
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలు దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో నిర్వాహక కంపెనీ లే ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్, కార్డియాక్ స్టెంట్ల తయారీ సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్, ఆహారం, పానీయాల సంస్థ కెవెంటర్ ఆగ్రో ఉన్నాయి.
► పబ్లిక్ ఇష్యూ ద్వారా ఇక్సిగో రూ. 1,600 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. తాజా ఈక్విటీ నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
► ఐపీవో ద్వారా సహజానంద్ మెడికల్ రూ. 1,500 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది.
► పబ్లిక్ ఇష్యూలో భాగంగా కెవెంటర్ ఆగ్రో రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.07 కోట్లకుపైగా షేర్లను మండాలా స్వీడే ఎస్‌పీవీ విక్రయానికి ఉంచనుంది. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెవెంటర్ ఆగ్రో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment