ఖాదర్ ఇచ్చిన సమాచారంతోనే..! | qadar's interrogation lead the whole operation | Sakshi
Sakshi News home page

ఖాదర్ ఇచ్చిన సమాచారంతోనే..!

Published Thu, Aug 20 2015 5:14 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

ఖాదర్ ఇచ్చిన సమాచారంతోనే..!

ఖాదర్ ఇచ్చిన సమాచారంతోనే..!

జూబ్లీహిల్స్ కాల్పుల ఘటనకు సంబంధించిన మొత్తం సమాచారం అంతా వెలుగులోకి వస్తోంది. ఒక్క వ్యక్తిని పట్టుకుని.. అతడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ అంతా జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన బ్యాంకు దోపిడీ ముఠాలో ఖాదర్ అనే వ్యక్తిని పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫహీం, అబ్దుల్ సత్తార్ అనే ఇద్దరినీ జూబ్లీహిల్స్ టాస్క్ఫోర్స్ పోలీసులు వెంబడించారు.

ఈ విషయాన్ని గుర్తించిన కర్ణాటక గ్యాంగు.. కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లోనే ఎల్అండ్టీకి చెందిన ధర్మేందర్ సింగ్ అనే కార్మికుడు గాయపడ్డాడు. స్థానికుల సాయంతో నిందితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వాళ్ల వద్ద నుంచి రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో బ్యాంకు దోపిడీలకు పాల్పడే ఈ ముఠా.. హైదరాబాద్లో ఓ మొబైల్ వ్యాపార సంస్థకు చెందిన మేనేజర్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement