![Mastan Sai Case Investigation Latest Updates](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/11322.jpg.webp?itok=3Dt7-4M6)
కొనసాగుతున్న మస్తాన్ సాయి విచారణ
రంగంలోకి నార్కొటిక్స్ విభాగం అధికారులు
హార్డ్ డెస్‌్కలో విస్తుపోయే నిజాలు
డాటాను రీ ఇన్‌స్టాల్ చేస్తున్న పోలీసులు
మణికొండ: నగ్న వీడియోలు, బ్లాక్‌మెయిలింగ్, డ్రగ్స్, అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. రెండో రోజు శుక్రవారం క్రైం పోలీసులతో పాటు సైబరాబాద్ నార్కొటిక్స్ విభాగం సైబరాబాద్ ఇన్‌చార్జి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు అతడిని విచారించారు. ఈ సందర్భంగా మస్తాన్‌సాయిని డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తావు, ఎంత మందికి ఇచ్చావు, డ్రగ్స్ అలవాటు చేసిన యువతులపై ఎందుకు అత్యాచారం చేశావని, అలా ఎంత మందిని చేశావు, నగ్న వీడియోలను తీయాల్సిన అవసరం ఏమిటని, లావణ్యను ఎందుకు హత్య చేయాలనుకున్నావని ప్రశ్నించినట్లు తెలిసింది.
తన హార్డ్ డిస్క్లో లావణ్య ఆరోపించినట్లు వేల సంఖ్యలో వీడియోలు లేవని, తన భార్యతో పాటు ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌వి మాత్రమే ఉన్నాయని మరోసారి బుకాయించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దాంతో హార్డ్‌డెస్‌్కను అతడి ముందే ఓపెన్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో ఒక్కో యువతికి సంబంధించి ఒక్కో ఫోల్డర్ రూపంలో వాట్సాప్ చాట్స్, ఆడియో, వీడియో, స్క్రీన్ రికార్డింగ్‌లను భద్రపర్చినట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్‌డిస్‌్కలో 44 మంది యువతులకు సంబందించి 250కి పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. తన విల్లాలోని బెడ్‌రూంలో సీక్రెట్‌గా ఏర్పాటు చేసిన ఐదు కెమెరాలతో వీటిని తీసినట్లు విచారణలో మస్తాన్‌సాయి అంగీకరించినట్టు సమాచారం.
లావణ్య ఇంట్లోనూ తీసిన వీడియోలు, చాట్ డాటా అతడి సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా అతడిని ప్రశ్నించినట్లు తెలిసింది. తన మిత్రుడు వినీత్‌రెడ్డి తనకు డ్రగ్స్ సరఫరా చేసే వాడని, పార్టీలు ఉన్నపుడు అతడి వద్ద కొనుగోలు చేసే వాడినని మస్తాన్‌సాయి వెల్లడించినట్లు సమాచారం. దీంతో వినీత్‌రెడ్డిని అరెస్టు చేసి, మరోమారు విచారించాలని నార్కోటిక్స్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
రెండో రోజు విచారణలో మస్తాన్‌సాయి యువతులను డ్రగ్స్ పార్టీల ద్వారా మచి్చక చేసుకుని వారిని లైంగికంగా వాడుకున్నానని అంగీకరించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం వరకు పోలీసులు అతడి మరింత లోతుగా విచారించనున్నారు. అప్పటికీ తమకు రావాల్సిన సమాచారం రాకపోతే శనివారం మరో సారి కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటా: లావణ్య
Comments
Please login to add a commentAdd a comment