sai
-
మస్తాన్ సాయి విచారణలో విస్తుపోయే నిజాలు
మణికొండ: రెండు రోజులుగా పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొన్న మస్తాన్‌సాయిని(Mastan Sai Case) శనివారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మస్తాన్ సాయి యువతులకు పార్టీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ ఇవ్వటం, వారు మత్తులోకి జారుకున్న తర్వాత వారిపై లైంగికదాడికి పాల్పడటం, దానిని సీక్రెట్ కెమెరాలు, సెల్ఫోన్ల వీడియా తీసి రికార్డు చేయటం, వాటిని ఆధారంగా చేసుకుని యువతులను పలుమార్లు బ్లాక్మెయిల్ చేయడం చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. అదే కోవలో సినీహీరో రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య సైతం అతని ఉచ్చులో చిక్కుకుంది. అతని వద్ద తన వీడియోలు ఉన్న హార్డ్డెస్్కను తస్కరించిన ఆమె దాని ఆధారంగా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన హార్డ్డెస్క్ తిరిగి ఇవ్వాలని మస్తాన్‌సాయి లావణ్యను బెదిరించడమేగాక తనతో పాటు తన ఇంటిపై దాడి చేశాడని, తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇంటికి వచ్చిన సమయంలో మస్తాన్ సాయితో పాటు అతడి స్నేహితుడు ఖాజా మెయినుద్దీన్ డ్రగ్స్ తీసుకుని ఉండటంతో పరీక్షలు నిర్వహించిన పోలీసులు నార్కోటిక్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ నెల 2న అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్దేశపూర్వకంగానే నేరాలు... మస్తాన్‌సాయిని నార్సింగి పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారించటంతో అతను ఉద్దేశపూర్వకంగానే యువతులకు డ్రగ్స్ ఇవ్వటం, నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటం లాంటి చర్యలు ఉద్దేశ పూర్వకంగానే చేశానని అంగీకరించినట్టు తెలిసింది. తల్లితండ్రుల అతి గారాబం కారణంగా ఉన్నత చదువులు చదువుకున్నా వక్రమార్గంలో పయనించినట్లు పోలీసులు గుర్తించారు. తన భార్య, గర్ల్ ఫ్రెండ్స్, ఇతర యువతులను నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డుపెట్టి బ్లాక్ మెయిల్ చేయడం అతడి నైజంగా పోలీసులు గుర్తించారు. తను చేసిన నేరాలను విచారణలో అంగీకరించటంతో అదే నివేదికను కోర్టుకు అందించినట్లు తెలిసింది. -
Mastan Sai Case: 44 మంది యువతులు, 250కి పైగా వీడియోలు
మణికొండ: నగ్న వీడియోలు, బ్లాక్‌మెయిలింగ్, డ్రగ్స్, అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. రెండో రోజు శుక్రవారం క్రైం పోలీసులతో పాటు సైబరాబాద్ నార్కొటిక్స్ విభాగం సైబరాబాద్ ఇన్చార్జి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు అతడిని విచారించారు. ఈ సందర్భంగా మస్తాన్‌సాయిని డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తావు, ఎంత మందికి ఇచ్చావు, డ్రగ్స్ అలవాటు చేసిన యువతులపై ఎందుకు అత్యాచారం చేశావని, అలా ఎంత మందిని చేశావు, నగ్న వీడియోలను తీయాల్సిన అవసరం ఏమిటని, లావణ్యను ఎందుకు హత్య చేయాలనుకున్నావని ప్రశ్నించినట్లు తెలిసింది. తన హార్డ్ డిస్క్‌లో లావణ్య ఆరోపించినట్లు వేల సంఖ్యలో వీడియోలు లేవని, తన భార్యతో పాటు ఇద్దరు గర్ల్ఫ్రెండ్స్వి మాత్రమే ఉన్నాయని మరోసారి బుకాయించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దాంతో హార్డ్డెస్్కను అతడి ముందే ఓపెన్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో ఒక్కో యువతికి సంబంధించి ఒక్కో ఫోల్డర్ రూపంలో వాట్సాప్ చాట్స్, ఆడియో, వీడియో, స్క్రీన్ రికార్డింగ్‌లను భద్రపర్చినట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్డిస్్కలో 44 మంది యువతులకు సంబందించి 250కి పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. తన విల్లాలోని బెడ్రూంలో సీక్రెట్‌గా ఏర్పాటు చేసిన ఐదు కెమెరాలతో వీటిని తీసినట్లు విచారణలో మస్తాన్‌సాయి అంగీకరించినట్టు సమాచారం. లావణ్య ఇంట్లోనూ తీసిన వీడియోలు, చాట్ డాటా అతడి సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా అతడిని ప్రశ్నించినట్లు తెలిసింది. తన మిత్రుడు వినీత్‌రెడ్డి తనకు డ్రగ్స్ సరఫరా చేసే వాడని, పార్టీలు ఉన్నపుడు అతడి వద్ద కొనుగోలు చేసే వాడినని మస్తాన్‌సాయి వెల్లడించినట్లు సమాచారం. దీంతో వినీత్‌రెడ్డిని అరెస్టు చేసి, మరోమారు విచారించాలని నార్కోటిక్స్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. రెండో రోజు విచారణలో మస్తాన్‌సాయి యువతులను డ్రగ్స్ పార్టీల ద్వారా మచి్చక చేసుకుని వారిని లైంగికంగా వాడుకున్నానని అంగీకరించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం వరకు పోలీసులు అతడి మరింత లోతుగా విచారించనున్నారు. అప్పటికీ తమకు రావాల్సిన సమాచారం రాకపోతే శనివారం మరో సారి కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటా: లావణ్య -
వివాహబంధంలోకి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
ఉదయ్‌పూర్: కోర్టుల్లో రాకెట్ పట్టి ప్రత్యర్థులతో పోటీపడి సెమీస్, ఫైనల్స్ ప్రవేశించే తెలుగింటి ఆడపడుచు సింధు ఇప్పుడు నవవధువుగా ముస్తాబై మూడుముళ్ల బంధంలోకి ప్రవేశించింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రాజమహల్లాంటి వేదికపై ఆదివారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో ఆమె తమ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకట దత్తసాయిని వివాహమాడింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 24న (మంగళవారం) హైదరాబాద్‌లో వీరి వివాహా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి తెలుగు సినీ, క్రీడా రంగ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ, ప్రభుత్వ పెద్దలు హాజరయ్యే అవకాశముంది. -
రాయల్‌గా రాజస్తానీ టచ్‌తో
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు పెళ్లాడుతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరుగు తోంది. ఉదయ్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ ‘రఫల్స్’ను సింధు పెళ్లి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రాజసం ఉట్టిప డేలా పెళ్లి వేదికను అలంకరించారు. అతిధులను వేదికకు తీసుకువచ్చే పడవలను కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. డెకరేషన్ అంతా రాజస్తానీ శైలిలో సంప్రదాయం, రాజసాల మేళవింపుగా ఉందని చెబుతున్నారు. విందులోనూ మేవారీ రుచులతో కూడిన రాజస్తానీ వంటకాలను వడ్డించినట్లు తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యు లు, అత్యంత సన్నిహితుల మధ్య మూడు రోజులపాటు సాగే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ‘హల్దీ’సంబరాలు నిర్వహించగా, శనివారం ‘మెహందీ, సంగీత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ‘వరమాల’కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 11.30 గంటల ముహూర్త సమయాన సంప్రదాయ రీతిలో పెళ్లి తంతును నిర్వహిస్తామని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. తమ వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను సింధు కుటుంబం ఆహ్వానించింది. అయితే పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆత్మీ యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.మంగళవారం నాడు హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడ ల్లో రెండు పతకాలు, వరల్డ్ చాంపియన్‌షిప్ సహా పలు అగ్రశ్రేణి టోర్నీల్లో విజేతగా నిలిచిన సింధు.. భారత బ్యాడ్మింటన్‌లో అతి పెద్ద స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలంగా స్నేహం..సింధు, దత్తసాయి కుటుంబాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఇటీవలే వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు ఖాయం చేశాయి. హైదరా బాద్‌కు చెందిన డేటా మేనేజ్మెంట్ సొల్యూ షన్ సంస్థ ‘పొసి డెక్స్ టెక్నాలజీస్’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దత్తసాయి పని చేస్తున్నారు. ఆయన తండ్రి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ ఎస్)లో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్ అయిన జీటీ వెంకటేశ్వర రావు.. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పొసిడెక్స్ టెక్నాలజీస్ ఇటీవలి వరకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ‘ధరణి’పోర్టల్‌ను నిర్వహించింది. డేటా సైన్స్‌లో మాస్టర్స్ చేసిన దత్తసాయి స్వయంగా క్రీడాభిమాని. జేఎస్ డబ్ల్యూ సంస్థలో పని చేసినప్పుడు ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఆపరే షన్స్‌ను దత్తసాయి పర్యవేక్షించాడు. జనవరి నుంచి సింధు వరుసగా వేర్వేరు టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం ఉండటంతో డిసెంబర్లోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. -
పెళ్లి పీటలెక్కనున్న సింధు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ మహారాణి పూసర్ల వెంకట (పీవీ) సింధు త్వరలో పారాణితో ముస్తాబుకానుంది. ఆమె పెళ్లి బాజాకు మూహూర్తం కూడా ఖారారైంది. ఈ నెల 22న ఉదయ్‌పూర్ (రాజస్తాన్)లో అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరుగనుంది. రెండేళ్ల తర్వాత సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ట్రోఫీతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఆమె నవ వధువుగా పెళ్లి పీటలెక్కబోతోంది. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుడు వెంకట దత్తసాయి ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. వధూవరుల కుటుంబాలకు ఇదివరకే పరిచయముంది. తాజా పరిణయంతో ఇరు కుటుంబాలు బంధువులు కానున్నారు. పెళ్లి వార్తను సింధు తండ్రి పీవీ రమణ ధ్రువీకరించారు. ‘ఇరు కుటుంబాలు కలసి నెల క్రితమే పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేశాం. వచ్చే జనవరి నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉండటంతో అందుబాటులో ఉన్న ఈ నెలలోనే వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాం. పెళ్లి వేడుకను ఉదయ్‌పూర్‌లో నిర్వహిస్తాం. ఈనెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తాం. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు ఈ నెల 20 నుంచి జరుగుతాయి’ అని రమణ వెల్లడించారు. భారత బ్యాడ్మింటన్‌లో తారాస్థాయి చేరుకున్న సింధు ఖాతాలో ఐదు ప్రపంచ చాంపియన్íÙప్ పతకాలు, రెండు వరుస ఒలింపిక్స్ పతకాలు ఉన్నాయి. సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సింధు... 2017, 2018లలో రజతం, 2013, 2014లలో కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో మరో ఐదు పతకాలు గెలుచుకుంది. -
కొండపల్లి బొమ్మలకు.. మార్వలెస్ టచ్
ఈ తరం యువతకు అధునాతన ఆవిష్కరణల పై ఉన్న ఆసక్తి.. మన మూలాలను అన్వేషించడంపై ఉండదని తరచూ వింటుంటాం. కానీ నగరానికి చెందిన అభినవ్ సాయి అనే 23 ఏళ్ల యువకుడు తన సృజనాత్మకతతో సాంస్కృతిక వైభవానికి అధునాతన హంగులను అద్దుతూ రెండు తరాలకూ మధ్య వారధిలా నిలుస్తున్నాడు. కళ పరంగా ఎంతో విశిష్టత ఉన్నప్పటికీ ఆదరణకు దూరమవుతున్న కొండపల్లి బొమ్మలకు అధునాతన హంగులతో మళ్లీ ప్రాణం పోస్తున్నాడు. వోక్సన్ యూనివర్సిటీ వేదికగా తను చదువుకున్న విజ్ఞానాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యం పోస్తున్నాడు. ఇలా కొండపల్లి బొమ్మకు తాను రూపొందించిన మోడ్రన్ జాయింట్ టెక్నాలజీకి పేటెంట్ సైతం లభించింది. తాను అందించిన ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంతో స్వయంగా రూపొందించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఐదు నేషనల్ అవార్డులను పొందింది. అంతేకాకుండా తన స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో హాలీవుడ్ లెగో టాయ్స్ తరహాలో రూపొందించిన కల్కి మూవీ టాయ్స్ వినూత్న ఆవిష్కరణను తలపిస్తున్నాయి. ఇలా కొండపల్లి బొమ్మలు మొదలు తన సినిమా ప్రయాణం ఈ తరానికి స్ఫూర్తి దాయకమే. ఆ విశేషాలు అభినవ్ మాటల్లోనే తెలుసుకుందాం...!! చిన్నప్పటి నుంచి క్రియేటివ్ పెయింటింగ్, రాక్ స్కల్ప్చరింగ్, మినియేచర్ స్కల్ప్చర్ వంటి సృజనాత్మకత కళలు అంటే ఇష్టం. ఇలా కళాత్మక ప్రయోగాల్లో భాగంగానే నేను 7వ తరగతి (12 ఏళ్ల వయసులో..) చదువుతున్నప్పుడే ఫ్రెండ్స్‌తో నా మొదటి షార్ట్‌ఫిల్మ్ తీశాను. అప్పటికీ నాకు ఎడిటింగ్ అంటే కూడా సరిగా తెలీదు. ఐ మూవీస్ యాప్ సహాయంతో దానిని పూర్తిచేశాను. అలా బ్లాక్ అండ్ వైట్ సినిమా, థ్రిల్లర్, యానిమేషన్, ఫ్యాషన్ తదితర వేరియేషన్స్‌తో 50 షార్ట్ఫిల్్మ్స చేశాను. ఈ క్రియేటివిటీ, ఐడియాలజీతోనే నగరంలోని వోక్సెన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ ఆండ్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్‌లో చేరాను. వోక్సెన్ వేదికగా తెలుగు సంస్కృతిలో విశిష్టత కలిగిన కొండపల్లి బొమ్మలపైన పరిశోధనలు చేశాను. నా క్రియేటివిటీలో భాగంగా కొండపల్లి బొమ్మకు యాక్షన్ మూమెంట్ ఉండేలా మార్పు చేశాను. డెమోక్రసీ డెత్ ఆఫ్ ఆర్ట్స్..నా గ్రూప్ ప్రాజెక్ట్‌లో భాగంగా టాయ్‌కథాన్ అనే కాంపిటీషన్లో పలు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను. ముఖ్యంగా 95 శాతం ట్రెడిషనల్ బొమ్మల విషయంలో ప్రచారం వేరు, వాస్తవికత వేరు. ఆన్లైన్లో కూడా ఔట్‌డేటెడ్ సమాచారం ఉంటుంది. కొండపల్లి బొమ్మలకు ఎంతో విశిష్టత ఉంది. 400 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి రాజుల కళాభిరుచిలో భాగంగా తెలుగు నేలకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. తేలికైన తెల్లపొనిక చెక్కతో చేస్తారు. కానీ వాటికి ప్రస్తుతం అంతగా మార్కెట్ లేదు. ఒకప్పుడు 6 అడుగుల వరకూ ఉంటే ఇప్పుడు 4, 5 ఇంచులకు మారిపోయాయి. సహజసిద్ధమైన రంగులు వినియోగించేవారు. ప్రస్తుతం అవి వాడట్లేదు. ఎయిర్ పోర్ట్‌లు, పెద్ద షాపింగ్ మాల్స్‌లో అమ్మే బుట్ట బొమ్మలు కూడా కొండపల్లి బొమ్మలు అనుకుంటారు చాలమంది. ఇలాంటి అంశాల వెనుకున్న కారణాలను నా పరిశోధనలో తెలుసుకున్నారు.యూనివర్సిటీ ప్రోత్సాహంతో పేటెంట్ ఒక స్పైడర్ మ్యాన్ బొమ్మలా మన కొండపల్లి చెక్క బొమ్మలు కూడా కదిలేలా డిజైన్ చేశాను. ప్రయోగంలో మా యూనివర్సిటీ అందించిన ప్రోత్సాహంతో నాకు పేటెంట్ రైట్స్ లభించాయి. హాలీవుడ్లో టాయ్స్టిక్ స్టార్టజీ బాగా ఆదరణ పొందింది. బార్బీ వంటి బొమ్మలను రూపొందించి వాటి మార్కెట్ కోసం భారీ సినిమాలను సైతం నిర్మిస్తారు. ఈ కోణంలోనే నా ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంలో తీసిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు మరో ఐదు నేషనల్ అవార్డులు పొందింది. మరో 10 నేషనల్ అవార్డులకు ఎంపికైంది. ఈ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. 3డీ డిజైన్.. గ్లిమ్స్‌తో యానిమేషన్..హాలీవుడ్ లెగో టాయ్స్లాగే.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలుగు సినిమా ‘కలి్క’ సినిమాలోని బుజ్జీ కారు, ప్రభాస్ తదితర పాత్రధారులను నా స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో స్కెచ్ వేసి, 3డీ డిజైన్‌తో కొండపల్లి క్రాఫ్ట్ మెన్‌తో బొమ్మలు చేయించాను. అంతేకాకుండా కల్కి గ్లిమ్స్ ఆధారంగా యానిమేటెడ్ వీడియో చేశాను. ఈ విషయం తెలుసుకుని కల్కి నిర్మాత స్వప్న, దర్శకులు నాగ్ అశ్విన్ నా క్రియేటివిటీని అభినందించారు. వారితో కలిసి ఒక ప్రాజెక్టులా ఈ బొమ్మలను తయారు చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమా విడుదల బిజీ నేపథ్యంలో కుదరలేదు. నా క్రియేటివిటీతో దర్శకునిగా సినిమాలు చేయాలని ఉంది. ఇప్పటి వరకూ తొమ్మిది కమర్షియల్ సినిమా స్క్రిప్‌్టలు రెడీ చేశాను. ఇందులో ఒక కథ ప్రముఖ దర్శకులు సుకుమార్‌కు నచ్చి చర్చలు జరుగుతున్నాయి. తన సుకుమార్ రైటింగ్స్ ఆధ్వర్యంలో నా సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. -
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
పందెం కోళ్లను ఈతకు తీసుకెళ్లి..తండ్రీ, ఇద్దరు కొడుకులు మృతి
పెదవేగి : పందెం కోళ్ల పెంపకం సరదా ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వాటికి ఈతలో శిక్షణను ఇద్దామనుకున్న ఆ తండ్రీ కొడుకులు ప్రమాదవశాత్తూ కాల్వలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. కవ్వగుంట గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (45) రైతు. సంక్రాంతికి ఏలూరు జిల్లా కోడిపందేలకు ప్రసిద్ధి. దీంతో వెంకటేశ్వరరావు తన పందెం కోళ్లను తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నాడు. వాటికి శిక్షణలో భాగంగా ఈతకూ తీసుకెళ్తుంటారు. దీంతో తమకు సమీపంలో ఉన్న పోలవరం కుడికాలువలో ఈత శిక్షణ ఇచ్చేందుకు వాటిని తీసుకువెళ్లాడు. వెంకటేశ్వరరావుతోపాటుగా అతని ఇద్దరు కుమారులు శెట్టిపల్లి మణికంఠ (16), శెట్టిపల్లి సాయి (14)లు సైతం తోడుగా వెళ్లారు. కాలువలో లోతును గ్రహించని ముగ్గురూ కాలువలో ఉన్నపళంగా మునిగిపోయారు. ఈత రాకపోవడంతో వారు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకునేలోపే వారు మృతిచెందారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజేంద్రప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందం, స్థానికుల సాయం మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పండగ సమయంలో ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త, ఇద్దరు కుమారులు విగత జీవులుగా కళ్లముందు కనిపించడంతో భార్య దేవి, ఇతర కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
సెంచరీతో చెలరేగిన సాయితేజా.. యూఏఈను చిత్తు చేసిన అమెరికా
అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్న తెలుగు సంతతి క్రికెటర్ ముక్కామల సాయితేజా రెడ్డి (99 బంతుల్లో 107; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ప్లేయర్ మిలింద్ కుమార్ (110 బంతుల్లో 155 నాటౌట్; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఐసీసీ పురుషుల ప్రపంచకప్ లీగ్–2లో భాగంగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 136 పరుగుల తేడాతో గెలిచింది. ఈ లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన అమెరికా ఆరో విజయంతో 12 పాయింట్లు ఖాతా లో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ 36.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ ఖాన్ (51; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రాహుల్ చోప్రా (52; 7 ఫోర్లు, ఒక సిక్సర్), హమీద్ (43 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్, నోస్తుష్ చెరో మూడు వికెట్లు తీశారు.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్
-
ప్రాణాలు తీసిన అతివేగం
సూర్యాపేట: అతివేగం ఇద్దరి యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. మితిమీరిన వేగంతో చెట్టును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకుల్లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులకి స్వల్ప గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు యువకులు ఎర్టిగా కారును అద్దెకు తీసుకుని సూర్యాపేటలోని వీరి స్నేహితుడు ఉదయ్‌ను కలిసేందుకు గురువారం వచ్చారు. వీరంతా బాల్యస్నేహితులు. అతడితో కలిసి కాసేపు సరదాగా పట్టణంలో తిరిగి ఉదయ్‌ను కూడా కారులో ఎక్కించుకుని కేతేపల్లికి బయలుదేరారు. సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం శివారులో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జటంగి సాయి (17), అంతటి నవీన్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మారగోని మహేష్, కావడి శివ, అబ్బురి గణేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మిగిలిన మరో ఇద్దరు యువకులు చింత మళ్ల ధనుష్ అలియాస్ బన్ని, ఉదయ్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ధనుష్ కారును 170 స్పీడ్‌తో నడపడంతోనే అదుపు తప్పినట్టు తెలుస్తోంది. మితిమీరిన వేగంతో కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. చెట్టు విరిగిపోవడమే కాకుండా కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. -
కబాలి భామ సరికొత్త లేడీ ఓరియంటెడ్ చిత్రం!
2006లో తిరుడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి సాయి దన్సిక. అయితే 2009లో జయం రవితో నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. తరువాత మాంజావేలు, నిల్ గమనీ సెల్లాదే, పరదేశీ వంటి చిత్రాల్లో కథానాయకిగా సత్తాచాటారు. 2016లో రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రంలో ఆయనకు కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని మలయాళ చిత్రాల్లోనూ నటించిన ఈమె ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. కాగా తాజాగా ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఈమె నటించిన ది ప్రూఫ్ చిత్రాన్ని నృత్య దర్శకురాలు రాధిక తెరకెక్కించడం విశేషం. ఈమె మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం కావడం గమనార్హం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కాగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు శశికుమార్ బుధవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) -
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
ఈనాడు ఒత్తిళ్లతో మహిళా ఉద్యోగి ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్: ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడింది. సంస్థలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను, అనుభవిస్తున్న మానసిక క్షోభను భర్తతో పంచుకున్నప్పటికీ.. అవి మరింత తీవ్రతరం కావడంతో తనకిక చావే శరణ్యం అనుకుంది. తాను పనిచేస్తున్న ఈనాడు కార్యాలయ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు, మృతురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ గజ్జి స్వామియాదవ్ కాలనీలో నివాసముండే ఎర్రగొల్ల శ్రీనివాస్, సాయికుమారి (34)కి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. శ్రీనివాస్ పదిహేనేళ్లుగా, సాయికుమారి తొమ్మిదేళ్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈనాడు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈనాడు కాల్ సెంటర్లో పనిచేసే సాయికుమారికి కొంతకాలంగా సంస్థలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో తరచూ ఇబ్బంది పడుతుండేది. భర్తకు చెప్పుకుని బాధ పడేది. ఆదివారం సరదాగా గడిపి.. ఈ క్రమంలోనే భార్యకు మానసిక ధైర్యాన్నిచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తిప్పాడు. ఇద్దరూ సరదాగా గడిపారు. సోమవారం విధుల్లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీకి బయలుదేరిన సాయికుమారిని ఉదయం 6 గంటలకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జాతీయ రహదారి వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చాడు. అయితే 9 గంటల సమయంలో ఈనాడు హెచ్ఆర్ విభాగం నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. సాయికుమారి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయిందని చెప్పడంతో హుటాహుటిన ఫిల్మ్‌సిటీకి వెళ్లాడు. అప్పటికే తలకు తీవ్ర గాయమైన సాయికుమారి మృతి చెందింది. శ్రీనివాస్ ఇచ్చింన ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. ఈనాడు సిబ్బంది అత్యుత్సాహం ఈనాడు సంస్థ ఒత్తిళ్ల కారణంగా తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చింన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పీఎస్‌లో ఉన్న శ్రీనివాస్ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అతని చుట్టూ కంచెలా ఉన్న ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. తన భార్య మృతికి దారితీసిన పరిస్థితులను మీడియాకు వివరించేందుకు సిద్ధమవుతున్న శ్రీనివాస్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
ఫొటోగ్రాఫర్ దారుణ హత్య
ఆలమూరు/మధురవాడ/పీఎం పాలెం : సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి, స్నేహితుడితో కలిసి ఓ ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయి(21)కి ఫొటోలు, వీడియోలు తీయడం హాబీ. అతడికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద రూ.12.70 లక్షల విలువైన కెమేరాలు, ఇతర పరికరాలున్నాయని తేజ గుర్తించాడు. వాటిని ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫొటోగ్రాఫర్‌నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమేరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్‌కుమార్‌తో తేజ రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని, సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్‌కుమార్‌లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు. అనుమానం వచ్చిందేమో! కారులో తనను ఇష్టానుసారంగా తిప్పడం వల్లో ఏమోగానీ తేజపై సాయికి అనుమానం వచ్చింది. మధ్యలో కారు ఫొటోతో పాటు తేజ ఫోన్ నంబర్‌ను కూడా తన తల్లి రమణమ్మకు వాట్సాప్‌లో పంపాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశి్నంచి కొంత సమాచారం రాబట్టారు. కాగా, విశాఖ కంచరపాలేనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా.. ఈ హత్యాపన్నాగం బయట పడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కరీంనగర్లో ప్రేమోన్మాది ఘాతుకం
కొత్తపల్లి(కరీంనగర్): ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడిచేసి పరారైన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి కట్టేమిషన్ ఏరియాలో గురువారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బొద్దుల సాయి, ఓ యువతి ఎదురెదురు ఇంట్లో ఉంటున్నారు. సాయి ఇసుక క్వారీలో ఉద్యోగం చేస్తుండగా ఎమ్మెస్సీ పూర్తిచేసిన యువతి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. ఆమెను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాంటూ సాయి వేధిస్తున్నాడు. విషయం తెలిసిన పెద్దలు సాయిని మందలించారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. తర్వాత కొన్నిరోజులు బాగానే ఉన్న సాయి ఇటీవల మళ్లీ ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపాడు. ఇంట్లోకి చొరబడి.. గురువారం యువతి తండ్రి ఆడెపు వీరేశం బట్ట లు అమ్మేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు వెళ్లాడు. తల్లి స్థానికంగా కిరాణాదుకాణంలో సరుకులు అమ్ముతోంది. ఇదే సమయంలో సాయి ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి పన్ను విరిగి చేతికి గాయమైంది. అంతటితో ఆగ కుండా కత్తితో గొంతుకోసే ప్రయత్నం చేశాడు. ఆమె కేక లు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకునేసరికి పరారయ్యాడు. వెంటనే స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి పరారైన యువకుడి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. -
రైళ్లలో నకిలీ టీసీలు
చీరాల: రైళ్లలో దోపిడీ దొంగలే కాదు.. టీసీల పేరుతో కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. టికెట్ లేని ప్రయాణికులు, రిజర్వేషన్ స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతి లేకుండా ఎక్కిన వారే వీరి టార్గెట్. మెడలో ఒక నకిలీ రైల్వే ఐడీ కార్డు, నకిలీ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్ కలెక్టర్లా మాట్లాడుతూ టికెట్ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ కొత్త రకం దోపిడీకి పాల్పడుతున్నారు. వీరందరూ విజయవాడ నుంచి నెల్లూరు వరకు రైళ్లలో సంచరిస్తూ ముందస్తుగా అనుకున్న రైళ్లలోనే వెళుతుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ జరిమానాలు విధిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. అతడే కీలకం బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ఉప్పు సాయి ప్రసాద్ తెనాలిలో ఉంటున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్మరానికి చెందిన జి.గణేష్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొడ్లకొండ గ్రామానికి చెందిన బొంతా కళ్యాణ్, మహబూబాబాద్ జిల్లా నెల్లికోడూరు మండలం పెద్దతండాకు చెందిన బి.ప్రవీణ్ వద్ద లక్ష రూపాయలు తీసుకుని నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వారిని తనతో ఉంచుకుని విజయవాడ– నెల్లూరు మధ్య రైళ్లలో టీసీలుగా అవతారమెత్తించాడు. రోజూ అతడే డ్యూటీలు వేయించి ఏ రైలు ఎక్కాలో చెప్పేవాడు. రైళ్లలో టికెట్ లేనివారిని గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేయించేవాడు. జరిమానాల సొమ్మును భారీగా తీసుకునేవాడని తెలిసింది. ముందుగా అనుకున్న రైళ్లలోనే టీసీలుగా వెళ్లి టికెట్ తీసుకోని ప్రయాణికుల వద్ద నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య అనుకున్న రైల్వేస్టేషన్లలో దిగి మరో రైలు ఎక్కుతూ జరిమానాలు విధిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో చీరాలకు వచ్చిన వారు చీరాల రైల్వేస్టేషన్లో అసలు టీసీకి దొరికిపోయారు. టీసీలా వ్యవహరిస్తున్న వారిపై అనుమానం రావడంతో ముగ్గురిని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. దీంతో జీఆర్పీ పోలీసులు విచారించగా సాయి ప్రసాద్ బాగోతం బయటపడింది. సాయి ప్రసాద్ వలే విజయవాడలో ఇదే తరహాలో మరో వ్యక్తి దందా సాగిస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై జీఆర్పీ ఎస్ఐ కొండయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా పట్టుబడిన ముగ్గురు మైనర్లు కావడంతో వారికి 41 నోటీసులిచ్చినట్టు తెలిపారు. వ్యవహారంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
బాసర IIIT ఘటన పై గవర్నర్ తమిళ సై ఆవేదన..!
-
శ్రీముఖితో ఉన్న రిలేషన్ ను బయట పెట్టిన సాయి శ్రీ చరణ్...
-
25 నుంచి ఆర్చరీ శిబిరం
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత భారత ఆర్చరీ క్రీడాకారులు మళ్లీ లక్ష్యాలపై గురి పెట్టనున్నారు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 25 నుంచి జాతీయ ఆర్చరీ శిక్షణ శిబిరం పునఃప్రారంభం కానుంది. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో శిబిరాన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 16 మంది ఆర్చర్ల బృందం (ఎనిమిది మంది చొప్పున పురుషులు, మహిళలు) రికర్వ్ విభాగంలో తమ శిక్షణను కొనసాగించనున్నారు. వీరితో పాటు నలుగురు కోచ్‌లు, ఇద్దరు సహాయక సిబ్బంది ఈ క్యాంపులో పాల్గొంటారని ‘సాయ్’ తెలిపింది. ఈ క్యాంపునకు ఎంపికైన వారందరూ ఈ నెల 25న ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ‘సాయ్’ ఆదేశించింది. అనంతరం వీరికి కరోనా పరీక్షలు నిర్వహించి... 14 రోజుల పాటు క్వారంటైన్ చేయనుంది. పురుషుల జట్టు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా... మహిళల జట్టు మాత్రం ఆ పనిలో నిమగ్నమైంది. అంతే కాకుండా వ్యక్తిగత విభాగాల్లో సైతం ఒలింపిక్ బెర్తుల కోసం భారత ఆర్చర్లు పోటీ పడాల్సి ఉంది. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్ అర్హత టోర్నీలో భారత జట్టు పోటీ పడనుంది. శిబిరానికి ఎంపికైన పురుషుల జట్టు: తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, బి.ధీరజ్, ప్రవీణ్ జాదవ్, జయంత తలుక్దార్, సుఖ్‌మను బాబ్రేకర్, కపిల్, విశ్వాస్; మహిళల జట్టు: దీపిక కుమారి, అంకిత భగత్, బొంబేలా దేవి, రిధీ, మధు వేద్వాన్, హిమని, ప్రమీలా బరియా, తిషా సంచెటి. -
భారత హాకీలో కరోనా కలకలం
న్యూఢిల్లీ: భారత హాకీలో కరోనా కలకలం రేపుతోంది. జాతీయ స్థాయి ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతూ ఉండటం ఇండియన్ హాకీలో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఆరో పాజిటివ్ నమోదు కావడంతో మరోసారి అలజడి రేగింది. హాకీ ఆటగాడు మన్దీప్ సింగ్‌కు తాజాగా కరోనా బారిన పడ్డాడు. తాజాగా జరిపిన కోవిడ్-19 టెస్టుల్లో మన్‌దీప్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. తద్వారా భారత హాకీలో ఆరో పాజిటివ్ నమోదైంది. ఈ విషయాన్ని సాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.ఆగస్టు 20వ తేదీ నుంచి నేషనల్ క్యాంప్ ఆరంభించడానికి సన్నాహకాలు ప్రారంభించిన తరుణంలో వరుసగా క్రీడాకారులు కరోనా బారిన పడటం గుబులు పుట్టిస్తోంది. (నర్సింగ్ వస్తున్నాడు...) దాంతో జాతీయ క్యాంపును వాయిదా వేసే పరిస్థితిపై భారత హాకీ సమాఖ్య చర్చలు జరుపుతోంది. గతవారం భారత హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో నలుగురు కోవిడ్ బారిన పడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత సాయ్ సెంటర్‌కు వెళ్లిన క్రమంలో వీరికి కరోనా సోకింది. సాయ్ సెంటర్‌కు 20 మంది ఆటగాళ్లు హాజరు కాగా అందులో ఆరుగురికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది. కరోనా సోకిన హాకీ ఆటగాళ్లలో మన్దీప్, మన్‌ప్రీత్ సింగ్‌లతో పాటు సురేంద్ర కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, కృష్ణ బహుదుర్ పాఠక్‌లు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు సాయ్ వెల్లడించింది. -
‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు రూ. 30 వేలు: సాయ్
న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) 2,749 మంది ‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.30 వేలు చెల్లించింది. ఖేలో ఇండియా స్కాలర్షిప్లో భాగంగా ఏడాదికి రూ. 1.20 లక్షలు ఒక్కో అథ్లెట్‌కు చెల్లిస్తారు. 2020–21 సీజన్లో తొలి త్రైమాసికానికి ఆ మొత్తాన్ని అథ్లెట్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని ‘సాయ్’ తెలిపింది. ఖేలో ఇండియా అథ్లెట్ల జాబితాలో మొత్తం 21 క్రీడాంశాలకు చెందిన 2,893 మంది ఉన్నారని, వీరిలో 2,749 మందికి చెల్లింపులు చేశామని, మిగతా 144 మందికి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని సాయ్ అధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లేందుకు, వ్యక్తిగత, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రతి త్రైమాసికానికి రూ. 30 వేలు భత్యంగా చెల్లిస్తారు. -
ఆన్లైన్ పాఠాల్లో అశ్లీల చిత్రాల కలకలం..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ను విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆన్లైన్ పాఠాలకు డిమాండ్ పెరిగిపోయింది. అటు స్కూలు పిల్లలు దగ్గర్నుంచి, ఇటు క్రీడాకారుల వరకూ అంతా ఆన్లైన్లో తమ ట్రైనింగ్ క్లాస్‌ను వింటున్నారు. ఇలా ఆన్లైన్ పాఠాలు నిర్వహించడానికి భారత క్రీడా ప్రాధికార సంస్థ( సాయ్), భారత బ్యాడ్మింటన్ అసోసియన్(బాయ్)లు నడుంబిగించగా మధ్యలో అశ్లీల చిత్రాలు ప్రత్యక్షం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. బాయ్, సాయ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ ఆన్లైన్ శిక్షణలో 500 నుంచి 700 వరకూ పాల్గొన్నారు. ఇది బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగుతోంది. దీనికి ఇండోనేసియా కోచ్‌లు అగుస్ దివి సాంటోసో, నమ్రి సురోటో మార్గ నిర్దేశకం చేస్తున్నారు. అంతా బాగానే సాగుతున్న వేళ.. ఒక్కసారిగా స్క్రీన్‌పై అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో కోచ్ సాంటోసో క్లాస్ చెబుతున్నాడు. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సెషన్లో తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్‌లో ఉన్న గోపీచంద్ వెంటనే లాగౌట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ‘సాయ్’ ఐటీ వింగ్ విచారణ జరుపుతోంది. ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతున్న సమయంలో అశ్లీల చిత్రాలు రావడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడింది. తమ జూమ్ సెషన్ హ్యాక్ కాకపోయినా అశ్లీల చిత్రాలు రావడం సాయ్ ఐటీ డిపార్ట్మెంట్కు తలపోటుగా మారింది. -
కావ్య, నందినిలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్ అండ్ జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కావ్య (‘సాయ్’), నందిని (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, రంగారెడ్డి) సత్తా చాటారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం జరిగిన పోటీల్లో వీరిద్దరూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల 400మీ. పరుగును కావ్య అందరికన్నా వేగంగా 58.42 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ‘సాయ్’ కేంద్రానికే చెందిన మహేశ్వరి (1ని.00.1సె.), సీహెచ్ పద్మశ్రీ (1ని.01.1సె.) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. అండర్–16 బాలికల లాంగ్‌జంప్ ఈవెంట్లో నందిని 5.21మీ. దూరం జంప్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అదితి సింగ్ (జ్యోతి విద్యాలయ) 4.07 మీ. దూకి రెండో స్థానంలో నిలవగా... పవిత్ర (సెయింట్ ఆన్స్; 4.05మీ.) మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు పురుషుల 400మీ. పరుగు: 1. రిషబ్ మిశ్రా, 2. శ్రవణ్ కుమార్, 3. తేజ. అండర్–16 బాలుర లాంగ్ జంప్: 1. యోగేందర్, 2. పి. అంజి, 3. వరుణ్. అండర్–14 బాలుర 4/400మీ. రిలే: 1. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, రంగారెడ్డి, 2. సీఎంఆర్, సూరారం, 3. మియాపూర్. అండర్–12 బాలుర 80మీ.పరుగు: 1. జె. అనిల్, 2. రామ్ శంకర్, 3. జి. లక్ష్మణ్. అండర్–10 బాలుర 60మీ. పరుగు: 1. హృషికేశ్ స్వామి, 2. కె. గౌతమ్, 3. ఆర్. శ్రీకాంత్; 300మీ. పరుగు: 1. రాము, 2. ప్రణయ్, 3. గౌతమ్. అండర్–16 బాలికల 400మీ. పరుగు: 1. శ్రేయ, 2. విజయ లక్ష్మి, 3. ప్రవళిక. అండర్–14 బాలికల 100 మీ. పరుగు: 1. రాగవర్షిణి, 2. ఆర్. ఝాన్సీ బాయి, 3. సవిత; 400మీ. పరుగు: 1. ఝాన్సీ బాయి, 2. రాగవర్షిణి, 3. శరణ్య; లాంగ్ జంప్: 1. సవిత, 2. నవ్య, 3. షీరజ. అండర్–12 బాలికల 80మీ.పరుగు: 1. విభా రావు, 2. రోహిత, 3. ప్రతీకా రెడ్డి. -
శభాష్.. సాయి
సనత్‌నగర్: వృద్ధాప్యానికి వయస్సు ఉంటుందేమో గానీ..మనస్సుకు కాదంటూ ఆ ఏడు పదుల వ్యక్తి నిరూపిస్తున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా నవ యువకుడిలా కాలనీ అభివృద్ధికి, వివిధ రకాల సేవా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వర్తిస్తుంటారాయన. ఆయనే మోడల్‌కాలనీకి చెందిన జేఎస్టీ సాయి. చిట్టాతో రెడీ... రాష్ట్ర మంత్రో, ప్రజాప్రతినిధో...లేక అధికారో...మోడల్‌కాలనీ వైపు వస్తున్నారంటే చాలు...ఆ వ్యక్తి సమస్యల చిట్టాతో రెడీగా ఉంటాడు. అవి సొంత సమస్యలేమీ కాదు.. అన్నీ ప్రజా సంక్షేమంతో ముడిపడినవే. ఇక రెగ్యులర్‌గా సమస్యలపై అధికారులతో ఫోన్లో టచ్‌లో ఉంటుండడం ఆయన దినచర్యలో ఒక భాగం. ఆ వ్యక్తి వస్తున్నా...లేదా ఫోన్న్ చేస్తున్నా...మళ్ళీ ఏ సమస్యను మోసుకొస్తున్నారంటూ అని వ్యంగ్యంగా అనే అధికారులూ లేకపోలేదు. తాను ఉండే కాలనీ ప్రజల సంక్షేమం. అభివృద్ధి గురించి ఆయనలోని తపనకు ఇదో ఉదాహరణ. ఇది నాణేనికి ఒక వైపు అయితే... ఆయనలోని సామాజిక కోణం మరోవైపు...తానుండే కాలనీ వారితో కలిసి మానవ సేవా సమితి పేరిట సమాజహిత కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. ఆయనలోని ఇంకో కోణం ఏమిటంటే సినీ అభిమాని అయిన ఆయన కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ తనలోని కళాభిమానాన్ని చాటుతుంటారు. ఇవన్నీ చేయాలంటే ఉరకలెత్తే రక్తమే ఉండనక్కర్లేదు..అనుభవాలను ధారపోసే సీనియర్ సిటిజ¯Œన్స్ కూడా చేయవచ్చని నిరూపిస్తున్నారు 78 ఏళ్ళ జేఎస్టీ సాయి. ఆ ప్రాయంలోనూ సామాజిక సేవా కార్యకర్తగా, కాలనీ అభివృద్ధి బాధ్యతలను, జీహెచ్ఎంసీ సర్కిల్–10 ఆసరా కమిటీ ఉపాధ్యక్షుడిగా ఓపిగ్గా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. స్వచ్ఛ కాలనీ అవార్డు రావడంలో ప్రధాన భూమికగా... ఒకప్పుడు మోడల్‌కాలనీ పార్కు చూస్తే చెట్లపొదలతో చిట్టడివిని తలపించేలా ఉండేది. దాని అభివృద్ధికి అధికారులను, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి పార్కును సర్వాంగసుందరంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దడానికి కారకులుగా నిలిచారంటే ఆయనలోనే తపనకు నిదర్శనం. ఆ పార్కు నిర్వహణకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంస్థల నుంచి అవార్డులు, ప్రశంసలు కూడా వచ్చాయి. అలాగే రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, అంతెందుకు రోడ్డుపై చెత్త, చెట్ల కొమ్మలు ఉన్నా వెంటనే అధికారులకు ఫోన్న్ చేయడమో! లేక నేరుగా వెళ్ళి వినతిపత్రం ఇవ్వడమో చేసి పరిష్కారం జరిగే వరకు వెంటపడుతుండడం. ఒకానొక దశలో అధికారులు సైతం విసుగెత్తిపోయి సమస్య పరిష్కారించి తీరక తప్పదు. అందుకేనేమో ఆ కాలనీకి స్వచ్ఛ కాలనీ అవార్డు వరించింది. ఐక్యతే బలం నినాదంతో... ఇక వినాయక చవితి, స్వాతంత్య్ర, గణతంత్ర, కార్తీక మాస విశిష్ట పూజలు, వనభోజనాలు...ఇలాంటి కార్యక్రమాలను కాలనీవాసులందరినీ భాగస్వాములు చేసి ఒకే వేదిక పైకి చేర్చి ఐక్యతలో ఉండే శక్తిని చాటిచెబుతారు. ఆయా పండుగ వేళల్లో ఉల్లాసభరిత కార్యక్రమాలతో మనస్సును పరవశింపజేసే కార్యక్రమాల నిర్వహణలో రాజీపడరంటే అతిశయోక్తి కాదు. ఇక సహపంక్తి భోజనాలు, ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాల నిర్వహణలో ఆయనకు ఆయనే సాటి. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంలో పిల్లలకు ఆటలు, పాటలు, వ్యాసరచన, వక్తత్వ , పెయింటింగ్ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం ఆనవాయితీ. ఓటు విలువపై విస్తృత ప్రచారం... ఓటు హక్కు...ప్రజల తలరాతలను మార్చే ఆయుధంగా జేఎస్టీ సాయి భావిస్తారు. అందుకే ఎన్నికల వేళ ఓటు విలువను తెలియపరుస్తూ ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం కల్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. మానవసేవా సమితితో సేవలకు నాంది కాలనీకి చెందిన బుచ్చిబాబు, శశికాంత్‌లతో పాటు మరికొంతమందితో కలిసి మానవ సేవా సమితి తరుపున జేఎస్టీ సాయి వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. వేసవికాలంలో దాదాపు రెండు నెలల పాటు బాటసారులకు పెరుగన్నం, మజ్జిగ, మంచినీటిని అందిస్తున్నారు. దీంతో పాటు నిత్యం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికిలోని రోగుల సహాయకుల కు అన్నదానం చేస్తుంటారు. సత్యసాయి సేవా సమితి తరుపున జరిగే వివిధ కార్యక్రమా ల్లో జేఎస్టీ సాయి చురుగ్గా పాల్గొంటూ తనలోని సేవానిరతిని చాటుతున్నారు. అలాగే విద్యావ్యాప్తిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు నోట్ పుస్తకాల పంపిణీ చేస్తున్నారు. కళాకారులకు ప్రోత్సాహం... ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్‌న్ ప్రతినిధిగా జేఎస్ టీ సాయి కళాకారులు అంటే అపారమైన గౌర వం. అందుకే కాలనీలో సామూహికంగా ఏ కార్యక్రమం చేపట్టినా కళాకారులను చేయూత అందించాలనే ఉద్దేశ్యంతో వారి చేత ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇప్పిస్తుంటారు. అంతేకాకుండా కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యం తో స్వయంగా సుమధుర కళానికేతన్‌ను స్థాపిం చి జానపద, కూచిపూడి, భరతనాట్యం, నాటిక, నాటక, అవధానాలు, సంగీతం, మిమి క్రీ వంటి కార్యకమాలు నిర్వహించి తనలోని కళాతృష్ణను తీర్చుకుంటూనే ప్రజలకు వినో దాన్ని అందిస్తున్నారు. శ్రీవిశ్వనాధం సాహిత్య పీఠం జాయింట్ సెక్రటరీ, శ్రీనాటరాజ ఆర్ట్ అకాడమీ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, కష్ణ కళాభారతి కార్యదర్శిగా, సుమధుర కళానికేతన్ ఫౌండర్ సెక్రటరీగా, విద్వత్ పరిషత్ కన్వీనర్‌గా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి సాంస్కృతిక రంగంలో తనదైన సేవలు అందించారు. సీనియర్ సిటిజన్స్‌కు ‘ఆసరా’... తోటి సీనియర్ సిటిజన్స్ నిత్యం ఉల్లాసంగా ఉండాలని జేఎస్టీ సాయి తాపత్రయం. అందుకోసం జీహెచ్ఎంసీ నుంచి వివిధ రకాల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు వారికి సంబంధించిన స్కీములను వినియోగించుకునేలా చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో అవార్డులు..రివార్డులు.. మరెన్నో సన్మానాలు... ♦ మోడల్‌కాలనీకి స్వచ్ఛ కాలనీ అవార్డు దక్కించుకోవడం వెనుక జేఎస్టీ సాయి కాలనీ పరిశుభ్రత విషయంలో కీలక భూమిక వహించారు. ♦ ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రివార్డు. ♦ సీనియర్ సిటిజన్స్, సంఘ సేవకు గాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌చే అవార్డు, సన్మానం. ♦ సామాజిక సేవలకు గానుఎకోష్యూర్ ఎక్సలెన్స్ అవార్డు ♦ సంఘ సేవకు గాను ఖమ్మం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుచే సత్కారం.. -
బ్రహ్మజ్ఞానమంటే...
ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేద బుద్ధి ఉంటుందా? ఎక్కడి నుండో ఓ సేటు (వ్యాపారి) బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటూ రావడం, సాయిని తొందరచేస్తూ.. వెంటనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు– అంటూ కంగారు పెట్టడం... ఈ కథనంతా విన్నాం కదా! ఆ సేటు వెళ్లిపోయాక ‘కాకా.. శ్యామా.. ఇంకా మరి కొందరు మసీదులోకి వచ్చాక సాయి ఆ అందరూ అడిగిన మీదట బ్రహ్మజ్ఞానమంటే ఏమిటో చెప్పడం ప్రారంభించాడు. ఈ కళ్లు ‘కళ్లు’ కావు! ఎంతో లోతుగా ఉన్న బావి (నుయ్యి) నుండి నీటిని బిందెతో లేదా చేదతో పైకి తెచ్చుకోవాలంటే బిందె బరువూ నీళ్ల బరువూ అనే రెండింటినీ పైకి లాగడం అనే కారణంగా మరింత బరువు జత అవుతుంది కదా! ఆ కారణంగా మామూలుగా మనం అలాంటి బిందె– చేదలని నేల మీద ఉన్నప్పుడు మోసెయ్యగలిగినా కూడా, నూతి నుండి తెచ్చుకోవాలంటే అది మూడు రెట్ల బరువుతో సమానమైన పనిగా అనిపిస్తుంది.ఇదంతా ఎందుకంటే ఏదో సామాన్యమైన విషయాన్ని తెలుసుకుంటూంటే అక్కడక్కడ కొంత విన్నా వినకున్నా కూడా మనకి అర్థం అయిపోతుంది– అయిపోవచ్చునేమో కానీ, అదే మరి గట్టిదీ ఎంతో అర్థమున్నదీ అయిన బ్రహ్మజ్ఞానం లాంటి విశేషాలని తెలుసుకోదలిస్తే ప్రతి అక్షరాన్నీ శ్రద్ధగా వింటూ ఉండవలసిందే. మీరందరూ అలాంటి శ్రద్ధ, విశ్వాసం కలవాళ్లు కాబట్టి కొద్దిగా తెలియజేస్తాను.ఉదాహరణకి మనందరికీ కళ్లున్నాయి కదా! ఆ కళ్లతో ఏం చేస్తాం.? ఎదుటి వ్యక్తినీ, వస్తువులనీ పదార్థాలనీ పశుపక్షి మృగ జంతువులనీ... ఇలా అన్నింటినీ చూస్తాం. అయితే ఓ వ్యక్తినో ఓ వస్తువునో... ఇలా పై వాటిని చూస్తే భౌతికరూపం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఎంత ఎత్తున్నాడు? లావున్నాడు? సన్నగా ఉన్నాడు... వంటి విశేషాలే తెలుస్తాయి. అంతేతప్ప ఆ వ్యక్తి ఎంత చదువుకున్నాడు? ఎంత హోదాలో ఉన్నవాడు?.. వంటివేమీ ఎవరో అతడ్ని గురించి చెప్తే గానీ తెలియవు కదా! అలా అతని గొప్పదనాన్ని గురించి మనకి తెలియనంత వరకూ అతడు ఓ సామాన్యుడనేదే కదా మన అభిప్రాయం. అయితే అది నిజమా? కాదుగా! ఈ నేపథ్యంతో మన కళ్లని మనం నిజమని నమ్మకూడదు. ఇలా చెప్తూంటే ఇది ఏదోలా అనిపించవచ్చు మనకి. అయినా శ్రద్ధగా వింటే అర్థమవుతుంది.ఉదాహరణకి ఓ బంగారపు చంద్రహారం, ఉంగరం, వడ్డాణం... ఇలా ఎన్నో బంగారు ఆభరణాలు కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఆ ఆభరణాలని కరిగిస్తేనో... అన్నీ బంగారపు ముద్దలై కూచుంటాయి. అది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.అదే తీరుగా మరో ఉదాహరణని చూద్దాం. సముద్రంలో కెరటాలు, బుడగలు, నురగలు, సుడిగుండాలు.. ఇలా కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ కెరటాలూ, బుడగలూ.. అన్నీ ఆగిపోతే కనిపించేవి నీళ్లే. నీళ్లే ఇలా మరో మరో తీరు రూపాన్ని ధరించి కెరటాలూ, బుడగలూ, నురగలూ ఇలా అవుతాయి. ఇది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.మరొక్క ఉదాహరణని కూడా చూసి విషయాన్ని తెలుసుకుందాం. కుండ, పిడత, మూకుడు... ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ అన్నింటినీ పగలగొడితే కనిపించేది మట్టి మాత్రమే కదా!అంటే ఏమన్నమాట? ఒక మూల పదార్థం అదే బంగారం, నీరు, మట్టీ... అనే ఇలాంటివన్నీ చంద్రహారం వడ్డాణం– కెరటాలు, నురగలు – కుండా పిడతా వంటివిగా మారుతున్నాయి. ఒక రూపాన్ని పొందినప్పుడు ఇదే తీరుగా బ్రహ్మపదార్థాన్ని గురించి ఆలోచించి అర్థం చేసుకుందాం. చెట్టూ పుట్టా పర్వతం, సముద్రం 84 లక్షల జీవరాసులూ... ఇలా కనిపిస్తున్నాయి కదా ప్రపంచంలో. ఇలా కనిపించడం భౌతికదృష్టి. ఈ ప్రపంచాన్ని అలా ఒకటిగా కలిపి ముద్ద చేసేస్తే (అది ప్రళయకాలంలో జరుగుతుంది) అది బ్రహ్మపదార్థం (బంగారం నీరూ మట్టీ లాగా అన్నమాట). అంటే ఏది మూల పదార్థమో అది బ్రహ్మపదార్థం. ఏది వికృత పదార్థమో అది మనకి భౌతికదృష్టికి కనిపించే పదార్థమన్నమాట. ఈ దృష్టి మనకి గాఢంగా కలిగినప్పుడు చెట్టూ పుట్టా మనిషీ జంతువూ అనే భేదభావం ఏర్పడదు. చంద్రహారం కంటే వడ్డాణం వేరు కాదు– దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది బంగారమే కాబట్టి. అయితే పేరు, రూపం మాత్రమే వేరు. అలాగే కెరటమూ నురుగూ కూడా వేరు కాదు. దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది నీరే కాబట్టి.ఈ దృష్టిని మన కళ్లకి బాగా పట్టించినట్లయితే కుక్క, పాము, పక్షి, చేప, మనిషి... ఇలా కనిపించే అన్నింటిలోనూ కూడా పైకి కనిపించే(పేరూ రూపమూ ఆకృతీ...) రూపాన్ని తొలగించి చూస్తే అంతా బ్రహ్మపదార్థమే అని అర్థమవుతుంది. ఇది నిజం కాబట్టే మనకంటూ తెచ్చుకున్న ఆహారపదార్థాలని కుక్కలు, పిల్లులు, ఎలుకలు... ఇలా ఏవి తింటున్నా... మూల పదార్థ దృష్టితో చూస్తే అవన్నీ కూడా బ్రహ్మపదార్థం నుండి వచ్చినవే కాబట్టి– ఏ విధంగానూ మనకంటే వేరు కావు. రూపాన్ని బట్టి పేరుని బట్టీ వేరువేరు పేర్లతో పిలువబడుతున్నాయి తప్ప అన్నీ ఒకటే నిజానికి. ఒకే భూమి నుండి పూల చెట్లూ, పళ్ల చెట్లూ, తీగల పాదూ... పుడుతున్నాయో అదే తీరుగా బ్రహ్మపదార్థం ఒకటే అయినా దాని నుండి వచ్చే రూపాలని బట్టి పేర్లు మారుతుంటాయనేది సత్యం.నాలో ఉన్న బ్రహ్మపదార్థమే మీలోనూ ఉంది. అయితే పేర్లు మారడం కారణంగా ఇతను శ్యామా, అతను కాకా, మరొకతను గోల్కరే... అని ఇలా అందరి చేతా పిలిపించుకో బడుతున్నారు. నిజానికి ఈ అందరూ ఒకే బ్రహ్మపదార్థానికి సంబంధించిన వాళ్లే. ఈ దృష్టే గనుక మనకి గాఢంగా కలిగితే మరొకనికి కష్టాన్ని కలిగిద్దామనీ, మరొకనికి హానిని తలపెడదామనీ, ఏ ఒకరిద్దరికి మాత్రమే సహాయపడుదామనీ... ఆ తీరు ఆలోచన రాదు.’ వసుధైక కుటుంబక’ మనే మాట ఒకటుంది. వసుధ అంటే భూమి అని అర్థం. ‘ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబానికి చెందినదే సుమా!’ అని దానర్థం. ఈ దృష్టికి రాగలిగినప్పుడు ఎవరికైనా ద్రోహాన్ని తలపెడితే మనకి మనమే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్నామని అర్థమవుతుంది. దాంతో ద్రోహాన్ని తలపెట్టనేలేరు. అప్పుడు సర్వసమానభావం (ఎవరికి ద్రోహాన్ని తలపెట్టినా తనకి తానే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్న భావం) అలవడుతుంది. ఇదంతా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే ఒక తీరు విధానం. కాబట్టి మన కళ్లు ‘కళ్లు’ కావు. దృష్టి మారిన కళ్లు కావాలన్నమాట. ఇది ఒక తీరు. ఇక మరో తీరులో కూడా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే వీలుంది. ఇదేం శ్లోకం? మనందరికీ ప్రసిద్ధంగా తెలిసిన ఓ శ్లోకముంది.‘గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరఃగురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’ అనేది.సృష్టించేవాడు బ్రహ్మ. ఆయన పురుషుడే. రక్షించేవాడు విష్ణువు. ఆయనా పురుషుడే. లయింపజేసేవాడు శివుడు. ఆయనా పురుషుడే. పుట్టుక, రక్షణ, మరణం అనే మూడు క్రియలూ అయిపోతే ఇక మిగిలిందేమిటి? ఏం చేయవలసి ఉంది? లేదు కదా! మరి శ్లోకం అక్కడితో ముగిసిపోకుండా ‘సాక్షాత్పరబ్రహ్మ’ అనే ఒక మాట ద్వారా ఆ పరబ్రహ్మని గురువుగా చెప్పడమేమిటి? ఈ పరబ్రహ్మ పురుషుడా? స్త్రీ నా? లేక నపుంసకధర్మంతో ఉన్నవాడా? అని ఈ తీరుగా ఆలోచిస్తే తెలుస్తుంది బ్రహ్మపదార్థమేమిటో!?కొంత విసుగ్గా అర్థమయ్యీ కానట్టుగా అనిపించినా కొద్ది ఓపిక పడితే తెలుస్తుంది. తెలిశాక మన ఆలోచనా విధానమే మారుతుంది.పైన ఆకాశముంది. ఉందా? అంటే లేదు. ఎందుకని? కనిపిస్తూ.. ఉన్నట్లుగా ఉంటూ.. ఎప్పటికీ కనిపించకుండా ఉండేదే ఆకాశం కాబట్టి. ఆ మాటకొస్తే ఆకాశమనే మాటకి అర్థమే ‘శూన్యం’ అని. ఆ ఆకాశాన్ని పట్టుకుని వేలాడుతూ పగటివేళ సూర్యుడూ రాత్రివేళ చంద్రుడూ మనకి కనిపిస్తున్నారా? ఈ ఇద్దరూ కూడా ఏ మాత్రపు క్షణమాలస్యం కూడా చేయకుండా – ఎంతటి చలికాలమైనా, ఎండ కాలమైనా, వర్షకాలమైనా– వచ్చి కనిపిస్తూ ఉంటారా? వీళ్లు కాక ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు.. ఇలా ఎన్నో ఆ ఆకాశాన్ని పట్టుకుని అతుక్కుని కనిపిస్తూ ఉంటే ఆకాశాన్ని శూన్యపదార్థమని ఎలా అనగలం?కాబట్టి కనిపించని దాంట్లో కనిపించేదేదో ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నించి దాన్ని చూడగలగడం బ్రహ్మజ్ఞానం. పైగా నవగ్రహాలుంటాయక్కడే. పోనీ అవన్నీ ఓ వరుసలో నడుస్తున్న వ్యక్తుల్లా పక్క పక్కన లేక కొన్ని సమానమైన వరసల్లోనో నడుస్తారా? అంటే కానే కాదు. వాళ్లకి వాళ్లు నడవరు. నడిచేలా చేయబడతారు. అంటే వాళ్ల ప్రయత్నం ఏమీ లేకుండా వాహనం కదులుతుంటే దాంట్లో ఉన్న మనం ఏ మాత్రమూ కదలకుండా ఉంటామో, అయినా కదులుతూ వెళ్తున్నామో అలా నడిపింపబడుతూ ఉంటాయి. పోనీ ఒకే వరుసలో ఒకే పద్ధతిలో ఉంటాయా? అంటే కానేకాదు. కొందరు తూర్పుని చూస్తుంటే (శుక్రుడూ రవీ) మరి కొందరు పశ్చిమాన్ని చూస్తుంటే (శనిచంద్రులు) ఇంకొందరు ఉత్తరాన్ని చూస్తుంటే (బుధగురులు) మిగిలిన వాళ్లు దక్షిణముఖంగా ఉంటారా? వీళ్లలో కొందరు ఒక వేగంతో మరి కొందరు మరి కొంత వేగంతో ఇంకొందరు మరీ వేగంతో ప్రయాణిస్తూ ఉంటారా? వీళ్లలో కొందరు సూర్యునికి ప్రదక్షిణాకారంతో కొందరు అప్రదక్షిణాకారంతో తిరుగుతారా? ఇలా తిరుగుతున్నా కూడా ఏనాడూ ఒకరినొకరు గుద్దుకోనే గుద్దుకోరా? ఈ నిర్మాణం ఎవరిది? ఈ నిర్వహణ ఎవరిది? వీళ్లే కనిపించని వాళ్లవుతుంటే వీళ్లని నిర్వహించే ఆయనెక్కడ కనిపిస్తాడు? ఈ తీరుగా ఆలోచిస్తూ పోతే ఓ అదృశ్య శక్తి ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. అదే బ్రహ్మం. దీన్నే అదృశ్యుడుగా ఉన్న దైవంగా భావిస్తారు లౌకిక దృష్టితో జనమంతా. ఈ నిర్మాణాన్నీ వ్యవస్థనీ నిర్వహణా విధానాన్నీ ఏ మాత్రమూ గమనించకుండా ఆ శక్తికి ఓ పేరు పెట్టుకుని ఈయన చదువునీ ఆమె డబ్బునీ ఫలాని ఆయన ఆరోగ్యాన్నీ... ఇలా ఇస్తుంటారని పూజల్నీ పురస్కారాల్నీ, మళ్లీ వాటిని కూడా అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చేస్తూ పోతూ ఉండటమా? హిందూ ధర్మాన్ని తప్పుపట్టడం కానే కాదు నా లక్ష్యం. సరిగా ఆ ధర్మాన్ని తెలుసుకోకుండా ఉంటున్నారా? అనేదే నా ఆందోళన.అందుకే పైన అనుకున్న శ్లోకం ఓ మాటని చెప్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఎంతో గొప్పగా అనుకుంటున్నా వాళ్లని కూడా నడిపించే బ్రహ్మపదార్థ మొకటుందని గమనించవలసి ఉందనీ, ఆయన్నే గురువుగా భావిస్తూ నమస్కరిస్తూ ఉండవలసిందనీను.ఆ పరబ్రహ్మనే కొందరు రాముడు, కృష్ణుడూ అంటుంటే మరికొందరు అల్లా అంటూంటారు. రాముడూ కృష్ణుడూ ఓ ప్రత్యేకమైన నిర్మాణ విధానంలో ఉన్న ఆలయాల్లో ఉంటూ ఉంటే, అల్లాహ్ మరో ప్రత్యేకమైన నిర్మాణవిధానంలో ఉన్న మసీదుల్లో ఉంటాడు. విధానం ఒక్కటే. రూపాలు వేరు. నివాసాలు వేరు. ఈ ప్రాంతం వాళ్లు జొన్నల్ని తింటే ఆ ప్రాంతం వాళ్లు గోధుమల్ని తింటే ఇంకో ప్రాంతం వాళ్లు వరి అన్నాన్ని తింటే ఆ తినబడే దాన్ని కొందరు అన్నమన్నారు. కొందరు రొట్టెలన్నారు. ఇంకొందరు మరో పేరుతో పిలిచారు. ఏమైనా ఈ భిన్నభిన్నతీరులున్నవన్నీ ఆకలిని పోగొట్టేందుకే కదా! ఈ దృష్టిగాని మనకి కలిగితే అప్పుడు ఈ విధానమంతా బ్రహ్మమే అనే ఆలోచనకి రాగలం. అందుకే ‘అల్లాహో మాలిక్’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండే నాకు ‘రాజారామ్ రాజారామ్’ అనే మంత్రం వేరుగా అనిపించదు. ఖాపర్దే భార్యకి ఇదే మంత్రాన్నిచ్చాను కూడా. హేమాడ్ పంత్ పుట్టుకకి బ్రాహ్మణుడయ్యుండీ సాయబునీ ఫకీరునీ అయిన నన్ను హిందూ దేవాలయ అర్చకుడయ్యుండీ ‘యా సాయీ!’ అని మరాఠీ భాషలో నన్నాహ్వానించినపుడు అందుకే ఆనందపడ్డాను– ‘ఈయన బ్రహ్మజ్ఞాని కాబట్టే సర్వదేవతలనీ ఒకే తీరుగా లెక్కించే గొప్పగుణం కలిగి కనిపిస్తున్నాడని.ఈ బ్రహ్మజ్ఞానమే మనకి కలిగిన రోజున మతద్వేషాలు దైవనిందలు దండయాత్రలు దేవాలయధ్వంసాలు మసీదుల్ని కూలగొట్టడాలు వంటివి ఉండనే ఉండవు. ఖురాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో సొంత బిడ్డలా చేతితో పట్టుకుంటామో అదే తీరుగా భగవద్గీతని కూడా చేతిలోకి తీసుకోగలుగుతాం.అంత దాకా ఎందుకు? నేను మొదటిసారి పెళ్లి వాళ్ల గుంపుతో షిర్డీకి వచ్చినప్పుడు ఈయనకి విడిది ఎక్కడియ్యాలా? అని అందరూ సంశయపడుతూ ఉంటేనూ, ఖండోబా దేవాలయ అర్చకుడు హేమాడ్‌పంత్ ‘పోనీ! ఈ ఆలయంలో ఓ గదిని కేటాయిద్దామా?’ అని ఆలోచిస్తూ ఉంటేనూ అందరూ కూడా ‘అతను సాయబు’ కాబట్టి పొరపాటున కూడా ఇక్కడికి రానియ్యద్దన్నారు. నేనూ అక్కడ ఉండదలచలేదు వారు ఉండవలసిందంటూ ఒకవేళ కోరినా. ఇది హిందువుల అజ్ఞాన దృష్టి అని నేననను.‘నువ్వు హిందూ దేవతలని కూడా కొలుస్తూ దేవతలని గురించి ప్రశంసిస్తూ దేవాలయాలకి వెళ్తూ ఆ మతం వాళ్లకి భోజనాలని పెడుతూ వాళ్లతో కలిసి మమేకంగా తిరుగుతూ కనిపిస్తున్నావు కాబట్టి మసీదు మెట్లని ఎక్కనియ్యం’ అంటూ మా వాళ్లు కూడా నన్ను రానీయలేదు. దాన్ని కూడా వారి అజ్ఞానమని నేననను. ఇంట్లో పిల్లవాడు తెలిసి తెలియని వయసులో కేవలం ఆటలమీదే దృష్టి ఉన్న దశలో బడికి వెళ్లనే వెళ్లనంటూ మారాం చేయడమే కాక ఏడుస్తూ చేతికి దొరికిన ప్రతి వస్తువునీ దూరంగా గిరవాటువేస్తున్న వేళ తల్లి మాత్రమే వాడికి పక్కవాళ్ల పిల్లల్నీ చదువుకున్న గొప్పవాళ్లనీ.... ఇలా చూపించి అర్థమయ్యేలా చెప్పి వాడంతట వాడే బడికి వెళ్లేలా చేస్తోంది. అదుగో అలాంటి బాల్యదశలో ఉన్నవాళ్లే ఈ భేదభావంతోనూ బ్రహ్మజ్ఞాన దృష్టి లేకుండానూ ఉంటారు– కనిపిస్తున్నారు కూడా. అది వాళ్ల తప్పు కాదు. వాళ్లకి సదవగాహన కలిగేలా చెప్పకపోవటం మన తప్పు మాత్రమే. అందుకే నా ఈ ప్రయత్నాలన్నీ. మసీదులో తులసి మొక్కా, హోమగుండానికి సంకేతరూపంగా ధునీ, భజనలకి ప్రతిరూపంగా నామజపం, భేదభావాలు రాకుండా వ్యాపించకుండా ఉండేందుకోసం– సాయబులకి ప్రీతి పాత్రమైన చందనోత్సవంతో హిందువులకిష్టమైన దైవకల్యాణాలూ– శ్రీరామనవమి ఉత్సవం రోజునే ఉరుసు ఉత్సవం... వంటివన్నీ జరుపుతున్నాం మసీదులో. ఇలా క్రమక్రమంగా మనం బుద్ధిలో అవగాహన పెంచుకోగలిగితే ఇక భేదభావం ఎక్కడుంటుంది?ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేదబుద్ధి ఉంటుందా? ఉండగలుగుతుందా? ఆ ఏకత్వ దృష్టిని సాధించడమే బ్రహ్మజ్ఞానమంటారు. (ఏకం సత్ విప్రా బహుధా వదంతి) – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
దైవం మానుష రూపేణా
ఏమిటి? దైవం మానుష రూపేణా! అని సాయిని గురించి అన్నారా? దేవుడు ఓ మనిషి రూపంలో కనిపిస్తున్నాడని కదా దానర్థం. దేవుడంటే కనిపించనివాడు కదా! మనుష్యుడంటే అన్ని బాధలకీ గురవుతూ కనిపిస్తూ ఉండేవాడు కదా! ఇలా ఈ ఇద్దరూ తూర్పు పడమరల్లా ఉంటూంటే ఇద్దరూ ఒకటేనంటూ ఎలా అనడం సబబు? అనిపిస్తుంది పై దృష్టితో చూస్తే.సంస్కృతంలో ‘గంగాయాం ఘోషః’ (గంగానదిలో గొల్లపల్లె) అనే మాట ఒకటుంది. నిజంగా ఓ పల్లెటూరు ఓ నదిలో ఉండటం అసాధ్యం. మరి అసాధ్యమైనదని తెలిసి కూడా ఇలా ఎలా అనగలుగుతున్నారట? గంగానది ఎంత చల్లగానూ ప్రశాంతంగానూ మనసుకి ఆనందం కలిగించేది గానూ చక్కని చల్లని గాలులతోనూ ఉంటుందో అలా ఈ పల్లెటూరు కూడా అంతగానూ గంగానది పోలికలతోనూ ఉంటుందని దాని భావం. అదే తీరులో ‘దైవం మానుష రూపేణ’ అంటే కావడానికి మనిషే అయినా దైవంలా అన్ని సందర్భాల్లోనూ కాపాడుతూ వస్తూ దైవంతో సమానంగా అనిపిస్తాడని దీనర్థం. ఈ నేపథ్యంలో ఎలా ఈ సాయి ఆ దైవంలా అనిపించాడో చూద్దాం! సాయిలో దైవం... భారతంలో భీష్ముడూ విదురుడూ కుంతీ అనే వాళ్లు కనిపిస్తారు. వీళ్లు జీవిస్తున్న కాలంలోనే కృష్ణుడూ ఉన్నాడు. ప్రధానంగా ఈ ముగ్గురూ ఆ కృష్ణుడ్ని మానవావతారంలో తమ కళ్లతో చూస్తున్నా కూడా, ఎప్పుడూ ఆ కృష్ణుడ్ని ఓ దైవంగా భావిస్తే దర్శించేవాళ్లే తప్ప, ఏనాడూ దైవమనే భావనే వాళ్లకి ఉండేది కాదు. (ఆత్మలో ఎరుకయున్..) అందుకే ఎంత మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అనే ఆ అంశాన్ని ఒకటికి రెండు మార్లు లోపల అనుకుని ఆ మీదటే మాట్లాడుతూ ఉండేవాళ్లు, 9 తీరుల భక్తి భావంలోనూ ఈ తీరుభక్తి (దైవమే సుమా!) ఒకటి.అదే తీరగా ఖాపర్దే (దాదాసాహెబ్ ఖాపర్దే) అనే ఆయన తన కుటుంబంతో సహా షిర్డీకి వచ్చి కొంతకాలం పాటు ఉండదలిచాడు. ఆయనేదో అందరు భక్తుల్లా సాధారణుడు కాడు. గొప్ప పండితుడు. పైగా అంత విద్య తన వద్ద ఉందనే అహంకారాన్ని ఏ మాత్రమూ ప్రదర్శించేవాడు కాదు. అతి సాధారణంగా ఉంటూ అందరితోనూ కలిసిమెలిసి తిరుగుతూ ఉంటూ తన అసాధారణ విధానాన్ని ఏనాడూ చూపించడం కోసం ప్రయత్నం కూడా చేసి లేడు.ఎప్పుడూ ఆయన పాదాల దగ్గరే నిలబడి ఉంటూ కూచోవాలనే ఆలోచనతో కూడా ఉండేవాడు కాడు. ఎవరైనా భక్తులు సాయికి ఏ ఫలాన్ని గానీ ఆహారాన్ని గానీ సమర్పించుకుంటే సాయి దాన్ని తీసుకుని ఖాపర్దేకి గాని ఇస్తే దైవానికి మనం దేన్నైనా సమర్పిస్తే పూజారి దాంట్లో సగాన్ని మనకి ఇస్తే ఎలా దాన్ని ప్రసాదంగా భావిస్తూ తీసుకుంటామో అలా సాయి ఇచ్చిన ఫలహారాలని మాత్రమే తీసుకుంటూ ఉండేవాడు. ఈయన భక్తిలోని లోతు తెలియని ఏ కొందరో మరీ అంతగా ఉండాలా? అనుకునే వాళ్లు. ఇటుపక్క ఆంగ్లభాషలో నిష్ణాతుడు కావడమే కాకుండా, అటుపక్క విద్యారణ్యులవారి ‘పంచదశి’ని చక్కగా తేలిక తేలిక పదాలతో వివరించి చెప్తూండేవాడు దానియందిష్టమున్న భక్తులకి. ఆకాశంలో 7వ ఎత్తులో గరుడుడికి నేల మీద అలా అడుగులేస్తూ నడవడం ఎంతో కష్టం కదా! అయినా అంతటి మహా పండితుడు ఇటు ఆంగ్లం అటు సంస్కృతం ఈ రెంటికీ మధ్యలో తెలుగులోనూ కూడా అయ్యుండీ. అందరికీ అర్థమయ్యే స్థాయికి దిగి ఎదుటివారికి అర్థమయ్యేంత వరకూ తాను తృప్తి చెందేవాడు కాడు. ఇలా వివరించి చెప్పడానికి దేన్నో ఆశించి ఉండటం కాదు కారణం – ఆనాటి మహనీయుల విజ్ఞానం అతిసామాన్యునికి కూడా అందాలి, అందజెయ్యాలనే తాపత్రయం మాత్రమే.సాయి వద్దకొచ్చే ఎందరో సాయిని చనువుగా పలకరించడం, అప్పుడప్పుడు వాదించి మాట్లాడటం, మరి కొందరైతే తిట్లు తినడం, ఇంకొందరైతే ఆయనకి ముందు నడవటం, కలిసి వెళ్తూ ఉండటం... వంటివి చేస్తూ ఉండేవారు గానీ ఖాపర్దే మాత్రం ఏనాడూ అలా ప్రవర్తించేవాడే కాదు సరికదా సాయి సమక్షంలో ఆయన కనీసం కూచుని కూడా ఎరుగడు– నోరు విప్పి మాట్లాడేవాడు కాదు తనంత తానుగా. సాయి మాట్లాడి ప్రశ్నిస్తే తప్ప సమాధానాన్ని కూడా ఇచ్చేవాడు కాదు. ఈయన్ని చూసే ఈయన విధానం నచ్చి క్రమంగా ఈయన గమనించిన సాయిలోని దైవత్వాన్ని గుర్తించి ‘నూల్కర్ బుట్టి’ అనే ఇద్దరూ కూడా ఖాపర్దేలాగానే ప్రవర్తిస్తూ ఉండేవారు. ఖాపర్దేనే ముగ్గురిగా మూడు రూపాలతో ఉన్నాడా? అనిపిస్తూ ‘ఉండేవాళ్లు ఖాపర్దేని చూస్తూ విజ్ఞానంలో పై స్థాయిలో ఉండే పెద్దలంతా ఓ మాటని అనుకునేవాళ్లు – వేదాలదగ్గరికి సామాన్యశబ్దాలు వెళ్లి మారు మాట్లాడలేక మౌనంగా ఎలా ఉంటాయో, అలా ఈ ముగ్గురూ సాయి సమ్ముఖంలో మౌనంగానే ఉంటూ ఉంటారు అని. ఎంత పచ్చినిజం ఆ మాటలు! లోకంలో సాధారణంగా ఎక్కడో కాని భార్యాభర్తలిద్దరూ ఒకే తీరుగా ఉండటమనేది కనిపించదు. ఈమె తీవ్ర దైవభక్తి పరురాలైతే ఆయన నాస్తికుడు కాకపోయినా అంత దైవభక్తి పరుడు కాకుండానూ లేదా ఆమె చేసేదాన్ని మరీ అంత చాదస్తమా? అనుకునే తీరుగానూ ఉంటుంటారు. చిత్రమేమంటే ఖాపర్దే సాయి పట్ల చూపుతున్న ఆ భక్తితత్పరతలోని లోతుని గమనించి ఆమె కూడా సాయి పట్ల అంత గాఢ భక్తి కలిగినదిగానూ అయిపోయింది.ఆయన మహాపండితుడైతే ఆమె చక్కని వంటకత్తె. దాంతో సాయికి ఏయే పదార్థాలు భోజనంలో రుచికరంగా ఉంటాయో ప్రతి నిత్యం గమనిస్తూ ఆ పదార్థాలనే ఆమె స్వయంగా వండి తేవడమూ, తెచ్చిన ఆ పళ్లెం మీద గుడ్డని కప్పి భక్తి పూర్వకంగా సాయికి దైవానికి సమర్పించే నైవేద్యమనుకుంటూనే ఆయన ముందుంచడమూ చేస్తూ ఉండేది.ఎందరో ఎందరెందరో ఎన్నెన్నో వంటకాలని, సాయి ఇష్టమైన భక్ష్యాలని ఫలాలని తెచ్చి వెండిపళ్లాలలో ఆయన సమ్ముఖంలో ఉంచినా, సాయి మాత్రం ఖాపర్దే భార్య తెచ్చిన పళ్లెం ఎక్కడుందా? అని ఓ క్షణం పరిశీలించి ముందుగా ఆ పళ్లెంలోని ప్రసాదాన్నే ఆరగిస్తూండేవాడు. ఒక్కోసారి సాయి తన భక్తులతో మాట్లాడుతూనో భిక్షాటనకంటూ వెళ్లి తాను తెచ్చిన ఆహారాన్ని కుక్కలకీ పక్షులకీ... ఇతర జీవులకీ వేస్తూ భోజన సమయాన్ని దాటి తినకుండా ఉంటే, ఆ సాయి భోజనాన్ని తీసుకుని తినేంతవరకూ ఈమె కూడా తింటుండేది కాదు. అంతటి దైవభావన ఆ దంపతులకి సాయి విషయంలో ఉంటూండేది. ఖాపర్దేకి కొన్ని ముఖ్యవ్యవహారాలుండి ఆయన ఒకే బిగిని 4 నెలల కంటే ఉండలేక వెళ్లవలసి వస్తూంటే, ఆయన తన భార్యని అక్కడే సాయికి భోజన సమర్పణం కోసం ఉంచేసి వెళ్లాడు. అంతటి గాఢభక్తి ఆ ఇరువురికీ. అది కూడా దైవసమాన దృష్టితో కూడిన భక్తి మాత్రమే. ఇదీ కారణం! ఎవరెవరి మనసులోని మాటల్నైనా, ఎంత దూరంలో వాళ్లు మాట్లాడుకున్నా గ్రహించగల శక్తి సాయికుందని అనేక ఉదాహరణల ద్వారా మనం తెలుసుకున్నాం. అలాంటి సాయి ఎవరిలో భక్తి ఎంత స్థాయిలో ఉందో తెలుసుకోలేడా? ఆ కారణంగా ఖాపర్దే దంపతుల భక్తిలోని లోతుదనాన్ని గ్రహించి – ఆ దంపతులకి సాధన మార్గంలో తేలికైన మార్గాన్ని ఉపదేశ రూపంగా చూపాలనుకున్నాడు. అలా అనుకున్న సమయానికి ఖాపర్దే పొరుగు ప్రదేశంలో తన కుటుంబపు పనిమీద వెళ్లి ఉండటాన్ని గ్రహించి, ముందుగా ఆమెకి సులువైన సాధనమార్గాన్ని (భగవంతుని అనుగ్రహాన్ని సాధించే పద్ధతిని) తెలియజేయాలనుకున్నాడు మనసులో.ఓ రోజు ఆమె ప్రతిరోజులాగానే సాయికి పళ్లెం నిండుగా తినుబండారాలని పట్టుకొచ్చింది! సాయికిష్టమైన పూరీ హల్వా అన్నం పప్పు పచ్చడి వడియాలూ మొదలైన పదార్థాలని పళ్లెం నిండుగా తెచ్చి సాయి ముందుంచిందో లేదో ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా సాయి ఆ పళ్లాన్ని తీసుకున్నాడు తన చేతితో. ఇవే పదార్థాలతో పాటు అటూ ఇటూగా మరికొన్ని పదార్థాలని వెండి పళ్లాలలో పట్టుకొచ్చి సాయికి మరింత దగ్గరగా ముందు వరుసలోనే పెట్టారు కొందరు.ఇన్ని పళ్లాలున్నా ఖాపర్దే భార్య తెచ్చిన పళ్లాన్ని మాత్రమే సాయి తీసుకుని భోజనాన్ని ప్రారంభించగానే సాయి భక్తుడూ అతిసన్నిహితుడూ నిరంతరం ఆయనతోనే ఉండేవాడూ ఆయన శ్యామా సాయిని ఉద్దేశించి పలుకుతూ ఏదో ప్రశ్నని అడుగదలిచినట్లుగా తన ముఖాన్ని సాయి వైపు చూస్తూ ఉంచాడు. సాయి శ్యామాని చూస్తూ – ‘ఏం అడుగదలిచా?’– వన్నట్లు కళ్లెగరేశాడు. శ్యామా నిర్భయంగా! ‘‘సాయిదేవా! దైవసమానులైన వారికి ప్రపంచ పద్ధతుల కంటే భిన్నమైన ధోరణులు కదా ఉంటాయి! ఇందరు ఇన్ని తినుబండారాలని ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి అతిపవిత్రంగా వండి తెచ్చి సమర్పిస్తూ ఉంటే అందరినీ మౌనంగా కాదంటూ ఖాపర్దే ధర్మపత్ని తెచ్చిన పళ్లాన్నే స్వీకరిస్తూ ఉన్నావు గదా! కనీసం రుచిని చూసి నచ్చలేదంటూ కొన్ని పళ్లాలని దూరంగా జరిపేసినా ఆ భక్తురాండ్రకి కొంత మానసికంగా తృప్తి ఉంటుంది గానీ, కనీసం అలా ముట్టుకోకుండా కూడా ఎంతో పరిశుభ్రత ఉట్టిపడుతూ ఉండే పళ్లాలని కూడా అలా జరిపివేస్తున్నావే! అది ఆ భక్తురాండ్ర మనసుకి గాయాన్ని కలిపించేది కాదా? అయినా అందరూ ఒక్కరే అని ప్రబోధించే నీకు ఈ వివక్షని చూపించడం సమంజసం అనిపిస్తోందా? భోజనాన్ని ఎలా ఉన్నా భిక్షాటనకి వెళ్లి తెచ్చినప్పుడు చద్ది అన్నమైనా, అది తెచ్చాక ఆ అన్నపుగిన్నెలో కాకులు కుక్కలు పిల్లులు మూతిని పెట్టి తిన్నా కూడా ఏ అసహ్యం భేదభావనా లేకుండా.. ఆరగించే నీకు ఖాపర్దేసతీమణి తెచ్చే ఆహారమే అంత ఇష్టం అవుతూ ఉండటంలో లోపలి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. నీతో బాగా చనువు ఉన్నవాణ్ని నేను కాబట్టి ఈ ప్రశ్నని ఇందరి సమక్షంలోనూ అడుగుతున్నాను. దీనిలో ఏదో పరమార్థం ఉండి ఉంటుందని భావిస్తున్నాను. నన్ను మన్నించి తెలుపరూ?’ అని అడిగాడు. ఆ సుదీర్ఘ ప్రశ్నని సాయి విని చిరునవ్వు నవ్వుతూ ‘శ్యామా! ఈమె తెస్తున్న ఆహార పదార్థాలూ ఎంతటి శ్రేష్ఠమైనవో తెలియజెప్తాను విను. ఈ జన్మలో ఖాపర్దే పండితునికి భార్యగా కనిపిస్తున్న ఈమె తన కిందటి జన్మల్లో మొదటి జన్మలో అతిసాధువూ పుష్టికలదీ ఎందరికో పాలని ఇచ్చినదీ అయిన తెల్లని ఆవు. ఒక వ్యాపారస్తుడు అప్పటి ఆమె యజమాని.తరువాత జన్మలో ఆమె ఓ తోటమాలి ఇంట్లో జన్మించింది. ఆ మీద జన్మలో క్షత్రియజాతిలో పుట్టి ఓ వర్తకునికి భార్య అయింది. ఆ మీదట జన్మలో ఓ బ్రాహ్మణవంశంలో పుట్టి పరమ ఆచారపరురాలూ సంప్రదాయ విధానం కలిగినదీ అయింది. చెప్పలేని దైవభక్తి ఆమెకి ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా అయిపోయింది. ఎంతో కాలం నుండీ ఎదురుచూస్తూ ‘ఎప్పుడు చూస్తానా?’ అనుకుంటున్న ఈమె కాస్త ఈ జన్మలో ఎక్కడో పుట్టి ఇప్పుడు షిర్డీకి వచ్చి తనని తాను నాకు చూపించుకుంటోంది. ఆశ్చర్యకరంగా ఆమె భర్త కూడా పండితుడయ్యుండీ, ఆ సంస్కృత ఆంగ్ల పాండిత్యం అలాగే అధికారమూ హోదాలేని నన్నే ఆదరించడం కూడా జరుగుతూ ఉంది. ఈ ఇద్దరిలోనూ కనిపించే ఆ భక్తీ నా పట్ల చూపుతున్న ఆ భావనా (దైవ సమానభావన) మా ముగ్గురికే తెలుస్తుంది. అందుకే ఇష్టంగా తింటున్నాను. ఈ జన్మలూ ఆ జన్మకీ జన్మకీ మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పాలంటే మరికొంత సమయం పడుతుంది గాని తృప్తిగా రెండు ముద్దల్ని నన్ను తిననీ! ఇలా ఆమె భోజనాన్ని తినడమనేది పక్షపాత బుద్ధిని చూపడం లేదా ఇతరుల్ని గాయపడేలా చేయడం అనుకోవద్దు.నా గురించి తెలియని భక్తులు కాదు వీళ్లంతా.. అంటూ మొత్తం అన్నాన్ని తినేసి తన ఆసనంలో కూర్చున్నాడు సాయి.ఇలా తననీ తన భర్తనీ అందరి సమక్షంలో సాయి అంతగా ప్రశంసించినా ఆమెలో ఏవిధమైన గర్వమూ కళ్లలో మెరుపూ అందరికంటే తానెక్కువ అనే భావంతో కనిపించాల్సిన నవ్వూ... ఏమీ లేనే లేవు. ఎవరి గురించో తానువింటున్నట్లుగా ఓ నది సముద్రంలో చెప్పలేనంత జలంతో వచ్చి కలిసినా సముద్రంలో ఏ మాత్రపు పెరుగుదలా లేకుండా గంభీరంగా యథాపూర్వంగానే (పూర్వం ఎలా ఉందో అలానే) ఉండిపోయింది. అది అందరికీ విస్మయాన్ని కలిగించింది.వాక్కు ద్వారా శక్తిపాతంసాయి అలా ఆసనంలో కూర్చున్నాడో లేదో ఆమె సాయి పాదాలని మృదువుగా నొక్కసాగింది. అలా తన పాదాలని మర్దన చేస్తున్న ఆమె చేతులని తాను తన చేతులతో గ్రహిస్తూ... ‘తల్లీ! ఓ మంత్రాన్నిజపించు’– అంటూ ‘రాజారామ్– రాజారామ్– రాజారామ్.. అంటూ ముమ్మారు అతిమంద్రంగా ఆమెకి ఉపదేశించాడు. ఇదేనమ్మా నువ్వు నిత్యం జపించాల్సిన మంత్రం! అంటూ ఆమె కళ్లలోకి ఆర్థ్రంగా చూశాడు. ‘దేవా!’ అని ఆమె అంటూంటే.. నీ జీవిత పరమార్థం నెరవేరేది ఈ మంత్రంతోనే. మీ దంపతులకి శ్రేయస్సు కలుగుతుంది’ అని ముగించాడు సాయి. వాక్ శక్తిపాతం చేశాడన్నమాట సాయి.శక్తిపాతమంటే..?ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి నీరు పల్లంగా ఉన్న ప్రదేశంలో పడ్డట్టుగా ఉదాత్త తపశ్శక్తి ఉన్న మహనీయుని నుంచి ఆయన ఆర్జించిన తపశ్శక్తిలోని ఓ కొంత(ఈ తపశ్శక్తిని ఎంత నిష్ఠతో ఇష్టంతో మనఃపూర్వకంగా గ్రహించగల శక్తి ఉన్న వ్యక్తి ఉన్నాడో అతనికి అంత మాత్రమే లభించడం శక్తిపాతం ద్వారా లభిస్తుంది.ఒక సామాన్యశక్తిమంతుడు నిరంతర వ్యాయామం ద్వారా ఎంత బలవంతుడు తన అభ్యాసానికి అనుగుణంగా కాగలుగుతాడో అలా శక్తి పాతమనేది కూడా సాధకుని భక్తితత్పరతకి అనుగుణంగానే ఉంటుంది. ఖాపర్దే భార్య ఇలా భక్తిశ్రద్ధలతో సాయిని కేవలం ఓ సాధకునిగా లేదా సిద్ధునిగా లేదా తమ కోరికలని తీర్చే మహనీయునిగా కాక ఓ దైవంలానే నిరంతరం భావించింది కాబట్టి, సాయి కూడా తనలో దృష్టితో ఆమెని అంతటి నిరంతర సాధకురాలిగా గుర్తించాడు కాబట్టీ ఆమెకి తన వాక్కు ద్వారా తన తపశ్శక్తిని శక్తిపాతరూపంగా అందజేశాడు.అంతేకాదు. ‘తల్లీ! నా శక్తిపాతం ద్వారా శక్తి మంతురాలివైన నువ్వు చేయాల్సింది ‘నా నామజపం కాదు– రాజారామ్– అనే మంత్రంతో ఆ రామచంద్రుడ్ని మాత్రమే’ అని మౌనంగా తెలియజేశాడు కూడా.స్వాములవారు సమీపానికి భక్తులు వెళ్లడం మంత్రోపదేశాన్ని పొందటం, మళ్లీ మరొకరి వద్దకి వెళ్లడం కొంతకాలమయ్యాక మరొకరి వద్దకి వెళ్లి ఉపదేశం తీసుకుందామనే ఆలోచనతో ఉండటం ఎంత సరికాదో, గురువుని మెప్పించి శక్తిపాతం ద్వారా మంత్రోపదేశాన్ని పొందటం ఎంత సరైనదో పరోక్షంగా తెలియజేశాడు సాయి ఈ సంఘటన ద్వారా. ఆయన ‘మూర్తీభవించిన దైవం’ అనే దృష్టితో సేవించింది కాబట్టే ఆమెకి మంత్రాన్ని పొందడం సాధ్యమైంది. ‘నాకు మోక్షవిద్య కావాలి! అందుకే వచ్చాను....’ – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
ఆత్మహత్య ఆలోచనలా? షిర్డీకి వచ్చేయ్!
ఏ సంఘటనని సాయి జీవితంలో దర్శించినా అది మూఢవిశ్వాసమనీ, హేతువాదానికి నిలవనే నిలవదనీ అనుకోనే అక్కర్లేదు. లో–పరిశీలించి చూస్తే తప్పక అందులో యదార్థత దాంతో పాటు సాయిని విశ్వసించి తీరాలనే దృఢబుద్ధీ కలుగుతాయి పాఠకులకీ, శ్రోతలకీ కూడా. ఈ నేపథ్యంలో సాయికున్న సమాన –వ్యాన వాయువుల మీద ఉన్న అధికారాన్ని గమనించుకుని పై శీర్షికకి సంబంధించిన– జరిగిన కథని వివరించుకుని ఆనందిద్దాం! ‘కాయస్థ’ అనే ఒక కులానికి చెందిన స్త్రీ ఉండేది. గర్భవతి కథ ఆమెకి ప్రతి కాన్పూ తీవ్రమైన ప్రాణాంతక స్థితిని గుర్తుచేస్తూ ఉండేది. దాంతో భయపడిన ఆ దంపతులు శ్రీరాం మారుతి అనే బాబాకి సన్నిహితుడైన ప్రముఖుణ్ణి కలిస్తే ఆయన ఈ దంపతుల్ని సాయి వద్దే ప్రసవం రోజుల్లో ఉండవలసిందని సూచించాడు. వాళ్లు అలాగే సాయి పూజని చేస్తూ షిర్డీలోనే ఉండిపోయారు. ఇక ప్రసవం కాబోతుందనగా ఆమె గర్భంలోని శిశువు అడ్డం తిరిగి యథా పూర్వంలా తల్లి ప్రాణాన్ని బలిగొనే స్థితిని కల్గించేసింది. సాయిధ్యానాన్నే చేస్తూ ఆ గర్భవతి ఉండగా, ఇతర భక్తులందరూ కూడా ఈమె కోసం ధ్యానాన్ని కొనసాగిస్తుండగా.. ఆమె ‘ప్రసవించింది’ అయితే పుట్టిన బిడ్డ మరణించింది. ఏ ఒక్కరూ కూడా ‘సాయి ఏం చేయగలిగాడు?’ అని నిందించలేదు, పరోక్షంగా– కుతర్కాన్నీ చేయలేదు. పైగా సాయి రక్షించడం బట్టే పెద్ద ప్రాణం(తల్లిప్రాణాలు) రక్షింపబడిందనే అన్నారు. సాయికి సమానవాయువు మీద (బొడ్డు భాగంలో ఉంటూ గర్భవతుల ఆహారసారాన్ని బొడ్డుతాడు ద్వారా సంతానానికి పంపుతూండే వాయువూ ఆధిపత్యం ఉంది కాబట్టే ఇలా సుఖ ప్రసవమయిందనే అనుకున్నారు. ఆ శిశువు శరీరంలో వ్యానవాయువు (శరీరంలో ఎక్కడెక్కడ ఏయే వాయుశాతం తగ్గిందో ఆ వాయువుని అక్కడికక్కడే అప్పటికప్పుడే నింపగల శక్తి ఉన్న వాయువు) సర్వ అవయవాల్లోకీ ప్రవహిస్తూ చరించలేదని తెలిసిన సాయి ఆ శిశువు మృతిపట్ల ఏవిధమైన బాధని పడనేలేదు. దానికి కారణం సాయికి వ్యానవాయువు మీద ఆధిపత్య శక్తీ, అలాగే అదే శిశువుకి ఉండాల్సినంత ప్రాణవాయు శక్తి లేక మరణిస్తుందనే భవిష్యత్కాలాన్ని తెలుసుకోగల శక్తీ ఉండటమే! ఆత్మహత్యా ఆలోచన గోపాల్(నారాయణ్ అంబడేకర్) అనే ఓ భక్తుడు పూనా(పూణే)లో ఉంటుండేవాడు. ప్రభుత్వోద్యోగం చేసి పదవీ విశ్రాంతిని పొందాడు(రిటైర్మెంట్). దాంతో అతనికి ఏమి తోచనట్లయింది. ఏం చేయాలో పాలుపోయేది కాదు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి నాలుగురాళ్లు సంపాదించుకుందామనుకున్నా తాను చేసింది ఎక్సైజ్ ఉద్యోగం అయ్యేసరికి (మద్యాన్ని అమ్మించడం–అక్రమ మద్యాన్ని పట్టుకుని శిక్ష విధించడం) ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇదిలా ఉంటే అతను క్రమంగా దురదృష్టం పాలు కాసాగాడు. ఎందరి ద్వారానో.. ఏ తీరు ఉద్యోగమైనా సరే చేయగలనని అందరికీ సమాచారాన్ని పంపాడు గానీ ఏ ఒక్కరూ కూడా ఇతనికి సరిపడిన ఉద్యోగం తమ వద్ద లేనేలేదంటూ తిరస్కరించారు. దిక్కుతోచని దశలో ఆర్థికంగా కూరుకుపోతున్న స్థితిలో కూడా ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్లడాన్ని మానేవాడు కాదు. అయినా ఏ తీరుగానూ అతని పరిస్థితి పైకి వెళ్లిన సందర్భమే లేకపోయింది. సాయికి తన కష్టాన్ని విన్పించుకునేవాడు వెళ్లిన ప్రతిసారీ. సాయి అతని కథని విని మౌనంగా ఉండేవాడే తప్ప ఏమీ మాట్లాడే వాడే కాదు. దాంతో తనలో తానే తన దురదృష్టాన్ని నిందించుకుంటూ విపరీతంగా ఆలోచిస్తూ ఎంతసేపో మౌనంగా ఉంటూ కాలాన్ని గడుపుతుండేవాడు. తన ఆలోచనలు ఇలా సాగాయి. ఎండవేడిమికి తట్టుకోలేక చల్లని నీడనిస్తున్న చెట్టునీడన చేరితే ఆ చెట్టుమీద మండే ఓ పసిరికపాము తలనపడితే ఎలా భయంతో వణికిపోతామో, ఏ చెట్టు నీడనీ ఆశ్రయించడానికి భయపడిపోతామో అలా అయింది అతని స్థితి. సాయిని ఆశ్రయించినా మార్పు రాలేదని బాధపడ్డాడు.అర్ధరాత్రివేళ ఇంట్లోకి దొంగ వచ్చి కత్తి చూపి భయపెడుతూంటే అకస్మాత్తుగా తలుపులో నుండి పారిపోయి మరో ఇంటివాళ్లని లేపబోతుంటే అక్కడే దొంగలు తనని పట్టుకుని కట్టేసినట్టయింది అతని దుర్దశ. సాయిని చేరినా మార్పు రానేలేదని మనోవ్య«థ పడ్డాడు. దైవం తప్ప రక్షించే వాడెవరున్నారు? అనే దృఢ విశ్వాసంతో దేవాలయంలోకి కంగారుగా ప్రవేశిస్తే ఆ గుడిలోని గంటే తలకి బలంగా కొట్టుకుని మూర్ఛపోయేంత స్థితిని కల్పించినట్టయింది అతని పరిస్థితి. సాయిని సేవించినా పరివర్తన(పరిస్థితిలో మార్పు) లేనేలేదని తీవ్రమైన అశాంతికి లోనయ్యాడు.ఎదురుగా వస్తున్న పులిని గమనించి పులి నోట్లో పడకుండా తప్పించుకున్న గోవు ‘బతికాను జీవుడా!’ అని మనశ్శాంతితో ఉండబోతే ఎదురుగా నిలుచున్న కటికవాడు బలంగా తన కొమ్ముల్ని పట్టి ముకుతాడుని చేత్తో పట్టుకుని వధ్యశాలకి తీసుకుపోతున్నట్లనిపించింది తనకి. సాయిసేవని చేసినా ఆరాధించినా కూడా తనకి ఏమాత్రమూ తోవ దొరకలేదని ఎంతో అలజడికీ అశాంతికీ గురి అయ్యాడు. ఇన్నీ ఆలోచనలని చేసి చేసి–కుటుంబానికి తానేమీ చేయలేని స్థితికొచ్చేసానని గమనించి, అండగా నిలిచే వాళ్లెవరూ లేరనే నిర్ధారణకొచ్చి– ఆ సమస్యకి పరిష్కారం కేవలం ఆత్మహత్య మాత్రమేననే స్థిరాభిప్రాయానికి వచ్చేసాడు. గోపాల్ నారాయణ్ కుటుంబం మొత్తాన్ని షిర్డీకి మార్చేసాడు. అయితే తనలో అభిప్రాయాన్ని ఏ ఒక్కరికీ కూడా చెప్పనేలేదు.ఏ రోజూ ఆత్మహత్యకి ఏది తేలికైన మార్గం? ఎలా బాధని అనుభవించకుండా క్షణంలో ప్రాణాన్ని తీసేసుకోవాలి? అంతే కాదు ఒకసారంటూ ఆత్మహత్యకి ప్రయత్నించి కార్యరంగంలోకి దూకాక ఆ ప్రయత్నం విఫలమై మళ్లీ జీవించవలసి వస్తే– ఇటు ప్రతిష్టాపోతుంది, మరోసారి ఆ ప్రయత్నం చేయవీలుకాదు. కనీసం ఆత్మహత్యని చేసుకోవడంలో కూడా ఓడిపోయాడనే మాట మిగిలిపోతుంది తనకి– అని ఈ తీరుగా మార్గాలను అన్వేషిస్తూ ఉండిపోయాడు. అంతే! అతనికో మంచి ఆలోచన తాననుకున్న పనిని ఏ ఒక్కరూ గుర్తించవీల్లేని ఆలోచన– తాను పడుతున్న కడగండ్లనీ– కష్టాలనీ– భవలోక బంధాలనీ క్షణంలో తీర్చేసుకోగల ఆలోచన– తన కొచ్చింది. అదే! బావిలోకి దూకి ఆత్మహత్యని చేసేసుకోవడమనే ఆలోచన! ముసురుకున్న ఊహలు ఆత్మహత్య అనుకోగానే ఎన్నో ఆలోచనలు రాసాగాయి గోపాల్‌కి. మనని నమ్ముకుని వచ్చిన పంచప్రాణాలనీ అలా ఉంచేసి అకస్మాత్తుగా ప్రాణాలని బలవంతాన తీసుకోవడం ఏమంత సబబు? చుట్టాలందర్నీ పిలిచి–ఇప్పుడే వస్తానని చెప్పి అకస్మాత్తుగా యజమాని ఎటో వెళ్లిపోతే వచ్చిన చుట్టాలంతా ఏమనుకుంటారు? అసలు ఆ కాడికి చుట్టాలని పిలవడం దేనికి? ఈ పంచప్రాణాలూ మనల్ని నమ్ముకుని వచ్చిన చుట్టాలవంటివే కదా! అనేది ఒక ఊహ! వీటిని కాదని వెళ్లిపోవడం ధర్మమా? నిజమే! కష్టం వచ్చింది! ఇంతకంటే కష్టపడ్డవాళ్లెందరు లేరు? ఓ ద్రౌపది నిండు సభలో హస్తినాపుర ప్రజలు రాజులు సామంతులు...ఇలా ఎందరో చూస్తుండగా, తనని రక్షించవలసిన బాధ్యతా ధర్మమూ ఉన్న భీష్మ ద్రోణ కృప బాహ్లిక సోమదత్త భూరిశ్రవసులు మొదలైన వృద్ధులందరూ ఉండగా వస్త్రాపహరణమంత దుఃఖం అందునా ఏక వస్త్రకాలంలో (స్త్రీ అశుచిగా నెలకోసారి ఉండే 3 రోజుల్లో మొదటిరోజు సమయంలో) జరిగినా ఆమె దానిని తట్టుకుని తననెవరు అలా స్థాయిని దిగజార్చి పరువూ ప్రతిష్ఠ పోయేలా చేసారో, తనకే కాక తన భర్తలందరికీ అపకీర్తి కలగజేసారో, ఎవరు ఆ సమయంలో తమకేం పట్టనట్టుగా ఉంటూ మౌనసాక్షులుగా ఉండిపోయారో ఆ అందర్నీ కురుక్షేత్రమనే పేరున్న యుద్ధంలో సమూలంగా వధించలేదూ? అది కాదు చేయవలసిన కర్తవ్యం!? అనే మరో ఊహ కలిగింది గోపాల్‌కి. అయినా మళ్లీ తనకి పూర్వజన్మ సుకృతం కారణంగా ఉద్యోగం ఎప్పుడొస్తుందనీ –తన భార్య పుత్రుల్ని జాగ్రత్తగా చూసుకోగలననీ బాగా ఆలోచించాడు తనకి తాను. ఏ అంతూ పొంతూ దొరికే వీలే కనిపించలేదు. ఇంతగా ఆలోచించాక– ఇక లాభం లేదు, చర్చించుకుంటూ కూచుంటే కర్తవ్యం దెబ్బతింటుంది! తాననుకున్న కార్యాన్ని నెరవేర్చుకున్న వాడూ తాను కాలేడని ఆలోచించి ఎవరూ చూడని సమయంలో టక్కున ఆ పాడుబడ్డ బావిలోనికి దూకెయ్యాలనే నిశ్చయానికొచ్చేసాడు గోపాల్. మంచి విద్వాంసుడులా గ్రంథకర్తా వేదాంత ప్రశ్నలని అందరికీ అర్థమయ్యేంత దిగువస్థాయికి వచ్చి మరీ సమాధానాన్ని వివరించ గల శక్తిమంతుడు అయిన గోపాల్ ఆ బావిలోనికి దూకడమనే అకృత్యానికి పాల్పడరాదని నిశ్చయించుకున్నాడు మరుక్షణంలో.ఇలా తర్జనభర్జనలతో ఊçహాపోహలతో తలకిందులౌతున్న గోపాల్ –ఇక ఆలస్యం చేయకూడదంటూ నిశ్చయించుకుని పాడుబడ్డ బావిలో దూకడానికే నిశ్చయించుకున్నాడు కూడా. ఇలా ఊగిసలాటలో ఉన్న గోపాల్ అకస్మాత్తుగానూ శీఘ్రంగానూ తాననుకున్న పనిని చేయదలిచి కొత్త ఆలోచనలని రానీయకుండా దృఢమైన నిర్ణయాన్ని చనిపోవడానికే తీసుకుని దానికి కావలసిన ఏర్పాట్లు ఏమిటా? అనే ఆలోచనలో పడ్డాడు. ఇది చదివావా? గోపాల్ ఇంటికి కొంత సమీపంలో వ్యాపారుల అంగడులున్నాయి! ఆ ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే సగుణ్(మేరు నాయక్) ఇల్లు ఉంది. ఆయన భోజనశాలకి అధిపతి. అప్పగించిన పనిని శ్రద్ధతో చేస్తూ పరమధర్మబద్ధంగా ఉండే వ్యక్తి సగుణ్.అంతలో గోపాల్ ఇంటికి సగుణ్ వచ్చాడు. తనకు తానుగా ఆశ్చర్యమయింది గోపాల్‌కి. ‘గోపాల్! మాంచి పుస్తకాన్నిస్తాను చదువుతావా?’ అనడిగాడు సగుణ్. ‘ఓ! తప్పక’ అంటూ ఆనందంగా ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు గోపాల్.వెంటనే పుస్తకంలో అలా పుటలని తిప్పుతూ ఒక పుట దగ్గర ఆగిపోయాడు. అక్కడ పుటల్లో ఇలా ఉంది! అక్కల్ కోట్ మహారాజును తీవ్రంగా సేవిస్తూ ఉండే ఒక భక్తుడుండేవాడు! అతడికి ఆ అక్కల్ కోట్ మహారాజే సర్వస్వం. అలా ఉంటున్న కాలంలో తీవ్రమైన రోగం వచ్చింది ఆయనకి. ఎవరెవరో ఎందరెందరో వైద్యాన్ని ప్రారంభించారు. ఆ వ్యాధికి తగ్గుముఖం పడుతుందనే నమ్మకం తమకి లేదనే విషయాన్ని వైద్యులే చెప్పారు. అంతే! ఆ భక్తునికి ఓ ఆలోచన వచ్చింది! తాను జీవించి ఉన్నందుకు ఒకరి కష్టాన్ని తాను ఎంతగా తీర్చగలనా అని ఆలోచించాడు. ఏమాత్రమూ సహాయపడలేదనే నిర్ధారణకి వచ్చేసాడు ఆ భక్తుడు. దాంతో తానెవరికీ సహాయపడలేదు– తన కొచ్చిన వ్యాధిని తగ్గించుకోగల శక్తిమంతుడు కాదు. ఇలాంటప్పుడు జీవించి ఏం ప్రయోజనం? అనే ఆలోచనకొచ్చి చావు మాత్రమే శరణ్యమనుకున్నాడా భక్తుడు అని అనిపించింది ఆ సందర్భంలో.సరిగ్గా తనకి ప్రతిబింబాన్ని చూస్తున్నట్లుగా అన్పించింది. అంతే! ఆ భక్తుడు తీవ్ర నిరాశతో బావిలో దూకెయ్యకనే దూకేసాడని ఉంది! వెంటనే అక్కల్ కోట్ మహారాజే అక్కడి కొచ్చి ప్రాణాపాయం నుండి రక్షించాడు. రక్షించాక అన్నాడు–! ‘భక్తుడా! ఆత్మహత్య చేసుకోవాలనే ఈ దురదృష్టకర ఆలోచన రావడంలో నీ తప్పు లేదు సుమా! ప్రారబ్ధ రీత్యా మనం అనుభవించవలసిన బాధలు ఏమున్నాయో వాటిని సాక్షాత్తు ఆ దైవమైనా సరే ఈ భూమిలో గాని జన్మించి ఉంటే అనుభవించక తప్పదు. ఆ కర్మల ఫలితాన్ని తప్పక అనుభవించాల్సిందే. ఆ పాపాల ఫలితాన్ని అనుభవించకుండా దాచుకోవడమో, జాగ్రత్త పడడమో చేయదలిస్తే... మరింత పాపఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇంకా పాపాల సంఖ్య తీవ్రత పెరిగినట్లయితే మరో జన్మని కూడా ఎత్తవలసి ఉంటుంది. ఇప్పుడే కష్టాన్ని దాటలేక నూతిలోపడి ఆత్మహత్య చేసుకుంటే కచ్చితంగా రాబోయే పాపఫలితాన్ని అనుభవించక తప్పదు. అందుచేత కష్టాలని భరించక తప్పదు. ఆత్మహత్య అనేది పిరికి పందలు– దద్దమ్మలు చేసే పని. దాన్ని ఓ సంచలనాత్మక వార్తగా పదిమందికీ ప్రచారం చేస్తే గనుక ఆ ఆత్మహత్యల కథా చరిత్ర అలా సాగుతూనే ఉంటుంది! కాబట్టి ఆత్మహత్య అనేది ఏమాత్రమూ సరికాదనే నిశ్చయజ్ఞానం కలిగింది. అక్కల్ కోట్ మహారాజ్ గారి ద్వారా వెంటనే గోపాల్ సాయి మసీదు కెళ్లి పాదాలమీద పడి వెక్కి వెక్కి చిన్నపిల్లవానిలా ఏడ్చాడు.సాయిలో ఉన్న గొప్పదనమేమంటే తన వద్ద కొచ్చిన ఎవరైనా ప్రారంభించి తమ విశేషాలని చెప్తూంటే– తల్లి మాటలని పిల్లవాడు శ్రద్ధగా ఆలకించినట్లు వినేవాడు తప్ప, మధ్య మధ్యలో ప్రశ్నించడం చేసేవాడు కాదు. అందుకే గోపాల్ బాధనంతా సాయి చూసి చూసి స్పష్టంగా అతని ఆత్మహత్య ఆలోచనను పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిందని తెలిసి అప్పుడు మాట్లాడడం ప్రారంభించి ‘గోపాల్! వచ్చిన ఆలోచనని వచ్చినట్లుగానే అమలు చేసెయ్యకూడదు. ఆలోచించగలగాలి తరువాత ఏమౌతుందో అని! అన్నాడు.గోపాల్ మరో మారు తీవ్రంగా తన కన్నీటితో తన మనోబాధని వ్యక్తీకరించి ఆత్మహత్య మహాపాతకమని తేల్చి ఆత్మహత్యా ఆలోచననే గాని ఎవరికి వచ్చినా షిర్డీకి గాని వస్తే పూర్తిగా ఆలోచన తొలగి పోతుందని తన అనుభవంతో చెప్పాడు. ఇది ఎంత దివ్య ఔషధమో కదా. ‘సాయికి శ్రీ విష్ణు సహస్రనామం చాలా ఇష్టమా? ఎందుకు? – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు
శ్రీనివాస్‌సాయి, ప్రియ వడ్లమాని, దీక్ష శర్మ రైనా, ఇర్ఫాన్, సింధు, తిరువీర్, వంశీరాజ్, మోనాబేద్రె, అప్పాజి అంబరీష ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘శుభలేఖ+లు’. శరత్ నర్వాడే దర్శకత్వంలో విద్యాసాగర్,జనార్ధన్ ఆర్.ఆర్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతోంది. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రం ప్రపంచవ్యాప్త విడుదల హక్కులను దక్కించుకున్నారు. ఈ సినిమా రెండో ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇటీవల విడుదలైన మా సినిమా ట్రైలర్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్లోనూ మా చిత్రంపై ఆసక్తి నెలకొంది. ట్రైలర్, టీజర్ చూసిన ఇండస్ట్రీలోని పెద్దలు మా యూనిట్‌కి పాజి టివ్ ఎనర్జీని అందిస్తున్నారు. ఇంతమంది ప్రముఖుల ఆదరణ మా సినిమాకి లభించడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.యం.రాధాకృష్ణన్, కెమెరా: యస్.మురళీమోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మేనేజర్: సూర్యనారాయణ కరుటూరి. -
సాయి తేజ స్వరూపం
ఏదీ తగిన ప్రమాణం ఆధారం లేకుండా దీన్ని మీరు నమ్మి తీరాల్సిందే! అనే తీరు ధోరణి సాయి చరిత్రలో కనిపించనే కనిపించదు. ఆ దృష్టితోనే అలాంటి సాక్ష్యాలతో కూడిన సంఘటనలతో సాయి.. ఈ అనంత పృథ్వినీ జలాన్నీ తన అధీనంలోకి వినయంతో.. భక్తితో.. గౌరవంతో మాత్రమే... తెచ్చుకోగలిగాడని నిరూపించుకుని తెలుసుకున్నాం. ఈ క్రమంలో తేజస్సు అనే పంచభూతాల్లోని మూడవదాన్ని ఎలా అదుపులోనికి తెచ్చుకోగలిగాడో చూద్దాం! శాంతించు! ప్రతిరోజూ మసీదులో ఉన్న ధుని(అగ్నిహోత్రస్థలం)లో భక్తులు తెచ్చిన కట్టెలని వేస్తూనే ఉండేవాడు సాయి. భక్తులు కూడా ధునికి ప్రదక్షిణాన్ని చేస్తూ భక్తి గౌరవ ప్రపత్తులతో కట్టెలని వేస్తూ ఉండేవారు. ఆ అగ్నిహోత్ర కార్యక్రమం చూడటానికి నయన మనోహరంగా ఉంటూ ఉండేది. కేవలం కట్టెల్ని తగలబెట్టడం దీని లక్ష్యం కాదనీ, మన పూర్వజన్మపాపకర్మలని అగ్నిలో ఎవరికి వారు దహించివేసుకోవడమనేది దీని లక్ష్యమనీ సాయి భక్తులందరికీ బోధ చేస్తూ ఉండేవారు వివరంగా. అయితే కిందిస్థాయి పామరునికి కూడా అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. దాంతో విశేషసంఖ్యలో భక్తులొస్తూ నిత్యం ధుని కార్యక్రమాన్ని చేస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఓ వేసవి కాలంలో.. అందునా మిట్ట మధ్యాహ్నపువేళ ధునిలో కట్టెల్ని అందరూ క్రమంగా వేస్తూ ఉంటే మంటలు మరింత అయ్యాయి. కొద్ది ఎత్తు తక్కువగా ఉన్న ఆ మసీదులో దూలాలు కొద్ది కిందుగానే ఉన్న కారణంగా ఎక్కడ ఆ మంటలు ఆ దూలాలకి అంటుకుని ఏ ఉపద్రవాన్ని తెచ్చిపెడతాయోనని భక్తులు కట్టెలని వేయడం తగ్గించారు. ఓ దశలో మానేసారు కూడా. అందరి దృష్టి పూర్తిగా అగ్నికారణంగా మసీదు పైకప్పుకి మంటలు వ్యాపిస్తాయేమోననే ఆలోచనతో ఉండిపోయింది గానీ, దాదాపుగా ఆధ్యాత్మిక భావం ఎవరిలోనూ లేదు. పోనీ ఆ దశలో సాయి కూడా వెనక్కితగ్గచ్చుగా కర్రలని ధునిలో వేయకుండా. ఆయన కట్టెలని ఎగదోస్తూ కర్రలని వేస్తూ ఇంకా అగ్నిహోత్రం విజృంభించేలానే చేస్తూ ఉండటం భక్తులందరికీ ఆవేదనని కలిగించింది. ఆయనతో మాట్లాడలేక.. పరిస్థితిని వివరించలేక.. ఒక పక్క కొన్ని నీటి బిందెలని సిద్ధం చేసారు. మరో పక్క కట్టెలమోపులోని కట్టెలని కొన్నింటిని పక్కకి జరిపేసారు. ఇంతలో సాయి ఆ ధునిలోని అగ్ని జ్వాలలని గమనించి మరింత ఎత్తుగా మసీదులోపలి కప్పుకి అగ్ని అంటుకోబోతోందని గ్రహించి భక్తులతో ఆ నీటిబిందెలని తేవలసిందని అనలేదు. అగ్నిని చూస్తూ తన చేతిలోని సటకాతో ఆ పక్కనున్న స్తంభం మీద కొడుతూ.. ‘‘అగ్నిదేవా! శాంతించు! శాంతించు!! దిగిపో! దిగు! దిగు!!’’ అనడం మొదలెట్టాడు. సటకాతో కొట్టిన ఒక్కొక్క దెబ్బకి కొంచెం కొంచెం తప్పున జ్వాల తగ్గుతూ తగ్గుతూ మొత్తం అగ్ని శాంతించింది. భక్తుల ఆశ్చర్యానికి అవధి లేదు. కట్టెలని తగ్గించుకుండానూ, ఏ నీళ్లో పోయకుండానూ మంటలు అదుపులోకి రావడమంటే సామాన్య విషయమా? ఈ కారణంగా సాయి.. అగ్నిత (తేజస్సు నిప్పు)ని కూడా తన అదుపులో ఉంచుకోగలగాడని అర్థమయింది భక్తులకి. దైవశక్తి విజృంభించిన వేళ మనుష్యశక్తి (నీళ్లు పోయడం.. కట్టెల్ని తగ్గించడం..) ఏ విధంగానూ ప్రయోజనపడదని దీని ద్వారా గ్రహించాలి. ఇంతకీ అగ్ని సాయికి ఎందుకు అధీనుడై ఉన్నాడో మరో సంఘటనని కూడా తెలుసుకున్నాక వివరించుకుందాం! వేడి వంటపాత్రలో చేయిపెట్టి.... చక్కగా వెలుగుతున్న దీపంలో ఎక్కడా చీకటి అనేది ఎలా కనిపించదో... బాగా తృప్తిగా భోజనం చేసిన వ్యక్తిలో ఎలా ఆకలి అనేది మచ్చుకైనా ఉండదో... అలా సాయి చేసే ఏ చేష్టలోనూ ఏ దోషమూ ఉండదు సరికదా! నేర్చుకోవలసిన అంశమే ఉండి తీరుతుంది. తాను భోజనాన్ని చేయడం కంటే పదిమందికి అన్నాన్ని పెట్టడంలో చెప్పలేని తృప్తినీ, ఆనందాన్నీ పొందుతూ ఉండేవాడు సాయి. భోజనాన్ని పెట్టడంలో కూడా ముందుగా కుంటి, గుడ్డి, కుష్ఠిరోగస్థులూ, ఇతర రోగులూ, అతి వృద్ధాప్యం కారణంగా ఆకలికి ఆగలేనివారూ, అంగవికలురూ ఉంటే వారికి పెట్టేవాడు. ఆ మీదట మాత్రమే అందరికీ భోజనం. ఎప్పుడూ ఒక్కడే దొంగలాగా తినరాదంటూ ఉండేవాడు. పశుపక్షి, క్రిమికీటకాలకి ఓ సమయమంటూ ఉండదు కాబట్టి ఎప్పుడూ వాటికి ఆహారాన్ని ఓ స్థలంలో వేస్తూనే ఉండాలంటూ ఉండేవాడు. సాయి వద్ద రెండే రెండు వంటపాత్రలుండేవి. ఒకటి వందమందికి ఆహారాన్ని వండగలిగేదీ.. మరోటి 50 మందికి సరిపోయేలా వండగలిగేదీను. ఎప్పుడూ భక్తజనుల సంఖ్యని గమనించి తానే వండి వడ్డించేవాడు. దాంట్లో అపరిమితానందాన్ని పొందుతుండేవాడు. ఇలా ఉండగా ఓ సారి దాదాకేల్కర్ అనే తన భక్తుడ్ని పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికిందో లేదో పరీక్షించి చెప్పు అన్నాడు. జాతికి బ్రాహ్మణుడైన కేల్కర్ ఆ పలావు గిన్నె మూతని కూడా తీయడానికి ఇష్టం లేనివాడౌతూ.. సాయి దగ్గరకొచ్చి బాగానే ఉందని సమధానం చెప్పాడు. దాంతో సాయి నవ్వుతూ.. ‘‘మూత తీయలేదు. వాసన చూడలేదు. దాని పదునుని పరిశీలించలేదు. నాలుకతో రుచి చూడలేదు. ఎలా బావుందని చెప్పావు?’’ అంటూ కేల్కర్ ఎందుకు చూడలేదో గమనించి మరోమారు నవ్వుకున్నాడు.వెంటనే తనకి తానే ఆ మరుగుతున్న పలావు డేగిసాలో తెడ్డు పెట్టకుండా తన చేతినే పెట్టి కలయదిప్పుతూ.. ఇప్పుడు డేగిసాలోని పదార్థాలన్నీ ఒకటికొకటి కలిసి మంచి రుచిని ఇయ్యబోతున్నాయనడమే కాకుండా కేల్కర్ చేతిని పట్టుకుని డేగిసాలో పెట్టించాడు కూడా. ఏ విధంగానూ ఇద్దరి చేతులూ కాలకపోవడాన్ని గమనించిన భక్తజనమంతా ఆశ్చర్యపడ్డారు.కేల్కర్ బ్రాహ్మణత్వాన్ని కించపరచడం సాయి లక్ష్యమే కాదు. మరోమారు ఆ విశేషాన్ని గమనిద్దాం! ఈ సంఘటనలో అగ్ని సాయికి అధీనుడై ఏ మాత్రమూ గాయపరచలేదు. సాయినే కాదు కేల్కర్‌ను కూడా. అగ్ని ఎందుకు సాయికి సహకరిస్తూ సాయికి అధీనుడయ్యాడో తెలుసుకోబోయే ముందు అగ్ని బాధకి సాయి గురైన ఓ సంఘటనని కూడా తెలుసుకోవాల్సి ఉంది. కాలిన చేతితో సాయి ఓ సంవత్సరంలో అది దీపావళి రోజు. సాయికి పరమభక్తులైన మాధవరావు, దేశపాండే, తాత్యా మొదలైన ఎందరో సాయి చుట్టూ ఉన్నారు. సాయి ఆ ధునిలో కట్టెలని చేతితో పైకి ఎగదోస్తూ ‘అల్లాహ్ హో మాలిక్’ (అల్లాయే నిజమైన నా యజమాని) అంటూ పరవశించిపోతూ ధునిని ప్రజ్వరిల్లజేస్తూ ఉన్నాడు. అందరూ చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా తన చేతిని తానే ఆ మంటలో పెట్టి క్షణకాలంలో పైకితీసుకున్నాడు. కణకణమండే ఆ కట్టెల మంటకి సాయి చేయి కాలింది. నల్లగా కమిలిపోయింది.సాయి మాత్రం ఏ మాత్రపు బాధా లేకుండా ఉంటే.. మాధవురావు మాత్రం గట్టిగా కేకలు వేస్తూ.. ‘‘బాబా! ఏమిటీ పని? అగ్నిహోత్రానికి నీ చేతిని కానుకగా ఇయ్యలనుకున్నావా? మా భక్తుల పరిస్థితిని గమనించవా?..’’ అని అరుస్తూ ఉన్నాడు. భక్తులందరికీ ఏమీ తోచలేదు.సాయి నిదానంగా.. ‘మాధవరావూ! ఏ ప్రమాదమూ లేదయ్యా! నా చేతికి నిప్పు అంటుకుని గాయమైన ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. లేని పక్షంలో మాడి మసి అయిపోయేవాడు’ అన్నాడు. ఎవరికీ ఏమీ అర్థం కాకపోతే సాయే వివరించాడు వృత్తాంతాన్ని. ‘‘ఇనుప పనిని చూస్తూ ఇనుప వస్తువులని తయారు చేసే కమ్మరివాడొకడున్నాడు. కమ్మరి వాళ్లెందరు లేరు? అయితే ఆ కమ్మరికి అసూయ లేదు. తెగ సంపాదించెయ్యాలనే అత్యాశ లేదు. అన్నింటికీ మించి ‘సర్వం దైవ అనుగ్రహమయం’ అనే చక్కని బుద్ధి అతనిది. మంచి జరిగినా, చెడు కలిగినా అదంతా దైవదత్తమే.. దైవకల్పితమే.. అనుకునే ఉత్తమ లక్షణం అతనిది. ఇక్కడికి 300 మైళ్ల దూరంలోని చిన్న పల్లెలో ఉంటున్న అతనికి సుస్తీ (అనారోగ్యం) చేస్తే అతని కమ్మరి పనిలో గాలి తిత్తి కొలిమిని అతడి భార్య వేయడం మొదలెట్టింది. కణకణమండే నిప్పులకొలిమి సమీపంలో కూచుని తిత్తిని వేస్తుంటే పిల్లవాడు పాలకి ఏడ్చాడు. వాడ్ని ఒళ్లో వేసుకుని తిత్తివేస్తూ అనారోగ్యంతో ఉన్న భర్త పిలవగానే.. అతనికి ఎలా ఉందో, ఏమయిందోనని హఠాత్తుగా లేవగానే ఒళ్లోని బిడ్డ కొలిమిలో పడిపోయాడు. వాడు ‘సాయీ! బాబా!!’ అన్నాడు. అంతే! చేతిని చాచి బయటికి తీశాను. అపాయం లేకుండా ఒళ్లు కాలకుండా బయటికి వచ్చాడు. నా చేయి కాలితే ఏమైంది?’’ అన్నాడు సాయి.ఇదేదో కట్టుకథ కాదు. విచారించగా అక్కడివాళ్లు వచ్చి నిజమని చెప్పిన సత్యకథ. అయితే ఇక్కడ మనకో సందేహం రాక మానదు. ‘మరి సాయి పంచభూతాలకీ అధికారి అనీ, వాటిని తన అధీనంలో ఉంచుకున్నాడనీ అన్నారు గదా మరి అగ్నిదేవుడు సాయి చేతిని ఎందుకు కాల్చాడు? అని. నిజమే కదా! కర్మానుభవం ఎవరికి వ్యాధి వస్తే వాళ్లే బాధని అనుభవించవలసినట్లుగానూ, వ్యాధి వచ్చిన వారికి దగ్గరివాళ్లూ, బంధువులూ, ఆప్తులూ, మిత్రులూ ఎవరి స్థాయిలో వాళ్లు సహాయపడటం వరకు మాత్రమే చేయగలిగేటట్లూ ఎవరి పాపకర్మని వాళ్లు మాత్రమే అనుభవించక తప్పదు. ఏ మహనీయుల్నో మనసా–వాచా–కర్మణా(త్రికరణశుద్ధిగా) నమ్మి ఆరాధిçస్తున్న పక్షంలో వాళ్ల సహాయం సకాలంలో తీరుతుంది. ఇదీ ఇక్కడి రహస్యం. కాబట్టి కమ్మరికీ, కమ్మరివాని భార్యకీ, అతడి పుత్రునికీ సంబంధించిన పాపఫలానికి అనుగుణంగా ఆ మానసిక ఆందోళననీ, ఆ వ్యాధి బాధనీ ఆ దంపతులు పొందవలసివస్తే, ఆ పుత్రుడు తాత్కాలిక అగ్ని బాధకి గురి కావలసిన సందర్భం రావడం, అంతలోనే అతడు నమ్మిన సాయి రక్షించడమనేవి జరిగాయి. చివరికి మోక్షాన్ని పొందినా భారతంలో ‘భీష్ముడూ’, శ్రీమద్రామయణంలో ‘అహల్యా’, భాగవతంలో ‘పరీక్షిత్’ ఎలా తీవ్రమైన మనో వ్యథకీ, అవమానాలకీ, అపనిందకీ గురయ్యారో ఇదీ అలాంటిదే. ఆ కర్మఫలాన్ని ఆ పుత్రుని నుండి తాను తీసుకోదలిచాడు కాబట్టీ, ఆ కర్మఫలం సిద్ధుడైన సాయిది కాదు కాబట్టీ తప్పక తానూ సాధారణ వ్యక్తిలా అగ్ని బాధకి గురికావలసే వచ్చాడు. రుణమంటూ ఒకరి వద్ద చేసాక దాన్ని తీర్చడం తప్పనిసరి. ఆ రుణాన్ని తానే తీర్చనక్కరలేదు తనకి సహాయకునిగా ఉన్న ఎవరైనా కూడా తీర్చవచ్చు. ఆ తీర్చడానికి కావలసిన ఇబ్బంది ఏదైనా ఉంటే పడవలసింది కూడా రుణాన్ని తీర్చదలచిన వ్యక్తే. ఏది ఏమైనా రుణం మాత్రం తీర్చబడాల్సిందే! అందుకే సాయి చేతికి అగ్ని గాయమయిందనేది సమాధానం. లో రహస్యం శ్రీమద్రామాయణ భారత భాగవతాల్లో మనం ‘అస్త్రా’లనే పేరిట కొన్నింటిని గూర్చి చదువుతాం. వింటాం. శస్త్రమంటే కేవలం ఎదుటి శత్రువుని వధించడం కోసం వాడే మారణాయుధం. అదే మరి అస్త్రం అన్నట్లైతే ఆ శస్త్రానికే మంత్రశక్తిని జోడించి ప్రయోగించబడేది అని అర్థం. ఏ పేరున్న అస్త్రమైతే ఆ దైవానికి సంబంధించిన మంత్రాన్ని జపించి.. జపించి.. ఆ శక్తిని ఆ శస్త్రంలోనికి నింపితే ఆ పేరిటి అస్త్రమౌతుందన్నమాట.ఆ క్రమంలో అగ్నిదేవుని మంత్రాన్ని మననం చేసి.. చేసి.. ఆ శక్తిని శస్త్రంలో ప్రవేశపెడితే అది ఆగ్నేయాస్త్రంగా అవుతుంది. ఈ ఆగ్నేయాస్త్రపు మంటలనీ, జ్వాలలనీ, వేడిమినీ ఎదుర్కోని నిలిచేందుకు వరుణుని (జలానికి అధిష్ఠాన దేవత) మంత్రాన్ని మననం చేసి.. చేసి.. ఆ శక్తిని శస్త్రంలో నింపితే ఆ అస్త్రం వారుణాస్త్రం అవుతుంది. అగ్నిని ఆర్పేంతటి నీటిధారని పంపగలుగుతుంది. దేవతలే ఇలాంటి అస్త్రాలని వాడారనుకోకూడదు. భారతయుద్ధంలో ఎందరో యోధులు ఇలాంటి అస్త్రాలని ప్రయోగించినవారే. అదే తీరుగా సాయి కూడా శస్త్రం (మారణాయుధం) అనేదాన్ని తీసుకోకుండా తనదైన మంత్రాన్ని మననం చేసి.. చేసి.. ఆ శక్తిని వారుణాస్త్ర శక్తితో సమానంగా చేసుకున్న కారణంగానే ఆ వేడితో ఉడుకుతున్న వంట డేగిసాలో చేతిని పెట్టినా ఆయనకి ఏమీ కాలేకపోయింది. అంటే వేడిమిలో వేడితనం లేకుండా పోయిందన్నమాట. వెనుక భాగంలో నీళ్లలో ఉండే సహజధర్మమైన చల్లదనం అక్కడ పోయి వేడిమితనం కలిగి దీపాలు వెలిగినట్లే, ఇక్కడ కూడా నిప్పులో ఉండే ఆ వేడిమితనం పూర్తిగా పోయి నీటికుండే చల్లదనమే ఆ తేజస్సు (అగ్ని)లో ప్రవేశించిందన్నమాట. సిద్ధుడైన వ్యక్తికి పంచభూతాల్లోని పదార్థాలకుండే సహజధర్మాన్ని తాత్కాలికంగా తొలగించగల శక్తి ఉంటుందనేది సోదాహరణంగా అర్థమౌతోంది కదా!శ్రీమద్రామాయాణంలో ఆంజనేయుని తోకకి నిప్పు అంటించబడింది. ఆంజనేయునికి చల్లగా అనిపించి, కొంతసేపటికి గాని ఆ విషయమేమంటే సీతమ్మ తన పాతివ్రత్యశక్తి ద్వారా అగ్నిదేవుడ్ని ప్రార్థించి నిప్పులో ఉండే వేడిమిని తొలగించి నీటికుండే చల్లదనాన్ని ఆ అగ్నిలోనికి నింపి ఉంచడమే! మరొకరి తోకకి అంటుకున్న నిప్పుని కూడా చల్లబరచగల శక్తి ఉన్న సీతమ్మని చితిలో ప్రవేశించవలసిందని రాముడనగానే ఈ ఆలోచన లేని, రానీ వాళ్లంతా రాముడ్ని తిట్టిపోస్తారు తమ అజ్ఞానాన్ని గ్రహించుకోలేక కొందరు స్త్రీలైతే మరీను. ఎంతగా రాముడ్ని నిందిస్తే ఆ స్థాయి అవివేకం అజ్ఞానం ఉన్నట్లే కదా అర్థం.మరో ఉదాహరణం కూడా ఈ సందర్భంలో చెప్పుకోక తప్పదు. హనుమ లంకాదహనాన్ని ప్రారంభించి చేస్తుంటే లంకలో ఉన్న అన్ని ఇళ్లు దాదాపుగా తగులబడుతూ కనిపించాయి గానీ.. ఒక్క విభీషణుని ఇల్లు మాత్రమే.. అగ్నికి గురి కాలేదు. దానికి కారణం కేవలం మంత్రమనన శక్తి విభీషణుని ధర్మబద్ధవిధానం, రామానుగ్రహమున్నూ అతడే కాదు అతని భార్య ‘సరమ’ కూతురు ‘అనల’ కూడా విభీషణుని త్రోవలోనే ఉండటం కూడా వాళ్ల ఇల్లు అగ్ని నుంచి రక్షింపబడటానికి కారణం. ఆదిశంకరులవారి మీది కోపంతో ఆయన జ్ఞాతులూ ఇంకకొందరూ (దాయాదులూ మొదలైనవారూ ఆ దేశ రాజభటులు కూడా) ఆయన పార్థివ శరీరాన్ని ఒకచోట దాచి ఉంచితే దాన్ని చితి మీద పెట్టి దహించబోయారు. ఆ విషయాన్ని గ్రహించిన ఆదిశంకరుల వారు లక్ష్మీనరసింహ కరావలంబస్తోత్రాన్ని ఆశువుగా పఠిస్తూ తన పార్థివ శరీరం దహింపబడకుండా రక్షించుకున్నారు. ఒకవేళ ఆ అసూయాపరులు పగ సాధించుకోవాలనుకున్న వారూ చితి మీద పెట్టిన ఆదిశంకరుల శరీరానికి అగ్నిని ముట్టింపబోయినా ఆ అగ్ని తనలోని దాహకశక్తిని (మండించే గుణాన్ని) కోల్పోయి చల్లగానే ఉండబోతాడు వారి మంత్ర మనన శక్తి కారణంగా.ఇలా పంచభూతాలలోని సహజధర్మాన్ని పంచభూతాలూ కోల్పోయిన సందర్భాలు అనేకం గోచరిస్తాయి పురాణాల్లో. అవన్నీ కేవలం మంత్రమనన శక్తి కారణంగానే.సాయి అంతటి వారితో పోల్చదగిన మంత్ర శక్తి కలవాడా? అనుకోనక్కరలేదు. భూత భవిష్యద్ వర్తమానాలు మూటినీ గమనించుకుంటూ వ్యాఖ్యంగా ఆ విశేషాలని బహిరంగంగా చెప్తూంటే ఇంకా సాయిని విశ్వసించక పోవడమా?‘షిర్డీలో ముందు నాటికి భవంతులెన్నో వస్తాయి. భక్త జనం లక్షల సంఖ్యలో నుండి కోటికి వెళ్తుంది. షిర్డీలో ఉచితాన్నదానం నిరంతరం జరుగుతుంది. దేవాలయాలు కూడా సాయికి ఎన్నో ఎన్నో ఎన్నో రాబోతాయి’ ఇవి భవిష్యత్తుని సంబంధించిన సాయి మాటలు. నిజమయ్యాయా? లేదా?‘కమ్మరి భర్య – పుత్రుడు కొలిమిలో పడిపోవడం.. సాయి రక్షించడమనేది చేయికాలిన కాలంలో అంటే వర్తమానంలో జరిగిన విషయం నిజమయిందా? లేదా?తనకి ఎవరెంత దక్షిణగా ఇస్తామని లోగడ మొక్కుకున్నారో మొక్కుకుని కూడా తీర్చకుండా ఉన్నారో ఆ విషయాన్ని చెప్పడం (గోవా భక్తుడు 15 రూపాయలిస్తానని మొక్కుకుని తీర్చలేదు) భూత కాలానికి (ఒకప్పటి లోగడ విషయం కదా!) సంబంధించిన విషయం నిజమయిందా? లేదా? కాబట్టి సిద్ధపురుషుడైన సాయిని కేవలంధర్మబద్ధంగా వ్యవహరించడం అగ్ని హోత్రాన్ని నిరంతరం చేయడం అనే లక్షణాల కారణంగా అగ్ని కూడా స్వాధీనుడయ్యాడనేది లో రహస్యం. ఇక నాలుగూ ఐదూ అయిన వాయువూ ఆకాశమూ కూడా ఎలా సాయికి అధీనులయ్యారో తెలుసుకుందాం!సశేషం. - డా. మైలవరపు శ్రీనివాసరావు -
పంచభూతాధికారి
ఎంతో ఎత్తులో ఉన్న నక్షత్రాలని లెక్కించడం ఎంత కష్టమో.. ఎంతో దగ్గరగానూ ఎదురుగానూ ఉన్నా కూడా ఓ చెరువులోని నీటి బిందువుల్ని ఎలా లెక్కించడం కష్టమో.. అలాగే తనకి తానే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని చేస్తున్నా ఓ రోజులో ఎన్నిమార్లు గాలిని పీల్చి విడిచామో చెప్పడం ఎంత కష్టమో.. అదే తీరుగా సాయి గురించి ఎన్ని విశేషాలనీ లీలలనీ విన్నా ఆయన తత్త్వమేమిటో వాటి అంతరార్థమేమిటో సంపూర్ణంగా చెప్పగలగడం అసాధ్యం. పరిచయం ఏ మాత్రమూ లేనివాణ్ణి పిలిచి మరీ దక్షిణ అడుగుతాడు. దక్షిణ ఇయ్యబోయిన పరిచయస్తుడ్ని ఇయ్యవద్దంటాడు. ఎవరైనా తమంత తాము దక్షిణనీయబోతే ఇంతమాత్రమే చాలంటాడు. మరికొందరు దక్షిణనిస్తూంటే ‘ఇంతకాదు. అంత ఇస్తావా? ఇయ్యగలవా?’ అంటాడు. తీరా దక్షిణని ఇచ్చాక దాన్ని వాళ్లకీ పంచేస్తాడు పోనీ! అందరికీ సమానంగానా? అంటే అదీ కాదు. ఒకరికి కొంత, మరొకరికి ఇంకోకొంత, ఆ వేరొకరికి ఊహించనంత. ఇదేమి దక్షిణ విధానమో? పోనీ! ప్రవర్తనని చూద్దామా? ఒకసారి చెప్పలేనంత ప్రేమతో ఓ తండ్రి లాలించినట్లుంటాడు. ఇంకొకసారి రాళ్లతో కొట్టడానికి పరుగెత్తివస్తూ రాతిని విసురుతాడు. ఆకాశం దద్దరిల్లేలా అరుస్తాడు. ఇంకొకసారి కంటితడి పెట్టుకుంటాడు. ఇదేమి ప్రవర్తన విధానమో? ఒకర్ని కావాలని తన వద్దకి రావలసిందిగా కబుర్లు పంపుతూనే ఉంటాడు. కావాలని దర్శిద్దామని షిర్డీకి వచ్చిన కొందరికి దర్శనమే ఈయడు. పైగా ‘తన వద్దకి అతడ్ని తేవద్దు. అతనిని రానీయవద్దు’ అంటాడు. ఇదేమి దర్శన అనుగ్రహ విధానమో?ఒకరోజున అసలు భిక్షానికే వెళ్లాడు. మరొకరోజున 4 నుంచి 8 మార్లు భిక్షాటన చేస్తాడు. ఆ తెచ్చిన రొట్టెలని కుక్కలకీ ఇతర జంతువులకీ ఇస్తాడు. ‘మా ఇంటికి ఆతి«థ్యానికి రండి’ అని పిలిస్తే సరేనంటాడు. ఏ పశువూ లేదా జంతువూ లేదా కీటకరూపంలో తిని– భోజనం బాగుందని వంటకం వివరాలతో సహా చెప్తాడు. ఇదేమి భిక్షాటన విధానమో? మరి ఎందుకు కొలవాలి? ఇంత అయోమయంగానూ లోఅర్థం తెలియకుండానూ ఉన్న సాయి చరిత్రని ఎందుకు తెలుసుకోవాలి? సంపూర్ణ ఆనందాన్ని పొందకుండానూ పొందవీల్లేని స్థితిలోనూ, ఈ సాయి చరిత్ర ఉన్నప్పుడు ‘ఆయన్ని ఎందుకు కొలవాలి?’ అనే సందేహం ఎందరికో కలుగుతుంది కదా! ఏ భయంతోనో వ్యతిరేకించినా, దుర్విమర్శ చేసినా, ఏమైనా కీడు జరుగుతుందేమో అనే ఆందోళనతోనూ సాయి చరిత్ర పారాయణం చేయడం ఎందుకు? అనే ఆలోచన కూడా కలుగుతుంది ఎవరికైనా. సమాధానం ఒక్కటే. ఇలా పైన అనుకున్న తీరుగా ఊహించుకున్నది నిజమే అయ్యుంటే ప్రతి సంవత్సరంలోని రోజుకీ మరో రోజుకీ భక్తజనుల సంఖ్య ఎందుకు పెరిగిపోతోంది? సాయిదేవాలయాల సంఖ్య కూడా ఎందుకు ఎదిగిపోతోంది? ప్రతిసాయి భక్తుడూ అనుకోకుండా మరొకర్ని సాయి భక్తునిగా చేసెయ్యగలుగుతున్నాడు? డబ్బిచ్చి.. ప్రలోభపెట్టి కాకుండా వీరు సాయి గురించి చెప్పగానే అవతలివారు కూడా తాను మాత్రమే కాకుండా సకుటుంబంగా షిర్డీకి ఎందుకు వెళ్లొస్తున్నారు?కారణం ఒక్కటే! ఒక కత్తిని గరుకునేలమీద ఎంత రాస్తే మరెంతగా రాస్తే (నూరితే) అంతగా అది పదునెక్కిపోతుందో అలా అర్థం కాలేదనుకుంటున్న సాయి చరిత్రని ఎన్నిమార్లు చదువుతూ ఎన్నిమార్లు వింటూ ఎన్నిమార్లు సాయిదర్శనాన్ని చేస్తూ ఉంటే అంతగానూ సాయికి దగ్గరైపోతూ ఎవరి అనుభవానికి వాళ్లకి పైననుకున్న అసందర్భ ప్రవర్తనలన్నింటికీ లో–విశేషాలు వాళ్ల వాళ్ల స్థాయికి అర్థమైపోతూ ఉంటాయి. అవన్నీ అసందర్భాలు అయోమయాలూ అనిపించవు.పంచదార తియ్యగా ఉంటుందని చెప్తాం. మరి బెల్లం కూడా అదే తీపిదనంతో ఉంటుందా? అంటే కొద్ది తేడా ఉందని చెప్తాం. వివరించవలసిందని చెప్తే.. కుదరడం లేదని చెప్పేస్తాం. ఇదీ అంతే! ఎవరి అనుభవం వారిదే! నదికి వెళ్లేటప్పుడు మనం ఎంత పరిమాణం గల జలపాత్రని తీసుకెడితే అన్ని నీళ్లని మాత్రమే తెచ్చుకోగలిగినట్లుగా, ఎవరెంత భక్తితో సాయిని సేవిస్తారో వారికి అంతలోతుగానూ లో–అర్థం స్పష్టంగా తెలిసి, వారు మరింత దగ్గరైపోతారు సాయికి.ఒక్కమాటలో చెప్పాలంటే నేడు మహాభక్తులైన అందరూ కూడా సాయిని నమ్మనివారూ. ఎవరి బలవంతం మీదనో మొదట్లో షిర్డీకి వచ్చినవాళ్లేనూ అనేది నిర్వివాదాంశం.‘ఇదంతా ఎందుకు? అంటే ‘సాయి పంచభూతాలకీ అధికారి ఎలా అవుతాడు? కాగలడు?’ అని వాదం చెయ్య బుద్ధి వేస్తుంది అందరికీ. అయితే ‘కొన్ని స్పష్టమైన స్వయమైన అనుభవాలని పొందాక అది నిజమే సుమా!’ అని అనిపించకమానదని తెలియజెప్పడానికీ! కాబట్టి సాయి చరిత్రని చదవండి. చదువుతూ ఉండండి. చదువుతూనే ఉండండి! ఈ నేపథ్యంలో ఆయన పంచభూతాల మీదా ఎలా అధికారం కలవాడయ్యడో చూద్దాం! పృథ్వి మీద అధికారం ‘నెలకి ఇంత!’ అని ఈ తీరుగా జీతాన్ని నిర్ణయించిన పక్షంలో ప్రతి సేవకుడూ యజమానికి అనుగుణంగా పనిచేస్తాడనేది అనుభవంలో కనిపించే అంశం. అలా సేవకుడొకడు తనకంటూ వచ్చినప్పుడూ పని చేస్తున్నప్పుడూ ఈ జీతాన్నిచ్చే వ్యక్తీ.. పని చేయించుకుంటున్న వ్యక్తీ ఓ అధికారి ఔతాడు. ఇది నిజం కదా!మరి సాయి ‘పంచభూతాలకీ అధికారి’ అని చెప్పుకోబోతున్నాం కదా! ఈ పంచభూతాలనీ ‘ఈయన ఏ తీరుగా పోషిస్తున్నాడని ఆ పంచభూతాలూ ఈయన కింద సేవకులుగా ఉండాలి?’ అనేది గట్టి సంశయం కదా! ఇలా ఆలోచించినప్పుడే యదార్థం తెలుస్తుంది. తత్త్వం అర్థమవుతుంది కూడా! ముందుగా పృథ్వి(భూమి)ని ఎలా తనకి సేవ చేయించుకుని ఆ పృథ్వికి అధికారి అయ్యాడో, భూమికి స్వాధీనం(స్వ+అధీనం – తన చెప్పుచేతల్లో ఉంచుకోవడం) చేసుకున్నాడో తెలుసుకుని ఎలా అది సాధ్యమయిందో ఆ తర్వాత తెలుసుకుందాం. పచ్చికుండల్లో నీళ్లు సాయి ఒక ప్రత్యేకమైన తోటని(వెండీ అని దాని పేరు) ఎంతో ఇష్టంగా పెంచుతూండేవాడు. ప్రతిరోజూ స్వయంగా తానే పచ్చికుండలలో నీళ్లు నింపుకుని ఆ నీటితో ఈ తోటలోని మొక్కలకి నీళ్లని పోస్తూండేవాడు. ఇదేదో అభూతకల్పనలతో నిండిన చరిత్ర కాదు. అందరూ ప్రతినిత్యం గమనించిన కళ్లకి కనిపించిన యదార్థం. కుండ అనేదాన్ని మట్టితో చేస్తారు. ఆ పచ్చికుండని ఆములో పెట్టి బాగా కాల్చిన తర్వాత అది గట్టిపడి కొద్ది బరువైన పదార్థాన్ని మోయగల స్థితికి వస్తుంది. అదే మరి పచ్చికుండ అయితే దానిలో నీళ్లు నింపి పైకి ఎత్తబోయేసరికే ఆ నీటి బరువుకి విచ్చిపోతుంది. పైగా సాయి ఆ కుండని తన భుజానికెత్తుకుని రెండు మూడు మార్లు నీళ్లు నింపి మొక్కలని తడిపి తిరిగి వస్తూండేవాడు. ఇది ఎక్కడైనా సాధ్యమా?ఆ పృథ్వి (కుండ ఏ మట్టితో చేయబడిందో ఆ పృథ్వి) తనకి వశమై ఉంది కాబట్టే కుండ విచ్చిపోకుండానూ తోట ఎండిపోకుండా నీరు పోసేందుకు సాధనంగానూ ఉపయోగపడింది. సాయికి తెలియకుండా.. సాయిని శ్రమకి గురి చేయరాదనే ఉద్దేశంతో ఎందరు ప్రయత్నించినా అలా పచ్చికుండతో నీళ్లు పట్టడం భుజానికెత్తుకోవడం తోటవరకూ వెళ్లగలగడం మొక్కలకి పోయడమనేది సాధ్యం కాలేదు ఏ ఒక్కరికీ. అంటే సాయికొక్కనికే పృథ్వి సహకరించిందని కదా అర్థం! ఎందుకు సహకరించిందో తెలుసుకునే ముందు మరో వృత్తాంతాన్ని కూడా చూద్దాం! నేలమాళిగలో 12 ఏళ్లు సాయి తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. అయితే అకస్మాత్తుగా సాయి 16 ఏండ్ల యువకునిగా ఓ వేపచెట్టు కింద కనిపించాడు. ఎప్పుడూ తపఃసమాధిలో ఉంటూండటం, అల్లాహ్ హో మాలిక్! అంటూ అనేక పర్యయాలు అంటూండటం, ఏ సౌకర్యాన్నీ కావాలని ఎవరినీ కోరకపోవడం పైగా ఎవరైనా వచ్చి తమ అనారోగ్యాన్ని వివరించి చెప్పుకుంటే కొంతదూరం వెళ్లి ఏదో చెట్టు ఆకు పసరు తెచ్చి ఇయ్యడం, అవతలివారిని ఆరోగ్యవంతుల్ని చేయడం... ఆయనలోని గొప్పదనం అర్థమవుతూ ఎవరింటికి తీసుకుపోదలిచి ప్రార్థించినా వెళ్లకపోవడమనే ఇన్నింటినీ గమనించిన జనులంతా ఆయన్ని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఖండోబా దేవాలయంలో ఒకనికి పూనకం వస్తే ఈ బాలుడ్ని గురించి అడిగారు అక్కడి వారంతా. ఆ పూనకం వచ్చిన వ్యక్తి ఓ గునపాన్ని (గడ్డపార) తెమ్మనీ ఓ స్థలాన్ని చూపించి అక్కడ తవ్వవలసిందనీ చెప్పాడు. తవ్వి చూస్తే ఓ పెద్ద రాయి కనిపించింది. దాన్ని తొలిగించి చూడవలసిందన్నాడు. అలా చూస్తే ఓ పెద్ద భూగృహం, ఇంకా వెలుగుతూనే ఉన్న 4 దీపాలు, కర్ర బల్లలూ, జపమాలలూ, జపం చేసుకునేందుకు వీలైన ఓ చిన్న వేదిక వంటి ఎత్తు స్థలం కనిపించింది. ఇది అందరూ చూస్తూండగా బయటపడిన యదార్థం ఈ సొరంగంలోనే ఆ బాలుడు ఒకటి కాదు రెండు కాదు 12 ఏండ్ల పాటు తపస్సు చేసి సిద్ధుడయ్యాడని చెప్పాడు పూనకం వచ్చిన వ్యక్తి. ఇప్పుడాలోచిద్దాం! పృథ్వికి అంటే నేలకి ప్రతి వస్తువునీ తనలో కప్పేసుకునే గుణం ఉంటుంది. అందుకే ఏ వస్తువునైనా కొన్నినాళ్ల పాటు నేలమీదనే విడిచేస్తే క్రమంగా కప్పబడిపోతుంది. మరి ఇది పృథ్వి కుండే సహజలక్షణమవుతుంటే ఎలా ఆ భూమిసొరంగంలో ఒకటి కాదు రెండు కాదు అది కూడా నెలలు కాదు సంవత్సరాలు. ఆ సంవత్సరాలు కూడా ఒకటి కాదు రెండు కాదు 12 సంవత్సరాల పాటు ఆ సొరంగంలో ఉండిపోవడం సాయికి ఎలా సాధ్యమయింది? పోనీ ఏ సొరంగానికి ఏదైనా ఓ మార్గముందేమో అనుకునే వీలులేదు. దానికి కారణం ఆ పూనకం వచ్చిన వ్యక్తి తాను మైమరచిన స్థితిలో ఓ ప్రదేశాన్ని చూసి తవ్వవలసిందన్నప్పుడు గదా తవ్వి చూసి ఈ సొరంగ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు అందరూ! కాబట్టి ఆ సొరంగమనేది ఎటూ ప్రవేశంలేని ఎవరూ ప్రవేశించలేని నేలమాళిగే తప్ప రాకపోకలకి వీలైనది కానేకాదు గదా! ఇక తగినంత గాలి లేని పక్షంలో ఏ దీపం వెలుగదనేది మనకి తెలిసిన అనుభవ సత్యమవుతూంటే అకస్మాత్తుగా హఠాత్తుగా తవ్వి చూస్తే అక్కడ నాలుగు దీపాలు వెలుగూ కనిపించడమా? ఇక భూమికి ఉండే మరో గుణం. ఎంతటి వస్తువునైనా నల్లబడిపోయేలా చేయడం. దానికి కారణం గాలి ఏ మాత్రమూ తగలని కారణంగా వేడిమి పుట్టడం. భూమిలో నల్లని బొగ్గు ఇంకా నల్లబడిన రాక్షసిబొగ్గు ఇంకా నల్లబడి లోహాలూ... ఇలా ఇన్ని లభించడానికి కారణం విపరీతమైన వేడిమి మాత్రమే. పెద్ద బండరాయి కప్పబడిన భూమి సొరంగంలో అంతకాలం ఉండడమనేది సాధ్యమా? కొన్ని గంటలయ్యేసరికి నీళ్లు మరికొన్ని గంటలయ్యేసరికి తిండీ ఇంకాకొన్ని గంటలయ్యేసరికి తగినంత గాలీ వెలుతురూ ఆవశ్యకమా? కాదా? ఎలా ఉండగలిగాడు సాయి? అదికూడా 12 ఏళ్ల పాటు. పోనీ! ఇదంతా అసత్యం ఓ కట్టుకథ అంటూ కొట్టిపారేద్దామా? అంటే అందరి సమక్షంలో గదా ఆ భూమి సొరంగం తెరవబడింది. ‘తత్ర గంధవతీ పృథ్వి’ అని భూమి లక్షణం. భూమికి వాసన ఉండటమనేది సహజ లక్షణమని దీనర్థం. ఇది నిజమని నిరూపిస్తూ వాన చినుకు పడగానే ఓ చక్కని వాసన నేల నుండి మనకి వస్తుంది గదా! ఆ వాసనే భూమి నుండి మొక్కని రప్పించగల శక్తి ఉన్న పదార్థం కదా! మరి ఇన్ని సంవత్సరాల పాటు మూసివేయబడ్డ నేలలో ఏ విధమైన దుర్వాసనా ఎందుకు రాలేదు? మనమే మన ఇంటిని ఓ వారం పాటు పూర్తిగా గాలి చొరకుండా మూసి ఉంచితే వచ్చే ఓ తీరు మాగుడు వాసన 12 ఏళ్ల పాటు గాలీ వెలుతురూ లేని భూ సొరంగం నుండి ఎందుకు రాలేదు? ఇలా అనేక ఆశ్చర్యకర అంశాలు మనకి కనిపిస్తాయి. సరే ఇంతకీ సాయికి పృ«థ్వి ఎందుకు సహకరించి పైతీరు ఇబ్బందులు లేకుండా ఆయనని అధికారిగా భావించి ఎందుకు తన సహజధర్మం నుండి పక్కకి వచ్చి సాయికి అధీనురాలు అయింది! లేదా కావలసివచ్చింది? గమనిద్దాం! ఇదీ కారణం! భూమి అని మనందరం పిలుస్తాం కానీ, సంప్రదాయం హిందూ ధార్మిక వ్యవస్థా ఆ భూమిని భూమాత అని, పుడమి తల్లి అని పిలుస్తుంది. తల్లి ఎలా తన సంతానానికి సకాలంలో అన్నాన్ని పెట్టి రక్షిస్తుందో, పెద్దగా వరదలోస్తే ఎలా సముద్రం వైపు పరుగెత్తేలా చేస్తూ కొంత నీటిని తానే స్వయంగా తాగేసి తన మీద ఉన్న ప్రాణులకీ అప్రాణులకీ కూడా నష్టాన్ని కలిగించకుండా చూస్తుందో అంతటి ఉత్తమురాలు భూమి(భూదేవి). అంతే కాదు. పెద్దపెద్ద మానులున్న వృక్షాల భారాన్ని భరిస్తుంది. అసలు వృక్షాలు అంతంత పెద్దగా ఎదగడానికి తాను నీరు తాగి ఆ నీటిని ఒకప్పటి ఆ మొక్కలకి అందించి ఆ మొక్కల్ని చెట్లుగానూ ఆ చెట్లని పెద్దపెద్ద వృక్షాలుగానూ ఎదిగేలా చేసింది కూడా ఈ పృథ్వియే. ఇలా చేసే లక్షణాలున్న పృథ్వి పనిని ఎవరైనా గానీ చేస్తే ఆ పృథ్వి తాను చేస్తున్న పనినే చేస్తూ తనకి పరోక్షంగా సహకరిస్తున్నాడు ఫలానా వ్యక్తి అనే భావంతో తప్పక ఆ పృథ్వి. ఆ వ్యక్తికి సహకరిస్తుంది. లోకమంతా ‘ఈ వ్యక్తి అధీనంలోనే భూమి ఉంది’ అనేంత అభిప్రాయాన్ని కలిగిస్తుంది జనులకి. ఇంతకీ సాయి ఆ పృథ్వి చేసిన ఏ పనుల్నీ చేశాడట? భూమిమీద ఏ 84 లక్షల జీవరాశులున్నాయో ఆ జీవరాశులన్నింటికీ ఆహారాన్ని అందేలా చేయాలనుకుంటూ కేవలం అనుకోవడమే కాకుండా షిర్డీకి వచ్చిన వ్యక్తులకి అన్నాన్నీ క్రిమికీటకాలకి తీపి పదార్థాలనీ పక్షులూ మొదలైన వాటికి తిండి గింజలనీ భూమి మీద మొక్కలకి నీటినీ, కుక్కలూ మొదలైన జంతువులకి తాను భిక్షాటన చేసి తెచ్చుకున్న ఆహారపదార్థాలనీ చేపలూ మొదలైన వాటికి వాటి ఆహారాన్నీ ఇలా భూమి ఏ తీరుగా అన్నాన్నీ అందిస్తూ ఉంటుందో ఆ పనినే సాయి చేశాడు. చేస్తూ ఉన్నాడు ప్రతిరోజూ. ఆ కారణంగా భూమి పరమానందాన్ని పొందింది. శ్రీమద్రామాయణంలో జటాయువు రెక్కల్ని రావణుడు నరికేస్తే... ఇంకా దాన్ని బాగా హింసిస్తే చావుబతుకుల స్థితికొచ్చేసింది ఆ పక్షి. ఆ సందర్భంలో సీతమ్మ జటాయువుని కౌగిలించుకుందంటాడు వాల్మీకి.సీతమ్మ భూమికూతురు. భూమి నుండి ఓషధులు మొక్కల రూపంలో పుడతాయి. ఆ మాటకొస్తే మన్ను పుట్టమన్ను ఇసుకతో కూడిన మన్ను నీటి అడుగున ఉండే బురద ఒండ్రుమన్ను... ఇవి కూడా ఔషధాలే. సీతమ్మ భూమికి కూతురై ఔషధి లాంటిది కాబట్టే ఆమె కౌగిలించుకున్న కారణంగా అంతగా గాయపడి చావుబతుకుల్లో ఉన్న జటాయువు కూడా రామలక్ష్మణులొచ్చేంతవరకూ జీవించి సీతాపహరణ విషయాన్ని చెప్పగలిగాడు. సాయి కూడా భూమి నుంచి ఏ మొక్క ఏ వ్యాధికి ఔషధమో గమనించి భూదేవి చేస్తున్న పనిని తాను కూడా నిస్వార్థంగా చేస్తున్నప్పుడు భూదేవి సాయికి ఎందుకు సహకరించదు? స్వాధీనురాలు కాకుండా ఉంటుంది? భూదేవి తట్టుకోలేనిది పాపుల భారాన్ని. అందుకే శ్రీహరిని వేడుకుంటూ పాపభారాన్ని తగ్గించవలసిందని ప్రార్థిస్తుంది. సాయి కూడా కొందర్ని అసహ్యించుకుంటూ కొందరికి జ్ఞానబోధ చేస్తూ కొందరికి దర్శనాన్నే ఈయక... ఎవరి తప్పుని వారు వారికి వారు తెలుసుకునేలా చేస్తూ పాపి అయినవారిలోని పాపగుణాన్ని ఆలోచనల్నీ తొలగిస్తూ ఉండటంతో భూదేవి ఆయనకి స్వాధీనురాలయింది. దేవతలు ఎప్పుడూ సజాతీయులు(తమ వంటి గుణలే ఉన్నవారు) అయినవాళ్లకి సహకరిస్తూ ఉంటారు తప్ప హోదా ప్రధానమని అనుకోరు.ఈ క్రమంలో పంచభూతాల్లో రెండు మూడు నాలుగూ ఐదూ అయిన నీరు తేజస్సు వాయువూ ఆకాశమూ కూడా ఎందుకు సాయికి అధీనులైపోయాయో గమనించుకుందాం! – సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
దక్షిణనియ్యి! వద్దొద్దు! నాకెందుకు నీ దక్షిణ!?
ఎక్కడైనా సరే కన్నతల్లిని చూస్తే తన బిడ్డ కళ్లలోకి అలా చూసి క్షణం ఆగి గట్టిగా హత్తుకుని పెద్ద ముద్దు పెట్టుకుంటుంది. ఈ ఇద్దరిలోనూ కన్పించే తేడా ఏమిటి? తేడా ఏమిటో కన్పించనితనమే!కన్నతల్లి తన బిడ్డ కళ్లలోకి చూస్తూ ఎంత ఎదురుచూసేలా చేశావురా? బొజ్జలో ఉండి ఎన్ని తన్నులు తన్నావురా? ఎన్ని తినరాని(మట్టి సుద్ద మరీపులుపు..) వాటిని ఇష్టంగా తినిపించావురా? ఒకసారి నేను కూడా దక్కని పరిస్థితిని కల్పించి ఎంత గాభరా పుట్టించావురా? అనుకుంటూ ఆ పసివాడి కళ్లలోకి ఈ భావాన్నంతటినీ వ్యక్తీకరిస్తూ ఆ ఆనందాతిశయాన్ని భౌతికంగా వ్యక్తీకరిస్తూ ‘గాట్టి పెద్ద ముద్దు’ని పెడుతుంది.అదే మరి పక్కనున్న మరొక ఆమె అయితే.. బోసినవ్వు ఎంత బాగుంది? గిరజాలెంత చక్కగా ఉన్నాయి? బుగ్గలెంత బూరెల్లా కనిపిస్తున్నాయి..! అంటూ ముద్దెట్టుకుంటుంది. ఇద్దరూ చేస్తున్నదీ చేసిందీ ఒకే పని అయినా ఎంత వ్యత్యాసముంది?ఇదే తీరుగా ఏదో బాబాని దర్శించేయడం కాకుండా ‘బాబా! నన్నెంత తలకిందులైన పరిస్థితి నుండి ఊహాతీతంగా బయటపడేశావ్? పూర్తిగా ఎండిన చెట్టులా ఉన్న నన్ను చిగిర్చి పుష్పించేలా చేశావు?’ అనుకుంటూ చూసేవారికి బాబా మరింత ఆనంద అనుగ్రహదర్శనాన్నిస్తాడు. ఏదో పదిమందితో వెళ్లాం కదా! అని చూస్తే కనిపిస్తాడు తప్ప దర్శనాన్ని ఇవ్వడు. ఇది అనుభవం ద్వారా మాత్రమే తెలిసే విషయం.ఇక్కడ ఈ మాటలెందుకనుకోవచ్చు! బాబాని దర్శించడానికి వెళ్లే ముందు బాబా గురించిన ఎంతో సమాచారాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నట్టుగా తెలుసుకుని గాని దర్శించుకున్నట్లయితే ఆ చూసే చూపులో లోతుదనమే వేరు. అలా కాక కేవలం దర్శించి నమస్కరించేస్తే పై ఉదాహరణలో కన్నతల్లి కాని ఆమె పొందినది ఆనందమే అయినా అది కన్నతల్లి ఆనందంలాంటిదెలా కాదో.. కాలేదో.. అలాగే ఉంటుంది. 15 రూపాయలివ్వు! సాయి దర్శనం కోసం గోవా నుంచి ఇద్దరు పెద్ద వయసువాళ్లొచ్చారు. సాయి దర్శనాన్ని చూస్తూనే చెప్పలేని ఆనందంతో పాదాభివందనాన్ని వినమ్రులై చేశారు. ఇద్దరూ కలిసే వచ్చారు. ఇద్దరూ కలిసే పాదాభివందనాన్ని చేశారు. అయితే సాయి మాత్రం మొదటివాణ్ని చూస్తూ ‘నాకో 15 రూపాయల దక్షిణనివ్వు!’ అని అడిగాడు. సాయి దర్శనం లభించడమే అదృష్టకరమైన అంశమనుకుంటూ ఉంటే ఆయనే దక్షిణ అడిగి మరీ తీసుకోవడం అనేది మరింత అదృష్టకరమైన అంశమనుకుంటూ వెంటనే 15 రూపాయలనీ ఇచ్చేశాడు మొదటి వ్యక్తి.‘అయ్యో! ఆయన అడక్కుండానే దక్షిణనిచ్చి ఉంటే ఎంత బాగుండేది?’ అనుకుంటూ రెండవ వ్యక్తి 35రూపాయల దక్షిణని సాయికివ్వబోతే వద్దు అంటూ చేతి సంజ్ఞని చేస్తూ సాయి తిరస్కరించాడు.ఇతని దగ్గర అడిగి తీసుకోవడమేమిటి? అతను తనంత తానుగా ఇంతకంటే ఎక్కువనియ్యబోతే తిరస్కరించడమేమిటి? అని అక్కడున్న భక్తులందరికీ, వచ్చిన గోవాభక్తులిద్దరికీ సంశయం కలిగింది. బాబాని అడగాలంటే భయం, సంకోచం కాబట్టి ఎవ్వరూ అడగలేకపోయారు. గానీ ‘శ్యామా’మాత్రం బాగా చనువున్నవాడు కాబట్టి సాయికి నమస్కరించి ‘ఈ సంశయాన్ని ఆయన ముందు పెట్టి అనుమానాన్ని తీర్చవూ?’ అని అడిగాడు సాయిని.బాబా శ్యామా ముఖంలోనికి చూస్తూ.. ‘శ్యామా! నాకు కుటుంబం ఉందా?’ అని అడిగాడు. ‘లేదు లేదు’ అన్నాడు శ్యామా.‘భార్య, పుత్రులు, దత్తులు ఉన్నారా?’‘లేరు లేరు..!!’‘తీర్చుకోవలసిన బాధ్యతలూ చేసిన అప్పులూ ఏమైనా ఉన్నాయా?’‘లేనే లేవు..!’‘మరి నాకు డబ్బెందుకు?’ అన్నాడు సాయి.వెంటనే శ్యామా ‘బాబా! మరి నువ్వేకదా దక్షిణ అడిగావు! ఒకరి వద్ద తీసుకున్నావు. మరొకరియ్యబోతుంటే వద్దన్నావు! అదీ కాక నీకు సొమ్ము అవసరమే లేకపోతే మరి కొందరి దగ్గర కూడా దక్షిణ అడిగి తీసుకు రమ్మంటుంటావు. తెచ్చాక తీసుకుంటావు కదా!’ అని చుట్టూ ఉన్న అందరి భక్తుల అనుమానాలన్నింటినీ కలిపి అడుగుతున్నా అన్నట్లు ధైర్యంగా అడిగాడు. సాయి చిరునవ్వు నవ్వుతూ ‘శ్యామా! చేసిన అప్పు, శత్రుత్వం, చంపితీరాలనే పగా అనేవి జన్మలెన్ని ఎత్తినా తీర్చుకోనంత కాలం అవి వెంట వస్తూనే ఉంటాయి. నీకు ఏ రుణమూ లేదు. అందుకే నాకింత సన్నిహితుడివిగా ఉంటున్నావు. ఒక్కమాటలో చెప్పాలంటే... రుణవిముక్తి కోసమే నా దగ్గరి కొస్తారు. రుణ విముక్తిని చేసుకుంటారు. ఇక నాకు అతుక్కుని అలా వస్తూ పోతూనే ఉంటారు’ అన్నాడు బాబా.శ్యామాతో పాటు భక్తులంతా అర్థమైనట్టూ బాబా చెప్పినమాటలు కానట్టూ ఉండగానే బాబా చెప్పడం మొదలెట్టాడు వివరంగా.‘ఇదుగో! ఈ భక్తుడున్నాడే! ఒకప్పుడితనికి ఉద్యోగం లేదు. తీవ్రమైన సంకట పరిస్థితుల్లో ఉన్నాడు. నిరుపేద. ఒకరోజున మొక్కుకున్నాడు. ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తానని. మొక్కుకున్నట్లే ఉద్యోగం వచ్చింది. మొక్కుబడి విషయాన్ని మరచిపోయాడు. 15.. 30.. 50... అలా పెరిగిన జీతం ఈ రోజున 700 అయ్యింది. అదుగో ఆ వచ్చిన ఈ వ్యక్తి నాకు రుణగ్రస్తుడు కాదూ! అందుకే అతను ఇస్తానని ఆనాడు ఒప్పుకున్న ఆ 15 రూపాయలని మాత్రమే అడిగి తీసుకున్నాను. ఇప్పుడు 700 కావచ్చు. అది నా కొద్దు. అది అతని మొదటి జీతం కాదు గదా! కాబట్టి ఇతన్ని అడిగి తీసుకున్న 15 రూపాయలు నాకు చెల్లించవలసిన బాకీపడిన పైకం మాత్రమే’ అన్నాడు. అంతా ఆశ్చర్యచకితులయిపోయారు.30,000 రూపాయల చౌర్యం‘శ్యామా! నేనొకప్పుడు సముద్రపు ఒడ్డున తిరుగుతున్నాను. అలా నడుస్తూ ఉంటే ఓ సుందరమైన భవనం కనిపించింది. అదొక సద్బ్రాహ్మణునిది అని ఆ భవనానికున్న నామఫలకం చెప్తోంది. మంచి జాతి కదా అని గ్రహించి ఆ భవనానికున్న వరండాలో కూర్చున్నాను. ఆ యజమాని నన్నేమీ అనలేదు సరికదా నన్ను లోనికి పిలిచి చక్కని భోజనాన్ని పెట్టి మంచి వసతిగా ఉన్న శుభ్రమైన పడకగదిలో పడుకోబెట్టాడు కూడా! నేనెంత గాఢంగా నిద్రపోయానో నాకే తెలియదు. అయితే తెల్లవారిన తర్వాత చూసుకుంటే నా జేబులో ఉన్న 30 వేల రూపాయల కరెన్సీ కాగితాలు చౌర్యానికి గురయ్యాయని అర్థమయింది. ఆయన సద్బ్రాహ్మణుడే కాక సకాలంలో ఆదుకున్నవాడు. ఆయన్ని అనుమానించడం మహాపాపం. ఆయన ఈ విషయాన్ని విని చాలాసేపు నన్ను ఓదార్చాడు. పొగిలి పొగిలి ఏడుస్తూనే ఉన్నాను. ఒకరోజు రెండ్రోజులు కాదు. అదే బ్రాహ్మణుని ఇంటి వరండాలో 15 రోజుల పాటు రోజూ చేసేపని ఏడవడమే. ఆ మరుసటి రోజున కూడా ఇలాగే తలుచుకు తలుచుకు ఏడుస్తూ ఉంటే ఎక్కడి నుండో ఓ ఫకీరొచ్చాడు. ఉర్దూలో రెండురెండు పాదాలు మాత్రమే ఉండే ద్విపదల్లాంటివి పాడుతూ నా దగ్గరికే వచ్చాడు.‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. జరిగిందంతా చెప్పాను. ‘ఇంతేగా! నీకో ఫకీరు పేరు చెబుతాను. ఆయన ఉండే చోటు కూడా చెప్తాను. ఆయనకి మొక్కుకో! ‘నీ డబ్బు మొత్తం నీకు తిరిగొచ్చి నీకు చేరే వరకూ ప్రతిరోజూ నువ్వుతింటున్న వరి అన్నాన్ని తిననే తిననని ఆ ఫకీరుకి పూర్తి శరణాగతుడివి అయి ఆయన నామాన్నే జపించుకుంటూ ఉండు’ అని.మరేమీ తోచలేదు. ఆ ఫకీరు చెప్పినట్లే పూర్తి నిష్ఠతో నామాన్ని జపిస్తూ ఉండిపోయాను. సరిగ్గా కొన్నిరోజులు జపించానో లేదో ఆ దొంగిలింపబడ్డ సొమ్ము నా వద్దకొచ్చింది. ఆనందంతో ఆ బ్రాహ్మణుని ఇంటిని విడుస్తూ ఆయనకి ధన్యవాదాలు చెప్పి సముద్రం దగ్గర కొచ్చాను. స్టీమర్ (నౌక) వచ్చింది. దాన్నిండా జనం. ఎవరో ఒక సిపాయి నాకు అడ్డుపడి లోనికి తీసుకుపోయి నాకు చోటునిచ్చి మరీ కూర్చోమన్నాడు. నౌక సముద్రం ఆ ఒడ్డుకి చేరింది. అక్కడి నుంచి రైలెక్కాను. ఇదిగో ద్వారకామాయి’ కొచ్చానన్నాడు బాబా.శ్యామాతో పాటు భక్తులందరికీ ఈ 2వ కథ అగమ్యగోచరంగా ఉండేసరికి ఆశ్చర్యంగా వింతగా చూడసాగారు బాబా వైపు. వెంటనే శ్యామాని చూస్తూ బాబా ‘శ్యామా! ఈ అతిథుల్ని నీ ఇంటికి తీసుకెళ్లు. మంచి భోజనాన్ని పెట్టి విశ్రాంతినిప్పించు’ అన్నాడు.శ్యామా ఆ ఇద్దరినీ తనింటికి తీసుకెళ్లాడు. చక్కగా భోజనాన్ని పెట్టాడు. వాళ్లు తినడం ముగించాక! బాబా చెప్పిన కథ మీకేమైనా అర్థమయిందా? బాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. ఉన్నాడు. ఆయనేమిటి? సముద్రపు ఒడ్డేమిటి? బ్రాహ్మణగృహంలో ఉండటమేమిటి? ఆయన దగ్గర 30 వేల రూపాయలుండటం, అవి ఓ దొంగ చేతికి చిక్కడం, ఆయన దుఃఖిస్తూ ఉండిపోవడం, తిరిగి సొమ్ము ఆయనకి రావడం... ద్వారకామాయికి రావడం... ఇదంతా అగమ్యగోచరంగా ఉంది నాకు. మీ ఇద్దరూ వచ్చాక బాబా ఈ కథని చెప్పాడంటే ఈ కథకి తుదీ మొదలూ మీకే తెలిసుండాలి’ అన్నాడు. దాంతో ఆ ఇద్దరి కంఠాలు గద్గదమైపోతూ ఉంటే మొదటి ఆయన చెప్పాడు. ఆ కథ నాదే. చిచిఘాట్ నా జన్మస్థానం. నిరుపేదనైన నేను సముద్రపు ఒడ్డున తిరుగుతూ ఉద్యోగం కోసం ప్రయత్నించసాగాను. దత్తాత్రేయుణ్ని కొలుస్తూ ఉద్యోగం రాగానే మొదటి జీతాన్ని సమర్పించుకుంటానన్నాను. చిత్రమేమంటే నా మొదటి జీతం 15. నేటి జీతం 700. అన్నాను గానీ మొదటి జీతాన్ని మొక్కుగా చెల్లించుకోవాలనే మాటను మరచాను. సరిగ్గా బాబా నేటి జీతాన్ని 700 అని చెప్తూ నాటి జీతమే (15 మాత్రమే) కావాలని నేను చెప్పకుండా ఈయకుండా ఉంటే ‘అడిగి మరీ తీసుకున్నాడు’. ఆయన ఓ దైవం. సర్వజ్ఞుడు.దోషాన్ని మనకి మనమే గుర్తించేలా చేసి క్షమించే దైవం అని ముగించాడు.కాబట్టి కంచికామకోటి పరమాచార్యులవారు ఓ మాటని చెప్తూ ఉండేవారు. ఎవరైనా దైవానికి మొక్కుకుని ఉంటే ప్రతిరోజూ డైరీలోనూ మొదటివాక్యంగా ఈ మొక్కు వివరాలను రాసుకుంటూ ఉండాలని. అది ఎంత గొప్పమాట. సత్యనారాయణస్వామి వ్రతంలో మొక్కుని మరిచిపోవడం, షావుకారుకి భార్య గుర్తు చేసినా వాయిదా వేయడం, చివరికి తప్పుని అంగీకరించి ఒడ్డునపడటం.. అనే ఆ కథ ఎంతటి కనువిప్పునిస్తుంది మనకి! గమనించుకోవాలి! అనుకోకుండా వచ్చిన క్రమక్రమ ఆపదలలో మొక్కేసుకోవడం ఇన్ని సంఖ్యలో ఉన్న మొక్కుల్లో దేన్నో మర్చిపోవడం లేదా మొక్కుకున్న వివరం గుర్తులేకపోవడం వంటివి జరుగుతూ ఉండటం సర్వసాధారణం. సాయి దయార్ద్రహృదయుడు కాబట్టి మనం చేసిన దోషాన్ని గుర్తుచేసి మరీ మనచేత తీర్పించుకుంటాడన్న మాట. అలాగని ఆయనే గుర్తు చేస్తాడు కదా! అహంకార నిర్లక్ష్యభావాన్ని చూపిస్తే మనకి ఫలితం బాగా అర్థమయ్యేలా చేస్తాడు కూడా! కాబట్టి సకాలంలో మొక్కుని సరిగా తీర్చుకోవాలి తప్పదు! రెండవది నా కథే! రెండవ ఆయన కన్నీళ్లు తన్నుకుంటూ వస్తూంటే తన కథని చెప్పసాగాడు. ‘నేనొక వర్తకుడ్ని. వ్యాపారపు పనుల కారణంగా కుదరదనుకుని ఒక బ్రాహ్మణజాతి వంటవాడ్ని ఏర్పాటు చేసుకున్నాను. 35 ఏండ్ల నుండే మా ఇంట్లో తలలో నాలుకగా అయిపోయాడాయన.ఎవరో ఒక నీచుని సహవాసం వచ్చింది. దాంతో నేను పడుకునే గదిలో డబ్బు దాచుకునే బీరువా ఏ గోడలో బిగింపబడి ఉంటుందో తెలిసిన అతను ఓ నాటి రాత్రి ఆ గోడకి అమర్చబడిన బీరువాకి అటు ఇటూ ఉండే ఇటుకల్ని తొలగించి బీరువాకి రంధ్రాన్ని చేసి 30,000 రూపాయల సొమ్ముని కాజేశాడు. వ్యాపారపు పెట్టుబడి సొమ్మంతా దొంగతనానికి గురైందని తెలిసి ఇవ్వవలసినవారికి ఎలా ఇయ్యాలో.. సరుకుని ఎలా కొనుగోలు చేయాలో?... ఏం దిక్కుతోచక బావురుమంటూ ఏడుస్తూ 15 రోజుల పాటు కంటికీ మింటికీ ధారగా ఏడుస్తూనే గడిపాను రాత్రింబవళ్లని.15 రోజుల పాటూ మరో పనిలేదు. ఏడుపే ఏడుపే. 15 రోజులు నిండాక ఓ ఫకీరు నా దగ్గర కొచ్చాడు. ఏడుస్తున్న నన్ను దగ్గరికి తీసుకుంటూ కారణాన్ని అడిగాడు. చెప్పాను. వెంటనే తరుణోపాయాన్ని (కష్టాన్ని దాటగల ఉపాయాన్ని) చెప్పాడు. ‘కీపర్గాంవ్ అనే తాలూకాలో షిరిడీ అనే కుగ్రామం ఉంది. అక్కడ ‘సాయి’ అనే ఓ జాలియా (నియమ బద్ధమైన జీవితాన్ని గడిపే జ్ఞాని అయిన ఫకీరు) ఉన్నాడు. ఆయనకి మొక్కుకో! ‘నీ సొమ్ము నీకు వచ్చేలా చేయవలసిందనీ సొమ్మొచ్చే వరకూ వరి అన్నాన్ని (నిత్య ఆహారం) ముట్టనే ముట్టననీ సొమ్ము లభించాక దర్శనానికొస్తాననీ, ఈలోగా నామజపాన్ని చేస్తూనే ఉంటాను’ అని మొక్కుకో అన్నాడు. ఆ ఫకీరు చెప్పిన మాటల్నే మంత్రంగా భావించి అలాగే చేయసాగాను. ఆశ్చర్యకరంగా ఆ బ్రాహ్మణజాతి వంటవాడు వచ్చి 30 వేల రూపాయలనీ ఇచ్చేసి.. మతిభ్రమించి ఏం చేశానో ఆ సమయంలో తెలియలేదు. తిరిగి ఈ సొమ్మునిచ్చే వరకూ మనశ్శాంతి లేక ఇలా వచ్చాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎన్నిమార్లు వెదికినా నాకు ఈ కోపర్‌గాంవ్ జిల్లాలోని షిరిడీ కుగ్రామంలోని సాయి వద్దకి వెళ్లవలసిందనీ ఆహార నిషేధాన్ని పాటించవలసిందనీ నామజపాన్ని కానిస్తూండవలసిందనీ చెప్పిన ఆనాటి ఫకీరు కనపడనే లేదు. అలాంటి వ్యక్తి ఎవరికీ కనపడలేదని కూడా అందరూ చెప్పారు.ఈ రోజున ఇక్కడికి వచ్చాను. ఆ ఫకీరు చెప్పిన సాయి ఈయనయే. నా చరిత్ర మొత్తం అలా కళ్లకి కట్టినట్టు చెప్పడం.. 30 వేలు మాత్రమే అని చెప్పగలగడం. నా 15 రోజుల శోకం.. ఇదంతా అక్షరాక్షర సత్యం అని ఆనందాశ్రువుల్ని రాల్చాడు.సొమ్ము 30 వేలూ నాకు లభించాక కూడా నేను మరింత వ్యాపారాభివృద్ధికి ‘కొలాబా’ అనే ప్రదేశానికి వెళ్లాను. సాయి నాకు స్వప్నంలో కనిపించాడు. అంతే! బుర్ర పాడయిపోయింది. ఇంత సొమ్ములభింపజేసిన సాయి దర్శనం కంటే వ్యాపారం ముఖ్యమా? అనుకుంటూ సముద్రపు నౌక దగ్గరికి రాగానే అడ్డుకున్నాడు సరంగు(కెప్టెన్). ఒక సిపాయి–తనకి నేను బాగా తెలుసునని చెప్తూ లోనికి ఎక్కనిచ్చాడు. ఇలా రాగలిగాను బుద్ధివంకరని పోగొట్టుకుని. ఆయనకి నేను 35 రూపాయలని ఇయ్యబూనడమా? ఎంత అవివేకిని? అంటూ బిగ్గరగా ఏడ్చాడు. గమనించుకోవాలి! మనం మొక్కుని ఎప్పుడు తీర్చుకోకుండా ఉంటామో అప్పుడు మన అపరాధాన్ని తెలియజేసే కరుణార్ద్రహృదయుడాయన. అహంకరిస్తే అథఃపాతాళానికి తొక్కే సాహసపరాక్రమవంతుడూ ఆయనే. – సశేషం -
ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజిత
డచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఉత్తేజిత 21–10, 21–13తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీకృష్ణప్రియ 11–21, 12–21తో ఫాబిని డిప్రెజ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన శైలి రాణే, అనురా ప్రభు దేశాయ్, రియా ముఖర్జీ కూడా తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. -
ఏం కావాలోయి? ఉందిగా ద్వారకామాయి!!
ఎంతో వేగంగా ప్రవహించి ప్రవహించి బలంగానూ, ముందూ వెనుకలకి కదులుతూనూ ఉన్న నీరంతా ఒక్కసారి ఆనకట్ట దగ్గర ఆగిపోయిందంటే, దాన్ని అలా ఆపగలిగిన ఆనకట్ట గట్టిదనాన్ని, అలా ఆపగలిగేలా కట్టిన ఆ మహానుభావుల గొప్పదనాన్నీ తెలుసుకోవలసిందే వాళ్లని స్మరిస్తూ ఉండాల్సిందే! అదే తీరుగా ఓ పండితుడు తగిన ప్రమాణాలని చూపుతూ మాత్రమే పదిమందిలో గుర్తింపు పొందగలిగాడంటే... ఆయనకి చదువు చెప్పిన ఆ గురువుల్నీ, ఆ గురువుల నేతృత్వంలో ఈయన చదువుని ఒంటబట్టించుకున్న తీరునీ ప్రశంసించవలసిందే. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే.. ఫలాని కష్టం వచ్చిపడిందని అనుకుంటూ ద్వారకామాయిని దర్శిస్తే సాయి నామస్మరణని అక్కడే కూచుని చేస్తే ఆ ఇబ్బంది నుండి బయటపడగలుగుతున్నారంటే.. ఆ ద్వారకామాయికున్న గొప్పదనాన్ని, ఆ ద్వారకామాయి నిర్మాణంలో దాగిన విశేషాలనీ తెలుసుకుని తీరాల్సిందే! ఓ పాత్రలో ఉన్న రుచికరమైన పానీయాన్ని ఒకరివెంట ఒకరుగా తాగుతూ వెళుతూ ఉంటే.. ఎలా పాత్ర ఖాళీ అయిపోతుందో, అలా కాకుండా ఎందరు ఎందరెందరు ఈ కాలం ఆ కాలం అనకుండా సర్వకాలం ద్వారకామాయిని సేవిస్తూ ఉన్నా ఆ కష్టాలని దాటింపజేసే శక్తి ఆ స్థలానికి ఉంటూనే ఉంటోందంటే నిజంగా మనం ఆ గొప్పదనాన్ని అర్థం చేసుకోవలసిందే! సాయి విడిది! తన గుర్రాన్ని సొంత కుటుంబసభ్యునిలా చూసుకుంటున్న ‘చాంద్‌పాటిల్’ ఓ మంచి వేసవివేళ దిక్కు తోచక తిరుగుతుంటే సాయి అతడ్ని పిలిచి, కారణమడిగి, సరిగా వెతకలేదని అతనికి చెప్పి.. ‘ఫలాని చోట ఉంది తెచ్చుకో!’ అనడమూ ‘చాంద్‌పాటిల్’కి గుర్రం సరిగ్గా అక్కడే దొరికి ఉండటం..’ అనే ఆ చరిత్రని లోగడ అనుకున్నాం. సాయిని చాంద్‌పాటిల్ తనతో తన ఇంట్లోనే ఉంచుకుని, తన కుటుంబం మొత్తం షిర్డీకి ఓ పెళ్లికి వెళ్తూ ఉంటే.. తనతో సాయిని తీసుకెళ్లి ఉండటం కూడా మనకి గుర్తుంది కదా! ఆ షిర్డీకి పెళ్లివారితో సహా సాయి రాగానే పెళ్లివాళ్లంతా రెండెడ్లబళ్లు దిగగానే సాయిని చూస్తూనే ఆహ్వానించిన వ్యక్తి ‘ఖండోబా’ అనే గ్రామదేవతా ఆలయంలో అర్చకుడైన ‘మహల్సాపతి’ మాత్రమే! ఇంతవరకూ మనకి తెలుసు!సాయి వేషాన్ని చూశారు షిర్డీలోని అక్కడి వారంతా. పెద్ద బురఖా (కుఫ్ని)ని ధరించి, తలకి ఓ టోపీలాంటి గుడ్డని చుట్టి, గడ్డంతో కన్పిస్తూ ఎవ్వరు అలా చూసినా స్పష్టంగా మహమ్మదీయుడే అనేలా తనని గురించి చెప్పక చెప్తూన్న సాయిని ఏ ఒక్కరూ కూడా ఖండోబా దేవాలయంలోనికి అడుగు పెట్టనీయకూడదని అనుకున్నారు. ఎందరో ఆ అభిప్రాయాన్ని తమలో తాము అనుకుంటున్నట్లుగా, కొద్దిగా బిగ్గరగా అనుకున్నారు కానీ ఒకరిద్దరు ఆ మాటని పైకి అననే అన్నారు కూడా. ‘లా సాయీ!’ (దయచేసి ఓ అతిపవిత్రుడా! లోనికి రా!) అని ఖండోబా దేవాలయ అర్చకుడు మహల్సాపతి ఆ సాయి రూపాన్నీ ఆయన లో–దాగిన గొప్పదనాన్ని గుర్తించి పైకి అలా ఆహ్వానించగలిగాడు. గానీ, తానొక అర్చకరూపంలో ఉద్యోగిగా ఉన్న కారణంగా అక్కడ సాయికి నివాసాన్ని ఇప్పించగల శక్తి లేనివాడయ్యాడు. మనసుంటే మార్గముంటుందన్నట్లు మహల్సాపతే స్వయంగా అక్కడి పెద్దలతో మాట్లాడి అక్కడికి పెద్ద దూరం కాని ఓ మసీదులో సాయిని ఉంచే ఏర్పాటుని మాత్రం చేయగలిగాడు. సాయిని తానే తీసుకువెళ్లాడు ఆ మసీదుకి. ఆ మసీదులో సాయిని దిగబెట్టి ‘సాయీ! ఇదే నీ విడిది!’ అని నమస్కరించి వెనుదిరిగాడు. ఎలా ఉంది ఆ మసీదు? మసీదుకి ముందు ఏ ఆవరణా(ఓ కప్పు ఉన్న ప్రదేశం) లేదు. గోడలన్నీ బాగా పాతబడిపోయి ఉండడమే కాక ఆ మసీదుకున్న ఓ పిట్టగోడ (ప్రహరీగా ఉన్న ఎత్తు తక్కువ గోడల్లో ఒకటి) దాదాపు కూలిపోయిన స్థితిలో ఉంది. మసీదు నిండుగా బూజులు వేలాడుతూ కన్పిస్తున్నాయి. ఏదైనా ఓ అవసరం వచ్చి పిలిస్తే పలికేందుకు ఏ ఒక్కరూ అక్కడ లేరు. అస్తమానం మసీదులోనే కూర్చుని కూర్చుని విసుగొచ్చి ఓ క్షణం ఎక్కడైనా కూచుందామంటే ఒకే ఒక్క దిక్కు ఆ మసీదుకు ఎదురుగా ఉన్న వేపచెట్టు మాత్రమే. సాయికి ఆనందమే అన్పించింది. ఒంటరిగా ఉన్న వేపచెట్టుకి తానొక జంటగా ఉండేందుకు వచ్చాను గదా! అని. ఇంతకాలం ఎవరింట తాను అతిప్రీతిపాత్రంగా గౌరవింపబడ్డాడో ఆ చాంద్‌పాటిల్ కనపడలేదు. తనతో రాలేదు. అలాగని తనని వదిలించుకుందామనేది అతని అభిప్రాయం కాదు. పెళ్లి పనుల్లో ఉన్నాడతను. అదీ కాక తాను అతనికి చెప్పి ఇక్కడికి రాలేదు కూడా. ఇక కొంతకాలం తాను షిర్డీలో ఉన్నప్పటికీ మరో చోటికి వెతుక్కుందామనే దృష్టీ తనకి లేదు.మసీదంతా తిరిగి చూస్తే ఓ చిన్నకుండ కన్పించింది. ‘హమ్మయ్య! నీటి అవసరాన్ని తీర్చడానికి చాలు’ అనుకున్నాడు సాయి. పాతకాలపు పెద్ద తిరుగలి ఆ ఆవరణలోనే కన్పించింది. ‘అబ్బో! గోధుమల్ని విసురుకుని తినడానికి, రొట్టె చేసుకునేందుకు ఇది కూడా ఉందిలే’ అనుకున్నాడు. ఇక పొయ్యిని ఏర్పాటు చేసుకోవడం, ఎండిన కట్టెలూ, పడుకునే చోటూ.. అనే వాటినన్నింటినీ ప్రకృతే ఇస్తుంది తనకి.మంచి వసతి, నీరు, భోజనం అనేవి దొరికాక తనకి లోటేముంది? అనుకున్నాడు. మరో ఆనందకరమైన అంశమేమంటే తనని ఎవరూ కూడా వచ్చి పలకరించేందుకు వీలు లేకుండా మసీదు ఆవరణలో కాలు పెట్టే సౌకర్యంగానీ, స్థలంగానీ ఏ మాత్రపు వీలుగానూ లేకపోవడమే. గోతులతో ఎగుడు దిగుడులతో – సన్నతోవతో – ఇరుకు సందుతో – మసీదు వరకూ రావలసిన తీరుకి ఎవ్వరూ కూడా రారు. ఏదైనా పొరపాటున వచ్చిన వీళ్లే చాలు మరొకరు రాకుండా ఉండేలా చేయడానికి ఇలా ఉన్న ఆ వసతిలో సాయి చక్కని అంగరంగవైభవంగా ఉన్న భవనంలోనికి ప్రవేశించినట్లుగా భావిస్తూ, ఏ మాత్రపు అసంతృప్తీ లేకుండా ఆ మసీదులోనే ఉండదలిచాడు. భగవద్గీతలో కృష్ణుడన్నాడు. యదృచ్ఛా లాభ సంతుష్టః– ‘ఏది తన అదృష్టానికి దొరికినా దాంతోనే పరమసంతోషపడేవాడే నిజమైన గొప్పవాడని.’ సరిగ్గా అలాంటి లక్షణమే సాయిది! చేసిన మార్పులు ఏదైనా ఓ ప్రదేశానికి మనం వెళ్లాక, అక్కడే మనం ఉండాల్సి వస్తే కొన్ని మనకున్నంత పరిధిలో యధాశక్తి చేసుకుంటాం కదా! అలాగే సాయి ఆ మసీదులోకి ప్రవేశించాక చేసిన మొదటి పని చక్కని తులసి మొక్కని నాటడం. ‘ఇదేమిటి? మహమ్మదీయుడేమిటి? తులసి మొక్కని నాటడమేమిటి?’ అనుకున్నారు ఆ మసీదుపక్కగా పలచపలచగా వెళ్తూండే జనం. కొన్ని రోజులయ్యాక ఆ తులసి మొక్క దగ్గర వెలుగుతున్న దైవారాధనకి చిహ్నమైన దీపాన్ని ప్రతిరోజూ ఉండటాన్ని గమనించారు.మరి కొన్ని రోజులయ్యాక అక్కడికి కొద్ది పక్కగా రాత్రీపగలూ అనే భేదం లేకుండా అలా వెలుగుతూ– ఏనాడూ ఆరిపోవడమనేదే లేని అగ్నిహోత్రాన్ని గమనించసాగారు. దీంతో వచ్చేపోయే వాళ్లకి ఓ వింతగానూ ఆశ్చర్యపరిచేది గానూ అయింది ఆ మసీదూ, మసీదులోని సాయీను.లోనికి వెళ్లి పలకరించడమూ ఆయన చేస్తున్న ఈ విధానమూ గురించి అడిగి లో–రహస్యాన్ని తెలుసుకుందామనుకున్నా ఆ గోతుల్లో అడుగేస్తూ ఎగుడుదిగుడు నేలలో నడుస్తూ ఆ సన్నని తోవలో ఇరుకుగా ఉన్న రెండు పాడుబడ్డ గోడల మధ్యలో నుండి నడుస్తూ సాయిని చేరుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఆసక్తి ఉంది గానీ ఆ శక్తి లేదు. ఉత్సాహముందిగానీ ఆ ప్రోత్సాహం లేదు. ఒంటరిగానైనా వెళ్దామనే ఊహ ఉంది గానీ ఆ ధైర్యం చాలడం లేదు. ఇలా రోజులు గడుస్తుంటే సాయి మెల్లగా మసీదులో కొంతసేపు ఆ ఎదురుగా ఉన్న వేపచెట్టు కింద ఎక్కువసేపూ ఉండటాన్ని గమనించి ఆనందపడ్డారు ఆ వస్తూ పోతూ ఉండే జనం.ఎవరు ఎలా ఉన్నా ఖండోబా దేవాలయ అర్చకుడైన మహల్సాపతి మాత్రం సాయి ఆ మసీదులో ఉన్నకాలంలో కూడా నిత్యం రావడం, సాయికి అర్ఘ్యపాద్యాదులనిచ్చి నమస్కరించి వెళ్తూండటం మాత్రం చేస్తూనే ఉండేవాడు. ఈ విషయం జనంలోకి మరింతగా వెళ్లడంతో క్రమంగా సాయికి భక్తులు రావడం ప్రారంభించారు.మసీదేమిటి? తులసి మొక్కేమిటి? నిత్య దీపారాధన ఏమిటి? హిందువులంతా లక్ష్మీదేవిగా భావించే వేపచెట్టు మొదట్లో కూర్చుని కనిపిస్తూ ఉండటమేమిటి? పైగా హిందూధర్మాన్ని అనుసరిస్తూ ఉండే నిష్ఠాగరిష్ఠులు ప్రతి నిత్యం చేసే అగ్నిహోత్రంలా అక్కడ అగ్నిని వెలిగించి ఉంచడమేమిటి? మహమ్మదీయులే కాకుండా హిందువులూ పైగా జాతి, మత, వర్గ, కుల, స్త్రీ–పురుష, బాల, వితంతు భేదం లేకుండా క్రమక్రమంగా అందరూ రావడం ప్రారంభించాడు. దీని పేరేమిటి? ఇలా జరుగుతుంటే ఓసారి అడిగారు భక్తజనం. చూడ్డానికి మసీదే.. మసీదులా ఉండటం కాదు. కనిపిస్తున్నది పవిత్ర దైవదీపారాధనమే... దీపంలా ప్రకాశంకోసం పెట్టబడింది కాదు. లోపల ఉన్నది తులసి మొక్కే. అదేదో యధాలాపంగా మొలిచింది కానే కాదు. కావాలని నాటబడిందే..! వస్తున్నది గ్రామ దేవాలయ అర్చకుడు మహల్సాపతే. ఏదో మారు వేషంలో వస్తుండటం కాదు. ఇందరొస్తూ ఉన్న ఒక్క చిల్లుకానిని(రూపాయిలో 64వ వంతు) అడిగిన జాడ లేనే లేదు. ఇదంతా ఏమిటి? ఈ ప్రదేశం పేరేమిటి? ఈ విధానం పేరేమిటి?’ అని. సాయి చిరునవ్వు నవ్వుతూ ‘ఈ స్థలం పేరు ద్వారకామాయి. ఆ వెలుగుతున్న అగ్నిపేరు ‘ధుని’ అన్నాడు. పూర్తిగా అర్థంకాని అందరూ మరికొద్ది వివరణనీయవలసిందిగా అడిగితే సాయి చెప్పాడు.‘చతుర్ణా మపి వర్ణానాం యత్ర ద్వారాణి సర్వతఃఅతో ద్వారవతీత్యుక్తా విద్వద్భి స్తత్వవేదిభిః’అనే శ్లోకానికి అర్థాన్ని.లోకంలో నాల్గువిధాల వృత్తుల్ని చేస్తూ అలాంటి ప్రవర్తనతో ఉండే ‘బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర’ అనే వారున్నారు గదా! ఆ అందరికీ కూడా ‘ధర్మం అర్థం కామం మోక్షం’ అనే నాలుగూ పొందగలిగేలా చేసే శక్తి ఉన్న క్షేత్రం పేరు ‘ద్వారవతి’ దాన్నే ‘ద్వారక’ అంటారు హిందూసంప్రదాయంలో. అదుగో అలాంటి ద్వారకే ఇది. ఆ ద్వారకకి ప్రతిబింబం లాంటి ఈ ప్రదేశానికి నేను ‘ద్వారకామాయి’ అని పేరు పెట్టుకున్నానన్నాడు. ఎంత లోతైన అర్థమున్నపేరు! అది నీ పని కాదు! సహజంగా ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే.. ఎవరు దేన్ని విరాళంగా ఇచ్చినా ఆ స్థలానికో లేక తనకో అలాంటి వాడు కానేకాదని భక్తులకి నిత్యానుభవంలో అర్థమైంది. ఇలా వస్తూండే రాకపోకల భక్తుల్లో మరింత విశ్వాసం పెరిగిన గోపాలరావు గుండ్’ అనే అతను ఈ మసీదు స్థితిని గమనించి దీన్ని బాగుచేయదలిచి బాగుజేతకి కావలసిన రాతినీ సున్నాన్నీ ఇతర వస్తువుల్నీ పరికరాలనీ సమకూర్చి పనిని ప్రారంభించబోతే సాయి అతడ్ని పిలిచి ‘ఇది నీ వంతు కాదు. మానెయ్’ అన్నాడు. నానా (నానా సాహెబ్ ఛందోర్కర్)చేస్తాడులే! కంగారు పడకు అన్నాడు. నిజానికి నానా అప్పటికింకా ఆ పనికి సంబంధించిన ఆలోచనకి రానే లేదు.అలాగే ‘చెప్పలేనంత దుమ్ము ధూళి బూజులు బల్లులూ, ఎలుకలు ఇతర క్రిమికీటకాలు, పాములు తిరుగాడే ఆ ప్రదేశాన్ని బాగు చేసి ఎల్తైన గోడల్నీ లోపల ఎవరైనా వస్తే కూర్చుండే విధంగా సౌకర్యవంతమైన అరుగుల్ని కట్టించదలిచా’ అని అనగానే అది నీ పని కాదు. కాకా(కాకా సాహెబ్ దీక్షిత్) ఆ బాధ్యతని తీసుకోబోతున్నాడన్నాడు సాయి.తీవ్రమైన నిరుత్సాహం ఒక పక్కా, ఏదో చేసి సాయికి చక్కని సౌకర్యాలని కల్పించాలనే తపన ఒక పక్కా ఎవరెవరికో వచ్చిన ఆ అవకాశం తనకెలా వస్తుందా? అనే ఆత్రుత ఒక పక్కా ఉన్న సమయంలో మహల్సాపతి అక్కడి కొచ్చి పరిస్థితిని గమనించి ‘సాయిదేవా! అనుగ్రహించు!! ఆ భక్తుని కోరికని ఆదరించు’ అన్నాడు భక్తిగా ప్రణామం చేస్తూ. సాయి వెంటనే ‘ఈ ఆడంబరం దేనికి నాకు? నేను ఏదైనా అసౌకర్యం ఉందని అన్నానా? ఎప్పటి నుండోలేని ఈ సౌకర్యాలు ఇప్పుడెందుకు?’ అన్నాడు. అయినా పట్టుబట్టి మహల్సాపతి ప్రాధేయపడి ఒప్పించాడు సాయిని.అంతే! మసీదు మొత్తం దులపబడింది. నేల ఎత్తు చేయబడింది. గోడలన్నీ పటిష్ఠంగా నిర్మించబడ్డాయి. నేల గోతులు, ఎగుడుదిగుడులూ సరిచేయబడ్డాయి. ఎల్తైన ప్రదేశం మీద ధుని ఏర్పాటయింది. ఒక అంగవస్త్రం (తుండు/తువ్వాలు/పై వస్త్రం) వేసుకుని దానిమీద కూచునే సాయి చోటులో చక్కని ఎల్తైన వేదిక వచ్చింది. ఇక ఆ ఎదురుగా ఆవరణా సభామండపంలా అనిపించే తీరులో ఇనుప స్తంభాలు వాటి మీద ఓ కప్పు దాదాపుగా అయిపోతున్న దశలో ‘చావడి’ నుంచి ద్వారకామాయి కి వచ్చాడు సాయి. కోపంతో ఊగిపోతూ స్తంభాలన్నింటినీ దూరదూరంగా వెళ్లిపోయేలా తన్నేసాడు.కప్పుకోసం తెచ్చిన వస్తువుల్ని విసిరేసాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.కాసేపు మౌనధ్యానంలో ఉండిపోయాడు. మరికొంత సేపు ఏదో నామజపాన్ని చేసుకున్నాడు. పెద్ద వర్షం వచ్చి ఆగిపోయాక ఉండే పరిస్థితిలా ప్రశాంతంగా కళ్లు తెరిచి ఇనుపస్తంభాలని పాతబోయిన గుంటల్లో రూపాయి నాణాలని వేశాడు. మట్టి తానే వేసాడు స్వయంగా. ఈ ద్వారకామాయి రూపురేఖలని మార్చిన ఇద్దరు భక్తులకీ (కాకా తాత్యా) నూతన వస్త్రాన్ని తెప్పించి తలపాగలని తానే కట్టాడు.ఇలా ఆగ్రహించడానికి కారణం – ఏది సరైన ముహూర్తమో అడగకుండా తెలుసుకోకుండా ఉత్సాహం కారణంగా కట్టదలిచి పనిని ప్రారంభించేయడమే! మరి తులసి మొక్క దీపారాధనం వేపచెట్టు నీడ విశ్రమించడం ద్వారకామాయి అని పేరు పెట్టడం.. వంటి పనుల్ని చేసిన సాయి హిందువు కాడా? హిందూ ధర్మాన్ని పాటించాలని ఉపదేశించిన వాడు కాడా?అంతా అయ్యాక కొత్త ద్వారకామాయిలో అడుగిడిన సాయి అన్నాడు– ‘ఇక్కడ కోరితే కానిపని ఉండదు. ఇబ్బంది అనేది తొలగిపోతుంది’ అని. దానికి కారణం సాయి చేసే మంత్రజపశక్తి మాత్రమే! బాబా చిత్రప్రవర్తనలూ – అంతరార్థాలూ చూద్దాం! – సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
బాబాకు భోజనం పెడదామా!
సాయి గొప్పదనాన్ని వినడమే కాదు... ప్రత్యక్షంగా కూడా ఎన్నో నిదర్శనాలతో సహా చూసిన తాత్యా (తాత్యా పటేల్) దంపతులు ఎప్పుడు తమకు కొంత ఖాళీ దొరికినా వెంటనే షిర్డీ గ్రామానికి వచ్చేస్తుండేవారు. ’సర్వస్య శరణా గతిః’ అన్నట్లు సాయి దగ్గరే ఉంటూ ఆయన ఏం చేస్తే దాన్ని చేయడం.. ఆయన దేన్ని వద్దంటే ఆ పని తమ మనసుకి ఇష్టమైనదైనా సరే మానేయడం.. ఇలా సాయికి నీడలాగ ఉంటూ ఉండేవారు. కొందరికి అనిపిస్తుండేది.. ‘ఇక వీళ్లకు ఇట్లా పనీ పాటా, గొడ్డు గోదా, ఉద్యోగం సద్యోగమంటూ ఏమీ లేదా?’ అని.. తత్యా దంపతులు ఒకేమాట అంటుండేవారు. మాకు ఇళ్లు లేకా కాదు.. పని పాటా ఉండక కాదు.. అన్నీ ఉన్నాయి కానీ ప్రతిపనిలోనూ.. ప్రారంభంలోనూ.. మధ్యలోనూ..ముంపులోనూ ఒక అశాంతి ఉంటుంది. లేదా అసంతృప్తి కలుగుతుంది, కలిగే వీలు ఉంటుంది. అయితే సాయి సన్నిధిలో ఆ అసంతృప్తి, నిరాశ, అశాంతి అనేవి మచ్చుకి కూడా ఉండవు. తల్లి దగ్గర ఉన్న దూడకు మరో ఆలోచన ఎలా ఉంటుందో.. గూటిలో అమ్మతో ఉన్న పక్షి పిల్లకి ఆకాశంలో ఎగురుదామనే ఊహ ఉన్నా ఎలా ఇష్టం పుట్టదో అలా ఇంత విశాల ప్రదేశం మాకంటూ తిరగడానికి ఉన్నా శరీరంలో ఓపిక ఉన్నా.. ఖర్చు చేసుకుని తిరిగే ఆర్థిక శక్తి ఉన్నా ఇక్కడ ఉంటే ఆ ఆనందం ఎక్కడా మరెక్కడా ఉండదు. లేదంతే. ఇక మాకు కాశీ, ఇదే మాకు ప్రయాగ, ఇదే మాకు ద్వారకా, మీరు ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటున్నారో అవన్నీ మాకు మాకోసం షిర్డీకే వచ్చేశాయి. అందుకే మేము రోజుకో పుణ్య క్షేత్రానికి వచ్చిన ఆనందంతో సాయిసన్నిధిలో గడుపుతూ ఉంటామని స్పష్టమైన అవగాహనతో, విశ్వాసంతో చెబుతూ ఉండేవారు. అంతటి శరణా గతి ధర్మం ఉన్నవాళ్లు ఆ దంపతులు. ఇలా ఉంటే ఒక రోజున తాత్యా భార్య సాయి దగ్గరకు వచ్చి మౌనంగా నిలబడి చూపులతో ఆయన్నేదో ప్రార్థించినట్లుగా చూసింది. సాయి ఆమెను చూస్తూ ‘‘సందేహించకు..! అడిగేది ఏదో అడుగు.. ఆలోచనను లోలోపల దాచేసుకోవడం పిరికితనానికి చిహ్నం. తప్పు పని గురించి అడుగుతున్నామేమో అనే భయానికి సాక్ష్యం అడుగు’’ అన్నాడు. వెంటనే చెప్పలేనంత ఉత్సాహంతో ఆమె సాయికి సాగిలపడి లేచి ఆయన మొఖంలోకి చూస్తూ.. ‘దేవా ! ప్రతి రోజూ నేను విందును తీసుకొస్తే ఆరగిస్తున్నావు కదా.. ఈ దీనురాలి ప్రార్థన మన్నించి ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఎందుకు ఆరగించకుడదూ..? నీకు ఏమేమి పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాలు నాకు తెలుసు.. వండే అవకాశం నాకు ఉంది. దయచేసి రావూ?’ అని అడిగి ఆయన ఏమంటాడో అని అలా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆయన సమాధానం ఇవ్వకుండానే.. ‘సాయి! మా ఇల్లు ఇక్కడకు చాలా దగ్గర. పైగా సమయం పాటించే లక్షణం కూడా మా దంపతులది. నిన్ను రప్పించి నువ్వొచ్చాక నేను ఆలస్యం చేయను నీ భోజనానికి దయచేసి రావూ !’ అంది. సాయి నవ్వుతూ ‘అమ్మా..! భిక్షం కోసమని అన్ని వీధులు తిరిగే నాకు దగ్గర దూరం అనేది ఓ లెక్కా? ఇక బిడ్డకు అన్నం పెడతానని తల్లిలా నువ్వు అంటుంటే ఎందుకు రానూ.. పిలవడమే ఓ అదృష్టంగా భావించి వచ్చి తీరుతాను.. నువ్వన్నావే సమయ నియమాన్ని పాటిస్తున్నానని.. దానికి సరిపోయేలా 5 కొట్టేసరికల్లా మీ ఇంటికి వస్తాను. భిక్షగాడైన నాకు మీ ఇంటి చిరునామాను, దూరాన్ని వివరించి చెప్పాలి కూడానా..? నాకు పోళీలు (మహారాష్ట్ర వంటకం) బాగా ఇష్టమని తెలిసిందంటున్నావే..! తల్లికి కదామ్మా బిడ్డకు ఇష్టమేదో తెలుస్తుంది. సరే రమ్మంటున్నావుగా వస్తాను అన్నాడు. అంతే ! ఆమె ఉరుకులాంటి నడకతో ఇంటికి వెళ్లి వంటింటిని ఒకటికి రెండు మార్లు శుభ్రం చేసి ఏ ఒక్కరిని కూడా సహాయానికి పిలవకుండా అంతా తానే చేసి సాయికి వడ్డించాలనే ఆనందంతో మొత్తానికి పోళీలని చక్కగా చేసింది. మంచి వెండిపళ్లెంలో చక్కగా సర్ది మరీ పెట్టింది. ఇటు వంటకాన్ని చేస్తుండడం అటు గడియారాన్ని చూస్తూండడం.. ఇలా మొత్తానికి 5 గంటల ముందే అంటే 4 గంటలకే సిద్ధం చేసి సాయి రాకకోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే కూచుంది ఈ వీధిలోకి కళ్లని ప్రసరింపజేస్తూ. వంటింటి ముందున్న గదిలో అగరువత్తుల ధూపాన్ని బాగా వేసి మరీ ఆమె ఎదురు చూస్తూ ఉండిపోయింది.సమయం 4 దాటింది. నాలుగున్నర అయింది. సాయికి ముగ్గులు బాగా ఇష్టం కదా! అని ఆ వడ్డించబోయే గదిలో ముగ్గులు వేయడం ప్రారంభమయింది అటు 5 గంటలనే మాట గుర్తుంచుకుని. ఈ పనిధ్యాసలో ఈమె ఉండగా ఎక్కడినుండో ఓ నల్లకుక్క గబగబా ఇంట్లోకి దూరి ఆ పోళీలని తినడం కోసం నోరు తెరిచి పళ్లెం దగ్గరకి వెళ్లింది. వెంటనే అపరిమిత కోపం వచ్చిన ఆమె– పాడుకుక్కా! సాయికోసం నైవేద్యంగా పెడితే నువ్వెక్కడ దాపురించావంటూ దగ్గర్లో కర్ర కనపడబోతే చిన్న ఇనుప కడ్డీని దాని మీదికి విసిరింది. అది దానికి తగిలి బాధతో అరుచుకుంటూ వెళ్లిపోయింది. సమయం ఆరు ఆరున్నర ఏడు కూడా అయింది. ఎంతో నిరాశతో ఆమె సాయి మందిరానికి ఈ పోళీలున్న పళ్లాన్నే పట్టుకుని వెళ్లింది. సాయి అప్పటికి తన భక్తులూ శిష్యులైన వాళ్లందరి మధ్యా కూర్చుని ఈమెని ఉద్దేశిస్తూ– ‘చూశారా! ఈమెకెంత కోపం వచ్చిందో! నన్ను విందుకి పిలిచింది తన ఇంటికి. నేను వస్తానని కూడా అన్నాను. తీరా నేను కచ్చితంగా ఆమెతో అన్నట్టుగానే ఆమె కూడా ఒప్పుకున్నట్టుగానే 5కే వెళ్లాను ఆమె ఇంటికి. మంచి ముగ్గులు వేసింది. అగరు ధూపం వేసింది. ఇదుగో! ఈ వెండిపళ్లెంలోనే పోళీలని చూడముచ్చటగా కూడా సర్ది ఉంచింది.అయితే ఏం లాభం? నేను తినబోయేసరికి ఓ ఇనుప కమ్మీని నా మీదికి విసిరింది. భయంతో అరుచుకుంటూ పారిపోయి వచ్చానని ఆమె వంక చూస్తూ ముగించాడు. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. మహల్సాపతితో పాటు అక్కడున్న భక్తులందరికి ముందు ఏమీ అర్థం కాకపోయినప్పటికీ ఆమె వివరించిన విషయం తెలిసి అందరూ నివ్వెరపోయారు. ఆమె మళ్లీ సాయిని ప్రార్థిస్తూ.. ‘సాయి దేవా..! జరిగిందేదో జరిగిపోయింది నాదే తప్పు. పొరపాటైంది మన్నించు. ఇన్నినాళ్ల నుంచి నిన్ను సేవిస్తున్నా నీ తత్వం తెలియని అజ్ఞానిని. మన్నించు. రేపు సాయంత్రం ఇదే సమయానికి మాల్ పూరీలను పానకంలో ముంచి సిద్ధం చేసి ఉంచుతాను. నీ కోసం ఎదురుచూస్తుంటున్నానని దీనాతిదీనంగా పలికింది. సాయి అన్నాడు.. ‘‘తల్లీ ! అంత దీనంగా వేడుకోవాల్సిన అవసరం లేదు. నేను తప్పక వస్తాను. విందు ఆరగిస్తాను. సరేనా’’ అన్నాడు. అంతే! ఆమె కిందటి రోజులాగే.. అంతా సిద్ధం చేసుకుని కూర్చుంది. మాల్ పూరీలను పానకంలో ముంచి ఉంచేసరికి ఆ చక్కని సువాసన ఆ వీధి వెంట వెళుతుంటే అందరి ముక్కుపుటాలకు తాకనారంభించింది. ఏదో విశేషముందని అందరూ లోపలికి రాబోతుంటే ఆమెకు ఒక పక్కసాయేనేమో అని భయం. మరోపక్క ఇతడు.. వాడు నాకు తెలిసిన వాడే కదా అని ఊరటా.. ఇంతలో ఏ కుక్క వస్తోందని ఆత్రుత. కుక్క వచ్చినా సాయిలానే భావిద్దామని ఉత్సాహం. కొన్ని కుక్కకు పెట్టి మరికొన్ని సాయికి పెడదామనే ఆలోచన. ఒకటేమిటి వేలవేల ఊహలు.. ఆపోహలు ఆమెకు మనసులో అలా తాండవించ సాగాయి. అటు వీధిని.. ఇటు ఇంటిని మరోవైపు వచ్చి పోతూ వినోదంగా చూస్తుండే మనుషులను చూస్తుంటే ఎక్కడ నుంచో ఒక పెద్ద దున్నపోతులా ఉన్నటు వంటి శరీరంతో కనిపిస్తున్న గవిడిగేదె తన ముందు కాళ్ల రెంటిని లోపలి గదిలోనికి పెట్టి ఆనందంతో అంబా అని అరుస్తూ లోపలికి పోబోయింది. చెప్పలేని కోపంతో కర్రతో బలంగా కొట్టి పంపేసింది ఆమె. అంతకుముందు తను ఎప్పుడూ చూడని.. ఎన్నడూ రాని కుక్క వచ్చింది కాబట్టి ‘సాయి’ అని గుర్తించలేకపోయాను గాని, ఈ గేదెని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను కాబట్టి ఇది సాయి రూపం కానేకాదనుకుని తనకు తాను సమాధానపడిందామె. అనుకున్నట్టుగా 5 దాటింది. ఐదున్నర ఆరుకూడా అయ్యింది. ఆరు దాటింది. మళ్లీ నిన్నటి లాగానే తీవ్ర నిరుత్సాహంతో ఆ వంటకాన్ని తీసుకుని సాయి తన భక్తులకి ఏదో అధ్యాత్మిక విశేషాలను వివరిస్తున్న ఆ మందిరానికి వెళ్లి సాయికి నమస్కరించబోయింది. వెంటనే సాయి తన భక్తులందరితో ‘ఈ అమ్మ పిలిచింది కదా ఈ బిడ్డని’ అనే అభిప్రాయంతో ఆమె ఇంటికి సకాలంలో వెళ్లి ఎప్పుడు తిందామా? అనే ఆకలి కడుపుతో పోతే వెంటనే బలంగా కర్ర తీసుకుని మోదింది. చూడండి బలంగా ఎంత దెబ్బ నాకు తగిలిందో! ఇదేదో ఆమె ఇష్టంగా పిలిస్తే నేను నిందని ఆమె మీద వేస్తున్నానేమిటని భావించకండి అంటూ తన కఫ్నీ (పెద్ద పొడుగాటి చొక్కా) పైకెత్తాడు. బలంగా కర్రతో కొట్టిన వాత అందరికీ కనిపించింది. తాత్యా భార్యకి మాట రాలేదు. రెండుసార్లు అపచారం చే శాననే మనోబాధ పెల్లుబికింది. నిన్నయితే ఇనుపకమ్మీని విసిరిందే గాని కుక్క తప్పించుకుంది. ఈ రోజున ఆ గేదెకి తగలనే తగిలింది. అది కాస్తా సాయి శరీరానికే తగిలిందని బాధపడుతూ అనేక పర్యాయాలు క్షమించవలసిందంటూ సాయిని ప్రార్ధించింది. ‘అమ్మా! నేను ఈ భౌతిక శరీరంలో వస్తేనే కాని వచ్చినట్టుగా భావించకు.. అన్ని రూపాల్లోనూ సాయి ఉన్నట్టుగా భావించి ఏది ఆ సమయానికి నీకు కనబడినా నాకు పెట్టినట్టుగానే భావించు. నేను కోరుకునేది కూడా భూతదయ ఉండాలనే. జీవించి ఉన్న ప్రతి ప్రాణినీ భూతమంటారు కదా! నేనూ ప్రాణినే. నువ్వూ ప్రాణివే. ఇక్కడ అందరూ కూడా ప్రాణం ఉన్నవాళ్లు కాబట్టి అందరూ కూడా భూతాలే. గుర్తుంచుకో! అన్నాడు సాయి. ఆమె కన్నీరు కారుస్తూ దీనాతిదీనంగా నిలబడితే ఆమె లోపలి భావాన్ని గ్రహించిన సాయి.. తల్లీ! ఇదిగో ఊదీ (విభూతి) నిచ్చాను తీసుకో! సాయంత్రం 5 కే వస్తాను. చక్కని పేణీలనే సిద్ధంగా ఉంచు! అవే నాకు ఇష్టం కదా! అన్నాడు. పరుగు లాంటి నడకతో ఆమె ఇల్లు చేరి మధ్యాహ్నం 2 గంటలకే పేణీలని సిద్ధం చేసి ఇక 5 గంటలకి ఏ కుక్క వచ్చినా గేదె వచ్చినా ఆవు వచ్చినా.. ఇక ఏది వచ్చినా దాన్నే సాయిరూపంగా భావించాలనే అభిప్రాయంతో దృఢంగా నిశ్చయబుద్ధితో ఉండిపోయి ఎదురుచూడ సాగింది. సాయి వచ్చే మార్గమంటూ తమయింటిని ఒకటే ఉండటం వల్ల ఆమెకి అటూ ఇటూ చూడాల్సిన అవసరం తప్పింది. తగిన విధంగా గది తలుపులు దగ్గరకి వేసి సాయి రావలసిన తోవనే చూస్తూ ఉండిపోయింది. ఎందుకు సమయాన్ని వ్యర్ధపరచాలనుకుంటూ సాయి సంకీర్తనాన్ని శ్రావ్యంగా తాను పాడుతుంటే ఆ సమీపంలో ఉన్న గృహిణులు కూడ గొంతు కలిపారు. మొత్తానికి ఆ ఇల్లు వాయిద్యధ్వనితో నిండిన ఓ సంగీతవేదికలా అన్పించింది అందరికీ. ఆమెకి నిన్న రాత్రి నిద్రపట్టలేదు. దానిక్కారణం సాయిని కర్రతో కొట్టాననే తీవ్ర మనోవేదన. పైగా ఇంటికి పిలిచి కొట్టానుకదా! అనే దుఃఖం. మళ్లీ అంతలోనే ‘నాకు సాయియే అనే భావం ఉంటే అలా చేసి ఉండేదాన్ని కాదు గదా!’ అనే దోషంలేని ఊహ. ఇలా ఊహా అపోహా నేరమూ శిక్షా.. ఈ తీరు భావనలతో ఉండిపోయింది. 5 అయింది. అయిదున్నర అయింది. సాయి జాడలేదు. దిక్కుతోచని ఆమె ఆ పేణీలని పెట్టిన పళ్లాన్ని తీసుకుని సాయి ఉన్న మసీదు వద్దకి వెళ్దామని లోనికి వచ్చి చూసి వాటికి పట్టిన గండు చీమల్ని దులిపి మసీదులో సాయి వద్దకి వెళ్లి నమస్కరిద్దామనుకుని ఆయన్నే ప్రార్ధించి రప్పించాల్సిందే! అనుకుంటూ ఆయనకి మొక్కింది. సాయి ఆమెని చూస్తూనే.. అమ్మా! పేణీలు ఎంత రుచిగా ఉన్నాయమ్మా.. చాలా చక్కగా చేశావు నాకోసం! ఇంత ప్రేమతో నాకు ఆ వంటకాన్ని నువ్వు పెట్టావుగా! కడుపు మొత్తం నిండిపోయింది. నాకెంతో ఇష్టమైన తీపిని సమపాళ్లలో పెట్టి మరీ సిద్ధం చేశావు. ఇక ఇలా నాకు తీపి పదార్ధాలని సిద్ధం చేస్తూ అస్తమానం పిలుస్తూ ఉంటే నా ఆరోగ్యం కూడా చెడిపోతుంది! చాలునమ్మా.. అంటూ పూర్ణిమచంద్రుని లాంటి నవ్వుని నవ్వాడు సాయి. ఆమెకేమీ పాలు పోలేదు. ‘వంటకమంతా ఇంట్లో ఉంటే ఆయనెప్పుడు తిన్నాడు?’ అనేది ఆమె చింత–అనుమానం. ఆ స్థితిని గమనించిన సాయి ఆమెని చూస్తూ.. ‘అదేమిటమ్మా! తీపిని సిద్ధం చేసింది నువ్వేకదా! ఆ వెనుక గదిలో కిటికీ పక్కన ఉంచింది నువ్వే కదా! రంగురంగుల ముగ్గులతో నిండిన గదిని దాటి అగరువత్తుల వాసనలతో గది మొత్తాన్ని నింపి నాకోసం కొత్త పళ్లెంలో కొత్త ఆకుల మీద పేణీలని పెట్టిందీ నువ్వే కదా! తినలేదని ఎందుకంటావు? ఎన్ని చీమలు సుఖంగా తిన్నాయి! వాటిని చూడగానే రుచికి ఆశపడ్డ నోరు నీకు కన్పించాలనే ఆలోచనని కూడా వేయలేదు. అందుకే అలా తినేసా’నన్నాడు. ఆమె నివ్వెరపోతుంటే.. సాయి అన్నాడు– ‘‘అమ్మా.. భగవంతుడు 84 లక్షల జీవరాసుల్ని సృష్టి చేశాడు. తెలుసా నీకు? ఓ తండ్రి తన ఇంట్లో తానొక్కడే ఎప్పుడూ భోజనం చేసి నిద్రపోడు. తమ సంతానం భోజనం చేసిందా? అని గమనించి వాళ్లు తింటూంటే తాను ఆకలితో ఉన్నా తృప్తిగా చూపులతో భోజనాన్ని ముగించి ఆ మీదట భౌతికంగా తాను తింటాడు నోటితో. తల్లివి నీవు! బిడ్డల ఆకలి నీకు తెలిసినట్టుగా నాకెలా తెలుస్తుంది? ‘‘తల్లీ.. ! నీ విందుకి చాలా ఆనందమమ్మా! ఎప్పుడు నాకు భోజనాన్ని పెట్టాలని నీకు అన్పించినా ఏదో ఒక ప్రాణిని పిలిచి లేదా తనంతటి తానే వస్తే దానికి పెట్టు. పెట్టేటప్పుడు నా పేరుని ఒక్కమారు అనుకో! అంతే!! అది నన్నే చేరుతుంది విందూ లేదా నైవేద్యం రూపంగా! సంతోషమమ్మా’’ అని ముగించాడు సాయి. ఆమె తన్మయత్వంతో అలా ఆనందబాష్పాలని విడుస్తూనే ఉండిపోయింది. నేను వేదాలని చదివిన వాడిని. మసీదుకొస్తే మైలబడతా! అని పలికిన పండితుని కథ ఏమిటోచూద్దాం! – సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
రేసర్.. సాయిధర్..
పశ్చిమగోదావరి,జంగారెడ్డిగూడెం: జిల్లాకు చెందిన సాయిధర్ను రేసర్ కావాలనే అతని ఆసక్తి టాలెంట్ హంట్ టెస్ట్‌లో ఫైనల్ వరకు తీసుకువెళ్లింది. చిన్నతనం నుంచి రేసింగ్‌పై మక్కువ ఉన్న అతను హోండా–టెన్10 రేసింగ్ అకాడమీ నిర్వహిస్తున్న 2018 హోండా టాలెంట్ హంట్ టెస్ట్‌కు వెళ్లి సత్తాచాటాడు. ఫైనల్ పోరులోనూ పాల్గొన్నాడు. వివిధ దశలో ఫైనల్ జరిగింది. ప్రస్తుతం అతను ఫైనల్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఫైనల్లో విజేతగా నిలిస్తే రేసింగ్ అకాడమీకి ఎంపికవుతాడు. దీంతో జాతీయ స్థాయిలో రేసింగ్ పోటీలకు పాల్గొనేందుకు మార్గం సుగమం అవుతుంది. ఏలూరుకు చెందిన 18 ఏళ్ళ దాసరి సాయిధర్ ఆల్ ఇండియా లెవల్ హోండా ఇండియా టాలెంట్ హంట్ టెస్ట్‌లో ఫైనల్ క్వాలిఫయింగ్ పూర్తిచేశాడు. గత నెల 27 నుంచి చెన్నై ఇరున్గటుకొట్టాయ్లోని మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ రేస్ ట్రాక్‌లో జరిగిన ఫైనల్ పోటీల్లో ప్రతిభ చాటాడు. వివిధ దశల్లో హోండా టాలెంట్ హంట్ టెస్ట్ మూడు దశలలో జరుగుతుంది. మొదటి దశలో రాష్ట్రస్థాయిలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో డ్రైవింగ్ స్కిల్స్, ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. మూడో స్టేజ్‌లో రేస్ ట్రాక్‌పై పోటీ నిర్వహిస్తారు. తొలి క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో భాగంగా సాయిధర్ ఆన్లైన్ పరీక్షను పూర్తిచేసి రెండో క్వాలిఫయింగ్ ఎంపికయ్యాడు. ఈనెల 18న తెలంగాణ రాష్ట్రం షామీర్పేట్లో జరిగిన రెండో క్వాలిఫయింగ్‌లో 16 మందితో పోటీ పడి విజేతగా నిలిచాడు. మొత్తం ఐదు రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొనగా రాష్ట్రానికి ఒకరు చొప్పున ఎంపిక చేశారు. వీరిలో 4వ వాడిగా సాయిధర్ రాష్ట్రం నుంచి ఎంపికయ్యాడు. 27వ తేదీ నుంచి చెన్నై ఇరున్గటుకొట్టాయ్లోని మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ రేస్ ట్రాక్‌లో జరుగుతున్న పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీలో మొత్తం 9 మంది పాల్గొనగా, ప్రస్తుతం సాయిధర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు అనంతరం హోండా టెన్10 రేసింగ్ అకాడమీకి ఐదుగురిని ఎంపిక చేస్తారు. ఇదీ నేపథ్యం ఏలూరులో పుట్టి పెరిగిన సాయిధర్ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గిరిధర్ పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. సాయిధర్ చిన్నతనం నుంచి బైక్ రేస్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు. ఖాళీ సమయాల్లో టీవీలో ఎక్కువగా బైక్ రేస్‌లను చూస్తుండేవాడు. క్రమేపీ ఆ ఆసక్తి అతను బైక్ సంబంధిత గేమ్స్ వైపు మళ్ళింది. ఇదే సమయంలో మోటార్ బైక్‌ను నేర్చుకోవడం, బైక్ నడపటంలో నైపుణ్యతను సాధించాడు. ఇది గమనించిన సాయిధర్ సోదరుడు శశిధర్ తమ్ముడిని మరింత ప్రోత్సహించాడు. ఎప్పటికైనా జాతీయా స్థాయిలో మంచి రేసర్‌ని కావాలనే తన ఉద్దేశాన్ని సోదరుడికి తెలపడంతో తమ్ముడిని ప్రోత్సహించాడు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌కి పంపించాడు. అక్కడ సాయిధర్ ఫిజికల్ ట్రైనింగ్, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాడు. అయితే జాతీయ స్థాయి రేసర్ కావాలంటే అతనికి రేసింగ్ లైసెన్స్ ఉండాల్సి రావడంతో అకాడమీకి పంపాలని యోచన చేశాడు. ఇదే సమయంలో హోండా టెన్10 రేసింగ్ అకాడమీ రేసింగ్‌పై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చే నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆన్లైన్ ప్రకటన ఇచ్చింది. దీంతో సాయిధర్ దరఖాస్తు చేసుకుని పోటీల్లో పాల్గొన్నాడు. మంచి రేసర్నికావాలనేదే లక్ష్యం నాకు బైక్ రేసులంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి బైక్ రేసులను ఎక్కువగా చూసేవాడిని. గేమ్స్ కూడా ఆడేవాడిని. వాటిలో ఉన్న కొద్ది మెలకువలతో నేను బైక్‌ను నేర్చుకున్నాను. నాకున్న ఆసక్తికి నా తండ్రి గిరిధర్, సోదరుడు శశిధర్లు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ప్రస్తుతం అకాడమీలో చేరేందుకు పోటీకి హాజరయ్యాను. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో మంచి రేసర్‌గా గుర్తింపు పొందాలనేది నా లక్ష్యం. –సాయిధర్, రేసర్ -
కులాంతర వివాహం చేసుకుందని..
బెజ్జంకి(సిద్దిపేట): కులాంతర వివాహం చేసుకుందని చెల్లెలిపై ఓ అన్న కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన చిట్టం పెల్లి మౌనిక 12 రోజుల క్రితం మండలంలోని తోటపల్లికి చెందిన తన డిగ్రీ క్లాస్మేట్ సొల్లు సాయిని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆపై తమకు రక్షణ కల్పించాలని ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం శనివారం బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌కు రావల్సిన మౌనికతో సోదరుడు నాగరాజు ఘర్షణ పడ్డాడు. పరువు తీస్తున్నావంటూ కత్తితో దాడికి పాల్పడటంతో ఆమె వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నాగరాజు పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మౌనికను తాతయ్య, స్థానికులు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సాయి అనే మాటకి అర్థం..?
ఖండోబా గ్రామదేవత ఆలయ అర్చకుడు మహల్సాపతి పెట్టిన పేరే ‘సాయి’. ‘యా సాయీ!’ (దయచేసి రండి సాయీ!) అని ఆయన ఆహ్వానిస్తే సాయి లోనికొచ్చాడు.ఇంతకీ సాయి అనే పేరుతోనైతే మహల్సాపతి పిలిచాడు గానీ ఈ పదానికున్న అర్థం ఏమిటనే సంశయం మనకొస్తుంది కదా! మరాఠీ భాషా నిఘంటువు ప్రకారం సాయి అనే మాటకి ‘ప్రభువు – దేవుడు – నాథుడు – ప్రియుడు – ఫకీరు’ అనే అర్థాలున్నాయి. ఇది ఇప్పుడే కొత్తగా వచ్చిన పదం కాదు. భక్తకబీరు ‘సాయి’ అనే పదాన్ని ‘అత్యంత సమర్థతతో లోకాలని నడిపించే భగవంతుడు’ అనే అర్థం వచ్చేలా తనగీతాల్లో వాడాడు.‘సాయి’ అని ఎందుకు మహల్సాపతి సంబోధించాడో క్రమంగా చూసుకుంటూ వెళదాం. సాయి పదానికి మొదటర్థం ‘ప్రభువు’ అని. ‘భు’ అంటే ‘ఉన్నవాడు’ అని అర్థం. ‘స్వయం+భు+వు’ అనే పదానికి తనంతట తానుగా పుట్టి, ప్రస్తుతం ఉన్నవాడని అర్థం. అలాగే ‘ఆత్మభువు’ అనే మాటకి ఆత్మ నుండి పుట్టి ప్రస్తుతం ‘ఉన్నవాడు’ అని అర్థం. మనోభువు అనే మాటకి మనసు నుండి పుట్టి ప్రస్తుతం ‘ఉన్నవాడు’ అని అర్థం. ఈ తీరులో ‘ప్రభువు’ అనే అర్థమున్న సాయిపదానికి ‘ప్ర+భు+వు’అంటే మానవ అతీతమైన లక్షణాలు కలిగి ప్రస్తుతం ఉన్నవాడు అని అర్థమౌతుంది. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోగల శక్తి సాయికి ఉండడమనేది ఈ ప్రభువనే అర్థానికి సరైన ఉదాహరణ. ఇక సాయి అనే పదానికి ఉన్న రెండో అర్థం ‘దేవుడు’. దీవ్యతీత దేవః – ఎప్పుడూ మానసికానందంతో ఉండేవాడని దీనర్థం. ఎండకి మాడుతున్నా, వర్షం తనని తడుపుతున్నా, చలి తనని బాధిస్తున్నా, సమయానికి తిండి దొరక్కున్నా, ఎవరిమటుకు వారు తమతమ ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చున్నా – ఏవిధమైన దుఃఖమనేది లేకుండా అదే మసీదు దగ్గర ఉండటం. ఆ సమయంలో కూడా ఆనందంగానే ఉండటమనేది ‘దేవుడు’ అనే ఆ అర్థానికి సరైన ఉదాహరణ.సాయి అనే పదానికున్న మూడో అర్థం ‘నాథుడు’. ‘నాథే’ తాను అండగా ఉండి రక్షించేవాడని ఈ మాటకి అర్థం. కలరావ్యాధితో బాధపడుతున్న షిర్డీవాసులకి తాను అండగా ఉండే కదా గ్రామప్రజలు కలరా రోగులు కాకుండా రక్షించాడు! కాబట్టి నాథుడనే అర్థానికి ఉదాహరణ ఇదన్నమాట!సాయి అనే పదానికున్న నాలుగో అర్థం ‘ప్రియుడు’. ప్రియుడు అనగానే రోజులు మారాక ‘ప్రేమించిన వాడు’ అనేది అర్థంగా అయిపోయింది. అయితే ప్రియుడనేమాటకి సరైన అర్థం అది కాదు. శరీరం నిండుగా ప్రేమతత్త్వం కలవాడని. ప్రియుడు అనగానే కేవలం మనుషుల విషయంలో.. అందునా యవ్వనవంతుల విషయంలో మాత్రమే ప్రేమ కలిగినవాడనేది దాని భావంగా కనిపిస్తుంది. ప్రేమభావమనేది పక్షుల విషయంలో, కుక్కల విషయంలో, చెట్ల విషయంలో ఇలా అన్ని చరాచర జాతులన్నింటిలోనూ ఉండాలి. సాయి ఎన్నో పక్షులకి తిండిగింజల్ని వేసేవాడు. కుక్కలకి ఆహారాన్ని పెట్టేవాడు. నిత్యం ‘లెండీ’ అనే పేరుగల తోటలో చెట్లకి నీటిని క్రమం తప్పకుండా పోస్తుండేవాడు. కాబట్టి ప్రియుడనే ఆ అర్థానికి ఇవన్నీ ఉదాహరణలన్నమాట! సాయి అనే పదానికి ఉన్న చివరి అర్థం ‘ఫకీరు’. దేని మీదనూ ధ్యాసలేకుండా ఉండేవాడిని ఫకీరు అంటారు. ఒకే వస్త్రాన్ని కట్టుకోవడం, భిక్షాటన చేసి తెచ్చుకున్న ఆహార పదార్థాలని ఒక గిన్నెలో ఉంచి, కనీసం మూత కూడా లేకుండా చేసి.. కుక్కలు, పక్షులు, చీమలు తింటున్నా పట్టించుకోకుండా.. అవి తినగా మిగిలిందాన్ని ఏ మాత్రపు అసహ్యం లేకుండా తినడం, ఒకవేళ భిక్షాటనలో ఆహారం లభించకపోతే తిండి లేకుండా ఉండటం ఇవన్నీ ఫకీరు లక్షణాలే కదా! కాబట్టి ఫకీరు అనే అర్థానికి ఇవి ఉదాహరణలన్నమాట!ఇన్ని తీరుల లక్షణాలనీ గమనించాడు కాబట్టే ఖండోబా దేవాలయ అర్చకుడైన మహల్సాపతి ‘సాయి’ అనే పేరుతో ఆయన్ని సంబోధిస్తూ తన గౌరవాభిమాన భక్తులన్నిటినీ కలుపుతూ ‘యా సాయీ! (సాయీ! దయచేయండి)’ అన్నాడన్నమాట.సంస్కృత పండితులు కొందరు ‘సాయి’ అనే పదం సంస్కృత వ్యాకరణం ప్రకారం సరికాదు కాబట్టి ఆయన్ని ‘శాయి’ అని పిలవాలంటూ ‘శాయి బాబా’ అనడం మొదలెట్టారు ఒకప్పుడు. ‘శాయి’ అనే పదం సంస్కృత భాష ప్రకారం.. నిత్యం శయనించి (పరుండి) ఉండేవాడు (శేతే ఇతి శాయీ) అనే అర్థాన్నిస్తుంది. శేషుని మీద పరుండి ఉండేవాడు కాబట్టి ‘శేష శాయి’ అయ్యింది. ఆ పదాన్ని ఉచ్చరించేటప్పుడు ‘శేషసాయి’ అనకూడదు. ఇక్కడ ‘సాయి’ అనేది సంస్కృత భాషాపదం కాదు. మరాఠీ పదం కాబట్టి ‘శాయి’ అనకూడదు. ‘సాయి’ అనే అనాలి. అలాగే ‘బాబా’ అనేది కూడా ‘తండ్రి వలే రక్షకుడు’ అనే అర్థాన్నిస్తుంది కాబట్టి సాయి లేదా సాయి బాబా అనే అనాలి తప్ప శాయి అని గాని శాయిబాబా అనిగాని అనకూడదు. శాయి అనేది సంస్కృత పదమే అయినా మళ్లీ ‘బాబా’ అనేది సంస్కృతం కాదు కాబట్టి ‘శాయి బాబా’ అనకూడదు. దాసగణు కథ ఒక ఇంటిని మనం కట్టుకున్నాక ఏయే వస్తువులు మనకి అవసరమవుతాయో గమనించుకుని ఎలా తెచ్చుకుని మనింట్లోనే ఉంచుకుంటామో, అలా సాయి కూడా తనతో పాటుగా ఏయే లక్షణాలున్నవారిని ఎవరెవరిని శాశ్వతంగా ఉంచుకోవాలో బాగా ఆలోచించుకున్నాడు. ఆయన దృష్టి అనన్యసామన్యం కదా! అలా ఆయన మనోభీష్టానికి అనుగుణంగా వచ్చి ఆయన దగ్గరే ఉండిపోయినవాళ్లే కాకా సాహెబ్, నానా సాహెబ్, సచ్చరిత్ర రాయాలనే దృక్పథానికి వచ్చిన అన్నాసాహెబ్ అనేవాళ్లు. ఈ ముగ్గురూ మంచి మిత్రులైపోయారు. వీరు కాక ఇంకా ఎందరో ఆయన దగ్గరికి రావడం భక్తులుగా మారిపోయి ఆయన సన్నిధిలోనే ఉండిపోవడం జరిగింది.అలాంటి ఉత్తమ భక్తుల కోవలోకి మరొకర్ని రప్పించుకోవాలని మనసులో భావించాడు సాయి. ఆ అనుకున్నది ‘దాసగణు’ అనే ఒక పోలీసు ఉద్యోగాన్ని చేస్తున్నవానిని గూర్చి సాయి తనలో అనుకోవడం తడవు – దాసగణుకి షిర్డీ రావాలని అనిపించింది. సాయి అతణ్ణి చూస్తూ.. ‘గణూ! ఆ పోలీసు ఉద్యోగాన్ని మాని ఈ మానవసేవకి అంకితం అయిపోకూడదూ? ప్రశాంతంగా జీవితాన్ని వెళ్లదీయచ్చుగా!’ అన్నాడు.దాసగణు ఆ మాటలకి కొద్దిగా అసంతృప్తి పడి – ‘స్వామీ! నేనిప్పుడు సాధారణ పోలీసుని. ఎందుకో పదవోన్నతిని పొంది సబ్ ఇన్స్పెక్టరుగా కొంతకాలంపాటు ఆ హోదాలో ఉండి ఆ మీదట వద్దామనుకుంటున్నా’ అన్నాడు. సాయి చిరునవ్వుతో ‘అలాగా! అలాగే కానీ!’ అన్నాడు. చాలా తొందరకాలంలోనే దాసగణుకి పదవోన్నతి లభించింది. సబ్ ఇన్‌స్పెక్టరయ్యాక సాయి వద్దకొస్తానన్న ఆ మాట తనలో తిరుగాడుతూనే ఉంది. సాయి దర్శనానికొచ్చాడు. సాయి మాట్లాడుతూ.. ‘గణూ! ఇన్‌స్పెక్టరయ్యాక వచ్చేస్తానన్నావుగా!’ అన్నాడు. దాసగణు ఆ మాటకి సమాధానాన్ని చెప్పలేకపోయాడు. దానిక్కారణం ఆ ఉద్యోగంలో కొంతకాలం ఉండాలనే మోజు మాత్రమే. సాయి చిరునవ్వు నవ్వుకుంటూ తనలో అనుకున్నాడు. మంచి ఆధ్యాత్మిక భవిష్యత్తున్నవాడు కదా దాసగణు! ఈ లౌకిక ప్రవృత్తిలో ఎందుకిలా జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు? అని. ఇలా అనుకుని ‘సరే గణూ! ఎలా ఆ ఉద్యోగాన్ని నిర్వహిస్తావో చూద్దాం!’ అన్నాడు సాయి. ఆ మాటకర్థం అప్పుడు తెలియలేదు దాసగణుకి.కొన్నాళ్లయ్యాక పోలీసుస్టేషన్లో ఏదో చోరీసొత్తు దొంగలనుండి రాబట్టి తెచ్చినది కనిపించలేదు. దురుదృష్టవశాత్తూ ఆ సొమ్ముని దాసగణు తీసి ఉంటాడనే అభియోగం మోపబడింది. నిజానికి తాను నిర్దోషి. ఎన్ని విధాల తాను దోషిని కాదంటూ తగిన పత్రాలని సమర్పించినా దాసగణు మాత్రమే నేరగాడుగా లెక్కించబడ్డాడు. దాంతో దాసగణు ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సాయి పలికిన పలుకుల్ని గుర్తు చేసుకుని – షిర్డీకి తన మకాంను మార్చేసాడు. 70 సంవత్సరాల వయసున్నప్పటికీ దృఢంగా ఉన్న తాను సాయిసేవలో పూర్తిగా తన జీవితాన్ని వెళ్లదీయాలని నిశ్చయించుకుని సాయి అనుమతిని కోరాడు. సాయి అనుగ్రహించాడు. దాసగణుది మంచి శ్రావ్యమైన కంఠం. రాగాలజ్ఞానం కూడా ఉంది. సొంతంగా కీర్తనలని రచించి స్వరపరిచి పాడగల నైపుణ్యం ఉంది. తనకి కల్గిన అనుభవంతో, సాయిది భవిష్యత్ జ్ఞాన శక్తి కల తపశ్శక్తి అని గ్రహించి సాయి మీదే కీర్తనలని సొంతంగా రచించాడు. అంతతో ఊరుకోకుండా చుట్టుపక్కలనున్న గ్రామాల్లో హరికథల రూపంలో సాయి చరిత్రని శ్రావ్యంగా పాడుతూ అనేకుల్లో సాయి భక్తిని రగుల్కొల్పాడు. శ్రావ్యమైన కంఠం, కీర్తనల్లోని సాహిత్యం కారణంగా కేవలం మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దాసగణు కీర్తనలని వినాలనే తపన ప్రారంభమయింది శ్రోతలైన భక్తులకి. దాంతో అనేక ప్రదేశాల్లో సాయి కీర్తనలని విరివిగా వినిపించాడు దాసగణు. ప్రతిఫలాపేక్ష ఏ మాత్రమూ లేకుండా ఇలా సాయి ప్రచారం విశేషంగా అయిన కారణంగా సాయి భక్తుల సంఖ్య మరింత అయిపోయింది. నిజమైన ఆశ్చర్యకరమైన అంశమేమంటే దాసగణు నిజానికి సాయి భక్తుడు కాదు. తొట్టతొలుతదశలో అతను పండరిపురాధీశుడైన విఠ్ఠల భక్తుడు. ఆ సాహిత్యాన్ని బాగా చదివిన వాడూ అనేక అనుభవాలని పొందినవాడు కూడా. అయితే షిర్డీక్కూడ వస్తుండేవాడు కేవలం విఠ్ఠలునివద్దకే కాకుండా. అలాంటి దాసగణు సాయిని సమీపించి పాదాలని స్పృశించి నమస్కరించి ‘ప్రభూ! ఒక్కసారి పండరిపురానికి వెళ్లి విఠ్ఠలుని దర్శించి రావాలని అనిపిస్తోంది. నీ సన్నిధిని విడిచి వెళ్లడమా? అని మనసు వెనకడుగువేస్తోంది! కాదు పాండురంగణ్ణి. దర్శించాల్సిందేనని బుద్ధి వెంటపడుతోంది! నాకేమీ పాలుపోవడం లేదు’ అన్నాడు. సాయి చిరునవ్వుతో దాసగణుని చూస్తూ ‘గణూ! పండరి వెళ్తేనే విఠ్ఠలుని దర్శనమవుతుందా? ఆయన అక్కడ మాత్రమే ఉన్నాడా? ఉంటూ ఉంటాడా? సరే! నీ అభీష్టానికి అనుగుణంగా పండరినాథుని దర్శనం కలిగేలా చేస్తాను. మరి నామగుప్తాహాన్ని (పండరి విఠ్ఠలదేవుని నామాన్ని క్రమం తప్పకుండా ఏడు రోజుల పాటు చేయడం) చేస్తావా?’ అన్నాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం తప్పక చేస్తానన్నాడు దాసగణు.తాను చెప్పిన ప్రకారం దాసగణు ఏడురోజుల పాటూ నియమనిష్ఠలతో పండరినాథుని దర్శనమవుతుందనే గట్టి ఎదురుచూపుతో సప్తాహాన్ని ముగించి సాయికి పాదాభివందనాన్ని చేసాడు. తలనెత్తి చూసే సరికి సాయి లేడు. పండరిపురనాథుడైన విఠ్ఠలుడే రుక్మిణీ సమేతంగా దర్శనమిస్తుండే సరికి దాసగణుకి కలిగిన ఆనందానికి శరీరం పట్టలేదు. ఏమిటీ వింత? నా దగ్గరికొచ్చి విఠ్ఠలుడు దర్శనమీయడమా? భగవంతుణ్ణి మన చెంతకి నామపారాయణం వల్ల రప్పించుకోగలమా? దానికి గురు అనుగ్రహం ఇంతగా ఉంటుందా? అనుకుంటూ ఆ విఠ్ఠలుని పాదాలని తన చేతులతో స్పృశించాడు. విఠ్ఠల పాండురంగడు విగ్రహరూపంలో లేడు. జీవించివున్న దైవరూపంలో సచేతనంగా కనిపించాడు. కనులనిండా ఆనందబాష్పాలు అలా కారిపోతుంటే... ‘సాయీ! సాయీ!’ అంటూ సాయిని మనఃపూర్వకంగా స్మరించాడు ఇంతటి ఆనందాన్ని కలిపించినందుకు. అంతే! ఎదురుగా అయిదడుగుల శరీరంతో తానెప్పుడూ ధరించే పెద్దలాల్చీతో సాయి కనిపించాడు. దాసగణుకి నోట మాట రాలేదు. సాయి నిత్యం తన చెంత ఉన్న కారణంగా ఆయన గొప్పదనాన్ని లెక్కించలేకపోయానని సిగ్గుపడ్డాడు.కొంతకాలమయ్యాక దాసగణుకి గంగాయమునల్లో స్నానం చేసి రావాలనే బుద్ధి పుట్టింది. ఆ అభిప్రాయాన్నే సాయికి వెల్లడించాడు. సాయి మళ్లీ పూర్వంలాగానే నవ్వి – దాసగణూ! గంగాయమునలు ఇక్కడలేవా? ఇది ప్రయాగ కాదనుకుంటున్నావా? తప్పక స్నానాన్ని చేయిస్తాను’ అనగానే దాసగణు సాయిపాదాల చెంత తన శిరసునుంచి నమస్కరించాడు. అంతే ఒకపాదం నుండి గంగా మరోపాదం నుండి యమునా ధారలుగా రాసాగాయి. దాసగణుతో పాటు అందరికీ ఆశ్చర్యం ఆనందం కలిగాయి. ఇది సాధ్యమా? ఎలా వచ్చాయి ధారలుగా? (సశేషం..) -
పుట్టుక లేని పకీరు
ఎవరిదైనా ఓ జీవిత చరిత్రని రాయాలంటే స్పష్టమైన ఆధారాలు లభించినప్పుడు మాత్రమే దాన్ని లోకానికి ప్రచారం చేయడం సరైన పని. అలా కాక ఆధారాల్లేకపోయినా ఏదో ఊహలతోనో, ఎవరెవరో చెప్పిన కట్టుకథలతోనో జీవిత చరిత్రలని గనుక రాస్తే నిజమైనదేదో, నమ్మాల్సిందేదోనన్న విషయం ఓ జీవితకాలంలో తెలియదు ఎవరికీ కూడా. రామకథకి వాల్మీకి రాసిన శ్రీమద్రామాయణమే ప్రమాణం అవుతుంటే, పూర్తిగా శ్రీమద్రామాయణాన్ని చదవని ఎందరో కొంత శ్రీమద్రామాయణంలోనిదీ, కొంత మరో రామాయణంలోనిదీ, మరికొంత అక్కడక్కడ హరికథల్లో విన్నదీ కలిపి చెప్పేస్తున్న కారణంగానే నేటికీ శ్రీమద్రామాయణం అసలు కథ ఏదో అది నూటికి తొంభైమందికి తెలియకుండా పోయింది, కేవలం ఇలాంటివారి వల్ల. అలాగే, వ్యాసుడు రాసిన భారత భాగవత కథలు కూడా పూర్తిగా చదవనివారి కారణంగానే కల్పిత కథలతో ప్రచారమవుతూ నిజమైన కథ ఏదో తెలియకుండా పోయింది. కేవలం ఇలాంటివారి వల్లే.. ‘ధర్మసందేహాలు’ వస్తూనే ఉంటాయి ఓ జన్మకాలమంతా. దానిక్కారణం దేన్నీ సరిగా లోకానికి రానీయక పోయినందువల్ల. ఇలా చెప్తున్నారేమిటి? అని ప్రశ్నించేవారూ, అలా చెప్పడం సరికాదని ఎదురు తిరిగే వారూ లేకపోయినందువల్లనే.హేమాడ్ పంత్ ఒక బాధ్యతాయుతమైన మేజిస్ట్రేట్ పదవిని నిర్వహించినవాడైన కారణంగా తగిన సాక్ష్యాధారాలు, వీటితో పాటు ఎవరినుండైనా విన్న కొన్ని సమాచారాలుంటే వాటిలో నిజానిజాలెంతో పరిశీలించగల శక్తి ఉన్న తన బుద్ధితో విచారించి ఆ ప్రమాణబద్ధమైన అంశాలు కలిపి సాయి పుట్టింది ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనే విశేషాలని తేల్చగలిగాడు. సాయి మొదటి దశ అది 1854వ సంవత్సరం. షిర్డీ గ్రామానికి వెలుపల, అంటే పొలిమేర అనుకోవచ్చు. అక్కడో పెద్ద వేపచెట్టుండేది. దాని కిందే సాయి ఉండేవాడు. అప్పటికి ఆయన 16 సంవత్సరాల వయసువానిగా కన్పించాడు అందరికీ. అంటే ఆయన పుట్టినది 1838వ సంవత్సరం అయ్యుండచ్చు.ఎప్పుడూ ఆ చెట్టు కిందే బస. ఓ రాత్రి లేదు, ఓ పగలు లేదు, ఓ ఎండ అనీ లేదు, ఓ వాన అనీ లేదు, ఓ చలి అనీ లేదు. అక్కడే అక్కడే అక్కడే. షిర్డీ గ్రామానికి వస్తూండేవారూ పోతుండేవారూ ఏవేవో వృత్తులు చేసుకుంటూండేవారూ గానీ, ఎందుకు ఈ బాలుడు ఇలా కూర్చున్నాడో ఎవరికీ కనీసం తెలుసుకుందామని కూడా అనిపించలేదు. అడిగిన వారు కూడా లేరు.కొన్నాళ్లిలా గడిచాక, ముస్లిం పద్ధతిలో కనిపిస్తున్న ఆ బాలుణ్ని గమనించాక, ఎప్పుడూ అల్లానామాన్నే జపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమయ్యాక, ఎవరో ఒకామె తన పుత్రికని తీసుకొచ్చి, తన పాప కండ్ల కలకతో బాధపడుతోందని నమస్కరించి చూపించింది. సాయి టక్కున లేచి కొంతదూరంలో ఉన్న చెట్టువద్దకెళ్లి పసరు తీసి ఆమె కళ్లలో వేసాడు. మరురోజుకి తగ్గింది.అంతే! ఆ మరునాడు మరో ఇద్దరొచ్చారు. ఈ వ్యాధీ ఆ వ్యాధీ అంటూ ఎవ్వరొచ్చినా మాట్లాడే ధోరణే లేదు. వినడం, ఏ చెట్టు ఏ తీగ అనే దాన్ని చూసుకోవడం, టక్కున లేచి కొంత దూరం వెళ్లి తేవడం, ఆ పసరుని నోటిలోనో, గాయంపైనో వేసి ఆ వ్యాధి తగ్గేట్టుగా వైద్యం చేయడం, పంపించివేయడం ఇలా జరిగేది. దీంతో ఐదుగురు పది మందిగా, పదిమంది వందగా అయిపోయారు. ఇలా జనం పెరుగుతున్నా ఆయనకి విసుగు, విరామం లేకుండా వైద్యం చేస్తూనే ఉండేవారు. అప్పుడైనా ఏ ఒక్కరికీ ఇంతటి వైద్యం చేసిన ఆయన్ని ఏ ఇంటిలోకో, వసారాలోకో ఉండవలసిందిగా పిలుద్దామని, నిత్యం భోజనాన్ని సమకూరుద్దామని వాళ్లకీ అనిపించలేదు. ఈయనకు కూడా అడుగుదామనే ఆలోచన ఏమాత్రమూ లేదు. ఆయన వివరాలని ఎవరూ అడిగిందీ లేదు. ఈయన చెప్పిందీ లేదు. ఈయనది ఏ మతం? జనసంఖ్య పెరగడంతో మెల్లగా ఈయన గురించిన వివరాల్లోకి ఆలోచనలు సాగాయి.ఫకీరు రూపంలో ఉన్నాడు కాబట్టి, మసీదు గోడకి ఆనుకుని కూర్చున్నాడు కాబట్టి, మధ్యమధ్యలో పైకి ‘అల్లాహ్మాలిక్’ (అల్లాయే నా జీవిత యజమానీ దైవం కూడా) అంటూ ఉన్నాడు కాబట్టి... ఈయన ముస్లిం మాత్రమే అని కొందరు ఓ నిర్ణయానికొచ్చేశారు. పైగా మహమ్మదీయులకి ఇలాంటి పసరు వైద్యాలు, తాయెత్తులు, దిష్టి తొలగించే వైద్యాలు వంశ పరంపరగా వస్తూంటాయి కాబట్టి కూడా ఈయన ముస్లిమే అనే నిశ్చయం చేసుకున్నారు.అయితే మరికొందరు మాత్రం సాయి చెవులు రెంటికీ ఉన్న చిల్లుల్ని చూసి ఇవి హిందూధర్మం ప్రకారం ఉపనయనం (ఒడుగు) కార్యక్రమంలో చేయబడే సంస్కారాలు చెవులు కుట్టడం (కర్ణవేధ) అలాగే పుట్టువెండ్రుకల్ని తీసివేయడం (చౌలం) అనేవి స్పష్టంగా కనిపిస్తున్న కారణంగా హిందువేననే నిర్ణయానికొచ్చేశారు.కొద్దిగా పరిచయమయ్యాక మాటలు దొర్లుతాయిగా! బాబూ! నీ బస ఎక్కడ? ఇక్కడే కనిపిస్తూ ఉంటావని అడిగితే ఆ మసీదు చూపిస్తూ ‘అదుగో! ద్వారక నా నివాసమన్నట్లు చూపించాడు. చనువుతో మసీదులోపల తిరిగి చూస్తే మహమ్మదీయ విధానానికి విరుద్ధంగానూ, హైందవ ధర్మానికి అనుగుణంగానూ ‘తులసిమొక్క’ కనిపిస్తోంది. అదేదో తనంత తాను పెరిగింది కాదు. పెంచబడుతూన్న ధోరణి కనిపిస్తోంది. మరి కొద్దికాలమయ్యాక ‘నువ్వెవరివి?’ అని అడిగితే కొందరితో రాముడిననీ, మరికొందరితో కబీరుననీ, ఝాన్సీ లక్ష్మీబాయ్ కొలువులో సిపాయిననీ, బట్టలని నేస్తూ ఉండేవాడిననీ... ఇంకా విచిత్రంగా మహాలక్ష్మిననీ... ఇలా చెప్తుంటే ఆశ్చర్యపడేవారు అందరూ. అయినా మన రోగాలన్నీ నయమవుతూంటేనూ, ఈ కుర్రవాడు ఏ సొమ్మునీ తీసుకోకుండా చిటికెలో వైద్యం చేస్తుంటేనూ, వయసులో స్త్రీలందరినీ ఎంతో గౌరవ మర్యాదలతో సభ్యదృష్టితోనే చూస్తున్న కారణంగానూ మనకి ఇతర వివరాలెందుకనుకుంటూ వాళ్లంతా ఏనాడూ ఈయన గురించిన లో వివరాలకి పోలేదు. ఒకవేళ వివరాలని ఆయన చెప్పినా అవి అర్థమయ్యేవి కాదు. ఇలా అన్నింటినీ జోడించుకు చూసుకుంటే లౌకికంగా ఆయన ఓ పిచ్చివానిలా అనిపించేవాడు కూడా. అలా ఆయన్ని పిచ్చివాడుగా అనుకోవడానికి ఇష్టముండేది కాదు. మనసు అంగీకరించేది కాదు. ఇతరులకి ఈయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో తెలిసేదీ కాదు.ఇదిలా ఉండగా ఓసారి సాయిని ధులియా అనే ఊళ్లో మేజిస్ట్రేటు కోర్టులో ఎవరి వ్యాజ్యంలోనో సాక్షిగా విచారించవలసి వచ్చింది. అప్పుడు సాయిని గురించి ప్రశ్నా సమాధానాలు ఇలా ఉన్నాయి. ‘‘నీపేరు?’’‘‘బాబా.’’‘‘నీ తండ్రి పేరు?’’‘‘బాబా.’’తండ్రీకొడుకుల పేర్లు ఒకలానే ఎందుకుంటాయి? అని ఒక్కక్షణం మేజిస్ట్రేటు ఆశ్చర్యపడినా తన బాధ్యత చెప్పింది రాసుకోవడం మాత్రమే కాబట్టి, ఇంకా ఏదైనా అడిగితే అది న్యాయస్థాన నియమాలకి వ్యతిరేకం కాబట్టి అలాగే నమోదు చేశాడు.‘‘సరే! నీ మతం ఏమిటి?’’‘‘కబీరు మతం.’’‘‘ఏ కులం నీది?’’‘‘దేవుడి కులం’’‘‘ఇంకా ఏమైనా నీ వివరాలని చెప్తావా?’’‘‘నేను అనసూయాదేవిని, మహాలక్ష్మిని.’’మేజిస్ట్రేటు మారు మాట్లాడక ‘వెళ్లవచ్చు’నన్నట్టు చూశాడు. చిత్రమేమంటే మేజిస్ట్రేటు ఎక్కడా కూడా ‘నీ ఊరేది?’ అని అడగలేదు. సాయి చెప్పలేదు కూడా.షిర్డీకి వంద మైళ్ల దూరంలో పత్రి అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లోనే సాయి పుట్టాడనే ఓ వదంతి ఉంది. ఆ దిశగా పరిశీలించారు కొందరు మేధావులు.జన్మస్థలం ‘పత్రి’కాదుసహజంగా ఎవరైనా ఎక్కడైనా పుడితే ఆ విషయం తెలియకుండా ఉండదు. పుట్టాడు అనగానే తల్లి, తండ్రి, మేనత్త, మేనమామ, ఇతర బంధువులు, ఆప్తులూ తిరిగిన ప్రదేశం చదువుకున్న బడీ, లేదా పనిచేసిన పొలం... ఇలా ఏవో కొన్ని వివరాలు తప్పక ఉంటాయి. ఒకరికి కాకపోతే మరొకరికైనా తెలిసి తీరుతాయి కదా! నిజంగా సాయే గనుక పత్రి గ్రామంలోనే పుట్టి ఉండి ఉంటే, ఆ గ్రామం షిర్డీకి కేవలం వంద మైళ్ల దూరంలోనే ఉంది కాబట్టి, ఆ ఊరి ప్రజలు ఇక్కడికీ, ఇక్కడివారు అక్కడికీ ఏవో వృత్తి వ్యాపారాల మీద తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఈ నిజం తప్పక బయటపడి ఉండేదే తగిన సాక్ష్యాధారాలతో. ఒక వ్యక్తి జన్మించాడంటే పైన అనుకున్న తీరుగా ఏ కొందరో బంధువులు తప్పనిసరి కాబట్టి, నేరుగా షిర్డీలో మసీదు గోడనానుకుని కూర్చుని ఉన్న సాయి దగ్గరకే వచ్చి, ఈ పత్రి గ్రామం, జన్మస్థలం... వ్యవహారాన్ని చెప్పి ఉండకపోవచ్చును గానీ, ఏ ఒక్కరో అయినా ఆ నోట ఈ నోట ఫలానివారికి కలిగిన కుర్రవాడు, వాని లక్షణాలు ఇవీ, వృత్తి ఇదీ, ఇల్లు ఇదీ.. అంటూ చెప్పకుండా ఉండగలరా? పోనీ! ఎవరికైనా జన్మస్థలం జన్మనిచ్చిన తల్లి అతిముఖ్యులు కాబట్టి, తన తల్లిపేరునీ ఊరిపేరునీ సాయి ఎక్కడైనా చెప్పాడా? చెప్పుకున్నాడా? పదిమందిలో చూచాయిగానైనా అన్నాడా?.. అని పరిశీలిస్తే ఎక్కడా కూడా ఆ ప్రస్తావనే రాలేదు ఆయననుండి. పోనీ! ఏ ఊరు పేరూ గుర్తింపూలేని వ్యక్తుల విషయంలోనైతే సమాచారం తెలియకపోవచ్చుననుకోవచ్చు గానీ, ఇందరు రోగులకి రోగ బాధని నయం చేస్తూనూ, ఒంటరిగా ఉంటూ ఎవరి జోలికీ పోకుండా ఇంత చిన్నవయసులో ఇంత సభ్యతతో ఉంటూ కనిపిస్తూంటేనూ, ఏమీ ఆశించకుండానూ ఏం తింటున్నాడో ఎలా జీవనాన్ని గడుపుతున్నాడో ఎవరికీ తెలియని రీతిలో ఉంటూంటేనూ ఆయన గురించి సమాచారం వంద మైళ్ల దూరంలో ఉన్న ‘పత్రి’ గ్రామవాసులకి తెలిసి ఉండదా?ఇదంతా ఒకెత్తూ... సాయికి బాగా దగ్గరగా ఉండే వారైన నానాదీక్షిత్, అలాగే బూటీ... మరికొందరికీ సాయి చెప్పి ఉండడా? లేక వీరు అడిగి ఉండరా? తెలిసి ఉండదా? వాళ్లెవరూ సాయిది ‘పత్రి’ గ్రామమనకపోవడంతో పాటు అసలు ఆయన జన్మస్థలం గురించిన ప్రస్తావననే తేకపోవడం మరొకెత్తూను.సాయి ఇంకా ఈ లోకంలో ఉండగానే ‘ఖండోబా’ అనే గ్రామదేవత ఆలయంలో అర్చకునిగా ఉంటున్న ‘మహల్సాపతి’ అనే ఆయన సాయిమీది విశేష భక్తితో అనేక పర్యాయాలు సాయికీర్తనలని రాగయుక్తంగా పాడాడు కదా! ఆయన కూడా ఎక్కడా ఏనాడూ ఏ చోటా సాయి ఎక్కడ పుట్టాడనే విషయాన్ని గానీ, విశేషించి ‘పత్రి గ్రామం’ పేరుగాని ఎత్తనే లేదు.మరి ఈ జన్మస్థలం గురించిన ఈ చర్చ అపోహలకి కారణం ఒక్కటే. ‘ఖండోబా’ అనే గ్రామదేవత ఆలయంలో అర్చకునిగా పనిచేస్తూండే ‘మహల్సాపతి’ అనే ఆయన ఒక పెన్సిలుతో ఒక కాగితం మీద ‘సాయి షిర్డీ సమీపంలోని పత్రి గ్రామంలో పుట్టాడు’ అని రాసి ఉండడమే. ఈ రాతకి ఏ మాత్రం ఆధారం లేనే లేదు. ఏతావతా తేలిందేమంటే మనం చెప్పుకోబోయిన కథ చెప్పుకున్న మన సాయి కథా ‘కంచికి వెళ్లకుండా మళ్లీ అనగనగా... అంటూ కథ ప్రారంభానికే వచ్చేసిం’దని. దీన్ని బట్టి సప్రమాణంగా తెలిసేదేమంటే... సాయి జన్మస్థలం, తల్లిదండ్రులు, సాయి పేరు, సాయి మతం, సాయి బాల్య విశేషాలు, సాయి చేసే వృత్తి.. ఇలా ఏమీ కూడా ఇప్పటివరకూ తెలియనే తెలియవనీ, తెలియడం కోసం ప్రయత్నించిన అందరికీ కూడా అంతుబట్టనే లేదనీను.ఇదంతా ఇలా ఉంచి ఆయన్ని అడిగితే ఏం చెప్తాడోనని ఆలోచించి, చివరి ప్రయత్నంగా ఆయన్ని గురించిన వివరాలని ధైర్యం చేసి ఆ సాయినే అడిగితే ఆయన, చిరునవ్వుని మౌనంగా నవ్వి మరో పక్కకి తొలిగిపోయేవాడు కూడా.ఊరు, పేరూ వివరాలూ లేకుండా ఉండడం సాధ్యమా?పైన చదివిందాని ప్రకారం సాయి ఊరూ పేరూ వివరాలూ.. ఇలా ఏమీ తెలియవీల్లేదని అనుకున్నా, అలా ఉండడం సాధ్యమా? అనే సందేహం మనకి వస్తుంది. అలా రావడం తప్పుకాదు కూడా.ఇప్పుడు యథార్థాన్ని తెలుసుకుందాం!సాయి మనలా ఒక కులానికీ, మతానికీ సంప్రదాయానికీ చెందిన వాడు కాదు. అందుకే కులాన్ని గురించి అడిగితే దేవుడికులమని, మతాన్ని అడిగితే కబీరు మతమనీ అన్నాడు. సంప్రదాయం గురించిఎవరూ అడగకున్నా.. వేషం ప్రకారం మహ్మదీయం, తులసి మొక్క నాటడం, నిత్యం అగ్నిహోత్రాన్ని చేసే సంప్రదాయం(ధుని) అలాగే మసీదుని ద్వారక అనడం ప్రకారం హైందవమనీ తెలియజేసుకున్నాడాయన.తాను పుట్టిన 16 సంవత్సరాల వరకూ ఏ ఉనికీ లేకుండా అకస్మాత్తుగా వెలుగులోకి రావడం ప్రకారం ఆయన ఏదో ఓ ఘనకార్యాన్ని లోకానికి చేయదలిచి వచ్చినవారే అని అర్థమవుతుంది. దీనికి బలమైన ఆధారం కూడా ఒకటుంది! లోకంలో అందరికీ ఈ అకస్మాత్తుగా ఊడిపడ్డ సాయిని గురించిన అనుమానం కలిగి షిర్డీగ్రామంలో ఉన్న గ్రామదేవతకి జరిగే ఉత్సవాల్లో ఓ రోజున ఈయనని గురించి తెలుసుకోవాలనుకున్నాడు.ఆ రోజుల్లో యథార్థమైన ‘పూనకాలు’ ఉంటూండేవి. ‘పూనకం’ అంటే ఒక దైవశక్తి. నిత్యం ఆ దేవిని ఉపాసిస్తూండే ఒక వ్యక్తిలోనికి ప్రవేశించడమని అర్థం. అలా దైవశక్తి ఈలోనికి ఆవహించిన వేళ, అలా ఆవహింపబడిన వ్యక్తికి బాహ్యస్పృహా స్మృతీ ఉండవు. అంటే తానెవరో, ఎక్కడ నుంచి వచ్చాడో, తన వివరాలేమిటో తనకి తెలియవు. కేవలం ఆ దేవీ స్మృతీ స్పృహలోనే ఉంటారు.అలాంటి పూనకం వచ్చిన వ్యక్తిని అక్కడి ప్రజలంతా ఈ 16 సంవత్సరాల బాలుని గురించి చెప్పవలసిందిగా కోరారట. అంతే! ఒక గునపం తెమ్మని చెప్పి ఒక ప్రదేశాన్ని చూపించి తవ్వవలసిందన్నాడు ఆ పూనకం వచ్చిన వ్యక్తి. కొద్దిగా తవ్వగా ఒక బండరాయి కనిపించింది. ఆ రాతిని తొలగించి చూస్తే నాలుగు దీపాల ప్రమిదలూ కన్పించాయి. అంతేకాదు, అప్పుడే పూజ చేసి ఎక్కడికో వెళ్లిన తీరులో పూజాద్రవ్యాలూ పూజ చేసిన విధానాలు కనిపించాయి అందరికీ. ‘‘ఈ బాలుడు 12 సంవత్సరాలు ఈ నేలమాళిగలో తపస్సు చేశాడు. ప్రతి నిత్యం ఇలా చేస్తూ పైకి వస్తూంటే అక్కడి జనమంతా అనవసర ప్రశ్నలతో బాధిస్తుంటే, ఆ ప్రదేశాన్ని విడువబోతూ ఈ బండని కప్పి.. దయచేసి ఈ ప్రదేశాన్ని పాడుచేయకండి అని ప్రార్థించి వెళ్లిపోయాడు’’ అని చెప్పాడు పూనకం వచ్చిన వ్యక్తి.అంటే దాదాపు 1838లో జన్మించిన సాయి 1842 లో (నాల్గవ సంవత్సరంలో) తపస్సు ప్రారంభించి 12 ఏళ్ల పాటు తపస్సు చేసి 1854లో షిర్డీ పొలిమేర జనులందరికీ కనిపించాడన్నమాట. అక్కడి నుంచిమరో నాలుగు సంవత్సరాల పాటు సాయి ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. పోనీ! ఇంత గొప్పవాడు సాయి అనే అభిప్రాయంతో ఆ గ్రామదేవత అయిన ఖండోబా ఆలయంలో ఎక్కడో ఒక చిన్న గదినైనా సాయికి ఇయ్యగలిగారా ఎవరైనా? అంటే ఈయన హైందవధర్మానికి చెందినవాడు కాదు గదా! అని ఆ ఆలయ అర్చకుడు ‘మహల్సాపతి’తో పాటు అందరూ నిరాకరించారు ఇవ్వడానికి, లేదా మౌనంగా ఉండిపోయారు. చిత్రమేమంటే ఆయన 1858లో తిరిగి షిర్డీకి రాగానే ఆయన ప్రతిభ ప్రారంభమయింది. ఆయనకి పేరు పెట్టడంతో సహా లీలలన్నీ జనులకి ఒకటొకటిగా తెలియసాగాయి. తన పాదాలనుండి ‘దాసగణు’ అనేమహాభక్తునికి గంగా యమునా నదీ ధారలని చూపించాడు సాయి. ఎలాగో చూద్దాం. ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
అన్నా సాహెబు సంకల్పం
‘సాయిపథం’ అంటే సాయి నడిచిన మార్గం అని. అంటే – ఆయన ఏం చేశాడో? ఏం చేయాల్సి ఉందని భక్తులకి ఉపదేశించేవాడో? వేటిని ఆయన చేస్తే వాటిని మనం లీలలుగా భావించే వాళ్లమో, ఏయే భక్తులకి ఏయే విధంగా ఆయన వారి వారి అనుభవాల్లో కనిపించేవాడో.. వాటన్నింటినీ తెలుపడమన్నమాట. ఇక ‘అంతర్వేదం’ అంటే – పైన అనుకున్న తీరుగా సాయి చేసిందాన్నుంచి మనం గ్రహించవల్సిందేమిటో, దేన్ని మనం ఎలా గ్రహించాలనే అభిప్రాయంతో సాయి అలా చేశాడో, అదే తీరుగా భక్తులకి ఉపదేశించిన ప్రతిపలుకులోని అంతరార్థమేమిటో... మొత్తం మీద తన చేష్టల ద్వారా, తన బోధనల ద్వారా సాయి చెప్పదలచిన భావమేమిటో దాన్ని వివరించడమన్నమాట. ఈ నేపథ్యంలో మనం చదువుకుంటూ వెళ్లాల్సి ఉంది. ప్రేరణ సాయిదేవుని చరిత్రని రచించడానికి పూనుకున్న ‘అన్నా సాహెబు ధాబోల్కర్’ మొదట్లో మహాభక్తుడు కాదు. సమస్త తీర్థయాత్రల్ని చేసే లక్షణమున్న వాడూ కాదు. పైగా ప్రతి విషయాన్నీ హేతుబద్ధంగా ఆలోచించి, తన బుద్ధికి నచ్చిందన్నప్పుడే అంగీకరించే గట్టిదనం కలవాడు కూడా. ఏ ఫలితానికైనా కార్యకారణ సంబంధం ఉండాలి. ఉదాహరణకి ఒక దీపం తన వెలుగుని ప్రసరింపజేస్తోందంటే ప్రమిద, నూనె, వత్తి, నిప్పు వల్లనే. ఈ కారణాల్లో ఏది లేకున్నా దీపమనేది వెలగదు, ప్రకాశాన్ని ఇవ్వలేదు. ఇది అనుభవంలో కనిపించే సత్యం. అయితే, కేవలం గోధుమపిండిని చల్లితే షిరిడీలోని విజృంభించిన కలరా వ్యాధి పూర్తిగా తగ్గిపోవడమా? అనే సంశయం గట్టిగా పీడించసాగింది అన్నా సాహెబుని. దాంతో దానిమీద దృష్టి సారించాడాయన. ఎవరీ సాయి? ఏమిటాయన గొప్పదనం? అని. ఏదైనా ఒక మంచి పంట పండాలంటే నాటబడే విత్తనంతో పాటు భూమి సారవంతమైనదయ్యుండాలి. ఆ కారణంగా అన్నాసాహెబు ముందుగా నాటబడే విత్తనం ‘సాయి చరిత్రం’ అవుతుంటే, దాన్ని చక్కగా లోకానికి అందించగల సారవంతమైన భూమిగా తాను కాగలనా? అని ఆలోచించుకున్నాడు. మహానుభావులెప్పుడూ ఇలాగే ఆలోచిస్తారు. దీన్నే ప్రారంభ భీరుత్వం అంటుంది శాస్త్రం. ఈ భయంతో, పిరికితనంతో ఆగిపోవడం అధముల లక్షణం. ప్రారంభించి కొద్దిదూరం వెళ్లాక ఏదో విఘ్నం కారణంగా పనిని విడిచివేయడం మధ్యముల స్వభావం. ఏది ఏమైనా తనకి తానే ప్రశ్నించుకుంటూ, సమాధానం కోసం శతవిధాల బుద్ధిని ఆలోచనలకి గురిచేస్తూ అనుకున్న పనిని సాధించడం ఉత్తముల లక్షణం – అని భావించిన అన్నా సాహెబు మడమని వెనక్కి తిప్పదలచలేదు. తన పునాదిని గురించి తాను ఆలోచించుకున్నాడు.సంస్కార సాంప్రదాయాలు నిండిన ఆద్యగౌడ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు తాను. తల్లికీ, తండ్రికి, తాత ముత్తాతలకీ విశేషమైన దైవ భక్తి ఉంది. కాబట్టి సాయి చరిత్రాన్ని ‘నచ్చితే రాద్దాం! ఏ మాత్రపు అవిశ్వాసం తోచినా ఆగిపోదాం!’ అనే నిశ్చయంతోనే అన్నా సాహెబు తనని తాను స్థిరపరుచుకున్నాడు. ఒక అడుగు వేస్తే పది అడుగులు సాయిది ఒకే ప్రేమ సూత్రం. భక్తుడైన నువ్వు ఒక అడుగుని నా వైపుకి వేస్తే చాలు, నేను ఎక్కువ అనే ఆలోచనని మాని నీ దిక్కుగా పది అడుగులు వేస్తాననేది ఆయన అభిప్రాయం. సాయి – సర్వజ్ఞుడు కాబట్టి అన్నా సాహెబులోని ఆలోచనని గమనించి 1910వ సంవత్సరంలో అన్నా సాహెబుని బాంద్రా అనే పట్టణంలో రెసిడెంటు మెజిస్ట్రేటుగా బదిలీ చేయించాడు (కాబోలు)! పోనీ అప్పుడైనా అన్నా సాహెబుకి సాయిని గురించిన చరితాన్ని రాయడమెందుకనే ఆలోచన కలగలేదు సరికదా ఆయన గురించి గొప్పవారైన పదిమందీ ఏమన్నారో ఆ విశేషాలను తెలుసుకోవాలనే తపన ప్రారంభమయింది. తాను మూఢ విశ్వాసి కానే కాదు కాబట్టి, పైగా చేసేది ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే నమ్మే ఉద్యోగం కాబట్టి తనతో సమానమైన సహేతుకమైన బుద్ధిగల మేధావుల రచనలని చదవడం ప్రారంభించాడు అన్నా సాహెబు. ఇందూరు హైకోర్టు జడ్జి గారు ఎమ్.బి.రేగే గారు ‘బాబా శరీరం భౌతికంగా మనకి కనిపించకపోయినా, ఆయన సమాధి దగ్గర నిలబడి ప్రార్థిస్తే – ఆయన సమాధి కాకముందున్న తీరుగానే మనసులో భావిస్తే నిశ్శబ్దంగా ఆయన ఏదో తోవని చూపుతూ మన సమస్యకి పరిష్కారాన్ని చెప్తారు’ అని రాసిన మాటలు కనిపించాయి. దీంతో అన్నా సాహెబు మనసులో సాయి చరిత్రని అందించాలనే ఊహ చిగురించింది. బి.వి. నరసింహస్వామి గారు కూడా హైకోర్టు జడ్జిగారే. వారు సాయిని గురించి రాస్తూ – ‘నేనిప్పటికీ సాయి లేడని నమ్మలేకపోతున్నాను. ఇప్పటికీ ఉన్నారనే నేను గట్టిగా నమ్ముతున్నాను. నా మనోవీధిలో నిరంతరం నాకు కనిపిస్తూ ఉంటారు. ఏ సంశయాన్నైనా ధర్మబద్ధంగా తీరుస్తూ ఉంటారు’ అన్నాడు. దీంతో అన్నా సాహెబు మనసులో సాయిచరిత్రాన్ని రాయాలనే ఆలోచన దృఢమయింది. కేవలం న్యాయాధికారులు చెప్పిందాని ప్రకారమే నేనూ ఒక న్యాయాధికారిని కాబట్టి నమ్మి సాయిచరిత్రాన్ని రాయడమా? అని ఆలోచించిన అన్నా సాహెబు ఇతరుల వాక్యాలేమైనా ప్రమాణబద్ధంగా ఉన్నవి కనిపిస్తాయా? అని పరిశీలించాడు. అంతే, ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ జి.జి.నార్కే రాసిన మాటలు కనిపించాయి ఇలా.. ‘నా మామగారూ, నా భార్యా, నా తల్లీ సాయికి గొప్ప భక్తులు. వాళ్లకి భగవంతుడంటూ ఎవరైనా ఉన్నారంటే ఆయన సాయి మాత్రమే. ఈ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని అంత గొప్పదనం ఆయనలో ఏముందా? అనే ఊహతో నేను కూడా ఓసారి వాళ్లతో షిరిడీకి వెళ్లాను. నా అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేస్తూ ఆ రోజున సాయి హారతి సమయంలో తీవ్రమైన కోపంతో ఊగిపోతూ భక్తుల్ని శపిస్తూ తిడుతూ అందరూ భయపడేలా చేస్తున్నారు. నేను బయల్దేరే సమయంలో సాయి గురించి అర్ధవిశ్వాసం కాస్తా పూర్తిగా శూన్య విశ్వాసంగా మారి – ఈయన ఓ పిచ్చివాడు మాత్రమే. ఈ పిచ్చివాణ్ని దైవంగా భావించే నా భార్యా, నా మామా, నా తల్లీ కూడా.. వాళ్లే అనే నిర్ణయానికొచ్చేశాను. అయితే అందరితో పాటు నేను కూడా సాయిహారతి పూర్తి అయ్యాక ఆయన పాదాలని స్పృశించి మొక్కాను. ఆయన నా తలని మాత్రమే నిమురుతూ, నవ్వుతూ ప్రేమ పూర్వకంగా నన్ను చూస్తూ ‘నేను పిచ్చివాడిని కాను!’ అన్నారు. దాంతో నా మనోభిప్రాయాన్ని ఆయన ఎలా గమనించగలిగారా? అనే ఆశ్చర్యం, అద్భుతం నా మనసులో కలిగి మరోమారు ఆయన పాదాలని నిజమైన భక్తితో స్పృశించి మొక్కాను’ అని. అంతే! అన్నా సాహెబుకి కనిపించిన ఈ ప్రత్యక్ష ఆధారాలన్నీ ఒక గట్టి ఆలోచనకి రూపాన్నిచ్చాయి. తాను కూడా ఓసారి సాయిని చూసి ఆయనతో తనకి కలిగిన అనుభవాన్ని గమనించుకుని, హృదయపూర్వకంగా నచ్చితే నమ్ముదాం! లేదా మానేద్దాం!! అని. ఇలా ఆలోచనలతో ఉన్న అన్నా సాహెబుకి ఆ సమయంలోనే మరికొందరి అనుభవాలు కనిపించాయి. ఇక ఆలస్యం చేయడం తగదనే అభిప్రాయం కలిగింది అన్నా సాహెబుకి. బాబాతో మరింత దగ్గర సంబంధం ఉన్నవారితో పరిచయాన్ని గాని ఏర్పాటు చేసుకుంటే స్వయంగా బాబాని దర్శించగల వీలుంటుందనీ, అవసరమైతే సాయి చరిత్రాన్ని రాసే ఆలోచనకి ఓ రూపాన్ని ఇవ్వవచ్చని భావించాడు. అలాంటివారిని గురించి ప్రత్యేకించి అన్వేషించాల్సిన అవసరం లేకపోయింది ఆయనకి. షిరిడీ భక్తులందరిలో ఎవరిని పలకరించినా సాయి బాబాకి అతి సన్నిహితులుగా శ్యామా (ఈయన అసలు పేరు మాధవరావు దేశ్‌పాండే) అనే ఆయనని చెప్తుండేవారు. ఆయన సాక్షాత్తు బాబాని పరోక్షంగా భక్తులతో మాట్లాడుతున్న సందర్భంలో ‘దేవుడు!’ అని మాత్రమే అంటుండేవారు. ‘సాయిదేవా!’ అని తరచూ సంబోధిస్తూండేవారు. ఇంకా అవసరమా? అన్నా సాహెబుకి సాయి చరిత్రాన్ని లోకానికి అందించాలనే ఆలోచనైతే బలంగా కలిగింది గానీ, ఎందరెందరో సాయిచరిత్రాన్ని స్వీయ అనుభవాలతో సాయి లీలలతో మహిమలతో పూర్తిగా రాసేసి, ముద్రించి లోకంలోకి వ్యాప్తి చేసేశాక ఇంకా తానేదో రాయాల్సి ఉందంటూ రాయాల్సిన అవసరం ఉందా? అనే ఆత్మ అవిశ్వాసం కలిగింది. ఒక్క క్షణం పాటు ఇక్కడే ఈ ప్రధాన చరిత్ర నుండి పక్కకి జరిగి చూడాల్సి ఉంది. కాళిదాసు అంతటి మహాకవి కావ్యాలని రాయడం ప్రారంభిస్తూ – ఎందరెందరో మహా కావ్యాలని అందించేసి ఉండగా, పొట్టివాడొకడు ఎల్తైన చెట్లకి వేలాడుతున్న తియ్యటి మామిడి పళ్లని కోసుకోడానికి అనేక పర్యాయాలు ఎగురుతున్నట్లుగా ఎందుకీ ప్రయత్నం అనుకున్నాడు. వాల్మీకి మహర్షంతటి వాడు శ్రీమద్రామాయణాన్ని పూర్తిగా రచించి తన ఆశ్రమంలో అందరికీ వినిపించి, వాళ్లంతా చాలా బాగుందని ప్రశంసిస్తే ఆనందపడ్డాడు ప్రారంభంలో. ‘అయ్యో! నేనూ ఆశ్రమ జీవినే. వీళ్లూ ఆశ్రమవాసులే కదా! నేను రాసిన దేన్నైనా ఆశ్రమ సాహచర్య జీవనం కారణంగా ఆమోదించి ఉంటారు’ అనే భావనతో ఇతర ఆశ్రమ మహర్షులకి వినిపించాలనుకుని వాళ్లని ఆహ్వానించాడు. వాళ్లంతా వచ్చారు. విన్నారు. చెప్పలేనంత రమ్యంగా ఉందని శ్లాఘించారు. మళ్లీ వాల్మీకి అనుకున్నాడు – ‘ఇంతకుముందు విన్న వాళ్లూ వీళ్లు కూడా ఆశ్రమవాసులే. అయితే వాళ్లు నా ఆశ్రమవాసులూ, వీళ్లు ఇతరాశ్రమవాసులూను. వీళ్లు కాకుండా సాక్షాత్తు రాముడే విని ఆమోదముద్ర వేస్తే దీన్ని లోకానికి అందిద్దాం’ అనుకున్నాడాయన. రాముడు కొంతకాలానికి ఆ ప్రాంతానికి రాగా ఆయనకే వినిపించాడు. ఆయన అంతా విని ‘చక్కగా ఉంది’ అని చెప్తూ, ‘నా కథని నేనే విని బాగుందని అనక మరోలా అంటానా?’ అని తనని గురించి ఎవరైనా అనుకుంటారేమోనని భావిస్తూ రామకథ జరిగిన కాలంలో ఎందరెందరున్నారో అందరి సమక్షంలోనూ అది కూడా అయోధ్యలోనే వినిపిస్తే అందరూ బాగుందని అన్న పక్షంలోనే లోకానికి అందిద్దామన్నాడు రాముడు. అలాగే జరిగింది. ఆమోదించబడింది సభలో. లోకానికి విడుదలయింది. ‘నిజమైన గ్రంథకర్త ఎవరు?’ అంటే తనని గురించి తాను భయపడుతూ, తన రచన వల్ల ఎవరైనా నమ్మకూడని విషయాన్ని నమ్మి వెళ్లకూడని మార్గానికి గాని వెళ్లినట్లయితే ఆ దోషమంతా తనదిగా భావించేవాడెవరో అతడు మాత్రమే సరైన గ్రంథకర్త. ఆదరాబాదరగా రెండు మూడు విషయాలని సేకరించి రాసేసేవాడు సరైన గ్రంథకర్త కాడు. తాను సంపూర్ణంగా నమ్మి, అలా నమ్మడానికి గల కారణాలని సహేతుకంగా వివరించి నమ్మింపజేయగలవాడే సరైన గ్రంథకర్త అనేది దీని భావం. అలాంటి గ్రంథకర్తకి కావలసిన సర్వలక్షణాలూ కలవాడు అన్నా సాహెబు అనేది దీని లక్ష్యం. ఇంతటి ఉత్తమ లక్ష్యాలతోనూ సాయి చరిత్రాన్ని రాయదలిచిన అన్నా సాహెబుకి కలిగిన చివరి సందేహం ‘ఇంకా అవసరమా?’ అని. ఇక్కడే ఉంది రహస్యం. ‘ఇంకా అవసరమా?’ అనే విషయం తేలాలంటే, ఇంతకుముందు ఎవరెవరు ఏమేం రాశారో వాటిని చూడాల్సి ఉందిగా! అదుగో ఈ పనిని సాయి మాత్రమే పరోక్షంగా అన్నా సాహెబుని ప్రేరేపించి చేయిస్తున్నాడన్నమాట. కొద్దిలోతుగా ఆలోచిస్తే ఇంతగా అన్నా సాహెబు సాయిని గూర్చి తపన పడుతున్నాడంటే, సాయి అనుగ్రహం తనకి లభించేసినట్లే! సాయి చరిత్రాన్ని రాసేందుకు సాయిదేవుని అనుగ్రహానికి పాత్రుడైనట్లే. సాయిచరిత్రం అవసరమే! అన్నా సాహెబు దృష్టిలో గురుచరిత్ర గ్రంథం పడింది. దాని రచయిత సరస్వతీ గంగాధరుడు. ఆయన గ్రంథాన్నైతే లోకానికి అందించాడు గాని, సాయిబాబాకి ముందు అవతారాలైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నరసింహ సరస్వతి స్వామి గార్ల చరిత్రలనీ విశేషాలనీ బాగా వివరించారు. కాబట్టి తాను రాయబోయే సాయిచరిత్రం అవసరం లోకానికి ఉంది. గురు చరిత్రం ఉంది గాని అది కన్నడంలో ఉన్న కారణంగా అందరికీ అర్థం కాదు. అదీ కాక గురుచరిత్ర లోకానికొచ్చిన తర్వాత ఎన్నో సాయి లీలలు భక్తుల్లోకి అనుభవంలోకి వచ్చాయి. అవన్నీ లోకానికి తెలియజేయాలంటే మరో గ్రంథం అవసరమే కదా! ఇలా అనేక కోణాల్లో పరిశీలించుకుని, తనని తానే పరీక్షించుకుని ఆ మీదట సాయిచరిత్ర అవసరం ఉందని నమ్మి – ఓ వ్యాసుడు భారతాన్నీ, ఓ వాల్మీకి రామాయణాన్నీ, ఓ కాళిదాస మహాకవి పంచకావ్యాలనీ నాటకాలనీ లోకానుగ్రహ కాంక్షతో రాయాలని భావించినట్టుగా అన్నాసాహెబు సాయి గురించిన గ్రంథ రచనకి మానసికంగా పూనుకున్నాడు. ఆ రెండూ ముఖ్యం ఇంత జరిగాక అన్నా సాహెబుకి సారాంశంగా అర్థమైన విషయం ఒక్కటే. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఓ ఆలోచనని కార్యరూపం దాల్చేలా చేయాలంటే శ్రద్ధ – సబూరి ‘స్థిరమైన నమ్మకం, తీవ్రమైన ఓపిక’ అనేవి కావాలని. ఆ రెండు ఆయుధాలతో షిరిడీకి ప్రయాణమయ్యాడు అన్నా సాహెబు.. సాయి దర్శనం కోసం... -
అప్పుల బాధతో నేతన్న బలవన్మరణం
సిరిసిల్లటౌన్: అప్పులబాధ భరించలేక గాజంగి సాయి(23)అనే యువ నేతకార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేటకు చెందిన సాయి ఓ వస్త్రపరిశ్రమ యజమాని వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఐదేళ్లక్రితం తండ్రి ప్రభాకర్ కూడా అప్పుల బాధతో ఉరివేసుకుని చనిపోయాడు. తల్లి వసంత బీడీలు చుడుతూ కుమారుడు సాయి, కూతురు రేఖను పోషిస్తోంది. మూడేళ్లుగా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాయి.. ఏడునెలల క్రితం చెల్లెలు రేఖ వివాహం జరిపించాడు. ఈ క్రమంలో ఇందుకోసం కొంత అప్పు చేశాడు. కుటుంబపోషణ, వివాహంకోసం తెచ్చిన అప్పు మొత్తంగా రూ. 2 లక్షలకు చేరింది. అప్పు ఇచ్చినవారిలో సమీప బంధువులు, స్నేహితులు ఉండటంతో వారి బాకీ సమయానికి తీర్చలేనన్న బెంగతో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో సాయి ఉరివేసుకుని చనిపోయాడు. బంధువుల ఇంటికి వెళ్లిన సాయి తాత దత్తు బుధవారం ఉదయాన్నే ఇంటికి వచ్చి చూసేసరికి మనవడు విగతజీవిగా దూలానికి వేలాడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో నేత కార్మికుల వరుస ఆత్మహత్యలతో సిరిసిల్ల తల్లడిల్లింది. ఈ క్రమంలోనే కార్మికులకు ధైర్యాన్ని అందిస్తూ.. వైఎస్ విజయమ్మ సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజిత
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రేడ్–5 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు శుభారంభం చేయగా... కుదరవల్లి శ్రీకృష్ణప్రియ, జక్కా వైష్ణవి రెడ్డి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సాయి ఉత్తేజిత 25–23, 21–16తో వైవోని లీ (జర్మనీ)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శ్రీకృష్ణప్రియ 11–21, 15–21తో లిన్నీ అలెజాండ్రా మైనకి (ఇండోనేసియా) చేతిలో... వైష్ణవి రెడ్డి 19–21, 17–21తో జూలీ జాకబ్సన్ (డెన్మార్క్) చేతి లో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గురుసాయిదత్ 21–16, 21–11తో మూడో సీడ్ వైగోర్ కోలో (బ్రెజిల్)పై, సౌరభ్ వర్మ 21–11, 21–18తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై, సమీర్ వర్మ 22–20, 21–10తో థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. -
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమజంట
సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి అనుమతి నిరాకరించడంతో ఓ ప్రేమజంట పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. లింగగూడెనానికి చెందిన సాయి, సునీత ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించకపోవడంతో గ్రామ సమీపంలోని సుబాబుల్ తోటలో వాళ్లిద్దరూ శనివారం ఈ సంఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం సాయి, సునీత జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్ట్రేలియా వెళ్దామనుకుని అనంతలోకాలకు..
మేడ్చల్ రూరల్ : బీటెక్ పూర్తి చేసిన ఓ విద్యార్థి మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన మంగళవారం రాత్రి మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంభవించింది. వివరాల.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఆశిష్(24), సాయి(23) చదువు నిమిత్తం కొంపల్లిలోని సినీప్లానెట్ సమీపంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆశిష్ మండలంలోని కండ్లకోయ పరిధిలోని సీఎంఆర్‌ఈసీ కళాశాలలో 2016లో బీటెక్ పూర్తి చేశాడు. కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సాయి.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ఆశిష్, సాయిలు ఇద్దరు కలిసి తన స్నేహితుడి బైక్‌పై మేడ్చల్‌కు వెళ్తుండగా కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపై వీరి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో వారు తప్పి కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న ట్రాలీ ఆటో వీరిని ఢీకొట్టింది. దీంతో ఆశిష్ అక్కడికక్కడే మృతి చెందగా సాయి తీవ్ర గాయాలకు గురి కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
నార్పల : వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి వెళ్లి స్టాటర్ బాక్స్ తెరుస్తుడంగా విద్యుదాఘాతానికి గురై యువ రైతు మృతి చెందిన సంఘటన నార్పల మండలం పూలసలనూతల గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. నార్పల మండలంలోని పులసలనూతల గ్రామానికి చెందిన కురుబ గడ్డం చిన్న వెంకట్రాముడు కు ఇద్దరు కుమారులు. వారిలో సాయి(20) పెద్ద కుమారుడు, ఇంటర్ వరకూ చదువుకుని తండ్రికి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉన్నారు. వీరికి మూడు ఎకరాలు పొలం ఉంది. బోరు కింద వేరుశనగ పంటను సాగు చేశారు. వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి తండ్రి, కొడుకు సాయంత్రం ఐదు గంటలకు తోట వద్దకు వెళ్లారు. ఆరు గంటల సమయంలో త్రీ ఫేస్ కరెంట్ రావడంతో మోటారు ఆన్చేయడానికీ స్టాటర్ బాక్స్ వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే స్టాటర్‌కు విద్యుత్ ప్రసరించడంతో సాయి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడే ఉన్న తండ్రి చిన్న వెంకట్రాముడు టవాల్‌తో కొడుకును లాగడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విద్యుదాఘాతంతో అక్కడక్కడే మృతి చెందాడు. కన్న కొడుకును కళ్లారా చంపుకున్నానని తండ్రి చిన్న వెంకట్రాముడు, కుటుంబ సభ్యులు బోరును విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
న న్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నేను డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతున్నా! మీరు చాలా మందికి ఎన్నో మంచి సలహాలు ఇస్తారు. నాకు కూడా మీరే హెల్ప్ చేయండి. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని ప్రేమించాను. తను నాకు మరదలౌతుందని తెలిసి, సంవత్సరం క్రితమే ప్రపోజ్ చేశాను. అప్పుడు తను రిజెక్ట్ చేసింది. కానీ, లాస్ట్ టు మంత్స్ బ్యాక్ ‘లవ్యూ టూ’ చెప్పింది. ‘నువ్వు లేకపోతే నేను ఉండలేన’ంటోంది. కానీ వాళ్ల అమ్మకి చెప్పలేకపోతోంది. వాళ్ల డాడీ తొమ్మిది నెలల క్రితమే చనిపోయారు. మా పేరెంట్స్‌కి చెబితే.. ‘వాళ్ల ఫ్యామిలీ ఒప్పుకుంటే పెళ్లి చేస్తా’మన్నారు. కానీ వాళ్ల అమ్మకి నాపై మంచి అభిప్రాయం లేదు. తనకి సంబంధాలు చూస్తున్నారు. మా పేరెంట్స్‌కి ప్రిస్టేజ్ ఎక్కువ. నేను ఏం చెయ్యాలో స్రై్టట్గా చెప్పండి ప్లీజ్! – సాయి నీలాంబరి నేల మీద దొర్లుతోంది. కడుపు పట్టుకుని మరీ దొర్లుతోంది. ఒళ్లంతా వంకర టింకరగా తిప్పుతూ దొర్లుతోంది. ‘ఏమైంది నీలూ’ అని అడిగా...! దొర్లుతూ దొర్లుతూ నావైపు తిరిగింది! ముఖం అంతా ఎర్రగా కందిపోయి ఉంది! ముందే మంచి కలర్... ఇప్పుడు ఆపిల్ లాగా అయిపోయింది! ఏమైంది.. ఏమైంది.. అని కంగారుగా అడిగా.. కడుపు పట్టుకుని దొర్లుతోంది నన్ను చూసి గట్టిగా నవ్వింది!నా మీద అంతా నీలాంబరి తుంపరే! హేయ్.. వాట్ ఈజ్ దిస్? అని అడిగా... ‘ఎల్.ఓ.ఎల్.ఆర్.ఓ.ఎఫ్’ అని ఇంకోసారి తుంపర పేల్చింది! అంటే ఏంటి? ‘లాఫ్ ఔట్ లౌడ్ రోలింగ్ ఆన్ ది ఫ్లోర్’ అంటే...? ‘ఎవరయినా మంచి జోక్ వేస్తే... కడుపు పట్టుకుని దొర్లుతూ నవ్వమని’ ఏంటి జోక్.. ఎవరు? పేల్చింది. ‘సార్ స్రై్టట్గా ఆన్సర్ చెప్పాలంట..! మీరు లైఫ్‌లో ఇప్పటిదాకా ఏదీ స్రై్టట్గా చెప్పలేదు. మీరు స్రై్టట్గా ఆన్సరిస్తే అంతకంటే పెద్ద జోక్ ఉండదు. ఎల్.ఓ.ఎల్.ఆర్.ఓ.ఎఫ్’ అని దొర్లుతూ నవ్వింది నీలాంబరి. ఇదిగో స్రై్టట్గా చెప్తున్నా ఆన్సర్. చూడు సాయీ.. నాన్న చనిపోయాడు. ఆ కుటుంబానికి అమ్మే ఎవ్రిథింగ్! వరసకు నీకు అత్తయ్య! నువ్వంటే ఆమెకు మంచి ఇంప్రెషన్ లేదు! తండ్రి లేని బిడ్డను ఎలా చూసుకుంటావో అని డౌట్! అందుకే, నీకు అందకుండా చెట్టు ఎక్కి కూర్చుంది! మీ పేరెంట్స్‌కి ఇగో, అందుకే, వాళ్లు మిద్దెక్కి కూర్చున్నారు! వాళ్లని కన్విన్స్ చేసుకోకపోతే నీ లవ్ కొండెక్కినట్టే! ‘సార్ స్రై్టట్గా ఆన్సర్ చెప్పాలంటా...! లాఫ్ ఔట్ లౌడ్ రోలింగ్ ఆన్ ది ఫ్లోర్...’ అని కొండమీద నుంచి దొర్లినట్టు దొర్లుతూనే ఉంది నీలాంబరి! -
నూతన ‘సాయ్’ పాలక కమిటీ సభ్యులకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) పాలక కమిటీ సభ్యులుగా ఇటీవల నియమితులైన వారిని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్), ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ శనివారం ఘనంగా సన్మానించింది. బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావులు పాల్గొన్నారు. ఇటీవలే వీరు ముగ్గురు రాష్ట్ర సాయ్ పాలక కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం, కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ బి. వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరితో పాటు శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి, ఎండీ దినకర్‌బాబు, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే గడ్డ నుంచి ఒకే జట్టుగా..
-ఖోడినార్ నుంచి ‘సాయి’ జట్టుకి ఎంపికైన ఏడుగురు యువతులు -వాలీబాల్‌లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణింపు అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) : ఇప్పుడంతా చదువుల యుగం. చదువులు దెబ్బ తింటాయని పాఠశాల, కళాశాల స్థాయిలో బాలురనే ఆడించడం లేదు. కానీ ఆ గ్రామం అందుకు భిన్నం. ఆటలు ఆడితేనే బంగారు భవిష్యత్ ఉంటుందని నమ్మిన గ్రామస్తులు బాలురనే కాదు.. బాలికలను కూడా ఆటల్లో ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఆ గ్రామానికి చెందిన ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఏడుగురు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆ గ్రామమే గుజరాత్ రాష్ట్రంలోని సోమనా«ద్ జిల్లాలోని ఖోడినార్. ఈ గ్రామానికి చెందిన ఏడుగురు క్రీడాకారిణులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి)కి ఎంపికై గొల్లవిల్లిలో జరుగుతున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఒకే గ్రామం నుంచి ఏడుగురు ఒక జట్టుకు ఎంపిక కావడం, రాణించడం అరుదైన విషయం. కోచ్ వర్ధన్వాలా శిక్షణలో తామంతా వాలీబాల్‌లో రాణిస్తున్నామంటున్న వీరంతా ఇంటర్నేషనల్, నేషనల్ పోటీల్లో అవార్డులు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ పోటీల్లో ఆడా.. విద్యతో పాటు వాలీబాల్‌పై మక్కువ పెంచుకుని తర్ఫీదు పొందాను. రెండు పర్యాయాలు థాయ్‌లాండ్‌లో జరిగన ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొన్నాను. ఆర్ట్ స్టూడెంట్‌గా ఉన్నతవిద్యభ్యసించి స్థిరపడాలని, అంతర్జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నా స్నేహితులు క్రీడాకారులు కావడంఅదృష్టం. – చేతన్ గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నా.. నేషనల్ సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి, ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నా. ఖోడినార్ ప్రాంతం నుంచి నాతో పాటు ఏడుగురం వాలీబాల్లోనే రాణిస్తున్నాం. కోచ్ సూచనలు, సలహాలతో నిరంతర సాధన చేస్తున్నాం. అటు చదువు, ఇటు క్రీడ రెండింటిలో గుర్తింపు తెచ్చుకోవాలని టీం వర్క్ చేస్తున్నాం. – అస్మిత -
పోలీసుల వేధింపులు: యువకుడి ఆత్మహత్య
ములకలపల్లి: తాను చేయని దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయడంతో అవమానంగా భావించిన ఓ యువకుడు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గొల్లగూడెం గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన జమ్మిలి సాయి(23) అనే యువకునిపై దొంగతనం చేశాడని ఫిర్యాదు వచ్చింది. అయితేఉ తాను దొంగతనం చేయలేదని చెప్పినా.. పోలీసులు స్టేషన్‌కు పిలిపించి వారి పద్దతిలో విచారణ చేశారు. దాంతో మనస్థాపానికి గురైన సాయి గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసుల వేధింపులతోనే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. -
సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న శివరాజ్‌పాటిల్
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి మహాసమాధిని కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్‌పాటిల్ దర్శించుకున్నారు. బుధవారం రాత్రి ఆయన బెంగళూరు నుంచి ప్రశాంతి నిలయానికి చేరుకొన్నారు. గురువారం ఉదయం సత్యసాయి మహాసమాధిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాంతిభవన్ అతిథి గృహంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్యసాయి చిత్రపటాన్ని అందజేశారు. అనతరం శివరాజ్‌పాటిల్ 9 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. -
ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరిప్రదక్షిణను చేపట్టారు. ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద సత్యసాయి చిత్రపటానికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలాపనతో గిరిప్రదక్షిణలో భక్తులు ముందుకు సాగారు.గోకులం, ఎనుములపల్లి గణేష్ సర్కిల్, ఆర్వీజే పెట్రోల్ బంక్, చింతతోపుల మీదుగా పట్టణంలో ప్రవేశించి తిరిగి ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద మంగళహారతితో కార్యక్రమం ముగిసింది. పుట్టపర్తి పరిసర ప్రాంతాలతోపాటు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణలో పాల్గొని తరించారు. -
ధర్మపరిరక్షణార్థమే సత్యసాయి అవతరణ
సత్యసాయి బోధనల ఆంగ్ల అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్‌కుమార్ పుట్టపర్తి టౌన్ : మానవతా విలువలు అంతరించిపోతున్న తరుణంతో ధర్మపరిరక్షణార్థం సత్యసాయి భూమిపై అవతరించారని సత్యసాయి అంగ్ల బోధనల అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్‌కుమార్ అన్నారు. సత్యసాయి 91వ జయంతి కార్యక్రమాల్లో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సోమవారం ఉదయం ఆయన ప్రసంగించారు. సత్యం, ధర్మ, శాంతి, ప్రేమ మానవ జీవింతలో మూలస్తంభాలని, వాటిని సత్యసాయి బోధించి, ఆచరించి చూపారన్నారు. ప్రతి ఒక్కరూ సత్యసాయి బోధనల అనుసారం సన్మార్గంలో నడవాలని కోరారు. సత్యసాయి మొబైల్ వైద్యసేవల వాహనాలు ప్రారంభం సత్యసాయి సంచార వైద్య సేవల్లో భాగంగా హైదరాబాద్, విజయనగరం జిల్లాలో గ్రామీణ రోగులకు సేవలందించేందుకు రెండు నూతన మొబైల్ వైద్య వాహనాలను సత్యసాయి ట్రస్ట్ సభ్యులు సోమవారం ప్రారంభించారు. సత్యసాయి జయంతిలో భాగంగా సోమవారం ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాహనాలను ప్రారంభించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, చక్రవర్తి, నాగానంద, ఏపీ మిశ్రా, టీకేకే భగవత్, కార్యదర్శి ప్రసాద్‌రావు, సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్‌పాండ్య, ప్రశాంతి కౌన్సిల్ చైర్మ¯ŒS డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, మాజీ డీజీపీ హెచ్‌జే దొర పాల్గొన్నారు. -
బాబాయ్ అబ్బాయ్ ఓ పూరి జగన్నాథ్
బాబాయ్ - అబ్బాయ్ - ఒక ఫేమస్ డెరైక్టర్! నిజానికి ఈ టైటిలే అయితే ఇంకా బాగుండేదేమో.. కానీ పూరి జగన్నాథ్ లేకపోతే బాబాయ్ - అబ్బాయ్ ఉండేవారంటారా? అందుకే ఈ టైటిలే బెటర్! సాయిరామ్ శంకర్‌లో పరిణతి లేదని కాదు... ఆకాశ్‌లో సూర్యతేజం లేదనీ కాదు! నిజానికి కొండంత డెరైక్టర్ నీడలో... వీరిద్దరి ప్రతిభ మసకబారిందేమో అనిపిస్తోంది. కుర్రాళ్లిద్దరూ మంచివాళ్లే..! ‘చాలు చాలు... సినిమావాళ్లు మంచోళ్లా!?’ ఇంటర్వ్యూ చదవండి... మీకే అర్థమవుతుంది! ఒక్క సినిమా స్టోరీ చెప్పలేదు... అన్నీ మనసులోంచి వచ్చిన మాటలే..! ఎంజాయ్ సండే... బాబాయ్-అబ్బాయ్.. సౌండింగ్ బాగుంది. మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో? ఇద్దరూ: సూపర్ అండి. బాబాయ్-అబ్బాయ్‌లా కాకుండా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్‌లానే ఉంటాం. మమ్మీ-డాడీ దగ్గర చెప్పుకోలేనివి బాబాయ్‌తో..? సాయి: పిల్లలు ఏదైనా చెప్పుకునే ఫ్రీడమ్ మా అన్న-వదిన ఇస్తారు. కాకపోతే బాబాయ్ అంటే ఫ్రెండ్‌లా కాబట్టి... సరదా సరదా విషయాలు చెబుతుంటాడు. ఆకాశ్: డాడీ బిజీగా ఉంటారు కాబట్టి... ఏ విషయం అయినా అమ్మ దగ్గరే చెబుతాం. బాబాయ్‌తో మాట్లాడేటప్పుడు ఏది పడితే అది హ్యాపీగా మాట్లాడేస్తాం. మీ ఫ్రెండ్లీ బాబాయ్ కెరీర్‌వైజ్‌గా సక్సెస్ కావడం లేదు కదా. మీకేమైనా బాధగా ఉంటుందా? ఆకాశ్: ‘143’, ‘డేంజర్’, ‘బంపర్ ఆఫర్’... ఇలా మా బాబాయ్వి కొన్ని సక్సెస్‌లే చూశాను. సినిమాలు ఫ్లాప్ అయ్యుండొచ్చేమో కానీ, ఆర్టిస్ట్‌గా ఆయన ఎప్పుడూ ఫెయిల్ కాలేదండి. అబ్బో.. బాగానే వెనకేసుకొస్తున్నాడు.. సాయి: వాడి వెనక నేనుంటే కనిపించను. ఎంత హైట్‌గా ఉన్నాడో చూశారుగా. ఈ రెండేళ్లల్లో బాగా పెరిగాడు. ఇంత హైట్ అవుతాడనుకోలేదు. నాకూ, పూరీ అన్నయ్యకు మధ్యలో ఉన్న మా గణేశ్ అన్నయ్య మంచి హైట్. బహుశా అది వచ్చి ఉంటుందేమో. ఇంకా బాబాయ్ ఏమీ సాధించలేదు. ఈలోపు అబ్బాయి హీరోగా రెడీ అయిపోతున్నాడు... పోటీ? సాయి: అస్సలు లేదు. కళ్ల ముందు పెరిగినవాళ్లు మనకన్నా మించి ఉండాలని కోరుకుంటాం కదా. అయినా నేను మావాణ్ణి బ్రదర్‌లా అనుకుంటా. ఎందుకంటే మా వదిన మమ్మల్ని సొంత కొడుకులా చూసినట్లే చూస్తుంది. అన్నను తమ్ముడు మించాలండి. ఆకాశ్: నేను హీరో కావడానికి ఇంకో మూడేళ్లు ఉందండి. ఈ మూడేళ్లల్లో మా బాబాయ్ కెరీర్ పీక్స్‌కి వెళుతుందనుకుంటున్నా. చూస్తూ ఉండండి.. మా బాబాయ్ గట్టి హిట్ సాధిస్తాడు. సాయి గారూ... మీ లుక్స్ బాగుంటాయి. బాగా యాక్ట్ చేస్తారు. అయినా రేంజ్ పెరగకపోవడానికి కారణం? సాయి: లుక్స్, యాక్టింగ్ కన్నా ముందు మంచి కథ ముఖ్యం. ‘143’, ‘డేంజర్’, ‘బంపర్ ఆఫర్’ మంచి రిజల్ట్‌నే ఇచ్చాయి. కొన్ని కథలను సరిగ్గా సెలక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇలా మిగిలిపోయా (నవ్వుతూ). కెరీర్‌వైజ్‌గా వెనకబడి... ఇలా హాయిగా నవ్వడం బహుశా మీకే సాధ్యం అవుతుందేమో? సాయి: కీడెంచి మేలెంచమంటారు. నేనా టైపే. ఫెయిల్యూర్‌కి ప్రిపేర్ అవుతా. రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చిందనుకోండి... హ్యాపీ. లేకపోతే పెద్దగా బాధ అనిపించదు. కాసేపు బాధ పడి రొటీన్లో పడిపోతా. మరి... ఆకాశ్! మీరూ మీ బాబాయ్ టైపేనా? మీ ‘ఆంధ్రా పోరి’ హిట్ కాలేదు కదా? ఆకాశ్: నేను కూడా కొంచెం బాబాయ్ టైపే. కాసేపు బాధపడ్డా. ‘నువ్వు బాగా యాక్ట్ చేశావ్’ అని నాన్న మెచ్చుకున్నారు. ఫస్ట్ సినిమా అయినా బాగా చేశావని అందరూ అన్నారు. నా వరకూ నేను బాగానే చేశానండి. ‘ఆంధ్రా పోరి’ చూసి, మీకేమనిపించింది సాయి? సాయి: మావాడి స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. తనలో మహీరో మెటీరియల్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. పూరీ బ్రదర్ అంటే అవకాశాలు బాగానే వస్తాయి. సినిమా సినిమాకీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారేంటి? సాయి: ‘బంపర్ ఆఫర్’ హిట్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఓ పెద్ద నిర్మాత నాతో సినిమా చేస్తాననడంతో వాటిని వదిలేసుకున్నా. అక్కినేని నాగేశ్వరరావుగారు-శ్రీహరిగారు-నా కాంబినేషన్లో ఆ సినిమా ప్లాన్ చేశారు. నాలుగైదేళ్ల క్రితం ఏయన్నార్‌గారు మీసాలు పెంచారు. అది ఈ సినిమా కోసమే. ‘ఇదే చివరి సినిమా.. ఇక చేయను’ అని ఆయన అన్నారు. గ్రేట్ కాంబినేషన్ కాబట్టి, ఈ ఒక్క సినిమా మీదే దృష్టి పెట్టాలనుకున్నా. ఒకటీ రెండూ.. మూడు... అలా తొమ్మిది నెలలు గడిచిపోయాయ్. హఠాత్తుగా సినిమా చేయడం లేదని ఆ నిర్మాత చేతులెత్తేశాడు. అప్పుడర్థమైంది.. జీవితంలో ఎప్పుడూ ఒకే సినిమా మీద ఆధారపడకూడదని. ముఖ్యంగా హిట్ సినిమా చేశాక గ్యాప్ తీసుకోకూడదని. మీ అన్నయ్య ఏమీ అనలేదా? సాయి: వర్కవుట్ కాదు. అతను సినిమా తీయడని ముందే చెప్పాడు. మీ అన్నయ్య మీతో డెరైక్టర్‌గా-ప్రొడ్యూసర్‌గా సినిమాలు చేశారు. డబ్బులు పోగొట్టుకున్నారు. మీకేమైనా గిల్టీగా..? సాయి: గిల్ట్ ఉంటుందండి. కొడుకు మీద ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది తండ్రులు వెనకాడతారు. తమ్ముడి కోసం ఓ తండ్రి కన్నా ఎక్కువే చేశాడు. డబ్బులు నష్టపోయాడు. బాబాయ్ కోసం మీ నాన్న డబ్బులు పోగొట్టుకున్నందుకు మీకేమైనా కోపం? ఆకాశ్: అస్సలు లేదండి. ఒకవేళ నాన్న వేరే హీరో మీద పెట్టినా డబ్బులు పోయేవి. సొంత తమ్ముడి కోసమే కదా పెట్టారు. ఒకవేళ ఆ సినిమాలు డబ్బులు తెచ్చి ఉంటే, అప్పుడు మేమంతా ఎంజాయ్ చేసేవాళ్లం కదా... పూరీగారు తక్కువ టైమ్‌లో కోట్లు సంపాదించి.. దాదాపు అన్నీ పోగొట్టేసుకున్నారు. చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేస్తున్నారని మీరు గ్రహించలేకపోయారా? సాయి: బేసిక్‌గా అన్నయ్య అందర్నీ నమ్ముతాడు. కోట్లు కొట్టేస్తారని ఎవరైనా ఊహిస్తారా? మేం కూడా గ్రహించలేదు. తెలుసుకునే సరికి అంతా అయిపోయింది. ఆ కష్టాలన్నీ మీ డాడీ మీకు చెప్పారా? ఆకాశ్: ఇబ్బందులేవీ మాకు తెలియకూడదని నన్నూ, పవిత్ర (ఆకాశ్ చెల్లెలు)నూ హాస్టల్లో చేర్చారు. మూడేళ్లు హాస్టల్లో ఉన్నాం. వచ్చిన తర్వాత తెలిసి, బాధ అనిపించింది. మీరిందాక చుట్టూ ఉన్నవాళ్లు అన్నారు కదా.. ఒక్కోసారి వాళ్లు మా డాడీని కలవడానికి కూడా ఒప్పుకునేవాళ్లు కాదు. బిజీగా ఉన్నారనేవాళ్లు. మేం వాళ్లను బయటివాళ్లలా అనుకోలేదు. మా సొంత బాబాయ్లానో, మావయ్యలానో అనుకునేవాళ్లం. సాయి: (మధ్యలోనే అందుకుంటూ...) నేను మా అన్నయ్యను కలవాలన్నా వాళ్ల పర్మిషనే తీసుకోవాల్సి వచ్చేది. పోగొట్టుకున్న డబ్బుని పూరీగారు తక్కువ సమయంలోనే సంపాదించారు. ఇలా అందరికీ సాధ్యం కాదు... సాయి: అన్నయ్య మంచితనమే ఆయనకు మంచి చేస్తోంది. నాకు తెలిసి గడచిన పన్నెండేళ్లల్లో లక్షా, 2 లక్షలు, ఐదు లక్షలు... ఇలా హెల్ప్ పేరుతో ఈజీగా ఐదారు కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు. అలా చేశాడు కాబట్టే, మళ్లీ ‘బౌన్స్ బ్యాక్’ కాగలిగాడు. ఆకాశ్: యస్.. మా డాడీ నైస్ హ్యూమన్ బీయింగ్. అన్నదమ్ముల అనుబంధం ఎంత బాగున్నా.. ఇంట్లో ఆడవాళ్ల కారణంగా ప్రాబ్లమ్ రావడం కామన్. మీకు డబ్బులు పెట్టినప్పుడు మీ వదిన ఏమైనా..? సాయి: మీరన్నది నిజమే. కానీ, మా ఇంట్లో వేరు. మా వదిన ఒక్క మాట కూడా అనలేదు. మా ఆవిడ, వదిన బాగుంటారు. వాళ్లకు వేవ్ లెంగ్త్ కుదరడం మాకు హ్యాపీ. ఆకాశ్... మళ్లీ బాబాయ్‌తో డాడీ ఓ సినిమా చేస్తే బాగుంటుందని అనిపిస్తోందా? ఆకాశ్: ఇద్దరి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. సాయి: అన్నయ్య నా కోసం చేయాల్సిందంతా చేశాడు. దర్శక-నిర్మాతగా ‘143’, నిర్మాతగా ‘హలో.. ప్రేమిస్తారా..’, కథ-మాటలు రాయడంతో పాటు ఆయనే ‘బంపర్ ఆఫర్’ను నిర్మించారు. ఇంకా ప్రెజర్ ఇవ్వకూడదనే నేను బయట సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. ఈ డిసెంబర్లో గట్టు ఎక్కేస్తానని అనుకుంటున్నాను. ఆకాశ్: యస్... అది నిజమవుతుంది. హీరోగా రవితేజ స్ట్రాంగ్ అవడానికి మీ అన్నయ్యే కారణం కదా! సాయి: ఒకరికొకరు తోడయ్యారు. అన్నయ్యకు ఓ హీరో కావాలి. రవితేజగారికి ఓ దర్శకుడు కావాలి. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’తో ఇద్దరి జర్నీ స్టార్టయింది. అన్నయ్య కథలకు సరిపడే హీరో రవితేజగారు, అలాంటి ఎనర్జిటిక్ హీరోకి సరిపడా కథలు రాసిన దర్శకుడు మా అన్నయ్య. అన్నయ్య దగ్గర ఏడేళ్లు సహాయ దర్శకుడిగా చేశారు. మీ కోసం ఓ కథ రాసుకోవాలనిపించలేదా? సాయి: ప్రేక్షకులందరి దయతో రెండు మూడు సినిమాలు ఆడితే... అప్పుడు ఆలోచిస్తా. ఆకాశ్: బాబాయ్ నా కోసం ఓ కథ రాయాలి. సాక్షి: అప్పుడే అబ్బాయి కర్చీఫ్ వేసేశాడు! (నవ్వులు) మీ డాడీ పనిచేసిన హీరోల్లో మీకు ఎవరు క్లోజ్? ఆకాశ్: అందరూ క్లోజ్‌గా ఉంటారు. చిన్నప్పుడు నాది రింగు రింగుల జుట్టు. పెద్దయ్యాక ‘కెమెరామ్యాన్ గంగతో రాంబాబు’ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారిని కలసినప్పుడు.. ‘నీ జుట్టు బాగుండేది. ఇప్పుడేమైంది’ అనడిగారు. అందరూ బాగుంటారు. సాయి: ఆకాశ్ పుట్టు వెంట్రుకలు తీయించడం లేటయింది. మొదటి సంవత్సరంలోపు తీయకపోతే మూడేళ్ల వరకూ తీయకూడదు కదా. దాంతో జుత్తు బాగా పెరిగిపోయింది. ‘బద్రి’ టైమ్‌లో మనోడు జాకీర్ హుస్సేన్ (తబలా ప్లేయర్)లా ఉండేవాడు. అప్పుడు షూటింగ్‌కి తీసుకువెళ్లాం. పవన్‌గారు ఆకాశ్ జుట్టుతో ఆడుకునేవారు. ఆకాశ్! మీరు పాకెట్ మనీ ఎంత తీసుకుంటారు? సాయి: ఆ... అన్నీ చెప్పేస్తారు మీకు (నవ్వులు). ఆకాశ్: ఎప్పుడు సినిమాకి వెళ్లినా అమ్మ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంటా. పాకెట్ మనీ అని ప్రత్యేకంగా తీసుకోను. మమ్మీ చాలా స్ట్రిక్ట్. బాబాయ్‌తో ప్రేమ కబుర్లు కూడా చెబుతారా? ఆకాశ్: నేనింకా ప్రేమించలేదు కానీ... బాబాయ్ దగ్గర పిచ్చ ఫ్రీడమ్. అన్నీ చెప్తాను. సాయీ! మీది ప్రేమ వివాహమే కదా? సాయి: అవునండి. అమ్మానాన్న, అన్నయ్య-వదిన దగ్గరుండి మరీ పెళ్లి చేశారు. మీ ఫ్యూచర్ కోసం ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. ఇద్దరూ: థ్యాంక్యూ అండి... అందరికీ హ్యాపీ సండే. - డి.జి. భవాని -
అంబరమంటిన దీపావళి సంబరం
ప్రశాంతి నిలయంలో దీపావళి పర్వదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలాగే గుజరాతీయుల నూతన సంవత్సర వేడుకలు సైతం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత వేద మంత్రోచ్ఛారణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం గుజరాత్ భక్తులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన సత్యసాయి యూత్ సభ్యులు మహాసమాధి చెంత ‘జర్నీ ఆఫ్ రిథమ్’అన్న పేరుతో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. అలాగే గుజరాత్‌లోని నవసారికి చెందిన బాలవికాస్ విద్యార్థులు శ్రీరాముడిని కొనియాడుతూ భక్తిగీతాలతో నృత్యప్రదర్శన నిర్వహించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
కశ్మీర్‌ను కాపాడుకోవాలి
సాక్షి,హైదరాబాద్: ‘ఆకలిగొన్న వారి ఆకలి తీర్చేదే హిందుత్వం. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసుకొనేవాడే హిందువు’ అని పశ్చిమామ్నాయ ద్వారకా శారదా పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతీ మహాస్వామి చెప్పారు. దేశంలో ఉండేవారందరూ హిందువులు కారన్నారు. భారత్‌ను పట్టి పీడిస్తున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దేశమంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ‘భారత్ అమ్మలాంటిది. అందులో కశ్మీర్ ముఖం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అన్నారు. ఆదివారం నాంపల్లి లలిత కళాతోరణంలో జరిగిన దర్శనమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక పుష్కరోత్సవంలో ఆయన ప్రసంగించారు. జీహాదీ ముసుగులో ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటున్నారన్నారు. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ప్రస్తుతం వారిపై అత్యాచారాలు, ఆరాచకాలు పెరిగాయన్నారు. ఇందుకు పురుషులు మత్తు మందులకు బానిసలవ్వడమే కారణమన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో భగవద్గీత, రామాయణం, భారతం బోధించాల్సిన అవసరం ఉందన్నారు. సాయి మనిషి రూపమే... ‘సాయి పేరుతో గాయత్రీ మంత్రి అర్థం మార్చేశారు. సీతారాం బదులు సాయిరాం తీసుకువచ్చారు. సాయి భూమిపై పుట్టినవారే. అవతార మూర్తి కాదు. షిర్డీ వేదికగా సాయిని దేవుడని రుజువు చేయండని షిర్డీ సంస్థాన్నే కోరాం. రెండు నెలలు గడువిచ్చినా వారు చూపలేకపోయారు. ఆంధ్రా, తెలంగాణాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని వందలాది గుళ్లల్లో ఒక్కటి కూడా సాయి ఆలయం లేదు. సాయిని దేవుడిగా కొలిచేవారు దీన్ని గుర్తించాలి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సాయి పూజ సుద్ధ తప్పు. ఇవన్నీ పోవాలంటే సుదర్శన చక్ర పూజ అవసరం. గోహత్యలు ఆపాలి’ అని స్వామి వ్యాఖ్యానించారు. దీంతో సభలోని సాయి భక్తులు స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని బయటకు పంపించారు. అనంతరం తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుతూ స్వామికి పాద పూజ నిర్వహించారు. పుష్పగిరి పీఠాధిపతి నృసింహ భారతిస్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
అమ్మను మరిపించిన సత్యసాయి
వేదాంతి మల్లా ప్రగడ∙శ్రీమన్నారాయణ పుట్టపర్తి టౌన్: ఆదిపరాశక్తి అమ్మను మరిపిస్తూ లోకకల్యాణార్థం అవతరించిన సర్వాంతర్యామి సత్యసాయి అని వేదాంతి మల్లా ప్రగడ∙శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. దసరా వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మానవాళి సర్వతోముఖాభివృద్ది కోసం సత్యసాయి తన లీలావైభవాన్ని కొనసాగించారన్నారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమను బోధిస్తూ పరిమిత రూపంలో జన్మించిన సత్యసాయి కాలంంతోపాటు అపరిమిత రూపంగా మానవాళిని సన్మార్గం వైపు నడిపే ఆదిపరాశక్గిగా విరాజిల్లారన్నారు. అనంతరం భక్తులు సత్యసాయి భక్తులు మహాసమాధిని దర్శించుకున్నారు. నేడు విజయదశమి వేడుకలు ప్రశాంతి నిలయంలో మంగళవారం విజయదశమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది సత్యసాయి భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రశాంతి నిలయంలో చేరుకున్నారు. దసరా వేడుకల్లో భాగంగా విశ్వశాంతి కోసం ఏడు రోజులుగా ప్రశాంతి నిలయంలో బ్రహ్మశ్రీ కొండావధాని నేతృత్యంలో పుర్ణచంద్ర ఆడిటోరియంలో జరుగుతున్న వేదపురుష సప్తాహ యజ్ఞం పూర్ణాహుతితో మంగళవారం ముగియనుంది. అనంతరం భక్తులు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.అలాగే తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న సత్యసాయి గ్రామ సేవ కార్యక్రమం సైతం ముగియనుంది. మంగళవారం ప్రశాంతి నిలయంలో గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
సత్యసాయి గ్రామసేవలు ప్రారంభం
దసరా వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి ట్రస్ట్ గ్రామ సేవలను సోమవారం ఘనంగా ప్రారంభించింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు, కార్యదర్శి ప్రసాద్‌రావు ప్రశాంతి నిలయంలో గ్రామసేవ కార్యక్రమాన్ని పూజలు నిర్వహించి ప్రారంభించారు. తొమ్మిది రోజులు పాటు నిర్వహించే గ్రామసేవలో పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల పరిధిలోని 126 గ్రామాలకు చెందిన సుమారు 60 వేల కుటుంబాలకు చీర, ధోవతి, సత్యసాయి అన్న ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, సిబ్బంది సుమారు 600 మంది సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్రాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే సత్యసాయి చూపిన మార్గంలో నడుస్తూ ఆయన సేవలను ట్రస్ట్ కొనసాగిస్తోందన్నారు. దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేశామన్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. తొలి రోజు పుట్టపర్తి నగరపంచాయతీ పరిధిలో గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలరించిన సంగీత కచేరి సత్యసాయిపై భక్తిప్రపత్తులు చాటుతూ చక్కటి స్వరాలతో విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది.సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి మిరుపురీ సంగీత కళాశాల విద్యార్థులు,సిబ్బంది సంగీత కచేరి నిర్వహించారు. అనంతం వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
వైభవంగా విరాట్‌సాయి జన్మదినోత్సవం
భక్తజనంతో రేపూరు కిటకిట ∙ భారీగా సామూహిక సత్యవ్రతాలు రేపూరు (కాకినాడ రూరల్) : కాకినాడ రూరల్ మండలం రేపూరులోని 116 అడుగుల ఎల్తైన విరాట్ షిరిడీ సాయిబాబా 181వ జన్మదినోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 4 నుంచి భక్తులు సాయికోటి మహాస్థూపంలో శ్రీసాయి సాయికోటి పుస్తకాలను వేయించారు. కాకడ హారతితో పాటు భక్తులు సుప్రభాతం, అభిషేకాలు, సామూహిక సత్యవ్రతాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు బాబాకు చందనోత్సవం నిర్వహించారు. విరాట్‌సాయి విగ్రహ వ్యవస్థాపకులు అమ్ముల సాంబశివరావు ప్రసంగం వినడానికి వచ్చిన భక్తులు, బాబాను దర్శించుకునేందుకు క్యూ కట్టారు. 11రోజుల పాటు సాయికోటి దీక్షలు చేపట్టిన యువకులు వాటిని విరమించారు. సుమారు 2 వేలకు పైగా మహిళలు సామూహిక సత్యవ్రతాలను చేశారు. కార్యక్రమం లో పాల్గొని సాయిబాబాను దర్శించుకొని సాయికోటి పుస్తకాలను మహాస్థూపంలో వేశారు. ఒక్కరోజు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 40 వేలకు పైగా భక్తులు తరలివచ్చారని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. సాయిబాబా 181వ జన్మదినోత్సవం సందర్భంగా 65 కిలోల భారీ కేక్‌ను భక్తుల కట్ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటి భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తులకు తాగునీరు, మజ్జిగ, వివిధ రకాల పానీయాలు అందించారు. రూరల్ సీఐ పవన్‌కిశోర్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం ఎస్సై తిరుపతి తమ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. -
మెగాస్టార్ మూవీ సూపర్‌హిట్ కావాలి
అంతర్వేదిలో హీరో సాయి ధరమ్‌తేజ హోమం అంతర్వేది (సఖినేటిపల్లి) : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం పూర్తిస్థాయిలో విజయం సాధించాలని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఈ చిత్రానికి పని చేయాలని కోరుకుంటూ ఆయన మేనల్లుడు, యువ హీరో సాయి ధరమ్‌తేజ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి బుధవారం హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల హోమాలు నిర్వహించారని తెలిపారు. అభిమానులు కూడా ఆరోగ్యంగా ఉండాలని హోమంలో తాను ప్రార్థించానన్నారు. తాను ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నక్షత్రం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నానని, కొత్త చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ సరసన 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్ కూడా పోలీసు అధికారిణి పాత్రలో కనిపించనుంది. చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, రావి మురళి, గుండాబత్తుల తాతాజీ, అడబాల రాజప్ప, నామన నాగభూషణం, అధిక సంఖ్యలో అభిమానులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
సెల్ఫీ తీసుకుంటూ అథ్లెట్ మృత్యువాత
భోపాల్: సెల్ఫీ తీసుకుంటూ జాతీయ స్థాయి అథ్లెట్ పూజా కుమారి(20) మృతి చెందింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సహచర మహిళా అథ్లెట్లతో కలిసి శాయ్ సమీపంలోని చెరువుకు వెళ్లిన పూజా కుమారి సెల్ఫీ తీసుకుంటూ అందులో పడిపోయింది. సహాయం కోసం కేకలు పెట్టింది. ఆమెకు ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయింది. పూజా కుమారితో వెళ్లిన ఇద్దరికీ ఈత రాకపోవడంతో వారిద్దరూ హాస్టల్ కు పరుగెత్తుకెళ్లి కొందరిని వెంటబెట్టుకుని తిరిగి వచ్చారు. చెరువు నుంచి పూజా కుమారి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ కు చెందిన ఆమె మూడేళ్లులో శాయ్ హాస్టల్ లో ఉంటుందని చెప్పారు. -
ఐక్య పోరాటంతోనే బలోపేతం
పెద్దాపురం : ఐక్య పోరాటంతోనే సంఘ బలోపేతం సాధ్యపడుతుందని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు కుండల సాయి అన్నారు. పెద్దాపురం యాదవ కమ్యూనిటీ హాలులో సోమవారం అఖిల భారత యాదవ మహాసభ అధికార ప్రతిని«ధి చావల రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ యాదవులంతా ఐక్యంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది యాదవ సంక్షేమ నిధి వెయ్యికోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొర్రెలు, మేకల పెంపకం దారులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. యాదవ సంఘం నాయకులు పైల చిన్నబ్బాయి, సందక రాంబాబులు మాట్లాడుతూ యాదవ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘం పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో కన్నారావు, సందక సత్తిబాబు, మామిడి శివ, విడదాసరి రాజా, బొమ్మాడ సూరి, రెల్లబోయిన శ్రీనివాస్, గణేష్, లోవరాజు, మడక సుబ్బారావు, బొట్టా రామకృష్ణ, నీలపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ‘సాయి’
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గుత్తుల సాయి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఈ నియామకం జరిగింది. ముమ్మిడివరం మండలం గాడిలంకకు చెందిన సాయి పార్టీలో ముమ్మిడివరం నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ ఆ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా మాత్రమే ఉన్న సాయి సేవలను ఇక ముందు రాష్ట్రస్థాయిలో వినియోగించుకోవాలనుకుంటున్నారు. అదే ఉద్దేశంతో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సాయికి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. జగన్మోహన్రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన రాష్ట్ర స్థాయి బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని సాయి ‘సాక్షి’కి చెప్పారు. నియోజకవర్గ నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. -
వైభవంగా గురుపౌర్ణమి
– భక్తులతో ఆలయాలు కళకళ కడప కల్చరల్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అజ్ఞానంలో ఉన్న మాకు జ్ఞాన జ్యోతివై ఉత్తమ జీవితానికి ఉత్తమోత్తమ మార్గాన్ని చూపు సాయిదేవా అంటూ భక్తులు వేడుకున్నారు. శ్రీ షిరిడిసాయి ఆలయాలలో ఉదయం 4 గంటల నుంచే కాగడ హారతి అనంతరం విశేష పూజలు నిర్వహించారు. శ్రీ సాయిబాబా ఆలయాలు, దత్తాత్రేయస్వామి ఆలయాలలో మూల విరాట్లను ప్రత్యేకంగా అలంకారం చేశారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. పలు దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో సమీప రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. ఊహించనంత ఎక్కువ మంది భక్తులు తరలి రావడంతో నిర్వాహకులు మరింత జాగ్రత్త వహించి అప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లను చేశారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
-
ఆధ్యాత్మిక శోభ
-
భక్తిపారవశ్యంతో సాయిదీక్షలు
కరీంనగర్‌కల్చరల్ : గురుపౌర్ణమిని పురస్కరించుకుని నగరంలో శ్రీషిర్డీసాయిమాలధారణ దీక్షలను సాయిభక్తులు స్వీకరించారు. శ్రీషిర్డీసాయి భక్తజన మండలి ఆధ్వర్యంలో సాయినాథ్ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 19న గురుపౌర్ణమి సందర్భంగా శ్రీవిజయగణపతి సాయిబాబా ఆలయంలో 24 గంటల పాటు భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీషిర్డీసాయి భక్తజన మండలి అధ్యక్షుడు నలుమాచు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ తెలిపారు. -
కనుల పండువగా సాయి పల్లకిసేవ
మిర్యాలగూడ అర్బన్: సాయి పల్లకి సేవను దత్తా ఆశ్రమ స్వాములు శనివారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. పొలిశెట్టి వెంకటేశ్వర్లు, సక్కుబాయి ఇంటి నుంచి ప్రారంభమైన సంతోష్‌నగర్ మీదుగా కొనసాగింది. దీనిలో భాగంగా కాలనీ మహిళలు వేసిన కోలాట ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని సాయి పల్లకిని మోశారు. -
ప్రత్యక్ష దైవం...
మచ్చ రామలింగారెడ్డి సాయిబాబాగా నటిస్తున్న చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. కొండవీటి సత్యం దర్శకుడు. సుకుమార్, కోసూరి సుబ్బారావు నిర్మాతలు. భానుశంకర్, సీత, విజేత, శ్రీకృష్ణ రమేశ్‌లు ప్రధాన పాత్రల్లో నటిసున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ షిర్డీ సాయి మీద వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉంటుందీ చిత్రం. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు. ఆడియో విడుదలైన తర్వాత కిషన్ కవాడియా స్వరాలు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తాయి. నటీనటుల అభినయం భక్తి పారవశ్యంలోకి తీసుకువెళ్తుంది. పెన్నా, అనంతపురం, అహోబిలం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: దాసం వెంకట్రావ్, ఛాయాగ్రహణం: సూర్య, సంగీతం: కిషన్ కవాడియా. -
నెల్లూరు జిల్లాలో దారుణం
కావలి: నెల్లూరు జిల్లాలో శనివారం దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కావలిలో ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి సాయి పై మహేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఇది గుర్తించిన స్థానికులు విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిన్నారిని చిదిమేసిన లారీ
గుంటూరు జిల్లా చిలకలూరిపేట బస్టాండ్ సమీపంలో లారీ ఢీకొని ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బుధవారం ఉదయం సాయి అనే మహిళ తన ఐదేళ్ల కుమారుడు ప్రణీత్‌తోపాటు పొరుగింటికి చెందిన నర్సరీ చదివే శ్రావణిని స్కూటీపై స్కూల్‌కు తీసుకెళుతోంది. బస్టాండ్ సమీపంలో గుంటూరు వైపు నుంచి వచ్చిన లారీ స్కూటీని ఢీకొంది. సాయి, శ్రావణి ఒక వైపు పడిపోగా, ప్రణీత్ మరో వైపు పడిపోయాడు. అతడిపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ జిల్లా సిద్దిపేటలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న సిద్దిపేటకు చెందిన వైష్ణవి(18), వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన సాయి ప్రేమించుకుంటున్నారు. అయితే, గురువారం మధ్యాహ్నం వారు సిరిసిల్ల శివారులో యాసిడ్ తాగి పడి ఉండగా స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విషం తాగి తల్లి, కొడుకు ఆత్మహత్య
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ తన కుమారుడికి విషం తాగించి, తానూ తాగి తనువు చాలించింది. ఈ విషాదం కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నాగన్నచెరువు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పితాని దానమ్మ(23), ఆమె కుమారుడు సాయి(4) సోమవారం సాయంత్రం సమీపంలోని చెరువు వద్ద విగత జీవులై పడి ఉండగా స్థానికులు గుర్తించారు. వారి సమీపంలో పురుగు మందు డబ్బా పడి ఉంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో వారు చనిపోయారని భావిస్తున్నారు. -
పంతానికి పసికూనల బలి
ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తానూ తనువు చాలించిన తండ్రి పిల్లల కోసం భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు వేర్వేరుగా వుంటున్న దంపతులు ఫలించని పోలీసులు.. గ్రామస్తుల కౌన్సెలింగ్ స్పర్థల చిచ్చు ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. భర్తతోపాటు ముగ్గురు ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలను తీసేసింది. పరస్పర పంతం నలుగురి ప్రాణాలను అంతం చేసిందిన్నాయి. కొయ్యూరు: మఠం బీమవరం పంచాయతీ చీడికోటలో అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న పాలగెడ్డ దేవకుమారీ, పక్కనన్న తూర్పుగోదావరి జిల్లా నుంచి వలసవచ్చి ఎం బీమవరంలో నివశిస్తున్న తూము గౌరీశంకర్‌లు(40)తో సహజీవనం చేస్తున్నారు. వారికి దుర్గప్రసాద్(7) సాయి(5)కుమారులున్నారు. మూడేళ్ల కూతురు ఉంది. కొన్ని నెలల కిందట ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలు తల్లివద్దే ఉండేవారు. కానీ వారు తనతో ఉండాలని శంకర్ పట్టుబట్టేవాడు. కొద్ది రోజులు అతని వద్దనే ఉంచుకున్నాడు. అయితే భార్య దేవకుమారి కొద్దిరోజుల తర్వాత పిల్లలను తన వద్దకు తీసుకుపోయింది. పిల్లలను తీసుకుపోయేందుకు భర్త వస్తే ఆమె మంప పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు వారికి కౌన్సెలింగ్ చేశారు. ఇద్దరూ కలిసి ఉండి పిల్లలను బాగా చూసుకోవాలని సూచించారు. రాజీ కుదరకుంటే తల్లి వద్దనే తగిన వయసు వచ్చేవరకూ ఉండాలని చెప్పారు. పెద్దకొడుకును తండ్రి వద్ద మిగిలిన ఇద్దరినీ తల్లి దగ్గర ఉంచాలని గ్రామస్తులు,పెద్దలు సూచించారు. దానికి ఇద్దరు అంగీకరించలేదు. దీంతో పిల్లలు దేవకుమారి వద్దే ఉన్నారు. ఈనేపథ్యంలో తరచూ దేవకుమారి కొయ్యూరు వెళ్తూ పిల్లలను పట్టించుకోవడం లేదని శంకర్ వాపోయేవాడు. కొన్నాళ్ల తర్వాత వెళ్లి పిల్లలను తన వద్దకు తెచ్చుకున్నాడు. దీనిపై కోపగించిన దేవకుమారి వెళ్లి పిల్లలను తన ఇంటికి తీసుకొచ్చేసింది. దీంతో అతను రెండు నెలల పాటు పిల్లలు లేకుండానే ఒంటరిగా గడిపాడు. ఒక దశలో ఆమెతో రాజీకి వద్దామని విఫలయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బిడ్డలు దూరమవుతున్నారని మనస్థాపానికి గురయ్యాడు. భార్యలేని సమయం కోసం ఎదురు చూశాడు. సోమవారం భార్య కొయ్యూరు వెళ్లిందని తెలుసుకున్నాడు. శంకర్ మంగళవారం ఉదయం భార్య ఇంటికి చేరుకున్నాడు. ఇరుగుపొరుగు వారికి చెప్పి పిల్లలను తనతో తీసుకుపోయాడు. రాత్రి అతని వద్దనే ఉంచుకుని తెల్లవారుజామున పిల్లలకు విషమిచ్చి అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం భార్య వవచ్చేసరికి పిల్లలు లేరు. దీంతో ఇరుగుపొరుగు ద్వారా విషయం తెలుసుకుని భర్త ఇంటికి వచ్చి చూసేసరికి భర్తతో సహా పిల్లలు విగతజీవులై కనిపించారు..మృతదేహాల కోసం ఎం బీమవరానికి వై రామవరం అంబులెన్స్‌ను పంపామని పోలీసులు తెలిపారు. అడ్డతీగల ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సరదాను హరించిన శారద
భవాని మాల ధరించిన చిన్నారులు రెండు కుటుంబాలకు ఒక్కక్కరే కొడుకులు చూచుకొండలో విషాదం స్నానం కోసం శారద నదిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృత్యువాత మునగపాక:ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్థులు శారదా నదిలో సరదాగా స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో చూచుకొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చూచుకొండ ఎస్సీ కాలనీకి చెందిన కాండ్రేగుల దార సన్యాసినాయుడు (మణికంఠ, 13) సమీపంలోని గణపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వతరగతి చదువుకుంటున్నాడు. అదే కాలనీకి చెందిన పేలూరి సాయి (14) కూడా అదే హైస్కూల్లో 9వతరగతి చదువుతున్నాడు. దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా ఇద్దరూ అమ్మవారి మాల ధరించారు. బుధవారం ఉదయం మణికంఠ, సాయి, అదే కాలనీలో ఉంటున్న సతీష్ అల్పాహారం తీసుకున్న తరువాత గణపర్తి శారదానది పరివాహక ప్రాంతంలో స్నానం చేసేందుకు ఉదయం 9.45 గంటలకు చేరుకుని నదిలోకి దిగారు. మణికంఠ, సాయి ఇద్దరూ ఒక్కసారిగా నదిలో గల్లంతయ్యారు. ఇది గమనించిన సతీష్ కేకలు వేయడంతో పక్కనే ఉన్న కొంతమంది గాలింపు చేపట్టారు. కొంతసేపటికి సాయి మృతదేహం లభ్యమైంది. మణికంఠ మృతదేహం కోసం గణపర్తి, మెలిపాక, పూడిమడక గ్రామాలకు చెందిన ఈతగాళ్లతోపాటు ఎస్ఐ హరి, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా సుమారు 4 గంటల పాటు గాలించారు. తాళ్లు, ట్యూబ్‌ల సహాయంతో నదిలో విస్త్రృతంగా గాలింపు చేపట్టగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికంఠ మృతదేహం కూడా కనిపించడంతో ఒడ్డుకు తీసుకువచ్చారు. న దీపరివాహక ప్రాంతం వద్ద ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. నదిలో స్నానం చేస్తున్న సందర్భంలో తాము వారించినా పిల్లలు వినిపించుకోలేదని అక్కడ ఉన్న రజకులు ఆవేదన వ్యక్తంచేశారు. రెండూ పేద కుటుంబాలే.. మణికంఠ తల్లి ఉమ అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ కంపెనీలో పనిచేస్తుండగా తండ్రి స్థానికంగా మేస్త్రీగా పనులు చేస్తుంటాడు. మణికంఠ అక్క మౌలిక అండమాన్‌లో ఉంటోంది. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఇలా నదిలో పడి మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు కూడా తట్టుకోలేకపోతున్నారు. సాయి తండ్రి విష్ణు స్థానికంగా క్షౌర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు నదిలో పడి మృతి చెందాడన్న విషయం తెలియడంతో కుటుంబసభ్యుల. ఇద్దరి విగతజీవులను చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఈ సంఘటన పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో నది ఒడ్డకు వందలాదిగా జనం తరలివచ్చారు. నది ఒడ్డునే పోస్టుమార్టం శారదానదిలో పడి మృత్యువాత పడిన మణికంఠ, సాయిలకు స్థానికంగానే పోస్టుమార్టం నిర్వహించారు. అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి చెందిన వైద్యులు శారదానది ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ హరి చెప్పారు. శోకసంద్రంలో చూచుకొండ ఆడుతూ పాడుతూ ఉండే ఇద్దరు చిన్నారులు స్నానానికి వెళ్లి మృతి చెందడంతో చూచుకొండ గ్రామం శోక సముద్రంలో మునిగింది. రెండు కుటుంబాలకు ఒక్కొక్కరే కొడుకులు కావడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. నేతలు, అధికారుల పరామర్శ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు, అధికారులు బుధవారం గ్రామానికి చేరుకున్నారు. తహశీల్దార్ రాంబాబు, ఎంపీడీఒ శాంతలక్ష్మి, ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, ఎంపీపీ మంజు, ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, చూచుకొండ సర్పంచ్ నరసింగరావు, కర్రి రామనాగేశ్వరరావు తదితరులు మృతదేహాలకు సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. -
బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య
లేపాక్షి (అనంతపురం): బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా లేపాక్షిలో సోమవారం రాత్రి జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు... హిందూపురం బీసీ బాలుర హాస్టల్లో పనిచేసే చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలసి లేపాక్షిలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు సాయి (18) తనకు బైక్ కొనివ్వలేదని రెండురోజుల నుంచి ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన సాయిని భోజనం చేయలేదేమని తల్లిదండ్రుల అడగ్గా తింటానని చెప్పి తన గదిలోకి వెళ్లాడు. 11 గంటలైనా బయటకు రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించాడు. అతన్ని అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
'ఉద్యోగం వద్దు, న్యాయం కావాలి'
తిరువనంతపురం: భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఇవ్వచూపిన ఉద్యోగాన్ని మహిళా అథ్లెట్ అపర్ణా రామభద్రన్ తల్లి గీత తిరస్కరించారు. తనకు ఉద్యోగం అవసరం లేదని, న్యాయం కావాలని అన్నారు. కేరళలోని అళెప్పీ సాయ్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లో అపర్ణా రామభద్రన్, మరో ముగ్గురు అథ్లెట్లు విషపూరిత పండు (సెర్బెరా ఒడోలమ్)ను తిని ఆత్మహత్యాయత్నం చేయగా అపర్ణ ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి గీతకు ఉద్యోగం ఇచ్చేందుకు సాయ్ ముందుకు వచ్చింది. అయితే తనకు ఉద్యోగం వద్దని, న్యాయం కావాలని ఆమె డిమాండ్ చేసింది. ఇద్దరు సీనియర్లు తనను వేధింపులకు గురి చేశారని ఆస్పత్రిలో అపర్ణ తనతో చెప్పిందని గీత విలేకరులతో చెప్పారు. నిందితులను కాపాడేందుకు సాయ్ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. -
షిర్డీ సాయిపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
వారణాసి: ద్వారకాపీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా ముస్లిం అనీ, ఆయన గొడ్డు మాంసం తినేవారంటూ ఆయన నిన్న ద్వారకాపీఠంలో వ్యాఖ్యానించారు. సబ్ కామాలిక్ అన్న మాటలు సాయిబాబా చెప్పినవి కావని... అది గురు నానక్ సూక్తి అని శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి గుర్తు చేశారు. అంతేకాకుండా హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు పెట్టడాన్ని ప్రభుత్వాలు అడ్డుకోవాలని సూచించారు. సాయిబాబా ట్రస్ట్ ప్రజల్ని వెర్రివాళ్ళను చేస్తోందని ఆయన మండిపడ్డారు. ట్రస్ట్ పేరుతో వివిధ బ్యాంకుల్లో మూలుగుతన్న కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకోవాలని స్వరూపానంద డిమాండ్ చేశారు. ఆగ్రాలోని తాజ్ మహల్, అజ్మీర్ దర్గాల్లోని శివలింగాన్ని ధ్వంసం చేసి ముస్లిం పాలకులు సమాధులు కట్టారని ఆయన ఆరోపించారు. గతంలోనూ స్వామి స్వరూపానంద సరస్వతి ... ఇదే అంశంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
బహుశా... ఇదే నా చివరి ఇంటర్వ్యూ అవుతుందేమో!
‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకొన్న నటుడు సాయి. అయితే ఆ తర్వాత మాత్రం మితంగానే తెరమీద కనిపిస్తున్నాడు. ఎందుకలా? లెక్కకు మించి అవకాశాలు పలకరిస్తున్నా, సాయి ఎందుకు వాటిని ఒప్పుకోవడం లేదు! ప్రస్తుతం దర్శకుడిగా మారే ప్రయత్నంలో ఉన్న సాయి అంతరంగం ఏమిటి? మీ నేపథ్యం ఏమిటి? సినీరంగం వైపు ఎలా వచ్చారు? మాది తూర్పుగోదావరి జిల్లా తుని. స్కూల్ దశ నుంచే చదువు మీద కన్నా సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీదే ఆసక్తి ఎక్కువ. జనాలు కొట్టే చప్పట్లలో ఏదో కిక్ ఉందనిపించింది. అందుకే క్రికెటరయిపోదామని అనుకొన్నా. అండర్-19 సెలక్షన్స్ కోసం కాకినాడకు వెళ్లడంతో ఆ క్రికెట్ జర్నీకి బ్రేక్ పడింది. సెలక్షన్స్ జరుగుతున్నన్ని రోజులూ అక్కడ ఉండటం కూడా కష్టమైంది. వసతి కోసమని ఇంట్లో వాళ్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అదే సమయంలో చదువుకు కూడా ఫుల్స్టాప్ పడటంతో ఏదో ఒక పని చేయక తప్పలేదు. దీంతో తెలిసిన వారి ద్వారా చెన్నై వెళ్లి అక్కడ సినిమాల సాంకేతిక విభాగంలో ట్రై చేయడం మొదలు పెట్టాను. ఇదంతా పదిహేనేళ్ల కిందటి సంగతి. మరి నటుడిగా ఎలా మారారు? ఉన్న పరిచయాలతో మొదట సీరియళ్లలో అవకాశం వచ్చింది. తమిళ, తెలుగు భాషల కోసం చెన్నైలో రూపొందించే చాలా సీరియళ్లకు దర్శకత్వ విభాగంలో పనిచేశాను. అలా ఒక ఐదేళ్లు గడిచిపోయాయి. కనీసం 30 సీరియళ్లకు పనిచేశాను. అలా చేస్తున్నప్పుడు ‘కుర్రాడు బాగున్నాడు...’ అంటూ దర్శకులు ఏదైనా చిన్న పాత్రను చేయమనేవారు. ఆ సీరియళ్లు తెలుగులో ప్రసారం అయినప్పుడు మా అమ్మ చూసి తెగమురిసిపోయేది. ‘‘అప్పడప్పుడు అలా కనిపించరా’’ అని చెప్పేది. దీంతో నటన మీద కూడా దృష్టిపెట్టాను. తొలి సినిమాతోనే గుర్తింపు లభించినా, తర్వాత ఆ దూకుడు లేదే...! ఈ రోజుల్లో, బస్‌స్టాప్ సినిమాల తర్వాత ముప్పై నలభై సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకూ వెకిలి పాత్రలే! డబుల్ మీనింగ్ డైలాగ్స్ ద్వారా నవ్వించాలని చెప్పే దర్శకులు, నిర్మాతలే కనిపించారు. అయితే అర్థంపర్థం లేకుండా సాగే అలాంటి పాత్రలు చేయడం సరికాదనిపించింది. సెలెక్టివ్‌గా చేయవచ్చు కదా! నాకంత స్థాయి లేదండీ. ఒకసారి సినిమాను ఒప్పుకొన్నాకా అలా చేయను, ఇలా చేయను అంటే కుదరదు. అయితే రాజీపడి అలాంటి పాత్రలను చేయలేను. శారీరకంగా నేను ఒక క మేడియన్లా కనిపిస్తానేమో కానీ నా తాత్వికత వేరు. ‘నటన వేరు, వ్యక్తిగతం వేరు’ అనుకోలేకపోయాను. ‘ఏం విత్తామో, అదే కోస్తాం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఈ విషయంలో నాకు నా భార్య సౌందర్యప్రియ కూడా పూర్తిగా మద్దతుగా నిలబడింది. ఇటీవలే మాకు బాబు పుట్టాడు. మరి భవిష్యత్తులో వాడు ఇప్పుడు నేను చేసిన సినిమాలను చూసి ఇబ్బంది పడకూడదు. నాకు సినిమాలే అక్కర్లేదు, ఏదోఒక పనిచేసి బతకగలను, నావాళ్లను పోషించుకోగలను. నేను నమ్మే దైవత్వం కూడా అలాంటి పాత్రలకు సమ్మతించకుండా చేసింది. అందుకే వాటికి దూరంగా జరిగాను. మరి భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసుకొంటున్నా. అదొక పీరియాడికల్ మూవీ. వర్క్ అంతా దాదాపుగా పూర్తయ్యింది. అది కార్యరూపం దాల్చి నేను దర్శకుడిగా నిలదొక్కుకొంటే, అందరికీ గుర్తుండిపోతా. లేకపోతే ఇదే నా చివరి ఇంటర్వ్యూ అవుతుందేమో! చెన్నైలో ఉన్న మీకు తెలుగు సినిమా అవకాశాలు ఎలా లభించాయి? ఏడేళ్ల కిందట చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. సీరియళ్లకు పనిచేయడం మానేసి... సొంతంగా రియాలిటీ షో కాన్సెప్ట్‌ను డిజైన్ చేసుకొన్నాను. వాటికి మంచి క్రేజ్ ఉండటంతో నా కాన్సెప్ట్‌ను నిర్మాత బన్నీవాసుకు వినిపించాను. ఆయన ద్వారా మారుతిగారితో పరిచయం కలిగింది. అప్పటికి మారుతి ‘బస్‌స్టాప్’ తీస్తున్నారు. దానికి నేను కూడా అసోసియేట్‌గా జాయిన్ అయ్యాను. అయితే ఆ సినిమా ఆగిపోయింది. ఆ విరామంలో ‘ఈ రోజుల్లో’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడం మొదలుపెట్టారు. దానికి కూడా అసోసియేట్‌గా పనిచేసిన నేను మారుతి గారి సూచనమీదే నటుడిగా కూడా మారాను. ఆగిపోయిన బస్‌స్టాప్ మళ్లీ మొదలవ్వడంతో అందులో కూడా పాత్ర లభించింది. - బీదాల జీవన్‌రెడ్డి -
టెర్రీ వాల్ష్ సేవలు ఇక చాలు: హెచ్ ఐ
న్యూఢిల్లీ: టెర్రీ వాల్ష్ సేవలు ఇక అవసరం లేదని హాకీ ఇండియా(హెచ్ ఐ) స్పష్టం చేసింది. వాల్ష్ మనసు మార్చుకుని భారత హాకీ జట్టుకు మళ్లీ కోచ్ పనిచేసేందుకు సిద్ధపడినా తాము అంగీకరించబోమని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. ఈ మేరకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ జనరల్ జిజి థామ్సన్ కు ఆయన లేఖ రాశారు. టెర్రీ వాల్ష్ సేవలు అవసరం లేదని, సాయ్ అనుమతితో కొత్త కోచ్ ను నియమించుకుంటామని బాత్రా పేర్కొన్నారు. హాకీ ఇండియా ఒప్పుకుంటే భారత హాకీ జట్టు కోచ్‌గా మరో సారి టెర్రీ వాల్ష్‌ను నియమించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సాయ్ ప్రకటించిన నేపథ్యంలో బాత్రా ఈ లేఖ రాశారు. -
అవివాహిత బాక్సర్లకు గర్భనిర్ధారణ పరీక్షలు!
న్యూఢిల్లీ: భారత క్రీడారంగం సిగ్గు పడే, మహిళలు క్రీడలను ఎంచుకునేందుకు తటపటాయించే ఘటన బాక్సింగ్ లో చోటు చేసుకుంది. ప్రపంచ చాంఫియన్ షిప్ లో పాల్గొనబోతున్న ఎనిమిది మంది మహిళా బాక్సర్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. బాక్సింగ్ ఇండియా (బీఐ) సూచనల మేరకు ఇది జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా సాయ్ వైద్య సలహాదారు డాక్టర్ పీఎస్ఎం చంద్రన్ బయటపెట్టారు. వీరిలో పెళ్లికానివారు, జూనియర్ బాక్సర్లు కూడా ఉన్నారు. భారత్ కు ఆడాలనే ఆశతో ఉన్న మహిళా బాక్సర్లు తమ బాధను బయటికి వ్యక్త పర్చలేకపోయారని, ఆధికారుల ఆదేశాలను పాటిస్తూ పరీక్షకు హాజరయ్యారని చంద్రన్ చెప్పారు. అసలు ఏఐబీఏ నిబంధన ప్రకారం బాక్సర్లకు గర్భ నిర్ఱారణ పరీక్షలు జరపాలని ఎక్కడా లేదు. సాధారణ వైద్య పరీక్షల అనంతరం ఆ సర్టిఫికెట్ తో పాటు బాక్సర్లు సొంత పూచీపై నాన్ ప్రెగ్నెన్సీ సర్టిఫికెట్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. 18 ఏళ్ల లోపువారైతే తల్లితండ్రులు ఈ డిక్లరేషన్ సమర్పించాలి.