
ముగిసిన మస్తాన్‌సాయి కస్టడీ
కోర్టుకు విచారణ వివరాలు
సమగ్ర సమాచారం రాబట్టిన పోలీసులు
మణికొండ: రెండు రోజులుగా పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొన్న మస్తాన్‌సాయిని(Mastan Sai Case) శనివారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మస్తాన్ సాయి యువతులకు పార్టీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ ఇవ్వటం, వారు మత్తులోకి జారుకున్న తర్వాత వారిపై లైంగికదాడికి పాల్పడటం, దానిని సీక్రెట్ కెమెరాలు, సెల్‌ఫోన్ల వీడియా తీసి రికార్డు చేయటం, వాటిని ఆధారంగా చేసుకుని యువతులను పలుమార్లు బ్లాక్‌మెయిల్ చేయడం చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. అదే కోవలో సినీహీరో రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య సైతం అతని ఉచ్చులో చిక్కుకుంది.
అతని వద్ద తన వీడియోలు ఉన్న హార్డ్‌డెస్‌్కను తస్కరించిన ఆమె దాని ఆధారంగా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన హార్డ్‌డెస్క్ తిరిగి ఇవ్వాలని మస్తాన్‌సాయి లావణ్యను బెదిరించడమేగాక తనతో పాటు తన ఇంటిపై దాడి చేశాడని, తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇంటికి వచ్చిన సమయంలో మస్తాన్ సాయితో పాటు అతడి స్నేహితుడు ఖాజా మెయినుద్దీన్ డ్రగ్స్ తీసుకుని ఉండటంతో పరీక్షలు నిర్వహించిన పోలీసులు నార్కోటిక్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ నెల 2న అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఉద్దేశపూర్వకంగానే నేరాలు...
మస్తాన్‌సాయిని నార్సింగి పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారించటంతో అతను ఉద్దేశపూర్వకంగానే యువతులకు డ్రగ్స్ ఇవ్వటం, నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటం లాంటి చర్యలు ఉద్దేశ పూర్వకంగానే చేశానని అంగీకరించినట్టు తెలిసింది.
తల్లితండ్రుల అతి గారాబం కారణంగా ఉన్నత చదువులు చదువుకున్నా వక్రమార్గంలో పయనించినట్లు పోలీసులు గుర్తించారు. తన భార్య, గర్ల్ ఫ్రెండ్స్, ఇతర యువతులను నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డుపెట్టి బ్లాక్ మెయిల్ చేయడం అతడి నైజంగా పోలీసులు గుర్తించారు. తను చేసిన నేరాలను విచారణలో అంగీకరించటంతో అదే నివేదికను కోర్టుకు అందించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment