
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల అన్ని టెలికాం ఆపరేటర్లను వినియోగదారుల ప్రయోజనం కోసం.. వాయిస్ కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సేవలను కలిగి ఉన్న సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు ప్రతిస్పందనగా, రిలయన్స్ జియో ఎటువంటి డేటా ప్రయోజనాలను అందించకుండా.. కాలింగ్, ఎస్ఎమ్ఎస్ వంటి వాటికోసం మాత్రమే రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.
రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్‌లు (రూ.458, రూ.1958) ప్రత్యేకంగా వాయిస్ కాల్స్ & టెక్స్ట్ మెసేజస్ వంటివి మాత్రమే అవసరమయ్యే వారికి ఉపయోగపడతాయి. అంటే ఈ ప్లాన్‌లలో డేటా లభించదు.
రూ.458 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే ఉంటుంది. వ్యాలిడిటీ సమయంలో అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 ఎస్‌ఎంఎస్‌లు, నేషనల్ రోమింగ్ వంటివి లభిస్తాయి. అంతే కాకుండా.. జియో సినిమా, జియో టీవీ, జియోకు సంబంధించిన యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు.
ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?
రూ. 1,958 ప్లాన్
ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్‌ఎంఎస్‌లు, నేషనల్ రోమింగ్ సేవలు ఉన్నాయి. వీటితో పాటు.. వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ యాక్సెస్‌ను పొందుతారు. కొత్త ప్లాన్‌ల తీసుకొచ్చిన జియో.. రూ. 479, రూ. 1899 ప్లాన్‌లను నిలిపివేసింది.