ఇద్దరిని బలిగొన్న సెల్ఫీ సరదా | He went to take a selfie and accidentally fell into the river | Sakshi
Sakshi News home page

ఇద్దరిని బలిగొన్న సెల్ఫీ సరదా

Published Thu, May 18 2023 2:39 AM | Last Updated on Thu, May 18 2023 2:39 AM

He went to take a selfie and accidentally fell into the river - Sakshi

బాల్కొండ: నీటి అంచున సెల్ఫీ దిగాలన్న ఓ యువకుడి సరదా అతనితో పాటు మరొకరిని బలిగొన్నది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని పురాణి పేట్‌కు చెందిన అబ్దుల్‌ ఫహీం (50) తన మరదలు కుమారుడు అబ్దుల్‌ బార్‌ (23), తన కుమారుడు అబ్దుల్‌ సాద్‌తో కలిసి బుధవారం నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ సందర్శనకు వచ్చారు. ప్రాజెక్ట్‌ దిగువన ఎస్కే ప్‌ గేట్ల వద్ద గోదావరిలోకి దిగారు. అక్కడ నీటి అంచున అబ్దుల్‌ బార్‌ సెల్ఫీ తీసుకోడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు.

ఇది గమనించిన అబ్దుల్‌ ఫహీం.. అతన్ని రక్షించేందుకు నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయా రు. ఒడ్డుపై నుంచి వీరిని చూస్తున్న అబ్దుల్‌ సాద్‌ గట్టిగా కేకలు వేశాడు. స మీపంలో ఉన్న మత్స్యకారులు  వచ్చేలోపు ఇద్ద రూ నీటిలో పూర్తిగా ము నిగి పోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా నీట మునిగిన చోటనే సాయంత్రానికి ఇద్దరి మృత దేహాలూ లభ్యమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement