Mastan
-
మస్తాన్ సాయి కుటుంబాన్ని దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని డిమాండ్
-
మస్తాన్ సాయి విచారణలో విస్తుపోయే నిజాలు
మణికొండ: రెండు రోజులుగా పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొన్న మస్తాన్‌సాయిని(Mastan Sai Case) శనివారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మస్తాన్ సాయి యువతులకు పార్టీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ ఇవ్వటం, వారు మత్తులోకి జారుకున్న తర్వాత వారిపై లైంగికదాడికి పాల్పడటం, దానిని సీక్రెట్ కెమెరాలు, సెల్ఫోన్ల వీడియా తీసి రికార్డు చేయటం, వాటిని ఆధారంగా చేసుకుని యువతులను పలుమార్లు బ్లాక్మెయిల్ చేయడం చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. అదే కోవలో సినీహీరో రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య సైతం అతని ఉచ్చులో చిక్కుకుంది. అతని వద్ద తన వీడియోలు ఉన్న హార్డ్డెస్్కను తస్కరించిన ఆమె దాని ఆధారంగా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన హార్డ్డెస్క్ తిరిగి ఇవ్వాలని మస్తాన్‌సాయి లావణ్యను బెదిరించడమేగాక తనతో పాటు తన ఇంటిపై దాడి చేశాడని, తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇంటికి వచ్చిన సమయంలో మస్తాన్ సాయితో పాటు అతడి స్నేహితుడు ఖాజా మెయినుద్దీన్ డ్రగ్స్ తీసుకుని ఉండటంతో పరీక్షలు నిర్వహించిన పోలీసులు నార్కోటిక్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ నెల 2న అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్దేశపూర్వకంగానే నేరాలు... మస్తాన్‌సాయిని నార్సింగి పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారించటంతో అతను ఉద్దేశపూర్వకంగానే యువతులకు డ్రగ్స్ ఇవ్వటం, నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటం లాంటి చర్యలు ఉద్దేశ పూర్వకంగానే చేశానని అంగీకరించినట్టు తెలిసింది. తల్లితండ్రుల అతి గారాబం కారణంగా ఉన్నత చదువులు చదువుకున్నా వక్రమార్గంలో పయనించినట్లు పోలీసులు గుర్తించారు. తన భార్య, గర్ల్ ఫ్రెండ్స్, ఇతర యువతులను నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డుపెట్టి బ్లాక్ మెయిల్ చేయడం అతడి నైజంగా పోలీసులు గుర్తించారు. తను చేసిన నేరాలను విచారణలో అంగీకరించటంతో అదే నివేదికను కోర్టుకు అందించినట్లు తెలిసింది. -
Mastan Sai Case: 44 మంది యువతులు, 250కి పైగా వీడియోలు
మణికొండ: నగ్న వీడియోలు, బ్లాక్‌మెయిలింగ్, డ్రగ్స్, అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. రెండో రోజు శుక్రవారం క్రైం పోలీసులతో పాటు సైబరాబాద్ నార్కొటిక్స్ విభాగం సైబరాబాద్ ఇన్చార్జి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు అతడిని విచారించారు. ఈ సందర్భంగా మస్తాన్‌సాయిని డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తావు, ఎంత మందికి ఇచ్చావు, డ్రగ్స్ అలవాటు చేసిన యువతులపై ఎందుకు అత్యాచారం చేశావని, అలా ఎంత మందిని చేశావు, నగ్న వీడియోలను తీయాల్సిన అవసరం ఏమిటని, లావణ్యను ఎందుకు హత్య చేయాలనుకున్నావని ప్రశ్నించినట్లు తెలిసింది. తన హార్డ్ డిస్క్‌లో లావణ్య ఆరోపించినట్లు వేల సంఖ్యలో వీడియోలు లేవని, తన భార్యతో పాటు ఇద్దరు గర్ల్ఫ్రెండ్స్వి మాత్రమే ఉన్నాయని మరోసారి బుకాయించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దాంతో హార్డ్డెస్్కను అతడి ముందే ఓపెన్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో ఒక్కో యువతికి సంబంధించి ఒక్కో ఫోల్డర్ రూపంలో వాట్సాప్ చాట్స్, ఆడియో, వీడియో, స్క్రీన్ రికార్డింగ్‌లను భద్రపర్చినట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్డిస్్కలో 44 మంది యువతులకు సంబందించి 250కి పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. తన విల్లాలోని బెడ్రూంలో సీక్రెట్‌గా ఏర్పాటు చేసిన ఐదు కెమెరాలతో వీటిని తీసినట్లు విచారణలో మస్తాన్‌సాయి అంగీకరించినట్టు సమాచారం. లావణ్య ఇంట్లోనూ తీసిన వీడియోలు, చాట్ డాటా అతడి సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా అతడిని ప్రశ్నించినట్లు తెలిసింది. తన మిత్రుడు వినీత్‌రెడ్డి తనకు డ్రగ్స్ సరఫరా చేసే వాడని, పార్టీలు ఉన్నపుడు అతడి వద్ద కొనుగోలు చేసే వాడినని మస్తాన్‌సాయి వెల్లడించినట్లు సమాచారం. దీంతో వినీత్‌రెడ్డిని అరెస్టు చేసి, మరోమారు విచారించాలని నార్కోటిక్స్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. రెండో రోజు విచారణలో మస్తాన్‌సాయి యువతులను డ్రగ్స్ పార్టీల ద్వారా మచి్చక చేసుకుని వారిని లైంగికంగా వాడుకున్నానని అంగీకరించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం వరకు పోలీసులు అతడి మరింత లోతుగా విచారించనున్నారు. అప్పటికీ తమకు రావాల్సిన సమాచారం రాకపోతే శనివారం మరో సారి కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటా: లావణ్య -
రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటా: లావణ్య
సాక్షి, హైదరాబాద్: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసింది. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.ఈ క్రమంలో లావణ్య.. ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని ఆమె తెలిపారు. ‘‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలి’’ అని లావణ్య కోరారు.‘‘యువతులు వీడియోలు ఎక్కడ అమ్ముతున్నాడో పోలీసులు తేల్చాలి. నేను రాజ్ తరుణ్ కోసం ఒంటరి పోరాటం చేశాను. నేను సహాయం కోసం మాత్రమే కొందరితో పర్సనల్ గా మాట్లాడాను. నేను నా కేసులో ఏమవుతుందో తెలుసుకోవడం కోసమే వేరే వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడాను. రాజ్ తరుణ్ ఇప్పుడు వచ్చిన కాళ్ళు మొక్కుతాను. నేను మస్తాన్ సాయి నుంచి బయటపడితే చాలు’’ అంటూ లావణ్య వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. సంచలన విషయాలు వెల్లడి -
మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో లావణ్య ..!
-
లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది.మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టు ప్రకారం..‘మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశాడు. అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్‌ను కూడా పోలీసులు జత పరిచారు. మస్తాన్ సాయి ల్యాప్‌టాప్‌లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్‌తరుణ్ గతంలోనే తొలగించాడు. అయితే, ఆలోపే ఇతర డివైస్లలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. లావణ్యను పలు మార్లు చంపేందుకు అతడు యత్నించాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.వెలుగులోకి వస్తున్న ఆకృత్యాలు.. కొన్నేళ్లుగా మస్తాన్‌సాయి పబ్‌లు, వీఐపీ పార్టీలలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్‌లు, ఫోన్ రికార్డింగులను హార్డ్ డిస్క్‌లో భద్రపరిచాడు. ఆ హార్డ్ డిస్క్‌ను మస్తాన్‌సాయి ఇంటినుంచి తీసుకున్న లావణ్య.. పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్‌సాయి తన ఇంటిపై దాడిచేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..కాగా, లావణ్యను డ్రగ్స్ కేసులో మరోమారు ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌బాషా యత్నిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది నాగూర్‌బాబు ఆరోపించారు. వారి మధ్య జరిగిన సంభాషణ రికార్డులను మంగళవారం పోలీసులకు అందించామని తెలిపారు. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి, ఇంట్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించాలనే పథకం వేశారని ఆరోపించారు. ఆ వివరాలన్నీ పోలీసులకు అందించి చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. -
మస్తాన్‌సాయి పోలీస్ కస్టడీకి ఏర్పాట్లు
మణికొండ: అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయిని లోతుగా ప్రశ్నించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతడి అకృత్యాలు నిక్షిప్తమై ఉన్న హార్డ్ డిస్క్ కోసం లావణ్య ఇంటిపై దాడిచేసిన కేసులో మస్తాన్‌సాయిని నార్సింగి పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఆ హార్డ్ డిస్్కలోని వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్న పోలీసులు.. అతడిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫిర్యాదుదారు లావణ్యను మంగళవారం మరోసారి స్టేషన్‌కు పిలిపించారు. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాలు, వాటిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నట్టు తెలిసింది. బుధవారం కోర్టులో పిటిషన్ వేసి మస్తాన్‌సాయిని 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అంతకుముందే మస్తాన్‌సాయికి నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. వెలుగులోకి వస్తున్న ఆకృత్యాలు.. కొన్నేళ్లుగా మస్తాన్‌సాయి పబ్‌లు, వీఐపీ పార్టీలలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్‌లు, ఫోన్ రికార్డింగులను హార్డ్ డిస్్కలో భద్రపరిచాడు. ఆ హార్డ్ డిస్‌్కను మస్తాన్‌సాయి ఇంటినుంచి తీసుకున్న లావణ్య.. పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్‌సాయి తన ఇంటిపై దాడిచేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు. కాగా, తనను డ్రగ్స్ కేసులో మరోమారు ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌బాషా యత్నిస్తున్నారని లావణ్య న్యాయవాది నాగూర్‌బాబు ఆరోపించారు. వారి మధ్య జరిగిన సంభాషణ రికార్డులను మంగళవారం పోలీసులకు అందించామని తెలిపారు. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి, ఇంట్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించాలనే పథకం వేశారని ఆరోపించారు. ఆ వివరాలన్నీ పోలీసులకు అందించి చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. -
ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాలయిను ట్రాప్ చేసిన మస్తాన్‌సాయి
-
మస్తాన్ సాయి పెన్ డ్రైవ్ లో బడా స్టార్ల ప్రైవేట్ వీడియోలు
-
మస్తాన్ సాయి అరెస్ట్.. లావణ్య ఫిర్యాదులో సంచలన విషయాలు!
రాజ్ తరుణ్- లావణ్య వివాదం టాలీవుడ్లో సంచలనంగా సృష్టించింది. గతేడాది ఒకరిపై ఒకరు కేసులతో పాటు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. తాము విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అని నార్సింగి పోలీసులకు తాజాగా లావణ్య ఫిర్యాదు చేసింది. ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.ఫిర్యాదులో సంచలన విషయాలు..మస్తాన్ సాయిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదులో లావణ్య ోసంచలన విషయాలు బయటపెట్టింది. పలువురు అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా పోలీసులకు కీలకమైన హార్డ్ డిస్క్ అందించినట్లు లావణ్య వెల్లడించింది.హార్డ్ డిస్క్‌లో 300 వీడియోలు..పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో దాదాపు 300లకు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో లావణ్యకు సంబంధించినవీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లావణ్య వెల్లడించింది. ఇప్పటికే లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. ఈ కేసులో మరో యువకుడు ఖాజాను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారన్న లావణ్య ఫిర్యాదులో పోలీసులకు వివరించింది.ఆధారాలతో వచ్చా- లావణ్యమస్తాన్ సాయిపై అన్నీ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశానని లావణ్య తెలిపింది. గతంలో నా వద్ద ఆధారాలు లేవని.. అందుకే ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది. ఇప్పుడు వీడియోలతో సహా నా వద్ద ఉన్న ఆధారాలు నార్సింగి పోలీసులకు ఇచ్చానని లావణ్య పేర్కొంది. దీంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ప్రాణహాని ఉంది..లావణ్యమస్తాన్ సాయితో తనకు ప్రాణహాని ఉందని లావణ్య ఆరోపించింది. అతని నుంచి రక్షణ కల్పించాలని లావణ్య పోలీసులను కోరింది. తనకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు యత్నిస్తున్నారని లావణ్య ఆరోపణలు చేసింది. ప్రస్తుతం హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అప్పగించానని లావణ్య పేర్కొంది. -
డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్
-
మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
సాక్షి, నరసరావుపేట : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రానుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా సృష్టం చేసింది. ఆ సంస్థ ఎండీ షేక్ మస్తాన్ శనివారం తన స్వగ్రామం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌లో 49.41 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 94–104 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే అవకాశం ఉందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 47.55 శాతం ఓటు షేర్‌తో 71–81ఎమ్మెల్యే స్థానాలు పొంది ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఇతరులకు 3 శాతం ఓట్లు పడవచ్చన్నారు. లోక్‌సభ ఫలితాలలో వైఎస్సార్సీపీ 13–15 ఎంపీ స్థానాలు, టీడీపీ కూటమి 10–12 స్థానాలు పొందే అవకాశం ఉందన్నారు. ఆరా మస్తాన్ ఇంకా ఏం చెప్పారంటే.. షర్మిలకు కనీసం డిపాజిట్ దక్కదు కడప ఎంపీగా పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఓడిపోవడంతోపాటు కనీసం డిపాజిట్ కూడా దక్కదు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం ద్వారా వైఎస్సార్సీపీ 3 ఎంపీ స్థానాలను కోల్పోతుంది. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో ఓడిపోతున్నారు. బీజేపీ, జనసేనతో పొత్తు వల్ల టీడీపీకి గతంలో కంటే కొంత ఓటు శాతం పెరిగినప్పటికీ అధికారం మాత్రం దక్కడం లేదు. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ ఎంపీలు తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో బీజేపీకి 8–9 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్‌కు 7–8 ఎంపీలు, ఎంఐఎంకు ఒక్క స్థానం దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానం పొందిన బీఆర్ఎస్కు ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. కాంగ్రెస్‌కు 38.43 శాతం, బీజేపీకి 36.65 శాతం, బీఆర్ఎస్కు 18.99 శాతం ఓట్లు నమోదవుతాయి. మా సర్వే ఫలితాలు వంద శాతం నిజం కావాలని కోరుకుంటున్నా. గతంలో మా అంచనా ఫలితాలు నిజమయ్యాయి.ఈసారి కూడా అదే జరగనుంది. పార్టీల ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోను కాకుండా వృత్తిని వృత్తిగా భావించి ఫలితాలను వెల్లడించాను. వైఎస్సార్సీపీ అభ్యర్థులను మార్చడం కొన్ని చోట్ల మేలు చేసింది. పేదలు–పెత్తందార్ల మధ్య యుద్ధం అన్న జగన్ మాటలు పని చేశాయి. బీజేపీతో పొత్తు వల్ల ఓట్ల పరంగా నష్టపోయినా, పోల్ మేనేజ్మెంట్ పరంగా టీడీపీకి ఉపయోగపడింది. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశం కూటమికి ఇబ్బందిగా మారింది.వైఎస్సార్సీపీ వైపు మహిళలు, గ్రామీణ ఓటర్లుముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలన వైపు మహిళలు, గ్రామీణులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొగ్గు చూపినట్టు మా సర్వేలో తేలింది. కరోనా వల్ల కొంత సమయం వృథా అయినా, పాలనలో నూతన విధానాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకు పాలన తేవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 71 శాతానికి పైగా ఉన్న గ్రామీణ ఓటర్ల అభిమానాన్ని పొందింది. పింఛన్‌దారులు సంతోషంగా ఉన్నారు. మహిళల ఖాతాల్లో ప్రతి రెండు మూడు నెలలకు ఏదో ఓ పథకం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలి్పంచడంతో రాష్ట్రంలో 56 శాతం మహిళలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు.కూటమికి మహిళలు కేవలం 42 శాతం మాత్రమే మద్దతిచ్చారు. పురుషులు కూటమికి 51.56 శాతం, వైఎస్సార్సీపీకి 45.53 శాతం ఓటు వేశారు. మహిళలు పురుషుల కన్నా సుమారు 4.7 లక్షల మంది అధికంగా ఓటు వేయడం, అందులోనూ 56 శాతం మంది వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వడంతో మరోసారి అధికారం నిలబెట్టుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్సార్సీపీకి అండగా నిలవడంతో 2019లో వచ్చిన ఓటు శాతాన్ని వైఎస్ జగన్ నిలుపుకున్నారు. -
ఆక్వా రైతును కాపాడుకుందాం..
సాక్షి, అమరావతి : ఆక్వా రైతును కాపాడుకోకుంటే ఆ పరిశ్రమ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు కంపెనీలను హెచ్చరించారు. ఆక్వా రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని, అదే రీతిలో ఈ పరిశ్రమలు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, హేచరీలు, మందుల కంపెనీల ప్రతినిధులతో శనివారం విజయవాడలో జరిగిన సాధికారత కమిటీ భేటీలో ఎంపీ మస్తాన్‌రావు మాట్లాడుతూ తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు యూనిట్ విద్యుత్ రూ.8కి సరఫరా చేస్తుండగా.. మన రాష్ట్రంలో మాత్రమే యూనిట్ రూ.1.50కే సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌంట్ రూ.210 చొప్పున కొనుగోలు చేసినా ఎగుమతిదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. హేచరీలతో పాటు ఫీడ్ ప్లాంట్ నిర్వాహకులు కూడా రైతులపై భారం తగ్గించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులతో పాటు హేచరీలు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి ఢిల్లీకి ప్రతినిధుల బృందం వస్తే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఆర్‌జెడ్ పరిధిలోని హేచరీలను మూసివేయాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకోగలిగామని, ఆ మేరకు కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ(సీఏఏ) చట్టసవరణ జరిగేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. వడ్డి రఘురాం మాట్లాడుతూ నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనధికారిక, నిబంధనలు పాటించని హేచరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి ప్రతి నెలా రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు వెల్లడించారు. 30 పైసలకే వనామీ సీడ్ సరఫరా నాణ్యమైన వనామీ సీడ్‌ను 30 పైసలకు రైతులకు అందుబాటులో ఉంచుతామని హేచరీ యజమానులు భరోసా ఇచ్చారు. నాణ్యమైన టైగర్ సీడ్ దొరకని కారణంగా ఉత్పత్తి దెబ్బతిని నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో టైగర్ సీడ్ ఉత్పత్తిని తగ్గించాలని రఘురాం కోరగా.. హేచరీల యజమానులు ఆ మేరకు స్పందించారు. బ్రూడ్ స్టాక్ క్వాలిటీ మేనేజ్మెంట్పై సెపె్టంబర్ 29న విశాఖలో జరిగే జాతీయ స్థాయి సెమినార్లో రైతులను కూడా భాగస్వాములను చేస్తామని హేచరీ ప్రతినిధులు చెప్పారు. జాతీయ రొయ్య హేచరీల సంఘం అధ్యక్షుడు యల్లంకి రవికుమార్, జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు, సీఏఏ డైరెక్టర్ (చెన్నై) పి.శంకరరావు ఎంపెడా రీజనల్ మేనేజర్ జయభేల్ తదితరులు పాల్గొన్నారు. -
వెన్నలా చందమామ
రోజూ ఒంగోలులో ఒక సన్నివేశం తప్పనిసరి. బస్‌స్టాండు సమీపంలోని అరవై అడుగుల రోడ్డు దగ్గర జనం కి టకిటలాడుతూ కనిపిస్తారు. వారి చేతుల్లో పచ్చని ఆకులు ఉంటాయి. వాటిలో తెల్లటి చందమామలు ఉంటాయి. నోటిలో వేసుకోగానే కరిగిపోయే ఈ చందమామల కోసం ఒక్కరోజు కూడా నాగా ఇవ్వకుండా అక్కడకు నిత్యం జనం వస్తూనే ఉంటారు. అది మస్తాన్ ఇడ్లీ మహిమ. అక్కడ ఉన్నది మస్తాన్ ఇడ్లీ షాపు. సుమారు 30 సంవత్సరాల క్రితం మస్తాన్ అనే వ్యక్తి ప్రారంభించిన ఈ ఇడ్లీషాపు నేటికీ సూపర్‌హిట్‌గా నడుస్తోంది. ఎంత హిట్ అంటే ఎంసిఏ చదువుకుని హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాల్సిన మస్తాన్ కుమారుడు మీరావలి ఆ ఉద్యోగం మానేసి, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకునేంత. తండ్రి తర్వాత ఆ షాప్ పరంపరను కొనసాగిస్తున్న మీరావలి... ‘మస్తాన్ ఇడ్లీషాపు’ ప్రయాణాన్ని సాక్షితో ఇలా పంచుకున్నారు... ‘‘మా నాన్నగారు మస్తాన్ పెద్దగా చదువుకోలేదు. కొంత కాలం టైలరింగ్ చే శారు. ఆ తరవాత ఐస్ ఫ్యాక్టరీలో పనిచేశారు. అక్కడా లాభం లేకపోయింది. ఆ తరవాత చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. ఎన్ని చేసినా ఆయనకు సంతృప్తి కలగలేదు. కుటుంబ పోషణ కోసం కొంతకాలం బంధువుల హోటల్లో పనిచేశారు. కాని ఎంత కాలం పనిచేసినా సరిపడేన్ని డబ్బులు వచ్చేవి కాదు. ఎలాగూ అనుభవం వచ్చింది కనుక సొంతగా హోటల్ మొదలెట్టాలని అనుకున్నారు. 1980లో ఈ ఊళ్లో కర్నూలు రోడ్డులోని భారతి నర్సింగ్ హోమ్‌కి ఎదురుగా ఒక చిన్న పూరి గుడిసెను హోటల్‌గా చేసుకుని అక్కడే వ్యాపారానికి విత్తనం నాటారు. ఆ పూరి గుడిసెలోనే ఇడ్లీ, ప్లెయిన్ దోసె, స్పెషల్ కాఫీ తయారు చేసి సప్లయి చేయడం మొదలుపెట్టారు. సుమారు మూడు çసంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఈ హోటల్‌ను కేవలం 1000 రూపాయలతో ప్రారంభించారు. నేతిలా పేరుకుపోయింది 1988లో మా హోటల్ దశ తిరిగింది. ఇప్పుడున్న చోటుకు మస్తాన్ ఇడ్లీసెంటరును మార్చారు. చాలాకాలం హోటల్‌కి నేమ్‌బోర్డు కూడా లేదు. కాని అందరి నోళ్లలో మస్తాన్ పేరు, పేరుకున్న నేతిలా పేరుకుపోయింది. ఇవీ ప్రత్యేకతలు... నేతి ఇడ్లీ, నేతి దోసె మా ప్రత్యేకత. వెన్నపూసను స్వయంగా కరిగించి నెయ్యి తయారుచేయించి, ఆ నేతితోనే వంటకాలు తయారు చేస్తాము. జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు, మిరపకారం... వీటిని దోసె మీద వేసి తయారుచేస్తాము. ఈ ఆలోచన నాన్నగారి సొంతం. ఈ రుచికే వినియోగదారులు సాహో అనేశారు. 2002లో మేము బిర్యానీ పాయింట్ ప్రారంభించాము. కాని ఎక్కువ కాలం నడవలేదు. అచ్చి వచ్చిన ఇడ్లీయే మాకు అన్నం పెడుతోంది. ఇద్దరం సంతానం... నాన్నగారికి ఒక అబ్బాయి (నేను), ఒక అమ్మాయి. అమ్మాయి దివ్యాంగురాలు. హోటల్‌కి సంబంధించిన పనంతా నాన్న, అమ్మ, నేను చేసేవాళ్లం. 2003లో నాన్నగారు కాలం చేశారు. అప్పటి నుంచి అమ్మకి విశ్రాంతి ఇచ్చాను. పనివారిని నియోగించుకుని హోటల్ నడుపుతున్నాను. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటే లక్షల్లో ఒకడిగా ఉండేవాణ్ణి. ఇప్పుడు మాత్రం మస్తాన్ ఇడ్లీ సెంటర్ ఓనర్ని. ఆ తృప్తి చాలు. ఇవీ మస్తాన్ ఇడ్లీ వేళలు... ఉదయం 8 – 11, సాయంత్రం 6 – 9.30 వరకు మస్తాన్ హోటల్ కిటకిటలాడు తుంటుంది. చుట్టుపక్కల వారంతా మస్తాన్ ఇడ్లీ షాపు దగ్గరే కనిపిస్తారు. దీనినొక మీటింగ్ పాయింట్‌గా చూస్తారు. స్వయంగా వచ్చి ఇడ్లీ రుచి చూడలేని రాజకీయ నాయకులు, పార్సిల్స్ తెప్పించుకుని తిని ఆ రుచిని ఆస్వాదిస్తారు. ఇక్కడ కేవలం ఇడ్లీ, దోసె మాత్రమే దొరుకుతాయి. అన్నీ ఇంట్లోనే తయారుచేస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన మినప్పప్పు, బియ్యం ఉపయోగిస్తారు. క్వాలిటీ విషయంలో రాజీపడరు. నెలకోసారి వేటపాలెం వెళ్లి బస్తాడు జీడిపప్పులు హోటల్ కోసం తెచ్చుకుంటారు. – డా. వైజయంతి పురాణపండ -
రెండోరోజూ కొనసాగిన ఐటీ సోదాలు
సాక్షి, అమరావతి/విశాఖ క్రైం: రాష్ట్రంలోని వివిధ వ్యాపార సంస్థలపై శుక్రవారం మొదలైన ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారుల సోదాలు శనివారం రెండోరోజూ కొనసాగాయి. విజయవాడ, విశాఖపట్నంలలో సదరన్ డెవలపర్స్, శుభగృహ సంస్థల్లో శనివారమూ సోదాలు జరిపిన ఐటీ అధికారులు విలువైన పత్రాలు, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన బంధువులకు చెందిన సదరన్ డెవలపర్స్‌లో శనివారం సాయంత్రం దాకా కొనసాగాయి. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూలావాదేవీలపై ప్రధానంగా దృష్టిపెట్టినట్టు సమాచారం. ఈ భూముల్ని ఎవరి పేరుమీద కొనుగోలు చేశారు.. దీనికైన నగదు ఎక్కడిదని ఐటీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో 8, 9 తేదీల్లో హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పోతుల రామారావుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించడానికి ఐటీ అధికారులు నిరాకరించారు. సాధారణంగా ఆదాయపన్ను విభాగం జరిపే సోదాల్ని ఐటీశాఖ బహిర్గతం చేయదని, ఈ కేసుల్లోనూ తాము అదే పద్ధతి పాటిస్తామని ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సోదాల సందర్భంగా తీసుకున్న పత్రాలను పరిశీలించి అవసరమైన సమాచారాన్ని సంబంధిత వ్యక్తులనుంచి సేకరిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, నంబూరు శంకర్రావుకు చెందిన శుభగృహ, ఎన్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్లో శనివారం రాత్రి కూడా సోదాలు కొనసాగాయి. ఐటీ అధికారుల వద్ద ఉన్న సమాచారానికి, సోదాల్లో లభ్యమైన డాక్యుమెంట్లకు సరిపోలకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో విజయవాడ మాచవరంలోని శుభగృహకు చెందినవారి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. మరోవైపు నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్ గ్రూపుల్లో గురువారం మొదలైన సోదాలు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. సోదాలకు తొలుత బీఎంఆర్ గ్రూపు సహకరించకపోవడంతో ఐటీశాఖ తనదైన శైలిలో ప్రశ్నించడంతో దారికొచ్చారు. ఇక్కడా విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేసి తీసుకెళ్లడంతోపాటు తదుపరి విచారణకోసం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. విశాఖలో.. విశాఖ నగరంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు శనివారమూ సోదాలు కొనసాగించారు. సీతమ్మధారలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఎన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శుభగృహ సంస్థల్లో పోలీసు భద్రత మధ్య సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో జరిపిన భూముల క్రయవిక్రయాలు, ఐటీ చెల్లింపులపై ఆరా తీసినట్టు సమాచారం. బీద మస్తాన్‌రావు సంస్థల్లో మూడోరోజూ ఐటీ సోదాలు భారీగా నగదు, నకిలీ డాక్యుమెంట్లు, హవాలా లావాదేవీల గుర్తింపు.. కావలి: టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వ్యాపార సంస్థల్లో మూడోరోజైన శనివారమూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా భారీగా నగదు, నకిలీ డాక్యుమెంట్లు, హవాలా లావాదేవీలను ఐటీ అధికారుల బృందం గుర్తించినట్టు తెలుస్తోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని విమానాశ్రయ భూముల వద్ద ఉన్న బీద మస్తాన్‌రావుకు చెందిన విదేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే ప్రాసెసింగ్ ప్లాంట్, రొయ్యల మేత ఫ్యాక్టరీ ప్రాంగణంలో భారీగా నగదు బయటపడినట్టు తెలిసింది. అలాగే తనిఖీల సందర్భంగా చెన్నైలోని ఒక రహస్య భవనంలో భారీగా నగదునూ ఐటీ అధికారులు కనుగొన్నట్టు సమాచారం. అక్కడే కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇస్కపల్లి ప్రాంతంలో ఉన్న బీద మస్తాన్‌రావుకు చెందిన రొయ్యల గుంతలు, రొయ్య పిల్లల హేచరీలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కుల నకిలీ డాక్యుమెంట్లను కూడా ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే బీద మస్తాన్‌రావుకు చెందిన సంస్థలు, కార్యాలయాలున్న దామవరం, నెల్లూరు, చెన్నైలలో జరిపిన తనిఖీల్లో హవాలా రూపంలో విదేశాల నుంచి నగదు లావాదేవీలు జరిగిన విషయం బహిర్గతమైంది. మస్తాన్‌రావుకు అమెరికాలో రొయ్యల విక్రయ కేంద్రం ఉంది. అమెరికాతోపాటు పలు దేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తారు. ఈ విదేశీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వ పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి, సురక్షితంగా తమ వద్దకు నగదును చేర్చుకోవడానికి హవాలా మార్గాన్ని అనుసరించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బ్యాంకులద్వారా జరిగిన లావాదేవీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా కేవలం పుస్తకాలలో రాతలద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను వేర్వేరుగా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా, బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలతోపాటు వారి కుటుంబసభ్యుల పేర్లమీదున్న సంస్థలద్వారా టీడీపీ నాయకులకిచ్చిన నగదు వివరాల్నీ ఐటీ అధికారులు సేకరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కోటరీలో ముఖ్యులుగా ఉన్న టీడీపీ నాయకులు భీతిల్లిపోతున్నారు. మరోవైపు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బీద రవిచంద్ర భాగస్వామ్యం ఉన్న సంస్థలతోపాటు ప్రైవేటుగా నిర్వహించిన లావాదేవీలపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలిసింది. -
నా సోదరికి పోలీసుల నుంచి ప్రాణహాని
కేసులుంటే కోర్టులో హాజరుపరచండి .. లేదంటే విడుదల చేయూలి అన్నపూర్ణ సోదరుడు భూతం వుస్తాన్‌రావు డిమాండ్ పిడుగురాళ్ళ మావోయిస్టు అనే ఆరోపణలతో పిడుగురాళ్ళ వుండలం జూలకల్లుకి చెందిన తన సోదరి అన్నపూర్ణ అలియూస్ అరుణ అలియూస్ పద్మక్కను తుళ్లూరు వుండలం తాళ్లారుుపాలెంలో పోలీసులు అరెస్టు చేశారని, ఆమెకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆమె సోదరుడు భూతం మస్తాన్‌రావు ఆరోపించారు. వుస్తాన్‌రావు మంగళవారం పిడుగురాళ్ళ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన చిన్న చెల్లెలు అరుున అన్నపూర్ణ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. తన పెద్ద చెల్లెలు వెంకటరత్నం ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతోందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కారులో వచ్చిన కొందరు పోలీసులు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి విజయువాడ వైపు తీసుకెళ్లారని చెప్పారు. అన్నపూర్ణపై కేసులు ఉంటే తక్షణమే కోర్టులో హాజరు పరచాలని, కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయూలని వుస్తాన్‌రావు డివూండ్ చేశారు. గతంలో వుస్తాన్‌రావు మేనకోడలు కువూర్తె అరుున రాయుపాటి స్వర్ణలత అలియూస్ నాగవుణిని పట్టుకుని పోలీసులు కాల్చి చంపిన చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు అదే విధంగా తన చిన్న చెల్లెలు అన్నపూర్ణ ప్రాణాలకు హాని ఉందని ఆయున ఆందోళన వ్యక్తం చేశారు. 1991లో జననాట్య వుండలి పట్ల ఆకర్షితురాలైన అన్నపూర్ణ ఇంటి నుంచి వెళ్లిపోరుుందని, అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియలేదని, ఇటీవలే రెండు రోజుల క్రితం పెద్ద చెల్లెలు వెంకటరత్నం ఇంటికి వచ్చిన అన్నపూర్ణను పోలీసులు తీసుకెళ్లారని వుస్తాన్‌రావు వివరించారు. ఆమెను వెంటనే కోర్టుకు హాజరు పరచడవూ? లేదా విడుదల చేయుడమో చేయకపోతే పెద్దయెత్తున ఆందోళనకు దిగుతామని ఆయున పోలీసులున హెచ్చరించారు. అన్నపూర్ణతోపాటు తన పెద్ద చెల్లెలు వెంకటరత్నం, బావ బాలస్వామి కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెంటనే విడుదల చేయాలని కోరారు. అన్నపూర్ణను బేషరతుగా విడుదల చేయాలి: పౌరహక్కుల సంఘం నరసరావుపేట టౌన్: పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు నాయకురాలు భూతం అన్నపూర్ణను వెంటనే బేషరతుగా విడుదలచేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్జీవో హోమ్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పోలీసుల చర్యను నిరసించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళయ్యపాలెంలో తన సోదరి ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న తలదాచుకున్న భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణను యాంటీ నక్సల్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లుకి చెందిన అన్నపూర్ణ 1991నుంచి ఉద్యమంలో భాగస్వామ్యురాలైందన్నారు. గత నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణ బంధువుల ఇంట్లో చికిత్స పొందుతోందని చెప్పారు. ఏఎన్ఎస్ పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళారని, ఆమెకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అన్నపూర్ణపై ఏమైనా కేసులు ఉంటే వెంటనే ఆమెను కోర్టులో హాజరుపరచాలని లేకుంటే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, రాష్ట్రకమిటీ సభ్యులు నల్లపాటి రామారావు , కెఎన్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శిఖినం చిన్నా, పికెఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కంభాల ఏడుకొండలు, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి దండు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
కూలినసాహసశిఖర౦