Capital Markets
-
నిధుల సమీకరణలో 2025 జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ జోరందుకున్నట్లు సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి 21 శాతం ఎగసి రూ. 14.27 లక్షల కోట్లకు చేరే వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది(2023–24)లో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి రూ. 11.8 లక్షల కోట్లు మాత్రమే సమకూర్చుకున్నట్లు ప్రస్తావించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్(ఎన్ఎస్ఐఎం) నిర్వహించిన ఒక సదస్సులో బచ్ పలు అంశాలను వివరించారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) కంపెనీలు ఈక్విటీల నుంచి రూ. 3.3 లక్షల కోట్లు, రుణ మార్గాల ద్వారా రూ. 7.3 లక్షల కోట్లు అందుకున్నట్లు తెలియజేశారు. వెరసి రూ. 10.7 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించారు. ఇక చివరి త్రైమాసికాన్ని(జనవరి–మార్చి) కూడా పరిగణిస్తే ఈక్విటీ, డెట్ విభాగాల ద్వారా సుమారు రూ. 14.27 లక్షల కోట్లను అందుకునే వీలున్నట్లు బచ్ అంచనా వేశారు. ఇకపై ఇన్విట్స్ అదుర్స్ నిజానికి ఈ ఏడాది తొలి 9 నెలల్లో మునిసిపల్ బాండ్లుసహా రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (ఇన్విట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్విట్స్ ద్వారా సమీకరించిన నిధులు రూ. 10,000 కోట్లు మాత్రమేనని బచ్ వెల్లడించారు. అయితే వచ్చే దశాబ్దంలో వీ టిలో యాక్టివిటీ భారీగా పెరగనున్నట్లు అంచనా వే శారు. దీంతో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి సమీకరించే నిధులను అధిగమించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎన్ఎస్ఐఎంను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఎంఈలకు దన్ను చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల బోర్డు ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు బచ్ పేర్కొన్నారు. క్లియరింగ్లకు పడుతున్న సమయాన్ని కుదించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఎస్ఎంఈ ప్రతిపాదనలను అనుమతించేందుకు సెబీ 3 నెలల గడువును తీసుకుంటున్నదని, బ్యాంకులైతే 15 నిముషాలలో ముందస్తు అనుమతులు మంజూరు చేస్తున్నాయని బచ్ వ్యాఖ్యానించారు. దీంతో అనుమతుల జారీలో మరింత సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఐపీవోల వరద ఇటీవల కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతుండటంతో అప్రమత్తత పెరిగినట్లు బచ్ తెలియజేశారు. పలు కంపెనీలు సెబీ తలుపు తడుతున్నప్పటికీ ఇతర మార్గాలకూ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లు, ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్లు, రైట్స్ ఇష్యూలు తదితరాలను ప్రస్తావించారు. రైట్స్ జారీలో వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్లు, ఇందుకు కంపెనీలు సైతం సన్నద్ధంకావలసి ఉన్నట్లు వెల్లడించారు. కాగా.. మ్యూచువల్ ఫండ్ల కొత్త ఆఫర్లకు వేగవంత అనుమతులిస్తున్నామని, ఇకపై రూ. 250 కనీస పెట్టుబడులతో సిప్ పథకాలను అనుమతించనున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లలో దేశీయంగా పెట్టుబడులు పుంజుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు నమోదయ్యే ఆటుపోట్లు తగ్గినట్లు వివరించారు. -
ఐపీవోకు 8 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఎనిమిది కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో లీలా ప్యాలస్ మాతృ సంస్థ ష్లాస్ బెంగళూరు, ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ, మోనోబ్లాక్ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ తదితరాలున్నాయి. ఈ ఏడాది సెపె్టంబర్ 10–23 మధ్య కాలంలో ఇవి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఈ నెలాఖరుకల్లా అనుమతులు పొందాయి. ఐపీవోకు అనుమతి లభించిన ఇతర కంపెనీలలో ఐవేల్యూ ఇన్ఫోసొల్యూషన్స్, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ సైతం చేరాయి. వివరాలు చూద్దాం..ఏథర్ ఎనర్జీ ద్విచక్ర ఈవీ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మహారాష్ట్రలో ఈవీ ప్లాంటు ఏర్పాటుకు, ఆర్‌అండ్‌డీకి, రుణ చెల్లింపులకు, మార్కెటింగ్ వ్యయాలకు వెచ్చించనుంది. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ఈవీ కంపెనీగా లిస్ట్‌కానుంది.హోటల్ లీలాలీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ నిర్వాహక కంపెనీ ష్లాస్ బెంగళూరు ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఆఫర్ చేయనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద ఆతిథ్య రంగ ఐపీవోగా నిలవనుంది. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్కు పెట్టుబడులున్న కంపెనీ ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 10 ప్రాంతాలలోని 12 హోటళ్ల ద్వారా 3,382 గదులను నిర్వహిస్తోంది. ఓస్వాల్ పంప్స్ తక్కువ, అధిక వేగంగల(లోస్పీడ్, హైస్పీడ్) మోనోబ్లాక్ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.13 కోట్ల షేర్లను ప్రమోటర్ వివేక్ గుప్తా ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలకు, సొంత అనుబంధ సంస్థ ఓస్వాల్ సోలార్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. ఈ బాటలో హర్యానాలోని కర్ణాల్లో కొత్త యూనిట్లను నెలకొల్పేందుకు, రుణ చెల్లింపులకు సైతం వెచ్చించనుంది.ఫ్యాబ్ టెక్నాలజీస్ ఫార్మా, బయోటెక్, హెల్త్‌కేర్ పరిశ్రమలలో టర్న్‌కీ ఇంజినీరింగ్ సొల్యూషన్లు అందించే ఫ్యాబ్ టెక్నాలజీస్ ఐపీవోలో భాగంగా 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆయా విభాగాలలో కంపెనీ సమీకృత సొల్యూషన్లు సమకూర్చుతోంది. వీటిలో డిజైనింగ్, ప్రొక్యూర్మెంట్, ఇన్స్టాలేషన్, టెస్టింగ్ తదితర సేవలున్నాయి. ఐవేల్యూ ఇన్ఫో పీఈ సంస్థ క్రియేడర్కు పెట్టుబడులున్న ఐవేల్యూ ఇన్ఫోసొల్యూషన్స్ ఐపీవోలో భాగంగా 1.87 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. క్రియేడర్ 1.11 కోట్ల షేర్లను విక్రయించనుంది. కంపెనీ ప్రధానంగా డిజిటల్ అప్లికేషన్ల మేనేజింగ్, డేటా నిర్వహణలో సమీకృత ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సొల్యూషన్లు అందిస్తోంది. జనవరి 6న స్టాండర్డ్ గ్లాస్ ఆఫర్ఫార్మా రంగానికి ప్రత్యేక పరికరాల తయారీలో ఉన్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభం కానుంది. జనవరి 8న ఆఫర్ ముగియనుంది. ప్రైస్ బ్యాండ్ రూ. 133–140గా నిర్ణయించారు. కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ.250 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. అలాగే రూ.350 కోట్ల వరకు వి లువైన 1.84 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. ఈ ఆఫర్‌తో తమ హోల్డింగ్స్ లో కొంత భాగాన్ని కంపెనీ ప్రమోటర్లు ఎస్2 ఇంజనీరింగ్, కందుల రామకృష్ణ, కందుల కృష్ణ వేణి, నాగేశ్వర్ రావు కందుల విక్రయించనున్నారు.క్వాలిటీ పవర్ ఎనర్జీ ట్రాన్స్మిషన్, పవర్ టెక్నాలజీల కంపెనీ క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఐపీవోలో భాగంగా రూ. 225 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్ చిత్రా పాండ్యన్ ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలో పాండ్యన్ కుటుంబానికి 100 శాతం వాటా ఉంది. -
స్టాక్ మార్కెట్ మన్మోహనుడు
దశాబ్దకాలంపాటు దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ హయాంలో స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్మురేపాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ దాదాపు 400 శాతం దూసుకెళ్లింది. వెరసి 10 ఏళ్లలో 8 సంవత్సరాలు లాభాలు పంచింది. 2006–07లో 47 శాతం జంప్‌చేయగా.. 2009లో మరింత జోరు చూపుతూ 81 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. పలు కీలక నిర్ణయాలుఆర్థిక మంత్రిగా (1991–96) ఉన్నప్పటి నుంచే క్యాపిటల్ మార్కెట్లలో సంస్కరణలకు బీజం వేశారు మన్మోహన్ సింగ్. భారతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునీకరించడం, అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేసే విధానాలకు రూపకల్పన చేసారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 1988లోనే ఏర్పాటైనప్పటికీ 1992లో సెబీ చట్టం ద్వారా దానికి చట్టబద్ధమైన అధికారాలు అందించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పారదర్శకతను పెంపొందించేందుకు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సెబీ ఒక పటిష్టమైన నియంత్రణ సంస్థగా మారేందుకు ఇది తోడ్పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశం కలి్పంచడం ద్వారా మార్కెట్లో లిక్విడిటీకి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మన్మోహన్ సంస్కరణలు దోహదపడ్డాయి.బుల్ పరుగుకు దన్ను మన్మోహన్ సింగ్ దేశానికి ఆర్థిక స్వేచ్చను కలి్పంచిన గొప్ప శిల్పి. 1991లో సంస్కరణలతో దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్‌కు తెరతీశారు. వ్యాపారాలు భారీగా విస్తరించాయి. దీంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,000 పాయింట్ల స్థాయి నుంచి జోరందుకుంది. 780 రెట్లు ఎగసి ప్రస్తుతం 78,000 పాయింట్లకు చేరుకుంది. ఫలితంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అత్యుత్తమ రిటర్నులు అందించింది. – వీకే విజయకుమార్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్సంస్కరణల జోష్ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ 1991లో చేపట్టిన సంస్కరణలు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో చెప్పుకోదగ్గ మార్పులకు కారణమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిచ్చాయి. ఆధునిక భారత్‌కు బాటలు వేశాయి. లైసెన్స్ రాజ్‌కు చెక్ పెట్టడంతోపాటు, స్వేచ్చా వాణిజ్యం, స్టాక్ మార్కెట్లలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఆయన దారి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లకు భారత్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. – పల్కా అరోరా చోప్రా, డైరెక్టర్, మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ 4,961 నుంచి 24,693కు మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదవిలో ఉన్న 2004 నుంచి 2014వరకూ పరిగణిస్తే సెన్సెక్స్ 4,961 పాయింట్ల నుంచి 24,693 వరకూ దూసుకెళ్లింది. ఈ కాలంలో మూడేళ్లు మినహా ప్రతీ ఏటా ఇండెక్స్ లాభాల బాటలో నే సాగడం గమనార్హం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో ఇండెక్సులు పతనంకాగా.. 2011, 2014లోనూ మార్కెట్లు వెనకడుగు వేశాయి. 2011లో సెన్సెక్స్ అత్యధికంగా 27% క్షీణించింది. ఆరి్థక మంత్రిగా మన్మోహన్ 1991లో చేపట్టిన సంస్కరణలు ఆరి్థక వ్యవస్థకు జోష్‌నివ్వడంతో టర్న్అరౌండ్ అయ్యింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. బక్కచిక్కిన రూపాయి బలోపేతమైంది. ప్రధానంగా విదేశీ మారక నిల్వలు భారీగా ఎగశాయి.సెన్సెక్స్ పరుగు ఏడాది లాభం(%) 2004 33 2005 42 2006 47 2007 47 2009 81 2010 17 2012 26 2013 9 -
క్యూ3లో 25 రియల్ ఎస్టేట్ డీల్స్..
దేశీ రియల్టీ రంగంలో ఈ కేలండర్ సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో 25 డీల్స్ జరిగినట్లు కన్సల్టింగ్ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ నివేదిక పేర్కొంది. వీటి విలువ 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,760 కోట్లు)గా తెలియజేసింది. ప్రధానంగా డెవలపర్స్ చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)దే వీటిలో ప్రధాన వాటాగా వెల్లడించింది. ‘రియల్టీ, రీట్స్ డీల్ ట్రాకర్– ఎంఅండ్ఏ, పీఈ డీల్ ఇన్సైట్స్’ పేరుతో విడుదల చేసిన నివేదిక వివరాలు చూద్దాం..కొత్త రికార్డ్ రియల్టీ రంగ జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ3)లో ఏకంగా 25 డీల్స్ నమోదయ్యాయి. పరిమాణంరీత్యా ఇది సరికొత్త రికార్డుకాగా.. విలువ(రూ. 11,760 కోట్లు)రీత్యా 2023 ఏడాది క్యూ2 తదుపరి గరిష్ట విలువగా నమోదైంది. ప్రధానంగా క్విప్ జారీ పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వీటికి రెసిడెన్షియల్, వాణిజ్య విభాగాలలో పీఈ నిధులు జత కలిశాయి. అంతేకాకుండా రియల్టీ టెక్నాలజీ కంపెనీలలోనూ ఒప్పందాలు కలిసొచ్చాయి. డీల్స్ తీరిలా క్యూ2లో నమోదైన మొత్తం డీల్స్‌లో 5.1 కోట్ల డాలర్ల విలువైన 8 ఒప్పందాలు కొనుగోళ్లు, విలీనం(ఎంఅండ్ఏ) విభాగంలో జరిగాయి. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) విభాగంలో 40.1 కోట్ల విలువైన 12 డీల్స్ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్–జూన్(క్యూ2)లో లభించిన 1.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారీగా క్షీణించాయి. కాగా.. క్యూ3లో 4.9 కోట్ల డాలర్ల విలువైన ఒక ఐపీవోసహా 94 కోట్ల డాలర్ల విలువైన క్విప్‌లు జారీ అయ్యాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్లు బలపడటం సహకరించింది. క్విప్‌లో 94 కోట్ల డాలర్ల విలువైన 4 డీల్స్ జరిగాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 60.2 కోట్ల డాలర్ల డీల్ దీనిలో కలసి ఉంది. ఇవి క్యూ2తో పోలిస్తే ఆరు రెట్లు అధికం. -
స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్
న్యూఢిల్లీ: స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) నిబంధనలను కఠినతరం చేసింది. ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కనీస కాంట్రాక్ట్ పరిమాణాన్ని పెంచడంతోపాటు.. ఆప్షన్స్ ప్రీమియంల ముందస్తు వసూళ్లను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల పరిరక్షణార్ధం పొజిషన్ లిమిట్స్‌పై ఇంట్రాడే పర్యవేక్షణ, ఎక్స్పైరీ రోజున కేలండర్ స్ప్రెడ్ లబ్ధి రద్దు, వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్‌ను క్రమబద్ధీకరించడం, టెయిల్ రిస్క్ కవరేజీ పెంపు తదితర పలు ఇతర చర్యలను సైతం తీసుకుంది.ఈ చర్యలన్నీ వచ్చే నెల (నవంబర్) 20 నుంచి దశలవారీగా అమల్లోకిరానున్నట్లు తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. ఇటీవల పరిశీలన ప్రకారం ఎఫ్‌అండ్‌వో విభాగంలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు 2022–24 మధ్య కాలంలో సగటున రూ. 2 లక్షలు చొప్పున నష్టపోయినట్లు సెబీ గుర్తించింది. కోటిమంది వ్యక్తిగత ఇన్వెస్టర్లలో 93% మందికి నష్టాలు వాటిల్లినట్లు ఇప్పటికే రిటైలర్లను హెచ్చరించింది. ఈ కాలంలో వ్యక్తిగత ట్రేడర్లకు ఉమ్మడిగా రూ. 1.8 లక్షల కోట్లమేర నష్టాలు నమోదైనట్లు పేర్కొనడం తెలిసిందే. నిబంధనల తీరిదీ... తాజా సర్క్యులర్‌లో సెబీ ఎఫ్‌అండ్‌వో నిబంధనల సవరణలను వెల్లడించింది. వీటి ప్రకారం ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కనీస కాంట్రాక్ట్ పరిమాణాన్ని 2015లో నిర్ణయించిన రూ. 5–10 లక్షల నుంచి రూ. 15–20 లక్షలకు పెంచింది. ఇందుకు అనుగుణంగానే లాట్ సైజ్‌ను కూడా నిర్ధారిస్తారు. వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్‌ను ఒకేఒక ప్రామాణిక ఇండెక్స్‌కు పరిమితం చేస్తారు. షార్ట్ ఆప్షన్స్ కాంట్రాక్టులపై ఎక్స్పైరీ రోజున 2 శాతం అదనపు మార్జిన్ (ఈఎల్ఎం)ను విధిస్తారు. ఆప్షన్ కొనుగోలుదారులు ముందస్తుగా పూర్తి ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. దీంతో అధిక లెవరేజ్‌ను నివారిస్తారు. మునిసిపల్ బాండ్లకు పన్ను రాయితీలు మౌలిక రంగ అభివృద్ధికి వినియోగించగల నిధుల సమీకరణకు వీలుగా మునిసిపల్ బాండ్లకు పన్ను రాయితీలు ప్రకటించాలని సెబీ తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. వీటి సబ్‌్రస్కయిబర్లకు పన్ను మినహాయింపులను అందించాలని అభ్యర్థించింది. -
సెబీ.. ఇన్వెస్టర్ సర్టిఫికేషన్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సర్టిఫికేషన్ పరీక్షను నిర్వహించనుంది. దీంతో ఉచితంగా స్వచ్చంద పద్ధతిలో ఇన్వెస్టర్లు ఆన్లైన్లో పరీక్షను రాయడం ద్వారా సరి్టఫికేషన్‌ను అందుకునేందుకు వీలుంటుంది. తద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సమగ్ర విజ్ఞానాన్ని పొందవచ్చని ఒక ప్రకటనలో సెబీ పేర్కొంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం) సహకారంతో అభివృద్ధి చేసిన సర్టిఫికేషన్‌ను సెబీ జారీ చేయనుంది. వెరసి ఇన్వెస్టర్లు స్వచ్చందంగా మార్కెట్లు, పెట్టుబడుల విషయంలో తమ విజ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ సెక్యూరిటీల మార్కెట్లో ప్రావీణ్యాన్ని పెంచుకునేందుకు పరీక్ష ఉపయోగపడుతుందని తెలియజేసింది. -
చిన్న షేర్లలో అవకతవకలు
ముంబై: చిన్న, మధ్యతరహా స్టాక్స్‌లో అవకతవకలు జరుగుతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవీ పురి పేర్కొన్నారు. కొంతమంది అసహజ లావాదేవీలకు తెరతీసినట్లు గుర్తించామని తెలియజేశారు. చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్ఎంఈలు) విభాగంలో కృత్రిమంగా ధరల పెంపును చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎస్ఎంఈ విభాగం ఐపీవోలతోపాటు.. సెకండరీ మార్కెట్లోనూ అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. వెరసి రిసు్కలు అధికంగాగల విభాగంలో ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉన్నట్లు సూచించారు. ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా మహిళా పాత్రికేయులతో ముచ్చటించిన పురి పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాన విభాగంతో పోలిస్తే ఎస్ఎంఈ విభాగం ప్రత్యేకమైనదని ఇన్వెస్టర్లు అర్ధం చేసుకోవలసి ఉన్నట్లు పురి పేర్కొన్నారు. ప్రధాన విభాగంలోని కంపెనీలు తప్పనిసరిగా సమాచారాన్ని వెల్లడించవలసి ఉంటుందని, అయితే ఎస్ఎంఈ విభాగం రిసు్కలు విభిన్నంగా ఉంటాయని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. 28 నుంచి ఆప్షనల్ పద్ధతిలో టీ+0 సెటిల్మెంట్ సెక్యూరిటీల టీ+0 సెటిల్మెంట్ను మార్చి 28 నుంచి ఆప్షనల్ పద్ధతిలో ప్రవేశపెట్టనున్నట్లు పురి తెలియజేశారు. గత కొద్ది నెలల్లో భారీగా దూసుకెళుతున్న స్మాల్, మిడ్ క్యాప్ విభాగం షేర్ల విలువలపై స్పందిస్తూ కొన్ని కౌంటర్లలో అసహజ లావాదేవీలు నమోదవుతున్న సంకేతాలున్నట్లు వెల్లడించారు. ధరలను మ్యానిప్యులేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి బుడగలవంటివని వ్యాఖ్యానించారు. ఇలాంటి బుడగలు తలెత్తేందుకు అనుమతించకూడదని, ఇవి పగలిపోతే ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఇది మార్కెట్లకు మంచిదికాదని అభిప్రాయపడ్డారు. స్టాక్ బ్రోకర్లకు కఠిన నిబంధనలు కాగా, అర్హతగల స్టాక్ బ్రోకర్(క్యూఎస్బీ)గా గుర్తించే మార్గదర్శకాలను సెబీ తాజాగా విస్తృతం చేసింది. తద్వారా మరింతమంది బ్రోకర్లను నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే దిశగా తాజా చర్యలకు తెరతీసింది. యాజమాన్య సంబంధ లావాదేవీల పరిమాణం, నిబంధనలు, సమస్యల పరిష్కారం తదితర అంశాలను స్టాక్ బ్రోకర్లను క్యూఎస్బీలుగా గుర్తించడంలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఒక సర్క్యులర్‌లో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పేర్కొంది. -
2024లో పెట్టుబడులకు దారేది..?
ఇన్వెస్టర్లు ఏడాదికోసారి తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను తప్పకుండా సమీక్షించు కోవాలి. అప్పుడే ఏ విభాగానికి ఏ మేరకు కేటాయింపులు చేయాలన్న స్పష్టత వస్తుంది. ఈక్విటీలు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వడ్డీ రేట్లు సైతం గరిష్టాలకు చేరాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. క్యాపిటల్ మార్కెట్లపై ఈ ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్.. వీటిల్లో ఏ విభాగం పనితీరు ఎలా ఉంటుంది..? ఇది తెలిస్తే.. తమ పెట్టుబడుల్లో వేటికి ఎంత మేర ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిర్ణయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులను ఒడిసి పట్టుకోవచ్చు. అంతేకాదు, మార్కెట్ అస్థిరతలను తట్టుకునే విధంగా తమ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవచ్చు. దీనిపై మార్కెట్ నిపుణుల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. ఈక్విటీ అవకాశాలు దీర్ఘకాలంలో ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీలు అధిక రాబడులు ఇస్తాయని తెలిసిందే. 2024 సైతం ఇందుకు భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. ‘‘2024 పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్నాం. అంతర్జాతీయ, దేశీయ ముఖచిత్రం మెరుగ్గా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధిలో ఉండడం, మానిటరీ పాలసీ రేట్ల విషయంలో సర్దుబాట్లు, ముడి చమురు ధరలు తగ్గడం ఇందుకు మద్దతునిస్తున్నాయి’’అని ఫండ్స్ ఇండియా సీఈవో గిరిరాజన్ మురుగన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి, ఆ తర్వాత పలు దేశాల మధ్య యుద్ధాలతో అంతర్జాతీయంగా ఏర్పడిన అవరోధాల నడుమ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ప్రదర్శించడాన్ని గమనించొచ్చు. ‘‘అంతర్జాతీయంగా వాణిజ్యం విషయంలో మారిన ప్రాధాన్యతలు భారత్‌కు అనుకూలించనున్నాయి. పలు రంగాల్లో భారత్ అంతర్జాతీయంగా మార్కెట్ వాటాను పెంచుకోనుంది. ఒకవైపు సేవల ఎగుమతుల్లో బలంగా ఉన్నాం. మరోవైపు తయారీలోనూ బలమైన స్థానం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది’’అని ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు కెన్నెత్ ఆండ్రడే పేర్కొన్నారు. ఈక్విటీ ఇన్వెస్టర్లకు భారత్ ప్రాధాన్య ఎంపికగా ఉంటుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘భారత్ ఆర్థిక అంచనాలు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ వృద్ధి అంచనా 2.7 శాతాన్ని భారత్ వృద్ధి అంచనాలు 6.5–7 అధిగమిస్తున్నాయి. భారత ప్రభుత్వం వైపు నుంచి పారదర్శక, స్థిరమైన, స్నేహపూర్వక పెట్టుబడుల విధానాలు ఈ వృద్ధికి బలాన్నిస్తున్నాయి. ఇవన్నీ ప్రపంచవేదికపై భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన స్వర్గధామంగా మారుస్తున్నాయి’’అని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమన్ వీర్ తెలిపారు. ఈక్విటీల్లోనూ మెరుగైన రాబడుల అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? అన్న సందేహం వస్తుంది. కేంద్ర సర్కారు దేశీ తయారీ బలోపేతంపై విరామం లేకుండా కృషి చేస్తోంది. కనుక తయారీ రంగం 2024లోనూ బలమైన పనితీరు చూపించనుంది. 2024 సంవత్సరం మధ్య నుంచి వడ్డీ రేట్ల కోత మొదలవుతుందని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత భారత మార్కెట్లకు మరింత బూస్ట్నిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ‘‘వడ్డీ రేట్ల కోతతో విదేశీ ఇనిస్టిట్యూషన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా భారత్‌కు తరలివస్తాయి. దీంతో తయారీ, ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, డిఫెన్స్, రైల్వే ఇన్ఫ్రా, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కంపెనీలు లాభపడనున్నాయి’’అని మురుగన్ వివరించారు. దేశీయ ఇన్వెస్టర్లు చిన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తుంటే.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీలు, సూచీల్లో ఎక్కువ వెయిటేజీ ఉన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆండ్రడే తెలిపారు. ‘‘ఈ ఏడాది డిఫెన్స్, రియాలిటీ, ఆటో, ప్రభుత్వరంగ, ఫార్మా కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. నూతనతరం (న్యూఏజ్) వ్యాపార కంపెనీలు అయితే డార్క్‌హార్స్‌గా నిలుస్తాయి. ఫైనాన్షియల్స్, ఐటీ, తయారీ, ప్రభుత్వరంగ సంస్థలు, హెల్త్‌కేర్ థీమ్‌లు సైతం ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతాయి’’ అని రీసెర్చ్ అండ్ ర్యాంకింగ్ సీఐవో జ్రస్పీత్ సింగ్ అరోరా అభిప్రాయపడ్డారు. 2022 ఈక్విటీలకు అనుకూలంగా లేని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 2022, 2023 రెండు సంవత్సరాలకు కలిపి చూస్తే సెన్సెక్స్ ఇచి్చన నికర వార్షిక రాబడి 11.5 శాతమే. మార్కెట్ల వ్యాల్యూషన్లు కొంచెం గరిష్ట స్థాయికి చేరినందున ఇన్వెస్టర్లు వైవిధ్యంతో అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మిడ్, లార్జ్‌క్యాప్ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని, అధిక రుణభారంతో నడిచే కంపెనీలకు దూరంగా ఉండాలని మురుగన్ సూచించారు. రియల్ ఎస్టేట్ దశాబ్ద కాలం పాటు రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ పెద్దగా పెరగలేదు. కరోనా మహమ్మారి తర్వాత నుంచి డిమాండ్ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. వచ్చే ఐదు, పదేళ్ల పాటు రియల్ ఎస్టేట్ మెరుగైన పనితీరు చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 2030 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నిపుణులు, విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుకు అనుగుణంగా ఈ రంగంలోకి పెట్టుబడులు వస్తాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ, భౌతిక రియల్ ఎస్టేట్ అన్నది భారీ పెట్టుబడికి సంబంధించిన అంశం. అధిక ఆర్జన కలిగిన వర్గానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ‘‘పెట్టుబడి పరంగా రియల్ ఎస్టేట్ అన్నది క్లిష్టమైన, లిక్విడిటీ పెద్దగా లేని సాధనం. వైవిధ్యం కోసం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకున్నా, రిస్‌్కలు కూడా లేకపోలేదు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’’అని హర్ష గెహ్లాట్ సూచించారు. వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అందుకు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ అయిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లను పరిశీలించొచ్చు. బంగారం దీర్ఘకాలంలో (10–15 ఏళ్లు అంతకంటే ఎక్కువ) బంగారం ద్రవ్యోల్బణానికి మించి రాబడులను ఇస్తున్నట్టు ఫండ్స్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది. చారిత్రక గణాంకాలను పరిశీలించినా ఇదే విషయం తెలుస్తుంది. దీర్ఘకాలంలో బంగారంపై రాబడి ద్రవ్యోల్బణం కంటే 2–4 శాతం అధికంగా ఉంటోంది. స్వల్పకాలానికి ఇది అనుకూలమైన సాధనం కాదు. అదే పనిగా స్థిరమైన రాబడులను అన్ని కాలాల్లోనూ బంగారం నుంచి ఆశించరాదు. మధ్య మధ్యలో బంగారం కొన్నేళ్లపాటు ఎలాంటి రాబడులు లేకుండా కొనసాగుతందని చెప్పడానికి గత ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దీర్ఘకాలం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల్లో వైవిధ్యానికి తోడు, అనిశి్చత సమయాల్లో, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా ఉపకరిస్తుంది. ‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం ఇవన్నీ బంగారంలో పెట్టుబడికి బలమైన నేపథ్యాలుగా చూడొచ్చు. రాబడులు అధిక స్థాయిలో లేకపోయినా, మరే ఇతర సాధనంలో లేనంతగా పెట్టుబడుల భద్రతకు బంగారం భరోసానిస్తుంది. రిస్‌్కలను ఎదుర్కొనేందుకు వీలుగా పోర్ట్‌ఫోలియోలో కొంత మొత్తాన్ని బంగారానికి కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది’’అని ఫిన్‌ఎడ్జ్ సీఈవో హర్ష గెహ్లాట్ సూచించారు. బంగారానికి అనుకూలించే ఇతర అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు సైతం బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. డాలర్ నుంచి వైవిధ్యం కోరుకోవడం కూడా బంగారానికి మద్దతునిచ్చే అంశం. సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి బంగారానికి డిమాండ్ ఉండడం 2023లో ధరలకు మద్దతునిచి్చందని, 2024లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా. భారత్, చైనా బంగారం కొనుగోళ్లలో రెండు అతిపెద్ద దేశాలు కాగా, వీటి నుంచి ఈ ఏడాదీ కొనుగోళ్లకు డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా మన దేశం బలమైన ఆర్థిక వృద్ధి నమోదు చేస్తున్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందన్న అంచనా కూడా ఉంది. అయితే బంగారానికి ఎంత శాతం పెట్టుబడి కేటాయించుకోవాలన్న సందేహం ఏర్పడొచ్చు. ‘‘పెట్టుబడులకు బంగారాన్ని వైవిధ్య సాధనంగా చూడొచ్చు. అదే సమయంలో బంగారంపై పరిమితికి మించి చేసే పెట్టుబడులతో ప్రతికూల ఉత్పాదకత కూడా ఎదురుకావచ్చు. కనుక ఇన్వెస్టర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతానికి మించకుండా బంగారానికి కేటాయించుకోవచ్చు’’అని నిపుణుల సూచన. వేటికి ఏ మేరకు.. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. అదే విధంగా ఒక్కో సాధనానికి ఎంత మేరకు కేటాయింపులు చేయాలన్నదీ కీలకమే. ఇన్వెస్టర్ వయసు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడుల కాల వ్యవధి, పెట్టుబడుల వెనుక ఉన్న లక్ష్యం ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణ నియమం ప్రకారం.. ఐదేళ్లు అంతకుమించి ఎక్కువ కాలం పాటు తన పెట్టుబడులు కొనసాగించే వెసులుబాటు ఉండి, అధికంగా వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈక్విటీ ఫండ్స్ మొదటి ఆప్షన్ అవుతుంది. ఫండ్స్ బలమైన నియంత్రణల మధ్య, తక్కువ వ్యయాలు, చక్కని వైవిధ్యంతో, తగినంత లిక్విడిటీతో, నిపుణుల ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయని, ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చని గెహ్లాట్ సూచించారు. రిస్క్ నివారణకు ఈక్విటీల్లో దీర్ఘకాలానికి సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఐదేళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేసే వారు ఈక్విటీలకు మొత్తం పెట్టుబడుల్లో 70–80% వరకు, డెట్‌కు 15–20% వరకు, బంగారానికి 5–10% మధ్య కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ పదేళ్లు అంతకుమించి అయితే ఈక్విటీలకు 80–90%, డెట్‌కు 5–10%, బంగారానికి 5–10% వరకు కేటాయించుకోవచ్చు. పదేళ్లకు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటే 20% వరకు కేటాయింపులు చేసుకోవచ్చన్నది సూచన. అప్పుడు డెట్ కేటాయింపులను రియల్ ఎస్టేట్‌కు మళ్లించుకోవచ్చు. డెట్ సాధనాలు.. డెట్ (స్థిరాదాయ) విభాగంలో పెట్టుబడులకు ఈ ఏడాది అనుకూలమేనని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘2023–24 వృద్ధి అంచనాలను ఆర్బీఐ అర శాతం పెంచి 7 శాతం చేసింది. 2024లో కనీసం మూడు పర్యాయాలు రేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడ్ సంకేతాలు ఇచి్చంది. వడ్డీ రేట్ల కోతతో బాండ్ ధరలు పెరుగుతాయి. ఇది బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి అనుకూలం’’అని రీసెర్చ్ అండ్ ర్యాంకింగ్ సీఐవో జ్రస్పీత్ సింగ్ అరోరా పేర్కొన్నారు. ‘‘2024–25లో జీడీపీ 6 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి నమోదు చేస్తుంది. అదే కాలంలో సగటు ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండొచ్చు. గడిచిన రెండేళ్లలో ద్రవ్యోల్బణం 6 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. కనుక 2024–25 ద్వితీయ ఆరు నెలల్లో ఆర్బీఐ రేట్ల కోత చేపట్టొచ్చు. ఆ నిర్ణయం పదేళ్ల భారత ప్రభుత్వ బాండ్ల (ఐజీబీ)కు అనుకూలిస్తుంది. భారత ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లలో ఉన్న వారు రేట్ల కోత ప్రయోజనాలు పొందుతారు’’అని ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ ఫిక్స్డ్ ఇన్కమ్ సీఐవో దావల్ దలాల్ తెలిపారు. 10 ఏళ్ల ఐజీబీ ప్రస్తుతమున్న 7.17 స్థాయి నుంచి 2025 మార్చి నాటికి 6.75 శాతానికి దిగొస్తుందని దలాల్ అంచనా వేస్తున్నారు. ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్టర్లు క్రమంగా వ్యవధి పెంచుకోవాలని, ఐజీబీలను జోడించుకోవాలని సూచించారు. స్వల్ప కాలానికి కార్పొరేట్ సంస్థలు షార్ట్‌డ్యురేషన్ బాండ్ల జారీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటిపై ఈల్డ్స్ పెరగొచ్చని.. ఇన్వెస్టర్లు దీర్ఘకాల బాండ్లలో ప్రస్తుతమున్న అధిక రేట్లపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తారని దలాల్ అంచనా వేశారు. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం అన్ని రకాల డెట్ సాధనాలపై ఇప్పుడు కాల వ్యవధితో సంబంధం లేకుండా ఒకటే పన్ను విధానం ఉండడాన్ని మర్చిపోకూడదు. డెట్ సాధనాలపై వచ్చే ఆదాయం వ్యక్తుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారి ఆదాయ శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక మెరుగైన రాబడులు ఇచ్చే డెట్ సాధనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. మీడియం డ్యురేషన్‌తో కూడిన డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో ఒకటి. వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నందున ఈ సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. ఎఫ్డీలు, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ సహజంగా తక్కువ. -
ఫైనాన్షియల్ మీడియా పోస్టులకు చెక్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా ఆర్థికపరమైన(ఫైనాన్షియల్) సలహాలిచ్చేవారిపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ దృష్టి పెట్టింది. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా పిలిచే వ్యక్తులు లేదా సంస్థల నియంత్రణకు తాజాగా చర్యలు చేపట్టింది. ఒక్కో పోస్టుకు రూ. 10,000 నుంచి రూ. 7.5 లక్షలవరకూ చార్జ్చేసే సలహాదారులు ఇటీవల అధికమైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు తెరతీసింది. తద్వారా ఇన్వెస్టర్లకు కచి్చతమైన, నిష్పక్షపాత సమాచారం లభించేందుకు వీలు కలి్పంచనుంది. అదీకృత సలహాలకు అవకాశంతోపాటు.. మోసాలను తగ్గించేందుకు సెబీ చర్యలు తోడ్పడనున్నట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ పేర్కొన్నారు. సెబీ తాజా ప్రతిపాదనల ప్రకారం ఆర్థిక సలహాదారులు(ఫిన్ఫ్లుయెన్సర్లు) సెబీ వద్ద రిజిస్టర్కావలసి ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించవలసి ఉంటుంది. రిజిస్టర్కానివారు ప్రమోషనల్ కార్యక్రమాల కోసం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్లతో జట్టు కట్టేందుకు అనుమతించరు. ఇకపై సెబీ వద్ద రిజిస్టర్కావడంతోపాటు, నిబంధనలు పాటించవలసిరావడంతో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనం(అకౌంటబిలిటీ) పెరుగుతుందని, ప్రమాణాలు, నైపుణ్యాలు మెరుగుపడతాయని రైట్ రీసెర్చ్, పీఎంఎస్ వ్యవస్థాపకుడు, ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఫిన్ఫ్లుయెన్సెర్ల పాత్రకు జవాబుదారీతనం పెంచడం ద్వారా సెబీ ఇన్వెస్టర్లకు రక్షణను పెంచుతున్నదని అజీజ్ పేర్కొన్నారు. దీంతోపాటు పరిశ్రమలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నదని తెలియజేశారు. సెబీ లేదా స్టాక్ ఎక్సే్ఛంజీ లేదా మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వద్ద రిజిస్టరైన ఫిన్ఫ్లుయెన్సెర్లు తమ రిజి్రస్టేషన్ నంబర్, కాంటాక్ట్ వివరాలు తదితరాలను పొందుపరచవలసి ఉంటుంది. -
రీట్ హోల్డర్లకు ప్రత్యేక హక్కులు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)లలో యూనిట్లు కలిగిన పెట్టుబడిదారులకు ప్రత్యేక హక్కులను కలి్పంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. కార్పొరేట్ సుపరిపాలనకు మరింత బూస్ట్‌నిస్తూ రీట్ బోర్డులలో తమ ప్రతినిధుల(నామినీ)ను ఎంపిక చేసుకునేందుకు యూనిట్ హోల్డర్లకు వీలు కలి్పంచింది. ఇందుకు తాజా నిబంధనలను విడుదల చేయడంతోపాటు.. సవరణలకు తెరతీసింది. దీంతో ఇకపై సెల్ఫ్ స్పాన్సర్డ్ రీట్లకూ మార్గమేర్పడనుంది. యూనిట్ హోల్డర్లు నామినేట్ చేసే సభ్యులకు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల నిర్వహణా సంబంధ నిబంధనలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీ రీట్ నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఏదైనా ఒక రీట్‌లో 10 శాతానికంటే తక్కువకాకుండా వ్యక్తిగతంగా లేదా సామూహికంగా యూనిట్లు కలిగిన యూనిట్ హోల్డర్లు సంస్థ బోర్డులో ఒక డైరెక్టర్‌ను నియమించవచ్చు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇని్వట్)లు, రీట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు తీసుకునే నిర్ణయాలపై యూనిట్ హోల్డర్లకు ఎలాంటి హక్కులూ లభించడంలేదు. దీంతో ట్రస్ట్‌లు తదితర భారీ పెట్టుబడిదారు సంస్థలు బోర్డులో సభ్యత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. కాగా.. సెబీ తాజా నిబంధనలతో ఇన్వెస్టర్లలో వి శ్వాసం మెరుగుపడుతుందని ఎన్డీఆర్ ఇన్విట్ మేనేజర్స్ సీఎఫ్‌వో సందీప్ జైన్ పేర్కొన్నారు. అటు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు, ఇటు కంపెనీకి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. -
ఐదేళ్ల గరిష్టానికి పీనోట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్ల (పీనోట్లు) ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు జూన్ చివరికి రూ.1,11,291 కోట్లకు చేరాయి. దేశ ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో (క్యాపిటల్ మార్కెట్లు) కలిపి ఈ మేరకు పెట్టుబడులు ఉన్నాయి. ఐదున్నరేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మే చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ.1,04,585 కోట్లుగా ఉంది. స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీనోట్ల పెట్టుబడుల విలువ పెరగడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైనట్టు సెబీ గణాంకాలు స్పస్టం చేస్తున్నాయి. సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్లను జారీ చేస్తుంటారు. సెబీ వద్ద నమోదు చేసుకోకుండా పీ నోట్ల ద్వారా ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.పీ నోట్ జారీ చేసే ఎఫ్‌పీఐలు ఇందుకు సంబంధించి సెబీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రి ల్ చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ. 95, 911 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి రూ. 88,600 కోట్లు, ఫిబ్రవరి చివరికి రూ.88,398 కో ట్లు, జనవరి చివరికి రూ.91,469 కోట్ల చొప్పున ఉంది. బలమైన పనితీరు వల్లే.. సాధారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల ధోరణికి అనుగుణంగానే పీనోట్ల పెట్టుబడులు కూడా ఉంటుంటాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు నెలకొన్న సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపిస్తుండడం పీ నోట్ పెట్టుబడుల వృద్ధికి దోహదపడినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్ చివరికి ఉన్న రూ.1.11 లక్షల కోట్లలో ఈక్విటీల్లోనే రూ.1,00,701 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డెట్‌లో రూ.12,382 కోట్లు, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు రూ.203 కోట్లుగా ఉన్నాయి. జూన్ చివరికి ఎఫ్‌పీఐల నిర్వహణలోని పెట్టుబడులు రూ.55.63 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు భారత ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు పది నెలల గరిష్ట స్థాయి అయిన రూ.47,184 కోట్లకు జూన్ నెలలో చేరాయి. అదే నెలలో డెట్‌మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.9,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. -
పీనోట్ పెట్టుబడులు హైజంప్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడను ప్రతిబింబిస్తూ క్యాపిటల్ మార్కెట్లలో పారి్టసిపేటరీ నోట్ల(పీనోట్స్) ద్వారా పెట్టుబడులు జోరు చూపుతున్నాయి. 2023 మే చివరికల్లా రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయి. ఇవి గత ఐదేళ్లలోనే అత్యధికంకాగా.. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పెట్టుబడులు విస్తరించాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం వరుసగా మూడో నెలలోనూ పీనోట్ పెట్టుబడులు పుంజుకున్నాయి. వీటిని దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాకుండానే పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా విదేశీ ఇన్వెస్టర్లకు జారీ చేస్తుంటారు. అయితే ఇందుకు తగిన అంశాలను పరిశీలించాక మాత్రమే పీనోట్లను జారీ చేస్తారు. సెబీ వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ చివరికల్లా పీనోట్ పెట్టుబడుల విలువ రూ. 95,911 కోట్లుగా నమోదుకాగా.. మే నెలకల్లా రూ. 1,04,585 కోట్లను తాకాయి. అంతక్రితం మార్చికల్లా ఇవి రూ. 88,600 కోట్లుకాగా.. ఫిబ్రవరిలో రూ. 88,398 కోట్లు, జనవరి చివరికల్లా రూ. 91,469 కోట్లుగా నమోదయ్యాయి. 2018 మార్చి తదుపరి ఈ మే నెలలో పీనోట్ పెట్టుబడులు భారీగా లభించాయి. దేశ ఆర్థిక పటిష్టతకుతోడు.. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం ఎఫ్‌పీఐ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు విశ్లేషకులు తెలియజేశారు. -
7 బిజినెస్ గ్రూప్‌ల ఆస్తుల వేలం: సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏడు బిజినెస్ గ్రూప్‌లకు చెందిన 17 ఆస్తులను వేలం వేయనున్నట్లు తాజాగా పేర్కొంది. జాబితాలో ఎంపీఎస్, వైబ్‌గ్యోర్ గ్రూప్‌లతోపాటు, టవర్ ఇన్ఫోటెక్ తదితరాలున్నాయి. ఇన్వెస్టర్ల సొమ్ము రికవరీ నిమిత్తం ఈ నెల 28న వేలం నిర్వహించనున్నట్లు సెబీ వెల్లడించింది. ఇందుకు రూ. 51 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఇతర గ్రూప్‌లలో ప్రయాగ్, మల్టీపర్పస్ బియోస్ ఇండియా, వారిస్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్, పైలాన్ గ్రూప్‌లున్నట్లు సెబీ ప్రకటించింది. వీటికి సంబంధించిన ప్రాపర్టీలను బ్లాక్ చేస్తున్నట్లు నోటీసు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో విస్తరించిన ఈ ఆస్తులలో భూములు, పలు అంతస్తుల భవంతులు, ఫ్లాట్లు, వాణిజ్య కార్యాలయాలున్నట్లు తెలియజేసింది. ఆన్లైన్ మార్గంలో నిర్వహించనున్న ఆస్తుల వేలానికి క్విక్‌ఆర్ రియల్టీ విక్రయ సేవలందించనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థలన్నీ నిబంధనలు పాటించకుండా ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ చేపట్టినట్లు సెబీ వివరించింది. -
బ్లాక్‌రాక్ ‘ఆస్తులు’ ఆవిరి!
న్యూఢిల్లీ: మార్కెట్లో మామూలు ఇన్వెస్టర్లే కాదు. కాకలు తీరిన కంపెనీలూ దెబ్బతింటాయి. ఏకంగా 10 లక్షల కోట్ల డాలర్ల ఆస్తులున్న బ్లాక్‌రాక్ లాంటి దిగ్గజం కూడా గడిచిన ఆరు నెలల్లో స్టాక్ మార్కెట్ ఆటుపోట్లను తట్టుకోలేకపోయింది. ఈ సంస్థ ఏకంగా తన నిర్వహణ ఆస్తుల్లో లక్షా డెబ్బై వేల కోట్ల డాలర్లను (రూ.136 లక్షల కోట్లు) కోల్పోయింది. అది కూడా ఆరు నెలల కాలంలో. ఇది ఓ ప్రపంచ రికార్డు కూడా. గతంలో ఎన్నడూ ఓ సంస్థ ఆరు నెలల కాలంలో ఇంతలా నిర్వహణ ఆస్తులను కోల్పోలేదు. నిజానికి 2022 తొలి ఆరు నెలలు ప్రపంచ క్యాపిటల్ మార్కెట్లకు ఏమాత్రం కలసి రాలేదనే చెప్పుకోవాలి. ఈ ప్రతికూలతలను ఇతర అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థలు సాధ్యమైన మేర అధిగమించే ప్రయత్నాలు చేశాయి. కానీ, బ్లాక్రాక్పై మార్కెట్ పరిణామాల ప్రభావం ఎక్కువగా పడింది. ఎందుకంటే ఈ సంస్థ నిర్వహణ ఆస్తుల్లో మూడొంతులు ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌లోనే ఉన్నాయి. పెట్టుబడుల పరంగా మారిన ఇన్వెస్టర్ల ప్రాథాన్యతలు సైతం ఈ సంస్థ ఆస్తులపై ప్రభావం చూపించాయి. ఈ సంస్థ నిర్వహించే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్‌లో పావు శాతమే బెంచ్‌మార్క్ కంటే మెరుగైన పనితీరు చూపించాయి. 8.49 లక్షల కోట్ల డాలర్లు.. జూన్ చివరికి బ్లాక్‌రాక్ మొత్తం నిర్వహణ ఆస్తులు 8.49 లక్షల కోట్ల డాలర్లకు పరిమితం అయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలం నుంచి చూస్తే 11 శాతం క్షీణించాయి. అసలు బ్లాక్‌రాక్ మూలాలు యాక్టివ్ ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్)లోనే ఉన్నాయని చెప్పుకోవలి. 2002లో మొదటి యూఎస్ డోమిసిల్డ్ బాండ్ ఈటీఎఫ్‌ను ఆరంభించగా, గత పదేళ్ల కాలంలో యాక్టివ్ ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల్లోకి 280 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2022 జూన్ 30 నాటికి 954 బిలియన్ డాలర్ల ఆస్తులను యాక్టివ్ బాండ్ ఫండ్స్‌లో నిర్వహిస్తుంటే.. యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్‌లోని నిర్వహణ ఆస్తులు 393 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఈ ఏడాది బాండ్ మార్కెట్ కుప్పకూలడం యాక్టివ్ ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు బయటకు వెళ్లేందుకు దారితీసింది. ‘‘స్టాక్స్, బాండ్స్‌కు 2022 అత్యంత చెత్త ఆరంభంగా మిగిలిపోతుంది’’ అని బ్లాక్‌రాక్ చైర్మన్, సీఈవో లారీఫింక్ ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. -
మనీ పర్సుకు బైబై.. ప్రధానంగా 3 కారణాలతోనే అలా!
డిజిటల్ పేమెంట్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. 2021–22లో దేశంలో ఏకంగా 7,422 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేం ద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఒరవడి కొనసాగితే 2026కల్లా దేశంలో డిజిటల్ లావాదేవీలు లక్ష కోట్ల డాలర్లకు చేరతాయన్నది హాంకాంగ్‌కు చెంది న క్యాపిటల్ మార్కెట్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా.. ఎందుకీ డిజిటల్ చెల్లింపులు? నగదు చెల్లింపులకే ప్రాధాన్యమిచ్చే భారత ప్రజల్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి... 1. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయం జనాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించింది. అప్పటికి చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. రోజువారీ లావాదేవీల కోసం ప్రజలు డిజిటల్, ఆన్లైన్ బాట పట్టాల్సి వచ్చింది. తొలుత ఎక్కువగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే ఆన్లైన్ చెల్లింపులు జరిగాయి. 2. డిజిటల్ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం కరోనా. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్, సామాజిక దూరంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. కరోనా వల్ల బ్యాంకులు, ఆర్థికసంస్థలు విప్లవాత్మక మార్పులు చేపట్టాయి. సులువైన ఆన్లైన్ పేమెంట్లకు సురక్షిత మార్గాలు తెచ్చాయి. 2016 నాటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులకు దేశంలో పేటీఎం ఒక్కటే అందుబాటులో ఉండగా ఆ తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటివెన్నో వచ్చాయి. 3. డిజిటల్ చెల్లింపు సంస్థల మధ్య పోటీ పెరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండటం మూడో కారణం. ఇతర దేశాల్లో సౌలభ్యం కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే మన దగ్గర మాత్రం వాటి ద్వారా వచ్చే రాయితీల కోసం 60 శాతం మంది చెల్లింపులు చేస్తున్నట్లు గూగుల్–బీసీజీ సర్వేలో తేలింది. డిజిటల్ చెల్లింపులకు మార్గాలు డెబిట్, క్రెడిట్ కార్డులతో మొదలైన డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ ఆధారిత చెల్లింపులకే ఇప్పటికీ పెద్దపీట వేస్తున్నా ప్రి–పెయిడ్, ఎలక్ట్రానిక్ కార్డులు, స్మార్ట్ ఫోన్ యాప్‌లు, బ్యాంక్ యాప్‌లు, మొబైల్ వ్యాలెట్లు, పేమెంట్ బ్యాంకులు, ఆధార్ ఆధారిత పేమెంట్ పద్ధతులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (బీమ్) యాప్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ వ్యాలెట్లు ఐదు, పది రూపాయల లావాదేవీలనూ అనుమతిస్తుండటంతో తోపుడు బండ్ల నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్ల దాకా వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. 2020 అక్టోబర్‌లో 200 కోట్లున్న యూపీఐ లావాదేవీలు గత మార్చిలో 500 కోట్లకు పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న భారతీయుల సంఖ్య వచ్చే ఏడాదికల్లా 66 కోట్లకు చేరుతుందని అంచనా. మార్చిలో మారిన ట్రెండు డిజిటల్ చెల్లింపులు ఇంతలా పెరుగుతున్నా గత మార్చిలో అనూహ్యంగా నగదు చెల్లింపులు భారాగా పెరిగాయి. 2021 మార్చిలో రూ.2,62,539 కోట్ల నగదు చెల్లింపులు జరిగితే గత మార్చిలో రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వాలు పలు పథకాల కింద జనం ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుండటం, వాటిని డ్రా చేసుకోవడం ఇందుకు కారణంగా కన్పిస్తున్నాయి. ఏటీఎం నగదు విత్‌డ్రాయల్స్ కూడా 2020తో పోలిస్తే 2022 మార్చి నాటికి బాగా పెరిగాయి. ఎలా చెల్లిస్తున్నారు? భారతీయులు అత్యధికంగా యూపీఐ విధా నం వాడుతున్నారు. 2021–22లో రూ.84,17,572.48 కోట్ల విలువైన 4.5 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2020–21తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఆధార్ ఆధారిత విధానం (ఏఐపీఎస్) ద్వారా 3,00,380 కోట్ల రూపాయల విలువైన 23 కోట్ల లావాదేవీలు జరిగాయి. గత మార్చిలోనే 22.5 లక్షల లావాదేవీల ద్వారా 28,522 కోట్ల రూపాయల డిజిటల్ చెల్లింపులు జరిగాయి. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) ద్వారా 46 కోట్ల లావాదేవీల ద్వారా రూ.37,06,363 కోట్లు చేతులు మారి నట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. టోల్గేట్ చెల్లింపులు దాదాపుగా డిజిటైజ్ అయ్యాయి. 2021– 22లో 24 లక్షల ఫాస్ట్‌ట్యాగ్‌ల రూ.38,077 కోట్ల చెల్లింపులు జరిగాయి. మార్చిలో అత్యధికంగా రూ.4,000 కోట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ల ద్వారా వసూలయ్యాయి. ఇంతలా డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్నా దేశంలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో జనం నగదు చెల్లింపులకే మొగ్గుతున్నారు. అయితే ఈ దశాబ్దాంతానికల్లా డిజిటల్ చెల్లింపులు నగదు చెల్లింపులను దాటేస్తాయని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
రిస్క్ ప్రాజెక్టులకు ఈక్విటీ నిధులే బెటర్!
న్యూఢిల్లీ: అమలుకు విషయంలో ఇబ్బందులు ఉన్న (ఇంప్లిమెంటేషన్ రిస్క్) ప్రాజెక్టులకు సాధారణంగా క్యాపిటల్ మార్కెట్ల ద్వారా నిధులు సమీకరణే సమంజసమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు ప్రజా డిపాజిట్లను ఉపయోగించే బ్యాంకుల డబ్బు వినియోగం తగదని ఉద్ఘాటించారు. అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చగల, దాని నష్టాలను నిర్వహించగల బలమైన బాండ్ మార్కెట్ భారతదేశానికి అవసరమని అన్నారు. మొండిబకాయిలకు సంబంధించి భారత్ బ్యాంకింగ్ నియమ నిబంధనలు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఐబీఏలో తొలి అడుగే..: సంతోష్ కుమార్ శుక్లా కాగా కార్యక్రమంలో ఇన్సూరెన్స్ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ శుక్లా మాట్లాడుతూ, బ్యాంకింగ్‌లో ఎన్పీఏలు తగ్గుదలకు దివాలా చట్టం ఎంతో దోహదపడుతోందన్నారు. ఈ విషయంలో గడచిన ఐదేళ్లలో ఎంతో పురోగతి సాధించినా, ఇవి ఇంకా తొలి అడుగులుగానే భావించాలని అన్నారు. దివాలా పరిష్కార పక్రియలో చోటుచేసుకుంటున్న జాప్యం నేపథ్యంలో కొన్ని అసెట్స్ విలువల్లో క్షీణత సైతం చోటుచేసుకుంటోదన్నారు. సీఓసీ (క్రెడిటార్ల కమిటీ) వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలిగి, ఇతర వ్యవస్థలతో త్వరితగతిన అనుసంధానమై పనిచేయగలిగితే, దివాలా పరిష్కార పక్రియ మరింత వేగవంతం అవుతుందని అన్నారు. దేశ రుణ భారం తగ్గాలి: అజిత్ పాయ్ సమావేశంలో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్‌కు సంబంధించి నీతి ఆయోగ్ విశిష్ట నిపుణుడు అజిత్ పాయ్ మాట్లాడుతూ, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దేశ రుణ భారం నిష్పత్తి (దాదాపు 80 శాతం) మరింత తగ్గాల్సి ఉందన్నారు. ఇతర పలు జీ–20 దేశాలతో పోలి్చతే ఈ విషయంలో భారత్ వెనుకబడి ఉందని అన్నారు. -
ఐపీవోలకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలు దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో నిర్వాహక కంపెనీ లే ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్, కార్డియాక్ స్టెంట్ల తయారీ సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్, ఆహారం, పానీయాల సంస్థ కెవెంటర్ ఆగ్రో ఉన్నాయి. ► పబ్లిక్ ఇష్యూ ద్వారా ఇక్సిగో రూ. 1,600 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. తాజా ఈక్విటీ నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ► ఐపీవో ద్వారా సహజానంద్ మెడికల్ రూ. 1,500 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ► పబ్లిక్ ఇష్యూలో భాగంగా కెవెంటర్ ఆగ్రో రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.07 కోట్లకుపైగా షేర్లను మండాలా స్వీడే ఎస్పీవీ విక్రయానికి ఉంచనుంది. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెవెంటర్ ఆగ్రో పేర్కొంది. -
చిన్న ఇన్వెస్టర్లకూ ప్రభుత్వ బాండ్లు!!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా బ్యాంకులు, బీమా కంపెనీల్లాంటి పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ బాండ్లను ఇకపై చిన్న స్థాయి రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయొచ్చు. అంతే కాదు, బ్యాంకింగ్ సేవా లోపాలకు సంబంధించి వివిధ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకు సంబంధించిన రెండు స్కీములను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ వీటిలో ఉన్నాయి. దేశీయంగా పెట్టుబడి అవకాశాలను మరింతగా పెంచడానికి, సురక్షితమైన వ్యవస్థ ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో సులువుగా ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ తోడ్పడగలదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం నిధులు సమీకరించుకునేందుకు కూడా ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ‘‘మధ్య తరగతి, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు మొదలైన వర్గాల వారంతా తమ పొదుపు మొత్తాలను నేరుగా, సురక్షితంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సెక్యూరిటీలకు కచ్చితమైన సెటిల్మెంట్ హామీ ఉంటుంది కాబట్టి చిన్న ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుంది’’ అని మోదీ చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింతగా ప్రభావం చూపేందుకు రిజర్వ్ బ్యాంక్ విధానాలు కూడా తోడ్పడ్డాయని ఆయన తెలిపారు. సమష్టి కృషితో ఎకానమీ రికవరీ: ఆర్థిక మంత్రి కోవిడ్–19తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ఇటు ఆర్థిక శాఖ అటు ఆర్బీఐ కలిసికట్టుగా పనిచేయడం వల్ల, వేగంగా కోలుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రిటైల్ డైరెక్ట్ స్కీముతో బాండ్ల మార్కెట్ మరింతగా విస్తరించగలదని ఆమె తెలిపారు. మరోవైపు, తమ సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలను గణనీయంగా ఉపయోగించుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఈ స్కీముతో వ్యక్తిగత రిటైల్ ఇన్వెస్టర్లు ఇకపై ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లు, రాష్ట్రాల అభివృద్ధి రుణాలకు సంబంధించిన బాండ్లు మొదలైన వాటిని నేరుగా కొనుగోలు చేయొచ్చు. ఇతర ఇన్వెస్టర్లకు గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు. ఇందుకోసం ఆర్బీఐ వద్ద ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లు ఆయా ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. ఎన్డీఎస్–ఓఎం అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ బాండ్ల జారీ, సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఇది కేవలం బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి బడా సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఒకే అంబుడ్స్‌మన్.. సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021 కింద, రిజర్వ్ బ్యాంక్ పరిధిలో పనిచేసే ఆర్థిక సంస్థలు అందించే సేవల్లో లోపాలపై కస్టమర్లు ఒకే చోట ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు వంటి వాటికి వేర్వేరుగా అంబుడ్స్‌మన్ ఉంటున్నారు. వీటికి సంబంధించిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 అనే 3 స్కీములను కలిపి కొత్తగా సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021ను రూపొందించారు. రూ. 50 కోట్ల పైగా డిపాజిట్ పరిమాణం ఉన్న షెడ్యుల్యేతర సహకార బ్యాంకులనూ దీనిలోకి చేర్చారు. ఫిర్యాదులపై ఆయా ఆర్థిక సంస్థలు 30 రోజుల్లోగా సంతృప్తికరమైన పరిష్కారం చూపకపోతే, కస్టమర్లు సమగ్ర అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. -
సెక్యూరిటీ మార్కెట్లపై రిటైల్ ఇన్వెస్టర్ల ముద్ర
న్యూఢిల్లీ: సెక్యూరిటీ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం 2020 ఏప్రిల్ నుంచి పెరిగినట్టు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఎన్ఐఎస్ఎమ్ రెండో వార్షిక ‘క్యాపిటల్ మార్కెట్స్’ సదస్సులో భాగంగా త్యాగి మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ప్రతీ నెలా 24.5 లక్షల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమైనట్టు చెప్పారు. వడ్డీ రేట్లు కనిష్టాల్లో ఉండడం, నగదు లభ్యత తగినంత ఉండడం ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడానికి కారణాలుగా పేర్కొన్నారు. కానీ, అదే సమయంలో ఇన్వెస్టర్లకు ఆయన ఒక హెచ్చరిక చేశారు. వడ్డీ రేట్లు తిరిగి పెరగడం మొదలై, నగదు లభ్యత తగ్గితే అది మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందన్నారు. మార్కెట్లు ఎప్పుడూ భవిష్యత్తునే చూస్తుంటాయన్న ఆయన.. ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తు వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వస్తున్నవిగా పేర్కొన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి 4.1 కోట్లుగా ఉన్న మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య.. ఆర్థిక సంవత్సరం చివరికి 5.5 కోట్లకు పెరగడం గమనార్హం. అంటే 34.7 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది. ఈ లెక్కన గత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెలా సగటున 12 లక్షల చొప్పున కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20)లో ప్రతీ నెలా సగటున ప్రారంభమైన కొత్త డీమ్యాట్ ఖాతాలు 4.2 లక్షల చొప్పున ఉన్నాయి. మరింత వేగం.. ‘‘ఈ ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) మరింత వేగాన్ని అందుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతీ నెలా 24.5 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈక్విటీ మార్కెట్ టర్నోవర్ 2019–20లో రూ.96.6 లక్షల కోట్లుగా ఉంటే.. 2020–21లో రూ.164.4 లక్షల కోట్లకు పెరిగింది. 70.2 శాతం అధికమైంది. ట్రేడ్లలో ఎక్కువ భాగం మొబైల్స్, ఇంటర్నెట్ ఆధారిత వేదికల నుంచే నమోదు కావడం రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం పెరిగినదానికి సంకేతం’’ అని అజయ్ త్యాగి వివరించారు. రీట్, ఇన్విట్, ఈఎస్జీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షించినట్టు త్యాగి చెప్పారు. కరోనా కల్లోలిత సంవత్సరంలోనూ (2020–21) క్యాపిటల్ మార్కెట్ల నుంచి కంపెనీలు రూ.10.12 లక్షల కోట్లను సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన రూ.9.96 లక్షల కోట్ల కంటే స్వల్పంగా పెరిగింది. నూతన దశకం ‘‘బలమైన వృద్ధికితోడు మన మార్కెట్లు కొత్త యుగంలోకి అడుగు పెట్టాయి. పలు నూతన తరం టెక్ కంపెనీలు దేశీయంగా లిస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మరే ఇతర మార్కెట్‌తో చూసినా కానీ మన మార్కెట్లు నిధుల సమీకరణ విషయంలో ఆకర్షణీయంగా ఉన్నాయి’’ అని త్యాగి పేర్కొన్నారు. క్యాపిటల్ మార్కెట్ల బలోపేతానికి, మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా సెబీ ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. -
పన్ను భారం తగ్గిస్తే పెట్టుబడుల జోరు
ముంబై: బహుళ పన్నుల భారంతో మన క్యాపిటల్ మార్కెట్లు పోటీపడలేకపోతున్నాయని, పెట్టుబడుల రాకను పెంచేందుకు ప్రభుత్వం వీటిని తగ్గించాలని ఎన్ఎస్ఈ చీఫ్ విక్రమ్ లిమాయే కోరారు. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ), మూలధన లాభాల పన్ను (సీజీటీ), స్టాంప్ డ్యూటీ చార్జీలు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అన్నవి భారత్ వర్ధమాన మార్కెట్లతో పోడీపడే విషయంలో విఘాతం కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీ వృద్ధి ఆరేళ కనిష్ట స్థాయికి చేరి, మందగమనం ఎదుర్కొంటున్న తరుణంలో విక్రమ్ లిమాయే ఈ సూచనలు చేయడం గమనార్హం. ‘‘పన్నుల నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం అన్నది మన మార్కెట్ల ఆకర్షణీయతను గణనీయంగా పెంచుతుంది. మరింత మంది పెట్టుబడులు పెట్టడం వల్ల లిక్విడిటీ కూడా మెరుగుపడుతుంది’’ అని ఎన్ఎస్ఈ 25 ఏళ్ల ప్రయాణం సందర్భంగా మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లిమాయే అన్నారు. అదే సమయంలో కేంద్ర ఆర్థి క మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘‘భారత మార్కెట్ల పోటీ తత్వాన్ని పెంచేందుకు మొత్తం మీద లావాదేవీల వ్యయాలు (పన్నులు సహా), మార్జిన్లు, నిబంధనల అమలు వ్యయాలు తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి, సెబీ చైర్మన్ అజయ్ త్యాగిలను కోరుతున్నాను. అంతర్జాతీయంగా భారత వెయిటేజీ పెరిగేందుకు ఇది సాయపడుతుంది. దీంతో మరిన్ని విదేశీ పెట్టుబడులను మన మార్కెట్లు ఆకర్షించగలవు’’ అని లిమాయే ప్రకటన చేశారు. జన్‌ధన్ యోజన తరహా పథకం కావాలి... సామాన్యులూ షేర్లలో ట్రేడ్ చేసుకునేందుకు గాను డీమ్యాట్ ఖాతాల ప్రారంభానికి ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన తరహా పథకం అవసరమని విక్రమ్ లిమాయే అన్నారు. అప్పుడు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ సాయంతో ఇన్వెస్టర్లు ఖాతాను తెరిచేందుకు వీలుంటుందన్నారు. త్వరలో మరిన్ని సంస్కరణలు ఉంటాయ్.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబై: ప్రజలు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టబోతోందని ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రభుత్వం గతంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రయతి్నంచినప్పటికీ .. రాజ్యసభలో తగినంత బలం లేకపోవడంతో కొన్ని సాధ్యపడలేదని పేర్కొన్నారు. దేశం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే, సంస్కరణల అమలుకు సంబంధించి ఈసారి అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోదని ఆమె స్పష్టం చేశారు. మందగమనం బాటలో ఉన్న ఆరి్థక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం.. భూ, కారి్మక చట్టాలు మొదలైన వాటికి సంబంధించి తక్షణమే సంస్కరణలు చేపట్టాలంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
వృద్ధికి మరిన్ని సంస్కరణలే కీలకం..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కూడా కారణమని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ పేర్కొన్నారు. మరిన్ని సంస్కరణలు, నవకల్పనలు భారత వృద్ధికి కీలకంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, 2024–25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలంటే.. ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణలు అవసరమని డేవిడ్ తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించినా.. బ్యాంకింగ్ రంగం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ), క్యాపిటల్ మార్కెట్ల వంటి వాటి విషయంలో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ‘మూడు ప్రధాన రంగాల్లో పురోగతి సాధించాలి. ముందుగా ప్రైవేట్ రంగం సహా బ్యాంకింగ్ పరిశ్రమ వృద్ధికి తోడ్పాటు అందించాలి. కార్పొరేట్ బాండ్ మార్కెట్, తనఖా రుణాల మార్కెట్ మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థతో పాటే ఎదిగిన ఎన్బీఎఫ్సీల్లో రిస్కులు ఉన్న నేపథ్యంలో వాటిని నియంత్రించాలి. సరైన నియంత్రణ చర్యలు తీసుకుంటే.. ఆర్థిక రంగం మరింత మెరు గుపడుతుంది’ అని డేవిడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో 97 ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందిస్తోందని డేవిడ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం 24 బిలియన్ డాలర్లు అందించేందుకు ప్రపంచ బ్యాంకు కట్టుబడి ఉందన్నారు. -
పీఏసీఎల్ ఇన్వెస్టర్లు రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోండి: సెబీ
న్యూఢిల్లీ: పీఏసీఎల్ గ్రూప్, ప్రమోటర్ల ప్రమేయం ఉన్న ఆస్తుల కొనుగోళ్ల విషయమై అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ప్రజలను హెచ్చరించింది. పీఏసీఎల్ సంస్థకు చెందిన ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. పీఏసీఎల్ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ జారీ చేసిన నిర్దేశిత ఫార్మాట్లో ఇన్వెస్టర్లు రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. -
రూ.2.23 లక్షల కోట్లకు పి-నోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్స్(పి-నోట్స్) ఇన్వెస్ట్మెంట్స్ మార్చినాటికి రూ.2.23 లక్షల కోట్లకు చేరాయి. ఫిబ్రవరిలో ఈ పి-నోట్ల పెట్టుబడులు 18 నెలల కనిష్టానికి పడిపోయాయి. కాగా పి-నోట్ల పెట్టుబడులు పెరగడం 4 నెలల్లో ఇదే తొలిసారి. నవంబర్ నుంచి పి-నోట్ల పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నా యి. విదేశీ హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్, హెడ్జ్ ఫండ్స్, ఇతర విదేశీ సంస్థలు పి. నోట్ల ద్వారా మన క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల సమయాన్ని, వ్యయాలను ఈ పి-నోట్ల పెట్టుబడులు ఆదా చేస్తాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2,17,740 కోట్లుగా ఉన్న భారత క్యాపిటల్ మార్కెట్లో (ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్) పి నోట్ల పెట్టుబడులు గత నెలలో రూ.2,23,077 కోట్లకు పెరిగాయి. -
బడ్జెట్ ‘సమ్’గతులు
ఎస్టీటీ లక్ష్యం పెంపు ఎస్‌టీటీను 2004లో ప్రవేశపెట్టారు. క్యాపిటల్ మార్కెట్లో ఈక్విటీల కొనుగోలు లేదా అమ్మకపు లావాదేవీపై విధించే పన్ను ఇది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎస్టీటీ వసూలు లక్ష్యం రూ. 6,000 కోట్లు. ఈ ఏడాది(2013-14) లక్ష్యం రూ. 6,720 కోట్లుకాగా, తాజాగా రూ. 5,497 కోట్లకు తగ్గించారు. దీంతో పోలిస్తే వచ్చే ఏడాది లక్ష్యం 9% అధికం. గడిచిన ఏడాది(2012-13)లో ఈ వసూళ్లు రూ. 4,997 కోట్లు. ఏడీఆర్, జీడీఆర్ నిబంధనలు మారుస్తాం... ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత విస్తరించే దిశలో విదేశీ లిస్టెడ్ సెక్యూరిటీల నిబంధనలను మొత్తంగా సమీక్షించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనిలో భాగంగా దేశీ కంపెనీలు జారీ చేసే ఏడీఆర్, జీడీఆర్‌ల నిబంధనలను హేతుబద్ధీకరించనున్నట్లు చిదంబరం పేర్కొన్నారు. వీటితోపాటు దేశీయంగా కార్పొరేట్ బాండ్లు, కరెన్సీ డెరివేటివ్స్ మార్కెట్‌ను వృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విభాగాల వైపు రిటైల్, సంపన్న వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా కంపెనీలు తక్కువ ఖర్చులో దీర్ఘకాలిక నిధులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కుతుందన్నారు. ఇక విదేశీ కరెన్సీ రిస్క్‌లను త ట్టుకునేందుకు వీలుగా కరెన్సీ డెరివేటివ్స్ మార్కెట్‌ను పటిష్టపరచనున్నట్లు తెలిపారు. తద్వారా కంపెనీలు పూర్తిస్థాయిలో హెడ్జింగ్‌ను చేపట్టే వీలుంటుందన్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా... ఈ మార్చిలోగా హిందుస్తాన్ జింక్, బాల్కోలలో ప్రభుత్వానికి గల వాటాలను విక్రయించడం సాధ్యపడదని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి మాయారామ్ చెప్పారు. దీంతో ఈ ఏడాది ప్రభుత్వేతర కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 3,000 కోట్లను మాత్రమే సమీకరించగలమని భావిస్తున్నట్లు ప్రస్తుత తాత్కాలిక బడ్జెట్లో పేర్కొన్నారు. తొలుత వీటి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 14,000 కోట్లను సమీకరించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాక ఆర్థిక మంత్రి చిదంబరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాయారామ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వానికి హిందుస్తాన్ జింక్‌లో 29.54%, బాల్కోలో 49% చొప్పున వాటా ఉంది. కాగా, ఈ ఏడాది(2014-15)కి డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సగానికిపైగా తగ్గిస్తూ రూ. 16,027 కోట్లకు ఆర్థిక శాఖ పరిమితం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల విక్రయం ద్వారాతొలుత రూ. 36,925 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. మన స్టాక్ మార్కెట్లు మెరుగే ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే దేశీ స్టాక్ మార్కెట్లు మెరుగైన పనితీరునే కనపరిచాయని ప్రస్తుత తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా చిదంబరం వ్యాఖ్యానించారు. ఇందుకు ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలు దోహదం చేశాయని చెప్పారు. క్యాపిటల్ మార్కెట్ సంస్కరణలు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి అదనపు అధికారాలిచ్చే బిల్లుకు ఆమోదం లభించనప్పటికీ క్యాపిటల్ మార్కెట్ సంస్కరణలకు సంబంధించి పలు చర్యలను చేపట్టినట్లు ఆర్థిక మంత్రి చిదంబరం తాత్కాలిక బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బీమా చట్టాల సవరణ, సెక్యూరిటీల చట్ట సవరణ వంటి అత్యున్నత బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొందలేకపోవడంతో నిరుత్సాహానికి లోనయ్యామని వ్యాఖ్యానించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణకు సంబంధించి సెబీతో చర్చల ద్వారా వివిధ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలిపారు. వివిధ కేట గిరీలకింద విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను(ఎఫ్‌పీఐలు) గుర్తించడం, మనీ లాండరింగ్‌ను నిరోధించే చట్టానికి(పీఎంఎల్ఏ) సవరణలు చేయడం వంటి ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిపారు. ఎగుమతులు ఆశావహం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) ఎగుమతులు ఆశావహంగా ఉంటాయన్న అంచనాలను ఆర్థికమంత్రి పీ చిదంబరం వెలిబుచ్చారు. ఈ పరిమాణం 6.3 శాతం వృద్ధితో 326 బిలియన్ డాలర్లుగా నమోదవుతాయని భావిస్తున్నట్లు చిదంబరం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2013-14లో భారత్ ఎగుమతులు అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2012-13)తో పోల్చితే 1.8 శాతం తగ్గి, 300.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా దిగుమతులు తగ్గుతున్నట్లు చిదంబరం పేర్కొన్నారు. క్యాడ్ కట్టడిలో భాగంగా బంగారం దిగుమతులపై ఆంక్షలు దీనికి ప్రధాన కారణమని కూడా ఆయన వివరించారు. మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి మౌలిక రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఆర్థిక మంత్రి చిదంబరం తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా పేర్కొన్నారు. తద్వారా రూ. 6,60,000 కోట్ల విలువైన ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లకు దారిచూపినట్లు చెప్పారు. వివిధ కారణాలతో పలు ప్రాజెక్ట్‌లు నిలిచిపోయిన పరిస్థితుల్లో పెట్టుబడులపై క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా 296 ప్రాజెక్ట్‌లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ల అంచనా విలువ రూ. 6,60,000 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ షాక్ ఇచ్చింది: జెమ్స్ అండ్ జ్యూవెలరీ బడ్జెట్ పట్ల ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూవెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బడ్జెట్ తమను షాక్‌కు గురి చేసిందని జీజేఎఫ్ చైర్మన్ హరేష్ సోని వ్యాఖ్యానించారు. పుత్తడిపై దిగుమతి సుంకాలు తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతమున్న సుంకాల కారణంగా బంగారం స్మగ్లింగ్ పెరిగిపోతోందని పేర్కొన్నారు. పుత్తడి దిగుమతి ఆంక్షల కారణంగా లక్షలాది స్వర్ణకారులు, చేతి నిపుణులకు పని లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్ని సార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. పెద్ద, మధ్య తరహా కార్లు, ఎస్యూవీ వంటి విలాస వస్తువులపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన ప్రభుత్వం 40 లక్షల మందికి ఉపాధినిస్తున్న దేశీయ జెమ్స్ అండ్ జ్యూవెలరీ పరిశ్రమపై విచక్షణ చూపిందని విమర్శించారు. క్యాడ్ పెరిగి పోవడానికి పుత్తడి ఒక్కటే కారణం కాదని, ప్రజలు బంగారాన్ని ఉత్తమమైన సామాజిక ఆస్తిగా పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
6 నెలల్లో మరిన్ని సంస్కరణలు
న్యూఢిల్లీ: దేశం మళ్లీ అధిక వృద్ధిబాట పట్టే దిశగా వచ్చే ఆరు నెలల్లో క్యాపిటల్ మార్కెట్లు, ఆర్థిక రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. వచ్చే ఏడాది వృద్ధి రేటు 6 శాతానికి పెరగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను సరళీకరించడం, ప్రాజెక్టులకు ఆటంకాలను తొలగించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆర్థిక అంశాలపై శుక్రవారం జరిగిన ఒక సదస్సులో చిదంబరం తెలిపారు. ‘నేను చేయాల్సిన పనులకు సంబంధించి పెద్ద చిట్టా ఉంది. దాన్ని రోజూ ఫాలో చేస్తుంటాను. క్యాపిటల్ మార్కెట్లను, ఆర్థిక రంగాన్ని సరళీకరించాలి.. గ్యాస్, చమురు ధరల సమస్యలను పరిష్కరించాలి. మరింత బొగ్గు ఉత్పత్తి చేసే దిశగా బొగ్గు రంగంలో కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాం. నిల్చిపోయిన ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పెట్టుబడుల క్యాబినెట్ కమిటీ మరిన్ని సార్లు భేటీ కానుంది. ఇలా చేయాల్సినవి చాలా ఉన్నాయి.. వీటన్నింటినీ కచ్చితంగా చేస్తాం’ అంటూ ఆయన వివరించారు. ఒత్తిడి అధిగమించ గలం.. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల తరహాలోనే భారత ఎకానమీ కూడా ఒత్తిడిలో ఉందని, అయితే దీన్ని కచ్చితంగా అధిగమించగలమని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. 2014-15లో వృద్ధి రేటు 6 శాతానికి చేరువలో ఉండగలదని, రెండేళ్ల వ్యవధిలో మరింత మెరుగుపడి 8 శాతానికి పెరగగలదని పేర్కొన్నారు. 2012-13లో ఎకానమీ వృద్ధి పదేళ్ల కనిష్టమైన 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ వృద్ధి..నాలుగేళ్ల కనిష్టమైన 4.4 శాతంగా ఉండటాన్ని ప్రస్తావించిన చిదంబరం ఇది నిరాశపర్చిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పటడుగులు వేయకుండా ఆర్థిక క్రమశిక్షణ బాటలో ముందుకు సాగాల్సి ఉంటుందని చిదంబరం చెప్పారు. పెట్టుబడులపై నిర్ణయాలను వేగవంతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అధిక వృద్ధికి బాటలు వేయగలవని పేర్కొన్నారు. భారత్‌పై ఇన్వెస్టర్ల అభిప్రాయం క్రమంగా మారుతోందన్నారు. పరిశ్రమ వర్గాలు ఓపిక పట్టాలి.. ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం చివరి రోజు వరకూ పాటుపడతామని చిదంబరం చెప్పారు. సరైన నిర్ణయం తీసుకున్నామా లేదా అన్నది ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఫలితాలను చూసే దాకా పరిశ్రమ వర్గాలు ఓపిక పట్టాలని పేర్కొన్నారు.