కానిస్టేబుల్ వైపే కాల్పులు! | jubilee hills firing issue: faheem aimed at constable, reveals video | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ వైపే కాల్పులు!

Published Sat, Aug 22 2015 1:12 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

కానిస్టేబుల్ వైపే కాల్పులు!

కానిస్టేబుల్ వైపే కాల్పులు!

జూబ్లీహిల్స్ కాల్పుల ఘటనలో సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సాక్షి టీవీ చేతికి అందిన సీసీటీవీ ఫుటేజి వీడియోలో మరో విషయం బయటపడింది. ఆ రోజు.. టాస్క్ఫోర్స్ పోలీసులు జీపులో వెంబడించి, దుండగుల పల్సర్ బైకును ఢీకొట్టినప్పుడు ఆ బైకు పడిపోయింది. దాంతో వెనక ఉన్న ఫహీం తన వద్ద ఉన్న రివాల్వర్ తీసి.. పట్టుకోడానికి వస్తున్న కానిస్టేబుల్ వైపు కాల్చాడు.

అయితే, సమయానికి కానిస్టేబుల్ పక్కకు వంగడంతో.. ఆ బుల్లెట్ వెళ్లి, అక్కడ మెట్రోపనులు నిర్వహిస్తున్న ధర్మేందర్ సింగ్ అనే కానిస్టేబుల్కు తగిలింది. దోపిడీ చేయడానికే కర్ణాటకకు చెందిన ముఠాలోని ముగ్గురు సభ్యులు వచ్చారని తొలుత భావించినా.. చివరకు బిగ్ సీ కంపెనీలో పనిచేసే మేనేజరే ఈ మొత్తం పథకానికి సూత్రధారి అని తర్వాత తెలిసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement