data
-
సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
రిలయన్స్ జియో 26 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) బ్యాండ్‌లో హై-ఫ్రీక్వెన్సీ 5జీ సేవలను ప్రారంభించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికే దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్న మిడ్-బ్యాండ్ 3.3 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో జియో ప్రస్తుత 5జీ కవరేజీని ఎంఎంవేవ్ రోల్అవుట్ భర్తీ చేస్తుంది.ప్రస్తుత మిడ్-బ్యాండ్ 5జీ బలమైన పనితీరు, విస్తృత కవరేజీని అందిస్తూ వినియోగదారుల అవసరాలను చాలా వరకూ తీరుస్తుండగా, ఎంఎంవేవ్ బ్యాండ్ లేదా 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ప్రత్యేక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు అంటే వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.ఏమిటీ ఎంఎంవేవ్ 5జీ?మిల్లీమీటర్ వేవ్ 5 జి సాంప్రదాయ మొబైల్ నెట్‌వర్క్‌ల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. ఇది అల్ట్రా-ఫాస్ట్ డేటా ట్రాన్స్మిషన్, చాలా తక్కువ లేటెన్సీని అనుమతిస్తుంది. అయితే దీని పరిధి పరిమితంగా ఉంటుంది. ఇది భవనాలలోకి చొచ్చుకువెళ్లలేదు. అలాగే విస్తృత ప్రాంతాలను కవర్ చేయలేదు. అందుకే ఎంఎంవేవ్ 5జీకి మరింత దట్టమైన మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్లు, చిన్న సెల్స్, కచ్చితమైన ప్లేస్మెంట్ అవసరమవుతాయి. దీని వల్ల ఖరీదు కూడా ఎక్కువే.దేశవ్యాప్త వినియోగదారుల రోల్అవుట్ల కంటే నిర్దేశిత ప్రదేశాలల్లో ఏర్పాటుకే ఇవి అనుకూలంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెగ్యులర్ మొబైల్ బ్రౌజింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి ఎంఎంవేవ్ నుండి పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రిమోట్ సర్జరీలు వంటి ఎంటర్ప్రైజ్ సంబంధిత వినియోగానికి మాత్రం అత్యధిక వేగం, తక్కువ జాప్యంతో ఇది సేవలందిస్తుంది.ఎంఎంవేవ్ 5జీ లాంచ్ ఎక్కడెక్కడంటే..జియో ఎంఎంవేవ్ 5జీ ఇప్పుడు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది. వీటిలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో ఎంఎంవేవ్ 5జీ అందుబాటులోకి వచ్చింది. ఇక తూర్పు, ఈశాన్య భారతదేశం విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
బ్యాకప్‌లో మనమే అప్
సాక్షి, హైదరాబాద్: మల్టీ నేషనల్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు.. చివరికి సాధారణ వ్యక్తులకు కూడా నేడు డిజిటల్ డేటా కీలకంగా మారింది. సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో మన సమాచారం చోరీ చేసినా, రాన్సమ్వేర్ ఎటాక్‌లతో తస్కరించినా ప్రమాదమే. ఇందుకు ఏకైక పరిష్కారం డేటా బ్యాకప్ చేసుకోవడమే. డేటా బ్యాకప్‌లో భారతీయులు ముందంజలో ఉంటున్నట్టు వెస్ట్రన్ డిజిటల్ సంస్థ సర్వే వెల్లడించింది. డేటా బ్యాకప్‌కు సంబంధించి ఈ సంస్థ ఇటీవల పలు దేశాల్లో సర్వే నిర్వహించింది. అత్యధికంగా భారతీయులే డేటా బ్యాకప్ చేస్తున్నట్టు సర్వేలో తేలింది. నివేదికలోని ముఖ్యాంశాలు» అత్యధికంగా 30% మంది భారతీయులు నిత్యం తమ డేటా బ్యాకప్ చేసుకుంటున్నారు. తర్వాత స్థానంలో అమెరికా 27%, బ్రిటన్ 23 శాతంతో నిలిచాయి. » భారతీయుల్లో 77%మంది డేటా బ్యాకప్ కోసం తాము క్లౌడ్ స్టోరేజీని వాడుతున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా మొబైల్ (ఇతర డివైజ్) పాడవడంతో లేదా అనుకోకుండా డిలీట్ చేయడం, లేదా సైబర్ ఎటాక్.. ఇలా ఏదో ఒక కారణంగా తమకు డేటాను పోగొట్టుకున్న అనుభవం ఉందని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 71 శాతం మంది పేర్కొన్నారు. » డేటా బ్యాకప్‌కు 3 విధానాలు వాడుతున్నట్టు సర్వే లో వెల్లడైంది. ఇందుకు 3–2–1 సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు సర్వే నిర్వాహకులు తెలిపారు. డేటాకు సంబంధించి 3 కాపీలను పెట్టుకోవాలి. రెండింటిని రెండు వేర్వేరు డివైజ్‌లలో స్టోర్ చేసుకోవాలి. ఒక సాఫ్ట్ కాపీని క్లౌడ్ వంటి స్టోరేజీలో దాచుకోవాలి. -
సగం జనాభా లావెక్కింది
న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో సగానికి పైగా వయోజనులు ఊబకాయులుగా మారిపోయారు! 2050 నాటికి ఇది 57 శాతం దాటనుంది. అంతేగాక పిల్లలు, టీనేజర్లు, యువకుల్లో మూడింట ఒక వంతు ఊబకాయులుగా మారొచ్చని లానెస్ట్ జర్నల్ అంచనా వేసింది. 200 పైగా దేశాలకు చెందిన గ్లోబల్ డేటాను విశ్లేషించిన మీదట ప్రచురించిన తాజా అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది. దశాబ్ద కాలంలో ముఖ్యంగా అల్పాదాయ దేశాల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని కట్టడికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ)కు చెందిన ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ నాయకత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఊబకాయుల సంఖ్య 1990తో పోలిస్తే నేడు రెట్టింపైంది. 2021 నాటికి ప్రపంచ వయోజనుల్లో సగం మంది ఊబకాయులుగా మారిపోయారు. 25 ఏళ్లు, అంతకు పైబడ్డ వారిలో ఏకంగా 100 కోట్ల పురుషులు, 111 కోట్ల మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే 2050 ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య పురుషుల్లో 57.4 శాతానికి, స్త్రీలలో 60.3 శాతానికి పెరగవచ్చు. ఇక 1990 నుంచి 2021 నాటికి పిల్లలు, టీనేజర్లలో ఊబకాయులు 8.8 శాతం నుంచి 18.1 శాతానికి పెరిగారు. 20–25 మధ్య వయసు యువతలో 9.9 నుంచి 20.3 శాతానికి పెరిగింది. చైనాలో 62 కోట్లు ఊబకాయుల సంఖ్య 2050 నాటికి చైనాలో 62.7 కోట్లు, భారత్‌లో 45 కోట్లు, అమెరికాలో 21.4 కోట్లకు చేరనుంది. సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో ఈ సంఖ్య ఏకంగా 250 శాతానికి పైగా పెరిగి 52.2 కోట్లకు చేరుతుదని అంచనా. నైజీరియా 2021లో 3.66 కోట్ల మంది అధిక బరువుతో ఉండగా 2050 కల్లా 14.1 కోట్లకు చేరనుంది. సామాజిక వైఫల్యం... వయోజనుల్లో సగం ఊబకాయులే కావడాన్ని సామా జిక వైఫల్యంగా చూడాలని ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ అన్నారు. యువతలో ఊబకాయం వేగంగా పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ‘‘కొత్తగా వచ్చిన బరువు తగ్గించే మందుల ప్రభావాన్ని అధ్యయనం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటే విపత్తును ఎంతో కొంత నివారించవచ్చు’’అని ఆమె వెల్లడించారు. ఆరోగ్య వ్యవస్థలకు సవాలు ఊబకాయం పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు సవాలేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డోక్ చి్రల్డన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ జెస్సికా కెర్. ‘‘పిల్లలు, టీనేజర్ల విషయంలో ఇప్పట్నుంచే శ్రద్ధ పెడితే ఊబకాయాన్ని నివారించడం సాధ్యమే. యూరప్, దక్షిణాసియా దేశాల్లో పిల్లలు, టీనేజర్లు అధిక బరువుతో ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.ఉత్తర అమెరికా, ఆస్ట్రలేషియా, ఓషియానియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఊబకాయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టీనేజీ బాలికల్లో ఎక్కువగా ఉంది’’అని చెప్పారు. భావి తరాలు అనారోగ్యం బారిన పడకుండా చూడటం, ఆర్థిక, సామాజిక నష్టాలను నివారించడం తక్షణ కర్తవ్యమని సూచించారు. -
వ్యక్తిగత డేటా లీక్!.. కారణం వారే అంటున్న నెటిజన్స్
న్యూఢిల్లీ: తమ వ్యక్తిగత డేటా పబ్లిక్ డొమైన్‌లోకి చేరిపోయినట్టు మెజారిటీ నెటిజన్లు భావిస్తున్నారు. పబ్లిక్ డొమైన్లో తమ డేటా లీక్ అయినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో 87 శాతం మంది చెప్పారు. ఇందులో సగం మంది తమ ఆధార్ లేదా పాన్ వివరాలు లీక్ అయినట్టు భావిస్తున్నారు.దేశవ్యాప్తంగా 375 జిల్లాల పరిధిలో 36వేల మంది స్పందనలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ప్రధానంగా టెలికం ఆపరేటర్లు, ఈ–కామర్స్ యాప్‌లు, బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ విభాగాలు తమ డేటా లీకేజీకి కారణమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. పబ్లిక్ డొమైన్లో తమ డేటా లీకేజీకి టెలికం ఆపరేటర్లు కారణమని 65 శాతం మంది భావిస్తుంటే, 63 శాతం మంది ఈ–కామర్స్ యాప్‌లు లేదా సైట్లు, 56 శాతం మంది బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సంస్థలు కారణమై ఉంటాయని చెప్పారు.స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఇందుకు కారణమని 50 మంది అనుకుంటున్నారు. 48 శాతం మంది పేమెంట్ యాప్‌ల ద్వారా తమ వ్యక్తిగత వివరాలు లీక్ అయి ఉంటాయని చెప్పగా.. 26 శాతం మంది విద్యా సంస్థలు, 37 శాతం మంది వ్యాపార సంస్థల పాత్ర ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు. -
రోజూ 2 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. సంస్థ యూజర్లకు దీర్ఘకాలిక సర్వీసు అందించే లక్ష్యంతో 365 రోజుల వ్యాలిడిటీతో ఆకర్షణీయమైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రోజూ 2 జీబీ డేటాను అందించే ఈ ప్యాక్ సంవత్సరం పొడవునా ఇంటర్నెట్ అవసరమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.కొత్త ప్లాన్ వివరాలు..వాలిడిటీ: ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అంటే వినియోగదారులు ఒకసారి రీఛార్జ్‌తో ఏడాది పొడవునా నిరంతరాయ సేవలను పొందవచ్చు.రోజువారీ డేటా: వినియోగదారులకు రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.ధర: ఈ ప్లాన్ ధర రూ.1515.వాయిస్ కాల్స్ ఉండవు..ఈ ప్లాన్‌లో ప్రధానంగా డేటాపై దృష్టి సారించారు. ఇందులో ఉచిత వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు ఉండవు. అయితే బీఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ వంటి అదనపు ప్రయోజనాలతో ఇతర ప్లాన్లను అందిస్తోంది. ఏడాది పొడవునా స్థిరమైన ఇంటర్నెట్ అవసరమయ్యే విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ ప్రవేశపెట్టినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.ఇదీ చదవండి: ఐపీఎల్ స్పాన్సర్షిప్ డీల్ దక్కించుకున్న రిలయన్స్బీఎస్ఎన్ఎల్ విభిన్న ప్రయోజనాలతో ఇతర ప్లాన్లను కూడా అందిస్తుంది. రూ.1198 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీ ఉంటుంది. నెలకు 300 నిమిషాల ఉచిత కాల్స్, 3 జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్లు, ఉచిత రోమింగ్ అందిస్తుంది. వినియోగదారులకు ఈ ప్లాన్ కోసం నెలకు రూ.100 వరకు ఖర్చు అవుతుంది. డేటా, వాయిస్ సర్వీసులు కావాలనుకునే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. -
బంగారం దిగుమతి లెక్కల్లో పొరపాటు
వాణిజ్య లోటు రికార్డు స్థాయికి పెరగడానికి కారణమైన నవంబర్ బంగారం దిగుమతి (Gold Import) డేటాలో చూసిన "అసాధారణ" పెరుగుదలను ప్రభుత్వం తాజాగా సరిదిద్దింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం నవంబర్ నెలలో బంగారం దిగుమతి విలువ 14.8 బిలియన్ డాలర్లు నుండి 9.8 బిలియన్ డాలర్లకు సర్దుబాటు చేసింది.గణన లోపం కారణంగా మునుపటి సంఖ్య తప్పుగా ఉంది. జూలైలో పద్దతిలో మార్పును అనుసరించి గిడ్డంగులలో రెట్టింపు లెక్కింపు దీనికి కారణం కావచ్చు. ఈ విషయంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.2024 జనవరి నుండి నవంబర్ వరకు బంగారం దిగుమతులపై సవరించిన డేటా "వార్షిక సగటు 800 టన్నుల కంటే చాలా తక్కువగా ఉంది" అని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా అన్నారు. జనవరి నుండి నవంబర్ వరకు మొత్తం బంగారం దిగుమతులు 796 టన్నుల నుండి 664 టన్నులకు సరిదిద్దారు. అక్టోబర్‌కు సంబంధించి 97 టన్నులు నుండి 58 టన్నులకు, నవంబర్‌లో దిగుబడులను 170 టన్నుల నుండి 117 టన్నులకు సర్దుబాటు చేశారు.డిసెంబర్ 16న జరిగిన సాధారణ నెలవారీ ట్రేడ్ డేటా బ్రీఫింగ్లో, బంగారం దిగుమతులు పెరగడం వల్ల నవంబర్‌లో భారతదేశ వాణిజ్య లోటు రికార్డు గరిష్ట స్థాయి 37.8 బిలియన్ డాలర్లకు విస్తరించిందని డేటా చూపించింది . 2024 డిసెంబరులో అసాధారణ పెరుగుదలను గమనించిన డీజీసీఐఎస్.. కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ అందుకున్న డేటాతో సమన్వయం చేసుకుంటూ బంగారం దిగుమతి డేటాపై వివరణాత్మక పరిశీలనను చేపట్టింది. -
సోషల్ మీడియా DPDP నిబంధనలు : 18 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిరి
సామాజిక మాధ్యమాల వినియోగంలో 18 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించి కీలక చట్టం రాబోతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్ డ్రాప్ట్ రూల్స్ ప్రకారం ఇకపై 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతి అవసరమని స్పష్టం చేస్తోంది. భారతదేశం వెలుపల వ్యక్తిగత డేటాను బదిలీ చేయడానికి కంపెనీలకు ప్రభుత్వ అనుమతి అవసరమని కూడా పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (జనవరి 3న) డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 (DPDP) కోసం డ్రాఫ్ట్ నియమాలను నోటిఫై చేసింది. నిబంధనలపై అభిప్రాయాన్ని/కామెంట్లను పంచుకోవడానికి మంత్రిత్వ శాఖ వాటాదారులను కూడా ఆహ్వానించింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచడం దేశ ప్రయోజనాలకు మంచిదన్న అభిప్రాయం, సోషల్ మీడియా వినియోగానికి కనీసం 21 ఏళ్లు లేదంటే ఓటు హక్కుకు అమలు చేస్తున్నట్టుగా 18 ఏళ్ల వయోపరిమితి ఉండాలన్న వాదనల మధ్య ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.The Ministry of Electronics and Information Technology has published the draft rules for the Digital Personal Data Protection (DPDP) Act for public consultation. Suggestions and objections regarding the draft rules can be submitted through the MyGov portal until February 18,… pic.twitter.com/a5X4uPeFyW— Bar and Bench (@barandbench) January 3, 2025 పిల్లల డేటా ప్రాసెసింగ్‌పై DPDP రూల్స్ ప్రకారం చైల్డ్ (C) వినియోగదారు సోషల్‌మీడియా ఖాతాను సృష్టించాలనుకుంటే, డేటా ఫిడ్యూషియరీ (DF) తప్పనిసరిగా తల్లిదండ్రుల సమ్మతిని ధృవీకరించాలి. ఈ సందర్భంలో, తల్లిదండ్రులు (P) తనను తాను గుర్తించి, DFతో ఇప్పటికే అందుబాటులో ఉన్న ధృవీకరించిన గుర్తింపు, వయస్సు వివరాలతో రిజిస్టర్డ్ యూజర్ అని నిర్ధారిస్తారు. పిల్లల డేటాను ప్రాసెస్ చేయడానికి ముందు, డీఎఫ్ తప్పనిసరి. అలాగే తల్లిదండ్రుల గుర్తింపు , వయస్సు రికార్డుల విశ్వసనీయతను కూడా నిర్ధారించాల్సి ఉంటుంది.ఫిబ్రవరి 18 వరకు ప్రజాభిప్రాయాల సేకరణకుద్దేశించిన ముసాయిదా నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నిర్దేశించిన IDని ధృవీకరించి, డిజిటల్ లాకర్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అందుబాటులో ఉంచడానికి పిల్లల వయస్సును ధృవీకరించాలి. వివాదంDPDP చట్టంలో పిల్లల డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన నిబంధనలు వివాదాస్పదంగా ఉన్నాయి. పౌర సమాజం, పరిశ్రమ వర్గాలతో పాటు, మెటా, గూగుల్ (Meta, Google) లాంటి బిగ్ టెక్ సంస్థలు కూడా ప్రభుత్వాన్ని పిల్లలు, డేటా వినియోగం నిబంధనలపై మార్పులను కోరుతున్నాయి. ప్రధాంగా ఈ నిబంధనలోని వయస్సును 18 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల కంటే తక్కువకు తగ్గించాలంటున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 18 తరువాత, ప్రజలనుంచి వచ్చిన సూచనలు, సలహాల మేరకు మరికొన్ని మినహాయింపులుండవచ్చని భావిస్తున్నారు.పిల్లల డేటాను ప్రాసెస్‌పై పరిమితులు, మినహాయింపులు మానసిక ఆరోగ్య సంస్థ లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణులుఅనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపుణులువిద్యా సంస్థచైల్డ్ డే కేర్ సెంటర్విద్యా సంస్థకాగా 2023 ఆగస్టులో పార్లమెంటులో ఆమోదించిన DPDP బిల్లు ఈ నిబంధనను నిర్దేశించింది. దేశ పౌరుల డిజిటల్ హక్కులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన సంగతి తెలిసిందే. -
కస్టమ్స్‌కు విదేశీ ప్రయాణికుల డేటా షేరింగ్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై అంతర్జాతీయ ప్రయాణికుల డేటాను కస్టమ్స్ విభాగానికి కూడా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం విమాన రవాణా సేవల సంస్థలు జనవరి 10 నాటికి నేషనల్ కస్టమ్స్ టార్గెటింగ్ సెంటర్–ప్యాసింజర్ (ఎన్సీటీసీ–ప్యాక్స్)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) జారీ చేసిన ఆదేశాల ప్రకారం .. అంతర్జాతీయ ఫ్లయిట్ బయలుదేరడానికి 24 గంటల ముందుగానే విదేశీ ప్రయణికుల మొబైల్ నంబరు మొదలుకుని టికెట్ కోసం చెల్లింపులు జరిపిన మాధ్యమం, ట్రావెల్ షెడ్యూల్ వరకు పలు వివరాలను కస్టమ్స్ అధికారులకు ఎయిర్‌లైన్స్ అందించాలి. ఒకవేళ విమానయాన సంస్థ గానీ డేటాను షేర్ చేసుకోవడంలో విఫలమైన పక్షంలో, అలా చేసిన ప్రతిసారి రూ. 25,000–50,000 వరకు కస్టమ్స్ విభాగం జరిమానా విధించవచ్చు. ఆదాయపన్ను శాఖ ఖండన పన్ను ఎగవేతదారులను పట్టుకునేందుకు తాము డిజీయాత్ర యాప్ డేటాను చూడడం లేదని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్ పెట్టింది. ‘‘ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు అలాంటి చర్య ఏమీ లేదని స్పష్టం చేస్తున్నాం’’అని అందులో పేర్కొంది. ముఖ గుర్తింపు విధానంలో (ఎఫ్‌ఆర్‌టీ) పనిచేసే డిజీ యాత్ర విమానాశ్రయాల్లో పలు చెక్ పాయింట్ల వద్ద ఎలాంటి అవాంతరాల్లేకుండా ముందుకెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. డిజీ యాత్ర యాప్ కోసం ప్రయాణికులు ఇచ్చే సమాచారం ఎన్‌క్రిపె్టడ్ విధానంలో నిల్వ ఉంటుంది. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా ప్రయాణికులు డిజీయాత్ర సేవలను పొందొచ్చు. -
ఉపకరణాలే కాదు.. డేటా కూడా ముఖ్యం
సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రపరిచే విషయంలో హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, లాప్‌ట్యాప్‌లను, అందులో ఉన్న డేటాను ఒరిజినల్ రూపంలోనే భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. ఉపకరణాలంటే అందులో ఉన్న డేటా కూడా అని, దానిని కూడా భద్రపరచడం తప్పనిసరని తెలిపింది. డేటా అత్యంత కీలకమంది. తన ఫిర్యాదు మేరకు జత్వానీ తదితరులపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఆమెకు చెందిన పలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను జప్తు చేశారని, అందులో కీలక సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ ఉపకరణాలను వెనక్కి ఇచ్చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జత్వానీ నుంచి జప్తు చేసిన ఉపకరణాలన్నింటినీ భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మరోసారి విచారణ జరిపారు. వెనక్కి ఇచ్చేసేందుకే వాటిని తెప్పించారురాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు ఇతర ఉపకరణాలను ఆమెకు తిరిగి ఇచ్చే ఉద్దేశం ఏమీ ప్రస్తుతానికి దర్యాప్తు అధికారికి లేదని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) వద్ద ఉన్న జత్వానీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తిరిగి ఆమెకు ఇచ్చేస్తున్నారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, అసలు ఆ ఉపకరణాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి వద్ద ఉన్నాయని దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. ఈ సమయంలో విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, ఎఫ్ఎస్ఎల్ వద్ద విశ్లేషణ నిమిత్తం ఉన్న జత్వానీ మొబైల్ ఫోన్లు తదితర ఉపకరణాలను వెనక్కు ఇచ్చేందుకు హడావుడిగా తెప్పించారని తెలిపారు. ఆ ఉపకరణాలను విశ్లేషించి, అందులో ఉన్న వివరాలతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందచేయాల్సి ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు జప్తు చేసిన నేపథ్యంలో, అందులో ఉన్న సిమ్ కార్డ్ స్థానంలో తాజా సిమ్ కార్డ్‌ను జత్వానీకి ఇవ్వాలని సంబంధిత ఆపరేటర్‌ను పోలీసులు ఆదేశించే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే ఆ సిమ్‌లో ఉన్న డేటా మొత్తం పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు గురించి జత్వానీ ఇష్టమొచ్చినట్లు మీడియా ముందు మాట్లాడుతున్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్డీటీవీకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలను ఆయన కోర్టుకు సమర్పించారు. ఈ సమయంలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఆ ఉపకరణాలను వెనక్కి ఇచ్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని పునరుద్ఘాటించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ మొత్తం వ్యవహారంలో వారం కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు జత్వానీ, ఆమె తల్లిదండ్రులు కోర్టులో హాజరయ్యారు. -
ఒకేసారి రీచార్జ్.. ఏడాదంతా డైలీ 3జీబీ డేటా
దీర్ఘకాలం వ్యాలిడిటీతో రోజూ ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో తక్కువ ధరకే డైలీ 3జీబీ డేటాను ఆస్వాదించవచ్చు. ఇలాంటి ప్లాన్లు ఇతర ప్రైవేటు టెలికం కంపెనీల్లో లేకపోవడం గమనార్హం.365 రోజులు వ్యాలిడిటీ 365 రోజులు వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ. 2,999. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదంతా అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఆనందించవచ్చు. ప్రతిరోజూ 3జీబీ హై స్పీడ్ డేటా పొందవచ్చు. ఈ వార్షిక ప్లాన్‌లో కస్టమర్లకు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.సినిమాల స్ట్రీమింగ్, గేమింగ్ కోసం ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఏడాదిపాటు ప్రతిరోజూ 3జీబీ డేటా అందించే ప్లాన్లు ఇతర ప్రైవేట్ టెలికం కంపెనీల్లో లేవు. గరిష్టంగా 84 రోజుల వ్యాలిడిటీతో ఇలాంటి ప్లాన్ జియోలో రూ.1799లకు, ఎయిర్‌టెల్‌లో రూ.1798లకు అందుబాటులో ఉంది. -
ఉబర్‌కు షాక్.. రూ. 2,718 కోట్లు ఫైన్
-
త్వరలోనే డేటా రక్షణ నిబంధనలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత డిజిటల్ డేటా పరిరక్షణ చట్టం ముసాయిదా నిబంధనలను నెలరోజుల్లోనే విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ప్రభుత్వం తొలుత డిజిటల్‌గా ఈ చట్టం అమలుపై దృష్టి పెట్టినట్టు.. అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించినట్టు చెప్పారు.‘‘కార్యాచరణ సిద్ధమైంది. సంప్రదింపుల కోసం ముసాయిదా నిబంధనలను నెల రోజుల్లోపు ప్రజల ముందు ఉంచుతాం’’ అని మీడియా ప్రతినిధులకు వైష్ణవ్ తెలిపారు. నిబంధనలకు సంబంధించి భాష సరళతరంగా ఉంటుందన్నారు. గోప్యత హక్కు అన్నది ప్రాథమిక హక్కుల్లో భాగమేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆరేళ్ల తర్వాత.. 2023 ఆగస్ట్ 9న ‘ద డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం తెలపడం గమనార్హం.ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు యూజర్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది. వ్యక్తిగత డేటా సేకరణ, ప్రాసెసింగ్‌కు సంబంధించి నిబంధనలను కచ్చితగా అమలు చేయాల్సి ఉంటుంది. డేటా ఉల్లంఘన చోటుచేసుకుంటే రూ.250 కోట్ల వరకు జరిమాన చెల్లించే నిబంధన సైతం ఈ చట్టంలో భాగంగా ఉంది. -
10 ఏళ్లలో కూలిపోయిన 200 వంతెనలు!
బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్‌లో ఇటీవలి కాలంలో జూన్ 18న తొలి వంతెన కూలగా ఆ తరువాత కేవలం 17 రోజుల్లోనే 12కు పైగా వంతెనలు కుప్పకూలిపోయాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి బలహీనమైన వంతెనల విషయంలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.దేశంలో వంతెనలు కూలడమనేది ఒక్క బీహార్ మాత్రమే కాదు. ఇతర ప్రాంతాలలో కూడా వంతెనలు కూలుతుంటాయి. ఒక నివేదిక ప్రకారం 1977- 2017 మధ్య భారతదేశంలో 2,130 వంతెనలు కూలిపోయాయి. 2012- 2021 మధ్య 214 వంతెనలు కూలిపోయినట్లు ప్రభుత్వ రికార్డులలో నమోదయ్యింది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం ఇటీవలి కాలంలో వంతెనల కూలిన కేసులు తక్కువగా నమోదయ్యాయి. 2012- 2013 మధ్య సగటున 45 వంతెనలు కుప్పకూలగా, ఆ సంఖ్య 2021లో ఎనిమిదికి తగ్గింది.సంవత్సరంకూలిన వంతెనలు2012452013452014162015222016 192017 102018 172019232020920218 వంతెనలు కూలిపోవడానికి కారణంవంతెనలు కూలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంతెనల డిజైన్, ఉపయోగించిన మెటీరియల్, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడం మొదలైనవి వీటిలో ప్రధాన కారణాలు. వంతెనలు కూలడానికి ప్రకృతి వైపరీత్యాలు కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇండియా టుడే నివేదిక ప్రకారం ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 80కి పైగా వంతెనలు కూలిపోయాయి. 2012 నుంచి 2021 వరకు వంతెనలు కూలిన ప్రమాదాలలో 285 మంది మృతి చెందారు. 2022లో గుజరాత్‌లోని మోర్బీలో వంతెన కూలిపోవడంతో 141 మంది మృతి చెందారు.సంవత్సరం మృతుల సంఖ్య2013 532014 122015 242016 472017 102018 342019 262020 102021 5 -
ఐదు విడతల ఓటర్ టర్నవుట్ డేటా వెల్లడి.. ఈసీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఐదు విడతల కచ్చితమైన పోలింగ్ ఓటర్ టర్నవుట్ డేటాను ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం(మే25) వెల్లడించింది. ఓటింగ్ శాతాల డేటా అభ్యర్థులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. టర్నవుట్ డేటా అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగలేదని, ప్రతి విడత పోలింగ్ రోజు ఉదయం 9.30నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్ డేటాను ఓటర్ టర్నవుట్ యాప్‌లో ఉంచామని తెలిపింది. పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని స్పష్టం చేసింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఈసీ ఖండించింది. ఐదు విడతల్లో బూత్‌ల వారిగా పోలింగ్ డేటాను వెబ్సైట్లో ఉంచాల్సిందిగా ఈసీని ఆదేశించాలని ఏడీఆర్ వేసిన పిటిషన్‌పై శుక్రవారమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తాము ఈ విషయంలో ప్రస్తుత ఎన్నికల వేళ ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీం తెలిపింది. ఈ విచారణ జరిగిన మరుసటి రోజు ఐదు విడతల్లో పోలైన కచ్చితమైన ఓటర్ టర్నవుట్ డేటాను ఈసీ వెల్లడించడం గమనార్హం.ఈసీ వెల్లడించిన పోలింగ్ శాతాలు..తొలివిడత - 66.14రెండో విడత- 66.71మూడో విడత- 65.68నాలుగో విడత-69.16ఐదో విడత - 62.20 -
పోలింగ్ శాతాల డేటా వివాదం..జవాబుల్లేని ప్రశ్నలనేకం..!
న్యూఢిల్లీ: దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల విశ్వసనీయతపై చర్చ జరగడం సాధారణమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతాలు ఆలస్యంగా ప్రకటించడంపైకి చర్చ మళ్లింది. దీనికి కారణం ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల పోలింగ్‌కు సంబంధించి ఫైనల్ ఓటర్ టర్నవుట్ డేటాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్(ఈసీ) వారాల కొద్ది సమయం తీసుకోవడమే. డేటా ఆలస్యమవడంతో పాటు పోలింగ్‌రోజు రాత్రి ప్రటించిన పోలింగ్ శాతానికి సమయం తీసుకుని ప్రకటించన డేటాకు మధ్య భారీ వ్యత్యాసముండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క ఎన్జీవోలు ఈ విషయంలో కోర్టుల తలుపులు తడుతున్నాయి. పోలింగ్ శాతం డేటాల్లో భారీ వ్యత్యాసాలపై ఇప్పటికే అసోసియేట్ ఫోరం ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సుప్రీంకోర్టుకు వెళ్లింది.ఏడీఆర్ వేసిన పిటిషన్‌ను మే17న తొలుత విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓటర్ టర్నవుట్‌లు ప్రకటించడానికి ఆలస్యమెందుకవుతోంది, డేటాల్లో భారీ వ్యత్యాసమెందుకు ఉంటోందని ఈసీని ప్రశ్నించింది. మే 24న మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినపుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.తొలి దశ పోలింగ్ శాతం డేటాకు ఏకంగా 11 రోజులు... అంకెల్లోనూ భారీ వ్యత్యాసం..లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరిగితే ఈసీ యాక్చువల్ పోలింగ్ పర్సెంటేజీ ప్రకటించడానికి ఏకంగా 11 రోజులు పట్టింది. ఇక డేటా విషయానికి వస్తే పోలింగ్ ముగిసిన రోజు డేటా 60 శాతం అని తెలపగా 11 రోజుల తర్వాత ఈడేటా ఏకంగా 6 పర్సెంటేజీ పాయింట్లు పెరిగి 66.14 శాతానికి చేరింది.దీనిపై ప్రతిపక్షాలతో పాటు ఎన్జీవోలు విస్మయం వ్యక్తం చేశాయి. పోలింగ్ శాతాల్లో ఇంత వ్యత్యాసమెందుకు వస్తోంది.. డేటా వెల్లడించడానికి ఎందుకంత సమయం తీసుకోవాల్సి వస్తోందని ఈసీకి ప్రశ్నల బాణాలు సంధిస్తున్నాయి. ఇదే తంతు సెకండ్ ఫేజ్ పోలింగ్‌కు మళ్లీ రిపీట్ అయింది. ఏప్రిల్ 26న సాయంత్రం పోలింగ్ శాతం 60.96 శాతం అని ప్రకటించగా అది కాస్తా ఏప్రిల్ 30న వాస్తవ డేటా ప్రకటించే సరికి 66.71శాతానికి పెరిగిపోయింది.నాలుగు దశల్లో 1.07 కోట్ల ఓట్ల తేడా..ఎన్నికల నాలుగు దశల పోలింగ్ శాతాల్లో ఈసీ ప్రకటించిన తొలి, తుది డేటాల వ్యత్యాసాన్ని ఓట్లలో పరిశీలిస్తే 1.07 కోట్ల ఓట్ల వ్యత్యాసం వచ్చింది. ఇప్పటివరకు పోలింగ్ పూర్తయిన 379 నియోజకవర్గాలకు ఈ ఓట్లను పంచితే ఒక్కో నియోజకవర్గానికి సగటున 28 వేల ఓట్ల తేడా వస్తున్నట్లు అంచనా. అన్నింటికంటే ఎక్కువగా మే 13న పోలింగ్ జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో 17 లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారిగా చూసినపుడు ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతాల డేటాల్లో తేడా అభ్యర్థుల గెలుపోటములను ఈజీగా ప్రభావితం చేయగలదన్న వాదన వినిపిస్తోంది. 2019లో ఎలా ప్రకటించారు.. ఇప్పుడేమైంది..ఐదోవిడత పోలింగ్ సోమవారం(మే20)న జరిగింది. దీనికి సంబంధించి సోమవారం రాత్రి 11.30 గంటలకు ఓటర్ టర్నవుట్ 60.09గా ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. ఫైనల్ పోలింగ్ శాతం డేటాను ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీనిపై అనేక ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్ నియోజకవర్గాల వారిగా, స్ట్రీ,పురుషుల వారిగా అన్ని రకాల డేటాను ప్రకటించిందని, ఇప్పుడెందుకు ఈసీకి అది సాధ్యమవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.17సి ప్రామాణికం కాదా...సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది సేపటికే ప్రతి పోలింగ్ బూత్‌లో ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంట్లకు ఆ బూత్‌లో పోలైన ఓట్ల వివరాలను 17సి ఫామ్‌లో ఎన్నికల అధికారులు అందిస్తారు. ఇది నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లోనూ జరుగుతుంది. 17సి ఫామ్‌లతో అభ్యర్థులకు నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల వివరాలు తెలుస్తాయి. ఇంత క్లియర్‌గా 17సి ఉండగా ఫైనల్ డేటా విషయంలో సమస్య ఎక్కడ వస్తోందని కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే లేఖ ద్వారా ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే ప్రశ్నించడం గమనార్హం. -
ఫుడ్ కోసం తగ్గిన ఖర్చు.. అంతా వాటికోసమే!
గత పదేళ్లలో భారతీయులు గృహాల కోసం చేస్తున్న ఖర్చు రెండింతలు పెరిగిందని, ఖర్చులో కూడా ఎక్కువ భాగం అనవసరమైన అంశాలకే ఖర్చు చేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక నివేదికలో వెల్లడించింది. బట్టలు, టెలివిజన్ సెట్లు, వినోదం కోసం విచక్షణా రహితంగా డబ్బు వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది. గృహాలకు, వినోదాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న ప్రజలు ఆహార పదార్థాలు తక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ వినియోగంలో ఆహార పదార్థాల కోసం చేసే ఖర్చు 2011-12లో 53 శాతం. అయితే ఇప్పుడు ఇది 46.4 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఆహారేతర వినియోగం కోసం పెట్టే ఖర్చు 47 శాతం నుంచి 53.6 శాతానికి పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించిన సర్వేలో తేలింది. పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే.. ఆహారం కోసం పట్టణవాసులు పెడుతున్న ఖర్చు 42.6 శాతం నుంచి 39.2 శాతానికి తగ్గిపోయింది. ఆహారేతర వినియోగం 60.8 శాతానికి చేరింది. గతంలో దీనికోసం చేసే ఖర్చు 57.4 శాతంగా ఉండేది. ఇదీ చదవండి: కళ్ళముందే సరికొత్త ప్రపంచం.. మొదలైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ఈవెంట్ ఇక తలసరి ఆదాయం విషయానికి వస్తే.. 2011-12లో పట్టణవాసులు తలసరి ఆదాయం రూ. 2630 నుంచి రూ. 6459కు చేరింది. గ్రామీణప్రాంతాల్లో అయితే తలసరి ఆదాయం 1430 రూపాయల నుంచి రూ. 3773కు చేరింది. తలసరి ఆదాయం పెరిగేకొద్దీ ఆహరం కోసం చేసే ఖర్చు తగ్గుతుందని తెలుస్తోంది. -
చార్జింగ్‌తో పాటు డేటా స్టోరేజ్
చార్జింగ్‌తో పాటు డేటా స్టోరేజ్ చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం ఒకేసారి రెండుపనులు చేస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో ఈ పరికరం పోర్టబుల్ చార్జర్‌లా పనిచేస్తుంది. దీని ద్వారా స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి వాటిని చార్జింగ్ చేసుకోవచ్చు. పరికరాలను చార్జింగ్ చేస్తున్న సమయంలోనే, వాటిలోని ముఖ్యమైన డేటాను కూడా ఇందులో భద్రపరచుకోవచ్చు. ఇది సైనిక అవసరాల కోసం ఉపయోగించే ‘ఏఈఎస్–256’ ఎన్క్రిప్షన్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది ఏకకాలంలో రెండు పరికరాలకు 65 వాట్ల విద్యుత్తును సరఫరా చేస్తూ చార్జింగ్ చేయగలదు. అలాగే, 1000 ఎంబీపీఎస్ వేగంతో డేటాను స్టోర్ చేసుకోగలదు. డేటా స్టోరేజ్ సామర్థ్యం ప్రకారం ‘మెమ్కీపర్’ పేరుతో చైనాకు చెందిన మెమ్కీపర్ టెక్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం మూడు మోడల్స్‌లో– 256 జీబీ, 512 జీబీ, 1టీబీ మోడల్స్‌లో దొరుకుతుంది. మోడల్‌ను బట్టి ఈ పరికరం ధర 99 డాలర్ల నుంచి 132 డాలర్ల (రూ.8,214 నుంచి రూ.10,957)వరకు ఉంటుంది. -
ఈపీఎఫ్ఓ, పీఎంఓ డేటా లీకేజీ కలకలం?.. అప్రమత్తమైన కేంద్రం
దేశంలో డేటా లీకేజీ కలకలం రేపుతోంది. ప్రధాని కార్యాలయం (పీఎంఓ), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)ల డేటాబేస్ నుంచి డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఈ డేటా లీకేజీపై స్పష్టత ఇవ్వాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డేటా లీకేజీపై సమాచారం ఉంది. కానీ వాస్తవమా? కాదా? అని తెలుసుకునేందుకు రివ్యూ జరుపుతున్నాం. సీఈఆర్టీ.ఇన్ ఇచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డేటా లీకేజీ అంటూ వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నట్లు కేంద్రానికి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ‘డేటా లీకేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అయితే, సైబర్ నేరస్తులు ఒక సర్వర్ ను యాక్సిస్ చేసినట్లు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయని, అందుకు తగ్గ ఆధారాలు లేవు’ అని స్పష్టం చేశారు. గ్లోబల్ సాఫ్ట్వేర్, కోడ్ రిపోజిటరీ గిత్ హబ్‌లో చైనీస్ సైబర్ ఏజెన్సీలకు చెందిన కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, ఈ డాక్యుమెంట్లలో ఈపీఎఫ్ఓ, ఇండియన్ పీఎంఓ, ఇతర పబ్లిక్ నుండి డేటా ఉందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో పలు పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ డేటా లీకేజీ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. భారత్ లక్ష్యంగా గత ఏడాది నవంబర్ లో విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, తాజ్ హోటల్స్, ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ వంటి సంస్థలపై సైబర్ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పాటు ఐటీ, బిజినెస్ ఔట్ సోర్సింగ్ సంస్థలతో సహా పలు సర్వీసులు అందించే సంస్థలపై అత్యధికంగా సైబర్ దాడులు జరిగినట్లు నివేదికలు హైలెట్ చేశాయి. సింగపూర్ కు చెందిన సైబర్ ఫిర్మా 2023 నివేదిక సైతం ప్రపంచ వ్యాప్తంగా జరిగే సైబర్ దాడులు భారత్ ను లక్ష్యంగా చేసుకుని 13.7శాతం ఉందని, ఆ తర్వాత అమెరికా, ఇండో నేషియా,చైనా దేశాలు ఉన్నట్లు తేలింది. -
Jio AirFiber: ఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు జియో ఆఫర్లు..
జియో ఎయిర్ ఫైబర్ (Jio AirFiber) కస్టమర్లకు అదనపు డేటా కోసం డేటా బూస్టర్ ప్లాన్లను అందిస్తోంది. నెలవారీ అన్లిమిటెడ్ డేటా కోటా పూర్తయి అదనపు డేటా కావాల్సినవారి కోసం మూడు డేటా బూస్టర్ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. జియో కొన్ని నెలలుగా దేశంలోని పలు నగరాల్లో ఎయిర్‌ఫైబర్ సేవలను అందిస్తోంది. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందించడానికి 5G టెక్నాలజీని ఉపయోగించే వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. 1 నుంచి 1.5 Gbps వేగంతో ఇంటర్నెట్ అందించగల దీన్ని నివాస, కార్యాలయ వినియోగం కోసం రూపొందించారు. జియో ప్రకారం.. దాని ఎయిర్ ఫైబర్ వినియోగదారులు నెలకు 1TB హై-స్పీడ్ డేటాను ఆనందించవచ్చు. అయితే ఈ పరిమితిని చేరుకున్న తర్వాత, వేగం తగ్గుతుంది. వినియోగదారులకు మరిన్ని డేటా ఎంపికలను అందించడానికి మూడు రకాల డేటా బూస్టర్ ప్యాక్‌లను అందిస్తోంది. డేటా బూస్టర్ ప్లాన్ వివరాలు 1TB కంటే ఎక్కువ హై-స్పీడ్ డేటా అవసరమయ్యేవారు స్పీడ్ బూస్ట్ పొందడానికి ఈ ప్యాక్‌లను ఎంచుకోవచ్చు. రూ. 101 ప్లాన్: ఈ ప్లాన్ మీ బేస్ ప్లాన్‌తో సమానమైన వేగంతో 100GB అదనపు డేటాను అందిస్తుంది. రూ. 251 ప్లాన్: ఈ ప్లాన్‌తో మీరు మీ బేస్ ప్లాన్‌లో ఉన్న వేగంతో 500GB అదనపు డేటాను పొందుతారు. రూ. 401 ప్లాన్: ఇది మీ బేస్ ప్లాన్‌లో ఉన్నట్టుగానే అదే వేగంతో 1000GB డేటా టాప్ అప్ అందిస్తుంది. -
ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళలు.. 2023లో ఇంతమందా?
గత కొంతకాలంగా ఉద్యోగాల్లో చేరే మహిళల సంఖ్య బాగా పెరిగింది. దీంతో జాబ్ కోసం అప్లై చేసుకునే వారు క్రమంగా పెరుగుతున్నారు. 2023లో దేశం మొత్తం మీద ఎంత మంది ఉద్యోగాలకు అప్లై చేశారనే డేటాను apna.co విడుదల చేసింది. విడుదలైన డేటా ప్రకారం, గత ఏడాది ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిలో మహిళలు కోటి మంది ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం పురుషులతో పాటు మహిళలు ఇంతమంది అప్లై చేసుకోవడం గొప్ప విషయమని చెప్పాలి. ఇందులో కూడా టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. 2023లో మొత్తం 3.2 కోట్లమంది ఉద్యోగాలకు అప్లై చేసుకోగా.. ఇందులో 1 కోటి మంది మహిళలే కావడం గమనార్హం. అదే 2022లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న 2.7 కోట్ల మందిలో 87 లక్షలమంది మహిలు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళల సంఖ్య 2022 కంటే 13 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రోబో పనికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా - వీడియో వైరల్ ప్రస్తుతం ఇంటిదగ్గరే ఉంది ఇంటిపనులు మాత్రమే చేయడానికి మహిళలు ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. తమను తాము నిరూపించుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.. తమదైన రీతిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 2023లో నిమిషానికి 100 ఉద్యోగాలకు ధరఖాస్తులు వచ్చినట్లు.. ఇందులో ఎక్కువగా సేల్స్ సపోర్ట్, ఎంటర్ప్రైజ్ సేల్స్, అడ్వర్టైజింగ్, రియల్ ఎస్టేట్, ఇన్సైడ్ సేల్స్, మార్కెటింగ్, ఈ కామర్స్ వంటి ఉద్యోగాలకు ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. -
స్వేచ్ఛ చందమామ కథలు: తొలి తెలుగు AI టూల్ లాంచ్ (ఫొటోలు)
-
చందమామ కథలు: స్వేచ్ఛ తొలి తెలుగు AI టూల్ లాంచ్
హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని, తెలుగులో ప్రత్యేకించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డేటాతో స్వేచ్చా "AI చందమామ కథలు" ను శనివారం ఆవిష్కరించింది. తెలుగు ఎల్ఎల్ఎమ్ అనేది తెలుగు మాట్లాడే మారుమూల రైతుకు కూడా అందుబాటులో ఉండాలనే ఛాలెంజ్‌ను స్వీకరించి, ఈ క్రమంలో దీనికి చందమామ కథలను ఎంచుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరైనారు. ఇది తెలుగులో కథ చెప్పడం కోసం దేశంలో తీసుకొచ్చిన తొలి ఏఐని ఆయన కొనియాడారు. నీతి, మర్మం నైతిక విలువలతో కూడిన చందమామ కథలను తెలుగు ఏఐవైపు మళ్లించడం సంతోషమన్నారు. భారతీయ కథలు, భారతీయ భాషలలో, భారతీయులందరికీ కథల రూపంలో అందించడం ముఖ్యం, ఈ క్రమంలో తెలుగు భాషలో, విలువలతో కూడిన చందమామ కథలతో ప్రారంభించడం చాలా బాగుందన్నారు ప్రొఫెసర్ (ఐఐటీ, మద్రాస్)గౌరవ్ రైనా. ఈ సందర్భంగా స్వేచ్ఛ తెలంగాణ వ్యవస్థాపకుడు వై కిరణ్ చంద్ర సాక్షి.కామ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక చిన్న సమావేశంలో కథలకోసం భారతీయ భాషలలో ఏఐని సృష్టించే ఈ సమస్యపై ఆలోచిస్తున్న క్రమంలో చైతన్య (CPO & కో-ఫౌండర్, ఓజోనెటెల్), ప్రొఫెసర్ గౌరవ్ రైనా (ప్రొఫెసర్ IIT మద్రాస్) ఈ ఆలోచనకు రూపం వచ్చిందని తెలిపారు. తమ ప్రయత్నానికి 30 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు సహకరించారని తెలిపారు. దీన్ని భవిష్యత్తులో స్వేచ్ఛ గొంతుకలా కూడా విస్తరించాలని భావిస్తున్నామని కిరణ్ చంద్ర తెలిపారు. ప్రధానంగా భారతదేశంలో 10 మిలియన్ డాలర్లతో ChatGPT లాంటి ఎల్ఎల్ఎంని నిర్మించడం అసాధ్యమన్న ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వ్యాఖ్యల్ని సవాల్‌గా తీసుకున్నట్టు చెప్పారు. ఓపెన్ AI వంటి వాటితో పోటీ పడేందుకు భారతీయ స్టార్ట్-అప్ రూపొందించిన తొలి ఇండిక్ లాంగ్వేజ్ మోడల్‌లలో తమ స్వేచ్ఛ చాట్‌బాట్ ఒకటని కిరణ్ వెల్లడించారు. 42 వేలకు పైగా పేజీల కథలను ఇప్పటికే అప్ లోడ్ చేశామనీ, అమృతమైన సరికొత్త కథలు వచ్చేలా కూడా ఈ టూల్ ను సిద్ధం చేశామని చెప్పారు. 40వేల కథల డేటాసెట్ ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనేది చాట్‌జీపీటీలా ఖరీదైనదిగా గాకుండా ప్రతి రైతుకు, ప్రతి గ్రామీణ ఉపాధ్యాయునికి, ప్రతి దుకాణదారునికి అందుబాటులో ఉండాలన్నారు. ఆవైపుగా కూడా తమ కృషి సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రమా దేవి లంక(డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్) ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల కూడా పొల్గొనడం విశేషం. -
ప్యాకెట్ లోనే డేటా వ్యాలెట్ !
-
నేరస్తుల చేతికి ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది?
నేరాలకు, హత్యలకు, దోపిడీలకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మెక్సికో దేశం కేంద్రంగా మారింది. ఇప్పుడు ఇక్కడి నేరస్తులు ప్రభుత్వం ఉపయోగించే డేటాబేస్‌ను వినియోగించి మరీ నేరాల్లో మరో ముందడుగు వేశారని వైస్ న్యూస్ నివేదిక వెల్లడించింది. మెక్సికన్ నేరస్తులు తాము టార్గెట్ చేసుకున్న వారి వివరాలను, చివరికి వారి లైవ్ లొకేషన్‌ను తెలుసుకునేందుకు ప్రభుత్వ సంస్థలు ఉపయోగించే ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ డేటాబేస్‌ను యాక్సెస్ చేస్తున్నాయని నిఘా వర్గాలు తమకు తెలియజేశామని వైస్ న్యూస్ పేర్కొంది. నేరస్తులు తాము టార్గెట్ చేసుకున్న వారి వివరాలను జియోలొకేట్ ద్వారా తెలుసుకునేందుకు వారు టైటాన్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. తద్వారా తాము టార్గెట్ చేసిన వారి ప్రైవేట్ సమాచారంతోపాటు వారికి సంబంధించిన పత్రాలను పొందుతూ అక్రమాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. 10 వేల మెక్సికన్ పెసోలు (రూ. 600) నుండి 1,80 వేల పెసోలు (రూ. 9,000) చెల్లించి నేరస్తులు వివిధ టైటాన్ సేవలను పొందుతున్నారని వైస్ న్యూస్ తెలియజేసింది. ఈ విధంగా నేరస్తులు అధికారికంగా టైటాన్ సేవల సొంత లాగిన్ పొందుతూ, ఆధునిక మార్గాల్లో తమ నేరాలను కొనసాగిస్తున్నారు. నిజానిక్ టైటాన్ సేవలను ఉపయోగించేందుకు పోలీసు బలగాలు సంబంధిత లైసెన్స్‌లను కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఆ లైసెన్స్ అక్రమమార్గంలో తిరిగి బ్లాక్ మార్కెట్లోనూ అందుబాటులోకి వస్తున్నదని నిఘా వర్గాలు కనుగొన్నాయి. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. మెక్సికన్ ఓటర్ ఐడీ డేటాబేస్, క్రెడిట్ బ్యూరోలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఫోన్ యాప్‌ల లాగ్‌లు, ఇమెయిల్‌లు, ఇలాంటి సమాచారాల ఆధారంగా టైటాన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు సులభంగా నేరస్తులను గుర్తించడానికి ఈ సాఫ్ట్వేర్ రూపొందించినట్లు కంపెనీ ప్రచారం చేస్తుంది. అయినప్పటికీ మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్‌తో సహా అనేక ప్రభుత్వాలు, రిపోర్టర్లు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష సమూహాలపై గూఢచర్యం చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పరిశోధనలో తేలింది. అయితే ఈ టైటాన్ సాఫ్ట్వేర్ అక్రమ వినియోగం వెనుక ఎవరు ఉన్నారనేది స్పష్టంగా వెల్లడికాలేదని వైస్ న్యూస్ తెలిపింది. ఈ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్ లాగిన్ పేజీలోని ఎబౌట్లో ఎటువంటి సమాచారం ఉండదు. అలాగే ఈ సంస్థ సర్వర్లను తరచూ మారుస్తూ ఉంటుంది. బహుశా ఎవరూ ట్రాక్ చేయకుండా ఉండేందుకే ఇటువంటి విధానం అనుసరిస్తుంటుందని తేలింది. నేరస్తులు ఎక్కడ దాక్కున్నారో తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడే ఈ టైటాన్ సాఫ్ట్వేర్ సేవలను చట్టాన్ని అమలు చేసే వారి కన్నా.. నేరస్తులే అధికంగా ఉపయోగిస్తున్నారని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. కాగా ఈ వివరాలపై మెక్సికన్ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. ఇది కూడా చదవండి: దావూద్ ఇబ్రహీంకు సీరియస్? -
తగ్గిన నిరుద్యోగ రేటు - గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి నిరుద్యోగిత రేటు 6.6 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే కాలంలో ఇది 7.2 శాతం నమోదైంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.8 శాతంగా ఉండగా, ఏప్రిల్–జూన్‌లో 6.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని స్త్రీలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగం రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో 8.6 శాతానికి వచ్చి చేరింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 9.4 శాతంగా ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో 9.1 శాతం, జనవరి–మార్చిలో 9.2 శాతం, అక్టోబర్–డిసెంబర్ 9.6 శాతం నమోదైంది. పట్టణ ప్రాంత పురుషులలో నిరుద్యోగిత రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో 6 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 6.6 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో 5.9 శాతం ఉంది. 2022–23 జనవరి–మార్చిలో 6 శాతం, అక్టోబర్–డిసెంబర్లో 6.5 శాతంగా నమోదైంది. క్రియాశీల శ్రామిక శక్తి.. 2023 జూలై–సెప్టెంబర్‌లో పట్టణ ప్రాంతాలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల్లో క్రియాశీల శ్రామిక శక్తి 49.3 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.9 శాతంగా ఉంది. 2023 ఏప్రిల్–జూన్‌లో 48.8 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చిలో 48.5 శాతం, అక్టోబర్–డిసెంబర్లో 48.2 శాతం నమోదైంది. -
నెల్లూరులో ‘పచ్చదొంగల ముఠా’ ఆగడాలు
సాక్షి, నెల్లూరు: ఓటర్ల డేటా పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్న ‘పచ్చదొంగల ముఠా’ బాగోతం మరోసారి వెలుగుచూసింది. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ కార్యకర్తలు ఇళ్లల్లోకి చొరబడి వ్యక్తిగత డేటాను దొంగలించడానికి యత్నించిన ఘటన తాజాగా నెల్లూరులో బయటపడింది. మాజీ మంత్రి పొంగురు నారాయణకు చెందిన ప్రైవేటు సైన్యం ఓటర్ల డేటా పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. నగరంలో ఇంటింటికి తిరుగుతూ సెల్ఫోన్లో మీకు ఓటిపి వస్తుంది అని ఓటిపి తీసుకొని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు(శనివారం) మూలాపేటలో ఓ ఇంటికి వెళ్లి ఇలా వ్యక్తిగత డేటాను దొంగిలించే యత్నించేందుకు ఓటీపీలు అడుగుతున్నటువంటి పచ్చదొంగల ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఇది చదవండి: ఇళ్లపైకి ‘పచ్చ’దొంగలు.. జాగ్రత్త! -
భవిష్యత్ గ్యారంటీ కార్డు పేరిట టీడీపీ సమాచార సేకరణ
-
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరగబోయే మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. గత ఎన్నికల ప్రక్రియ ముగిశాక.. తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి 2019 జనవరి 15వ తేదీ ప్రారంభమైంది. 2024 జనవరి 16వ తేదీతో తెలంగాణ అసెంబ్లీ గడువు ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30వ తేదీ గురువారం నాడు ఒకే దఫాలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ.. ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 9వ(సోమవారం) తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తక్షణమే ఎన్నికల కోడ్‌ను అమలులోకి తెచ్చింది. ఆపై నవంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన కాసేపటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. వారంపాటు సాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. నవంబర్ 10వ తేదీతో ముగిసింది. నవంబర్ 13వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన చేపట్టారు రిటర్నింగ్ అధికారులు. నవంబర్ 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఎన్నికల ప్రచారం నవంబర్ 28వ తేదీ సాయంత్రం ముగిసింది. మొత్తం ఓటు హక్కు ఉన్నవాళ్ల సంఖ్య.. ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1.62 కోట్లు, మహిళా ఓటర్లు 1.63 కోట్లు. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676 మంది,సర్వీస్ ఓటర్లు(సాయుధ దళాల సిబ్బంది, దేశం వెలుపలా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పని చేసే వ్యక్తులు) 15, 406 మంది ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు (18-19ఏళ్ల వయసు) 9,99,667 మంది ఉన్నారు. వీళ్లలో పురుష ఓటర్లు 5,70,274 మంది, మహిళా ఓటర్లు 4,29,273 మంది, ట్రాన్స్ జెండర్ ఓటర్లు 120 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు(పీడబ్ల్యూడీ) 5,06,921 మంది ఉండగా.. ఇందులో పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఒకరు ఉన్నారు. ఓవర్సీస్ ఓటర్లు.. పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 1 మొత్తంగా 2,944 ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 59 ఏళ్లలోపు వాళ్లు 86 శాతం ఉన్నారు. వయసు 80 ఏళ్లు దాటిన వాళ్లు 4,40,371 మంది ఉన్నారు. 80ఏళ్ల వయసు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణలో ఈసీ తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 3,26,18,205. తెలంగాణలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించారు. ఈ వెసులుబాటుతో 27,178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాజ్ రాజ్ ప్రకటించారు. అందులో 15,000 మంది సీనియర్ సిటిజన్లు, 9,374 మంది వికలాంగులు, 1,407 మంది నిత్యావసర సేవా సిబ్బంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అత్యధికం.. అత్యల్పం అత్యధికంగా హైదరాబాద్‌లో 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,26,574 మంది ఓటర్లు ఉన్నారు. ఇక నియోజకవర్గాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో(హైదరాబాద్ జిల్లా) 7 లక్షల 32 వేల 560 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) నియోజకవర్గంలో లక్షా 48 వేల 713 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. బరిలో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 4,798 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటినీ(పరిశీలన) తర్వాత 2,898 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చివరకు 2,290 మంది అభ్యర్థులు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీ నగర్(రంగారెడ్డి జిల్లా)లో 48 మంది, కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్‌లో 44 మంది.. కామారెడ్డిలో 39 మంది పోటీలో మిగిలారు. అత్యల్పంగా నారాయణపేట(నారాయణపేట జిల్లా)లో ఏడుగురు, బాన్సువాడలో(కామారెడ్డి జిల్లా)లోనూ ఏడుగురు చొప్పున అభ్యర్థులు, బాల్కొండ(నిజామాబాద్)లో 8 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. సాధారణంగా.. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయిస్తారు. గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులకు వరుస క్రమంలో ఎన్నికల అధికారులు జాబితా తయారు చేస్తారు. వాటి ఆధారంగానే బ్యాలెట్ రూపొందిస్తారు. పార్టీ ప్రతినిధుల నుండి క్లియరెన్స్ తర్వాత(నవంబర్ 29) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు. ఏర్పాట్లు.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35,655 పోలింగ్ కేంద్రాల్లో తెలంగాణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో వెబ్‌క్యాస్టింగ్ ఉండే కేంద్రాలు 27,097 (78శాతం), 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 67 మంది జనరల్ అబ్జర్వర్లను, 39 మంది పోలీస్ అబ్జర్వర్లను తెలంగాణ ఎన్నికల కోసం నియమించింది ఈసీ. మొత్తంగా ఎన్నికల విధుల కోసం 2.08 లక్షల మంది సిబ్బందిని నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. వాళ్లను రెండు రోజులు ముందుగానే ఆ ప్రాంతాలకు తరలించింది. 35,655 పోలింగ్ కేంద్రాలు పోలింగ్: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా పోలింగ్ కేంద్రాల వల్ల 144 సెక్షన్ అమలు 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో.. 4,400 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ముగింపు పోలింగ్ ముగిసే టైం వరకు లైన్లో ఉన్నవాళ్లకు మాత్రమే ఓటింగ్‌కు అనుమతి భద్రత కోసం 375 కంపెనీల కేంద్ర బలగాలు భద్రతా విధుల్లో 45 వేలమంది పోలీసులు ఏజెన్సీ ఏరియాల్లో భద్రత మరింత కట్టుదిట్టం నవంబర్ 30వ తేదీ ఉదయం 5.30ని. పోలింగ్ సిబ్బందికి అవగాహన కోసం మాక్ పోలింగ్ ఉంటుంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల కౌంటిగ్.. అదే రోజు ఫలితాల వెల్లడి అవుతాయి. మొత్తంగా ఈసీ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5వ తేదీలోపు తెలంగాణ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. -
ఢీ అంటే ఢీ ఆర్ట్ ఆఫ్ డీఇన్‌ఫ్లుయెన్సింగ్
