green signal
-
తెలంగాణలో కొలువుల జాతర.. భారీ నోటిఫికేషన్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫైల్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేసింది. 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.ఆయా జిల్లా కలెక్టర్లు.. నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఖాళీల భర్తీ ప్రక్రియతో మరింత పటిష్టంగా అంగన్వాడీలు పనిచేయనున్నారు. -
ఇస్రోకి తీపి కబురు.. మూడో లాంచ్ ప్యాడ్ కు మోదీ గ్రీన్ సిగ్నల్
-
4 ఐపీవోలకు సెబీ సై
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో డాక్టర్ అగర్వాల్స్ హెల్త్కేర్సహా కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా చేరాయి. గతేడాది సెప్టెంబర్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. అయితే మౌరి టెక్, అమంటా హెల్త్‌కేర్ ఐపీవో ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గాయి. వివరాలు చూద్దాం.. ఐకేర్ కంపెనీ పీఈ దిగ్గజాలు టెమాసెక్ హోల్డింగ్స్, టీపీజీలకు పెట్టుబడులున్న డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 6.95 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా కంటి పరిరక్షణ(ఐ కేర్) సరీ్వసులు అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలినవాటిని ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. రియల్టీ డెవలపర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రియల్టీ రంగ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మౌలిక రంగ సంస్థ ఈపీసీ ఇన్ఫ్రా, టోల్ వసూళ్ల కంపెనీ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోలో భాగంగా రూ. 105 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 31 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లకు ప్రస్తతం 71.58 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మెషీనరీ తయారీ ఇథనాల్ ప్లాంట్లను రూపొందించే రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. దీనిలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా ఇథనాల్ ప్లాంట్ల డిజైనింగ్, తయారీ, సరఫరా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెనకడుగులో.. ఐటీ సొల్యూషన్ల కంపెనీ మౌరి టెక్, ఆరోగ్య పరిరక్షణ సంస్థ అమంటా హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను విరమించుకున్నాయి. గతేడాది సెపె్టంబర్– అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. అయితే డిసెంబర్లోనే పత్రాలను వెనక్కి తీసుకున్నాయి. ఇందుకు కారణాలు వెల్లడికాలేదు. ఐపీవోలో భాగంగా హైదరాబాద్ కంపెనీ మౌరి టెక్ రూ. 440 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావించింది. వీటితోపాటు మరో రూ. 1,060 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచాలని ప్రణాళికలు వేశారు. ఇక ఫార్మా రంగ కంపెనీ అమంటా హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయాలని తొలుత భావించింది. కంపెనీ ప్రధానంగా మెడికల్ పరికరాలు, స్టెరైల్ లిక్విడ్ ప్రొడక్టుల తయారీలో ఉంది. -
4 ఐపీవోలకు సెబీ ఓకే.. లిస్ట్‌లో హైదరాబాదీ కంపెనీ
న్యూఢిల్లీ: దాదాపు రూ. 3,000 కోట్ల సమీకరణకు సంబంధించి నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయి లైఫ్ సైన్సెస్, రూబికాన్ రీసెర్చ్, సనాతన్ టెక్స్టైల్స్, మెటల్‌మ్యాన్ ఆటో వీటిలో ఉన్నాయి. ఇవి జూలై–ఆగస్టు మధ్యకాలంలో తమ ముసాయిదా ఐపీవో పత్రాలను సెబీకి సమర్పించాయి. అక్టోబర్ 31న సెబీ ఆమోదం లభించింది.హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రమోటరు, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు, ఇతరత్రా షేర్హోల్డర్లు 6.15 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 600 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపునకు, మిగతా నిధులను కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు .. ఔషధాల ఫార్ములేషన్ కంపెనీ రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 585 కోట్లు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్ విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్‌కు రూబీకాన్ రీసెర్చ్‌లో 57 శాతం పైగా వాటాలు ఉన్నాయి. ఐపీవో నిధుల్లో రూ. 310 కోట్ల మొత్తాన్ని, రుణాల చెల్లింపు కోసం, మిగతాది ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం రూబీకాన్ వినియోగించుకోనుంది.మరోవైపు, సనాతన్ టెక్స్టైల్స్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 300 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నాయి. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 210 కోట్ల మొత్తాన్ని .. అనుబంధ సంస్థ సనాతన్ పాలీకాట్కి సంబంధించి దీర్ఘకాలిక మూలధన అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే రూ. 175 కోట్లను రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించుకోనుంది.అటు మెటల్‌మ్యాన్ ఆటో సంస్థ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ విధానంలో ప్రమోటర్లు 1.26 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 25 కోట్ల మొత్తాన్ని మధ్యప్రదేశ్‌లోని పిథంపూర్‌లో 2వ యూనిట్లో యంత్రపరికరాల కొనుగోలు తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్
-
TG: గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌కి, రిజర్వేషన్ల జీవో 33, తదితర అంశాలపై పిటిషన్లు దాఖలు చేశారు.ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేయడంతో గ్రూప్-1 పరీక్షకు అడ్డంకి తొలిగింది. మరో ఆరు రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుండి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు.ఇదీ చదవండి: TG: డీఎస్సీ టీచర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదాహైకోర్టు తీర్పు నిరాశ కలిగిందని గ్రూప్-1 అభ్యర్థులు అంటున్నారు. కోర్టు తీర్పుతో మానసికంగా కుంగిపోయాం. మెయిన్స్‌లో ప్రిపరేషన్‌కు కొంత సమయం ఇవ్వాలి. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్‌గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్‌లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్‌లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్‌లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్‌లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్‌స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్‌తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్‌లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
ఢిల్లీ: జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తున్నామని.. పార్లమెంట్లో బిల్లు పెడితే ఓడిస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. గత నెల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో జమిలి ఎన్నికలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలుదేశవ్యాప్తంగా ఏడాది ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, వీటి ప్రభావం దేశ అభివృద్ధిపై పడుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి జమిలి ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెబూతూ.. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనూ ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ అంశం ఉన్నందున మళ్లీ మూడోసారి మోదీ సారధ్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తిచేసుకున్న తరుణంలో జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడ్డాయి.దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలన మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై పట్టుదలగా ఉన్న ప్రధాని మోదీ ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతిరామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేసింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేల సంఖ్యలో ఈ-మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. పూర్తి సాధ్యాసాధ్యాలను అధ్యయనంర చేసిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇటీవలే కేంద్రానికి నివేదికను సమర్పించింది. -
ఆర్ఐఎల్ – డిస్నీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మీడియా విభాగం, వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశీయంగా రూ.70,000 కోట్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించనుంది. ఆరు నెలల క్రితమే ప్రకటించిన డీల్‌ను గుత్తాధిపత్య విధానాలను అడ్డుకునే సీసీఐ పరిశీలించింది. ఈ నేపథ్యంలో తొలుత కుదుర్చుకున్న డీల్ నిర్మాణంలో 2 సంస్థలు కొన్ని సవరణలూ ప్రతిపాదించాయి. తాజా డీల్‌కు సీసీఐ అనుమతి మంజూరు చేసింది. స్వచ్ఛంద సవరణలు: ఆర్ఐఎల్, వయాకామ్18 మీడియా ప్రైవేట్, డిజిటల్18 మీడియా, స్టార్ ఇండియా ప్రైవేట్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ మధ్య కుదిరిన ఒప్పందంలో స్వచ్ఛంద సవరణల తదుపరి డీల్‌కు ఆమోదముద్ర వేసినట్లు ‘ఎక్స్’ ద్వారా సీసీఐ వివరించింది. అయితే రెండు పారీ్టల ప్రతిపాదిత సవరణలను వెల్లడించలేదు. తాజా డీల్ ప్రకారం ఆర్ఐఎల్, అనుబంధ సంస్థలు విలీన కంపెనీలో 63.16% వాటాను పొందనున్నాయి. మిగిలిన 36.84% వాటా వాల్డ్ డిస్నీకి దక్కనుంది. విలీన సంస్థ రెండు స్ట్రీమింగ్ సరీ్వసులు, 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద మీడియా హౌస్‌గా అవతరించనుంది. విలీన సంస్థ ఇలా.. ఆర్ఐఎల్కు గల మీడియా సంస్థలలో నెట్వర్క్ 18 ప్రధానమైనదికాగా.. 18 వార్తా చానళ్లను కలిగి ఉంది. కలర్స్ బ్రాండ్‌తో ఎంటర్టైన్మెంట్ చానల్‌తోపాటు క్రీడా చానళ్లను నిర్వహిస్తోంది. మనీకంట్రోల్.కామ్, బుక్‌మైషో సైట్లతోపాటు కొన్ని మ్యాగజీన్లను ప్రచురిస్తోంది. మరోవైపు ఆర్ఐఎల్ జియోçస్టూడియోస్సహా కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీలు డెన్, హాథవేలో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. 21 సెంచురీ ఫాక్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఆస్తుల కొనుగోలు ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ దేశీయంగా 2020లో ప్రారంభమైంది. ఇందుకు 71.3 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. తద్వారా స్టార్ ఇండియా, హాట్స్టార్లను సొంతం చేసుకుంది. ఎంటర్టైన్మెంట్, సినిమా, స్పోర్ట్స్ తదితర చానళ్లను కలిగి ఉంది. -
SC, ST వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
-
దిగ్గజ ఐపీవోలకు ఓకే.. సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీలూ 2023 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. రూ. 5,500 కోట్లకు రెడీ ఐపీవో ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రూ. 5,500 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధులలో అత్యధిక శాతాన్ని సామర్థ్య విస్తరణ, సెల్ తయారీ ప్లాంట్, ఆర్అండ్డీపై పెట్టుబడులకు వినియోగించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. రూ. 1,226 కోట్లు సెల్ తయారీ యూనిట్‌కు, రూ. 1,600 కోట్లు ఆర్‌అండ్‌డీకి, మరో రూ. 800 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. ఇక బెయిన్ క్యాపిటల్‌కు పెట్టుబడులున్న ఎమ్క్యూర్ ఫార్మా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.ఆఫీసర్స్ చాయిస్ @ రూ. 267–281 ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 267–281 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,000 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయాలి. -
తూర్పు ఏజెన్సీలో కరెంట్ కష్టాలకు చెక్ పెట్టిన వైఎస్ జగన్
-
తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేబినెట్ సమావేశం నిర్వహణకు షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం షరతు విధించింది. జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సిన అత్య వసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని ఈసీ స్పష్టం చేసింది.లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్య వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయిన అధికారులెవరూ క్యాబినెట్ సమావేశానికి హాజరు కాకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. -
జ్ఞానవాపి మసీదు వివాదం.. సెల్లార్లో పూజలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం(ఏప్రిల్ 1) కీలక తీర్పు ఇచ్చింది. మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లార్లో హిందువులు ప్రార్థనలకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునే అంశంలో మాత్రం ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ పిటిషన్‌ను ఫైనల్‌గా జులైలో విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా,మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని గతంలో వారణాసి జిల్లా కోర్టు తీర్పునివ్వగా ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు కూడా ధృవీకరించింది. ఇదీ చదవండి.. రామ్‌లల్లా దర్శనానికి మూడు రాష్ట్రాల గవర్నర్లు -
కంటోన్మెంట్లో స్కైవేలకు కేంద్రం ఓకే
హైదరాబాద్: ఎట్టకేలకు కంటోన్మెంట్లో ప్రతిపాదిత స్కైవేలు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. స్కైవేల నిర్మాణానికి అవసరమైన రక్షణ భూముల కేటాయింపునకు ఇటీవలే అంగీకారం తెలిపిన కేంద్రం, తాజాగా స్కైవేల నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పరిధిలో స్కైవేల నిర్మాణం చేపట్టనుంది. రాజీవ్ రహదారిపై ప్యాట్నీ చౌరస్తా నుంచి హకీంపేట వరకు సుమారు 14 కిలోమీటర్లు, నాగ్‌పూర్ హైవే మార్గంలో ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు సుమారు 6.5 కిలోమీటర్లు రెండు ఎలివేటెడ్ కారిడార్లుగా స్కైవేలు నిరి్మంచనున్నట్లు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో ప్యారడైజ్ నుంచి సుచిత్ర సర్కిల్ వరకు స్కైవే నిరి్మంచాలని భావించినప్పటికీ, ఈ మార్గంలో సుచిత్ర నుంచి బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతోంది. దీంతో ప్రతిపాదిత స్కైవేను బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు కుదించినట్లు తెలుస్తోంది. బీఓఓ కమిటీ ఏర్పాటు ►రక్షణ భూముల బదలాయింపునకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా కేంద్రం భాగస్వామ్య పక్షాలతో బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ (బీఓఓ) కమిటీ ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ, డిఫెన్స్ ఎస్టేట్స్ కార్యాలయం, లోకల్ మిలటరీ అథారిటీ, కంటోన్మెంట్ బోర్డుల నుంచి ఒక్కో ప్రతినిధి చొప్పున నలుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ►ప్రతిపాదిత ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం మొత్తం 150 ఎకరాల రక్షణ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇందులో 90 ఎకరాలు ఆర్మీకి సంబంధించిన స్థలాలు కాగా, కంటోన్మెంట్ బోర్డు స్థలాలు 30 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ ఇతరత్రా మరో 30 ఎకరాలు ఉన్నాయి. ప్రైవేటు స్థలాలు వీటికి అదనం. ►ఈ మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రోడ్లను 60 మీటర్లకు విస్తరించనున్నారు. ఈ మేరకు రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవేలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు భవనాలు కనుమరుగు కానున్నాయి. ►బేగంపేట ఎయిర్‌పోర్టు, హకీంపేట ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాలకు సమీపంలో ఫ్లైఓవర్లకు బదులుగా టన్నెల్ రూపంలో రోడ్ల నిర్మాణం చేపట్టే అవకాశముంది. దీనిపై త్వరలోనే హెచ్ఎండీఏ పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వనుంది. ►ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ బోర్డు 30 ఎకరాలకు పైగా స్థలాన్ని కోల్పోతున్నందున, అందుకు గానూ సుమారు రూ.300 కోట్ల పరిహారం ఇవ్వాలని బోర్డు అధికారులు కోరారు. అయితే కంటోన్మెంట్, ఆర్మీ, డిఫెన్స్ ఎస్టేట్స్, ఎయిర్‌ఫోర్స్ వంటి విభాగాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివే కాబట్టి, పరిహారం పూర్తిగా కేంద్రానికి చెందేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బోర్డుకు ఎలాంటి పరిహారం దక్కే అవకాశం లేకుండా పోయింది. ►తాజా భూకేటాయింపుల్లో భాగంగా కంటోన్మెంట్ బోర్డు బాలంరాయి పంప్ హౌజ్, బేగంపేట ఎయిర్‌పోర్టు, హకీంపేటలో ఎయిర్‌లైన్స్ స్థలాలు, కొన్ని ఓల్డ్ గ్రాంట్ బంగళాలు తమ స్థలాలను కోల్పోనున్నాయి. ముఖ్యంగా ఎన్సీసీ, ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్ భారీ మొత్తంలో స్థలాలను కోల్పోనున్నాయి. -
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇటీవల కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లో మరో నాలుగు కంపెనీలు సందడి చేయనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఈ జాబితాలో ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్, జేఎన్‌కే ఇండియా, ఎక్సికామ్ టెలీసిస్టమ్స్, అక్మే ఫిన్‌ట్రేడ్(ఇండియా) చేరాయి. 2023 జూన్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ నాలుగు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. కాగా.. స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ ఐపీవో దరఖాస్తును మాత్రం సెబీ తిప్పిపంపింది. వివరాలు చూద్దాం.. ఎంటెరో హెల్త్‌కేర్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ను అందుకుంది. ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం వీటికి జతగా మరో 85.57 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఎంటెరో హెల్త్‌ను 2018లో ప్రభాత్ అగర్వాల్, ప్రేమ్ సేథీ ఏర్పాటు చేశారు. జేఎన్‌కే ఇండియా పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు జేఎన్‌కే ఇండియా సెబీ నుంచి అనుమతి పొందింది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం వీటికి జతగా మరో 84.21 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అక్మే ఫిన్‌ట్రేడ్ ఐపీవోలో భాగంగా అక్మే ఫిన్‌ట్రేడ్(ఇండియా) 1.1 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఎక్సికామ్టెలీ టెలికం రంగ కంపెనీ ఎక్సికామ్ టెలీసిస్టమ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 74 లక్షల షేర్లను ప్రమోటర్ సంస్థ నెక్ట్స్‌వేవ్ కమ్యూనికేషన్స్ విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం నెక్ట్స్‌వేవ్‌కు కంపెనీలో 71.45 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను తెలంగాణలోని తయారీ యూనిట్లో ప్రొడక్షన్ లైన్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను పరిశోధన, అభివృద్ధి, ప్రొడక్ట్ డెవలప్మెంట్, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. -
విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్
అనకాపల్లి: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి చెప్పారు. ఆమె సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారంలో రైల్వే జోన్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వేజోన్ నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించిందని, భూమిపూజకు రూ.10 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. వడ్లపూడిలో రైల్వేస్థలం 100 ఎకరాలు ఉండగా, జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవలో 52 ఎకరాల స్థలాన్ని రైల్వే అధికారులకు అప్పగించినట్లు వివరించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ఓఎస్డీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం విశాఖలో నియమించిందని పేర్కొన్నారు. ప్రజల అభీష్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాన్ని గౌరవించి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుంటే.. ‘ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు..’ అని చెప్పి నగదు తీసుకున్న రోజులను చంద్రబాబు మరిచిపోయినా... జనం ఇంకా గుర్తుంచుకున్నారని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి రాష్ట్రానికి వెన్నెముకలాంటిదని, విజయవాడలో 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి గోదావరి జలాలను ఇచ్ఛాపురం వరకూ అందించాలని పోలవరం ప్రాజెక్టును చేపడితే చంద్రబాబు నాయుడు అడ్డుకున్న రోజులను గుర్తెరగాలని పేర్కొన్నారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటే సుమారు రూ.56 వేల కోట్లు ఖర్చవుతుందని, ఈ విషయంపై కేంద్ర జలవనరుల శాఖమంత్రితో చర్చించామని ఎంపీ సత్యవతి చెప్పారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు భూసేకరణలో ఇబ్బందుల కారణంగా ముందుకు సాగలేదని, చోడవరం మండలంలో ఒక గ్రామ ప్రజలు సహకరించకపోవడంతో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఉత్తరాం«ధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఇతర నేతలు గత ఐదేళ్లలో ఏనాడూ కేంద్ర మంత్రులను కలిసిన పాపానపోలేదన్నారు. వారు ఈ విషయాలపై మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఎస్సై నియామకాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామకాలకు సంబంధించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సై నియామక ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్‌కు మంగళవారం క్లియరెన్స్ ఇచ్చింది. అభ్యర్థుల ఎత్తు. కొలతల అంశంలో అవకతవకలు జరిగాయంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలను అడ్డుకున్న స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు విచారణ చేపట్టింది. ఆపై న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించింది. అయితే.. రిక్రూట్ మెంట్ బోర్డ్ కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోలడంతో ఈ అంశం ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది. అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. రిక్రూట్ మెంట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలు విడుదల చేసుకునేందుకు మార్గం సుగమమైంది. ఇక తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఏం జరిగింది? ►నెలన్నర కింద న్యాయస్థానం ముందు ఎస్సై అభ్యర్థుల పిటిషన్ ►ఇప్పటికే పలు మార్లు పిటిషన్లు వేసిన అభ్యర్థులు ►అభ్యర్థుల తరపున జడ శ్రవణ్ పిటిషన్ ►ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు కోర్టులో కేసులు ►తొలుత ఫలితాలు విడుదల చేయకుండా హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ►ఎస్సై రిక్రూట్మెంట్లో ఎత్తు విషయంలో అభ్యంతరాలు ►ఇప్పటికే రెండు సార్లు ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►ఎత్తు విషయంలో విఫలమయ్యారని తేల్చిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►హైకోర్టు ఆదేశాలతో మరోసారి ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►రెండో సారి కొలిచిన తర్వాత మళ్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందుకు పిటిషన్ ►రెండో సారి మాన్యువల్‌తో కాకుండా.. స్కానర్లతో ఎత్తు కొలిచిన బోర్డు ►రెండో పరీక్షలోనూ అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు ►అయినా హైకోర్టులో మళ్లీ పిటిషన్ వేసిన జడ శ్రవణ్ ►అభ్యర్థులు ఉద్దేశపూర్వకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారని ఆరోపణలు ►రిక్రూట్మెంట్ బోర్డు పై ఆరోపణలు తప్పని తేలితే రూ.లక్ష జరిమానా కడతారా? ప్రశ్నించిన హైకోర్టు ►అంగీకారం తెలుపుతూ మెమో దాఖలు చేయాలని ఆదేశం ►హైకోర్టు సమక్షంలో ఒక్కొక్క అభ్యర్థి ఎత్తు కొలుస్తామన్న జడ్జిలు ►ఎత్తు విషయంలో అర్హత సాధించలేకపోతే.. లక్ష కడతామని రాసివ్వాలని షరతు ►అభ్యర్థులు వెనక్కి తగ్గడంతో ఫలితాలు విడుదల చేసుకోవచ్చన్న హైకోర్టు ఇదీ చదవండి: ‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది -
అయిదు ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా షెల్టర్ ఫైనాన్స్, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ తదితర అయిదు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివ ఫార్మాకెమ్, ఒనెస్ట్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటికి నవంబర్ 7–16 మధ్య సెబీ అబ్జర్వేషన్ లెటర్స్ (ఓఎల్) జారీ చేసింది. ఐపీవోకి సెబీ ఆమోదముద్రగా ఓఎల్‌ను పరిగణిస్తారు. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ రూ. 1,800 కోట్లు సమీకరించనుంది. డోమ్స్ కొత్తగా రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు రూ. 850 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 575 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు, 40,51,516 షేర్లను విక్రయించనున్నారు. శివ ఫార్మాకెమ్ ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు రూ. 900 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్ర యించనున్నారు. ఎఫ్ఎంసీజీ సంస్థ ఒనెస్ట్ రూ. 77 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ఇతర వాటాదా రులు 32.5 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. -
రెండు ప్రపంచాలు
‘జార్జిరెడ్డి’, ‘పలాస’, ‘మసూద’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తిరువీర్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ద్రిష్టి తల్వార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు. డార్క్ కామెడీ జానర్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. ఏ మూన్ షైన్ పిక్చర్స్‌పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ నిర్మించనున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా, యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: లియోన్ జేమ్స్. -
రైతుబంధుకు ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు భారీ ఊరట లభించింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. తదనుగుణంగా రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధును గతంలోలాగా తక్కువ భూవిస్తీర్ణం ఉన్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండగా ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీంతో ఎన్నికలకు ముందు కేవలం 28వ తేదీనే రైతుబంధు సొమ్ము పంపిణీకి వీలుంది. విడతలవారీగా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రకటించడంతో ఒకేరోజు రైతుబంధు సొమ్ము రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు. రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
నేటి నుంచి టాయ్‌ట్రైన్ పునఃప్రారంభం
సాక్షి, ముంబై: వర్షాకాలం నేపథ్యంలో సుమారు నాలుగు నెలలుగా నిలిచిపోయిన మాథేరన్ టాయ్‌ట్రైన్ (మినీ రైలు) సేవలు పునఃప్రారంభం కానున్నాయి. నవంబరు 4వ తేదీ శనివారం నుంచి ఈ ట్రైన్ ప్రారంభించేందుకు సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నేరుల్–మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్ రెండేసి చొప్పున.. మొత్తం నాలుగు సర్విసులు నడపనున్నారు. మరోవైపు మార్పులు చేసిన సమయాలనుసారం అమన్ లాడ్జీ–మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్ మార్గాల్లో ఆరు చొప్పున మొత్తం 12 సర్విసులు, శని, ఆదివారాల్లో అదనంగా రెండేసి చొప్పున ప్రత్యేక టాయ్ రైళ్లను నడపనున్నారు. వర్షాకాలంలో నిలిపివేత.. సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షా కాలం ప్రారంభం కాగానే టాయ్ ట్రైన్ సేవలు నిలిపివేస్తారు. ఆ తరువాత మళ్లీ అక్టోబరు 15వ తేదీ నుంచి సర్విసులు పునఃప్రారంభిస్తారు. కానీ ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా పునఃప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతంలో ఒకటైన మాథేరాన్‌ను సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రైలులో కొండల మధ్య నుంచి ప్రయాణిస్తూ.. జలపాతాలు, పచ్చదనాన్ని చూసేందుకు ఇష్టపడతారు. నేరుల్ నుంచి 21 కి.మీ. దూరంలో కొండపై ఉన్న మాథేరాన్ చేరుకోవాలంటే రోడ్డు మార్గం కంటే మినీ రైలులో వెళ్లే ఆనందమే బాగుంటుందని పర్యాటకులు ఈ రైలు మార్గాన్ని ఎంచుకుంటుంటారు. రెలు మార్గం దాదాపు 90 శాతం కొండ అంచుల మీదుగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో రైల్వే ట్రాక్ కిందున్న మట్టి కొట్టుకుపోవడం, కొండ చరియలు విరిగిపడడం, వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యేంత వరకు రైలు సేవలు పూర్తిగా నిలిపివేస్తారు. ఈ సమయంలో పర్యాటకులు రోడ్డు మార్గం మీదుగా మాథేరాన్ చేరుకోవల్సిందే. ఇప్పుడు టాయ్ ట్రైన్ సేవలు ప్రారంభమవుతుండటంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మరిన్ని పెట్టుబడులు
సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఏడు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగా.. మూడు విస్తరణ కార్యక్రమాలకు చెందినవి ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 69,565 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. వీటన్నింటినీ అధికారులు తెలుసుకుంటూ ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అర్థంచేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. అత్యంత పారదర్శక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చా మని.. ఈ క్రమంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. పరిశ్రమలపట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని, ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నామన్నారు. కానీ, అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉందని, పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలపట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జీఐఎస్ ఒప్పందాల అమలును వేగవంతం చేయండి.. ఇక విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున మేలు చేకూర్చామని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం కల్పించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇస్తూ వారికి చేదోడుగా నిలవడం ద్వారా ఎంఎస్ఎంఈల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలతతో ముందుకు సాగుతోందన్నారు. ఈ రంగంపై ఎక్కువమంది ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఈ సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. పురపాలక, పట్టణాభివద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె. విజయానంద్, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ (చేనేత, జౌళి) ముఖ్యకార్యదర్శి కె. సునీత, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. దీనిద్వారా రూ.531 కోట్ల పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు లభిస్తాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.1,750 కోట్ల పెట్టుబడితో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. ఇందులో 2,000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో స్మైల్ (సబ్‌స్ట్రేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్) కంపెనీ ఆధ్వర్యంలో రూ.166 కోట్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు. దీనిద్వారా దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలు. నెల్లూరు జిల్లా కష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (రిలయెన్స్ పవర్) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. థర్మల్ పవర్ స్థానంలో రూ.6,174 కోట్ల పెట్టుబడితో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఆమోదం. దీనిద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 2,000 మందికి పరోక్షంగానూ ఉద్యోగావకాశాలు. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్ర పేపర్ లిమిటెడ్ రూ.4వేల కోట్ల పెట్టుబడితో సంస్థను విస్తరించనుంది. తద్వారా 3వేల మందికి ఉద్యోగాలు. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ కూడా రూ.679 కోట్ల పెట్టుబడితో విస్తరణ. తద్వారా 300 మందికి ఉద్యోగాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ సైతం రూ.933 కోట్ల పెట్టుబడి సంస్థను విస్తరించనుంది. 2,100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్‌కు ఎస్ఐపీబీ ఆమోదం. దీనిద్వారా 310 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు వస్తాయి. -
విశాఖలో విప్రో విస్తరణ
సాక్షి, విశాఖపట్నం : ఐటీ పరిశ్రమలకు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే పలు సంస్థలు తమ శాఖల్ని ఇక్కడ విస్తరిస్తున్నాయి. తాజాగా ఈ వరుసలో దిగ్గజ ఐటీ సంస్థ విప్రో చేరింది. విశాఖలో ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని విస్తరిస్తున్నట్టు ఆ సంస్థ ‘ప్రాజెక్ట్ లావెండర్’ పేరు తో ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లలో విశాఖ వెళ్లేందుకు ఉన్న ఉద్యోగుల వివరాల్ని ఈ మెయిల్స్ ద్వారా సేకరించే పనిలో విప్రో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థను 1000 సీట్లకు విస్తరించే విషయంపై ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం, ఎపిటా జరిపిన చర్చల్లో విప్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సంస్థ ప్రకటనతో విశాఖ ఐటీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఇప్పుడు మహా నగరాల నుంచి టైర్–2 సిటీల వైపు చూస్తున్నాయి. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్ మొదలైన ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులేస్తున్నాయి. ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తాజాగా విప్రో కూడా అదే బాటలో విశాఖలో విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ సమయంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు.. తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపించని నేపథ్యంలో వారి వద్దకే వెళ్లేందుకు ఐటీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ వ్యయాల్ని తగ్గించుకునేందుకు ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా విప్రో కూడా విశాఖలో కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చింది. ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో.. విశాఖలో కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తమ డెవలప్మెంట్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వారికి విప్రో సంస్థ లేఖలు రాసింది. విశాఖ కేంద్రంగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలు సేకరిస్తోంది. ఈ తరుణంలో తాజాగా విశాఖలో డేటా సెంటర్ విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. వృద్ధి చెందుతున్న నగరాల్లో తమ సంస్థ డెవలప్మెంట్ సెంటర్‌ను విస్తరించేందుకు ప్రాజెక్ట్ లావెండర్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా తొలి అడుగు విశాఖలో వేస్తున్నట్టు విప్రో స్పష్టం చేసింది. వైఎస్సార్ హయాంలో నాంది సత్యం జంక్షన్లో వైఎస్సార్ హయాంలో 2006 మేలో విప్రో క్యాంపస్‌కు ఏడెకరాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం మూడున్నరేళ్ల తర్వాత విప్రో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 750 మందితో ప్రారంభించాలని భావించినా.. తొలుత 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. అయితే కోవిడ్ సమయంలో క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ కార్యకలాపాల జోరు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విప్రో ప్రతినిధులతో చర్చించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(ఎపిటా) గ్రూప్ సీఈవో కిరణ్‌రెడ్డి విప్రో ప్రతినిధి శశికుమార్‌తో పలు దఫా లుగా చర్చలు జరిపి.. విస్తరించేందుకు ఆహా్వనించారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన విప్రో.. కా ర్యకలాపాలు ప్రారంభించింది. దశల వారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమని ప్రకటించింది. మౌలిక సదుపాయాల పనులు పూర్తి విశాఖలో విస్తరణకు విప్రో సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తోంది. గత క్యాంపస్‌లో కొంత భాగం ఇప్పటికే అద్దెకు ఇచ్చిన విప్రో.. ముందు భవనంలో ఇప్పటికే సేవలు ప్రారంభించింది. ఈ భవనంలోని అన్ని ఫ్లోర్లలోనూ తమ సంస్థ మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇందులో అద్దెకు ఇచ్చిన వారిని ఖాళీ చేయించారు. వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ను మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే వీడీఐ ప్రాజెక్టులతో కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటికే 1000 మందికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల్ని దాదాపు పూర్తి చేసింది. మానవ వనరుల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం సంస్థ సేవల్ని విశాఖలో విస్తరిస్తామని ప్రభుత్వంతో విప్రో స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి కల్లా 1000 సీట్లకు పెంచుతామని చెప్పారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు విప్రో ప్రతినిధులు హామీ ఇవ్వడం శుభపరిణామం. వైజాగ్‌లో టాలెంట్, అప్‌స్కిల్లింగ్, అనుభవజు్ఞలైన నిపుణుల్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేశాం. భవిష్యత్తులో ఏ క్లైయింట్ వచ్చినా.. ఇక్కడికే తీసుకురావాలని సూచించాం. దానికి కావాల్సిన మానవ వనరుల్ని అందిస్తామన్నాం. దానికి విప్రో ప్రతినిధులు కూడా అంగీకరించారు. ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి సహకారంతో పాటు విప్రో ప్రాజెక్టులకు అవసరమైన రిక్రూట్మెంట్కు కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చాం. – కిరణ్‌రెడ్డి, ఎపిటా గ్రూప్ సీఈవో -
వెండితెరపై స్టార్స్‌ను కలిపిన సూపర్ హిట్ కథలు
కొన్ని కథల్లో అతిథి పాత్రలకు కూడా ‘స్టార్’ రేంజ్ యాక్టర్లు కావాల్సి వస్తుంది. కథలో ఆ పాత్రలకు అంత ప్రాధాన్యం ఉంటుంది. ఆప్రాధాన్యాన్ని గ్రహించి అతిథి పాత్రలకు స్టార్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అలా కొన్ని క్రేజీ కాంబినేషన్స్‌ని కొన్ని కథలు కలిపాయి. ఆ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. కల్కి కలిపింది ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ వంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్‌హాసన్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా ఇద్దరు లెజెండరీ నటులను, ఒక స్టార్ డైరెక్టర్ని ‘కల్కి’ కలిపింది. భారతీయ ఇతిహాసం మహాభారతం స్ఫూర్తితో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని ΄ోలిన పాత్రలో కనిపించనున్నారని టాక్. అమితాబ్ క్యారెక్టర్ మహాభారతంలోని అశ్వథ్థామ పాత్రను ΄ోలి ఉంటుందని భోగట్టా. అలాగే కమల్‌హాసన్ విలన్ పాత్ర ΄ోషిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళిది అతిథి పాత్ర. ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తారనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని జనవరి12 విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కన్నప్పలో శివుడు? మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రభాస్ నటించనున్నారు. ఈ మూవీకి ‘మహాభారత’ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించ నున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నటుడు, నిర్మాత మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల శ్రీకాళహస్తిలోప్రారంభమైంది. శివ భక్తుడైన కన్నప్ప, ఆయన భక్తి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. కన్నప్పగా మంచు విష్ణు నటించనున్నారు. శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని టాక్. కోలీ స్టార్‌తో టాలీ స్టార్ ‘సార్’ వంటి హిట్ సినిమా తర్వాత తమిళ హీరో ధనుష్ తెలుగులో నటిస్తున్న రెండో స్ట్రయిట్ ఫిల్మ్ ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారు. నాగార్జున పుట్టినరోజుని (ఆగస్టు 29) పురస్కరించుకుని ‘డీ 51’ చిత్ర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు ఈ చిత్రంలో ఆయన నటించనున్న విషయాన్ని వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున పాత్రకి చాలాప్రాధాన్యం ఉందని టాక్. ప్రస్తుత సమాజంలో నెలకొన్న అసమానతల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందట. ఈ చిత్రంలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తారు. వార్కి సిద్ధం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియాని మించిన స్థాయిలో స్టార్డమ్ సొంతం చేసుకున్నారు హీరో ఎన్టీఆర్. ఇప్పటివరకూ తెలుగు సినిమాలు మాత్రమే చేసిన ఆయన తొలిసారి పరభాషా చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ‘వార్ 2’ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’ (2019) సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందనుంది. -
కోలీవుడ్ కబురు?
దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌కు కోలీవుడ్ నుంచి కబురు వెళ్లిందట. తమిళ నటుడు అథర్వ హీరోగా ఆకాష్ అనే కొత్త దర్శకుడు ఓ తమిళ చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఖుషీ కపూర్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఖుషీకి ఈ కథ నచ్చిందని, ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే.. ఖుషీ కపూర్ నటించే తొలి తమిళ సినిమా ఇదే అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘పయ్యా (‘ఆవారా’)’ సినిమాకు సీక్వెల్‌గా ‘పయ్యా 2’ రానుందని, ఇందులో ఆర్య హీరోగా నటిస్తారని, ఖుషీ కపూర్ హీరోయిన్గా ఎంపికయ్యారనే టాక్ గతంలో కోలీవుడ్‌లో వినిపించింది. అయితే ‘పయ్యా 2’ సీక్వెల్లో ఖుషీ కపూర్ నటిస్తుందనే వార్తల్లో వాస్తవం లేదని ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక హిందీలో ‘ఆర్చీస్’ అనే వెబ్ ఫిల్మ్‌లో ఖుషీ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. -
ప్రేమకథ విన్నారా?
కెరీర్లో హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉన్నారు మృణాళ్ ఠాకూర్. నార్త్ అండ్ సౌత్ అనే తేడాలను పక్కన పెడితే ఈ బ్యూటీ హీరోయిన్గా నటించిన ఐదు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయంటే ఆమె ఏ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారో ఊహించవచ్చు. ఇదే స్పీడ్‌ను కొనసాగించాలనుకుంటూ బాలీవుడ్ కొత్త సినిమాకు సై అన్నారట మృణాళ్. శ్రీదేవి టైటిల్ రోల్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘మామ్’ తీసిన దర్శకుడు రవి ఉడయార్ ఇటీవల ఓ లవ్‌స్టోరీ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నారట. ఆయన ఈ కథను మృణాళ్‌కు వినిపించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రాంరంభం కానుందని బీ టౌక్ టాక్. -
సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్!
దక్షిణాదిలోని అగ్రకథానాయికల్లో ఒకరిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్నారు సాయిపల్లవి. ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ కోవలోనే తాజాగా మరోసారి సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ బీ టౌన్లో చర్చనీయాంశమైంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇటీవల ఓ ప్రేమకథకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఈ చిత్రంలోనే సాయిపల్లవి హీరోయిన్గా నటించనున్నారనే టాక్ హిందీ పరిశ్రమలో ప్రచారంలోకి వచ్చింది. ఆమిర్ సన్నిహితుల్లో ఒకరైన సునీల్ పాండే దర్శకత్వం వహిస్తారని, ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని భోగట్టా. ఇక ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తే, హిందీలో ఆమెకు తొలి చిత్రం అవుతుంది. మరి.. సాయిపల్లవిని బాలీవుడ్ భులాయా (పిలిచిందా?) లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. -
ప్రేమకు గ్రీన్ సిగ్నల్!
ఉత్తరాది అమ్మాయి రాశీ ఖన్నా హీరోయిన్గా దక్షిణాదిలో ఎక్కువ సినిమాల్లో నటించి స్టార్ లిస్ట్‌లో ఉన్నారు. రచ్చ గెలిచిన రాశీ ఖన్నా ఇప్పుడు ఇంట అంటే ఉత్తరాదిలో నటిగా నిరూపించుకోవాలని అనుకుంటున్నట్లున్నారు. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘యోధ’ చిత్రంలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. దిశా పటానీ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. తాజాగా రాశీ మరో కొత్త సినిమాకు పచ్చ జెండా ఊపారని బాలీవుడ్ సమాచారం. నూతన దర్శకుడు బోధయన్ రాయ్ హీరో విక్రాంత్ మెస్సీతో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథను ఇటీవల రాశీకి వినిపించారట. ఈ ప్రేమకథతో ప్రేమలో పడ్డారట ఈ బ్యూటీ. దాంతో ఈ సినిమాలో విక్రాంత్ మెస్సీకి ప్రేయసిగా నటించేందుకు రాశీ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీటౌన్ సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటోందట చిత్ర యూనిట్. -
సోనియా సమక్షంలో కాంగ్రెస్ లోకి తుమ్మల
-
పాపికొండల విహార యాత్రకు గ్రీన్ సిగ్నల్
దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరిలో పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు. బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారి పేరంటపల్లికి వెళ్లనున్నారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే -
గుడ్‌న్యూస్.. టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయులకు శుభవార్త. ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను హైకోర్టు సవరిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ దంపతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వివరాల ప్రకారం.. తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై బుధవారం కోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ఈ క్రమంలోనే టీచర్ యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లను కోర్టు తప్పుపట్టింది. టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి కోర్టు అనుమతిచ్చింది. ఇది భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని కోర్టు స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని కోర్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన పోలీసు.. మంత్రి హరీష్ అభినందన -
ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎఫ్–16లు
కీవ్/ఇనెడోవిన్: రష్యాను దీటుగా ఎదుర్కోలేక డీలాపడిన ఉక్రెయిన్‌లో ఉత్సాహాన్ని నింపే పరిణామం. ఆ దేశానికి అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాలను అందజేయాలనే నిర్ణయానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దీంతో నెదర్లాండ్స్, డెన్మార్క్‌లు అమెరికా తయారీ ఎఫ్–16లను ఉక్రెయిన్‌కు అందజేసేందుకు ముందుకు వచ్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా డెన్మార్క్, నెదర్లాండ్స్‌ల్లో పర్యటించారు. ఆదివారం ఆయన నెదర్లాండ్స్‌లోని ఎయిండ్ హోవెన్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మార్క్ రుట్‌తో సమావేశమయ్యారు. అక్కడున్న రెండు ఎఫ్–16 విమానాలను పరిశీలించారు. అనంతరం మార్క్రుట్ మీడియాతో మాట్లాడుతూ.. తమ షరతులకు ఉక్రెయిన్ అంగీకరించిన తర్వాతే ఎఫ్–16ల సరఫరా మొదలవుతుందని స్పష్టం చేశారు. ఆ షరతులు ఏమిటన్నది వెల్లడించలేదు. తమ వద్ద ప్రస్తుతం 42 ఎఫ్–16 విమానాలున్నాయని, వీటిలో కొన్నిటిని ఉక్రెయిన్‌కు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌కు తాము 19 ఎఫ్–16లను అందజేస్తామని డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ ప్రకటించారు. ఎఫ్–16 యుద్ధ విమానాల పైలెట్లకు 6 నుంచి 8 నెలల శిక్షణ అవసరముంటుందని అధికారులు చెబుతున్నారు. నెదర్లాండ్స్, డెన్మార్క్‌ల నిర్ణయం చారిత్రకమని జెలెన్స్కీ కొనియాడారు. రష్యా దాడుల్లో ఏడుగురు మృతి ఉక్రెయిన్‌లోని చెరి్నహివ్ నగరంపై శనివారం రష్యా జరిపిన భీకర క్షిపణి దాడుల్లో సోఫియా అనే ఆరేళ్ల చిన్నారి సహా ఏడుగురు చనిపోగా మరో 150 మంది క్షతగాత్రులయ్యారు. రష్యాలోని కుర్స్క్ ప్రాంత రాజధాని కుర్స్క్ రైల్వే స్టేషన్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపింది. రైల్వే స్టేషన్ పైకప్పునకు మంటలు అంటుకుని అయిదుగురు గాయపడ్డారు. కాగా, ఉక్రెయిన్ డ్రోన్ దాడితో మాస్కోలోని రెండు ఎయిర్‌పోర్టుల్ని కొద్ది గంటలపాటు మూసివేశారు. -
‘విలీనానికి’ అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో ఆదివారం రాజ్‌భవన్‌లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పలు సిఫారసులతో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. దీంతో విలీనంపై మూడురోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడినట్టయ్యింది. ముగిసిన హైడ్రామా ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ఈ నెల 2న రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రాజ్‌భవన్‌కు పంపింది. అయితే బిల్లు పరిశీలనకు సమయం కావాలని 3వ తేదీన రాజ్‌భవన్ ప్రకటించింది. ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో అదే రోజు బిల్లును పరిశీలించిన గవర్నర్ తమిళిసై 5 సందేహాలపై ప్రభుత్వ నుంచి వివరణలు కోరారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు రాజ్‌భవన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించగా, ప్రభుత్వ ప్రొద్బలమే ఇందుకు కారణమని రాజ్‌భవన్ ఆరోపించింది. కాగా ప్రభుత్వం పంపిన వివరణలతో సంతృప్తి చెందని గవర్నర్.. ఈ నెల 5న రెండోసారి మరికొన్ని సందేహాలకు సమాధానాలను కోరగా, ప్రభుత్వం వెంటనే ఆ మేరకు వివరణలు పంపించింది. రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఎట్టకేలకు ఆదివారం బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలి ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం తర్వాత కూడా సంస్థ భూములు, ఆస్తులపై యాజమాన్య హక్కులను ఆర్టీసీ సంస్థే కలిగి ఉండాలి. సంస్థ అవసరాల కోసమే వాటిని వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలి. ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలి. బకాయిల చెల్లింపు బాధ్యతను తీసుకోవాలి. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పారితోశాకాలు, జీతభత్యాలు, పే స్కేలు, సర్విసు నిబంధనలు, బదిలీలు, పదోన్నతులు, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు వర్తింపజేయాలి. వైద్యపరంగా అనర్హులు(మెడికల్లీ అన్‌ఫిట్)గా మారే ఉద్యోగులు కారుణ్య నియామకం కింద తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కోరే సదుపాయాన్ని కల్పించాలి. అత్యంత కఠినంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల ప్రక్రియను సరళీకరించి మానవీయంగా మార్చాలి. అందరికీ సమాన ప్రయోజనాలు ఆర్టీసీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో రాష్ట్ర సర్విసు నిబంధనల మేరకు సమాన ప్రయోజనాలు, జీతాలు, పీఎఫ్ చెల్లించాలి. వారి ఉద్యోగ భద్రతను పరిరక్షించి వారి సేవలను ఇతర శాఖల్లో వినియోగించుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు సర్విసులో ఉన్నంత కాలం వారికి ఆర్టీసీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కొనసాగించాలి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సైతం వైద్య ప్రయోజనాలు అందించాలి. బస్సుల నిర్వహణలో ఆర్టీసీ సంస్థ, యూనియన్ల పాత్రే కీలకం. ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణను ప్రభుత్వం తీసుకుని, ఔట్సోర్సింగ్ పద్ధతిలో స్వతంత్ర సంస్థకు లేదా మరేదైనా పద్ధతిలో అప్పగించాలి. నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వాలి. -
ఙ్ఞానవాపిలో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి
-
డబుల్ ఇస్మార్ట్‌లో..
తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని ఓ కీలక పాత్రకు సంజయ్ దత్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో భాగం కావడానికి సంజయ్ దత్ సుముఖంగా ఉన్నారని టాక్. -
నయనతారకు నచ్చుతే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది
కథ నచ్చితే కొత్త దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు హీరోయిన్ నయనతార. కోలీవుడ్ దర్శకుడు అశ్విన్ శరవణన్ వంటి వారికి తొలి అవకాశం ఇచ్చింది నయనతారనే. కాగా ఈ బ్యూటీ ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కథ బాగా నచ్చడంతో తాజాగా మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాతో విక్కీ డ్యూడ్ అనే ఓ యూ ట్యూబర్ దర్శకుడిగా పరిచయం కానున్నారని టాక్. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలలో ఆరంభించనున్నారట. ఈ చిత్రం కాకుండా మరో నాలుగు చిత్రాలతో నయనతార ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో షారుక్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం ‘జవాన్’ ఒకటి. -
Anupama Parameswaran: బిజీ బిజీ
తెలుగులో ప్రస్తుతం రవితేజ ‘ఈగిల్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్వైర్’ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు అనుపమా పరమేశ్వరన్. ఈ బ్యూటీ తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రవీణ్ వెల్లడించి, ఓ ఫోటోను షేర్ చేశారు. విజయ్ డొంకాడ ఈ సినిమాను నిర్మిస్తారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అని, ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని భోగట్టా. అలాగే తమిళంలో ‘సైరన్’, మలయాళంలో ‘జేఎస్కే: ట్రూత్ షల్ ఆల్వేస్ ప్రివైల్’ సినిమాలు చేస్తున్నారు అనుపమ. ఇలా వరుస చిత్రాలతో ఈ ఏడాది అనుపమ బిజీ బిజీ అన్నమాట. -
అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా!
హీరో అల్లు అర్జున్ , దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. వీరి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన ఓ స్టోరీ లైన్ అల్లు అర్జున్ కు బాగా నచ్చిందట. దీంతో త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుందట. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ . ఇటు మహేశ్‌బాబు సినిమాతో త్రివిక్రమ్ బిజీ. సో... వీరి కమిట్మెంట్స్ పూర్తయ్యాక అల్లు అర్జున్ , త్రివిక్రమ్ సినిమా సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుందేమో? -
గ్రూప్-1,2 నోటిఫికేషన్లకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
-
2 కంపెనీల ఐపీవోలకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా నిధుల సమీకరణకు నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ ఎబిక్స్ ఇంక్ అనుబంధ సంస్థ ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్, స్పెషాలిటీ కెమికల్ తయారీ కంపెనీ సర్వైవల్ టెక్నాలజీస్లను అనుమతించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించమంటూ ఈ రెండు కంపెనీలు 2022 మార్చి, డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. రూ. 6,000 కోట్లపై కన్ను ఐపీవో ద్వారా ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్ రూ. 6,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అనుబంధ సంస్థలు ఎబిక్స్ ట్రావెల్స్, ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. అంతేకాకుండా ఎబిక్స్ మారిషస్ జారీ చేసిన తప్పనిసరిగా మార్పడికి లోనయ్యే డిబెంచర్ల చెల్లింపులతోపాటు.. వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. కంపెనీ పేమెంట్ సొల్యూషన్స్, ట్రావెల్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, బీపీవో సర్వీసులు, స్టార్టప్‌ల ఏర్పాటులో టెక్నాలజీ ఆధారిత డిజిటల్ ప్రొడక్టులు, సర్వీసులను అందిస్తోంది. రూ. 1,000 కోట్లకు సై ఐపీవోలో భాగంగా సర్వైవల్ టెక్నాలజీస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్(సీఆర్ఏఎంఎస్– క్రామ్స్) విభాగంలో ప్రధానంగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్ ప్రొడక్ట్ గ్రూప్‌ల నుంచి ఎంపిక చేసిన ఉత్పత్తులను కంపెనీ రూపొందిస్తోంది. -
ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్ మన్లు..
-
APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు
సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు పడ్డాయి. భారీగా సొంత బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2,736 కొత్త బస్సుల కొనుగోలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.572 కోట్ల అంచనాతో 1500 కొత్త డీజిల్ బస్సులు, జీసీసీ మోడల్ లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘36 కొత్త అద్దె బస్సులు తీసుకోబోతున్నాం. వీలైతే కర్ణా టక తరహాలో 15 మీటర్ల అంబారీ బస్సులు. కొత్త స్క్రాప్ పాలసీ ప్రకారం కొన్ని బస్సులు తీసేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో 15 ఏళ్ల సర్వీసు దాటిన బస్సులు కేవలం 221 మాత్రమే ఉన్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపే విషయంపై ఒడిశా, కర్ణాటకతో ఒప్పందాలు పూర్తయ్యాయి. తమిళనాడు, తెలంగాణతో త్వరలోనే ఒప్పందాలు చేసుకుంటాం’’ అని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. -
విదేశీ బ్లాక్స్‌పై కోల్ ఇండియా కన్ను
న్యూఢిల్లీ: ప్రస్తుతం విదేశాలలో ఎలాంటి కోల్ బ్లాకులూలేని పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాకు త్వరలో ఈ అవకాశాలు లభించనున్నాయి. తాజాగా ఇందుకు పార్లమెంటరీ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇకపై విదేశాలలో బొగ్గు గనుల కొనుగోలు అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే ఇందుకు ఆయా క్షేత్రాలపట్ల పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టవలసి ఉంటుంది. ప్రధానంగా తక్కువ యాష్గల కోకింగ్ కోల్ బ్లాకుల కొనుగోలుకి అనుమతించనున్నారు. దీంతో శిలాజ ఇంధనలాకు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమేకాకుండా విదేశాలలో మైనింగ్‌పై కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుంటుందని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న బొగ్గు వనరులను పరిగణిస్తూ విదేశాలలో కోల్ బ్లాకులను కొనుగోలు చేసేందుకు కమిటీ సిఫారసు చేస్తోంది. బొగ్గు శాఖ లేదా కోల్ ఇండియా ఇందుకు సిద్ధపడవచ్చని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో బొగ్గు, గనులు, స్టీల్‌పై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ పేర్కొంది. 2009లో.. పూర్తి అనుబంధ సంస్థ కోల్ ఇండియా ఆఫ్రికానా లిమిటాడా ద్వారా నిజానికి 2009లోనే కోల్ ఇండి యా మొజాంబిక్‌లోని కోల్ బ్లాకుల కొనుగోలుకి ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను సొంతం చేసుకుంది. లోతైన అన్వేషణ, జియోలాజికల్, మైనింగ్ అవకాశాల నివేదికను అధ్యయనం చేశాక బొగ్గు నాణ్యత విషయంలో వెనకడుగు వేసింది. ఇక్కడ బొగ్గు వెలికితీత వాణిజ్యపంగా ఆచరణ సాధ్యంకాదని గుర్తించింది. ఫలితంగా బొగ్గు గనుల కొను గోలు లాభదాయకంకాదని 2016లో ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను తిరిగి మొజాంబిక్ ప్రభుత్వానికి దాఖలు చేసింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండి యా 80 శాతాన్ని ఆక్రమిస్తున్న విషయం విదితమే. -
కల్పతరులో జేఎంసీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్‌లో నిర్మాణ రంగ అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్టŠస్ విలీనానికి దారి ఏర్పడింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సంయుక్త సంస్థ దేశీయంగా అతిపెద్ద లిస్టెడ్ ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు కల్పతరు పేర్కొంది. ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ జేఎంసీ విలీనానికి అనుమతించినట్లు వెల్లడించింది. సంయుక్త సంస్థ దేశీయంగా భారీ కార్యకలాపాలు కలిగి ఉండగా.. 67 దేశాలలోనూ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. విద్యుత్ ప్రసారం, పంపిణీ, బిల్డింగులు, ఫ్యాక్టరీలు, వాటర్, రైల్వేలు, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర పలు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు వివరించింది. ఆర్డర్ బుక్ రూ. 43,000 కోట్లకు చేరనున్నట్లు తెలియజేసింది. కాగా.. 2022 ఫిబ్రవరిలో కల్పతరు, జేఎంసీ బోర్డులు విలీనానికి ఆమోదముద్ర వేశాయి. దీనిలో భాగంగా జేఎంసీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 4 షేర్లకుగాను 1 కల్పతరు షేరుని కేటాయిస్తారు. -
వైఎస్ షర్మిల పాదయాత్రకు ఓకే
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత విచారణ సందర్భంగా విధించిన షరతులు పాటించాలని ఆదేశించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు స్పష్టం చేసింది. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గత నెల వరంగల్‌లో షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకుని ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించి.. అనుమతి పొందారు. ఆ తర్వాత కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్టీపీ సభ్యుడు డి.రవీంద్రనాథ్‌రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున జీవీఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ వరప్రసాద్ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో 3,500 కి.మీ. మేర షర్మిల పాదయాత్ర ప్రశాంతంగా సాగిందన్నారు. గత విచారణ సందర్భంగా తాము ఆదేశాలు ఇచ్చినా పాదయాత్రకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆయన బదులిస్తూ.. హైకోర్టు అభ్యంతర వ్యాఖ్యలు చేయవద్దని చెప్పినా కూడా తెలంగాణను షర్మిల తాలిబన్ రాజ్యంతో పోల్చారన్నారు. పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘించారని చెప్పారు. రాజకీయ నేతలకు పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంటుందన్న న్యాయమూర్తి.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వాటిపై ఆంక్షలు విధించాల్సి వస్తుందన్నారు. టీఆర్ఎస్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడటం సరికాదని జీపీకి సూచించారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణంగా మారిందన్నారు. అసలు రాజకీయ నాయకులంతా పాదయాత్ర కోసం ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ప్రశ్నించారు. అనంతరం యాత్రకు అనుమతి ఇచ్చారు. సీఎం కేసీఆర్‌పైనా, రాజకీయంగా, మతపరంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించారు. ఇతర నాయకులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయరాదని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. -
సిగ్నేచర్ గ్లోబల్ రెడీ: వెయ్యికోట్ల ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఇష్యూలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ సర్వప్రియా సెక్యూరిటీస్, ఇన్వెస్టర్ సంస్థ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ విడిగా రూ. 125 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉంది. మధ్యస్థాయి, చౌక గృహ విభాగంపై దృష్టిపెట్టిన కంపెనీ.. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, భూముల కొనుగోలు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2014లో ఏర్పాటైన సిగ్నేచర్ గ్లోబల్ ఐపీవో చేపట్టేందుకు జులైలోనే సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ ప్రధానంగా హర్యానాలో కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించింది. థర్మజ్ క్రాప్‌నకు ఓకే: ఆగ్రోకెమికల్ కంపెనీ థర్మజ్ క్రాప్ గార్డ్ పబ్లిక్ ఇష్యూ తొలి రోజు సోమవారానికల్లా 1.8 రెట్లు అధికంగా స్పందన లభించింది. రూ. 216–237 ధరలో చేపట్టిన ఇ ష్యూ ద్వారా కంపెనీ రూ. 251 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా 80, 12,990 షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 1.44 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.6 రె ట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 35 శాతం స్పందన నమోదైంది. కంపెనీ విభిన్న ఆగ్రో కెమికల్ ఫార్ములేషన్ల తయారీ, పంపిణీలను నిర్వహిస్తోంది. -
AP Govt: వశిష్ట నిర్మాణానికి ఓకే.. రూ.490 కోట్ల వ్యయంతో వారధి..
సాక్షి, ఏలూరు: తీరప్రాంత ప్రజల చిరకాల కోరికగా మిగిలిన వశిష్ట గోదావరి వారధి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక అడ్డంకులు, అవరోధాలు, కోర్టు కేసులను దాటుకుని వచ్చే జనవరిలో టెండర్లు నిర్వహించి యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహించనున్నారు. వశిష్ట గోదావరిపై వంతెన కట్టి ప్రజల చిరకాల కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నర్సాపురం పర్యటనలో ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాలను కలిపే కీలక బ్రిడ్జి కావడంతో ముఖ్యమంత్రి ప్రకటనతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రిటీష్ హయాంలోనే అంకురార్పణ జరిగిన ఈ వంతెన నిర్మాణం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వంతెన నిర్మాణం ప్రారంభమవుతుందన్న తరుణంలో ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం కూడా ఆగిసోయింది. మళ్లీ ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంతెన నిర్మాణంపై దృష్టి పెట్టారు. 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించి.. రూ.490 కోట్లతో నరసాపురం మండలం రాజుల్లంక గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకూ నిర్మించిన 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టబోతున్నారు. కోనసీమ జిల్లా శివకోడు నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న స్టేట్‌హైవేను జాతీయ రహదారిగా మార్పుచేసి రామేశ్వరం మీదుగా ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోని రాజుల్లంక, వైఎస్ పాలెం, సీతారామపురం మీదుగా 216 జాతీయ రహదారికి బైపాస్ హైవే రోడ్డు నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. పనులు మైథాస్ సంస్థకు అప్పగించారు. అయితే ఈ సంస్థ సంక్షోభంలోకి వెళ్లడంతో మళ్లీ మరో కంపెనీకి వంతెన పనులు అప్పగించారు. కానీ ఆయన మృతితో పనులు నిలిచిపోయాయి. తరువాత టీడీపీ ప్రభుత్వం వంతెన విషయంలో అనేక డ్రామాలు నడిపింది. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి పేరు వస్తుందనే వంతెన నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలో వంతెన పనులకు టెండర్లు పిలుస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యత తీసుకుని, బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్‌గా ఉన్న వంతెన నిర్మాణానికి పూనుకుంటున్నారు. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ దశాబ్దాల కలల వారధి 1910లో నరసాపురం పట్టణం వద్ద వంతెన నిర్మాణానికి అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కేవలం రూ.70 వేలతో అంచనాలు తయారు చేసింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇక అప్పటి నుంచి నరసాపురం వశిష్ట వంతెన కథ నడుస్తూనే ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలోనూ నేతలు హామీలు ఇవ్వడం, మరిచిపోవడం జరుగుతోంది. 1986లో మొదటిసారిగా నరసాపురం వశిష్ట వంతెనకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్థాపన చేశారు. అయితే తరువాత రాజకీయ కారణాలతో ఇక్కడ నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. 2003లో చంద్రబాబు హయాంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి అంటూ హడావిడి చేసి శంకుస్థాపన చేశారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండగా కూడా వశిష్ట వంతెన నిర్మాణంపై సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటన చేసి హడావిడి చేయడం జరిగింది. కోర్టులకెక్కి ఆపే ప్రయత్నం.. నిజానికి ఈ నెల 18న నరసాపురంలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో శంకుస్థాపనలు జరిగిన రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లతో పాటే వశిష్ట వంతెనకు కూడా శంకుస్థాపన జరగాలి. అయితే స్థలసేకరణ విషయం వచ్చేసరికి ఈ ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణానికి బీజం పడితే జగన్ సర్కారుకు ఎక్కడ పేరు వస్తుందేమోనని.. ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపాయి. కావాలని అడ్డంకులు సృష్టించడానికి స్థల సేకరణ అంశంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గట్టి ప్రయత్నం చేసి స్టేను వెకేట్ చేయించి, ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించాలని నిర్ణయించారు. తీరా ముఖ్యమంత్రి పర్యటన దగ్గరికి వచ్చే సమయానికి మళ్లీ రెండోసారి కోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. దీని వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నట్టు సమాచారం. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో.. చించినాడ 216 జాతీయ రహదారికి కోనసీమ జిల్లా నుంచి నరసాపురం వరకూ బైపాస్ నిర్మించి, మధ్యలో వంతెన నిర్మిస్తే ఈ ప్రాజెక్ట్‌కు మోక్షం కలుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గట్కరీకి లేఖ రాయడం, శివకోడు సఖినేటిపల్లి మీదుగా రామేశ్వరం నుంచి నరసాపురం వరకూ 25 కిలోమీటర్ల మేర స్టేట్ హైవేను 216కు బైపాస్‌గా నేషనల్ హైవేగా మార్పు చేయాలని, మధ్యలో రాజుల్లంకవద్ద గోదావరిపై వంతెన నిర్మించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖకు స్పందించిన గట్కరీ వెంటనే ఆమోదం తెలపడంతో దశాబ్దాల వంతెన సమస్యకు లైన్ క్లియర్ అయ్యింది. -
ప్రత్యర్థులకు భిన్నంగా ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, ఉద్యోగులకు పండగ!
సాక్షి, ముంబై: మూన్‌లైటింగ్ వివాదం ప్రకంపనలు పుట్టిస్తున్నతరుణంలో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులు గిగ్ ఉద్యోగాలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని నిబంధనలు విధించింది.ప్రత్యర్థి కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఉద్యోగులకు చక్కటి వెసులుబాటుతోపాటు, కంపెనీలకు తలనొప్పిగా మారిన అట్రిషన్ రేటు కూడా తగ్గుతుందని శ్లేషకులు భావిస్తున్నారు. గురువారం ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ఇన్ఫోసిస్ వివరాలను అందించింది. మూన్లైటింగ్ని ప్రస్తావించకపోయినప్పటికీ, గిగ్ వర్క్‌ని చేపట్టాలనుకునే వారు, మేనేజర్, హెచ్ఆర్ ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. అయితే రెండో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ, తమకు పోటీగా ఉండకూడదని స్పష్టం చేసింది. తమ కంపెనీ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ‘గిగ్ వర్క్’లను ఏ విధంగా చేసుకోవచ్చో ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు అంతర్గతంగా వివరించింది. కంపెనీతో సమర్థవంతంగా పని చేసే వారి సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేయకుండా చూసేందుకు తమ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది. -
13 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళంలో జ్యోతిక
దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ జ్యోతిక. ఈ నెల 18న జ్యోతిక బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మమ్ముట్టి హీరోగా మలయాళ హిట్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఫేమ్ జో బేబీ దర్శకత్వంలో ‘కాతల్’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలోనే జ్యోతిక హీరోయిన్గా నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన జ్యోతిక ఇంతకుముందు మలయాళంలో ‘రాఖిలి పట్టు’(2007), ‘సీతాకల్యాణం’ (2009) అనేసినిమాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
మళ్లీ ఐపీవోల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నప్పటికీ కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ 8 కంపెనీలు ఐపీవో బాట పట్టగా.. తాజాగా రెండు కంపెనీలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో మూడు సంస్థలు లిస్టింగ్‌కు సన్నాహాలు ప్రారంభించాయి. ఇందుకు అనుగుణంగా సెబీ వద్ద ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిక్ ఇష్యూ ఆలోచనకు స్వస్తి పలుకుతున్నట్లు స్టెరిలైట్ పవర్, ముక్కా ప్రొటీన్ పేర్కొనడం గమనార్హం. వివరాలు చూద్దాం.. డెల్టాటెక్ రెడీ రియల్ మనీ గేమింగ్ విభాగంలో తొలి దశలోనే కార్యకలాపాలు విస్తరించిన డెల్టాటెక్ గేమింగ్‌కు తాజాగా సెబీ నుంచి అనుమతి లభించింది. మే నెలలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను లిస్టెడ్ ప్రమోటర్ సంస్థ డెల్టా కార్ప్ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 150 కోట్లను బిజినెస్ విస్తరణకు వినియోగించనుంది. మరో రూ. 50 కోట్లు టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేటాయించనుంది. ప్రిస్టీన్.. సై ప్రధానంగా రైల్ రవాణా నెట్‌వర్క్‌కు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయ సర్వీసులందించే ప్రిస్టీన్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిస్టింగ్ కోసం జూన్‌లో సెబీని ఆశ్రయించింది. తాజాగా ఇందుకు అనుమతి లభించింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 2 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, కంపెనీలోని ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ కంటెయినర్, నాన్కంటెయినర్ తదితర వివిధ రైల్, రోడ్ రవాణా సంబంధ వివిధ సర్వీసులు అందిస్తోంది. ఎయిరాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 750 కోట్లు సమీకరించేందుకు అనుమతించమంటూ ఎయిరాక్స్ టెక్నాలజీస్ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రమోటర్లు సంజయ్ భరత్‌కుమార్ జైస్వాల్(రూ. 525 కోట్లు), ఆషిమా సంజయ్ జైస్వాల్(రూ. 225 కోట్లు) విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కంపెనీ ప్రధానంగా పీఎస్ఏ ఆక్సిజన్ జనరేటర్లను తయారు చేస్తోంది. ప్రయివేటరంగ పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ మార్కెట్లో కంపెనీ 50–55 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2022 మార్చికల్లా దేశీయంగా దాదాపు 872 స్థాపిత పీఎస్ఏ ఆక్సిజన్ జనరేటర్లు నిర్వహణలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీకి అనువైన మెషీనరీ, విడిభాగాలు రూపొందించే కాన్పూర్ కంపెనీ.. లోహియా కార్ప్ ఐపీవో చేపట్టేందుకు సెబీని ఆశ్రయించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా దాదాపు 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, శాక్స్ తయారు చేసేందుకు వీలైన మెషీనరీని ప్రధానంగా రూపొందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో 2,000 మంది కస్టమర్ల బేస్‌ను కలిగి ఉంది. గతేడాది(2021–22)లో ఆదాయం రూ. 1,334 కోట్ల నుంచి రూ. 2,237 కోట్లకు జంప్ చేసింది. నికర లాభం రూ. 119 కోట్ల నుంచి రూ. 161 కోట్లకు ఎగసింది. ఐకియో ఐపీవోకు లెడ్ లైటింగ్ సొల్యూషన్స్ అందించే ఐకియో లైటింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 237 కోట్లు సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్‌కు, కొత్త యూని ట్ ఏర్పాటుకు వినియోగించనుంది. మరో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. కంపెనీ నాలుగు తయారీ యూనిట్లను కలిగి ఉంది. స్టెరిలైట్ పవర్ గతేడాది(2021) ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన ప్రయివేట్ రంగ కంపెనీ స్టెరిలైట్ పవర్ సందిగ్ధంలో పడింది. రూ. 1,250 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసిన కంపెనీ ప్రస్తుత ఆటుపోట్ల పరిస్థితుల్లో ఇష్యూ చేపట్టడం సరికాదని భావిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఐపీవోను వాయిదా వేసేందుకు నిర్ణయించుకున్నట్లు విద్యుత్ ప్రసారం, మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ తాజాగా వెల్లడించింది. వెరసి ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకోనున్నట్లు తెలియజేసింది. అయితే మార్కెట్లు కుదురుకుంటే భవిష్యత్‌లో సెబీకి తిరిగి ప్రాథమిక పత్రాలను దాఖలు చేయనున్నట్లు వివరించింది. ముక్కా ప్రొటీన్ ఈ ఏడాది మార్చిలో సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన ముక్కా ప్రొటీన్ వెనకడుగు వేసింది. తాజాగా ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. చేపల ఆహారం, చేప నూనె, ఆక్వా, పౌల్ట్రీ రంగాలలో ఫీడ్‌గా వినియోగించే ఫిష్ సొల్యూబ్ పేస్ట్ తదితరాలను కంపెనీ ప్రధానంగా తయారు చేస్తోంది. సబ్బుల తయారీ, లెదర్, పెయింట్ల పరిశ్రమల్లోనూ కంపెనీ ప్రొడక్టులను ఉపయోగిస్తారు. -
మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్
-
నాగర్నార్ స్టీల్‌విడదీతకు ఓకే
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎన్ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నార్ స్టీల్ ప్లాంటు(ఎన్ఎస్పీ)ను విడదీసేందుకు వాటాదారులు, రుణదాతలు అనుమతించినట్లు కంపెనీ సీఎండీ సుమిత్ దేవ్ తాజాగా వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా స్టీల్ శాఖ ఎన్ఎండీసీ వాటాదారులు, రుణదాతలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. తద్వారా ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీ విడదీతకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలియజేశారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు దగ్గర్లోగల నాగర్నార్లో ఎన్ఎండీసీ 3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూ. 23,140 కోట్ల అంచనా వ్యయాలతో 1,980 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంటును నెలకొల్పుతోంది. 2020 అక్టోబర్‌లో ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విడదీసేందుకు కేం్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఎన్ఎస్పీ ప్రత్యేక కంపెనీగా విడివడనుంది. తదుపరి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికిగల పూర్తి వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుకి విక్రయించనున్నారు. -
విజయవాడ–నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకి పచ్చజెండా
సాక్షి, అమరావతి: ఏపీ నుంచి మరో జాతీయ రహదారి మహారాష్ట్రను అనుసంధానించనుంది. విజయవాడ–నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కార్యాచరణకు ఉపక్రమించింది. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్–బ్రౌన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నారు. రూ.14 వేల కోట్లతో మొత్తం 457 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించే ప్రణాళికను ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. చదవండి: AP: ఎగుమతులపై ‘పుష్’ పాలసీ ఈమేరకు ఫీజబులిటీ నివేదిక, డీపీఆర్‌లను ఖరారు చేసింది. విజయవాడ–నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను అయిదు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. వాటిలో విజయవాడ–ఖమ్మం, ఖమ్మం–వరంగల్, వరంగల్–మంచిర్యాల ప్యాకేజీలను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా.. మంచిర్యాల–రేపల్లెవాడ, రేపల్లెవాడ–చంద్రాపూర్ ప్యాకేజీలను బ్రౌన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా నిర్మించాలని నిర్ణయించారు. చంద్రాపూర్ నుంచి నాగ్‌పూర్‌కు ఇప్పటికే ఉన్న 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవేకి ఈ రహదారిని అనుసంధానిస్తారు. మొత్తం మీద 310 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్, 147 కిలోమీటర్ల బ్రౌన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రూపుదిద్దుకోనుంది. తగ్గనున్న వ్యయ, ప్రయాసలు ఈ హైవేతో విజయవాడ–నాగ్‌పూర్ మధ్య ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు బాగా తగ్గుతాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి నాగ్‌పూర్ వెళ్లాలంటే హైదరాబాద్, అదిలాబాద్ మీదుగా 770 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దాదాపు 13 గంటల సమయం పడుతోంది. కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేను విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, మంచిర్యాల మీదుగా నిర్మించన్నారు. దీంతో విజయవాడ–నాగ్‌పూర్ మధ్య దూరం 163 కిలోమీటర్లు తగ్గి ఐదుగంటల సమయం కలసివస్తుంది. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కావడంతో భూసేకరణ ప్రక్రియపై ఎన్హెచ్ఏఐ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు వేగవంతం చేసింది. విజయవాడ రూరల్, జి.కొండూరు, గంపలగూడెం మండలాల్లో దాదాపు 1.65 లక్షల చదరపు మీటర్ల భూసేకరణకు రెవెన్యూ శాఖ సన్నాహాలు చేస్తోంది. డిసెంబరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి 2025నాటికి ఈ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పూర్తిచేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. -
గెయిల్ బైబ్యాక్ బాట
న్యూఢిల్లీ: యుటిలిటీ పీఎస్‌యూ దిగ్గజం గెయిల్ ఇండియా బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం(31న) సమావేశమైన బోర్డు పెయిడప్ ఈక్విటీలో 2.5 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు గెయిల్ పేర్కొంది. షేరుకి రూ. 190 ధర మించకుండా 5.7 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,083 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రస్తుత బైబ్యాక్ ధర ఎన్ఎస్ఈలో బుధవారం(30న) ముగింపు ధరతో పోలిస్తే 24% అధికంకావడం గమనార్హం! గతంలోనూ..: గెయిల్ 2020–21 లోనూ షేరుకి రూ. 150 ధరలో రూ. 1,046 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 51.8% వాటా ఉంది. దీంతో ప్రభుత్వం సైతం బైబ్యాక్‌లో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. గత బైబ్యాక్‌లో ప్రభుత్వ వాటాకు రూ. 747 కోట్లు లభించిన సంగతి తెలిసిందే. కాగా.. 2021–22లో కంపెనీ మధ్యంతర డివిడెండ్ కింద రికార్డ్ సృష్టిస్తూ రూ. 3,996 కోట్లు(90 శాతం) చెల్లించింది. ఇక 2009, 2017, 2018 లతోపాటు 2020లోనూ వాటాదారులకు బోనస్ షేర్లను సైతం జారీ చేసింది. ఎన్ఎస్ఈలో గెయిల్ షేరు 2 శాతం పుంజుకుని రూ. 156 వద్ద ముగిసింది. -
గ్రూప్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
-
విశాఖలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పేదల భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విశాఖలో ఒక లక్షా 80 వేల మందికి కోర్టు తీర్పు ఊరట నిచ్చింది. ఇల్లు లేని వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. దీనిపై కొందరు పిటిషన్ దాఖలు చేయడంతో ఇళ్ల స్థలాలు పంపిణీ నిలిచింది. ఇప్పుడు ఆ పిటిషన్ కొట్టి వేయడంతో లబ్ధిదారులు సంతోష వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏపీ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన -
ఎల్ఐసీ ఐపీవోకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి మార్గం సుగమమైంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌కు సెబీ తాజాగా ఓకే చెప్పింది. వెరసి దరఖాస్తు చేసిన నెల రోజుల్లోగా ఒక కంపెనీ ఐపీవోకు అనుమతించి రికార్డు సృష్టించింది. దీంతో బీమా దిగ్గజంలో 5 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వానికి వీలు చిక్కనుంది. ఎల్ఐసీ లిస్టింగ్ ద్వారా ప్రభుత్వం రూ. 63,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి(2021–22) నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించేందుకు అవకాశమేర్పడింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఐపీవో చేపట్టడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు అధికారిక వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి. పూర్తి వాటా... ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం(దాదాపు 632.5 కోట్ల షేర్లు) వాటా ఉంది. ఐపీవోలో భాగంగా 5 శాతం వాటా(31.6 కోట్ల షేర్లు)ను విక్రయానికి ఉంచనుంది. ఎల్ఐసీ ఉద్యోగులకు, పాలసీదారులకు ఐపీవో ధరలో డిస్కౌంటును ఆఫర్ చేయనుంది. గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ అంతర్గత విలువను మిల్లిమన్ అడ్వయిజర్స్ రూ. 5.4 లక్షల కోట్లుగా మదింపు చేసింది. దీంతో రూ. 16 లక్షల కోట్ల మార్కెట్ విలువను పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఎల్ఐసీ లిస్టయితే అతిపెద్ద ఐపీవోగా రికార్డు నెలకొల్పనుంది. 2021లో రూ. 18,300 కోట్ల సమీకరణకు వచ్చిన పేటీఎమ్ ప్రస్తుతం అతిపెద్ద ఇష్యూగా నమోదైన విషయం విదితమే. అంతక్రితం 2010లో కోల్ ఇండియా రూ. 15,500 కోట్లు, 2008లో రిలయన్స్ పవర్ రూ. 11,700 కోట్లు సమీకరించడం ద్వారా భారీ ఐపీవోలుగా నిలిచాయి. -
కంపెనీలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఇటీవల కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ కొంతమేర నెమ్మదించింది. అయితే తిరిగి మరోసారి ఊపందుకోనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దోహదపడనుంది. నిధుల సమీకరణకు తాజాగా సెబీ నుంచి అనుమతి పొందిన కంపెనీల జాబితాలో ఏపీఐ హోల్డింగ్స్, వెల్నెస్ ఫరెవర్ మెడికేర్, సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ చేరాయి. కాగా.. మరోవైపు స్పెషాలిటీ మెరైన్ కెమికల్ తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ సాధించే యోచనలో ఉంది. వివరాలు చూద్దాం.. ఫార్మ్ఈజీ.. ఫార్మసీ ప్లాట్‌ఫామ్ ఫార్మ్‌ఈజీకి మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా రూ. 6,250 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ఐపీవో నిధుల్లో రూ. 1,929 కోట్లు రుణ చెల్లింపులు, వృద్ధి అవకాశాలకు రూ. 1,259 కోట్లు, కొనుగోళ్లు తదితర వ్యూహాలకు రూ. 1,500 కోట్లు చొప్పున వెచి్చంచనుంది. వెల్నెస్ మెడికేర్ అదార్ పూనావాలాకు పెట్టుబడులున్న వెల్నెస్ ఫరెవర్ మెడికేర్ ఐపీవో ద్వారా రూ. 1,600 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఓమ్నిచానల్ రిటైల్ ఫార్మసీ కంపెనీ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 1.60 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఇటీవలే బోర్డులో కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకుంది. సీఎంఆర్ గ్రీన్ మెటల్ రీసైక్లింగ్ కంపెనీ సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.34 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఐపీవోకు ఆర్కియన్ కెమ్ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు న్యూఢిల్లీ: స్పెషాలిటీ మెరైన్ కెమికల్ తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూకి సిద్ధపడుతోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,200 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.9 కోట్ల షేర్లను సైతం కంపెనీ ప్రమోటర్లు, ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఇన్వెస్ట్మెంట్ సంస్థలలో పిరమల్ గ్రూప్, బెయిన్ క్యాపిటల్ మధ్య ఏర్పాటైన భాగస్వామ్య సంస్థ రిసర్జెన్స్ ఫండ్ ప్రధానంగా వాటాను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. 2021 మార్చితో ముగిసిన ఏడాది కంపెనీ దాదాపు రూ. 741 కోట్ల టర్నోవర్ సాధించింది. -
మరో గ్రీన్ సిగ్నల్!
తెలుగులో ‘బోళాశంకర్’, ‘సర్కారు వారి పాట’, తమిళంలో ‘సాని కాయిదమ్’, మలయాళంలో ‘వాషి’ .. ఇలా సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ కీర్తీ సురేష్. తాజాగా ఈ మలయాళ బ్యూటీ మరో తమిళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించగా ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు.. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. -
కోవిడ్ ఔషధం వచ్చేసింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న కోవిడ్–19 ఔషధం మోల్నుపిరావిర్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ యాంటీ వైరల్ డ్రగ్‌కు అయిదు రోజుల్లో వైరస్‌ను కట్టడి చేయగలిగే సామర్థ్యం ఉండడంతో సహజంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు మోల్నుపిరావిర్ ఔషధం తయారీ, విక్రయానికి పలు కంపెనీలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మంగళవారం అనుమతి ఇచ్చింది. ఔషధ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుని వాటి ఫలితాల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించిన ఈ సంస్థలు.. మోల్నుపిరావిర్ జనరిక్ వర్షన్ ఉత్పత్తికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. మోల్నుపిరావిర్‌ను మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్ అభివృద్ధి చేశాయి. అయిదు రోజులు వాడితే చాలు.. ప్రస్తుతానికి మోల్నుపిరావిర్ 200 ఎంజీ క్యాప్సూల్స్ ఉత్పత్తికి డీసీజీఐ ఆమోదం తెలిపింది. మోల్నుపిరావిర్‌ను 18 ఏళ్లు పైబడి, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్న కోవిడ్–19 రోగులకు వైద్యులు సిఫార్సు చేస్తారు. ప్రత్యేకత ఏమంటే అయిదు రోజులు ఈ మందు వాడితే చాలు. ఉదయం 800 ఎంజీ, రాత్రి 800 ఎంజీ తీసుకోవాల్సి ఉంటుంది. తాము చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 80 శాతం మంది రోగులు అయిదు రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారని.. ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ఒక కంపెనీ డైరెక్టర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘10 రోజుల్లో 93 శాతం, 14 రోజుల్లో 99 శాతం మందికి నెగెటివ్ వచ్చింది. ఈ మందు వైరస్ ప్రభావాన్ని పూర్తిగా నియంత్రించడం విశేషం. కోవిడ్–19కు ఈ ఒక్క డ్రగ్ సరిపోతుంది. ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సిన అవసరం దాదాపుగా ఉండదు’ అని ఆయన వివరించారు. ఇదీ కంపెనీల జాబితా.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మోల్నుపిరావిర్ ఔషధం తయారీకి సంబంధించి భారత్‌లో ప్రస్తుతానికి 13 కంపెనీలు ఆమోదం పొందాయి. ఇందులో ఆరు సంస్థలు హైదరాబాద్‌కు చెందినవే కావడం విశేషం. వీటిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో, నాట్కో ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఆప్టిమస్ ఫార్మా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన సన్ ఫార్మా, సిప్లా, వయాట్రిస్ (గతంలో మైలాన్) టోరెంట్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్, బీడీఆర్ ఫార్మాస్యూటికల్స్‌కు సైతం డీసీజీఐ నుంచి అనుమతి లభించింది. మోల్నుపిరావిర్ ఔషధ పరీక్షలను రెడ్డీస్, అరబిందో, హెటిరో, నాట్కో, ఎంఎస్ఎన్, ఆప్టిమస్, స్ట్రైడ్స్, బీడీఆర్ జరిపాయి. డాక్టర్ రెడ్డీస్ నేతృత్వంలో సన్, సిప్లా, వయాట్రిస్, టోరెంట్, ఎమ్క్యూర్ కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి ఔషధ పరీక్షలను నిర్వహించాయి. అన్ని బ్రాండ్లు వారంలోనే.. మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్‌ను నేడో రేపో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. అన్ని బ్రాండ్లు ఈ వారమే విపణిలోకి రానున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఔషధాన్ని సరఫరా చేయగలిగే సామర్థ్యం తమకు ఉందని అరబిందో వైస్ చైర్మన్ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఈ క్యాప్సూల్స్ తయారు చేయనున్నట్టు హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థ సారథి రెడ్డి తెలిపారు. కాగా, బ్రాండ్‌నుబట్టి ఒక్కో క్యాప్సూల్ గరిష్ట ధర రూ.30 నుంచి రూ.75 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల సమాచారం. 400 ఎంజీ క్యాప్సూల్స్ తయారీకై అనుమతించాల్సిందిగా ఇప్పటికే కంపెనీలు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ వారంలోనే గ్రీన్ సిగ్నల్ రావొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. 400 ఎంజీ అందుబాటులోకి వస్తే రోగులకు పెద్ద ఉపశమనం ఉంటుంది. -
ఐపీవోలకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలు దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో నిర్వాహక కంపెనీ లే ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్, కార్డియాక్ స్టెంట్ల తయారీ సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్, ఆహారం, పానీయాల సంస్థ కెవెంటర్ ఆగ్రో ఉన్నాయి. ► పబ్లిక్ ఇష్యూ ద్వారా ఇక్సిగో రూ. 1,600 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. తాజా ఈక్విటీ నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ► ఐపీవో ద్వారా సహజానంద్ మెడికల్ రూ. 1,500 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ► పబ్లిక్ ఇష్యూలో భాగంగా కెవెంటర్ ఆగ్రో రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.07 కోట్లకుపైగా షేర్లను మండాలా స్వీడే ఎస్పీవీ విక్రయానికి ఉంచనుంది. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెవెంటర్ ఆగ్రో పేర్కొంది. -
హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి లైన్‌క్లియర్!
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్‌క్లియర్ అయ్యింది. ఇందుకు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. పేర్లు వ్యాఖ్యానించడానికి నిరాకరణ ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయంపై దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని కూడా అత్యున్నత స్థాయి ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై త్రైమాసికం వారీగా లేదా కోర్టు సమయానుకూల ఆదేశాలకు అనుగుణంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయాలని ఆదేశించింది. ప్రస్తుతం వాటాలు ఇలా... హిందుస్తాన్ జింగ్‌లో తనకున్న వాటా 100 శాతంలో 24.08 శాతాన్ని దేశీయ మార్కెట్లో కేంద్రం తొలుత 1991–92లో విక్రయించింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్రం వాటా 75.92 శాతానికి తగ్గింది. అతల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో ఉన్న 2002 సమయంలో అప్పట్లో ‘మినీ రత్న’ హోదా హిందుస్తాన్ జింక్‌లో 26 శాతాన్ని వ్యూహాత్మక భాగస్వామి– ఎస్‌ఓవీఎల్‌కు (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) కేంద్రం విక్రయించింది. 2002 ఏప్రిల్ 10న ఎస్‌ఓవీఎల్ ఓపెన్ మార్కెట్లో మరో 20 శాతాన్ని కొనుగోలు చేసింది. 2003 ఆగస్టులో కేంద్రంతో జరిగిన షేర్‌హోల్డర్ అగ్రిమెంట్ ద్వారా మరో 18.92 శాతం కొనుగోలు చేసింది. వెరసి ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ వద్ద హిందుస్తాన్ జింక్‌లో 64.92 శాతం వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయానికి కూడా 2012లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. గురువారం ట్రేడింగ్ ముగిసే నాటికి ఎస్‌ఓవీఎల్ వాటా 64.92 శాతం కాకుండా, డీఐఐ, ఎఫ్ఐఐ, రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద వరుసగా 32.32 శాతం, 0.83 శాతం, 1.93 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఎన్ఎస్ఈలో షేర్ ధర క్రితంలో పోల్చితే 2.92 శాతం (రూ.9.70) తగ్గి రూ.322.95 వద్ద ముగిసింది. -
పేటీఎమ్ ఐపీవోకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ను పొందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గోప్యత పాటించే షరతుతో అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరుకల్లా పేటీఎమ్ ఐపీవోకు వచ్చే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీవో ద్వారా రూ. 16,600 కోట్లు సమీకరించాలని పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ భావిస్తోంది. వెరసి దేశీ ప్రైమరీ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఇష్యూగా నిలిచే వీలుంది. ఇంతక్రితం 2010లో పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా రూ. 15,200 కోట్ల సమీకరణ ద్వారా భారీ ఐపీవోగా రికార్డ్ సాధించింది. కాగా.. వేగవంత లిస్టింగ్‌కు వీలుగా ఐపీవోకు ముందు నిర్వహించే(ప్రీఐపీవో) షేర్ల విక్రయాన్ని రద్దు చేసుకునే యోచనలో పేటీఎమ్ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ విలువ నిర్ధారణలో వ్యత్యాసాలు ఇందుకు కారణంకాదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రూ. 1.47–1.78 లక్షల కోట్ల విలువను పీటీఎమ్ ఆశిస్తోంది. యూఎస్ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విలువ మదింపు నిపుణులు అశ్వథ్ దామోదరన్ తాజాగా పేటీఎమ్ అన్‌లిస్టెడ్ షేర్లకు ఒక్కొక్కటీ రూ. 2,950 చొప్పున విలువను అంచనా వేయడం గమనార్హం! పబ్లిక్ ఇష్యూలో భాగంగా పేటీఎమ్ రూ. 8,300 కోట్ల విలువైన తాజా ఈక్వి టీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 8,300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. -
Akasa Air: ఝున్‌ఝున్‌వాలాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Akasa Airlines Rakesh Jhunjhunwala: కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న ఈ సంస్థకు.. పౌర విమానయాన శాఖ ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)’ జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. దీనితో 2022 వేసవి నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ఆకాశ ఎయిర్ హోల్డింగ్ సంస్థ ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. ‘ఎన్వోసీ జారీ చేసినందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలు‘ అని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే తెలిపారు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేస్తున్న ఆకాశ ఎయిర్ బోర్డులో ప్రైవేట్ రంగ ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగో మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ కూడా ఉన్నారు. సీఈవోగా నియమితులైన దూబే గతంలో జెట్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఎయిర్‌బస్, బోయింగ్‌తో చర్చలు జరుపుతోందని సమాచారం. వచ్చే నాలుగేళ్లలో సుమారు 70 విమానాలను ఆపరేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. చదవండి: బిగ్‌బుల్‌ను కలిశా.. సంతోషం: ప్రధాని మోదీ ఇదీ చదవండి: ఝున్‌ఝున్‌వాలా ఏం చేయబోతున్నాడు? సర్వత్రా ఆసక్తి -
సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్: 539 కొత్త 104 వాహనాలు
సాక్షి, అమరావతి: గ్రామీణ, మూరుమూల ప్రాంతాల ప్రజలకు వారి ముంగిటే నాణ్యమైన వైద్య సేవలు రానున్నాయి. ఇందుకోసం ఉద్దేశించిన ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తెచ్చేందుకు 539 కొత్త 104 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలు కొనుగోలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో 432 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. మిగతా వాహనాల కొనుగోళ్లకు చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున మొత్తం 656 కొత్త వాహనాల ద్వారా గ్రామీణ, గిరిజన ప్రజలకు అక్కడే వైద్య సేవలందిస్తున్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలకూ.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేయడం ద్వారా గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా మండలానికి రెండేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 మొబైల్ మెడికల్ యూనిట్వాహనం, ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మండలానికి రెండు చొప్పున 104 వాహనాలను సమకూర్చేందుకు కొత్తగా మరో 539 కొనుగోలు చేస్తున్నారు. టెండర్లలో ఎల్–1గా నిలిచిన సంస్థ పేర్కొన్న ధరకు మళ్లీ రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో సాధకబాధకాలను తెలుసుకుని పటిష్టంగా ఈ కాన్సెప్ట్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 258 మండలాల్లో నవంబర్ 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కొత్తగా కొనుగోలు చేసే వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 1,195 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలు అందుబాటులోకి వస్తాయి. జనాభాను దృష్టిలో పెట్టుకుని.. జనాభాను దృష్టిలో పెట్టుకుని 104 వాహనాలను వినియోగించాలంటూ సీఎం ఆదేశించారని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో వినయ్‌చంద్ తెలిపారు. 539 కొత్త వాహనాల కొనుగోలుకు సుమారు రూ.89 కోట్లు వ్యయం అవుతుందన్నారు. వాటి నిర్వహణకు ఏడాదికి రూ.75 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయానికి నెలకు కనీసం రెండుసార్లు 104 వాహనంలో వైద్యులు వెళ్లి ఉదయం ఓపీ చూస్తారన్నారు. మధ్యాహ్నం నుంచి ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించడం, పరీక్షలు నిర్వహించడం చేస్తారని వివరించారు. కొత్త 104 వాహనాలు జవనరి 26 నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
వైద్యారోగ్య శాఖలో భారీ నియామకాలు.. 14,200 పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు దాదాపు 14,200కు పైగా పోస్టుల భర్తీకి అధికారులు చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అక్టోబరు 1 నుంచి పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది నియామకం, కోవిడ్–19 నివారణ, వ్యాక్సినేషన్‌పై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బంది, జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుత అవసరాలు తదితర వివరాలపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. డాక్టర్ సెలవులో వెళ్తే మరో డాక్టర్ విధులు నిర్వహించాలి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలి. ఒక డాక్టరు సెలవులో వెళ్తే.. ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా వ్యవస్థ ఉండాలి. ఈ మేరకు తగిన సంఖ్యలో వైద్యులను నియమించాలి. డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితి కానీ, తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కానీ ఉండకూడదు. కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు నిర్వహించాలి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. ఇదే సమయంలో సరిపడా సిబ్బంది లేని కారణంగా రోగులకు మంచి సేవలు అందని పరిస్థితి ఇకపై ఉంటానికి వీల్లేదు. మూడు జిల్లాల్లో వ్యాక్సినేషన్‌పై దృష్టి ►తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. ఇందుకోసం ఈ మూడు జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలి. ►రాత్రి పూట కర్ఫ్యూ యధావిధిగా అమలు చేయాలి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అంక్షలు కొనసాగుతాయి. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియే కోవిడ్ సమస్యకు పరిష్కారం. అందువల్ల దీన్ని వేగవంతం చేయాలి. ►ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ ఇలా.. ►ఏపీలో యాక్టివ్ కేసులు : 13,749 ►ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు : 2,787 ►కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 562 ►రికవరీ రేటు శాతం : 98.60 ►పాజిటివిటీ రేటు శాతం : 2.12 ►3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు : 10 ► 3 నుంచి 5 శాతం పాజిటివిటీ ఉన్న జిల్లా : 2 ►5% కంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్న జిల్లా : 1 ►రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 10,921 ►నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్స్ శాతం : 91.33 ►ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్స్ శాతం : 72.64 థర్డ్ వేవ్ పై సన్నద్ధత ►అందుబాటులో ఉన్న డీ టైప్ సిలెండర్లు : 27,311 ►అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు : 20,964 ►ఇంకా అందుబాటులోకి రావాల్సినవి : 2,493 ►ఆక్సిజన్ పైప్‌లైన్ పనులు పూర్తయిన ఆస్పత్రులు : 128 ►ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు : 143 ►అక్టోబర్ 10 నాటికి మొత్తం అందుబాటులోకి.. వ్యాక్సినేషన్ ►ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య : 2,61,56,928 ►సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన వారు : 1,34,96,579 ►రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు : 1,26,60,349 ►వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు : 3,88,17,277 -
నెలకు 3 లక్షల కార్డులు క్రెడిట్ కార్డ్స్: హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ముంబై: క్రెడిట్ కార్డ్స్ మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీకి ఆర్బీఐ నుంచి గత వారం గ్రీన్‌సిగ్నల్ పొందిన నేపథ్యంలో భారీ లక్ష్యాన్ని బ్యాంక్ నిర్ధేశించుకుంది. తొలుత నెలకు 3 లక్షల కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు బ్యాంక్ పేమెంట్స్, కంజ్యూమర్ ఫైనాన్స్ గ్రూప్ డైరెక్టర్ పరాగ్ రావ్ వెల్లడించారు. ‘మూడు నెలల్లో ఈ సంఖ్యను చేరుకుంటాం. ఆ తర్వాత ఆరు నెలలకు ఈ సంఖ్యను 5 లక్షలకు చేరుస్తాం. 9–12 నెలల్లో కార్డుల సంఖ్య పరంగా మా వాటాను తిరిగి చేజిక్కించుకుంటాం’ అని వివరించారు. కార్డుల సంఖ్య పరంగా హెచ్డీఎఫ్సీ వాటా 2 శాతం తగ్గి 25లోపుకు వచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నూతన క్రెడిట్ కార్డులు జారీ చేయరాదంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను 2020 నవంబరులో ఆర్బీఐ ఆదేశించింది. -
కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్‌కు గ్రీన్ సిగ్నల్
-
త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతా : హీరోయిన్
‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మృణాళినీ రవి మరో తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపారట. ప్రస్తుతం తమిళ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారామె. విక్రమ్ సరసన ‘కోబ్రా’, విశాల్‌తో ‘ఎనిమి’ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రంలో నటించనున్నారని టాక్. ఈ సందర్భంగా మృణాళిని మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల అభిమానం ఒక రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి ఆ అభిమానాన్ని రుచి చూసిన వాళ్లెవరైనా అంత తేలిగ్గా మర్చిపోలేరు. నటనతో పాటు గ్లామర్‌కి స్కోప్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ కరోనా లాక్డౌన్లో కొందరు తెలుగు దర్శకులు చెప్పిన కథలను ఆన్లైన్లో విన్నాను. త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతాను’’ అన్నారు. -
పాపికొండల పర్యాటకానికి గ్రీన్ సిగ్నల్
వీఆర్‌పురం: అలలతో సయ్యాటలాడుతూ.. ఆ తుంపర్లలో హాయిగా తడుస్తూ.. రివ్వున తాకే చల్లని గాలులలకు సేద తీరుతూ.. ఆనందంగా కేరింతలు కొడుతూ.. తల్లి గోదావరి ఒడిలో ప్రయాణించే రోజులు మళ్లీ వచ్చేశాయి. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న పాపికొండల పర్యాటకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరో రెండు రోజుల్లోనే ఇది ప్రారంభం కానుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర కిందట దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో దాదాపు 50 మంది జలసమాధి అయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘోర ప్రమాదం అనంతరం పాపికొండల పర్యాటకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. గోదావరిలో అన్ని మోటార్ బోట్లనూ నిషేధించింది. పర్యాటకుల ప్రాణాలకు భద్రతనిచ్చే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకున్న తరువాతే నదీ పర్యాటకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించింది. గోదావరిలో రాజమహేంద్రవరం నుంచి 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు నడిచేవి. అలాగే భద్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు రాకపోకలు సాగించేవి. కాకినాడ పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఇప్పటి వరకూ ఒక్క ప్రైవేటు లగ్జరీ బోటుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన హరిత ఏసీ లగ్జరీ బోటుకు మాత్రం పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చింది. ఈ బోటుతోనే పాపికొండల పర్యాటకం ఈ నెల 15 నుంచి పునఃప్రారంభం కానుంది. మొత్తంమీద అనేక జాగ్రత్తల నడుమ పాపికొండల పర్యాటకాన్ని తిరిగి ప్రారంభిస్తుండడంపై అటు పర్యాటకులు, ఇటు ఈ పర్యాటకంపై ఆధారపడిన కుటుంబాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా పర్యాటకులు ఏజెన్సీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ సుమారు 40 కిలోమీటర్ల పొడవున గోదావరికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండల అందాలను, ఇక్కడి అటవీ ప్రాంతాన్ని, కొండల నడుమ వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరి సోయగాన్ని బోట్లలో ప్రయాణిస్తూ వీక్షించేందుకు ఏటా దేశవ్యాప్తంగా వేలాదిగా పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలివచ్చేవారు. ఫలితంగా పాపికొండల పర్యాటకం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. దీంతో ఇక్కడి గ్రామాల్లో నివసించే కొండరెడ్డి గిరిజన ప్రజలతో పాటు సమీప గ్రామాల గిరిజనేతరులకు కూడా ఇది ఉపాధి మార్గంగా మారింది. వీఆర్‌పురం మండలం పోచవరం బోట్ పాయింట్ నుంచి రోజు సుమారు 300 మంది, సెలవు రోజుల్లో వెయ్యి మందికి పైగా పర్యాటకులు పాపికొండల సందర్శనకు వచ్చేవారు. వీరు 15 నుంచి 20 బోట్లలో పాపికొండలు వెళ్లేవారు. పర్యాటకం నిలిచిపోయే సమయానికి బోటుకు పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.400 చొప్పున టిక్కెట్టు ఉండేది. ఏసీ బోట్లకు మరో రూ.100 అదనంగా వసూలు చేసేవారు. టిక్కెట్టు చార్జీలోనే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా కలిపి ఉండేవి. భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు, పర్యాటకులు 75 కిలోమీటర్ల దూరంలోని పోచవరం బోట్ పాయింట్‌కు రోడ్డు మార్గంలో చేరుకొనేవారు. అక్కడి నుంచి గోదావరి నదిలో బోట్ ద్వారా పాపికొండల సందర్శనకు వెళ్లేవారు. అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా వైపు పేరంటపల్లిలో ఎత్తయిన కొండల నడుమ, గలగల పారే సెలయేటిని ఆనుకుని ఉన్న పురాతన శివాలయాన్ని దర్శించుకుని భక్తిపరవశులయ్యేవారు. అనంతరం తిరుగుపయనమయ్యేవారు. వేల కుటుంబాలకు ఉపాధి పాపికొండల పర్యాటకంపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. భద్రాచలంలో పర్యాటకులను తరలించే మినీ వ్యాన్ల డ్రైవర్లు మొదలుకొని అక్కడి టిక్కెట్టు కౌంటర్లలో పని చేసే వర్కర్లు, లాడ్జీల నిర్వాహకులు, మార్గం మధ్యలోని కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని హోటళ్లు, ఇతర వ్యాపారాలు చేసేవారు పాపికొండలు పర్యాటకులపై ఆధారపడి జీవించేవారు. అలాగే పోచవరం బోట్ పాయింట్ వద్ద వ్యాపారులు, బోట్ల యజమానులు, గుమస్తాలు, బోట్ల వర్కర్లు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, బోట్లలో పర్యాటకులకు వినోదాన్ని పంచే డ్యాన్సర్లు, పేరంటపల్లిలో వెదురు కళాకృతులు విక్రయించే కొండరెడ్డి గిరిజనులు, కొల్లూరు ఇసుక తిన్నెల్లో బొంగు చికెన్ విక్రయించే గిరిజనులతో పాటు ఐస్‌లు విక్రయించే వారు ఇలా సుమారు 5 వేల మందికి పైగా ప్రజలు ఈ పర్యాటకాన్ని నమ్ముకొని జీవనం సాగించేవారు. ఇన్నాళ్లుగా పాపికొండల విహార యాత్రలు నిలిచిపోవడంతో వారందరి జీవనానికి బ్రేకులు పడ్డాయి. పాపికొండల పర్యాటకం పూర్వ వైభవం సంతరించుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. లాంచీకి కాపలా కాస్తున్నా అసలు నేను లాంచీ డ్రైవర్‌ను. పాపికొండలకు బోట్లు నిలిచిపోవడంతో బోట్లలో సిబ్బందిని కుదించారు. గతిలేక నేను నడిపిన లాంచీకి ఇప్పుడు కాపలాదారుగా ఉంటున్నాను. పాపికొండల పర్యాటకం మళ్లీ ప్రారంభం కాబోతోందంటే ఆనందంగా ఉంది. – పి.సూర్యనారాయణ, లాంచీ డ్రైవర్ ఆశలు చిగురిస్తున్నాయి పర్యాటకంపై ఆధారపడి ఎంతోమంది గిరిజన, గిరిజనేతర కుటుంబాలు ఉపాధి పొందేవి. పర్యాటకం నిలిచిపోవడంతో పూట గడవని స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని మాలాంటి కొండరెడ్డి కుటుంబాల వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వెదురు కళాకృతులు విక్రయించి జీవనం సాగించేవారు. ఇప్పుడు చేద్దామంటే పని దొరకక పూట గడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మాలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. – కోపాల రాంబాబురెడ్డి, వెదురు కళాకృతుల విక్రయదారు, పేరంటపల్లి ఆశగా ఎదురుచూస్తున్నాం బోట్లో గుమస్తాలుగా చేసే మాలాంటి ఎంతో మందికి బోట్ యూనియన్ నుంచి నెలవారీ జీతాలు వచ్చేవి. పర్యాటకం నిలిచిపోవడంతో ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంకొన్ని రోజులకైనా పర్యాటకం మొదలవుతుందని, వేరే పనికి వెళ్లకుండా ఆశగా ఎదురు చూస్తున్నాం. – నందికొండ నరసింహరావు, బోట్ గుమస్తా పర్యాటకం ప్రారంభమైతేనే.. పర్యాటకం నిలిచిపోవడంతో కనీసం బోట్లలో పని చేసే వర్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. పర్యాటకం ప్రారంభమైతేనే ఈ గండం నుంచి గట్టెక్కగలుగుతాం. పోచవరం బోట్ పాయింట్ వద్ద పర్యాటక బోట్లను పోర్ట్ అధికారులు పలుమార్లు తనిఖీ చేశారు. కొన్ని బోట్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల మంజూరుకు సిఫారసు కూడా చేశారు. త్వరలోనే పర్యాటకం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం. – మామిడి వెంకటరమణ, బోట్ యజమాని చదవండి: చంద్రబాబు సభ: ఆ రాయి ఎలా వచ్చింది? మందుబాబులు నాకే ఓటు వేయాలి -
పిరమల్ చేతికి దివాన్ హౌసింగ్
న్యూఢిల్లీ: దివాళా చట్ట చర్యలకు లోనైన ఎన్బీఎఫ్సీ.. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్)ను పిరమల్ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు ఆర్బీఐ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రుణ భారంతో కుదేలైన డీహెచ్ఎఫ్ఎల్ను కొనుగోలు చేసేందుకు పిరమల్ గ్రూప్ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఇప్పటికే రుణదాతల కమిటీ(సీవోసీ) ఆమోదముద్ర వేసింది. పిరమల్ గ్రూప్ కంపెనీ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను జనవరి 15న సీవోసీ ఆమోదించింది. భారీ నష్టాలు..: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో డీహెచ్ఎఫ్ఎల్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,095 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ3లో రూ. 934 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లోనూ డీహెచ్ఎఫ్ఎల్ రూ. 2123 కోట్ల నష్టాలు ప్రకటించడం గమనార్హం! ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్పై దివాళా చర్యలకు వీలుగా 2019 నవంబర్‌లో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు సిఫారసు చేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 18 వద్ద ముగిసింది. -
రేషన్ డోర్ డెలివరీకి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ మార్చి 15కు వాయిదా వేసింది. ‘ఇంటింటికీ రేషన్’ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే. ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ వ్యాజ్యం దాఖలు చేశారు. కాగా, హైకోర్టు తాజా ఆదేశాలతో వెంటనే రేషన్ డోర్ డెలివరీకి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాల్లో ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ రేషన్ డోర్ డెలివరీ జరగనుంది. (చదవండి: ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల) టీడీపీ కంచుకోటల్లో వైఎస్సార్సీపీ పాగా -
వైఫై బూత్‌లు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: దేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ)ల ద్వారా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పీఎం–వాణి’గా వ్యవహరించే ఈ పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేజ్... దేశంలో భారీ వైఫై విప్లవానికి తెరతీయనుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఈ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పనున్నారు. ‘పీడీఓలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్, అలాగే ఫీజు వంటివి ఏవీ వర్తించవు. చిన్న షాపులు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల రూపంలో ఈ పీడీఓలు ఉంటాయి’ అని కేబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఎలా పనిచేస్తుందంటే... వైఫై యాక్సెస్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణ, అలాగే సబ్స్క్రయిబర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం వంటివన్నీ పీడీఓ నిర్వర్తిస్తుంది. పీడీఓలకు అగ్రిగేటర్‌గా వ్యవహరించే పీడీఓఏ... పీడీఓలకు అవసరమైన అనుమతులు, అకౌంటింగ్ సంబంధిత అంశాలను చూస్తుంది. యూజర్లు రిజిస్టర్ చేసుకోవడం, దగ్గర్లో ఉన్న ‘వాణి’ సదుపాయం కలిగిన వైఫై హాట్స్పాట్లను గుర్తించి, డిస్ప్లే చేయడం వంటివన్నీ ఉండే విధంగా అప్లికేషన్‌ను యాప్ ప్రొవైడర్లు అభివృద్ధి చేస్తారు. యాప్ ప్రొవైడర్లు, పీడీఓఏలు, పీడీఓల వివరాలను పొందుపరిచేందుకు ఒక కేంద్రీయ రిజిస్ట్రీ ఉంటుంది. ప్రారంభంలో ఈ కేంద్రీయ రిజిస్ట్రీని సీ–డాట్ నిర్వహిస్తుందని అధికారిక ప్రకటన పేర్కొంది. పీడీఓలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అయితే, పీడీఓఏలు ఇంకా యాప్ డెవలపర్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా, ఎలాంటి ఫీజు లేకుండానే టెలికం శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోపు అనుమతి లభిస్తుంది. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మాయమైపోయిన పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లు.. మళ్లీ కొత్త రూట్లో ప్రజల ముందుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. సందు చివర కిరాణా షాపులు, చిన్నా చితకా టీ కొట్లు, పాన్ షాపుల్లో కూడా పబ్లిక్ వైఫై బూత్‌లు త్వరలో దర్శనమివ్వనున్నాయి. గతంలో పబ్లిక్ కాల్ ఆఫీస్ (పీసీఓ) స్థానంలో ఇప్పుడు పబ్లిక్ డేటా ఆఫీస్(పీడీఓ)లు కొలువుదీరనున్నాయి. మొబైల్ డేటాతో పనిలేకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ... ఎంత కావాలంటే అంత డేటాను లోడ్ చేసుకొని, ఎంచక్కా ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టేయొచ్చన్నమాట!! దేశంలో లక్షలాది వైఫై హాట్స్పాట్లను సృష్టించేందుకు ఈ ‘వాణి’ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. కంటెంట్ పంపిణీలో సమానావకాశాలను అందించడంతో పాటు చౌకగా కోట్లాది మందికి బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీన్ని కనెక్టివిటీ సేవల్లో యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్)గా చెప్పుకోవచ్చు. – ఆర్ఎస్ శర్మ, ట్రాయ్ మాజీ చైర్మన్ లైసెన్స్ రహిత సంస్థలు అట్టడుగు స్థాయిలో వైఫై సేవలను అందించేందుకు వీలు కల్పించే ఈ కీలక చర్యకు మేం ముందునుంచీ మద్దతిస్తున్నాం. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తికి ఇది ఎంతగానో చేదోడు అందిస్తుంది. ప్రజలను డిజిటల్ పౌరులుగా మార్చేస్తుంది. అదే సమయంలో వ్యాపారాభివృద్ధితో పాటు కిరాణా స్టోర్లు, టీ షాపులు వంటి చిన్న స్థాయి వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మొత్తంమీద చూస్తే సామాజిక–ఆర్థికాభివృద్ధితో పాటు గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీ దీని ద్వారా సాకారమవుతుంది. – టీవీ రామచంద్రన్, బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ప్రెసిడెంట్ కొత్త కొలువులు పెరుగుతాయ్... ‘వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే విధంగా ఈ ప్రక్రియ మొత్తం ఉంటుందని భావిస్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో దేశంలో స్థిరమైన, మరింత సమర్థవంతమైన హై–స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (డేటా) సేవలను కోరుకుంటున్న యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. 4జీ మొబైల్ కవరేజీ లేని ప్రాంతాల్లో దీని అవసరం మరింతగా ఉంది. పబ్లిక్ వైఫైను అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ఈ అవసరాలను తీర్చగలం’ అని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. అంతేకాకుండా ఈ సేవల ద్వారా ఉద్యోగాల కల్పనతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాన్ని పెంచడం అలాగే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి కూడా దోహదపడుతుందని వివరించింది. -
ఫైజర్ టీకా వచ్చేసింది!
లండన్: ఫైజర్– బయో ఎన్ టెక్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌కు చెందిన ఔషధ నియంత్రణా సంస్థ ఎంహెచ్ఆర్ఏ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు హెల్త్ సెక్రటరీ మాట్ హాంకాక్ చెప్పారు. టీకా అధ్యయనాల్లో 95 శాతం ప్రభావశీలత చూపిందన్నారు. టీకా పంపిణీ మంత్రి నదీమ్ మాట్లాడుతూ ‘‘ కరోనాపై పోరాటంలో ఇది అతిపెద్ద అడుగు’’ అన్నారు. కంపెనీ సమర్పించిన డేటా విశ్లేషణను నిపుణులు పరిశీలించిన అనంతరం వ్యాక్సిన్‌కు ఉండాల్సిన ప్రమాణాలను, రక్షణ నియమాలను ఈ టీకా అందుకున్నట్లు ఎంహెచ్ఆర్ఏ భావించి, ప్రజల్లో వాడకానికి అనుమతినిచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టీకాను ముందుగా తీసుకునే ప్రాధామ్య వర్గాలు(ప్రియారిటీ గ్రూప్స్) అనుసరించాల్సిన సూచనలను ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. వైద్యులు, వయోవృద్ధుల్లాంటి వారిని ప్రాధామ్య వర్గాలుగా పరిగణిస్తారు. ‘‘వచ్చేవారం నుంచి యూకే మొత్తం టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది. టీకా విజయవంతం కావాలంటే ప్రజలంతా తమకు నిర్ధేశించిన పాత్రను సమర్ధవంతంగా పోషించాలి’’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 4కోట్ల డోసులను ప్రభుత్వం ఆర్డరు చేసింది. వ్యాక్సినేషన్లో భాగంగా 21 రోజుల వ్యవధితో రెండుమార్లు టీకా ఇస్తారు. టీకాను అత్యంత శీతల ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచడం అతిపెద్ద సవాలని హాంకాక్ అభిప్రాయపడ్డారు. తొలి దశలో ముందుగా 8 లక్షల వ్యాక్సిన్షాట్స్ అందుబాటులో ఉంటాయని, క్రమంగా నెలాఖరుకు మిగిలిన డోసులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. టీకాను ఫైజర్ ఎంత వేగంగా ఉత్పత్తి చేస్తే అంతవేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. టీకాలు అందుబాటులోకి వస్తుండడం సంతోషకరమైన అంశమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. రష్యాలో వ్యాక్సినేషన్ మాస్కో: ఒకవైపు ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలపగా, మరోవైపు స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్‌కు రష్యా అనుమతినిచ్చింది. వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. డిసెంబర్లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. రష్యా 20 లక్షల డోస్‌లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే లక్ష మందికిపైగా ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్ చెప్పడం గమనార్హం. -
లక్ష్మీ విలాస్ ‘ఖాతా’ క్లోజ్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)ని డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో (డీబీఐఎల్) విలీన ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదముద్ర పడింది. విలీన స్కీమ్‌నకుకేంద్ర క్యాబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే దీనిపై ఒక ప్రకటన చేసిన రిజర్వ్ బ్యాంక్ .. నవంబర్ 27 (శుక్రవారం) నుంచి విలీనం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆ రోజు నుంచి ఎల్వీబీపై విధించిన మారటోరియం కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రూ. 25,000 విత్‌డ్రాయల్ పరిమితులు తొలగిపోనున్నాయి. ‘‘నవంబర్ 27 నుంచి విలీనం అమల్లోకి వస్తుంది. ఎల్వీబీ శాఖలన్నీ కూడా ఆ రోజు నుంచి డీబీఎస్ బ్యాంక్ ఇండియా శాఖలుగా మారతాయి. ఎల్వీబీ డిపాజిటర్లంతా కూడా డీబీఎస్ ఖాతాదారులుగా మారతారు. అలాగే, ఎల్వీబీపై విధించిన మారటోరియం కూడా ఇక అమల్లో ఉండదు’’ అని ఆర్బీఐ పేర్కొంది. ఎల్వీబీ ఖాతాదారులకు యథాప్రకారంగా సర్వీసులు అందేలా చూసేందుకు డీబీఎస్ బ్యాంక్ ఇండియా అన్ని ఏర్పాట్లూ చేస్తోందని వివరించింది. వాస్తవానికి మారటోరియం గడువు డిసెంబర్ 16తో ముగియనున్నప్పటికీ అంతకన్నా ముందుగానే ఎత్తివేయనుండటం గమనార్హం. లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎల్వీబీ ఉద్యోగులందరికీ కూడా నవంబర్ 17నకు ముందు నుంచి అందుకుంటున్న వేతనాలు, సర్వీసు నిబంధనలే ఇకపైనా వర్తిస్తాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీ బోర్డును ఆర్బీఐ నవంబర్ 17న రద్దు చేసి ప్రత్యేక అడ్మినిస్ట్రేటర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆర్బీఐ సిఫార్సుల మేరకు డిపాజిటర్లు రూ. 25,000కు మించి విత్‌డ్రా చేసుకోకుండా కేంద్రం .. ఎల్వీబీపై 30 రోజుల మారటోరియం విధించింది. సింగపూర్‌కి చెందిన సంస్థ డీబీఎస్ భారత విభాగం డీబీఐఎల్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను విలీనం చేసే ప్రతిపాదనను ఆర్బీఐ రూపొందించింది. తాజాగా ఇదే అమల్లోకి రానుంది. ఈ ఏడాది పెను సంక్షోభం ఎదుర్కొన్న బ్యాంకుల్లో యస్ బ్యాంక్ తర్వాత ఎల్వీబీ రెండోది. నిధుల కొరతతో కుదేలైన యస్ బ్యాంక్‌పై ప్రభుత్వం మార్చిలో మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐతో 45 శాతం వాటాలు కొనిపించి, రూ. 7,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టించి యస్ బ్యాంక్‌ను గట్టెక్కించింది. షేరు జూమ్.. దాదాపు వారం రోజులుగా లోయర్ సర్క్యూట్లకు పడిపోతూ వస్తున్న ఎల్వీబీ షేర్లు తాజా పరిణామాలతో బుధవారం 5 శాతం పెరిగాయి. బీఎస్ఈలో రూ. 7.65 వద్ద (అప్పర్ సర్క్యూట్) ముగిశాయి. ఒక దశలో లోయర్ సర్క్యూట్ స్థాయి రూ. 6.95కి, ఏడాది కనిష్టానికి కూడా పడిపోయినప్పటికీ ఆ తర్వాత గణనీయంగా కోలుకోవడం గమనార్హం. ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత నవంబర్ 17 నుంచి 24 మధ్య షేరు ధర 53 శాతం పడిపోయింది. షేర్హోల్డర్లకు సున్నా..? ఈ మొత్తం లావాదేవీలో షేర్హోల్డర్లకు దక్కేదేమీ లేదు. విలీన ప్రతిపాదన తుది స్కీమ్‌ను బట్టి చూస్తే ముసాయిదాలో పేర్కొన్న ఈక్విటీ రైటాఫ్‌లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం లావాదేవీ అనంతరం ఎల్వీబీ పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తాన్ని రైటాఫ్ చేయనున్నారు. గురువారం నుంచి ట్రేడింగ్‌ను ఎన్ఎస్ఈ నిలిపివేయనుంది. శుక్రవారం ఎక్సే్చంజీల నుంచీ ఎల్వీబీ షేర్లను డీలిస్ట్ చేయనున్నారు. డిపాజిట్లు సురక్షితం.. ఎల్‌వీబీకి చెందిన 20 లక్షలకు పైగా ఖాతాదా రులు, 4,000 మంది పైగా ఉద్యోగులకు తాజా పరిణామం ఊరట కలిగిస్తుందని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. డిపాజిట్ల విత్‌డ్రాయల్‌పై ఇతరత్రా మరే ఆంక్షలు ఉండబోవని ఆయన చెప్పారు. ‘‘ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదు. డిపాజిట్లు సురక్షితమైన చేతుల్లోనే ఉన్నాయి. విత్‌డ్రాయల్ కోసం పరుగెత్తాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి తెలిపారు. డీబీఐఎల్‌కు తగినంత స్థాయిలో మూలధనం ఉన్నప్పటికీ విలీనానంతరం కార్యకలాపాల వృద్ధి కోసం ముందుగానే మరో రూ. 2,500 కోట్ల నిధులను కూడా సమకూర్చుకుంటుందని చెప్పారు. ఎల్వీబీ కనుమరుగు.. సుమారు 94 ఏళ్ల చరిత్ర కలిగిన ఎల్వీబీని వీఎస్ఎన్ రామలింగ చెట్టియార్ సారథ్యంలో తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో ఏర్పాటు చేశారు. 19 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో ఎల్‌వీబీకి 566 శాఖలు, 918 ఏటీఎంలు ఉన్నాయి. బడా సంస్థలకు భారీ స్థాయిలో రుణాలివ్వడం మొదలెట్టినప్పట్నుంచి ఎల్‌వీబీకి కష్టాలు మొదలయ్యాయి. మొండిబాకీలు భారీగా పేరుకుపోవడంతో బ్యాంకుపై ఆర్బీఐ గతేడాది ఆంక్షలు కూడా విధించింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్ సంస్థలతో విలీనమయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. 2019–20లో రూ. 836 కోట్ల నికర నష్టం ప్రకటించిన ఎల్వీబీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 397 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా పరిణామాలతో ఎల్వీబీ ఇక పూర్తిగా కనుమరుగు కానుంది. పటిష్టంగా డీబీఐఎల్... సింగపూర్ కేంద్రంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డీబీఎస్‌కు డీబీఐఎల్ భారతీయ అనుబంధ సంస్థ. డీబీఎస్‌కు ఆసియాలోని 18 మార్కెట్లలో కార్యకలాపాలు ఉన్నాయి. ఎల్వీబీని విలీనం చేసుకోవడంతో డీబీఐఎల్ శాఖల సంఖ్య 600కు పెరుగుతుంది. బాధ్యులపై చర్యలు ఉంటాయి.. ఎల్వీబీ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని జవదేకర్ తెలిపారు. ‘‘తప్పులు చేసిన వారిపై చర్యలుంటాయి. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా పర్యవేక్షణ మెరుగుపరుస్తాం. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇవి కూడా భాగం’’ అని ఆయన చెప్పారు. ఆర్బీఐ కూడా పర్యవేక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పరిస్థితి చేయి దాటిపోవడానికి ముందే సమస్యను ఆర్బీఐ అంచనా వేయగలగాలి. రాబోయే సమ స్యలను పసిగట్టగలిగితే పరిష్కారం సులువవుతుంది’’ అని జవదేకర్ వ్యాఖ్యానించారు. -
ప్రైవేటు పాఠశాలలకు గట్టి షాక్..
విజయనగరం అర్బన్: ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సర్కారు బడుల్లో చేరాలంటే ఇక టీసీలతో పనిలేదు. సర్కారు ఇచ్చిన తాజా ఉత్తర్వుల మేరకు కేవలం తల్లిదండ్రుల అంగీకార పత్రంతో చేర్చుకునేందుకు మార్గం సుగమమైంది. ప్రైవేటు విద్యాసంస్థలవారు బడిమానేసిన పిల్లలకు టీసీలు ఇవ్వడానికి సుతరామూ అంగీకరించకపోవడంతో సర్కారు బడుల్లో చేరికకు అవరోధంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్య పరిష్కారమైంది. సర్కారు బడుల్లో కొత్త గా చేరే విద్యార్థులు టీసీలు ఇవ్వలేకపోతే వారి పేర్లు ప్రభుత్వ ఆన్లైన్ చైల్డ్ఇన్ఫోలో చేరే అవకాశం లేదు. ఆ విద్యార్థులు ఇంకా ప్రైవేటు స్కూల్లో ఉన్నట్టే లెక్క. తల్లిదండ్రుల అంగీకార పత్రం చైల్డ్ ఇన్ఫోలో నమోదుకు చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైల్డ్ ఇన్ఫోలో నమోదుకు గడువు పెంపు రేషనలైజేషన్ మార్గదర్శకాలపై ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. 2020 ఫిబ్రవరి 29 నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలనే మార్గదర్శకాలను సవరించి తాజా విద్యా ర్థుల నమోదునే పరిగణించాలని ఉపాధ్యాయులు కోరారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం వచ్చే నెల 2వ తేదీ నాటికి చైల్డ్ ఇన్ఫోలో ఉన్న ప్రవేశాల ఆధారంగా చేయా లని ఆదేశించారు. అయితే ప్రభుత్వ పాఠశాలలపై ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీసీలు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వారి పే ర్లు నామమాత్రంగానే ఉన్నాయి. దీనివల్ల చైల్డ్ఇన్ఫో ఆన్లైన్ జాబితాలో ఇంకా ప్రైవే టు స్కూళ్లలో ఉన్నట్లే నమోదు ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తల్లిదండ్రుల అంగీకార పత్రంతో చేరినట్టు ఆన్లైన్ చైల్డ్ఇన్ఫోలో నమోదుకు అవకాశం కల్పిస్తూ వచ్చే నెల 2వ తేదీ వరకు నమోదు గడువు పెంచారు. ఇప్పటికే చేరిన 2.57 లక్షల మంది విద్యార్ధులు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పెరుగుతోంది. ఇప్పటికే 2,57,051 మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి చేరారు. టీసీలు లేకుండా వచ్చిన వారు మరో 30 వేల మంది వరకు ఉన్నా రు. వారి సంఖ్య ఆన్లైన్లో నమోదు కాలేదు. ఇందులో 1, 6వ తరగతులకు పూర్తి స్థాయిలో కొత్త స్కూళ్ల నుంచి చేరాల్సి ఉంటుంది. మిగిలిన తరగతులకు ముందు తరగతుల నుంచి ప్రమోట్ అవుతారు. ప్రమోట్ అయిన వారే గాకుండా కొత్తగా ప్రైవేటు స్కూళ్ల నుంచి హాజరవుతున్న వారే అధికంగా ఉన్నారని చెబుతున్నారు. ఇంకా పాఠశాలలు తెరవక ముందే 2, 4, 5, 7వ తరగతి లలో గత ఏడాదికంటే సంఖ్య పెరిగింది. తెరిచాక కనీసం మరో 60 వేలకు పెరగవచ్చని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అంగీకారపత్రం డ్రాప్‌బాక్స్‌లో నమోదు చేయాలి జిల్లాలోని ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చే విద్యార్థులను చేర్చుకోవడంలో వచ్చిన సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. చైల్డ్ఇన్ఫో నమోదును వచ్చే నెల 2వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సమగ్ర వివరాలను ప్రధానోపాధ్యాయులు తక్షణమే అప్లోడ్ చేయాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు టీసీలు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకొని చైల్డ్‌ఇన్ఫోలోని డ్రాప్ బాక్స్‌లో ఎంఈఓలు వేయాలి. – జి.నాగమణి, డీఈఓ -
తెలుగు రాష్ట్రాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైల్వేల నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. లింగంపల్లి - కాకినాడ, సికింద్రాబాద్ -షాలిమర్ ట్రైన్స్‌కు రైల్వే శాఖ అనుమతిచ్చింది. వీటితో పాటు.. సికింద్రాబాద్- విశాఖ, విశాఖ -తిరుపతి రైళ్లు నడిపేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. చదవండి : ఏపీ: ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే.. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకుల రైళ్లు నిలిచిపోయాయి. ఆపై అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లకు అనుమతించిన రైల్వే శాఖ ఈనెల 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా ఊపగా, మరో 39 రైళ్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఎప్పటినుంచి రాకపోకలు సాగిస్తాయనే వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించనుంది. -
అదానీ–జీవీకే ఎయిర్పోర్ట్ ఒప్పందానికి సీఐఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు ఉన్న మెజారిటీ వాటాలను (50.50 శాతం) అదానీ గ్రూప్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇతరుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా కొన్ని షరతులకు లోబడి (గ్రీన్ చానెల్) ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందానికి మార్గం సుగమం అయ్యింది. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆగస్టులో అదానీ గ్రూప్ తెలిపింది. ప్రస్తుత ప్రమోటరు జీవీకే సంస్థకు ఇందులో ఉన్న రుణభారాన్ని కొనుగోలు చేసి, ఈక్విటీ కింద మార్చుకోవడంతో పాటు ఇతర మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ సంస్థ అయిన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ (జీవీకే ఏడీఎల్) రుణాన్ని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్(ఏఏహెచ్) బ్యాంకర్ల నుంచి కొనుగోలు చేయనుంది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఏడీఎల్‌కు ఉన్న 50:50% వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌతాఫ్రికా (ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ సంస్థలకు ఉన్న 23.5# వాటాలను కూడా (మొత్తం 74%) అదానీ కొనుగోలు చేయనుంది. తద్వారా దేశీయంగా విమానాశ్రయాల నిర్వహణ లో అతి పెద్ద ప్రైవేట్ సంస్థగా ఆవిర్భవించనుంది. -
సోయా కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, నిజామాబాద్: సోయా కొనుగోళ్లకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది కూడా సోయా సేకరణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ ఇటీవల సూత్రప్రాయంగా అంగీకరించిందని మార్క్‌ఫెడ్ వర్గాలు పేర్కొంటున్నారు. ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తుందనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఈసారి సోయా సాగు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధర దక్కే అవకాశాలున్నాయి. 5.93 లక్షల క్వింటాళ్ల దిగుబడి వరి, మొక్కజొన్న తర్వాత జిల్లాలో అత్యధికంగా సోయా పంట సాగవుతుంది. ఈసారి 74,153 ఎకరాల్లో ఈ పంటను వేసుకున్నారు. విస్తారంగా వర్షాలు కురియడంతో దిగుబడులు కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయి. గత ఏడాది ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల వరకు వస్తే ఈసారి మరో రెండు క్వింటాళ్లు అదనంగా దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల చొప్పున లెక్కేస్తే 74,153 ఎకరాలకు సుమారు 5.93 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంచనా. మార్కెట్ ధరపైనే ఆధారం.. కాగా సోయా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.3,880 ఉంది. అయితే మార్కెట్ ధర కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తారు. ప్రస్తుతం మార్కెట్ ధర క్వింటాలుకు రూ.3,400 వరకు పలుకుతోంది. సోయాలు మార్కెట్‌కు వచ్చేసరికి ఇదే ధర ఉంటే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే సోయాలను విక్రయిస్తారు. ఏటా అక్టోబర్ మొదటి వారంలో సోయా కోనుగోళ్లు ప్రారంభమవుతాయి. మరో ఇరవై రోజుల్లో సోయాలు మార్కెట్లోకి వస్తాయి. దీంతో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గత ఏడాది 16 వేల క్వింటాళ్ల సేకరణ.. గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో జిల్లాలో 16,525 క్వింటాళ్లు సేకరించారు. 1,027 మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6.13 కోట్లు విలువ చేసే సోయాను కొనుగోలు చేశారు. అయితే ఈసారి మార్కెట్ రేట్ కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సిన ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాల వారీగా అలాట్మెంట్ ఇస్తాం.. నాఫెడ్ ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశం జరిగింది. సోయా కొనుగోళ్లకు నాఫెడ్ అంగీకరించింది. రాష్ట్రంలో ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. నాఫెడ్ స్పష్టత ఇచ్చిన వెంటనే జిల్లాల వారీగా సోయా సేకరణకు అలాట్మెంట్ ఇస్తాము. – మార గంగారెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ -
కోవిడ్-19 : దీదీ కీలక నిర్ణయం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 20 వరకూ రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయని ప్రకటించారు. సెప్టెంబర్ 7, 11, 12 తేదీల్లో బెంగాల్ అంతటా సంపూర్ణ లాక్డౌన్ అమలవుతుందని వెల్లడించారు. ఇక భౌతిక దూరం, ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ మెట్రో రైలు సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ సెప్టెంబర్ 20 వరకూ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థల మూసివేత కొనసాగుతుందని చెప్పారు. ఆరు కోవిడ్-19 హాట్‌స్పాట్ రాష్ట్రాల నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణను అనుమతించారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ రాష్ట్రాల నుంచి వారానికి మూడు రోజుల పాటు విమాన రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. కరోనా కట్టడికి ఆగస్ట్ 31 వరకూ ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణే, నాగపూర్, అహ్మదాబాద్ నుంచి కోల్‌కతాకు ప్రయాణీకుల విమానాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. కోవిడ్-19 మహమ్మారిని నిరోధించేందుకు పీఎం కేర్స్ ఫండ్ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జీఎస్టీ బకాయిలను సైతం కేంద్రం చెల్లించడం లేదని అంతకుముందు సోనియా గాంధీతో జరిగిన బీజేపీయేతర సీఎంల సమావేశంలో మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : ఇప్పుడు కుక్కర్ ఖాళీగా ఉండదు! -
ముంబై చూపిన సిగ్నల్
ట్రాఫిక్ సిగ్నల్ మీద ఎవరు ఉంటారు? ఎర్రలైట్ వెలిగినా పచ్చలైట్ వెలిగినా ఆ దీపాల మీద పురుషుడి బొమ్మే ఉంటుంది. మరి స్త్రీలు? స్త్రీలు రోడ్ల మీదకు రారా? పబ్లిక్ స్పేసెస్ మీద వారికి హక్కు ఉండదా? ట్రాఫిక్ సిగ్నల్ విధానం పురుష కేంద్రకంగా ఎందుకు ఉండాలి? ఈ ఆలోచన ఇదివరకే ఇతర దేశాలలో వచ్చింది. మీరు పురుషుణ్ణి ప్రతినిధిగా తీసుకుంటే మేము స్త్రీని తీసుకుంటాం అని జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా తమ ట్రాఫిక్ సిగ్నెల్స్‌లో స్త్రీ సంకేతాన్ని తీసుకోవడం ప్రారంభించాయి. అయితే దీని మీద చర్చలు జరిగాయి. పూర్తిగా పురుషుణ్ణి తీసుకోవడం ఎలా సరికాదో పూర్తిగా స్త్రీని తీసుకోవడం కూడా సరికాదని వ్యాఖ్యానాలు వినిపించాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ‘జెండర్ న్యూట్రల్’గా ఉండటం గురించి అందరూ ఆలోచించాలన్న వాదనలూ వచ్చాయి. అయితే పురుషుడి సంకేతానికి బదులు స్త్రీ సంకేతాన్ని తీసుకోవడం గురించి మెచ్చుకునే వారు ఎక్కువగానే ఉన్నారు. పబ్లిక్ ప్లేసులు స్త్రీలవి కూడా అని ఈ సిగ్నలింగ్ వల్ల చెప్పినట్టయ్యిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా దేశంలో మొదటిసారి ముంబైలో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు పురుషుడి సంకేతం కాకుండా స్త్రీ సంకేతం వాడటం మొదలైంది. ముంబైలో సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న సిద్దివినాయక గుడి నుంచి మహిమ్ వరకు ఉన్న రోడ్డులో అన్ని ట్రాఫిక్ సిగ్నెల్స్లోనూ పురుషులకు బదులు స్త్రీ సంకేతాలను వాడుతున్నారు. వచ్చేపోయేవారు ఈ మార్పును ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఒక కొత్తదృష్టి కలిగినవారై చూస్తున్నారు. అంతా మెదడులోనే ఉంటుంది. దానికి మెల్లమెల్లగా సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళితే పురుషులు తాము జరిగి స్త్రీలకు దక్కవలసిన సమాన భాగం కొరకు ఆలోచిస్తారు. అందుకు ఇలాంటి ప్రయత్నాలు తప్పనిసరి. -
పట్టాలపైకి తొలి కిసాన్ రైలు
ముంబై : రైతుల దిగుబడులకు మార్కెటింగ్ ఊతమిచ్చేలా కిసాన్ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్రకు చెందిన నాసిక్ జిల్లా దియోలలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు దేశంలోనే తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల రవాణాకు కిసాన్ రైలు ఉపయోగపడుతుందని అన్నారు. రైతులు తమ దిగుబడులకు సరైన ధర పొందేలా తక్కువ చార్జీలతోనే ఈ రైలు సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆహారోత్పత్తుల సరఫరా కోసం భారత రైల్వేలు 96 రూట్లలో 4610 రైళ్లను నడుపుతున్నాయని చెప్పారు. రైతులు స్వయంసమృద్ధి సాధించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు చర్యలు చేపడుతున్నారని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దియోలలి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరే కిసాన్ రైల్ మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు దనాపూర్ చేరుకుంటుంది. ఇక తిరుగుప్రయాణంలో భాగంగా ప్రతి ఆదివారం రాత్రి 12 గంటలకు దనాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.45 గంటలకు దియోలలి చేరుకుంటుంది. ఈ రైలు ఒక ట్రిప్‌లో 31.45 గంటల ప్రయాణంలో 1519 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. కిసాన్ రైలు నాసిక్ రోడ్, మన్మాడ్, జల్గావ్, భుసావల్, బుర్హాన్పూర్, ఖండ్వా, ఇటార్సి, జబల్పూర్, సత్నా, కట్ని, మాణిక్పూర్, ప్రయాగరాజ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, బుక్సార్ స్టేషన్లలో ఆగుతుంది. కాగా, కిసాన్ రైల్ రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుందని, స్ధానిక రైతులు, వ్యాపారులు, మార్కెట్ కమిటీలతో కలిసి రైల్వేలు రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాయని కేంద్ర రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : రైతు పెన్షన్ స్కీమ్‌కు శ్రీకారం.. -
అప్పన్న ఆలయానికి అపూర్వ గౌరవం
దొండపర్తి (విశాఖ దక్షిణ): సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లేఖ మేరకు రాష్ట్రంలో ప్రసిద్ధ దేవస్థానాల్లో ఒకటైన సింహాచలాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పిలిగ్రిమేజ్ రెజువెనేషన్, స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్’ (ప్రసాద్) స్కీమ్‌లోకి ఈ చారిత్రాత్మక ఆలయాన్ని చేర్చింది. 11వ శతాబ్దానికి చెందిన సింహాచలం దేవస్థానంతో పాటు అనుబం«ధంగా ఉన్న ఆలయాల్లో సకల సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. దేవాలయ పర్యాటకంలో భాగంగా సింహాచలానికి రూ.53 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ‘ప్రసాద్’ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా 2015–16లో అమరావతి ఆలయం అభివృద్ధికి రూ.28.36 కోట్లు, శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి రూ.47.45 కోట్లు మంజురు చేసింది. దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ‘ప్రసాద్’ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు దేవాలయాల పేర్లను సూచిస్తూ రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం దేశంలో ఉన్న దేవాలయాల్లో ఐదింటిని మాత్రమే ఎంపిక చేసింది. వాటిలో సింహాచలం దేవస్థానం ఉండడం విశేషం. రూ.53.69 కోట్లతో ప్రతిపాదనలు కేంద్రం సూచనలు మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ సింహాచలం అభివృద్ధి, చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింహాచలం మెట్ల మార్గం అభివృద్ధికి రూ.27.86 కోట్లు, కొండపైనే వివిధ అభివృద్ధి పనులకు రూ.18,21,50,000, పాన్ ఏరియా కాంపొనెంట్స్‌కు రూ.3,87,50,000, కన్సల్టెన్సీ, ఇతర ఛార్జీలతో కలిపి మొత్తంగా రూ.53.69 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సింహాచలం దేవస్థానాన్ని ‘ప్రసాద్’ స్కీమ్‌లో చేరుస్తున్నట్లు ప్రకటించింది. కాగా, దేవాలయ పర్యాటకంలో భాగంగా సింహాచలం దేవస్థానాన్ని ‘ప్రసాద్’ స్కీమ్‌లో చేర్చడం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పథకంలో మంజూరైన రూ.53 కోట్లతో ఆలయంలో పర్యాటక రంగ అభివృద్ధికి తగిన విధంగా ఖర్చు చేస్తామన్నారు. -
వెబ్ సిరీస్‌లో...
టాలీవుడ్.. కోలీవుడ్.. మాలీవుడ్.. శాండల్‌వుడ్.. బాలీవుడ్... ఇలా అన్ని భాషల్లోనూ ప్రస్తుతం డిజిటల్ హవా సాగుతోంది. కరోనా లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో డిజిటల్ రంగానికి వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు ఈ రంగంవైపు మొగ్గుచూపుతున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం నటించేందుకు పచ్చజెండా ఊపుతున్నారు. సౌత్‌లో టాప్ హీరోయిన్స్ అయిన సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా వంటి వారు సైతం డిజిటల్ రంగంవైపు అడుగులేశారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ త్రిష కూడా డిజిటల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. రామ్ సుబ్రమణ్యన్ దర్శకత్వం వహించనున్న ఓ తమిళ వెబ్ సిరీస్‌లో నటించేందుకు త్రిష అంగీకరించారట. తండ్రీ, కూతురు మధ్య జరిగే భావోద్వేగమైన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం. -
కాజల్ పెళ్లి పీటలెక్కనుందా ?
‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్‌కి పరిచయమైన కాజల్ అగర్వాల్ తమిళ్, హిందీ భాషల్లోనూ దూసుకెళుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ పెళ్లికి పచ్చజెండా ఊపారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో కాజల్ డేటింగ్లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. కాజల్ ప్రేమకి ఇంట్లో వాళ్లు పచ్చజెండా ఊపారని, వచ్చే ఏడాది పెళ్లి అనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి వివాహానికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారట. పెళ్లి తర్వాత నిర్మాతగా మారి ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టడంతో పాటు తన భర్త వ్యాపారాల్లో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారట కాజల్. అయితే నటిగా సినిమాలకు దూరం కావాలనుకోవడం లేదని సమాచారం. -
మెడికల్ పీజీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: శనివారం నుంచి మెడికల్, డెంటల్ పీజీ, డిగ్రీ, డిప్లొమా పరీక్షలను యథావిధిగా ప్రారంభించేందుకు అనుమతి ఇస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 29 వరకూ పరీక్షలను నిర్వహించేందుకు ఎంఐసీ అనుమతి ఇచి్చందని, కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కూడా వైద్యపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినందున అనుమతి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచి్చంది. ఈ ఫీజుతోనే సప్లిమెంటరీ పరీక్షలకు.. గాంధీ ఆస్పత్రిని కరోనా వైద్యానికి కేటాయించినందున ఆ ఆస్పత్రిలో పరీక్షలు రాయాల్సిన 158 మందికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రభాకర్ రావు ధర్మాసనానికి తెలిపారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం గడువులోగా పరీక్షలను నిర్వహించాలని కోర్టు విచారణకు హాజరైన కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. కరోనా కారణంగా ఏడాదికి ప్రాక్టికల్స్‌ను ల్యాబ్స్‌కు పరిమితం చేసేందుకు కౌన్సిల్ అనుమతి ఇచ్చిందని, రోగుల వద్ద ప్రాక్టికల్స్ ఉండవని చెప్పారు. కరోనా కారణంగా పరీక్షలు రాయరాదని భావించే విద్యార్థులకు కరోనా సమస్య పరిష్కారం అయ్యాక సప్లిమెంటరీ నిర్వహించేందుకు అనుమతి ఉంటుందన్నారు. సప్లిమెంటరీ రాయాలని భావించే విద్యార్థుల నుంచి వేరే ఫీజు వసూలు చేయవద్దని, ఇప్పుడు వసూలు చేసిన ఫీజుతోనే పరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. నేటి నుంచి పరీక్షలు పీజీ మెడికల్ డిగ్రీ డిప్లొమా పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విభాగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 20, 22, 24వ తేదీల్లో పీజీ డిప్లొమా, 20, 22, 24, 26 తేదీల్లో పీజీ డిగ్రీ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయని తెలిపింది. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్షాకేంద్రంలో రిపోర్ట్ చేయాలని స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, గాంధీ మెడికల్ కాలేజీ సెంటర్‌ను ఎల్బీనగర్లోని కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించినట్లు తెలిపారు. మొత్తం 1,187 మంది పరీక్షలు రాస్తున్నారని, ఇందులో 994 పీజీ డిగ్రీ అభ్యర్థులు, 193 పీజీ డిప్లొమా అభ్యర్థులున్నారని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. పెద్ద లెక్చర్ హాల్స్, ఎగ్జామ్ హాల్స్‌లో 25 నుంచి 30 మంది విద్యార్థులకు మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు చేశామని, అన్ని పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటిస్తూ అభ్యర్థులకు సీట్లు కేటాయించినట్లు కనీ్వనర్ వెల్లడించారు. -
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
-
శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
-
రోడ్డెక్కుతున్న బస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 రోజుల విరామం తర్వాత మళ్లీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ ఆర్టీసీ బస్సులు నడుపుకొనేం దుకు ప్రభుత్వం అనుమతినివ్వటంతో ఆర్టీసీ అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభం అవుతున్నాయి. నగరం బయటి నుంచే రాకపోకలు హైదరాబాద్ సిటీలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున నగరంలో బస్సులు తిప్పొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సిటీ సర్వీసులు ప్రారంభించటం లేదు. అదే కోవలో జిల్లా సర్వీసులను కూడా సిటీలోకి అనుమతించొద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సిటీ వెలుపలే బస్సులు నిలిచిపోతాయి. అక్కడి నుంచి ప్రయాణికులు ఇతర ప్రైవేటు లేదా సొంత వాహనాల్లో ఇళ్లకు చేరాల్సి ఉంటుంది. ► నల్లగొండ – విజయవాడ హైవే మీదుగా వచ్చే బస్సులను హయత్‌నగర్ వద్దే నిలిపేస్తారు. వాటిని దిల్సుఖ్నగర్ వరకు అనుమతించాలన్న విన్నపాన్ని ప్రభుత్వం కొట్టిపడేసింది. ► వరంగల్ వైపు నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ కూ డలి వద్ద నిలుస్తాయి. ► దేవరకొండ వైపు నుంచి వచ్చేవి ఇబ్రహీంపట్నం వరకే నడుస్తాయి. ► వికారాబాద్ వైపు నుంచి వచ్చేవి ‘అప్పా’ జంక్షన్ వద్ద ఆగిపోతాయి. ► కరీంనగర్, సిద్దిపేట వైపు నుంచి వచ్చేవి జూబ్లీ బస్టేషన్ వరకు వస్తాయి. ► ఇమ్లీబన్ బస్టాండులోకి బస్సులను అనుమతించరు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్, మినీ బస్సులన్నింటినీ నడుపుతారు. రాష్ట్రం లోపలే అన్ని జిల్లాలకు ఈ బస్సులు తిరుగుతాయి. దూరం.. దూరం కరోనా నిబంధన ల్లో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ ప్ర యాణికులను తరలిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా బస్సుల్లో నిలబడి ప్రయాణించేందుకు అనుమతించబోమని వెల్లడించారు. తొలుత భౌతిక దూరంలో భాగంగా రెండు సీట్ల వరసలో ఒకరిని, మూడు సీట్ల వరసలో ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే అనుమతించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు తమకు అలాంటి ఆదేశాలు ఏవీ రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. అంటే.. అన్ని సీట్లలో ప్రయాణికులను అనుతిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదేమాట అధికారులను అడిగితే.. భౌతికదూరం పాటిస్తామని మాత్రమే చెబుతున్నారు, సీట్ల మధ్య దూరం ఏర్పాటు గాని, కొన్ని సీట్లను ఖాళీగా ఉంచే ఆలోచన కానీ ఉందా అంటే సమాధానం దాటవేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని బస్సు ఎక్కాలని, నిలబడేందుకు మాత్రం అనుమతించమని పేర్కొంటున్నారు. ప్రయాణికులు కచ్చితంగా మాస్కు ధరించాలి. వారు లోనికి ఎక్కగానే కండక్టర్ వద్ద ఉండే శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకు ప్రయాణికులు దూరందూరంగా ఉండాలి. ప్రయాణ సమయంలో మాస్కు తొలగించొద్దు.. వంటి నిబంధనలపై ప్రయాణికులకు ముందే సూచనలు చేయనున్నారు. మధ్యలో చెకింగ్ సిబ్బంది వచ్చే సమయంలో వీటిని ఉల్లంఘిస్తూ దొరికిన ప్రయాణికులకు ఫైన్ విధించనున్నారు. మాస్కు లేకుంటే రూ.వేయి జరిమానా ఇక్కడా వర్తిస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. -
పోస్ట్ ప్రొడక్షన్స్‌కు ఓకే
కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రభావంతో సినిమా షూటింగ్స్ ఆగిన సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ అండ్ టెలివిజన్ షోలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆయా నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా పాటించాలని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 11 (సోమవారం) నుంచి నిర్మాణ సంస్థలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టుకోవచ్చు. ఎడిటింగ్, డబ్బింగ్, రీ–రికార్డింగ్, సౌండ్ డిజైన్/ సౌండ్ మిక్సింగ్, డీఐ (డిజిటల్ ఇంటర్ మీడియట్) విభాగాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఐదుగురు మాత్రమే పాల్గొనాలి. గ్రాఫిక్స్ వర్క్ కోసం పది నుంచి పదిహేను మంది పని చేయవచ్చు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజేషన్, ట్రావెల్ పాస్‌లు.. ఇలా కరోనా నిర్మూలనలో భాగమైన వాటిని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో పాల్గొనేవారు పాటించేలా నిర్మాతలు తగిన చర్యలు తీసుకోవాలి. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా, సినిమా, టెలివిజన్ రంగాలకు సంబంధించిన నిర్మాతలు కరోనా కారణంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని కోలీవుడ్ టాక్. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మద్యం షేర్లకు మినహాయింపు కిక్కు
సాక్షి, ముంబై : మద్యం దుకాణాలకు షరతులతో కూడిన అనుమతి లభించడంతో నష్టాల మార్కెట్లో కూడా పలు లిక్కర్ షేర్లు దూసుకుపోతున్నాయి. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం లిక్కర్ స్టాక్స్ ఫుల్ జోష్‌లో ట్రేడవుతున్నాయి. దాదాపు 11శాతం వరకు ఎగిసాయి. జీఎం బ్రూవరీస్, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్, రాడికో ఖైతాన్, గ్లోబస్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రూవరీస్, యునైటెడ్ స్పిరిట్స్ ఈ రోజు ఇంట్రా-డే లో 4 నుండి 11 శాతం వరకు లాభపడుతున్నాయి. కరోనా వైరస్ ఉధృతికి అడ్డు కట్టపడకపోవడంతో మే 17 తేదీ వరకు లాక్డౌన్ పొడగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెన్సెక్స్ 1712 పాయింట్లకుపైగా కుప్ప కూలి 32వేల స్థాయి దిగువకు చేరింది. నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు పతనమైంది. (లాక్డౌన్ 3.0 : సెన్సెక్స్ ఢమాల్) లాక్‌డౌన్‌తో గత త్రైమాసికంలో మద్యం అమ్మకాల వాల్యూమ్స్ గణనీయంగా పడిపోనున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో యునైటెడ్ బ్రేవరీస్ తమ వాల్యూమ్స్‌లో 15శాతం క్షీణతను అంచనావేసింది. అయితే అధిక ధరల కారణంగా కంపెనీలకు మార్జిన్స్ మరింత పెరగనున్నాయనీ, అమ్మకాలు తగ్గడంతో ఆపరేటింగ్ మార్జింగ్ క్షీణతను నమోదు చేసే అవకాశముందని ఎంకే గ్లోబల్ సర్వీసెస్ అంచనా వేసింది. (జియో మరో భారీ డీల్ ) మరోవైపు దేశవ్యాప్తంగా షరతులతో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు ఆయా దుకాణాల వద్ద బారులు తీరడం గమనార్హం. కాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, రెడ్ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలను ( స్టాండ్ ఎలోన్) తెరవడానికి అనుమతిస్తారు. అయితే దేశవ్యాప్తంగా కంటైన్ మెంట్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి లేదు. (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ) -
ఇసుక తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, కొవ్వూరు: జిల్లాలో ఇసుక తవ్వకాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేవలం నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ పథకం పనులకు మాత్రమే ఇసుక సరఫరా చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని డోర్ డెలివరీ పథకానికి ప్రస్తుతానికి అనుమతి లేదని అధికారులు చెప్పారు. ముందస్తుగా స్టాకు యార్డులకు ఇసుక తరలించి నిల్వ చేయడం ద్వారా వర్షకాలంలో ఇసుక కష్టాలను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ర్యాంపులను తెరిచి ఇసుకను స్టాక్ యార్డులకు తరలిస్తున్నారు. గండేపల్లి, జగ్గంపేటలతో పాటు జిల్లాలోని తాడేపల్లిగూడెం స్టాకు యార్డుకి ఇసుక చేరవేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా గత నెల 22 నుంచి నిలిచిన తవ్వకాలు మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఇసుక ర్యాంపుల్లో పడవ యాజమానులతో కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. వాడపల్లి, ఔరంగబాద్, ఏరినమ్మ, కొవ్వూరు, దండగుండరేవు, ఆరికిరేవుల, దండగుండ రేవు, కొవ్వూరు–1 ర్యాంపుల నిర్వహణ సొసైటీలతో సమీక్షించారు. ర్యాంపులో సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం వంటి నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. కాగా జిల్లాలో పోలవరం, తాడిపూడి, ప్రక్కిలంక, గుటాల ర్యాంపులు వారం రోజుల క్రితమే తెరిచారు. నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సరఫరా చేస్తున్నారు. జ స్టాకు యార్డుల ఏర్పాటు జిల్లాలో తాడేపల్లిగూడెం స్టాకుయార్డుకి తూర్పు గోదావరి జిల్లా నుంచి మూడు రోజుల్లో 35 వేల టన్నుల ఇసుక తరలించారు. సోమవారం నుంచి ఐ.పంగిడిలో నూతనంగా స్టాకు యార్డు ప్రారంభం కానుంది. రానున్న రోజుల్లో భీమవరం, ఉండి, కాపవరం వంటి స్టాకు యార్డులకు ఇసుక తరలిస్తాం. –కె.మనోరంజన్ రెడ్డి, ఏపీఎండీసీ జిల్లా ఇన్చార్జ్ -
కరీంనగర్ ఎన్నికలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మూడు మున్సిపల్ డివిజన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాకే ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించింది. పొన్నుస్వామి కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్, అంత కుముందు జరిగే ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం తీర్పు వెలువరించింది. అప్పీల్ పిటిషన్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయ వాది సంజీవ్‌కుమార్ సింగిల్ జడ్జి తీర్పు ప్రతిని ధర్మాసనానికి అందజేశారు. దానిని పరిశీలించిన అనంతరం సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 3, 24, 25 డివిజన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాక ఎన్నికలు నిర్వహించాలని, ఈ ఉత్తర్వులు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై డివిజన్ బెంచ్ వెలువరించే తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొనడాన్ని గుర్తు చేసింది. పిల్‌ను తాము తోసిపుచ్చామని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొనసాగించలేమని పేర్కొంది. 24న కరీంనగర్ ఎన్నిక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు లైన్ క్లియరైంది. ఈ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు ఈ నెల 24న ఎన్నికల నిర్వహణతో పాటు 27 ఫలితాల ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. శుక్రవారం కరీంనగర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికల నోటీస్‌ను జారీచేశాక, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 దాకా నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. 12వ తేదీ సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరణ, 13న నామినేషన్ల పరిశీలన, అది పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల నామినేషన్ల ప్రచురణ, 14న సాయంత్రం 5 గంటల దాకా తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్ల స్వీకారం, 15న అప్పీళ్ల పరిష్కారం, 16న మధ్యాహ్నం 3 దాకా ఉపసంహరణ, మధ్యాహ్నం 3 తర్వాత అభ్యర్థుల తుదిజాబితా ప్రచురణ ఉంటుంది. 24న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైతే 25న రీపోలింగ్, 27న ఫలితాలు ప్రకటిస్తారు. -
150 ప్రైవేట్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్..
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై-ఢిల్లీ, హౌరా-ఢిల్లీ సెక్టార్లు సహా వంద రూట్లలో దాదాపు 150 ప్రైవేట్ రైళ్లకు హైపవర్ కమిటీ పచ్చజెండా ఊపింది. తేజాస్ ట్రైన్లను ఇప్పటికే ప్రైవేట్ రంగంలో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ రైళ్లకు హైపవర్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ రంగ రైల్వేలకు గట్టి పోటీకి దారులు తెరుచుకుంటాయని భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వంద రోజుల అజెండాకు అనుగుణంగా రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ ప్రైవేట్ రైళ్లకు ఆమోదముద్ర వేసిన క్రమంలో హైపవర్ కమిటీని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఏర్పాటు చేశారు. ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు ఖరారైన మార్గదర్శకాల ప్రకారం రైల్వే, టూరిజం రంగాల్లో అనుభవమున్న భారత, అంతర్జాతీయ కంపెనీలు ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు పోటీపడవచ్చు. రూ 450 కోట్ల కనీస నికర విలువ కలిగిన సంస్థలను ఇందుకు అనుమతిస్తారు. ఇక ప్రయాణీకులకు మెరుగైన సేవలు, రైళ్ల రాకపోకల్లో 15 నిమిషాలకు మించని జాప్యం వంటి ఇతర నిబంధనలను ఆయా కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. తొలుత ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా రూట్లలో ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు అనుమతించనున్నారు. ఈ రూట్లలో రైళ్ల వేగం గంటకు 160 కిమీ ఉండేలా ట్రాక్స్‌ను మెరుగుపరిచేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. -
మరోసారి వార్డుల పునర్విభజన
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన మరోసారి చేపట్టనున్నారు. పుర ఎన్నికలపై ఉన్న పిటిషన్లను శుక్రవారం హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసి మళ్లీ వార్డుల పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా మున్సిపాలిటీల్లో తిరిగి వార్డుల పునర్విభజన చేపట్టి, ఓటరు జాబితాను సరిచేయనున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 36 వార్డులుంటే 48కి పెంచారు. నల్లగొండలో 40 ఉంటే 48 చేశారు. కొత్త మున్సిపాలిటీ అయిన హాలియాలో 12వార్డులు ఏర్పాటు చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల విభజనలో కొందరు అధికారులు.. అధికార పార్టీ వారికి అనుకూలంగా వ్యవహరించడం, ఓటరు జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఎన్నికలను నిలుపుదల చేసి అవకతవకలను సరిచేయాలని జూలైలో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే వచ్చింది. ఇప్పుడు స్టే ఎత్తివేయడంతోపాటు పిటిషన్లను కొట్టివేయడంతో పై మూడు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన పూర్తిగా రద్దు చేసి కొత్తగా ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. పిటిషన్ల కొట్టివేతతో ఆశావహుల్లో చర్చ .. మున్సిపల్ ఎన్నికలపై కోర్టులో కేసులు నడవడం, పలుమార్లు వాయిదా పడడంతో ఆశావహుల్లో నిర్లిప్తత ఏర్పడింది. ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే మరో 20 రోజుల్లో వార్డుల పునర్విభజన, ఓటరు జాబితా తయారీ, ఎన్నికల అధికారుల నియామకం, సరిహద్దులు గుర్తించడం, వార్డులను పెంచడం, ఎన్నికల అధికారులకు శిక్షణ, పోలింగ్స్టేషన్లను గుర్తించడంలాంటి పనులు పూర్తిచేసే అవకాశం ఉంది. -
పురపోరుకు సిద్ధం
సాక్షి, రామాయంపేట(మెదక్): ఎట్టకేలకు మున్సిపల్‌పోరుకు చిక్కులు వీడాయి. తప్పుల తడకగా వార్డుల విభజన, ఓటరు జాబితా రూపొందించారని.. ఇష్టానుసారంగా ఈ ప్రక్రియ చేపట్టారని ఆరోపిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే.. పలు వాయిదాల అనంతరం హైకోర్టు గురువారం తుదితీర్పు వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేయగా, ఇందులో జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలున్నాయి. గత జూలైలో జారీ అయిన నోటిఫికేషన్, వార్డులు, ఓటర్‌లిస్టును రద్దుచేస్తూ, మళ్లీ మొదటి నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. 14 రోజులోపు ఈప్రక్రియ పూర్తిచేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ వార్డులు, ఓటర్ లిస్టు తయారీకై మున్సిపాలిటీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పూర్తిసమాచారం సేకరించిన అధికారులు.. ఆదేశాలు జారీకాగానే రంగంలోకి దిగనున్నారు. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు పూర్తిచేసి తుదిజాబితా ప్రదర్శించనున్నారు. దీంతోపాటు కొత్తగా ఏర్పాటైన వార్డులకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం వార్డుల వారీగా తుదిజాబితా రూపొందించి కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. అనంతరం రాజకీయ పక్ష్యాలతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం మార్పులు, చేర్పుల తరువాతనే కొత్త జాబితా విడుదల కానుంది. మెదక్‌లో గతంలో 27 వార్డులుండగా అది 32కు పెరిగింది. దీంతో పాటు తూప్రాన్ లో 11 నుంచి 16, నర్సాపూర్‌లో 9 నుంచి 15, రామాయంపేటలో 9 నుంచి 12 వరకు వార్డులు పెరగగాయి. వీటిలో ఓటర్ లిస్టుతో పాటు వార్డులు, పోలింగ్ కేంద్రాల్లో మార్పులు జరుగనున్నాయి. ఆశావహుల సంతోషం.. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆశావహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఓటర్లు ప్రజల వద్దకు వెళ్తున్నారు. రామాయంపేటలో బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళన రూపంగా ప్రజలవద్దకు వెళ్తూ వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇటీవలనే బీజేపీ కార్యకర్తలు వార్డుల్లో పాదయాత్ర చేపట్టి సమస్యలను గుర్తించగా, కాంగ్రెస్ నాయకులు వార్డుల వారీగా దెబ్బతిన్న రహదారులు, మురుగుకాలువల మరమ్మతు విషయమై పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. ఆదేశాల మేరకు నడుచుకుంటాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపడుతాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ఓటర్‌లిస్టు, వార్డుల విభజనలో మా ర్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. – రమేశ్, మున్సిపల్ కమిషనర్, రామాయంపేట -
మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఎన్నికల నిర్వహణకు అవరోధంగా ఉన్న 73 మున్సిపాలిటీలపై స్టే ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. ఇదే సమయంలో జూలై 7న ముందస్తు ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌నూ రద్దు చేసింది. ‘వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలి. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇవ్వాలి. ఆ అభ్యంతరాలను మరో వారం రోజుల్లోగా ఆయా మున్సిపాలిటీలు పరిష్కరిం చాలి. ఇలా చేశాక 15వ రోజు నుంచి ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చేపట్టవచ్చు. జీవో 78లోని 8వ నిబంధన ప్రకారం అభ్యంతరాలను పరిష్కరించాలి. ఒకవేళ ఎవరి అభ్యంతరమైనా పరిష్కరించకపోతే అందుకు కారణాలను లిఖితపూర్వకంగా ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి. ఈ మొత్తం ప్రక్రియ 14వ రోజుల్లోగా పూర్తిచేసి 15వ రోజున ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ)కు నివేదికను పంపాలి. డీఎంఏ ఇచ్చిన తుది నివేదిక మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) శాఖ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. తదుపరి ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చేపట్టడంతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుంది’అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి తుది ఉత్తర్వులు జారీ చేశారు. రిట్ పిటిషన్లకు అనుమతి.. ఎన్నికల ముందస్తు ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని దాఖలైన పలు రిట్ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను చట్ట ప్రకారం పరిష్కరించాలని, వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు, రిజర్వేషన్ల ఖరారు వంటివి చట్ట ప్రకారం పూర్తి చేశాకే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. ‘వార్డుల విభజన సమయంలో ఒక వార్డుకు మరో వార్డుకు ఓటర్లు పది శాతానికి మించరాదన్న చట్ట నిబంధన అమలు జరి గేలా చూడాలి. ఓటర్లను వరస క్రమంలోనే విభజన జరగాలనిపేర్కొంది. -
మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ శుక్రవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలపై విధించిన స్టేను కూడా హైకోర్టు ఎత్తివేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణపై జులైలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ను ఈ సందర్భంగా కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని కోర్టు సూచించింది. -
గంగపుత్రులకు బెంగలేదు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచడంతోపాటు సముద్ర ఉత్పత్తులకు మరింత విలువ జోడించడమే లక్ష్యంగా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలోనే దశాబ్దాల కాలంగా కేవలం మాటలకే పరిమితమైన పూడిమడిక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మొత్తంగా రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు అవసరమైన నిధుల మంజూరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెదం తెలిపాయి. ఇందులో తొలిదశలో నాలుగు, మలిదశలో నాలుగు హార్బర్లను నెలకొల్పనున్నారు. జిల్లాలోని అచ్యుతాపురం మండలంలోని పూడిమడిక వద్ద ఫిషింగ్ హార్బర్‌ను మలిదశలోరూ.353.10కోట్ల నిధులతో ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నో ఏళ్ల కల.. ఇటు విశాఖ హార్బర్... అటు ఒడిశా పారాదీప్... మధ్యలో ఎక్కడా ఫిషింగ్ హార్బర్ లేదు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం వరకు హార్బర్ లేకపోవడంతో మత్స్యకారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా తుపానులు, విపత్తులు వచ్చిన సందర్భాల్లో బోట్లు సురక్షిత హార్బర్‌కు తీసుకువచ్చేందుకు మత్స్యకారులు నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులోనూ జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎక్కువగా ఫిషింగ్‌కు ఒడిశా వైపునకే వెళ్తుంటారు. మరోవైపు విశాఖలోనే దాదాపు 700కి పైగా మెకనైజ్డ్ బోట్లు, 3వేల ఫైబర్ బోట్లు, 400 చిన్న పడవలు ఉండటంతో ఇక్కడి హార్బర్ సామర్ధ్యం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అచ్యుతాపురం మండలంలోని పూడిమడిక సమీపాన మొగ ప్రాంతంలో హార్బర్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాల కాలంగా ఉంది. కానీ ఇన్నేళ్లూ కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఐదు నెలల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ హార్బర్ ఏర్పాటు అనుకూలతలపై సర్వే చేపట్టింది. ఢిల్లీకి చెందిన వాప్కాస్ (వాటర్ అండ్ పవర్ కన్సెల్టెన్సీ సర్వీసెస్ లిమిటెట్) సంస్థ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం హార్బర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పూడిమడకలో హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపి.. ఆ మేరకు కేంద్ర నిధులతో సంయుక్తంగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భీమిలిలో జెట్టీ ఏర్పాటు అనుకూలతలపై సర్వే.. ఇక భీమిలి ప్రాంతంలో జెట్టీ నిర్మించేందుకు అనుకూలతలపై సర్వే చేయాలని ఇప్పటికే బెంగళూరుకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్ (బెంగళూరు) సంస్థకు మత్స్యశాఖ లేఖ రాసింది. ఆ ప్రాంతంలో సముద్రం లోతు, అలల ప్రభావం, ఇసుక తిన్నెల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి సదరు సంస్థ నివేదిక ఇవ్వాల్సి ఉంది. నివేదిక వచ్చిన తర్వాత ఈ జెట్టీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెప్పుకొచ్చారు. పోర్టు ఆధీనం నుంచి తప్పించాలి.. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ పోర్టు ఆధీనంలో నడుస్తోంది. హార్బర్లో ఉన్న 11 జెట్టీల్లో నిలిపి ఉంచే బోట్లకు ఏటా పోర్టు సొమ్ము వసూలు చేస్తుంది. వసూలు చేసిన సొమ్ముతో తగిన మౌలిక సదుపాయాల కల్పన, హార్బర్లోకి బోట్లు వచ్చేందుకు అనువుగా డ్రెడ్జింగ్ పనులు చేపట్టడం లేదు. మత్స్యశాఖ ఆధీనంలో ఉంటే తగిన విధంగా దీన్ని మలుచుకోవచ్చు. మత్స్యకారుల కష్టాలు తీరే అవకాశం ఉంది. – దూడ ధనరాజు, బోటు యజమాని మౌలిక సదుపాయాలు కల్పించాలి.. ఫిషింగ్ హార్బర్‌పై ఆధారపడి బతికే వారిలో వీధుల్లో తిరిగి చేపలు అమ్ముకునే మహిళలు అధికంగా ఉన్నారు. వీరికి తగిన మరుగు సదుపాయం లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నూతన ఫిషింగ్ హార్బర్లలో మంచినీరు, మరుగుదొడ్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. – అల్లిపిల్లి అప్పలస్వామి, కలాసీ జట్టీ నిర్మాణం చేపడితే మేలు.. పూడిమడక తీరం నుంచి వెయ్యి పడవల్లో వేట సా గిస్తున్నాం. పడవల్ని రోజూ వేటకు తీసుకెళ్లాలంటే ఎనిమిది మంది కలాసీలు మోయాల్సి ఉంటుంది. కలాసీలకు అయ్యే ఖర్చు వేటకు భారంగా మారింది. జట్టీ నిర్మాణం చేపడితే మోత భారం ఉండదు. లంగరు వేసిన పడవల్ని ఇద్దరు తీసుకెళ్లి వేట చేయగలుగుతారు. – చింతకాయల కాసుబాబు, మత్స్యకారుడు, పూడిమడక 20 ఏళ్లుగా జట్టీ కావాలని అడుగుతున్నాం.. పూడిమడకలో జట్టీ నిర్మాణం చేపట్టాలని 20 ఏళ్లుగా అడుగుతున్నాం. తుపాను వచ్చిందంటే చాలు కంటిమీద కునుకు ఉండదు. సముద్రం ముందుకు వచ్చిన ప్రతిసారీ పడవల్ని భద్రపరుచుకోవడానికి అవస్థలు పడుతున్నాం. పడవల్ని భద్రపరుచుకోకపోతే ఒకదానికొకటి తాకి మరమ్మతులకు గురవుతున్నాయి. మోగకు వెళ్లే రహదారిని బాగుచేయాలి. – గనగళ్ల బాపయ్య, మత్స్యకారుడు, పూడిమడక పడవలు దెబ్బతింటున్నాయి ఇదివరకు చిన్నపడవలు వినియోగించేవాళ్లం. ఇప్పుడు కోనాం, సూరల వేటకు పెద్దపడవల్ని వినియోగిస్తున్నాం. పడవని జరపడం ఇబ్బందిగా ఉంది. జట్టీ నిర్మిస్తే కలాసీల అవసరం లేకుండా వేటసాగుతుంది. సముద్రం కోతకు గురైనప్పుడు తీరంలో పడవలు దెబ్బతింటున్నాయి. జట్టీ నిర్మిస్తే సమస్యలన్నీ పోతాయి. – వాడముదుల అమ్మోరు, మత్స్యకారుడు, పూడిమడక త్వరలో సర్వే చేస్తాం.. పూడిమడకలో హార్బర్‌ను గ్రీన్ ప్రాజెక్ట్‌గా చేపడతాం. ఆ మేరకు త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలోనే మత్స్యశాఖ తరఫున పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు లేఖ కూడా రాశాం. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది –పి.కోటేశ్వరరావు, అడిషనల్ డైరెక్టర్, మత్స్యశాఖ శీతల గిడ్డంగి అవసరం చాలా ఉంది.. విశాఖ ఫిషింగ్ హార్బర్లో శీతల గిడ్డంగి అవసరం చాలా ఉంది. ప్రస్తుతం 3 టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగి ఏర్పాటు చేశారు. దీన్ని ఎండు చేపలు నిల్వ చేసేందుకు వినియోగిస్తున్నారు. కనీసం 30 టన్నుల సామర్థ్యం గల గిడ్డంగి ఉంటే రొయ్యలు అధికంగా లభ్యం అయినప్పుడు ఇందులో నిల్వచేసుకుని ధర పలికినప్పుడు అమ్ముకోవచ్చు. గిడ్డంగి లేకపోవడం వల్ల రొయ్యలకు గిట్టుబాటు ధర లభ్యం కావడం లేదు. – బర్రి కొండబాబు, అధ్యక్షుడు, విశాఖ కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ -
పదేళ్ల ఎన్నికల కల
గుంటూరు నగరవాసుల పదేళ్ల ఎన్నికల కలలు సాకారం కానున్నాయి. ప్రత్యేక అధికారుల పాలన స్థానంలో స్థానిక ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటి వరకు గ్రామాల విలీనం, వార్డుల పునర్విభజనకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన కేసులు పరిష్కారమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. సాక్షి, గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు అడ్డంకులుగా తొలిగాయి. పదేళ్లుగా తరువాత ఎట్టకేలకు ఎన్నికలు జరగనున్నాయి. 2010 సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఇప్పటికీ గుంటూరు నగరం ప్రత్యేకాధికారుల పాలనే ఉంది. ప్రధానంగా శివారు గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా, వార్డుల పునర్విభజన సక్రమంగా జరగటం లేదని కొంత మంది కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ కోర్టు కేసులు పరిష్కారమయ్యాయి. నగరపాలక సంస్థలో లాలుపురం పంచాయతీ విలీనానికి వ్యతిరేకంగా కోర్టులో నడిచిన వివాదం పరిష్కారమైంది. లాలుపురాన్ని కార్పొ రేషన్‌లో విలీనం చేసేందుకు అంగీకరిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కార్పొరేషన్‌కు పంపటంతో సమస్య పరిష్కారమయింది. మొత్తం మీద విలీన గ్రామాలకు సంబంధించిన సమస్యలు కొలిక్కిరావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వార్డుల ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు గుంటూరు నగరంలో వార్డులకు సంబంధించి ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. గతంలో నగరంలో 52 వార్డులు ఉన్నాయి. విలీన గ్రామాలకు సంబంధించి 10 వార్డులు ఏర్పాటు చేశారు. మొత్తం 62 వార్డులుగా నగరాన్ని విభజించారు. గుంటూరు నగర పాలక సంస్థలో 7.50 లక్షలకు పైగా జనాభా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరగాల్సి ఉంది. 4 లక్షల జనాభా ఉంటే 50 వార్డులు, తరువాత 50 వేల జనాభాకు ఒక వార్డు చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరును 57 వార్డులుగా పునర్విభజించి ప్రభుత్వానికి పంపేందుకు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారని సమాచారం. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వార్డుల పునర్విభజన నోటికేషన్ విడుదల చేయనున్నారు. నగర ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేర్పులతో వార్డుల పునర్విభజనను ఖారారు చేసేందుకు సుమారు మూడు నెలలు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం మార్చిలోపు పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ మార్చిలోపు పూర్తయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైందని సమాచారం. తొలగిన అడ్డంకుకలు గుంటూరు నగరంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అడ్డంకులు తొలిగాయి. విలీన గ్రామాల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. లాలుపురం గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనంచేసేందుకు ఆ పంచాయతీ తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. అనంతరం వార్డుల పునర్విభజన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతాం. – చల్లా అనురాధ, నగరపాలక సంస్థ కమిషనర్ -
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
-
మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
-
‘ఎస్సారెస్పీ’ నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, వరంగల్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. గతంలో ఈ అంశాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఎట్టకేలకు నీటి విడుదలకు గ్రీన్‌సిగ్న ల్ ఇచ్చింది. ఈమేరకు ఆదివారం 9 గంటలకు లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) వద్ద నీరు విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ చీఫ్ ఇంజి నీర్ అనిల్‌కుమార్ ప్రకటించారు. త ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 2,10,250 ఎకరాల్లో పంటలకు మేలు జరగనుంది. కాగా, దిగువ మానేరు కింద ఉన్న కొత్త 10 జిల్లాల్లో స్థిరీకరించిన ఆయకట్టు సుమారు 9 లక్షల ఎకరాల వరకు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎస్సారెస్పీ ద్వారా ఖరీఫ్ పంటలకు సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. పాత వరంగల్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల వరకు ఈ నీరు సరఫరా అవుతుంది. ఈ మేరకు ఖరీఫ్ చివరి దశలో ఉన్న పంటలకు ఉపయోగపడేలా చూడడంతో పాటు చెరువులు, కుంటలు నింపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ఎండీ నీటి మ ట్టం 24.034 టీఎంసీలు కాగా, శనివారం నా టికి 20.543 టీఎంసీలకు చేరుకుంది. ఎల్ఎండీ ద్వారా ఆదివారం నుంచి రెండు వేల క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడుదల చేయనుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నీటి విడుదల కార్యాచరణ ఇదీ.. ఎల్ఎండీ ఎగువ, దిగువన ఉన్న ఆయకట్టుతో పాటు చెరువులు, కుంటలు నింపడానికి ఈ నెల 13 నుంచి 23 వరకు ఎస్సారెస్పీ నీరు విడుదల చేయనున్నారు. కొద్ది రోజుల్లో రబీ సీజన్ ఆరంభం కానుండగా.. ఇప్పటి నుంచే ప్రభుత్వం కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు రబీ సాగుకు ఎస్సారెస్పీ అధికారులు పంపిన సాగునీటి ప్రణాళికలను కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఇదే సమయంలో శ్రీరాంసాగర్‌కు 80 టీఎంసీల నీరు చేరుకోగా.. రోజుకు 6,060 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఎల్ఎండీలోకి 20.543 టీఎంసీల నీరు చేరడంతో నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించారు. అధికారుల ప్రతిపాదనల ప్రకారం ఎల్ఎండీ దిగువన పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ఆయకట్టుకు పది రోజుల పాటు నీటి సరఫరా చేసేందుకు ఆదివారం విడుదల చేయనున్నారు. దీంతో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల పరిధిలోని 2,10,250 ఎకరాల ఆయకట్టుకు మేలు జరుగుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే వర్షాలతో చాలా చెరువులు, కుంటలకు నీరు చేరగా.. ఎల్ఎండీకి దిగువన ఉన్న కాల్వల ద్వారా జీవీసీ – 4 పరిధిలోని 439, వరంగల్(సీసీహెచ్) 154, స్టేజీ – 2 పరిధిలో 270 చెరువు కుంటలను పూర్తిగా నింపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రబీ సాగుకు ఎస్సారెస్పీ నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 84 టీఎంసీల నీరు ఉంది. అయితే, ఇన్ ఫ్లో ఉండడంతో ఎల్ఎండీలోకి నీరు సమృద్ధిగా చేరుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ స్టేజీ–1, 2 పరిధిలో రబీ సాగుకు నీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం నుంచి చెరువులు, కుంటలు నింపనుండగా.. భూగర్భజలాలు కూడా పెరుగుతాయి. మరోవైపు రబీలో ఆరుతడి పంటలే వేసుకోవాలని నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు ఇప్పటి నుంచే రైతులను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు 18.82 లక్షల ఎకరాలు కాగా, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,98,290 ఎకరాలకు రబీలో నీరందే అవకాశం ఉంది. నేడు దిగువకు విడుదల చేయనున్నాం.. దిగువ మానేరు ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా ఆదివారం నీటిని దిగువకు విడుదల చేయనున్నాం. స్టేజ్–1, 2 ద్వారా ఉదయం 9 గంటలకు నీటిని వదులుతాం. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలే తప్ప ఎక్కడ కాల్వవకు గండి పెట్టొద్దని కోరుతున్నాం. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే రబీ పంటలకు కూడా నీరు అందుతుంది. ఎల్ఎండీ నుంచి సూర్యాపేట వరకు చెరువులు, కుంటలు కూడా నింపనున్నాం. ఆదివారం ఉదయం 500 క్యూసెక్కులతో నీటిని విడుదల చేసి... సాయంత్రం వరకు రెండు వేల క్యూసెక్కులు పెంచుతాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరింత పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. – శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జీవీసీ–4, ఎస్సారెస్పీ -
ఉందిలే మంచి కాలం
అమెరికాలో శాశ్వత నివాసం కోసం కలలు కంటూ ఉద్యోగాల ఆధారిత గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు ఇది శుభవార్త. గ్రీన్‌కార్డులను ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతం మాత్రమే మంజూరు చేయాలన్న కోటా పరిమితిని ఎత్తివేసే బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ‘ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ యాక్ట్ ఆఫ్ 2019 (హెచ్ఆర్ 1044)’ బిల్లుకు సభలో అనూహ్యమైన మద్దతు లభించింది. మొత్తం 435 మంది సభ్యులకుగాను 365 మంది అనుకూలంగా ఓటు వేస్తే, 65 మంది వ్యతిరేకించారు. జోలాఫ్రెన్, కెన్‌బర్గ్‌లు గత ఫిబ్రవరిలో ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా కుటుంబాల ప్రాతిపదికన వలస వీసా కోటాను ఏడు నుంచి 15శాతానికి పెంచడంతో వలసదారులకు భారీగా ఊరట లభిస్తోంది. సెనేట్‌లోనూ ఈ బిల్లుకి ఆమోద ముద్ర పడాల్సి ఉంది. గ్రీన్ కార్డు బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే భారత్ వంటి దేశాల నుంచి తక్కువ వేతనాలకే నిపుణులైన ఉద్యోగుల్ని అమెరికా కంపెనీలు నియమిస్తాయని, దీని వల్ల అమెరికాలో మధ్యతరగతికి ఎక్కువగా నష్టం జరుగుతుందని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనోళ్లకే భారీగా ప్రయోజనం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో భారతీయులే 6 లక్షల మందికి పైగా నిరీక్షణ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వలస విధానమే కొనసాగితే ఇండియా వంటి అధిక జనాభా కలిగిన దేశాల వారు గ్రీన్ కార్డు కోసం 151 ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని క్యాటో ఇనిస్టిట్యూట్ వంటి సంస్థలు అంచనా వేశాయి. అధికంగా గ్రీన్‌కార్డు లభించిన దేశాల్లో చైనా ముందుంది. బిల్లు చట్టంగా మారితే 3 లక్షల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. దరఖాస్తు చేసుకున్న భారతీయుల్లో ఇప్పటివరకు ప్రతిఏటా 25శాతం మందికే గ్రీన్‌కార్డులు మంజూరవుతూ వచ్చాయి. ఓ భార్య కల ఫలించిన వేళ రెండేళ్ల క్రితం అమెరికాలోని కన్సాస్‌లో జాతి వివక్షకు బలైపోయిన తెలంగాణ టెక్కీ కూచిభట్ల శ్రీనివాస్ భార్య సునయన గ్రీన్‌కార్డు బిల్లుకి గట్టిగా మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు. 2017 ఫిబ్రవరిలో కన్సాస్ రెస్టారెంట్లో శ్రీనివాస్‌ను కొందరు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. భర్త మరణించాక కూడా అమెరికాలోనే ఉండాలనుకున్న సునయన దూమల ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. తాత్కాలిక వీసా మీదే ఆమె ఇన్నాళ్లూ అమెరికాలో ఉంటూ పనిచేస్తున్నారు. ఈ వీసాల కోసం కంపెనీ యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీదే భారతీయులు ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో గ్రీన్‌కార్డు బిల్లు చట్టరూపం దాల్చడానికి సునయన తన వంతు ప్రయత్నాలు చేశారు. పలుమార్లు వాషింగ్టన్ వెళ్లి న్యాయ నిపుణులతో, ప్రవాస భారతీయ సంఘాలతో సంప్రదింపులు జరిపారు. -
‘వీవీ’లు ఓకే..
ఖమ్మంసహకారనగర్/నేలకొండపల్లి: ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్ల(వీవీ)ను నియమించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత విద్యా సంవత్సరం పని చేసిన వారిని రెన్యువల్ చేసేందుకు అనుమతిచ్చింది. జిల్లావ్యాప్తంగా 471 మంది విద్యా వలంటీర్లను కొనసాగించేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఉపాధ్యాయులు లేని జిల్లాలోని 6 పాఠశాలలకు కొందరిని అత్యవసరంగా నియమించగా.. రెండు, మూడు రోజుల్లో మిగతా పాఠశాలల్లో వీరిని నియమించనున్నారు. జిల్లాలో 1,294 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,98,944 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో బాలికలు 96,936 మంది ఉండగా.. బాలురు 1,02,008 మంది ఉన్నారు. వీరందరికీ మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పటికీ అందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో మాత్రం ఆలస్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాదికేడాది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతున్నా.. కొత్త టీచర్ల నియామకం ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఒక్క ఉపాధ్యాయుడే రెండు, మూడు తరగతులకు బోధించాల్సి వస్తోంది. లేనిపక్షంలో విద్యావలంటీర్లతోనే ఎలాగోలా నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తీర్పునకు అనుకూలంగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యా వలంటీర్లను ప్రతి ఏటా రెన్యువల్ చేయాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించగా.. వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులను భర్తీ చేసేవరకు వీరిని ఏటా రెన్యువల్ చేయాలని తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో విద్యా శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. అయితే ప్రభుత్వం రెన్యువల్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 471 మంది విద్యా వలంటీర్లను రెన్యువల్ చేయనున్నారు. మండలాలవారీగా ఉద్యోగ విరమణ పొందనున్న ఉపాధ్యాయులు, ఏర్పడనున్న ఖాళీలు, దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారు, ఇతర కారణాలతో ఖాళీలు, ఇతర అవసరాల రీత్యా వలంటీర్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని డీఈఓ కార్యాలయం నుంచి ఎంఈఓలకు ఆదేశాలు అందాయి. ఈసారి కూడా.. గత ఏడాది కాలంలో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు అనేక మంది ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఈ ఏడాది విద్యావలంటీర్లు అదనంగా అవసరం అవుతారనే ఆలోచనలో విద్యా శాఖ ఉంది. ఈ క్రమంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో భర్తీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది దాదాపు 731 మంది విద్యా వలంటీర్ల అవసరం ఉంటుందని గుర్తించారు. ఈ మేరకు అంతమందిని నియమించుకునేందుకు అనుమతి కోరుతూ జిల్లా విద్యా శాఖ.. ఉన్నతాధికారులకు నివేదికను పంపించింది. అయితే ప్రస్తుతానికి 471 మంది విద్యా వలంటీర్ల రెన్యువల్‌కు ఆమోదం లభించింది. అందని వేతనాలు.. 2018–19 విద్యా సంవత్సరానికి జిల్లావ్యాప్తంగా విద్యా వలంటీర్లకు ప్రతి నెలా వేతనాలు అందలేదు. మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు జమ చేస్తున్నారు. వీరికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 12వ తేదీ వరకు వేతనాలు అందించాల్సి ఉంది. నెలకు రూ.12వేల చొప్పున పెండింగ్ వేతనాలు రావాల్సి ఉంది. విద్యా సంవత్సరం ముగిసి, తిరిగి ప్రారంభమైనా నేటి వరకు వేతనాలు అందలేదంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నా.. సమాన వేతనాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్పించు కుని నెలనెలా వేతనాలు జమ చేయాలని కోరుతున్నారు. -
పాలన ఇక గాడిలో..
అశ్వాపురం: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకానికి లైన్‌క్లియర్ అయింది. నియామకాలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్యదర్శుల పోస్టుల ఎంపికలో పారదర్శకత పాటించలేదంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో నియామకాలు నిలిచిపోయాయి. జిల్లాలో 479 పంచాయతీలు ఉండగా 387 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఈ మొత్తం పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్లోనే సర్టిఫికెట్ల పరిశీలన... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసి, అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణత సాధించిన వారి మార్కుల ఆధారంగా జాబితా ప్రకటించారు. డిసెంబర్ 20న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. ఆ నెలలోనే పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో నియామకాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ నియామకాలు చేపట్టాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమైంది. జనవరి 31న పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియడంతో నియామకాలు చేపడతారని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో ఇక ఇప్పట్లో నియామక ప్రక్రియ ఉండదని అభ్యర్థులు ఆందోళన చెందారు. అయితే ఎట్టకేలకు ఎన్నికల సంఘం నియామక ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో తమకు కొలువులు దక్కుతాయని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శుల కొరతతో కుంటుపడిన పాలన... ఫిబ్రవరి 2న జిల్లాలోని 479 పంచాయతీలలో నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టినా.. పంచాయతీ కార్యదర్శుల కొరతతో పాలన కుంటు పడింది. జిల్లాలో 479 పంచాయతీలలో 92 మంది మాత్రమే పంచాయతీ కార్యదర్శులు ఉండటంతో ఒక్కొక్కరు నాలుగు, ఐదు పంచాయతీలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడే పేరుకుపోయాయి. కార్యదర్శులు లేకపోవడంతో నూతన పాలకవర్గాలు సైతం తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, పంచాయతీ నిర్వహణ, ఇంటి పన్నుల వసూలు, వీధిలైట్లు, జనన, మరణ ధ్రువపత్రాల జారీ తదితర పనుల విషయంలో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఇంకా ఆదేశాలు రాలేదు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కానీ మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లాలో 387 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నియామకాలకు సంబంధించి పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ఆర్.ఆశాలత, డీపీఓ -
పట్టాలపైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఢిల్లీ నుంచి వారణాసి వరకూ నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూపొందించడం వెనుక డిజైనర్లు, ఇంజనీర్ల కృషిని అభినందిస్తున్నానని ప్రధాని మోదీ ప్రశంసించారు. నాలుగున్నరేళ్ల తమ పాలనలో రైల్వేలను మెరుగుపరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. ఈ అత్యాదునిక రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో కేవలం 18 నెలల్లో తయారు చేయడం దేశానికి గర్వకారణమన్నారు. ట్రైన్‌ను ప్రారంభించిన అనంతరం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇతర అధికారులతో కలిసి కలియతిరుగుతూ రైలును పరిశీలించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ట్రైన్ 18కు ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పేరును నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈనెల 17 నుంచి ఢిల్లీ-వారణాసి మధ్య వారానికి ఐదు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లతో పాటు 16 ఏసీ కోచ్‌లుంటాయి. ఈ రైలులో ఒకేసారి 1128 మంది ప్రయాణీకులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు. అన్ని కోచ్‌ల్లో ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ వంటి అత్యాధునిక సదుపాయాలను అందుబాటులో ఉంచారు. తాజా వంటకాలను ప్రయాణీకులకు అందించేందుకు ప్రతి కోచ్‌లో పాంట్రీని ఏర్పాటు చేశారు. -
బదిలీలకు గ్రీన్ సిగ్నల్!
జోగుళాంబ శక్తిపీఠం: దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులకు ఇక స్థాన చలనం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎం.ఎస్ నెం07 విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 51ఆలయాల్లో ఇది అమలుకానుంది. గత 12 ఏళ్లుగా ఉద్యోగులు కొందరు ఒకే ఆలయంలో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. మరోవైపు ఒకే ఆలయంలో పనిచేయడం వల్ల కొందరు ఉద్యోగులు అభివృద్ధికి కారకులయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 51 ఆలయాల్లో మొత్తం ఉద్యోగులు 620 మంది ఉన్నారు. ఇందులో అర్చక స్వాములు 171 మంది ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్, వాచ్మెన్లు ఇలా వివిధ క్యాటగిరీలలో 449మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో అర్చకులు మినహా ఇతర క్యాటగిరీలో ఉన్న ఉద్యోగులకు ఈ జీవో ప్రకారం బదిలీలు జరగనున్నాయి. కాగా నేటిదాకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా దాదాపు 273 మంది మాత్రమే వేతనాలు అందుకుంటున్నారు. ఇది వర్తించని వారికి కూడా బదిలీలు ఉంటాయా? లేదా అనేది ప్రశ్నార్థంగా మారింది. స్థానిక నేతల అండదండలతో... ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఆలయాల్లో ఉన్నత హోదాలో ఉన్న ఉద్యోగులు సైతం అనేక విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో అక్కడి భక్తులు కొందరు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేసిన దేవాదాయ వాఖ వారిని ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. అయినా వీరు రాజకీయ నేతల ఒత్తిడితో మళ్లీ ఉన్న చోటుకే వదిలీ చేయించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. 20శాతం మందికి తప్పనిసరి జీవో 7 ప్రకారం తొలివిడతగా 20శాతం మంది బదిలీలు కానున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని అలంçపూర్, మన్యంకొండ, కురుమూర్తి, ఉమామహేశ్వరం, మద్దిమడుగు, జమ్ములమ్మ, బీచుపల్లి, నాయినోనిపల్లి , కకాకర్లపాడు, చిన్నరాజమూరు, గంగాపురం, ఉర్కొండపేట, మఖ్తల్, మల్దకల్, సింగవట్నం, బుద్దారం గండి, పాలెం, సిరిసనగండ్ల, చింతరేవుల, పాగుంట తదితర ఆలయాలతో ఇతర చిన్న ఆలయాల్లో కూడా ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. సంతోషంలో ఉద్యోగులు భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నవారు, అలాగే ఏళ్ల తరబడి ఒకే ఆలయంలో పనిచేస్తూ స్థానిక నేతల ఒత్తిడితో మానసిక వేదనకు గురవుతున్న ఉద్యోగులు జీవో విడుదలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ అనిల్‌కుమార్ ఆలయాల ఉద్యోగులు, అడ్మినిస్ట్రేషన్‌పై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతాయుతంగా పని చేస్తారు బదిలీలతోనే ఆలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పని చేస్తారు. ఏ శాఖలో అయినా బదిలీలు సర్వసాధారణం. ఎప్పుడూ ఒకేచోట లాంగ్‌స్టాండింగ్‌లో ఉద్యోగి పనిచేయడం సరికాదు. ఆలయాల వ్యవస్థ గాడిలో పడి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. – కృష్ణ, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ బదిలీలను స్వాగతిస్తున్నాం ఆలయాల్లో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారనేవి కేవలం ఆరోపణలు మాత్రమే. పండుగలు, పబ్బాలు, భార్యాపిల్లలను వదిలి ఆలయాల్లోనే దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నారు. కొన్నిసార్లు స్థానిక చోటామోటా లీడర్ల గొంతెమ్మ కోర్కెలను కాదనప్పుడు ఉద్యోగులపై ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం సహజమే. మేం బదిలీలను స్వాగతిస్తున్నాం. కొత్త స్థానాల్లో మరింత ఉత్సాహంతో పని చేస్తాం. – జయపాల్ రెడ్డి, జిల్లా అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
పల్లెపోరు
సాక్షి, వనపర్తి: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం పల్లెపోరుకు సన్నద్ధమవుతోంది. దీనిపై అధికార యంత్రాంగం తగిన కార్యాచరణపై దృష్టిసారించింది. పంచాయతీ ఎన్నికలను గడువులోగా నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించడంపై హైకోర్టు ఈనెల 11న తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. తీర్పు వెలువడిన మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి పండగలోపే ఎన్నికలు ముగించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఆశలపై నీళ్లు! ఈ ఏడాది జూలైలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం జూన్ నాటికే ఓటరు తుదిజాబితా విడుదల, పోలింగ్ బూత్‌ల గుర్తింపు, ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేయడం, బ్యాలెట్ నమూనాలు, ప్రింటింగ్ వంటి పనులు పూర్తిచేసింది. రేపోమాపో ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల కానున్న సమయంలో రిజర్వేషన్ల ప్రక్రియ తేలే వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకూడదని గత జూన్ 26న హైకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసిన అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. ఎన్నికల సామగ్రిని సైతం స్టోర్‌రూమ్‌లకు తరలించారు. ఇంతలో కోర్టు తీర్పు నేపథ్యంలో ఆశావహుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలు కానుంది. అధికారులకు ప్రత్యేక శిక్షణ సెప్టెంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలకు విడుదల చేసిన ఓటరు తుదిజాబితా ఆధారంగానే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం ఇటీవల జారీచేసింది. నవంబర్ మొదటి వారం నుంచి మూడో వారంలోగా గ్రామాలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారుచేసి అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద అతికించనున్నారు. నవంబర్ నాలుగో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త ఓటర్లను చేర్చడంతో పాటు మరోసారి జాబితాను ప్రచురించనున్నారు. నవంబర్ నాలుగో వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, స్టేజీ –1, స్టేజీ –2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నారు. డిసెంబర్ రెండో వరకు ఎన్నికల సమాచారాన్ని సేకరించడం, ఏర్పాట్లను పూర్తిచేయడం వంటి పనులను పూర్తిచేయనున్నారు. ఈ ఎన్నికల ఏర్పాట్లకు సబ్‌కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ సెక్రటరీలు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వేషన్ల అంశమే కీలకం గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం మేలో రిజర్వేషన్లను ప్రకటించింది. దీని ప్రకారం ఎస్టీలకు 5.17శాతం, ఎస్సీలకు 20.46శాతం, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కేటాయించింది. కానీ వీటిని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న తరుణంలో రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. పాత వాటి ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేస్తారా ? లేక కొత్తగా ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రామాల్లో రాజకీయ వేడి ఆగస్టు 2న గ్రామపంచాయతీ పాలకవర్గాలకు గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. అదేరోజు నుంచి కొత్త పంచాయతీలుగా అవతరించిన తండాలు, అనుబంధ గ్రామాల్లోనూ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు ప్రత్యేకాధికారులను నియమించారు. వనపర్తి జిల్లాలో కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి 255 గ్రామ పంచాయతీలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 255, నాగర్‌కర్నూల్‌లో 543, మహబూబ్‌నగర్ జిల్లాలో 721 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే అన్నిపార్టీలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. దీనికితోడు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతుండటంతో గ్రామాల్లో మరింత రాజకీయ వేడి రాజుకోనుంది. -
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్
-
వీవీల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యావాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే వీవీల నియామకం చేపట్టాల ని భావించినప్పటికీ ఉపాధ్యాయుల బదిలీల కారణంగా ఆలస్యమైంది. విద్యాశాఖ అధికా రులు ముందస్తుగా మండలాల వారీగా అవసరమైన విద్యావాలంటీర్ల వివరాలు తెప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ వివరాలు మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు ఎంఈవోల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు. స్కూల్ అసిస్టెంట్లు విధుల్లో చేరినప్పటికీ.. ఎస్జీటీల బదిలీ ప్రక్రియ బుధవారం రాత్రితో ముగిసినందున వారు విధుల్లో చేరితేగానీ లెక్క పక్కాగా తేలదని అధికారులు చెబుతున్నారు. ఏ పాఠశాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎంఈవోలు గుర్తించి పంపించాలంటే ఒకటి రెండు రోజులైనా పట్టవచ్చని అంటున్నారు. ఖాళీల వివరాలను బట్టి నియామక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఖాళీలు తేలకముందే విద్యాశాఖ వీవీల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేయడంతో గందరగోళంగా మారింది. జిల్లాలో బదిలీలకు ముందు విద్యాశాఖ అధికారులు ఖాళీల వివరాలను ఇదివరకే గుర్తించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్న చోట, ఉసాధ్యాయులు సెలవులు పెట్టిన చోట, ఇతర కారణాలతో సెలవులపై వెళ్లిన ఉపాధ్యాయుల స్థానంలో 152 ఎస్జీటీ, 100 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని గుర్తించారు. ఈ ఖాళీలను వీవీలతో భర్తీ చేయాలని ముందుగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు జరగడంతో ఖాళీల సంఖ్య మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బదిలీ ఉపాధ్యాయులందరు విధుల్లో చేరితే గానీ ఖచ్చితమైన ఖాళీల సంఖ్య తేలదని చెబుతున్నారు. బదిలీల తర్వాత ఉన్న ఖాళీల వివరాలను అందజేయాలని బుధవారం రాత్రి ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరావు ఎంఈవోలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. గురువారం రాత్రి వరకు ఖాళీల లెక్క తేలుతుందని భావించినా స్పష్టత రాలేదు. ఇదీ షెడ్యూల్ విద్యావాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈనెల 16వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. అనంతరం హార్డ్‌కాపీలను ఎంఈవో కార్యాలయంలో సమర్పించాలి. ఎంఈవోలు వాటిని పరిశీలించి ఈ నెల 17లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి. 18న అభ్యర్థులను ఎంపిక చేసి కలెక్టర్ అమోదం పొందుతారు. 19న పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు నిర్వహింస్తారు. విద్యావాలంటీర్లు 20వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది. -
కాళేశ్వర విజయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు కీలకమైన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం లభించింది. బుధవారం ఢిల్లీలోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రాజెక్టుకు ఉన్న అన్ని ప్రధాన అవరోధాలు తొలగిపోనున్నాయి. తాజా అనుమతి నేపథ్యంలో ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం మళ్లీ తెరపైకి రానుండగా, ప్రపంచంలోని ఎక్కడ్నుంచైనా కాళేశ్వరానికి అవసరమయ్యే నిధుల సేకరణకు వెసులుబాటు కలగనుంది. అన్ని అనుమతులు వచ్చేసినట్టే! టీఏసీ అనుమతులకు సంబంధించి బుధవారం జరిగిన భేటీలో కేంద్ర జల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, నీతి ఆయోగ్ సలహాదారు, భూగర్భ జల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు, కేంద్ర జల సంఘానికి చెందిన అన్ని విభాగాల సంచాలకులు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్) మురళీధర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) హరిరామ్ పాల్గొని ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం నిర్మాణ ప్రక్రియకు సంబంధించి లింక్ –1, లింక్ –2, లింక్ –3 పనుల పురోగతిని ప్రదర్శించారు. ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల నీటిని గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు రూపొందించిన ప్రణాళికను వివరించారు. ఎల్లంపల్లిలో లభ్యమయ్యే 20 టీఎంసీల నీరు, మరో 25 టీఎంసీల భూగర్భ జలాలు కలుపుకొని మొత్తం ప్రాజెక్టు నీటి లభ్యత 240 టీఎంసీలు ఉండగా, ఇందులో నుంచి 237 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి కేంద్ర జల సంఘం ఇప్పటికే తన అంగీకారం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందులో 169 టీఎంసీలు సాగునీటికి, 30 టీఎంసీలు హైదారాబాద్ తాగు నీటి అవసరాలకు, 10 టీఎంసీలు దారి పొడవునా ఉండే గ్రామాల తాగునీటికి, 16 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలు, 12 టీఎంసీలు ఆవిరి నష్టం కోసం వినియోగించే ప్రణాళికపై వివరణ ఇచ్చారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల్లో 24 గంటల పాటు జరుగుతున్న పనులు, ఇప్పటికే జరిగిన రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చు అంశాలను వివరించారు. అధికారుల ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన టీఏసీ.. సమావేశం అనంతరం ఏకగ్రీవంగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులను మంజూరు చేస్తూ తీర్మానించింది. ఈ మేరకు ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్‌లు ఢిల్లీ నుంచి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం 9 కీలక అనుమతులు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు రావడంతో సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు లభించినట్లయింది. జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) మాత్రమే మిగిలి ఉంది. అన్ని అనుమతులు ఇప్పటికే రావడంతో ఈ అనుమతి త్వరలోనే వస్తుందని హరిరామ్ తెలిపారు. మంత్రి హరీశ్ హర్షం కాళేశ్వరానికి టీఏసీ అనుమతిపై నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. అనుమతుల సాధనలో కీలక పాత్ర పోషించిన సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్‌లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లను అభినందించారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు లభించిన అనుమతులివీ.. 1. పర్యావరణ ప్రభావ నివేదిక తయారీకి టీఓఆర్ 2. మేడిగడ్డ వద్ద 75% డిపెండబిలిటీతో 283.3 టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్ 3. అంతర్రాష్ట్ర అనుమతి 4. కేంద్ర భూగర్భ జల శాఖ 5. కన్స్ట్రక్షన్ అండ్ మిషనరీస్ డైరెక్టరేట్ 6. అటవీ మంత్రిత్వ శాఖ తుది అనుమతి 7. పర్యావరణ తుది అనుమతి 8. ఇరిగేషన్ ప్లానింగ్ 9. ప్రాజెక్టు అంచనా , -
‘నీరవ్ అరెస్టుపై నిర్ణయం హాంకాంగ్‌దే’
బీజింగ్: హాంకాంగ్‌లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి, పీఎన్బీ స్కాం కీలక నిందితుడు నీరవ్ మోదీ అరెస్టు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ‘సరెండర్ ఆఫ్ ఫ్యుజిటివ్ అఫెండర్స్ అగ్రిమెంట్’ కింద నీరవ్‌ను అరెస్టు చేయాలని ఇప్పటికే హాంకాంగ్‌కు భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ ప్రతిపాదనపై హాంకాంగ్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, స్కాం కేసులో కొనసాగుతున్న దర్యాప్తును తాను పర్యవేక్షించబోనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలంటూ దాఖలైన పిల్ విచారణార్హమా? కాదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. -
‘గ్రీన్’ హైవేకు పచ్చజెండా
సాక్షి, చెన్నై: గ్రీన్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10 వేల కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ పనులకుగాను స్థల సేకరణకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి. చెన్నై నుంచి సేలం వైపు ఎనిమిది మార్గాలతో 274 కిమీ దూరంలో ఈ గ్రీన్ నేషనల్ హైవే రూపుదిద్దుకోనుంది. కన్యాకుమారి నుంచి చెన్నై మీదుగా పలు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి రూపదిద్దుకుని ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ రహదారుల్లో నిత్యం వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఈ జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రాష్ట్ర రహదారులు అనేకం ఉన్నాయి. అయినా, ట్రాఫిక్ తగ్గేది లేదు. ఈ పరిస్థితుల్లో చెన్నై నుంచి పశ్చిమ తమిళనాడు వైపుగా సేలంకు సరికొత్త రోడ్డు మార్గానికి కేంద్రం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధమైంది. పచ్చదనంతో నిండిన మార్గంగా ఈ జాతీయ రహదారిని రూపొందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ పనులకుగాను స్థలసేకరణ నిమిత్తం రాష్ట్ర రహదారుల శాఖ కార్యదర్శి రాజీవ్ రంజన్‌కు కేంద్ర రహదారుల శాఖ నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మార్గం సాగే జిల్లాల్లోని కలెక్టర్ల పర్యవేక్షణలో స్థల సేకరణకు ప్రత్యేక అధికారుల్ని రంగంలోకి దించే విధంగా ఆ ఉత్తర్వుల్లో వివరించారు. అలాగే , ఆ రోడ్‌రూట్ మ్యాప్ అంశాలను అందులో పొందుపరిచారు. రూ.10 వేల కోట్లతో పచ్చదనం: చెన్నై నుంచి సేలం వరకు 274 కి. మీద దూరం రూపుదిద్దుకోనున్న ఈ హైవే 250 కిమీ దూరం అటవీ మార్గంలో సాగనుంది. చెన్నై తాంబరం నుంచి ధర్మపురి జిల్లా అరూర్ వరకు ఎన్‌హెచ్ 179బీగా, అరూర్ నుంచి సేలం వరకు ఎన్‌హెచ్ 179ఏగా ఈ గ్రీన్ హైవేను పిలుస్తారు. రూ.పదివేల కోట్ల వ్యయంతో పచ్చదనంతో ఈ మార్గం రూపుదిద్దుకోనుంది. కాంచీపురం జిల్లాల్లో 53 కిమీ, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు, వందవాసి, పోలూరు, ఆరణి, సెంగం మీదుగా 122 కి.మీ, కృష్ణగిరిలో రెండు కిమీ, ధర్మపురి జిల్లా తీర్థమలై, అరూర్, పాపిరెడ్డి పట్టిలను కలుపుతూ 53 కి.మీ, సేలం జిల్లా వాలప్పాడి తాలుకా నుంచి సేలం నగరంలోకి 38 కిమీ దూరం నిర్మించనున్నారు. స్థలసేకరణ ప్రక్రియను త్వరితగతిన ముగించాలని, ప్రత్యేక అధికారుల ద్వారా పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 250 కి.మీ దూరం అటవీ మార్గంలో ఈ గ్రీన్ హైవే పయనించనున్న దృష్ట్యా, అందుకు తగ్గ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ రహదారి పూర్తయతే చెన్నై నుంచి సేలంకు 3 గంటల్లో చేరుకోవచ్చు. దేశంలోనే రెండవ గ్రీన్ హైవే తమిళనాడుకు దక్కడం గమనించదగ్గ విషయం. -
కొత్తగా 24 మెడికల్ కాలేజీలు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యారోగ్య రంగంలో మానవవనరుల కొరతను తగ్గించేందుకు వివిధ పథకాలకు రూ.14,930 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు అన్రిజర్వ్డ్ ప్రాంతాల్లో 24 వైద్య కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 2020–21 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 18,058 యూజీ, పీజీ సీట్లను పెంచనున్నట్లు కేంద్రం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. దాదాపు 248 నర్సింగ్ కళాశాలల్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. త్వరలో ఏర్పాటు చేయనున్న 24 మెడికల్ కాలేజీలను ప్రస్తుతమున్న జిల్లా, రెఫరల్ ఆస్పత్రులకు అనుసంధానిస్తామని పేర్కొంది. 3 నుంచి 5 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయంది. -
జహీరాబాద్ నిమ్జ్‌కు ‘పచ్చ’ జెండా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఈ మెగా పారిశ్రామికవాడ నిర్మాణంలో అనుసరించాల్సిన నియమ నిబంధనల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆమోదం తెలిపింది. తొలి దశ పర్యావరణ అనుమతులుగా భావించే ‘టీఓఆర్’కు ఆమోదం లభించడంతో.. తుది అనుమతులు కోరేందుకు మార్గం సుగమమమైంది. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగ విచారణ జరిపి తుది దశ అనుమతుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంఘం మండలాల్లో 12,635 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిమ్జ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.44 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.37,740 కోట్ల పెట్టుబడులతో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఈ పారిశ్రామికవాడలో ఏర్పాటవనున్నాయి. 2040 సంవత్సరం నాటికి రూ.96,778 కోట్లు విలువ చేసే ఉత్పత్తులు జరగనున్నాయి. 2030 నాటికి పూర్తి.. నిమ్జ్ నిర్మాణానికి రూ.4,500 కోట్ల అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. సైట్ అభివృద్ధి, అంతర్గత రోడ్లు, నీరు, విద్యుత్ సరఫరా, వరద, మురుగు నీటి కాల్వలు, భవనాలు, వీధి దీపాలు, పచ్చదనం అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టుకు వెలుపల మౌలిక సదుపాయాల కోసం మరో రూ.6,100 కోట్ల వ్యయం కానుంది. 2020 నాటికి ప్రాజెక్టు తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, 2030 నాటికి మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. నిమ్జ్ పరిధిలో 17 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 12,635 ఎకరాలకు గాను 2,884 ఎకరాలు టీఎస్ఐఐసీ ఇప్పటికే సేకరించింది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు ఆకర్షించేందుకు నిమ్జ్ ప్రతిపాదిత ప్రాంతం అనుకూలమని ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు సమీపంలో ఇప్పటికే మహీంద్ర, ఎంఆర్ఎఫ్ టైర్స్, అరబిందో ఫార్మా, స్పార్శ్ ఫార్మా, కావేరీ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్, ఆర్డాన్స్ ఫ్యాక్టరీ మెదక్, భారత్ డైనమిక్స్(బీడీఎల్), ట్రైడెంట్ షుగర్స్ లాంటి మెగా పరిశ్రమలున్నాయంది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ., ఓఆర్ఆర్ నుంచి 50 కి.మీ, దూరంలోని ఈ ప్రాజెక్టుకు రహదారులు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, సీ పోర్టు (కృష్ణపట్నం, జవహర్లాల్ పోర్ట్ ట్రస్ట్) సదుపాయాలతో పాటు నీరు, విద్యుత్ సదుపాయాలున్నాయని పేర్కొంది. కాగా, నిమ్జ్‌లో ప్రధానంగా ఎలక్ట్రిక్ పరికరాలు, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ రంగాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. జోన్ల వారీగా ప్రాజెక్టు అభివృద్ధి ఇలా.. జోన్ స్థలం (ఎకరాల్లో) ఉత్పత్తి పరిశ్రమలు 7,107 సాంకేతిక సదుపాయాలు 550 మౌలిక వసతులు 883 గృహ నిర్మాణం 638 లాజిస్టిక్స్ 899 పచ్చదనం 1,603 రహదారులు 955 మొత్తం 12,635 నోట్: కామన్ ఫోల్డర్లో నీమ్జ్ జహీరాబాద్ పేరుతో ప్రాజెక్టు సైట్ మ్యాప్ ఫోటోలు ఉన్నాయి. పరిశీలించగలరు. 12,635 - ఎకరాల్లో మెగా పారిశ్రామిక వాడ నిర్మాణం 4,500 - కోట్లు అంచనా వ్యయం 6,100- కోట్లు ప్రాజెక్టు వెలుపల మౌలిక వసతులకు.. 2,40,000- మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి -
రైల్వే బ్రిడ్జిలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ వాసుల ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు ఒక కదలిక వచ్చింది. జిల్లా కేంద్రంలో రైల్వే బ్రిడ్జిలు లేకపోవడంతో ప్రధాన మార్గాల్లో ఎదుర్కొంటున్న ట్రాఫిక్ నరకయాతనకు రానున్న రోజుల్లో ముగింపు పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైల్వేబ్రిడ్జిలను నిర్మించనున్నాయి. రెండు ప్రధాన మార్గాల్లో ఒకటి రైల్వే ఓవర్‌బ్రిడ్జి(ఆర్ఓబీ), మరొకటి రైల్వే అండర్‌బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్‌తోపాటు అంచనా వ్యయాన్ని రూపొందిస్తున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు చేపట్టే అవకాశం ఉంది. తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్బ్రిడ్జే.. ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం కోసం ప్రభుత్వాలు రూ.76 కోట్లు మంజూరు చేశాయి. ఇందులో ప్రధానంగా రాష్ట్ర వాటానే అధికంగా ఉండనుంది. ట్రాక్ నిర్మా ణం ఉన్న చోటనే కేంద్రం నిధులు వెచ్చిస్తుందని అధికా రులు చెబుతున్నారు. మిగతా బ్రిడ్జి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీంతోనే రాష్ట్రంపైనే అధిక భా రం పడనుంది. ప్రధానంగా మార్కెట్ యార్డుకు వెళ్లే దారిలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి(ఆర్ఓబీ) నిర్మించాలన్నది ఆదిలాబాద్ ప్రజల చిరకాల స్వప్నం. ఇక్కడ ఆర్ఓబీ నిర్మాణానికి సాధ్యత(ఫీజిబిలిటీ) కాదని చెప్పడం నిరాశ కలిగిస్తోంది. ఈ జంక్షన్ క్రాసింగ్ దగ్గర నుంచి 8 మీటర్ల తర్వాత వాహనాలు బ్రిడ్జి పైకి రావడానికి ఏటవాలుగా నిర్మించేందుకు అనువుగా లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఆర్ఓబీ నిర్మించిన పక్షంలో అటు హైదరాబాద్, ఇటు నాగ్‌పూర్ కు ఎటువైపు అయిన మలిపేందుకు అనువుగా 90 డిగ్రీ ల టర్నింగ్ పాయింట్ నిర్మించేందుకు అనువుగా లేదని పేర్కొంటున్నారు. జంక్షన్ నుంచి పంజాబ్‌చౌక్ వరకు వెళ్లే దగ్గర ఈ సాధ్యత లేదని అధికారులు చెబుతున్నా రు. ఆర్అండ్బీ ఇంజినీరింగ్ చీఫ్(ఈఎన్సీ) దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇక్కడ ఆర్ఓబీ నిర్మా ణం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. కాగా ఇటీవల కాలంలోనే పంజాబ్‌చౌక్ వద్ద రూ.1కోటి 20లక్షలతో చెరోవైపు 12 మీటర్ల వెడల్పుతో ఇరుపక్కల కొత్తగా రహదారిపై బ్రిడ్జిను పునర్నిర్మాణం చేపట్టారు. ఒకవేళ ఇక్కడ ఆర్ఓబీ నిర్మించిన పక్షంలో ఈ బ్రిడ్జి నిర్మాణం వృథా అయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా అధికా రులు ఆర్ఓబీ నిర్మాణానికి వెనక్కి వస్తున్నారని తెలు స్తోంది. అదే సమయంలో ఇక్కడ వ్యాపార సముదా యం అధికంగా ఉండడంతో ఆర్ఓబీ నిర్మిస్తే ఈ సముదాయానికి ఇబ్బంది ఎదురవుతుందన్న కోణంలో ఆర్‌యూబీకి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. స్పిన్నింగ్ మిల్లు వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జి.. స్పిన్నింగ్ మిల్లు వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మించనున్నారు. ప్రధానంగా రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి అధిక వ్యయం అవుతుంది. అదే సమయంలో ఇక్కడ నిర్మాణానికి సాధ్యత ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రాక్ నుంచి మార్కెట్ యార్డు వైపు 240 మీటర్లు, కలెక్టరేట్చౌక్ వైపు 150 మీటర్ల పొడవున ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. కలెక్టరేట్ చౌక్ వద్ద ఏటవాలుగా వాహనాలు దిగిన తర్వాత ఇటు హైదరాబాద్, అటు నాగ్‌పూర్‌కు సులువుగా మలిగేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా ఇక్కడే ఆర్ఓబీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. -
పద్మావత్ : సుప్రీం గ్రీన్ సిగ్నల్
పద్మావత్ చిత్ర విడుదలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిషేధించిన రాష్ట్రాల్లో కూడా విడుదల చేయాల్సిందేనని గురువారం తేల్చి చెప్పింది. సెన్సార్ సమస్యలను దాటి ఈ నెల 25న రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డ్ రిలీజ్ కు అనుమతించినా.. తాము మాత్రం అనుమతించబోమని ఆయా ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. దీంతో నిషేదంపై చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కారణంగా సినిమాను నిషేదించారంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాపై విధించిన నిషేదాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ సుప్రీం తీర్పుతో ఈ నెల 25న దేశవ్యాప్తంగా పద్మావత్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. -
స్టోరీ నచ్చితే ఎవరైనా ఓకే!
ఒక 20 సినిమాలు చేసిన హీరో.. అందులోనూ స్టార్ హీరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం అంటే అది కచ్చితంగా హాట్ టాపిక్కే. గురువారం అల్లు అర్జున్ ఇలాంటి టాపిక్ ద్వారానే చర్చల్లో నిలిచారు. ఓ కొత్త దర్శకుడితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వార్తల్లో ఉన్న ప్రకారం అతని పేరు సంతోష్ రెడ్డి. బన్నీకి సంతోష్ చెప్పిన కథ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించనున్నారట. సో.. స్టోరీ నచ్చితే బన్నీకి ఏ దర్శకుడైనా ఓకే అన్నమాట. ఈ ఏడాది బన్నీ ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చినట్లు. ఒకరు రచయిత వక్కంతం వంశీ. బన్నీ హీరోగా సెట్స్ మీద ఉన్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ద్వారా ఆయన దర్శకునిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. అయితే.. కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకు కథ అందించిన రచయితగా వక్కంతం వంశీ ఆల్రెడీ పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
భద్రతకు రూ.25 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో శాంతిభద్రతల వ్యవస్థను మెరుగుపరచడానికి.. పోలీసు బలగాలను ఆధునీకరించడానికి.. ఉగ్రవాదంపై సమర్థవంతంగా పోరాటానికి ఉద్దేశించిన భారీ అంతర్గత భద్రతా పథకానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.25 వేల కోట్ల విలువైన ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్) సమావేశం బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగింది. పోలీసు బలగాలను ఆధునీకరించేందుకుగానూ ‘మాడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్(ఎంపీఎఫ్)’పేరిట 2017–18 నుంచి 2019–20 వరకు మూడేళ్ల పాటు రూ.25,060 కోట్ల మేర వెచ్చించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.18,636 కోట్లు కాగా.. రాష్ట్రాల వాటా రూ.6,424 కోట్లుగా ఉంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు తెలిపారు. ఇంతకుముందు ఎన్నడూ చేపట్టని అతిపెద్ద పథకం ఇదని చెప్పారు. ఎంపీఎఫ్ పథకం కింద దేశ అంతర్గత భద్రతకు ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. అలాగే శాంతిభద్రతలు, మహిళల భద్రత, అత్యాధునిక ఆయుధాల లభ్యత, పోలీసు బలగాల రవాణా, సరుకు రవాణా, హెలికాప్టర్లను అందుబాటులో ఉంచడం, పోలీసు వైర్లెస్ వ్యవస్థ, జాతీయ శాటిలైట్ నెట్‌వర్క్‌ను ఆధునీకరించడం, క్రైం, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టమ్స్, ఈ–జైళ్లు మొదలైన వాటిని కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఎంపీఎఫ్ పథకంలో భాగంగా అంతర్గత భద్రత కోసం జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రూ.10,132 కోట్లు వ్యయం చేయనున్నట్టు రాజ్‌నాథ్ చెప్పారు. 35 నక్సల్ ప్రభావిత జిల్లాల్లోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.3వేల కోట్లను వ్యయం చేస్తామన్నారు. పోలీసు మౌలిక వసతుల కల్పన, శిక్షణ సంస్థలు, దర్యాప్తు సదుపాయా ల నిమిత్తం రూ.100 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఎంపీఎఫ్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధునాతనమైన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని ఏర్పాటు చేస్తామని, జైపూర్ లోని సర్దార్ పటేల్ గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజమ్‌ను, అలాగే గాంధీనగర్‌లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని ఆధునీకరిస్తామని చెప్పారు. ఏఏఐ భూమి ఏపీ ప్రభుత్వానికి రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 10.25 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంతే విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమిని ఇస్తుంది. రాజమండ్రి విమానాశ్రయం చుట్టూ గల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ఈ భూమిని వినియోగిస్తారు. ప్రభుత్వ వైద్యుల ‘రిటైర్మెంట్’ పెంపు కేంద్ర ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల్లో పనిచేస్తున్న వారికీ ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం కేంద్ర వైద్యుల రిటైర్మెం ట్ వయసు కొన్ని విభాగాల్లో 60 ఏళ్లుగా, మరికొన్నింటిలో 62 ఏళ్లుగా ఉంది. దీంతో వివిధ విభాగాల్లోని 1,445 మంది వైద్యులకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు మొబైల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. -
ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా
బదిలీ మార్గదర్శకాలు విడుదల వెబ్ కౌన్సెలింగ్, పాయింట్ల కేటాయింపుపై అసంతృప్తి ఆందోళనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు రాయవరం (మండపేట): వేసవి సెలవుల్లో మిన్నకుండిన విద్యాశాఖ మరో పది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయ బదిలీలుంటాయా? ఉండవా? అనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో విడుదలైన బదిలీ ఉత్తర్వులు అందరినీ అయోమయంలో పడేశాయి. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తూ వస్తున్న వెబ్ కౌన్సెలింగ్, ప్రతిభ ఆధారిత పాయింట్ల విధానాన్ని అమలు చేయడంపై ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెబ్ కౌన్సిలింగ్కే విద్యాశాఖ మొగ్గు.. ఉపా«ధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నా విద్యాశాఖ వెబ్ కౌన్సెలింగ్ విధానాన్నే అమలు చేస్తోంది. ఆ¯ŒSలై¯ŒS ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. అయితే ఇది ఎంత వరకు అమలవుతుందన్నది వేచి చూడాల్సిందే. ప్రధానోపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఐదేళ్లు నిండితే తప్పనిసరిగా బదిలీ కావాలి. ఇతర ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు ఒకే పాఠశాలలో పనిచేసి ఉంటే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. రెండేళ్లు సర్వీసు నిండిన వారంతా బదిలీకి అర్హులు. ప్రతిభ ఆధారిత పాయింట్లు కూడా అమలులో ఉంటాయి. బదిలీల విషయంలో సర్వీస్ కటాఫ్ తేదీని ఈ ఏడాది ఏప్రిల్ 30 పరిగణనలోకి తీసుకుంటారు. దీనివల్ల ఎక్కువ మంది బదిలీ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రాధాన్య పాయింట్లు కేటాయింపు ఇలా.. ఉపాధ్యాయుల బదిలీల్లో కొన్ని కేటగిరీలకు ప్రాధాన్య మార్కులు కేటాయిస్తారు. గుర్తింపు పొందిన యూనియన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఐదు పాయింట్లు లభిస్తాయి. అవివాహిత మహిళలకు గతంలో 10 పాయింట్లు కేటాయించగా వాటిని ఐదుకు కుదించారు. స్పౌజ్ కేటగిరీ (భార్యాభర్తలు ఉద్యోగులైతే)లో పాయింట్లను 10 నుంచి నాలుగుకు తగ్గించారు. రేషనలైజేష¯ŒS కింద పోస్టు కోల్పోయిన ఉపాధ్యాయులకు ఒక పాయింట్ అదనంగా లభిస్తుంది. 4వ కేటగిరీ పరిధిలోని గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఏడాదికి రెండు పాయింట్లు చొప్పున కేటాయిస్తారు. కేటగిరి–3కి ఒక పాయింట్, కేటగిరి–2కు అర్ధ పాయింట్ కేటాయిస్తారు. కేటగిరి–1కు ఒక్క పాయింట్ లభించదు. గరిష్ఠంగా 8ఏళ్ల సర్వీస్‌కు పాయింట్లు కేటాయిస్తారు. అంతకన్నా ఎక్కువ ఉన్నా పరిగణలోనికి తీసుకోరు. టీచర్ మొత్తం సర్వీస్‌కు ఏడాదికి 0.4 పాయింట్లు చొప్పున గరిష్ఠంగా 12 పాయింట్లు కేటాయిస్తారు. దీంతో 30 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు అన్యాయానికి గురవుతారు. ఎ¯ŒSసీసీ/స్కౌట్ ఉన్న స్కూల్ హెచ్ఎం, టీచర్‌కు రెండు పాయింట్లు ఇస్తారు. పాఠశాల ఎ¯ŒSరోల్‌మెంట్‌ను రెండేళ్లలో బాగా పెంచిన వారికి ఆరు పాయింట్లు లభిస్తాయి. ఇది ప్రధానోపాధ్యాయులతోపాటు అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు వర్తిస్తుంది. పాఠశాలలో చదివిన పిల్లలు ఎక్కడా బడి మానివేయకుండా వంద శాతంపై తరగతులకు వెళ్లి ఉంటే ఐదు పాయింట్లు లభిస్తాయి. 50–80 శాతం విద్యార్థులకు బీ–2, ఆపైన గ్రేడ్ వస్తే 4 మార్కులు, 25–50 శాతం విద్యార్థులకు బీ–2, ఆపై గ్రేడ్ వస్తే 2 పాయింట్లు కేటాయిస్తారు. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి 90 శాతం రోజుల్లో గడువులోగా ఆ¯ŒSలై¯ŒSలో ఇండెంట్ వివరాలు పంపితే 2 పాయింట్లు, 80–89.99 శాతం రోజుల్లో పంపిస్తే ఒక పాయింట్ కేటాయిస్తారు. 10వ తరగతికి సంబంధించి ఉత్తీర్ణత శాతం 95 నుంచి 100 శాతం వరకు ఉంటే గరిష్ఠంగా ఆరు పాయింట్లు లభిస్తాయి. ఇది ప్రధానోపాధ్యాయుడికి మాత్రమే వర్తిస్తుంది. వ్యక్తిగత ప్రతిభ ఆధారిత పాయింట్లు.. ‘జాతీయ అవార్డుకు 6, రాష్ట్ర అవార్డుకు 5 పాయింట్లు ఇస్తారు. తరగతిలో 80 శాతం మంది విద్యార్థులు బీ–2, ఆపై గ్రేడ్ సాధించి ఉంటే ఆయా సబ్జెక్టు టీచర్‌కు 6 పాయింట్లు, 50–80 శాతం మంది బీ–2, ఆపై గ్రేడ్ సాధించి ఉంటే 4 పాయింట్లు, 25–50 శాతం మంది బీ–2, ఆపై గ్రేడ్ సాధిస్తే 2 పాయింట్లు కేటాయిస్తారు. వికలాంగులు, వితంతువులు, చట్టబద్దంగా విడాకులు తీసుకున్న మహిళా టీచర్లు, కేన్సర్ బాధితులు, గుండె శస్త్ర చికిత్స బాధితులు, న్యూరో సర్జరీ, బో¯ŒS టీబీ, కిడ్నీ మార్పు, ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మానసిక వికలాంగులుంటే, పిల్లలకు గుండెల్లో రంధ్రాలుంటే, తలసేమియా, హీమోఫీలియోతో బాధపడే పిల్లలుంటే, స్పౌజ్ ఆర్మీలో పనిచేస్తుంటే వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. అభ్యంతరాలివీ.. విద్యార్థుల ప్రవేశాలు 10–20 శాతం పెరిగితే ఆరు పాయింట్లు కేటాయించడం అన్యాయమని వాపోతున్నారు. స్పౌజ్‌కు గతంలో 10 పాయింట్లు కేటాయిస్తే ఈ సారి 4 పాయింట్లు, రేషనలైజేష¯ŒS ద్వారా ఎఫెక్ట్ అయ్యే టీచర్‌కు గతేడాది 10 పాయింట్లు కేటాయిస్తే ఇప్పుడు ఒక పాయింట్ కేటాయించడం పట్ల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. -
హంద్రీ-నీవా వెడల్పునకు గ్రీన్‌సిగ్నల్
అనంతపురం సెంట్రల్ : హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం మొదటి దశ కాలువ వెడల్పునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు జిల్లా మల్యాల (1500 కిలో మీటర్లు) నుంచి జీడిపల్లి జలాశయం (216 కిలో మీటరు) వరకూ కాలువ వెడల్పునకు రూ. 1272.41 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ప్రతిపాదనలు పంపగా రూ. 1030 కోట్లుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి దశలో 31 ప్యాకేజీ వద్ద 145 కిలో మీటరు అనంతపురం జిల్లా ప్రారంభవుతుంది. కసాపురానికి సమీపంలోని బుగ్గసంగాల నుంచి జిల్లా మొదలవుతుంది. 134 కిలో మీటర్ల నుంచి 155 వరకూ రూ. 86.53 కోట్లు, 155 నుంచి 176 కిలో మీటరు వరకూ రూ.73.61 కోట్లు, 176 నుంచి 192 కిలో మీటర్లు వరకూ రూ. 54.23 కోట్లు, 192 నుంచి 210 కిలో మీటరు వరకూ రూ. 68 కోట్లు, 210 నుంచి రూ. 216 కిలో మీటరు వరకూ రూ. 34.45 కోట్లు కాలువ వెడల్పు చేసేందుకు నిధులు మంజూరు చేశారు. -
‘కాళేశ్వరం’ టెండర్లకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: గోదావరి నదీ జలాల్లో నీటి వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఐదు ప్రధాన రిజర్వాయర్ల నిర్మాణ పనులకు నీటిపారుదలశాఖ త్వరలోనే టెండర్లు పిలవనుంది. ఇందుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఆ దిశగా సమాయత్తమవుతున్నారు. వారంలో టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. రూ.10,876 కోట్లతో చేపట్టే ఈ ఐదు రిజర్వాయర్లలో మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీలతో చేపట్టనుండగా దానికి రూ.7,249.52 కోట్లకు ఇప్పటికే ఆ శాఖ ఓకే చేసింది. అలాగే రంగనాయక సాగర్ రూ. 496.50 కోట్లు, కొండపోచమ్మ రూ.519.70 కోట్లు, గంధమల రూ.860.25 కోట్లు, బస్వాపూర్ రూ.1,751 కోట్లకు అనుమతులు వచ్చాయి. వీటికి గత నెల 8నే పరిపాలనా అనుమతులు వచ్చినా సాంకేతిక అనుమతులు రాలేదు. చదవండి: వచ్చే ఏడాది ఖరీఫ్‌కు కాళేశ్వరం దీనికితోడు కాళేశ్వరం పర్యావరణ, అటవీ అనుమతుల అంశంలో అధికారులు బిజీగా ఉండటంతో టెండర్ల అంశం మరుగునపడింది. అయితే శుక్రవారం సమీక్ష సందర్భంగా మల్లన్నసాగర్ వరకు వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేసి నీటిని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. -
క్రీడా పాఠశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
► విజయనగరం విజ్జి మైదానంలో రూ.50 కోట్లతో క్రీడా పాఠశాల ► గంట్యాడ మండలం తాడిపూడిలో జల క్రీడాశాల ఏర్పాటు ► జూన్ నుంచి 350 మంది క్రీడాకారులకు తరగతులు ప్రారంభం విజయనగరం మున్సిపాలిటీ: విద్యకు నిలయమైన విజయనగరం జిల్లాలో క్రీడా పాఠశాల, జల క్రీడా శాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పాలనాపరమైన ఆమోదం లభించగా... వాటి ఏర్పాటుపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రీజనల్ క్రీడా పాఠశాలను విజయనగరం పట్టణ శివారులోని విజ్జిస్టేడియంలోను, జల క్రీడాశాలను గంట్యాడ మండల తాటిపూడి కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రూ.50 కోట్లతో క్రీడా పాఠశాల.. విజ్జి స్టేడియం వేదికగా రూ.50 కోట్లతో క్రీడా పాఠశాల నిర్మాణానికి ఆదేశాలు వచ్చాయి. అందులో రూ.20 కోట్ల నిధుల విడుదలకు పాలనాపరమైన ఆమోదం లభించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. క్రీడాపాఠశాల ఏర్పాటు ప్రాజెక్టును గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ విభాగం రూపకల్పన చేస్తోంది. ఆ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా సదరు అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు విజ్జిలో పర్యటించనున్నారు. 4 నుంచి 10వ తరగతి చదువుతున్న మొత్తం 350 మంది విద్యార్థులకు ఈ పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. తరగతులను వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌నెల) లోనే ప్రారంభించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తరగతుల నిర్వహణకు ఓ భవనం.... వారు వసతి ఉండేందుకు మరో భవనంను ముందస్తుగా విజ్జి స్టేడియం సమీపంలో అద్దెకు తీసుకునే యోచనలో ఉన్నారు. తాటిపూడి వద్ద జల క్రీడాశాల.. జిల్లా కేంద్రానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలోని గంట్యాడ మండలం తాడిపూడి వద్ద జల క్రీడా శాల ఏర్పాటుకు పాలనాపరమైన ఆమోదం లభించింది. తాటిపూడి జలశయాన్ని దీనికోసం వినియోగించుకోనున్నట్టు సమాచారం. శిక్షణ పొందగోరే విద్యార్థులకు వసతి, తరగతులు కోసం భవనాల నిర్మాణాల కోసం తొలివిడతగా రూ.3కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇదే విషయాన్ని డీఎస్డీఓ ఎన్.సూర్యారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా... రూ.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన క్రీడా పాఠశాల కోసం తొలివిడతగా రూ.20 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. పాఠశాలలో 350 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
హమ్మయ్యా..!
ఒంగోలు టూటౌన్ : ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ఇంటర్వూ్యలకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ అనుమతితో ఈ నెల 24, 25వ తేదీల్లో అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒంగోలులోని టెక్నాలాజీ అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ (టీటీడీసీ)లో ఇంటర్వూ్యలు నిర్వహించనున్నారు. 24వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఖాధీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (కేవీఐబీ) దరఖాస్తుదారులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. 25న జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహిస్తామని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.ఆనంద్‌కుమార్ తెలిపారు. డీఐసీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న రూరల్ అభ్యర్థులకు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్బన్ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ అభ్యర్థులను ఇంటర్వూ్య చేస్తుంది. ఫలించిన ఎదురు చూపులు పీఎంఈజీపీ రుణాల కోసం రెండేళ్లుగా ఇంటర్వూ్యలు నిర్వహించలేదు. బ్యాంకు లింకేజీ రుణాలు కావడంతో నిరుద్యోగులకు రుణాలు అందని ద్రాక్షే అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పరిశ్రమలతో ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులు జిల్లాలో లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పేదరికంతో చదువులు మధ్యలో మానేసిన వారే. ఇటు ఉన్నత చదువులు చదవలేక అటు వ్యవసాయ భూములు లేక కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది పీఎంఈజీపీ రుణాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. సిమెంట్ ఇటుకల తయారీ, కారం మిల్లులు, డిటర్జంట్ పౌడర్ల తయారీ, గ్రానైట్ ఫాలిషింగ్, ఐస్ క్రీమ్ తయారీ, మహిళలు ఇంటి వద్ద ఉండి తయారు చేసే పలు కుటీర పరిశ్రమలకు సంబంధించిన యూనిట్లకు పీఎంఈజీపీ కింద బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇస్తారు. యూనిట్ విలువ ఆధారంగా రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రుణాలు ఇస్తారు. కనీసం 8వ తరగతి వరకు చదివిన వారు రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల వారికి 15 శాతం, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు 25 శాతం వరకు యూనిట్ విలువలో రాయితీ ఇస్తారు. 15 ఏళ్లుగా ప్రభుత్వం లక్ష్యాలకు.. బ్యాంకులు మంజూరు చేసే రుణాలకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. దీంతో లక్ష్యాల్లో పురోగతి కనిపించకపోవడంతో పీఎంఈజీపీ రుణాలను ప్రభుత్వం ఏటా తగ్గిస్తూ వస్తోంది. దీనికి తోడు బ్యాంకు నుంచి లభించే రుణ సదుపాయం, సాంకేతిక సహకారం వంటి వాటిని ప్రభుత్వం గాలికొదిలేసింది. కేవలం లబ్ధిదారుల ఎంపికతోనే చేతులు దులుపుకోవడంతో పథకం నీరుగారింది. 2009 నుంచి కనీసం 132 యూనిట్ల వరకు లక్ష్యాలు ఇస్తున్న సర్కార్.. రానురానూ క్రమంగా 32 యూనిట్లకు కుదించింది. దీనికి తోడు రెండేళ్లుగా ఇంటర్వూ్యలు నిర్వహించిన పాపాన పోలేదు. దీంతో నిరుద్యోగుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి పీఎంఈజీపీ ఇంటర్వూ్యల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ఏడాది కనీసం 500 మంది నిరుద్యోగులకైనా పీఎంఈజీపీ రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిక్కీ జిల్లా కో ఆర్డినేటర్ భక్తవత్సలం డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా ఇంటర్వూ్యలు నిర్వహించక పోవడంతో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఆన్లైన్లో రుణాలకు దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గమనించి చిన్న పరిశ్రమలతోనైనా జీవితంలో స్థిరపడేందుకు తోడ్పాటునందించాల్సిన అవసరం ఉందంటున్నారు. అధికారులు ఆ దశగా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికే.. 01–07–2016 నుంచి 2017 జనవరి 31లోపు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుదారులకు మాత్రమే ప్రస్తుతం ఇంటర్వూ్యలకు కాల్ లెటర్లు పంపుతారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ,ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులు), ప్రత్యేక అర్హత సంబంధిత పత్రం (వికలాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు), రూరల్ ఏరియా సర్టిఫికెట్, పాపులేషన్ సర్టిఫికెట్, అభ్యర్థి స్థాపించబోయే ప్రాజెక్టు నివేదిక, విద్యార్హత పత్రాలు, ఆన్లైన్ దరఖాస్తు కాపీ, పాస్‌పోర్టు సైజు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్‌లను వెంట తెచ్చుకోవాలని జీఎం సూచించారు. -
శ్రమ దోపిడీకి గ్రీన్ సిగ్నల్
రాయదుర్గం మున్సిపాలిటీలో 279 జీఓ అమలుకు ఆమోదం ఔట్సోర్సింగ్ స్థానంలో వర్క్డ్ సోర్స్ కార్మికులను వెంటాడుతున్న బానిసత్వ భయం రాయదుర్గంటౌన్ : మునిసిపల్ కార్మికు లు ఒళ్లు వంచి పని చేయడం లేదనే సా కుతో పనుల నిర్వహణను ప్రైవేటు సం స్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధమైంది. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వర్క్డ్ సోర్సింగ్ విధానంతో పని చేయించాలని జీఓ 279 విడుదల చేసింది. ఈ జీవో శ్రమదోపిడీకి లైసెన్సు అని కార్మికులు మండిపడుతున్నారు. తా ము కాంట్రాక్టర్ల కింద బానిసలు గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నా రు. పారిశుద్ధ్యం మెరుగు పేరిట యూజర్ చార్జీల పేరుతో ప్రజల పై భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సర్వత్రా అం సంతృప్తి వ్యక్తమవుతోంది. చాలా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే రాయదుర్గం లో మాత్రం 279 జీఓ అమలుకు ఆమో దం లభించింది. ఇప్పటికే సాంకేతికపరమైన అనుమతి కూడా మంజూరైంది. కాంట్రాక్ట్ కార్మికులు 1,418 మంది జిల్లా వ్యాప్తంగా అనంతపురం కార్పొరేష¯ŒSతోపాటు 11 మునిసిపాలిటీల్లో మొత్తం 1,418 మంది కాంట్రాక్ట్ కార్మికులు పబ్లిక్ హెల్త్ సెక్ష¯ŒS కింద పనిచేస్తున్నారు. రెగ్యులర్ కార్మికులతో పోలిస్తే దాదాపు సగం మంది కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నారు. కొత్త ఉద్యోగాల నియామకం లేకపోగా చనిపోయిన వారి కార్మికుల పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగుల వారసుల్లో చాలామంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కిందనే కొనసాగుతున్నారు. అనంతపురం కార్పొరేష¯ŒSలో 401 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండగా, ధర్మవరంలో 140, గుంతకల్లులో 120, గుత్తిలో 80, పామిడిలో 37, తాడిపత్రిలో 120, హిందూపురంలో 220, మడకశిరలో 50, కళ్యాణదుర్గంలో 60, పుట్టపర్తిలో 80, రాయదుర్గంలో 60, కదిరిలో 110 మంది ఉన్నారు. కార్మికులకు కీడు చేస్తుంది జీఓ 279 అమలు వల్ల కాంట్రాక్ట్ కార్మికులు పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కోల్పో యే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్ల చెప్పుచేత ల్లో నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కార్మికులకు కీడు చేసే ఈ జీవోను ప్రభు త్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – వెంకటేశులు, కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షుడు, రాయదుర్గం మునిసిపాలిటీ శ్రమ దోపిడీనే జీఓ అమలు వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. వారి శ్ర మను కాంట్రాక్టర్లు దోచుకుంటారు. ఈ జీవోను అమలు పరచ డం ద్వారా ప్రధానంగా స్థానిక సంస్థల అధికారాలను బలహీన పరచి ప్రజలపై యూజర్ చార్జీల భారం మోపడానికి అవకాశం ఉంది. – వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
ప్రాజెక్టుల రీడిజైన్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
-
ఎయిడెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వ మెమో జారీ మచిలీపట్నం: ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్ ఈ నెల 4వ తేదీన మెమో నం.18,836ను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో 2015 జనవరి 6వ తేదీ, 2015 సెప్టెంబర్ 14వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2004 అక్టోబర్ 20వ తేదీ నుంచి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టుల నియామకాన్ని చేపట్టవచ్చని పేర్కొన్నారు. అయితే దీని అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 12 సంవత్సరాలుగా ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల నియామకంపై నిషేధం ఉంది. ఈ మధ్యకాలంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయటంతో ఎయిడెడ్ పాఠశాలల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన నియామకాలు చేపడతారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏవో, ఏఈవో, హెచ్‌వో పోస్టుల భర్తీకి
హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీకి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాధికారులు (ఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈ వో), ఉద్యానవన అధికారుల (హెచ్‌వో) పోస్టుల భర్తీకి ఉమ్మడి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ సమయంలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్‌ల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. వ్యవసాయాధి కారులు, విస్తరణాధికారులు, ఉద్యానవన అధికారుల పోస్టుల భర్తీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, రాత పరీక్షకు అనుమతినిస్తూ ఫలితాలను వెల్లడించవద్దని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. తరువాత వీటిపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే మిగిలిన అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఆర్డీఓల బదిలీ
- కర్నూలుకు మల్లికార్జున - నంద్యాలకు రాంసుందర్‌రెడ్డి నియాకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్): ఎట్టకేలకు ఆర్డీఓల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు వచ్చాయి. కర్నూలు ఆర్డీఓగా మల్లికార్జున, నంద్యాల ఆర్డీఓగా రాంసుందర్‌రెడ్డిలను నియమించారు. కర్నూలు జిల్లాకు చెందిన మల్లికార్జునను ఇదే జిల్లాలో ఆర్డీఓగా నియమించడం విశేషం. గతంలోఇతను కర్నూలు, కోడుమూరు, గూడూరు, సి. బెళగల్, గోనెగండ్ల, తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం హంద్రీనీవా సుజల స్రవంతి యూనిట్–4లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నారు. కర్నూలు ఆర్డీఓగా పనిచేస్తున్న రఘుబాబును కాకినాడ బదిలీ చేశారు. ఈయన మూడేళ్ల పాటు ఇక్కడ పనిచేశారు. నంద్యాల ఆర్డీఓగా రాంసుందర్‌రెడ్డి నియమితులయ్యారు.ఇతను గతంలో ఆదోని ఆర్డీఓగా దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ ఈడీగా పనిచేస్తున్నారు. ఇంతవరకు నంద్యాల ఆర్డీఓగా పనిచేసిన సుధాకర్‌రెడ్డి హంద్రీనీవా సుజల శ్రవంతి యూనిట్–4 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతోంది. తుది ఓటర్ల జాబితాను జనవరి 16న ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా సవరణకు ఆటంకం లేకపోతే వీరిని రిలీవ్ చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు, నంద్యాల ఆర్డీఓలు రిలీవ్ కావడం, కొత్త ఆర్డీఓలు బాధ్యతలు స్వీకరించడం జిల్లా కలెక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
గే పెళ్లిళ్లకు తైవాన్ గ్రీన్ సిగ్నల్
తైపీ: ప్రపంచంలో గే (స్వలింగ) పెళ్లిళ్లు నానాటికి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. తైవాన్ ప్రజలు కూడా ఇప్పుడు అటువైపే అడుగులు వేస్తున్నారు. దేశ రాజధాని తైపీ, కవోసియుంగ్ నగరాల్లో ఇప్పటికే అక్కడక్కడ గే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ఇంకా వాటికి అధికారికంగా గుర్తింపు రావాల్సి ఉంది. గే పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును ఇంకా ఆమోదించాల్సి ఉంది. వచ్చే జనవరిలో పార్లమెంట్లో ఈ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం 113 మంది సభ్యుల్లో 57 మంది సభ్యులు ఆమోదిస్తే సరిపోతుంది. పాలకపక్ష డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీ, ఇతర పార్టీలు మద్దతిస్తున్నందున బిల్లు ఆమోదంపొందే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. బిల్లు చట్లరూపం దాలిస్తే ఆసియాలో గే పెళ్లిళ్లను ఆమోదించిన తొలి దేశం తైవాన్ అవుతుంది. వాస్తవానికి గే మ్యారేజెస్‌ను అనుమతిచ్చే బిల్లును దేశ పార్లమెంట్లో 2005లోనే ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అది పెండింగ్‌లో ఉంటూ వచ్చింది. 2013లో దానికి మళ్లీ కదలిక రావడంతో పార్లమెంట్ కమిటీ దాన్ని సమీక్షించింది. మళ్లీ అది పెండింగ్‌లో పడిపోయింది. గత మే నెలలో దేశాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన త్సాయ్ ఇంగ్ వెన్, గే పెళ్లిళ్ల చట్టానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మళ్లీ బిల్లుకు కదలిక వచ్చింది. -
కొత్త బార్లకు గ్రీన్ సిగ్నల్
నల్లగొండ : ఎక్సైజ్ శాఖ కొత్తబార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనాభా ప్రాతిపదిక న ఇప్పుడున్న వాటికి అధనంగా కొత్త బార్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం లభించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 13 వేల జనాభాకు, పట్టణాలు, నగరపంచాయతీల్లో 25 వేల జనాభాకు ఒక బారు చొప్పున ఏర్పాటు చేసేలా మార్గదర్శకాలు రూపొం దించారు. దీని ప్రకారం మూడు జిల్లాల్లో కలిపి కొత్తగా 8 బార్లు మంజూరు చేశారు. నల్లగొండ మున్సిపాలిటీలో నాలుగు, దేవరకొండ నగరపంచాయతీలో రెండు, హుజూర్‌నగర్‌లో రెండు బార్లకు అనుమతి ఇచ్చారు. మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరిలో జనాభాకు మించి ఎక్కువగానే బార్లు ఉన్నాయి. కోదాడ మున్సిపాలిటీలో గతంలో మంజూరు చేసిన మూడు బార్లకు ఉన్న అడ్డం కులు తొలగిపోయాయి. త్వరలో కోదాడ బార్లకు సంబంధించి ఎక్సైజ్ శాఖ డ్రా ద్వారా లెసైన్స్ దారులను ఎంపిక చేయనుంది. కొత్తగా మంజూరైన ఏడు బార్లకు మాత్రం ఎక్సైజ్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
ముందస్తు బడ్జెట్‌కు ఈసీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ను ముందస్తుగా ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. 2017 తొలినాళ్లలో ఐదు రాష్ట్రాల (పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా) శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ముందస్తు బడ్జెట్‌కు ఈసీ అడ్డు చెబుతుందేమోనన్న ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ ఈసీని వివరణ కోరింది. ముందస్తు బడ్జెట్‌కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రిటిష్ కాలం నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివ రి పని దినాన ప్రవేశపెట్టడం ఆనవాయితీ. దీనివల్ల బడ్జెట్ ఆమోదం పొంది అమలవ్వడానికి జూన్ దాకా సమయం పట్టేది. ఈ ఏడాది నుంచి బడ్జెట్‌ను నెల ముందే ప్రవేశపెట్టి, చట్టపరమైన ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్ 1 నుంచే బడ్జెట్‌ను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం బుధ లేదా గురువారాల్లో సమావేశమై, బడ్జెట్ తేదీని నిర్ణయించే అవకాశం ఉంది. -
నుడాకు ఓకే
రెండేళ్ల నిరీక్షణ తరువాత క్యాబినేట్లో ఆమోదముద్ర చిత్తూరు జిల్లాకు చెందిన రెండింటితో కలిపి 21 మండలాలు పదవుల కోసం పైరవీలు ప్రారంభించిన టీడీపీ నేతలు నెల్లూరు సిటీ: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అ«ధారిటీ(నుడా) మంగళవారం క్యాబినెట్ భేటీలో ఆమోద ముద్ర పొందింది. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న అంశానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. 2014 నవంబర్‌లో ఐఏఎస్ చక్రధర్‌బాబు, టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు నుడా ప్రతిపాదనలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. నెల్లూరు జిల్లాలోని 33 మండలాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే చాలాకాలం పాటు నుడా అంశంలో కదలిక లేదు. మఽళ్లీ ఇటీవల నుడా వైపు అడుగులు పడ్డాయి. రెండు సార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొదటగా 33 మండలాలతో కూడిన ప్రతిపాదన పంపగా, రెండవసారి 14 మండలాలతో కూడిన ప్రతిపాదనలు పంపారు. అయితే కొన్ని సవరణలు చేస్తూ మంగళవారం 21 మండలాలతో కూడిన నుడాకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నుడాలో కలిపిన ప్రాంతాలు ఇవే.. నెల్లూరు కార్పొరేషన్, గూడూరు, కావలి, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు, నాయుడుపేట నగర పంచాయితీలను నుడాలో కలిపారు. వాటితో పాటు కావలి రూరల్‌లోని గౌరవరం, అనుమడుగు, రుద్రకోట గ్రామాలతో పాటు జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు, కోవూరు, టీపీగూడూరు, ముత్తుకూరులోని కొంత భాగం, వెంకటాచలం, మలుబోలు, చిల్లకూరు, ఓజిలి, దొరవారిసత్రం, తడ మండలాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలను నుడా జాబితాలో చేర్చారు. అయితే నుడాలో కలిపిన మండలాలు అన్నీ హైవేకు రెండువైపులా కలుపుకుంటూ వెళ్లారు. శ్రీసిటీకి చెందిన 7వేల ఎకరాలను మొత్తం నుడాలో కలిపారు. నుడాలో మొత్తం సుమారు 13లక్షల జనాభా, 1600 చదరపు కి.మీ విస్తీర్ణం ఉంది. నుడా ద్వారానే అనుమతులు ఇప్పటి వరకు భారీ పరిశ్రమలు, భవనాలు తదితర వాటికి అనుమతుల కోసం అమరావతికి వెళ్ళాల్సి వచ్చేది. అయితే నుడా ఏర్పడ్డంతో పరిశ్రమలు, భారీ భవనాలకు అనుమతులకు నుడా ద్వారానే ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నుడాకు భారీ ఆదాయం సమకూరుతుంది. నుడా ఆదాయాన్ని రోడ్లు, పార్క్‌లు, ఇతర అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంది. కార్పొరేషన్ పరిధిలోని భవన అనుమతులు కూడా నుడా ద్వారానే తీసుకోవాల్సి వస్తుంది. నుడా పదవుల కోసం అధికార పార్టీ నేతల పైరవీలు క్యాబినెట్లో మంగళవారం నుడాకు ఆమోద ముద్ర పడటంతో అధికార పార్టీ నేతలు పదవుల కోసం పైరవీలు మొదలెట్టారు. నుడాకు చైర్మన్, 20 మంది సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో నామినేటెడ్ చైర్మన్ పదవి కోసం నాయకులు పావులు కదుపుతున్నారు. అయితే మరికొంత మంది ఆశావహులు కూడా నుడా చైర్మన్ పదవి కోసం పోటీపడుతున్నారు. సభ్యుల పదవుల కోసం టీడీపీలోని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా, నుడా వైస్ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. -
పోలవరం ప్రాజెక్ట్‌కు సమాధి
-
‘పాలమూరు’ మార్పులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకంలోని వివిధ ప్యాకేజీల్లో మార్పులకు నీటి పారుదల శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్యాకేజీ-1, ప్యాకేజీ-16లకు సంబంధించి కొత్త డిజైన్లు, ప్రాథమ్యాలకు తగినట్లుగా మార్పులకు ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈ మార్పులతో రూ.100 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశముంది. పాలమూరు ప్రాజెక్టులోని ఒకటో ప్యాకేజీలో స్టేజ్-1 పంపింగ్ స్టేషన్‌ను తొలుత భూ ఉపరితలంపై నిర్మించాలని నిర్ణయించారు. అయితే దీని నిర్మాణ ప్రాంతం అటవీ భూమి పరిధిలోకి వస్తుండడంతో.. అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ప్రాజెక్టు నిర్మాణం జాప్యమయ్యే అవకాశం ఉండడంతో పంపింగ్ స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని మార్చాలని భావించారు. నిర్మాణ స్థలం మార్పు, పెరిగే వ్యయం, ఇతర సానుకూల, ప్రతికూలతలను అంచనా వేసేందుకు నీటి పారుదల శాఖ ఇంజనీర్లతో ప్రభుత్వం కమిటీని వేసింది. పంప్‌హౌజ్‌ను అదే స్థలంలో భూగర్భంలో నిర్మించాలని.. దీనిద్వారా అటవీ, భూసేకరణ సమస్య తప్పుతుందని పేర్కొంటూ ఆ కమిటీ తమ నివేదిక సమర్పించింది. కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం)తో ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఎన్ఐఆర్ఎం కూడా కూడా ఓకే చెప్పడంతో భూగర్భ పంప్‌హౌజ్ నిర్మించేందుకు నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి కమిటీ మొగ్గు చూపింది. ఈ మార్పు కారణంగా ప్రాజెక్టుపై రూ.50 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశముంది. ప్యాకేజీ-16 లోనూ..: ఇక రూ.3,250 కోట్ల అంచనాతో చేపట్టిన ప్యాకేజీ-16లో తొలుత ఓపెన్ చానల్, టన్నెల్లను ప్రతిపాదిస్తూ కాల్వల నిర్మాణానికి డిజైన్ రూపొందించారు. ఇందులో భూసేకరణ, రైల్వే క్రాసింగులు వంటి సమస్యలు నెలకొన్నాయి. దీంతో డిజైన్ మార్చాలని నిర్ణయించి అధ్యయనం చేయించారు. ఈ మేరకు ఓపెన్ చానల్ కాకుండా మొత్తంగా టన్నెల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మార్పులతో ప్రభుత్వంపై రూ.80 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. -
కురుకుంట పీహెచ్సీ ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్
అనంతపురం సిటీ : అనంతపురం రూరల్ పరిధిలోని కురుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరో నాలుగు రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు డీఎంహెచ్ఓ వెంటకరమణ బుధవారం తెలిపారు. చాలా రోజుల క్రితమే ఈ కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ అనివార్యకారణాల వాయిదా పడుతూ వస్తోందన్నారు. ఈ పీహెచ్సీ కోసం సిబ్బంది నియామకాలు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మెత్తం 7 పీహెచ్‌సీలను కొత్తగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. -
‘ధర్మకర్తల’ నియామకానికి నోటిఫికేషన్
ఐదేళ్ల తర్వాత దేవాలయాల పాలకమండళ్లకు మోక్షం తాండూరు: నామినేటెడ్ పదవుల కోసం ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న టీఆర్ఎస్ నేతలకు ఇది తీపి కబురు. దేవాలయాలకు కొత్త పాలకమండళ్ల ఏర్పాటుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎట్టకేలకు ఐదేళ్ల తరువాత దేవాలయాల పాలక మండళ్లకు మోక్షం కలిగింది. ఆయా దేవాలయాల ధర్మకర్తల నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎన్.శివశంకర్ సోమవారం నోటీఫికేషన్ జారీ చేశారు. ఈనేపథ్యంలో ఇప్పటికే నామిటెడ్ పదవుల రేసులో ఉన్న గులాబీ శ్రేణులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. తాండూరు నియోజకవర్గంలో శ్రీభావిగి భద్రేశ్వర్, శ్రీపోట్లీ మహారాజ్, శ్రీకాళికాదేవి, శ్రీనగరేశ్వర(తాండూరు పట్టణం), శ్రీజుంటుపల్లి రామస్వామి దేవాలయం(యాలాల మండలం), కోత్లాపూర్ శ్రీరేణుకా ఎల్లమ్మ(తాండూరు మండలం) దేవాలయాల ధర్మకర్తల నియామకం కోసం కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ధర్మకర్తలుగా నియామకం కోసం ఆసక్తి ఉన్నవారు నోటిఫికేషన్ జారీ అయిన 20 రోజుల్లోపు కమిషనర్, సంయుక్త కమిషనర్లకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. -
నెరవేరనున్న దశాబ్దాల కల
హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేయడానికి ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్ మండలాలను హన్మకొండ జిల్లాలోకి చేర్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో దశాబ్దాల కల తొందరలోనే నెరవేరనుంది. - హుజూరాబాద్ హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఓ ప్రత్యేకత ఉంది. 2014 ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టులో హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోనే తాత్కాలికంగా అప్పటి జాయింట్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ చేతుల మీదుగా రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రస్తుత కరీంనగర్ ఆర్డీఓ చంద్రశేఖర్‌ను ఇన్చార్జి ఆర్డీఓగా నియమించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, సైదాపూర్, మానకొండూర్ మండలంలోని శంకరపట్నం మండలాలను హుజూరాబాద్ ఆర్డీఓ పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే అంతకుముందే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి కాంగ్రెస్ సర్కారు హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది. దీంతో హుజూరాబాద్‌లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ సర్కారు వచ్చాక హుస్నాబాద్‌ను పక్కన పెట్టి హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది. దీంతో హుస్నాబాద్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. కొందరు ఈ అంశంపై కోర్టుకు వెళ్లడంతో రెండు చోట్ల డివిజన్ల ఏర్పాటు నిలిచిపోయింది. ఇప్పుడు మోక్షం... హుజూరాబాద్ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కావాలని ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం పోరాటాలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రతి ఎన్నికల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తామంటూ నాయకులు హామీలిస్తూ దీనిని ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ డివిజన్ ప్రతిపాదనలను పక్కనపెడుతూ వచ్చాయి. తాజాగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ కల నెరవేరనుంది. హుజూరాబాద్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, జమ్మికుంట, కమలాపూర్ మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. సకాలంలో అందనున్న సేవలు... ప్రస్తుతం హుజూరాబాద్‌తోపాటు పైన పేర్కొన్న మండలాలు కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరగాలంటే ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో పనులు జరుగక నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఎట్టకేలకు హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో ఇకనుంచి సకాలంలో సేవలందనున్నాయి. భూ సమస్యల పరిష్కారం మెరుగుపడనుందని ప్రజలు భావిస్తున్నారు. -
తెలంగాణలో 27 జిల్లాలు ఖరారు
-
27 జిల్లాలు ఖరారు
• 58 డివిజన్లు, 533 మండలాలు • ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఆమోదం... • సిరిసిల్ల, సికింద్రాబాద్ ఔట్ • వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్గిరి జిల్లాలుగా రంగారెడ్డి విభజన • అనూహ్యంగా పెద్దపల్లి, హన్మకొండలకు చోటు • ఆదిలాబాద్‌లో నిర్మల్ జిల్లాకు గ్రీన్ సిగ్నల్ 1. ఆదిలాబాద్; 2. మంచిర్యాల; 3. నిర్మల్; 4. కరీంనగర్; 5. పెద్దపల్లి; 6. జగిత్యాల; 7. వరంగల్; 8. హన్మకొండ; 9. మహబూబాబాద్; 10. భూపాలపల్లి; 11. మెదక్; 12. సిద్దిపేట; 13. సంగారెడ్డి; 14. నిజామాబాద్; 15. కామారెడ్డి; 16. నల్లగొండ; 17. సూర్యాపేట; 18. యాదాద్రి; 19. మహబూబ్‌నగర్; 20. నాగర్‌కర్నూల్; 21. వనపర్తి; 22. ఖమ్మం; 23. కొత్తగూడెం; 24. హైదరాబాద్ (ఓల్డ్); 25. వికారాబాద్; 26. శంషాబాద్; 27. మల్కాజ్గిరి సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొత్తం 27 జిల్లాలుండేలా పునర్విభజన చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాల స్వరూపం, కొత్త జిల్లాల సంఖ్యపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. జిల్లాల విభజనపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీసీఎల్ఏ రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎంవో అధికారులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత 10 జిల్లాలతో పాటు రాష్ట్రంలో 17 కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ డివిజన్లను 44 నుంచి 58కు పెంచాలని నిర్ణయించారు. ఇప్పుడున్న 459 మండలాలను 533కు పెంచనున్నారు. ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై శనివారం అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తారు. అదే రోజు కేబినేట్లో చర్చించి ఆమోదించిన అనంతరం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత నెల రోజుల వ్యవధిలో ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను, ప్రజల విజ్ఞప్తులను సమీక్షలో సీఎం క్షుణ్నంగా పరిశీలించారు. సీసీఎల్ఏ, ట్రాక్ రూపొందించిన కొత్త జిల్లాల మ్యాప్‌లనూ పరిశీలించారు. మొదటగా రెవెన్యూ యంత్రాంగం, సీసీఎల్ఏ సిద్ధం చేసిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించాలా, జిల్లాల సంఖ్యను అంతకుమించి పెంచాల్సిన అవసరముందా అని లోతుగా చర్చించిన అనంతరం తుది ప్రతిపాదనలను ఖరారు చేశారు. కొత్త జిల్లాలకు జేసీలే కలెక్టర్లు.. ప్రస్తుత జిల్లాలకు పాత కలెక్టర్లను యథాతథంగా కొనసాగించాలని, కొత్తగా ఏర్పడే జిల్లాలకు జాయింట్ కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను కలెక్టర్లుగా నియమించాలని అన్ని శాఖల కార్యదర్శులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ తదితర పోస్టులన్నిటినీ యథాతథంగా కొనసాగించాలని కోరారు. సచివాలయంలో బుధవారం ఉదయం సీఎస్ రాజీవ్‌శర్మ అన్ని శాఖల కార్యదర్శులతో కొత్త జిల్లాల ముందస్తు సన్నాహాలపై సమావేశమయ్యారు. ఉద్యోగుల విభజన, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాలు, కార్యాలయాల వసతి తదితరాలను ప్రధానంగా చర్చించారు. శాఖలవారీగా అధికారులు, ఉద్యోగుల విభజన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచిం చారు. కొత్త జిల్లాలకు సిబ్బంది పంపిణీలో సీనియారిటీకి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజనకు అనుసరించాల్సిన విధానాన్నే కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల పంపిణీకి కూడా అవలంబించాలని, సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సచివాలయంలో సీఎస్ అధ్యర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మళ్లీ భేటీ జరగనుంది. దీనికి 14 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించారు. జంట జిల్లాలుగా హన్మకొండ, వరంగల్ వరంగల్ జిల్లాలో కొత్తగా హన్మకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనూహ్యంగా ఆఖరి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. జనగామను జిల్లా చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నందున హన్మకొండను జిల్లా చేసి జనగామను అందులో కొనసాగించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో వరంగల్ జిల్లా ఏకంగా నాలుగు ముక్కలవనుంది. జిల్లాలో ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న భూపాలపల్లి, మహబూబాబాద్లతో పాటు హన్మకొం డను తుది జాబితాలో చేర్చారు. రంగారెడ్డి మూడు ముక్కలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ముందునుంచీ పేచీ ఉం ది. ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు ఉపసంఘం ఎదుట భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటంతో వివాదం ముదిరింది. దాంతో తర్జనభర్జనల అనంతరం హైదరాబాద్ జిల్లాను యథాతథంగా కొనసాగించాలని, నగరం చుట్టూరా ఉన్న రంగారెడ్డిని మూడు జిల్లాలుగా చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్గిరి కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఖరారు చేశారు. గతంలోని సికింద్రాబాద్ ప్రతిపాదనను విరమించుకున్నారు. సిరిసిల్లకు బదులు పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో ముందు నుంచీ ప్రతి పాదనల్లో ఉన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు తుది ప్రతిపాదనల్లో చోటు దక్కలేదు. దానికి బదులుగా అనూహ్యంగా పెద్దపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే నిర్ణయం వెలువడింది. దీంతో కరీంనగర్లో జగి త్యాల, పెద్దపల్లి కొత్త జిల్లాల జాబితాలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచి ర్యాలతో పాటు కొత్తగా నిర్మల్ జిల్లా ప్రతి పాదనకు సీఎం ఓకే చెప్పారు. -
ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్
పరకాల : మండలంలోని కంఠాత్మకూరులో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం, విద్యుత్ సబ్ స్టేషన్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎత్తిపోతల నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ పథకానికి నిధులు మంజూరు కావడంతో శుక్రవారం జడ్పీటీసీ పాడి కల్పనాదేవి– ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నర్సక్కపల్లిలో ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్, స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కంఠాత్మకూరు మాటుపై ఎత్తిపోతల పథకం నిర్మాణంతో దమ్మయ్యకుంట, రెడ్డి చెరువు, పచ్చర్లకుంట, రాయపర్తిలోని ఊర చెరువు, మల్లక్కపేట చెరువులు నింపే అవకాశం ఉంటుందన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణంతో రైతులకు కరెంటు కష్టాలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంగ కొమురమ్మ, టీఆర్ఎస్ నాయకులు వరికెల దేవరావు, తిప్పార్తి సాంబశివరెడ్డి, బైరెడ్డి రాజిరెడ్డి, బాషబోయిన కొమురయ్య, పాడి వివేక్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్
నామినేషన్లు ప్రారంభం ఆగస్టు22 ఎన్నికలు సెప్టెంబర్ 13న జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపేందుకు యాజమాన్యం అంగీకరించింది. సెప్టెంబర్ 13న ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించింది. రామగుండం ప్రాజెక్టు పరిపాలనా భవనంలోని ఆడిటోరియంలో గురువారం జరిగిన సమావేశంలో ఎన్టీపీసీ అధికారులు, వివిధ యూనియన్ల ప్రతినిధుల సమావేశంలో ఎన్నికల తేదీని ఖరారు చేశారు. ప్రస్తుత గుర్తింపు యూనియన్ కాలపరిమితి గతేడాది సెప్టెంబర్‌తో ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో వివిధ యూనియన్లు అసంతృప్తి వ్యక్తంచేస్తూ కార్మికశాఖ అధికారులకు వినతిపత్రాలు అందించాయి. ఈ క్రమంలో కేంద్రకార్మిక శాఖ డెప్యూటీ ఛీప్ లేబర్‡కమిషనర్ ఎన్నికల విషయంలో స్థానిక యాజమాన్యానికి లేఖ రాసింది. ప్రాజెక్టులోని యూనియన్లు, యాజమాన్య ప్రతినిధులతో ఎన్నికలతేదీ ఖరారుపై సమావేశం నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీ సంస్థ విస్తరణ నేపథ్యంలో వీఐపీల తాకిడి ఉంటుందని, కొంత వ్యవధి కావాలని యాజమాన్యం కార్మికశాఖాధికారిని కోరింది. ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఎన్నికల సరళిని మార్పు చేసేందుకు కార్పొరేట్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని అన్ని ఎన్టీపీసీ సంస్థల్లో ఒకేసారి గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని భావించింది. మెజార్టీ సాధించిన యూనియన్‌తోపాటు రెండో స్థానంలో ఉన్న యూనియన్‌కు ప్రాతినిధ్యం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అపెక్స్ సమావేశంలో కొన్ని జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తంచేశాయి. జూన్ 19న ఎన్బీసీ సమావేశంలో యూనియన్ ఎన్నికలపై అన్ని జాతీయ సంఘాలు ఏకాభిప్రాయానికి వచ్చి సంతకాలు చేశాయి. దీంతో రామగుండం ఎన్టీపీసీ సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ కార్పొరేట్ సెంటర్ న్యూఢిల్లీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు సెప్టెంబర్ 13న ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో నామినేషన్ ఆగస్టు 22న, విత్‌డ్రా 24న, గుర్తుల కేటాయింపు 25న, సెప్టెంబర్13న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గుర్తింపు సంఘం ఎన్నికలలో విజయం సాధించిన నూతన యూనియన్ ప్రతినిధులు సెప్టెంబర్ 15,16 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న ఎన్భీసీ సమావేశంలో పాల్గొనున్నారు. పోటీలో ఏడు యూనియన్లు అర్హత కలిగిఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఏజీఎం హెచ్ఆర్, ఎన్నికల అధికారి రమేష్, వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల తేదీ ఖరారు కావడంతో ఎన్నికలలో పోటీ చేసేందుకు అన్ని యూనియన్లు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. -
ఔషధనగరికి రాచమార్గం
ఫార్మాసిటీ కోసం నాలుగులేన్ల రోడ్డు నిర్మాణం ఔషధనగరికి కార్యరూపం ఇచ్చేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఔషధ దిగ్గజ కంపెనీలకు ఎర్రతివాచీ పరిచేందుకు నాలుగు వరుసల రహదారులను అభివృద్ధి చేస్తోంది. ఫార్మా సంస్థలన్నింటినీ ఇక్కడకు తరలించాలనే కృతనిశ్చయంతో ఉన్న సర్కారు.. కందుకూరు మండలం ముచ్చర్ల ఫార్మాసిటీని కలుపుతూ రహదారులను అనుసంధానం చేస్తోంది. ఒకవైపు శ్రీశైలం జాతీయ రహదారి నుంచి నాగార్జున సాగర్ హైవే, ఔటర్‌రింగ్‌రోడ్డును కలుపుతూ మరో మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ఏడాది ఆఖరులోగా మోడల్ఫార్మాసిటీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో రోడ్లు భవనాలశాఖ రోడ్డు సర్వే పనులను యుద్ధప్రాతిపదికన చేస్తోంది. మొదటి విడతలో శ్రీశైలం రహదారి నుంచి మీర్కాన్‌పేట పరిధిలోని పెద్దమ్మ దేవాలయం వరకు నాలుగు వరుసల రహదారికి మార్గం సుగమం చేస్తోంది. - కందుకూరు 8.32 కి.మీలు ⇒ తొలిదశలో 150 అడుగుల వెడల్పుతో 8.32 కిలోమీటర్ల మేర కందుకూరు నుంచి మీర్ఖాన్పేట వరకు నాలుగులేన్ల రోడ్డు నిర్మిస్తారు. 15 వేల ఎకరాలు ⇒ మొత్తం ఫార్మాసిటీకి సేకరించాల్సిన భూమి ఇది. అయితే తొలి దశలో మాత్రం ఆరు వేల ఎకరాల్లో ఔషధనగరిని నిర్మించాలని సర్కారు భావిస్తోంది. 65 ఎకరాలు ⇒ మోడల్ ఫార్మాసిటీ నిర్మించే ప్రాంతం. ఫార్మాసిటీ అంటే ఇలా ఉంటుందని, మరిన్ని కంపెనీలను ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తోంది. రూ.75 కోట్లు ⇒ భూసేకరణ, రహదారి నిర్మాణానికి టీఎస్ఐఐసీ రూ.75 కోట్లను కేటాయించింది. -
గిరిజన భవనానికి రూ.1.10 కోట్లు
పరిపాలనా మంజూరు ఇచ్చిన ప్రభుత్వం కరీంనగర్ సిటీ : జిల్లా కేంద్రంలో రూ.కోటి 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గిరిజన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా మంజూరు ఇచ్చింది. ఈ మేరకు జీఓ నెం.1560/2016, తేదీ 05–07–2016 ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గిరిజన భవన నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గిరిజన భవన నిర్మాణ ం చేపట్టేందుకు నగర శివారులోని ఉజ్వలపార్కు సమీపంలో కొన్ని సంవత్సరాల క్రితం 18 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. గతంలో పలుమార్లు భవన నిర్మాణానికి నిధులు విడుదల అయినా, ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో అవి నిలిచిపోయాయి. అప్పటినుంచి గిరిజన సంఘాలు భవన నిర్మాణానికి డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి 10 లక్షలతో భవనాన్ని నిర్మించేందుకు నిధులు విడుదల చేసింది. తాజాగా పరిపాలనా మంజూరు ఇవ్వడంతో గతంలో ప్రతిపాదించిన ఉజ్వల పార్క్ సమీపంలోని స్థలంలో భవన నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం జిల్లా కేంద్రంలో గిరిజన భవన నిర్మాణానికి పరిపాలన మంజూరు ఇచ్చిన సందర్భంగా టీఆర్ఎస్ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు అజ్మీరాచందులాల్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ రాములు నాయక్‌ల చిత్రపటాలను పాలతో అభిషేకించారు. ఆరు దశాబ్దాల గిరిజనుల డిమాండ్ అయిన గిరిజన భవన్‌ను గత పాలకులు విస్మరిస్తే, కేసీఆర్ నెరవేర్చారని ఈ సందర్భంగా గిరిజన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి బి.తిరుపతినాయక్, నాయకులు పూల్‌సింగ్, సోమనాయక్, భాస్కర్‌నాయక్, రవి, రాజ్‌కుమార్, నర్సింహానాయక్ పాల్గొన్నారు. -
ఎస్‌ఎంసీల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్
26న స్కూళ్ల వారీగా నోటిఫికేషన్ ఆగస్టు 1న ఎన్నికలు..అదేరోజు ప్రమాణ స్వీకారం అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాల్సిన స్కూల్ మెనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి షెడ్యూలు విడుదల చేసింది. మార్చిలో ఒకసారి షెడ్యూలు విడుదల చేసిన ప్రభుత్వం తీరా ఎన్నికలకు రెండు రోజులు ముందు వాయిదా వేసింది. తాజాగా ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ప్రకటించి ఒకరోజు ముందు వాయిదా వేశారు. మరోసారి ఆగస్టు 1న ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం షెడ్యూలు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 3,882 పాఠశాలల్లో ఎస్ఎంసీలను నియమించనున్నారు. ఎన్నికల షెడ్యూలు ఇలా.. ఈనెల 26నlఉదయం 10 గంటలకు ఆయా స్కూళ్ల వారీగా హెచ్ఎంలు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితా తయారు చేసి నోటీస్ బోర్డులో ఉంచుతారు. ఓటరు జాబితాలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరూ ఉంటారు. అయితే ఓటింగ్‌కు మాత్రం ఇద్దరిలో ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. • 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటర్ల జాబితాల్లో ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అదేరోజు సాయంత్రం 4 గంటలకు తుది జాబితా విడుదల చేస్తారు. • ఆగస్టు 1న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ఎన్నికలు నిర్వహిస్తారు. 1.30 గంటలకు ఎన్నికైన సభ్యులు మినహా తక్కిన వారందరినీ బయటకు పంపుతారు. 2 నుంచి 3 గంటల వరకు ఎన్నికైన సభ్యులతో చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 3.30 గంటలకు మొదటి ఎస్ఎంసీ సమావేశం నిర్వహిస్తారు. -
పాఠశాల ఎన్నికలకు ‘పచ్చ’ జెండా..!
ఈ నెల 26వ తేదీ నుంచి పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఓటర్ల జాబితాల తయారీలో ఉపాధ్యాయులు ఓటర్ల జాబితాలు తమకు ఇవ్వాలంటూ అధికారపార్టీ నేతల ఆదేశాలు పిఠాపురం/బాలాజీ చెరువు: పాఠశాలలకు సర్వశిక్షా అభియాన్ నుంచి నిధులతో భవనాలు నిర్మాణం మధ్యాహ్నభోజన నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో పాఠశాల యాజమాన్య కమిటీలకు గిరాకీ పెరిగింది. ఈనెల 26న ఈ కమిటీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా ఈ దఫా ఎన్నికలు నిర్వహించడానికి ఉపాధ్యాయులు సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో పాఠశాలల్లో ఎన్నికల సందడి ప్రారంభమయింది. జిల్లాలో 4412 ప్రభుత్వ పాఠశాలల్లో 4.02 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఓటుహక్కును వినియోగించుకోడానికి ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని కమిటీలు తమ వారికే దక్కాలని తద్వారా పాఠశాలలపై అజమాయిషీ చేయాలన్న ఉద్దేశ్యంతో అధికారపార్టీ నేతలు ఉపాధ్యాయులు తయారు చేస్తున్న జాబితాలను తమకు పంపాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యుల్ ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఓటర్ల లిస్టుపై అభ్యంతరాలను ఈ నెల 29 సాయంత్రం 3 గంటల వరకు స్వీకరిస్తారు. 4 గంటలకు ఓటర్ల జాబితాను ఖరారు చేస్తారు. వచ్చే నెల 1న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చేతులు ఎత్తడం, అభిప్రాయాలు వ్యక్త పరచడం, రహస్య బ్యాలెట్ పద్దతుల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 4 గంటలకు తొలి పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహిస్తారు. -
బిందు సేద్యానికి గ్రీన్ సిగ్నల్
► ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం, ఓసీలకు 50 శాతం రాయితీ ► సన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై పరికరాలు సరఫరా ► మీ సేవలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఒంగోలు టూటౌన్ : బిందు సేద్యం(సూక్ష్మనీటి సాగుపథకం) అమలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగు నీటి పరిరక్షణ, పంటల ఉత్పత్తి సామార్థ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. గత ఏడాది ఐదు ఎకరాల మెట్ట లేదా 2.5 ఎకరాల మాగాణికి మించకుండా ఉన్న రైతులకు లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వగా ఈ ఏడాది దానిని రూ.2 లక్షలకు పెంచారు. ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు సాగు చేసే రైతులకు రూ.2.80 లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నారు. సన్నకారు రైతులు 2.5 ఎకరాల మెట్ట లేదా 1.5 ఎకరాల మాగాణి కలిగిన రైతులు, చిన్న కారు(ఐదు ఎకరాల మెట్ట లేదా 2.5 ఎకరాల మాగాణి) రైతులకు 90 శాతం రాయితీ ఇస్తారు. పది ఎకరాలు పైబడి సాగు చేసే రైతులకు(పెద్ద రైతులకు) 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. గత ఏడాది పెద్ద రైతులకు రూ.2 లక్షల వరకు మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. ఇప్పడది రూ.4 లక్షలకు పెంచారు. గత ఏడాది డ్రిప్ పొందిన రైతులు ఎవరైనా లక్ష రూపాయల వరకు సబ్సిడీ వినియోగించుకుని ఉంటే ఈ ఏడాది ఆ రైతులకు మరో రూ.లక్ష వరకు సబ్సిడీ పొందే అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి రాయితీ కల్పించారు. ఐదేళ్ల పైబడిన డ్రిప్ పరికరాలు మరమ్మతులకు గురైతే వాటి స్థానంలో కొత్త డ్రిప్ పరికరాలను 50 శాతం రాయితీపై ఇవ్వనున్నారు. తుంపర సేద్యం పైపులు(స్పింక్లర్లు), రెయిన్ గన్స్ అమలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఏపీఎంఐపీ అధికారులు తెలిపారు. వాటిని 50 శాతం రాయితీపై ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. దరఖాస్తు విధానం బిందు సేద్యం పరికరాల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు మీ సేవలో సంప్రదించాల్సి ఉంటుంది. అప్లికేషన్‌తో పాటు భూ యాజమాన్యపు హక్కు పత్రం, (టైటీల్ డీడ్ లేదా 1బీ రిజర్వు కాపీ), అడంగల్ కాపీ, ఎఫ్‌ఎమ్‌బీ, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో, ఎస్సీ, ఎస్టీ రైతులు అయితే సంబంధిత కులధ్రువీకరణ పత్రం జత చేయాలి. పరికరాలు కావాల్సిన రైతులు మీసేవలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనలు ఇవీ.. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న పది రోజులకు ఏపీఎంఐపీ ఫీల్డ్ స్టాఫ్, అధికారులు రైతు పొలాన్ని తనిఖీ చేస్తారు. తనిఖీ సమయంలో రైతు పొలంలో పంట వేసి ఉండాలి. తప్పని సరిగా బోరు ఉండాలి. అనంతరం రైతుకు ఇచ్చే రాయితీలు(సబ్సిడీ, నాన్ సబ్సిడీ వివరాల మొత్తం రైతు ఫోన్ నంబర్‌కు మెసెజ్ రూపంలో తెలియజేస్తారు. బిందు సేద్యానిక సబ్సిడీపోను మిగిలిన నగదును ప్రాజెక్టు డెరైక్టర్, ఏపీఐపీ, పేరు మీద డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుందని ఏపీఎంఐపీ డెరైక్టర్ టి.బాపిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మైక్రో ఇరిగేషన్ కంపెనీలు డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను రైతులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పలు కంపెనీలను గుర్తించింది. సుధాకర్ కంపెనీ, సిగ్నెట్, ప్రీమియర్, నెటాపిమ్, కొటారి, గోదావరి, ఫినోలెక్స్, హరిత, నాగార్జున, జైన్, కుమార్, నంది, కిసాన్, విశాఖ కంపెనీల్లో దేనినైనా రైతు ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కంపెనీ అందించే పరికరాలకు పదేళ్లపాటు కంపెనీయే సర్వీస్ చేస్తుందని పీడీ తెలిపారు. అయితే ఒక సారి డ్రిప్ పరికరాలు పొందిన రైతులు పదేళ్ల వరకు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.