సెల్ఫీ తీసుకుంటూ అథ్లెట్ మృత్యువాత | National Level Athlete Puja was taking selfie with her friends | Sakshi
Sakshi News home page

సెల్ఫీ తీసుకుంటూ అథ్లెట్ మృత్యువాత

Published Sun, Jul 31 2016 9:50 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

సెల్ఫీ తీసుకుంటూ అథ్లెట్ మృత్యువాత

సెల్ఫీ తీసుకుంటూ అథ్లెట్ మృత్యువాత

భోపాల్: సెల్ఫీ తీసుకుంటూ జాతీయ స్థాయి అథ్లెట్ పూజా కుమారి(20) మృతి చెందింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సహచర మహిళా అథ్లెట్లతో కలిసి శాయ్ సమీపంలోని చెరువుకు వెళ్లిన పూజా కుమారి సెల్ఫీ తీసుకుంటూ అందులో పడిపోయింది. సహాయం కోసం కేకలు పెట్టింది. ఆమెకు ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయింది.

పూజా కుమారితో వెళ్లిన ఇద్దరికీ ఈత రాకపోవడంతో వారిద్దరూ హాస్టల్ కు పరుగెత్తుకెళ్లి కొందరిని వెంటబెట్టుకుని తిరిగి వచ్చారు. చెరువు నుంచి పూజా కుమారి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ కు చెందిన ఆమె మూడేళ్లులో శాయ్ హాస్టల్ లో ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement