
సాక్షి, అనంతపురం: గుత్తిలో గురువారం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న లవర్ సినిమా షూటింగ్ చేశారు. పట్టణంలోని ఎస్సీ కాలనీ, కోట కింద భాగంలో హీరో రాజ్ తరుణ్‌పై పలు సన్నివేశాలు షూట్ చేశారు. ఓ ఇంటి వద్ద గొడవ జరుగుతున్న సమయంలో ఆ గొడవను సద్దుమణచడానికి హీరో అక్కడికి వచ్చే సీన్‌ను చిత్రీ కరించారు. అక్కడే హీరో రాజ్ తరుణ్‌కు, విలన్, రౌడీలకు మధ్య ఫైట్ చిత్రీ కరించారు.
మూడు రోజుల పాటు గుత్తిలోనే షూటింగ్ జరుగనుంది. గుత్తికి చెందిన వర్దమాన సినీ హీరో సీ విజయభాస్కర్, గిల్లీ దండా(ఫేమ్) విలన్ శ్రీకరం నరేష్‌రాయల్, నటుడు హేమంత్ రాయల్‌లు హీరో తరుణ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లవర్ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. గుత్తిలో షూటింగ్ పూర్తి అయ్యాక తిరిగి అనంతపురంలో షూటింగ్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాకు నితిష్ దర్శకుడిగా,దిల్ రాజు నిర్మాతగా, సమీరా రెడ్డి కెమెరా మ్యాన్‌గా వ్యవహరిస్తున్నారు.