెద్ద బ్యానర్లో ‘ఉయ్యాల జంపాల’ తర్వాత రెండో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను తప్ప ఈ చిత్రంలో నటించిన వారందరూ దాదాపు కొత్తవారే. అయినా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ► ఈ చిత్రంలో నాది ఓ మధ్యతరగతి అబ్బాయి పాత్ర. బాధ్యతలు తక్కువగా ఉంటాయి. నా లుక్ ఈ సినిమాలో సహజంగా ఉంటుంది. అందరిలా సరదాగా కనిపిస్తాను. అబ్బాయిలకు, అమ్మాయిలకు ఈ సినిమా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆ పాయింట్ నచ్చి ఈ సినిమా చేశా. ► జీవితం రంగులరాట్నంలా తిరుగుతుంటుంది. మా సినిమాలో హీరో జీవితం కూడా అంతే. కథకు తగ్గ టైటిల్ అని ‘రంగులరాట్నం’ అని పెట్టాం. సినిమా చూశా. చాలా బాగుంది. చూస్తున్నంతసేపు హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ► శ్రీ రంజనిగారు సెల్వరాఘవన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. లేడీ డైరెక్టర్ అయినా అబ్బాయి మనస్తత్వం బాగా అర్థం చేసుకొని ఈ సినిమా తెరకెక్కించారు. తనకు కావాల్సింది బాగా రాబట్టుకున్నారు. ► ప్రతి ఏడాది సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. మా సినిమా వేరే చిత్రాలకు పోటీ అనుకోను. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా మాది. సెన్సార్ పూర్తి కాగానే విడుదల తేదీ ప్రకటిస్తాం. -
అప్పుడు ఉయ్యాల ఇప్పుడు రంగుల రాట్నం
మాస్‌కి ఈజీగా నచ్చేసే కుర్రాడు రాజ్ తరుణ్. మొదటి సినిమా ‘ఉయ్యాల జంపాల’తో మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా రాజ్ తరుణ్‌ని హీరోగా పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ మళ్లీ అతనితో ఓ సినిమా నిర్మించింది. ‘రంగుల రాట్నం’ పేరుతో శ్రీ రంజని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిత్రా శుక్లా హీరోయిన్. షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. సితార, ప్రియదర్శి ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: ఎల్.కె. విజయ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్. -
21ఎఫ్కి మించి
హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ‘కుమారి 21ఎఫ్’ వంటి యూత్‌ఫుల్ హిట్ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ – దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఎస్.ఆర్.టి ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి ఈ హిట్ కాంబినేషన్ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘దర్శకుడు చెప్పిన కథ విని బాగా ఎగై్జట్ అయ్యాను. ‘కుమారి 21ఎఫ్’ లాగే యూత్‌ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. 21ఎఫ్ మించిన స్థాయిలో ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. రామ్ తాళ్ళూరి ఇటీవలే రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ నటించిన ‘రాజుగాడు’ ఈ సంక్రాంతికి విడుదల కానుందట. -
హ్యాట్రిక్‌కి వర్మ రెడీ!
దర్శకుడిగా విరించి వర్మ వయసు నాలుగేళ్లే. తీసింది రెండు సినిమాలే. అయితేనేం... రెండూ హిట్సే. అతను తీసిన తొలి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’ హీరోగా రాజ్ తరుణ్‌కి మంచి పునాది వేయడంతో పాటు లో బడ్జెట్లో మంచి సినిమాలు తీయాలనుకునే నిర్మాతలకు ధైర్యాన్ని ఇచ్చింది! నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వం వహించిన రెండో సినిమా ‘మజ్ను’ మంచి హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ దర్శకుడు ముచ్చటగా మూడో సినిమా తీయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎం.ఎల్. కుమార్‌చౌదరి సమర్పణలో కీర్తీ కంబైన్స్, పద్మజా పిక్చర్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ‘‘యూత్‌ఫుల్, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథను విరించి వర్మ రెడీ చేశారు. తెలుగులోని ప్రముఖ యువహీరో ఈ సినిమాలో నటిస్తారు. ఆయనెవరు? ఇందులోని మిగతా నటీనటులు ఎవరు? సాంకేతిక నిపుణులు ఎవరు? అనే వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని కుమార్‌చౌదరి తెలిపారు. -
లాస్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్
సినీ తారలపై గాసిప్స్ సహజం. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్, యాంకర్ లాస్యను పెళ్లాడినట్టుగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం రాజ్ తరుణ్ తనదైన స్టైల్లో స్పందించాడు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వారిపై సెటైర్స్ వేశాడు. మీడియాలో వస్తున్న వార్తలపై తన ఫేస్బుక్ పేజ్‌లో స్పందించిన రాజ్ తరుణ్, 'కేవలం ఒక్కసారి కుమారి 21ఎఫ్ ఆడియో రిలీజ్లో కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దారులకు నా కృతజ్ఞతలు' అంటూ మొదలు పెట్టిన రాజ్ తరుణ్, ఇలా వెటకారంగా మాట్లాడుతున్నందుకు క్షమించాలని కోరాడు. అయితే ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేసేవారిపై ఇంతకన్నా ఎలా స్పదించాలో తనకు తెలియదన్నాడు. మరో మూడేళ్లలోపు తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తను పెళ్లి వార్తను తానే అందరికీ తెలియజేస్తానన్నాడు. రూమార్స్ అయినా.., నా గురించి ఆలోచించిన అందరికీ థ్యాంక్స్ అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నవారికి పంచ్ ఇచ్చాడు. -
కన్ఫ్యూజన్తో కామెడీ!
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘ఈడో రకం-ఆడో రకం’ తారాగణం: మంచు విష్ణు, రాజ్‌తరుణ్, సోనారిక, హెబ్బాపటేల్ మాటలు: డైమండ్ రత్నబాబు సంగీతం: సాయికార్తీక్ ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ నిర్మాత: రామబ్రహ్మం సుంకర దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి ఎడల్డ్, శ్లాప్‌స్టిక్ కామెడీ (ఓవర్ డోస్‌లో ఫన్నీ యాక్షన్స్), కన్ఫ్యూజన్ కామెడీ చిత్రాలు ఇప్పుడు హిందీ చిత్రసీమలో సర్వసాధారణం. ఆ కోవకు చెందిన ‘వెల్కమ్’, ‘హౌస్‌ఫుల్’, ‘గ్రాండ్ మస్తీ’ అక్కడి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ సక్సెస్ఫుల్ ఫార్ము లా స్ఫూర్తితో ఇప్పుడు తెలుగులో ఆ తరహా కథాంశాలను రూపొందించడానికి దర్శక-నిర్మాతలు సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన ‘ఈడోరకం-ఆడోరకం’ ఆ తర హా చిత్రమని చెప్పొచ్చు. ట్రైలర్లో కన్ఫ్యూజన్ కామెడీ అని హింట్ ఇచ్చి, దర్శక-నిర్మాతలు ఈ సినిమా గురించి ముందే క్లారిటీ ఇచ్చేశారు. ఇద్దరు జులాయి ఫ్రెండ్స్ ఒక పెళ్ళికి వెళ్ళి, అక్కడ హీరోయిన్ను చూసి, ఆ అమ్మాయి కోరికకు తగ్గట్లుగా మారడం కోసం ఆడిన ఒక అబద్ధం వల్ల... ఆ తరువాత ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో కామెడీగా చెప్పే కథ ఇది. పాత్రల మధ్య ఈ కన్ఫ్యూజన్ కామెడీ ఎంతవరకు నవ్వులు పూయించిందంటే... కథలో లాయర్ నారాయణ (రాజేంద్రప్రసాద్). అతని కొడుకు అర్జున్ (మంచు విష్ణు). బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చే స్తూ, తండ్రి చేతిలో తిట్లు తినడం మనవాడి డైలీ రొటీన్. అర్జున్ ఫ్రెండ్ అశ్విన్ (రాజ్‌తరుణ్). ఇతనూ అంతే! కామన్ ఫ్రెండ్ కిశోర్ (‘వెన్నెల’ కిశోర్) పెళ్లికి వెళ్లినప్పుడు నీలవేణి (సోనారిక)తో అర్జున్, సుప్రియ (హెబ్బా పటేల్)తో అశ్విన్ ప్రేమలో పడతారు. అనాథనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆమె ప్రేమను దక్కించుకోవడానికి తాను అనాథనని అబద్ధమాడి, మెల్లగా ప్రేమలోకి దించుతాడు మంచు విష్ణు. చివరికి రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ కలిసి వేరు కాపురం పెడదామనుకుంటారు. ఇళ్ల వేటలో తిరిగి, హీరోయిన్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటుంది. తీరా చూస్తే - అది హీరో ఇంటి పై పోర్షనే. ఇది ఊహించని ట్విస్ట్. అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మంచు విష్ణు తన ఫ్రెండైన రెండో హీరో రాజ్‌తరుణ్‌ని రంగంలోకి దింపుతాడు. హీరోయిన్‌కి భర్తగా ఇంట్లో అమ్మానాన్నలకు పరిచయం చేస్తాడు. అప్పటి నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో రాజ్తరుణ్కీ, రెండో హీరోయిన్‌కీ పెళ్లి. తాను డబ్బున్నవాడినని చెప్పడం కోసం మంచు విష్ణు తండ్రిని తన తండ్రిగా చెప్పుకుంటాడు రాజ్‌తరుణ్. రకరకాల అబద్ధాలతో కథను ముందుకు నడుపుతారు. ఈ క్రమంలో రెండు జంటలూ ఒకే ఇంట్లోకి చేరతాయి. ఫలితంగా ఒక హీరో పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మరొక హీరోకు భార్యగా నటించాల్సిన పరిస్థితి. మరి తమ అసలు రంగు బయటపడకుండా ఉండడం కోసం ఏం చేశారు? వీరు మిగతా పాత్రలకు సృష్టించిన ఈ కన్ఫ్యూజన్ చివరకు ఎలా క్లారిఫై అవుతుంది? అనేది మిగతా కథ. మొత్తం మీద, ఎడల్ట్ కామెడీని ఇష్టపడేవారికి నవ్వులకు కొదవలేని వెండితెర కథ. -
'ఈడో రకం ఆడో రకం' మూవీ రివ్యూ
టైటిల్: ఈడో రకం ఆడో రకం జానర్: కన్ఫ్యూజన్ కామెడీ తారాగణం: మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబాపటేల్, రాజేంద్ర ప్రసాద్, రవిబాబు సంగీతం: సాయి కార్తీక్ దర్శకత్వం: జి నాగేశ్వరరెడ్డి నిర్మాత: సుంకర రామబ్రహ్మం చాలాకాలంగా భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు మరోసారి తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్ సినిమా ఈడోరకం ఆడో రకంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరున్న జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్తో భారీ హిట్ మీద కన్నేశాడు. పంజాబీలో ఘనవిజయం సాధించిన సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువనటుడు రాజ్ తరుణ్ మరో హీరోగా నటించాడు. సీరియస్ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో మరోసారి కామెడీ టర్న్ తీసుకున్న మంచు విష్ణుకు ఈడోరకం ఆడోరకం ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది..? కథ : ప్రాక్టీసు ఉన్నా కేసులు లేని లాయర్ నారాయణ (రాజేంద్రప్రసాద్) చిన్నకొడుకు అర్జున్ (మంచు విష్ణు). ఆస్తిపాస్తులు లేని సీఐ కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) కొడుకు అశ్విన్ (రాజ్ తరుణ్). అర్జున్, అశ్విన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్, ఎలాంటి పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతూ టైం పాస్ చేసే ఈ ఇద్దరూ, ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లటంతో అసలు కథ మొదలవుతుంది. ఆ పెళ్లిలో అర్జున్, నీలవేణి (సోనారిక)ని, అశ్విన్, సుప్రియ (హేబాపటేల్)ని చూసి ఇష్టపడతారు. అయితే ఓ అనాథను మాత్రమే పెళ్లి చేసుకుంటాన్న నీలవేణిని ప్రేమలోకి దించటం కోసం తాను అనాథే అని నాటకం ఆడతాడు అర్జున్. అర్జున్ అనాథ అని నమ్మి అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పకుంటుంది. పెళ్లి విషయం మాట్లాడటానికి భూ కబ్జాలు, దందాలు చేసే తన అన్న గజన్న( అభిమన్యు సింగ్) దగ్గరకు తీసుకెళ్తుంది. అర్జున్, గజన్నకు కూడా నచ్చటంతో వెంటనే పెళ్లి చేసేస్తాడు గజన్న. తప్పనిసరి పరిస్థితుల్లో తన తండ్రి నారాయణకి విషయం చెప్పకుండానే అర్జున్ పెళ్లి చేసుకుంటాడు. అయితే గజన్న ఇంట్లో రౌడీల మధ్య ఉండటం ఇష్టం లేని నీలవేణి, బయట ఇల్లు అద్దెకి తీసుకోవాలనుకుంటుంది. అదే సమయంలో పేపర్ యాడ్ చూసి, అర్జున్ తండ్రి నారాయణ ఇంట్లో అద్దెకి దిగాలని నిర్ణయించుకుంటుంది. నారాయణ మాటతీరు, ఇల్లు నచ్చటంతో అర్జున్‌కి చెప్పకుండానే అడ్వాన్స్ కూడా ఇస్తుంది. అలా అదే ఇంట్లో టెనెంట్‌గా, ఇంటి ఓనర్ కొడుకుగా రెండు పాత్రలు చేయలేక అర్జున్ ఇబ్బంది పడటంతో సినిమాలో కన్ఫ్యూజన్ మొదలవుతోంది. ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అతడి ప్రేమ వ్యవహారం కూడా ఇరకాటంలో పడుతుంది. ఆస్తి పాస్తులున్న వాడికే తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లిచేస్తానన్న దత్తన్న (సుప్రీత్) కు తాను లాయర్ నారాయణ కొడుకునని పరిచయం చేసుకొని అతని చెల్లెలు సుప్రియను పెళ్లి చేసుకుంటాడు అశ్విన్. దీంతో అందరి రిలేషన్లు కన్ఫ్యూజన్లో పడతాయి. మరి ఈ కన్ఫ్యూజన్లన్నింటికీ క్లారిటీ ఎలా వచ్చింది. చివరకు అర్జున్ అనాథ కాదన్న విషయం తెలిసి నీలవేణి ఏం చేసిందన్నదే మిగతా కథ. నటీనటులు: మంచు విష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ హీరోలా కనిపిస్తూనే నవ్వులు పూయించాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా తనదైన నటనతో మెప్పించాడు. తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో సినిమాకు జోష్ తీసుకువచ్చాడు. ముఖ్యంగా ఇద్దరి హీరోల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. హీరోయిన్లుగా నటించిన సోనారికా, హేబాపటేల్ ఇద్దరూ నటనపరంగా పర్వాలేదనిపించినా అందాల ప్రదర్శనతో మాత్రం సినిమాకు గ్లామర్ తీసుకువచ్చారు. సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తండ్రి పాత్రలో మరోసారి తన మార్క్ చూపించాడు. ఇప్పటికీ తనలో కామెడీ టైమింగ్ అలాగే ఉందని ప్రూవ్ చేసిన రాజేంద్ర ప్రసాద్ సినిమాకు సక్సె లో కీరోల్ ప్లే చేశాడు. సాంకేతిక నిపుణులు : పంజాబీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించటంలో దర్శకుడు నాగేశ్వరరెడ్డి విజయం సాధించాడు. ముఖ్యంగా విష్ణులోని కామెడీ యాంగిల్‌ను పర్ఫెక్ట్గా వాడుకున్న దర్శకుడు సినిమాను ఎంటర్టైనింగ్గా తెరకెక్కించాడు. కన్ఫ్యూజన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఏ మాత్రం పట్టుతప్పినా ఆడియన్స్‌కు కథ అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి టిపికల్ సబ్జెక్ట్‌ను పర్ఫెక్ట్గా డీల్ చేయటంలో సక్సెస్ సాధించాడు. సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాయి కార్తీక్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. మాస్ పాటలతో ఆకట్టుకున్న సాయి కార్తీక్, నేపథ్య సంగీతంతోనూ మెప్పించాడు. ప్లస్ పాయింట్స్ : మంచు విష్ణు, రాజ్ తరుణ్ రాజేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు లేకపోవటం ట్యాగ్‌లైన్: ఈ సినిమా.. ఓవరాల్‌గా యూత్‌ని ఆకట్టుకునే సక్సెస్ఫుల్ కామెడీ - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
సాయి ధరమ్ ప్లేస్‌లో రాజ్ తరుణ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి వరుస హిట్స్‌తో హ్యాట్రిక్ సాధించాడు రాజ్ తరుణ్ . అయితే నాలుగో సినిమాగా వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఫ్లాప్ అయినా రాజ్ తరుణ్ జోరుకు మాత్రం బ్రేక్ పడలేదు. తాజాగా ఓ స్టార్ వారసుడు చేయాల్సిన సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ హీరోగా మూడో సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు, శతమానంభవతి పేరుతో మరో సినిమాను కూడా ప్లాన్ చేశాడు. అచ్చమైన తెలుగు కథతో తెరకెక్కనున్న ఈ సినిమా మరోసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సక్సెస్ ఇస్తుందని భావించాడు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోగా సాయికి బదులుగా రాజ్ తరుణ్‌ను ఎంపిక చేశాడట. ప్రముఖ రచయిత వేగ్నేష్ సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాలో ఓ కీలక పాత్రల్లో నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రారంభించి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. -
ఆ కథ ముందుగా బన్నీకే చెప్పా!
‘‘‘ఉయ్యాల జంపాల’ చూశాక రాజ్‌తరుణ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ కథ రాసుకున్నా. అతను గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సినిమా సెట్స్‌పైకి వచ్చింది. నేను ఏ ప్రేక్షకులను టార్గెట్ చేసి తీశానో, వారికి బాగా నచ్చుతోంది’’ అని శ్రీనివాస్ గవిరెడ్డి అన్నారు. తొలి ప్రయత్నంగా శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు... చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. చిరంజీవిగారి నటన చూస్తూ పెరిగా. నాన్నేమో సినిమాల్లోకెళితే పనికిరాననీ, అమ్మయితే పైకొస్తా వనీ నమ్మేది. నా ఆకాంక్ష నెరవేర్చుకోడానికి హైదరాబాద్‌లో అడుగు పెట్టా. శ్రీకాంత్ నటించిన ‘నగరం’కి సహాయ ద ర్శకునిగా చేశాను. బన్నీకి కలిసి కథ చెప్పాలన్న ప్రయత్నంతో నా జీవితం యూటర్న్ తీసుకుంది. ప్రస్తుతం ఆది హీరోగా రూపొందిన ‘గరం’ కథ ముందు అల్లు అర్జున్‌కే వినిపించాను. ఈ సినిమా చేయకపోయినా బన్నీ నాకు ఆర్థికంగా సహకారం అందించారు. ఆయన దగ్గరే కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేశా. ‘గరం’కి కథ, మాటలు నావే. భవిష్యత్తులో అల్లు అర్జున్‌తో సినిమా చేసే రోజు వస్తుందన్న నమ్మకముంది. -
నవ్వించడానికి రెడీ!
మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నవ్వించడానికి రెడీ అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ‘ఎ’ టీవీ సమర్పణలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు సరసన సోనారిక, రాజ్‌తరుణ్ సరసన హెబ్బా పటేల్ నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించనున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు మోహన్‌బాబు సతీమణి నిర్మల కెమెరా స్విచాన్ చేయగా, మోహన్‌బాబు క్లాప్‌నిచ్చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘నాగేశ్వరరెడ్డి మార్కు కామెడీ తో ఈ చిత్రం ఉంటుంది. ఏప్రిల్ 14న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సిద్ధార్థ రామస్వామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గరికపాటి కిషోర్. -
ఆ హీరో శాలరీ కోటి రూపాయలు!
హైదరాబాద్ : దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న సామెత తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. నిన్న మొన్నటి వరకూ లక్షల్లో పారితోషికం తీసుకునే ఈ హీరో తాజాగా కోటి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన రాజ్ తరుణ్ ...ఇప్పుడు చిన్న నిర్మాతల పాలిట మినిమమ్ గ్యారంటీ 'హీరో'గా మారాడు. డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ సారథ్యంలో ఇటీవల విడుదలైన 'కుమారి 21 ఎఫ్' చిత్రం విజయంతో రాజ్ తరుణ్ కోటి క్లబ్‌లోకి చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి గానూ ఈ యువ హీరో రూ.25 లక్షలు తీసుకున్నాడు. బ్యానర్‌తో పాటు టాప్ టెక్నిషియన్లు ఉండటంతో రాజ్ తరుణ్ తన రేటును తగ్గించినట్లు తెలుస్తోంది. ఇక 'సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు' సినిమా నుంచే రాజ్ తరుణ్ కోటి రెమ్యునరేషన్ ను అప్లయి చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాంగోపాల్ వర్మ, వంశీ దర్శకత్వంలో అతడు నటిస్తున్నాడు. కాగా కుమారి 21 ఎఫ్ సక్సెస్‌తో రాజ్ తరుణ్‌కు టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అతడి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీంతో రాజ్ తరుణ్ తన పారితోషకాన్ని అమాంతం పెంచేశాడు. -
అక్టోబర్30న రానున్న 'కుమారి 21F'
-
‘సినిమా చూపిస్త మావ!’ ప్రెస్ మీట్
-
ఉయ్యాల...జంపాల
అక్కినేని నాగార్జున, డి.సురేశ్‌బాబు, ‘అష్టా చమ్మా’ ఫేమ్ పి.రామ్మోహన్... ఈ ముగ్గురూ కలిసి సినిమా చేయడమే ఒక ఆసక్తికర అంశమైతే, అంతా కొత్త టీమ్‌తో ఈ సినిమా నిర్మించడం ఇంకా ఆసక్తి కలిగించే విషయం! ఇన్ని ఆసక్తులకు నెలవుగా నిలిచిన సినిమా ‘ఉయ్యాల జంపాల’. విరించి వర్మ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో ప్రాచుర్యం పొందిన ఆనంది, రాజ్‌తరుణ్ ఇందులో నాయికా నాయకులు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. నిర్మాతల్లో ఒకరైన రామ్మోహన్.పి మాట్లాడుతూ -‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ నెలలో పాటలను త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వ డి.బి., సంగీతం: సన్నీ ఎం.ఆర్, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాతలు: నాగార్జున, రామ్మోహన్ పి.