పీఏసీఎల్ ఇన్వెస్టర్లు రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోండి: సెబీ
న్యూఢిల్లీ: పీఏసీఎల్ గ్రూప్, ప్రమోటర్ల ప్రమేయం ఉన్న ఆస్తుల కొనుగోళ్ల విషయమై అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ప్రజలను హెచ్చరించింది. పీఏసీఎల్ సంస్థకు చెందిన ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది.
పీఏసీఎల్ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ జారీ చేసిన నిర్దేశిత ఫార్మాట్‌లో ఇన్వెస్టర్లు రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.