selfie
-
మామయ్యా.. నీ లాలన కావాలి.. నీ పాలన రావాలి (ఫొటోలు)
-
ముగ్గూ-మురిపెం : ముగ్గుతో మీ సెల్ఫీ ఫోటో షేర్ చేయండి!
సంక్రాంతి పండుగకు నెలరోజుల ముందునుంచే సంబరాలు మొదలైపోతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పిండి వంటల ఘుమఘుమలు..అంతేనా తెలుగు ముంగిళ్లు రంగు రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలతో శోభాయమానంగా వెలిగిపోతాయి. గొల్లభామలు, నెమళ్లు, శంఖాలు, తామరలు, రథాలు, ఇలా ఒకటనేమిటి.. సప్తవర్ణ శోభితంలా ఎలాంటి ముగ్గులనైనా ఔరా అనిపించేలా తీర్చిదిద్దడంలో తెలుగింటి ఆడపడుచుల నైపుణ్యం ఇంతా అంతా కాదు. అలాంటి అందమైన ముగ్గులతో ఫోటోతీసుకుని మాకు(సాక్షి.కామ్) పంపించండి. సాక్షి. కామ్‌లో మీ ముగ్గూ, ఫోటోను చూసుకొని మురిసిపోండి మరి. ఇంకెందుకు ఆలస్యం..ముగ్గు వేయండి. అందమైన ముగ్గులతో ఫోటో తీసుకుని మాకు(సాక్షి.కామ్) పంపించండి. సాక్షి. కామ్‌లో మీ ముగ్గూ, ఫోటో చూసుకొని మురిసిపోండి! మరి ఇంకెందుకు ఆలస్యం ముగ్గు వేయండి.. క్లిక్ చేయండి..9182729310 నంబరుకు వాట్సాప్ చేయండి. -
సెల్ఫీ విత్ వైఎస్ జగన్ (ఫొటోలు)
-
జననేతతో మీ అనుభవం..
నాయకుడంటే.. అధికారం కోసం పాకులాడే వాడు కాదు. అధికారం పేరిట పెత్తనం చెలాయించడమూ కాదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గొప్పలు చెప్పుకోవడం అంతకంటే కాదు.. జనాల కోసం.. జనం నుంచి పుట్టేవాడు.. వారి బాగోగులను సొంతింటి మనిషిగా చూసుకునే వాడు. జనం గర్వంగా మనవాడని చెప్పుకోగలిగిన వాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఐదేళ్ల పాలనతో అందరి మనసులను చూరగొన్న ‘జగనన్న’! ఏపీ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం జగనన్న పాలన. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలన్నీ కొత్త పుంతలు తొక్కిన కాలమిది. రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సంక్షేమం విషయంలో ముందు చూపు ఉన్న నేత. అలాంటి నేతతో మీకూ అనుబంధం ఉందా?. 👉ఎప్పుడైనా జగన్‌తో కలిసి ఫొటోగానీ.. సెల్ఫీగానీ దిగారా? 👉ఆయన గురించి మీ అభిప్రాయం ఏమిటి? మాతో పంచుకోండి..మీరు చేయాల్సిందిల్లా... మీ వివరాలతో 9182729310 నెంబర్‌కు వాట్సాప్ చేయడమే. జగనన్న పుట్టినరోజు (డిసెంబర్ 21న) సందర్భంలో మీ ఫొటోలను, ఆ అనుభవాన్ని మేం ప్రచురిస్తాం.నోట్: సెల్ఫీ వీడియో నిమిషం వీడియో ఉండాలి. -
పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర వైఎస్ జగన్ సెల్ఫీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సెల్ఫీ తీసుకున్నారు. మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, కాలేజీని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన సెల్ఫీ తీసుకున్నారు.రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల కలలను చిదిమేసే విధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం పెనుశాపంగా మారింది. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడమేమిటి?. పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి’’ అంటూ సీఎం చంద్రబాబును గతంలో వైఎస్ జగన్ హెచ్చరించారు కూడా.కాగా, వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. -
ఏనుగుతో సెల్ఫీకి యత్నం..యువకుడి దుర్మరణం
నాగ్‌పూర్: సెల్ఫీ సరదా మరో నిండు ప్రాణం తీసింది. 23 ఏళ్ల ఓ యువకుడు ఏకంగా ఏనుగుతో అడవిలో సెల్ఫీ తీసుకునే సాహసం చేశాడు. ఇంకేముంది ఆ అడవి గజరాజుకు కోపం కట్టలు తెంచుకుది. శశికాంత్ రామచంద్ర అనే ఆ యువకుడిని తొండంతో కొట్టి కిందపడేసి కాళ్ల కింద తొక్కి నలిపేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం(అక్టోబర్ 24) జరిగింది. శశికాంత్ అతని స్నేహితులతో కలిసి అడవిలో కేబుల్ వేసే పని కోసం వెళ్లాడు. ఫారెస్ట్ సిబ్బంది ఎంత చెబుతున్నా వినకుండా ఏనుగులుండే ప్రదేశానికి వెళ్లి దానితో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు. శశికాంత్ స్వస్థలం మహారాష్ట్రలోని చంద్రపూర్.ఇదీ చదవండి: ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లా గన్నవరం మండలం మాదలవారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ మోజు కాలేజీ విద్యార్థుల ప్రాణం తీసింది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్ధులు వారంతం సెలవు కావడంతో స్నానం చేసేందుకు స్థానికంగా ఉన్న చెరువులోకి దిగారు. అనంతరం సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో జారి నీటిలో పడిపోయారు. ఈత వచ్చినా.. నీటి ఉద్ధృతికి ఈదలేక కొట్టుకుపోయారు. అయినప్పటికీ ఐదుగురు విద్యార్థులు సురక్షితంగా ఒడ్డుకు రాగా.. ఇద్దరు విద్యార్థులు పాలడుగు దుర్గారావు , జె.వెంకటేష్‌లు ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమారులు మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన జరిగినా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని లింగయాస్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ముచ్చట తీర్చే సెల్ఫీ ప్రింటర్
స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక జనాలకు ఎడాపెడా సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. సెల్ఫీలు ఎంతసేపూ ఫోన్లోనో, కంప్యూటర్లలోనో చూసుకోవడమే తప్ప పాతకాలంలోలా వాటిని ప్రింట్ చేయించి, ఆల్బమ్స్‌లో దాచుకునే అలవాటు దాదాపు అంతరించింది.అయితే, సెల్ఫీలను ప్రింట్ చేసుకుని, దాచుకోవాలనే ముచ్చట కూడా కొందరికి ఉంటుంది. ఆ ముచ్చట తీర్చడానికే జపానీస్ కెమెరాల తయారీ కంపెనీ ‘కేనన్’ తాజాగా సెల్ఫీ ప్రింటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘సెల్ఫీ క్యూఎక్స్20’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ప్రింటర్‌తో స్మార్ట్‌ఫోన్ నుంచి ఫొటోలను నేరుగా ముద్రించుకోవచ్చు.అలాగే, లాప్టాప్, డెస్క్‌టాప్‌లలో భద్రపరచుకున్న ఫొటోలను కూడా ముద్రించుకోవచ్చు. సెల్ఫీ లేఔట్ యాప్ ద్వారా ఈ ప్రింటర్ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రింట్ తీసుకోవడానికి ముందు ఫొటోలను ఎడిట్ చేసుకోవడానికి, ఎంపిక చేసుకున్న ఫొటోల కొలాజ్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భారత్ మార్కెట్లో దీని ధర రూ. 7,495 మాత్రమే! -
సెల్ఫీ రాజా.. మోగించు బాజా..
బి.కొత్తకోట: యువగళం పాదయాత్ర సందర్భంగా 2023 మార్చి 15న బి.కొత్తకోట మీదుగా పెద్దతిప్పసముద్రం మండలంలోకి వెళ్తూ..ఆలేరువాగు ఒడ్డున నిర్మించిన బి.కొత్తకోట షాదీమహాల్ వద్ద ఆగిన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు. దీనిని టీడీపీ ప్రభుత్వంలో రూ.50 లక్షలతో నిర్మించగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాళంతో పాటు బ్లూ, ఆకుపచ్చ రంగులు వేయించిందని ట్విట్టర్లో పోస్టు పెట్టి ఆరోపణలు చేశారు. తాళం వేసిన పాపం నూటికి నూరుపాళ్లు టీడీపీ ప్రభుత్వానిదే. దీనిని ఎప్పుడు, ఎవరి హయాంలో నిర్మించారో స్థానికులకు తెలియంది కాదు. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేసిన లోకేష్ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వారి హయాంలో నిర్మించి నిరుపయోగం చేసిన షాదీమహల్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు.సౌకర్యాలు విస్మరించి విమర్శలుషాదీమహల్లో వివాహాలు, ఇతరా శుభకార్యాలు జరుపుకునేందుకు అవసరమైన సౌకర్యాలను గత టీడీపీ ప్రభుత్వం కల్పించలేదు. ప్రధానంగా తాగునీటి వసతి లేదు. బోరువేయించాలని టీడీపీ ముస్లిం నాయకులు ప్రారంభోత్సవ సభలోనే విన్నవించినా పట్టించుకోలేదు. రూ.50లక్షలతో నిర్మించిన భవనానికి కనీసం విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయారు. భవనం నిర్మించి శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలు వేసి చేతులు దులుపుకున్నారు. 2018 అగస్టు 16న ప్రారంభించిన రోజు షాదీమహల్ తెరచుకుంది. అయితే మరుసటిరోజు నుంచే దీనికి తాళం వేశారు. అప్పుడు వేసిన తాళమే ఇప్పటికీ అలాగే ఉంది. షాదీమహల్ వ్యవహారంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఏనాడూ జోక్యం చేసుకోలేదు. వైఎస్సార్సీపీ నాయకుల జోక్యంకాని, ప్రమేయం కానీ లేదు. ముస్లింల కోసం షాదీమహల్ నిర్మించినా 2019లో టీడీపీ అధికారం కోల్పోయేదాకా పట్టించుకోలేదు. ఈ తప్పులన్నీ గత టీడీపీ ప్రభుత్వంలో జరిగి తాళం పడితే దానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లోకేష్ ఆరోపణలు చేశారు. పాదయాత్రలో షాదీమహల్ వద్ద సెల్ఫీ తీసుకుని తాళం వేశారని ఆరోపించిన లోకేష్ దీనిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ముస్లింలు కోరుతున్నారు. -
భార్యతో టీ తాగుతూ.. మనీష్ సిసోడియా భావోద్వేగ సెల్ఫీ
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి పదిహేడు నెలల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా ఇంటి జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం(ఆగస్టు10) ఉదయం ఇంట్లో తన భార్యతో కలిసి టీ తాగుతూ తీసుకున్న సెల్ఫీ చిత్రాన్ని ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. आज़ादी की सुबह की पहली चाय….. 17 महीने बाद!वह आज़ादी जो संविधान ने हम सब भारतीयों को जीने के अधिकार की गारंटी के रूप में दी है।वह आज़ादी जो ईश्वर ने हमें सबके साथ खुली हवा में साँस लेने के लिए दी है। pic.twitter.com/rPxmlI0SWF— Manish Sisodia (@msisodia) August 10, 2024ఈ సందర్భంగా ‘17 నెలల తర్వాత.. ఫస్ట్ మార్నింగ్ టీ ఆఫ్ ఫ్రీడమ్. భారతీయులందరికీ రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు నుంచి వచ్చిందే ఈ స్వేచ్ఛ’అని తన ట్వీట్‌కు సిసోడియా భావోద్వేగపూరిత కామెంట్స్ జత చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో లిక్కర్‌స్కామ్ కేసులో అరెస్టయిన సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన 17 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. -
చిన్ననాటి స్నేహితులు చెరో దారిలో నడిచారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వాళ్లిద్దరూ చెడ్డీ దోస్తులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహం వారిది. ఇద్దరూ కలిసి పదో తరగతి దాకా చదువుకున్నారు. టెన్త్ పూర్తయ్యాక చెరో దారిలో నడిచారు. అది కూడా వర్గ శత్రువులుగా భావించే నక్సలిజం వైపు ఒకరు వెళ్తే, కేంద్ర పారామిలటరీ బలగాల్లోకి మరొకరు వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత ఏడాది తేడాలో ఆ ఇద్దరూ అసువులు బాసారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామం పెద్ద వెంకట్‌రెడ్డి, భూమవ్వల కుమారుడైన సిద్దారెడ్డి, అదే గ్రామానికి చెందిన కంది నాగమణి, శంకరయ్య దంపతుల పెద్ద కొడుకు సిద్దరాములు ఇద్దరూ చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు. స్కూలుకైనా, వాగులో ఈతకైనా, ఆటల్లో అయినా ఇద్దరూ ఇద్దరే. అలాంటి స్నేహితులు నూనూగు మీసాల వయసులో చెరో దారిని ఎంచుకున్నారు. సిద్దారెడ్డి అలి యాస్ సిద్దన్న సమసమాజం కోసమంటూ అప్పటి పీపు ల్స్వార్ ఉద్యమంలో చేరిపోయాడు. తర్వాత కాలంలో ఆ ప్రాంత ఆర్గనైజర్‌గా చురుగ్గా పాల్గొన్న సిద్దారెడ్డి 1998లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. సిద్దారెడ్డి స్నేహితుడు సిద్దరాము లు దేశ రక్షణ తన విధిగా భావించి 1990లో సీఆర్పీఎఫ్ జవా నుగా సెలెక్టయ్యాడు. ఆయన 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు మందుపాతర పేల్చిన ఘటనలో తనువు చాలించాడు. సిద్దారెడ్డి స్తూపం పక్కనే సిద్దరాములు విగ్రహం...చిట్యాల గ్రామంలోకి అడుగుపెట్టగానే ప్రధాన కూడలి వద్ద రోడ్డు పక్కన స్తూపం, దాని పక్కనే విగ్రహం ఉంటాయి. గ్రామంలో సిద్దారెడ్డితో పాటు చనిపోయిన మరికొందరి పేర్లతో అమరవీరు ల స్తూపం నిర్మించారు. కాగా జవాన్ సిద్దరాములు తల్లి కంది నాగమణి తన కొడుకు విగ్రహం పెట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రయ త్నించి.. చివరకు ఏర్పాటు చేసి గతేడాది మార్చి 27న ఆవిష్కరింపజేసింది. ఇద్దరి విగ్రహాలు పక్కపక్కనే ఏర్పాటు చేయడం యా దృచ్ఛికంగా జరిగినా, దోస్తులూ పక్కపక్కనే ఉన్నట్టుంటుంది. -
ప్యారిస్ ఒలింపిక్స్: నీతా అంబానీ సెల్ఫీల సందడి, వైరల్ వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన ప్రతిష్టాత్మక ఇండియా హౌస్‌లో భారత ఒలింపిక్ షూటింగ్ బృందాన్ని సత్కరించారు. ప్రత్యేకంగా అభినందించారు. వారితో సెల్పీలకు ఫోజులిచ్చి సందడి చేశారు. భారతీయులందర్నీ గర్వంతో తల ఎత్తుకునేలా చేశారు! గో ఇండియా.. గో’ అంటూ వారిని ఉత్సాహ పరిచారు. మరిన్ని విజయాలు సాధించాలంటూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు విశ్వ క్రీడావేదికపై మనదేశాన్ని సగర్వంగా నిలిపిన కృషికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటికే రెండు పతకాలతో, మన షూటర్లు పారిస్‌లో త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరేసిన సంగతి తెలిసిందే. భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్, ఇండియా హౌస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్‌లోనూ మను కాంస్య పతకాన్నిసాధించి స్వాతంత్య్రం తర్వాత రెండు మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్‌గా చరిత్రకెక్కింది.Indian star shooter Sarabjot Singh gets heroic reception in India house 😍😍Manu Bhaker and Sarabjot Singh win Bronze 🥉 in the 10m air pistol mixed team event. #Sarabjot #Shooting #ManuBhaker #ParisOlympics2024 #Paris2024 #Paris2024Olympic #ParisOlympics pic.twitter.com/8oUs2x7PoK— India Olympics 2024 (@nnis_sports) July 30, 2024 -
మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం యత్నం.. ఇలా చేశారేంటి?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార్ ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ పారిస్ ఒలింపిక్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి పారిస్ చేరుకున్న చిరంజీవి అక్కడి వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.అయితే తాజాగా మెగాస్టార్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న చిరంజీవితో అక్కడే ఉన్న కొందరు సిబ్బంది సెల్పీలు దిగేందుకు యత్నించారు. అందులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. Padma Vibhushan Chiranjeevi at Airport pic.twitter.com/sTvtP2qW3R— Milagro Movies (@MilagroMovies) July 30, 2024 -
స్నేహితుడితో ఓ సెల్ఫీ
‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ ఈ ప్రపంచంలో ఎవ్వరైనా ఈ మాటల్ని వింటే పులకించి పోవాల్సిందే. అదీ స్నేహం గొప్పతనం. స్నేహానికి కులం, మతం, ప్రాంతం, భాష, లింగ భేదాలేవీ వుండవు. ఉన్నదంతా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడమే. దోస్త్ అంటే వీడేరా అనిపించేంత బంధం. మరి ‘దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీ జాన్.. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం’’ అనుకునేంత గొప్ప దోస్తులు మీ జీవితంలో ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం అలాంటి నిజమైన స్నేహితుడితో సంతోష క్షణాలను మళ్లీ గుర్తు చేసుకోండి. ఆగష్టు ఫస్ట్ సండే..(4వ తేదీ) స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ దోస్తుతో సెల్పీ దిగి సాక్షి. కామ్‌కు పంపించండి. ‘దోస్త్ మేరా దోస్త్’ సెల్పీ 9182729310 నెంబరుకు వాట్సాప్ చేయండి. ఆ ఫొటోలను సాక్షి డాట్ కామ్‌లో ప్రచురిస్తాం. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడమే కాదు.. ఈ జ్ఞాపకాన్ని కలకాలం పదిల పర్చుకోండి. ఫ్రెండ్షిప్ డే గురించి ఇవి మీకు తెలుసా?అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ ప్రతిపాదన 1958 జూలై 30న పరాగ్వేలో మొదలైంది. వరల్డ్ ఫ్రెండ్షిప్ డే ఆలోచనను తొలిసారి 1958, జూలై 20న పరాగ్వేలో స్నేహితులతో విందు సందర్భంగా డాక్టర్ ఆర్టెమియో బ్రాచో ప్రతిపాదించారు.ఐక్యరాజ్యసమితి 2011లో జూలై 30ని అధికారిక అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని వివిధ దేశాలలో వేర్వేరు రోజులలో జరుపుకుంటారు. భారతదేశంలో ఆగస్టు నెలలోని తొలి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. -
రాయల్ సెల్ఫీ: వందేళ్లక్రితమే భారత్‌లో సెల్ఫీ ఉందని తెలుసా..!
స్మార్ట్‌ఫోన్ యుగం వచ్చాక ఎక్కడికైన వెళ్లినా..ఏదైన వింత చోటు కనిపించినా.. వెంటనే ఫోన్‌కి పనిచెప్పేస్తారు. సెల్ఫీలు దిగేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడం చేస్తోంది నేటి యువత. ఒకప్పటిలా కెమెరామెన్తో ఫోటోలు తీయించుకునే పనే లేదు. నచ్చిన యాంగిల్స్‌లో మనకు మనమే ఫోటోలు తీసేసుకుంటున్నారు. అయితే ఈ సెల్ఫీలు మోజు నేటిది మాత్రం కాదు. వందేళ్ల ఏళ్ల క్రితమే దీనికి క్రేజ్ ఉంది. పైగా నాటి కాలంలోనే వాళ్లు సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు కూడా. ప్రపంచంలోనే తొలి సెల్ఫీని అక్టోబర్ 1839లో రాబర్ట్ కార్నెలియస్ తీశారు. ఆయన డాగ్యురోటైప్ టెక్నిక్‌ని ఉపయోగించారు. ఇది అయోడిన్-సెన్సిటైజ్డ్ సిల్వర్ ప్లేట్, పాదరసం ఆవిరిని ఉపయోగించే ప్రారంభ ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ. ఆయన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తన ఇంటి పెరట్లో తన కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగేందుకు దాదాపు మూడు నుంచి 15 నిమిషాల వ్యవధి తీసుకుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆ ఫోటో వెనుక సవివరంగా వివరించాడు కూడా. ఈ ఫోటోనే 1839లో తీసిన సెల్ఫీ లైట్ పిక్చర్‌గా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. అయితే మన ఇండియాలో తొలి సెల్ఫీ దిగింది రాజకుటుంబానికి చెందిన ఓ జంట. రాచరికపాలన సాగే త్రిపుర రాష్ట్రంలో సెల్ఫీ ఫోటోగ్రాఫ్ 1880లో దిగడం జరిగింది. మహారాజా బీర్ చంద్ర మాణిక్య అతని భార్య మహారాణి ఖుమాన్ చాను మన్మోహినీ దేవి ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. మహారాజు మంచి ఫోటోగ్రఫీ ఔత్సాహికుడు. అతను అనేక ఫోటోగ్రఫీ ప్రదర్శనలు కూడా నిర్వహించాడు. అంతేగాదు ఆయన చనిపోయేంత వరకు ఫోటోగ్రాఫిక్ సోసైటీలో సభ్యుడు కూడా.రాజు కారణంగా ఆ కళపై మహారాణి కూడా మక్కువ పెంచుకుంది. అలా ఆమె కూడా ఫోటోగ్రాఫర్‌గా మారడం జరిగింది. చెప్పాలంటే ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ కళలో ప్రావీణ్యం పొందిన తొలి భారతీయ మహిళ ఆమెనే కావడం విశేషం. కాగా, త్రిపుర మహారాజు తీసుకున్న సెల్ఫీలో మహారాణితో కౌగిలించుకుని దిగినట్లుగా ఫోటో కనిపిస్తుంది. అంతేగాదు ఈ ఫోటోనే భారతదేశంలోని తొలి సెల్ఫీగా నిలిచింది కూడా.(చదవండి: దీపికా పదుకొణె మెడలో సిక్కు మహారాజుల నాటి నెక్లెస్..!) -
G7 Summit 2024: మరో ‘మెలోడీ’ క్షణం
బరీ(ఇటలీ): జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆతీ్మయ భేటీని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. మూడు సెకన్ల సెల్ఫీ వీడియోను తీసి ‘ఎక్స్’లో షేర్చేశారు. మెలోనీ, మోదీ పేర్లను కలిపి మెలోడీ అనే కొత్త పదాన్ని సృష్టించి దానికి హ్యాష్‌ట్యాగ్‌ను తగిలించి గతంలోనే ఆమె విస్తృత ట్రెండింగ్ చేసిన విషయం తెల్సిందే. అదే పంథాలో మరోసారి కొత్త వీడియోను తీసి అందరితో పంచుకున్నారు. శుక్రవారం జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగిన ఇటలీలోని అపూలియాలో ఉన్న రిసార్ట్ ఇందుకు వేదికైంది. మోదీని మెలోనీ సాదరంగా ఆహా్వనించినపుడు నమస్కారంతో ఇరువురూ పలకరించుకున్న విషయం తెల్సిందే. తర్వాత ద్వైపాక్షి చర్చలు జరిపాక ఆయనతో కలిసి మెలానీ ‘హలో ఫ్రమ్ ది మెలోడీ టీమ్’ అంటూ ఒక సెల్ఫీ వీడియోను తీసుకున్నారు. ఈ వీడియోను శనివారం ఆమె ‘ఎక్స్’లో షేర్చేయడంతో అది తెగ వైరల్ అయింది.PM Narendra Modi and Italy's PM Giorgia Meloni's selfie on the sidelines of the G7 summit, in Italy. pic.twitter.com/wE1ihPHzeq— ANI (@ANI) June 15, 2024 Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024 ‘భారత్–ఇటలీ స్నేహబంధం శాశ్వతంగా కొనసాగాలి’ అని ఆ వీడియోను మోదీ మళ్లీ షేర్ చేశారు. గతేడాది డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్28’ సదస్సు సందర్భంగా మెలోనీ, మోదీ తీసుకున్న సెల్ఫీ ఆనాడూ తెగ వైరల్ అయిన విషయం విదితమే.1. #COP28 summit in Dubai.2. #G7 summit in Italy#Melodi #Selfie #G7Italie #G72024 pic.twitter.com/otVV1YGaMh— Rai Sahab 🇮🇳 (@raiparas) June 15, 2024 The Moment we all have been waiting for ☺️☺️😂 pic.twitter.com/5hdahECYMa— Amit Shah (Parody) (@Motabhai012) June 14, 2024 Had a very good meeting with PM @GiorgiaMeloni. Thanked her for inviting India to be a part of the G7 Summit and for the wonderful arrangements. We discussed ways to further cement India-Italy relations in areas like commerce, energy, defence, telecom and more. Our nations will… pic.twitter.com/PAe6sdNRO9— Narendra Modi (@narendramodi) June 14, 2024 -
Happy fathers day 2024 లవ్లీ డాడీతో సెల్పీ పంపండి, సాక్షితో సెలబ్రేట్ చేసుకోండి!
నాన్న త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ప్రత్యేకంగా ప్రతి యేడాది జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటాం. అంటే ఏడాది జూన్ ఆదివారం 16న ఫాదర్స్ డే. ప్రతీ ఫాదర్స్ డే రోజు లవ్లీ డాడీని అనేక బహుమతులతో సర్ప్రైజ్ చేస్తారు కదా. ఈ ఏడాది మాత్రం సాక్షి. డాట్కాంతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోండి. ఎలా అంటారా? సింపుల్.. నిస్వార్థంగా ఆకాశమంత ప్రేమను పంచే మీ డాడీతో ఒక సెల్ఫీ తీసుకోండి. సాక్షి డాట్.కామ్‌కు ఈ కింద ఫోటోలో ఉన్న నెంబరుకు వాట్సాప్ చేయండి...హ్యాపీ ఫాదర్స్ డే! -
రైలుతో సెల్ఫీకి యత్నం.. చూస్తుండగానే ప్రాణం పోయింది
ఫొటోలు దిగడం సరదాకే అయినా.. ఒక్కోసారి ఆ సరదానే ఏమరపాటులో ప్రాణాలు పోయేందుకు కారణం అవుతోంది. స్మార్ట్ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజుతో ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్లెందరినో చూస్తున్నాం. అలాంటి ఘటనలు చూశాక కూడా.. అత్యుత్సాహం ప్రదర్శించడం ఆపడం లేదు చాలామంది. తాజాగా.. మెక్సికోలో ఓ యువతి అంతా చూస్తుండగానే.. సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి బయల్దేరి ఎంప్రెస్ అనే రైలు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెక్సికో సిటీకి చేరుకుంటుంది. ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తున్నారు. దీనికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. పైగా అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తుంటారు. సోమవారం రైలు వెళ్తున్న టైంలో హిడాల్గో వద్ద ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్లోనే ఆమె మృతి చెందింది. ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్ ఫసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024 -
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
-
ఓటేయండి.. సెల్ఫీ పంపండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. తమ రాష్ట్రం కోసం, తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘాలు కోరుతున్నాయి. అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తుండగా.. మంచి స్పందన లభిస్తోంది. ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)ఉత్సాహంతో ఓటేశాం.. మీరూ కదలండి (ఫొటోలు) మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) మీ వివరాలతో వాట్సాప్ చేయడమే. ఆ ఫొటోలను సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు సందేశం ఇస్తే.. మీ బాధ్యతను చూపించి మరో నలుగురిని ఓటేసేలా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.గమనిక: పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ను అనుమతించరు. సిబ్బంది కళ్లు కప్పి తీసుకెళ్లి అక్కడ సెల్ఫీలు దిగడం నేరం. కేసు పెడతారు. -
ఓటేయండి.. సాక్షి సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొనండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఉపయోగించుకోవాల్సిన హక్కు ఓటు హక్కు అని, అందరూ ఓటేయాలని ఇప్పటికే ఈసీ ప్రచారం సైతం చేసింది.అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు నిరూపిస్తే.. మీ బాధ్యతను మరో నలుగురికి చూపించి ఓటింగ్ శాతం పెంచడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం. -
అభిమాని పట్ల షకీబ్ దురుస ప్రవర్తన.. వీడియో వైరల్
షకీబ్ అల్ హసన్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్ సమకాలీన క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగతున్న షకీబ్.. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు. ఈ బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటున్న షకీబ్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు షకీబ్ మైదానంలో ఉండగా.. గ్రౌండ్ స్టాప్ ఒకరు అతడి దగ్గరకు వచ్చి సెల్పీ అడిగాడు.దానికే చిరెత్తుకుపోయిన షకీబ్ అతడిని కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రౌండ్స్‌మన్ బాధపడుతూ పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షకీబ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి అంత పొగరు పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతుకుముందు చాలా సందర్భాల్లో అభిమానులపై షకీబ్ చేయిచేసుకున్నాడు కూడా. Shakib… when a groundsman tried tontake a selfie with him 🤨 pic.twitter.com/BWbDX4LAsK— Nibraz Ramzan (@nibraz88cricket) May 7, 2024 -
మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!
సెల్ఫీ వల్ల చాలామంది మనుషుల ప్రాణాలు బలైన సంఘటనలు అనేకం చూశాం. కానీ ఒక సెల్ఫీ వీడియో నిందితుడిని పట్టిచ్చిన వైనం వైరల్‌గా మారింది. ఓ రైలు ప్రయాణికుడి సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్ మిస్టరీ ఛేదించిన ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి: బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకలకు ఇంటికెళ్లి అనంతరం తిరిగి పూణే వెళ్లేందుకు ఈ నెల 24న సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. కానీ అనూహ్యంగా అతని మృతదేహం విఠల్వాడి రైల్వే స్టేషన్లో పట్టాలపై దర్శనమిచ్చింది. అయితే జారి పడి దుర్మరణం పాలై ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. అయితే ఇక్కడే అసలు కథ వెలుగులోకిచ్చింది. రైలు విఠల్వాడి స్టేషన్ వద్దకు వచ్చేసరికి ప్రభాస్ భాంగే బయట రైలు డోరు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన సెల్‌ఫోన్ దొంగ ఆకాశ్ జాదవ్ హఠాత్తుగా అతని ఫోన్ లాక్కున్నాడు. అతని మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి పట్టాలపై పోయాడు. అయితే ఈ మొత్తం ఉందంతం మరో రైలు ప్రయాణికుడు జాహిద్ జైదీ సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. జాహిద్ ఫోన్ కొట్టేసేందుకు కూడా ఆకాశ్ జాదవ్ ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. అది వీడియోలో రికార్డు అయింది.దీనిపై అతను ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిపై విచారించాల్సిందిగా పోలీసులను కోరాడు.ఇది వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితుడిగా ఆకాశ్ జాదవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు కూడా నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి ప్రభాస్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసు అధికారి పండరీనాథ్ కాండే వెల్లడించారు. -
గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’!
స్మార్ట్ యుగంలో సెల్ఫీలకున్న క్రేజ్అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సమయం, సందర్భం చూసుకోకుండా.. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తారు. దివంగత ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటన దీనికి తాజాగా ఉదాహరణ. అనారోగ్యంతో సోమవారం (ఫిబ్రవరి 26న) కన్నుమూసిన పంకజ్ ఉధాస్కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. తెల్లని దుస్తుల్లో అక్కడున్న వారంతా విషణ్ణ వదనాలతో ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి విద్యాబాలన్ అభిమాని ఒకరు సెల్పీ కోసం వెంటబడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్య ఫ్యాన్ ఒకరు ఆగకుండా విద్యతో కలిసి తన ఫోన్‌ని చేతిలో పెట్టుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. పదే పదే వారిస్తున్నా వినకుండా... వెంటబడ్డాడు. అయితే దీనికి ఏమీ స్పందించకుండా, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు విద్యా బాలన్. కొంతమంది విద్యా బాలన్ ప్రవర్తనను కొనియాడగా, మరికొందరు నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొంచెమైనా సిగ్గుండాలి’’ అంటూ ఫ్యాన్‌పై మండిపడ్డారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) కాగా గజల్ మేస్ట్రో అస్తమయంపై యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించు కునేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వచ్చారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్న నటి విద్యా బాలన్ కూడా పంకజ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. విద్యతో పాటు, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ మంగళవారం ఆయనకు అంతిమ నివాళులర్పించారు. -
చిరుతతో సెల్ఫీ కోసం ఎగబడ్డ జనం!
నారాయణపేట, సాక్షి: చిరుత పులితో సెల్ఫీ దిగేందుకు జనం ఎగబడ్డ ఘటన శనివారం నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. దామరగిద్ద మండలం కాంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో మూడు చిరుతలు తిరుగుతాయనే సమాచారంతో చుట్టుపక్కల జనం ఎగబడ్డారు. ఆ సమయంలో జనం రాకను చూసి పిల్ల చిరుతలు పరారయ్యాయి. అయితే అనారోగ్యంతో ఉన్న తల్లి చిరుత నిస్సహాయ స్థితిలో అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. దీంతో కొందరు యువకులు ఫొటోలు-వీడియోలు తీసేందుకు.. ఆ చిరుతతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈలోపు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని దానిని పరిశీలిస్తున్నారు. -
TS Assembly Elections 2023: ఓటుతో మా బాధ్యత పూర్తి చేశాం
-
తెలంగాణ ఎన్నికల పోలింగ్‌లో ఓటేశారు (ఫొటోలు)
-
ఓటేయండి.. సెల్ఫీ తీసుకోండి.. సాక్షికి పంపండి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటేసే వారికోసం సాక్షి. కామ్ సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫోటో గ్యాలరీలు గ్యాలరీ -4 గ్యాలరీ -3 గ్యాలరీ -2 గ్యాలరీ -1 -
Video: సెల్ఫీల వివాదం.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు
సెల్ఫీల పిచ్చి ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరికి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ట్రెండ్‌గా మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సెల్ఫీ మోజుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ ఫోటోల పిచ్చి కొన్నిసార్లు శ్రుతిమించుతోంది. తాజాగా సెల్ఫీ కారణంగా వివాదం తలెత్తింది. ఈ గొడవ కాస్తా అమ్మాయిలు జుట్లుపట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులోని గాంధీ పార్క్‌లో కొంతమంది ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెల్ఫీల కోసం యువతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ముందు తామే సెల్ఫీలు దిగాలని, తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని ఓ వర్గం అమ్మాయిలు చెప్పడంతో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రెండు గ్రూపులుగా విడిపోయి యువతులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. జుట్లుపట్టుకొని కొట్టుకున్నారు. అమ్మాయిలు ఫైటింగ్ చేసుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్యర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? Gandhi Park, Guntur. Ladies Fighting...we are so developed. 😂😂😂 pic.twitter.com/fgqfWOef4k — Saran Bhuma (@telugodikeka) November 27, 2023 -
యాపిల్ మెగా ఈవెంట్లో పీవీ సింధు: టీమ్ కుక్‌తో సెల్ఫీ పిక్స్ వైరల్
Apple Event Pv Sindhu Selfie with Tim Cook అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ మెగా ఈవెంట్‌కు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. యుఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోస్ట్ ఎవైటెడ్ iPhone 15 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హాజరైనట్టు ఇన్‌స్టాలో షేర్ చేసిన సింధు Apple CEO టిమ్ కుక్‌తో సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. (గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) ‘‘Apple Cupertinoలో సీఈవో టిమ్ కుక్‌ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం! ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్‌ని , , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. ఈ పోస్ట్‌లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు, Apple Cupertinoలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. కాగా USB-Cతో Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్‌కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
ఆదిత్య L1 సెల్ఫీ...ఒకే ఫ్రేమ్ లో భూమి-చంద్రుడు..
-
వాహ్ ఆదిత్య.. సెల్ఫీ అద్భుతం
బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) విన్యాసాలు షురూ చేశాడు. ఈ క్రమంలో ఏకంగా అద్భుతమైన ఫొటోలు తీసింది కూడా. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 దిశగా పయనిస్తోంది ఆదిత్య ఎల్1. అందుకు ఇంకా 4 నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తొలి 16 రోజులు భూకక్ష్యల్లోనే చక్కర్లు కొడుతుంది. అలా.. చక్కర్లు కొడుతూ.. ఆదిత్య ఎల్1 అద్భుతమైన ఫొటోలను తీసింది. ఎల్1 మిషన్ కనిపించేలా సెల్ఫీ తీసుకోవడంతో పాటు ఒకే ఫొటోలో భూమి, సుదూరాన ఉన్న చంద్రుడు ఫొటోల్ని కూడా బంధించింది. సెప్టెంబర్ 4న భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫొటో తీసినట్లు ఇస్రో తెలిపింది. ‘‘ ఆదిత్య-ఎల్1 మిషన్: చూస్తోంది!. సూర్యుడు-భూమి ఎల్1 పాయింట్ లక్ష్యంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్1 ఒక సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడి చిత్రాలు కూడా తీసింది’’ అంటూ ఇస్రో ఒక వీడియోను షేర్ చేసింది. Aditya-L1 Mission: 👀Onlooker! Aditya-L1, destined for the Sun-Earth L1 point, takes a selfie and images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy — ISRO (@isro) September 7, 2023 ఆదిత్య ఎల్1 మిషన్ శాటిలైట్ జీవితకాలం ఐదేళ్లు కాగా ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా.. సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయాలనుకుంటోంది ఇస్రో. -
సెల్ఫీ దిగేందుకు తాపత్రయం.. చంద్రబాబు తిప్పలు
-
కేదార్నాథ్ యాత్రలో అపశ్రుతి.. సెల్ఫీ తెచ్చిన ముప్పు..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ యాత్రకు వెళ్తున్న ఓ వ్యక్తి నదిలో జారిపడ్డాడు. ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నక్రమంలో సెల్ఫీ తీసుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కేధార్నాథ్ యాత్ర మార్గమధ్యలోని రాంబాడ సమీపంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో మందాకిని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది మీదుగా యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అంతలోనే కాలు జారి నదిలో పడిపోయాడు. కొంచం దూరం కొట్టుకుపోయిన తర్వాత బండరాళ్లను పట్టుకుని ఆగిపోయాడు. Video: Kedarnath Pilgrim Slips Into River While Taking Selfie, Saved Later https://t.co/nvqy95fj1p pic.twitter.com/FeK21URcOY — NDTV (@ndtv) September 5, 2023 పరిస్థితిని గమనించిన స్థానికులు రంగంలోకి దిగారు. తాళ్లతో ఒకరినొకరు పట్టుకుని బాధితున్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భయానక దృశ్యాలను చూసి నెటిజన్లు భారీగా స్పందించారు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 77వ స్వాతంత్య్ర వేడుకలు ఎర్రకోట వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే.. ఈసారి వినూత్నంగా వేడుకలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది దాదాపు 1800 మంది అతిథులు తమతమ జీవిత భాగస్వామితో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నారు. ఇందులో రైతులు, చేపలు పట్టేవారు, నర్సులు సహా వివిధ కులవృత్తులు చేసేవారు ఉండనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 75 జంటలు సాంప్రదాయ శైలిలో వేడుకల్లో కనువిందు చేయనున్నారు. ప్రత్యేక అతిథుల్లో 660 గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు, 250 మంది రైతు సంఘాల సభ్యులు, 50 చొప్పున ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన సభ్యులు, సెంట్రల్ విస్టాకు చెందిన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, స్కూల్ టీచర్లు, నర్సులు, చేపలు పట్టేవారు ఇందులో పాలు పంచుకోనున్నారు. ఈ ప్రత్యేక అతిథులు కొంత మంది జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్నారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఈ ప్రత్యేక అతిథులకు వసతి సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 75 జంటలు తమతమ సాంప్రదాయ శైలిలో వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ జెండాకు వందనం చేయనున్నారు. జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తారు. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. దేశంలో ఉన్న పథకాలపై 12 సెల్ఫీ లొకేషన్స్‌ను వేడుకల్లో ఏర్పాట్లు చేశారు. వాక్సిన్, యోగా, ఉజ్వల్ యోజన, స్పేస్ పవర్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా సహా తదితర స్కీలకు సంబంధించిన లొకేషన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 20 వరకు ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఆయా ప్రదేశాల్లో సెల్ఫీ దిగి మై గౌవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసిన 12 మందిని విజేతలుగా నిర్ణయిస్తారు. వారికి రూ.10,000 చొప్పున ప్రైజ్‌మనీని కూడా ఇస్తారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులకు ప్లాన్.. హై అలర్ట్ జారీ.. -
మళ్లీ సెల్ఫీ తీసుకునేందుకు కష్టపడ్డ బాబు !
-
గాలి తీసుకున్న చంద్రబాబు
-
ప్చ్.. సెల్ఫీ కోసం ముసలాయన కష్టాలు
సాక్షి, శ్రీసత్యసాయి: చంద్రబాబు నాయుడికి.. ఉన్నమాటంటే ఉలుకెక్కువ. వయసు మీద పడే కొద్దీ.. అధికార దాహం పెరిగిపోతోంది ఆయనలో. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కదనే అసహనమూ ఆయనలో కొట్టొచ్చినట్లూ కనిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే.. తాజాగా ఆయన చేసిన స్టంట్ నవ్వులు పూయిస్తోంది. పెనుగొండ పర్యటనలో కియా కార్ల పరిశ్రమ ఎదురుగా సెల్ఫీ దిగి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరాననుకున్నారాయన. దానికి యెల్లో మీడియా ఈనాడు తన కథనంలో ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు. ఉద్యోగులతో పాపం బలవంతంగా తన బావ పాటకు(జై బాలయ్య..) డాన్స్ చేయించిన ఉదంతాన్ని సైతం చంద్రబాబు తన ప్రసంగంలో ఉదహరించాడు. అయితే.. సెల్ఫీ కోసం చంద్రబాబు నాయుడు అవస్థలు పడ్డాడు. అది తీయటం రాక మూడు సెల్ ఫోన్లు మార్చారు. చివరకు పక్కనే ఉన్న సిబ్బంది సహకరించారు. ఇంకేం.. ఆ ముసలాయన తాను అనుకున్న పని చేసేశాడు. ఇదే కాదు.. తన మీటింగ్‌లకు జనాలు వచ్చారని చూపించుకునేందుకు ఆయన చేసే ప్రయత్నమూ(డ్రోన్ కెమెరా) కనిపించిందక్కడ. గతంలో ఇలాంటి అత్యుత్సాహమే కదా అమాయక ప్రాణాల్ని బలిగొంది. అయినా చంద్రబాబుకు సిగ్గుమాత్రం రావడం లేదు! అనే కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు. -
ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..
ఇటీవలకాలంలో సెల్ఫీ పిచ్చి మాములుగా లేదు. సెల్ఫీ మోజులోపడి వేగంగా వెళ్లే ట్రెయిన్ వద్ద, ప్రమాదకరమైన లోయలు, సముద్రంలోని అలలు వద్ద..సెల్ఫీలు తీసుకుని చనిపోయిన ఉదంతాలు చూశాం. అయినా సరే జనాలు తగ్గేదే లే! అంటున్నారు. ఏ మాత్రం భయం లేకుండా ప్రమాదరకరమైన ప్రదేశాల్లో సెల్ఫీ అంటూ ప్రాణాలను రిస్క్‌లో పడేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి బంధువులు లబోదిభోమని పెట్టే కేకలు అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అచ్చం అలాంటి భయానక అనుభవాన్ని చవిచూశాడు ఇక్కడొక వ్యక్తి. 30 ఏళ్ల గోపాల్ పుండ్లిక్ చవాన్ మహారాష్ట్రలోని అజంతా గుహాల సందర్శనకు వచ్చాడు. అక్కడ ఉన్న బౌద్ధ గుహ దేవాలయాలను చూస్తూ ఉండగా సమీపంలో ఉన్న నది అతడిని ఆకర్షించింది. ఇంకేముంది..ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెల్ఫీ కోసం ట్రై చేశాడు. అంతే ఒక్కసారిగా ఆ నదిలో పడిపోయాడు. సరిగ్గా సమీపంలోనే.. గర్జించే జలపాతం. మంచి ఫోర్స్‌గా వస్తున్న నీటి ప్రవాహం చూస్తే.. ఆ వ్యక్తి రాళ్లు గుంటలపై కొట్టుకుపోయేలా ఉంది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి నీటిలోకి పడగానే ఈత కొట్టే యత్నం చేయడంతో వెంటనే అదికారులు అప్రమత్తమై రక్షించే ప్రయత్నం చేశారు. సుమారు 10 మందికి పైగా వ్యక్తుల తాడు సాయంతో ఆ వ్యక్తి లోయ నుంచి బయటకు తీశారు. కాగా, అతను భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికి బట్టగట్టగలిగాడు కానీ లేదంటే చనిపోయేవాడని అధికారులు అంటున్నారు. అతను పడిన వెంటనే గాభరాపడకుండా ఈత కొట్టే యత్నం చేశాడు కాబట్టే మాకు అతడిని రక్షించగలిగే సమయం దొరికిందని చెప్పుకొచ్చారు. చాలా మంది అతిడిలా అదృష్టవంతులు కాకపోవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక 2020 అధ్యయనం ప్రకారం షార్క్ దాడులతో చనిపోయే వారికంటే ఇలా నీళ్ల వద్దకు సెల్ఫీ కోసం వచ్చి చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువని పేర్కొనడం గమనార్హం. (చదవండి: గూగుల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?) -
‘నిమ్మల’ నాటకాలు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒకవైపు పనులు జరగకుండా అడ్డుకోవడం.. మరోవైపు ఆగిపోయాయంటూ యాగీ చేయడం.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీరు ఇదీ.. సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటవుతుంటే స్వాగతించాల్సిందిపోయి అడ్డదారుల్లో అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకొల్లు మండలం దగ్గులూరులో 58.33 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్ల వ్యయంతో నూతన మెడికల్ కళాశాలకు సీఎం వైఎస్ జగన్ గతేడాది శంకుస్థాపన చేశారు. అనంతరం కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. తొలుత రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ల్యాండ్ ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. 27 మీటర్ల లోతులో ఆరు బోర్లు తవ్వారు. 1.7 మీటర్ల ఎత్తు వరకూ ఫ్లోర్ కాంక్రీట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పనులు దక్కించుకున్న మెగా సంస్థను యలమంచిలి మండలం వేల్పూరులంకలో ఇసుక తవ్వకానికి మైనింగ్ శాఖ అనుమతించింది. ఎమ్మెల్యే నిమ్మల ఈ పనులను అడ్డుకునేందుకు అనుచరులతో పర్యావరణానికి హాని కలుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. దీంతో ఐదు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని పనులను కొనసాగిస్తున్నారు. పాలకొల్లులో సోమవారం టీడీపీ బస్సు యాత్ర సందర్భంగా పార్టీ నాయకులతో పొలాల్లో సెల్ఫీ దిగిన నిమ్మల రామానాయుడు ఇదే మెడికల్ కాలేజీ.. అసలు పనులే జరగడం లేదని బురద చల్లేందుకు ప్రయతి్నంచారు. -
సెల్ఫీ కోసం విజయ్ ఫ్యాన్ ఎం చేసాడో చూడండి
-
అమెరికాలో అంబానీ, మహీంద్ర ఉబెర్ కష్టాలు: మిలియన్ డాలర్ల సెల్ఫీ వైరల్
భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులు ఉబెర్ కోసం ప్రయత్నించారంటే నమ్ముతారా? కానీ ఇటీవల అమెరికాలో అదే జరిగింది. ఈ సందర్భంగా బిలియనీర్ ముఖేష్ అంబానీ, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎపిక్ సెల్ఫీవైరల్గా మారింది. ఏమీ అర్థం కాలేదు కదా? అసలేం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్ రైనా నెట్‌వర్త్ తెలిస్తే షాకవుతారు) మహీంద్రా గ్రూప్ చైర్మన్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇద్దరూ వైట్‌హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్‌కి హాజరైన సంగతి తెలిసిందే. స్టేట్ డిన్నర్ తర్వాత, ఇండియా యుఎస్ మధ్య జరిగిన హైటెక్ హ్యాండ్‌షేక్ సమావేశానికి కూడా వీరు హాజరయ్యారు. వీరితోపాటు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ తదితర దిగ్గజాలు కూడా ఈ మీటింగ్‌నకు హాజరైనారు. అయితే అంబానీ ఆనంద్ మహీంద్రా యూఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ గినా రైమోండో 3rdiTech సహ వ్యవస్థాపకురాలు బృందా కపూర్‌తో మాటల్లో పడి , తర్వాతి లంచ్ అపాయింట్‌మెంట్‌కి వెళ్లాలన్న విషయాన్ని మర్చిపోవడంతో వీరిందరినీ అక్కడికి చేర్చాల్సిన గ్రూపు షటిల్‌ను మిస్ అయిపోయారు. చివరికి ఉబెర్ కోసంప్రయత్నిస్తుండగా హై-టెక్ హ్యాండ్‌షేక్ కాన్ఫరెన్స్‌కు హాజరైన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ని కలిశారు. (సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ఈ సందర్భాన్ని ట్విటర్లో అభిమానులతో పంచుకున్న ఆనంద్ మహీంద్ర బహుశా దీన్ని వాషింగ్టన్ మూమెంట్ అంటారేమో. ఇదే శక్తివంతమైన సెల్ఫీకి దారితీసింది అంటూ అంబానీ, సునీతా విలియమ్స్, బృందా కపూర్లతో ఉన్న సెల్ఫీని ట్వీట్ చేశారు. ఉబెర్కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఉబర్‌కు బదులుగా సునీతా స్పేస్ షటిల్లో వెళదామా అని సునీతాని అడిగామంటూ వెల్లడించారు. ఈ సెల్ఫీపై పలువురు నెటిజన్లు సంతోషంగా స్పందించారు. ఇది 10 లక్షలకు పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్‌తో వైరలైంది. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) చాలా అరుదుగా కలుసుకున్నప్పుడు సాధారణంగా ఏం మాట్లాడుకుంటారు నిజంగా తెలుసుకోవాలని ఉంది..వ్యాపారం, ప్రయాణం, ఈవెంట్ ఏదైనా.. ఎలాంటి జోకులు వేసుకుంటారంటూ జేకే జ్యుయలర్ల్ వినీత్ చమత్కరించారు. గొప్ప వక్తులు.. ఒకే ఫ్రేమ్‌లో.. ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటూ మరొకరు కామెంట్ చేయడం విశేషం. I suppose this was what they would call a ‘Washington moment.’ After the tech handshake meeting yesterday, Mukesh Ambani, Vrinda Kapoor & I were continuing a conversation with the Secretary of Commerce & missed the group shuttle bus to the next lunch engagement. We were trying… pic.twitter.com/gP1pZl9VcI — anand mahindra (@anandmahindra) June 25, 2023 -
నాచారంలో సెల్ఫీ సూసైడ్
సాక్షి, క్రైమ్ విభాగం: నాచారంలో దారుణం జరిగింది. ఓ వివాహిత ఫేస్బుక్ లైవ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యలే అందుకు కారణమని పోలీసులు భావిస్తుండగా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె భర్త, అతని కుటుంబం టార్చర్ భరించలేక తన కూతురు ప్రాణం తీసుకుందని ఆమె తండ్రి వాపోతున్నాడు. ఉద్యోగి అయిన సనా.. తండ్రి ఉంటున్న బిల్డింగ్‌లోనే మరో పోర్షన్లో ఉంటోంది. ఈ క్రమంలో సనాతల్లి ఎంతసేపు తలుపులు కొట్టినా తీయకపోవడంతో బద్ధలు కొట్టిచూశారు. సనా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. భర్త, మామల్ని ఫేస్బుక్లో లైవ్‌పెట్టి మరీ ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమె.. తండ్రి సాయంతో కొడుక్కి(3) స్కూల్లో తాజాగా అడ్మిషన్ ఇప్పించింది. అంతా సంతోషంగా ఉందనుకుంటున్న సమయంలో ఆమె ఇలా చేయడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. షాదీ నాటి ఫొటో మతం మార్చుకుని.. వివాహేతర సంబంధంతో.. వివాహేతర సంబంధం.. అల్లుడి కుటుంబం వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని సనా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2019లో రాజస్థాన్‌కు చెందిన రాజ్‌పుత్ యువకుడు హేమంత్‌తో ఆమె ప్రేమ వివాహం జరిగింది. మతం మారతానని ముందుకొచ్చిన అతను.. ఆమె తండ్రిని ఒప్పించి మరీ వివాహం చేసుకున్నాడు. అయితే.. అతని కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. అందుకే సనాను మానసికంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చింది. ఈలోపు అతని దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సూఫీ ఖాన్ వచ్చింది. సనా తండ్రి నటిగా పరిచయం చేసుకున్న సూఫీ ఖాన్‌తో సనా భర్తకు చనువు ఏర్పడింది. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. దీంతో సనాకు, ఆమె భర్తకు మధ్య గొడవలు జరిగాయి. సూఫీఖానాను ప్రేమలో పడి.. తన కూతురిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని.. టార్చర్ పెట్టాడని సనా తండ్రి నాచారం పీఎస్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. అప్పుడు ఇరుకుటుంబాలు మాట్లాడుకుని గొడవను సర్దుమణిగేలా చేశాయి. ఆపై ఆ భార్యాభర్తలు రాజస్థాన్ వెళ్లిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ కొడుకును చూసుకుంటున్నారు. ఈలోపు సూఫీఖాన్ విషయంలోనే మళ్లీ ఆ భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో కొడుకును తీసుకుని తిరిగి నాచారం వచ్చేసిందామె. అయితే కొడుకును చూసుకుంటూ.. సంతోషంగానే ఆమె ఉందని అంతా భావించారు. ఈలోపే ఇలా అఘాయిత్యానికి ఒడిగట్టింది సనా. సూఫీఖాన్కు, సనా భర్త మధ్య జరిగిన సంభాషణలు, వాట్సాప్ ఛాటింగ్, వాళ్లు దిగిన ఫొటోలు, వాళ్ల వివాహేతర సంబంధానికి సంబంధించిన అన్నీ సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని సనా తండ్రి అంటున్నాడు. తన కూతురికి న్యాయం చేయాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నాడాయన. భర్త వేధింపులు ఎక్కువ కావడంతోనే ఆమె.. వాళ్లను లైవ్‌లో పెట్టి మరీ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు. సూఫీఖాన్ బయటకు వస్తే.. మొత్తం అన్ని విషయాలు బయటపడతాయని అంటున్నారాయన. ఈ మేరకు సనా ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను చెట్టుకు కట్టేసి..ఆ తర్వాత
బిహార్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది. గాయాలపాలైన బాధితున్ని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ముజఫర్‌పూర్ జిల్లాలోని వసుదేవ్పుర్ సరాయ్ గ్రామంలో జరిగింది. సెల్ఫీ తీసుకునే నెపంతో.. సెల్ఫీ తీసుకునే నెపంతో భార్య తన భర్తను చెట్టుకు కట్టేసింది. అనంతరం అతనిపై కిరోసిన్ పోసి, నిప్పంటించింది. బాధితుడు అరుపులు పెట్టడంతో ఘటనా స్థలం నుంచి పారిపోయింది. చుట్టుపక్కలవారు చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఘటనకు గల సరైన కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పినందుకే భర్తపై భార్య ఈ ఘాతుకానికి పాల్పడిందని గ్రామస్థులు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి:భర్తను చంపి విలాసవంతమైన జైళ్ల కోసం గూగుల్‌లో వెతికిన భార్య -
సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందన్నది ఎవరికి తెలియదు. ఒక్కోసారి కేవలం చూపులతోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం చూస్తుంటాం. ప్రేమను వ్యక్తం చేసే దారులు వేరుగా ఉన్నప్పటికి అంతిమంగా గెలిస్తే వచ్చే సంతోషం వేరు. ఇక అభిమానితో దిగిన ఒక్క సెల్ఫీ స్పెయిన్ టెన్నిస్ స్టార్ గార్బిన్ ముగురుజా జీవితాన్ని మర్చేసింది. ఆ ఒక్క సెల్ఫీ తమ ప్రేమకథకు దారి తీస్తుందని ముగురుజా ఊహించి ఉండదు. కానీ అదే సెల్ఫీ ఇప్పుడు తాను ఇష్టపడ్డ అభిమానితో ఏడు అడుగులు వేసేలా చేసింది. గార్బిన్ ముగురుజా త్వరలోనే ఆర్థర్ బోర్జెస్ అనే అభిమానిని పెళ్లి చేసుకోబోతోంది. బుధవారం వాళ్లిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనంతరం బోర్జెస్‌తో ఉన్న ఫొటోలను ముగురుజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ముగురుజా షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. సెల్ఫీతో మొదలైన ప్రేమకథ.. ముగురుజా, ఆర్థర్ బోర్జెస్ల ప్రేమకథ ఒక సెల్ఫీతో మొదలైంది. 2021లో ముగురుజ యూసె ఓపెన్ ఆడేందుకు ఆమెరికా వెళ్లింది. అక్కడ న్యూయార్క్ వీధిలో బోర్జెస్‌ను మొదటిసారి చూసిందట. ''నేను బస చేసిన హోటల్ సెంట్రల్ పార్క్‌కు దగ్గర్లో ఉంది. ఒకరోజు బోర్ కొట్టడంతో కాసేపు నడుద్దామని బయటకు వెళ్లాను. అక్కడ బోర్జెస్‌ను మొదటిసారి చూశాను. నన్ను గమనించిన అతను ఒక సెల్పీ అడిగాడు. 'ఎంత అందంగా ఉన్నాడు' అని నా మనసులో అనుకున్నా. అక్కడి నుంచి మా ప్రేమకథ మొదలైంది'' అని ముగురుజా చెప్పుకొచ్చింది. ఆ రోజు నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. రెండేళ్ల తర్వాత బోర్జెస్ ముగురుజాకు ప్రపోజ్ చేశాడు. ఆ క్షణంలో ఆమె కంగారుపడింది. ఈ సంతోషంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వెంటనే బోర్జెస్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా బోర్జెస్ తన అభిమాన టెన్నిస్ స్టార్‌ను పెళ్లాడబోతున్నాడు. ముగురుజా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఆమె 2016లో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. 15 వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది. చదవండి: 'ఓవల్‌లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది' -
బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!
దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్ క్రష్‌గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!) ఇటీవలే సోషల్ మీడియాలో తాను గర్భం ధరించినట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావడంతో అవాక్కయ్యారు. తాజాగా మరోసారి తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది ముద్దుగుమ్మ. మిర్రర్ ముందు సెల్ఫీ దిగుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా 'ఇట్స్ ఆల్ ఏబౌట్ ఎంజెల్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అంటే పరోక్షంగా ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించి హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలియానాకు పుట్టబోయేది కూతురే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. గతంలో హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్షిప్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ కలిసి కత్రినా, విక్కీలతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. కానీ ప్రెగ్నెన్సీ బయటపెట్టినా ఇంతవరకు తన రిలేషన్ షిప్ స్టేటస్ మాత్రం ఇలియానా రివీల్ చేయకపోవడం గమనార్హం. (ఇది చదవండి: విషాదం.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత) -
ఇద్దరిని బలిగొన్న సెల్ఫీ సరదా
బాల్కొండ: నీటి అంచున సెల్ఫీ దిగాలన్న ఓ యువకుడి సరదా అతనితో పాటు మరొకరిని బలిగొన్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాణి పేట్‌కు చెందిన అబ్దుల్ ఫహీం (50) తన మరదలు కుమారుడు అబ్దుల్ బార్ (23), తన కుమారుడు అబ్దుల్ సాద్‌తో కలిసి బుధవారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. ప్రాజెక్ట్ దిగువన ఎస్కే ప్ గేట్ల వద్ద గోదావరిలోకి దిగారు. అక్కడ నీటి అంచున అబ్దుల్ బార్ సెల్ఫీ తీసుకోడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ఇది గమనించిన అబ్దుల్ ఫహీం.. అతన్ని రక్షించేందుకు నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయా రు. ఒడ్డుపై నుంచి వీరిని చూస్తున్న అబ్దుల్ సాద్ గట్టిగా కేకలు వేశాడు. స మీపంలో ఉన్న మత్స్యకారులు వచ్చేలోపు ఇద్ద రూ నీటిలో పూర్తిగా ము నిగి పోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా నీట మునిగిన చోటనే సాయంత్రానికి ఇద్దరి మృత దేహాలూ లభ్యమయ్యాయి. -
రాష్ట్రపతి హెలీకాప్టర్‌తో సెల్ఫీ
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 3 రోజుల రాష్ట్ర పర్యటన గందరగోళంగా మారింది. ఆమె చివరి రోజు పర్యటనలో పలు సమస్యాత్మక పరిస్థితులు తలెత్తాయి. దీంతో రాష్ట్రపతి పర్యటనలో భద్రత లోపించిందనే ఆరోపణలు బలపడుతున్నాయి. మయూర్భంజ్ జిల్లా బరిపద మహారాజా శ్రీరామచంద్ర భంజ్‌దేవ్ విశ్వ విద్యాలయంలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగిస్తుండగా.. 9నిమిషాల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ వివాదం చల్లారక ముందే మరో వివాదం తెరకెక్కింది. సోషల్ మీడియా ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము శుక్రవారం మయూర్భంజ్ జిల్లా సిమిలిపాల్ టైగర్ రిజర్వ్(ఎస్టీఆర్)ను సందర్శించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ విధుల్లో ఉన్న ఫార్మసిస్ట్ జస్వంత్ బెహరా అత్యంత భద్రత, కీలకమైన భారతదేశ ప్రథమ మహిళ ప్రయాణించనున్న హెలీకాప్టర్(ఛాపర్)తో సెల్ఫీలు దిగారు. జషిపూర్ సమీపం చెలిగోధులి హెలీప్యాడ్‌లో దిగిన తర్వాత రాష్ట్రపతి రోడ్డు మార్గంలో సిమిలిపాల్ జాతీయ పార్కును సందర్శించారు. ఆమె సందర్శన దృష్ట్యా ఈనెల 4, 5 తేదీల్లో సాధారణ సందర్శకుల పర్యటన నివారించారు. ఈ సందర్భంగా ప్రత్యేక విధులకు నియమితులైన సిబ్బంది రాష్ట్రపతి హెలీకాప్టర్‌తో సెల్ఫీ తీసుకోవడం సమస్యగా తయారైంది. ఈ వ్యవహారం రాష్ట్రపతి భద్రతపై ప్రశ్నలు తలెత్తడంతో జస్వంత్ బెహరా పోస్ట్‌ను తొలగించినట్లు సమాచారం. సిబ్బందిపై వేటు.. మరోవైపు యూనివర్సిటీలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన సమయంలో ముర్మును ఎందుకు సురక్షిత ప్రదేశానికి తరలించలేదని భద్రతా నిపుణులు ఇంతకుముందు ప్రశ్నించగా.. ఇది రాష్ట్రపతి కార్యక్రమాన్ని విధ్వంసం చేసే ప్రయత్నమని బీజేపీ కార్యాలయం ఆరోపించింది. రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఈ చిక్కు సమస్య చోటు చేసుకుంది. విద్యుత్ సరఫరా అంతరాయంతో దీపాలు ఆరిన వేదిక వద్ద ఉన్న మైక్ సిస్టమ్ ప్రభావితం కాకపోవడంతో ఆమె ప్రసంగం నిరవధికంగా కొనసాగించారు. ఉదయం 11.56 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు ఈ పరిస్థితి కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యూనివర్సిటీ అధికారులు ఎలక్ట్రీషియన్ జయంత్ త్రిపాఠిని విధుల నుంచి తొలగించారు. పర్యటన ఏర్పాట్ల లోపాలపై విచారణకు రిజిస్ట్రార్, పీజీ కౌన్సిల్ చైర్మన్, డెవలప్మెంట్ అధికారితో కూడిన ముగ్గురు సభ్యుల బృందం నియమించారు. ఈ బృందం విచారణ ఆధారంగా బాధ్యులను ఖరారు చేసి తగిన చర్యలు చేపడతారు. -
అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇటీవలే పఠాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణే కూడా నటించారు. గతేడాది విడుదలైన పఠాన్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్‌లో నటిస్తున్నారు. (ఇది చదవండి: నాలుగు రోజుల్లో 500కు పైగా సిగరెట్లు తాగాను: అల్లరి నరేశ్) తాజాగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాల కంటికి చిక్కారు షారూక్. దీంతో అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించారు. దీంతో షారూక్ సహనం కోల్పోయాడు. ఒక్కసారిగా అగ్రహం వ్యక్తం చేస్తూ అభిమాని చేతిని దూరంగా నెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు షారూక్ తీరుపై మండి పడుతున్నారు. ఓ నెటిజన్ రాస్తూ..' సెల్ఫీలు తీసుకోవాల్సింది ఇలాంటి వారితో కాదు. దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ, మనదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న వారితో దిగండి అంటూ సలహాలిచ్చారు. మరొక నెటిజన్ రాస్తూ..' మీ పర్మిషన్ లేకుండా మీతో సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం షారుక్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో పోషిస్తున్నారు. మరోవైపు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న డుంకీలో కూడా కనిపించనున్నారు. (ఇది చదవండి: రెండు నెలల క్రితమే నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది!) -
'బ్యాటింగే కాదు మాటలతోనూ మనసు దోచుకుంటాడు'
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు మంచి ఆరంభం లభించినప్పటికి మధ్యలో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడి టాప్ ప్లేస్‌ను సీఎస్కేకు కోల్పోయింది. తాజాగా గురువారం సొంత మైదానం జైపూర్‌లో సీఎస్కేను ఎదుర్కోనుంది. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న ధోని సేనను రాజస్తాన్ ఎలా నిలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక కెప్టెన్ సంజూ శాంసన్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటివరకు శాంసన్ ఏడు మ్యాచ్‌లాడి 181 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. అయితే గత ఐదు మ్యాచ్‌లు కలిపి కేవలం 85 పరుగులు మాత్రమే చేసిన సంజూ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మరి సీఎస్కేతో మ్యాచ్‌లో రాణిస్తాడేమో చూడాలి. ఇక సీఎస్కేతో మ్యాచ్‌ను పురస్కరించుకొని బుధవారం శాంసన్ నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లను చూడడానికి అభిమానులు స్టేడియానికి వచ్చారు. ప్రాక్టీస్ ముగించుకునే సమయంలో అభిమానులు శాంసన్‌ను ఒక్క సెల్ఫీ అని పిలిచారు. దీనికి అంగీకరించిన శాంసన్ వెంటనే అభిమానులతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అభిమాని ఫోన్లో స్వయంగా శాంసన్ సెల్ఫీ తీస్తుండగా.. ఫోన్ రింగైంది. దీంతో సంజూ కాల్ లిఫ్ట్ చేశాడు. దీంతో పక్కనున్న అభిమాని.. ''అరె సంజూ భయ్యా మాట్లాడుతున్నాడు.. హలో చెప్పు'' అని పేర్కొన్నాడు. దీనికి ఫోన్లో ఉన్న అవతల వ్యక్తి ''నిజమా .. హలో సంజూ భయ్యా'' అని అడిగాడు. దీంతో సంజూ..''అవును నేనే.. హలో బ్రదర్ ఎలా ఉన్నావు'' అంటూ చెప్పడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. ''సంజూ బ్యాటింగ్‌తోనే కాదు మాటలతోనూ అభిమానుల మనసు దోచుకుంటాడు'' అంటూ కామెంట్ చేశారు. Calls > Text because you never know, Sanju Samson might just pick up 😂😂 pic.twitter.com/fJwGMbvmt2 — Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2023 చదవండి: #RCB: గెలిస్తే ఓకే.. గెలవకపోతే నీ పరిస్థితి ఏంటో! -
తండ్రీకొడుకులకు సెల్ఫీల పిచ్చి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు జేజేలు పలుకుతుండటం చూసిన తర్వాత తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లకు సెల్ఫీల పిచ్చి పట్టుకుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. ఆమె బుధవారం విశాఖపట్నం జిల్లా డీఆర్సీ సమావేశానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి హోదాలో హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తండ్రీకొడుకులు సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే రైతుభరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సచివాలయ భవనాల వద్ద తీసుకోవాలని సూచించారు. వారి పిచ్చి టీడీపీ నేతలకు కూడా అంటించారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాలనపై లేనిపోని విమర్శలు చేసే టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పాలన అందిస్తున్న కారణంగానే ఏం చేయాలో పాలుపోక.. టీడీపీ నేతలు ఇలా తయారయ్యారని ఆమె విమర్శించారు. -
టిడ్కో ఇళ్లతో సెల్ఫీ ఆటలా? ఇదేం రాజకీయం.? ఇదేం దుర్మార్గం?
పట్టణ, నగరాల్లో పేదలకు పక్కా గృహాల నిర్మాణాల్లో గత టీడీపీ ప్రభుత్వం మాయాజాలం చేసింది. పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపడుతోందని చంద్రబాబు ఆర్భాటపు ప్రకటనలు . సాధారణ ఎన్నికలు వచ్చే వరకూ కాలక్షేపం చేసింది. ఆంధ్రప్రదేశ్ పట్టణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిడ్కో) ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నామని నటిస్తూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపించే సమయంలో హడావుడిగా తూతూ మంత్రంగా పనులు చేపట్టి గాలికొదిలేసి. కేంద్రం తన వాటాగా ఇచ్చిన నిధులతో మాత్రమే పనులు చేపట్టి చేతులు దులుపుకుంది. వాటిని చక్కటి మౌలిక వసతులతో పూర్తి చేసి పేదలకు అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూనుకుంది. టిడ్కో ఇళ్లపై వాస్తవం ఇదీ.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9,568 టిడ్కో గృహాలకు నిర్మించేందుకు రూ.482 కోట్లు ప్రాజెక్టు వ్యయం అవుతుందని టీడీపీ ప్రభుత్వ హయాంలో అంచనాలు రూపొందించింది. ఒంగోలు నగరంతోపాటు కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి, కనిగిరి మున్సిపాలిటీల్లో టిడ్కో ఇళ్లు నిర్మించాలని భావించింది. ఒంగోలు నగరంలో చింతల, కొప్పోలుల్లో కలిపి 4,128 గృహాలు నిర్మించాలని స్థలాల ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మార్కాపురంలోని పెద్దనాగులాపురం రోడ్డులో 912 మందికి, గిద్దలూరు మోడెంపల్లిలో 1248 మందికి, కనిగిరి చాకిరాలలో 912 మందికి, అద్దంకి శింగరకొండలో 960 మందికి, కందుకూరు ఉప్పుచెరువు వద్ద 1408 మందికి టిడ్కో గృహాలు నిర్మించి ఇవ్వాలని ఏర్పాట్లు చేశారు. 30 శాతం కూడా నిర్మాణం పూర్తి చేయని టీడీపీ ప్రభుత్వం: జిల్లాలోని టిడ్కో గృహాల నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం కనీసం 30 శాతం కూడా పూర్తి చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో పునాదులు లేపి వదిలేశారు. కొన్నింటిలో మాత్రం స్లాబులు మాత్రమే వేశారు. మొత్తం రూ.482 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అందులో కేవలం రూ.145.32 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. అదికూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చిన మొత్తాన్ని ఖర్చుచేసి తాము టిడ్కో గృహాలను దాదాపు పూర్తి చేశామని డప్పు కొట్టుకుంది. 6,112 గృహాలు ఉచితంగా ఇస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో 300 చదరపు గజాల టిడ్కో ఇంటిని ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్ల కోసం నగదు చెల్లించిన లబ్ధిదారులు దాదాపు 6,112 మంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను నిర్మించేందుకు పూనుకుంది. ఇందుకు సంబంధించి రూ.350 కోట్లు కేటాయించింది. రివర్స్ టెండర్ల ద్వారా పనులు చేపట్టింది. ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసింది. మొదటి విడతగా 2,640 గృహాలకు రివర్స్ టెండర్లో 11 శాతం లెస్‌కు టెండర్లు కోట్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.23.34 కోట్లు మిగిలింది. వీటి నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. మిగతా గృహాలకు ఫేజ్–2, ఫేజ్–3 కింద పనులు చేపట్టేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. రూ.12.72 కోట్లు పసుపు, కుంకుమకు: టిడ్కో గృహాల్లో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.12.72 కోట్లను చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల సమయంలో పసుపు–కుంకుమకు ఖర్చు చేశారు. ఆ నిధులను టిడ్కో గృహాల కోసం వెచ్చించాల్సి ఉంటే వాటిని కూడా పసుపు–కుంకుమకు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూశాడు. ఇళ్లపేరుతో నాడు పేద ప్రజలను మోసం చేసిన టీడీపీ నేతలు నేడు సెల్ఫీల పేరుతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను ప్రజలు ఈసడించుకుంటున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పట్టించుకోకుండా కాలక్షేపం చేసి నేడు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సెల్ఫీ చాలెంజ్ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. సిగ్గులేకుండా దామచర్ల సెల్ఫీనా.... "ఒంగోలు నగరంలో ఇళ్లు నిర్మిస్తామని 15,500 మంది వద్ద నుంచి టీడీపీ నేతలు డబ్బులు కట్టించుకున్నారు. కేవలం 4 వేల ఇళ్లు మాత్రమే ప్రారంభించారు. ప్రజల నుంచి కట్టించుకున్న డబ్బును ఏం చేశారో తెలియదు. కానీ టీడీపీకి చెందిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సోమవారం టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి సిగ్గులేకుండా సెల్ఫీ వీడియో దిగటం సరికాదు. అప్పట్లో ప్రజల వద్ద వసూలు చేసిన సొమ్మును ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి ప్రజలకు అందజేస్తోంది. తగుదనమ్మా అంటూ దామచర్ల సెల్ఫీ వీడియో దిగి ప్రజలకు ఏమని సంకేతాలు ఇద్దామనుకుంటున్నాడో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒంగోలు నగరంలోని చింతలలో రూ.98 కోట్లు ఖర్చుచేసి 1392 ఇళ్లు టీడీపీ హయాంలో పూర్తి చేశామని టీడీపీ వాళ్లు చెబుతున్నారు. అది పూర్తిగా అబద్ధం. ఆ ప్రాజెక్టు మొత్తం వ్యయ అంచనాలు రూపొందించిందే రూ.81.80 కోట్లు. అందులో రూ.45.18 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. ఇంకా 55.23 శాతం పనులు జరగాల్సి ఉంది. ఇకపోతే కొప్పోలు ప్రాజెక్టులో 4656 గృహాలకు నిర్మాణ పనులు చేపట్టి రూ.450 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అన్నీ అబద్దాలే చెబుతూ ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తున్నారు." – బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే -
సెల్ఫీ ప్లీజ్!.. ‘నందన్ సార్’ భారత్‌లో మీ సేవలు అమోఘం!
నందన్ నిలేకని పరిచయం అక్కర్లేని పేరు. ‘ఆధార్ కార్డ్’ పేరుతో ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఐడీ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చిన సృష్టికర్త, ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ..ఎన్ఆర్ నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించిన సహా వ్యవస్థాపకుడు..ఆ సంస్థ ఛైర్మన్ కూడా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖుల్లో ఒకరైన నందన్ నిలేకనితో సెల్ఫీ దిగాలని ప్రపంచ దేశాలకు చెందిన ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ గ్లోబుల్ క్లయింట్ బిజినెస్ హెడ్ మార్క్ వైడెమాన్ (Mark Wiedman) నందన్ నిలేకని గొప్పతనం గురించి లింక్డిన్ అకౌంట్లో షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో నిలేకనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. తన సంస్థ(బ్లాక్‌రాక్) ఉద్యోగులకు ఆయనంటే మహా ఇష్టం. నేను ఈ సంవత్సరం ముంబైలో నందన్ నీలేకనిని కలిసిన తర్వాత, దేశాభివృద్దిలో ఆయన సేవలు గురించి తెలుసుకునేందుకు నిర్మాణ సంస్థ హడ్సన్ యార్డ్స్ (Hudson Yards) కార్యాలయానికి ఆహ్వానించినట్లు వైడ్మాన్ తన పోస్ట్‌లో తెలిపారు. అంతేకాదు నిలేకని సహకారాన్ని ప్రస్తావిస్తూ.. వైడ్మాన్ ఒక ప్రశ్నతో ప్రారంభించారు. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గుర్తింపు కార్డు లేకుండా జీవిస్తున్నారని ఊహించగలరా’ అని ప్రశ్నించారు. నిలేకని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్' (UPI) సృస్టికర్త. అతను గత 14 సంవత్సరాలుగా వందల మిలియన్ల మందికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డ్‌లను అందించడంలో భారత్ రూపు రేఖల్ని మార్చేశారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. నందన్ సృష్టించిన కొత్త సాంకేతికత భారతీయులకు వారి రోజువారీ జీవితంలో ఎలా సహాయపడుతుందో కూడా పేర్కొన్నారు. . ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ జరగాలనేది ఆయన లక్ష్యం. ఇందుకోసం భారత్‌తో సహకరించేందుకు 50 దేశాలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇక కార్యక్రమం ముగిసిన అనంతరం తన సంస్థ ఉద్యోగులు నందన్‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారని వెల్లడించారు. చదవండి👉 ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త! ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా -
హెలికాప్టర్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండంగా..అంతలోనే..
ఓ అధికారి హెలికాప్టర్ వద్ద సెల్ఫీ తీసుకునే యత్నంలో టెయిల్ రోటర్ బ్లేడ్ పరిధిలోకి వచ్చాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ బయట సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వాధికారి మృత్యువాత పడ్డారు. బాధితుడిని జితేంద్ర కుమార్ సైనీగా గుర్తించారు అధికారులు. అతడు ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి ఫైనాన్షియల్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కేదార్నాథ్ ధామ్‌లోని హెలిప్యాడ్ వద్ద జరిగింది. సైనీ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నసమయంలో అనుకోకుండా హెలికాప్టర్ టెయిల్ రోటర్ బ్లేడ్ పరిధిలోకి వచ్చాడు. దీంతో సైనీ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అక్షయ తృతియ సందర్భంగా భక్తుల చార్ధామ్ యాత్ర కోసం అని గంగోత్రి, యమునోత్రి పోర్టల్‌లను ప్రారంభించిన ఒక రోజు తర్వాత ఈ అనూహ్య సంఘటన జరిగింది. కాగా తీర్థ యాత్ర కోసం ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు నమోదు చేసుకున్నారు. ఐతే కేదార్నాథ్ దేవాలయాన్ని ఏప్రిల్ 25న బద్రీనాథ్‌ను ఏప్రిల్ 27న తెరవనున్నారు. (చదవండి: చార్ధామ్ యాత్ర ప్రారంభం) -
అభివృద్ధి అంటే ఇది..చంద్రబాబుకు ఎమ్మెల్యే భూమన దిమ్మతిరిగే సెల్ఫీ ఛాలెంజ్
-
ఓటీటీలోకి అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’, ఎక్కడంటే..?
బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘సెల్ఫీ’. మలయాళ సూపర్ హిట్ ‘డ్రైవిండ్ లైసెన్స్’కు హిందీ రీమేక్ ఇది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. రాజ్ మెహతా డైరెక్షన్లోదాదాపు రూ. 110 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కితే.. పట్టుమని పాతిక కోట్లను కూడా వసూలు చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. నేటి(ఏప్రిల్ 22) నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. సెల్ఫీ కథ ఇదే.. విజయ్ (అక్షయ్‌కుమార్) ఒక స్టార్ హీరో. ఎస్సై ఓం ప్రకాశ్ అగర్వాల్ (ఇమ్రాన్ హష్మీ) అతనికి వీరాభిమాని. అతన్ని ఎలాగైన కలిసి ఒక సెల్ఫీ తీసుకోవాలనేది అతని కోరిక. అయితే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే క్రమంలో హీరో విజయ్.. ఎస్సై ఓం ప్రకాశ్ అగర్వాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో ఓం ప్రకాశ్ అగర్వాల్ఈగో దెబ్బతింటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే సెల్ఫీ కథ. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) -
బాబు సెల్ఫీకి మంత్రి రోజా అదిరిపోయే కౌంటర్
-
సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు
ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం జిల్లా): టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.7 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ బ్రిడ్జిని నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సెల్ఫీ తీసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లు తోక ముడిచారు. వీరి సెల్ఫీకి బొడ్డబడ గ్రామస్తులంతా ప్రతిస్పందించారు. ఈ వంతెన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైందంటూ గురువారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ప్రజల్లో అభాసుపాలయ్యామంట గురువారం ‘సెల్ఫీ’ పోస్టులు తొలగించారు. చదవండి: టీడీపీ నేతల ‘సెల్ఫీ’గోల్ -
సెల్ఫీ.. ఓ సెల్ఫ్ గోల్!.. బాబు బాటలో టీడీపీ తమ్ముళ్లు
ఇచ్ఛాపురం రూరల్: ఎవరో చేసిన పనులను తాము చేసినట్టుగా చెప్పుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు టీడీపీ శ్రేణులు కూడా ఈ విషయంలో అధినేతను అనుసరిస్తున్నారు. టీడీపీయేతర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులను తాము చేసినట్టుగా చెప్పుకొంటూ సెల్ఫీ చాలెంజ్‌లు చేస్తూ జనంలో నవ్వులపాలవుతున్నారు. ‘2018లో అప్ప టి సీఎం చంద్రబాబు హయాంలో బొడ్డబడలో రూ.7 కోట్లతో రోడ్ కమ్ బ్రిడ్జి నిర్మాణం చేశాం. ఈ క్రమంలో చాలెంజ్ చేస్తున్నా.. వైఎస్సార్సీపీ నుంచి ఎవరైనా సవాల్‌ను స్వీకరించాలి’ అంటూ మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ వంతెన దిగువన ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ విసిరిన సెల్ఫీతో సవాల్ ఎల్లో మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో రావడంతో బొడ్డబడ గ్రామస్తు లు అవాక్కయ్యారు. సొమ్మొకడిది.. సోకొకడిది.. అన్న చందంగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుల తీరుపై వా రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి వంతెన నిర్మించాలంటూ టీడీపీ హయాంలో వందలాది వినతి పత్రాలిచ్చినా బుట్టదాఖలు చేశారని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి చొరవతో 2014లో రూ.7 కోట్ల కేంద్ర నిధులతో వంతెన పనులకు ప్రారంభోత్సవం చేసి.. నిర్మాణాన్ని మొదలు పెట్టారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరి్మంచిన ఆ వంతెనను 2018 మే 18న టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన అనంతరం ఎన్నో ఏళ్ల తమ కల నెరవేర్చినందుకు గ్రామస్తులు డాక్టర్ కిల్లి కృపారాణికి సన్మానం కూడా చేశారు. ఎవరో నిరి్మంచిన బ్రిడ్జికి ప్రారంబోత్సవం చేసి.. ఇది తామే కట్టామంటూ టీడీపీ నేతలు సెల్ఫీ చాలెంజ్‌లు విసరడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. అవునులే ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా! చంద్రబాబుదీ ఇదే తంతు కదా!. -
చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ కు సీఎం జగన్ దిమ్మతిరిగే కౌంటర్
-
రాజకీయ నేతలతో సెల్ఫీలు.. ఉద్యోగికి కలెక్టర్ షాకింగ్ ట్విస్ట్
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఎన్నికల విధుల్లో ఉండగా వీఐపీల వద్ద సెల్ఫీ తీసుకున్న ఉద్యోగిపై సస్పెన్షన్ వేటుపడింది. వివరాలు.. నెలమంగల తాలూకా సోలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రిల్ మాస్టర్ అయిన అంజన్‌కుమార్‌ను సోలూరు వద్ద చెక్ పోస్టులో తనిఖీ బృందం మేనేజర్‌గా నియమించారు. మధ్యాహ్నం 2గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ డ్యూటీ. ఈ సమయంలో అటుగా వచ్చిన ప్రముఖ రాజకీయ నేతలతో ఆయన సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో బెంగళూరు గ్రామీణ జిల్లా కలెక్టర్ ఆర్.లత అతన్ని సస్పెండ్ చేశారు. చదవండి: బ్యూటీషియన్‌కు షాక్.. లక్ష కడితే నెలకు రూ.40 వేల వడ్డీ.. చివరికి.. -
ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!
ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు చెన్నై పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం పర్యటన ముగిసే సమయానికి తిరు ఎస్ మణికందన్ అనే దివ్యాంగుడిని కలిశారు. అతనితో సమావేశమై ప్రత్యేక సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను 'ప్రత్యేక సెల్ఫీ' పేరుతో మోదీ ట్విట్టర్లో షేర్ చేస్తూ అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అతను సొంతంగా దుకాణాన్ని నడపడమే గాక తన రోజువారి లాభాలలో గణనీయమైన భాగాన్ని బీజేపీకి ఇస్తాడని చెప్పారు. "ఆయన నేను ప్రారంభించిన రోడ్‌కు బూత్ ప్రెసిడెంట్‌గా, కార్యకర్తగా పనిచేయడం మాకెంతో గర్వకారణం. అలాంటి వ్యక్తి ఉన్న పార్టీలో నేను కార్యకర్తను అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అతని జీవితం స్ఫూర్తిదాయకం, అలాగే మా పార్టీ సిద్ధాంతాల పట్ల అతను కనబర్చిన నిబద్ధత కూడా ఆదర్శవంతంగా ఉంది . అతని భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు" అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మోదీ చెన్నైలో రూ. 5వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇది ప్రభుత్వ పని సంస్కృతి, దార్శినికతల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు మోదీ. తమ ప్రభుత్వ డెడ్‌లైన్ కంటే ముందే ఫలితాలను సాధిస్తుందన్నారు. తమ ప్రభుత్వం విజయాలను అందుకోవడంలో పని సంస్కృతి, విజన్ అనే రెండు అంశాలు కీలక పాత్ర పోషించాయన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అంటే ఆలస్యం కానీ ఇప్పుడూ ఆ అర్థం డెలిరీ(తగిన సమయానికి అందించడం). తాము పన్ను చెల్లించే చెల్లింపుదారుల ప్రతి రూపాయికి తాము జవాబుదారిగా పనిచేస్తున్నాం. తాము నిర్థిష్ట గడువులతో పని చేస్తాం, వాటికంటే ముందే ఫలితాలను సాధిస్తాం అని మోదీ ఒక బహిరంగ సభలో అన్నారు. (చదవండి: సేవ చేయండి.. పేరొస్తుందని చూడకండి) -
కట్టని ఇళ్ల వద్ద సెల్ఫీలు దిగటం సిగ్గుచేటు: జోగి రమేశ్
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబు, లోకేశ్ సెల్ఫీ బాబులు, కామెడీ రాజాలుగా తయారయ్యారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. పేదలకు వారు నిర్మించిన ఇళ్లంటూ నెల్లూరులో టిడ్కో ఇళ్ల వద్ద బాబు సెల్ఫీ దిగడంపై మంత్రి ఒక ప్రకటనలో స్పందించారు. టీడీపీ హయాంలో నెల్లూరులో టిడ్కో ఇళ్లు, ఇప్పుడున్న ఇళ్ల నాడు–నేడు ఫోటోలను విడుదల చేశారు. నెల్లూరులో టిడ్కో ఇళ్లన్నీ ఆయనే కట్టేశానని చెప్పుకోవడానికి సిగ్గులేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబే టిడ్కో ఇళ్లన్నీ కట్టేస్తే మరి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టినవేమిటని అన్నారు. టిడ్కో ఇళ్ల రూపంలో పేద, మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పారు. టిడ్కో ఇళ్ల పేరిట పేదవారి ఆశలను ఆసరాగా చేసుకుని అవినీతికి పాల్పడ్డారని అన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి ఆ రోజుల్లో రూ.1,000–1,100 మధ్య ఖర్చయితే అంతకు రెండు మూడు రెట్లు అధికంగా టెండర్లు ఖరారు చేసి దోచేశారన్నారు. అది కూడా ఒక్క చోటా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, అస్తవ్యస్తంగా వదిలేశారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాకే టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, అన్ని మౌలిక వసతులతో ప్రజలకు అందిస్తోందని తెలిపారు. నెల్లూరులోనూ బాబు కట్టని ఇళ్ల వద్ద సెల్ఫీలు తీసుకొని తానే కట్టానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక టి డ్కో ఇళ్ల కోసం రూ. 8,734 కోట్లు ఖర్చు చేసిందన్నా రు. అందులో రూ. 5,840 కోట్లు, నిర్మాణ పనులకు, టీడీపీ అస్తవ్యస్తంగా వదిలేసిన ఇళ్లకు మౌలిక సదుపాయాల కోసం రూ.725 కోట్లు ఖర్చు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వదిలిన రూ.3 వేల కోట్లు బకాయిలు కూడా తమ ప్రభుత్వమే తీర్చిందని తెలి పారు. బాబు హయాంలో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లకు ఒక్కో లబ్ధిదారుడిపై రూ. 7.2 లక్షలు భారం వేయగా, వైఎస్ జగన్ ఆ భారాన్ని తొలగించి, ఇళ్లను ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. ఇలా పేదలపై రూ. 3,805.4 కోట్ల మేర భారాన్ని తప్పించారన్నారు. 365 చ.అ, 430 చ.అ ఇళ్ల లబ్ధిదారుల కు ముందస్తు చెల్లింపుల్లో 50 శాతం సబ్సిడీని సీఎం జగన్ కల్పించారన్నారు. ఈ రూపేణా రూ.482.31 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందన్నారు. ఒక్క రూపాయికే ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయిస్తూ రూ.1,200 కోట్ల రిజిస్ట్రేషన్ భారాన్ని కూడా తొలగించామన్నా రు. చంద్రబాబు ప్రభుత్వం టీడ్కో ఇళ్ల అంచనాలు పెంచేసి, దోచేస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్ చేపట్టి రూ.392 కోట్లు ప్రజా ధనం ఆదా చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్తంగా వదిలేసిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి ఇప్పటికే 50వేల ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. మిగి లిన ఇళ్లను కూడా త్వరలోనే లబ్ధిదారులు అందిస్తామని చెప్పారు. చంద్రబాబు తమతో వస్తే ఇళ్లు ఎక్కడ కడుతున్నారో చూపిస్తామన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఊళ్లను చూస్తే చంద్రబాబు గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదన్నారు. టీడీపీం సెల్ఫీల పార్టీ అని ఆరోపించారు. చంద్రబాబు వాలకం చూస్తుంటే చార్మినార్, తాజ్‌మహల్ కూడా ఆయనే కట్టేశానని ఓ సెల్ఫీతీసుకునేట్టు ఉన్నారన్నారు. తండ్రీ కొడుకుల కామెడీని రాష్ట్ర ప్రజలు చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. -
సీఎం వైఎస్ జగన్ తో మహిళా నాయకులు సెల్ఫీ
-
ఫోటో అని చెప్పి.. ఏకంగా వీడియోనే తీశాడు: ప్రముఖ హీరోయిన్
సాధారణంగా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ఫోటోల కోసం క్యూ కడతారు. సెల్‌ఫోన్ తీసి టపీమని సెల్ఫీలు తీయడం చూస్తుంటాం. పోనీలే ఫ్యాన్స్ కదా వారు కూడా ఓపిగ్గా నిలబడి ఫోటోలు దిగుతారు. ఒకరోజు తన స్వగ్రామానికి వెళ్లిన ఓ నటి అభిమాని అడ్డగ్గానే సెల్ఫీ దిగేందుకు ఒప్పుకుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ మన హీరో ఆమెకు తెలియకుండా ఏకంగా వీడియోనే తీశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో హీరోయిన్ ఆ వీడియోపై స్పందించింది. అనిరుద్ధ రాయ్ చౌదరి చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకుంటున్న నటి యామీ గౌతమ్. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని తన ఇంట్లో జరిగిన ఒక సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఒక అభిమాని తనను ఫోటో కోసం అభ్యర్థించాడని.. కానీ అతను వీడియో చిత్రీకరించడం గుర్తుచేసుకుంది. ఆ తర్వాత వీడియో ఆన్లైన్లో షేర్ చేశాడని నటి వెల్లడించింది. యామీ గౌతమ్ ఇటీవల అలియా భట్ గోప్యతా ఉల్లంఘన సంఘటనపై కూడా స్పందించింది. అయితే ఇటీవల ఆలియా భట్ ఇంట్లో ఉండగా కొందరు ఆమె ఫోటోలను తీశారు. దీనిపై ఆమె తన ఇన్‌స్టా వేదికగా ప్రశ్నించింది. యామీ గౌతమ్ మాట్లాడుతూ..'నేను చాలా ఓపెన్‌గా ఉంటా. వ్యక్తులను స్వాగతించడం ఇష్టం. యామీ తెలిపింది. మా ఊరు ఒక చిన్న పట్టణం కావడంతో ప్రజలు నాతో మాట్లాడాలని కోరుకుంటారు. నాకు కూడా అది చాలా హ్యాపీ. కానీ ఓ అబ్బాయి నాతో ఫోటో దిగేందుకు వచ్చాడు. కానీ అతను వీడియో తీశాడు. ఇది చాలా దారుణంగా ఉంది. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన లక్షలు వ్యూస్ సాధించాడు. ఆ సక్సెస్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వీడియో చూసి చాలామంది మా ఇంటికి వచ్చారు. దీంతో నేను ఒక్కసారిగా షాకయ్యా. ఇలాంటి వాటితో యువతకు మనం తప్పుడు సంకేతాలు ఇస్తున్నాం. దీంతో వారిని వెంటనే వారించాను. వ్యక్తిగత జీవితంలో ప్రైవసీ చాలా ముఖ్యం.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. యామీ గౌతమ్ ప్రస్తుతం సన్నీ కౌశల్‌తో కలిసి 'చోర్ నికల్ కే భాగా'లో కనిపించనుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఆమె తదుపరి అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠితో ఓ మై గాడ్ 2, ప్రతీక్ గాంధీతో ధూమ్ ధామ్‌లో కూడా నటిస్తున్నారు. -
వాళ్లను నిందించొద్దు.. వందశాతం తప్పు నాదే: అక్షయ్ కుమార్
ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ సునాయసంగా వందల కోట్లు సంపాదిస్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన ఈ ఖిలాడి హీరో.. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాడు. గతేడాది ఈ హీరో నటించిన అత్రంగిరే ,కట్‌పత్లీ, బచ్చన్ పాండే,సామ్రాట్ పృథ్వీరాజ్,రక్ష బందన్,రామ్ సేతు చిత్రాలలో ఒకటి కూడా హిట్ టాక్‌కి సంపాదించుకోలేదు. కనీస వసూళ్లు కూడా రాకపోవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. ఇక తాజాగా విడుదలైన ‘సెల్ఫీ’చిత్రం కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన సినిమా పరాజయాలపై అక్షయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘సెల్ఫీ’సినిమా ప్రమోషన్స్ భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఫ్లాప్‌లపై అక్షయ్ మాట్లాడాడు. ‘సినిమాల విషయంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాను. ఒకనొక సమయంలో నేను నటించిన 16 సినిమాలు నిరాశపరిచాయి. మరోసారి 8 సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. సినిమా హిట్ అవ్వడం లేదంటే అది కచ్చితంగా నా తప్పే. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనం ఆశిస్తున్నారు. ప్రస్తుతం నేను దాని కోసమే ప్రయత్నిస్తున్నాను. సినిమా హిట్ అవ్వకపోతే ప్రేక్షకులను నిందించవద్దు. అది వంద శాతం నా తప్పే’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. -
సెల్ఫీతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అక్షయ్ కుమార్
బాలీవుడ్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్ గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. సెల్ఫీతో ఆయన తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కాడు. అభిమానులతో ఏకదాటిగా సెల్పీలు దిగి అక్షయ్ ఈ రికార్డును నెలకొల్పాడు. కేవలం మూడు నిమిషాల్లోనే 184 సెల్ఫీలు దిగి హాలీవుడ్ నటుడు జేమ్స్ స్మిత్ రికార్ట్‌ను బ్రేక్ చేశాడు. ఇటీవల ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో గిన్నిస్ బుక్ అధికారుల అధ్వర్యంలో అక్షయ్‌తో సెల్పీ పోటీని నిర్వహించారు. దీనికి దాదాపు 240 మంది అభిమానులు హాజరు కాగా అక్షయ్ వారితో ఒక్కొరిగా ఫొటో దిగాడు. చదవండి: మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్! మూడు నిమిషాల్లో ఆయన 209 సెల్ఫీలు దిగగా అందులో కొన్ని డిస్ క్వాలిఫై అయ్యాయి. బ్లర్‌గా వచ్చిన ఫొటోలను తీసివేయగా చివరకు 184 సెల్ఫీలతో ఆయన ఈ రికార్డ్‌ను సృష్టించాడు. ఈ మేరకు అధికారులు అక్షయ్‌కి ఈ రికార్డుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని అందించారు. అనంతరం అక్షయ్ అనందం వ్యక్తం చేస్తూ ఈ రికార్డు అభిమానులకు అంక్షితం ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇంత వరకు వచ్చింది అభిమానుల వల్లే. వారందరికి నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని నా అభిమానలకే అంకితం ఇస్తున్నా’ అని తెలిపాడు. చదవండి: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. దాదాపు 200 థియేటర్లో రి-రిలీజ్‌కు రెడీ కాగా ఇప్పటి వరకు 168 సెల్ఫీతో హాలీవుడ్ నటుడు జేమ్స్ స్మిత్‌కు ఈ రికార్డ్ ఉండగా దీనిని తాజాగా అక్షయ్ బ్రేక్ చేయడం విశేషం. 2015లో సాన్ అండ్రీయాస్ ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 105 సెల్ఫీలతో తొలి రికార్డు క్రియేట్ చేశాడు. కాగా వెండితెరపై తనదైన నటన, వైవిధ్యమైన పాత్రలతో అభిమానులను అలరిస్తుంటాడు అక్షయ్. ఆయన తాజా చిత్రం సెల్ఫీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు శుక్రవారం(ఫిబ్రవరి 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
సెల్ఫీ తీసుకుంటుండగా కోబ్రా కాటేసింది
కందుకూరు: నాగుపాముతో సెల్ఫీకి ప్రయత్నించిన ఓ యువకుడు ఆ పాము కాటేయడంతో ప్రాణాలొదిలాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన పోలంరెడ్డి సాయిమణికంఠరెడ్డి (22) కందుకూరులోని జేఏ కాంప్లెక్స్‌లో షాపును అద్దెకు తీసుకుని జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పాములు పట్టి ఆడించే వెంకటస్వామి అనే వ్యక్తి ఆ షాపు వద్దకు వచ్చాడు. ఆ పామును చూసి సంబరపడిన మణికంఠరెడ్డి పాముతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో పామును మణికంఠరెడ్డి మెడలో వేసుకోగా.. ఆ పాము జారి కిందపడిపోయింది. దీంతో మణికంఠరెడ్డి పాము తోక పట్టుకునే ప్రయత్నంలో అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి కాటేసింది. వెంటనే స్నేహితులు మణికంఠను ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మణికంఠ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కోరలు లేవని చెప్పడం వల్లే.. పామును ఆడించే వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో మణికంఠరెడ్డి ఫొటోల కోసం అడిగిన వెంటనే పామును ఇచ్చేశాడు. దానికి కోరలు తీసేశానని, అందువల్ల కాటేయదని చెప్పాడు. దీంతో మణికంఠరెడ్డి భయం లేకుండా పామును మెడలో వేసుకుని సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది కాటేసిన తరువాత కూడా కోరలు తీసేశానని, కాటేసినా విషం ఎక్కదని దానిని ఆడించే వ్యక్తి చెప్పాడు. అయినా స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాటేసిన పాము అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా జాతికి చెందినది కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని కందుకూరు సీఐ వెంకట్రావ్, ఎస్సై కిశోర్ పరిశీలించారు. పామును తీసుకొచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
న్యూయర్ వేడుకల్లో.. సెల్ఫీల కోసం..
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో కొత్త సంవత్సరం వేడుక రసాభాసగా మారింది. అంతా చక్కగా న్యూ ఇయర్ వేడుకులు ఆనందంగా జరుపుకుంటుండగా కొందరు వ్యక్తుల కారణంగా ఘర్షణకు దారితీసింది. ఈ మేరకు నోయిడాలోని గౌర్ సిటీ ఫస్ట్ అవెన్యూ సోసైటీలో న్యూ ఇయర్ వేడుకల్లో కొందరూ వ్యక్తులు ఇద్దరు మహిళలతో బలవంతంగా సెల్ఫీలు దిగేందుకు యత్నించారు. దీన్ని ఆ మహిళల భర్తలు వ్యతిరేకించడంతో వారికీ, ఆయా వ్యక్తులకు మధ్య వాగ్వాదం తలెత్తింది.నిందితులు ఆ మహిళల భర్తలను కొట్టడంతో అక్కడే ఉండే నివాసితులు, సెక్యూరిటీ గార్డు ఈ ఘటనపై జోక్యం చేసుకున్నారు. ఐతే నిందితులు వారిపై కూడా దౌర్జన్యానికి దిగి దాడి చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మిగతా నిందితులు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఆ అపార్ట్మెంట్ సోసైటీకి చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, తన స్నేహితుడి భార్యతో బలవంతంగా సెల్ఫీలు దిగేందుకు కొందరూ వ్యక్తులు యత్నించినట్లు పోలీసులకు తెలిపాడు.దీనికి వారు అభ్యంతర చెప్పడంతో తనపై, అతడి స్నేహితుడిపై దాడి చేశారని, అలాగే వారిని కాపాడేందుకు జోక్యం చేసుకున్న నివాసితులు, సెక్యూరిటీ గార్డుపై కూడా దారుణంగా దాడి చేసినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అందుకు సంబంధించన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Big Fight At Noida New Year Party After Women "Forced" For Selfies https://t.co/gDlae7A0mD pic.twitter.com/G5oxm5CGIL— Breaking News (@feeds24x7) January 1, 2023(చదవండి: న్యూ ఇయర్ రోజున విషాదం.. టూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా..) -
వ్యక్తిని హత్య చేసి..తెగిపడిన తలతో సెల్ఫీలు
ఇటీవల కాలంలో మనుషులు చాల ఘోరంగా తయారవుతున్నారు. ఏదో వివాదం తలెత్తితే చాలు హత్యలు దాక వెళ్లిపోతున్నారు. పైగా ఏదో ఘనకార్యం చేసినట్లుగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. వినేందుకే జుగుప్పకరంగా ఉంటున్నాయి ఆ ఘటనలు. అచ్చం అలాంటి ఘటనే జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో 20 ఏళ్ల గిరిజన యువకుడు 24 ఏళ్ల తన బంధువుని అతి కిరాతకంగా తల నరికి చంపాడు. ఈ ఘటన ముర్హు ప్రాంతంలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల తండ్రి తన కొడుకు కను ముండా డిసెంబర్ 1న ఇంట్లో ఒక్కడే ఉన్నాడనొ, మిగతావాళ్లంతో పొలాలకు వెళ్లారని చెప్పారు. తాము ఇంటికి తిరిగి వచ్చి చూడగా కను కనిపించలేదు. దీంతో మృతుడి తండ్రి కొడుకు కోసం గాలించి విఫలమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదులో తన మేనల్లుడు సాగర్ ముండా, అతని స్నేహితులే తన కొడుకుని అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలించడం ప్రారంభించారు. విచారణలో... నిందితులు కనుని దారుణంగా నరికి చంపి, తెగిపడిన తలతో నిందితుడు, అతని స్నేహితులు సెల్ఫీలు దిగారని చెప్పారు. మృతుడి మొండం గోప్లా అడవిలోనూ తల 15 కిలో మీటర్ల దూరంలో దుల్వా తుంగ్రీ ప్రాంతంలో కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐతే ఓ భూమి విషయమై మృతుడి కుటుంబానికి, నిందితుల కుటుంబాలకి మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమని చెప్పారు. పోలీసులు మృతుడితో సహా నిందితుల దగ్గర ఉన్న ఐదు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, ఎస్యూవీ కారుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితుల తోపాటు ప్రధాన నిందితుడి భార్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: భర్త క్రూరత్వం! భార్య అనారోగ్యంతో ఉందని...) -
FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?'
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్-హెచ్లో సోమవారం ఘనా, దక్షిణ కొరియాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఘనా జట్టు 3-2 తేడాతో సౌత్ కొరియాపై ఉత్కంఠ విజయాన్ని సాధించింది. మహ్మద్ కుదుస్ రెండు గోల్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించి ఘనా ఆశలను నిలపగా.. మరోపక్క సౌత్ కొరియా మాత్రం ఓటమితో వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించినట్లే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓడిపోయామన్న బాధలో ఉన్న సౌత్ కొరియా కెప్టెన్ సన్ హ్యుంగ్ మిన్ ఏడుస్తూ తెగ ఫీలయ్యాడు. ఇలాంటి సమయంలో ఓదార్చాల్సింది పోయి అతని వద్దకు వచ్చిన ఘనా స్టాఫ్ సిబ్బంది తమ చేష్టలతో విసిగించారు. ఒకపక్క ఓటమి బాధలో సన్ హ్యుంగ్ ఏడుస్తుంటే.. ఘనా సిబ్బంలోని ఒక వ్యక్తి మాత్రం అతనితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి స్టాఫ్ మెంబర్ వద్దని వారించినా వినకుండా సెల్ఫీ దిగాడు. ఇదంతా గమనించిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఘనా స్టాఫ్ సిబ్బందిని ట్రోల్ చేశారు. ''పాపం మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో అతను ఏడుస్తుంటే సెల్ఫీ ఎలా తీసుకుంటారు''.. ''సిగ్గుండాలి.. బాధలో ఉన్న ఆటగాడిని ఓదార్చాల్సింది పోయి ఇలా సెల్ఫీలు దిగడమేంటి.. చాలా అసహ్యంగా ఉంది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక గ్రూప్ హెచ్ నుంచి పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించగా.. ఇక ఘనా తన చివరి మ్యాచ్ ఉరుగ్వేతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రి క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కు చేరిన పోర్చుగల్ మాత్రం సౌత్ కొరియాతో డిసెంబర్ 3న ఆడనుంది. Ghana's coaches taking a selfie with a tearful Son Heung-min following their nation's victory over South Korea 😅😳#Qatar2022 pic.twitter.com/6ZX2O46Ogu — FourFourTwo (@FourFourTwo) November 28, 2022 చదవండి: Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్ నాది' -
హీరోయిన్ శ్రుతి హాసన్‌కు ఏమైంది? ఆమె ముఖం ఇలా మారిపోయిందేంటి?
స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్‌కు ఏమైంది? ఆమె ముఖం ఏంటి ఇలా అయిపోయింది? అంటూ ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. రీసెంట్గా శృతి షేర్ చేసిన ఫోటోలే ఈ అనుమానాలకు కారణం. సాధారణంగా హీరోయిన్స్ డీగ్లామర్‌గా కనిపించేందుకు వెనకాడుతుంటారు. మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేసేందుకు కూడా ఇష్టపడరు. అయితే శ్రుతిహాసన్ మాత్రం ఇవేం పట్టించుకోదు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫీవర్, సైనస్‌తో ఆమె బాధపడుతుందట. బ్యాడ్ డే, బ్యాడ్హెయిర్తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు, ఇష్టపడతారని భావిస్తున్నాను అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రుతిహాసన్ ముఖం బాగా ఉబ్బిపోయి బాగా డల్‌గా కనిపిస్తుంది. దీంతో అసలు శ్రుతిహాసన్‌కు ఏమైంది? ఇలా తయారయ్యిందేంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇలా షేర్ చేయడానికి చాలా గట్స్ ఉండాలంటూ మరికొందరు శ్రుతిని ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
టేకాఫ్ అయిన కొద్ది క్షణంలోనే కుప్పకూలిన విమానం ఆ తర్వాత...
మరణం అంచులదాక వెళ్లి అనూహ్యంగా బయటపెడితే ఎవరికైనా ఏడుపూ ఆనందం ఒకేసారి తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఔను! జీవితం మనకు మరో అవకాశం ఇచ్చిందనుకుంటాం. మళ్లీ సమర్ధవంతంగా జీవితాన్ని ఎలా పునర్నిర్మించాలో ఆలోచించుకుంటాం కదా. అచ్చం అలానే ఇక్కడొక జంట చచ్చపోతాం అనుకునేంత భయానక ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే....పెరూ రాజధాని లిమాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో రన్‌వేపై కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో సిబ్బంది తోపాటు, దాదాపు 120 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఐతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక జంట వెంటనే సెల్ఫీ తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదం తర్వాత కాసేపు భయాందోళనలకు లోనవ్వడం సహజం. కానీ జీవితం మరో అవకాశం ఇచ్చిందన్న ఆనందంతో తాము ఇలా సెల్ఫీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఆనందంగా చెబుతున్నారు ఆ దంపతులు. ఈ సెల్ఫీ ఫోటోను ఏ 320 సిస్టమ్స అనే ఫేస్బుక్లో 'సెల్ఫీ ఆఫ్ ద ఇయర్' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: లాటరీ తగలడమే శాపమైంది...లవర్‌తో భార్య జంప్) -
వాట్ ఏ సెల్ఫీ! ఎంతా బాగా ఫోజ్ పెట్టిందో...
ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. చాలా వీడియోల్లో మనకు నచ్చిన రకరకాల జంతువుల సెల్ఫీ వీడియోలు చూసుంటాం. క్రూరమైన మృగాలతో కూడా డేర్‌గా చేసిన వైరల్ వీడియోలు కూడా చూసి ఉంటాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒక ఆవుతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ఏంటి ప్రత్యేకత అనే కదా.! ఏంలేదండి...జంతువులతో కలిసి తీసే సెల్ఫీ వీడియోలు చాలా వరకు మనం చెప్పినట్లు అవి వినవు. అది ఆహారం తింటున్నప్పుడో లేక ప్రశాంతంగా కూర్చొన్నప్పుడో జస్ట్ అలా క్లిక్‌మనిపించి చకచక వీడియో తీస్తాం. ఔనా! కానీ ఈ వ్యక్తి మాత్రాం ఆ ఆవును సెల్ఫీ తీస్తున్న ఫోజు పెట్టమంటే వెంటనే సెట్‌రైట్ అయిపోయి ఫోజు పెట్టింది. చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Vivek vyas 🇮🇳 (@vivek_127) (చదవండి: బలవంతంగా జుట్టు పట్టుకుని ఈడ్చేసిన నర్సు.. వీడియో దుమారం) -
వరంగల్‌లో మరో సెల్ఫీ సూసైడ్ కలకలం
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో సెల్ఫీ సూసైడ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్తో అప్పులపాలై యువకుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరిచిపోక ముందే మరో వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అపార్ట్మెంట్ యజమాని కులం పేరుతో దూషించి, దాడి చేశాడని వాచ్మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా గత వారం రోజుల్లో సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడడం ఇది రెండో ఘటన. ఆత్మహత్యకు పాల్పడ్డ అపార్ట్మెంట్ వాచ్మెన్ వడ్లకొండ శ్రీనివాస్, ఓనర్ వేధింపులు కులం పేరుతో దూషించడమే కారణమని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అయిదు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్, ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. తన ఆత్మహత్యకు అపార్ట్మెంట్ ఓనర్ యాదగిరి ఆయన భార్య హిందుమతి, పనిలో పెట్టించిన రాజయ్య ఆయన భార్య కారణమని ఆరోపించాడు. సెల్ఫీ వీడియో ద్వారా వారు పెట్టిన ఇబ్బందులను చూపించారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్మాగా మారడంతో అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. శ్రీనివాస్ కొద్దిరోజులు అపార్ట్మెంట్లో ఉండి వాచ్‌మెన్‌గా పనిచేసి బయటికి వచ్చినప్పటికీ యాదగిరి హిందుమతి దంపతులు మళ్లీ శ్రీనివాసునే పిలిపించుకుని వాచ్‌మెన్‌గా పెట్టుకున్నారని బంధువులు తెలిపారు. గౌడ కులస్థుడైన శ్రీనివాస్ కులాంతర వివాహం ఎస్సీ మహిళను చేసుకోవడంతో కులం పేరుతో దూషించి కొట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు. అంటరాని వారిగా చూస్తూ అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. అపార్ట్మెంట్ యజమాని ప్రస్తుతం పరారీలో ఉండగా.. గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరువు ఆత్మహత్యగా భావిస్తు కుల సంఘాలు అక్కడి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశాయి. ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. . -
పులితో పరాచకాలు వద్దు! దాడి చేస్తే ఖతమే!
పులికి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. అచ్చం అలానే ఒక వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది యువకులు పులితో సెల్ఫీ తీసుకునేందుకు దాని వెంట పడతారు. వాస్తవానికి అది పట్టించు కోకుండా రోడ్డు దాటుకుని వెళ్లిపోతుంది కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ల పని ఔట్. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో చోటు చేసుకుంది. ఐతే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్లో షేర్ చేస్తూ...పులి మిమ్మల్ని వెంబడించాలనుకోలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దయచేసి ప్రమాదకరమైన క్రూర మృగాలతో సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించకండి. ఇలాంటి అత్యుత్సాహన్ని మానుకోండి అని యువతను హెచ్చరించారు. Remember that if you see a large carnivore, it wanted you to see it. It never wanted to be chased. The tiger can maul you to death feeling threatened. Please don’t resort to this wired behaviour. pic.twitter.com/e0ikR90aTB — Susanta Nanda (@susantananda3) October 6, 2022 (చదవండి: 80 ఏళ్ల అష్టదిగ్గజాలు స్కైడైవింగ్తో... గిన్నిస్ రికార్డు) -
అందానికి అందం తోడైతే.. త్రిష-ఐష్ సెల్ఫీ వైరల్
తమిళ సినిమా: అందానికి అందం తోడైతే కనువిందే కదా. మాజీ మిస్ ఇండియా, మాజీ మిస్ చెన్నై కలిస్తే.. అందానికి ప్రతిరపమైన వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగితే.. ఆ దృశ్యం అభిమానులకు కనుల పండుగే అవుతుంది. ఇలాంటి పుత్తడి బొమ్మలు ఐశ్వర్యరాయ్, త్రిష కలిసి ఒకే చిత్రంలో నటించడం కచ్చితంగా విశేషమే అవుతుంది. అలాంటి చిత్రమే పొన్నియిన్ సెల్వన్. వీరితో పాటు విక్రమ్, జయం రవి, కార్తీ, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి పలువురు ప్రముఖ తారలు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి మణిరత్నం సృష్టికర్త, ఏఆర్ రెహమాన్ సంగీతం, రవివర్మ అదనపు బలం. రెండు భాగాలుగా రూపొందిన ఈ పాన్ ఇండియాత్రం తొలి భాగం ఈ నెల 30వ తేదీ తెరపైకి రానుంది. ఇందులో ఐశ్వర్య నందిని పాత్రలోనూ, త్రిష కుందవై పాత్రలోను నటించారు. వీరివి చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రలట. మరి త్రిష విక్రమ్‌కు చెల్లెలిగానూ, జయం రవికి అక్కగాను నటించగా, ఐశ్వర్యరాయ్ ప్రతినాయకిగా నటించడం విశేషం. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని దర్శకుడు మణిరత్నం తెలిపారు. కాగా చిత్రంలో శత్రువులుగా నటించినా నిజజీవితంలో ఐశ్వర్యరాయ్, తాను మంచి స్నేహితులమయ్యామని త్రిష పేర్కొన్నారు. అంతేకాకుండా వాళ్లిద్దరూ తీసుకున్న సెల్ఫీని తన ఇంస్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ లైక్‌ల మీద లైక్‌లు కొట్టిస్తున్నాయి. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్య
సనత్‌నగర్: తమ్ముడి భార్య కుటుంబసభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బబ్బుగూడకు చెందిన శీలం వీరస్వామి, పుష్ప దంపతులకు ముగ్గురు కుమారులు. వీరస్వామి రెండో కుమారుడు హరినాథ్‌కు 2020లో తాండూరుకు చెందిన భాగ్యలక్ష్మీతో వివాహం జరిగింది. వారికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మీ ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. అదనపు కట్నం కోసం అత్తింటివారు తనను వేధిస్తున్నారని భర్త హరినాథ్‌తో పాటు అతడి సోదరుడు ప్రసాద్, ఇతర కుటుంబసభ్యులపై తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. భాగ్యలక్ష్మీకి రూ.12 లక్షలు ఇచ్చి రాజీ చేసుకోవాలని ఇరు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం పలు దఫాలుగా డబ్బు చెల్లించాల్సి ఉంది. గత నెల రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా సర్దుబాటు కాకపోవడంతో చెల్లించలేదు. దీంతో భాగ్యలక్ష్మి సోదరుడు హనుమంతు తరచూ ప్రసాద్‌కు ఫోన్ చేసి వేధిస్తుండేవాడు. అతడితో పాటు పోలీసులు కూడా ఫోన్ చేస్తుండడంతో మనస్తాపానికిలోనైన ప్రసాద్ గురువారం ఉదయం తమ్ముడి భార్య కుటుంబ సభ్యుల వేధింపులను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తండ్రిని హతమార్చిన కూతురు) -
Elizabeth-2: అంత్యక్రియలకు వెళ్లి సెల్ఫీకి పోజులా? అదేమైనా బర్త్‌డే పార్టీనా?
లండన్: మెక్సీకో విదేశాంగ మంత్రి మార్సెలో ఇబ్రార్డ్ను నేటిజన్లు ఏకిపారేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. భార్యతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడంపై మండిపడ్డారు. దేశం తరఫున ప్రతినిధిగా వెళ్లి రాణి అంత్యక్రియల్లో ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా? అని విమర్శలు గుప్పించారు. 'మీరు భార్యతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అదేం బర్త్‌డే పార్టీ కాదు. మెక్సీకో ప్రతినిధిగా వెళ్లారు. అది గుర్తుపెట్టుకోండి' అని ఓ నెటిజన్ ఇబ్రార్డ్కు చురకలు అంటించాడు. 'ఈయన లండన్ పర్యటనకు వెళ్లిన వింత సందర్శకుడిలా ప్రవర్తించారు. ఇతరులను ఇబ్బందిపెట్టి అందరూ తనవైపు చూడాలనుకుంటున్నారమో?' అని మరో యూజర్ విమర్శించాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం జరిగాయి. 2,000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఇబ్రార్డ్ ఒకరు. అయితే అంత్యక్రియలకు ముందు ఆయన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరకాటంలో పడ్డారు. En el Funeral de Estado de S.M. la Reina Isabel II pic.twitter.com/GUiNPtJrSo — Marcelo Ebrard C. (@m_ebrard) September 19, 2022 చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
రొనాల్డో చేసిన పనికి యువతి మొహం మాడిపోయింది!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డొకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆటలో అతని విన్యాసాలు చూడాలని స్టేడియాలకు పోటెత్తుతుంటారు. అలా సెపరేట్ ఫ్యాన్ బేస్ కలిగిన రొనాల్డోతో ఫోటో దిగాలన్న ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. తాజాగా తను అభిమానించే ఆటగాడితో సెల్ఫీ దిగాలని ఆరాపడింది ఒక అందమైన యువతి. కానీ రొనాల్డో ఆమెతో ఫోటో దిగేందుకు నిరాకరించి చేతిని అడ్డుపెట్టుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూఈఎఫ్ఏ యూరోప్ లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మాంచెస్టర్ యునైటెడ్, మొల్డోవన్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 2-0తో విజయం సాధించింది. మాంచెస్టర్ యునైటెడ్ తరపున రొనాల్డో, జెడన్ సాంచోలు చెరో గోల్ కొట్టారు. తొలి సగం ముగిసేసరికి రొనాల్డో కొట్టిన గోల్‌తో మాంచెస్టర్ యునైటెడ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి హాఫ్ బ్రేక్‌టైంలో కాస్త చికాకుగా ఉన్న రొనాల్డో పెవిలియన్‌కు వెళ్తున్నాడు. ఇంతలో అక్కడున్న ఒక యువతి రొనాల్డోతో ఫోటో దిగాలని ఆశపడింది. కానీ రొనాల్డో అందుకు అభ్యంతరం చెబుతూ తన చేతిని అడ్డుపెట్టి వెళ్లిపోయాడు. దాంతో యువతి మొహం చిన్నబోయింది. A fan asked Ronaldo for a picture during the halftime of the United game but he refused to take it… pic.twitter.com/qYIRsvmtQU — LSPN FC (@LSPNFC_) September 15, 2022 చదవండి: 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' ప్రైవేట్ లీగ్స్ మోజులో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు -
విజయ్‌తో రష్మిక మందన్నా సెల్ఫీ వైరల్
తమిళసినిమా: సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు సెల్ఫీలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. సెలబ్రిటీలతో సెల్ఫీ అంటే అందరికీ క్రేజీ అనే చెప్పాలి. నటి రష్మిక మందన్నా సెల్ఫీనే సామాజిక మాధ్యమాల్లో క్రేజీగా వైరల్ అవుతోంది. ఈ శాండిల్‌వుడ్ బ్యూటీ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. పుష్ప చిత్రం ఈ అమ్మడి రేంజ్‌ను బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం విజయ్‌తో వారీసు చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకుంది. షూటింగ్ స్పాట్లో ఫొటోలు ఇప్పటికే లీక్ అయి యూనిట్ వర్గాలను షాక్‌కు గురి చేశాయి. తాజాగా సంగీత దర్శకుడు తమన్ చిత్ర ఆడియో దీపావళికి విడుదల కానుందని తన ట్విట్టర్లో పేర్కొని వారీసు చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం సంక్రాంతికి భారీ అంచనాల మధ్య తెరపై రానుందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ స్పాట్లో నటి రష్మిక మందన్నా విజయ్‌తో సెల్ఫీ ప్లీజ్ అంటూ తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అమృత మరణం.. ఉప్పుపాతరతో ఊపిరి తిరిగొస్తుందా?
చిక్కబళ్లాపురం: ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించినవారిని ఉప్పు పాతరేస్తే ప్రాణాలు తిరిగొస్తాయనే మూఢ నమ్మకం కన్నడనాట నేటికీ కొనసాగుతోంది. ఇటీవల బళ్లారిలో ఓ బాలుడి మృతదేహాన్ని ఉప్పు పాతరేయడం మరచిపోకముందే... చిక్కబళ్లాపుర జిల్లాలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకుంది. శిడ్లఘట్ట తాలూకాలోని గాజులవారిపల్లెకు చెందిన ఎంఏ విద్యార్థిని అమృత (22) గంగానహళ్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆమె ఆదివారం ఉదయం గ్రామంలోని చెరువు వద్ద సరదాగా రీల్స్ చేస్తున్న సమయంలో తీసుకుంటూ జారిపడి నీటిలో మునిగిపోయింది. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్నవారు వచ్చి అమృతను ఒడ్డుకు తీసుకురాగా, అప్పటికే ఆమె చనిపోయింది. అయితే.. అయినప్పటికీ బంధువులు ఉప్పు పాతర వేస్తే బతుకుతుందనే నమ్మకంతో అమృత మృతదేహాన్ని ఉప్పులో పెట్టారు. గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పుపాతర) -
నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి
నోయిడా: ఉత్కంఠ రేపిన సూపర్‌టెక్ జంట టవర్ల కూల్చివేత ఆదివారం మధ్యాహ్నం విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. పేలుళ్ల కారణంగా టవర్ల పరిసరాల్లోని రహదారులు, భవనాలు, చెట్లపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగింపు సాయంత్రం నుంచే మొదలైంది. అక్కడికి అత్యంత సమీపంలో ఉన్న ఎమెరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ సొసైటీల నుంచి ఖాళీ చేయించిన కుటుంబాల్లో సగానికి పైగా తిరిగి తమ నివాసాలకు చేరుకున్నాయి. అధికారులు వారికి విద్యుత్, నీరు, వంటగ్యాస్ సరఫరాలను పునరుద్ధరించారు. తమ నివాసాలు సురక్షితంగా ఉన్నందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారీ పేలుళ్లతో ఎమెరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ లోపల వెలుపల, ఇతర నివాస ప్రాంతాలు, రహదారులు, పరిసరాల్లోని చెట్లపై దుమ్ముధూళి దట్టంగా పేరుకుపోయింది. దీనిని తొలగించేందుకు ఆదివారం సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో పనివారిని రంగంలోకి దించారు. 500 మంది సిబ్బందితోపాటు, 100 నీటి ట్యాంకర్లు, 22 యాంటీ స్మోగ్ గన్స్‌లో ఊడ్చటం, తుడవటం వంటి పనులను చేపట్టినట్లు నోయిడా అథారిటీ సీఈఓ రీతూ మహేశ్వరి తెలిపారు. టవర్ల కూల్చివేతతో ఏర్పడిన 80 వేల టన్నుల శిథిలాలను తొలగించేందుకు 3 నెలలు పడుతుందని ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. దీనిని వృథాగా పడేయకుండా రీసైకిల్ చేసి, తిరిగి వినియోగిస్తామని పేర్కొంది. సెల్ఫీలతో జనం సందడి టవర్లు కూలిన తర్వాత సోమవారం కూడా జనం అక్కడికి వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. పెద్ద ఎత్తున గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలకు సమీపంలో సెల్పీలు, వీడియోలు తీసుకుంటున్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా నివాస సముదాయాలను నిర్మించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అధికార బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ పెద్ద అబద్ధాల కోరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ!: వైరల్ వీడియో
ఇటీవల యువతకు సెల్ఫీ క్రేజీ మాములుగా లేదుగా. ఎలాంటి ప్రదేశంలో ఉన్నాం అన్న స్ప్రుహ కూడా లేకుండా సెల్పీ మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయిన వాళ్లు కోకొల్లలు. అయినప్పటకీ ఎవరూ ఎంత ప్రమాదకరమైన 'తగ్గేదే లే' అంటూ సెల్పీలు తీస్తూనే ఉంటున్నారు. ఇక్కడ కూడా ఇద్దరు ప్రబుద్ధులు అలానే చేసి చివరికి బతుకు దేవుడా అంటూ పరుగు లంఘించారు. ఏం జరిగిందంటే... ఇదరు వ్యక్తులు కారులో వెళ్తుండగా ఒక ఏనుగులు గుంపు రోడ్డు పైకి వస్తుంది. దీంతో వాళ్లు కారు ఆపి మరీ ఆ ఏనుగుల గుంపు వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు. ప్రమాదం అని తెలిసి కూడా వాటికి దగ్గరగ వెళ్తారు. మొదట అవి సెల్ఫీ తీసుకునేందుకు ఇష్టం లేదన్నట్లు తమ ముఖాన్ని పక్కకు పెట్టుకుంటాయి. కాసేపటి తర్వాత ఒక్కసారిగా కోపంతో మాతో సెల్ఫీలా... అన్నట్లుగా ఒక్కసారిగా ఉరుముతూ వాళ్ల మీదకు వస్తాయి. దెబ్బతో సదరు వ్యక్తులు భయంతో పరుగెడుతూనే ఉంటారు. Selfie craze with wildlife can be deadly. These people were simply lucky that these gentle giants chose to pardon their behaviour. Otherwise, it does not take much for mighty elephants to teach people a lesson. video-shared pic.twitter.com/tdxxIDlA03 — Supriya Sahu IAS (@supriyasahuias) August 6, 2022 (చదవండి: వామ్మో! ఏంటీ దెయ్యం అలా ఎలా చేస్తోంది) -
ప్రాణం మీదకు తెచ్చిన సరదా..సెల్ఫీ కోసం రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి..
బెంగళూరు: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల కిరణ్ రాజ్‌పుర్ నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వెళ్లాడు. ఇతరుల కంటే భిన్నంగా సెల్ఫీ దిగాలనే ఉత్సుకతతో నీర్సాగర్ రిజర్వాయర్ వద్ద ఎత్తైన అంచుకు వెళ్లాడు. ఆనందంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో పొరపాటున కాలుజారి పడిపోయాడు. అనంతరం వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. యువకుడి కోసం అతని స్నేహితులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. అతని కోసం గాలింపు చేపట్టిన సహాయక బృందాలు భారీ వర్షం, వరదల కారణంగా ఆపరేషన్ నిలిపివేశాయి. ధార్వాడ్ బెగూర్‌కు చెందిన ఈ యువకుడు చాలా ఎత్తైన ప్రాంతం నుంచి పడిపోయాడని పోలీసులు తెలిపారు. వర్షాకాలంలో గజ ఈతగాల్లు కూడా అక్కడి నుంచి దూకే సాహయం చేయరని తెలిపారు. యువకుడు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కష్టమే అన్నారు. రిజర్వాయర్ దిగువన ఉండే గ్రామస్థులకు సమాచారం అందించామని, ఏమైనా ఆచూకీ లభిస్తే తెలుస్తుందని చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు ఘటనా స్థలం వద్దకు వెళ్తుంటే అడ్డుకుని వెనక్కి పంపించామని వివరించారు. వానలు పడినప్పుడు నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు చాలా మంది వెళ్తుంటారు. ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లవద్దని అక్కడున్న సిబ్బంది, పోలీసులు సందర్శకులను హెచ్చరిస్తూనే ఉంటారు. కొంతమంది మాత్రం అవేమి పట్టించుకోకుండా ఫోటోలు దిగేందుకు రిజర్వాయర్ అంచు వరకు వెళ్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారినపడుతున్నారని చెప్పారు. డ్యాంలో నీటి స్థాయి తగ్గేవరకు సందర్శకులు రాకుండా నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: హైవేపై లారీ నడిపిన మహిళ.. స్మైల్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్ -
Kadem Project: కడెంపై ఆ 9 మంది ‘చివరి’ సెల్ఫీ..! ఉగ్ర గోదారి ఉరిమి చూస్తే!
నిర్మల్/కడెం: గోదావరి మహోగ్రరూపాన్ని కడెం ప్రాజెక్టు సిబ్బంది కళ్లారా చూశారు. క్షణం ఆలస్యమైనా వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేది. ప్రాజెక్టుపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డ్యామ్ సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. అప్పటికే 5 లక్షల క్యూసెక్కులు వస్తున్నా పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఇంతలో వరద ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఈఈ రాజశేఖర్.. కలెక్టర్ ముషరఫ్ అలీకి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. మీరందరూ వెంటనే డ్యామ్ వదిలి వెళ్లిపోవాలని కలెక్టర్ గట్టిగా ఆదేశించడంతో గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ సెల్ఫీ ఫొటో తీసుకుని వచ్చేశారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఈ సునీల్ పరిస్థితిని చూసివద్దామంటూ ఈఈ రాజశేఖర్, డీఈ భోజదాస్, గేట్ ఆపరేటర్లు చిట్టి, సంపత్‌లను వెంటబెట్టుకుని వెళ్లారు. తాము అక్కడికి వెళ్లిన కాసేపటికే వరద ఒక్కసారిగా పోటెత్తిందని, ప్రాజెక్టు పై నుంచి నీళ్లు ఉప్పొంగాయని, దీంతో వెంటనే తమ బైక్ అక్కడే వదిలేసి, ఎస్ఈ కారులో వచ్చేశామని గేట్ ఆపరేటర్లు తెలిపారు. డ్యామ్‌పై నుంచి సునామీలా వచ్చిన వరదను చూసి వణికి పోయామని చెప్పారు. -
సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా ... ఏకంగా అగ్ని పర్వతంలోనే జారీ...
సెల్ఫీల పిచ్చితో ఇటీవల యువత ఎంత భయానక ప్రమాదాలను కొని తెచ్చుకంటున్నారో చూస్తేనే ఉన్నాం. మనం ఉన్నది ప్రమాదకరమైన ప్రదేశం వద్ద అన్న విషయం మర్చిపోయి మరీ సెల్ఫీ మోజుతో ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ పిచ్చితో చావు అంచు వరకు వెళ్లొచ్చాడు. వివరాల్లోకెళ్తే...ఒక అమెరికన్ టూరిస్ట్ తన కుటుంబంతో సహా ఇటలీలోని ప్రఖ్యాత అగ్ని పర్వతం అయిన మౌంట్ వెసువియస్ పర్వతం వద్దకు వెళ్లాడు. అక్కడ అతను తన కుటుంబంతో కలిసి ఆ అగ్నిపర్వత వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్ ప్రమాదవశాత్తు ఆ అగ్ని పర్వతం బిలంలో పడిపోయింది. తన ఫోన్ కోసం అని ఆ అమెరికన్ టూరిస్ట్ ఆ అగ్నిపర్వతం బిలంలోకి దిగడానికి యత్నిస్తున్నాడు. ఐతే అతను ప్రమాదవశాత్తు పట్టుతప్పి ఆ బిలంలోకి పడిపోయాడు. అతను బిలంలోకి పడిపోవడాన్ని గుర్తించిన స్థానిక గైడ్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పట్టారు. ఈ మేరకు పోలీసులు కూడా రంగంలోకి దిగి హెలికాప్టర్ సాయంతో ఆ వ్యక్తిని రక్షించారు. ఐతే పోలీసులు అతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వాస్తవానికి అతను ఈ అగ్నిపర్వతం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇది చాలా ప్రమాదాకరమైన ప్రదేశం అని పర్యాటక సందర్శనకు నిషేధించారు. ఆ టూరిస్ట్ ఎలాంటి అనుమతి లేకుండానే తన కుటుంబంతో సహా అక్కడకు రావడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: గోటబయ పరార్.. లంకలో ఎమర్జెన్సీ: బయట కనిపిస్తే కాల్చివేతే) -
Youth Pulse: సెల్ఫీలు తీసుకోవడం ఇష్టమా? మరి 0.5 సెల్ఫీల గురించి తెలుసా?
సెల్ ప్రపంచంలో దర్జాగా చైర్ వేసుకొని కూర్చున్న యువతరానికి– సెల్ఫీ కొత్త కాదు! మరి సెల్ఫీలో కొత్త ఏమిటి? జీరో పాయింట్ ఫైవ్.. సెల్ఫీ ముచ్చట్ల గురించి మాట్లాడుకోవాలంటే ఒకటా రెండా... మేకప్ ఫ్రీ సెల్ఫీ అని ఒక ట్రెండ్ బయలుదేరింది. అంటే ఎలాంటి మేకప్ లేకుండా సెల్ఫీ తీసుకోవడం. ‘మేకప్ లేని నా ఫేస్ ఎంత అందంగా ఉందో’ అని కామెంట్ కూడా పెడుతుంటారు. ‘స్లీప్ సెల్ఫీ’ కూడా బాగా పాపులర్ అయింది. రాత్రి నిద్రపోయే ముందు సెల్ఫీ తీసుకోవడమన్నమాట! బాతులాగా మూతి ముడిచి తీసుకునే సెల్ఫీలు ‘డక్ ఫేస్ సెల్ఫీ’లుగా పాపులర్ అయ్యాయి. స్టైల్స్ విషయాన్ని పక్కన పెడితే, ఫోన్లలో ‘రేంజ్’లు ఉన్నట్లే సెల్ఫీలలో కూడా ఉన్నాయి. సెల్ఫీలలో ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్ 0.5 లేదా అల్ట్రావైడ్ సెల్ఫీ ‘ఇదేమన్నా చిన్నాచితకా సెల్ఫీ అనుకుంటున్నావా ఏంటీ, అల్ట్రావైడ్ సెల్ఫీ’ అనే మాటలు యూత్ నోటి నుంచి తరచుగా వినబడుతున్నాయి. ‘ఈ అల్ట్రావైడ్ సెల్ఫీల ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే... సాధారణ సెల్ఫీలతో పోల్చితే భిన్నంగా కనిపిస్తాయి, నుదురు, గోళ్లు, షూస్, మేకప్... మొదలైనవి హైలెట్ అవుతాయి. కొన్నిసార్లు కామిక్ లుక్‌తో కనిపిస్తాం. వీటిని బ్యాక్‌కెమెరా నుంచి మాత్రమే తీసుకునే వీలు ఉండడం వల్ల ‘ఇలా వస్తుంది’ ‘అలా వస్తుంది’ అని ఊహించడానికి లేదు. ఫైనల్ ఔట్పుట్ ఏమిటో మనకు తెలియదు! 2019లో ఐఫోన్11, శాంసంగ్ గెలాక్సీ ఎస్10లో 0.5 సెల్ఫీలు ‘మేము ఉన్నాం’ అంటూ పరిచయం అయ్యాయి. అప్పట్లో సౌత్ ఫ్లోరిడాకు చెందిన ట్విట్టర్ యూజర్ జెర్మీ ఒకే అరటిపండుకు చెందిన రెండు ఫోటోలను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లెఫ్ట్ ఫోటో నార్మల్ కెమెరాతో తీసింది. రైట్ ఫోటో అల్ట్రావైడ్ కెమెరాతో తీసింది. రెండో ఫోటోలోని అరటిపండు ఉన్న సైజు కంటే పెద్దగా, చిత్రంగా కనిపిస్తుంది. అలా ‘వైడ్ యాంగిల్ ఈజ్ క్రేజీ’ అనుకోవడానికి అప్పుడే బీజాలు పడ్డాయి. ఈ సంవత్సరం ఆ క్రేజ్ ట్రెండ్‌గా మారింది. దిల్లీకి చెంది శ్రావ్య ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ నిండా బోలెడు 0.5 సెల్ఫీలు ఉన్నాయి. ఇప్పుడు మిత్రబృందం కూడా తనను అనుసరిస్తోంది. ‘ఇది అల్ట్రావైడ్ సెల్ఫీ అని చెప్పుకోవడంలోనే ప్రత్యేకత ఉంది. తీసిన ఫోటో తీసినట్లుగా వస్తే కిక్ ఏం ఉంటుంది? మన ఊహకు అందకుండా వచ్చినప్పుడు మజా వస్తుంది’ అంటుంది శ్రావ్య. ఇప్పటి మాట కాదు నిజానికి అల్ట్రావైడ్ లెన్స్ అనేది ఇప్పటి మాట కాదు. 1862లో వీటికి తొలిసారిగా పేటెంట్ లభించింది. ల్యాండ్‌స్కేప్, ఆర్కిటెక్చరల్ షాట్స్ కోసం వీటిని వాడేవారు. స్ట్రీట్ఫోటోగ్రఫీలో ఈ లెన్స్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. సెల్ఫీ అనగానే టక్కున గుర్తుకు వస్తుంది హాలీవుడ్ సెలిబ్రిటీ... కిమ్ కర్దాషియాన్. ‘క్వీన్ ఆఫ్ సెల్ఫీస్’గా పేరు తెచ్చుకున్న కిమ్ ‘సెల్ఫీస్’ పేరుతో ఏకంగా ఒక పుస్తకమే రాసింది. ఈ కాఫీ టేబుల్ బుక్‌లో వివిధ సందర్భాలలో కిమ్ తీసుకున్న సెల్ఫీలు ఆకట్టుకుంటాయి. కిమ్ కర్దాషియాన్, పారిస్ హిల్టన్లాంటి సెలిబ్రిటీలు జీరో పాయింట్ ఫైవ్ సెల్ఫీలకు యూత్‌లో క్రేజ్ తీసుకువచ్చారు. ‘కొత్త రకం సెల్ఫీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి’ అంటుంది కిమ్ కర్దాషియాన్. అది ఆమె మాటే కాదు... కొత్తతరం అనుసరిస్తున్న బాట కూడా! చదవండి: Cyber Crime Prevention Tips: టీమ్వ్యూమర్, ఎనీడెస్క్ వంటివి డౌన్లోడ్ చేయమంటారు? ఓటీపీ చెబితే అంతే సంగతులు! -
సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి..
-
Viral Video: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి..
సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శిలో ఓ కోతి సెల్ఫీలు దిగుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొబైల్ ఫోన్‌ను చేతిలో పట్టుకుని వాకింగ్ చేస్తూ ఉన్న ఓ వ్యక్తి నుండి మొబైల్ ఫోన్‌ను ఓ వానరం లాక్కెళ్లింది. అంతటితో ఆగకుండా దగ్గరలో ఉన్న గోడపై కూర్చొని సెల్ఫీలో దిగుతూ గంట పాటు మొబైల్ ఫోన్‌ను ఇవ్వకుండా ఆ వ్యక్తి కి ముచ్చెమటలు పట్టించింది. చదవండి: బెజవాడలో ఫేమస్.. రామకృష్ణ బుల్లెట్ గ్యారేజ్ ఆ కోతి చేష్టలకు వాకింగ్ చేస్తూ ఉన్నవారంతా ఒక్కసారి నోరెళ్ల పెట్టి అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత మొబైల్‌ను నోటితో పట్టుకొని చెట్లపై అటు ఇటు దూకుతూ తన కోతి చేష్టలను చూపెట్టింది. గంట తర్వాత చిన్నగా ఓ గోడపై వదిలి వెళ్లగా ఆ యువకుడు నానా కష్టాలు పడి గోడలు ఎక్కి మొబైల్ ఫోన్ తీసుకోవడంతో అక్కడి వారంతా కోతి చేష్టలకు ముక్కున వేలేసుకున్నారు. -
ఇదేం పిచ్చిరా నాయన! తగలెట్టేసి మరీ సెల్ఫీలా!
New selfie points near burnt buses and cars submerged: రాజికీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అల్లర్లు చెలరేగుతున్నసంగతి తెలిసిందే. తొలుత శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రాజపక్స కుటుంబాల ఇళ్లను, కార్యాలయాలను ధ్యంసం చేశారు కూడా. నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న మహిందా రాజపక్స కుటుంబం పై దాడి చేయాలని నిరసనకారలు ఆ ప్రాంతాలను కూడా ముట్టడించారు. ఈ క్రమంలో ఒకవైపు ఆందోళలనకారులు నిరసనలు చేస్తుంటే మరోవైపు కొంతమంది ఆ ధ్వంసమైన కార్లు, చెరువుల్లో మునిగిపోయిన బస్సుల వద్ద సెల్ఫీలు తీసకుంటున్నారు. ఈ హింసాత్మక అల్లర్లుక కారణంగా శ్రీలంక రక్షణ శాఖ కర్ఫ్యూ విధించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులన తగలబెట్టేవారిని నిర్థాక్షిణ్యంగా కాల్చేయండి అంటూ అదేశాలు జారీ చేసింది కూడా. ఐతే ఇక్కడ ప్రజలు ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆస్తులను సెల్ఫీ పాయింట్లుగా చేసుకుని సెల్ఫీలు దిగేందుకు ఎగబడటం విశేషం. అంతేకాదు ఈ కర్ఫ్యూ కారణంగా తాము స్కూల్‌కి వెళ్లలేకపోవడంతో తాము తమ కుటుంబంతో బయటకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నమని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసస్థలాల వద్ద బస్సలు, కార్లు దగ్ధం కాగా.. ప్రజలు తమ కుటుంబాలతో సహా వాటి వద్దకు వచ్చి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. Sri Lanka | Burnt buses and sunken cars become a new selfie point in Colombo "People are taking selfies here as they want to take it as memory, many people could not join protests, they are taking selfies to show solidarity with the protesters," said Clifford, a local resident pic.twitter.com/UpTKzwRLXF — ANI (@ANI) May 12, 2022 (చదవండి: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం) -
సీఐతో శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితుడి సెల్ఫీ
కుత్బుల్లాపూర్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి బుధవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపగా... తాజాగా పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్‌తో సెల్ఫీ మరో వివాదం అయింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్లీనరీలో రవి పాల్గొనడం.. పోలీసు అధికారులతో సెల్ఫీ దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ప్రజాప్రతినిధులకే ఆహ్వానం ఉండగా మున్నూరు రవి హాజరు కావడంపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ దృష్టి పెట్టింది. ఇదే ప్లీనరీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం ఉండడం అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. బందో బస్తులో ఉన్న తాను మున్నూరు రవిని గుర్తించి దగ్గరికి వెళ్లి ఎలా వచ్చావు ..అని అడిగే లోపే సెల్ఫీ తీశాడని.. రవి వచ్చిన విషయాన్ని బాలానగర్ డీసీపీ సందీప్ దృష్టికి తీసుకెళ్లానని సీఐ రమేష్ వివరణ ఇచ్చారు. (చదవండి: అప్పిచ్చి.. ఆందోళన చేసి.. ప్రాణాలు పోగొట్టుకుని..) -
దర్శకుడికి జాక్‌పాట్, స్టేజీపైనే రూ.10 లక్షల అడ్వాన్స్ చెక్!
సెల్ఫీ దర్శకుడు జాక్‌పాట్ కొట్టారు. జీవీ ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటించిసంగీతాన్ని అందించిన చిత్రం సెల్ఫీ. వర్ష బొల్లమ్మ కథానాయికగా దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రతినాయకుడిగా ఇందులో నటించారు. కలైపులి ఎస్.థాను సమర్పణలో మాదిమారన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డీజీ ఫిలిం కంపెనీ పతాకంపై శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 1న విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఈ విజయాన్ని చిత్రయూనిట్ మంగళవారం సాయంత్రం చెన్నైలో మీడియాతో పంచుకున్నారు. సెల్ఫీ చిత్రానికి ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, భారీ ఎత్తున విడుదల చేసిన కలైపులి.ఎస్ థానుకు నిర్మాత శబరీష్ ధన్యవాదాలు తెలిపారు. కాగా దర్శకుడు మదిమారన్ తన సంస్థలో మరో చిత్రం చేయడానికి ఇదే వేదికపై అడ్వాన్స్‌గా రూ.10 లక్షల చెక్కును థాను అందించడం గమనార్హం. చదవండి: పాన్ ఇండియా సినిమాల సక్సెస్, కలవరపడుతున్న కోలీవుడ్ -
ప్రేయసి ముద్దే.. పోలీసులకు పట్టించింది
అతనొక భయంకరమైన నేరస్తుడు. సుమారు 200 దేశాల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. 196 దేశాల్లో ఇంటర్‌పోల్ అతని అరెస్ట్ కోసం రెడ్ వారెంట్ జారీ చేసింది. ఏళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ప్రియురాలి అత్యుత్సాహంతో ఎట్టకేలకు బుక్కైపోయాడు. ఆమెకు ముద్దు పెట్టి పోలీసులకు దొరికిపోయాడు. అదెలాగంటే.. మెక్సికన్ డ్రగ్ లార్డ్, సినాలోవా కార్టెల్ మాఫియా ముఖ్యనేత జోవాక్విన్ గుజ్మన్ అలియాస్ ఎల్ చాపో గుర్తున్నాడా? ప్రస్తుతం అతను జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతని ముఖ్య అనుచరుడు, ఎల్ పిట్ గా పేరొందిన ‘బ్రియాన్ డొనాసియానో ఒలుగ్విన్ వెర్డుగో’ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికీ డ్రగ్స్లావాదేవీలు, అక్రమ రవాణా కొనసాగిస్తూ.. ఎల్ చాపోనే మించిపోయాడు. అలా 39 ఏళ్ల ఎల్ పిట్‌పై.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ పోల్ వారెంట్లు జారీ అయ్యాయి. చివరికి.. అతగాడి గాళ్ ఫ్రెండ్ అత్యుత్సాహమే అతన్ని పట్టించింది. కొన్నిరోజుల కిందట ఫేస్ బుక్ లో అమెరికా డ్రగ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ అధికారులకు ఓ ఫొటో కంటబడింది. ఓ పర్యాటక ప్రాంతంలో ఓ జంట ముద్దు పెట్టుకుంటున్న ఫొటో అది. ఆ ఫొటోలో ఉన్నది ఎల్ పిట్ అని గుర్తించిన అమెరికా డ్రగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతడు కొలంబియాలో ఉన్నట్టు కనిపెట్టారు. పక్కా స్కెచ్‌తో.. వెంటనే కొలంబియా అధికారులకు సమాచారం అందించారు. దాంతో పక్కా ప్లాన్ వేసిన కొలంబియా పోలీసులు క్యాలీ నగరంలోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఎల్ పిట్ ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అతడు కొలంబియాలోనే ఉంటున్నాడట. మెక్సికో, అమెరికా దేశాలకు వేల కోట్ల విలువైన కొకైన్ ను తరలించేందుకు కొలంబియాలోని (రివల్యూషనరీ ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) 'ఫార్క్' గెరిల్లా దళాల సాయం కోరేందుకు అతడు కొలంబియాలో మకాం వేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో.. మెక్సికోలో మోడల్ అయిన తన గర్ల్‌ఫ్రెండ్‌తో క్యాలీలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో దిగినట్లు తెలిసింది. ఆపై ఆమె ప్రఖ్యాత టూరిస్టు కేంద్రం లాస్ క్రిస్టాలెస్ కు తీసుకువచ్చింది. అక్కడ పర్వతంపై ముద్దు పెట్టుకుంటూ ఇద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. దొరికిపోయాడు. ఇదే మెక్సికోలో అయి ఉంటేనా? అయితే దాడుల సమయంలో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఎల్ పిట్ కొలంబియా పోలీసులకు 2,65,000 డాలర్ల లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడట. అంతేకాదు, ఇదే ఘటన మెక్సికోలో జరిగుంటే తన సాయుధ దళాలు కొద్దిసేపట్లోనే తనను విడిపించి ఉండేవని పోలీసులతో చెప్పాడట. గట్టి భద్రత మధ్య అతడిని పలు కేసుల విచారణ నిమిత్తం అమెరికాలోని కాలిఫోర్నియాకు తరలించనున్నారు. -
సింహాలతో సెల్ఫీ.. అట్లుంటది మనతోని!
సాధారణంగా సాధుజంతువులతో మనకి నచ్చినట్లు ప్రవర్తిస్తుంటాం. కానీ పులి, సింహం, ఏనుగులాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకుంటే వాటికి తిక్కరేగితే అంతే సంగతులు. ఇక ప్రత్యేకంగా సింహం గాండ్రింపు వింటేనే హడలిపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా సింహాలతోనే సెల్ఫీ దిగడమే కాకుండా వాటితో వీడియోలు కూడా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. అతని పేరు హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్. యూఏఈకి చెందిన పెద్ద వ్యాపారవేత్త. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులలో హుమైద్ ఒకరు. అతను ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఈఎన్ఓసీ) సీఈఓ. అతను తన లగ్జరీ లైఫ్‌స్టైల్, సింహాల పెంపకం, వాటితో వీడియోల ద్వారా సోషల్ మీడియాలో స్టార్‌గా కూడా మారాడు. అంతేకాకుండా అతనికి జంతువుల మీద ఉన్న ప్రేమ కారణంగా అల్బుకైష్ జంగిల్ అనే ఒక ప్రైవేట్ జూని నడుపుతున్నాడు. ఎడారి మధ్యలో ఉండే ఈ జూలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులున్నాయి. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఒక సింహం చెట్టుపైకి ఎక్కగా, మరో రెండు కింద ఉన్నాయి. హుమైద్ వాటికి కొంతదూరంలోనే సెల్ఫీ తీసుకుని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Humaid Abdulla Albuqaish (@humaidalbuqaish) -
పోరాట కేంద్రంగా ‘సీసీఐ’ సెల్ఫీ పాయింట్
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్ట రీని పునఃప్రారంభించాలనే ఉద్యమి స్తున్న సీసీఐ సాధన కమిటీ కొత్త పోరాట రూపాన్ని ఎంచుకుంది. నెల రోజులుగా ఆందోళన చేస్తున్న కమిటీ.. తమ పోరాటాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం ‘ఐ లవ్ సీసీఐ’ పేరుతో ఆదిలాబాద్ పట్టణంలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలు, యువకులు ఇక్కడ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసి కేంద్రానికి చేరేలా షేర్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సెల్ఫీ పాయింట్ వద్ద మొదటి ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణ అంశం ప్రజా ఉద్యమంగా మారు తుందన్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద ప్రతిఒక్కరూ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని కోరారు. సీసీఐ పునఃప్రారంభానికి కేంద్రం అనుమతి ఇచ్చే వరకూ పోరాటం కొనసాగుతుందని సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్ విజ్జగిరి నారాయణ, నర్సింగ్, రమేశ్, శివ, కిరణ్, మనోజ్, సూరజ్ తెలిపారు. -
సెల్ఫీ కోసం రైలు బోగీ పైకి.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో
పిడుగురాళ్ల: ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ శివారులో బుధవారం ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కటికం వీరబ్రహ్మం రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్నాడు. తన బైక్‌పై రైల్వేస్టేషన్ వద్దకు వచ్చాడు. అప్పటికే గూడ్స్ రైలు ఆగి ఉండటంతో వెనుక బోగీపైకి ఎక్కాడు. బోగీపై నిలబడి సెల్ఫీ దిగేందుకు చేతిని పైకిలేపడంతో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి కింద పడ్డాడు. కిందపడటంతో తలకు గాయం కావడంతో పాటు, శరీరం కూడా తగలబడుతోంది. అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య దీనిని గమనించి వెంటనే రైల్వేస్టేషన్ మాస్టర్ కృపాకర్‌కు సమాచారం ఇచ్చాడు. రైల్వే ఎస్ఐ పోలయ్య, ఏఎస్ఐ కె.క్రీస్తుదాసు, కానిస్టేబుల్ సురేష్‌లు ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. బాధితుడిని 108లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నాగ చైతన్య మంచితనం.. వైరల్ అవుతోన్న హార్ట్ టచింగ్ పోస్ట్
Naga Chaitanya Selfie With His Fans In Goa Post Goes Viral: అక్కినేని నాగ చైతన్య. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖ రెండు కుటుంబాల వారసుడు. కానీ ఎప్పుడూ గొప్పగా మాట్లడటం, గర్వం కనిపించవు. చూడటానికి ఉండటానికి సాప్ట్ క్యారెక్టర్. ఎదిగేకొద్దీ ఒదుగుతూ ఉండే మనస్తత్వం చైతూది. కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ వాళ్లు అందరూ నాగ చైతన్య గురించి చెప్పే విషయం డౌన్ టూ ఎర్త్ ఉంటాడని. అయితే ఇంతటి మంచి లక్షణాలున్న చైతన్య మంచితనం గురించి తాజాగా ఒక పోస్ట్ చెబుతుంది. అదేంటంటే.. ఇద్దరు దంపతులు (నవీన్ శర్మ, శిరీష) గోవాలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్‌కు వెళ్లారు. అక్కడికి చైతన్య కూడా వచ్చాడు. అది చూసిన దంపతులు మొదటగా అతను నాగ చైతన్య కాదో అవునో అని తటపటాయించారు. నాగ చైతన్య వద్దకు వెళుతూ చూస్తు సందిగ్ధంలో ఉన్నారు. అయితే చివరిగా అది నాగచైతన్యే అని ధ్రువీకరించుకొని చైతూను సెల్ఫీ ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు సరే అన్నా నాగ చైతన్యతో వారు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ఫ్రేమ్‌లో ఇద్దరూ దంపతులు సరిగా కనిపించకపోవడాన్ని గమనించాడు నాగ చైతన్య. దీంతో 'నేను సెల్ఫీ తీస్తాను. అప్పుడు ఫొటోలో మీరు ఇద్దరు కనిపిస్తారు' అని చైతూనే ఫోన్ తీసుకుని ఫ్రేమ్‌లో ముగ్గురు వచ్చేలా సెల్ఫీ తీసి ఇచ్చాడు. ఇది చూసిన ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చైతూ మంచితనం గురించి విన్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాం. నిజంగా చైతన్య డౌన్ టూ ఎర్త్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ జంట. ఈ జరిగిన మొత్తం విషయాన్ని ఇన్‌స్టాలో ఎమోషనల్ హర్ట్ టచింగ్‌తో పంచుకున్నారు. 'నాగ చైతన్య డౌన్ టూ ఎర్త్ బిహేవియర్ చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అతనితో సెల్ఫీ దిగడం మెమరబుల్ మూమెంట్' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Naveen Sharma (@itsnaveen.sharma) ఇదీ చదవండి: చిన్నారి నోట సమంత పాట.. సామ్, డీఎస్పీ రియాక్షన్ -
Viral Video: సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ.. ఫోన్లు పగలకొట్టండి అంటూ ఫైర్
-
సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ.. ఫోన్లు పగలకొట్టండి అంటూ ఫైర్
Singer Mangli Mobbed By Fans In Ongole, Video Goes Viral: జానపద పాటలతో కెరీర్ ప్రారంభించిన మంగ్లీ.. తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటుంది. ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో సైతం మంగ్లీ పాట ఉండాల్సిందే అనేలా క్రేజ్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆమెకు సెల్ఫీల సెగ తగిలింది. ప్రోగ్రామ్ అనంతరం తిరిగి వెళ్తుండగా మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అసహనానికి గురైన మంగ్లీ.. యువకుల తీరుతో ఇబ్బంది పడింది. కాగా ఇటీవలె పుష్ప సినిమాలో ఊ అంటావా మావ..ఊఊ అంటూవా పాటతో మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ ఒక్కసారిగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇదే పాటను మంగ్లీ కన్నడ వెర్షన్లో పాడి ఆకట్టుకుంది. -
సెల్ఫీ పిచ్చి...జాలి పడాలా? మీరే చూడండి!
సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ పిచ్చి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తుమ్మినా..దగ్గినా సెల్ఫీనే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా..చివరికి ప్రాణాలు పోతున్నా ఈ విపరీత ధోరణిలో మార్పు రావడంలేదు. సెల్పీ మోజులో ప్రపంచాన్నే మర్చి పోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీల కోసం ఎగబడుతూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందంగా ముస్తాబై బయటకు వచ్చిన యువతి సెల్ఫీ కోసం ప్రయత్నించింది. తన అందాన్ని కెమెరాలో బంధించాలని తాపత్రయ పడిన ఆ అమ్మాయి సమీపంలోని కాలువ ఒడ్డున నిల్చొని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. చివరకు అదుపు తప్పి బురదలో పడిపోయింది. నవ్వాలో.. చిరాకు పడాలో అర్థం కావడం లేదు. జాలేస్తోంది అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. View this post on Instagram A post shared by hepgul5 (@hepgul5) -
మహిళా ఎంపీలతో సెల్ఫీ.. ‘ఇదేం బుద్ధి’ అంటూ శశి థరూర్‌పై విమర్శలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం రోజునే కాంగ్రెస్ పార్టీ నేత శశి థరూర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. మహిళా ఎంపీలపై సెక్సియెస్ట్ కామెంట్స్ చేశారంటూ ఆయనపై విమర్శలు చేస్తున్నారు నెటిజనులు. ఇంతకు ఏం జరిగింది అంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ నేత శశి థరూర్ తన ట్విటర్లో మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఓ ఫోటో షేర్ చేశారు. ‘‘లోక్‌సభ పని చేయడానికి ఆసక్తికరమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు. ఈ రోజు ఉదయం నేను నా తోటి ఆరుగురు మహిళా ఎంపీలను కలిశాను’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో విమర్శలు మూటగట్టుకుంటుంది. Who says the Lok Sabha isn’t an attractive place to work? With six of my fellow MPs this morning: @supriya_sule @preneet_kaur @ThamizhachiTh @mimichakraborty @nusratchirps @JothimaniMP pic.twitter.com/JNFRC2QIq1 — Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021 ‘‘బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న మీరు.. మీ తోటి మహిళా ఎంపీల గురించి ఇలాంటి సెక్సియెస్ట్ కామెంట్ చేయడం ఎంత వరకు సబబు. అంటే మహిళలు అందంగా ఉంటారు.. వారితో కలిసి పని చేయడం సంతోషం అని మీ ఉద్దేశమా.. ఆడవారు అంటే కేవలం వారి బాహ్య సౌందర్యం మాత్రమే కనిపిస్తుందా.. సమానత్వం అంటూ ప్రసంగాలు ఇస్తారు.. మరీ ఇదేంటి సార్’’ అంటూ ఓ రేంజ్లో శశి థరూర్‌ని ట్రోల్ చేశారు నెటిజనులు. (చదవండి: ఐటీఐఆర్.. లేదంటే అదనపు ప్రోత్సాహకం ) సరదాకు చేసిన పని కాస్త ఇలా రివర్స్ కావడంతో శశి థరూర్ ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. సారీ చెప్తూ మరో ట్వీట్ చేశారు శశి థరూర్. ‘‘ఇలా అందరం కలిసి సెల్ఫీ దిగడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఇదంతా స్నేహపూర్వక వాతావరణంలో చోటు చేసుకుంది. అదే స్ఫూర్తితో వారు(మహిళా ఎంపీలు) ఈ ఫోటోను ట్వీట్ చేయమని కోరారు.. నేను చేశాను. కానీ ఈ ఫోటో వల్ల కొందరు బాధపడ్డట్లు తెలిసింది. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే పనిచేసే చోట ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అంటూ మరో ట్వీట్ చేశారు శశి థరూర్. (చదవండి: శశిథరూర్ ఇంగ్లీష్‌పై ఫన్నీ వీడియో.. నెక్స్ట్ ఇమ్రాన్ ప్లీజ్!) The whole selfie thing was done (at the women MPs' initiative) in great good humour & it was they who asked me to tweet it in the same spirit. I am sorry some people are offended but i was happy to be roped in to this show of workplace camaraderie. That's all this is. https://t.co/MfpcilPmSB — Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021 ఈ సెల్ఫీలో శశి థరూర్‌తో పాటు టీఎంసీకి చెందిన నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, కాంగ్రెస్‌కి చెందిన జోతిమణి, తమిజాచి తంగపాండియా ఉన్నారు. చదవండి: మోదీ కన్నీళ్లపై కాంగ్రెస్ ఎంపీ ఫన్నీ కౌంటర్ -
సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను తీసింది
మైసూరు(బెంగళూరు): చెరువు కట్ట పైన నిలబడి మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటు ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన హుణసూరు తాలూకాలోని హోసకోటె దగ్గర కెంచన చెరువులో చోటు చేసుకుంది. మృతులు అబ్దుల్లా (21), తన్వీర్ (20). ముగ్గురు కలిసి చెరువు చూడడానికి వచ్చారు. కట్టపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఇద్దరు జారిపడ్డారు. చెరువు లోతుగా ఉండడంతో ఈదలేక మృత్యువాత పడ్డారు. హుణసూరు గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. రౌడీషీటర్ అరెస్ట్ శివమొగ్గ: వ్యాపారుల ను బెదిరించి దందాలు చేయడంతోపాటు అనేక నేరాలతో సంబంధం కలిగి ముంబైలో తలదాచుకున్న శివమొగ్గ నగరంలోని టిప్పు నగర్‌కు చెందిన పేరుమోసిన రౌడీషీటర్ బచ్చన్(29)ను శివమొగ్గ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఇతనిపై జిల్లాలోని అనేక పోలీస్స్టేషన్లలో 53 కేసులున్నాయి. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో బసవనగుడికి చెందిన మహ్మద్ తౌహిద్(19), మహ్మద్ బిలాల్(21)ను నవంబర్ 16న పోలీసులకు పట్టుబడ్డారు. వారు ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ముంబై వెళ్లి బచ్చన్‌ను పట్టుకొచ్చారు. చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది -
అభిమాని మనస్సు గెలుచుకున్న సీఎం..
చెన్నై: సాధారణంగా తమకు నచ్చిన అభిమాన నాయకులు, సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం, కరచాలనం చేయడానికి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దీనికోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. తమ ప్రియమైన నాయకుడితో సెల్ఫీదిగే ఏ అవకాశాన్ని వదులుకోరనే విషయం తెలిసిందే. ఒక్కోసారి అభిమానులు ప్రదర్శించే అత్యుత్సాహం వలన నాయకులు, సెలబ్రిటీలు ఇబ్బందిపడుతుంటారు. ఈ క్రమంలో వీరిపట్ల సెక్యురీటి సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తించిన ఘటనలు కొకొల్లలు. అయితే, దీనికి భిన్నంగా.. కొంత మంది నాయకులు తమ అభిమానుల చిన్నపాటి కోరికలను గమనించి తీర్చటానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో తమిళనాడు.. సీఎం స్టాలీన్ స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమానికి హజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలీన్ను కలవడానికి, ఆయనతో సెల్ఫీ దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈక్రమంలో భద్రత సిబ్బంది అభిమానులందరిని ఒక క్రమపద్ధతిలో సీఎం వద్దకు పంపుతున్నారు. అప్పుడు ఒక ఎరుపు రంగు చొక్క ధరించిన ఒక వ్యక్తి సీఎం స్టాలీన్ను వద్దకు చేరుకున్నాడు. పాపం.. సీఎం తో కరచాలనం కూడా చేశాడు. ఆ తర్వాత.. తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి సీఎంతో సెల్ఫీ దిగటానికి ప్రయత్నించాడు. అప్పుడు వెనుక నుంచి భద్రత సిబ్బంది ముందుకు తోసేశారు. అభిమాని సెల్ఫీ ప్రయత్నాన్ని గమనించిన సీఎం స్టాలీన్.. అతడిని చేయిపట్టుకుని తనవైపులాగి సెల్ఫీ సరదా తీర్చారు. దీంతో అతను ఆనందంతో ఉబ్బితబ్బైపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘అభిమాని మనస్సు గెలుచుకున్నారు..’, ‘సీఎం .. అన్ని గమనిస్తూ ఉంటారు..’, ‘ మొత్తానికి యువకుడి సెల్ఫీ సరదా తీరింది’, అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఇంజినీరింగ్ చేస్తే సైబర్ సెంటర్లో పనిచేయాలి.. ఆవేదనతో విద్యార్థి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రస్తుత విద్యా వ్యవస్థ నచ్చక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. అరసీకెరె తాలూకా గండసి గ్రామానికి చెందిన హేమంత్‌గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డ ఇంజినీరింగ్ విద్యా ర్థి. హేమంత్ హాసన్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మంగళవారం సెల్ఫీ వీడియో విడుదల చేసిన హేమంత్ నేటి విద్యా వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. 20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదన్నాడు. తన తండ్రి ఉపాధ్యాయుడని, ఆయన వద్ద చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థానాలను అలంకరించారన్నారు. ఇప్పుడు ఇంజినీరింగ్ చేస్తే సైబర్ సెంటర్లో పనిచేయాలని అసంతృప్తి వ్యక్తం చేసాడు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కోరాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆదిచుంచనగిరి స్వామి రావాలని, తన అవయవాలు దానం చేయాలని వీడియోలో కోరాడు. చదవండి: Tamilnadu Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం -
పోలీసుల అదుపులో ప్రియాంక, సెల్ఫీల సందడి, వైరల్ వీడియో
లక్నో: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు.పోలీసు కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆగ్రా వెళుతుండగా బుధవారం లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లక్నో పోలీస్ లైన్స్‌కు తరలించారు. ప్రియాంకను అడ్డుకోవడం ఈ నెలలో ఇది రెండోసారి. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినపుడు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు, యూపీ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రియాంక యూపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడి వెళ్లినా అడ్డుకుంటారా అంటూ అధికారులను ప్రశ్నించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఆమె పర్యటనను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో యోగీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందంటూ ప్రియాంక ట్విటర్లో మండిపడ్డారు. బాధిత కుటుంబం న్యాయం కోరుకుంటోంది.. తాను ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నా. యూపీ ప్రభుత్వం దేనికి భయపడుతోంది? తనను ఎందుకు ఆపుతున్నారు? ఈ రోజు వాల్మీకి జయంతి బుద్ధుడిపై ప్రధాని మోదీ గొప్పగా మాట్లాడుతారు. కానీ దానికి విరుద్ధంగా తనపై దాడి చేశారంటూ ఆమె హిందీలో ట్వీట్ చేశారు. 25 లక్షలు దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ వాల్మీకి కుటుంబంతో తమ నేత మాట్లాడకుండా యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. మరోవైపు ప్రియాంక గాంధీని పోలీస్ లైన్‌కు తరలిస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహిళా పోలీసులు ప్రియాంకతో సెల్ఫీ తీసుకునేందుకు మొహమాట పడుతుండగా, చొరవగా వారితో సెల్ఫీకి ఫోజులివ్వడంతోపాటు, అప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకోవడం విశేషం. #WATCH | Lucknow: Congress' Priyanka Gandhi Vadra & her convoy stopped by Police on their way to Agra. Police say, "You don't have permission, we can't allow you" She was going to meet family of a sanitation worker who was nabbed in connection with a theft&died in Police custody pic.twitter.com/N3s0QAU8n6 — ANI UP (@ANINewsUP) October 20, 2021 -
విషాద గాథ: కాపాడినోడి చేతిలోనే కన్నుమూసింది
Ndakasi Selfie Pose Gorilla No More: ఫేస్బుక్ మీద ఆరోపణల తర్వాత సోషల్ మీడియా మనుషుల మీద మానసికంగా ప్రభావం చూపెడతాయా? లేదా? అనేది ప్రస్తుతం చర్చలో నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ ఘటన ఇంటర్నెట్లో యూజర్లను భావోద్వేగాల్ని ప్రదర్శించేలా చేస్తోంది. కొన్నేళ్ల క్రితం మనిషితో సెల్ఫీకి ఫోజులిచ్చిన ఓ గొరిల్లా.. చివరికి తనను కాపాడిన వ్యక్తి ఒడిలోనే తుదిశ్వాస విడిచి అందరితో కంటతడి పెట్టిస్తోంది. సెల్ఫీ స్టార్ ఎండకశి.. కొండ జాతికి చెందిన గొరిల్లా ఇది (Mountain Gorilla). 2019లో తన తోటి గొరిల్లా ఎన్‌డెజెతో కలిసి పార్క్ రేంజర్ మాథ్యూ షమావూ తీసిన సెల్ఫీకి సీరియస్ ఫోజు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గొరిల్లా వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఎండకశి మీద మీమ్స్, కథనాలు ఎన్నో వచ్చాయి. కొన్ని డాక్యుసిరీస్లలోనూ కనిపించింది. చివరికి పద్నాలుగేళ్ల వయసులో.. దాని చిన్నప్పటి నుంచి సంరక్షిస్తున్న ఆండ్రే బౌమా కౌగిలిలోనే కన్నుమూసింది అది. View this post on Instagram A post shared by Virunga National Park (@virunganationalpark) సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. అనారోగ్య సమస్యలతోనే ఎండకశి చనిపోయినట్లు పార్క్ నిర్వాహకులు తెలిపారు. చిన్నపిల్లలా చూసుకున్నా. కానీ, వీడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అంటూ ఆండ్రే పేరిట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. This picture of two gorillas 🦍 posing for a selfie is one of the best things I’ve seen this week! 😭😭 pic.twitter.com/ftj2k3s1DF — A̶l̶h̶a̶j̶i̶ 𝔻𝕣𝕦𝕟𝕜𝕒𝕣𝕕 (@The_Nifemi) April 19, 2019 కాంగో విరుంగ నేషనల్ పార్క్‌లో సెన్‌వెక్వే సెంటర్లో ఇంతకాలం పెరిగింది ఎండకశి. విశేషం ఏంటంటే.. ఈ సెంటర్లో పెరిగే గొరిల్లాలన్నీ దాదాపు అనాథలే!. విరుంగ నేషనల్ పార్క్‌లో నివసించే గొరిల్లాలను, సాయుధులైన మిలిటెంట్లు కాల్చి చంపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఎండకశి తల్లిని సైతం కాల్చి చంపారు. ఆ టైంలో తల్లి శవం మీద గట్టిగా పడుకున్న నెలల వయసున్న పిల్ల గొరిల్లా(ఎండకశి)ని పార్క్ రేంజర్ ఆండ్రే బౌమా కాపాడి.. ఇంతకాలం ఆలనా పాలనా చూసుకున్నాడు. ఇక ఈ ఘటన తర్వాత కొండ గొరిల్లాలను సంరక్షించేందుకు కాంగో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఇది సత్ఫలితం ఇవ్వగా.. 2007లో 720 కొండ గొరిల్లాల సంఖ్య.. ఇప్పుడు ఆ సంఖ్య 1,063కి చేరిందని తెలుస్తోంది. Sharing again, selfie of the century, a ranger and friends at Virunga National Park in DR Congo. On #WorldRangerDay pic.twitter.com/Kp3BCkCHCS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 31, 2020 చదవండి: ఆకలేస్తుందన్నాడు.. సాయం చేస్తే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు -
ఆర్యన్ ఖాన్‌తో సెల్ఫీపై విమర్శలు.. ‘బీజేపీ హస్తం ఉంది’
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు అతడితోపాటు మరో ఇద్దరికి ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన ఓ ఫోటో తెగ వైరలవ్వడంతో పాటు వివాదాస్పదంగా కూడా మారింది. పోలీసుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్‌తో ఓ వ్యక్తి సెల్ఫీ దిగాడు. సదరు వ్యక్తిని ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా గుర్తించారు. ఇక ఈ ఫోటోపై మహారాష్ట్ర మినిస్టర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు. (చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం, ఎవరీ మున్మున్ ధమేచ) ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ ఈ ఆరోపణలు చేశారు. ఈ సందరన్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం ఆర్యన్ ఖాన్ చేయి పట్టుకుని.. ఎన్సీబీ కార్యాలయానికి తీసుకుని వచ్చి వ్యక్తి ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి. అలానే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మనీశ్ భానుశాలి రెయిడ్ జరిగిన విజువల్స్‌లో కనిపించారు. ఎన్సీబీ అధికారులతో పాటు ఉన్న వీరిద్దరని చూస్తే.. దీనిలో బీజేపీ హస్తం ఉందని అర్థం అవుతుంది. నకిలీ డ్రగ్స్ రాకెట్‌ను పట్టుకుని.. మహారాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది’’ అన్నారు. నవాబ్ మాలిక్ వ్యాఖ్యలను ఎన్సీబీ కొట్టిపారేసింది. ఈ ఇద్దరినీ "స్వతంత్ర సాక్షులు" అని పేర్కొంది. ‘‘నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ కేసుకు సంబంధించిన విచారణ చట్టపరంగా, వృత్తిపరంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోంది" అని ఎన్సీబీ అధికారి జ్ఞానేశ్వర్ సింగ్ అన్నారు. ఆర్యన్ ఖాన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్‌తో పాటు మరో ఆరుగురిని సోమవారం అరెస్టు చేశారు. (చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..?) భానుశాలి పాత్రపై బీజేపీ స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలి. "రాజకీయాలు చేయడానికి అనేక సమస్యలు ఉంటాయి, కానీ మన దేశ భవిష్యత్తు తరాలకు సంబంధించిన డ్రగ్స్ విషయంలో మేము రాజకీయాలు చేయలేం’’ అని బీజేపీ ప్రతినిధి రామ్ కదం స్పష్టం చేశారు క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీపై గత శనివారం రాత్రి దాడులు చేసిన తరువాత, డ్రగ్స్ నిరోధక అధికారులు 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరాస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 33 1.33 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదు. అయితే, అతని వాట్సాప్ చాట్‌లో నేరపూరితమైన విషయాలు ఉన్నట్లు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. చదవండి: మీ టీనేజర్ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..! -
సెల్ఫీ అడిక్షన్ పెరుగుతోందా.. ఈ ఏడు జాగ్రత్తలు అవసరం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 4న సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోటగిరి నాగరాజు (34) మరణం.. జూన్ 6న నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్‌గాం చెరువులో అక్కాచెల్లెళ్లు, సమీప బంధువైన ఎల్మె స్మిత (17), ఎల్మె వైశాలి (14), లహుబందే అంజలి (16) మృతి.. సెప్టెంబర్ 5న వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని లక్నాపూర్ ప్రాజెక్ట్ అలుగు వద్ద వీరరాజు (25), మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దుందుబీవాగు పరిధిలోని చెక్‌డ్యాం వద్ద కుందేళ్ల శివప్రసాద్ (23) అసువులుబాయడం.. ఇదేనెలలో సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలోని మోయతుమ్మెద వాగులో మామ అల్లుళ్లు మ్యాదరి రాజు(27), చెంచల రుషి (11) తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. ఇలా సెల్ఫీలు ‘కిల్ఫీ’లుగా మారుతున్నాయి. విహారయాత్రలను విషాదంతో నింపిన ఈ ఏడాది ఉదంతాలివి. స్టేటస్లు, ప్రొఫైల్ పిక్ తదితరాలకు సెల్ఫీల కోసం ప్రత్యేక సెల్ఫోన్లు, స్టిక్స్‌తో పాటు కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అత్యంత దారుణమైన అంశాలూ దాగి ఉంటున్నాయి. ఈ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రమాదాల బారినపడి అశువులుబాస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు సెల్పీ మరణాలకు లోనుకాగా... వీటిలో రెండు మరణాలు ఇటీవల ఒక్కరోజే జరిగాయి. యువతలో ఈ ధోరణి ఎక్కువ... సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన చాలాకాలం తర్వాత ఈ సెల్ఫీల యుగం ప్రారంభమైంది. ప్రధానంగా ఫ్రంట్ కెమెరా సౌకర్యం ఉన్న సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక, నానాటికీ వాటి రెజుల్యూషన్ పెరగడంతో ఈ క్రేజ్ మొదలైంది. అనేక మంది ప్రముఖులు సైతం బహిరంగంగా సెల్ఫీ తీసుకుంటున్న సందర్భాలు అనేకం. సెల్ఫీ మోజులో ఉంటున్న వారిలో ఎక్కువ మంది యువతే. తామున్న ప్రాంతం, పరిస్థితులు, ప్రభావాలను పట్టించుకోకుండా సెల్ఫీ దిగడానికి ఆరాటపడుతున్నారు. ఈ ధోరణితోనే ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఎక్కువగా సోషల్‌మీడియా కోసమే... సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీలు దిగే అలవాటు మరింత ఎక్కువైంది. ఒకప్పుడు కేవలం తమ, తాము తీసిన ఫొటోలనే వీటిలో పెట్టేవాళ్లు. సెల్ఫీలు తీయడం ఎక్కువైన తరవాత సోషల్ మీడియాల్లో ఎవరి ప్రొఫైల్ పిక్ చూసినా, అప్లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం సెల్ఫీలే కనిపిస్తున్నాయి. దీంతో ఒకరిని చూసి మరొకరు, ఒకరి ప్రొఫైల్స్ చూసి ఇంకొకరు... ఇలా అంతా సెల్ఫీ బాటపడుతున్నారు. ఈ ధోరణి వారితో పాటు ఇతరులకూ ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సెల్ఫీ అడిక్షన్ పెరుగుతోంది... దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో ఉపయోగాలు ఉంటున్నాయి. అదే సమయంలో కొన్ని అనర్థాలు తప్పట్లేదు. అలాంటి వాటిలో సెల్ఫీ అడిక్షన్ ప్రధానమైంది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ 2013లో సెల్ఫీ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా పరిగణించింది. లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటపడుతూ సొంతంగా తీసుకున్న చిత్రాలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసే విధానం నానాటికీ పెరిగిపోతోంది. ఇందులో భాగంగా ఎదుటి వారిని ఆకర్షించే, ఆశ్చర్యపరిచే సెల్ఫీ తీసుకోవడానికి ప్రయతి్నస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వీలున్నంత వరకు గ్రూప్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం, కౌన్సిలింగ్ పొందడం, యువతపై పెద్దల పర్యవేక్షణ ద్వారా ఈ సెల్ఫీ అడెక్షన్ నుంచి బయటపడవచ్చు. – డాక్టర్ అనిత రాయిరాల, ప్రొఫెసర్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సేఫ్టీ కోసం ‘సప్త ప్రశ్నలు’... యూత్‌కు లేటెస్ట్ క్రేజ్‌గా మారిపోయిన ఈ సెల్ఫీ ప్రమాదభరితం కాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి ఉపక్రమించే ప్రతి ఒక్కరూ... దానికి ముందు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలని కోరుతున్నారు. ఎవరి వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు, అవి వర్తించే ప్రాంతాల్లో కొన్ని ఇలా... 1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో అసలు ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా? (మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో) 2. సెల్ఫీ కారణంగా నాకు, నా చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందా? (జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్వేస్, విమానాశ్రయాలు, వాహనాలు నడుపుతూ) 3. సెల్ఫీ తీసుకుంటూ ఎదుటివారు చూస్తున్న వాటికి నేను అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా? (థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు) 4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీస్తున్నామా? (మత సంబంధ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు) 5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా? (జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు) 6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా? (ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమయాత్రలు) 7. నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతరకరం అవుతుందా? (పార్టీలు, రెస్ట్‌రూమ్స్ సమీపంలో, బీచ్‌ల్లో) ఆ రెండు చోట్లా ‘నో సెల్ఫీ’... యువతలో మితిమీరిపోతున్న ఈ సెల్ఫీ ఆసక్తి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ‘నో పార్కింగ్’ప్రాంతాల తరహాలో ‘నో సెల్ఫీ ప్రాంతాలు అమలులోకి వస్తున్నాయి. 2015లో మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన కుంభ్‌మేళాలో సెల్ఫీ ప్రియులతో అనేక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో కుంభమే ళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. వీటి వల్ల జరిగే ప్రమాదాలను నిరోధించడం కోసం ముంబై పోలీసులు ఆ నగరంలోని 29 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. కొన్నాళ్ల క్రితం గోవా అధికార యంత్రాంగం సైతం అక్కడి 23 ప్రాంతాలను ఇలానే ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ సైతం ఏర్పాటు చేసింది. -
నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా!
ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు దిగడం అనేది సాధారణమైపోయింది. ఆ జ్ఙాపకం గుర్తుండిపోవడం కోసం ఇలా సెల్ఫీ తీసుకుంటాం. చాలా సందర్భాల్లో సెల్ఫీలు గుర్తులా మిగిలిపోతే.. కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎత్తైన కొండలు, సముద్రాలు, జలపాతాలు. పాములు.. ఇలా ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ ఇబ్బందులు పడ్డ వారున్నారు. సెల్ఫీ కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లు, ప్రాణాలు కోల్పోయిన వారిని చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ మేకతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన యువతికి ఊహించిన షాక్ తగిలింది. చదవండి: Viral: కుక్కపిల్లతో సీతాకోకచిలుకల చిలిపి ఆట! అయితే ఈ వీడియో ఇప్పడిది కాదు. రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనకు చెందిన పాత వీడియోను ఓ వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో మళ్లీ ట్రెండవుతోంది. ఈ వీడియోలో తాడుతో కట్టేసి ఉన్న ఓ మేక ముందు యువతి సెల్ఫీకి ట్రై చేస్తోంది. ఇంతలో మేక తాడు విదిలించుకోని రావడానికి ప్రయత్నించింది. మేక దగ్గరకు వస్తున్నా.. ఆ యువతి మాత్రం వీడియోలు, సెల్ఫీలు దిగుతూనే ఉంది. ఇంతలో మేకకు ఏమనిపించిందో ఏమో ఒక్కసారిగా వెనక్కి వెళ్లి ముందుకొచ్చి గట్టిగా ఆ యువతి తలను బలంగా కుమ్ముకుమ్మింది. లక్కీగా మేకకు కొమ్ములు లేవు. ఉంటే.. తీవ్రమైన గాయలు అయ్యేవే. చదవండి: ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ మేక గుద్దిన గుద్దుకు ఆమె చేతిలో సెల్‌ఫోన్ ఎగిరి కింద పడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ అమ్మాయి మేకను గమనించాల్సిందని, మేక బలంగా పొడిచింది పాపం అంటూ కామెంట్ చేస్తున్నారు.. ఇంకొందరు ఈ సెల్ఫీ పిచ్చి ఏంటి, మేకతో సెల్ఫీ అంటే అంత ఈజీ కాదు. ఏది ఏమైనప్పటికీ యువతి ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకుంటే బాగుండేది. ఇకనైనా సెల్ఫీలు తీసుకునేటప్పుడు ముందు, వెనక చూసుకొని తీసుకోవాలని కోరుతున్నారు. కావాలంటే ఈ వీడియో మీరూ చూడండి. pic.twitter.com/isNhcFuLU9 — The Darwin Awards (@AwardsDarwin_) September 1, 2021 -
సెల్ఫీ కావాలంటే రూ.100 కట్టాలంటున్న మంత్రి
భోపాల్: తనతో ఎవరైనా సెల్ఫీ తీసుకోవాలంటే ర. 100 కట్టాల్సిందిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకర్ చెప్పారు. ఆయా సొమ్మును పార్టీ పనుల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. శనివారం ఆమె ఖాండ్వా వద్ద మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సెల్ఫీలు తీసుకోవడం వల్ల చాలా సమయం వృథా అవుతోందని, కొన్ని కార్యక్రమాలకు గంటల కొద్దీ ఆలస్యమవుతోందన్నారు. బీజేపీ స్థానిక మండల్ యూనిట్లో రూ. 100 కట్టడం ద్వారా తనతో సెల్ఫీ తీసుకోవచ్చన్నారు. Pay 100 Rs for #selfies with @BJP4India @bjp4mp cabinet minister @UshaThakurMLA @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/4yXYWhUBGm — Anurag Dwary (@Anurag_Dwary) July 18, 2021 -
చిత్తూరు జిల్లాలో విషాదం నింపిన సెల్ఫీ
సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): సరదా కోసం తీసుకున్న సెల్ఫీ మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి తెలుగుగంగ కాలువలో పడిన స్నేహితుడిని కాపాడేందుకు అందులోకి దిగిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం సమీపంలోని ఉబ్బలమడుగు వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ పురుషోత్తమ్‌రెడ్డి కథనం మేరకు.. ఈ నెల 6న చెన్నైకి చెందిన నూతన దంపతులు ప్రియ, లోకేష్ ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రానికి బయలుదేరారు. మార్గంమధ్యలో గుమ్మిడిపూండి వద్ద తన స్నేహితులైన కార్తీక్, బాలాజీ, యువరాజును కూడా వెంట తీసుకెళ్లారు. కోవిడ్ నిబంధనలతో ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రాన్ని మూసివేయడంతో పక్కనే ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువ వద్ద కాసేపు సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఇంతలో యువరాజు సెల్ఫీ తీసుకుంటూ కాలువలోకి జారిపడ్డాడు. దీన్ని గమనించిన స్నేహితులు లోకేష్ (23), కార్తీక్ (17), బాలాజీ (24) కాలువలోకి దూకి యువరాజును కాపాడబోయారు. అయితే ప్రవాహ తాకిడికి ముగ్గురు యువకులు నీటిలో మునిగి కొట్టుకుపోయారు. యువరాజు మాత్రం నీటిప్రవాహాన్ని ఎదురొడ్డి గట్టుకు చేరాడు. యువరాజు, ప్రియ కలిసి కాలువ వెంట కొంతదూరం వరకు యువకుల ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం దక్కలేదు. ముగ్గురు యువకులు ఎలాగైనా బయటపడి తిరిగొస్తారని వేచిచూసిన ప్రియ, యువరాజు ఫలితం లేకపోవడంతో గురువారం రాత్రి వరదయ్యపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టగా సత్యవేడు మండలం రాచపాళెం సమీపంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని లోకేష్, బాలాజీలుగా గుర్తించారు. కార్తీక్ మృతదేహం కోసం తమిళనాడు పూండి కాలువ వరకు గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. -
సెల్ఫీలు దిగితే క్రిమినల్ కేసు.. నోటిఫికేషన్ విడుదల
సెల్ఫీల మోజులో ఆపదలను కొని తెచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. ప్రపంచంలో ప్రతీ ఏటా నమోదు అవుతున్న సెల్ఫీ మరణాల్లో.. మన దేశం వాటా ఎక్కువగానే ఉంటోంది. పైగా వర్షాకాలం సీజన్లో టూరిస్ట్ ప్రాంతాలకు క్యూ కడుతుండడం వల్ల ఇవి మరింత ఎక్కువగా నమోదు అవుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ జిల్లాలో సెల్ఫీలపై పూర్తి నిషేధం విధించారు. సూరత్: గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సాత్పుర లాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆ నోటిఫికేషన్లో అధికారులు హెచ్చరించారు. ఈమేరకు జూన్ 23నే అదనపు కలెక్టర్ పేరిట పబ్లిక్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీటి ప్రవాహాల ప్రాంతాలను సెల్ఫీ బ్యాన్ ఏరియాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వర్షాకాలం కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున.. బట్టలు ఉతకడం, ఈత, స్నానం చేయడం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో 2019లో వాఘై-సాపుతరా హైవేపై సెల్ఫీలను దిగడం నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావిస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడమనే వంకతో.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కరోనా నిషేధాజ్ఞలు ఎత్తివేయడంతో ప్రస్తుతం దంగ్ టూరిస్ట్ ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ నిషేధాజ్ఞలు జారీ కావడం కొసమెరుపు. ఇక ఈ స్ఫూర్తితో తమ దగ్గర ఇలాంటి ఇలాంటి చట్టం తేవాలని కేరళలోని టూరిస్ట్ ప్రాంతాల ఊర్లు కొన్ని డిమాండ్ చేస్తుండడం విశేషం. చదవండి: ఫోన్ చోరీ.. సెల్ఫీలు చూసి వ్యక్తి షాక్! -
మార్స్ పై రోవర్ నిజంగానే సెల్ఫీ తీసుకుందా..!
మామూలుగా సెల్ఫీ తీసుకునేటప్పుడు మనలో చాలా మంది సెల్ఫీ స్టిక్ లేదా మనలో ఎవరైనా పొడుగ్గా ఉన్నవారిని ఉపయోగించి సెల్ఫీను తీసుకుంటాం. మనం సెల్ఫీ తీసుకున్నట్లుగా ఫోటోను చూసి ఇట్టే చెప్పవచ్చును ఆ ఫోటో సెల్ఫీ ...! లేదా ఎవరైనా తీశారా..! గత కొన్ని రోజుల క్రితం మార్స్ ఉపరితలంపై పర్సివర్సెన్స్ రోవర్ తీసుకున్న సెల్ఫీ ఫోటోను ఏప్రిల్ 6 నాసా విడుదల చేసింది. కాగా ఈ ఫోటోపై చాలా మందికి అనుమానాలు రేకెత్తాయి. ఫోటోను ఎవరో తీశారనే సందేహాలు వ్యక్త పరిచారు. కాగా తాజాగా పర్సివర్సెన్స్ తీసుకున్న సెల్ఫీ ఫోటోపై నాసా వివరణ ఇచ్చింది. నాసా వివరణ: అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టడానికి ‘పర్సవరెన్స్’రోవర్‌ను నాసా పంపిన విషయం తెలిసిందే. పర్సవరెన్స్ రోవర్ ప్రాజెక్టులో భాగంగా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను కూడా పంపారు. మార్స్ఉపరితలంపై పర్సీవరెన్స్ రోవర్‌తో కలిసి హెలికాప్టర్ ఇన్‌జెన్యూటీని ఏప్రిల్ 6న సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీను తీసుకోవడానికి వాట్సాన్ అనే కెమెరానుపయోగించింది. పర్సివరెన్స్ రోవర్‌కు అమర్చిన రోబోటిక్ ఆర్మ్‌తో వాట్సాన్ కెమెరాను ఉపయోగించి సెల్ఫీ తీసింది. కెమెరాతో తీసిన సుమారు 62 వ్యక్తిగత చిత్రాలను జోడించి పర్సివరెన్స్, ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ల పూర్తి సెల్ఫీ చిత్రాన్ని విడుదల చేసింది. కాగా చిత్రాల జోడింపునకు సంబంధించిన వీడియోను నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ విడుదల చేసింది. వ్యక్తిగతంగా తీసుకున్న చిత్రాలను కలిపి పూర్తి చిత్రాన్ని విడుదల చేశామని నాసా పేర్కొంది. చదవండి: నాసా సాధించిన మరో ఘన విజయం..మార్స్‌పై తొలిసారిగా.. -
సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్
సెలబ్రిటీలు అన్నాక సెల్ఫీలు అడగడం కామన్. ముఖ్యంగా సిని పరిశ్రమకు చెందిన ప్రముఖులు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు జనాలు. వాళ్లు కూడా సాధ్యమైనంత వరకు అభిమానుల కోరిక మేరకు సెల్ఫీలు ఇచ్చి వెళ్లిపోతారు. కానీ ఓ నటుడు మాత్రం తనను సెల్ఫీ అడిగిన ఓ మహిళతో పుషప్లో చేయించాడు. ఆయన చేసింది మంచి పనే అయినా.. ఇప్పుడు ట్రోలింగ్కి గురయ్యాడు. ఆ వివరాలేంటో చూద్దాం. ఇండియన్ టాప్ మోడల్, నటుడు మిలింద్ సోమన్ గురించి అందరికి తెలిసిందే. 80, 90 దశకాల్లో టాప్ మోడల్ ఆయన. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. 53 ఏళ్ల మిలింద్.. మూడేళ్ల క్రితం తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తరచుగా తన సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యం సూత్రాలు పంచుతూ ఫిట్నెస్ను ప్రోత్సహిస్తారు. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ఫిట్నెస్ చిట్కాలు పంచుకుంటూ ఉంటాడు కూడా. ఆయన ఇటీవల ఒక పాత వీడియో తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ వీడియోలో సెల్ఫీ అడిగిన మహిళను 10 పుషప్‌లు చేయమని అడగడంతో ఆమె వెంటనే పుషప్‌లు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మిలింద్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని ఓ ప్లేస్ లో సెల్ఫీ అడిగిన ఆమెను ఇలా చేయించానని చెప్పుకొచ్చాడు. తర్వాత సోమన్ ఆ మహిళతో సెల్ఫీ దిగారు. అయితే ఆ మహిళ చీర ధరించి, అది కూడా రోడ్డు మీద పుషప్ లు చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ‘ఫిట్నెస్ కోసం పుష్-అప్లు చేయడం ఖచ్చితంగా మంచిదే, కానీ మీరు మీతో సెల్ఫీ తీసుకోవటానికి ఇలా ఒక స్త్రీని రోడ్డు మీద పుష్-అప్లు చేయించడం బాలేదు’అని ఒక నెటిజన్, ఢ‘శారీరక వ్యాయామం చేయాలనే మీ ఉద్దేశం చాలా గొప్పది అయితే, ముందస్తు అనుభవం లేకుండా ఈ వయసులో పుష్-అప్స్ చేయమని అకస్మాత్తుగా చెప్పడం సరికాదు’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) -
Tamil Nadu: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి
వేలూరు: వానియంబాడి సమీపంలో బాలుడు ట్రాక్టర్‌పై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ట్రాక్టర్‌తో పాటు బాలుడు బావిలో పడి మృతిచెందాడు. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని చిన్నమోటూరుకు చెందిన సౌందర్‌రాజన్ తన ట్రాక్టర్‌ను తీసుకుని అదే గ్రామానికి రాజంద్రన్ పొలంలో దున్నేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లాడు. క్రిష్ణన్ కుమారుడు సంజీవి(16) ట్రాక్టర్ నడుపుతూ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌తో పాటు సంజీవి కూడా సమీపంలోని 60 అడుగుల లోతు ఉన్న బావిలో పడ్డాడు. గ్రామస్తుల సమాచారంతో వానియంబాడి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగు వ్యవ సాయ మోటార్లను అమర్చి నీటిని బయటకు తోడి క్రేన్ సాయంతో ట్రాక్టర్‌ను, బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అంబలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముగ్గురి ప్రాణాల్ని బలిగొన్న కరోనా భయం -
షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి
టెక్నాలజీ పెరిగాక ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఫోటోల విషయంలో. సోషల్ మీడియాలో మహిళల ఫోటో కనిపిస్తే చాలు.. మృగాళ్లు వాటితో ఆడవారిని ఓ రేంజ్లో టార్చర్ చేస్తారు. అందుకే సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే ఓ మహిళ తెలిసిన వాడే కదా అని.. ఓ వ్యక్తి అడగటంతో అతడికి తన సెల్ఫీ పంపంది. దాన్ని అతడు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో చూసి సదరు మహిళ తీవ్రంగా షాక్ అయ్యింది. ఎందుకంటే ఎంతో అందంగా ఉన్న తనను సదరు వ్యక్తి చాలా అందవిహీనంగా మార్చి.. ఆ ఫోటోని పబ్లిష్ చేశాడు. ఈ క్రమంలో సదరు మహిళ ఆమె పంపిన ఫోటో.. అతడు మార్ఫ్ చేసిన ఫోటోలను వీడియోలో షేర్ చేసింది. ప్రసుత్తం అది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు... టిక్‌టాక్ యూజర్ అయిన సదరు మహిళ చూడ్డానికి చాలా అందంగా, స్టైల్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె హెయిర్ డ్రస్సర్ ఒక రోజు ఆమెకు కాల్ చేసి.. సదరు మహిళ సెల్ఫీ ఫోటో ఒకటి అతడికి సెండ్ చేయమని కోరాడు. తెలిసిన వాడే కావడంతో ఆమె తన సెల్ఫీని అతడికి పంపింది. ఆ తర్వాత అతడు ఆమె ఫోటోని ఎడిట్ చేసి తన సోషల్ మీడియా పేజ్‌లో అప్లోడ్ చేశాడు. ఈ ఫోటో చూసి ఆ మహిళ షాక్‌కు గురయ్యింది. ఏంటి నేను ఇలా ఉంటానా అనుకోని భయపడింది. ఎందుకంటే సదరు హెయిర్ డ్రెస్సర్ ఎంతో అందంగా ఉన్న మహిళ ఫేస్‌ను దారుణంగా ఎడిట్ చేశాడు. స్కిన్ కలర్ నల్లగా.. ముఖం కూడా ఉబ్బిపోయినట్లుగా మార్చాడు. ఈ క్రమంలో సదరు మహిళ రెండు ఫోటోలను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇప్పటికే 1.2మిలియన్లకు పైగా జనాలు దీన్ని వీక్షించారు. ఇక వీడియో చూసిన వారంతా ‘‘నీ హెయిర్ డ్రెస్సర్‌కి ఏమైనా పిచ్చా ఏంటి.. అందంగా ఉన్న నిన్ను ఇలా మార్చాడు’’.. ‘‘సహాజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. అతడు చేసిన పని ఏమాత్రం బాగాలేదు.. నువ్వు మరో హెయిర్ డ్రెస్సర్‌ని చూసుకో’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఇకపై ఇలాంటివి పోస్ట్.. షేర్ చేసినా నేరమే -
సెల్ఫీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన సీనియర్ నటి
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ముక్కిసూటి మనిషి. ఆమె మాటలు, చేష్టలు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. చూసేవారు ఏం అనుకుంటారో అని ఆలోచించరు. ఇలాంటి ప్రవర్తనతో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు జయా బచ్చన్. తన అనుమతి లేకుండా సెల్ఫీ తీయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి పట్ల జయా బచ్చన్ కఠినంగా ప్రవరించారు. ఆ వ్యక్తిని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పొగరుగా ప్రవర్తించడం సరికాదు అంటున్నారు. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జయా బచ్చన్ టీఎంసీకి మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జయా బచ్చన్ టీఎంసీ అధినేత్రి మమతకు మద్దతుగా కోల్‌కతాలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. వారందరికి చేతులు ఊపుతూ అభివాదం చేశారు జయా బచ్చన్. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమె సమీపంలోకి వెళ్లి సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన జయా బచ్చన్.. అతడిని పక్కకు తోసి ర్యాలీని కొనసాగించారు. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తుండటంతో ఆగ్రహానికి గురైన జయా అతడిని నెట్టేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరీ ఇంత కోపంగా, కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఫోటోలు తీయోద్దు అని చెప్తే సరిపోయేది కదా అంటున్నారు నెటిజనులు. చదవండి: జయ బచ్చన్ వల్లే బాలీవుడ్లో ఎన్నో మార్పులు, చరిత్ర చేర్పులు -
మహిళకు మరిచిపోలేని షాకిచ్చిన ఒంటె
-
వైరల్: ఆహారం అనుకుందో.. కోపమొచ్చిందో
జంతువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచిగా ఉంటే ఓకే.. కానీ అతి చేసి వాటికి చిరాకు తెప్పిస్తే.. మనకు మూడుతుంది. జన్మలో మర్చిపోలేని పాఠం చెప్తాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తనతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన మహిళకు దిమ్మ తిరిగే షాకిచ్చింది ఒంటె. టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ యువతి ఒంటెతో సెల్ఫీ దిగేందుకు దాని దగ్గరకు వెళ్తుంది. ఫోటో తీసుకుంటుండగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇలా ఫోటోలు తీయడం ఆ ఒంటెకు నచ్చలేదో.. లేక బాగా ఆకలిగా ఉందో ఏమో తెలియదో కానీ సదరు యువతి జుట్టును కొంచెం కొరుక్కుని తినడం ప్రారంభించింది ఒంటె. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: తృటిలో తప్పించుకున్న శ్రియ.. లేదంటే! -
సీటు బెల్ట్ ధరించండి.. బహుమతులు గెల్చుకోండి!
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ రూల్స్‌పై వాహనదారులకు అవగాహన పెంచాలన్న లక్ష్యంతో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్(ఐఎఫ్ఏటీ) సంస్థ ‘సెల్ఫీ విత్ సీట్ బెల్ట్’ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. సీటు బెల్ట్ ధరించినప్పుడు సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే బహుమతులు అందిస్తోంది. కారు డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించి, ఫొటో దిగి హ్యాష్‌ట్యాగ్‌తో ‘సెల్ఫీ విత్ సీట్ బెల్ట్’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ‘ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్’ (ఐఎఫ్ఏటీ) బహుమతితో పాటు 5 లీటర్ల డీజిల్‌ను అందిస్తోంది. భద్రత కోసమే ప్రచారం.. ప్రమాద సమయంలో ప్రాణాలను రక్షించగల సీట్ బెల్ట్ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని, వాహనదారులు తప్పకుండా సీటు బెల్టు ధరించాలని 2016 నుంచి ఐఎఫ్ఏటీ ప్రచారాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు సీటు బెల్టు తప్పకుండా ధరించేలా ప్రోత్సహిస్తోంది. సురక్షితం ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎయిర్ బ్యాగ్ విచ్చుకోవటం అనేది సీట్ బెల్ట్‌తో లింక్ అయి ఉంటుంది. ప్రమాద సమయంలో ఇది విచ్చుకున్నప్పుడు సీట్ బెల్టు ఆటోమేటిక్‌గా టైట్ అవుతుంది. చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో సీట్ బెల్ట్ ధరించకపోవటం వల్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. సీటు బెల్ట్ విషయంలో వాహన చోదకులు చూపుతున్న చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను హరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తేలికపాటి వాహనాలకు జరుగుతున్న ప్రతి మూడు ప్రమాదాల్లో రెండు సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆదర్శంగా.... ‘సెల్ఫీ విత్ సీట్ బెల్ట్’ ఛాలెంజ్ హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని వివిధ నగరాల్లో సైతం ట్రెండింగ్‌గా మారినట్లు ఐఎఫ్ఏటీ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ తెలిపారు. నగరంలోని వందలాది మంది క్యాబ్ డ్రైవర్లు, ప్రయాణికులు ఇలా ఫొటోలు దిగి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి బహుమతులు అందుకునట్లు తెలిపారు. -
పరీక్షలు రాయకుండానే పోయావా నాన్నా!
పిఠాపురం(తూర్పుగోదావరి): స్థానిక వై.జంక్షన్ సమీపంలో గొల్లప్రోలు టోల్‌గేటు వద్ద గొర్రిఖండి కాలువ వద్దకు ఆదివారం సరదాగా ఫొటోలు తీసుకుందామని వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం మార్కెట్ వీధికి చెందిన నాంపల్లి నగేష్, కత్తులగూడెంకు చెందిన కూరాకుల భాను, తమ్మనబోయిన వెంకటసాయి, శిస్టి కరణాల వీధికి చెందిన కొండమహంతి వాసు (16), వేణుం తేజ (16) చిన్ననాటి స్నేహితులు. అందరూ ఒకే స్కూలులో ఒకటో తరగతి నుంచి చదువుకున్నారు. ప్రస్తుతం స్థానిక ప్రైయివేటు స్కూలులో పదవ తరగతి చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఐదుగురు కలిసి పిఠాపురం వై.జంక్షన్ వద్ద ఉన్న తోటలోకి వెళ్లారు. అక్కడే ఉన్న గొర్రిఖండి కాలువ వద్ద కాసేపు సరదాగా తిరిగి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. గొర్రిఖండి కాలువ వడి ఎక్కువగా ఉండడంతో భయపడిన స్నేహితులు అందరూ ఇక ఇంటికి వెళ్లిపోదాం అనుకుని బయలుదేరగా వేణుం తేజ చేయి కడుక్కుని వస్తానని చెప్పి కాలువలోకి దిగాడు. చేయి కడుగుతుండగా కాలు జారి కాలువలోకి పడిపోవడంతో అతనిని రక్షించడానికి మిగిలిన స్నేహితులు ప్రయత్నించారు. కొండమహంతి వాసు తనకు ఈత వచ్చని చెప్పి కాలువలోకి దూకి స్నేహితుడిని రక్షించే ప్రయత్నం చేశారు. ఇద్దరూ గల్లంతయ్యారు. గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అగి్నమాపక సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పదవ తరగతి ఫస్టు క్లాసులో పాసవుతానని చెబుతూ ఎప్పుడు చదువుకుంటూ ఉండే కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోతాడని కలలో కూడా అనుకోలేదని మృతుడు తేజ తల్లిదండ్రులు జ్యోతి, శ్రీను గుండెలవిసేలా రోదించారు. పరీక్షలు రాయకుండానే పోయావా నాన్నా అంటూ వారు విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు అందివస్తున్నాడనుకుంటే అందని లోకాలకు వెళ్లి పోయాడని, ఇక తాము ఎవరి కోసం బతకాలని వాసు తల్లిదండ్రులు నాగలక్ష్మి చినబాబు ఏడుస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే తేజ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను అండగా ఉంటామని తెలిపారు. మృత్యుకూపంగా గొర్రిఖండి కాలువ పిఠాపురం వై.జంక్షన్ వద్ద ఉన్న గొర్రిఖండి కాలువ మృత్యుకూపంగా మారింది. ఇప్పటి వరకు కాలువలో పడి పలువురు మృతిచెందారు. ఇక్కడ కాలువ పది అడుగులకు పైగా లోతుగా వడితో ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో పాటు గట్లు నాచుకట్టి ఉండడంతో కాలువలోకి జారిపడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చదవండి: ఆర్మీ అధికారి భార్య, కూతురు ఆత్మహత్య విషాదం: 20 అడుగుల ఎత్తుకు ఎగిరి.. -
సెల్ఫీ కోసం బిత్తిరి పని, పోలీసుల ఎంట్రీతో..
భోపాల్: సెల్ఫీ తీసుకోవటం అంటే ఇష్టంలేని వాళ్లు ఉండరు. సెల్ఫీ ఫోటోల కోసం యువత ఎన్ని సహసాలకైనా సిద్ధమవుతోంది. కొంతమంది సెల్ఫీ ఫోటోల దిగే క్రమంలో ప్రాణాలను సైతం కోల్పోయిన సంఘటనలు చూశాం. తాము అందరి కంటే భిన్నంగా సెల్ఫీ ఫోటోలు దిగాలనే మోజులో మరికొంత మంది యువతీ, యువకులు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. అలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లం జిల్లా సుఖేదా గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువతి తన స్నేహితుల వాట్సాప్ గ్రూప్‌లో విభిన్నమైన సెల్పీ ఫోటోలను పంపి తన స్నేహితులను ఆశ్చర్యపరచాలని భావించింది. అందుకోసం ఏకంగా ఓ బావిగట్టు మీదకి ఎక్కి పలు రకాల సెల్ఫీ పోజులు ఇస్తూ ఫోటోలు దిగింది. అలా ఫోటోలు తీసుకుంటున్న సమయంలో అదుపు తప్పి ఆ యువతి ఒక్కసారిగా బావిలోకి జారీ పడిపోయింది. ఆ యువతి అరుపులతో సమీపంలోని ఓ యువకుడు ఆమెను పైకి తీసుకురావడానికి బావిలోకి దిగాడు. కానీ, వారిద్దరికీ బావి నుంచి పైకి రావటం ఎలాగో తెలియలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తాళ్లతో వారిద్దరినీ సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సెల్ఫీ కోసం ఏంటి ఆ పని’, సెల్ఫీ ఫోటో కోసం నువ్వు చేసిన సాహసం నీ స్నేహితులకు తెలిస్తే నవ్వుతారు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అమ్మాయిల వాట్సాప్ గ్రూపు.. అతడేం చేశాడంటే.. -
మాస్క్ తీసి ఫొటో దిగు నాయనా..
గంభీరావుపేట (సిరిసిల్ల): ఇష్టమైన నాయకులు, సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు.. ప్రతీ ఒక్కరు సెల్ఫీ దిగుతుంటారు. అలాగే, చంద్రకళ అనే వృద్ధురాలు కూడా మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీ దిగాలనుకుంది. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్‌కు ఆ బామ్మ ఎదురు వచ్చింది. ‘ఏం కావాలమ్మా?’అని కేటీఆర్ అడగగా.. ‘నీతో సెల్ఫీ దిగాలని వచ్చిన బిడ్డా..’అని బదులిచ్చింది. దీంతో కేటీఆర్ ఆమెతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే, కేటీఆర్ మాస్కు ధరించి ఉండటంతో ‘మాస్కు తీసి ఫొటో దిగు నాయనా..’అని అడిగింది. ఆమె కోరిక మేరకు కేటీఆర్ మాస్కు తీసి ఫొటో దిగారు. (చదవండి: కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అంతా గప్‌చుప్!) (పాత వేపచెట్టు : భారీ జరిమానా) -
పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే..
సాక్షి, చిత్తూరు : ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్లు సెల్ఫీ దిగితే ఓటును రద్దు చేస్తారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం ఫ్యాషన్ అయిపోయింది. ఇదే అలవాటు తో పొరపాటుగా మంగళవారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు సెల్ఫీ దిగితే, ఆ వ్యక్తి వేసిన ఓటు చెల్లకుండా పోతుంది. ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 49 (ఎం) ప్రకారం ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయకూడదు. దీన్ని అతిక్రమించి ఓటు వేస్తూ సెల్ఫీ దిగి, ఇతరులకు షేర్ చేస్తే ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 17 (ఏ) ప్రకారం ఆ ఓటును రద్దు చేస్తారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్ -
అనుష్క సెల్ఫీ: ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల వివాహం 2017లో డిసెంబర్ 11న జరిగింది. మూడేళ్ల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది జనవరి 11న పండంటి పాప పుట్టింది. అప్పటి నుంచి కూతురికి సంబంధించిన ఏ విషయాన్ని అభిమానులతో పంచుకోని ఈ దంపతులు ఫిబ్రవరి 2న తొలిసారి వారి గారాల పట్టి ఫొటోను షేర్ చేశారు. ప్రసవం తర్వాత తొలిసారిగా అనుష్క అద్దం ముందు నిల్చుని దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పాపను ఎత్తుకునేందుకు ఉపయోగించే వస్త్రాన్ని భుజాన వేసుకున్న అనుష్క ఇప్పుడదే తన ఫేవరెట్ అని రాసుకొచ్చింది. ఈ ఫొటో చూసిన అభిమానులు ఒకింత నిర్ఘాతపోయారు. ప్రసవం తర్వాత కూడా ఇంత ఫిట్‌గా కనిపించడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విరుష్క దంపతులు వారి ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరాలు కలిసేలా తమ గారాలపట్టికి వామిక అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. వామిక అంటే కనకదుర్గ అని అర్థం. న్యూమరాలజీ ప్రకారం పాపాయి వామికా లక్కీ నెంబర్ 3. కాగా విరుష్క అభిమానులు వామిక ముఖారవిందాన్ని ఎప్పుడు చూపిస్తారోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) చదవండి: ఒకే రోజు తల్లులైన అనుష్క, బబి తొలిసారి కూతురి ఫొటో షేర్ చేసిన ‘విరుష్క’ -
జాగ్రత్త.. పావురాలతో సెల్ఫీలొద్దు!
సాక్షి, హైదరాబాద్: నగరం లక్షల పావురాలకు ఆవాసం. రోజూ కొన్ని వేల మంది వీటికి తిండి గింజలు వేస్తుంటారు. 500 ప్రాంతాల్లో ప్రత్యేకంగా తిండి గింజలు వేసే కేంద్రాలున్నాయి. చాలా మందికి ఇలా తిండి గింజలు వేసి.. వాటితో సెల్ఫీ దిగడం అలవాటు. కొద్ది రోజుల వరకు ఈ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో పక్షి ప్రేమికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వారు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించనప్పటికీ ఆ వ్యాధి ఉన్న ప్రాంతం నుంచి వచ్చే పక్షుల వల్ల వైరస్ ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉన్నందున మరో రెండు నెలల పాటు జనం జాగ్రత్తతో ఉండాలని చెబుతున్నారు. పావురాల గుంపులోకి వెళ్లొద్దు.. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వృద్ధి చెందుతున్న పావురాలతో సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. హైదరాబాద్ సహా సమీప ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో పావురాలున్నాయి. వలస పక్షుల ద్వారా ఈ పావురాలకు బర్డ్‌ఫ్లూ సోకి.. వేగంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెపుతున్నారు. పావురాలకు నిత్యం తిండి గింజలు వేయడం చాలా మందికి అలవాటు. ఇది మంచిదే అయినా.. కొందరు పావురాల గుంపుల్లోకి వెళ్లి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఆ సమయంలో పావురాలు ఒక్కసారిగా ఎగిరితే వాటి రెక్కల నుంచి పెద్దమొత్తంలో దుమ్ము కణాలు గాలిలో కలుస్తుంటాయి. ఒకవేళ బర్డ్‌ఫ్లూ సోకిన పావురాలు వాటిల్లో ఉంటే ఆ దుమ్ము ద్వారా వైరస్ మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిత్యం ఫిర్యాదులు.. ప్రస్తుతం ఎక్కడైనా పక్షి చనిపోతే ప్రజలు బర్డ్ ఫ్లూ అనుమానంతో భయపడుతున్నారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పశుసంవర్థక శాఖ అధికారులకు, జీహెచ్ఎంసీకి, పక్షుల స్వచ్ఛంద సంస్థలకు ఫిర్యాదులు వస్తున్నాయి. తమ ఇంటి సమీపంలో చెట్టుపై నుంచి పక్షి పడి చనిపోయిందని, దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటూ మాకు నిత్యం పది వరకు ఫోన్లు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కడా బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదు. - సంజీవ్ వర్మ, యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ అప్రమత్తత అవసరం.. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదు. హైదరాబాద్‌లో పావురాలు పది లక్షలకు చేరువవుతున్నాయి. ఈ విషయంలోనే జనంలో అప్రమత్తత అవసరం. పావురాల గుంపులకు చేరువగా వెళ్లొద్దు. పక్షులు ఎక్కువగా వాలే చెట్ల కింద అధిక సమయం ఉండకపోవడం మంచిది. వాటి రెట్టలు కూడా వైరస్‌ను ప్రబలేలా చేస్తాయి. - వాసుదేవరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, పక్షి విభాగం అధిపతి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా, రెండు బోగీలు దగ్ధం
సాక్షి, పర్లాకిమిడి(ఒరిస్సా) : సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. స్థానిక రైల్వేస్టేషన్లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆగి ఉన్న పాసింజర్ రైలులోని 2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా పర్లాకిమిడి నుంచి రైళ్లు తిరగడం లేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం పాసింజర్ రైలును స్థానిక స్టేషన్లో నిలుపుదల చేశారు. బోగీలు, ఇంజిన్ వేరుచేసి, పర్లాకిమిడి నుంచి గుణుపురం వరకు ఎలక్ట్రికల్ లైన్‌ను సరి చేస్తున్నారు. చదవండి: నా చావుని త్వరగా మర్చిపోయి.. పెళ్లి చేసుకో అయితే అటుగా వచ్చిన పర్లాకిమిడిలోని గౌరచంద్ర వీధికి చెందిన సూర్యకుమార్ ఎలక్ట్రిక్ ట్రైను బోగి ఎక్కి, సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ లైన్‌ను పట్టుకున్నాడు. బోగీలుపై కప్పి ఉన్న గోనె సంచులు తగులుకుని మంటలు చెలరేగి, బోగీలకు వ్యాపించాయి. దీంతో బాలుడు కూడా మంటల్లో చిక్కి, కాలిపోయాడు. అగి్నమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన జీఆర్పీ పోలీసులు.. మృతదేహాన్ని కిందికి దించారు. -
ఆహా.. అల్లం చాయ్.. ఇంకేం కావాలి: కవిత
సాక్షి, హైదరాబాద్: ఉదయం ఓ కప్పు టీ కడుపున పడితేనే రోజు ప్రారంభం అవుతోంది. సామాన్యుడి నుంచి ధనికుడిని సైతం ఉదయం లేవగానే ఆహ్లదపరిచే టీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి చాయ్‌కి గుర్తింపుగా డిసెంబర్ 15న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపకుంటున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీ తాగుతున్న సెల్ఫీ ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘తీరిక లేకుండా పనితో అలసిపోయినప్పుడు మధ్యలో ఒక కప్పు వేడి వేడి అల్లం టీ తాగితే వచ్చే మజా కంటే మరింకేం ఉండదు. నేడు ఇంటర్నేషన్ టీ డే. ఈ సందర్భంగా అల్లం చాయ్ తాగుతున్న నా సెల్ఫీని మీతో పంచుకుంటున్న. అలాగే నా ఫాలోవర్స్ కూడా టీ తాగుతున్న మీ సెల్ఫీని నాతో పంచుకోండి’ అంటూ కవిత ట్వీట్ చేశారు. కవిత పిలుపు మేరకు ఆమె ట్విటర్ ఫాలోవర్స్ అంతా టీ తాగుతున్న సెల్ఫీ ఫొటోలను ఆమెతో షేర్ చేసుకుంటున్నారు. Nothing feels better than a piping hot cup of Ginger Tea or what we fondly call Allam Chai in the middle of a super hectic day! Here, I share my selfie with my cup of tea, would absolutely enjoy looking at your selfie with a cup of tea too! #InternationalTeaDay pic.twitter.com/fquxMyt0zK — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2020 -
ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
సాక్షి, నిజాంసాగర్ (జుక్కల్) : దీపావళి నాడు సరదా కోసం నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు సెల్ఫీ మోజులోపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ మన్నన్, పిట్ల ప్రశాంత్, సయ్యద్ సుమేర్, చెగుళ్ల బాలరాజు, కటికె శివ స్నేహితులు. శనివారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన వీరు నీటి మడుగుల వద్ద బండరాళ్లపైకి వెళ్లారు. ప్రాజెక్టు వరద గేట్ల నుంచి దిగువకు నీరు జాలు వారుతుండటంతో మడుగుల్లో సెల్ఫీలు దిగుతూ స్నానాలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మడుగుల లోతు అధికంగా ఉండటంతో శివ, సయ్యద్ సుమేర్ ఈతరాక నీటమునిగి పోయారు. అనంతరం పోలీ సులు గజ ఈతగాళ్లతో గాలించగా ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. విహారయాత్రకు వచ్చి... ఎడపల్లి(బోధన్): సెల్ఫీమోజు ముగ్గురు బాలికల ప్రాణాలను బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ ఉద్యానవనంలోని చెరువులో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బోధన్ రాకాసిపేటకు చెందిన జుబేరా (10) ఇంటికి నిజామాబాద్ నుంచి మీరజ్ బేగం(16), హైదరాబాద్ నుంచి బషీరా బేగం (16) తమ కుటుంబసభ్యులతో వచ్చారు. ముగ్గురి కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది అలీసాగర్ ఉద్యానవనానికి విహార యాత్రకు వెళ్లారు. అబ్దుల్‌తో పాటు ఈ ముగ్గురు పిల్లలు స్నానాలు చేయడానికి చెరువులోకి దిగారు. ఈ క్రమంలో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు లోతైన ప్రదేశంలోకి జారిపోయి నీట మునిగారు. వీరిని గమనించిన కుటుంబ సభ్యులు సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బోటింగ్ పాయింట్ సభ్యుడు నగేష్ , చెరువులో చేపలుపడుతున్న జాలరి గంగాధర్ నీట మునుగుతున్న యువకుణ్ణి రక్షించగలిగారు. అప్పటికే బాలికలు నీట మునిగి మృతి చెందారు. పుట్టినరోజు వేడుకల్లో విషాదం వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం మరికాల గ్రామ సమీపంలోని గోదావరిలో మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. వెంకటాపురం మండల పరిధి రంగరాజాపురం కాలనీకి చెందిన శశికుమార్ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి శనివారం గ్రామానికి చెందిన 21 మంది యువకులు పాతమరికాల గ్రామ సమీపంలోని గోదావరి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 16 మంది సరదాగా నదిలోకి ðదిగారు. కొంతసేపటికి ప్రవాహం పెరగడంతో తుమ్మ కార్తీక్ (21), సంఖ్యా శ్రీకాంత్ (22), రాయవరపు ప్రకాశ్ (22), కోడిరెక్కల అన్వేశ్ (21) నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన మిగతా మిత్రులు ఒడ్డుకు వచ్చారు. సాయంకోసం అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టు పక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చసరికే ఆ నలుగురు పూర్తిగా మునిగిపోయారు. అనంతరం గజ ఈతగాళ్లతో గాలించగా.. శనివారం రాత్రి రెండు, ఆదివారం ఉదయం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చెక్‌డ్యాంలో పడి ఇద్దరి మృతి న్యాల్కల్(జహీరాబాద్) : ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని రేజింతల్‌లో శనివారం చోటు చేసుకుంది. ఈనెల 13న గ్రామానికి చెందిన ఫకీర్ ఇస్మాయిల్ కుమారుడు సాజిద్, నాగేందర్ కుమారుడు రాకేష్ మేకలు మేపడానికి వెళ్లారు. రాత్రి వరకు ఇద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. కానీ మేకలు మాత్రం ఇంటికి వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. కాగా 14వ తేదీ ఉదయం గ్రామ శివారులోని చెక్‌డ్యాంలో సాజిద్ (14) మృతదేహం కనిపించింది. చెక్‌డ్యాంలో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల రాకేశ్ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు ఆదివారం ఉదయం రాకేష్ (18) మృతదేహం లభించింది. -
సెల్ఫీ మోజులో ముగ్గురు యువతుల మృతి
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి మండలం అలీసాగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు అలీసాగర్ రిజర్వాయర్‌లో పడి ముగ్గురు యువతులు మృతి చెందారు. సెల్ఫి దిగుతూ ఒకరి వెంట మరొకరు నీళ్ళల్లో పడిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీళ్ళల్లో పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానాకుల ద్వారా తెలుస్తోంది. మృతులు బోధన్ పట్టణం రాకాసిపేట్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బోధన్‌లోని ఓ వార్డు కౌన్సిలర్ అన్నయ్య కూతుర్లు జుబెరా (16), మశేరా (14), మీరాజ్ (12)గా తెలిసింది. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా 16 ఏళ్లలోపు వారే కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. ఈ ఘటనలో రాకాసిపేట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గుంటూరు కొల్లిపర మండలం పిడపర్తి పాలెం లో విషాదం చోటుచేసుకుంది. పశువులు కడగడానికి కాలువలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యువకుల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. -
న్యూలుక్లో ఫేస్బుక్ మెసెంజర్
ప్రపంచ సాంకేతిక దిగ్గజం ఫేస్బుక్ మెసెంజర్‌ను కొత్త అవతారంలో తీసుకురానుంది. అంతే కాకుండా దానికి చాట్ థీమ్స్, సెల్ఫీ స్టిక్కర్లు, సరిపడా ప్రతిస్పందనలను ప్రవేశపెట్టనుంది. ‘భవిష్యత్ మెసెజింగ్‌కు అనుగుణంగా మార్పులు ఉంటాయి. ఈ మధ్యే ఇన్ స్టాగ్రామ్ తో మెసెంజర్ అనుసంధానం జరిగింది' అని ఫేస్బుక్ వెల్లడించింది. ఫేస్బుక్ మెసెంజర్ కొత్త లోగో దాని సాంప్రదాయ సాలిడ్ బ్లూ(నీలం) రంగు నుంచి కొద్దిగా మారనుంది. దానికి బదులుగా, ఇది ఇన్స్టాగ్రామ్ లోగో మాదిరిగా నీలం- నుండి- పింక్ ప్రవణతకు రూపుదిద్దుకోనుంది. త్వరలో వినియోగదారులు ఇన్కమింగ్ సెల్ఫీ స్టిక్కర్ల ఫీచర్లను ఉపయోగించగలుగుతారు. అది వారి సెల్ఫీలతో పాటు స్టిక్కర్లను తయారుచేయడానికి వీలు కల్పిస్తుంది. ఫేస్బుక్ కూడా డార్క్ మోడ్ లక్షణాన్ని విడుదల చేస్తుంది, దీని ద్వారా మీరు చాట్ నుండి నిష్క్రమించినప్పుడు లేదా అవి చూసిన తర్వాత సందేశాలు అదృశ్యమవుతాయి. "మా క్రొత్త లోగో భవిష్యత్ మెసెజింగ్ విషయంలో జరగాల్సిన మార్పును ప్రతిబింబిస్తుంది. మీరు సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి మరింత డైనమిక్, ఆహ్లాదకరమైన, సమ్మిళిత మార్గం దిశగా మళ్లనుంది. ఈ మార్పు మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. కేవలం మెసేజులు మాత్రమే పంపుకునే దశ నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్స్‌తో వివిధ యాప్‌లు, పరికరాల ద్వారా హ్యాంగవుట్ అయ్యేందుకు నూతన మార్పులు వీలు కల్పిస్తాయి” అని మెసెంజర్ వైస్ ప్రెసిడెంట్ స్టాన్ చుడ్నోవీస్కీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. గత నెలలోనే ఫేస్బుక్ మెసెంజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌తో అనుసంధానించింది. దీంతో మెసెంజర్ లేదా ఇన్స్టాలలో దేన్నుంచైనా దేనికైనా సందేశాలు పంపుకునే వీలుంది. (చదవండి: యూజర్లకు షాక్.. ఐఫోన్ 12లో అవి మిస్) -
అర్థరాత్రి దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై సెల్ఫీలు
సాక్షి, హైదరాబాద్ : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పోలీసులు ఎంత కట్టడి చేసినా పోకిరీల అరాచకాలు ఆగడం లేదు. బ్రిడ్జీపై ఆగి సెల్ఫీలు దిగితే కేసులు పెడతామని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. పోలీసుసు హెచ్చరికలను భేఖాతరు చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. దుర్గం చెరువు బ్రిడ్జిపై అర్థరాత్రి దుస్తులు విప్పేసీ సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. లైవ్‌లో పోకిరీల ఆగడాలను చూసిన పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసు స్టేషన్‌కి తరలించారు. గతనెల 25న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభమైంది. లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సదర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెనపై వాహనాలు వేగంగా వేళ్తున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ఫోటోలకు ఎగబడుతున్నారు. మరీ ముఖ్యంగా వారంతంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తుండటంతో సెల్పీస్పాట్ ప్రమాదకరంగా మారింది. పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. వీకెండ్స్‌లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు
కౌలలాంపూర్: మలేషియాకు చెందిన జాక్రిడ్జ్ రోడ్జి అనే 20 ఏళ్ల యువకుడు శనివారం ఉదయం లేచే సరికి పక్కన ఫోన్ కనిపించలేదు. ఎక్కడ పెట్టానా? అని ఇల్లంతా వెతికాడు. కానీ దొరకలేదు. పోనీ ఎవరైనా ఎత్తుకెళ్లారా? అంటే ఆ ఆనవాళ్లు కూడా కన్పించలేదు. ఏదో మంత్రమేసినట్టుగా ఇలా మాయమైంటేందబ్బా అని తల గోక్కున్నాడు. ఎలాగైనా ఫోన్‌ను కనిపెట్టాల్సిందేనని అనుకున్నాడు. ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ ఇంటికి దగ్గర్లోని చిట్టడవికి దారి తీశాడు. అతని తండ్రి అదే పనిగా కాల్ చేస్తుండగా, దాని ద్వారా వచ్చే రింగ్ ఆధారంగా అతను చెవులు రిక్కిరించి మరీ ముందుకెళ్లాడు. అలా ఓ తాటి చెట్టు కింద ఫోన్‌ను గుర్తించాడు. (పెళ్లికి అనుకోని అతిథి, అంతా షాక్!) మొబైల్లో దొంగల ఫొటోలు ఉండొచ్చేమో చెక్ చేయమని అతడి అంకుల్ సలహా ఇచ్చాడు. దీంతో జాక్రిడ్జ్ ఫోన్ ఆన్ చేసి ఫొటోలు చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే అందులో ఉన్న దొంగ.. మనిషి కాదు, కోతి. అవును, ఆ దొంగ కోతి ఎన్నో సెల్ఫీలు తీసుకుంది. కొన్నిసార్లు ఫోన్‌ను తినేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కొన్ని ఫొటోలు క్యాప్చర్ అవగా, మరికొన్ని వీడియోలుగా రికార్డయ్యాయి. వీటన్నంటికి అతడు సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా తెరిచిన కిటికీ ద్వారా ఆ కోతి ఇంట్లోకి వచ్చి, తన ఫోన్ ఎత్తికెళ్లి ఉంటుందని జాక్రిడ్జ్ చెప్పుకొస్తున్నాడు. (కునుకు తీసిన కోతి.. నవ్వులు పూయిస్తున్న వీడియో) Something yang korang takkan jumpa setiap abad. Semalam pagi tido bangun bangun tengahari phone hilang. Cari cari satu rumah geledah sana sini semua takde then last last jumpa casing phone je tinggal bawah katil tapi phonenya takde. Sambung bawah. pic.twitter.com/0x54giujnY — z (@Zackrydz) September 13, 2020 -
అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి
-
అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి
సాక్షి, గుడ్లవల్లేరు: సెల్ఫీ సరదా మరో నిండుప్రాణాన్ని బలి తీసుకొంది. కోటి ఆశలతో సప్త సముద్రాలు దాటి వెళ్లిన యువతి నూరేళ్ళ జీవితాన్ని చిదిమేసింది. ఉన్నత చదువుల కోసం వెళ్ళిన కూతురిని జలరక్కసి మింగేయటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (27) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నైలోని పెద్దకుమార్తె వద్దకు వెళ్లిన తల్లితండ్రులు విషయం తెలిసి తల్లడిల్లిపోతున్నారు.అందరినీ ఆప్యాయంగా పలకరించే కమల ఇక లేదన్నా విషయాన్ని కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు జీర్ణించుకోలేకున్నారు. -
సెల్ఫీ పిచ్చి.. యువకుడి మృతి
కోల్‌కతా: సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఓ యువకుడి సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తూ.. నదిలో కొట్టుకుపోయి మరణించాడు. ఈ ఘటన డెహ్రడూన్‌లోని సాంగ్ నది వద్ద జరగింది. వివరాలు.. నగరంలోని క్లెమెంట్ టౌన్లో నివాసం ఉండే శుభం ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం వినాయకుడి నిమజ్జనం సందర్భంగా సాంగ్ నది వద్ద సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలు జారి నదిలో పడి కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రాష్ట్ర విపత్తు స్పందన దళం సాయంతో రెండు గంటల అన్వేషణ తర్వాత శుభం మృతదేహాన్ని వెలికి తీశారు. -
మహబూబాబాద్: కళ్లముందే నీట మునిగిన కూతురు
-
కళ్లముందే నీటిలో కొట్టుకుపోయిన కూతురు
సాక్షి, మహబూబాబాద్: జలపాతాన్ని చూసి ఉల్లాసంగా గడుపుదామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నిండింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లముందే నీట మునిగింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. బయ్యారం మండల కేంద్రానికి చెందిన అంబటి సతీష్, శ్రీవిధ్య దంపతులు, కూతురు శివాని, కుమారుడు శివాజీ మిగతా కుటుంబ సభ్యులతో కలిసి చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఫోటోలు దిగి సరదాగా గడిపారు. (చదవండి: శ్రీనివాస్ చనిపోయాడు.. ) తిరిగి ఇంటికి వచ్చే సమయంలో శివానీ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఆమె కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న బయ్యారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శివానీ ఆచూకీ లభించకపోవడం రెండు జేసీబీల సహాయంతో ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. దాంతో విగత జీవిగా మారిన శివానీ కనిపించింది. ఆమె యానిమల్ హజ్బెండరీలో డిప్లమా చేస్తున్నట్టు తెలిసింది. కళ్లముందే తమ బిడ్డ జల సమాధి కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ సమయంలో వాటిని సందర్శించడం మంచిది కాదని పోలీసులు ప్రజలకు సూచించారు. (చదవండి: ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ... ) -
సెల్ఫీలతో గుండెజబ్బు నిర్ధారణ..!
బీజింగ్: రోజు రోజుకు సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక గుండె జబ్బు నిర్ధారణ మరింత సులభతరం కాబోతుంది. సెల్ఫీలతో గుండె నిర్ధారణ ప్రక్రియను కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) ద్వారా కనుగొన్నట్లు యూరోపియన్ హర్ట్ జర్నల్‌లో కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. జర్నల్‌లోని వివరాల్లోకి వెళ్తె.. ఒకసారి గుండె జబ్బు నిర్దారణ అయ్యాక, ప్రతిసారి డాక్టర్ల దగ్గర చెకప్ చేసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం డాక్టర్లకు పేషెంట్ సెల్పీ పంపిస్తే చాలు, గుండె పనితీరును తెలుసుకోవచ్చు. కంప్యూటర్ ఆల్గరిథమ్ ద్వారా పేషేంట్ల ఫోటోలను, సెల్పీ ద్వారా విశ్లేషించి గుండె పనితీరును తెలుసుకోవచ్చని అధ్యయనకర్తలు తెలిపారు. అయితే పేషేంట్లు సొంత స్క్రీనింగ్ కోసం, గుండె జబ్బుల పనితీరును అంచనా వేయడానికి ఈ అధ్యయనం తొలి అడుగని చైనాకు చెందిన వైద్య నిపుణుడు జీజీంగ్ అభిప్రాయపడ్డారు. కాగా ఈ అధ్యయనం చేసిన వారిలో జీజీంగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన స్పందిస్తు.. గుండె జబ్బుల ప్రమాదం అంచనా వేయడానికి, అధిక రిస్క్ ఉన్న పేషంట్ల చేకూర్చడమే అప్లికేషన్ ముఖ్య లక్ష్యమని తెలిపారు.ఈ అధ్యయనంలో జింగ్ 8 చైనా ఆస్పత్రుల నుంచి 5,796 పేషెంట్ల గుండె పనితీరును అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: సెల్ఫీ సోకు.. ప్రాణం మీదకు తెచ్చుకోకు.. -
నీ హెయిర్ స్టైల్ బాగుంది, కానీ నువ్వు కాదు
సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పుడూ తమ ఫొటోలను, వీడియోలను పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. అలాగే బాలీవుడ్ నటి స్వస్తిక ముఖర్జీ కూడా తాజాగా ఓ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు. 'ఎగరడానికి నాకు రెక్కలు అవసరం లేదు. అసంపూర్తిగా డిజైన్ చేసిన నా తల సరిపోతుంది'' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలో ఆమె సగం గుండుతో, మరో సగం ముఖంపై వాలి ఉన్న జుట్టుతో కనిపించారు. అయితే ఈ లుక్ ఆమె అభిమానులను ఆకట్టుకోగా మరికొందరికి మాత్రం అస్సలు నచ్చలేదు. (సుశాంత్ ఆత్మహత్య : ఫేక్ సంతాపాలు అవసరమా?) "నీ హెయిర్‌స్టైల్ బాగుంది కానీ, ఎందుకో నువ్వు మాత్రం చూడటానికి అస్సలు బాగోలేవు. ఎందుకంటే మేకప్ వేసుకోలేదు, కనీసం ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉపయోగించలేదు" అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీనికి నటి స్పందిస్తూ.. "బ్యాడ్‌గా ఉన్నానా? అందవిహీనంగా కనిపించడం కూడా సంతోషంగానే ఉంది" అని పాజిటివ్ రిప్లై ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోయిన సదరు నెటిజన్ "అయ్యో.. నేను ఆ కోణంలో అనలేదు. ఏదేమైనా నా మాటలు తప్పుగా ధ్వనించినందుకు నాకు గిల్టీగా ఉంది. మీరు చాలా అందంగా ఉన్నారు" అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. కాగా స్వస్తిక.. డోలీ మెహ్రగా "పాతాళ్ లోక్" వెబ్ సిరీస్‌లోనూ నటించారు. "దిల్ బేచారా" చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ఆమె నటించిన "తాషెర్ ఘావర్" అనే బెంగాలీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. (నేను హీరోను కాదు.. కేవలం: సోనూ సూద్) -
అభిమానితో సెల్ఫీ అతనికి శాపంగా మారింది
లండన్ : ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన జోర్డన్ కాక్స్‌పై టీమ్ యాజమాన్యం వేటు వేసింది.కెంట్ జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ కాక్స్.. బాబ్ విల్లీస్ ట్రోఫీ మ్యాచ్‌లో ససెక్స్ టీమ్‌పై 238 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ మ్యాచ్‌లో అతను కోవిడ్19 నియమావళిని ఉల్లంఘించాడు. డబుల్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేసిన 19 ఏళ్ల కాక్స్.. స్టేడియంలో ఓ అభిమానితో సెల్ఫీ దిగాడు. దీంతో అతన్ని మిడిల్సెక్స్తో జరిగే మ్యాచ్‌కు దూరం పెట్టారు. బయో సెక్యూర్, సోషల్ డిస్టాన్సింగ్ నియమావళిని అతను ఉల్లంఘించినట్లు టీమ్ యాజమాన్యం చెప్పింది. (ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు : నెహ్రా) అయితే కోవిడ్19 పరీక్షలో నెగటివ్ వస్తేనే, తిరిగి జోర్డన్ కాక్స్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. ఈ ఘటన పట్ల కాక్స్ క్షమాపణలు చెప్పారు. జోర్డన్ మంచి క్రికెటర్ కానీ అతను ప్రోటోకాల్ బ్రేక్ చేశాడని, అతను కచ్చితంగా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లాల్సిందే అని డైరక్టర్ పౌల్ డౌన్‌టౌన్ తెలిపారు. (ధోనికి వయసుతో సంబంధం లేదు : వాట్సన్) -
మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీశారు..
ముంబై: జాలి లేకుండా కొందరు యువకులు ఒక కొండ చిలువను హింసించి సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఘటన బోరీవాలీలోని హనుమాన తెక్డీ ఏరియాలో జరిగింది. ముంబైలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా జోరుగా వానలు కురుస్తుండటంతో కొన్ని వన్యప్రాణులు వాటి స్థావరాలను వదిలి పొడి ప్రాంతాలకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక కొండ చిలువలువ నీరు లేని ఒక ప్రాంతానికి వెళ్లాలనుకుంది. అలా వెళుతున్న క్రమంలో ఆ మూగజీవి కొందరు ఆకతాయిల కంటపడింది. వారు దాన్ని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు కాళ్లతో తన్ని, చేతులతో కొట్టి అది వాళ్లకు లొంగాక దానితో సెల్ఫీలు తీసుకున్నారు. సెల్ఫీలు తీసుకున్న అనంతరం 8.5 అడుగుల కొండచిలువను ఓ సంచిలో పెట్టి దగ్గర్లోని అడవిలో వదిలేశారు. కొండచిలువను కొడుతున్నవీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వన్యప్రాణి సంరక్షణ కర్త పవన్ శర్మ ఆ వీడియో ఆధారంగా అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వాళ్లపై కేసు నమోదు చేశారు. వారిని విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: నాగుల పంచమి: కొండచిలువ కలకలం -
అక్కడ సెల్ఫీ తీసుకోవడం నిషేధం
భోపాల్ : వరద ఉధృతి నేపథ్యంలో నదుల వద్ద సెల్ఫీలు తీసుకోవడంపై నిషేధం విధిస్తూ మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఓ సెల్ఫీ ఘటనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి నది మధ్యలోకి వెళ్లి చిక్కుకున్న ఇద్దరు బాలికలను స్థానిక పోలీసులు రక్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం సోమవారం బార్వానీలో 144 సెక్షన్‌ను విధించారు. సమీపంలోని నీటి వనరుల దగ్గర సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేదించింది. భారీవర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుతం రాష్ట్రంలోని నదులు, కాల్వలు ఉప్పొంగి ప్రవాహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా నదుల వద్ద సెల్ఫీలు తీసుకోవడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు సామూహికంగా ఒకే చోట గుమికూడవద్దని ఆంక్షలు విధించినా 6-8 మంది బాలికలు చింద్వారా జిల్లాలోని పెంచ్ నదికి పిక్నిక్కి వెళ్ళడం చర్చనీయాంశమైంది. ఈ నేపథంలోనే వెంటనే స్పందిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టారు. (నదిలో మధ్యలో సెల్ఫీ దిగుదామనుకుంటే..) -
నదిలో మధ్యలో సెల్ఫీ దిగుదామనుకుంటే..
భోపాల్ : ఇద్దరు యువతులు సరదాగా చేసిన పని వారి జీవితాలను రిస్క్‌లోకి నెట్టింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో.. వారిద్దరు పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని ఆరుగురు యువతులు పెంచ్ నది తీరానికి పిక్నిక్ వెళ్లారు. ఆ బృందలోని ఇద్దరు యువతులు నదిలోకి సెల్ఫీ దిగేందుకు వెళ్లారు. నది మధ్యలో ఉన్న బండపై కూర్చొని సెల్ఫీ దిగాలని భావించారు. అయితే వారు అక్కడికి వెళ్లగానే.. నదిలో నీటి మట్టం క్రమంగా పెరగడం ప్రారంభమైంది. దీంతో వారు నది మధ్యలోనే చిక్కుకుపోయారు. (భారతీయ విద్యార్థికి రూ.1.3కోట్ల స్కాలర్షిప్) ఇది గమనించిన నది ఒడ్డున మిగతావారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సాయంతో వారిద్దరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(‘ఇది ఊహించలేదు.. ఆనందంగా ఉంది’) -
నది మధ్యలో సెల్ఫీ దిగుదామనుకుంటే..
-
కంటి చూపు పోగొట్టిన సెల్ఫీ
చెన్నై,తిరువొత్తియూరు: సెల్ఫీ తీస్తున్న సమయంలో రైతు కన్నును నెమలి పొడవడంతో అతను ఆ కంటి చూపును కోల్పోయే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కృష్ణగిరి జిల్లా డెంకినీకోట మారుదాంపల్లెకి చెందిన రామచంద్రారెడ్డి (60) రైతు. అతని ఇంటికి సమీపంలో రోజూ మధ్యాహ్నం సమయంలో ఆహారం కోసం ఒక నెమలి వచ్చి వెళ్లేది. దీన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన రైతు బాలాజీ (33) ఆ నెమలి పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం నెమలి వచ్చిన వెంటనే దాని పక్కకు వెళ్లి నిలబడి సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో నెమలి హఠాత్తుగా బాలాజీ ఎడమకంటిని తన ముక్కుతో పొడిచింది. ఈ ఘటనలో అతని కంటి నుంచి రక్తం వెలువడింది. అతన్ని చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి డాక్టర్లు కంటి చూపు రావడం చాలా కష్టమని తెలిపారు. నెమలిని సోమవారం గ్రామ ప్రజలు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న డెంకినీ కోట అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని నెమలిని విడిపించి ఐఆర్ అటవీశాఖ ప్రాంతంలో వదలిపెట్టారు. -
సెల్ఫీల మోజులో పడి..
పెద్దపల్లిరూరల్: పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. మధ్యలో నుంచి జాలువారుతున్న జలపాతం అందాలను చూసి ఆనందడోళికల్లో తేలియాడేందుకు వచ్చే యువత సెల్ఫీల మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పెద్దపల్లి మండలం సబ్బితం పంచాయతీ పరిధిలోని గట్టుసింగారం వద్ద జలపాతం ఉన్నట్లు ఆరేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి వర్షకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లా నుంచి కూడా పర్యాటకుల రాకపోకలతో సబ్బితం జలపాతం వద్ద సందడి నెలకొంటోంది. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై గల సబ్బితం గ్రామం నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతానికి చేరుకోవడం పర్యాటకులకు పరీక్షగానే మారింది. వర్షాలు కురిసినపుడే జాలువారే జలపాతం అందాలను చూసేందుకు అక్కడికి చేరుకునేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. అయితే మూడేళ్ల క్రితం జలపాతం వద్దకు వచ్చిన మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానంటూ ఇచ్చిన హామీ అటకెక్కింది. వానలు కురిసినపుడు ఈ మట్టిరోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించేందుకు పర్యాటకులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. 15 మంది ప్రాణాలు పోయాయ్.. స్నేహితులతో కలిసి జలపాతం అందాలను చూసేందుకు వచ్చిన యువత సరదాగా గడుపుతూ తమ స్మార్ట్ఫోన్లలో సెల్ఫీ దిగేందుకు యత్నిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఈ సారి వర్షం కురిసిన తొలి రోజుల్లోనే జలపాతం వద్ద ఆవుల యశ్వంత్ అనే యువకుడు సెల్ఫీ దిగేందుకు యత్నిస్తూ అదుపుతప్పి నీటిలో పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా గత ఆరేళ్లలో 15మంది ప్రాణాలు పోయాయి. జలపాతం వెలుగులోకి వచ్చిన మొదట్లో కొందరు యువకులు గుట్ట పై భాగానికి వెళ్లి బాహుబలి సినిమాలో వలె నటిస్తూ ఫొటోలు తీసుకోబోయి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. సబ్బితం జలపాతం వద్ద మృత్యువాత పడ్డ వారంతా యువకులే. రక్షణ ఏర్పాట్లేవి..! గట్టుసింగారం జలపాతం జాలువారే పై భాగానికి వెళ్లి అక్కడనుంచి దూకినట్టు నటించబోయి అదుపుతప్పి కిందపడి మరణించిన సందర్భంలో రక్షణ ఏర్పాట్లు చేస్తామంటూ అటవీ శాఖ అధికారులు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. రక్షణ చర్యలు తీసుకోని కారణంగానే సరదాకోసం వచ్చిన యువకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయనే వాదనలున్నాయి. జలపాతం ఉన్న ప్రాంతం అటవీశాఖ పరిధిలోనే ఉన్నా..జలపాతం వద్ద నీరు నిల్వ ఉండే ప్రాంతంలో ఉన్న ఇసుక నిల్వలను కొందరు అక్రమార్కులు తరలించుకుపోవడంతో ఆ ప్రాంతంలో లోతు ఎక్కువై ప్రాణాలు పోయే పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి జలపాతం ఉన్న ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
-
ప్రాణం తీసిన సెల్ఫీ
యశవంతపుర : నవ దంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన హాసన్ సమీపంలోని హేమావతి నదీ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. బేలూరు తాలుకా మురహళ్లి గ్రామానికి చెందిన అర్థేశ్(27), హెన్నలి గ్రామానికి చెందిన కృతికా(23)కు రెండు నెలల క్రితం వివాహమైంది. అర్థశ్ బెంగళూరులో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా సంస్థకు సెలవు ప్రకటించటంతో రెండు రోజుల క్రితం మురహళ్లికి వెళ్లాడు. బుధవారం అత్తగారి ఊరు హెన్నళికి వెళ్లాడు. సాయంత్రం దంపతులు ఇద్దరూ బైకుపై గ్రామ సమీపంలోని హేమావతి నది వద్దకు వెళ్లారు. రాత్రి కావస్తున్న ఇంటికి రాకపోవటంతో అత్తమామలు ఆందోళన చెందారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో నది ప్రాంతం వద్దకు వెళ్లగా బైక్ కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు నది చుట్టూ గాలింపు చేపట్టగా కృతికా మృతదేహం బయట పడింది. శుక్రవారం తెల్లవారుజామున అర్థేశ్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను సకలేశపుర ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నవదంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందారని పోలీసులు తెలిపారు.