ఉచిత స్వచ్ఛంద ఆన్‌లైన్ పరీక్షకు సై
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సర్టిఫికేషన్ పరీక్షను నిర్వహించనుంది. దీంతో ఉచితంగా స్వచ్చంద పద్ధతిలో ఇన్వెస్టర్లు ఆన్‌లైన్‌లో పరీక్షను రాయడం ద్వారా సరి్టఫికేషన్‌ను అందుకునేందుకు వీలుంటుంది. తద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సమగ్ర విజ్ఞానాన్ని పొందవచ్చని ఒక ప్రకటనలో సెబీ పేర్కొంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్‌ఐఎస్‌ఎం) సహకారంతో అభివృద్ధి చేసిన సర్టిఫికేషన్‌ను సెబీ జారీ చేయనుంది. వెరసి ఇన్వెస్టర్లు స్వచ్చందంగా మార్కెట్లు, పెట్టుబడుల విషయంలో తమ విజ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ సెక్యూరిటీల మార్కెట్లో ప్రావీణ్యాన్ని పెంచుకునేందుకు పరీక్ష ఉపయోగపడుతుందని తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment