
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్.. రుణభారాలను తగ్గించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తమ లాయల్టీ ప్రోగ్రాం ’జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్’లో వాటాల విక్రయ అంశం కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాటాల కొనుగోలుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ డీల్ గానీ కుదిరితే జెట్ ప్రివిలేజ్ సంస్థ వ్యాల్యు యేషన్ రూ. 3,000 కోట్లు– రూ. 4,000 కోట్ల దాకా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
విదేశీ రుణభారం తగ్గించుకునే యత్నాల్లో భాగంగా జెట్ ఎయిర్‌వేస్ సుమారు రూ. 5,000 కోట్ల సమీకరణకు ఇప్పటికే ఎస్‌బీఐ కన్సార్షియంను సంప్రదించినట్లు సమా చారం. తరచూ జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయా ణించే వారికి లాయల్టీ, రివార్డ్ పాయింట్లు మొదలైన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment