రాజ్ తరుణ్-లావణ్య వివాదం రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుంది. తాజాగా లావణ్యపై నార్సింగ్ పోలీసులకు ప్రీతి ఫిర్యాదు చేసింది. తమకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని ఆమె ఆరోపించింది. తమతో పాటు చాలామంది ఆడపిల్లలకు ఆమె డ్రగ్స్ ఇచ్చారని ఫిర్యాదులో తెలిపింది. ఆమె వల్ల చాలామంది జీవితాలు నరకంగా మారాయని ఆరోపించింది. ప్రీతి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని ఎస్‌ఐ సుఖేందర్‌రెడ్డి తెలిపారు.
ఇదే సమయంలో తాజాగా లావణ్య గురించి రాజ్ తరుణ్ లాయర్ ముధు శర్మ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లావణ్య డ్రగ్స్‌కు అలవాటు పడటమే కాకుండా అనేకమందికి అందించింది. దానిని అడ్డుకునేందుకు రాజ్ తరుణ్ చాలాసార్లు ప్రయత్నించాడు. అమె నిరాకరించింది. లావణ్యకు దూరంగా ఉంటూ వచ్చిన రాజ్ తరుణ్‌పై కక్ష పెంచుకుంది. అందుకే ఇలాంటి డ్రామాలు చేస్తుంది. లావణ్యకు డ్రగ్స్ మూఠాతో సంబంధాలు ఉన్నాయి. వారు డ్రగ్స్ ఎక్కడ తెస్తారు వంటి పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అవన్నీ పోలీసులకు అందిస్తాం.
డ్రగ్స్ మత్తులో ఉన్న ఆడపిల్లలపై న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి ఆపై వారి తల్లిదండ్రుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ వివరాలు పూర్తి స్ధాయిలో రాబోతున్నాయి. లావణ్య ఉచ్చులో చిక్కుకొని డ్రగ్స్‌కు అలవాటు పడి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. త్వరలో వారందరూ బయటకు వస్తారు. డ్రగ్స్ గురించి రాజ్ తరుణ్ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. దీంతో లావణ్య నుంచి ఆయనకు ప్రాణహాని ఉంది. రాజ్ తరుణ్ జీవితం మరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా కాకుండా చూసుకోవాలి. అని లాయర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment