![SEBI Announces MITRA Platform to Help Investors Track](/styles/webp/s3/article_images/2025/02/16/sebi.jpg.webp?itok=r3titVtH)
యాక్టివ్‌గా లేని పెట్టుబడుల గుర్తింపు సులభతరం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల కోసం ‘మిత్రా’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సెబీ తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి, వాటి వివరాలు మర్చిపోయిన వారు, దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు లేకుండా ఉండిపోయిన వాటిని సులభంగా గుర్తించేందుకు ఈ ప్లాట్‌ఫామ్ సాయపడనుంది. ఇలాంటి చురుగ్గాలేని (ఇనాక్టివ్), చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన (అన్‌క్లెయిమ్డ్) పెట్టుబడులను తిరిగి గుర్తించి, వెనక్కి తీసుకోవడానికి ఈ చర్య తీసుకుంది.
గతంలో చేసిన పెట్టుబడుల వివరాలను మర్చిపోయి, తాజా కాంటాక్ట్ సమాచారం లేక, తమ పేరిట చేసిన పెట్టుబడులపై అవగాహన లేని వారి విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలకు ఈ ప్లాట్‌ఫామ్ పరిష్కారం చూపుతుందని సెబీ తన తాజా సర్క్యులర్‌లో వెల్లడించింది. ఈ తరహా యాక్టివ్‌గా లేని ఫోలియోలు (పెట్టుబడులు) మోసపూరిత ఉపసంహరణలకు దారితీయవచ్చని పేర్కొంది.
రిజిస్టార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్.. క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన పెట్టుబడులను తగ్గించేందుకు సాయపడుతుందని పేర్కొంది. పదేళ్లుగా పెట్టుబడులు, మరే ఇతర ఆర్థికేతర లావాదేవీలు లేకుండా ఉండిపోయిన పెట్టుబడులను ఇనాక్టివిగా పరిగణిస్తుంటారు. ఇన్వెస్టర్లకు సంబంధించి ఇనాక్టివ్ ఫోలియోలు, అన్‌క్లెయిమ్డ్ డివిడెండ్‌లను గుర్తించి.. వాటిని తగ్గించే బాధ్యతను ‘యూనిట్ హోల్డర్ ప్రొటెక్షన్ కమిటీ’పై పెట్టింది. తాజా చర్యల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలంటూ ఏఎంసీలు, ఆర్‌టీఏలు, ఆర్‌ఐఏలు, యాంఫి, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులను సెబీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment