న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(రీట్)లలో యూనిట్లు కలిగిన పెట్టుబడిదారులకు ప్రత్యేక హక్కులను కలి్పంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. కార్పొరేట్ సుపరిపాలనకు మరింత బూస్ట్‌నిస్తూ రీట్ బోర్డులలో తమ ప్రతినిధుల(నామినీ)ను ఎంపిక చేసుకునేందుకు యూనిట్ హోల్డర్లకు వీలు కలి్పంచింది. ఇందుకు తాజా నిబంధనలను విడుదల చేయడంతోపాటు.. సవరణలకు తెరతీసింది. దీంతో ఇకపై సెల్ఫ్ స్పాన్సర్డ్ రీట్‌లకూ మార్గమేర్పడనుంది.
యూనిట్ హోల్డర్లు నామినేట్ చేసే సభ్యులకు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ల నిర్వహణా సంబంధ నిబంధనలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీ రీట్ నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఏదైనా ఒక రీట్‌లో 10 శాతానికంటే తక్కువకాకుండా వ్యక్తిగతంగా లేదా సామూహికంగా యూనిట్లు కలిగిన యూనిట్ హోల్డర్లు సంస్థ బోర్డులో ఒక డైరెక్టర్‌ను నియమించవచ్చు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(ఇని్వట్)లు, రీట్‌లలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది.
అయితే ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్లు తీసుకునే నిర్ణయాలపై యూనిట్ హోల్డర్లకు ఎలాంటి హక్కులూ లభించడంలేదు. దీంతో ట్రస్ట్‌లు తదితర భారీ పెట్టుబడిదారు సంస్థలు బోర్డులో సభ్యత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. కాగా.. సెబీ తాజా నిబంధనలతో ఇన్వెస్టర్లలో వి శ్వాసం మెరుగుపడుతుందని ఎన్‌డీఆర్ ఇన్విట్ మేనేజర్స్ సీఎఫ్‌వో సందీప్ జైన్ పేర్కొన్నారు. అటు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు, ఇటు కంపెనీకి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment