fahim
-
ఇద్దరిని బలిగొన్న సెల్ఫీ సరదా
బాల్కొండ: నీటి అంచున సెల్ఫీ దిగాలన్న ఓ యువకుడి సరదా అతనితో పాటు మరొకరిని బలిగొన్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాణి పేట్‌కు చెందిన అబ్దుల్ ఫహీం (50) తన మరదలు కుమారుడు అబ్దుల్ బార్ (23), తన కుమారుడు అబ్దుల్ సాద్‌తో కలిసి బుధవారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. ప్రాజెక్ట్ దిగువన ఎస్కే ప్ గేట్ల వద్ద గోదావరిలోకి దిగారు. అక్కడ నీటి అంచున అబ్దుల్ బార్ సెల్ఫీ తీసుకోడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ఇది గమనించిన అబ్దుల్ ఫహీం.. అతన్ని రక్షించేందుకు నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయా రు. ఒడ్డుపై నుంచి వీరిని చూస్తున్న అబ్దుల్ సాద్ గట్టిగా కేకలు వేశాడు. స మీపంలో ఉన్న మత్స్యకారులు వచ్చేలోపు ఇద్ద రూ నీటిలో పూర్తిగా ము నిగి పోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా నీట మునిగిన చోటనే సాయంత్రానికి ఇద్దరి మృత దేహాలూ లభ్యమయ్యాయి. -
రీజినల్ పార్టీలో నేషనల్ పార్టీ విలీనమా?
సాక్షి, హైదరాబాద్: అధికార బలంతో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఫహీం మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ బులిటెన్ విడుదల చేయడం దారుణమన్నారు. శనివారం ఫహీం మీడియాతో మాట్లాడుతూ.. మండలి ఛైర్మన్‌కు అసలు రాజ్యాంగం గురించి తెలుసా అని ప్రశ్నించారు. స్వామిగౌడ్ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నేషనల్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం చేస్తూ ఆయన జారీచేసిన బులిటెన్ సరికాదన్నారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవాంతరాలను ఎదుర్కొందని, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తమకు అనుమానులున్నాయని కాంగ్రెస్ నేత మానవతారాయ్ ఆరోపించారు. ఎన్నికల అధికారిని రీకాల్ చేసే అవకాశం ఉన్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృత్తం అవుతాయనే భయంతో కేంద్రం టీఆర్ఎస్కు మద్దతిస్తోందన్నారు. -
కోర్టులో లొంగిపోయిన ఫహీం
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం బావమరిది ఫహీం, అతడి భార్య షహీమ్ శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. వారిద్దరికీ న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఫహీం పేరు మీద కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఫహీం ఏ2గా ఉన్నాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఫహీం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలి కాలంలో ఎక్కువగా నయీమ్ తరఫున ఫహీం భూదందాలు సెటిల్ చేస్తున్నాడు. చాలా మంది అనుచరులు ఇతని కిందే పనిచేశారు. అయితే నయీం అక్రమాల చిట్టా వివరాలు తనకేమీ తెలియదని ఫహీం చెప్పడం గమనార్హం. మరోవైపు ఫహీంను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. కాగా హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని తుల్జాభవానీకాలనీలో శ్రీధర్‌గౌడ్ ఇంటిని ఫహీం సెటిల్మెంట్లకు ఉపయోగించుకునేవాడు. ఫహీం వద్ద శ్రీధర్ గౌడ్, సుధాకర్, వెంకటేష్, శ్రీధర్‌రాజు, కరుణాకర్, శ్రీను, బలరాం అనుచరులుగా పనిచేసేవారు. వీరంతా నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్‌లోని పాఠశాలలో కలసి చదువుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఫహీం వల్ల కానీపని అయితేనే నయీం రంగంలోకి దిగేవాడని పోలీసుల విచారణలో శ్రీధర్‌గౌడ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. శ్రీధర్, బలరాంను నిన్న హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చిన వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ1గా నయీం, ఏ2గా ఫహీం, ఏ3గా శ్రీధర్‌గౌడ్, ఏ4గా సుధాకర్, ఏ5 వెంకటేష్, ఏ6 శ్రీధర్‌రాజు, ఏ7 కరుణాకర్, ఏ8 శ్రీను, ఏ9 బలరాంగా పేర్కొన్నారు. శ్రీధర్, బలరామ్‌కు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. -
ఖాదర్ ఇచ్చిన సమాచారంతోనే..!
జూబ్లీహిల్స్ కాల్పుల ఘటనకు సంబంధించిన మొత్తం సమాచారం అంతా వెలుగులోకి వస్తోంది. ఒక్క వ్యక్తిని పట్టుకుని.. అతడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ అంతా జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన బ్యాంకు దోపిడీ ముఠాలో ఖాదర్ అనే వ్యక్తిని పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫహీం, అబ్దుల్ సత్తార్ అనే ఇద్దరినీ జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంబడించారు. ఈ విషయాన్ని గుర్తించిన కర్ణాటక గ్యాంగు.. కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లోనే ఎల్అండ్టీకి చెందిన ధర్మేందర్ సింగ్ అనే కార్మికుడు గాయపడ్డాడు. స్థానికుల సాయంతో నిందితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వాళ్ల వద్ద నుంచి రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో బ్యాంకు దోపిడీలకు పాల్పడే ఈ ముఠా.. హైదరాబాద్‌లో ఓ మొబైల్ వ్యాపార సంస్థకు చెందిన మేనేజర్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. -
పోలీసులు వెంబడిస్తుండగా కాల్పులు జరిపాడు