godavari
-
పులస ఏమవుతోంది!
ఏయూ క్యాంపస్ (విశాఖ): సముద్రంలో ఇలసగా పిలిచే చేప నీటికి ఎదురీదుకుంటూ నదిలోకి చేరుతుంది. అక్కడ తన రంగు, రుచి, పోషకాలను పూర్తిగా మార్పు చేసుకుంటుంది. అత్యంత ఖరీదైన చేపగా మారుతుంది. ప్రధానంగా వర్షాకాలంలో గోదావరి జిల్లాల్లో పులస చేప వలలో పడిందంటే మత్స్యకారుల సంతోషానికి అవధులు ఉండవు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పులస చేప (Pulasa Fish) ప్రస్థానం, పోషకాల మార్పులపై సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) ప్రత్యేక అధ్యయనం చేసింది. కానీ.. ఇలస నదిలోకి వలస వచ్చాక పులసగా మారి సముద్రంలోకి తిరిగి వెళుతోందా లేక నదిలోనే ఉండిపోతోందా అనే సందేహాలు శాస్తవేత్తలను వెంటాడుతున్నాయి. లోతైన పరిశోధన చేస్తేనే..గుడ్లు పెట్టేందుకు గోదావరి (Godavari) నదిలోకి వచ్చే సమయంలోనే పులసలు మత్స్యకారుల వలలో చిక్కి ఆహారంగా మారిపోతున్నాయా అనే సందేహాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. పులసల్ని వచ్చినవి వచ్చినట్టుగా పట్టేస్తుంటే పులసల పునరుత్పత్తి దెబ్బతిని ఆ చేప జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అదేవిధంగా గోదావరిలో పుట్టిన పులస పిల్లలు సముద్రంలోకి వెళుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు లోతైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. పులసల గమనాన్ని ప్రత్యేకంగా ట్యాగింగ్ చేసి ట్రాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వీటి మైగ్రేషన్ డైనమిక్స్‌ని సైతం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అప్పుడే పులస చేపలను సంరక్షించడం సాధ్యపడుతుందని పేర్కొంటున్నారు. కనీసం 20 శాతం పులసలు పునరుత్పత్తి చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.భారత్‌లో గంగ, గోదావరి నదులకే రాకబంగాళాఖాతం, అరేబియా సముద్రం, వియత్నాం, ఎర్రసముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో హిల్సా చేపలు లభిస్తాయి. బంగ్లాదేశ్‌లోని పద్మా నది, ఇరాక్‌లో యూప్రటిస్, మయన్మార్‌లోని ఇరావడి, పాకిస్తాన్లో సింధు, భారత్‌లోని గంగా, గోదావరి నదీ ప్రాంతాల్లోకి ఇవి వలస వచ్చి పులసలుగా రూపాంతరం చెందుతాయి. నది నుంచి సముద్రంలోకి ప్రవాహం కలిసే ప్రాంతంలో ఇవి లభిస్తాయి. వీటి లభ్యత ఇటీవల కాలంలో తగ్గిపోతోంది. గోదావరి తీరంలో లభించే పులస మెరుస్తూ ఉంటుంది. వీటిని సాధారణ ప్రజలు గుర్తించడం కష్టమే. నిపుణులు మాత్రమే గుర్తిస్తారు. ఇలస, పులసలో పోషకాల వ్యత్యాసం ఇలా..సముద్రంలోని ఉప్పునీటిలో ఉండే ఇలసలో 12 శాతం శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 100 గ్రాముల ఇలసలో సోడియం 183 మి.గ్రా., పొటాషియం 573 మి.గ్రా., క్యాల్షియం 133 మి.గ్రా., ఫాస్పరస్ 910 మి.గ్రా., ఐరన్ 29 మి.గ్రా. ఉన్నట్టు సీఐఎఫ్టీ పరిశోధనలో వెల్లడైంది. పులస విషయానికి వస్తే.. కొవ్వు శాతం 8నుంచి 11 శాతం మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. పులసలో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈపీఏ, డీహెచ్ఏ ఒమేగా–3 ఆమ్లాలు అధికంగా ఉన్నాయి. 100 గ్రాముల పులసలో సోడియం 83 మి.గ్రా., పొటాషియం 1,187 మి.గ్రా., క్యాల్షియం 166 మి.గ్రా., పాస్ఫరస్ 1,151 మి.గ్రా., ఐరన్ అధికంగా 32.5 మి.గ్రా. ఉన్నట్టు గుర్తించారు. రివర్ మౌత్ వద్ద లభించే ఇలస చేపల్లో కొవ్వు శాతం అత్యధికంగా 17 శాతం ఉన్నట్టు గుర్తించారు. ఇలస నుంచి పులసగా మారే సమయంలో దీని పోషకాలలో వ్యత్యాసం, మార్పులు స్పష్టంగా తెలుస్తున్నాయి. గుడ్లు పెట్టడానికి, పిల్లలుగా మారడానికి అవసరమైన విధంగా తన శరీరాన్ని, పోషకాలను మార్పు చేసుకోవడం ఈ చేపల విశేషం. ఉప్పు నీటి నుంచి మంచి నీటికి వచ్చే సమయంలో తట్టుకోవడానికి సైతం ఇవి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయి.సీఐఎఫ్టీ అధ్యయనం ఏం చెబుతోందంటే..సముద్రంలో పెరిగే చేపను ఇలస (హిల్సా) అని పిలుస్తారు. అవి వయసుకు వచ్చాక సముద్రంలో నుంచి, మంచినీటి నదిలోనికి ఎదురీదుతూ వెళ్తాయి. నదిలోనే గుడ్లు పెడతాయి. సముద్రపు నీటిలో ఇలసకు, మంచి నీటిలో పులసగా రూపాంతరం చెందిన చేపకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాము జన్మించిన స్థానానికే వచ్చి పులస మళ్లీ గుడ్లు పెడుతుందని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) (central institute of fisheries technology) అధ్యయనం చెబుతోంది. జూన్, జూలై నెలల్లో రుతుపవనాలు, వర్షాకాలం ప్రారంభం అయ్యే సమయంలో సముద్రంలోని ఇలసలు నదుల వైపు ప్రయాణం మొదలుపెడతాయి. నదుల్లోకి వీటి రాక నవంబర్ వరకు కొనసాగుతుంది. వర్షం కురిసిన సమయంలో నదుల్లోని బురద నీరు సముద్రంలో కలుస్తుంది. దీనిని గుర్తించి ఉప్పునీటి నుంచి మంచినీటి దిశగా ఇలస తన ప్రయాణం ప్రారంభిస్తుంది. వర్షం తగినంత లేకపోతే వీటి వలస ఆగిపోతుంది.పులస జాతిని సంరక్షించాలిపులస జాతిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రధానంగా నదులు కలుషితం కాకుండా చూడాలి. అప్పుడే ఆరోగ్యకరమైన చేపలు లభిస్తాయి. ముఖ్యంగా ఇలస నుంచి పులసగా మారే మార్గంలో వాటి ప్రయాణానికి అవరోధాలు లేకుండా చూడటం ఎంతో అవసరం. వీటిని పట్టుకోవడంలో ఒక నియమం అనేది లేదు. నదిలోకి వచ్చిన వాటిని వచ్చినట్టుగా పట్టేస్తూ ఉంటే పునరుత్పత్తి దెబ్బతింటుంది. అదేవిధంగా పుట్టిన పిల్లలు సముద్రంలోకి వెళుతున్నాయా లేదా అనే విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గుడ్లు పెట్టిన పులస నదిలోనే ఉండిపోతోందా లేక సముద్రంలోకి తిరిగి వెళుతోందా అనే విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంది.– డాక్టర్ బి.మధుసూదనరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఐసీఏఆర్–సీఐఎఫ్టీ, విశాఖపట్నం -
ఆ 45 టీఎంసీలూ ఏపీవే
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి మళ్లించే 80 టీఎంసీలకుగాను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మిగిలే 45 టీఎంసీల కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతాయని కేడబ్ల్యూడీటీ–2కు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ డైరెక్టర్ అనిల్ కుమార్ (ఏకే) గోయల్ స్పష్టం చేశారు. విభజన చట్టం 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులకు ఆ 45 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని చెప్పారు. జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 విచారణ శుక్రవారం కొనసాగింది. ఏపీ ప్రభుత్వం తరఫు సాక్షి ఏకే గోయల్‌ను తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తున్నందున నాగార్జున సాగర్ నుంచి ఆ మేరకు కృష్ణా డెల్టాకు విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చు కదా అంటూ తెలంగాణ న్యాయవాది అడిగిన ప్రశ్నలకు తగ్గించుకోవచ్చునని గోయల్ చెప్పారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించిన సంవత్సరంలో మాత్రమే.. సాగర్ నుంచి విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చునని చెప్పారు. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించే ఒప్పందం 1978 ఆగస్టు 4న ఉమ్మడి రాష్ట్రంలోనే బేసిన్‌లోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిందన్నారు. గోదావరి జలాలను మళ్లించే ప్రాంతం, మళ్లించిన జలాలను వినియోగించుకునే ప్రదేశం రెండూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నందున.. మళ్లించిన గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కే దక్కాలని తేల్చిచెప్పారు. గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా బేసిన్లో 45 టీఎంసీల లభ్యత అదనంగా ఉందన్నది వాస్తవమేనా అని తెలంగాణ న్యాయవాది ప్రశ్నించగా.. ఆ అంశాన్ని ట్రిబ్యునల్ తేల్చాలని గోయల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు), ఎస్సెల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ)లను గుర్తించలేదని తెలిపారు. ఎస్సెల్బీసీ పూర్తయ్యేంత వరకూ ఏఎమ్మార్పీ ద్వారా నీటిని వాడుకోవచ్చునని, ఎస్సెల్బీసీ పూర్తయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలనే ప్రతిపాదన ఉందని చెప్పారు.మీరు రూపొందించిన ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిలో విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులను చేర్చారని, కానీ నెట్టెంపాడు ఎత్తిపోతలను ఎందుకు చేర్చలేదని తెలంగాణ న్యాయవాది అడగ్గా.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌కు మాత్రమే ఆ నియమావళిని రూపొందించానని గోయల్ చెప్పారు. జూరాల ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తరలిస్తారని ఎత్తిచూపారు. సాక్షిగా మీరు స్వతంత్రంగా వాంగ్మూలం ఇస్తున్నట్లు లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు సాక్షిగా పూర్తిగా అవాస్తవాలు చెబుతున్నారు కదా అన్న తెలంగాణ న్యాయవాది వాదనను గోయల్ తోసిపుచ్చారు.ముగిసిన సాక్షుల విచారణఏపీ ప్రభుత్వం తరఫు సాక్షిని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్, మౌఖిక వాంగ్మూలం ముగిసినట్లు ట్రిబ్యునల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2న దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అంగీకరించింది. తదుపరి విచారణను జనవరి 16, 17కు వాయిదా వేసింది. -
అంగీకరించకపోతే పక్కన పెట్టేస్తాం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి– కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు రాష్ట్రా లన్నీ సమ్మతి తెలపాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కోరారు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్రాలు నాలుగేళ్లుగా నాన్చుడు వైఖరిని అవలంబిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్లు గడిచినా ప్రాజెక్టు ముందుకు కదలదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలు సహకరించకపోతే ప్రాజెక్టును పక్కనపెట్టక తప్పదని తేల్చి చెప్పారు. రాష్ట్రాలన్నింటికీ సాధ్యమైనంత గరిష్టంగా నీటి కేటాయింపులు చేశామని, ప్రాజెక్టు ద్వారా 148 టీఎంసీలే తరలిస్తున్నందున కేటాయింపులు పెంచాలన్న రాష్ట్రాల డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని కూడా చెప్పారు. నదుల అనుసంధానంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ఆమె మాట్లాడారు. నెలాఖరులోగా రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధిపతులతో ఢిల్లీలో ప్రత్యక్ష విధానంలో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించాలని ఎన్‌డబ్ల్యూడీఏకు దేబశ్రీ సూచించారు. జనవరిలో అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. తెలంగాణకు 50% కోటా ఇవ్వలేం..ప్రాజెక్టు ద్వారా తరలించనున్న 148 టీఎంసీల్లో 50 శాతం తమకు కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్‌ను దేబశ్రీ తోసిపుచ్చారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించడానికి బదులు సమ్మ క్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలనే తెలంగాణ ప్రతి పాదనలను పరిశీలి స్తున్నామని చెప్పారు. సమ్మక్క బరాజ్‌లో 83 మీటర్ల నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉండే నీళ్లను మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగంగా తరలించాలని, ఆ మేరకు నీటి లభ్యతను తేల్చడానికి సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలన్న రాష్ట్రం సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాలో రెండు కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని రాష్ట్రం చేసిన మరో ప్రతిపాదనకు సూత్రప్రాయంగా సమ్మతి తెలిపారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్ డీడీ సుబ్రమణ్యం ప్రసాద్ మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చిన తర్వాతే నాగార్జునసాగర్ ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకోవాలని చెప్పారు. తక్కువ భూసేకరణ చేసేలా ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను రూపొందించాలని కోరగా దేబశ్రీ అంగీకరించారు. పోలవరం నుంచి అనుసంధానం సాధ్యం కాదుపోలవరం ప్రాజెక్టు నుంచి నదుల అనుసంధానం చేపట్టాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని దేబశ్రీ తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలిస్తే ఏపీ, తమిళనాడు, పాండిచ్చేరి మాత్రమే లబ్ధి పొందుతాయని, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భాగస్వామ్యం కోల్పోతాయని స్పష్టం చేశారు. ఏపీ భూభాగం పరిధిలో రెండు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకకు కోటా పెంచలేం..తమ రాష్ట్ర భూభాగంలో మాత్రమే జరగనున్న బెడ్తి–వార్దా నదుల అనుసంధానం ప్రాజెక్టును గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు పరిధి నుంచి తొలగించాలని కర్ణాటక చేసిన విజ్ఞప్తిపై దేబశ్రీ ముఖర్జీ సానుకూలంగా స్పందించారు. గోదావరి–కావేరి ప్రాజెక్టులో కర్ణాటకకు 16 టీఎంసీల తాగునీరు మాత్రమే కేటాయించారని, సాగునీరును సైతం కేటాయించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. తాము ఇప్పటికే సమ్మతి తెలుపుతూ ఎంఓయూపై సంతకాలు చేశామని తమిళనాడు, పుదుచ్చేరిలు తెలిపాయి. తమ రాష్ట్రం సొంతంగా చేపట్టిన దామన్‌గంగా–వైతర్ణ–గోదావరి నదుల అనుసంధానాన్ని గోదావరి–కావేరి ప్రాజెక్టు కింద చేర్చాలని మహారాష్ట్ర విజ్ఞప్తి చేసింది. -
పోలవరం కాలువ గట్లపై మట్టిని తవ్వేస్తున్న జనసేన, టీడీపీ నేతలు
-
అందం.. అత్యద్భుతం
సాక్షి, అమలాపురం/ కాట్రేనికోన: గౌతమీ నదీ సాగర సంగమ ప్రాంతం. పాయలు.. పాయలుగా విడిపోయే నది. వాటిని ఆనుకుని ఇరువైపులా చిట్టిపొట్టి మొక్కలు.. చిక్కని గుబురు పొదలు. వాటి మధ్య సాగే పడవ ప్రయాణం. మడ పీతలు.. అందమైన పక్షులు.. అరుదైన వృక్షజాతులు.. ఔషధ మొక్కలు ఇలా దారి పొడవునా కనిపించే అందమైన సుందర దృశ్యాలు ఎన్నో మరెన్నో. అంబేడ్కర్ కోనసీమ జిల్లా బలుసుతిప్ప శివారు మగసానితిప్పకు వెళ్లే పడవ ప్రయాణం పైరు పచ్చని కోనసీమలో సరికొత్త అందాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. కొబ్బరి తోటలు.. పచ్చని పొలాలు.. పంట కాలువల అందాలనే కాదు.. మడ అడవులు.. నదీపాయలు.. పడవ ప్రయాణాలు.. ఇలా ‘స్వర్గమే కళ్లముందు’ కదలాడుతోంది. మగసానితిప్ప ఓ కుగ్రామం (Maasaani Tippa Village). గోదావరి నదీపాయలు, మడ అడవులు నడుమ ఒక చిన్న దీవి. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పంచాయతీ శివారు గ్రామం. అగ్నికుల క్షత్రియులు ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే పడవ ఒక్కటే మార్గం. అటువంటి గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం కాల భైరవస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి సుమారు 1,800 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు.గతంలో స్వామివారి ఆలయాన్ని సమీపంలో ఉన్న బలుసుతిప్ప గ్రామంలో చౌళరాజులు నిర్మించారని ఆలయ చరిత్ర చెబుతోంది. తుపాను సమయంలో మూలవిరాట్ సముద్రంలో కూరుకుపోతుండగా, మత్స్యకారులు అడ్డుకుని ఊరికి ఈశాన్యంగా ఉన్న మగసానితిప్పలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆలయం నిర్మించి వందేళ్లకు పైబడి అవుతోంది. తొలుత మత్స్యకార పద్దెలు పూజాదికాలు నిర్వహించగా, గత 80 ఏళ్లుగా బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు.పర్యాటకంగా ప్రోత్సహించాలిపర్యాటకంగా ప్రోత్సహిస్తే ప్రయాణికులు, భక్తుల సంఖ్య మరింత పెరగనుంది. ఏకో టూరిజంలో భాగంగా గతంలో పలు సందర్భాల్లో పర్యాటక బోట్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా తరువాత పట్టించుకునేవారు లేకుండా పోయారు. బలుసుతిప్ప, జి.మూలపొలం నుంచి ప్రత్యేక పర్యాటక బోట్లు ఏర్పాటు చేయడం, మగసానితిప్పలో సేద తీరేందుకు ఏర్పాట్లు చేస్తే పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. పెరిగిన తాకిడిఅతి పురాతన ఈ ఆలయానికి ఇటీవల కాలంలో భక్తుల తాకిడి పెరిగింది. గతంలో అప్పుడప్పుడు ఒకరిద్దరు భక్తులు మాత్రమే బయట నుంచి వచ్చేవారు. మహాశివరాత్రి నాడు మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు. కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మరీ ముఖ్యంగా కార్తిక మాసంలో రోజూ భక్తులు వస్తుండగా ఆయ్యప్ప, భవానీ మాలధారులు భారీగా వస్తున్నారు. ప్రతి నెలా అష్టమి రోజు ఇక్కడ గుమ్మడి కాయలో దీపం పెట్టడం వల్ల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం.ఆనవాయితీగా దీపారాధన కాల భైరవస్వామి వెలసి 18 దశాబ్దాలు దాటిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించి వందేళ్లు దాటుతోంది. ఏడు దశాబ్దాలుగా మా తండ్రి, తరువాత నేను అర్చకత్వం చేస్తున్నాం. గతంలో భక్తులు పెద్దగా వచ్చేవారు కాదు. ఇప్పుడు పెరిగింది. అష్టమి రోజున ఇక్కడ గుమ్మడికాయలో దీపారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనిపై నమ్మకంతో భక్తులు అధికంగా వస్తున్నారు. – ఓం నమశ్శివాయ, ఆలయ పూజారి, మగసానితిప్పముచ్చటగొలిపేలా..ఈ గ్రామానికి వెళ్లేందుకు రెండు జల మార్గాలున్నాయి. ఒకటి బలుసుతిప్ప, రెండోది ఐ.పోలవరం మండలం జి.మూలపొలం నుంచి ఇంజన్ పడవల (బోట్లు) మీద రాకపోకలు సాగించాల్సి ఉంది. ఈ పడవల ప్రయాణం ఒక అద్భుతం. మనో ఫలకంపై చెరగని ముద్రగా నిలిచిపోతోంది అంటే అతిశయోక్తి కాదు. ఒంపులు తిరుగుతూ సాగే నదీపాయల మధ్య బోటు ప్రయాణం.. ఇరువైపులా దట్టమైన పొదరిల్లుగా అల్లుకుపోయిన మడ చెట్లు.. నీటి మీద తేలియాడే వాటి వేర్లు ముచ్చటగొల్పుతాయి. అడవుల్లో ఉండే ఔషధ మొక్కల నుంచి వచ్చే పరిమళాలు ప్రకృతి ప్రేమికులను మరో లోకానికి తీసుకుపోతాయి. చెట్ల కొమ్మల మీద పాకుతున్న మడ పీతలు.. అక్కడక్కడా కనిపించే మడ పిల్లులు.. విదేశీ పక్షులు కనువిందు చేస్తాయి.చిన్న కాలువలుగా.. వెంటనే పెద్ద నదిని తలపించే పాయలు.. తీరాన్ని ఆనుకుని గోదావరి దీవుల మధ్య సంప్రదాయ పద్ధతిలో జీవనం సాగించే అగ్నికుల క్షత్రియులు (మత్స్యకారులు). చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ మడ అడవుల్లో పీతలు, చేపల, రొయ్యల వేట ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. మడ అడవులను ఆనుకుని మత్స్య సంపద కోసం ఏర్పాటు చేసిన వలలు, వాటి వద్ద మత్స్యకారుల సందడి ముచ్చట గొల్పుతాయి. పడవలకు ఎదురుగా వచ్చే వేట పడవలు... రాకపోకలు సాగించే గ్రామస్తులు, గంటపాటు సాగే ప్రయాణంలో కంటిని కట్టిపడేసే అందచందాల గురించి ఎలా ఎన్ని చెప్పుకొన్నా.. ఎంత చెప్పుకొన్నా తక్కువే. ప్రకృతి ప్రేమికులు జీవితంలో ఒక్కసారైనా ప్రయాణం చేయాలనిపించే ప్రాంతం ఇది. -
గోదావరి.. అపార జలసిరి
సాక్షి, అమరావతి: గోదావరిలో జలసిరులు అపారంగా ఉన్నాయని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) స్పష్టంచేసింది. ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని తాజాగా తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని సీడబ్ల్యూసీ వెల్లడించింది. గోదావరిలో ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించిన అధ్యయనాల్లో నిర్ధారించిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉందని ప్రకటించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరులు, బచావత్ ట్రిబ్యూనల్ సమయంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం గల ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయాలంటే వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకోవాలని చెబుతున్నారు. బేసిన్లో కొంతకాలం అధిక వర్షపాతం కురవడం... ఆ సమయంలో ఒకేసారి గరిష్టంగా వరద రావడం తదితర కారణాల వల్లే గోదావరిలో నీటి లభ్యత పెరగడానికి కారణమని నీటిపారుదలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోదావరి బేసిన్ ఇదీ.. దేశంలో రెండో అతి పెద్ద నది గోదావరి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్‌లో సముద్రమట్టానికి 1,067 మీటర్ల ఎత్తులో జని్మంచిన గోదావరి... మహారాష్ట్ర, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో 1,465 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏపీలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.గోదావరికి ప్రవర, పూర్ణ, మంజీర, పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ప్రధాన ఉప నదులు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పుదుచ్చేరిలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ..» గోదావరిలో 1985–86 నుంచి 2022–23 వరకు ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉంది. » 2013–14లో గరిష్టంగా 8,664.82 టీఎంసీల లభ్యత ఉండగా... 2009–10లో నీటి లభ్యత కనిష్టంగా 2,066.62 టీఎంసీల లభ్యత ఉంది. » బేసిన్లో సగటున 1,167 మి.మీ. వర్షపాతం కురుస్తుంది. దీనివల్ల గోదావరిలో ఏటా సగటున 12,869.74 టీఎంసీల ప్రవాహం ఉంటుంది. 1994–95లో గరిష్టంగా 1,484 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గరిష్టంగా 17,054.89 టీఎంసీల ప్రవాహం ఉంది. 2015–16లో బేసిన్లో కనిష్టంగా 914 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గోదావరిలో కనిష్టంగా 9,608.43 టీఎంసీల ప్రవాహం ఉంది. » 1985–2023 మధ్య ఏటా సగటున 850.38 టీఎంసీలను మాత్రమే సాగునీటి కోసం వినియోగించుకున్నారు. » 2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, పశువులకు తాగునీటి కోసం 70.28 టీఎంసీలు వాడుకున్నారు. » బేసిన్లో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటున 181.52 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ నిర్ధారించింది. -ఆలమూరు రామగోపాలరెడ్డి -
శాంతిస్తున్న ‘గోదావరి’
సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురి సౌత్: కాటన్ బ్యారేజీ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. ఇక్కడ శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు నీటిమట్టం 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం రాత్రి 7 గంటలకు మరింత తగ్గుతూ నీటిమట్టం 12.10 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజీ నుంచి 10,33,672 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 9,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద శనివారం పూర్తిగా ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించే అవకాశమున్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 32.440 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 9.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39.40 అడుగులకు చేరుకుంది.తేరుకుంటున్న కోనసీమ లంకలుమరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ లంకలు నెమ్మదిగా తేరుకుంటున్నాయి. కానీ, జిల్లాలో ప్రధాన కాజ్‌వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి.దీంతో ఆయా ప్రాంతాల లంకవాసులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, శనివారం ఉదయం ముంపు మరింత తగ్గే అవకాశమున్నందున ఆదివారం నుంచి లంక గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముంది.శ్రీశైలానికీ తగ్గుతున్న వరద..ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికీ ఎగువ నుంచి వచ్చే వరద తగ్గింది. ఇక్కడకు గురువారం నుంచి శుక్రవారం వరకు 1,25,938 క్యూసెక్కుల నీరు రాగా.. శ్రీశైలం నుంచి దిగువకు 1,20,367 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 211.457 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి వచ్చే నీటి చేరిక తగ్గింది. -
వరదతో లంకవాసుల జీవితం ఛిద్రం
సాక్షి, అమలాపురం/సాక్షి, భీమవరం: గోదావరి, వశిష్ట గోదావరి మరోసారి పోటెత్తడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు లంక గ్రామాల్లోని ప్రజల జీవితం ఛిద్రమైంది. ఈ ఏడాది గోదావరి వరద లంక గ్రామాలను ముంచడం ఇది మూడోసారి. జూలైలో వచ్చిన వరదకంటే ఇప్పుడు వరద భారీగా ఉంది. జూలై చివర్లో వచ్చిన వరదలకే పలు పంటలకు నష్టం వాటిల్లగా ప్రస్తుత వరదలకు అక్కడక్కడా మిగిలిఉన్న కాస్త పంటలు కూడా దెబ్బతిన్నాయి. వరదల ప్రభావం అంబేడ్కర్ జిల్లాలోని పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలపై అధికంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లోని లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 12 మండలాల్లోని 44 శివారు గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. కాజ్వేలతోపాటు ప్రధాన రోడ్లపై 5 అడుగుల ఎత్తున నీరు చేరడంతో లంకవాసులు, విద్యార్థులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. అప్పనపల్లి గ్రామం, బి.దొడ్డవరం ఇందిరమ్మ కాలనీ, అయినవిల్లి మండలంలో వీరవల్లిపాలెం, పొట్టిలంక, ముమ్మడివరం మండలంలోని లంకాఫ్ ఠాన్నేల్లంక, కూనాలంక, గురజాపులంక, అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో వరద మరింత పెరిగింది. జిల్లాలోని మత్స్యకార గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఉద్యాన పంటలు మరోసారి పెద్ద ఎత్తున నీట మునిగాయి. అరటి, కంద, కోకో, కొబ్బరి, కూరగాయ పంటలు నీట నానుతున్నాయి. పాడి రైతులు పాలు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మత్స్యకారులు పది రోజులుగా వేట లేక ఇబ్బంది పడుతున్నారు.లంక భూములను ముంచెత్తిన వశిష్ట గోదావరిఎగువ నుంచి ఉరకలెత్తుతూ వస్తున్న జలాలతో వశిష్ట గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని పలు లంక గ్రామాలను వరద ముంచెత్తింది. ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని 600 ఎకరాల్లో కూరగాయలు, 80 ఎకరాల్లో తమలపాకుల పంటలకు నష్టం వాటిల్లింది. 200 ఎకరాల్లోని అరటి తోటలను వరద ముంచెత్తింది. యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక, దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం గ్రామాల్లో వరదనీరు చేరింది. వడ్డిలంక వద్ద స్లూయిజ్ గేటు సక్రమంగా మూసుకోకపోవడంతో గోదావరి నీరు నక్కల డ్రెయిన్‌లోకి ఎగదన్నుతోంది. -
రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం (ఫొటోలు)
-
Updates: ‘అధికారులెవరూ రాలేదండీ’
AP And Telangana Floods News Latest Updates In Teluguశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద జలాశయం 2 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో : 1,38,833 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 96,081 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 884.60 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు .. ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిజయవాడ 12 రోజులైనా ముంపు ప్రాంత ప్రజలకు తప్పని తిప్పలు ఇంకా మోకాళ్ల లోతు నీటిలోనే నానుతున్న అంబాపురంలోని కాలనీలు వరదలో ఉండలేక ఇళ్లను వదిలి వెళ్లిపోయిన ప్రజలు దొంగల భయంతో మళ్లీ ఇళ్లకు చేరుకుంటున్న కొందరు ప్రభుత్వం నుంచి ఈరోజు వరకూ తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆగ్రహం మంచినీరు కూడా సప్లై చేయడం లేదంటున్న అంబాపురం ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇళ్ల నుంచి బయటికి వస్తున్న వరద బాధితులు ఎన్యుమరేషన్ దాదాపు పూర్తైందంటున్న అధికారులు.. తమ వద్దకు ఏ ఒక్కరూ రాలేదంటున్న వరద బాధితులువాలంటీర్ వ్యవస్థ ఉంటే తమకు ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదంటున్న అంబాపురం వాసులునల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలభద్రాచలంతగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహంఈరోజు ఉదయం 11 గంటలకు 42.7అడుగుల గోదావరి నీటిమట్టంమొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులుసూర్యాపేటఅనంతగిరి, కోదాడ మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందంఅనంతగిరి మండలం గోండ్రియాల, కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడిలో ధ్వంసం అయిన ఇళ్లలు, నష్టపోయిన పంట, కోతకు గురైన రహదారులను పరిశీలించిన కేంద్ర బృందం క్లిక్ చేయండి: దేవుడా ఈ నరకం ఇంకెన్నాళ్లూ! ప్రకాశం బ్యారేజీ వద్ద కేంద్ర బృందంప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందంబోటు ప్రమాదంలో దెబ్బ తిన్న బ్యారేజీని పరిశీలించిన సభ్యులుఖమ్మం ఖమ్మం నగరంలోని వరదల్లో నీట మునిగిన నయా బజార్ కాలేజీ ని పరిశీలించిన ఎమ్మెల్సీ కోదండరాం అనంతరం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కొనసాగుతున్న ఆపరేషన్ బోట్ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమంనిన్నంతా కష్టపడ్డ అండర్ వాటర్ టీంఇవాళ కూడా కొనసాగనున్న పనులుబోట్లను ముక్కలు చేసి ఆపై బెలూన్లతో తొలగించే యత్నంమెదక్ఏడుపాయాల ఆలయం మళ్లీ మూసివేతసింగూరు గేట్లు ఎత్తేయడంతో భారీగా నీరుఆలయాన్ని తాకుతూ నీటి ప్రవాహంరెండ్రజుల కిందటే తెరుచుకున్న ఆలయంఈలోపే మళ్లీ మూసేసిన నిర్వాహకులుబ్యారేజీకి కేంద్ర కమిటీనేడు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కేంద్ర కమిటీ ప్రకాశం బ్యారేజీ చెంతకు కమిటీప్రస్తుత బ్యారేజీ పరిస్థితిపై ఆరా తీయనున్న సభ్యులు ఎన్టీఆర్ జిల్లా:వరద ప్రభావిత ప్రాంతాల్లో అనిల్ సుబ్రహ్మణ్యం నేతృతంలో కేంద్ర బృందం పర్యటనకలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన కేంద్ర బృందంవరద ముంపు ప్రాంతాల డ్రోన్ విజువల్స్ పరిశీలననష్టంపై కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ జి.సృజనకేంద్ర బృందాన్ని కలిసి తమకు జరిగిన నష్టంపై వినతిపత్రం అందజేసిన కృష్ణామిల్క్ యూనియన్ (విజయ డైరీ ) చలసాని ఆంజనేయులుఫోటో ఎగ్జిబిషన్ అనంతరం ప్రకాశం బ్యారేజ్, బుడమేరు గండ్లు పడిన ప్రాంతం, ఈలప్రోలు, రాయనపాడు, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం నంద్యాల:శ్రీశైలం జలాశయానికి కోనసాగుతున్న వరద నీరుజలాశయం 1 గేటు 10 అడుగులు మేరకు మరొక్కసారి ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో: 1,38,833 క్యూసెక్కులుఔట్ ఫ్లో: 96,081 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలుప్రస్తుతం: 212.9198 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి విజయవాడ:విజయవాడలో ఇంకా ముంపులోనే పలు కాలనీలు12 రోజులైనా బురదలోనే ముంపు ప్రాంతాలుశుభ్రం చేసుకునేందుకు అవస్థలుపడుతున్న కాలనీల వాసులునీళ్లలో నానుతున్న ఎల్బీఎస్ నగర్, కండ్రిక, తోటివారి వీధిముంపులోనే ప్రకాశ్ నగర్, అంబపురంలోపల కాలనీల ప్రజలకు అందని సాయం రోడ్ల మీద బురద పేరుకుపోవటంతో ప్రజలకు అవస్థలుప్రచార ఆర్భాటంగా ఎన్యుమరేషన్మ్యాపింగ్ ఉంటేనే ఎన్యుమరేషన్ అంటున్న అధికారులుఇంట్లోని సామాన్లకు మాత్రమే జరుగుతున్న ఎన్యుమరేషన్ ఖమ్మం జిల్లాఖమ్మం నగరంలో బొక్కలగడ్డ, ధంసలాపురం ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టంఈరోజు ఉదయం 9 గంటలకు 43.3 అడుగులుకు చేరిన గోదావరి నీటిమట్టంఅమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరికఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.స్పిల్ వే ఎగువన 33.750 మీటర్లుస్పిల్ వే దిగువన 25.580 మీటర్లు నీటిమట్టం నమోదు.48 రేడియల్ గేట్ల ద్వారా 12,46.342,క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల.ఏలూరు జిల్లాజంగారెడ్డిగూడెం మండలం కొంగ వారిగూడెం ఎర్రకాలవ జలాశయానికి తగ్గిన వరద నీరు.పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 81.87ఇన్ ఫ్లో 1565 క్యూసెక్కులు అవుట్ ఫ్లో గేట్లు ఎత్తి 1806 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేసిన అధికారులునల్లగొండ జిల్లానాగార్జునసాగర్ ప్రాజెక్టు కు తగ్గిన వరదక్రస్ట్ గేట్లు మూసివేతఇన్ ఫ్లో: 68235 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో : 43298 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 310.8498 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఎడమ కాలువకు నీటిని నిలిపివేసి నేటికి 12 రోజులుసూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద ఇంకా పూడ్చివేయని కాలువ గండిసూర్యాపేట జిల్లా:పులిచింతల అప్డేట్ఇన్ ఫ్లో 31,182క్యూసెక్కులుఅవుట్ ఫ్లో:16,000క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం:175 అడుగులుప్రస్తుత నీటి మట్టం:172.767 అడుగులుపూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 38.765 టీఎంసీలుపవర్ జనరేషన్ :16000 క్యూసెక్కులు.నిజామాబాద్ జిల్లాశ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుఔట్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 80 టీఎంసీలుప్రస్తుతం 1090 అడుగులు, 80 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కమిటీ పర్యటన.ఖమ్మం, సూర్యాపేటలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బృందం.వరద బాధితులను ఆదుకోవాలని నిన్న సెంట్రల్ కమిటీకి నివేదిక ఇచ్చిన సిఎస్.ఇవ్వాల్టితో ముగియనున్న రాష్ట్ర పర్యటన.జూరాల అప్డేట్మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద13 గేట్స్ ఎత్తివేతఇన్ ఫ్లో : 1 లక్ష 26 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1 లక్ష 26 వేల 243 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.270 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 318.350మీటర్లుపూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 9.316 టీఎంసీలుఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాగోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుబ్యారేజ్ వద్ద 15.3 అడుగులుగా నమోదైన గోదావరి వరద నీటిమట్టం15 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలబ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలుసఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక టేకి శెట్టిపాలెం మధ్య వరద నీరు రావడంతో పడవలపై రాకపోకలుఅప్పనపల్లి-పెదపట్నం లంక మధ్య వరద నీరు రావడంతో అవస్థలు పడుతున్న స్థానికులుఇప్పటికే నీట మునిగిన గంటి పెదపూడి, ఎదురుబిడియం, కనకాయలంక కాజ్వేలువరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు రోజులపాటు వినాయక నిమజ్జనాన్ని చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన అధికారులుకోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న వశిష్ట , గౌతమి, వైనతేయ నదులు -
గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం అర్బన్/ఏటూరునాగారం: గోదావరి నదికి ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 7:32 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరింది. దీంతో ఆర్డీ ఓ దామోదర్‌రావు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం అంతకంతకూ పెరు గుతూ సాయంత్రం 5:15 గంటలకు 48 అడుగులు దాటి ప్రవహించడంతో రెండో ప్ర మాద హెచ్చరిక కూడా జారీ చేశారు. వరద పెరుగుతున్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ సూచించారు.అధికారులు అప్రమత్తంగా ఉండి, ముంపు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రం నాటికి 15.80 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాలైన రామన్నగూడెం, ఏటూరునాగారం గ్రామంలోని ఓడవాడ, 1, 2, 10 వార్డుల్లోని ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో నది ప్రవహిస్తోంది. 15.83 మీటర్లకు చేరితే.. రెండు ప్రమాద హెచ్చరిక, 17.33 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి కరకట్ట వద్ద పోలీసులు, రెవెన్యూ, కేంద్ర జలవనరుల శాఖ, ఇరిగేషన్ అధికారులు పహారా కాస్తున్నారు. సాగర్ 26 గేట్లూ ఎత్తివేతనాగార్జునసాగర్/ దోమలపెంట: నాగార్జునసాగర్ జలాశయానికి వరద పెరిగింది. దీంతో మంగళవారం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 2,50,257 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆరుగేట్లు కూడా... కృష్ణానదికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు పైకెత్తి 1,64,592 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. -
శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాల ప్రవాహం పెరిగింది. శ్రీశైలానికి జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 1,47,682 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో శుక్రవారం 6 గేట్లను తెరచి నాగార్జునసాగర్‌కు 1,67,076 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 212.91 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం స్పిల్‌వే, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో శుక్రవారం నాగార్జున సాగర్ జలాశయానికి 2,04064 క్యూసెక్కులు జలాలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి 20 క్రస్ట్ గేట్లు ఎత్తి స్పిల్‌వే మీదుగా 1,61,800 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో మరో 28,339 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, ఏఎమ్మారీ్ప, వరద కాల్వల ద్వారా 13,925 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి 1,31,803 క్యూసెక్కులు వస్తుండగా 202 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నారు. మిగులుగా ఉన్న 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. శాంతిస్తున్న గోదావరి ధవళేశ్వరం: ఉరకలెత్తిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.10 అడుగులకు చేరింది. గురువారం రాత్రి 11.75 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అనంతరం క్రమేపీ పెరుగుతూ శుక్రవారం ఉదయానికి 12.30 అడుగులకు చేరింది. సాయంత్రం 6 గంటలకు స్వల్పంగా తగ్గింది. కాటన్ బ్యారేజీ నుంచి 10,36,440 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. డెల్టా కాలువలకు 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ∙ఆరు గేట్ల ద్వారా 1,67,076 క్యూసెక్కులు విడుదల ∙ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి -
పెరుగుతున్న గోదారమ్మ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం, ప్రధాన పాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉప నదులు వరదెత్తడంతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చి0ది. బుధవారం సాయంత్రం 6 గంటకు భద్రాచలం వద్దకు 8.79 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 45.55 అడుగులకు చేరుకుంది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం అర్ధరాత్రికి భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉంది. అప్పుడు అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. పోలవరంలోకి ఎగువ నుంచి వల్చిన వరదను వల్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 7,02,506 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్కులను విడుదల చేస్తున్న అధికారులు మిగులుగా ఉన్న 7,00,706 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.ఎగువన తెలంగాణలోని ప్రాజెక్టుల్లోనూ గోదావరి పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ధవళేశ్వరం బ్యారేజ్‌కి వరద మరింత పెరగనుంది. గురువారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 48 గ్రామాలకు నిలిచిన రాకపోకలు గోదావరి పెరుగుతుండడంతో శబరి నది ఎగపోటుకు గురై చింతూరు మండలంలో వాగులు పొంగుతున్నాయి. దీంతో విలీన మండలాల్లో రహదారులు ముంపునకు గురై 48 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, వీఆర్‌పురం మండలాల నడుమ, చింతూరు మండలంలో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
గోదా‘వడి’ పెరుగుతోంది
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 3.05 లక్షల క్యూసెక్కులు వరద నీరు చేరింది. గోదావరి డెల్టాకు 3 వేల క్యూసెక్కులు వదులుతూ.. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో బ్యారేజ్‌లో ఫ్లడ్‌కుషన్ ఉంచడానికి కొంతమేర ఖాళీ చేస్తూ సముద్రంలోకి 3.09 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శ్రీరాంసాగర్‌లోకి 2.45 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. గేట్లు ఎత్తేసి 2.40 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దాని దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 4.72 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ప్రాణహిత ఉద్ధృతితో కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారేజ్)లోకి 9.02 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. దాని దిగువన సమ్మక్క బ్యారేజ్‌లోకి 7.23 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌లోకి 7.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద మంగళవారం రాత్రికి గోదావరి 39 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ఇది క్రమేపీ పెరుగుతూ అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దిగువన పోలవరం ప్రాజెక్టు వద్ద 29.550 మీటర్ల మేర నీటిమట్టం ఉంది. స్పిల్‌వే నుంచి 4 లక్షల 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భారీ వర్షాల కారణంగా వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
Nashik: ఉప్పొంగిన గోదావరి.. నీట మునిగిన ఆలయాలు
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు.నాసిక్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం ఎనిమిదిన్నర వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. ఫలితంగా రాంకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి.గంగాపూర్ డ్యాం సహా పలు డ్యాంల నుంచి అధికారులు క్రమంగా నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్‌లోని హోల్కర్ వంతెన కింద నుంచి 13,000 క్యూసెక్కుల వేగంతో నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్ పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, నది ఒడ్డున ఉన్న గ్రామాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
కావేరికి దారేది?
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) విఫలమవుతోంది. దీంతో ఏడేళ్లుగా ఈ ప్రతిపాదనలో ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి. నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలను ఎన్‌డబ్ల్యూడీఏ తీసుకోకుండా గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదన రూపొందించడమే దానికి కారణమని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తొలుత అకినేపల్లి.. ఆ తర్వాత జానంపల్లి.. ఇప్పుడు ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించేలా డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను ఎన్‌డబ్ల్యూడీఏ సిద్ధం చేసింది. తమ కోటా నీటిని కావేరికి ఎలా తరలిస్తారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానానికి అంగీకరించే ప్రశ్నే లేదని తెలంగాణ సర్కార్ చెబుతోంది.బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచి కావేరికి గోదావరి జలాలను తీసుకెళ్లేలా ప్రతిపాదనలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ఎన్‌డబ్ల్యూడీఏ విఫలమవుతున్న నేపథ్యంలో కావేరితో గోదావరి అనుసంధానం కష్టమేనని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఏకపక్షంగా ప్రతిపాదన.. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీలకు 107 టీఎంసీల మిగులు జలాలను జతచేసి 248 టీఎంసీలను అకినేపల్లి నుంచి కావేరికి తరలించేలా 2017లో ఎన్‌డబ్ల్యూడీఏ డీపీఆర్‌ను రూపొందించింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా జానంపేట నుంచి 248 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా 2018లో డీపీఆర్‌లో మార్పులు చేసింది. దీనిపై కూడా మూడు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఛత్తీస్‌గఢ్ ససేమిరా అంటున్నాగోదావరిలో మిగులు జలాలే లేవని.. నీటి లభ్యతే లేనప్పుడు అనుసంధానం ఎలా చేపడతారని 2020లో ఏపీ ప్రభుత్వం ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. దాంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీలను ఇచ్ఛంపల్లి నుంచి కావేరికి తరలించేలా 2022లో డీపీఆర్‌లో ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానం చేపడితే దేవాదుల, సీతారామ ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచే కావేరికి గోదావరి జలాలను తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ కోటా నీటిని కావేరికి తరలించడానికి అనుమతించే ప్రశ్నే లేదని.. కాదూ కూడదని అనుసంధానం చేపడితే న్యాయపోరాటం చేస్తామని ఛత్తీస్‌గఢ్ సర్కార్ స్పష్టం చేసింది. కానీ.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచే ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని నీటిని కావేరికి తరలించే ప్రతిపాదననే ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ తెరపైకి తేవడంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
గొట్టిముక్కల ఎగువన రెండు జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా గొట్టిముక్కలకు ఎగువన లోయ తరహాలో ఉన్న ప్రాంతాల్లో రెండు జలాశయాలను నిర్మించాలని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలను కేటాయించారని.. కానీ ఆ నీటితో ప్రతిపాదించిన 5.30 లక్షల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే 3 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ–2 ద్వారా నీళ్లు అందుతున్నాయని వివరించింది. అందువల్ల ఈ 45 టీఎంసీల నీటిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి రెండు జలాశయాలను నిర్మించాలని కోరింది.గోదావరి–కావేరి అనుసంధానంపై శుక్రవారం జలసౌధలో తెలంగాణతో ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం నిర్వహించింది. ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీఈ దేవేందర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్, రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్ పాల్గొన్నారు. భేటీలో రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. అనుసంధానం ప్రాజెక్టుపై రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటి సరఫరా కోసం 250 టీఎంసీలు అవసర మని చెప్పారు. అందువల్ల ప్రాజెక్టు ద్వారా తరలించే నీటిలో 50 శాతాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు.రాష్ట్రం చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవీ..⇒ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీటి తరలింపు కోసం ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని మా అధ్యయనంలో తేలింది. సమ్మక్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలి. రాష్ట్ర అవసరాల కోసం సమ్మక్క బరాజ్‌లో 83 మీటర్ల వరకు నిల్వలను సంరక్షిస్తూ ఆపై నిల్వలను మాత్రమే తరలించాలి. తెలంగాణకు సీతమ్మసాగర్ ప్రాజెక్టు కింద 70 టీఎంసీలు, సమ్మక్క ప్రాజెక్టు కింద 50 టీఎంసీలు, దేవాదుల కింద 38 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీల అవసరాలు ఉన్నాయి. వాటిని సంరక్షించాలి. సీతమ్మ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి అవసరమైన కనీస నిల్వలను కాపాడాలి.⇒ సమ్మక్క బరాజ్‌లో 87 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే ఛత్తీస్‌గఢ్‌లో జరిగే ముంపు విషయంలో ఆ రాష్ట్రాన్ని ఒప్పించే బాధ్యతను ఎన్‌డబ్ల్యూడీఏ తీసుకోవాలి. ఛత్తీస్‌గఢ్ వాడుకోకపోవడంతో మిగిలే 148 టీఎంసీల గోదావరి జలాలను గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించనున్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై ఆ తర్వాతే సంతకాలు చేస్తాం.⇒ అనుసంధానం ప్రాజెక్టులో కాల్వలు, సొరంగాల కోసం సేకరించాల్సిన భూముల్లో రెండు పంటలు పండే ఆయకట్టు భూములున్నాయి. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రం నిర్మించనున్న కాల్వల వ్యవస్థనే అనుసంధానం ప్రాజెక్టు అవసరాలకూ వాడుకోవాలి.⇒అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి కావేరికి తరలించాలని ప్రతిపాదించారు. అయితే కీలకమైన కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు వచ్చే వరకు సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోరాదు. సాగర్ నిర్వహణ ప్రొటోకాల్‌తోపాటు ఏపీ, తెలంగాణలకు నీటి కేటాయింపులపై స్పష్టత వచ్చాకే ఈ విషయంలో ముందుకు వెళ్లాలి.50 శాతం వాటా మినహా మిగతావి ఓకే: ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్అనుసంధానం ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో తెలంగాణకు 50 శాతం కేటాయించాలనే డిమాండ్ విషయంలో పట్టువీడాలని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ కోరారు. రెండు కొత్త జలాశయాల నిర్మాణం, సమ్మక్క బరాజ్ నుంచే నీటి తరలింపు, ఛత్తీస్‌గఢ్ నుంచి సమ్మతి తీసుకోవడం తదితర అంశాలన్నింటి పట్ల సానుకూలంగా ఉన్నామని తెలిపారు. తదుపరి చర్చల్లో ఈ అంశాలపై మరింత పురోగతి సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎంఓయూ చేసుకోవాలని కోరారు.గౌరవెల్లి కాల్వల పనులకు అనుమతిసాక్షి, హైదరాబాద్: శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు–ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఐఎఫ్ఎఫ్సీ) ప్రాజెక్టులోని ప్యాకేజీ– 7లో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లను తరలించే కాల్వల నిర్మాణం కోసం రూ.431.30 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన అనుమ తులు జారీ చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధి లోని 1,06,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ఈ పనులు చేపట్టనున్నారు. భూసేకరణలో పురోగతితో సంబంధం లేకుండా మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
హైదరాబాద్‌కు మల్లన్నసాగర్ జలాలు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ‘నీటి’కబురు చెప్పింది. నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి మంచినీటి సరఫరా ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ మంగళవారం ఉత్తర్వులు (జీవో నంబర్ 345) జారీ చేశారు. ఈ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పునరుజ్జీవింప చేయనుంది. హైబ్రిడ్ యాన్యుటీ (బీఓటీ + ఈపీసీ) మోడ్‌లో పనులు పూర్తి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు వివిధ మార్గాల ద్వారా 580 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నుంచి 600 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. అయితే 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా 170 ఎంజీడీల జలాల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఈ అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్–2ను చేపట్టాలని నిర్ణయించింది. 2030వ సంవత్సరం నాటికి హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీలకు పెరుగుతుందనే అంచనా ఉండగా, 2050 నాటికి ఇది 1,014 ఎంజీడీలకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. డీపీఆర్ సిద్ధం చేసిన వాప్కోస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను వాప్కోస్ కంపెనీ సిద్ధం చేసింది. ప్రాజెక్టులో భాగంగా పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు, మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3,600 ఎంఎం డయా భారీ పైప్‌లైన్ నిర్మించనున్నారు. ఘన్పూర్ వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపడతారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.3849.10 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.5,560 కోట్లు కేటాయించడంతో మొత్తంగా నగరానికి రూ.9410 కోట్లు కేటాయించినట్లయింది. మొత్తం 15 టీఎంసీల తరలింపుగోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్ల్యూఎస్) పథకం ఫేజ్–1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా రెండో దశ పథకం ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీల నీటిని నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగతా ఐదు టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను పునరుజ్జీవింప చేసేందుకు ఉపయోగించనున్నారు. -
సాగర సంబురం
సాక్షి,హైదరాబాద్/దోమలపెంట: శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతుండగా,నాగార్జునసాగర్ ప్రాజెక్టు సైతం జలకళను సంతరించుకుంటోంది. బిరబిరా కృష్ణమ్మ తరలివస్తుండడంతో నాగార్జునసాగర్‌లో గంట గంటకూ నీటినిల్వ పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం రాత్రి 7 గంటలకు 4,13,178 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 883.5 అడుగుల వద్ద 207.41 టీఎంసీలకు చేరుకుంది.ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటం.. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది, దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 60,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యు దుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది.నాగార్జునసాగర్‌లోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1,55,716 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 517.2 అడుగుల వద్ద 144.22 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.. పూర్తి నిల్వసామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 170 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారంరోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశముంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో పశి్చమ కనుమల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణా, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.కృష్ణా ప్రధానపాయ నుంచి ఆల్మట్టి డ్యామ్‌లోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 2.85 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.77 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 70 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మళ్లీ గోదావరికి పెరిగిన వరదమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా వర్షాలుసాక్షి, హైదరాబాద్: గోదావరినది పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది.భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ బుధవారం గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుందని కేంద్ర జలసంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులను హెచ్చరించింది. ప్రాణహితలో వరద పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోకి వరద ప్రవాహం 7.71 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దానికి ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క సాగర్) బరాజ్‌లోకి 9.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.సీతమ్మసాగర్(దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 9.64 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్దకు మంగళవారం సాయంత్రం 8.45 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. నీటి మట్టం 43.7 అడుగులుగా నమోదైంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 10.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.ధవళేశ్వరం బరాజ్‌లోకి 11,26,625 క్యూసెక్కులు చేరుతుండగా.. 11,19,425 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బరాజ్ వద్ద నీటిమట్టం 12.6 అడుగులుగా నమోదవుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక కూనవరం వద్ద శబరి ఉధృతితో నీటిమట్టం 39.25(సముద్రమట్టానికి) మీటర్ల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. -
దోబూచులాడుతున్న గోదావరి
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం/అమలాపురం: గోదావరి నదిలో వరద ప్రవాహం దోబూచులాడుతోంది. దిగువన వరద తగ్గుతుండగా.. ఎగువన పెరుగుతోంది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఖమ్మం జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకు బుధవారం గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని కేంద్ర జలసంఘం అధికారులను హెచ్చరించింది. కూనవరం వద్ద శబరి వరద ఉధృతి అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుందని వెల్లడించింది. ప్రాణహితలో వరద పెరగడంతో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి వరద ప్రవాహం 7.71 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. అదేస్థాయిలో బ్యారేజీ నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దానికి ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బ్యారేజీలోకి 9.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్‌లోకి చేరుతున్న 9.64 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 10.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి మంగళవారం మరింత తగ్గింది. సాయంత్రం 6 గంటలకు 175 గేట్లను ఎత్తి బ్యారేజీ నుంచి 11,30,731 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేశారు. దిగువన వరద తగ్గడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో ముంపు వీడుతోంది. -
లంక గ్రామాలు అస్తవ్యస్తం
సాక్షి, అమలాపురం : పాడి పంటలు.. అన్నపానీయాలు అందించి డెల్టాను సస్యశ్యామలంగా మార్చిన గోదావరే.. ఏటా ఉగ్రరూపం దాల్చి గ్రామాలను ముంచెత్తుతోంది. పాడి పంటలకు అంతులేని నష్టాన్ని మిగులుస్తోంది. అపారమైన నష్టాన్ని కలగజేస్తోంది. రోడ్లు, డ్రెయిన్లు, కాలువలను ఏకం చేస్తోంది. వాహనాలను పక్కనబెట్టి పడవల మీద రాకపోకలు సాగించేలా చేస్తోంది. చేలు, చెరువులు, ఉద్యాన పంటలను కబళిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే లంక గ్రామాలను అస్తవ్యస్థం చేస్తోంది. వరుసగా రెండుసార్లు ముంచెత్తిన గోదావరి వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వరద ముంపులో 21వేల కుటుంబాలు.. గోదావరి వరదలవల్ల జిల్లాలో 12 మండలాల్లోని 47 శివారు గ్రామాలు నీట మునిగాయి. 21,492 కుటుంబాలు వరద ముంపు బారినపడ్డాయి. పి. గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, ఐ.పోలవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ఇది అధికంగా ఉంది. వరదకు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ స్థానికులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. ఎటుచూసినా వరద నీరు తప్ప మరొకటి కనిపించడంలేదని లంక వాసులు వాపోతున్నారు. అల్లవరం మండలం బోడసుకుర్రు, ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 293 కుటుంబాలకు చెందిన 809 మందికి పునరావాసం కల్పించి ఆహార పొట్లాలను అందిస్తున్నారు. ఎనిమిది గృహాలు దెబ్బతిన్నాయి. 3,943.30 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అరటి, కంద, పసుపు, కర్ర పెండలం, కోకో పంటలతోపాటు కూరగాయ పంటలకు అధిక నష్టం కలిగింది. పన్నెండు రోజులుగా నదీపాయల్లో వరద కొనసాగుతుండడంవల్ల డెల్టాలోని మురుగునీటి కాలువల ద్వారా ముంపు నీరు దిగడంలేదు. వరద నీరు రాకుండా అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు మూసివేశారు. ఇదే సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డెల్టాలో వరిచేలు నీట మునగడంతో పంట దెబ్బతింది. అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ 2,734 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కానీ, ఇంతకు రెట్టింపు నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. వీటితోపాటు 300 ఎకరాల్లో వెనామీ రొయ్యల సాగు తుడుచుపెట్టుకుపోయిందని అంచనా. పాలు మా వద్దే ఉండిపోతున్నాయి.. నాకు మూడు గేదెలున్నాయి. రోజుకు ఆరు లీటర్ల పాలు వస్తాయి. పాలు కొనుగోలు చేసే వ్యాపారులు వరదలు కారణంగా రావడంలేదు. ఇంట్లోనే కొంత వాడాల్సి వస్తోంది. వరదలవల్ల పచ్చగడ్డి కొరత అధికంగా ఉంది. గతంలో వరదల సమయంలో ఎండు గడ్డి ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడంలేదు. – కుసుమ కోటేశ్వరరావు, అయినవిల్లి లంక, అయినవిల్లి మండలం ఈ నాలుగు నెలలు పడవ ప్రయాణమే.. వరదలు ఉండే ఈ నాలుగు నెలలు పడవ మీదనే రాకపోకలు చేయాల్సింది. ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు రేవు దాటి బస్సుపై నరసాపురం వెళ్తుంటా. తిరిగి వచ్చేసరికి రాత్రి ఏడవుతుంది. ఎక్కువ సమయం పడవ మీదే సరిపోతోంది. తిరిగొచ్చే వరకూ ఇంట్లో వారికి ఆందోళనే. – దొడ్డా శివ, బూరుగుపూడి, పి.గన్నవరం మండలం బీర, బెండ పంట దెబ్బతింది.. రెండు ఎకరాల్లో బీర, బెండ పాదులు సాగుచేశా. ఎకరాకు రూ.40 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. పంట మంచి కాపు మీద ఉంది. దిగుబడి బాగా వస్తుందని ఆశించాను. 11 రోజులుగా వరదలు ముంచెత్తడంతో కాయగూర పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. పాదులు కుళ్లిపోయాయి. పెట్టుబడులు కూడా వచ్చే అవకాశంలేదు. లంక గ్రామాల్లో రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, మమ్ముడివరం మండలంచెరువులను ముంచేసింది అన్నంపల్లిలో నాలుగు ఎకరాల్లో ఆక్వా సాగుచేశా. ఈసారి కౌంట్ అనుకున్నంత వేగంగా రాలేదు. దీంతో చెరువుల పట్టుబడులు ఆలస్యమయ్యాయి. ఆగస్టులో రావాల్సిన వరద జూలైలో వచి్చంది. చెరువులు మొత్తం మునిగిపోయాయి. కౌంట్ 120 ఉన్న సమయంలో పట్టుబడులు చేసినా అనుకున్నంత రేటు రాలేదు. నష్టాలను చవిచూడాల్సి వచి్చంది. – దంతులూరి నానిరాజు, అన్నంపల్లి, ఐ.పోలవరం మండలం సాయం అందించాలి.. ఏటా వరదల సమయంలో వేటకు విరామం ప్రకటించాల్సి వస్తోంది. మాకు చేపల వేట మాత్రమే జీవనోపాధి. వేటకు వెళ్లకపోతే కుటుంబ పోషణ కష్టం. వరదల సమయంలో ప్రభుత్వం నిత్యావసర వస్తువుల రూపంలో ఇచ్చే సాయం కంటే ఆర్థికంగా సాయం అందించాలి. – సంగాడి ముత్యాలు, మత్స్యకారుడు, మసకలపల్లి. కె.గంగవరం మండలం -
శాంతిస్తున్న గోదావరి
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగు లు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో సోమవారం గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. ఉగ్రరూపం దాలి్చన గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు.దానికి ఇంద్రావతి ప్రవాహం తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క) బ్యారేజ్‌లోకి చేరుతున్న 8.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బ్యారేజ్‌లోకి 9.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద సోమవారంరాత్రి 9 గంటలకు నీటిమట్టం 42.90 అడుగులకు చేరుకుంది.దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమ య్యాయి. కాగా ముంపు కాలనీ వాసులను సోమవారం సైతం పునరావాస శిబిరాల్లోనే కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం 11.78 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో స్పిల్ ఎగువన నీటిమట్టం 33.46 మీటర్లకు తగ్గింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి వచ్చిన వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,50,084 క్యూసెక్కులు చేరుతుండగా.. 14,42,384 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
నీట మునిగిన యానాం
-
నెమ్మదించిన గోదారి
సాక్షి, హైదరాబాద్: గోదావరి పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాతో పాటు తెలంగాణలో వర్షాలు తెరపి ఇవ్వడంతో ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కి శనివారం సాయంత్రం 6 గంటలకు 5,39,200 క్యూసెక్కుల ప్రవాహం రాగా ఆదివారం అదే సమయానికి 4,06,510 క్యూసెక్కులకు తగ్గింది. సమ్మక్క బరాజ్ (తుపాలకుగూడెం)కి వరద 9,75,910 క్యూసెక్కుల నుంచి 8,45,560 క్యూసెక్కులకు తగ్గింది. సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) బరాజ్‌కి సైతం వరద 13,95,637 క్యూసెక్కుల నుంచి 11,65,362 క్యూసెక్కులకు పడిపోయింది. ఈ మూడు బరాజ్‌లకు వచి్చన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద ఉదయం నుంచి తగ్గుముఖంశనివారం అర్ధరాత్రి భద్రాచలం వద్ద 53.60 అడుగులతో మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన వరద, ఆదివారం ఉదయం 6 – 7 గంటల మధ్య 53 అడుగుల దిగువకు రాత్రి 11గంటల కల్లా 47.20 అడుగులకు తగ్గింది. దీంతో తొలుత అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఆ తర్వాత రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ప్రవాహం సైతం 14,36,573 క్యూసెక్కుల నుంచి 11,08,154 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు ఏపీలోని చింతూరు, కూనవరం వద్ద శబరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టులోకి 13,35,413 క్యూసెక్కు లు చేరుతుండగా స్పిల్ వే 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. వరద కాల్వకు జలకళ బోయినపల్లి (చొప్పదండి): మెట్టప్రాంత రైతుల వరప్రదాయని వరద కాల్వ ఆరు నెలల తర్వాత జలకళను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలు కరీంనగర్ జిల్లా రామడుగు లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్ నుంచి వరదకాల్వ మీదుగా రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మ«ధ్య మానేరుకు చేరుకుంటున్నాయి. రామడుగు మండలం లక్ష్మీపూర్ నుంచి బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర వరద కాల్వలో జలసవ్వడులు వినిపిస్తున్నాయి.భద్రాచలంలో ఇళ్లల్లోకి నీళ్లుభద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే పట్టణంలోని ఏఎంసీ కాలనీకి ఎగువ భాగాన ఉన్న కరకట్ట స్లూయిజ్ నుంచి ఆదివారం సైతం వరద నీరు లీక్ కావడంతో అశోక్‌నగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు గ్రామాల నడుమ ఇంకా రాకపోకలు సాగడం లేదు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా వరద నీరు తగ్గింది. -
మరింత పెరిగిన ‘గోదావరి’
సాక్షి, అమరావతి/సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం సా.6 గంటలకు బ్యారేజ్‌లోకి 15,99,761 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. డెల్టా కాలువలకు తొమ్మిది వేల క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 15,90,761 క్యూసెక్కుల ప్రవాహాన్ని అధికారులు 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గరిష్టంగా వచ్చిన వరద ఇదే. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 15.7 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.మరోవైపు.. శనివారం రాత్రి నుంచి బేసిన్లో వర్షాలు కాస్త తెరిపివ్వడంతో ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రావతి తదితర ఉప నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం కూడా క్రమేణ తగ్గుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు 48.4 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక చింతూరు, కూనవరం వద్ద శబరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో గ్రామాలు, రహదారులు ముంపులోనే ఉన్నాయి. చింతూరు డివిజన్లోని నాలుగు మండలాల్లోని 191 గ్రామాలు వరదలకు ప్రభావితమైనట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. 35,746 కుటుంబాలను 149 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టులోకి 13,35,413 క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే 48 గేట్ల ద్వారా ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వే ఎగువన నీటి మట్టం 34.12 మీటర్లకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలోని పోలీస్ చెక్‌పోస్ట్‌లో రెండు అడుగుల మేర నీరు చేరింది. దీంతో దీనిని మరోచోటుకి మార్చారు. ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలో కూడా ఐదు అడుగుల మేర వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, ఏజెన్సీ సిబ్బంది కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటుచేశారు. ఇక ఎగువన వరద ప్రవాహం క్రమేణ తగ్గుతుండడంతో సోమవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టనుంది. లంక గ్రామాలను ముంచెత్తుతున్న వరద..మరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోసీమ జిల్లాలో గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లో శనివారం కన్నా ఆదివారం సాయంత్రం అడుగున్నర నుంచి రెండడుగుల ఎత్తున వరద పెరిగింది. మరో రెండడుగుల వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని లంక గ్రామాల్లో జూన్ 19న మొదలైన వరద ముంపు పది రోజులుగా కొనసాగుతోంది. పి. గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో వరద తీవ్రత అధికంగా ఉంది. పలు లంక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద చేరుతోంది. వరదలు, భారీ వర్షాలవల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డెల్టాలో మురుగునీటి కాలువలు పొంగి పొర్లుతుండడంతో సుమారు 5 వేల ఎకరాల్లో చేలు నీట మునిగాయి. అలాగే, లంక గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో అరటి, కంద, కూరగాయ పంటలు నీట మునిగాయని అంచనా. మరో నాలుగు రోజులపాటు వరద ముంపు ఉండే అవకాశం ఉన్నందున నష్టం మరింత పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌లు కె.గంగవరం మండలం కోటిపల్లి వరద ప్రాంతాల్లో పర్యటించారు.పరిహారమివ్వండి.. పునరావాసం కల్పించండి..వరద నీటిలో బాధితుల ఆందోళనఏటా వరదల కారణంగా బాధలు పడలేకపోతున్నామని, తమకు పోలవరం పరిహారం ఇచ్చి సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో వరద బాధితులు ఆదివారం వరదనీటిలో ఆందోళన చేపట్టారు. ఏటా జూలై నుంచి సెప్టెంబరు వరకు తమకు ఈ వరద కష్టాలు తీరడంలేదని, ఏడాది పొడవునా సంపాదించిందంతా వరదల సమయంలో సామాన్ల తరలింపుకే ఖర్చయిపోతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వడంతో పాటు ఇతర ప్రాంతాల్లో పునరావాసం కల్పించి తమను ఇక్కడినుంచి తరలించాలని బాధితులు డిమాండ్ చేశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న ఐటీడీఏ పీఓ కావూరి చైతన్య హామీతో వారు ఆందోళన విరమించారు.