పాపికొండల విహార యాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ | Ap Govt Green Signal To Papikondalu Tour | Sakshi
Sakshi News home page

పాపికొండల విహార యాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌

Published Wed, Sep 6 2023 7:19 AM | Last Updated on Wed, Sep 6 2023 7:19 AM

Ap Govt Green Signal To Papikondalu Tour - Sakshi

దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరిలో పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు.

ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు. బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారి పేరంటపల్లికి వెళ్లనున్నారు.
చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement