lavanya
-
ఆటల కుటుంబం!
ఆటలంటే బలం. కుటుంబం అంటే అమోఘ బలం. ఫ్యామిలీకి ఆటలు తోడైతే... ఆ బలం చెప్పలేనంత! 63 సంవత్సరాల కందుకూరి లావణ్య, ఆమె భర్త 69 సంవత్సరాల నాగేశ్వరరావు అథ్లెటిక్స్‌లో రాణిస్తూ ‘ఆహా’ అనిపిస్తున్నారు. తల్లిదండ్రుల బాటలోకి వచ్చిన 35 సంవత్సరాల అపర్ణ ఆటల్లో విజయకేతనం ఎగరేస్తోంది. ‘ఆటలకు వయసు అడ్డు కాదు’ అంటూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్న కందుకూరి కుటుంబం గురించి..విశాఖ జిల్లా భీమిలికి చెందిన లావణ్య చిన్నప్పటి నుంచే పరుగు పందేలలో పాల్గొనేది. షటిల్, రింగ్టెన్నిస్ బాగా ఆడేది. నాగేశ్వరరావుకు కూడా ఆటలంటే ఇష్టం. కబడ్డీ నుంచి షటిల్ వరకు ఎన్నో ఆటల్లోప్రావీణ్యం సంపాదించాడు. భార్యాభర్తలిద్దరికీ ఆటలంటేప్రాణం కావడంతో ఇంటినిండా ఆటల కబుర్లే!ఆటలకు సంబంధించి తమ చిన్ననాటి విశేషాలను ఒకరితో ఒకరు పంచుకునేవారు. ‘ఆరోజులు మళ్లీ వస్తే బాగుణ్ణు’ అనుకునేవారు. ‘చరిత్ర పునరావృతమవుతుంది’ అంటారు కదా! ‘ఆంజనేయా వెటరన్స్ అసోసియేషన్’ పుణ్యమా అని అలాగే జరిగింది. భీమిలిలో కోనాడ జయరాముడు అనే వెటరన్ క్రీడాకారుడు ఏర్పాటు చేసిన ‘ఆంజనేయా వెటరన్స్ అథ్లెట్ అసోసియేషన్ ’లో లావణ్య, నాగేశ్వరరావు సభ్యులుగా చేరారు. విశాఖలోని ‘మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ’లో సభ్యత్వం తీసుకున్నారు. అలా... మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగు పెట్టే అపూర్వ అవకాశం వచ్చింది. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలైంది.విజయపరంపరకరీంనగర్లో జరిగిన 800,1500 మీటర్ల పరుగు పందెంలో లావణ్య ప్రథమ స్థానంలో, నాగేశ్వరరావు ద్వితీయ స్థానంలో నిలిచారు. మహబూబ్‌నగర్, గుంటూరులో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచారు. చెన్నైలో జరిగిన జాతీయ పోటీల్లో 800, 1500 మీటర్ల పరుగులో ప్రథమ, 5 కిలోమీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో నిలిచింది లావణ్య. బెంగళూరులో జరిగిన 800, 1500 మీటర్ల పరుగులో భార్యాభర్తలిద్దరూ ప్రథమ స్థానంలో నిలిచారు. 200 మీటర్ల హర్డిల్స్‌లో ద్వితీయస్థానంలో నిలిచారు. చండీగఢ్, భోపాల్, హరియాణా కురుక్షేత్రలో జరిగిన పోటీల్లోనూ విజయకేతనం ఎగరేశారు.అంతర్జాతీయ స్థాయిలో...లావణ్య మరో అడుగు ముందుకు వేసి అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటుతోంది. చైనాలో జరిగిన పోటీలతో అంతర్జాతీయ పోటీల్లోకి అడుగుపెట్టింది. 800 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో నిలిచింది. శ్రీలంకలో 400, 800, 1500 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్‌లో పది వేల మీటర్ల పరుగులో ప్రథమ స్థానంలో నిలిచింది, సింగపూర్, థాయ్‌లాండ్‌లో జరిగిన పోటీల్లోనూ పాల్గొంది.కూతురు కూడా...లావణ్య కుమార్తె అపర్ణకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. రన్నింగ్‌తో పాటు వాలీబాల్‌లో ప్రతిభ చూపేది. పెళ్లి తరువాత ఆటలకు దూరమైంది. అయితే తల్లిదండ్రుల స్ఫూర్తితో 35 సంవత్సరాల అపర్ణ ‘విశాఖ అథ్లెటిక్స్ అసోసియేషన్ ’లో సభ్యత్వం తీసుకుంది. తల్లి,కూతుళ్లు కలిసి తొలిసారిగా గత నెలలో అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో పాల్గొన్నారు.లావణ్య 100, 800మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అయిదు కిలోమీటర్ల పరుగు పందెంలో అపర్ణ ప్రథమ స్థానం, 100 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇకపై తల్లితండ్రులతో కలిసి పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది అపర్ణ. – సింగారెడ్డి రమణ ప్రసాద్, సాక్షి, భీమిలిఅమ్మతో పాటు...అమ్మానాన్నలు ఒకరికొకరు స్ఫూర్తి. వారి నుంచి నేను స్ఫూర్తి పొంది 35 సంవత్సరాల వయసులో ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టాను. అమ్మతో పాటు పోటీల్లో పాల్గొనడం, విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఉత్సాహం ఉండాలేగానీ ఆటలకు వయసు ఎప్పుడూ అడ్డు కాదు. – అపర్ణకొత్త ప్రపంచంలోకి...ఆటల వల్ల కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. దేశంలోని ఎన్నోప్రాంతాలతోపాటు విదేశాలకు వెళ్లగలిగాను. ‘ఈ వయసులో ఆటలు ఎందుకు?’ అని నా భర్త నాగేశ్వరరావు అని ఉంటే నేను ఇంటికే పరిమితమయ్యేదాన్ని. ఆయన నన్ను ఎంతో ఉంది. – కందుకూరి లావణ్య -
మస్తాన్ సాయి కుటుంబాన్ని దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని డిమాండ్
-
మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్,సాక్షి,: లావణ్య, రాజ్ తరుణ్‌ల వివాదం తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, మస్తాన్ సాయి (Mastan Sai Case) నిందితుడిగా ఉన్న ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మస్తాన్ సాయి కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు చేరింది. మస్తాన్ సాయి కేసు విషయమై లావణ్య తరుఫు న్యాయవాది నాగూర్‌బాబు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. దర్గా ప్రతిష్టతకు భంగం..ధర్మకర్త కుమారుడైన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర, భద్రతకు, భంగం వాటిల్లుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ లేఖలో న్యాయవాది ప్రస్తావించారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందని లేఖలో తెలిపారు. అందుకే, మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి, ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నిర్వహించాలని లేఖలో వివరించారు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలు లేఖలో లావణ్య తరుఫు న్యాయవాది నాగూర్ బాబు వెల్లడించారు. -
మస్తాన్ సాయి విచారణలో విస్తుపోయే నిజాలు
మణికొండ: రెండు రోజులుగా పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొన్న మస్తాన్‌సాయిని(Mastan Sai Case) శనివారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మస్తాన్ సాయి యువతులకు పార్టీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ ఇవ్వటం, వారు మత్తులోకి జారుకున్న తర్వాత వారిపై లైంగికదాడికి పాల్పడటం, దానిని సీక్రెట్ కెమెరాలు, సెల్ఫోన్ల వీడియా తీసి రికార్డు చేయటం, వాటిని ఆధారంగా చేసుకుని యువతులను పలుమార్లు బ్లాక్మెయిల్ చేయడం చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. అదే కోవలో సినీహీరో రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య సైతం అతని ఉచ్చులో చిక్కుకుంది. అతని వద్ద తన వీడియోలు ఉన్న హార్డ్డెస్్కను తస్కరించిన ఆమె దాని ఆధారంగా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన హార్డ్డెస్క్ తిరిగి ఇవ్వాలని మస్తాన్‌సాయి లావణ్యను బెదిరించడమేగాక తనతో పాటు తన ఇంటిపై దాడి చేశాడని, తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇంటికి వచ్చిన సమయంలో మస్తాన్ సాయితో పాటు అతడి స్నేహితుడు ఖాజా మెయినుద్దీన్ డ్రగ్స్ తీసుకుని ఉండటంతో పరీక్షలు నిర్వహించిన పోలీసులు నార్కోటిక్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ నెల 2న అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్దేశపూర్వకంగానే నేరాలు... మస్తాన్‌సాయిని నార్సింగి పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారించటంతో అతను ఉద్దేశపూర్వకంగానే యువతులకు డ్రగ్స్ ఇవ్వటం, నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటం లాంటి చర్యలు ఉద్దేశ పూర్వకంగానే చేశానని అంగీకరించినట్టు తెలిసింది. తల్లితండ్రుల అతి గారాబం కారణంగా ఉన్నత చదువులు చదువుకున్నా వక్రమార్గంలో పయనించినట్లు పోలీసులు గుర్తించారు. తన భార్య, గర్ల్ ఫ్రెండ్స్, ఇతర యువతులను నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డుపెట్టి బ్లాక్ మెయిల్ చేయడం అతడి నైజంగా పోలీసులు గుర్తించారు. తను చేసిన నేరాలను విచారణలో అంగీకరించటంతో అదే నివేదికను కోర్టుకు అందించినట్లు తెలిసింది. -
నాకు తెలియకుండా మస్తాన్ సాయి వీడియో తీశాడు
-
రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటా: లావణ్య
సాక్షి, హైదరాబాద్: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసింది. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.ఈ క్రమంలో లావణ్య.. ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని ఆమె తెలిపారు. ‘‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలి’’ అని లావణ్య కోరారు.‘‘యువతులు వీడియోలు ఎక్కడ అమ్ముతున్నాడో పోలీసులు తేల్చాలి. నేను రాజ్ తరుణ్ కోసం ఒంటరి పోరాటం చేశాను. నేను సహాయం కోసం మాత్రమే కొందరితో పర్సనల్ గా మాట్లాడాను. నేను నా కేసులో ఏమవుతుందో తెలుసుకోవడం కోసమే వేరే వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడాను. రాజ్ తరుణ్ ఇప్పుడు వచ్చిన కాళ్ళు మొక్కుతాను. నేను మస్తాన్ సాయి నుంచి బయటపడితే చాలు’’ అంటూ లావణ్య వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. సంచలన విషయాలు వెల్లడి -
మస్తాన్ సాయి చుట్టూ పోలీస్ ఉచ్చు
-
లావణ్య నిజస్వరూపం మరోసారి బయటపెట్టిన శేఖర్ బాషా..
-
హార్డ్ డిస్క్ లో 300ల వీడియోలు.. లావణ్యపై శేఖర్ బాషా కుట్ర
-
లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది.మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టు ప్రకారం..‘మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశాడు. అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్‌ను కూడా పోలీసులు జత పరిచారు. మస్తాన్ సాయి ల్యాప్‌టాప్‌లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్‌తరుణ్ గతంలోనే తొలగించాడు. అయితే, ఆలోపే ఇతర డివైస్లలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. లావణ్యను పలు మార్లు చంపేందుకు అతడు యత్నించాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.వెలుగులోకి వస్తున్న ఆకృత్యాలు.. కొన్నేళ్లుగా మస్తాన్‌సాయి పబ్‌లు, వీఐపీ పార్టీలలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్‌లు, ఫోన్ రికార్డింగులను హార్డ్ డిస్క్‌లో భద్రపరిచాడు. ఆ హార్డ్ డిస్క్‌ను మస్తాన్‌సాయి ఇంటినుంచి తీసుకున్న లావణ్య.. పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్‌సాయి తన ఇంటిపై దాడిచేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..కాగా, లావణ్యను డ్రగ్స్ కేసులో మరోమారు ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌బాషా యత్నిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది నాగూర్‌బాబు ఆరోపించారు. వారి మధ్య జరిగిన సంభాషణ రికార్డులను మంగళవారం పోలీసులకు అందించామని తెలిపారు. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి, ఇంట్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించాలనే పథకం వేశారని ఆరోపించారు. ఆ వివరాలన్నీ పోలీసులకు అందించి చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. -
నేరాలను ఒప్పు కున్న మస్తాన్ సాయి
-
మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్
-
రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ, పెళ్లి, పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసిన మాస్తాన్ సాయికి ఉచ్చు బిగ్గుస్తోంది. మరోసారి మస్తాన్ సాయిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడానికి నార్సింగ్ పీఎస్‌కి లావణ్య వచ్చింది. మస్తాన్ సాయి కేసులో మరోసారి డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేం ఆర్జే శేఖర్ బాషాపై లావణ్య ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని లావణ్య అంటోంది. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది.మస్తాన్ సాయి, శేఖర్ బాషా మాట్లాడుకున్న ఆడియోలను పోలీసులకు అందజేసింది. తనతో పాటు మరో యువతిని కూడా ఇరికించే ప్లాన్ చేశారని లావణ్య అంటోంది. 150 గ్రాముల ఎండీఎంఏ తెస్తానని శేఖర్ బాషాతో మస్తాన్ సాయి చెప్పాడు. ‘‘లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయమని, పార్టీలో డ్రగ్స్ పెట్టి లావణ్యను, మరో యువతిని ఇరికిద్దామని మస్తాన్ సాయి, శేఖర్ బాషా సంభాషణల’’ ఆడియో క్లిప్‌ను పోలీసులకు లావణ్య అందజేసింది.కాగా, సినీ హీరో రాజ్ తరుణ్ భార్య లావణ్యపై హత్యాయత్నం జరిగింది. గతంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న, గుంటూరులో నమోదైన ఆ కేసులో నిందితుడిగా ఉన్న రావి బావాజీ మస్తాన్ సాయి ఈ దారుణానికి తెగపడ్డాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు సోమవారం మస్తాన్‌ను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన గుంటూరు వాసి షేక్ ఖాజా మొయినుద్దీన్‌కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... లావణ్యకు మస్తాన్ సాయితో 2022లో పరిచయమైంది.ఆమెతో పలు సందర్భాల్లో వీడియో కాల్స్ మాట్లాడిన మస్తాన్ దాదాపు 40 కాల్స్ రికార్డు చేశాడు. 2023లో గుంటూరులో జరిగిన మస్తాన్ సోదరి వివాహానికి అతడు ఆహ్వానించడంతో లావణ్య వెళ్లింది. ఆ సందర్భంలో ఆమె తన వీడియోల విషయం ప్రశ్నించగా... తీవ్రంగా దాడి చేసిన మస్తాన్ ఆమెపై లైంగిక దాడికీ పాల్పడ్డాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని రాజ్‌తరుణ్‌కు ఫోన్ ద్వారా చెప్పారు. తాను హీరోగా ఉన్నానని, తన పేరు బయటకు రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతడు అనడంతో లావణ్య అక్కడి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్‌పై కేసు నమోదైంది.ఆడవాళ్ల జీవితాలతో...ఇదిలా ఉండగా... మస్తాన్ సాయి అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని, స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వారికి వల వేస్తున్నాడని లావణ్యకు తెలిసింది. మరికొందరి ఫోన్లు హ్యాక్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడినట్లు ఆమె దృష్టికి వచ్చింది. అలా సంగ్రహించిన, రికార్డు చేసిన వందలాది నగ్న వీడియోలు, కాల్ రికార్డులను 4 టీబీ సామర్థ్యం కలిగిన హార్డ్‌డిస్క్‌లో మస్తాన్ దాచినట్లు గమనించింది. ఇటీవల మస్తాన్ సాయి ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ హార్డ్‌డిస్క్‌ను తన అధీనంలోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆ హార్డ్‌డిస్క్ కోసం మస్తాన్ అనేక రకాలుగా లావణ్యపై ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల 31న మరికొందరితో కలిసి లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెపై దాడికి యత్నించాడు.మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు టీవీ, సీసీ కెమెరాలు సహా అనేక వస్తువులు ధ్వంసం చేశాడు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ రోజు తన స్నేహితురాలి దగ్గర ఆశ్రయం పొంది అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై ఆదివారం రాత్రి మరోసారి డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెతో పాటు ఆమె సోదరుడినీ నిర్బంధించాడు. లావణ్య గొంతు నులిమి హత్యాయత్నం చేసి, ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్ తదితరాలను బలవంతంగా లాక్కున్నాడు. ఆ సమయంలో అతడి వెంట ఖాజా, మరొకరు కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మరో ప్రముఖ హీరో పేరు..సోమవారం మస్తాన్‌ను అరెస్టు చేసి జ్యుడీషి యల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు ఖాజాకు నోటీసులు జారీ చేశారు. మస్తాన్ వద్ద ఉన్న బ్యాగ్ నుంచి హార్డ్డిస్్క, ల్యాప్‌టాప్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నార్సింగి పోలీసులకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో మరో ప్రముఖ హీరో పేరునూ ప్రస్తావించారు. మస్తాన్‌సాయి ఇంట్లో నుంచి తెచ్చిన హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు ప్రయత్నించారని, తనకు ప్రాణహాని ఉందని లావణ్య అన్నారు.సోమవారం ఆమె నార్సింగి పోలీస్‌స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, మస్తాన్‌సాయితో పాటు అతని తండ్రి తనను చంపేందుకు చూస్తున్నారని, ఇప్పటికే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇన్ని రోజులు తన వద్ద సరైన సాక్ష్యాధారాలు లేక మిన్నకున్నానని, ఇప్పుడు పూర్తి వివరాలతో మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పుడు కూడా కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మస్తాన్‌సాయిపై ఆదివారం ఇచ్చిన ఫిర్యాదుపై స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు పిలిపించారని, వారు అడిగిన వివరాలను ఇచ్చానని ఆమె వివరించారు. -
ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాలయిను ట్రాప్ చేసిన మస్తాన్‌సాయి
-
రాజ్‌తరుణ్ భార్య లావణ్యపై హత్యాయత్నం
మణికొండ: సినీ హీరో రాజ్ తరుణ్ భార్య లావణ్యపై హత్యాయత్నం జరిగింది. గతంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న, గుంటూరులో నమోదైన ఆ కేసులో నిందితుడిగా ఉన్న రావి బావాజీ మస్తాన్ సాయి ఈ దారుణానికి తెగపడ్డాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు సోమవారం మస్తాన్‌ను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన గుంటూరు వాసి షేక్ ఖాజా మొయినుద్దీన్‌కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... లావణ్యకు మస్తాన్ సాయితో 2022లో పరిచయమైంది.ఆమెతో పలు సందర్భాల్లో వీడియో కాల్స్ మాట్లాడిన మస్తాన్ దాదాపు 40 కాల్స్ రికార్డు చేశాడు. 2023లో గుంటూరులో జరిగిన మస్తాన్ సోదరి వివాహానికి అతడు ఆహ్వానించడంతో లావణ్య వెళ్లింది. ఆ సందర్భంలో ఆమె తన వీడియోల విషయం ప్రశ్నించగా... తీవ్రంగా దాడి చేసిన మస్తాన్ ఆమెపై లైంగిక దాడికీ పాల్పడ్డాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని రాజ్‌తరుణ్‌కు ఫోన్ ద్వారా చెప్పారు. తాను హీరోగా ఉన్నానని, తన పేరు బయటకు రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతడు అనడంతో లావణ్య అక్కడి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్‌పై కేసు నమోదైంది. హార్డ్‌డిస్క్ లో నగ్నవీడియోలు, కాల్ రికార్డింగ్‌లు.. ఇదిలా ఉండగా... మస్తాన్ సాయి అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని, స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వారికి వల వేస్తున్నాడని లావణ్యకు తెలిసింది. మరికొందరి ఫోన్లు హ్యాక్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడినట్లు ఆమె దృష్టికి వచ్చింది. అలా సంగ్రహించిన, రికార్డు చేసిన వందలాది నగ్న వీడియోలు, కాల్ రికార్డులను 4 టీబీ సామర్థ్యం కలిగిన హార్డ్‌డిస్క్‌లో మస్తాన్ దాచినట్లు గమనించింది. ఇటీవల మస్తాన్ సాయి ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ హార్డ్డిస్్కను తన అధీనంలోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆ హార్డ్‌డిస్క్ కోసం మస్తాన్ అనేక రకాలుగా లావణ్యపై ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల 31న మరికొందరితో కలిసి లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెపై దాడికి యత్నించాడు.టీవీ, సీసీ కెమెరాలు సహా అనేక వస్తువులు ధ్వంసం చేశాడు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ రోజు తన స్నేహితురాలి దగ్గర ఆశ్రయం పొంది అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై ఆదివారం రాత్రి మరోసారి డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెతో పాటు ఆమె సోదరుడినీ నిర్బంధించాడు. లావణ్య గొంతు నులిమి హత్యాయత్నం చేసి, ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్ తదితరాలను బలవంతంగా లాక్కున్నాడు. ఆ సమయంలో అతడి వెంట ఖాజా, మరొకరు కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం మస్తాన్‌ను అరెస్టు చేసి జ్యుడీషి యల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు ఖాజాకు నోటీసులు జారీ చేశారు. మస్తాన్ వద్ద ఉన్న బ్యాగ్ నుంచి హార్డ్డిస్్క, ల్యాప్‌టాప్ తదితరాలు స్వా«దీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషి ంచిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నార్సింగి పోలీసులకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో మరో ప్రముఖ హీరో పేరునూ ప్రస్తావించారు. నాకు ప్రాణహాని ఉంది: లావణ్య మస్తాన్‌సాయి ఇంట్లో నుంచి తెచ్చిన హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు ప్ర యత్నించారని, తనకు ప్రాణహాని ఉందని లావణ్య అన్నారు. సోమవారం ఆమె నార్సింగి పోలీస్‌స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, మస్తాన్‌సాయితో పాటు అతని తండ్రి తనను చంపేందుకు చూస్తున్నారని, ఇప్పటికే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇన్ని రోజులు తన వద్ద సరైన సాక్ష్యాధారాలు లేక మిన్నకున్నానని, ఇప్పుడు పూర్తి వివరాలతో మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పుడు కూడా కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయతి్నస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మస్తాన్‌సాయిపై ఆదివారం ఇచ్చిన ఫిర్యాదుపై స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు పిలిపించారని, వారు అడిగిన వివరాలను ఇచ్చానని ఆమె వివరించారు. -
మస్తాన్ సాయి పెన్ డ్రైవ్ లో బడా స్టార్ల ప్రైవేట్ వీడియోలు
-
మస్తాన్ సాయి అరెస్ట్.. లావణ్య ఫిర్యాదులో సంచలన విషయాలు!
రాజ్ తరుణ్- లావణ్య వివాదం టాలీవుడ్లో సంచలనంగా సృష్టించింది. గతేడాది ఒకరిపై ఒకరు కేసులతో పాటు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. తాము విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అని నార్సింగి పోలీసులకు తాజాగా లావణ్య ఫిర్యాదు చేసింది. ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.ఫిర్యాదులో సంచలన విషయాలు..మస్తాన్ సాయిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదులో లావణ్య ోసంచలన విషయాలు బయటపెట్టింది. పలువురు అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా పోలీసులకు కీలకమైన హార్డ్ డిస్క్ అందించినట్లు లావణ్య వెల్లడించింది.హార్డ్ డిస్క్‌లో 300 వీడియోలు..పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో దాదాపు 300లకు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో లావణ్యకు సంబంధించినవీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లావణ్య వెల్లడించింది. ఇప్పటికే లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. ఈ కేసులో మరో యువకుడు ఖాజాను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారన్న లావణ్య ఫిర్యాదులో పోలీసులకు వివరించింది.ఆధారాలతో వచ్చా- లావణ్యమస్తాన్ సాయిపై అన్నీ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశానని లావణ్య తెలిపింది. గతంలో నా వద్ద ఆధారాలు లేవని.. అందుకే ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది. ఇప్పుడు వీడియోలతో సహా నా వద్ద ఉన్న ఆధారాలు నార్సింగి పోలీసులకు ఇచ్చానని లావణ్య పేర్కొంది. దీంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ప్రాణహాని ఉంది..లావణ్యమస్తాన్ సాయితో తనకు ప్రాణహాని ఉందని లావణ్య ఆరోపించింది. అతని నుంచి రక్షణ కల్పించాలని లావణ్య పోలీసులను కోరింది. తనకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు యత్నిస్తున్నారని లావణ్య ఆరోపణలు చేసింది. ప్రస్తుతం హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అప్పగించానని లావణ్య పేర్కొంది. -
'రాజ్ తరుణ్‌తో విడిపోవడానికి అతనే కారణం'.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య!
లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్, నేను విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. దీంతో నార్సింగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు..పలువురు అమ్మాయిలతో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు వచ్చాయి. ఏకాంతంగా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 వీడియోలకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇది చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు)అసలేం జరిగిందంటే..టాలీవుడ్లో రాజ్ తరుణ్- లావణ్య వివాదం గతేడాది సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా వారి టాపిక్ పెద్ద దుమారం రేగింది. ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్‌కు రిలేషన్ ఉందని గతంలో లావణ్య ఆరోపించింది. అయినా తనకు రాజ్ తరుణ్ అంటే చాలా ఇష్టమని అతనితో కలిసి జీవించాలని ఉందంటూ ఆమె కోరింది. -
Tirupati Stampede: మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది..
వైకుంఠ ద్వారం నుంచి ఆ కలియుగ వేంకటేశ్వరస్వామివారిని దర్శించి పునీతులు కావాలని తరలివచ్చారు. కానీ అధికా రులు, సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు. వారి జ్ఞాపకాలు తలుచుకుని బంధువులు నేటికీ కన్నీటి పర్యంతమవుతున్నారు.తిరుపతి టాస్క్‌ఫోర్స్: వారిని కదిలిస్తే చాలు.. కన్నీళ్లే సమాధానం చెబుతున్నాయి. తోడుగా ఉన్నవారు దూరమవడంతో దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తల్లిలేని ఆడ బిడ్డల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ ఘటన నుంచి తేరుకోలేక పోతున్నామని, ఆ జ్ఞాపకాలు తలుచుకుని మంచానికే పరిమితమయ్యామని మృతుల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి బైరాగిపట్టెడ, శ్రీనివాసం కౌంటర్లలో ఈనెల 8వ తేదీన జరిగిన తొక్కిలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెల్సిందే. అందులో నలుగురు ఏపీకి చెందిన వారు కాగా ఒకరు తమిళనాడు, మరొకరు కేరళకు చెందిన భక్తులు ఉన్నారు. ఘటన జరిగి సుమారు ఆరు రోజులు కావస్తున్నా మరణించిన భక్తుల రక్తసంబంధీకులు, బంధువులు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కొందరు మంచానికే పరిమితమయ్యామని, జీవితాంతం ఆ లోటు వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారువైజాగ్కు చెందిన మృతురాలు లావణ్య కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. తల్లి దూరమైన ఆ పసిపాపల ఆవేదన వర్ణ నాతీతం. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేమంటూ ఆవేదన చెందుతున్న ఆ పిల్లలను బంధువులు ఓదార్చలేని పరిస్థితి. తల్లిని కోల్పోయా.. మాది కేరళ. ఈనెల 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి కౌంటర్లలో జరిగిన తొక్కిసలాటలో మా తల్లి నిర్మల చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోలేకున్నాం. మా తల్లి నా కళ్ల ఎదుటే తి రుగుతున్నట్లు ఉంది. మా కుటుంబానికి ఆ మే పెద్ద దిక్కు. అలాంటిది తల్లి లేకపోవడం కలచివేస్తోంది. ఏ జన్మలో పాపం చేశానో త ల్లిని పోగొట్టుకున్నాను.–కౌషిగ, మృతురాలు నిర్మల కుమార్తె, కేరళఅమ్మ జ్ఞాపకాలతో..ఊహించని ఘటనతో కుటుంబం అంతా షాక్‌లోనే ఉంది. దైవదర్శనానికి వెళితే ఇలా జరగడం మనసును కలచివేస్తోంది. అమ్మ జ్ఞాపకాలు ప్రతి క్షణం వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి అమ్మతో కలసి సంతోషంగా గడుపుకున్నాం. ఇప్పుడు నాన్నతో పాటు యావత్ కుటుంబం, బంధువులు విషాదంలో మునిగిపోయి ఉన్నాం. జ్వరాలతో మంచాన పడ్డాం. – మహేష్, మృతురాలు శాంతి కుమారుడు, వైజాగ్మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది మాది వైజాగ్ దగ్గర మద్దెలపాళెం. నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మాకు ఒక్కడే కుమారుడు. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లాం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో నా భార్య రజిని మరణించింది. మా ఇంటి మహాలక్ష్మి మాకు దూరమైంది. ఇంట్లో నేను, నా కుమారుడు ఇద్దరమే మిగిలాం. ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి సంతోషంగా గడిపాం. ఈ ఏడాది ఆమెను దేవుడు దూరం చేశాడు. మా అబ్బాయి విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. – లక్ష్మణరెడ్డి, మృతురాలి భర్త, మద్దెలపాళెం, వైజాగ్ఆయన జ్ఞాపకాలతో కుమిలిపోతున్నా.. వైకుంఠ వాకిలి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలనే తపనతో నా భర్త నాయుడుబాబుతో క లసి 8వ తేదీన తిరుపతికి వచ్చాం. అదే రోజు జరిగిన తొక్కిసలాటలో నా భర్త చనిపోయాడు. కూలి చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న మా కుటుంబంలో ఈ విషాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నా భర్త వెంట లేడనే బాధను దిగమింగుకోలేక పోతున్నా. కుటుంబంలో 90 ఏళ్ల పెద్దవారు ఉన్నా రు. వారి బాగోగులు చూసుకోవాలి. ఆయన తోడు విడిచాడు. నా పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం సాయం అందించింది. నేను పెద్దగా చదువుకున్న దానిని కాదు. అధికారులు ఉద్యోగం నర్సీపట్నంలోనే కల్పిస్తే నాకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది.– మణికుమారి,మృతుడు నాయుడుబాబు సతీమణి, నర్సీపట్నం -
కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట!
తిరుపతి క్రైం/తిరుపతి కల్చరల్: మానవత్వం మరిచి పెంపుడు కుక్కను రాక్షసంగా వేట కొడవళ్లతో నరికి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటూ తిరుపతి పోలీసులు వెటకారంగా మాట్లాడారని తిరుపతికి చెందిన లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం తమ పెంపుడు కుక్క(టావీు)ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికి చంపేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. తమతో వెటకారంగా మాట్లాడుతూ చులకనగా వ్యవహరించారని లావణ్య వాపోయారు. కుక్కను చంపిన వారికి వత్తాసు పలుకుతూ.. రూ.2 లక్షలు ఇస్తారు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారని చెప్పారు. తానే రూ.2 లక్షలు ఇస్తానని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారా అని పోలీసులను లావణ్య ప్రశ్నించారు. ఈ సమావేశంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్స్ చైర్మన్ దివ్యారెడ్డి పాల్గొన్నారు.ఇద్దరు నిందితుల అరెస్టు..టామీ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను తిరుపతి ఈస్ట్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈస్ట్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. శంకర్ కాలనీకి చెందిన లావణ్య ఈనెల 6న బయటకు వెళ్తూ తన కుమార్తె గ్రీష్మతో పాటు టామీని స్కావెంజర్స్ కాలనీలోని తన మామయ్య ఆనందయ్య ఇంట్లో వదిలి వెళ్లారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో కుమార్తె గ్రీష్మ.. లావణ్యకు ఫోన్ చేసి తాతయ్య ఎదురింట్లో ఉన్న శివకుమార్, సాయికుమార్ టామీని చంపేశారని తెలిపింది. శివకుమార్ ఇంటి వైపు టామీ చూసి అరుస్తుండడంతో.. సాయికుమార్ రాయితో కొట్టాడని.. ఆ వెంటనే శివకుమార్ కత్తితో టామీని నరికి చంపేశాడు. లావణ్య ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. -
హీరోయిన్‌కు సారీ చెప్పిన రాజ్ తరుణ్.. చాలా బాధగా ఉందంటూ..!
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భలే ఉన్నాడే. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటించారు. జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఒకవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తోన్న రాజ్ తరుణ్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి అతనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ముంబయిలోని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఇంటి వద్దకు వెళ్లిన లావణ్య హల్చల్ చేసింది. అయితే అక్కడే రాజ్ తరుణ్ ఉన్న సమయంలో ఈ గొడవ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలైంది.(ఇది చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు)తాజాగా ఈ సంఘటనపై రాజ్ తరుణ్ పోస్ట్ చేశారు. ముంబయిలో జరిగిన సంఘటనను తలచుకుంటే చాలా బాధగా ఉంది.. అవమానంగా అనిపించిందని ట్వీట్ చేశారు. ఇలా మీ నివాసం వద్ద జరిగినందుకు క్షమించాలంటూ మాల్వీమల్హోత్రాను ట్విటర్ ద్వారా కోరారు. అయినప్పటికీ మీతో, మీ స్నేహితులతో కలిసి వినాయక చవితి పండుగను ఆస్వాదించానని.. అలాగే ఆ గణేశుడి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని రాజ్ తరుణ్ రాసుకొచ్చారు. అంతేకాకుండా గణేశునితో దిగిన ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. I feel so sad and humiliated for the recent events happened in mumbai . I’m very sorry @MalviMalhotra that it happened at your place . However, I had a great time experiencing Vinayak Chavithi with u nd ur friends. May Ganesha bless u nd all of us with peace and endless success. pic.twitter.com/AZZEBTUOwf— Raj Tarun (@itsRajTarun) September 12, 2024 -
దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త
సైదాపురం: క్షణికావేశంలో తాలికట్టిన భార్యపై అనుమానంతో కత్తితో దారుణంగా నరికి చంపేశాడు ఓ భర్త. అనంతరం బిడ్డలతో కలిసి పోలీసు స్టేషన్లో లొంగిపోయిన ఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. రాపూరు సీఐ విజయకృష్ణ అందించిన వివరాల మేరకు.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన చింతలపూడి మహేంద్ర(33)కు అదే గ్రామానికి చెందిన లావణ్యకు 11 ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి వరుణ్(10), జయవర్ధన్(8) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట నెల్లూరుకు కాపురం మార్చారు. అయితే వీరి మధ్య ఏడాది నుంచి వివాదం జరుగుతుండేది. ఈ క్రమంలో ఇటీవలే స్వగ్రామానికి వెళ్లారు. మహేంద్రకు తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దుస్తులు సర్దుకుని తన అమ్మవారి పుట్టినిల్లు అయిన చిట్వేల్‌కు చేరుకునేందుకు లావణ్య సిద్ధమైంది. ఇరుగు పొరుగు వారు సర్దిచెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మళ్లీ ఇంటి నుంచి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించడంతో మహేంద్ర క్షణికావేశంలో అక్కడే ఉన్న కత్తి తీసుకుని తలపై కొట్టి గొంతు కోశాడు. దీంతో లావణ్య చనిపోవడంతో ఇద్దరు బిడ్డలను తీసుకుని మహేంద్ర సైదాపురం పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు లొంగిపోయాడు. ఎస్ఐ క్రాంతికుమార్, సీఐ విజయకృష్ణ ఘటనా స్థలికి చేరుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. కేసును నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి రోదన చూసి స్థానికులు చలించిపోయారు. -
'నా నగలు ఎత్తుకెెళ్లారు'.. లావణ్య సంచలన ఆరోపణలు!
టాలీవుడ్ రాజ్‌తరుణ్-లావణ్య కేసు మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే రాజ్ తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్య పాటు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన రూ.12 లక్షల విలువైన బంగారం దొంగిలించారని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. నగలకు సంబంధించిన బిల్లులతో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన లావణ్య హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. నా బంగారు గాజులు, పుస్తెల తాడు, బ్రేస్ లెట్ , చైన్ మాల్వీనే దొంగిలించారంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. మా ఇంటికి మాల్వి మూడు సార్లు వచ్చిందని.. నగలు దాచిన బీరువా తాళాలు ఆమె దగ్గరే ఉన్నాయని ఆరోపించింది. దీనికి సంబంధించిన తన వద్ద ఆధారాలు ఉన్నాయని పోలీసులకు తెలిపింది.నా రాజ్‌ను పంపించు...హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై లావణ్య తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన రాజ్‌ను తిరిగి పంపించు.. నా మనిషిని తీసుకెళ్లి నన్ను ఒంటరిదాన్ని చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నా రాజ్ తరుణ్‌ను మాల్వీ తన గ్రిప్‌లో పెట్టేసుకుందని.. నేను తిరిగి వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు రాజ్ ఇచ్చాడని లావణ్య తెలిపింది.నిందితుడిగా రాజ్ తరుణ్ పేరు..అంతకుముందు లావణ్య పెట్టిన కేసులో పోలీసులు ఇటీవలే నేర అభియోగపత్రం దాఖలు చేశారు. అందులో హీరో రాజ్ తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో సహజీవనం చేసింది వాస్తవమేనని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసు మరింత రసవత్తరంగా మారింది. కాగా.. మరోవైపు ఈ వారంలో రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. -
రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్ లావణ్య ఫస్ట్ రియాక్షన్
-
రాజ్‌తరుణ్- లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు అయింది. రాజ్‌తరుణ్‌పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు తేల్చేశారు. లావణ్య- రాజ్‌తరుణ్ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. అందుకు సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు.ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, తాను పదేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబైకి చెందిన హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ గతంలో ఆమె పిర్యాదులో పేర్కొంది. పిర్యాదులో పేర్కొన్నట్లుగా ఆమె పలు ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది. ఈ క్రమంలో ఆమె రాజ్ తరుణపై కేసు కూడా పెట్టింది. ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ విషయంలో తాజాగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆయన తీసుకున్న ముందస్తు బెయిల్ కొట్టివేసే ఛాన్స్ ఉంది. -
డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్రగ్ పెడ్లర్‌గా వ్యవహరిస్తున్న గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిని సోమవారం తెలంగాణా ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకెళ్లింది. గుంటూరులోని మస్తానయ్య దర్గా నిర్వాహకుడు రావి రామ్మోహనరావు కుమారుడే ఈ మస్తాన్ సాయి. గతంలోనూ అతడిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్‌సాయి పేరు వెలుగులోకి వచి్చంది. మస్తాన్ దర్గాకు దర్శనం కోసం వచి్చన సమయంలో తనతో మస్తాన్‌సాయి అసభ్యంగా ప్రవర్తించినట్లు లావణ్య ఫిర్యాదు చేసింది. ఇతను దర్గాలో తలదాచుకుంటున్నట్లు సమాచారం అందడంతో నార్సింగ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో మస్తాన్‌సాయి పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. తర్వాత గుంటూరులోని మస్తాన్ దర్గాలోనే ఉంటున్నప్పటికీ గుంటూరు పోలీసులతో కుమ్మక్కు కావడంతో వారు అతడి జోలికి వెళ్లలేదని సమాచారం. -
రాజ్‌తరుణ్-లావణ్య వివాదం.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదం ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషనల్‌గా మారింది. రాజ్ తనతో 11 ఏళ్లుగా సహజీవనం చేసి, ఇప్పుడు వేరే హీరోయిన్ మోజులో పడి వదిలేశాడని లావణ్య ఆరోపిస్తుంది. అంతేకాదు తనను పెళ్లి కూడా చేసుకున్నాడని, గర్భం చేసి అబార్షన్ చేయించాడని పోలిసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మీడియా రెండు-మూడు రోజులు పలు కథనాలు ప్రసారం చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఇప్పటి వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీతో ఈ వివాదం మరింత ముదిరింది. అటు లావణ్య..ఇటు శేఖర్ బాషా నిత్యం ఏదో ఒక యూట్యూబ్ చానెల్‌కి ఇంటర్వ్యూలు ఇవ్వడం..అవి కాస్త వైరల్ కావడం..దీనిపై కొంతమంది విశ్లేషణలు పెట్టడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కూడా రాజ్‌తరుణ్-లావణ్య వివాదంపై తన విశ్లేషణ ఇచ్చేశాడు. ప్రస్తుతం రాజ్-లావణ్య వివాదం మీడియా సర్కస్‌గా మారిందని, సోషల్ మీడియాలో అయితే ఒక వెబ్ సిరీస్‌గా దీన్ని ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. మొత్తంగా లావణ్య వ్యవహారమే తేడాగా ఉందంటూ.. రాజ్ తరుణ్‌కి మద్దతుగా మాట్లాడాడు ఆర్జీవీ.‘రాజ్ నాతో 11 ఏళ్లు సహజీవనం చేశాడని.. అతను నాకు కావాలని లావణ్య అంటోంది. రాజ్ మాత్రమే కావాలంటే..అది చాక్లెట్ కాదు కదా? పెళ్లి చేసుకొని,20-30 ఏళ్లు కలిసి కాపురం చేసిన వాళ్లే విడిపోతున్నారు. ఇక సహజీవనం చేసి విడిపోవడం అసలు పాయింట్ కాదు’ అని ఆర్జీవీ అన్నారు.ఇక లావణ్య వరుసగా ఆడియో క్లిప్స్ రిలీజ్ చేయడం గురించి మాట్లాడుతూ.. ‘కలిసి కాపురం చేసే వాళ్లకి ఆడియో రికార్డు చేయాలనే ఆలోచన రాదు. క్రిమినల్ మైండ్ సెట్ వాళ్లకే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆడియో క్లిప్స్ లీక్ చేయడం క్రిమినల్ మెంటాలిటీని సూచిస్తుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉండడం అసంభవం. రాజ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతుంది..కానీ చివరకు ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందనే నాకు అనిపిస్తుంది’ అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. My observations on the RELATIONSHIP HORRORS between MEN and WOMEN in the context of Raj Tarun and Lavanya ISSUE https://t.co/Y4FTfmnVSC— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2024 -
రాజ్ తరుణ్‌పై లావణ్య కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం!
టాలీవుడ్లో సంచలనంగా మారిన లావణ్య కేసులో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో రాజ్ తరుణ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్యతో రాజ్ తరుణ్‌కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.కాగా.. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌తో దాదాపు 11 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు మీడియా ముందు మాట్లాడింది. నాకు భర్త కావాలి అంటూ ఇటీవల ప్రసాద్ ల్యాబ్ వద్ద హల్చల్ చేసింది. అయితే రాజ్ తరుణ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. రాజ్ తరుణ్ ఇటీవలే ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరసామీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. -
కాలితో తన్నాడంటూ శేఖర్ భాషాపై ఫిర్యాదు చేసిన లావణ్య
రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన ఆర్జే శేఖర్ భాషాపై కేసు నమోదైంది. తన స్నేహితుడు రాజ్ తరుణ్‌పై లావణ్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన పలు మీడియా వేదకల మీద కామెంట్లు చేశాడు. లావణ్య వల్లే రాజ్ తరుణ్ చాలా నష్టపోయాడని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్లో డిబేట్లో పాల్గొన్న లావణ్యపై శేఖర్ దురుసుగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు శేఖర్ భాషాపై కేసు నమోదు చేశారు.రాజ్ తరుణ్-లావణ్య వివాదం దారి మళ్లీ ఇప్పుడు శేఖర్ భాషా, లావణ్య గొడవ నెట్టింట వైరల్ అవుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్న లావణ్యపై శేఖర్ భాషా దాడి చేశాడని తెలుస్తోంది. తన కడుపు మీద బలంగా శేఖర్ భాషా తన్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె చెప్పారు.శేఖర్‌పై కేసు సెక్షన్ 74, 115(2) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు.శేఖర్ భాషా- లావణ్య మధ్య గొడవకు ప్రధాన కారణం ఆయన చేసిన ఆరోపణలే అని చెప్పవచ్చు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు శారీరక సంబంధం ఉందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. దీంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్‌కు మద్ధతుగా చాలామంది కామెంట్లు చేశారు. ఆపై ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో పాటు చాలామంది అమ్మాయిలకు డ్రగ్స్ అందించినట్లు ఆయన చెప్పారు. దీంతో లావణ్య, శేఖర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒక మీడియా వేదికపైనే శేఖర్ భాషాను లావణ్య చెప్పుతో కొట్టింది. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. -
రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు
రాజ్ తరుణ్-లావణ్య వివాదం రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుంది. తాజాగా లావణ్యపై నార్సింగ్ పోలీసులకు ప్రీతి ఫిర్యాదు చేసింది. తమకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని ఆమె ఆరోపించింది. తమతో పాటు చాలామంది ఆడపిల్లలకు ఆమె డ్రగ్స్ ఇచ్చారని ఫిర్యాదులో తెలిపింది. ఆమె వల్ల చాలామంది జీవితాలు నరకంగా మారాయని ఆరోపించింది. ప్రీతి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని ఎస్ఐ సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో తాజాగా లావణ్య గురించి రాజ్ తరుణ్ లాయర్ ముధు శర్మ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లావణ్య డ్రగ్స్‌కు అలవాటు పడటమే కాకుండా అనేకమందికి అందించింది. దానిని అడ్డుకునేందుకు రాజ్ తరుణ్ చాలాసార్లు ప్రయత్నించాడు. అమె నిరాకరించింది. లావణ్యకు దూరంగా ఉంటూ వచ్చిన రాజ్ తరుణ్‌పై కక్ష పెంచుకుంది. అందుకే ఇలాంటి డ్రామాలు చేస్తుంది. లావణ్యకు డ్రగ్స్ మూఠాతో సంబంధాలు ఉన్నాయి. వారు డ్రగ్స్ ఎక్కడ తెస్తారు వంటి పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అవన్నీ పోలీసులకు అందిస్తాం. డ్రగ్స్ మత్తులో ఉన్న ఆడపిల్లలపై న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి ఆపై వారి తల్లిదండ్రుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ వివరాలు పూర్తి స్ధాయిలో రాబోతున్నాయి. లావణ్య ఉచ్చులో చిక్కుకొని డ్రగ్స్‌కు అలవాటు పడి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. త్వరలో వారందరూ బయటకు వస్తారు. డ్రగ్స్ గురించి రాజ్ తరుణ్ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. దీంతో లావణ్య నుంచి ఆయనకు ప్రాణహాని ఉంది. రాజ్ తరుణ్ జీవితం మరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా కాకుండా చూసుకోవాలి. అని లాయర్ సూచించారు. -
Raj Tarun - Lavanya Case: వేధిస్తోందంటూ లావణ్యపై ఫిర్యాదు
మణికొండ: తనను మోసం చేశాడంటూ నటుడు రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యపై ప్రీతి అనే మహిళ పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. లావణ్య తనను ఫోన్ చేసి వేధిస్తోందని, తనకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి శుక్రవారం రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై నార్సింగి అడ్మిన్ ఎస్ఐ సుఖేందర్‌రెడ్డిని వివరణ కోరగా ప్రీతి అనే మహిళ ఇచి్చన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, అది తమ పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశంతోపాటు..అందులోని ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిపై ఇపుడే ఏమి చెప్పలేమన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఈ ఫిర్యాదుపై వివరాలను వెల్లడిస్తామన్నారు. ఫిర్యాదుదారు ప్రీతితో పాటు ఆర్జే శేఖర్ బాష, న్యాయవాది శర్మ ఉన్నారు. -
రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. లాయర్ సంచలన కామెంట్స్..
-
రాజ్ తరుణ్ వ్యవహారంలో లావణ్యపై కేసు నమోదు..
రాజ్ తరుణ్- లావణ్య వివాదం పలు మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లావణ్య తమ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేస్తున్నట్లు వారు తెలిపారు. తమ ఇంటి వద్దకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించిందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటుంన్న రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లిన లావణ్య గొడవ చేసిందని సమాచారం. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తమను లావణ్య ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి తలుపులు బలంగా కొడతూ తమను ఆందోళనకు గురిచేసినట్లు వారు చెబుతున్నారు. ఆపై ఇంటి ముందు బూతులు తిడుతూ గట్టిగా కేకలు వేసి ఇబ్బందులుకు గురిచేసిందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కృష్ణమోహన్ వెల్లడించారు. అయితే, రాజ్ తరణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తుంది. తనను పెళ్లి చేసుకుని మాల్వీ మల్హోత్రతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె చెబుతుంది. -
రాజ్ తరుణ్ స్నేహితుడిని చెప్పుతో కొట్టిన లావణ్య
టాలీవుడ్లో రాజ్ తరుణ్- లావణ్య వ్యవహారంలో రచ్చ కొనసాగుతుంది. కొద్దిరోజుల క్రితం రాజ్ తరుణ్‌పై లావణ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకున్న రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో ఎఫైర్ పెట్టుకుని మోసం చేశాడని తెలిపింది. అయితే తాజాగా ఒక మీడియా ఛానల్లో లావణ్య, శేఖర్ భాష మధ్య పెద్ద గొడవే జరిగింది.లావణ్య వివాదంలో రాజ్ తరుణ్ తరపున తన స్నేహితుడు శేఖర్ భాష పలు ఆధారాలతో మీడియా ముందుకు వచ్చాడు. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని ఆయన తెలిపాడు. చిన్నపిల్లలకు కూడా లావణ్య డ్రగ్స్ అమ్మినట్లు మీడియా డిబెట్లో శేఖర్ బాష కామెంట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన లావణ్య దాడికి దిగింది. లైవ్ రన్ అవుతుండగానే శేఖర్ బాషను లావణ్య చెప్పుతో కొట్టింది. దీంతో ఇద్దరూ ఆగ్రహంతో రెచ్చిపోయారు. అయితే, డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని లావణ్య తెలిపింది. కావాలని తనని ఇందులోకి లాగుతున్నారని ఆమె వారించింది. కానీ, ఆమె డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు ఉన్నాయని అందుకు సంబంధించిన లింక్ ఉన్న వ్యక్తి ఇక్కడికి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో లావణ్య డిబెట్ మధ్యలో నుంచి వెళ్లిపోయింది. ఇలా రోజుకో కొత్త గొడవలతో వీరిద్దరి వ్యవహారం నడుస్తుంది. -
లావణ్య-రాజ్ తరుణ్ స్టోరీలో మరో ట్విస్ట్
-
'పదేళ్లు కలిసి ఉన్నాం.. రాజ్ తరుణ్ సమాధానం చెప్పాలి': లావణ్య కామెంట్స్
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్‌ను కలిసేందుకు వచ్చిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. ప్రసాద్ ల్యాబ్‌లో తిరగబడరా సామీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా లావణ్య అక్కడికి వెళ్లేందుకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లావణ్యను వెళ్లకుండా నిలువరించారు. దీంతో నా భర్త రాజ్ తరుణ్‌తో నన్ను మాట్లాడనివ్వండి అంటూ పోలీసులను కోరింది. నా భర్తతో మాల్వీ ఎందుకు వచ్చిందని లావణ్య ప్రశ్నించింది. భర్తతో సంసారం చేసినట్లుగా మాల్వీ ఎందుకు కలిసి ఉంటోందని మాట్లాడింది. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి.. ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడని లావణ్య కామెంట్స్ చేసింది. లావణ్య మాట్లాడుతూ..'నన్ను ఎందుకు రాజ్ తరుణ్‌ను కలవకుండా చేస్తున్నారు. నాకు రాజ్ సమాధానం కావాలి. నా భర్త నాకు కావాలి. నా నుంచి ఎన్నిసార్లు తప్పించుకుంటాడు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. మాది లవ్ మ్యారేజ్. పెళ్లి ఫోటోలు కూడా కోర్టుకు సమర్పించాం. కోర్టుకు అన్ని ఆధారాలు ఇచ్చాను. నాతో పదేళ్లు కలిసి ఉన్నాడు. నాకు అబార్షన్ రెండుసార్లు చేయించాడు. నా ఇంటి నుంచి అతనే పారిపోయాడు. నేను ఒక సాధారణ అమ్మాయిని. అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాట్లేదో మీకే తెలియాలి. నేను న్యాయం కోసం పోరాడుతున్నా. ' అని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా.. రాజ్ తరుణ్-లావణ్య టాపిక్ టాలీవుడ్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదిరింది. తాను రాజ్ తరుణ్‌తో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు లావణ్య ఆరోపించింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు కామెంట్స్ చేసింది. -
నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి.. లావణ్య అబార్షన్‌పై రాజ్ తరుణ్ రియాక్షన్
కొద్దిరోజులుగా రాజ్ తరుణ్‌పై లావణ్య చేస్తున్న ఆరోపణలకు తాజాగా తిరగబడరసామీ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కొన్నింటికి సమాధానాలు దొరికాయి. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జోడీగా నటించిన చిత్రం తిరగబడరసామీ.. ఇందులో మన్నారా చోప్రా కీలకపాత్రలో నటించింది. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మించారు. ఆగష్టు 2న విడుదల కానున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో లావణ్య వివిదాం గురించి రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా స్పందించారు.లావణ్య అబార్షన్ గురించి రాజ్ తరుణ్ కామెంట్లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. అందుకే ప్రతిసారీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. నేను లావణ్యకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం లేదు. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టే ఈ విషయంలో లీగల్‌గా వెళ్తున్నాను. నా వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆమెను చేస్తున్న ఆరోపణలకు సంభంధించి ఇప్పటి వరకు ఎవరూ ఆధారాలు అడగలేదు. లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీలో ఆబార్షన్ గురించి లేదు. నిజమే అయితే, అందుకు సంబంధించిన మెడికల్ అధారాలు బయటపెట్టాలి.ఇక పెళ్లి గురించి మాట్లాడితే నాకు చాలా భయంగా ఉంటుంది. జీవితం లో పెళ్లి గోల వద్దు అనుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల నేను నటించిన పురుషోత్తముడు సినిమా ప్రమోషన్‌కు రాలేకపోయాను. నేను కూడా మనిషినే.. నాపై కావాలనే నిందలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో నేను ఎక్కడికీ వెళ్లలేకపోయాను. నా 32 ఏళ్ల జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదు. వారం , పది రోజులుగా ఇంటికే పరిమితం అయ్యాను.. నాతో పాటు నా తల్లిదండ్రుల కూడా భాదపడుతున్నారు. ' అని రాజ్ తరుణ్ తెలిపారు. ఈ వివాదం గురంచి కాస్త పక్కన పెడితే అంటూ తిరగబడరసామీ సినిమా గురించి రాజ్ తరుణ్ మాట్లాడారు. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా కష్టపడి పనిచేశారు. నిర్మాత కూడా ప్రాణం పెట్టి నిర్మించారు. మాల్వీ మల్హోత్ర చాలా గొప్ప నటి. టాలీవుడ్లో ఆమె ఇదే మొదటి సినిమా. కాబట్టి ఈ వివాదాలన్నీ కాస్త పక్కనపెట్టేసి ఆమెను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు రాజ్ తరుణ్ కోరాడు.నాపై దాడి చేసిన వారితో లావణ్య టచ్‌లో ఉంది: మాల్వీ మల్హోత్రలావణ్య చేస్తున్న ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆమె నాతోపాటు నా సోదరుడిపై చేసిన కామెంట్లకు ఇప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చాను. జులై 24న కూడా లావణ్య మెసేజ్ చేసింది.. అదీ కూడా పోలీసులకు పంపాను. నా ఫ్యామిలీ కానీ, నేను కానీ ఆమెని ఎప్పుడూ కలవలేదు. మాపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందో తెలియదు. 2020లో నాపై దాడి చేసిన కొంతమంది క్రిమినల్స్‌తో ఆమె ఇప్పుడు టచ్‌లో ఉన్నారు. వారితో టచ్‌లో ఉండకూడదని ఆమెకు సలహా కూడా ఇచ్చాను. నా దృష్టిలో ఆమె కూడా ఒక క్రిమినల్ అని అభిప్రాయపడుతున్నాను. లావణ్య గురించి ఇంతకు మించి ఏమీ మాట్లడలేను. లీగల్‌గా ఆమెపై చర్యలు తీసుకుంటాను. -
Audio Call: రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్.. లావణ్య-శేఖర్ బాషా ఆడియో లీక్!
-
రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్.. మరో సంచలన ఆడియో లీక్!
హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్ సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు పెట్టుకోవడంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇటీవలే రాజ్ తరుణ్‌కు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను అందుబాటులో లేనని రిప్లై కూడా ఇచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఆడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఆడియో కాల్లో లావణ్య.. ఆర్జే శేఖర్ భాష అనే వ్యక్తితో మాట్లాడుతున్న ఆడియో సంచలనంగా మారింది. ఇందులో లావణ్యకు, శేఖర్ భాషకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటూ శేఖర్ భాషను లావణ్య నిలదీసింది. మీరే రాజ్ తరుణ్ ఇల్లు కొట్టేయాలని ఇదంతా చేస్తున్నారని లావణ్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాజ్ తరుణ్ స్నేహితుడుగా చెప్పుకునే శేఖర్ బాషా అనే ఆర్జే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మస్తాన్ రావ్ అనే వ్యక్తి నుంచి లావణ్య మత్తు పదార్థాలను కొని బయట ఎక్కువ రేటుకు అమ్మేదని.. ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ భాషా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. -
రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపెట్టిన లావణ్య..
-
Lavanya Namoju: ఆలయచిత్రం
గుడిని గుడికి కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది? తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నామోజు లావణ్య దేశంలోని ఆలయాలకు వెళ్లి అక్కడి ఆధ్యాత్మికతను, గుడి ప్రాంగణాన్ని, ఆలయ గోపురాలను లైవ్ పెయింటింగ్ చేసి ఆ చిత్రాలను గుడికే బహుమానంగా ఇస్తోంది. దీని వల్ల గుడి రూపం చిత్రకళలో నిలుస్తోంది. అలాగే గుడికి వచ్చే భక్తులకు ఆలయ సౌందర్యాన్ని తెలియచేస్తుంది.‘ప్రతి ముఖ్యమైన గుడిలో నా చిత్రం ఉండాలి. అలాగే మరుగున పడిన గుడి నా చిత్రకళ ద్వారా కాస్తయినా ప్రచారం పొందాలని ఆలయ చిత్రాలను లైవ్ పెయింటింగ్ ద్వారా నిక్షిప్తం చేస్తున్నాను. ఇందుకు వస్తున్న ఆదరణ ఆనందం కలిగిస్తోంది’ అంది పాతికేళ్ల నామోజు లావణ్య. ‘ఇందుకు నా పెయింటింగ్స్ అమ్మకాల వల్ల వచ్చే డబ్బునే ఉపయోగిస్తున్నాను ఇటీవల భద్రాచల ఆలయంలోని సీతారాముల వారి మూర్తులు, ఆలయం లైవ్ పెయింటింగ్ చేసి దేవస్థానానికి అందజేశాను’ అందామె. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక చిత్రకళా సాధన అని కూడా అనుకోవచ్చు. మన సంస్కృతి కోసం‘మాది యాదాద్రి భువనగిరి. కామర్స్‌తో డిగ్రీ పూర్తి చేశాను. పోటీ పరీక్షలకు హాజరై, ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నా ఇష్టం మొత్తం పెయింటింగ్స్ మీదే ఉంది. దీంతో ఏడాది నుంచి పెయింటింగ్నే నా వృత్తిగా మార్చుకున్నాను. స్కూల్ ఏజ్ నుంచి నోట్ బుక్స్‌లో పెయింటింగ్స్ వేస్తుండేదాన్ని. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతున్న ఈ కాలంలో సోషల్‌మీడియా ద్వారా మన సంస్కృతిని, మంచిని కూడా పరిచయం చేయవచ్చు అనిపించి సంవత్సరం నుంచి ఆలయ శిల్పాన్ని, హైందవ సంస్కృతిని నా ఆర్ట్ ద్వారా చూపుతున్నాను’.రాక్ స్టోన్స్ పై జంతువులు‘మెదక్ జిల్లా మరపడ దగ్గర ఒక వెంచర్ వాళ్లు ఆర్ట్‌కు సంబంధించిన విషయం మాట్లాడటానికి పిలిస్తే నేను, మా అంకుల్ శ్రీనివాస్ వెళ్లాం. అక్కడ ఒక గ్రామదేవత టెంపుల్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాళ్లను చూశాక వాటిని ఆకారాలుగా చూపవచ్చనిపించింది. మొత్తం 42 రకాల పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ ఉన్నాయి. వాటిని ఏనుగులు, ఆవులు, కోతులు, తాబేలు, కొలనుగా రంగులద్ది మార్చాను. మొన్నటి మే నెల ఎండలో వేసిన పెయింటింగ్స్. అక్కడికి వచ్చినవాళ్లు ‘ఆడపిల్ల అంత పెద్ద రాళ్లు ఎక్కి ఏం పెయింటింగ్స్ వేస్తుంది’ అన్నారు. కానీ అవి పూర్తయ్యాక చాలా సంతోషించారు’ అంది లావణ్య.వెడ్డింగ్ లైవ్ ఆర్ట్‘వివాహవేడుక జరుగుతుండగా ఆ సన్నివేశం, సందర్భం చూడటానికి చాలా బాగుంటుంది. లైవ్ ఆర్టిస్ట్‌ను అని తెలియడంతో గత పెళ్లిళ్ల సీజన్లో వివాహం జరుగుతుండగా ఆ సీన్ మొత్తం పెయింటింగ్ చేసే అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఆ కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్టుగా చిత్రించి, ఇచ్చాను. కాలేజీ రోజుల్లోనే తొమ్మిది నెలల పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. యువతకు మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటాను. షీ టీమ్ వారు ‘షీ ఫర్ హర్’ అవార్డు ఇచ్చారు. నాన్న సురేందర్ కరోనా సమయంలో చనిపోయారు. అమ్మ గృహిణి. తమ్ముడు శివప్రసాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం గల కుటుంబమే మాది. నా కళకు సపోర్ట్ చేసేవారుంటే మరెన్నో విజయాలు అందుకోవచ్చు’ అంటూ తెలిపింది ఈ హార్టిస్ట్.– నిర్మలారెడ్డి -
రాజ్ తరుణ్ కు బిగుసుకుంటున్న ఉచ్చు..! నార్సింగి పోలీసుల నోటీసులు
-
రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో ఏముంది
-
హీరో రాజ్ తరుణ్‌కి నోటీసులు పంపిన పోలీసులు
పోలీస్ కేసులతో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజుల ముందు మీడియా ముందుకొచ్చిన లావణ్య అనే అమ్మాయి.. ఈ కుర్ర హీరోపై హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడీ కేసులో రాజ్ తరుణ్‌కి పోలీసులు నోటీసులు పంపించారు. ఈనెల 18 లోపు హాజరు కావాల్సిందేనని ఇందులో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద ఇతడికి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)రాజ్ తరుణ్ తనని ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి ఆరోపణలు చేసింది. నటి మాల్వీ మల్హోత్రా పరిచయమయ్యాక తనని పట్టించుకోవడం మానేశాడని, దీని గురించి అడిగితే నోటికొచ్చినట్లు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో ఇరికించడం వల్ల 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. మాల్వీతో పాటు ఆమె సోదరుడు తనని బెదిరించారని లావణ్య చెప్పుకొచ్చింది.లావణ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మాల్వీ, ఈమె సోదరుడు మయాంక్‌పై కేసు నమోదు చేశారు. రీసెంట్గా రాజ్ తరుణ్ తనకు దూరమైపోతాడేమో అనే బాధతో లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ మేరకు పోలీసులు ఈమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి) -
రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. మాల్వీ మల్హోత్రాపై సంచలన ఆరోపణలు!
రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ రోజుకోక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులతో ఫుల్ హాట్ టాపిక్‌గా మారింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో కేసులు కూడా నమోదయ్యాయి. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో సహా పలువురిపై రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా.. ఇటీవల లావణ్య సూసైడ్ చేసుకుంటున్నానంటూ పోలీసులను పరుగులు పెట్టించించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్-లావణ్య-మాల్వి మల్హోత్రా ఎపిసోడ్‌పై అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ప్రేమ పేరుతో తమ ఆస్తులని లాక్కుందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడంటూ తమ కుమారున్ని జైలుకు పంపించిందని వెల్లడించింది. తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఫ్లైట్ టికెట్స్, మెసేజెస్ వీడియో కాల్స్, కాల్ లిస్ట్‌ను ఆమె బయటపెట్టింది. తన కొడుకు యోగేశ్‌ను ట్రాప్ చేసి జైలుకు పంపించిందని మాల్వీ మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. తాజా ట్విస్ట్‌తో రాజ్ తరుణ్- మాల్వీ మల్హోత్రా- లావణ్య టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది. -
రాజ్ తరుణ్ ప్రేయసితో గొడవ.. మరోవైపు మాల్వీ ఆల్బమ్ సాంగ్ రిలీజ్
యువ హీరో రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి వల్ల ఎంతలా రచ్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాయి. తనని మోసం చేసిన రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వలలో పడ్డాడని లావణ్య అనే అమ్మాయి పోలీస్ కేసుల వేస్తోంది. ప్రతిగా మాల్వీ కూడా లావణ్యపై కేసు పెట్టింది. గత కొన్నిరోజుల నుంచి ఈ తతంగం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇది ఇలా ఉండగానే తాను నటించిన ఆల్బమ్ సాంగ్‌ని మాల్వీ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: వీడియో కాల్లో ప్రముఖ నటుడి కొడుకు నిశ్చితార్థం.. ఎందుకిలా?)'షాబానో' అంటూ సాగే ఈ పాటని ఇప్పుడు రిలీజ్ చేయడం ఓ విధంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా అయితే ఈ పాటని ఎవరూ పట్టించుకోకపోవచ్చు. కానీ ఇప్పుడిలా రాజ్ తరుణ్-లావణ్య-మాల్వీ మల్హోత్రా మధ్య నడుస్తున్న వివాదం వల్ల ఈ పాటకు కాస్త క్రేజ్ ఏర్పడింది. ఆ పాట ఏంటనేది మీరు చూసేయండి.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!) -
అర్ధరాత్రి లావణ్య నుంచి షాకింగ్ కాల్
-
రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్
-
తాను చనిపోతానంటూ లాయర్ కు లావణ్య మెసేజ్
-
'రాజ్ తరుణ్ ఫోన్ నుంచే కాల్ చేసింది'.. ఆమెపై లావణ్య షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్లో రాజ్ తరుణ్-లావణ్య టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్‌కు రిలేషన్ ఉందని ఆరోపించిన లావణ్య.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీతో రిలేషన్ ఉన్న మాట నిజమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అరియానా గ్లోరీతో రాజ్‌తరుణ్‌కు ఎఫైర్ ఉందని మీకెలా తెలుసు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించింది.లావణ్య మాట్లాడుతూ..' ఎందుకు నీ చట్టు తిప్పుకుంటున్నావ్ ఓ సారి నేను అరియానా గ్లోరీని అడిగా. ఒక అబ్బాయితో అమ్మాయి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. హీరోతో మామూలుగా మాట్లాడి ఉంటే నేను పట్టించుకునే దాన్ని కాదు. తనే రాజ్ తరుణ్‌ను బాయ్‌ఫ్రెండ్‌గా భావించింది. వాళ్లు దిగిన ఫోటోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంతే కాకుండా రాజ్ తరుణ్.. అరియానా గ్లోరీ ఇంటికి వస్తున్నాడని నాకు కొందరు చెప్పారు. ఆ తర్వాత నేను గోవాలో ఉండగా.. రాజ్ తరుణ్ ఫోన్ నుంచి కాల్ చేసి నాతో మాట్లాడింది. నువ్వు ఎంత సంపాదిస్తావ్ అని అడిగింది. నాకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తోందంటూ నాతో ఇన్సల్ట్గా మాట్లాడింది. ఆ తర్వాత అరియానా నాకు సారీ చెప్పింది. ఆ ఆడియో కూడా నా వద్ద ఉంది. ఇప్పుడైతే ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవ్' అని లావణ్య చెప్పుకొచ్చింది. కాగా.. రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా స్వామి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
నాకు దూరం చేస్తా అని ఛాలెంజ్ చేసింది..
-
రాజ్ తరుణ్, లావణ్య కేసులో కీలక ట్విస్ట్
-
హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్!
టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్‌తరుణ్‌తో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌తరుణ్‌ను ఏ1గా, మాల్వీని ఏ2గా, మయాంక్‌ని ఏ3గా చేరుస్తూ నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినుట్ల పోలీసులు తెలిపారు.లావణ్యకు అబార్షన్ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి జులై 5న నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆధారాలు చూపించాలని నార్సింగి పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. దీంతో లావణ్య తన దగ్గర ఉన్న ఆధారాలన్ని పోలీసులు అందించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. రాజ్‌తరుణ్‌తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని, 2014లో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అతను ఆర్థిక సమస్యలతో బాధపడినప్పుడు తన కుటుంబం అదుకుందని, ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 లక్షల వరకు ఇచ్చామని చెప్పింది. అంతేకాదు 2016లో తాను గర్భం దాల్చానని.. రాజ్‌తరుణే అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది.డ్రగ్స్ కేసులో ఇరికించారురాజ్తరుణ్, మాల్వీ మల్హోత్రా కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. ‘జనవరిలో నేను యూఎస్ నుంచి తిరిగి వచ్చాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాపై డ్రగ్స్ కేసు ఉందంటూ తప్పుడు ఆరోపణలతో రిమాండ్ చేశారు. 45 రోజుల పాటు నేను జైలులో ఉన్నాను. రాజ్‌తరుణ్, మాల్వి కలిసే ఇదంతా ప్లాన్ చేశారు. బయటకు వచ్చాక ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరించారు’ అని లావణ్య ఆరోపించింది. -
రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
-
రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. మరోసారి లావణ్య ఫిర్యాదు..
మణికొండ/బంజారాహిల్స్: ఆరోపణలు, ప్రత్యారోపణలు, పరస్పర కేసుల తరుణంలో సినీహీరో రాజ్‌తరుణ్ వ్యవహారం సినిమా స్టైల్లో అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఇరువర్గాలను పిలిచి నిజానిజాలు నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమయ్యారు. రాజ్తరుణతో 11 ఏళ్ల లివింగ్ రిలేషన్లో ఉన్నానని, ఇప్పుడు మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తన వద్దకు రావటంలేదని, మాల్వీ మల్హోత్రా సోదరుడు మయాంక్ తనను చంపుతానని బెదిరించాడని ఇదివరకే ఫిర్యాదు చేసిన లావణ్య మంగళవారంరాత్రి నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేసింది. ముందుగా చేసిన ఫిర్యాదుకు ఆధారాలను చూపాలని పోలీసులు ఆమెకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆమె తన న్యాయవాదితో కలిసి ఆధారాలను, 175 ఫొటోలు, స్క్రీన్చాట్లు, వీడియోలు, కాల్ రికార్డ్‌లు అందజేసినట్టు తెలుస్తోంది. రాజ్‌తరుణ్‌తో తనక 10 ఏళ్ల క్రితమే గచ్చబౌలిలోని ఎల్లమ్మగుడిలో వివాహమైందని, తనకు గర్భం రావటంతో ఓ ఆస్పత్రిలో అబార్షన్ కూడా చేయించారని తెలిపింది. రాజ్‌తరుణ్‌కు గతంలోనూ మరికొంత మంది మహిళలతో ఎఫైర్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. తాను అని్వక పేరుతో పాస్‌పోర్టు పొందానని, తామిద్దరం కలిసి ఇదివరకు విదేశాలకు కూడా వెళ్లామని తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఆధారాలను పరిశీలించి రాజ్‌తరుణపై కేసులు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. త్వరలోనే రాజ్‌తరుణ్‌ను విచారించి అసలు నిజాలను వెలుగులోకి తెస్తామని పేర్కొన్నారు. లావణ్యపై మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు లావణ్య అనవసరంగా వివాదంలోకి లాగి తన పరువుకు భంగం కలిగిస్తోందని, తన సోదరుడికి ఇష్టారాజ్యంగా మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తోందని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనది హిమాచల్‌ప్రదేశ్ అని, తల్లిదండ్రులు అక్కడే ఉంటారని, తాను మాత్రం ముంబైలో ఉంటానని, ‘తిరగబడరా స్వామీ’సినిమాలో నటించానని, ఈ సినిమా నిమిత్తమే హైదరాబాద్‌కు వచ్చి స్నేహితురాలి ఇంట్లో ఉంటున్నానని వెల్లడించారు. ఫిర్యాదుపై పో లీసులు జీరో ఎఫ్ఐర్ నమోదు చేసి ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. -
బీరు బాటిళ్లతో దారుణంగా.. రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్
-
రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య సంచలనం
-
లావణ్యపై మరో ఫిర్యాదు చేసిన సినీ నటి మాల్వి మల్హోత్రా
-
రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు: లావణ్య
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి పోలీసులని ఆశ్రయించింది. తన మాజీ ప్రియుడితో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై మళ్లీ కేసు పెట్టింది. తనతో పాటు తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తోందని మాల్వీ.. బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లావణ్య ఇప్పుడు మరో కేసు పెట్టింది. దీనితో పాటు స్క్రీన్ షాట్స్, మరికొన్ని ఆధారాలని ఫిర్యాదుతో పాటు సమర్పించింది. ఈ క్రమంలోనే మరోసారి రాజ్ తరుణ్‌తో తన బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్న హీరో దర్శన్.. అవన్నీ కావాలని రిక్వెస్ట్)గత పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని చెప్పిన లావణ్య.. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని చెప్పి షాకిచ్చింది. ఇందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్, వివరాలు సమర్పించింది. అయితే లావణ్య అని కాకుండా అన్విక పేరుతో తామిద్దరం కలిసున్నామనే చెప్పుకొచ్చింది. ఇదే పేరుతో విదేశాలకు కూడా వెళ్లొచ్చామని రివీల్ చేసింది. అయితే మాల్వీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిపై మరో కేసు పెట్టిన హీరోయిన్) -
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిపై మరో కేసు పెట్టిన హీరోయిన్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్-అతడి మాజీ ప్రియురాలు లావణ్య మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదివరకే ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా నిలిచిన నటి మాల్వి మల్హోత్రా.. లావణ్యపై మరో ఫిర్యాదు చేసింది. తనని, తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తోందని హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జోరీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుని ఫిలిం నగర్ స్టేషన్‌కి పోలీసులు బదిలీ చేశారు. లావణ్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని మాల్వీ తన ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)ఈ కేసు పూర్వాపరాలకు వస్తే.. రాజ్ తరుణ్ తను కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నామని, కానీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనని దూరం పెట్టాడని చెబుతూ లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకొచ్చింది. మాల్వి, ఆమె తమ్ముడు కలిసి తనని బెదిరిస్తున్నారని, రాజ్ తరుణ్‌ని వదిలేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి ప్రతిగా రాజ్ తరుణ్ లావణ్యపై కేసు పెట్టాడు. గతంలో ఈమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమేనని, కానీ ఇప్పుడు మస్తాన్ అనే వేరే వ్యక్తితో ఈమె రిలేషన్లో ఉందని అన్నాడు.మరోవైపు తనపై లావణ్య అసత్య ఆరోపణలు చేస్తోందని చెప్పి నటి మాల్వి మల్హోత్రా పోలీస్ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది. తనని తన తమ్ముడిని లావణ్య బెదిరింపులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చింది. మరి రోజుకో టర్న్ తీసుకుంటున్న ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్) -
కీలక ఆధారాలతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న రాజ్ తరుణ్ లవర్
-
రాజ్ తరుణ్ తో ఉన్న సంబంధం ఇదే...
-
రాజ్‌తరుణ్‌పై ఆధారాలతో మరో ఫిర్యాదు చేస్తా
మణికొండ: సినీ హీరో రాజ్‌తరుణ్ తనతో కలిసి లివింగ్ రిలేషన్లో ఉండటం, గుడిలో పెళ్లి చేసుకోవటం, నన్ను ఫోన్లో చంపేస్తానని బెదిరించిన రికార్డులు అన్నీ ఉన్నాయని, వాటన్నింటినీ జతచేస్తూ న్యాయవాదితో కలిసి త్వరలోనే నార్సింగి పోలీసులకు మరో ఫిర్యాదు చేస్తానని అతని మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. ఆదివారం ఆమె నగరంలో మీడియాతో మాట్లాడుతూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో పరిచయం అయిన తరువాతనే రాజ్‌తరుణ్ పూర్తిగా మారిపోయాడన్నారు. తనను వదలించుకునేందుకు కట్టు కథలు అల్లుతున్నారన్నారు. గతంలో డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేక పోయినా బలవంతంగా అందులో ఇరికించారని, త్వరలోనే తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు. నార్సింగి పోలీసులు ఆధారాలు ఇవ్వాలని నోటీసు ఇచ్చారని, గతంలో తను ఇచి్చన ఫిర్యాదు సరిగా లేదనే విషయం తెలుసుకుని ప్రస్తుతం న్యాయవాదితో తయారు చేయించి పూర్తి ఆధారాలతో మరో ఫిర్యాదు ఇస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు సంగతి ఎలా ఉన్నా తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కలి్పంచాలని ఆమె కోరింది. -
లావణ్య ఎవరో కూడా తెలియదు.. తనవన్నీ అబద్ధాలే: రాజ్ తరుణ్ హీరోయిన్
రాజ్ తరుణ్- లావణ్య టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే వీరిద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రిలేషన్లో ఉన్నాడంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేస్తోంది. అంతే కాకుండా తనను చంపేస్తానని బెదిరిస్తోందంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.అయితే లావణ్య చేస్తున్న ఆరోపణలపై తిరగబడరా స్వామి మూవీ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రియాక్ట్ అయింది. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని మాల్వీ కొట్టిపారేసింది. నా కుటుంబం గురించి ఆమె చేసిన కామెంట్స్ నిజం కాదని తెలిపింది. ఆమెపై తప్పకుండా ఫిర్యాదు చేస్తానని.. పరువునష్టం దావా వేస్తానని వెల్లడించింది. మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ..'ఆమె నా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్స్ తీసుకుంది. అవీ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎలా సేకరించిందో తెలియాలి. లావణ్యను నేను ఇప్పటివరకు కలవలేదు. ఆమె ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అంతే కాదు.. తన గురించి నాకేలాంటి వివరాలు తెలియదు. నేను కేవలం సినిమా గురించి మాత్రమే రాజ్ తరుణ్‌తో మాట్లాడతా. సెప్టెంబర్ నుంచి నాకు, రాజ్ తరుణ్‌కు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నాపై లావణ్య చేస్తున్నవన్నీ అవాస్తవాలే. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. దీనివల్ల నా రిప్యూటేషన్ దెబ్బతింటుంది. తప్పకుండా ఆమెపై పరువునష్టం దావా వేస్తా.' అని హెచ్చరించారు. కాగా.. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా తిరగబడరా స్వామి చిత్రంలో నటిస్తున్నారు. -
'రాజ్ తరుణ్‌కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్'.. లావణ్య షాకింగ్ కామెంట్స్!
రాజ్ తరుణ్- లావణ్య టాపిక్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదురుతోంది. హీరోయిన్ తామిద్దరం 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నామని.. ప్రస్తుతం మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నాడంటూ లావణ్య ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్‌కు చాలామంది హీరోయిన్స్‌తో రిలేషన్స్ ఉన్నాయంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది. లావణ్య మాట్లాడుతూ..'నాకు రాజ్ తరుణ్‌కు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. దాదాపు 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆమె నన్ను చంపేస్తానని బెదిరించింది. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో ఓ హోటల్లో ఉన్నారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను, రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తాను నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మస్తాన్ సాయికి, నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశా. కొందరు నాతో మైండ్‌గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో నేను, మస్తాన్ సాయి ఇద్దరం బాధితులమే. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను.' అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. 'నేను, మస్తాన్ సాయి ఎప్పుడు కూడా జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతను కేవలం నా మ్యూచ్‌వల్ ఫ్రెండ్. నాతో ఎవరు మాట్లాడినా అతనితో రిలేషన్లో ఉన్నట్లేనా? నాకు అన్యాయం జరిగింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నా దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం నేను బెదిరించాల్సిన పనిలేదు. అతని కోసం చాలా భరించాను. రాజ్ తరుణ్‌కు చాలామంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయి. ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
రాజ్ తరుణ్‌తో ఎఫైర్‌పై స్పందించిన మాల్వి మల్హోత్రా
ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకాపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హీరో రాజ్‌తరుణ్ తనతో సహజీవనం చేస్తూనే మరో పక్క మాల్వి మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా స్పందించింది.మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. 'రాజ్‌తరుణ్‌తో నటించిన ప్రతీ హీరోయిన్ను లావణ్య అనుమానిస్తుంది. ఇప్పటి వరకు ఆమెతో నాకు ఎలాంటి పరిచయం లేదు. నేను తనను బెదిరించలేదు. లావణ్యనే ప్రతిరోజూ నాకు మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తోంది. రాజ్ తరుణ్ నా సహ నటుడు మాత్రమే. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. లావణ్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఆమె చెబుతున్నవన్నీ అబద్దాలే' అని పేర్కొంది.చదవండి: హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో ట్విస్ట్!'రాజ్‌తరుణ్‌తో నాకు పెళ్లి అయినట్లు ఆమె చెబుతున్నదాంట్లో నిజం లేదు. ఆమె ఇలాంటి కథలు చెబుతుంది. లావణ్య చేస్తున్న టార్చర్ భరించలేక ఆమె నంబర్‌ను నేను బ్లాక్ చేశాను. ఈ విషయాన్ని రాజ్‌తరుణ్‌తో కూడా చెప్పాను. ఆ సమయంలో ఆమె నా తల్లదండ్రులకు కూడా ఫోన్ కాల్స్ చేసి వార్నింగ్ ఇచ్చింది. నా కుటుంబ సభ్యులు నంబర్స్ రాజ్‌తరుణ్ వద్ద కూడా లేవు. ఆమె ఎలా సంపాధించిందో తెలాల్సి ఉంది. ఆమె కాల్స్ చేసి భూతులు మాట్లాడుతుంది. తనకు ఎలాంటి సిగ్గులేదు. సమస్య వారిద్దరిదీ. కానీ, ఈ గొడవలు నా పేరు ఎందుకు తీస్తుందో తెలియదు. ఆమె టార్చర్ భరించలేకనే నేను ఎనిమి నెలలుగా రాజ్‌తరుణ్‌తో టచ్‌లో లేను. సినిమా విడుదల సమయంలో మాత్రమే ఆయనతో మాట్లాడుదానిని. మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. ఇలాంటి రూమర్స్ ఇంతటితో ఆపేస్తే మంచిది. ఇప్పుడు నేను కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తా.' అని మాల్వి మల్హోత్రా తెలిపింది. ప్రస్తుతం ఆమె సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. -
రాజ్ తరుణ్ - లావణ్య కేసులో ట్విస్ట్
-
హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో ట్విస్ట్!
ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, తాను పదకొండేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబైకి చెందిన హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ పిర్యాదులో పేర్కొంది. అయితే ఈ కేసులో నార్సింగి పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. పిర్యాదులో పేర్కొన్న ఆధారాలు సమర్పించాలంటూ తిరిగి లావణ్యకే నోటీసులు అందించారు. శుక్రవారం మధ్యాహ్నం లావణ్య ఫిర్యాదు చేయగా.. సాయంత్రమే పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన నాలుగు పేజీల ఫిర్యాదు ఫార్మాట్లో లేదని,నేరం జరిగితే సమయం, ప్లేస్..ఇలాంటి వివరాలేవి అందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. లావణ్య చేసిన ఫిర్యాదుపై ఆధారాలు ఇవ్వమని నోటీసులు ఇచ్చినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు లావణ్య అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది.ప్రాణహానీ ఉంది: లావణ్యహీరో రాజ్‌తరుణ్ తనతో సహజీవనం చేస్తూ మాల్వి మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఆమె మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు రాజ్‌తరుణ్, మాల్వి కలిసి ఇటీవల గోవా, చెన్నై, పాండిచ్చేరిలకు కలిసి వెళ్లారని, ఇదే విషయాన్ని నిలదీస్తే తనను దూరం పెట్టాడని పేర్కొంది. రాజ్‌తరుణ్‌ని వదిలేస్తే కొంత డబ్బు ఇస్తామని, లేదంటే చంపేస్తామని హీరోయిన్ సోదరుడు బెదిరించాడని తెలిపింది. తనకు ప్రాణహానీ ఉందని, కాపాడాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. అయితే అధారాలు సమర్పించాలని పోలీసులు లావణ్యను కోరారు.రిలేషన్లో ఉన్న మాట నిజమే కానీ.. : రాజ్తరుణ్లావణ్య ఫిర్యాదు తర్వాత రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ..గతంలో ఆమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమేనని.. విడిపోయి చాలా కాలం అవుతుందని చెప్పారు. 2014 నుంచి 2017 వరకు లావణ్యతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నానని చెప్పారు. తనకు మందు, సిగరేట్‌తో పాటు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, ఎన్నిసార్లు చెప్పినా మానేకపోవడంతో తాను బయటకు వచ్చానని చెప్పారు. -
రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్
-
ఆమె అలవాట్లు చూసి భయపడ్డా.. అందుకే నా ఇంటి నుంచి బయటికి వచ్చేశా: రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నారని ఆరోపించింది. అతడిని వదిలేయకపోతే తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ ఆరోపణల పై హీరో రాజ్ తరుణ్స్పందించాడు. తన రిప్యూటేషన్ ఎక్కడా దెబ్బతింటుందో అని ఇన్నాళ్లు బయటికి చెప్పలేదని అన్నారు. అంతే కాకుండా తాను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్లో లేనని తెలిపారు.నా ఇంటి నుంచే బయటికి వచ్చేశా..తాను గుంటూరులో నా ఇంటిలోనే ఉండేదని రాజ్ తరుణ్ వెల్లడించారు. నా సొంతింట్లినే లావణ్య పైన ఉండేదని.. అక్కడ మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసి ఉన్నారని తెలిపారు. తనకు మందు, సిగరెట్ అలవాటు ఉందని.. డ్రగ్స్ నా జీవితంలో ఎప్పుడు తీసుకోలేదని అన్నారు. మస్తాన్ సాయి.. ఆమెను విపరీతంగా కొట్టేవాడని.. దీనికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయన్నారు. అతనిపై కేసు పెట్టి కూడా.. నా ఇంట్లోనే మళ్లీ అతనితోనే ఉంటోందని అన్నారు. ఆమె అలవాట్లు నచ్చక నేను ఇంటి నుంచి బయటికి వచ్చేశానని తెలిపారు. ఒక అమ్మాయికి చెందిన అశ్లీల ఫోటోలు, వీడియోలు పెట్టుకుని వాళ్ల ఫాదర్‌ను బ్లాక్మెయిల్ చేసిందని రాజ్ తరుణ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కేవలం నా ఇమేజ్ దెబ్బతింటుందని పోలీసులకు చెప్పేందుకే బయపడ్డానని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యా.. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. లావణ్యకు కూడా తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు నా ఇంటి కోసమే ఈ రచ్చ అంతా చేస్తోందని ఆయన ఆరోపించారు.ఆమెపై కృతజ్ఞత ఉంది.. కానీ..ఆమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమేనని.. కానీ అది కేవలం 2014 నుంచి 2017 వరకు మాత్రమేనని రాజ్ తరుణ్ అన్నారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వివరించారు. డ్రగ్స్ తీసుకోవద్దని తనకు చాలాసార్లు చెప్పానని తెలిపారు. ఆమెతో ఏడేళ్లుగా దూరంగానే ఉంటున్నానని.. ఇప్పటికీ ఆమెపై తనకు కృతజ్ఞత ఉందని.. అందుకే నా ఇంటి నుంచి నేనే బయటికి వచ్చేశానని రాజ్ తరుణ్ వెల్లడించారు. నాపైనే కాదు... మస్తాన్ సాయిపైనా కేసు పెట్టింది ఇప్పుడు కూడా అతనితోనే...Raj Tarun Reveled Shocking Facts, Lavanya Relationship With Mastan Sai#rajtarun #rajtaruncase #rajtarunloverlavanya #latestnews #sakshiNews pic.twitter.com/OSEgrah0Ae— Sakshi TV Official (@sakshitvdigital) July 5, 2024 -
రాజ్ తరుణ్ లవర్ లావణ్య సంచలన ఆడియో
-
రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు
-
లీవ్ అడిగిన పాపానికి..
వరదయ్యపాళెం: మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి లావణ్య, సిబ్బంది నడుమ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. దీంతో అటెండర్ పుష్ప, ల్యాబ్ టెక్నీషియన్ నీరజ మంగళవారం వైద్యాధికారిణి లావణ్యపై శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనారోగ్య కారణాలతో లీవ్ కోసం అటెండర్ పుష్ప విన్నవించుకోగా పట్టించుకోక పోవడంతో తన భర్త ద్వారా టెలిఫోన్లో వైద్యాధికారిణిని మరోమారు విన్నవించే ప్రయత్నం చేశారు. అయితే అటెండర్ పుష్ప వ్యక్తిగత విషయాల గురించి ఆమె భర్తకు వైద్యాధికారిణి లావణ్య చెడుగా చెప్పడంతో కుటుంబంలో వివాదం తలెత్తింది. దీంతో మూడు రోజుల క్రితం పుష్ప భర్త, భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు పంపేశాడు. ఈ విషయమై ఆధారాలతో సహా పోలీసులకు అందజేసి న్యాయం కోసం అటెండర్ పుష్ప ఫిర్యాదు చేసింది. అలాగే హాస్పిటల్‌లోని ల్యాబ్ టెక్నీషియన్ నీరజతో కూడా దురుసుగా ప్రవర్తించడం, తరచూ విధుల నిర్వహణలో తన పట్ల భేదాభిప్రాయంతో వ్యవహరిస్తోందని, వీరిద్దరూ శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ గౌస్‌పీర్‌ను వివరణ కోరగా పీహెచ్సీ డాక్టర్‌పై రెండు ఫిర్యాదులు అందాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వాళ్లు గొంతు నొక్కేది మీ బిడ్డ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. : సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాజకీయాల్లో.. పట్టపగలే ఇంతదారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిణామాలను చూస్తున్నామని, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలకు తెర తీశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రచార సభలో అన్నారు.‘‘ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం?. వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉందంటే.. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందనో.. అన్ని వర్గాలు ఎక్కడ జగన్‌ను తమ వాడిగా భావిస్తున్నాయో అని అసూయతో కుట్రలకు తెర తీశాయి... అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్తాయో అని దానిని కూడా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్.. మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తున్నాడు. కానీ, ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు... మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి.. ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి.. సింకులోనే ఉండాలి.నా చెల్లిని పరిచయం చేస్తున్నా. లావణ్యమ్మ(మురుగుడు లావణ్య) మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి. ప్రతీ ఒక్కరూ ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా రోశయ్య నిలబడుతున్నారు. మీ ఆశీస్సులు రోశయ్యపై కూడా ఉంచాల్సిందిగా కోరుతూ.. ఓటేయమని కోరుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!
-
మహిళ చేతిలో నారా లోకేష్ చిత్తు చిత్తు..
-
వాళ్ల దగ్గర ఉన్నంత డబ్బు లేదు.. మంగళగిరి ముఖాముఖిలో చంద్రబాబు, లోకేష్‌ను ఏకేసిన సీఎం జగన్
-
బాబు బ్యాచ్ ఇళ్ల పట్టాలు ఆపారు.. ఓట్లకు వస్తే నిలదీయండి: సీఎం జగన్
సాక్షి, మంగళగిరి: ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. కాగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు. 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదు. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేది. దళారులు లేకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం మనది. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థతో అవ్వాతాతలకు పెన్షన్ అందించిన ప్రభుత్వం మనది. పెన్షన్‌ను రూ.3వేలకు పెంచి అందించే అవకాశం నాకు వచ్చింది. 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. బీసీలు ఎక్కువగా ఉన్నా.. చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు టికెట్ ఇవ్వరు. మనం మాత్రం చేనేత వర్గానికి చెందిన చెల్లెమ్మెకు టికెట్ ఇచ్చాము. మంగళగిరిలో లక్షా 20వేల ఇళ్లున్నాయి. లక్షా 8వేల ఇళ్లకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాం. 90 శాతం ఇళ్లకు లంచాలకు తావులేకుండా లబ్ధి జరిగింది. నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేసిన ప్రభుత్వం మనదిఅని తెలిపారు. పేదలకు మంచి జరిగితే అడ్డుకునే వాడు రాజకీయ నాయకుడా?. మేనిఫెస్టోలో చెప్పే ప్రతీ హామీని నెరవేర్చిన ప్రభుత్వం మనది. మంగళగిరిలో పేదలకు 54వేల ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు. కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసి చంద్రబాబు అడ్డుకున్నాడు. మీ ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది చంద్రబాబే. అందుకే ఓటు వేయమని అడిగినప్పుడు చంద్రబాబును నిలదీయండి’ అని కోరారు. -
సత్తుపల్లి అమ్మాయి.. స్పెయిన్ అబ్బాయి
ఖమ్మం: వారి ప్రేమ ఖండాంతరాలు దాటి వివాహ బంధంతో ఏకమైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన విద్యాభారతి కళాశాల డైరెక్టర్ మందడపు సత్యనారాయణ – సుజని దంపతుల కుమార్తె లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్ దేశంలోని బార్సిలోనలో ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో స్టాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన స్పెయిన్ దేశానికి చెందిన మార్క్ మన్సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇరుపక్షాల తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. సత్తుపల్లిలోని శ్రీసాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో బుధవారం అర్ధరాత్రి 12.53 నిమిషా లకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఒకటయ్యారు. ఇవి చదవండి: శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు -
ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం
-
నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
-
బెంగళూరు టు హైదరాబాద్
మణికొండ: లావణ్య ఫోన్ కాంటాక్ట్ లిస్ట్, కాల్ డేటా, సోషల్ మీడియా చాట్ల ఆధారంగా డ్రగ్స్ రాకెట్‌పై నార్సింగి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లావణ్యతోపాటు ఉనీత్రెడ్డిలపై 2022లో గుంటూరు జిల్లా పట్టాభిపురం, 2023లో మోకిల పోలీస్స్టేషన్లలో డ్రగ్స్ కేసులు నమోదైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. లావణ్యకు పలువురు టాలీవుడ్ నటులు, వీఐపీలతో పరిచయాలు ఉన్నట్టు గుర్తించారు. లావణ్య, ఉనీత్రెడ్డిలు బెంగళూరులో రూ.1,500లకు గ్రాము చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.6,000 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. విజయవాడ నుంచి ఉన్నత చదువులకు హైదరాబాద్ వచ్చి హోటల్ మేనేజ్మెంట్ చేసిన లావణ్య, ఆ రంగంలో స్థిరపడకుండా..మ్యూజిక్ నేర్చుకుంది. అదే క్రమంలో షార్ట్ ఫిలింలు, పలు చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా అవకాశాలు దక్కించుకుంది. మరిన్ని సినిమా చాన్స్‌ల కోసం ప్రయత్నిస్తోంది. ఉనీత్‌రెడ్డి కూడా షార్ట్ ఫిల్మ్‌లలో నటించాడు. ఉనీత్‌రెడ్డి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి లావణ్య,తోపాటు తన గర్ల్ ఫ్రెండ్. తదితరులు ఇచ్చేవాడు. వారు వాడటమే కాకుండా, ఇతరులకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. లావణ్యకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆమెను తమ కస్టడీకి తీసుకొని లోతుగా విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నుంచి అనుమతి రాగానే పూర్తిస్థాయి విచారణ చేస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ఉనీత్‌రెడ్డి పరారీలో ఉన్నాడని, అతడి ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. -
లావణ్య కథా చిత్రం
-
నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
-
నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఈ క్రమంలో అరెస్టైన నటి లావణ్య కస్టడీ కోరుతూ సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రోజులపాటు ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. విజయవాడ నుంచి ఉన్నత చదవుల కోసం లావణ్య హైదరాబాద్‌కు వచ్చినట్లు తేలింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. షార్ట్ ఫిలిం, పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె.. జల్సాలకు అలవాటు పడినట్లు తెలిసింది. కస్టడీ పిటిషన్లో పేర్కొన్న అంశాలు నార్సింగి డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ యువతి , ఉనీత్ రెడ్డి లను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుండి 4 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం యువతి హ్యాండ్ బ్యాగ్ లభ్యమైన డ్రగ్ సంగీతం టీచర్ పని చేస్తున్న లావణ్య టాలీవుడ్ హీరోకు ప్రేయసిగా ఉన్న యువతి ఉనీత్ రెడ్డి తనకు డ్రగ్ ప్యాకెట్లు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపిన లావణ్య కొద్దీ రోజుల క్రితం ఉనీత్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన లావణ్య పక్క సమాచారం తో లావణ్య ను తనిఖీ చేసి SOT పోలీసులు NDPS 22బీ, రెడ్ విత్ 8సి కింద కేసులు నమోదు చేసిన నార్సింగి పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కి నిందితులు ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య.. అతనికి ప్రియురాలిగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మూడు నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులోఅనుమానితురాలిగా ఉంది. ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్ పరిశీలిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది వీఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో A3గా ఉన్న ఇందూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: సారీ, నేను ఓడిపోయాను..! అసలేం జరిగిందంటే.. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న యువతి వద్ద డ్రగ్స్ ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగి పోలీసులు సోదాలు నిర్వహించి ఆమె నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. నార్సింగి నుంచి కోకాపేటకు వెళ్లే దారిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య అనే యువతి వద్ద ఆదివారం తనిఖీలు చేయగా 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.50 వేల వరకు ఉండగా వాటితో పాటు ఓ సెల్‌ఫోన్, రెండు ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్ర ఎడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు యువతి తెలిపింది. యువతిని అరెస్టు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి 14 రోజులపాటు రిమాండ్‌కు పంపారు. -
డ్రగ్స్‌తో పట్టుబడ్డ టాలీవుడ్ హీరో ప్రేయసి!
రంగారెడ్డి: హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నార్సింగిలో సైబరాబాద్ పోలీసుల దాడుల్లో డ్రగ్స్‌తో ఓ యువతి.. మరో వ్యక్తి పట్టుబడ్డారు. వాళ్ల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణలో ఆమె ఓ యువహీరో ప్రేయసిగా తేలింది. ఎస్ఓటీ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగీలో డ్రగ్స్ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఎస్వోటీ బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఓ యువతియువకుడి దగ్గరనుంచి 4 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి ఆ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. అయితే విచారించే క్రమంలో ఆ యువతి టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో ప్రేయసి గుర్తించారు. షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు దక్కించుకుని వెండితెరపై అవకాశాలు దక్కించుకున్నాడు ఆ యువ హీరో. మొన్న సంక్రాంతికి ఓ అగ్రహీరో చిత్రంలోనూ ఆ హీరో చిత్రంలోనూ ఆ యంగ్ హీరో నటించాడని పోలీసులు చెబుతున్నారు. రిమాండ్ విధింపు సదరు యువతి మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అనంతరం ఆమెను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
చేగువేరా బయోపిక్ 'చే' ఎలా ఉందంటే..
టైటిల్: ‘చే’ నటీనటులు:లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్ తదితరులు నిర్మాణ సంస్థ: బ్యానర్: నేచర్ ఆర్ట్స్ నిర్మాతలు: సూర్య , బాబు, దేవేంద్ర రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్ సంగీతం: రవిశంకర్ సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి, జగదీష్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. విప్లవం బాట పట్టిన 'చే' (సభావత్ నాయక్) పలు దేశాలు తిరుగుతూ పీడిత జనాన్ని చైతన్య పరుస్తుంటాడు. ఓ సారి పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడతాడు. గాయపడిన 'చే'ను గిరిజన గ్రామస్తులు కాపాడుతారు. ఆ క్రమంలో సింగి (లావణ్య) 'చే'ను ప్రేమిస్తుంది. శరీరకంగానూ దగ్గరవుతుంది. ఆకలి, నిరక్షరాస్యత, అనారోగ్యం తదితర సమస్యలపై దృష్టిపెడతాడు. కేవలం కడుపు నింపుకోవటం కోసమే పని చేసే పరిస్థితి నుండి ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో పోలీసుల చేతిలో తన దళ సభ్యులు చనిపోతారు. చివరికి 'చే' కూడా బొలీవియా సైనిక దళాలకు బందీగా చిక్కుతాడు. ఆ తర్వాత ఏమైందీ? తను ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంది? అనేదే ఈ సినిమా కథ. ఎవరెలా చేశారంటే.. చేగువేరా పాత్రలో బిఆర్ సభావత్ నాయక్ చక్కగా నటించాడు. ఈ తరం ప్రేక్షకులకు చేగువేరా ఎలా ఉంటాడో పూర్తిస్థాయిలో చూపించాడు. లీడ్ రోల్లో సభావత్ నాయక్ చెప్పిన డైలాగ్‌లు ఈ సినిమా హైలైట్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. చే కు జంటగా నటించిన లావణ్య తన పాత్రలో చక్కగా నటించింది. ఒక అందమైన అమాయకపు గిరిజన అమ్మాయిగా నటించి తన పాత్రకు పరిపూర్ణత తెచ్చింది. ఇక ఇతర పాత్రల్లో నటించిన పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్ తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ విప్లవం అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికి గుర్తొచ్చే పేరు చేగువేరా. అలాంటి వీరుడి జీవిత చరిత్రను తెరకెక్కించిన మూవీ ‘చే’.సాధారణ కథతో పాటు, చేగువేరా లైఫ్ గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలను కూడా ఎంతో ఆసక్తిగా తెరకెక్కించాడు దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్. సినిమాలోని పాత్రలు ఇండియాలో మాదిరిగానే కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే గిరిజనులను పోలి ఉంటాయి. చేగువేరా బయోపిక్‌ను మన నెటివికి దగ్గరగా చూపించాలన్న ఉద్దేశంతోనే సినిమా తీసినట్టు మనకు అర్థమవుతుంది. చరిత్రను తెరపై చూపించడం చిన్న విషయం కాదు..ఉన్నది ఉన్నట్లు చూపించకపోతే చరిత్రకారులు ఒప్పుకోరు.. సినిమాటిక్ లిబర్టీ తీసుకోకపోతే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ‘చే’ విషయంలో కూడా అదే జరిగింది. చాలా వరకు చేగువేరా జీవితాన్ని నేచురల్ గా చూపించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. కమర్షియల్ హంగులకి పెద్దపీట వేయలేదు. చాలా నిజాయితీగా సినిమాను తెరకెక్కించాడు. టెక్నికల్ విషయాలకొస్తే..రవిశంకర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్. సినిమాటోగ్రాఫర్లు కళ్యాణ్ సమి, జగదీష్ పనితీరు బాగుంది.ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు పర్వాలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ అతిసాధారణ వ్యక్తి ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించడం నిజంగా అభినందించాల్సిందే. -
Varun Lavanya Tripathi Konidela: ఈ జంట హనీమూన్ ఫోటోస్ చూశారా?
-
న్యూ లుక్ లో వైష్ణవ్ తేజ్..ఎందుకో తెలుసా..?
-
Varun Lavanya Pre Wedding Pics: ఘనంగా వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఏ సినిమానీ చిన్నది అనొద్దు
‘‘ఏ సినిమానీ చిన్నది అనొద్దు. కొత్త వాళ్ల సినిమా అనాలి. నేను రావడం వల్ల ఓ సినిమాకు మంచి జరుగుతుందంటే ప్రమోషన్‌కు వస్తాను.. అది నాకు తృప్తినిస్తుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. చైతన్యా రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ–‘‘ఈ మూవీ హిట్ అవుతుందని ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. యూనిట్‌కి మంచి సక్సెస్ రావాలి’’ అన్నారు.. -
‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ మూవీ రివ్యూ
టైటిల్: అన్నపూర్ణ ఫొటో స్టూడియో నటీనటులు: చైతన్య రావ్, లావణ్య,మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య నిర్మాణ సంస్థ: బిగ్ బెన్ సినిమాస్ నిర్మాత: యష్ రంగినేని దర్శకత్వం: చెందు ముద్దు సంగీతం: ప్రిన్స్ హెన్రీ విడుదల తేది: జులై 21, 2023 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో మంచి ఫేం అందుకున్న చైతన్య రావ్, యూట్యూబ్ వీడియోలతో పాటు హిట్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో. ఈ సినిమాను బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించగా ఒక పిట్ట కథ లాంటి సినిమాతో అందరినీ ఆకట్టుకున్న చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిర, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించగా టీజర్ ట్రైలర్ వంటి వాటితో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకుంది. దీంతో సినిమాని ముందుగానే మీడియా కోసం స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. పచ్చటి పొలాలు, చుట్టూ గోదావరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ఒక గ్రామంలో సూసైడ్ చేసుకోబోయిన అదే ఊరికి చెందిన చంటి (చైతన్యరావ్)ను పోలీసులు ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. అతను రాసుకున్న సూసైడ్ నోట్ చదివే క్రమంలోనే ఈ సినిమా మొదలవుతుంది. చదువు పూర్తయి వయస్సు మీదపడినా పెండ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోయినా తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు తన తల్లిపేరుతో అన్నపూర్ణ ఫొటో స్టూడియోను నడుపుతుంటాడు. ఊర్లో బేరాలు కంటే ఎక్కువగా స్నేహితులతో కలిసి సందడి చేస్తూ ఉంటాడు చంటి. అనుకోకుండా తన చెల్లిని కాలేజీలోనే కొత్తగా జాయిన్ అయిన గౌతమి (లావణ్య)తో ప్రేమలో పడతాడు. కొన్నాళ్లకు ఆమె కూడా చంటిని ప్రేమిస్తుంది. ఇలా సాగిపోతున్న క్రమంలో అనుకోకుండా ఓ మర్డర్ కేసులో చంటి ఇరుక్కుంటాడు. ఎవరూ చూడలేదు కదా అనుకుంటే ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత చంటి ఏం చేశాడు? అసలు సింధు ఎవరు? లావణ్యతో చంటి ప్రేమ ఏమైంది? అసలు చంటి సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? చివరికి చంటి బతికి బట్ట కడతాడా? అనేది సినిమా కథ. ఎలా ఉందంటే.. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్. దానికి చిన్న క్రైమ్ టచ్ కూడా ఇచ్చారు. నిజానికి తెలుగు వారందరికీ ఇలా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఏ మాత్రం కొత్త కాదు. ఈ కథ కూడా కొత్తగా అనిపించదు కానీ నడిచినంత సేపు ఆద్యంతం ఆసక్తికరంగా వెళ్ళిపోతుంది. సినిమా మొదలైన వెంటనే ఇది పెద్ద వంశీ స్టైల్ లో తెరకెక్కించిన సినిమా అనే విషయం ఈజీగా అర్థమవుతుంది. వయసు మీద పడిన పెళ్లి కాక ఇబ్బందులు పడే హీరో తనకన్నా రెట్టింపు వయసు వాడితో ప్రేమలో పడే హీరోయిన్, ఎలాంటి బాధ్యతలు లేకుండా గాలికి తిరిగే తొట్టి గ్యాంగ్ ఇలా ఆసక్తికరంగా కథ కథనాలు రాసుకున్నాడు డైరెక్టర్. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే సినిమాలో ఉన్న అన్ని పాత్రల చేత కామెడీ చేయించాలని ట్రై చేశారు కానీ పూర్తిస్థాయిలో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగుతూ ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగా డిజైన్ చేసుకున్నారు. అయితే సినిమాలో కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారనే విషయం రివిల్ చేసి కొంత ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఫ్యామిలీతో కలిస్ చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఎవరెలా చేశారంటే.. నటీనటుల విషయానికి వస్తే అటు చైతన్య రావు ఇటు లావణ్య వేరు వేరు సినిమాలలో అలాగే యూట్యూబ్ వీడియోలలో కనిపించిన ఇద్దరికీ ఇది హీరో హీరోయిన్లుగా మొదటి సినిమా కావడంతో చాలా ఫ్రెష్ ఫీల్ కలిగింది. వయసు పైబడిన పెళ్ళికాని ప్రసాదు లాంటి పాత్రలో చైతన్య రావు తనకన్నా రెట్టింపు వయసు వ్యక్తిని ప్రేమించే పాత్రలో లావణ్య జీవించారు, ఆమె నటన నేచురల్ గా ఉంది. సినిమాను మలుపు తిప్పే పాత్రను నిర్మాత యష్ రంగినేని పోషించి నిర్మాతగానే కాదు నటుడుగా కూడా ఆకట్టుకున్నారు. వైవా రాఘవ మినహా దాదాపు మిగతా పాత్రధారులు అందరూ కొత్తవారే అయినా తమ తమ పాత్రల పరిధి మీద ఆకట్టుకున్నారు. అయితే కామెడీ ఇంకాస్త వర్కౌట్ అయితే సినిమా వేరే లెవెల్ లో ఉండేది. టెక్నికల్ విషయాలు పరిశీలిస్తే చందు ముద్దు రాసుకున్న కథనాలు ఆకట్టుకున్నాయి కానీ కామెడీ విషయం మీద మరికొంత శ్రద్ధ పెడితే బాగుండేది. ప్రిన్స్ హెన్రీ సంగీతం ఆకట్టుకుంది అయితే నేపథ్య సంగీతం విషయంలో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. పంకజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోశాడు. పచ్చటి పొలాలను ప్రకృతి అందాలను ఒడిసిపట్టి ప్రతి ఫ్రేమ్ ని ఒక ఓ అందమైన పెయింటింగ్ ఏమో అనిపించేలా చూపించాడు. ఎస్.పి. చరణ్ పాడిన రంగమ్మ సాంగ్ చాలాకాలం గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమా ఎడిటింగ్ కూడా వంక పెట్టలేకుండా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఫొటో స్టూడియోలో ప్రేమ
‘‘ప్రేక్షకులకు మనం ఎప్పటి కథ చెబుతున్నామన్నది ముఖ్యం కాదు. ఆ కథను ఎలా చెబుతున్నామన్నదే ముఖ్యం. ‘సీతారామం’ సినిమా 1960ల నేపథ్యంలో ఉన్నా ప్రేక్షకులు ఆదరించారు. అందుకే 1980ల నేపథ్యంలో రూ΄÷ందిన మా ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు చెందు ముద్దు అన్నారు. చైతన్యా రావ్, లావణ్య జంటగా యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు చెందు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘ఓ పిట్ట కథ’. ఇప్పుడు ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ తీశాను. ఈ చిత్రంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను వినోదాత్మకంగా చూపిస్తున్నాం. మాలాంటి కొత్త వాళ్లను ప్రేక్షకులు ్ర΄ోత్సహించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి’’ అన్నారు. -
పల్లెటూరి ప్రేమ కథ
‘‘పల్లెటూరిలో జరిగే ప్రేమ కథే ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఒక అనూహ్య ఘటన వల్ల హీరో, హీరోయిన్ల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, పక్కా వాణిజ్య అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నిర్మాత యష్ రంగినేని అన్నారు. చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ఈ నెల 21న విడుదలఅవుతోంది. చిత్ర నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ– ‘‘నాకు పాత తెలుగు సినిమాలంటే ఇష్టం. లండన్ వెళ్లినప్పుడు ఎన్టీఆర్‌గారి పాత సినిమాలు చూస్తుంటాను. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ని చెందు బాగా తీశాడు. నేను కూడా ఓ పాత్ర చేశాను. విజయ్ దేవరకొండతో మేము నిర్మించిన ‘పెళ్ళి చూపులు, డియర్ కామ్రేడ్’ సినిమాలను త్వరలో రీ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
మనసుకు హత్తుకునే ప్రేమకథ
‘నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్లలో ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమా ట్రైలర్. చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ‘ఇచ్చట ఫోటోలు అందంగా తీయబడును’ అనేది క్యాప్షన్. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ బాగుంది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘1980–1990 నేపథ్యాన్ని మళ్లీ గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు చైతన్య రావ్. ‘‘ఫస్టాఫ్ ఫన్నీగా, సెకండాఫ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా కథనం సాగుతుంది’’ అన్నారు చెందు ముద్దు, యష్ రంగినేని. ‘మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథ’, ‘చంటి జాతకంలో ప్రాణగండం ఉంది’, ‘ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో చావు తప్ప నాకు వేరే దారి లేదు’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. -
క్వాలిటీ ఫిల్మ్‌లా అనిపిస్తోంది: మారుతి
చైతన్యా రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో యష్ రంగినేని నిర్మించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఈ సినిమా జూలై 21న రిలీజ్ కానున్న సందర్భంగా శుక్రవారం టీజర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘1980, 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఆ నేటివిటీ ఎక్కడా మిస్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్ చూస్తుంటే క్వాలిటీ ఫిల్మ్‌లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే మా చిత్రం భిన్నంగా ఉంటుంది’’ అన్నారు చెందు ముద్దు. -
పల్లెటూరి ప్రేమకథ
చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 21న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా యష్ రంగినేని మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. చెందు ముద్దు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందించారు. 80 దశకం నేపథ్యంతో పీరియాడిక్ సినిమాగా సాగుతుంది. మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రి¯Œ ్స హెన్రీ, కెమెరా: పంకజ్ తొట్టాడ. -
తిరుపతిలో లావణ్య ఫోటో ఫ్రేమ్స్ షాపులో భారీగా మంటలు..!
-
ఒంటరిగా ఉన్నపుడు ఎమ్మెల్యే ఇంకేం చేస్తాడో అని భయమేస్తుంది
-
అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో ఏం జరిగింది?
చైతన్యరావు, లావణ్య హీరో హీరోయిన్లుగా చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ‘ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును’ అనేది ఉపశీర్షిక. బిగ్‌బెన్ సినిమాస్‌పై యశ్ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేసి, సినిమా హిట్ సాధించాలని ఆకాంక్షించారు. చైతన్యరావు మాట్లాడుతూ –‘‘ఇప్పుడున్న ఫాస్ట్‌లైఫ్ నుంచి దూరంగా ప్రేక్షకులను 1980 నేపథ్యంలోకి తీసుకువెళ్లే సినిమా ఇది’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథే ఈ చిత్రం. కథలో ఉన్న ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు చందు. ‘‘ఫన్, థ్రిల్లింగ్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత యశ్ రంగినేని. -
భార్యను గొడ్డలితో నరికి.. పసికందును సంపులో పడేసి..
అబ్దుల్లాపూర్‌మెట్: భార్యను గొడ్డలితో నరికి చంపి.. నెలన్నర పసికందును సంపులో ముంచి హత్య చేశాడో వ్యక్తి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం అనాజ్‌పూర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏర్పుల ధన్‌రాజ్‌కు బండరావిరాలకు చెందిన కందికంటి నర్సింగ్‌రావు పెద్దకూతురు లావణ్య (28)తో 2018లో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఆద్య, రెండు నెలల వయసున్న కుమారుడు క్రియాన్స్ ఉన్నాడు. కొంతకాలంగా ధన్‌రాజ్ అదనపు కట్నం కోసం భార్యను వేధి స్తున్నాడు. ఇదే విషయంపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్దమనుషులు పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. కాగా, డెలివరీ తర్వాత లావణ్య పుట్టింట్లోనే ఉండగా.. కుమారుడికి టీకా వేయించాలని చెప్పి ధనరాజ్ బుధవారం లావణ్యను అనాజ్‌పూర్‌కు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా.. కోపోద్రిక్తుడైన ధన్‌రాజ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అలాగే పసికందును ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో ముంచి హత్య చేశాడు. తల్లిదండ్రులు గొడవ పడుతుండటాన్ని గమనించిన కూతురు ఏడుస్తూ బయటకు రావడంతో ఇరుగుపొరుగు వచ్చే సరికి ధన్‌రాజ్ అక్కడి నుంచి పరారయ్యాడు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి , సీఐ స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే హత్యలకు కారణమని, నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
‘వాలెంటైన్స్ నైట్’మూవీ రివ్యూ
టైటిల్: వాలెంటైన్స్ నైట్ నటీనటులు: చైతన్య రావు, లావణ్య, సునీల్, పొసానికృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నిర్మాతలు: తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి, మహీంధర్ నారల దర్శకుడు : అనిల్ గోపిరెడ్డి సంగీతం: అనిల్ గోపిరెడ్డి సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి కథేంటంటే.. రేడియో జాకీగా పని చేసే అజయ్(చైతన్య రావు), ప్రియ(లావణ్య)ను సిన్సియర్‌గా ప్రేమిస్తాడు. అయితే అనుకోకుండా వీరిద్దరికి బ్రేకప్ అవుతుంది. మరోవైపు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కృష్ణ (సునీల్) డ్రగ్స్ కి సంబధించిన వారిని పట్టుకుని ఎన్ కౌంటర్ చేస్తూ ఉంటాడు. ఈ డ్రగ్స్ దందాను నడుపుతున్న దాదా బ్యాచ్ ను పట్టుకోవడానికి విచారణ జరుపుతూ ఉంటాడు. అసలు ఈ దాదా ఎవరు ? వెనుక ఉండి ఈ డ్రగ్స్ దందాను ఎలా నడుపుతున్నాడు ? అజయ్, ప్రియ విడిపోవడానికి కారణం ఏంటి? చివరకు వారు ఎలా కలుసుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మంచి సందేశం ఉన్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది. డ్రగ్స్ వల్ల యూత్ ఎలా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారనే ఒక సామాజిక సమస్యగా తీసుకుని... ఇందులో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారు అనేది నిత్యం పరిశీలిస్తూ ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. అలాగే డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికే ఓ పారిశ్రామిక వేత్త... కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా ఉంటుందనే దాన్ని చక్కగా చూపించారు. దర్శకుడు అనిల్ గోపిరెడ్డి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి. కొన్ని బోల్డ్ సీన్స్ యూత్ కి కనెక్ట్ బాగా కనెక్ట్ అవుతాయి. ఎవరెలా చేశారంటే.. ఆర్.జె. అజయ్ గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు చైతన్య రావు. తెరపై చాలా డీసెంట్‌గా కనిపిస్తాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కృష్ణగా సునీల్ టెర్రిఫిక్ గా కనిపించారు. లావణ్య నటన కూడా చాలా బాగుంది. . కట్టుకున్న భార్యను, కూతురుని వదిలేసి డబ్బు సంపాధనే ధ్యేయంగా బతికే ఓ బిజినెస్ మ్యాన్ గా శ్రీకాంత్ అయ్యంగార్ నటన ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన పోసాని కృష్ణ మురళి, అలాగే ఫ్రెండ్ పాత్రలో నటించిన రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. అనీల్ గోపిరెడ్డి నేపథ్య సంగీతం, పాటలు పర్వాలేదు. జయపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
‘క్రైమ్ థ్రిల్లర్‌గా 'అం అః’.. రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడం చాలా కష్టంగా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్పా.. ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. . ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అం అః'. ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా ఈ చిత్రానికి శ్యామ్ మండల దర్శకత్వం వహిస్తున్నారు. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా విడుదలైన 'నీ మనసే నాదని' వీడియో సాంగ్ , టీజర్‌కి మంచి స్పందన లభించింది.సస్పెన్స్‌కి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. -
మరో కొత్త సినిమాను ప్రారంభించిన పెళ్లిచూపులు బ్యానర్
"పెళ్లి చూపులు", "డియర్ కామ్రేడ్", "దొరసాని" వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తన 6వ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించింది. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ పిట్ట కథ డైరెక్టర్ చెందు ముద్దు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారం ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నిర్మాత సురేష్ బాబు క్లాప్‌నివ్వగా దర్శకులు తరుణ్ భాస్కర్ కెమెరా స్విఛ్ ఆన్ చేసారు అలాగే మొదటి షాట్ కు దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మధుర శ్రీధర్ రెడ్డి, సందీప్ రాజ్, సాయి రాజేష్, మాటల రచయిత లక్ష్మీ భూపాల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ...మా మొదటి సినిమా పెళ్లి చూపులు విడుదలైన తేదీ జూలై 29. అదే రోజున మా కొత్త చిత్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దాదాపు అంతా కొత్తవాళ్లే నటిస్తున్న ఈ సినిమాకు కథే స్టార్ అన్నారు. హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ... నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. చెందు ముద్దును కలిసినప్పుడు ఈ కథ చెప్పారు. ఈ సబ్జెక్ట్ విన్నాక నా కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందనిపించింది అన్నారు. చదవండి: నాకేదైనా అయితే ఆ మాఫియాను వదలకండి, వెంటాడండి.. పుష్ప 2కి శిష్యుడి సాయం.. అంత సీన్ లేదన్న ఉప్పెన డైరెక్టర్ -
Lavanya: అందరికీ చెబుతుందనే లావణ్య హత్య
సాక్షి, చౌటుప్పల్: ‘లైంగికదాడికి పాల్పడిన సమయంలో గిరిజన మహిళ నన్ను గుర్తించింది. విషయాన్ని భర్తతో పాటు నేను పనిచేస్తున్న తాపీమేస్త్రీలకు చెబుతానని హెచ్చరించడంతో భయపడి హత్య చేశా’ అని ఈ నెల 9వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఈడిగి హరీష్‌గౌడ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. గిరిజన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బుధవారం తన కార్యాలయంలో స్థానిక ఏసీపీ ఉదయ్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూలు జిల్లా కోడూరు మండలం మైలారం పరిధిలోని కర్రెన్నబండతండాకు చెందిన ముడావత్ క్రిషీనా అతడి భార్య లావణ్య(28) ఇటీవల ఉపాధి నిమిత్తం మల్కాపురానికి వచ్చారు. అక్కడే ఉన్న ఓ కన్స్ట్రక్షన్ గోడౌన్లో లావణ్య వాచ్‌మన్‌గా, సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 9న భర్త విధులకు వెళ్లగా భార్య గోడౌన్ వద్ద ఒంటరిగా ఉంది. ఐదురోజులుగా వ్యూహరచన దండుమల్కాపురం శివారులో మూతబడిన ఓ డెయిరీలో కొంత మంది తాపీ మేస్త్రీలు ఉంటున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపురానికి చెందిన ఈడిగి హరీష్‌గౌడ్(25).. అంజనేయులు అనే మేస్త్రీ వద్ద కూలి పని చేస్తున్నాడు. ఈనెల 5న వారుంటున్న ప్రాంతంలో బోరు వేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మూతబడిన గోడౌన్లో లావణ్య ఒంటరిగా ఉండడాన్ని నిందితుడు గమనించి వివరాలు తెలుసుకొని అప్పటి నుంచి వ్యూహరచన చేస్తున్నాడు. హరీష్‌గౌడ్.. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ఉదయ్‌రెడ్డి భర్త డ్యూటీకి వెళ్లగానే.. ముడావత్ క్రిషీనా సోమవారం డ్యూటీకి వెళ్లడాన్ని హరీష్‌గౌడ్ గమనించి సమయం కోసం వేచిచూశాడు. సాయంత్రం 4గంటలకు బాత్రూంకు వెళ్లిన లావణ్య వద్దకు వెళ్లి లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడు. ప్రతిఘటించిన ఆమె తలపై కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతన్ని గుర్తించిన మృతురాలు విషయాన్ని భర్తతో పాటు ఇతరులకు చెబుతానంది. దీంతో నిందితుడు ఆమె తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతిచెందింది. అనంతరం మరోసారి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. విధులు ముగించుకొని రాత్రి ఎనిమిదిన్నరకు ఇంటికి వచ్చిన భర్త చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: (మాటేసి.. కాటేసి..) 24గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు లైంగికదాడి, హత్య ఘటనను పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు. ఘటనాస్థలిలో లభించిన కాళ్ల చెప్పుల ఆధారంగానే నిందితుడిని అతడు నివసించే మూతబడిన డెయిరీలోని గదిలో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరం అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. అతడి వద్ద 2బంగారు పుస్తెలు, 2 వెండి పట్టీలు, 4 వెండి మెట్టెలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై అత్యాచారం, హత్య, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్‌భగవత్ అభినందించారన్నారు. ఛేదించిన పోలీసులకు రివార్డు ప్రకటించారని తెలిపారు. సమావేశంలో సీఐలు ఎన్.శ్రీనివాస్, ఏరుకొండ వెంకటయ్య, ఎస్సైలు బి.సైదులు, డి.అనిల్, డి.యాకన్న పాల్గొన్నారు. -
లావణ్య సూసైడ్ కేసు.. స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!
తమిళనాడును కుదిపేసిన విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సీబీఐకు అప్పగించాలన్న మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. దీంతో రాష్ట్ర పోలీసులతోనే దర్యాప్తు చేయించాలన్న డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. సాక్షి, న్యూఢిల్లీ: తంజావూర్ విద్యార్థిని లావణ్య(17) బలవన్మరణ ఉదంతం తమిళనాడును, సోషల్ మీడియా ద్వారా దేశం మొత్తం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీ సీఐడీ లేదంటే సమానమైన దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించాలంటూ లావణ్య తండ్రి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో ఏకీభవించిన జస్టిస్ జీఎస్ స్వామినాథన్.. జనవరి 1న కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు వెలువరించారు. అయితే ఈ పరిణామం అనంతరం డీజీపీ ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టులో ఒక పిటిషన్(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయించింది. దీనిపై నేడు(సోమవారం) విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మధురై బెంచ్ తీర్పును సమర్థిస్తూ తమిళనాడు డీజీపీకి, ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అంతేకాదు ఇదేం ప్రెస్టీజ్ ఇష్యూ( సీబీఐకు అప్పగించడం ద్వారా రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించే విషయమేం కాదంటూ..) కాదంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది బెంచ్. అంతేకాదు దర్యాప్తు కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, బెల ఎం త్రివేది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మధురై బెంచ్ ఏం చెప్పిందంటే.. తంజావూర్ మైకేల్పట్టీలో నివాసం ఉండేది లావణ్య కుటుంబం. ఆత్మహత్యకు పాల్పడ్డ లావణ్య.. పదిరోజుల తర్వాత కన్నుమూసింది. స్కూల్లో మతమార్పిడి ఒత్తిళ్లతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ చిన్నారి మరణవాంగ్మూలం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. అయితే మరో వీడియోలో చిన్నారి వార్డెన్ వేధింపుల్ని భరించలేకపోయినట్లు, పినతల్లి వేధింపులు కూడా కారణమేనని చెప్పడం సైతం వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో బీజేపీ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య రాజకీయ వాగ్వాదం సైతం చోటు చేసుకుంది. ఈ పరిణామాల నడుమే.. స్కూల్లో వేధింపుల కోణంలో కాకుండా.. మతమార్పిడి వేధింపుల కోణంలోనే దర్యాప్తు చేయించాలంటూ లావణ్య తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో.. రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయించడం సమంజసం కాదనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది మద్రాస్ మధురై బెంచ్. అదే టైంలో ఆ వీడియోలను రికార్డు చేసిన వ్యక్తుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తూనే.. ఈ మేరకు సమర్థుడైన అధికారికి అప్పగించాలంటూ సీబీఐని ఆదేశించింది. -
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత
గోవింద్రాజ్, కిరణ్ మేడసాని, త్రిశంక్, అభిషేక్, లావణ్య, ఫరీనా, రవళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ అన్నది ట్యాగ్‌లైన్ . అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి. వెంకట్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, సినిమా పెద్ద హిట్ కావాలని శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘తన ఆలోచనే కరెక్ట్ అని భావించి తాను తీసే సినిమా యూనిట్‌ను ముప్పతిప్పులు పెట్టే ఓ డైరెక్టర్ చివరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథని వినోదాత్మకంగా తెరకెక్కించాం. ప్రధాన పాత్రలో గోవింద్ రాజ్ నటించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్.జి, కెమెరా: బొబ్బిలి సంతోష్ రెడ్డి. -
పేపర్ బొమ్మ
అందమైన బొమ్మలు.. సందేశాన్ని ఇచ్చే బొమ్మలు.. సందర్భానికి తగ్గ బొమ్మలు.. నాజూకైన బొమ్మలు.. లావణ్య నల్లమిల్లి చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి. అదీ క్విలింగ్ పేపర్‌తో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సృజనాత్మక ఆలోచనలతో పేపర్ బొమ్మల తయారీలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ‘ఆకుపచ్చని లోకంలోకి వెళ్లండి, జీవితాన్ని రంగులమయం చేసుకోండి’ అనే థీమ్‌తో ఐదు అడుగుల బొమ్మను పేపర్‌తో తయారుచేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు సంపాదించుకున్నారు. స్టిచింగ్ ట్యూటోరియల్తో ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. ఉన్న దారిలో ప్రయాణించడం కుదరకపోతే మరో దారిని తనకు తానుగా వేసుకుంటూ ముందుకు వెళుతున్న లావణ్య చెబుతున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘‘పుట్టి పెరిగింది నెల్లూరులో. హైదరాబాద్ జెఎన్‌టియూలో బీటెక్ చేశాను. ఐదేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. పెళ్లయి బాబు పుట్టాక ఉద్యోగం మానేశాను. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను. చిన్ననాటి నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మీద ఆసక్తి ఎక్కువ. డెలివరీ టైమ్‌లో ఇంట్లోనే ఉండటంతో బాబుకి కావల్సిన క్రోషెట్స్ అల్లకం వంటివి ఆన్లైన్ లో చూసి నేర్చుకున్నాను. పాప పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లల పనులతోనే రోజంతా సరిపోయేది. దీనితో ఇక ఉద్యోగం చేయాలనే ఆలోచనను పూర్తిగా మానుకున్నాను. అయితే, కాస్త తీరిక టైమ్ దొరికినా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అభిరుచిని ముందేసుకునేదాన్ని. పిల్లలు కాస్త పెద్దవుతుంటే టైమ్‌ను ప్లాన్ చేసుకుంటూ నా హాబీని పునరుద్ధరించుకోవడం మొదలుపెట్టాను. ఇంట్లోనే ఉండి యూ ట్యూబ్ చానెల్లో స్టిచింగ్ ట్యుటోరియల్ ప్రారంభించాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు స్టిచింగ్‌తో పాటు క్విల్లింగ్ డాల్స్ రెండూ చేస్తున్నాను. క్విలింగ్ డాల్స్ తయారీలో చేసిన ప్రయోగాలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. గాంధీ టు గణేష గాంధీజీ చరఖా తిప్పుతున్నట్టు ఉన్న డిజైన్ చేయాలనుకున్నప్పుడు కొంత టెన్షన్‌కి లోనయ్యాను. గాంధీ ముఖ కవళికలను బొమ్మలో సరిగ్గా తీసుకురాగలనా అని. బొమ్మ పూర్తయ్యాక వచ్చిన సంతృప్తి మాటల్లో చెప్పలేను. అలాగే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైనికుడు, జెండా బొమ్మలను తయారు చేశాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మినియేచర్ ఫ్లాగ్‌లో మిళితం చేశాను. మంచి ప్రశంసలు వచ్చాయి.కరోనా మహమ్మారి మీద పోరాటం చేస్తున్న డాక్టర్లను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ బొమ్మను డిజైన్ చేశాను. గణేష్ చవితిని పురస్కరించుకొని గణేష బొమ్మలను చేస్తున్నాను. గణేష టీమ్ పేరుతో ఒక మినియేచర్గ్రౌండ్నే సృష్టించాను. ఎలాంటి వర్క్‌షాప్స్, క్లాసులు లేకుండానే ఈ వర్క్‌ని నేర్చుకొని చేస్తున్నాను. ప్రస్తుతం ఆర్డర్స్ మీద వర్క్ చేస్తున్నాను. ఆన్లైన్లో క్లాసులు ఇస్తున్నాను. ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పుడు 40 బొమ్మలు తయారుచేసే పనిలో ఉన్నాను. ఈ బొమ్మలన్నీ ఎక్కువగా కానుకలుగా తమ ఆప్తులకు ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. కిందటేడాది గణేషుడి బొమ్మలను నేరుగా సేల్ చేశాను. ప్రస్తుతం వీటిని ఆన్లైన్లోనే విక్రయిస్తున్నాను. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కుట్టడం, అల్లడం వంటివి ఎలాగూ వచ్చు. ఇవి కాకుండా ఇంకేం చేయచ్చు అని ఆలోచించినప్పుడు పేపర్ క్విల్లింగ్ ఆకట్టుకుంది. ముందు పేపర్‌తో ఆభరణాలు తయారుచేయడం, వాటిని ఆన్లైన్లో పెట్టడం, ఆర్డర్స్ మీద ఎవరైనా అడిగితే చేసి ఇవ్వడం చేసేదాన్ని. దీంట్లోనే త్రీడీ క్రియేషన్స్ కూడా చేశాను. మా ఫ్రెండ్‌తో దీని గురించి చర్చ వచ్చినప్పుడు ఏదైనా వినూత్నంగా ట్రై చేద్దాం అనుకున్నాం. మా ఫ్రెండ్ ‘వన్మయి’ పేరుతో నేను 5 అడుగుల పొడవున మోడ్రన్ బొమ్మను తయారు చేశాను. కాగితపు గుజ్జు, ఫాబ్రిక్ గ్లూ వంటి వాటిని ఉపయోగించి ‘వర్నిక’ పేరుతో నిలువెత్తు కళారూపాన్ని ఒక మంచి థీమ్‌తో తయారుచేశాం. ‘ఆకుపచ్చని లోకంలోకి వెళ్లండి, జీవితాన్ని రంగుల మయం చేసుకోండి’ అనేది ఆ థీమ్. కిందటేడాది ‘వన్మయి’ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదయ్యింది. చాలా ప్రశంసలూ వచ్చాయి. దీంతో పూర్తిగా పేపర్ డాల్స్ మీద దృష్టిపెట్టాను. గంటల నుంచి రోజులు క్విలింగ్లో ఒక నీడిల్ ఉపయోగించి బొమ్మలు తయారుచేస్తాం. దీనికి కావల్సిన చిన్న చిన్న వస్తువులు స్టేషనరీ షాపుల నుంచి సేకరిస్తాను. త్రీడీ డాల్ వర్క్ అయితే సాధారణ బొమ్మ తయారు కావడానికి 2 నుంచి 3 గంటలు పడుతుంది. అదే కొత్త కాన్సెప్ట్.. కాస్త ఎక్కువ వర్క్ ఉన్నదయితే 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది’’ అని లావణ్య తను ఎంచుకున్న మార్గాన్ని పరిచయం చేసింది. – నిర్మలారెడ్డి -
ఎంత కాలం నటిస్తావు..?
శంషాబాద్: మూడు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి.. ఆత్మహత్యకుకు ముందు భర్త వెంకటేశ్వరావును ఉద్దేశించి మాట్లాడిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అతడి ప్రవర్తనతో విసిగి జీవితంపై విరక్తితో ఆత్మహత్య నిర్ణయం తీసుకుంటున్నాని లావణ్య లహరి గతంలోని ఓ వీడియో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.. అదే రోజు ఆ వీడియోకు ముందు వెంకటేశ్వర్రావును ఉద్దేశించి కూడా లావణ్య మాట్లాడిన మరికొంత వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది ‘సమాజాన్ని మోసం చేయడానికి ముసుగు వేసుకుని నటిస్తున్నావు.. ఎంత కాలం నటిస్తావు..? నీ కుటుంబ చరిత్ర కూడా ఎంతో హీనమైంది.. నిన్ను కూడా అదే దారిలో నడిపించాలని వారు చూస్తున్నారు. ప్రేమ.. ప్రేమ అని వెంటపడి నన్ను మోసం చేశావు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘డబ్బుతో ఏ నీచానికైనా ఒడిగట్టాలనే మనస్తత్వం నీది.. మన మధ్యన ఒక్క తీపి జ్ఞాపకం కూడా లేదు. ఏడు నెలల గర్భం పోయి నేను బెడ్‌పై ఉన్నప్పుడు మరో ఆడదానితో చాటింగ్ చేశావు. రేపు దానిని కూడా నువ్వు మోసం చేస్తావు’ అని లావణ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నీవు నన్ను కొట్టిన ప్రతి దెబ్బలను ప్రతి గోడ చెబుతుంది.. అంతలా నన్ను శారీరకంగా హింసించావు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, గతంలోని వీడియోకి అనుబంధంగానే ఈ వీడియో ఉన్నప్పటికీ.. అప్పుడు బయటికి వచ్చిన వీడియో మధ్యలోంచి ఉంది.. ఇందులో ఆమె భర్తను నేరుగా ప్రశ్నించి.. ఆవేదన వ్యక్తం చేసినట్లు ఉంది. -
అందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది?: లావణ్య
-
‘పెళ్లాం ఉండగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నావు’
సాక్షి, హైదరాబాద్ : భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఆత్మహత్యకు పాల్పడటం పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆత్మహత్యకు ముందు లావణ్య రికార్డు చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో లావణ్య చెప్పుకున్న బాధలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ప్రేమ పేరుతో తన భర్త వెంకటేశ్ ఏ విధంగా మోసం చేశాడో లావణ్య ఈ వీడియోలో వివరించారు. అయినా అతడి మీద ప్రేమ చావలేదని కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు తనను ఎంతో ప్రేమించారని.. కానీ వాళ్లను మోసం చేసి ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నందుకు క్షమించాలని కోరారు. (లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం) ‘ప్రేమించానని వెంటపడ్డావు. నా కోసం ఏదైనా చేస్తానని చెప్పావు. నీ మీద నమ్మకంతో తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లైన తర్వాత నీ నిజస్వరూపం తెలిసింది. బయటకు ఎన్నో నీతులు చెప్తావు.. కానీ నీకు అసలు వ్యక్తిత్వం ఉందా?. నేను గర్భిణిగా ఉన్నప్పుడు.. నువ్వు మరోకరితో సంబంధం పెట్టుకున్నావు అని తెలిసింది. నా ముందే వాళ్లతో వీడియో కాలింగ్‌లో మట్లాడేవాడిని. అమ్మాయిలతో చెడు తిరుగుళ్లు తప్పని చెప్పినందుకు నాపై దాడి చేశావు. అనేక సార్లు నీ ఇష్టం వచ్చినట్టు కొట్టావు. హింసించావు. ఇందుకోసమేనా నన్ను పెళ్లి చేసుకుంది. నీ గురించి తెలిసిన రోజే నిన్ను వదిలేసి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకపోవడం నేను చేసిన తప్పు. నీకు, నీ కుటుంబానికి బంధుత్వాల గురించి తెలియవు. కుక్కలకైనా తిన్న విశ్వాసం ఉంటుంది.. మీ కుటుంబానికి అది కూడా లేదు. తప్పు చేస్తుంటే నీ తండ్రే నీకు మద్దతుగా నిలుస్తున్నాడు. పెళ్లాం.. ఉండగానే శిరీష అనే అమ్మాయితో తిరుగుతున్నావు. ఇలా ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశం చేస్తావు. నేను ఇక ఉండను కాబట్టి.. కనీసం ఆమెను అయినా పెళ్లి చేసుకో. మరోక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. నీ ముఖానికి ఉన్న మాస్క్ తీసేయ్. (ఇక భరించలేను.. ఉండలేను! ) ఎన్నో ఆశలతో నీతో భవిష్యత్తును ఊహించుకున్నాను. పెళ్లి తర్వాత నీ విశ్వరూపం తెలిసింది. నేను సంపాందించి అంతా నీ పేరున వేసుకున్నావు. నీకు ఉద్యోగం లేకపోయినా ఏళ్ల తరబడి పోషించాను. నీకు ఉద్యోగం వచ్చాక హింసించడం మొదలు పెట్టావు. కావాలంటే నా పే స్లిప్‌లు చూడండి. నేను సంపాదించింది ఎంతో తెలుస్తోంది. డాడీ వీడి వద్ద 48 లక్షలు తీసుకోండి.. ఒక అబ్బాయిని దత్తతు తీసుకుని మంచిగా పెంచండి. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు.. ఎంతో ఇచ్చారు.. కానీ దాని మోసం చేసి వెళ్లిపోతున్నాను. మీ అందరు అంటే నాకు చాలా ఇష్టం.. ఈ వెధవ అన్న నాకు చాలా ఇష్టం.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని లావణ్య తెలిపారు. మరోవైపు లావణ్య ఆత్మహత్య కేసులో శంషాబాద్ పోలీసులు ఇప్పటికే ఆమె భర్త, అత్తమామలు, ఇద్దరు ఆడపడుచుల్ని అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. -
లావణ్య ఆత్మహత్యలో మరో వ్యక్తి..
శంషాబాద్: భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన సాప్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి కేసులో మరో నలుగురు నిందితులను ఆర్జీఐఏ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పట్టణంలోని సీఎస్కే విల్లాలో పైలట్ వెంకటేశ్వర్రావుతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన భార్య లావణ్య లహరి నివాసముండేది. భర్త చెడుతిరుగుళ్లతో ఆమె మనస్తాపం చెందింది. అదేవిధంగా వెంకటేశ్వర్రావు భార్యను మానసినంగా వేధిస్తుండేవాడు. ఈనేపథ్యంలో గతనెల 25న సూసైడ్‌నోట్ రాసిన లావణ్య లహరి సెల్ఫీ వీడియో తీసి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. (లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం) లావణ్య ఆత్మహత్యకు కారణమైన ఆమె భర్త వెంకటేశ్వర్రావుతో పాటు అత్తమామలతో పాటు ఆడపడుచు, మరో బంధువుపైనా బంధువులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆర్జీఐఏ పోలీసులు సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అద్దంకితో పాటు వరిమడుగు గ్రామంలో తలదాచుకున్న అత్త రమాదేవి, ఆడపడుచులు కృష్ణవేణి, లక్ష్మీకుమారితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు వారిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. వెంకటేశ్వర్రావు తండ్రి సుబ్బారావు పరారీలో ఉన్నాడు. అయితే, ఈ కేసులో ఇప్పటికే పోలీసులు లావణ్య లహరి భర్త వెంకటేశ్వర్రావును రిమాండుకు తరలించారు. -
లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. లావణ్య భర్త పైలట్ వెంకటేశ్వర్రావుకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటమే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరో మహిళతో వెంకటేశ్వర్రావు ఉండగా.. లావణ్యకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతో లావణ్య అతడిని నిలదీసింది. అయితే ఆ తర్వాత నుంచి వెంకటేశ్వర్రావు మరింతగా రెచ్చిపోయాడు. ఇంట్లో ఉండే ఆ మహిళతో సోషల్ మీడియాలో చాటింగ్ చేయడంతో పాటు.. లావణ్య ముందే ఆమెకు వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడు. (చదవండి : ఇక భరించలేను.. ఉండలేను!) దీంతో లావణ్య తనకు అన్యాయం చేయవద్దని ఆ మహిళను వేడుకున్నారు. మరోవైపు తీరు మార్చుకోని వెంకటేశ్వర్రావు.. లావణ్యపై భౌతిక దాడులకు పాల్పడ్డాడు. గర్భవతి అనికూడా చూడకుండా భర్త తనపై దాడి చేయడంతో లావణ్య మరింత ఉద్వేగానికి లోనయ్యారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అసలు రూపం తెలుసుకుని మనస్తాపం చెందారు. ఈ క్రమంలో లహరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో లావణ్య మృతికి సంబంధించి మరో మహిళ పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు కూడా సేకరించినట్టుగా సమాచారం. మరోవైపు తమ కూతురిని వెంకటేశ్వర్రావు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడన్నారు. అతడి పైలట్ లైసెన్స్‌ను రద్దు చేసి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కాగా, శంషాబాద్‌లోని సీఎస్కే విల్లాలో నివాసం ఉంటున్న లావణ్య భర్త వేధింపుల కారణంగా శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి : వీడియో: పైలట్ మొగుడి పైశాచికం!) -
లావణ్య కథ..!
-
పరారీలో పైలట్ తల్లిదండ్రులు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని లావణ్య లహరి ఆత్మహత్య కేసులో ఆమె భర్త వెంకటేశ్వరరావును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. లావణ్య అత్తామామ రమాదేవి, మల్లాది సుబ్బారావు పరారీలో ఉన్నట్టు తెలిసింది. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే లావణ్య లహరి (32) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. భర్త వెంకటేశ్వరరావు ప్రవర్తనతో విసిగి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేసింది. లావణ్య, వెంకటేశ్వరరావుది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. వారిద్దరు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. (చదవండి: వీడియో: పైలట్ మొగుడి పైశాచికం!) వెంకటేశ్వర్రావు ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్. లావణ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సీఎస్కే విల్లాలో ఉంటున్నారు. వీరికి సంతానం కలగలేదు. వెంకటేశ్వర్రావు కొంతకాలంగా మరో మహిళతో చనువుగా ఉండటంతో పాటు సంతానం కలగలేదనే వేధింపులు పెరగడంతో లహరి మనస్తాపం చెందింది. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులు గొడవపడ్డారు. దాంతో ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఆమె శుక్రవారం మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడింది. ఇదిలాఉండగా.. లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడు వెంకటేశం తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. (చదవండి: కరోనా జయించిన బాలాపూర్ సీఐ) -
ఇక భరించలేను.. ఉండలేను!
శంషాబాద్: రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్జీఐఏ) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పైలట్ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త ప్రవర్తనతో విసిగి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేసింది. సీఐ విజయ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వెంకటేశ్వర్రావు, అదే జిల్లా అద్దంకికి చెందిన లావణ్య లహరి ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. వెంకటేశ్వర్రావు ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్. లావణ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సీఎస్కే విల్లాలో ఉంటున్నారు. వీరికి సంతానం కలగలేదు. వెంకటేశ్వర్రావు కొంతకాలంగా మరో మహిళతో చనువుగా ఉండటంతో పాటు సంతానం కలగలేదనే వేధింపులు పెరగడంతో లహరి మనస్తాపం చెందింది. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులు గొడవపడ్డారు. చచ్చే వరకు ప్రేమించాలనుకున్నా.. భర్త ప్రవర్తన మారడం లేదని, వేరే మహిళతో కలిసి తిరుగుతున్నాడనే ఆవేదనతో లావణ్య సూసైడ్ నోట్ రాసింది. ఓ సెల్ఫీ వీడియోలోనూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ‘ప్రేమించడమంటే చచ్చేవరకు ప్రేమించాలన్న నమ్మకంతో ఇంతకాలం గడిపాను. గృహహింస కేసు పెట్టమన్నారు. కానీ, వాడిని ఇప్పటికీ ప్రేమిస్తున్నాను.. వాడి పాపాలతో వాడే పోతాడు.. కానీ అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావట్లేదు.. వేరే మహిళతో తిరిగి వస్తున్న వ్యక్తికి సేవలు చేసే దౌర్భాగ్యమేంటి. నా లోపాలను సరిదిద్దుకున్నాను. వాడు మాత్రం తను చేసింది తప్పుగానే గుర్తించట్లేదు. ఇలాంటి వాడికి సేవలు చేసే కర్మేంటి నాకు.. ఇక భరించలేను. ఉండలేననే నిర్ణయం ఈ రోజు తీసుకుంటున్నాను’ అని సెల్ఫ్ వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టింది. అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త వెంకటేశ్వర్రావును అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురిని వెంకటేశ్వర్రావు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడన్నారు. అతడి పైలట్ లైసెన్స్‌ను రద్దు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు. -
తహసీల్దారు దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేశంపేట తహసీల్దార్ లావణ్య, ఆమె భర్త మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ రీజనల్ డైరెక్టర్ నూనావత్ వెంకటేశ్వర్ నాయక్‌లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. వీరిద్దరూ ఏసీబీ దాడుల్లో వేర్వేరుగా లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వీరి బినామీలైన హయత్‌నగర్‌కు చెందిన బి.నాగమణి, సూర్యాపేట జిల్లా కపూరియా తండాకు చెందిన వి.హుస్సేన్ నాయక్ ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు దాదాపుగా రూ.1.33 కోట్ల ఆస్తులను అదనంగా కలిగి ఉన్నారని గుర్తించారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న లావణ్యను మంగళవారం అధికారులు ఏసీబీ ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. భర్త వెంకటేశ్వర్ ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. -
సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’
తరుణ్ తేజ్, లావణ్య హీరోహీరోయిన్లుగా రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఉండి పోరాదే'. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నవీన్ నాయని దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సింగల్ కట్ కూడా లేకుండా యూ/ ఏ సర్టిఫికెట్ పొందింది. సెప్టెంబర్ 6న సినిమా గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత డా. లింగేశ్వర్ మాట్లాడుతూ - ‘మా ఉండి పోరాదే చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ పొందింది. సెన్సార్ వారు సింగల్ కట్ కూడా లేకుండా ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా చూశాం అని.. నన్ను మా టీమ్‌ను అభినందించారు. నేను గతంలో చెప్పినట్టు సినిమా 100పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ మరింత పెరిగింది. లాస్ట్ 20 మినిట్స్ లో మన పక్కన ఉన్నవారిని కూడా మర్చి పోయేలా సినిమా ఉంటుంది. అందరూ థియేటర్ లో సినిమా చూసి పెద్ద సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను’అన్నారు. దర్శకుడు నవీన్ నాయని మాట్లాడుతూ... ‘ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత లింగేశ్వర్ గారికి థాంక్స్. సినిమా మేము అనుకున్న దానికన్నా హార్ట్ టచింగ్‌గా వచ్చింది. సినిమా కోసం ప్రతి టెక్నీషియన్ 100పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 6న మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు. -
మనసుకు హత్తుకునేలా...
తరుణ్‌తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉండి పోరాదే’. సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ కె. లింగేశ్వర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కె .లింగేశ్వర్ మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. నటీనటులందరూ కొత్తవారే అయినా కథను నమ్మి ఈ సినిమా నిర్మించా. చివరి 20 నిమిషాలు పక్క సీట్లో ఉన్నవారిని కూడా మర్చిపోయేలా మా చిత్రం ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌ని నవీన్ చక్కగా తెరకెక్కించారు. నటించిన అందరి కెరీర్లో ఇది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. సెన్సార్ వారు ఒక్క కట్ కూడా ఇవ్వలేదు. మా సినిమా 100 శాతం హిట్ అవుతుందనే నమ్మకం మరింత పెరిగింది’’ అన్నారు. ‘‘మేం అనుకున్న దానికన్నా సినిమా మనసుకు హత్తుకునేలా వచ్చింది. ఇంత మంచి చిత్రం చేసే అవకాశం ఇచ్చిన లింగేశ్వర్‌గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు సాంకేతిక నిపుణులందరూ 100 శాతం కష్టపడ్డారు’’ అన్నారు నవీన్ నాయని. -
ఏసీబీ విచారణ : తల తిరుగుతోందంటూ సాకులు
సాక్షి, హైదరాబాద్: కేశంపేట తహశీల్దార్ లావణ్య ఏసీబీ విచారణకు సహకరించట్లేదు. శుక్రవారం ఉదయం ఆమెను చం చల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. విచారణ ప్రారంభించగానే తల తిరుగుతోందని, వాంతు వచ్చేలా ఉందంటూ ప్రశ్నలు అడగనీయకుండా చేసి నట్లు తెలిసింది. వీడియో చూసి మౌనం.. ఇటీవల ఏసీబీ దాడిలో లావణ్య వద్ద రూ.93 లక్షల నగదు లభించిన విష యం తెలిసిందే. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిం దన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. రూ.35 లక్షలు సింగిల్ సెటిల్మెంట్ అనడానికి తమ వద్ద ఉన్న వీడియో సాక్ష్యాలను అధికారులు ఆమె ముం దుంచినట్లు సమాచారం. వాటిని చూడగానే ఆమె మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారించినా ఆమె నుంచి ఏసీబీ అధికారులు సమాధానాలు రాబట్టలేకపోయారు. శనివారం మధ్యాహ్నం వరకే సమయం ఉండటంతో ఈ లోపు ఆమె చేత నిజాలు చెప్పించగలరా అన్నది ఆసక్తికరంగా మారింది. మరో రూ.36.8 లక్షల గుర్తింపు.. ఏసీబీ దాడి చేసిన రోజు రూ.36.8 లక్షలను లావణ్య ఆమె బంధువుల ఖాతాల్లో గుర్తించారు. ఆమె సోద రుడి ఖాతాలో రూ.20.5 లక్షలు, నల్లగొండలోని బంధువు ఖాతాలో రూ.8 లక్షలు, లావణ్య ఖాతాలో రూ.5.99 లక్షలు, భర్త వెంకటేశం బ్యాంకు ఖాతాలో రూ.1.36 లక్షలు, ఇవి కాకుండా లావణ్యకే చెందిన మరో 2 ఖాతాల్లో రూ.40 వేలు, రూ.50 వేలు రూ.36.8 లక్షల సొమ్ము గుర్తించారు. ఇందులో లావణ్య ఖాతాలో ఉన్న సొమ్ము ఆమె వేతనంగా భావిస్తున్నారు. కేశంపేట తహశీల్దార్‌గా నియామకం కావడం కంటే ముందు లావణ్య ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పనిచేశారు. అక్కడ పరిచయమైన ఓ అధికా రిని తన బంధువు అని చెప్పుకొంటూ పలు లావాదేవీల్లో ఆ అధికారి పేరును వాడుకున్నట్లు తెలిసింది. -
అవినీతి లావణ్యం
-
ప్రతి పనికీ మనీ మనీ..!
కేశంపేట : రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య బాధితులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. తహసీల్దార్ లావణ్యకు ఎంత సమర్పించుకున్నారో చెప్పారు. ప్రతి పనికీ రేటును ఫిక్స్ చేసి వసూలు చేశారని పలువురు రైతులు ఆరోపించారు. రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలంటే తహసీల్దార్‌కుగానీ, తన ఏజెంట్లకుగానీ డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని, మీడియాకు తెలిపితే తమ సమస్యలను మరింత జటిలం చేస్తుందనే తాము ఎవరికీ చెప్పలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంపై దాడి.. కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రైతులు బయటే గుమిగూడారు. అదే సమయంలో వచ్చిన సర్వేయర్ నాగేశ్ కాళ్ళు మొక్కి తమకు ఇవ్వాల్సిన రిపోర్టులను అందజేయాలని రైతులు కోరారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రైతులు సర్వేయర్‌ను నిలదీశారు. టేబుల్, కుర్చీలను ఎత్తి పడేశారు. సకాలంలో పోలీసులు స్పందించి రైతులను సముదాయించి బయటకు పంపించారు. కలెక్టర్ రావాలి... గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని భూరికార్డులను మాయం చేసిన లీలలు తెలవాలంటే కలెక్టర్ కేశంపేటకు రావాలని రైతులు డిమాండ్ చేశారు. మండలంలో జరిగిన అవినీతిపై కలెక్టర్ విచారణ జరిపించాలన్నారు. సర్వేయర్ కాళ్లు మొక్కుతున్న బాధితురాలు మళ్లీ ఏసీబీ తనిఖీలు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మళ్లీ తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ లావణ్య, వీఆర్వో అనంతయ్య రైతు వద్ద నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో వారిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మరోమారు తనిఖీలు నిర్వహించారు. రూ. 50 వేలు ఇస్తేనే కాస్తు.. కేశంపేట శివారులోని సర్వే నంబర్ 223లో రెండు ఎకరాల భూమిని 1991లో సాదాబైనామాగా తలకొండపల్లి మండలంలోని రామకృష్ణపురం గ్రామానికి చెందిన శేరిల వెకటయ్య వద్ద కొనుగోలు చేశామని భారతమ్మ అనే మహిళా రైతు తెలిపారు. అప్పటి నుంచి కబ్జాలో ఉన్నామని, దానికి కాస్తు రాయాలని వీఆర్వో అనంతయ్యను కోరగా రూ.50 వేలు డిమాండ్ చేశారని చెప్పారు. తప్పనిపరిస్థితుల్లో డబ్బులిచ్చి కాస్తు రాయించుకున్నామన్నారు. గత సంవత్సరం మళ్లీ కాస్తు రాయాలని కోరగా లక్ష రూపాయలు ఇవ్వాలని వీఆర్వో కోరారని, తహసీల్దార్‌ను సంప్రదిస్తే అనంతయ్య చెప్పినట్టు లక్ష రూపాయలు ఇసైనే కాస్తు రాస్తామన్నారని భారతమ్మ ఆరోపించారు. తాము డబ్బులు ఇవ్వకపోవడంతో శేరిల వెంకటయ్య పేరును అన్లైన్లో చేర్చారని తెలిపారు. దీంతో అతను ఆ భూమిని విక్రయించాడని, తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. -
టైటిల్ బాగుంది
శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో నవీన్ నాయని దర్శకత్వంలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మించిన చిత్రం ‘ఉండిపోరాదే’. తరుణ్‌తేజ్, లావణ్య జంటగా నటించారు. ఈ చిత్రంలోని ఓ పాటను దర్శకుడు వి. వి వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టైటిల్ బాగుంది. అలాగే సాబు వర్గీస్ ఇచ్చిన పాటలన్నీ చాలా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ – ‘‘టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా చిత్రం యూత్‌తో పాటు అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. నవీన్ నాయని మాట్లాడుతూ – ‘‘మంచి కంటెంట్‌తో పాటు సందేశాత్మక చిత్రంగా ‘ఉండి పోరాదే’ని తెరకెక్కించాం’’ అన్నారు. -
బోర్డులో నీతి.. లోపలంతా అవినీతి
సాక్షి హైదరాబాద్/షాద్‌నగర్ టౌన్: కార్యాలయాలబయట అవినీతి రహిత సేవలు అంటూ పెద్ద అక్షరాలతో ప్రకటనలు.. లోపలకు అడుగుపెడితే చాలు గుప్పుమంటున్న అవినీతి వాసనలు. ఇది అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లుగా మారిన రెవెన్యూ కార్యాలయాల పరిస్థితి. ఇందులో దొరికిన వారే దొంగలు.. కానీ దొరకని వారు చాలా మందే దర్జాగా దండుకుంటున్నారు. రెవెన్యూశాఖలో ఇలాంటి తిమింగళాలు ఎందరో ఉన్నారు. వీరిద్వారా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకున్నందుకే.. రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసేందుకు సీఎం కేసీఆర్ నడుంబిగించారు. కాగా.. ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు పొంది.. అక్రమ సంపాదనలో రికార్డు సృష్టించిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య తీరు పై విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మనమందరం కలిసి పంచుకుందాం అనే నినాదంతో కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని వెల్లడైంది. 2016 నవంబర్ 21న కేశంపేట తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత లావణ్య మండలంలో పట్టుబిగించారు. ఈప్రాంతం లో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కన్నేశారు. తన పేరు బయట పడకుండా మధ్యవర్తులను తెరపైకి తీసుకొచ్చి భూవివాదాలు సెటిల్మెంట్లు చేసేవారని తెలుస్తోంది. ఫైలు కదలాలంటే ఆమ్యామ్యా తప్పదు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రతి రైతు వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదంటే ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని.. భూ రికార్డుల మార్పిడి, ఆన్లైన్లో నమోదు వర కు ప్రతి పనికీ వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం బయట ‘ఈ కార్యాలయం అవినీతి రహిత కార్యాల యం’అంటూ పెద్ద అక్షరాలతో బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. వీఆర్ఏ, వీఆర్ఓ, సిబ్బంది ఎవరైనా డబ్బులు అడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయా లని లావణ్య ఇటీవల కార్యాలయం ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. కానీ, ఆ బోర్డులను ఏర్పాటు చేయించిన తహసీల్దారే భారీ అవినీతి తిమింగళమని తెలియడంతో రైతులు, ప్రజలు అవాక్కయ్యారు. చంచల్‌గూడ జైలుకు లావణ్య, వీఆర్వో బుధవారం రూ.93 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని గురువారం ఉదయం 6 గంటల వరకు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఉంచి విచారించారు. కార్యాలయం లోని ప్రతి ఫైల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెండిం గ్ ఫైళ్ళ గురించి ఆరా తీసి.. ఎందుకు పెండింగ్‌లో ఉంచారని లావణ్యను ప్రశ్నించినట్లు తెలిసింది. కార్యాలయంలోని రికార్డు గదిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. గురువారం ఉదయం 6గంటల ప్రాం తంలో ఆమెను, వీఆర్వోను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి మరోసారి విచారణ చేపట్టారు. ఇద్దరికీ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఇం ట్లో హాజరుపర్చారు. 14రోజులపాటు రిమాండ్‌లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో వీద్దరినీ చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఉద్యోగంలో చేరినప్పటినుంచీ ఇదే తంతు ఈమె గతంలో పనిచేసిన చోట్ల కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కౌడిపల్లి, దౌల్తా బాద్, ములు గు, కొండాపూర్ మండలాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన లావణ్య అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారులు, స్థానిక రాజకీయ నాయకుల అండతో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారని వెల్లడైంది. ములుగు మండలంలో ఆమె పనిచేస్తున్న సమయంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలను అడ్డాగా చేసుకుని దందా కొనసాగించేవారని తెలుస్తోంది. కొండాపూర్ నుంచి బదిలీ అయిన రోజు కూడా కార్యాలయానికి వచ్చి పాత ఫైళ్లన్నింటినీ క్లియర్ చేసి అందినకాడికి దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులెన్నో.. ఏసీబీలో ఓ ముఖ్యమైన అధికారి తన సన్నిహితుడి పనికోసం లావణ్యను సంప్రదిస్తే.. దాన్ని పరిష్కరించేందుకు ఆమె ఏకంగా 2నెలలు తిప్పినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖకే చెందిన మరో అధికారి చేత సిఫారసు చేయిస్తే గానీ ఆ పని పూర్తి కాకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఓ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో ఆమెకు రూ.40లక్షలు ముట్టాయని..ఏసీ బీ దాడుల్లో పట్టుబడింది కూడా ఆ నగదేనంటూ ప్రచారం జరుగుతోంది. లావణ్య వంటి అవినీతి తిమింగళాలు రెవెన్యూశాఖలో ఎందరో ఉన్నారు. అడపాదడపా వీరు పట్టుబడుతున్నా.. చర్యలు తీసు కోవడంలో ఉన్నతాధికారుల ఉదాసీనత కూడా అవి నీతి పెరిగేందుకు ఊతమిస్తోందనే విమర్శలున్నా యి. అరెస్టు చూపిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలు, అధికారులు, సచివాలయంలోని పేషీలు శ్రద్ధ చూపకపోవడంతోనే.. రెవెన్యూ శాఖ అవినీతి ఊబిగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి. అందుకే కేసీఆర్ ఈ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు నడుంబిగించారు. ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్న మచ్చుకు కొన్ని కేసులివి: హైదరాబాద్ కలెక్టరేట్లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ 2010, ఫిబ్రవరిలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో చిక్కారు. ఈ కేసు సమగ్రంగా విచారణ జరిపి అదే ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ ద్వారా ప్రాసిక్యూషన్‌కు సిఫారసు చేస్తూ ఏసీబీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి ప్రాసిక్యూషన్‌కు నాలుగేళ్ల పాటు అనుమతి ఇవ్వకపోగా, కేసును విరమించుకోవడం గమనార్హం. అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మోహన్‌రావు 2010లో చేతివాటం ప్రదర్శిస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయనపై విచారణ జరిపి ప్రాసిక్యూషన్‌కు అనుమతినివ్వాలని ఏసీబీ కోరినా ఎలాంటి పురోగతి లేదు. పైగా కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉండడం గమనార్హం. డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్ 2011లో అవినీతి సొమ్ముతో ఏసీబీకి చిక్కారు. ఆ సమయంలో ఆయన ఇంటిలో సోదాలు చేయగా, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో రాములు నాయక్ ప్రాసిక్యూషన్‌కు ఏసీబీ కోరింది. కానీ, కేసును మూడేళ్లు పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం చివరకు శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకుంది. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ సహదేవ్ 2011లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేసును సమగ్రంగా విచారణ జరిపిన ఏసీబీ 2012లో ఆయన్ను కూడా ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కోరగా, ప్రభుత్వం మాత్రం రెండేళ్ల తర్వాత శాఖాపరమైన విచారణకే పరిమితమైంది. ఆ విచారణ ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. గత ఐదేళ్లలో 50 వరకు ఇలాంటి అవినీతి కేసులను ప్రభుత్వం మూసివేసింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద గుమిగూడిన రైతులు, ప్రజలు లంచాలు తిరిగి ఇచ్చేస్తున్నారంటూ పుకార్లతో.. లావణ్యకు లంచాల రూపంలో ఇచ్చిన నగదును ఏసీబీ వారు తిరిగి ఇచేస్తున్నారంటూ మొదలైన పుకార్లు క్షణాల్లో పాకిపోవడంతో.. కేశంపేట ఎమ్మెఆర్వో కార్యాలయానికి బాధిత ప్రజలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అయితే.. కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవడం, నగదు గురించి ఎవర్ని అడగాలో తెలియకపోవడంతో ఇవన్నీ పుకార్లేనని అర్థం చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. -
కేశంపేట ఎమ్మార్వో లావణ్య అరెస్ట్
-
ఎమ్మార్వో లావణ్య అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేశంపేట ఎమ్మార్వో లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. గురువారం సాయంత్రం నాంపల్లి ఏసీబీ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నారు. కాగా లావణ్య అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆమె భర్త వెంకటేష్ పరారయ్యారు. అడ్మినిస్ట్రేట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న వెంకటేష్ ఏసీబీ అధికారులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. బుధవారం ఓ రైతు దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కొందర్గు వీఆర్ఓ అనంతయ్య ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అనంతయ్య వెనకాల ఎమ్మార్వో లావణ్య పాత్ర ఉందని ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. హిమాయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 93.5లక్షల నగదు, 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు లావణ్యను అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఉత్తమ తహశీల్దార్ అవార్డు అందుకున్న లావణ్య.. ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్ కావడం గమనార్హం. -
భూత వైద్యం పేరుతో విద్యార్థినికి వాతలు
రామసముద్రం : భూతవైద్యం పేరుతో అమాయకురాలికి వాతలు పెట్టిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని పెద్దకురప్పల్లెకు చెందిన కృష్ణప్ప, మీనాక్షి దంపతుల కుమార్తె లావణ్యకుమారి మదనపల్లెలో పాలిటెక్నిక్ చదువుతోంది. కొంతకాలంగా లావణ్యకు మతిస్థిమితం తప్పింది. రాత్రివేళ కేకలు వేస్తుండడంతో తల్లిదండ్రులు పలుచోట్ల చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. దయ్యం పట్టిందని భావించి స్థానికుల సూచనల మేరకు కర్ణాటక సరిహద్దులోని గూకుంట గ్రామంలోని చర్చి వద్ద్దకు తీసుకెళ్లారు. అక్కడ పాస్టర్ జయప్ప అమ్మాయికి గాలి ఉందని, తాను తొలగిస్తానని నమ్మించాడు. గత వారం అక్కడికి వెళ్లి రాత్రీపగలు అక్కడే ఉన్నారు. తిరిగి చర్చి పక్కన గుట్ట వద్దకు లావణ్యను తీసుకెళ్లి భూతాన్ని తొలగిస్తానని చెప్పిన పాస్టర్ వాతలు పెట్టాడు. వాతలను చూసిన తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ఎస్ఐ శివశంకర్‌ను వివరణ కోరగా, తమకు ఫిర్యాదు రాలేదన్నారు. -
ఆడపిల్లని తక్కువగా చూడకూడదు
‘‘ఓ తండ్రి కోసం కూతురు పాడే ఈ పాటలో చక్కటి విలువలున్నాయి. ఆడపిల్లని తక్కువగా చూడకూడదు.. ఆడపిల్ల పుట్టుక చాలా అవసరం.. అని తెలియజెప్పే ఈ పాట వల్ల కొంత మందైనా మారాలనుకుంటున్నాను’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. తరుణ్ తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉండిపోరాదే’. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై డా.లింగేశ్వర్ నిర్మించిన ఈ సినిమా జూలై నెలాఖరులో విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా తండ్రి గొప్పతనాన్ని తెలియజేసే పాటను విడుదల చేశారు. నవీన్ నాయని మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన లింగేశ్వర్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇదొక రియలిస్టిక్ స్టోరీ. పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా సినిమా ఉంటుంది. ఇటీవలే కన్నడలో మా ఆడియో విడుదలవగా, మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. డా.లింగేశ్వర్ మాట్లాడుతూ– ‘‘ఇంత వరకు వెండితెరపై రానటువంటి కథ ‘ఉండిపోరాదే’. సుద్దాల అశోక్‌తేజగారు నాన్నపై రాసిన పాటకు అవార్డ్స్ వస్తాయనడంలో సందేహం లేదు. ఎంత మంది వచ్చినా చివరి వరకు మనల్ని ప్రేమించేది మాత్రం తల్లిదండ్రులే అనే సందేశం ఉంటుంది. కథ మీద ఎంతో నమ్మకంతోనే ఈ చిత్రాన్ని మూడు భాషల్లో నిర్మి ంచా’’ అన్నారు. ‘‘ సుద్దాలగారు మంచి సాహిత్యం అందించారు. పాటకు చిత్రగారు ప్రాణం పోశారు’’ అని సంగీత దర్శకుడు సబు వర్గీస్ అన్నారు. తరుణ్ తేజ్, లావణ్య, నటుడు కేదార్ శంకర్, మాటల రచయిత సుబ్బారాయుడు బొంపెం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీను విన్నకోట. -
ఇంతవరకూ రాని కథతో...
మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా మనల్ని చివరివరకూ ప్రేమించేది తల్లిదండ్రులే అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఉండిపోరాదే’. తరుణ్ తేజ్, లావణ్య హీరోహీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషల్లో నవీన్ నాయని దర్శకత్వంలో లింగేశ్వర్ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రం ఆడియోను 23న రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు సబు వర్గీస్ మాట్లాడుతూ– ‘‘సినిమాలో ప్రతి పాట సందర్భానుసారంగానే వస్తుంది. దర్శక–నిర్మాతలిచ్చిన స్వేచ్ఛ వల్ల మంచి పాటలివ్వగలిగాను’’ అన్నారు. ‘‘అవకాశమిచ్చిన నిర్మాతగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇదో రియలిస్టిక్ స్టోరీ. కన్నడలో ఆడియో రిలీజ్ చేశాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాం’’ అన్నారు నవీన్. ‘‘సినిమాను ప్రత్యేక శ్రద్ధతో తీశాం. ఇంతవరకూ తెరమీద రానటువంటి కథతో సినిమా ఉంటుంది. నాన్నపై రాసిన పాటకు సుద్ధాల అశోక్ తేజగారికి కచ్చితంగా అవార్డ్ వస్తుంది. జులై చివర్లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత లింగేశ్వర్. -
లావణ్య హత్య కేసులో వెలుగు చూస్తోన్న కీలక అంశాలు!
-
వాస్తవ కథ ఆధారంగా..
‘ఉండిపోరాదే.. గుండె నీదేలే.. హత్తుకోరాదే.. గుండెకే నన్నే...’ అనే పాట తెలుగు రాష్ట్రాల్లోని యూత్ గుండెలకు ప్రేమగా హత్తుకుంది. ఆ పాటలోని మొదటి పదం ‘ఉండిపోరాదే’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తరుణ్ తేజ్, లావణ్యలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సత్యప్రమీల కర్లపూడి సమర్పణలో డా.లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయిని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉండిపోరాదే’. కేదార్ శంకర్, అజయ్ ఘోష్, సత్యకృష్ణన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘‘15 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. మనసుని హత్తుకొనే సన్నివేశాలు, ఊహించని ముగింపుతో కన్నీరు తెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది. రాజమండ్రి, మైసూర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగిలిన 20 శాతం హైదరాబాద్, అండమాన్ దీవుల్లో జరిపే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది’’ అన్నారు చిత్రబృందం. సాబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. జూన్ నెలలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఉండిపోరాదే..
ఇటీవల ‘హుషారు’ సినిమాలో వినిపించిన ‘ఉండిపోరాదే’ సాంగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ‘ఉండిపోరాదే’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తరుణ్ తేజ్, లావణ్య హీరో హీరోయిన్లుగా సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో గోల్డ్ టైమిన్ పిక్చర్స్ పతాకంపై డాక్టర్ లింగేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవీన్ నాయని దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కథలో కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే నటీనటులు కొత్తవారు అనే తేడాని ప్రేక్షకులు చూడరు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేశాం. ఈ నెల 28న సెకండ్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. కెధార్ శంకర్, సత్య కృష్ణన్, సిద్ధిక్షా, అల్లు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సాబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. -
డైరెక్టర్ ప్రదీప్.. సన్నాఫ్ ఏవీఎస్
‘‘ఏవీయస్‌గారు నాకు మంచి మిత్రులు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. సినిమాలను, సాహిత్యాన్ని ఔపోసన పట్టారు. ‘తుత్తి, రంగు పడుద్ది’ వంటి మేనరిజమ్స్‌ను ఆయన చాలా బాగా వాడేవారు. ఏవీఎస్‌గారు లేని లోటు ఇండస్ట్రీలో ఉంది. ఆయన తనయుడు రాఘవేంద్ర ప్రదీప్ తెరకెక్కించిన ‘వైదేహి’ ట్రైలర్ బావుంది’’ అని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. మహేష్, ప్రణతి, సందీప్, అఖిల, లావణ్య, ప్రవీణ్ ముఖ్య తారలుగా ఏవీయస్ తనయుడు ఎ.రాఘవేంద్ర ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వైదేహి’. ఎ.జి.ఆర్. కౌశిక్ సమర్పణలో యాక్టివ్ స్టూడియోస్ పతాకంపై ఎ.జననీ ప్రదీప్ నిర్మిస్తున్నారు. దివంగత నటుడు ఏవీయస్ జయంతిని పురస్కరించుని బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని ఎన్. శంకర్ విడుదల చేశారు. ఏవీయస్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కేక్ కట్ చేశారు. ఎ.రాఘవేంద్ర ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి జయంతి నాడు మా సినిమా ట్రైలర్ విడుదల చేయడం హ్యాపీ. మా బావగారు నాకు ఇచ్చే సపోర్ట్‌ను మర్చిపోలేను. చాలా సందర్భాల్లో ఆయన మా నాన్నగారిలాగా నన్ను ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. ‘‘బాపు–రమణగారికి, ఏవీయస్‌గారికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఏవీయస్‌గారితో నాకూ చక్కటి సాన్నిహిత్యం ఉంది. వాళ్ల అబ్బాయి దర్శకుడు కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ సినిమాకు కెమెరా: దేవేంద్ర సూరి, సంగీతం: షారుఖ్. -
రాలిన విద్యా కుసుమం
వైఎస్సార్, వేంపల్లె : వేంపల్లె విశ్వనాథరెడ్డి కాలనీలో కె.లావణ్య(21) అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెండ్లిమర్రి మండలం ఉలవలపల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి వేంపల్లెలోని విశ్వనాథరెడ్డి కాలనీలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, కుమారుడు రమాకాంత్‌రెడ్డి, కుమార్తె లావణ్య ఉన్నారు. కుమారుడు వేంపల్లెలో ట్రాక్టర్, రెండు డోజర్లు పెట్టుకుని బాడుగలకు పంపుతున్నాడు. లావణ్య కడపలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఆడియాలజీ, స్పీచ్‌థెరపీ కోర్సు మూడో సంవత్సరం పూర్తి చేసుకుని, నాలుగో సంవత్సరం హైదరాబాద్‌లో ట్రైనింగ్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ‘నాకు చదువుపై ఒత్తిడి పెరిగిపోతోంది.. నేను చదవలేను’ అంటూ వేంపల్లెలోని తన స్వగృహానికి వచ్చింది. తల్లిదండ్రులు మాత్రం ఇక 6 నెలల్లో కోర్సు పూర్తవుతుందని కుమార్తెకు నచ్చచెబుతుండేవారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఇంట్లో అందరూ కలసి నిద్రిస్తుండగా.. లేచి పక్కనే ఉన్న బెడ్రూంలో చున్నితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి 4 గంటల సమయంలో లేచి కుమార్తె తన పక్కలో కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతుండటం చూసి విలవిలలాడింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. ఎస్ఐ చలపతి తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కోర్సు పూర్తవగానే లావణ్యను పెళ్లి కుమార్తెగా చూడాలనుకున్న తల్లి.. ఈ విధంగా జరగడంతో కన్నీటి పర్యంతమైంది. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కేసరి లావణ్య @అంబర్‌పేట
సాక్షి, హైదరాబాద్: శరీర దారుఢ్య పోటీల్లో స్త్రీల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కఠిన కసరత్తులతో కండలు పెంచి బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నారు. బాడీ పవర్ యునైటెడ్ కింగ్డమ్(యుకె) సంస్థ ఇటీవల నిర్వహించిన ఫిట్ ఫ్యాక్టర్ హైదరాబాద్ పోటీల్లో నగరంలోని అంబర్‌పేటకు చెందిన కేసరి లావణ్య ఎంపికయ్యారు. ఈ నెల 23న నగరంలోని సోమాజిగూడలో గల జయగార్డెన్‌లో స్త్రీలు, పురుషుల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. మహిళా విభాగంలో హైదరాబాద్ నుంచి ఇద్దరు, అస్సాం నుంచి ఒకరు పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న ముగ్గురు మహిళలకు జడ్జీలు కుమార్ మన్నాప్, డాన్ లయన్, బాలకృష్ణ, భరత్తేజ్ల సమక్షంలో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో కేసరి లావణ్య ప్రథమ స్థానానికి ఎంపికైంది. ఈ సందర్భంగా విలేకరులతో కేసరి లావణ్య మాట్లాడుతూ.. ఫిట్ ప్యాక్టర్ పోటీలో తాను ప్రథమ స్థానంలో రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో జాతీయ స్థాయిలో స్క్వాడ్స్ ఫిట్నెస్ సంస్థ ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి ట్రాన్స్ఫర్ మిషన్ చాలెంజీ పోటీలలో మిసెస్ ఇండియా డివోటెడ్ 2017 రన్నర్‌గా నిలిచానని తెలిపారు. ఫిట్‌నెస్‌లో జాతీయ స్థాయిలో అవార్డులు గెలిచేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను ఫిట్నెస్ రంగంలో రాణించేందుకు తన భర్త శ్రీకాంత్ ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడిందన్నారు. -
అమ్మతో ఆకాశ్
-
ప్రేమోన్మాదులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ప్రేమించు..లేకుంటే ప్రాణం తీస్తా’ అంటూ కిరాతకంగా వ్యవహరించిన ప్రేమోన్మాదులు యువతుల గొంతుకోసిన దారుణ సంఘటనలు వేలూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి. వేలూరు జిల్లా కేదాంతపట్టి గ్రామానికి చెందిన మునిరాజ్ కుమార్తె లావణ్య (23) హాస్టల్లో ఉంటూ కడలూరు జిల్లా చిదంబరంలోని అన్నామలై యూనివర్సిటీలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. లావణ్యకు ఆమె సొంతూరికి చెందిన వ్యక్తి, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న నవీన్‌కుమార్ (27)కు మధ్య స్నేహం ఉంది. అయితే నవీన్‌కుమార్ మాత్రం ప్రేమించాల్సిందిగా వేధించేవాడు. దీంతో విసిగిపోయిన లావణ్య గత 20 రోజులుగా నవీన్‌కుమార్‌తో మాట్లాడడం మానేసింది. ఫోన్ కూడా తీయడం లేదు. దీంతో సోమవారం ఉదయం చిదంబరానికి వచ్చిన నవీన్కుమార్నేరుగా లావణ్య ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి గేటుముందే నిలబడి మాట్లాడుకోవడంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కోపగించుకున్న నవీన్‌కుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి విచక్షణారహితంగా ముఖంపై కత్తితో దాడిచేశాడు. లావణ్య పెట్టిన కేకలకు పరిసరాల్లోని ఆటో డ్రైవర్లు ఉలిక్కిపడి ప్రేమోన్మాదిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అతడు కత్తితో బెదిరించడంతో బలమైన రాళ్లు విసిరి యువతిని రక్షించారు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో సమీపంలోని లావణ్యను ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికులు నవీన్‌కుమార్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్రగాయాలకు గురైన అన్ని ఆసుపత్రిలో చేర్పించి అన్నామలైనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాట్పాడిలో.. వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన షబ్బీర్ (23) అనే ఎంబీఏ విద్యార్థి అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు. మతం మార్చుకుని పెళ్లి చేసుకుందాం..లేకుంటే చంపేస్తాను అని బెదిరించేవాడు. దీంతో యువతి తల్లిదండ్రులు గత నెల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రోడ్డుపై నడిచి వెళుతున్న యువతిని అడ్డుకుని షబ్బీర్ కత్తితో గొంతుకోశాడు. ఆమె పెట్టిన కేకలతో జనం అక్కడికి చేరడంతో అతను పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. వేలూరు పోలీసులు షబ్బీర్‌ను అరెస్ట్ చేశారు. -
వివాహిత ఆత్మహత్య
పులివెందుల : పట్టణంలోని రాజారెడ్డి కాలనీకి చెందిన లావణ్య(23) అనే వివాహిత శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లావణ్యకు మల్లికార్జునతో 8నెలల కిందట వివాహమైంది. లావణ్య పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో నర్సుగా విధులు నిర్వహిస్తుండేది. మల్లికార్జున ఇప్పట్ల సమీపంలోని సంచుల ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు. గత రెండు రోజుల కిందట ముద్దనూరు వద్ద గల మంగపట్నం గ్రామంలో బంధువులు ఉండటంతో అక్కడ దేవర జరుగుతోందని ఆ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ లావణ్య బంధువులతో కలుపుగోలుగా ఉండలేదని తల్లి మందలించింది. చిన్నప్పటి నుంచి సున్నిత మనస్తత్వం గల లావణ్య తల్లి మందలించడంతో మనస్థాపం చెంది శుక్రవారం రాజారెడ్డికాలనీలోని స్వగృహంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అట్టపెట్టెలో అందం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆడవాళ్లతో షాపింగ్ మీద బోలెడన్ని జోకులున్నాయి. ఎందుకంటే ఓ పట్టాన వదలరని! అందులోనూ కాస్మెటిక్స్ షాపింగ్‌కైతే మరీనూ! తోడు వెళ్లినవాళ్లకు నచ్చితే కొంటారు.. లేకపోతే బ్రాండ్ మేనేజర్ చెబితే ఓకే చేస్తారు. మహిళగా స్వయంగా ఇవన్నీ చూసే కాబోలు... హైదరాబాదీ అమ్మాయి లావణ్య సుంకరి దీన్నే ఓ వ్యాపార వేదికగా మలచుకుంది. నెలకు సరిపడే ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులను బాక్స్‌లో పెట్టి విక్రయించడం మొదలెట్టింది. నెలకు 500 ఆర్డర్లతో మొదలైన గ్లామ్‌ఈగో ప్రస్థానం.. ఏడాదిలో 50 వేల ఆర్డర్లకు విస్తరించింది. వివరాలు లావణ్య మాటల్లోనే.. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంబీఏలో మార్కెటింగ్ చేశాక.. జెట్ ఎయిర్వేస్లో హోస్టెస్‌గా చేరా. అక్కడి నుంచి దుబాయ్, ఐర్లాండ్‌లకు చెందిన రెండు నిర్మాణ సంస్థల్లో పనిచేశా. తర్వాత సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకొని.. కో–ఫౌండర్ ప్రభాకర్ దారక్పల్లితో కలిసి రూ.60 లక్షల పెట్టుబడితో గతేడాది మార్చిలో టీ–హబ్ కేంద్రంగా గ్లామ్ఈగోను ప్రారంభించాం. బాక్స్‌లో నెలకు సరిపడే ఉత్పత్తులు..: గ్లామ్‌ఈగో బాక్స్‌ల ఎంపిక పూర్తి శాస్త్రీయంగా జరుగుతుంది. నమోదు చేసుకున్న కస్టమర్‌ను ముందుగా చర్మం రంగు, జుట్టు తీరు, శరీర ఆకృతి వంటి వాటిపై 8 ప్రశ్నలడుగుతాం. వాటి సమాధానాలను బట్టి ఎలాంటి మేకప్ కిట్స్ నప్పుతాయో ఎంపిక చేసి వాటినే పంపిస్తాం. గ్లామ్‌ఈగో వద్ద నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది సబ్స్క్రిప్షన్ బాక్స్లుంటాయి. వీటి ధరలు వరుసగా నెలకు రూ.399, రూ.329, రూ.299, రూ.289. ఒక్కో బాక్స్‌లో మేకప్ కిట్స్, స్కిన్, ఫేస్, బాడీ కేర్ ఉత్పత్తులు 4–5 వరకూ ఉంటాయి. అన్నీ ఆయుర్వేదిక్ బ్రాండెడ్ ఉత్పత్తులే. ఉదాహరణకు అమెరికాకు చెందిన మన్నాకాదర్, రష్యాకు చెందిన స్వేర్ సీక్రెట్, ఎంకెఫైన్ బ్రాండ్లున్నాయి. ప్రతి నెలా బ్రాండ్లు మారుతాయి కూడా. గత ఏడాది కాలంలో 40 బ్రాండ్ల ఉత్పత్తులను వినియోగించాం. రూ.19 కోట్ల నిధుల సమీకరణ.. హైదరాబాద్‌లోని చిరెక్ పబ్లిక్ స్కూల్ దగ్గర 8 వేల చ.అ.ల్లో గిడ్డంగి ఉంది. త్వరలోనే షాద్‌నగర్‌లో మరో వేర్‌హౌజ్‌ను ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది పురుషుల సౌందర్య ఉత్పత్తులను కూడా విక్రయిస్తాం. జూన్ నాటికి గ్లామ్ఈగోలో ఆయా బ్రాండ్ల ఉత్పత్తులను విడిగా కొనొచ్చుకూడా. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ–కామర్స్ ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 22 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే మరింత మందిని నియమిస్తున్నాం. ఈ ఏడాది చివరికి రూ.19 కోట్లు సమీకరిస్తాం. వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో చర్చిస్తున్నాం. హైదరాబాద్ వాటా 18–20 శాతం.. ప్రస్తుతం నెలకు 50 వేల ఆర్డర్లు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి 18–20 శాతం వాటా ఉంటుంది. మా కస్టమర్లలో ఎక్కువ 18–34 ఏళ్ల మధ్య వయస్సు వారు.. అందులోనూ కార్పొరేట్ మహిళా ఉద్యోగులే. మాకొచ్చే సబ్స్క్రిప్షన్లలో 6 నెలల వాటా 50 శాతం వరకుంటుంది. బ్లూడార్ట్, డీటీడీసీ, ఫస్ట్ ఫ్లయిట్, డెల్హివెరి వంటి అన్ని ప్రధాన కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. 38 వేల పిన్‌కోడ్స్‌లో డెలివరీ అందిస్తున్నాం. ఏడాదిలో రూ.6 కోట్ల వ్యాపారాన్ని చేరాం. వచ్చే ఏడాది ఆర్డర్ల సంఖ్య లక్షకు, వ్యాపారం రూ.18 కోట్లకు చేర్చాలని లకి‡్ష్యంచాం. -
ఫిబ్రవరి 12 రాత్రి అసలేం జరిగింది?
హనుమాన్‌జంక్షన్ రూరల్ : జీవితంలో అనుకోని దుర్ఘటనలు ఎదురైనప్పుడు కొందరు భయపడతారు.. మరికొందరు ఆ గాయాలనే తలుచుకుంటూ కుంగిపోతారు.. ఇంకొందరు సమయస్ఫూర్తితో ఎదుర్కొని ఎందరికో స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. ఊరు కాని ఊరిలో, భాష తెలియని ప్రాంతంలో అర్ధరాత్రి దుండగులు కత్తులతో దాడి చేస్తే ధైర్యంగా ప్రతిఘటించి మృత్యువుతో పోరాడి ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని జంగా లావణ్య. ప్రాణాపాయ స్ధితి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లావణ్య స్వగ్రామం తేలప్రోలు వచ్చారు. ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. సాక్షి: ‘బ్రేవ్ ఉమన్’ అవార్డు రావడం ఎలా అనిపించింది? లావణ్య: తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఇటీవల ప్రతిష్టాత్మక ‘బ్రేవ్ ఉమెన్’ అవార్డును ప్రకటించటం చాలా ఉత్సాహాన్ని ఇ చ్చింది. పూర్తిగా కోలుకోకపోవడంతో నా తల్లిదండ్రులు బసవ పున్న మ్మ, పిచ్చిరెడ్డి చెన్నైలో నటి రాధిక చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. సాక్షి: ఫిబ్రవరి 12 రాత్రి అసలేం జరిగింది? లావణ్య: నేను రోజూ సాయంత్రం జిమ్‌కు, వీక్ ఎండ్స్‌లో డాన్స్ క్లాస్‌కు వెళుతుంటాను. ఆ రోజు ఓ ముఖ్యమైన క్లయింట్‌తో కంపెనీ తరుపున మీటింగ్‌కు హాజరవడంతో రాత్రి బాగా ఆలస్యమైంది. అయినా ధైర్యం చేసి బైక్‌పై రూమ్‌కి బయలు దేరాను. మరో ఐదు నిమిషాల్లో రూమ్‌కు చేరుకునే దాన్ని. ఇంతలో పెరుంబాక్కం సమీపంలో ముగ్గురు వ్యక్తులు కత్తులతో నాపై దాడికి తెగబడ్డారు. నా దగ్గర బ్యాగ్‌లో ఉన్న డబ్బులు, మెడలోని బంగారు గొలుసు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. నా చేతికి ఉన్న బ్రాస్లెట్ బలవంతంగా తీసుకోబోతుండగా ప్రతిఘటించేందుకు యత్నించా. దీంతో వారు కత్తులతో నాపై విచక్షణారహితంగా దాడి చేశారు. నా తలపై బలంగా పొడవాటి కత్తితో బాదడంతో తీవ్ర గా>యాలయ్యాయి. ఇంకా నన్ను చంపేస్తారనే అనుమానంతో చనిపోయినట్లు నటించా. దీంతో నన్ను విడిచిపెట్టి పారిపోయారు. సాక్షి: ఆస్పత్రికి ఎలా చేరారు? లావణ్య: తీవ్ర గాయాలతో రక్తం పోతున్నా ధైర్యంగా సమీపంలోని రోడ్డుపైకి వచ్చా. రెండు అడుగులు వేయటం, కూర్చోవడం.. మళ్లీ రెండు అడుగులు వేయటం ఇలా రోడ్డుపైకి వచ్చిన తర్వాత కూడా రెండు గంటల పాటు ఎవ్వరూ సాయం అందించేందుకు ముందుకు రాలేదు. చాలా మంది ఉద్యోగులు ఆ రోడ్డుపై బైకులు, కార్లపై వెళుతూ గాయాలతో పడి ఉన్న నన్ను చూస్తున్నారే తప్ప సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చదువు రాని ఓ లారీ డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నా ఆఫీస్, తల్లిదండ్రుల వివరాలు పోలీసులకు చెప్పాను. చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో నన్ను పోలీసులు చేర్చారు. సాక్షి: అక్కడి పోలీసులు, ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది? లావణ్య: నా జీవితాంతం తమిళనాడు ప్రజలకు రుణపడి ఉంటాను. ఆపద సమయంలో యావత్ తమిళనాడు బాసటగా నిలిచింది. చెన్నై పోలీస్ కమిషనర్, ఏసీపీ, పల్లికరణై ఇన్స్పెక్టర్ శివకుమార్ కొద్దిరోజులకే ముగ్గురిని పట్టుకుకున్నారు. తమిళనాడు శాసనసభ ప్రతిపక్షనేత స్టాలిన్, ఐటీ శాఖ మంత్రి ఆస్పత్రికి వచ్చి నన్ను పలకరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సాక్షి: దుండగుల దాడి సమయంలో మీరు ఎలాంటి ఆందోళనకు గురయ్యారు? లావణ్య: మహాత్ముడు కలలు కన్నట్లుగా ఆడది మాత్రమే కాదు పురుషుడు కూడా అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వెళ్లగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అనేది నా అభిప్రాయం. ఇలాంటి సమయాల్లో ఆడ, మగ తేడా ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే. బహుశ ఇవే లక్షణాలు ఆపద సమయంలో నన్ను ధైర్యవంతురాలిని చేశాయి. దుండగుల దాడి నుంచి త్వరగా కోలుకునేందుకు ఇదే కారణం కావచ్చు. సమాజంలో ఎదురుదెబ్బలకు బెదరకుండా ముందుకు సాగడమే జీవితం. -
చనిపోయినట్లు నటించి బతికిపోయా
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ ఆ దుండగులు ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేని వారిగా వ్యవహరించారు, మీక్కావాల్సిన వస్తువులన్నీ తీసుకోండి..నన్ను మాత్రం ప్రాణాలతో వదిలేయండి అని ప్రాధేయపడినా పట్టించుకోలేదు...చనిపోయినట్లు నటించకుంటే నిజంగా చంపేసేవారు..’ అని ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన టెక్కీ లావణ్య పోలీసుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేశారు. కేసు విచారణ చేపట్టిన పల్లికరణై పోలీసులు ఆమె వద్ద వీడియో ద్వారా వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. గుండెను పిండేసేలా చోటుచేసుకున్న ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న లావణ్య ఈనెల 12వ తేదీన తన కార్యాలయ విధులను ముగించుకుని బైక్‌లో ఇంటికి వెళుతుండగా చెన్నై శివారు పెరుంబాక్కంలో ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. వారిలో ఒకడు నా చేతికి తొడుక్కొని ఉన్న బంగారు బ్రాస్లెట్ను లాక్కునేందుకు ప్రయత్నించారు. వెంటనే నేనే ఇస్తాను అన్నా వినిపించుకోలేదు. ఎంతో టైట్‌గా ఉన్న బ్రాస్లైట్ను బలవంతంగా లాగడంతో విలవిలలాడిపోయాను. నన్నేమీ చేయకండి అని కోరాను. అయితే వాళ్లు వినిపించుకోలేదు. వారితో నేను వాగ్వాదానికి దిగడంతో వెనక నుంచి ఒకడు ఇనుప కమ్మితో నా తలపై బలంగా కొట్టాడు. తల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండగా బైక్ నుంచి కిందపడి పోయాను. తల, చేతులు, గుండెపై రాడ్డుతో, చేతులతో పిడిగుద్దులు కురిపించారు. ఇక వీరి నుంచి ఎలాగైనా బైటపడాలని చనిపోయినట్లు నటించాను. చనిపోయాననుకుని వారు పారిపోయారు. రెండు గంటల పాటు రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడాను. ఎవరూ సహాయానికి రాని పరిస్థితుల్లో మానసిక స్థైర్యాన్ని గుండెల్లో నింపుకున్నా. రక్తం కారుతున్న స్థితిలో నేను మనోధైర్యాన్ని కూడగట్టుకుని లేచి నిల్చొని ఎదురుగా కొత్తగా కడుతున్న నిర్మాణంలోకి నడిచి వెళ్లాను. కొంచెంసేపైన మరలా నిలదొక్కుకుని జనసంచారం ఉన్న చోటకు వెళితే సహాయం లభిస్తుందని బయల్దేరాను, మా నాన్న ఇప్పటికే ఒక కుమార్తెను పోగొట్టుకున్నారు. నేను కూడా ఆయనకు దూరం కాకూడదని మొండి ధైర్యం తెచ్చుకోవడంతో రక్తం కారుతున్నా నొప్పులు తెలియలేదు. సుమారు రెండు గంటల తర్వాత ఒక వాహనంలో వెళుతున్న వ్యక్తుల ద్వారా ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వగా చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చేర్పించారు. నేను ఎటువంటి ఆధారాలు చూపకున్నా నిందితులను రెండోరోజుల్లోనే పట్టుకున్న తమిళనాడు పోలీసులు ప్రశంసనీయులు. ముఖ్యంగా నేను కోలుకునేందుకు రేయింబవళ్లు పాటుపడిన పళ్లికరణై ఇన్స్పెక్టర్ శివకుమార్‌కు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక పల్లికరణై ఇన్స్పెక్టర్ శివకుమార్‌ను మా కుటుంబంలో ఒక వ్యక్తిగా స్వీకరించాం. తమిళనాడు ప్రజలు నా కోసం చేసిన ప్రార్థనలే నన్ను బ్రతికించాయి. పోలీసులు వచ్చి నిందితులను ఫొటోలు చూపించి గుర్తించమని కోరారు. అయితే నేను వారి ముఖాలను చూసేందుకు ఇష్టపడలేదు. నా జీవితంలో వాళ్లను మరోసారి చూడకూడదని, జ్ఞాపకంలోకి కూడా రాకూడదని నిర్ణయించుకున్నా. దారిదోపిడీకి పాల్పడే నేరస్థులను పట్టుకుని దండించే పోలీసులు వారి ఫొటోలను ప్రజల్లో బహిరంగంగా ప్రకటించాలి. నాకు జరిగిన నష్టంతో నా మనసులో ఇలాంటి చైతన్య ప్రచారాల పథకాలు మెదలుతున్నాయి. పూర్తిగా కోలుకున్న తర్వాత తమిళనాడు పోలీసుల సహకారంతో మహిళల రక్షణ కోసం అనేక పథకాలను అమలు చేయాలని, చైతన్యం కల్పించాలని ఉంది. -
దారి చూపులు
సాయంత్రం నాలుగవుతోంది. లావణ్య కాలేజీ నుంచి ఇంటికి బయల్దేరింది. ఇంటికి కాలేజీ చాలా దగ్గర. రోజూ ఆ దారెంట నడుస్తూనే వెళుతుంది. కాలేజీకి పక్కన్నే సితార హాస్పిటల్. దానిపక్కన శ్రీధర్ లాడ్జి. ఆ తర్వాత వేదిక కాంప్లెక్స్. అది దాటుకొని వెళితే మదీనా బిర్యానీ సెంటర్. అక్కణ్నుంచి మలుపు తిరిగితే వచ్చే వీధిలో ఐదో ఇల్లే లావణ్య వాళ్ల ఇల్లు. లావణ్య కాలేజీ గేటు బయటకొచ్చి మెయిన్‌రోడ్డు మీదనుంచి సితార హాస్పిటల్ దాటి, శ్రీధర్ లాడ్జి ముందుకొచ్చింది. ఈ రోడ్డంతా రోజూ వచ్చే పోయే వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఇవ్వాళెందుకో అక్కడి వాతావరణమంతా లావణ్యకు ప్రశాంతంగా అనిపించింది. వేదిక కాంప్లెక్స్ దగ్గరకొచ్చేసరికి ఆమె మనసు అదోలా అయిపోయింది. నిన్నటిరోజు సరిగ్గా ఇదే సమయానికి కాలేజీ నుంచి వస్తూంటే, శ్రీధర్ లాడ్జి ముందు లావణ్యకు అక్కడక్కడా ముగ్గురు, నలుగురు జట్టుగా నిలబడి గుసగుసలాడుకోవడం కనిపించింది. ఒక అడుగు వాళ్లను చూస్తూ వేస్తూ, ఇంకో అడుగు వాళ్లను చూడకుండా వేస్తూ నడుస్తోంది లావణ్య. వేదిక కాంప్లెక్సు ముందుకొచ్చేసరికి లావణ్యకు సరిగ్గా మూడడుగుల దూరంలో రోడ్డు మీద రక్తపు మరకలు ఎర్రని దుప్పటి కప్పినట్లుగా పరుచుకున్నాయి. అది చూసి ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని అనుకుంది. వాళ్లంతా ఎందుకు గుసగుసలాడుకుంటున్నారో ఆమెకు అర్థమైంది. మదీనా బిర్యానీ సెంటర్ ముందు లావణ్యకు వాళ్ల పక్కింటావిడ కనిపించింది. లావణ్య కాస్త ముందుకు వెళ్లి ఆమెను ఈ ప్రమాదం గురించి అడుగుదామనుకుంది. ఈలోపు ఆమే, ‘‘ఏదో యాక్సిడెంట్ అంటమ్మా! అర్ధగంట క్రితమే రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని పెద్ద లారీ దాని చక్రాల కింద నలిపేసి వెళ్లిపోయిందట. పాపం అతను అక్కడికక్కడే చనిపోయాడట. అతను ఎవరో ఏంటో కూడా ఎవరికీ తెలియదట. అతని దగ్గర సెల్‌ఫోన్ కూడా లేదట..’’ చెప్తూ పోయిందామె. నిన్న పక్కింటావిడ చెప్పిన ఈ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ, పాపం అతనికి సంబంధించిన వాళ్లు ఎక్కడున్నారో అనుకుంటూ ఇంటికి చేరింది లావణ్య. ఆ తర్వాతిరోజు అదే దారిలో ఇంటికెళ్తూంటే వీధి మలుపు దగ్గర లావణ్యకు ఒక చిన్నమ్మాయి కనిపించింది. పదేళ్లుంటాయేమో ఆ అమ్మాయికి. మాసిపోయిన బట్టలతో, నల్లగా, బక్కచిక్కి ఉంది. నిజానికి లావణ్య అంతకుముందు రోజే ఆ అమ్మాయిని చూసింది. ఒకసారి రోడ్డుపైన, ఇంకోసారి కాలేజ్ పక్కన, మరోసారి వారుండే వీధిలో అక్కడక్కడే తచ్చాడుతూంటే లావణ్య ఆ అమ్మాయిని చూసింది. బిత్తరచూపులు చూస్తూ, దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఇంకేదో వెతుకుతున్నట్లుగా ఉంది. లావణ్యకు జాలేసింది. ఆ అమ్మాయి దిగులు వెనక ఏముందో తెలుసుకోవాలనుకుంది. ఆ అమ్మాయికి ఎదురుగా వెళ్లి, అడ్డంగా నిలబడింది లావణ్య. ఆ అమ్మాయి లావణ్యను అయోమయంగా చూసింది. ‘‘ఎవర్నువ్వు? ఏదైనా పోగొట్టుకున్నావా? లేదా ఎవరినైనా వెతుకుతున్నావా?’’ అడగాలనుకున్న ప్రశ్నలన్నీ టకటకా అడిగేసింది లావణ్య. ఆ అమ్మాయి తేరుకొని.. ‘‘అక్కా.. మా మావయ్య రెండురోజుల నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు..’’ లావణ్య ఆ అమ్మాయి వంకే చూస్తోంది. ‘‘మేం వేరే ఊర్నుంచి ఇక్కడికి వచ్చాము. అక్కడ పనులు లేవని పట్నంలో చాలా పనులుంటాయని నన్ను, మా అమ్మను మావయ్యే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏదో రైసు మిల్లులో పని దొరికిందని, తను, అమ్మ వెళ్లొచ్చని, నన్ను బడిలో చేర్పిస్తానన్నాడు. కానీ మొన్న పనిమీద వెళ్లిన మావయ్య ఇంతవరకూ తిరిగిరాలేదు. ఇక్కడ మాకెవ్వరూ తెలీదు. ఎవరిని అడగాలో తెలీక మావయ్యను నేనే వెతుకుతున్నా..’’ అంది.‘‘ఒకవేళ ఊరెళ్లాడేమో’’ అంది లావణ్య. ‘‘లేదక్కా! మాకు మావయ్య, మావయ్యకు మేం తప్ప అక్కడ ఇంకెవ్వరూ లేరు. మావయ్య ఊరెళ్లి ఉండడు..’’ అంది ఆ అమ్మాయి. లావణ్య వెంటనే ఏదో చెప్పబోతూంటే ఆ అమ్మాయి ఎవరో పిలిచినట్టు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఎవరో ఆడమనిషిని చూసి ఆ అమ్మాయి వాళ్ల అమ్మ అయ్యి ఉంటుంది అనుకుంటూ ఇంటిముఖం పట్టింది లావణ్య. ఇంట్లోకి వెళ్లగానే లావణ్యకు హాల్లో వాళ్ల మావయ్య కనిపించాడు. ఆయనకు ఆ ఊర్లోనే అతిపెద్ద రైసు మిల్లు ఉంది. నాన్నతో కలిసి ఏదో మాట్లాడుతూ ఉన్న మావయ్యను చూసి చూడనట్లే లోపలికెళ్లిపోయింది లావణ్య. నాన్న, మావయ్య ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. లోపలున్న వారికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అవేవీ పట్టించుకోనట్లే తన పని తాను చేసుకుంటోంది లావణ్య. ఒక్కసారే మావయ్య ఏదో గుర్తొచ్చినవాడిలా.. ‘‘అన్నట్టు నీకో విషయం చెప్పాలి బావా!’’ అన్నాడు. అంతసేపు ఆ మాటలను పట్టించుకోనట్టున్న లావణ్య ఎందుకో ఇదంతా ఆసక్తిగా వినడం మొదలుపెట్టింది. ‘‘మూడు రోజుల క్రితం ఒకతను మిల్లుకొచ్చాడు. ఏదైనా పనుంటే ఇవ్వమని ఎంత కష్టమైనా చేస్తానని, అలాగే తన చెల్లికీ పని ఇప్పించమని బతిమిలాడాడు. సరే ఏదో కష్టాల్లో ఉన్నట్టున్నాడు కదా అని రమ్మని చెప్పా. ఆరోజే అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడట. ఇక్కడే వేదిక కాంప్లెక్స్ ఉండ్లా, అక్కడ జరిగిందట. బాధాకరం ఏంటంటే ఇంతవరకూ అతని వాళ్లెవ్వరూ రాలేదట..’’ మావయ్య మాటలు వింటూంటే లావణ్యకు ఒక్కొక్కటిగా అంతకుముందు ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. లావణ్యకు మెల్లిగా అర్థమైపోయింది, ఆ అమ్మాయికి మావయ్య, ఇప్పుడు మావయ్య చెప్తున్న వ్యక్తి ఒక్కరేనని. ‘ఓరి దేవుడా! ఎంత ఘోరం జరిగిపోయింది. వాళ్లకు దిక్కెవరు? అతను లేకుండా వాళ్లు బతుకుతారా? ఇది తెలిస్తే వారు ఊరుకుంటారా? ఏడుస్తారు. బాగా ఏడుస్తారు. గుండెలు పగిలేలా ఏడుస్తారు..’ లావణ్య మెదడులో రకరకాల ప్రశ్నలు, ఆలోచనలు పట్టాల మీద రైలు పరిగెడుతున్నట్టు పరిగెడుతున్నాయి. ఒక్క ఉదుటున ఇంట్లోంచి బయటకొచ్చింది లావణ్య. వాళ్లమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెడుతోంది. నిజానికి తనిప్పుడు వినిపించుకునే స్థితిలో కూడా లేదు. ఆ అమ్మాయి కోసం పిచ్చిదానిలా పరుగులు పెట్టింది. రోడ్ల వెంబడి తిరిగింది. అంతపెద్ద మనిషి రెండురోజులు కనిపించకపోతే కంగారు పడిన ఆ అమ్మాయి ధోరణి అర్థం కాని లావణ్య ఆ కంగారు వెనక ఇంత విషాదం దాగుంటుందని అప్పటికి ఊహించలేదు. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పాలని తపించుకుపోయింది. కాలేజీ చుట్టుపక్కల, అవతలవైపు అంతా తిరిగి వస్తుంటే వేదిక కాంప్లెక్స్ ముందు కనిపించింది. ఆ అమ్మాయిని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది లావణ్యకు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయి ముందు నిలబడింది. ‘‘మీ మావయ్య.. మీ మావయ్య..’’ అంటూ నసుగుతూ ఉంటే ఆ అమ్మాయి వాళ్లమ్మ లావణ్య చెప్పేదేదీ వినిపించుకోకుండానే, ‘‘ఏంటమ్మా! వాళ్ల మావయ్య కనిపించడం లేదన్న విషయం నీకు చెప్పిందా?’’ అంటూ – ‘‘మా అన్నయ్యకు మేమంటే ఎనలేని ప్రేమ. మా అన్న తప్ప మాకు ఎవ్వరూ లేరు. మమ్మల్ని వదిలి ఆయన ఎక్కడికీ వెళ్లడు. అన్నయ్య లేకుండా మేం ఉండలేమని ఆయనకు తెలుసు. అలాంటివాడు ఎక్కడికి వెళతాడు? ఎప్పటికైనా తిరిగొస్తాడు.’’ ఆవిడ పలికిన ఆ రెండు ముక్కలు విన్నాక లావణ్య అప్పటివరకూ పడిన ఆరాటం, తపన ఒక్కసారే ఎక్కడికో ఎగిరిపోయాయి. దానికి బదులుగా ఇప్పుడు వారికి నిజం చెప్పాలా వద్దా అనే దిగులు మొదలైంది. ఒక్కక్షణం అలా నిలబడిపోయింది లావణ్య. నిజం తెలిసి వారి గుండెలు బద్దలు అవడం కన్నా అతను ఎప్పటికైనా తిరిగొస్తాడనే వారి భ్రమే సరైనదిగా తోచింది. అతనిపై వారికున్న నమ్మకం తిరిగొస్తాడనుకునేలా చేస్తోంది. కానీ అతను తిరిగి రాలేడని తెలిస్తే? అసలు అతను ఈ లోకంలోనే లేడని చెబితే? ఊహూ.. వారికింక ఏదీ చెప్పదలుచుకోలేదు లావణ్య. వచ్చిన దారినే వెనుతిరిగింది. లావణ్య వేదిక కాంప్లెక్స్ ముందు నిలబడిందిప్పుడు. ఆరోజు ఆమె చూసిన రక్తపు ఆనవాళ్లు కూడా కనబడలేదు. ముందుకు నడుస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది లావణ్య. ఆ తల్లీ కూతుళ్లు రోడ్డు దాటుతున్నారు. మళ్లీ ఏదో వెతుకుతున్నట్లుగా దిక్కు చూపులు చూస్తున్నారు. కానీ అవి దిక్కు చూపులు కావు. ఒకరు వాళ్ల మావయ్య, ఇంకొకరు వాళ్ల అన్నయ్య ఎటునుంచి వస్తాడో అని చూస్తోన్న ఎదురుచూపులు. కానీ అతనెప్పటికీ తిరిగి రాడని, వాళ్లకు అండగా ఉండలేడని, వారికి ప్రేమ పంచడం, వారి ప్రేమ పొందడం జరగదని, ఇవేవీ వారికి తెలియకూడదనీ కోరుకుంది లావణ్య. ఎప్పటికైనా అతను తిరిగొస్తాడనే భ్రమలోనే వాళ్లు ఉండాలని, అతని కోసం ఎదురుచూపులు ఇలాగే కొనసాగాలని కోరుకుంది. మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా భారంగా అడుగులేసుకుంటూ వెళ్లిపోయింది లావణ్య. - షేక్ షబానా -
యాప్ కీ కసమ్
ఉష ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమె బావ సంచిత్ పది రోజుల్లో అమెరికా వెళుతున్నాడు. ఇద్దరికీ చిన్నప్పుడే పెళ్లి నిశ్చయమైంది కానీ, ఉషకి డిగ్రీ పూర్తయ్యాకనే పెళ్లి అనుకున్నారు. సంచిత్ నిన్న సాయంత్రమే అక్కడికొచ్చాడు. వాళ్లు సరదాగా గడపడానికి కొద్ది రోజులే ఉన్నాయి. ఆ రాత్రి కబుర్లలో పడి, పడుకునేసరికి పన్నెండు దాటినా మర్నాడుదయం ఆరు కాకముందే లేచారిద్దరూ. ఇంట్లో మిగతావాళ్లెవరూ ఇంకా నిద్ర లేవలేదు. వీళ్లిద్దరూ హాల్లో కూర్చుని, టీవీ ఆన్ చేసి సౌండ్ మినిమమ్‌లో ఉంచారు. ‘‘చందన థియేటర్లో ఫస్ట్ షోకి వెడదామా?’’ అన్నాడు సంచిత్.‘‘సినిమా ఏంటి?’’ అంది ఉష. సంచిత్ నవ్వి, ‘‘ఏదో సినిమా, ఏదైనా ఓకే! అక్కడ రన్నయేవి పాత సినిమాలు కదా, జనమట్టే ఉండరు. నువ్వు సినిమా చూద్దువు. నేను నిన్ను చూస్తా’’ అన్నాడు.ఉష ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ‘‘నన్ను చూడ్డానికి సినిమాకెందుకు? ఇంట్లోనే కూర్చోవచ్చు’’ అంది. ‘‘థియేటర్లో నాన్స్టాపుగా గంటల తరబడి నిన్ను చూడొచ్చు. ఎవరూ ఏమీ అనరు, అనుకోరు. ఇక్కడలా కుదురుతుందంటే చెప్పు. ఈ హాలే నాకు సినిమా హాలు’’ అన్నాడు. సంచిత్ అలా మాట్లాడుతుంటే వినడానికి బాగుంటుంది ఉషకి. రోజంతా బావతోనే గడపాలి అనుకుంది. అంతలో పక్కనున్న ల్యాండ్‌లైన్ మ్రోగింది. ‘‘హలో! లావణ్యని. నా కొత్త యాప్ గురించి అర్జెంటుగా నీతో షేర్ చేసుకోవాలి. నువ్వీ రోజు పూర్తిగా నాకోసం కేటాయించాలి. అడక్క అడక్క అడుగుతున్నా – బెస్ట్ ఫ్రెండుని. కాదనకు. ప్రోగ్రాం కాసేపట్లో చెబుతాను. వెయిట్ చెయ్’’.ఉష రిసీవర్ పెట్టేసి సంచిత్కి విషయం చెప్పి, ‘‘అది నా క్లాస్‌మేటూ, బెస్ట్ ఫ్రెండూ. నాకోసం ఎన్నోసార్లు ఎన్నో చేసింది. దానికీ సరిగ్గా ఈరోజే ముహూర్తం దొరకడం మన దురదృష్టం’’ అంది. సంచిత్ చిరాగ్గా, ‘‘ఇప్పుడామె నాకు వరస్ట్ ఎనిమీ. నేనంటే నీకిష్టమైతే, నువ్వూ తన గురించి అలాగే అనుకోవాలి. మన ప్రోగ్రాం గురించి తనకి చెప్పు. అర్థం చేసుకుంటుంది’’ అన్నాడు.‘‘నేను చెప్పలేను. ఏం చెయ్యాలో తోచడం లేదు.’’ అంది ఉష దిగాలుగా. సరిగ్గా అప్పుడే మళ్లీ ల్యాండ్‌లైన్ మోగింది. మళ్లీ లావణ్యే!‘‘సారీయే, సడెన్‌గా గోపాల్ గుర్తుకొచ్చాడు. నా మొదటి యాప్ కబురు ముందు తనతో షేర్ చేసుకున్నా. ఇది ముందు నీతో షేర్ చేసుకున్నానని తెలిస్తే ఫీలౌతాడు. మన ప్రోగ్రాం కాన్సిల్!’’ అందామె. ఉష ఫోన్ పెట్టేసి, ‘‘హుర్రే’’ అంది. వారం రోజులుగా రెండో యాప్‌కోసం పడుతున్న శ్రమ ఫలించిందని లావణ్యకు మహోత్సాహంగా ఉంది. యాప్స్ తయారీ ఆమె హాబీ. ఆమె పెదనాన్న అమెరికాలో ఉంటున్నాడు. ఆయనకిద్దరు పిల్లలు. ఇద్దరికీ తెలుగు రాదు. వాళ్ల నానమ్మకి వాళ్లతో మాట్లాడాలని మహా సరదా. వాళ్లకోసం ఇంగ్లీషూ నేర్చుకున్నా, ఆ యాక్సెంట్ పిల్లలు పట్టుకోలేరు. అందుకని లావణ్య ఓ యాప్ తయారు చేసింది. నానమ్మ తెలుగులో మాట్లాడితే, అది ఇంగ్లీష్‌లోకి అనువాదమై పిల్లలకి వాళ్లకి అర్థమయ్యే యాక్సెంట్లో వినిపిస్తుంది. పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే, అది తెలుగులోకి అనువాదమై చక్కని తెలుగు యాక్సెంటులో నానమ్మకి వినిపిస్తుంది.మూడు వారాలక్రితం ఈ మొదటి యాప్ తయారు చేసినప్పుడు – ఆ ఉత్సాహాన్ని నానమ్మకంటే ముందు గోపాల్‌తో పంచుకుంది లావణ్య. అతడామెని మూడు నెలలక్రితం ఓ థియేటర్ వద్ద కలిశాడు. తనే పలకరించి, ‘‘నాకు బాగా డబ్బుంది. ఖర్చు చేస్తూ సరదాగా గడిపెయ్యడం నా హాబీ. పేరుకో డిగ్రీ కూడా ఉంది. ఇటీవల మీరు లాస్య అనే అమ్మాయిని వాసు అనే జులాయి నుంచి రక్షించడంలో గొప్ప సాహసం చేశారు. మీతో స్నేహం చేసి, మీ లక్ష్యాలను నా లక్ష్యాలు చేసుకోవాలని ఆశ పడుతున్నాను’’ అన్నాడు.అతడు మాట్లాడిన పద్ధతి నచ్చిందామెకి. వారంలోగానే ఇద్దరూ పార్కులో కలుసుకున్నారు. మరుసటి వారం కలిసి సినిమా చూశారు. నెల తిరక్కుండా ఒకరికొకరు ఐ లవ్యూ చెప్పుకున్నారు. ఆమె మొదటి యాప్ గురించి వినగానే, ‘‘దీన్ని కమర్షియలైజ్ చేద్దాం’’ అన్నాడతడు. లావణ్య మురిసిపోయింది. ‘ఇప్పుడీ రెండో యాప్ గురించి వింటే గోపాల్ ఏమంటాడో’ ఆనుకుంటూ ల్యాండ్‌లైన్ డయల్ చేసింది లావణ్య. అది గోపాల్ ఇల్లు. ఇంట్లో పెద్దవాళ్లు లేరని ఫ్రెండ్స్ అంతా ధైర్యంగా రాత్రి మందు పార్టీ చేసుకున్నారు. పెద్దవాళ్లిచ్చే డబ్బులు ఖర్చు చెయ్యడం తప్ప వాళ్లకింకో బాధ్యత లేదు. ఆడపిల్లల్ని వలలో వేసుకోవడం తప్ప ఇంకో పని లేదు. వాళ్ల చేతుల్లో మోసపోయిన అమ్మాయిల్లో కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఊరుకుంటారు. చాలా కొద్దిమంది మాత్రం వలలో పడ్డట్లే పడి జారిపోతారు. వాళ్లలో కొందరు ఎదురు తిరగొచ్చని లాస్య నిరూపించింది.వాసు ఇంటర్ చదువుతున్న లాస్యని ఇష్టపడ్డాడు. చొరవ చేసి పరిచయం చేసుకున్నాడు. మర్యాదస్తుడిలా పోజు కొడుతూ, ఆదర్శాలు వల్లించాడు. ఐ లవ్యూ తను చెప్పి, ఆమె చేతా చెప్పించాడు. ఒక రోజు పార్కులో ఓ పొద మాటున మరింత చొరవ చేశాడు. అప్పుడు మాత్రం ఆమె సహకరించలేదు సరికదా, ‘‘తప్పు నీది కాదు. నీతో పార్కుకి వచ్చానుగా, అదీ నా తప్పు’’ అని రుసరుసలాడింది. ఐతే వాసుకి ప్లాన్ బి సిద్ధంగా ఉంది. ‘‘తప్పు నాదే! మళ్లీ ఇలా జరగదని నువ్వు నమ్మేదాకా నాకు నిద్ర పట్టదు. మా గెస్ట్‌హౌస్‌కి రా. అక్కడ నువ్వూ, నేనూ తప్ప ఇంకెవ్వరూ ఉండరు. పబ్లిక్ పార్కులో జరిగిన పొరపాటు ఏకాంతంలో కూడా నావల్ల జరగదని తెలుసుకుంటావు’’ అన్నాడు.లాస్య వెంటనే ఒప్పుకోలేదు. కానీ వాసుకి తెలుసు. ఏ ఆడపిల్లకైనా సరే ఆ వయసులో నమ్మాలి, ఒప్పుకోవాలి – అనిపిస్తుందని. అలాగే చివరకు లాస్య ఒప్పుకుంది. వాసు ఉత్సాహం పట్టలేకపోయాడు. మిత్రులకి ఫోన్ చేసి, విషయం చెప్పాడు. వాళ్లతణ్ణి అభినందించి, త్వరలోనే ఆమె తమకూ సొంతం కానున్నదని ఆశించారు. కానీ వాసు లాస్యని తక్కువ అంచనా వేశాడు. ఆమెకి అతడి మీద అనుమానమొచ్చింది. తనకి పరిచయమున్న లావణ్యకి చెప్పింది. లావణ్య తండ్రికి చెప్పింది. వాసు పోలీసులకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. తండ్రి పలుకుబడితో బెయిలు మీద బయటకు వచ్చాడు. అతడిప్పుడు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే లావణ్యని లక్ష్యం చేసుకోవాలి. ఆ ఉద్దేశ్యంతోనే గోపాల్ లావణ్యని పరిచయం చేసుకుని ప్రేమలోకి దింపాడు. ‘‘ఈ రోజే ఆ లావణ్య పొగరు దించి మనకి దాసోహం చేసుకోవాలి’’ అన్నాడు వాసు చర్చకి ఉపక్రమిస్తూ. అంతలో గోపాల్ పక్కనున్న ల్యాండ్‌లైన్ మోగింది. రిసీవర్ తీసి, ‘‘ఎవరూ?’’ అన్నాడు గోపాల్ విసుగ్గా. ‘‘ఎవరూ గోపాలేనా – నేను లావణ్యని?’’‘‘అరే, లావణ్యా నువ్వా? థాంక్ గాడ్! ఏమయింది నీకు? నువ్వు ఫోన్ చెయ్యవు. నేను చేస్తే తియ్యవు. మనం ఫోన్లో మాట్లాడుకుని వారం దాటిపోయింది తెలుసా?’’ అన్నాడు గోపాల్.‘‘అందుక్కారణం కొత్త యాప్ డెవలప్ చేస్తూ బిజీగా ఉండడం! అది నిన్న రాత్రే సక్సెసవడం నాకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. నీతో పంచుకోవాలనిపించి ఆగలేక ఇప్పుడే ఫోన్ చేసేశాను’’ అంది లావణ్య.‘‘యు ఆర్ గ్రేట్ లావణ్యా! పాత యాప్ మీద ఆల్రెడీ ఒకరు స్పాన్సర్షిప్కి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా దాంతో కలిపేద్దాం’’ అని గోపాల్ ఇంకా ఏదో అనబోతుండగా – ‘‘కమర్షియలైజేషన్ విషయం తర్వాత. ముందు నా యాప్ డిటెయిల్స్ విను...’’ అంది లావణ్య.‘‘టెక్నికల్ విషయాల మీద నాకంత ఆసక్తి లేదు. నీ పేరు నలుదిక్కులా మోగిపోవాలి. అంతే నాక్కావలసింది. సాయంత్రం ఆరుకి మా ఇంటికి రా. అమ్మానాన్నా ఊళ్లో లేరు. ఈరోజు మధ్యాహ్నానికి వస్తారు. వాళ్లకి నిన్ను పరిచయం చేస్తా. నువ్వేమో యాప్ గురించి చెప్పడానికి వచ్చినట్లు అందువుగాని. నేనేమో నీ గురించి అమ్మానాన్నలకు చెబుతాను. అదే సమయంలో నువ్వు నీ యాప్‌ని కూడా డెమాన్స్ట్రేట్ చెయ్యాలి సుమా!’’ నవ్వాడు గోపాల్. ‘‘సరేలే కానీ ఎవరో స్పాన్సర్ అన్నావు! అతణ్ణీ పిలువు.. యాప్ గురించి నేనే చెబుతాను..’’‘‘అతడు కాదు, ఆమె! ఒక్కణ్ణే ఉన్నప్పుడు పిలిస్తే బాగుండదుగా.. అమ్మానాన్నా వచ్చాక చెబుదామనుకున్నా. నువ్వొస్తున్నావు కాబట్టి ఇప్పుడే చెబుతాను’’ అన్నాడు గోపాల్.‘‘సాయంత్రం కోసం ఎదురు చూస్తుంటాను. అప్పుడు నీ ఊహకందని సర్ప్రైజ్ కూడా తెస్తాను. నువ్వూ, ఆ స్పాన్సర్ కూడా ఫ్లాట్ అయిపోతారు. నీ మీదొట్టు’’ అని ఫోన్ పెట్టేసింది లావణ్య.గోపాల్ ఫోన్ పెట్టేసి, ‘‘చేప తనే వచ్చి వలలో పడతానంటోంది’’ అని ఫోన్ సంభాషణ సారాంశం వివరించాడు మిత్రులకి.‘‘సర్ప్రైజ్ అంటే లాస్య విషయంలో లాంటిది కాదు కదా!’’ అనుమానంగా అన్నాడు మూర్తి.‘‘వాసు ఫూలిష్‌గా గెస్ట్‌హౌస్‌కి రమ్మన్నాడు. దాంతో ఆ పిల్లకి అనుమానమొచ్చింది. మనం నేరుగా ఇంటికి పిలుస్తున్నాం. డౌటు రానే రాదు. తను రావడం ఖాయం’’ అన్నాడు గోపాల్. ‘‘నిజంగా వస్తుందా? వచ్చినా లొంగు తుందా?’’ అన్నాడు మూర్తి.‘‘ఒక ఆడపిల్లని చెప్పుచేతల్లో ఉంచాలంటే, ముందామె చెప్పు చేతల్లో మనమున్నామన్న భ్రమ కలిగించాలి. అది ఫస్ట్ స్టెప్. ఆమెకై ప్రాణమైనా ఇస్తామన్న నమ్మకం కలిగించడం రెండో స్టెప్. నమ్మించి మోసం చెయ్యడం మూడో స్టెప్. మోసపోయిన అమ్మాయిని బ్లాక్మెయిల్ చెయ్యడం నాలుగో స్టెప్. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫార్ములా. ఈరోజు మనం మూడో స్టెప్‌లోకి వస్తున్నాం. నో డౌట్స్’’ అన్నాడు గోపాల్ మిత్రబృందానికి కన్ను గీటి. ‘‘అందరికీ తెలిసిన ఈ ఫార్ములా లావణ్యకి తెలియదా. పోలీసాఫీసరు కూతురు’’ అన్నాడు వాసు. ‘‘లావణ్యకి మన దగ్గర జాగ్రత్త అవసరం లేదనిపించడమే రెండో స్టెప్. ఆమె విషయంలో అది దాటేశాం. అయినా ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండే అమ్మాయిలు నూటికొక్కరే ఉంటారు. మిగతా తొంభైతొమ్మిదిమందీ అబ్బాయిల వల కోసం సిద్ధంగా ఉంటారు. అది వయసు మహిమ. ఇదీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే్ట’’ అన్నాడు గోపాల్.‘‘ఇంతకీ ప్లానేమిటి? లావణ్య మీద నీ మోజు తీర్చుకోవడమా? నా పగ తీర్చడమా?’’ అన్నాడు వాసు. ‘‘ఎందుకురా నీకంత తొందర?’’ అన్నాడు గోపాల్. ‘‘బెయిలు మీదున్నవాణ్ణి. తొందరే మరి! ఈవేళైతేనే ఇంట్లో అంకులూ, ఆంటీ లేరు’’ అన్నాడు వాసు. ‘‘ఇంతకీ లావణ్య మీద నాకు మరీ మోజేం లేదు. అంతా నీ పగ కోసమే! మా బెడ్రూమ్ సౌండ్‌ప్రూఫ్ అని తెలుసుగా. అక్కడ ఈరోజు మనం లావణ్యపై తీసే వీడియోలు నీకు జైలు తప్పించడమే కాదు. ఓ పోలీసాఫీసర్ని కూడా మనకి తొత్తుని చేస్తాయి. మనం ఆ వీడియో ఆపరేషన్ గురించి చర్చిద్దాం’’ అన్నాడు గోపాల్. రాత్రి ఎనిమిది. చందన థియేటర్లో సినిమా చూస్తున్నారు ఉష, సంచిత్. ఉన్నట్లుండి ఉష మొబైల్ మోగింది. లావణ్య. ‘‘థియేటర్లో ఉన్నానే! తర్వాత మాట్లాడతా’’ అంది ఉష కొంచెం విసుగ్గా.‘‘ఉషా పరిణయం చూడాల్సింది నేను. కానీ, నువ్వు చూడ్డమేమిటే..’’ ‘మేము ఉషా పరిణయం సినిమాకు వెళుతున్నట్లు ఇంట్లో కూడా తెలియదే, దీనికెలా తెలిసింది?’ అనుకుంటూ ఉలిక్కిపడింది ఉష. ‘ఔనూ బావ ఉదయం అగ్లీ క్రీచర్ అన్న విషయం లావణ్యకెలా తెలిసింది?’ ‘‘నువ్వు షాక్‌లో ఉన్నావని తెలుసులే! ముందు అసలు విషయం విను. ఉదయం నేను చెప్పానే కొత్త యాప్ గురించి.. అదేమిటంటే, అవతలివాళ్లు ఫోన్ పెట్టేసేక కూడా మళ్లీ వాళ్లు మరొకరికి డయల్ చేసేదాకా అక్కడి మాటలు వినగలిగేలా చేస్తుంది. ఇది ల్యాండ్‌లైన్లకే పని చేస్తుంది. ముందు నీ ల్యాండ్లైనుకి టెస్టు చేసి, మీ ఇద్దరి మాటలు రికార్డు చేశాను. అవి మీకే వినిపించి థ్రిల్ చెయ్యా లను కున్నాను. టెస్టు ఫలించడంతో హుషారెక్కి పోయి ఆ విషయం గోపాల్‌తో షేర్ చెయ్యాలను కున్నాను. అప్పుడు....’’అప్పుడు ఉషకి కలిగిన థ్రిల్ వర్ణనాతీతం. లావణ్య ఇంకా ఏదో చెప్పబోతుంటే, ‘‘యు ఆర్ ఎక్స్ట్రార్డినరీ లావణ్యా! మరి యాప్ గురించి షేర్ చేశావా? గోపాల్ థ్రిల్లయ్యాడా?’’ అంది ఉష ఆత్రుతగా. అవతల పెద్ద నిట్టూర్పు వినిపించింది, ‘‘గోపాల్‌తో షేరింగా, ఇప్పుడా ఛాప్టర్ క్లోజ్!’’ అంది.‘‘అదేమిటి? ఏం జరిగింది?’’‘‘యాప్ కీ కసమ్, గోపాల్ ఇప్పుడు తన నలుగురు మిత్రులతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి, జైల్లో ఊచలు లెక్కెడుతున్నాడు’’ అంది లావణ్య. - వసుంధర -
ఆ దుండగులు దొరికారు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగురోజుల క్రితం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగమ్మాయి లావణ్య చెన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణానికి చెందిన లావణ్య (26) చెన్నై నావలూరులోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఈనెల 13న తెల్లవారుజామున విధులు ముగించుకుని నుంగంపాళయంలోని సోదరి ఇంటికి బైక్‌పై బయలుదేరారు. అరసన్‌కళని రోడ్డులో వెళుతుండగా దారిదోపిడీ ముఠా ఆమె తలపై ఇనుపరాడ్‌తో మోదడంతో కిందపడిపోయారు. ఈ సమయంలో ఆమె తల రోడ్డుపై ఉన్న ఒక బండరాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి స్పృహకోల్పోయారు. దుండగలు ఆమె మెడలోని నగలు, డబ్బు, సెల్‌ఫోన్, బైక్ దోచుకెళ్లారు. స్పృహలేని స్థితిలో పడిఉన్న లావణ్యను కొందరు స్థానికులు గుర్తించి పల్లికరణై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమెను ప్రయివేటు ఆస్పత్రి చేర్పించి విచారణ చేపట్టారు. ఈనెల 14న సెంమ్మంజేరీలోని ఒక మద్యం దుకాణం ముందు లావణ్య బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెమ్మంజేరీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు మద్యం తాగేందుకు వచ్చి మోపెడ్ అక్కడే వదిలివెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించగా ప్రధాన నిందితుడు సూర్య సహా నలుగురు పట్టుబడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య బుధవారం సాయంత్రం స్పృహలోకి వచ్చింది. అయితే ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో పోలీస్ సహాయ కమిషనర్ ముత్తుస్వామి గురువారం సాయంత్రం మరోసారి లావణ్యను కలుసుకోగా తనను కాపాడినందుకు కృతజ్ఞతలు అన్నట్లుగా తన రెండుచేతులూ జోడించి పోలీసులకు నమస్కరించింది. సంఘటన జరిగిన రోజున ఐదు కిలోమీటర్లు తనను వెంబడించి దాడిచేసిన నిందితులను గుర్తుపట్టే ఆనవాళ్లను పోలీసులకు వివరించినట్లు సమాచారం. తలపై శస్త్రచికిత్స చేసినందున ఎక్కువసేపు మాట్లాడరాదని వైద్యులు అభ్యంతరం చెప్పపడంతో పోలీసుల తిరిగి వెళ్లిపోయారని సమాచారం. -
చైతన్యపురిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చైతన్యపురిలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వివాహిత సోమవారం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. చైతన్యపురిలో ఉండే లావణ్య అనే మహిళ ఈ రోజు ఉరేసుకుని బలవన్మరణం చేసుకుంది. అత్తింటి వేధింపులే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. కాగా వరకట్నం కోసం లావణ్యను అత్తింటి వారు వేధించారని.. ఈ క్రమంలోనే ఆమె ఈ అఘాయిత్యం చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
నా చావుకు ఎవరూ కారణం కాదని..!
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): మురళీనగర్ ఈస్ట్ అయ్యప్పనగర్‌కు చెందిన కడలి సత్యలావణ్య(28) బలవన్మరణానికి పాల్పడింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యలావణ్య ఎల్అండ్టీలో ఇంజినీర్‌గా పనిచేస్తోంది. బుధవారం ఉదయం తమ్ముడు రవిశంకర్ తల్లికి అనారోగ్యంగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రి నుంచి వచ్చిన వారు చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని వివరాలు సేకరించారు. గదిలో లావణ్య రాసిన సూసైడ్ నోటు లభించింది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదని, అందరూ తనని క్షమించాలని, తన వల్లే అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని’ అందులో రాసి ఉంది. అయితే లావణ్యకు పెళ్లిసంబంధం కుదిరిందని తెలిసింది. తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఈ పరిస్థితులను చూసి మనస్తాపంతో మృతి చెంది ఉంటుందని లావణ్య తమ్ముడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఉన్నది ఒక్కటే జిందగీ
-
గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో మోసం
సాక్షి, సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో శానీటరీ విభాగంలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. సిద్ధిపేటకు చెందిన కనకరాజు, లావణ్య దంపతులు నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద నుంచి ఇప్పటివరకూ రూ. 20 లక్షల మేర వసూలు చేసినట్లు తెలిసింది. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో.. కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సిద్దిపేట పోలీసులు ఈ అంశంలో హెల్త్ ఇన్స్పెక్టర్ రవి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాధితుల సంఖ్య 20 నుంచి 30 మంది వరకూ ఉన్నట్లు సమాచారం. కాల్‌డేటా ఆధారంగా రవి, లావణ్యల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. బాధితులు అందరూ గతంలో పలుమార్లు గాంధీ ఆసుపత్రిలోని శానిటేషన్ విభాగానికి వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - యుద్ధం శరణం
-
వినాయక చవితికి రెండో పాట
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల రాఖీ సందర్భంగా చిత్రయూనిట్ ఓ ఫ్యామిలీ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఆ పాటతో సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ పరిచయం చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేస్తోంది. వినాయకచవితికి ఒక రోజు ముందుగానే సినిమాలోని రెండో పాటను రిలీజ్ చేయనున్నారు. నాగోల్ లోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పాటను లాంచ్ చేయబోతున్నట్టు హీరో నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. Hey guys ! next single #YuddamSharanam from the film will be out tomorrow .. A solid track coming your way pic.twitter.com/SqMrVMr0RH — chaitanya akkineni (@chay_akkineni) 23 August 2017