Privileges
-
రీట్ హోల్డర్లకు ప్రత్యేక హక్కులు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)లలో యూనిట్లు కలిగిన పెట్టుబడిదారులకు ప్రత్యేక హక్కులను కలి్పంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. కార్పొరేట్ సుపరిపాలనకు మరింత బూస్ట్‌నిస్తూ రీట్ బోర్డులలో తమ ప్రతినిధుల(నామినీ)ను ఎంపిక చేసుకునేందుకు యూనిట్ హోల్డర్లకు వీలు కలి్పంచింది. ఇందుకు తాజా నిబంధనలను విడుదల చేయడంతోపాటు.. సవరణలకు తెరతీసింది. దీంతో ఇకపై సెల్ఫ్ స్పాన్సర్డ్ రీట్లకూ మార్గమేర్పడనుంది. యూనిట్ హోల్డర్లు నామినేట్ చేసే సభ్యులకు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల నిర్వహణా సంబంధ నిబంధనలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీ రీట్ నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఏదైనా ఒక రీట్‌లో 10 శాతానికంటే తక్కువకాకుండా వ్యక్తిగతంగా లేదా సామూహికంగా యూనిట్లు కలిగిన యూనిట్ హోల్డర్లు సంస్థ బోర్డులో ఒక డైరెక్టర్‌ను నియమించవచ్చు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇని్వట్)లు, రీట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు తీసుకునే నిర్ణయాలపై యూనిట్ హోల్డర్లకు ఎలాంటి హక్కులూ లభించడంలేదు. దీంతో ట్రస్ట్‌లు తదితర భారీ పెట్టుబడిదారు సంస్థలు బోర్డులో సభ్యత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. కాగా.. సెబీ తాజా నిబంధనలతో ఇన్వెస్టర్లలో వి శ్వాసం మెరుగుపడుతుందని ఎన్డీఆర్ ఇన్విట్ మేనేజర్స్ సీఎఫ్‌వో సందీప్ జైన్ పేర్కొన్నారు. అటు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు, ఇటు కంపెనీకి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. -
‘జెట్ ప్రివిలేజ్’పై బ్లాక్‌స్టోన్ కన్ను
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్.. రుణభారాలను తగ్గించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తమ లాయల్టీ ప్రోగ్రాం ’జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్’లో వాటాల విక్రయ అంశం కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాటాల కొనుగోలుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ డీల్ గానీ కుదిరితే జెట్ ప్రివిలేజ్ సంస్థ వ్యాల్యు యేషన్ రూ. 3,000 కోట్లు– రూ. 4,000 కోట్ల దాకా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. విదేశీ రుణభారం తగ్గించుకునే యత్నాల్లో భాగంగా జెట్ ఎయిర్వేస్ సుమారు రూ. 5,000 కోట్ల సమీకరణకు ఇప్పటికే ఎస్బీఐ కన్సార్షియంను సంప్రదించినట్లు సమా చారం. తరచూ జెట్ ఎయిర్వేస్లో ప్రయా ణించే వారికి లాయల్టీ, రివార్డ్ పాయింట్లు మొదలైన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. -
ఆలోచన వచ్చింది.. మరుగుదొడ్డే రాలే!
♦ జిల్లాలో నత్తనడకన ‘స్వచ్ఛ్భారత్ మిషన్’ ♦ ఇప్పటికీ పూర్తికాని ఎంపిక ప్రక్రియ ♦ పథకాన్ని నీరుగారుస్తున్న ‘ప్రత్యేకాధికారులు’ ‘ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది’.. ఇదీ స్వచ్ఛ భారత్ మిషన్ సరికొత్త నినాదం. ఈ మిషన్‌లో భాగంగా సంపూర్ణ పారిశుద్ధ్యం కింద కేంద్ర ప్రభుత్వం వేలకొద్ది మరుగుదొడ్లు మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతల్ని అధికారులకు కట్టబెట్టింది. కానీ వారిలో చిత్తశుద్ధిలోపం కారణంగా జిల్లాలో ఈ పథకం నత్త కంటే నెమ్మదిగా సాగుతోంది. 2015- 16 వార్షిక సంవత్సరంలో జిల్లాకు 25,210 మరుగుదొడ్లు మంజూరు కాగా.. వీటిలో ఇప్పటివరకు 1,428 మాత్రమే పూర్తికావడం అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: పారిశుద్ధ్యం అందరి బాధ్యత అంటూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన స్వచ్ఛ్భారత్ మిషన్ (ఎస్‌బీఎమ్) జిల్లాలో నత్తనడకన సాగుతోంది.ఈ మిషన్ కింద పేదలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రాయితీలు కేటాయించింది. అర్హులైన నిరుపేదలు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.12వేలు సదరు లబ్ధిదారుడికి చెల్లిస్తుంది. ఈ మరుగుదొడ్ల నిర్మాణాలను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడంతోపాటు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి కూడా బాధ్యతల్ని అప్పగించింది. ఈ క్రమంలో జిల్లాకు 25,210 మరుగుదొడ్ల యూనిట్లు మంజూరయ్యాయి. కానీ వీటి నిర్మాణంపై అధికారులు దృష్టి సారించకపోవడంతో జిల్లాలో గత నెలాఖరునాటికి కేవలం 1,428 మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 682 యూనిట్లు వివిధ దశల్లో ఉండగా.. 23,100 మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొలిక్కిరాని ఎంపిక ప్రక్రియ.. స్వచ్ఛ్భారత్ మిషన్ కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ కార్యక్రమం కింద గతేడాది నవంబర్‌లో మరుగుదొడ్లు మంజూరయ్యాయి. జిల్లాలో 32 మండలాలను ఈ పథకం కింద ఎంపిక చేసిన యంత్రాంగం.. ఒక్కో మండలంలో ఐదు నుంచి ఆరు గ్రామాలను తీసుకుని ఆ మేరకు లక్ష్యాల్ని పూర్తి చేయాలని భావించింది. ఇందుకుగాను ప్రత్యేకాధికారులను సైతం నియమించింది. అయితే అప్పటినుంచి వరుసగా నవాబ్‌పేట జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు.. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆదిలోనే నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి. లక్ష్యదూరంలో ఎన్బీఏ.. స్వచ్ఛ భారత్ మిషన్‌కు ముందు నిర్మల్ భారత్ అభియాన్(ఎన్బీఏ) కింద గత ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టింది. ఇందులో భాగంగా 2013-14 సంవత్సరంలో జిల్లాకు 25,760 మరుగుదొడ్లు జిల్లాకు మంజూరయ్యాయి. వీటికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ నిర్మాణాలకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో అధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి లక్ష్యాలు సైతం పూర్తికాలేదు. మంజూరైన వాటిలో కేవలం 16,200 మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 9,270 మరుగుదొడ్ల నిర్మాణాలు అతీగతీలేకుండా పోయాయి. రెండేళ్ల కిత్రం నాటి లక్ష్యాల్నే సాధించని అధికారులు.. తాజాగా మంజూరైన వాటిని రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తారో చూడాలి. -
ముక్కు మూసుకోవాల్సిందే..!
సాక్షి, కడప: జిల్లాలోని అధిక శాతం పంచాయతీలు పారిశుధ్యలోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుధ్య సమస్య పంచాయతీలను పట్టిపీడిస్తోంది. కాదు... కాదు... ఈ సమస్యను పెంచిపోషిస్తున్నారు పంచాయతీ అధికారులు, పాలకులు. చాలా గ్రామాల్లో మురికి కాలువలు లేవు... ఉన్నవాటిలో పూడిక తీయకపోవడంతో అవి అస్తవ్యస్తంగా మారాయి. ఆ దారులలో నడవాలంటే ముక్కులు మూసుకోవాల్సిందే. పారిశుధ్యలోపంతో జ్వరాలు, అంటువ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు. రెండేళ్లకు పైగా పంచాయతీలలో సర్పంచ్‌లు లేక ప్రత్యేకాధికారులు పాలన కొనసాగింది. ఈ కాలంలో పంచాయతీలో ఉన్న సమస్యలు చెప్పేందుకు కూడా బాధ్యులు లేరు. ప్రత్యేకాధికారులు ఏదైనా సమావేశం ఉన్నప్పుడు మినహా గ్రామాల్లో సందర్శించడం, పంచాయతీ సమస్యలను పరిష్కరించడం లాంటి చర్యలకు ఏనాడూ ఉపక్రమించలేదు. దీంతో పంచాయతీలు మురికికూపాలుగా మారాయి. ఆస్తిపన్ను వసూలు చేయడంలో నిర్లక్ష్యం చూపని అధికారులు సమస్యలను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధచూప లేదు. ఈ ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కొత్త సర్పంచ్‌లు కొలువుదీరారు. అయితే వారు లక్షల రూపాయలు ఖర్చు చేసి సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. పంచాయతీ నిధులు వస్తే... తమ ఖర్చును పూడ్చుకోవాలని చూస్తున్నారే తప్ప పంచాయతీని బాగుచేద్దామని ఆలోచన చాలామందిలో కన్పించడం లేదు. పంచాయతీలకు రూ.15.05కోట్లు: ఈ ఏడాది పంచాయతీలకు రూ. 15.05 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ మొత్తం ట్రెజరీలో ఉంది. త్వరలోనే పంచాయతీల అకౌంట్‌కు చేరుతుంది. ప్రస్తుతం చెక్‌పవర్ అధికారం తిరిగి కట్టబెట్టడంతో వీటి ఖర్చు బాధ్యత పూర్తిగా సర్పంచ్‌లకే ఉంటుంది. సగటున ప్రతి పంచాయతీకి దాదాపు 1.90 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. మరి ఈ నిధులతో పల్లెల్లో పారిశుధ్యంతో పాటు ఇతర సమస్యలను ఏ మేరకు పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే! సమస్యలపై నిర్లక్ష్యం... ఆదాయంపై మక్కువ: పల్లెల్లో సమస్యలతో గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే పంచాయతీ అధికారులు మాత్రం సమస్యలు తీర్చకుండా ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఏడాది ఏప్రిల్ నుంచి ఆస్తిపన్నును 2శాతం అదనంగా వసూలు చేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఇతర చర్యల ద్వారా దాదాపు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 70కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని అర్జించే మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అద్దెకు ఇవ్వడం, లేఅవుట్లపై కఠినంగా వ్యవహరించడం లాంటి చర్యలతో ఖజాను నింపుకోనున్నారు. ఇదే శ్రద్ధ పల్లెల్లో పారిశుధ్యంపై చూపాలని, ప్రభుత్వ నిధులతో పాటు కొత్తగా చేకూరే ఆదాయాన్ని పల్లెల్లో ఖర్చు చేస్తే బాగుంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఫొటోలో కన్పిస్తున్న దృశ్యం ఎర్రగుంట్ల మండలం టి.సుంకేసుల గ్రామంలోనిది. గ్రామంలో మురికి కాలువలతో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి మురికినీటిని రోడ్డుపైకి వదులుతుంటారు. దీంతో ఈ రోడ్డు నిత్యం మురికినీటి కూపంగా ఉంటుంది. పైగా మంచినీటిపైపులు పగిలిపోయాయి. ఈ ఫొటోలో కన్పిస్తున్న దృశ్యం రాజుపాళెం మండలం గాదెగూడురులోనిది. రోడ్డుపై కనిపిస్తున్న మురికి నీరు రెండేళ్లుగా గ్రామాన్ని పట్టిపీడిస్తోంది. ఎప్పుడో తీసిన మురికికాలువలు పూర్తిగా పూడిపోయాయి. గ్రామస్తులు ఇళ్లలోని నీటిని రోడ్డుపైనే పారబోస్తున్నారు.