‘ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్ పవర్ ఏమిటో చూశారు. ఇక డీఇన్ఫ్లుయెన్సర్ పవర్ ఏమిటో చూసే టైమ్ వచ్చింది’... ఇది తెలుగు సినిమాలో మాస్ డైలాగ్ కాదు. సోషల్ మీడియాలో ఒక కుర్రాడు పెట్టిన కామెంట్.సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల హవా నడుస్తున్న కాలం ఇది. కస్టమర్లు ఏది కొనాలో, ఏ షో చూడాలో, ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో చెబుతున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్‌కు అడ్డుపడే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్’ ట్రెండ్ యువతరం నుంచే వచ్చి బలపడుతోంది. ట్రెడిషనల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ప్రాడక్ట్‌ను హైప్ చేస్తే డీఇన్ఫ్లుయెన్సర్లు ఆ హైప్‌ను ఛాలెంజ్ చేస్తున్నారు.... మార్కెటింగ్ డాటా అండ్ ఎనలిటిక్స్ కంపెనీ కంతార్ స్టడీ రిపోర్ట్ ప్రకారం వినియోగదారులపై ఇన్ఫ్లుయెన్సర్ల సిఫారసుల ప్రభావం తక్కువేమీ కాదు. సోషల్ మీడియాలో ఎటు చూసినా ఇన్ఫ్లుయెన్సర్లు కనిపిస్తారు. టీ పోడుల నుంచి టీపాయ్‌ల వరకు రకరకాలప్రాడక్ట్స్ను ప్రమోట్ చేయడానికి చిన్నచిన్న క్యాచీ వీడియోలను రూపోందిస్తారు. దీనికి భిన్నంగా ఒక ప్రాడక్ట్‌ను విశ్లేషిస్తూ విమర్శిస్తే...అదే డీఇన్‌ఫ్లుయెన్సింగ్! ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో టిక్ టాక్‌లో ఈ ట్రెండ్ మొదలైంది.సోషల్ మీడియా ఎనాలటిక్స్ ఫర్మ్ ట్యూబ్లర్ ల్యాబ్స్ చెబుతున్నదాని ప్రకారం గత సంవత్సరం నుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. మ్యాడి వెల్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ప్రముఖ కాస్మటిక్ స్టోర్స్‌లో పని చేసింది. కొన్నిప్రోడక్ట్స్ పట్ల కస్టమర్లు ఎందుకు విముఖంగా ఉన్నారో తన స్వీయ అనుభవాలను తెలియజేసింది. ఈ ప్రభావంతో ఆమె పేరు ఇన్ఫ్లుయెన్సర్ల జాబితా నుంచి డీఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలోకి చేరింది. న్యూయార్క్‌కు చెందిన ఇరవై సంవత్సరాల క్లారా కొన్ని బ్రాండ్లను విమర్శిస్తూ వీడియోలు చేసింది. వాటిలో ఒకటి వైరల్‌గా మారింది. అదే సమయంలో తాను విమర్శించిన బ్రాండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే భయం పట్టుకుంది. అయితే తనకు తానుగా ధైర్యం తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.‘నేను సరిౖయెన వివరాలతోనే వీడియో చేశాను. నేనెందుకు భయపడాలి’ అంటోంది క్లారా. మన సెలబ్రిటీ ఒకరు ఆరోగ్య సంబంధమైన విషయాలపై కాస్త లోతుగానే మాట్లాడాడు. అయితే ఆయన అవగాహన లోపాన్ని ఒక వైద్యుడు వెంటనే ఎత్తిచూపాడు. పాపులర్ చైనీస్ వ్లోగర్ ఒకరు తన వయసు తక్కువగా కనిపించేలా సాంకేతిక మాయ చేస్తే ఎవరో కుర్రాడు కనిపెట్టి ‘ఆయన అసలు రూపం ఇది’ అని చూపాడు. స్వీడన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫేక్ ట్రిప్ గురించి మరొక యువకుడు ‘ఇవి ఫొటోషాప్ చిత్రాలు’ అని నిజాన్ని బహిర్గతం చేశాడు. నిజానికి ఇలాంటివి సోషల్ మీడియాలో గతంలో లేవని కాదు. అయితే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్’ పుణ్యామా అని ‘అది కాదు ఇది’ అని వెంటనే సాధికార సమాచారంతో స్పందించే ధోరణి పెరిగింది.డీఇన్ఫ్లూయెన్సర్లు వోవర్–హైప్డ్ప్రాడక్ట్స్ను విమర్శించడమే కాదు చౌక ధరల్లో లభించే వాటి గురించి చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రోఫెసర్ అయిన అమెరికస్ రీడ్ ఇలా అంటున్నారు...‘ఇన్ఫ్లుయెన్సర్లలో ఎక్కువమంది సాధికారికంగా మాట్లాడడం లేదేమో అనే భావన కస్టమర్లలో వచ్చింది. డబ్బులు ఇస్తారు కాబట్టి సంబంధితప్రాడక్ట్ను ప్రమోట్ చేస్తారు. నిజానిజాల గురించి వారికి అవసరం లేదు. ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో డీఇన్ఫ్లుయెన్సరే నయం అనుకుంటున్నారు. నిజానికి డీఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇన్ఫ్లుయెన్సరే’ కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఈ ట్రెండ్‌కు ‘యాంటీ క్యాపిటలిస్ట్’ ట్రెండ్‌గా నామకరణం చేశారు. డీఇన్‌ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ వల్ల వృథా ఖర్చులు తగ్గుతాయని, వేలం వెర్రికి అడ్డుకట్టపడుతుందని, పర్యావరణ కోణంలో కూడా ఈ ట్రెండ్ వల్ల మేలు జరుగుతుందని యువతరంలో ఎంతోమంది బలంగా వాదిస్తున్నారు. తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలలో ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్’ ట్రెండ్‌పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి.డీఇన్ఫ్లుయెన్సింగ్కు విషయ సాధికారత, నిజాయితీ అనేవి కీలకం. అయితే ‘డీఇన్‌ఫ్లుయెన్సింగ్’ రూపంలో సూడో–అథెంటిసిటీ ముందుకు వస్తుందని, ఈ ట్రెండ్‌ను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే విమర్శ ఉంది. ‘ఈ ట్రెండ్ కాస్త చివరికి ఎలా మారుతుందంటే ఇది కొనవద్దు. మీరు కొనాల్సింది అది అన్నట్లుగా!’ అంటుంది 26 సంవత్సరాల అమెరికన్ ఇన్ఫ్లు్లయెన్సర్ జెస్సిక. ‘ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పగానే కస్టమర్ల అభిప్రాయాలు రాత్రికి రాత్రి మారిపోవు. ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం సలహా ఇస్తారు. అంతే. ఏది కొనాలి, ఏది కొనకూడదు అనే స్వీయవిచక్షణ కస్టమర్లలో ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లుగా మేము పారదర్శకంగా, నిజాయితీగా ఉంటాం’ అంటుంది ఫ్రాన్స్‌కు చెందిన ఇన్ఫ్లున్సర్ కోలిన్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం డీఇన్‌ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ హెల్త్, ఫైనాన్స్, లైఫ్‌స్టైల్ విభాగాలలో ఎక్కువగా కనిపిస్తుంది.‘డీఇన్ఫ్లూయెన్సింగ్ అనేది వాపా బలుపా?’ అనేది పక్కన పెడితే ఈ ట్రెండ్ మూలంగా ఇన్ఫ్లుయెన్సర్లుప్రాఫిట్కు మాత్రమే కాదు మెరిట్‌కు కూడాప్రాధాన్యత ఇచ్చే ధోరణి, జవాబుదారీతనం పెరుగుతుంది. సమస్య ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అనుసరిస్తున్న ధోరణి. వారిలో మార్పు రావాలి. సామాజిక బాధ్యత పెరగాలి. యువతలో అశాంతి, ఆందోళన రేకెత్తించే కంటెంట్‌కు దూరంగా ఉండాలి.– హిమాద్రి పటేల్, డిజిటల్ క్రియేటర్ -
డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్ట నిబంధనలకు అనుగుణంగా తమ సిస్టమ్స్‌ను సరిచేసు కునేందుకు వ్యాపార సంస్థలకు కొంత సమయం ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇది సుమారు ఏడాది పాటు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలతో సమావేశం సందర్భంగా ఆయన విలేకరులకు చెప్పారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్ అథారిటీ అయిన డేటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీబీ)ని వచ్చే 30 రోజుల్లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి తెలిపారు. డేటా భద్రత బోర్డుతో పాటు మార్గదర్శకాలు మొదలైనవన్నీ నెల రోజుల్లోగా సిద్ధం కాగలవని మంత్రి తెలిపారు. మెటా, లెనొవొ, డెల్, నెట్‌ఫ్లిక్స్ సహా పలు కంపెనీలకు చెందిన 125 మంది పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరుల వ్యక్తిగత డేటాను ఆన్లైన్ వేదికలు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే దిశగా డేటా భద్రత చట్టాన్ని రూపొందించారు. దీనికవసరమైన 25 నియమాలలో చాలా వరకు ముసాయిదా రూపొందించబడి సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు గతంలో చెప్పారు. సమ్మతి ఆధారిత యంత్రాంగం ద్వారా వినియోగదారుల డేటాను సేకరించడం కంపెనీలకు చట్టం తప్పనిసరి చేసింది, అయితే కొన్ని చట్టబద్ధమైన ఉపయోగాల కోసం, చట్టం కొన్ని సడలింపులను అందిస్తుంది. అమల్లో విఫలమైన సంస్థలకు రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చని చట్టంలో ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాదు 500 కోట్లకు పెంచవచ్చని కూడా పేర్కొన్నారు. -
వ్యక్తిగత డేటా సేఫ్‌గానే ఉందా?.. తెలియాలంటే..
వ్యక్తిగత డేటా సేఫ్‌గా ఉండకపోతే స్కామర్ల చేతిలో నష్టపోవాల్సి ఉంటుంది. డేటా దొంగిలించడం అనే కారణంతో ఇటీవల సైబర్‌మోసాలు పెరుగుతున్నాయి. మన వ్యక్తిగత డేటాను స్కామర్లు ఏ విధంగా దొంగిలిస్తారు, ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి.. డేటా ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి సాంకేతిక, సంస్థాగత, చట్టపరమైన రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత డిజటల్ హక్కులలో... యాక్సెస్ పొందే హక్కు, నిర్ధారించే హక్కు, సరిచేసే హక్కు, పోర్టబిలిటీ హక్కు, మర్చిపోవడం, ఆమోదం తెలిపే హక్కు ఉంటాయి. వ్యక్తిగత డేటా సమాచారం వారి ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి. వ్యక్తులు, వ్యాపారులు తమకు సంబంధించిన డేటా రక్షణగా ఉంటే ఆర్థిక, పరువు, చట్టపరమైన బాధ్యత వంటి నష్టాలను తగ్గించడంలో సహాపడుతుంది. డేటా ఉల్లంఘనలు, సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతున్నందన చట్ట ప్రకారం అవసరమైన జనరల్డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) చర్యలను అమలు చేస్తుంటారు. డేటా దొంగిలించడం జరిగినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. జీడీపీఆర్ ప్రకారం డేటా ఉల్లంఘన జరిగితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మీ డేటాను వివిధ కంపెనీలు ఎలా తీసుకుంటాయంటే... ఆన్లైన్ షాపింగ్: పేరు, జెండర్, ఇమెయిల్, చిరునామా, డెలివరీ, ఫోన్ నెంబర్, క్రెడిట్‌కార్డ్ వివరాలు, ప్రొడక్ట్ హిస్టరీ, తరుచూ కొనుగోలు చేసే వస్తువులు, షాపింగ్ విలువ, ఎక్కువ శాతంలో బ్రౌజ్ చేస్తున్న ప్రొడక్ట్స్, మీ ఐపీ అడ్రస్... ఈ వివరాలన్నీ వ్యక్తిగత డేటా జాబితాలోకి వస్తాయి. డేటింగ్ యాప్‌లు... పేరు, జెండర్, వయసు, సెక్కువల్ ఓరియెంటేషన్, ఫోన్ నెంబర్, ప్రైవేట్ చాట్, పొలిటికల్ వ్యూస్, వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాలు, స్వైప్స్, డిజిటల్ డివైజ్ సమాచారం, ఐపీ అడ్రస్.. ఈ యాప్ ద్వారా బహిర్గతం అవుతాయి. సెర్చ్ ఇంజిన్లు.. ఆన్లైన్ సెర్చింగ్, బ్రౌజింగ్ హిస్టరీ, ఆన్లైన్ ఆసక్తులు, షాపింగ్ అలవాట్లు, ఐపీ చిరునామా, ప్లేస్, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డులు, పరికర సమాచారం, డౌన్లోడ్ చేసిన ఫైల్స్, ఉపయోగించే బ్రౌజర్ యాడ్–ఆన్లు.. ద్వారా జరుగుతుంటుంది. సోషల్ మీడియా.. పోస్ట్‌లు, ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, ఫైల్స్, ఫోన్ పరిచయాలు, పేరు, జెండర్, ఇమెయిల్, ప్లేస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఫ్రెండ్స్ గ్రూప్, గ్రూప్ చాట్స్, పోస్టులు, ట్యాగ్ చేసిన ఫొటోలు అండ్ వీడియోలు.. సోషల్ మీడియా ద్వారా జరుగుతుంటాయి. గుర్తించదగిన సమాచారం.. మీ పుట్టిన రోజు లేదా ఫోన్ నెంబర్ వంటివి పబ్లిక్ రికార్డ్‌లో ఉండవచ్చు. ఒకసారి మీ వివరాలు బయటకు వచ్చాక దాడి చేసేవారు ఉండవచ్చు. సోషల్ ఇంజనీరింగ్ మోసాలకు వ్యక్తిగత డేటా సులభంగా ఉపయోగించుకోవచ్చు. సురక్షిత చర్యలు.. చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడి డేటా రక్షణ సూత్రాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. అవి సాధారణంగా కింది అంశాలను కలిగి ఉంటాయి... ∙చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యక్తులకు ప్రయోజనం కలిగేలా ప్రాసెస్ చేయాలి ∙వ్యక్తిగత డేటా విషయంలో కచ్చితత్వం పాటించాలి. అదే విధంగా ఇతరులు యాక్సెస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙అనధికార లేదా చట్టవిరుద్ధమైన ప్రాసెసింగ్ ద్వారా నష్టం కలిగితే నియంత్రణ అధికారులకు తెలపాలి. భారతదేశంలో డేటా రక్షణ కోసం చట్టం.. మన దగ్గర ఉన్న ఏకైక డేటా రక్షణ చట్టం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (ఐటీ చట్టం). దీని ప్రకారం డేటా చౌర్యం జరిగితే రక్షణ కోసం ఉపయోగించే కొన్ని సెక్షన్లు ఎ)సెక్షన్ 69 బి) సెక్షన్ 69ఎ సి) సెక్షన్ 69 బి.. ఉన్నాయి. అయితే, ముందస్తుగా డేటా గోప్యతను రక్షించడానికి చట్టం లేదు. తమ డేటాను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. అల్ఫాన్యూమరిక్ వర్డ్స్ ఉపయోగించాలి. ప్రత్యేక అక్షరాలను చేర్చాలి ∙రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించాలి ∙ఓటీపీ లేదా అథెంటికేటర్ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి పేరొందిన సెక్యూరిటీ, యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. ఫిషింగ్ స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ∙చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయరాదు. డేటా కేర్ సాఫ్ట్వేర్/యాప్స్‌ని చట్టబద్ధమైన మూలాల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ∙ మీ బ్రౌజర్‌ని అప్డేట్ మోడ్‌లో ఉంచాలి. https//తో ప్రారంభమయ్యే సురక్షిత వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేయాలి https://mxtoolbox.com/EmailHeaders.aspx ఉపయోగించి ఇమెయిల్ పూర్తి హెడర్‌ను చెక్ చేయాలి మీ యాప్‌లు మీ డేటాను ఎలా యాక్సెస్ చేస్తున్నాయో చెక్ చేయాలి. అందుకు.. https://reports.exodus-privacy.eu.org/en/, https://smsheader.trai.gov.in/ని ఉపయోగించి ఎసెమ్మెస్ సరైనదేనా అని ధృవీకరించుకోవచ్చు. మీ డేటా చౌర్యం జరిగిందీ లేనిదీ తెలుసుకోవడానికి చెక్ చేయాలంటే.. మీ ఇమెయిల్ లేదా ఫోన్ నెంబర్ డేటా ఉల్లంఘనలో భాగమైందో లేదో తనిఖీ చేయడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ల్లో సెర్చ్ చేయచ్చు. (a) https://amibeingpwned.com (b) https://snusbase.com (c) https://leakcheck.net (d) https://leaked.site (e) https://leakcorp.com/login (f) https://haveibeensold.app. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ (చదవండి: ఒక దేశం రెండు పేర్లు.."భారత్" అనే పేరు ఎలా వచ్చిందంటే..) -
భారత్‌లో లేఆఫ్‌లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!
ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా అన్ని రంగాల్లోనూ లేఆఫ్‌లు జరిగాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారత్‌లోనూ వేలాది మందిని ఆయా కంపెనీలు తొలగించాయి. అయితే దేశంలో లేఆఫ్స్‌కు సంబంధించి విస్తుగొలిపే లెక్కలు తాజాగా వెల్లడయ్యాయి. గత రెండేళ్లలో భారతదేశంలో దాదాపు లక్షమంది ఉద్యోగాలు కోల్పోయారని టెక్ ఫోకస్డ్ హైరింగ్ సంస్థ టాప్హైర్ (TopHire) నుంచి వచ్చిన డేటా పేర్కొంటోంది. ఈ లెక్కలు బహిరంగంగా నమోదైన గణాంకాల కంటే చాలా ఎక్కువ.గత రెండేళ్లలో భారతదేశం అంతటా 91,000 మంది ఉద్యోగులు తొలగించబడ్డారని టాప్హైర్ డేటా హైలైట్ చేసింది. మూడు రెట్లు అధికం పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న లేఆఫ్స్ డేటా అగ్రిగేటర్ అయిన లేఆఫ్స్డాట్ఫై (layoffs.fyi) ప్రకారం, 2021 సెప్టెంబర్ 1 నుంచి భారతదేశంలో దాదాపు 27,850 మంది ఉద్యోగాలు కోల్పోయారు. టెక్హైర్ సంస్థ నివేదించిన దానిలో ఇది దాదాపు మూడింట ఒక వంతు మాత్రమే.సైలెంట్ లేఆఫ్‌లు, బలవంతపు రాజీనామాల కారణంగా లెక్కల్లో ఈ భారీ వ్యత్యాసం ఉందని టెక్హైర్ నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: యాపిల్, శాంసంగ్ కీలక నిర్ణయం! ఇక్కడ తయారీ లేనట్లే.. లేఆఫ్స్డాట్ఫై డేటా ప్రకారం.. భారతదేశంలో గత రెండు సంవత్సరాలలో నమోదైన మొత్తం తొలగింపులలో విద్య లేదా ఎడ్టెక్ రంగంలోనే అత్యధికం ఉన్నాయి. బైజూస్, అనకాడమీ, వేదాంతు, అప్‌గ్రేడ్ వంటి కంపెనీలు 10,679 మందిని తొలగించాయి. వీటిలో ఒక్క బైజూస్ సంస్థే దాదాపు ఐదు వేల మందిని తొలగించింది. ఆ తర్వాత రిటైల్, ఈ-కామర్స్ రంగంలో గత రెండేళ్లలో అత్యధిక లేఆఫ్‌లు నమోదయ్యాయి. మింత్రా, మీషో, మమాఎర్త్, ఫ్లిప్‌కార్ట్, ఉడాన్, దుకాణ్ వంటి సంస్థలు 3,400 మందిని తొలగిచాయి. ఇక ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాలు 3195 ఉద్యోగాల కోతలతో మూడవ స్థానంలో నిలిచాయి. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ జియోమార్ట్, డన్జో తదితర సంస్థలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగాలను తగ్గించాయి. -
స్థానికంగానే టీచర్ల మెడికల్ బిల్లుల డేటా పరిశీలన
సాక్షి, అమరావతి: మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల సమాచారం స్థానిక డీడీవోల లాగిన్‌లోనే అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ తెలిపారు. వాటిని సరిగ్గా పరిశీలించి.. టీచర్లకు సరైన సమాచారం అందించాలని డీడీవోలను శనివారం కమిషనర్ ఆదేశించారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల స్థితిగతులను తెలుసుకునేందుకు, ప్రొసీడింగ్స్ కాపీల కోసం దూరప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నంలోని కమిషనరేట్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. బిల్లుల మంజూరు ప్రక్రియను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. కానీ డీడీవోలైన హెచ్ఎంలు, ఎంఈవోలు, డీవైఈవోల లాగిన్‌లో పరిశీలించకపోవడం వల్ల సమస్య వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి స్క్రూటినీ రిపోర్టులు వచి్చన వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా మంజూరు ప్రొసీడింగ్స్ ఆమోదించి, సంబంధిత డీడీవోల లాగిన్లకు పంపిస్తున్నామన్నారు. కానీ డీడీవోలు తమ లాగిన్‌లో బిల్లుల స్థితిగతులను సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల టీచర్లు వాటి కోసం దూరప్రాంతాల నుంచి తమ కార్యాలయానికి వస్తూన్నారని, టీచర్లు, ఉద్యోగులు వీటి కోసం కమిషనరేట్‌ను సంప్రదించే పరిస్థితి వస్తే.. డీఈవోలు, డీడీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన మెడికల్ రీయింబర్స్ బిల్లులను సంబంధిత డీడీవోలు ఆన్లైన్లోనే సమర్పించాలని.. లాగిన్ ఫిజికల్ బిల్లులు స్వీకరించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. -
గుడ్‌న్యూస్:11 నెలల గరిష్టానికి ఈపీఎఫ్‌వో సభ్యులు
తాజా అధికారిక ఉద్యోగాల కల్పన జూన్‌లో వరుసగా మూడవ నెలలోనూ పెరుగుదలను నమోదు చేసింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తాజా డేటా ప్రకారం జూన్ 2023లో 17.89 లక్షల కొత్త సభ్యులను చేర్చుకుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2022 తర్వాత అత్యధికమని డేటా తెలిపింది. మొత్తం చెల్లింపులు 11 నెలల గరిష్టమని పేర్కొంది. 3,491 సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెలలో తొలి ఈసీఆర్ని చెల్లించడం ద్వారా సామాజిక భద్రతా కవరేజీని అందించాయని పేర్కొంది.మే నెలతో పోలిస్తే జూన్ నెలలో సభ్యుల సంఖ్య 9.71 శాతం పెరిగింది. జూన్‌లో 10.14 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్‌వోలో చేరారు.సుమారు 12.65 లక్షల మంది సభ్యులు నిష్క్రమించినా మళ్లీ చేరినట్లు పేరోల్ డేటా సూచిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!) జూన్‌లో చేరిన మొత్తం సభ్యులలో 18 -25 సంవత్సరాల వయస్సు గలవారు, 57.87 శాతంగా ఉన్నారు. అలాగే 10.14 లక్షల మంది కొత్త సభ్యులలో, సుమారు 2.81 లక్షల మంది మహిళా సభ్యులు,తొలిసారిగా ఈపీఎఫ్‌లో చేరారు. వర్క్‌ఫోర్స్‌లో చేరిన మహిళా సభ్యుల శాతం గత 11 నెలలతో పోలిస్తేఇదే అత్యధికం. -
మనవాళ్లు వారానికి 22గంటలు సోషల్ మీడియాలోనే.. ఆశ్చర్యపరుస్తున్న నిజాలు!
ఇండియా టెక్నాలజీ రంగంలో పరుగులు పెడుతున్న తరుణంలో భారతీయులు సగటున ప్రతి రోజు 194 నిముషాలు.. అంటే మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గడుపుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సగటున భారతీయులు 46 నిమిషాలు ఆన్లైన్ గేమ్‌లలోనూ, ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌లపై 44 నిమిషాలు ఇలా సమయం గడుపుతున్నట్లు తెలిసింది. ఈ డేటా 2.06 మిలియన్ల వినియోగదారుల నుంచి యాప్‌లోని డేటా ఆధారంగా విడుదల చేయడం జరిగింది. మొత్తం 100 శాతం సోషల్ మీడియా వినియోగం స్మార్ట్ఫోన్లు లేదా టాబ్లెట్ల ద్వారా జరిగినట్లు స్పష్టమైంది. OTT కంటెంట్ కోసం 68 శాతం మంది స్మార్ట్ఫోన్లు/టాబ్లెట్లను, 4 శాతం మంది ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లను ఉపయోగించారు. ఇక 28 శాతం మంది టీవీ లేదా హోమ్ థియేటర్లను ఉపయోగించారు. ఇదీ చదవండి: వారికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి - అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా! ఇలా చేస్తే తగ్గే అవకాశం.. ఇంటర్నెట్లో సర్ఫింగ్ ఖర్చు విషయానికి వస్తే, సోషల్ మీడియా వినియోగదారులకు చాలా వరకు ఉచితం అని నివేదిక పేర్కొంది. కానీ వారు OTT కంటెంట్‌పై నెలకు రూ. 201 నుంచి రూ. 400, అదే విధంగా ఆన్లైన్ గేమింగ్‌పై నెలకు రూ. 100 కంటే తక్కువ చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్లాట్‌ఫామ్ ధరలను 30 శాతం పెంచినట్లయితే.. 71 శాతం మంది గేమర్లు, 17 శాతం OTT ప్రేక్షకులు సమయాన్ని తగ్గించే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడించాయి. -
లోక్‌సభలో పాసైన డేటా పరిరక్షణ బిల్లు
ఢిల్లీ: దేశ పౌరుల డిజిటల్హక్కుల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు.. లోక్‌సభలో ఎట్టకేలకు పాసైంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఆగస్టు 3న లోక్‌సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ‘గోప్యత’ దెబ్బతింటుందన్న విపక్షాల అనుమాన ఆందోళనల నడుమే ఇవాళ బిల్లు పాస్ కావడం గమనార్హం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా రూ.50 కోట్ల నుంచి గరిష్టంగా 250 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారని కేంద్ర ఐటీశాఖ మంత్రి(సహాయ) రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ చట్టం అమలు కోసం డేటా ప్రొటెక్షన్ బోర్డు ఆఫ్‌ఇండియాను ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లులోని నిబంధనం ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్‌తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసేందుకు పర్మిషన్ ఉంటుంది. ఆన్లైన్ వేదికల్లో.. వ్యక్తుల నుంచి సమాచార దుర్వినియోగం విపరీతంగా జరుగుతుంటుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం గనుక పొందితే.. ప్రతి పౌరుడి డిజిటల్ హక్కులకు రక్షణ లభిస్తుంది అని కేంద్రం చెబుతోంది. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లుతో సోషల్ మీడియా కంపెనీల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఈ బిల్లు భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో సేకరించిన.. ఆఫ్‌లైన్‌లో సేకరించి డిజిటలైజ్ చేయబడిన వాటి ప్రాసెసింగ్‌కు వర్తిస్తుంది. ► వ్యక్తిగత డేటా ఆ వ్యక్తి సమ్మతితో చట్టబద్ధమైన ప్రయోజనం కోసం మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. వినియోగదారుల డేటాను ఉపయోగించడానికి కంపెనీలు ఇప్పుడు అనుమతి తీసుకోవాలి. ► డేటా విశ్వసనీయులు డేటా ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి, డేటాను సురక్షితంగా ఉంచడానికి, దాని ప్రయోజనం అందించిన తర్వాత డేటాను తొలగించడానికి బాధ్యత వహిస్తారు. ► సమాచారాన్ని స్వీకరించే, సరిదిద్దే, తొలగించే హక్కు, ఫిర్యాదులను పరిష్కరించే హక్కుతో సహా వ్యక్తులకు ఈ బిల్లు నిర్దిష్ట హక్కులను అందిస్తుంది. ► రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్, నేరాల నిరోధం వంటి కారణాలతో బిల్లులోని నిబంధనలను అమలు చేయడం నుంచి ప్రభుత్వ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వవచ్చు. ఇదీ చదవండి: కుటుంబ పాలన.. క్విట్ ఇండియా -
parliament session: డేటా దుర్వినియోగం చేస్తే రూ.250 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: పౌరుల డిజిటల్ హక్కులు, వ్యక్తిగత సమాచార భద్రతకు ఉద్దేశించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుని ద్రవ్య బిల్లుగా తీసుకువచ్చారన్న ఆరోపణల్ని మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. ఇది సాధారణ బిల్లేనని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత గోప్యతతో ప్రమేయమున్న ఈ బిల్లును హడావుడి ఆమోదించవద్దని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి అన్నారు. గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉంచిన ముసాయిదా బిల్లుపై వచి్చన సలహాలు సూచనలతో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వినియోగదారుల డిజిటల్ డేటాని దుర్వినియోగం చేసేవారిపై కేంద్రం కొరడా ఝళిపించింది. అలాంటి సంస్థలపై రూ.50 నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించనుంది. అంతేకాకుండా ఈ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా డేటా ప్రొటక్షన్ బోర్డుని ఏర్పాటు చేయనున్నట్టుగా బిల్లులో పేర్కొంది. -
డేటా బిల్లుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు (డీపీడీపీ)కి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. జూలై 20 నుంచి ఆగస్టు 11 దాకా జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ బిల్లును ప్రవేశపెడతారని అధికార వర్గాల సమాచారం. గోప్యత హక్కులో భాగంగా పౌరుల డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ విషయంలో ఇంటర్నెట్ కంపెనీలు, మొబైల్ యాప్స్, వ్యాపార సంస్థల్లో జవాబుదారీతనం పెంచడం దీని లక్ష్యం. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గత ఆగస్టులో సుప్రీంకోర్టు ప్రకటించిన అనంతరం డేటా పరిరక్షణ బిల్లు తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు డేటా సేకరణకు ముందు పౌరుల అనుమతి తీసుకోవాలి. -
అభివృద్ధికి ‘రోడ్’మ్యాప్‌లు
ఎటైనా వెళ్లాలంటే.. బండి తీశామా, రోడ్డెక్కామా అంతే. వేరే పట్టణానికో, రాష్ట్రానికో వెళ్లాలంటే.. కారులోనో, బస్సులోనో హైవే ఎక్కాల్సిందే. కొన్ని హైవేలు అయితే వందలు, వేల కిలోమీటర్ల మేర సాగుతూనే ఉంటాయి. మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎంత పొడవున రోడ్లు ఉన్నాయో తెలుసా? మన దేశంలో ఉన్న రోడ్ల లెక్క ఏమిటో తెలుసా? దీనిపై తాజాగా ‘విజువల్ క్యాపిటలిస్ట్’సంస్థ ఓ అధ్యయనం చేయించి ‘రోడ్ల’లెక్కలు తేల్చింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ మొత్తంగా కోట్ల కిలోమీటర్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద హైవేల నుంచి గ్రామీణ రోడ్ల దాకా.. మొత్తం రహదారుల పొడవు సుమారు 2.1 కోట్ల కిలోమీటర్లపైనే. చంద్రుడికి, భూమికి మధ్య దూరం సుమారు 3 లక్షల కిలోమీటర్లు. ఈ లెక్కన భూమ్మీద రోడ్ల పొడవు.. 35 సార్లు చంద్రుడి వద్దకు వెళ్లి వచ్చినంత అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 200కుపైగా దేశాలు ఉంటే.. మొత్తం రోడ్ల విస్తీర్ణంలో ఒక్క అమెరికాలోనే 14 శాతానికిపైగా ఉండటం గమనార్హం. విజువల్ క్యాపిటలిస్ట్ సంస్థ కోరిన మేరకు పైథాన్ మ్యాప్స్ సంస్థ ఈ అధ్యయనం చేసింది. ‘గ్లోబల్ రోడ్స్ ఇన్వెంటరీ ప్రాజెక్ట్ (జీఆర్‌ఐపీ)’లోని రోడ్ల డేటాను సేకరించి.. వివిధ దేశాలు, ప్రాంతాల వారీగా క్రోడీకరించింది. ఏ దేశంలో.. ఎంత పొడవుతో.. ప్రపంచవ్యాప్తంగా 222 దేశాల్లో కలిపి మొత్తం రోడ్ల విస్తీర్ణం 2,16,00,760 కిలోమీటర్లు. ఇందులో 30 లక్షల కిలోమీటర్లకుపైగా పొడవైన రోడ్లతో యూఎస్ఏ టాప్‌లో నిలిచింది. 17 లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లతో చైనా, పది లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లతో భారత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలోని మొత్తం రహదారుల విస్తీర్ణంలో కేవలం ఈ మూడు దేశాల్లోనే 25 శాతానికిపైగా ఉండటం గమనార్హం. ఇక ఆండోరా, జీబ్రాల్టర్, వాలిస్ అండ్ ఫ్యుచురా ఐలాండ్స్, లీచెన్‌స్టీన్, పలౌ, అమెరికన్ సమోవా, ఫ్రెంచ్ సదరన్–అంటార్కిటిక్ ఐలాండ్స్, బెర్ముడా, క్రిస్మస్ ఐలాండ్స్, నార్ఫ్లోక్ ఐలాండ్ తదితర దేశాల్లో రోడ్ల విస్తీర్ణం 30 కిలోమీటర్లలోపే కావడం విశేషం. రోడ్ల విస్తీర్ణంలో మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 27వ (1,83,317 కి.మీ), పాకిస్తాన్ 38వ (1,06,183 కి.మీ), శ్రీలంక 43వ (96,023 కి.మీ) స్థానాల్లో ఉన్నాయి. హైవేలలో చైనా.. స్థానిక రోడ్లలో అర్జెంటీనా.. ♦ భారీ హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలు వంటి వాటిని పరిశీలిస్తే.. ప్రపంచంలో చైనా (6,83,248 కి.మీ) టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో అమెరికా (3,66,800), మెక్సికో (1,05,822), జపాన్ (94,451), కెనడా (91,173), బ్రెజిల్ (86,772), ఫ్రాన్స్ (74,956), ఇండియా (69,748), అర్జెంటినా (69,188), ఆ్రస్టేలియా (69,138) నిలిచాయి. ♦ మధ్య స్థాయి హైవేల పొడవులో.. ప్రపంచంలో అమెరికా (8,98,873 కి.మీ) టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రష్యా (5,12,386 కి.మీ), ఇండియా (4,13,790 కి.మీ), చైనా (3,06,176 కి.మీ), బ్రెజిల్ (2,23,662 కి.మీ), మెక్సికో (1,81,088కి.మీ), ఫ్రాన్స్ (1,14,433కి.మీ) తదితర దేశాలు నిలిచాయి. ♦ జిల్లా, మండల స్థాయి రోడ్లను పరిగణనలోకి తీసుకుంటే.. అర్జెంటీనా (534,876 కి.మీ) ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో ఇండియా (526,130 కి.మీ), ఆ్రస్టేలియా (426,346 కి.మీ), చైనా (373,831 కి.మీ), ఇండోనేషియా (334,164 కి.మీ), కొలంబియా (309,725 కి.మీ), బ్రెజిల్ (283,933 కి.మీ) తదితర దేశాలు ఉన్నాయి. ♦ పూర్తిగా స్థానిక, గ్రామీణ స్థాయి రోడ్లు అమెరికా (17,89,534 కి.మీ), చైనా (3,46,742 కి.మీ), జర్మనీ (3,01,853 కి.మీ) ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి రోడ్లు ఉంటే ఏమిటి? విజువల్ క్యాపిటలిస్ట్ విశ్లేషణ ప్రకారం.. ఎక్స్‌ప్రెస్ వేలు, భారీ హైవేలు అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, పట్టణీకరణకు సంకేతాలు. ఎక్కువ ఖర్చు పెట్టగల దేశాలు మాత్రమే వీటిని నిర్మించగలుగుతాయి. ♦ మధ్యస్థాయి హైవేలు అభివృద్ధి చెందుతున్న, పట్టణీకరణ పెరుగుతున్న ప్రాంతాలకు సూచికలు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటిని నిర్మిస్తున్నాయి. ♦ జిల్లా, మండల, స్థానిక రోడ్లు.. స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తాయి. ♦మొత్తంగా రహదారుల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం సుస్థిర అభివృద్ధికి సూచిక అని.. మౌలిక సదుపాయాల వల్ల అభివృద్ధి వేగం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. -
ట్విట్టర్ మైక్రోసాఫ్ట్ మధ్య చాట్ జీపీటీ చిచ్చు..
-
ఏయే నోట్లు ఎంతెంత? అత్యధిక వాటా ఈ నోటుదే..
దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో అత్యధిక విలువ కగిలిన నోటు రూ.2 వేల నోటు. అయితే తాజాగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లేదా ఏదైనా బ్యాంకు శాఖలో ఇతర డినామినేషన్ నోట్లతో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. రూ.500 నోట్లదే అత్యధిక వాటా ఆర్బీఐ డేటా ప్రకారం.. 2022 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 500 నోటు అత్యధిక విలువ కలిగిన కరెన్సీ అని తేలింది. ఇది మొత్తం విలువ పరంగా రూ. 22.77 లక్షల కోట్ల విలువైనది. చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో దీని వాటా 73.3 శాతం. దీని తర్వాత స్థానంలో రూ. 2,000 నోట్లు ఉన్నాయి. మొత్తం చెలామణిలో ఇవి 13.8 శాతంగా ఉన్నాయి. ఇదీ చదవండి: RS 2000 Note: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం.. అయితే తాజాగా మే19న ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2 వేల నోట్ల మొత్తం విలువ రూ. 3.62 లక్షల కోట్లు. అన్ని డినామినేషన్ నోట్లో వీటి వాటా 10.8 శాతం మాత్రమే. రూ. 2 నోట్లలో దాదాపు 89 శాతం మార్చి 2017కి ముందు ముద్రించినవే. ఏయే నోట్లు ఎంతెంత? 2022 మార్చి చివరి నాటికి చలామణిలో వివిధ డినామినేషన్ నోట్ల సంఖ్య, విలువలు ఇలా ఉన్నాయి. రూ.2వేలు - 21,420 లక్షల నోట్లు - విలువ రూ.4,28,394 కోట్లు రూ.500 - 4,55,468 లక్షల నోట్లు - విలువ రూ.22,77,340 కోట్లు రూ.200 - 60,441 లక్షల నోట్లు - విలువ రూ.1,20,881 కోట్లు రూ.100 - 1,81,420 లక్షల నోట్లు - విలువ రూ.1,81,421 కోట్లు రూ.50 - 87,141 లక్షల నోట్లు - విలువ రూ.43,571 కోట్లు రూ.20 - 1,10,129 లక్షల నోట్లు - విలువ రూ.22,026 కోట్లు రూ.10 - 2,78,046 లక్షల నోట్లు - విలువ రూ.27,805 కోట్లు బిజినెస్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, కథనాల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడండి -
డిజిటల్ అగ్రగామిగా భారత్!
ఆధార్, ఏకీకృత చెల్లింపు వ్యవస్థలు, డేటా పంపిణీ... ఈ మూడూ కలిసి భారత్‌ను ‘ప్రపంచ డిజిటల్ అగ్రగామి’గా నిలబెట్టాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో తాజాగా విడుదల చేసిన కార్యాచరణ పత్రంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారానే భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందివ్వగలిగిందని, డిజిటల్ అకౌంట్ అగ్రిగేటర్ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్నింకా వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం ప్రశంసించింది. అదే సమయంలో భారత్‌లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడటానికి డేటా ఉల్లంఘనలకు పాల్పడిన వారిని జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్టం రూపకల్పన తప్పనిసరి అని సూచించింది. మానవ జీవితాలను, ఆర్థిక వ్యవస్థను మార్చి వేస్తున్న ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్ర క్చర్ని భారతదేశం నిర్మించిందని, ఇది అనేక దేశాలు అనుసరించాల్సిన పాఠం అవుతుందని తాజా ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. ‘ఇండియా స్టాక్’ అనేది భారత్‌లో సాధారణంగా ఉపయోగిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) సెట్‌కి సామూహిక పేరు. దీంట్లో మూడు విభిన్నమైన పొరలు ఉంటున్నాయి. అవి, 1. ప్రత్యేక గుర్తింపు (ఆధార్), 2. కాంప్లిమెంటరీ చెల్లింపు వ్యవస్థలు (ఏకీకృత చెల్లింపు ఇంటర్ఫేస్, ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్, ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీస్), 3. డేటా పంపిణీ (డిజీలాకర్, అకౌంట్ అగ్రిగేటర్). ఇవన్నీ కలిసి అనేక పబ్లిక్, ప్రైవేట్ సేవలకు.. ఆన్ లైన్, కాగిత రహిత, నగదు రహిత, గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్ సంప్రాప్య తను కల్పించాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో కూడిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కార్యాచరణ పత్రం తెలిపింది. ఈ మదుపు ప్రయో జనం భారత్ వ్యాప్తంగా అనుభవంలోకి రావడమే కాకుండా కోవిడ్ 19 మహమ్మారి కాలంలో దేశానికి ఎంతో సేవచేసిందని ఆ పత్రం వెల్లడించింది. ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటుకు నేరుగా సామాజిక భద్రతా చెల్లింపుల పంపిణీని సులభతరం చేయడంలో ఆధార్ సహక రించిందని అది పేర్కొంది. దీనివల్ల లీకేజీలను తగ్గించడం, అవినీతిని అరికట్టడం, విస్తృతిని పెంచడం, సమర్థంగా కుటుంబాల వద్దకు చేరు కోవడానికి ఒక సాధనాన్ని అందించడంలో ఇది సహకరించింది అని వ్యాఖ్యానించింది. విస్తృతంగా డిజిటల్ చెల్లింపులు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర ప్రభుత్వ సంస్కరణల కారణంగా 2021 మార్చి వరకు జీడీపీలో 1.1 శాతం వ్యయాన్ని ఆదా చేసినట్లు భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారా భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందించగలిగింది. మహమ్మారి ఆవహించిన తొలి నెలల కాలంలో నిరుపేద కుటుంబాల్లో 87 శాతం కనీసం ఒక లబ్ధి పథకాన్నయినా అందుకున్నారు. సృజనాత్మక ఆవిష్కరణను, పోటీని పెంచడానికి, మార్కెట్లను విస్తరించడానికి, ప్రభుత్వ ఆదాయ సేకరణను పెంచుకోవడానికి, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి ఇండియా స్టాక్ ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడింది. డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వవ్యాప్తమయ్యాయి. దేశంలో అన్ని చెల్లింపుల లావాదేవీల్లో యూపీఐ చెల్లింపులు 68 శాతంగా ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల ఉపయోగం చిన్న వర్తకుల కస్టమర్ పునాదిని విస్తరించింది, వారి నగదు ప్రవాహాన్ని నమోదు చేసి, ద్రవ్య సంప్రాప్యతను మెరుగుపర్చింది. పెరిగిన ప్రభుత్వ రాబడి 2021 ఆగస్టులో మొదటిసారి ప్రారంభించి నది మొదలు ‘అకౌంట్ అగ్రిగేటర్’ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్ని వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం తెలిపింది. డిజిటలీకరణ అనేది ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణను కూడా బలపర్చింది. 2017 జూలై నుంచి 2022 మార్చి మధ్యలో జీఎస్టీ కోసం 88 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ రాబడులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ సర్వీస్ ప్రొవిజన్‌ను కూడా క్రమబద్ధీకరించారు. ఉదాహరణకు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్లను ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా పౌరులు పొందవచ్చు. అదేవిధంగా, ఇండియా స్టాక్ ‘నో యువర్ కస్టమర్’ నిబంధ నలను డిజిటలీకరించి, సులభతరం చేసింది. ఖర్చు లను తగ్గించింది. ఇ–కేవైసీని ఉపయోగిస్తున్న బ్యాంకులు సమ్మతి ఖర్చును 12 అమెరికా డాలర్ల నుంచి 6 అమెరికన్ సెంట్లకు తగ్గించుకున్నాయి. మహిళలే లక్ష్యంగా జన్‌ధన్ ఖర్చుల్లో ఈ తగ్గుదల తక్కువ ఆదాయం ఉన్న క్లయింట్లు కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం సేవలను మరింతగా ఆకర్షిస్తూ, లాభాలు ఆర్జించడానికి వీలు కల్పించింది. ఆర్థిక అభివృద్ధిలో అందర్నీ భాగస్వామ్యం చేయడానికి సంబంధించి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ ఆ పత్రం ఇలా చెప్పింది. ‘‘తక్కువ ఖర్చుతో కూడిన బ్యాంక్ ఖాతాకు అవకాశం కల్పించడం వల్ల బ్యాంక్ ఖాతా లతో వ్యక్తుల కవరేజీ రెట్టింపు అయింది. జన్ ధన్ పథకం ఆర్థికంగా అర్హత లేనివారిని, ప్రత్యేకించి గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పథకం కింద 2022 ఆగస్టు నాటికి 46 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తెరిచారు. డిజిటల్ బ్యాక్‌బోన్ ను ఉపయోగించడం వల్ల భారత్ తన వ్యాక్సిన్ పంపిణీని శరవేగంగా చేయగలడమే కాదు... భారీస్థాయి అంతర్గత వలసలు వంటి సవాళ్లను అధిగమించింది’’ అని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. కో–విన్ లో పొందుపర్చిన టెక్నాలజీని ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జమైకాలలో కూడా అమలు పర్చారు. ఇది ఆయా దేశాల వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను సులభతరం చేసింది. డేటా పరిరక్షణ తప్పనిసరి సవాళ్ల విషయానికి వస్తే, భారత్‌లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడ టానికి; కంపెనీలు, ప్రభుత్వాలు విచక్షణారహితంగా డేటా సేకరించడాన్ని నిరోధించడానికి; డేటా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలు, ప్రభు త్వాలను జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్ట రూపకల్పన తప్పనిసరి. సముచితమైన రీతిలో డేటా నిర్వహణకు, సైబర్ భద్రత రంగంలో తగిన మదుపులు పెట్టడానికి ఇది చాలా అవసరం. సామాజిక సహాయం మరింత దృఢంగా, స్వీకరించదగినదిగా చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) కూడా సహకరిస్తుంది. ఉదాహరణకు, రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ పథకాల మధ్య డేటా పంపిణీకి ఆధార్‌ను ఉపయోగించవచ్చని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. చివరగా, డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)ని ప్రభావితం చేయడానికి కాలక్రమాలు, నాణ్యత, సాధారణ ప్రభుత్వ ద్రవ్య నివేదికల కవరేజీ వంటివాటిని భారత్ గణనీయంగా మెరుగుపర్చుకుంది. అదే సమయంలో తన పౌరుల కోసం ప్రభుత్వ రంగ జవాబుదారీతనాన్ని మెరుగుపర్చుకోవడంలో ద్రవ్యపరమైన పారదర్శకతను విస్తరించడం అనేది కీలక అంశంగా ఉంటోంది. – ఎమ్. ముఖేశ్ రాణా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా -
మీ ఫోన్ పోయిందా?.. వెంటనే ఇలా బ్లాక్ చేసుకోండి.. అన్నీ సేఫ్..!
సాక్షి, హైదరాబాద్: మీ ఫోన్ ఈమధ్యే చోరీకి గురైందా? లేక ఎక్కడైనా పోగొట్టుకున్నారా? అందులోని డేటా దుర్వినియోగం కావొచ్చని ఆందోళన చెందుతున్నారా? ఇకపై మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆ ముప్పు నుంచి మనల్ని బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌ను అందుబాటులోకి తెచి్చంది. దీని సాయంతో పోయిన లేదా చోరీకి గురైన ఫోన్‌ను ఇతరులు వాడకుండా మీరు బ్లాక్ చేయొచ్చు. ఎలా ఉపయోగించాలంటే.. మనం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీఈఐఆర్ పోర్టల్‌లోకి వెళ్లి దాన్ని బ్లాక్ చేయవచ్చు. అంటే మన ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లినా అది పనిచేయకుండా మనం నియంత్రించవచ్చన్నమాట. దీంతోపాటు పోగొట్టుకున్న ఫోన్‌కు సంబంధించి పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ దొరికాక అన్‌బ్లాక్ సైతం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు పొందాలంటే ముందుగా కొన్ని వివరాలు తెలియజేయాలి. మీ మొబైల్ నంబర్, ఐఎంఈఐ నంబర్, మొబైల్ కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్‌తోపాటు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీని సీఈఐఆర్ పోర్టల్‌లో జత చేయాలి. వివరాలన్నీ అప్లోడ్ చేస్తే సీఈఐఆర్ సెంట్రల్ డేటాబేస్‌లో అప్పటికే నమోదై ఉన్న సదరు ఫోన్ పనిచేయకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. మన ఫిర్యాదు స్థితిని తెలుసుకొనే ఆప్షన్ సైతం ఈ పోర్టల్‌లో ఉంది. మార్చి 15 నుంచి అమల్లోకి.. వాస్తవానికి సీఈఐఆర్ సేవలను కేంద్ర ప్రభుత్వం 2019 చివర్లోనే ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచి్చంది. తొలుత కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అక్కడ విజయవంతం అయ్యాక దశలవారీగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ వస్తోంది. మార్చి 15 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ సీఈఐఆర్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ వెల్లడించింది. మార్చి 15 తర్వాత పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు సంబంధించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. పోలీసు సిబ్బంది ఈ సేవలు వాడాలి: డీజీపీ మొబైల్‌ఫోన్ చోరీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు చోరీ అయిన సెల్ఫోన్లను గుర్తించేందుకు సీఈఐఆర్ సేవలను వినియోగించుకోవాలని డీజీపీ అంజనీకుమార్ తాజాగా ఆదేశించారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తామని... మరో 10 రోజుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. చదవండి: బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా: సుఖేశ్ చంద్రశేఖర్ -
అప్పనంగా డేటా ఇచ్చేస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత సాంకేతికత యుగంలో మన పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, పాన్, ఆధార్, ఈ–మెయిల్ అడ్రస్, పాస్వర్డ్లు కేవలం సమాచారం మాత్రమే కావు. మన జీవితాలను నిర్దేశించే అంశాలు. ఇవి సైబర్ నేరగాళ్ల చేతికి వెళితే బ్యాంకు ఖాతాలో ఉన్న మన కష్టార్జితం క్షణాల్లో హాంఫట్ అవ్వొచ్చు. మన పేరిట లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చు. కోట్ల మంది డేటాను కొల్లగొట్టిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు ఇటీవలే రట్టు చేశారు. మన డేటా లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనా ఉందని, వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తప్పనిసరిగా అవగాహన ఏర్పరుచుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అమ్మకాలని, క్రెడిట్ కార్డులని, ఇన్స్టంట్ లోన్లని, మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయని, కొత్త రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభోత్సవాలకు విచ్చేయాలంటూ దాదాపు నిత్యం మనకు అపరిచితుల నుంచి ఫోన్‌కాల్స్ రావడం పరిపాటిగా మారింది. అయితే వారందరికీ మన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్‌లు, ఈ–మెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి. మన వివరాలు మరెవరో కాదు... అప్పనంగా మనమే ఇచ్చేస్తున్నాం! తప్పక డిలీట్ చేయించాలి.. వివిధ అవసరాలు, ప్రభుత్వ పథకాల నిమిత్తం ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌బుక్ మొదటి పేజీ, వివిధ సర్టిఫికెట్ల వంటి వాటిని ఫొటోకాపీ తీయించుకోవడం అనివార్యమవుతోంది. అయితే అలాంటప్పుడు మనం వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వారా పంపిన వివరాలను ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ సెంటర్ లేదా నెట్ సెంటర్ నుంచి డిలీట్ చేయించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కేస్ – 01 ‘గుడ్‌మార్నింగ్ సార్. యాదాద్రి దగ్గరలో కొత్త వెంచర్ ప్రారంభం కాబోతోంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు. మీ సొంత ప్రాంతానికి వెళ్లే దారిలోనే వెంచర్ ఉంది. తీసుకోండి...’ అంటూ టెలికాలర్ ఫోన్ చేసి తన పేరు, పూర్తి చిరునామా చెప్పడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవాక్కయ్యాడు. కేస్ – 02 ‘సార్.. మీరు వాడుతున్న ఫ్యూరిఫయర్తో పోలిస్తే మా ప్రొడక్ట్ అన్ని విధాలా ఉత్తమ మైనది. మీరు సరే అంటే మా ఏజెంట్‌ను మీ ఇంటికి డెమోకు పంపుతాం. మీ చిరునామా ఇదే కదా..’ అంటూ తన ఇంటి అడ్రస్‌ను ఓ ఉత్పత్తుల సంస్థ ఉద్యోగి ఫోన్లో చెబుతుంటే ఓ ప్రైవేటు ఉద్యోగి నోరెళ్లబెట్టాడు. లాటరీలు, కూపన్ల పేరుతో డేటా సేకరణ... మనం షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు లాటరీల కోసమనో లేదా గిఫ్ట్ కూపన్లు ఇచ్చేందుకనో మన వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అలా అడిగిందే తడవుగా రివార్డు పాయింట్ల కోసం, డిస్కౌంట్ల కోసం, గిఫ్ట్ కూపన్ల కోసం ఆశపడి మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చేస్తున్నాం. ఇలా పోగేసిన డేటాను కొందరు కేటుగాళ్లు కన్సల్టెన్సీలకు 5 పైసలకు ఒక కాంటాక్ట్ చొప్పున అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా కన్సల్టె న్సీలు కొన్ని వేల రూపాయల ఖర్చుతోనే కోట్ల మంది సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల నుంచి సైబర్ నేరస్తులు గంపగుత్తగా డేటాను కొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో ఉండే వ్యక్తిగత వివరాలను కొన్ని ఆన్లైన్ సంస్థలు డేటా ఎనలిటిక్స్ టెక్నిక్‌లతో సేకరించి వివిధ కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు అమ్ముకుంటున్నాయి. డేటా ప్రైవసీలో యూరోపియన్ చట్టాలు ఎంతో కఠినం.. యురోపియన్ దేశాల్లో వ్యక్తిగత సమాచారం. వివరాలకు, వ్యక్తి గత గోప్యతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన వివరాలను అను మతి లేకుండా ఎవరు తీసుకున్నా... వినియోగించినా వెంటనే వారిపై జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం కింద భారీ జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధించే అవకాశం ఉంది. ఆ తరహా చట్టాలు మన దేశంలోనూ వస్తేనే వ్యక్తిగత వివరాల గోప్యతకు రక్షణ ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇవ్వొద్దు... వీలైనంత వరకు మీ ఫోన్ నంబర్, చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్, పాన్ వంటి వివరాలను ఇతరులకు ఇవ్వొద్దు. ఇలా ఇవ్వడం వల్ల మన డేటాను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఢిల్లీ -
HYD: డేటా చోరీ కేసులో రంగంలోకి దిగిన ఆర్మీ
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఆర్మీ రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులతో రక్షణ రంగ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. 2.55 లక్షల మంది తమ ఉద్యోగుల వివరాలు ఉండటంపై ఆరా తీశారు. జాతీయ భద్రతకు ముప్పు కావడంతో ఆర్మీ సీరియస్‌గా దృష్టి సారించింది. నిందితుల వద్ద జాతీయ రాజధాని పరిధిలో పని చేసే 2.55 లక్షల మంది డేటా లభ్యం కాగా, తమ ఉద్యోగుల డేటా నకలు ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డేటా లీకేజీ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కేసులో భాగంగా డేటా ప్రొవైడర్ జస్ట్ డయల్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన సిట్ ద్వారా కేసు విచారణ చేపట్టనున్నారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న డేటాను తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ సైబర్ సేఫ్టీ ద్వారా పోలీసులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్‌లో డేటాచోరీకి సంబంధించి నగరానికి చెందిన వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
IPL 2023: జియో అదిరిపోయే ఆరు ప్రీపెయిడ్ ప్లాన్స్
సాక్షి, ముంబై: దేశంలో క్రికెట్ పండుగ ప్రారంభానికి ముందు టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో క్రికెట్ అభిమానులకు 6 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి షురూ కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం ఈ కొత్త ప్లాన్లను జియో ప్రకటించింది. (జియో కస్టమర్లకు భారీ షాక్: ఎంట్రీ-లెవల్ బాదుడే మామూలుగా) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023కి ప్రారంభానికి ముందు రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది.ఐపీఎల్ , ఈసారిJioCinema యాప్‌లో వీక్షించే వినియోగదారులకు ఇవి మరింత సౌకర్యంగా మారనున్నాయి. 4కేలో గేమ్‌ను చూడాలంటే ఎక్కువ డేటా కావాల్సిందే. అందుకే జియో కస్టమర్ల కోసం ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిల్లో మూడు వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు అపరిమిత డేటాప్రయోజనాలతో వస్తాయి మిగిలిన మూడు డేటా యాడ్-ఆన్ వోచర్లు మాత్రమే అనేది గమనించాలి. (ఇదీ చదవండి: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) జియో రూ.999, రూ.399, రూ.219, రూ.222, రూ.444, రూ.667 ప్లాన్ల వివరాలు రూ.999: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజూ 3జీబీ హై స్పీడ్ డేటా ఉచితం. ఇక అపరిమిత కాల్స్, రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి. ఇవి కాకుండా మరో రూ.241 వోచర్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో 40 జీబీ బోనస్ డే డేటా కూడా ఉంటుంది. రూ.399, రూ.219: ఈ రెండు ప్లాన్లలో రోజువారీ 3జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్. ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. రూ.399 ప్లాన్ లో రూ.61 విలువైన వోచర్ ఉచితంగా వస్తుంది. 6జీబీ అదనపు డేటా కూడా పొందొచ్చు. వ్యాలిడిటీ 28 రోజులు. 6 జీబీ బోనస్ డేటా రూ.219 ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. రోజువారీ 3 జీబీ ఉచిత డేటాకు అదనంగా 2 జీబీ బోనస్ డేటా ఉచితం. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ డేటా యాడ్-ఆన్ వోచర్లు బేస్ ప్రీపెయిడ్ ప్లాన్‌పై అదనపు డేటా రూ.222ప్లాన్‌లో ప్రస్తుత ప్లాన్ ఎక్స్ పైరీ గడువు 50జీబీ డేటా లభిస్తుంది. రూ.444: ఈ ప్లాన్ లో 100 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 60 రోజులు. రూ.667 డేటా ప్యాక్ తో 150 జీబీ ఉచిత డేటా వస్తుంది. 90 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. -
InternationalWomen's Day 2023: మహిళల నిజాయితీపై సంచలన రిపోర్ట్
సాక్షి,ముంబై: రుణాలు చెల్లింపులో మహిళలే ముందు ఉన్నారని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రుణాలను తిరిగి చెల్లించడంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ నిజాయితీగా ఉన్నారని క్రెడిట్ డేటా సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజా నివేదిక వెల్లడించింది. స్త్రీలకు రుణాలు ఇవ్వడం పురుషుల కంటే తక్కువ ప్రమాదకరమని ఈ డేటా వెల్లడించింది. అందుకే గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య బాగా పెరిగిందని వ్యాఖ్యానించింది. ప్రతి ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన నివేదికను ప్రకటిస్తుంది తన రుణ చెల్లింపుపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో భారతదేశంలోని స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ మనస్సాక్షిగా ఉంటారని వెల్లడించింది. గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య పెరగడానికి వారి మరింత నిజాయితీగా తిరిగి చెల్లించే ప్రవర్తనే కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో భారతదేశంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య వార్షిక రేటు 15 శాతం పెరిగింది, పురుషులతో పోలిస్తే ఇది 11 శాతం. 2017లో 25 శాతం మంది మహిళలు రుణాలు తీసుకోగా, 2022లో ఈ సంఖ్య 28 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది ఈ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం, దేశీయ అంచనా జనాభా 1.4 బిలియన్లలో దాదాపు 454 మిలియన్ల వయోజన మహిళలు ఉన్నారు. వీరిలో 2022 వరకు దాదాపు 6.3 కోట్ల మంది మహిళలు రుణాలు తీసుకున్నారు. మహిళలకు రుణ సదుపాయం 2017లో 7 శాతంగా ఉంది, ఇది 2022లో 14 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు సాధించిన పురోగతి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఇంకా మెరుగు పడాల్సి ఉందనికూడా తెలిపింది. మహిళా రుణగ్రహీతల సంఖ్య పెరగడం ప్రభుత్వ ఆర్థిక సమ్మేళనానికి సానుకూల సంకేతమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ అభిప్రాయపడ్డారు. వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలు, ఏజ్ గ్రూపులు,, భౌగోళిక ప్రాంతాలలో మహిళలకు అనుగుణంగా రుణాలను అందించడం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుందని కూడా ఆమె సూచిస్తున్నారు. దీని వల్ల మహిళలకే కాకుండా సంప్రదాయంగా వెనుకబడిన రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. -
వొడాఫోన్ కొత్త ప్లాన్: జియో, ఎయిర్టెల్ తరహాలోనే, ఏది బెటర్?
సాక్షి,ముంబై:వొడాఫోన్ ఇండియా సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. దేశీయ వినియోగదారుల కోసం రూ. 296ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఎక్కువ డేటాను వినియోగించే కస్టమర్లు లక్క్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ముఖ్యంగా ఎయిర్టెల్, జియోకు చెందిన రూ.296 రీచార్జ్ ప్లాన్లకు దీటుగా తాజా బల్క్ డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. వొడాఫోన్ రూ.296 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు 25 జీబీ బల్క్ డేటా అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వీఐ మూవీస్, టీవీని ఎంజాయ్ చేయవచ్చు కానీ, వివో అన్లిమిటెడ్ ప్రయోజనాలుండవు. ఎయిర్టెల్ రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకి100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు ఏంటంటే.. అపోలో 24|7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్ , వింక్ మ్యూజిక్ ఫ్రీ. రిలయన్స్ జియో రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ , రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో రిలయన్స్ జియో వినియోగదారులు జియోటీవీ, జియో సినిమా జియో క్లౌడ్,జియో సెక్యూరిటీల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి -
బ్రాడ్‌బ్యాండ్ నిర్వచనం మార్పు.. కనీస డౌన్లోడ్ స్పీడ్ ఎంతంటే
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ నిర్వచనాన్ని ప్రభుత్వం సవరించింది. కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను 2 ఎంబీపీఎస్‌కు (మెగాబిట్స్ పర్ సెకండ్) పెంచింది. 2013 జూలై నాటి నిర్వచనం ప్రకారం ఇది 512 కేబీపీఎస్‌గా (కిలోబిట్స్ పర్ సెకండు) ఉండేది. తాజా మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంత వినియోగదారులకు ఈ కొత్త నిర్వచనంతో ప్రయోజనం చేకూరగలదని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ప్రెసిడెంట్ టీవీ రామచంద్రన్ చెప్పారు. డౌన్లోడ్ స్పీడ్‌ను బట్టి ఫిక్సిడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను బేసిక్, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఊక్లా నిర్వహించే స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం గతేడాది డిసెంబర్లో భారత్‌లో సగటున మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ 25.29 ఎంబీపీఎస్‌గా నమోదైంది. నవంబర్‌లో ఇది 18.26 ఎంబీపీఎస్‌గా ఉండేది. 2022 నవంబర్ 30 నాటికి దేశీయంగా 82.54 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉండగా, వీరిలో 79.35 కోట్ల మంది వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ? -
AP: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు
సాక్షి, అమరావతి: మా అబ్బాయికి ఉద్యోగం ఉందనో లేదంటే ఇన్‌కం టాక్స్ కడుతున్నారనో మాకు ప్రభుత్వ పథకాలు రావడం లేదు.. ఈ తరహా కారణంగా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న వారికి ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ ప్రాతిపదికగా తీసుకుంటున్న నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల డేటాలో మార్పులు, చేర్పులకు వీలు కల్పించింది. ఆ సర్వే డేటాలో.. పెళ్లైన రెండు మూడు జంటలు కూడా ఒకే కుటుంబంగా నమోదై ఉండి.. ప్రస్తుతం వారు వేర్వేరుగా నివాసముంటుంటే.. వారిని వేర్వేరు కుటుంబాలుగా వర్గీకరించేందుకు అవకాశం కల్పించింది. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలను పొందొచ్చని గ్రామ, వార్డు సచివాలయ అధికారులు వెల్లడించారు. ఆ కారణంతో ప్రభుత్వ పథకాలకు పలువురు దూరం ప్రభుత్వం 2019 ఆగస్టులో గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాక.. వలంటీర్ల ఆధ్వర్యంలో నవశకం సర్వే నిర్వహించింది. వలంటీర్లు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి, ఆ ఇంటి పెద్ద లేదా ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ కుటుంబ వివరాలను నమోదు చేశారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1.67 కోట్ల కుటుంబాలున్నట్టు ఆ సర్వే తేల్చింది. నవశకం పేరుతో జరిగిన ఆ సర్వే వివరాల డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ప్రభుత్వం నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల వివరాలను ఆ నవశకం డేటాలో పేర్కొన్న కుటుంబాల వారీగా సభ్యుల వివరాలతో అధికారులు పోల్చి చూస్తున్నారు. అయితే, అప్పట్లో ఒకే కుటుంబంగా తమ వివరాలను నమోదు చేసుకున్న వారు పలు చోట్ల ఇబ్బంది పడుతున్నారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారనో, లేదంటే ఇన్‌కం ట్యాక్స్ కడుతున్నారనో, లేదా కారు ఉందనో, లేదంటే వ్యక్తిగత పేరుతో ఎక్కువ ఆస్తి నమోదై ఉందనో.. ఇలా పలు కారణాల వల్ల ఆ కుటుంబంలోని మిగతా వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. దీంతో కుటుంబ సభ్యుల వివరాల విభజనకు అవకాశం కలి్పంచాలని వారు ప్రభుత్వానికి అర్జీలిస్తూ వస్తున్నారు. ఇలాంటి వినతులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రావడంతో ప్రభుత్వం నవశకం సర్వే డేటాలో కుటుంబ వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. ఆ ఆరింటిలో ఏదో ఒక ఆధారం తప్పనిసరి.. నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోదలచిన వారు ఆరు రకాల్లో ఏదో ఒక ధ్రువీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. సర్వే డేటాలో.. ఇప్పుడు ఒకే కుటుంబంగా పేర్కొంటున్న వారిలో పెళ్లై వేరుగా ఉంటున్న వారు.. వివాహ ధ్రువీకరణ పత్రం, లేదంటే ఆధార్, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీకార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, పాస్‌పోర్టుల్లో భర్త లేదా భార్య పేర్లు ధ్రువీకరించేలా ఉంటే.. ఆ కుటుంబ సభ్యులను మరో కుటుంబంగా గుర్తిస్తారు. అయితే, ఆయా ధ్రువీకరణ పత్రాలుండటంతో పాటు ఆ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వేరుగా నివాసం ఉండాలి. చదవండి: మోదీకి ఆ సలహా ఇచ్చింది నేనే.. జనం చెవుల్లో బాబు పువ్వులు ప్రయోగాత్మక పరిశీలన అనంతరం.. నవశకం సర్వే డేటాలో కుటుంబ సభ్యుల వర్గీకరణను ముందుగా గ్రామీణ ప్రాంతంలో ఒక మండలంలో, పట్టణ ప్రాంతంలో ఒక నగర కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 9వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ప్రయోగాత్మకం(పైలెట్)గా పరిశీలన పూర్తి చేశారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం, వైఎస్సార్ జిల్లా కడప నగర కార్పొరేషన్‌ను ఇందుకు ఎంపిక చేశారు. మొదటి దశలో.. పెళ్లైన వారి వివరాల ప్రకారం మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. మరో రెండు దశల్లో వితంతు, విడాకులు తీసుకున్న వారిని వేరే కుటుంబాలుగా గుర్తించే ప్రక్రియ కూడా ఈ రెండు ప్రాంతాల్లో శుక్రవారం నుంచే ప్రయోగాత్మకంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. -
Covid-19: కోట్లలో కోవిడ్ కేసులు.. చైనా దిక్కుమాలిన చర్య..
బీజింగ్: చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు లక్షల కొత్త కేసులు, వేల మరణాలు నమోదవుతున్నాయి. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పడకలు ఖాళీలేక బేంచీలు, బల్లల మీదే చికిత్స అందిస్తున్నారు. శవాలను పూడ్చేందుకు శ్మశాన వాటికల్లో స్థలం లేక వేరే ప్రదేశాలకు తరలిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే చైనా ఆరోగ్య శాఖ ఆదివారం అనూహ్య ప్రకటన చేసింది. ఇకపై కరోనా కేసుల వివరాలు తాము వెల్లడించమని తెలిపింది. అంటువ్యాధుల నియంత్రణ, పరిశోధన కేంద్రమే కరోనా వివరాలను చూసుకుంటుందని చెప్పింది. అయితే కేసుల లెక్కలు ఎప్పుడు వెల్లడిస్తారు అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో కరోనా లెక్కలు దాచేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. రేడియో ఫ్రీ ఆసియా లీక్ చేసిన ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకారం చైనాలో 20 రోజుల వ్యవధిలోనే 25 కోట్ల మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య చైనా జనాభాలో 17.65 శాతం కావడం గమనార్హం. అంతేకాదు రానున్న మూడు నెలల్లో చైనాలో కరోనా కారణంగా 20 లక్షల మంది చనిపోతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: వైద్యుల పొరపాటు.. యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారంగా.. -
అదిరిపోయేలా జియో న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్స్..బెనిఫిట్స్ ఎక్కువే!
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో న్యూఇయర్ సందర్భంగా కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా న్యూ హ్యాపీ న్యూ ఇయర్-2023 పేరుతో రూ.2023 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. జియో ప్రతి ఏడాది ప్రకటించినట్లుగానే ఈ ఏడాది సైతం కొత్త ప్లాన్లను యూజర్లకు పరిచయం చేసింది. 252 రోజుల వ్యాలిడిటీతో రూ.2023 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు 9 నెలల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు ఉచితంగా 100 ఎస్ఎంఎస్లు, ప్రతి రోజూ 2.5 జీబీ డేటాతో 252 రోజుల వ్యాలిడిటీతో 630 జీబీ డేటాను వినియోగించుకునే అవకాశం కలగనుంది. దీంతో పాటు ప్రైమ్ మెంబర్ షిప్‌ను అందిస్తుంది. రూ.2999 ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లు 75జీబీ ఎక్స్ట్రా హై స్పీడ్ డేటా, 23 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు. 365రోజుల వ్యాలిడిటీతో ఉన్న ఈ ఆఫర్ మొత్తం మీద 912.5జీబీ డేటా చొప్పున రోజుకు 2.5జీబీ హై స్పీడ్ డేటా సొంతం చేసుకోవచ్చు. వార్షిక ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం జియో రూ.2999, రూ.2874, రూ.2545 ఇలా మూడు వార్షిక ప్లాన్లను అందిస్తుంది. రూ.2999 ప్లాన్‌లో పైన పేర్కొన్న ఆఫర్లు ఉండగా..365రోజుల వ్యాలిడిటీ రూ.2874 రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో అన్లిమిటెడ్ కాలింగ్ బెన్ఫిట్స్, వ్యాలిడిటీ సమయం మొత్తానికి 730 జీబీ డేటా అందిస్తుండగా రోజుకు 2 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రూ.2545 ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్ బెన్ఫిట్స్ తోపాటు 336రోజుల వ్యాలిడిటీతో 504జీబీ డేటా..రోజుకు 1.5జీబీ వినియోగించుకోవచ్చు. రోజుకు 100ఎస్ఎంఎస్లు పుంపుకోవచ్చని జియో ప్రతినిధులు తెలిపారు. చదవండి👉 ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్ -
టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్ న్యూస్
ముంబై: డేటా వినియోగం, 4జీ కనెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో టెలికం సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మరింత ప్రయోజనం చేకూరే అవకాశముంది. వీటి దన్నుతో క్యూ3లో టెల్కోల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 3-4 శాతం వృద్ధి నమోదు చేయగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఒరిస్సా, హర్యానాలో ఆవిష్కరించిన రేట్ల పెంపును భారతి ఎయిర్టెల్ మిగతా సర్కిళ్లలోనూ అమలు చేసి, పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పడితే నాలుగో త్రైమాసికంలో సీక్వెన్షియల్‌గా టెల్కోల ఆదాయం 5 శాతం పైగా వృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) దిగువ స్థాయిలో రేట్ల పెంపును ఎయిర్టెల్ రెండు సర్కిళ్లకు మాత్రమే పరిమితం చేసిన పక్షంలో టెలికం రంగం ఆదాయ వృద్ధిపై పెద్దగా అర్థవంతమైన ప్రభావమేమీ ఉండకపోవచ్చని బీఎన్పీ పారిబా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కానీ, దాన్ని ఇతర సర్కిళ్లకూ విస్తరిస్తే, పోటీ కంపెనీలు కూడా అనుసరిస్తే మాత్రం 2022-23 నాలుగో త్రైమాసికంలో ఆదాయాలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనూ త్రైమాసికాల వారీగా (సీక్వెన్షియల్) టెలికం పరిశ్రమ ఆదాయాలు 3-4 శాతం స్థాయిలో వృద్ధి చెందాయి. నవంబర్ ఆఖర్లో అమలు చేసిన రేట్ల పెంపు ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ సానుకూలంగా కొనసాగింది. ఇక రెండో త్రైమాసికంలో కస్టమర్లు పెద్ద డేటా ప్యాక్‌లకు అప్‌గ్రేడ్ అవుతుండటం ఆదాయాల వృద్ధికి కలిసి వచ్చింది. జియో, వొడా ఐడియా కీలకం.. పరిశ్రమలో పరిస్థితులను అంచనా వేసుకునేందుకు ఎయిర్టెల్ ఈ నెల తొలినాళ్లలో ఒరిస్సా, హర్యానాలో కనీస టారిఫ్‌ను ఏకంగా 57 శాతం పెంచి రూ. 155కి చేసిన సంగతి తెలిసిందే. పోటీ కంపెనీల ప్రతిస్పందనను కూడా చూసిన తర్వాత ఈ పెంపును కొనసాగించడం లేదా పూర్వ స్థాయికి తగ్గించడం గురించి తగు నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఎయిర్టెల్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ మిగతా కంపెనీలు కూడా అదే బాట పడితే మాత్రం టారిఫ్‌ల పెంపును ఎయిర్టెల్ మిగతా సర్కిళ్లకూ విస్తరించవచ్చని భావిస్తున్నారు. ఎయిర్టెల్ చర్యలకు ప్రతిస్పందనగా జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ) ఎంత మేర టారిఫ్‌లు పెంచుతాయనే దానిపై జనవరి–మార్చి త్రైమాసికంలో టెలికం పరిశ్రమ ఆదాయ వృద్ధి ఆధారపడి ఉంటుందని మరికొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్ తన బేస్ ప్యాక్ టారిఫ్‌ల పెంపును ఎంత వేగంగా మిగతా సర్కిళ్లకు విస్తరిస్తుంది .. జియో, వీఐ తమ కనీస రీచార్జ్ ప్లాన్లను రూ. 99 నుండి రూ. 125 స్థాయికి పెంచుతాయా లేదా ఎయిర్‌టెల్‌కు సమానంగా నేరుగా రూ. 155కి పెంచేస్తాయా అనే అంశాలతో ఆదాయాలు ప్రభావితం కాగలవని వారు పేర్కొన్నారు. విక్రేతల మార్కెట్.. విశ్లేషకుల అంచనాలు ఒకవేళ పోటీ కంపెనీలు కూడా ఎయిర్‌టెల్‌ను అనుసరించిన పక్షంలో టెలికం పరిశ్రమ.. విక్రేతల మార్కెట్‌గా ఆవిర్భవిస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి సందర్భంలో రేట్లను వినియోగదారుల డిమాండ్ కాకుండా విక్రేతలే నిర్దేశించే అవకాశం ఉంటుంది. టెలికం రంగంలో ఇలాంటి పరిస్థితి కనిపించి దాదాపు దశాబ్ద కాలం పైగా గడిచిపోయింది. రేట్లను నిర్దేశించే శక్తి కంపెనీల దగ్గర ఉన్నప్పుడు ధరలు పెరిగినా డిమాండ్ తగ్గని పరిస్థితి ఉంటుంది. వినియోగదారులు ఎంచుకునేందుకు ప్రత్యా మ్నాయ ఉత్పత్తులు, సర్వీసులు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు, టారిఫ్‌ల పెంపునకు ఇక్కడితో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పెట్టుబడులపై వచ్చే రాబడి అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో మరో విడత పెంపు అవసరం ఉంటుందని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. రేట్లను పెంచుతున్నా త్రైమాసికాల వారీగా టెల్కోల యూజర్ల స్థాయి దాదాపు అదే స్థాయిలో కొనసాగుతుండటంతో.. టారిఫ్‌లను మరింతగా పెంచేందుకు టెలికం సంస్థలకు అవసరమైన ధీమా లభించగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. -
గూగుల్ ఫారమ్ ఫిల్ చేస్తున్నారా?..6 లక్షల మంది భారతీయులపై హ్యాకర్ల పంజా!
పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. గత నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు చెందిన 50 కోట్ల యూజర్ల వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. తాజాగా భారత్‌కు చెందిన మరో 6 లక్షల మంది పర్సనల్ డేటాను బోట్ మార్కెట్(ఆన్లైన్ మార్కెట్ ప్లేస్) లో అమ్ముకున్నట్లు తేలింది. పలు నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు దొంగిలించారు. ఆ డేటాను బోట్ మార్కెట్లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. 2018 నుండి ప్రపంచంలో అతి పెద్ద వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సర్వీస్ ప్రొవైడర్ నార్డ్ వీపీఎన్ కు చెందిన లూథూనియా నార్డ్ సెక్యూరిటీ రీసెర్చ్ బోట్ మార్కెట్‌ను ట్రాక్ చేసింది. 2018లో తొలిసారి బోట్ మార్కెట్ విడుదలైంది. నాటి నుంచి ఆ మార్కెట్ పనితీరుపై నార్డ్ వీపీఎన్ దృష్టిసారించగా..యూజర్ల వివరాలు బోట్ మార్కెట్లో లభ్యమవుతున్నట్లు గుర్తించింది. తన రిసెర్చ్‌లో భాగంగా ప్రధానమైన జెనెసిస్ మార్కెట్, రష్యన్ మార్కెట్, 2 ఈజీ బోట్ మార్కెట్లతో పాటు దొంగిలించిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాగిన్ ఐడీలు ఉన్నట్లు చెప్పింది. రూ.490కే నాటి నుంచి బోట్ మాల్వేర్ సాయంతో హ్యాకర్స్ యూజర్లు వినియోగిస్తున్న ఫోన్, ల్యాప్‌ట్యాప్, పర్సనల్ కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి వారి లాగిన్ ఐడీలు, కుకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్క్రీన్ షాట్లతో పాటు ఇతర వ్యక్తిగత వివరాల్ని తస్కరించారు. ఒక్కో యూజర్ డేటాను రూ.490కి అమ్ముకున్నట్లు తేలింది. ఆటో ఫామ్స్ ఫిల్ చేస్తున్నారా? ఆటో ఫామ్స్ అంటే? ఏదైనా సంస్థ తన ప్రొడక్ట్ ఎలా ఉందో తెలిపేలా లేదంటే.. ఏదైనా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలంటే ముందుకు గూగుల్ ఫారమ్స్ తరహాలో ఆటో ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా ఫారమ్ ఫిల్ చేసిన యూజర్ల డేటా 667 మిలియన్ కుకీస్, 81వేల డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, 5లక్షల 38 ఆటో ఫారమ్స్ ఫిల్స్, భారీ ఎత్తున స్క్రీన్ షాట్లు, వెబ్ క్యామ్ స్నాప్‌ల నుంచి డేటాను సేకరించినట్లు నార్డ్ వీపీఎన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారిజస్ బ్రీడిస్ తెలిపారు. డార్క్ వెబ్ వర్సెస్ బోట్ మార్కెట్ డార్క్ వెబ్ మార్కెట్ల కంటే బోట్ మార్కెట్లు విభిన్నంగా ఉంటాయి. బోట్ మార్కెట్లు ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి ఒక్క డివైజ్ ద్వారా భారీ మొత్తంలో డేటాను సేకరిస్తాయని బ్రీడిస్ అన్నారు. ఐసీఎంఆర్‌పై 6వేల సార్లు దాడులు వాట్సాప్ తర్వాత దేశంలో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు.ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌పై సుమారు 6వేల సార్లు దాడి చేశారు. విఫలమయ్యారు. పటిష్ట భద్రత కారణంగా సైబర్ నేరస్తుల ఐసీఎంఆర్ వైబ్ సైట్ నుంచి డేటాను పొందలేకపోయారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
కొత్త డేటా ప్రైవసీ చట్టం.. ముసాయిదాలోని ముఖ్యాంశాలు ఇవే!
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను నిర్దిష్ట దేశాలకు బదిలీ చేసేందుకు, అక్కడ నిల్వ చేయడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త డేటా ప్రైవసీ చట్టం ముసాయిదాను ప్రవేశపెట్టింది. ఇందుకోసం భారత్‌కు వెలుపల ఏయే దేశాలు, ప్రాంతాలను ఎంచుకోవచ్చనేది నోటిఫై చేయనుంది. అలాగే సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించనుంది. శుక్రవారం ఈ మేరకు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) బిల్లు 2022 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనిపై డిసెంబర్ 17లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. భారత్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే నిల్వ చేయాలంటూ గత బిల్లులో చేసిన ప్రతిపాదనలు పలు దిగ్గజ టెక్ కంపెనీల్లో ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. తాజా మార్పులతో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి సంస్థలకు ఊరట లభించనుంది. పార్లమెంటు ఆమో దం పొందాక ముసాయిదా బిల్లు .. చట్టంగా మారుతుంది. వ్యక్తిగత డేటా విషయంలో ఒకవైపు వ్యక్తుల హక్కులు, బాధ్యతలను మరోవైపు డేటా సేకరించే సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచిస్తూ ఈ బిల్లును రూపొందించినట్లు ముసాయిదాలో పేర్కొన్నారు. చట్టబద్ధత, పారదర్శకత తదితర ఏడు సూత్రాల ప్రాతిపదికన బిల్లును తయారు చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వివరించింది. ‘పౌరుల డేటా రక్షణ, పరిశ్రమకు వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడం, దేశ భద్రత.. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా బిల్లు రూపొందింది‘ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వివాదాస్పద అంశాలు తొలగించి డేటా బిల్లును సరళతరం చేశారని న్యాయ సేవల సంస్థ జేఎస్ఏ పార్ట్నర్ రూపీందర్ మాలిక్ పేర్కొన్నారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. ► వ్యక్తిగత డేటాను సేకరించే ముందు వ్యక్తుల సమ్మతి తీసుకోవాలి. సదరు డేటాను షేర్ చేయడం, మార్చడం, ధ్వంసం చేయడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో డేటాను సేకరించిన వ్యక్తులు, కంపెనీలపై రూ. 500 కోట్ల వరకూ జరిమానా విధించవచ్చు. 2019లో జారీ చేసిన గత ముసాయిదాలో ఈ పెనాల్టీని రూ. 15 కోట్లు లేదా కంపెనీ గ్లోబల్ టర్నోవరులో 4% (ఏది ఎక్కువైతే అది)గా ప్రతిపాదించారు. ► అలాగే ఏదైనా పత్రం, సర్వీసు, గుర్తింపు ధ్రువీకరణ లేదా చిరునామా ధ్రువీకరణ కోసం దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తులపై రూ. 10,000 జరిమానా విధించవచ్చు. ► దేశ సార్వభౌమత్వం, సమగ్రత కాపాడేందుకు రాష్ట్ర ఏజెన్సీలకు బిల్లులోని నిబంధనల నుంచి మినహాయింపునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ► కంపెనీలు తాము సేకరించిన డేటాను నిర్దిష్ట వ్యవధి వరకే నిల్వ చేసుకోవచ్చు. ► డేటా సేకరించే సేకరించే సంస్థలు.. నిబంధనల పాటింపు కోసం డేటా రక్షణ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ల నుండి వచ్చే ఫిర్యాదులను కూడా ఈ బోర్డు వినాలి. ► యూజర్లు తమ సమ్మతిని తెలియజేసేందుకు, సమీక్షించుకునేందుకు, ఉపసంహరించుకునేందుకు ఆయా కంపెనీలు పారదర్శకమైన ప్లాట్‌ఫాంను అందుబాటులో ఉంచాలి. ► వ్యక్తిగత డేటాను సరిచేసుకునేందుకు, తొలగించేందుకు యూజర్లకు హక్కులు ఉంటాయి. ► తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పిల్లల వ్యక్తిగత డేటాను సేకరించకూడదు. ప్రాసెస్ చేయకూడదు. పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనలు ఇవ్వకూడదు. ► భారీ కంపెనీలు తాము ప్రాసెస్ చేసే డేటా పరిమాణాన్ని బట్టి .. నిబంధనల పాటింపును మదింపు చేసేందుకు స్వతంత్ర డేటా ఆడిటర్‌ను నియమించుకోవాలి. ► డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసే ప్రతిపాదన ముసాయిదాలో ఉంది. ఇది నిబంధనల ఉల్లంఘన కేసులను విచారణ చేసి, తగు నిర్ణయాలు తీసుకుంటుంది. ► వ్యక్తిగత డేటాను స్వయంగా లేదా డేటా ప్రాసెసర్లతో ప్రాసెస్ చేసే డేటా ఫిడ్యుషియరీ సంస్థలకు వివిధ రకాల జరిమానాలుంటాయి. చదవండి: ‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాదన్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ -
సరికొత్త ‘డేటా’ పరిరక్షణ
ఇటు పౌరసమాజ కార్యకర్తలనూ, అటు దిగ్గజ సైబర్ సంస్థలనూ సమానంగా వణికించిన పాత డేటా పరిరక్షణ ముసాయిదా బిల్లు స్థానంలో సరికొత్త ముసాయిదా బిల్లు శుక్రవారం వెలువడింది. పాత బిల్లు ఉపసంహరించుకున్న మూణ్ణెల్లలోపులో దీన్ని తీసుకురావడాన్నిబట్టి డేటా పరిరక్షణ బిల్లు విషయంలో కేంద్రం ఎంత పట్టుదలగా ఉన్నదో వెల్లడవుతోంది. 2019లో రూపొంది పార్లమెంటులో ప్రవేశించిన ముసాయిదా బిల్లుపై అన్నివైపులా తీవ్ర విమర్శలు చెలరేగటంతో దాన్ని ఉపసంహరించక తప్పలేదు. సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచివుంటున్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకమవుతున్నది. లక్షల కోట్లకు పడగెత్తిన మెటా (ఫేస్బుక్), ట్విటర్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు మొదలుకొని సాధారణ వ్యాపార, వాణిజ్య సంస్థల వరకూ పౌరుల డేటాతో ఆటలాడుకుంటున్నాయి. వారి వ్యక్తిగత గోప్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేసేలా ఇప్పటికే చాలా దేశాలు పకడ్బందీ చట్టాలు చేశాయి. ఆ చట్టాలను ఉల్లంఘించిన పక్షంలో భారీ జరిమానాలు విధిస్తున్నాయి. కానీ మన దేశం మాత్రం పుష్కరకాలంగా తాత్సారం చేస్తోంది. చట్టం తెస్తామనటమే తప్ప దాని ఆచూకీ లేదు. అందుకోసం జస్టిస్ బీఎస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2018లోనే ఒక ముసాయిదా బిల్లును కేంద్రానికి సమర్పించింది. చివరకు మరో ఏడాది కాలం తర్వాత దాని ఆధారంగా కేంద్రం ఒక ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే తమ బిల్లుకూ, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకూ పొంతనలేదని జస్టిస్ శ్రీకృష్ణ పెదవి విరిచారు. పార్లమెంటు లోపలా, వెలుపలా ఆ ముసాయిదాపై విస్తృతంగా చర్చ జరిగిన సందర్భంగా అందులో సమగ్రత గల్లంతయిందని అనేకులు విమర్శించారు. డేటా పరిరక్షణ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఏ చర్యలు తీసుకోవాలో అందులో ప్రతిపాదించారు. కానీ దీన్నుంచి ప్రభుత్వం తనను తాను మినహాయించుకోవటం అన్ని వర్గాలనూ దిగ్భ్రాంతిపరిచింది. అలాగే ఇక్కడ సేకరించే డేటా సరిహద్దులు దాటిపోరాదన్న నిబంధన అందులో ఉంది. ఈ నిబంధన సరికాదని మెటా, ట్విటర్వంటివి విమర్శించాయి. చివరకు ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం సైతం జోక్యం చేసుకుంది. ఏమైతేనేం...ఆ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఆ సంఘం బిల్లుకు మొత్తం 81 సవరణలు సూచించింది. ఈ నేపథ్యంలో ఆ బిల్లు ఉపసంహరణే ఉత్తమమని ప్రభుత్వం భావించింది. చాలా సైబర్ సంస్థలు, ఈ–కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసు సంస్థలు వినియోగదారుల డేటాను ఇష్టానుసారం సేకరిస్తున్నాయి. వీటిల్లో చేరాలంటే చాలా వివరాలు సమర్పించుకోవాల్సి వుంటుంది. ఖాతా తెరవాలన్న తొందరలో అత్యధికులు వెనకాముందూ చూడకుండా అడిగిన వివరాలన్నీ అందజేస్తున్నారు. ఈ వ్యక్తిగత డేటాను సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఆ వివ రాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి పోయి పౌరుల బ్యాంకు ఖాతాలు ఖాళీ కావటం, వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లో పడటం రివాజైంది. ఇలాంటివి చోటుచేసు కున్నప్పుడు ఆ మాధ్యమాలు తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాయి. పకడ్బందీ రక్షణ వ్యవస్థ లేనప్పుడు డేటా సేకరణ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకు జవాబు లేదు. ఆ సంగతలా ఉంచి పౌరుల డేటాను ప్రభుత్వం అడిగినప్పుడు ఏం చేయాలన్న ప్రశ్న ఉండనే ఉంది. పాత ముసాయి దాలో భద్రతా సంస్థలకు పూర్తిస్థాయి మినహాయింపునీయటం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుత ముసాయిదాలో సైతం అదే కొనసాగింది. జాతీయ భద్రత కీలకం గనుక అవాంఛనీయ శక్తుల కదలికపై నిఘా వేయటం, వారి కార్యకలాపాలను కనిపెట్టి ఉండటం అవసరం కావొచ్చు. కానీ ఆ మాటున నికార్సయిన అసమ్మతిని అణచాలని చూడటం, ఆ కృషిలో నిమగ్నమయ్యే వ్యక్తులనూ, సంస్థలనూ వేధించటం సరైంది కాదు. ప్రభుత్వాల విధానాలూ, చర్యలూ సరిగాలేవని భావించిన వారు శాంతియుత పద్ధతుల్లో నిరసించటం ప్రజాస్వామిక హక్కు. దీనికి భంగంవాటిల్లని రీతిలో భద్రతా సంస్థలు మెలిగితే ఎవరూ అభ్యంతరపెట్టరు. అందుకు భిన్నంగా వ్యవహరించినప్పుడే సమస్య తలెత్తుతుంది. ఏ అధికారైనా హద్దుమీరిన పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో చెప్పాలి. తాజా ముసాయిదాలో డేటా పరిరక్షణ బోర్డు ఏర్పాటు ప్రతిపాదన భేషైనది. పౌరుల వ్యక్తిగత డేటాను పరిరక్షించటంలో విఫలమైన సంస్థలపై రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధించే అధి కారం ఈ బోర్డుకుంది. అలాగే డేటా లీకయిందని తెలిసిన వెంటనే ఖాతాదార్లకు ఆ సంగతి చెప్పక పోతే రూ. 200 కోట్లవరకూ జరిమానా విధించొచ్చు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరాక సేకరించిన డేటాను సంస్థలు పూర్తిగా తొలగించాలన్న నిబంధన, వినియోగదారులు తమ డేటా తొలగించాలని కోరినా, సవరించాలని కోరినా సంస్థలు అంగీకరించాలన్న నిబంధన మంచిదే. తమ డేటా సేకరణ ప్రక్రియ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చూసేందుకు సంస్థలు ఆడిటర్‌ను నియ మించుకోవాలన్న నిబంధన కూడా మంచిదే. అయితే భారత్‌లో సేకరించిన డేటాను ఇక్కడి సర్వర్ల లోనే భద్రపరచాలన్న అంశంలో ప్రభుత్వం రాజీపడింది. అందుకు బదులు ఏయే దేశాల్లో డేటా ఉంచవచ్చునో ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. తనకు అవసరమైనపక్షంలో డేటా తీసుకోవటం సాధ్య పడే దేశాల్లో సర్వర్లు ఉండొచ్చన్నది సర్కారు భావన. మొత్తానికి తాజా ముసాయిదాపై కూడా లోతైన చర్చ జరగాలి. అందుకు పౌరుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణే గీటురాయి కావాలి. ఇదీ చదవండి: సెలక్షన్ కమిటీ రద్దు.. కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన -
కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగానికి చెక్.. ఇకపై అలాంటివి కుదరదు!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డేటా రక్షణ బిల్లుతో కస్టమర్ డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధమైన యూజర్ల లొకేషన్ ట్రాకింగ్ వివాదానికి సంబంధించిన కేసును టెక్ దిగ్గజం గూగుల్ సెటిల్ చేసుకున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లొకేషన్ ట్రాకింగ్ సిస్టం నుండి వైదొలిగినప్పటికీ యూజర్లను తప్పు దోవ పట్టించి, వారి లొకేషన్‌ను ట్రాక్ చేయడాన్ని కొనసాగించిందంటూ గూగుల్‌పై కేసు నమోదైంది. దీన్ని 392 మిలియన్ డాలర్లకు గూగుల్ సెటిల్ చేసుకుంది. ఇలా కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగం కాకుండా డేటా రక్షణ బిల్లు పటిష్టంగా ఉంటుందని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో లోక్‌సభలో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం మరింత బలమైన నిబంధనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
రానున్న పదేళ్లలో100 బిలియన్ డాలర్ల పెట్టుబడి: అదానీ
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే మూడో అంత్యంత సంపన్న బిలియనీర్ గౌతమ్ అదానీ రానున్న దశాబ్ద కాలంలో ఇండియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నారు. పదేళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని తాజా వెల్లడించారు. న్యూ పవర్ ఎనర్జీ, డేటా సెంటర్లు లాంటి రంగాలలో ఈ పెట్టుబడులుంటాయని తెలిపారు. సింగపూర్‌లో జరిగిన గ్లోబల్ సీఈఓల కాన్ఫరెన్స్‌లో అదానీ మాట్లాడుతూ, అదానీ గ్రూపుగా వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నా మన్నారు. ముఖ్యంగా ఈ పెట్టుబడిలో 70 శాతం ఇంధన పరివర్తన రంగానికి కేటాయించినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుత 20 గిగా వాట్ల పునరుత్పాదక పోర్ట్ ఫోలియోతో పాటు, 45 గిగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని తీసుకొస్తా మన్నారు. ఇది 100,000 హెక్టార్లలో విస్తరించి, సింగపూర్ వైశాల్యం కంటే 1.4 రెట్లు ఎక్కువ. 30 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కమర్షలైజేషన్‌కు తోడ్పడు తుందని అదానీ వెల్లడించారు. -
పౌరుల డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధం : నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి, ఉపాధి కల్పనే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం దారికొస్తోందని, దీనిపై దీర్ఘకాలంపాటు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని కూడా ఈ సందర్భంగా విశ్లేషించారు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధి, దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీని కట్టడే లక్ష్యంగా మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 1.4 శాతం (ప్రస్తుతం 5.4 శాతానికి పెరుగుదల) పెంచిన నేపథ్యంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రెపో రేటు పెంపునకు తక్షణం ఇక ముగింపు పడినట్లేనా అన్న సందేహాలకు ఆమె ప్రకటన తావిస్తోంది. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ►రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా దిగివస్తోంది. దీనిని మనం నిర్వహించగలిగిన స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, వృద్ధికి ఊపును అందించడం. (ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో 7.79 శాతం, మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతానికి దిగివచ్చింది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4శాతం, 5.8శాతాలుగా నమోదవుతాయని ఆర్బీఐ పాలసీ అంచనావేసింది. 2023– 24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది. ► అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు వైఖరి నుండి ఉద్భవిస్తున్న అస్థిరతను ఎదుర్కొనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. భారత్ ద్రవ్య విధానాన్ని పెద్ద అవాంతరాలు లేదా తీవ్ర ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలమన్న ఆర్బీఐ అధికారులు విశ్వసిస్తున్నారు. ►కోవిడ్–19 కాలంలో కేంద్రం ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉంది. లక్ష్యంతో కూడిన ఆర్థిక విధానంతో భారత్ డబ్బును ముద్రించకుండా సవాళ్లతో కూడిన సమాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. ►రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభ వల్ల ముడి చమురు, సహజ వాయువు లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది. ►చెల్లింపులకు సంబంధించి సాంకేతికతతో సహా అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్– అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. భారత్, అమెరికాలు కలిసి పని చేస్తే, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 30 శాతానికి చేరుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటాను అందిస్తాము. ఈ పరిస్థితి భారత్–అమెరిలను ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా మారుస్తుంది. ►భారత్ డేటా డేటా గోప్యత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం కొత్త డేటా గోప్యతా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ►అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతల ను తీసుకోనుంది. డిసెంబర్ 1నుంచి 2023 న వంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల స మయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఐఎంఎఫ్ కోటా సమీక్ష సకాలంలో జరగాలి... కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్‌కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. జీ20 బాధ్యతలు స్వీకరించనున్న భారత్‌తో పలు అంశాలపై చర్చించడానికి దేశంలో పర్యటిస్తున్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో సమావేశం అనంతరం కోటా అంశంపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఇన్‌స్టాకు భారీ షాక్: రికార్డ్ స్థాయిలో జరిమానా, ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఫేస్బుక్ (మెటా) సొంతమైన సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌కు భారీ షాక్ తగిలింది. తన టీనేజ్ యూజర్ల గోప్యతా నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఐర్లాండ్ డేటా ప్రైవసీ రెగ్యులేటర్ రికార్డు స్థాయిలో 405 మిలియన్ యూరోల (402 మిలియన్డ డాలర్ల) జరిమానా విధించింది. ఇది చదవండి: Hyundai Venue N Line: వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర ఎంతంటే? 2020లో ప్రారంభమైన విచారణలో 13-17 సంవత్సరాల మధ్య వయస్సున్న టీనేజ్ యూజర్ల డేటాపై నిబంధనలు పాటించలేదని తేల్చింది. పిల్లల ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాలకు సంబంధించి డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించిందని డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఆరోపించింది. నివేదికల ప్రకారం దాదాపు 32 బిలియన్.. 17 కోట్ల 44 లక్షల 15 వేల రూపాయలుగా ఉంటుంది. ఇదీ క్లిక్ చేయండి: హాప్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్: అదిరే..అదిరే..! ఈ రికార్డు జరిమానాపై అప్పీల్ చేయాలని ఇన్స్టాగ్రామ్ యోచిస్తోందని పేరెంట్ మెటా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్స్టాగ్రామ్ గత ఏడాది తన సెట్టింగ్‌లను అప్డేట్ చేసిందన్నారు. ముఖ్యంగా టీనేజర్ల వ్యక్తిగత డేటా సురక్షితంగా, ప్రైవేట్‌గా ఉంచడానికి కొత్త ఫీచర్లను లాంచ్ చేసినట్టు మెటా ప్రతినిధి తెలిపారు. ఈ జరిమానాతో విభేదిస్తున్నామనీ దీన్ని జాగ్రత్తగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. -
దేశంలో జోరుగా డేటా సెంటర్ల వ్యాపార విస్తరణ!
న్యూఢిల్లీ: డేటా సెంటర్ల వ్యాపార విస్తరణ దేశంలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే 138 డేటా కేంద్రాలతో ఈ పరిశ్రమ 5.6 బిలియన్ డాలర్ల (రూ.44,800 కోట్లు) స్థాయికి చేరుకుంది. 2025 నాటికి కొత్తగా 45 డేటా సెంటర్లు ఏర్పాటవుతాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ పేర్కొంది. బిన్స్వేంజర్తో కలసి ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రస్తుతం ఉన్న 138 డేటా కేంద్రాలు 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో 737 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో ఉన్నాయి. ఇందులో 57 శాతం సామర్థ్యం ముంబై, చెన్నైలోనే ఏర్పాటై ఉంది. మరో 13 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో 1,015 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో 45 డేటా కేంద్రాలు వచ్చే మూడేళ్లలో ఏర్పాటు కానున్నాయి. ఇందులోనూ 69 శాతం సామర్థ్యం చెన్నై, ముంబైలోనే ఏర్పాటు కానుంది. కొత్తవి కూడా కార్యకలాపాలు ప్రారంభించిన అనంతరం దేశవ్యాప్తంగా 183 డేటా సెంటర్లు, 24 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో, 1,752 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో ఉంటాయి. భారత్‌లో డేటా సెంటర్ల వ్యాపారం పరిణామ క్రమంలో ఉందని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ, డిజిటైజేషన్ డిమాండ్ ‘‘టెక్నాలజీ ఆమోదం, డిజిటైజేషన్ అన్నది అన్ని రంగాల్లోనూ వేగంగా కొనసాగుతోంది. భారత్ కూడా ఒక దశాబ్దం పాటు దీని ఒరవడిని చూస్తుంది. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల డిమాండ్ 2025 నాటికి 2,100 మెగావాట్లకు చేరుతుంది’’అని అనరాక్ క్యాపిటల్ ప్రెసిడెంట్ దేవిశంకర్ తెలిపారు. భవిష్యత్తులో 2,688 మెగావాట్ల మేర ప్రణాళికలేని అదనపు సరఫరా భారత మార్కెట్లోకి వస్తుందన్నారు. భిన్న రంగాల్లోని డేటా సంబంధిత సదుపాయాల నిర్వహణలో అనుభవం కలిగిన నిపుణులు ఈ నివేదిక రూపొందించినట్టు పేర్కొంది. -
చెక్కుచెదరని భారత్ వృద్ధి వేగం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ స్థూల దేశీయోత్పత్తి 13.5 శాతంగా నమోదయ్యింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (2021 ఏప్రిల్-జూన్) ఎకానమీ వృద్ధి రేటు 20.1 శాతంకాగా, మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి)లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 4.09 శాతంగా నమోదయ్యింది. వినియోగం, సేవలుసహా పలు రంగాల్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ విలువను పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)ను తీసుకుంటే మొదటి త్రైమాసి కంలో 12.7 శాతంగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 17.6%. 13.5 శాతం వృద్ధి అంటే.. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకారం, 2021–22లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ (2011-12 స్థిర ధరల ప్రాతిపదికన) విలువ రూ.32.46 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.36.85 లక్షల కోట్లు. వెరసి వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది. ఇక జీవీఏను విలువను తీసుకుంటే, ఇది 12.7 శాతం వృద్ధితో రూ.34.41 లక్షల కోట్లుగా ఉంది. కాగా ద్రవ్యోల్బణం పెరుగుదలతో సర్దుబాటు చేయని నామినల్ జీడీపీ (కరంట్ ప్రైసెస్ వద్ద) విలువ మొదటి త్రైమాసికంలో 26.7 శాతం ఎగసి రూ.51.27 లక్షల కోట్ల నుంచి రూ.64.95 లక్షల కోట్లకు ఎగసిందని ఎన్ఎస్ఓ పేర్కొంది. సవాళ్లు ఉన్నాయ్... రానున్న త్రైమాసికాల్లో వృద్ధి తీరుపై ఆందోళనలు నెలకొన్నాయి. వ్యవస్థపై ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల భారం, ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మాంద్యం భయాలు వంటివి ఇక్కడ ప్రధానమైనవి. మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా తక్కువగా వృద్ధి రేటు నమోదవడం గమనార్హం. 2022-23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భావిస్తోంది. సమీక్షా కాలంలో తయారీ రంగం 4.8 శాతంగా నమోదుకావడం ఆందోళన కలిగించే విషయం. ఇక ఎగుమతులకన్నా, దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉండడమూ సమస్యాత్మకమే. దీనికితోడు వర్షపాతం దేశ వ్యాప్తంగా విస్తృత ప్రాతిపదికన తగిన విధంగా లేనందున వ్యవసాయ వృద్ధి, గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. గడచిన ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతానికి పైబడి నమోదవుతుండడంతో మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 1.40 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 5.4 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా వడ్డీరేట్ల పెంపు బాటన నడవడం ప్రారంభించాయి. 7-7.5 శాతం శ్రేణిలో ఉండవచ్చు: కేంద్రం భారత్ ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 నుంచి 7.5 శాతం శ్రేణిలో నమోదుకావచ్చని కేంద్రం భావిస్తోంది. 2021-22లో భారత్ 8.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. ‘‘మొదటి త్రైమాసిక గణాంకాలు మేము ఆశించిన తీరులోనే ఉన్నాయి. వివిధ రంగాల పనితీరు పూర్తిస్థాయి ఆశాజనకంగా ఉంది. వృద్ధి రేటు 7-7.5 శాతం శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలుసైతం ఇదే అంచనాలను వెలిబుచ్చుతున్నాయి’’ అని ఫైనాన్స్ కార్యదర్శి టీవీ సోమనాథన్ పేర్కొన్నారు. -
మీ పాత ఫోన్లో పర్సనల్ డేటా ఎలా డిలీట్ చేయాలంటే?
మీరు కొత్త స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ పాత ఫోన్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. పాత ఫోన్ అమ్మేసే సమయంలో అందులో ఉండే వ్యక్తిగత డేటాను మీరు కాపీ చేసుకొని భద్రపరుచుకుంటే ఫర్వాలేదు. లేదంటే పర్సనల్ డేటా లీకయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పాత ఫోన్లో ఉన్న డేటాను డిలీట్ చేయడం, లేదంటే కాపీ చేయడం చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాతే ఆ డేటాను రీసెట్ చేయాలి. అలా చేస్తేనే పాత ఫోన్లో డేటా అంతా డిలీట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఫోన్‌ను ఎలా రీసెట్ చేయాలో తెలుసుకుందాం. ఫోన్‌ను ఎలా రీసెట్ చేయాలంటే స్టెప్ 1: ముందుగా ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి సిస్టం అనే అప్షన్‌పై ట్యాప్ చేయాలి స్టెప్2: సిస్టం ఆప్షన్ పై ట్యాప్ చేస్తే రీసెట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది స్టెప్3: అందులో మీకు ఎరేజ్ ఆల్ డేటా, లేదంటే (ఫ్యాక్టరీ రీసెట్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. స్టెప్4: డిలీట్ అవుతున్న డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదివి, ఎరేజ్ ఆల్ డేటాను క్లిక్ చేయాలి. స్టెప్5: కన్ఫర్మేషన్ కోసం స్క్రీన్‌పై పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. స్టెప్6: అనంతరం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎరేజ్ ఆల్ డేటాపై క్లిక్ చేస్తే.. ఆ డేటా మొత్తం డిలీట్ అవుతుంది. -
Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం!
న్యూఢిల్లీ: ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ప్రయాణికుల డేటాపై దృష్టి సారించింది. వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ కంపెనీలకు ఈ డేటాను అందించే వ్యాపారం ద్వారా రూ. 1,000 కోట్ల వరకూ ఆదాయం సమకూర్చుకోవచ్చని (మానిటైజేషన్) అంచనా వేస్తోంది. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సర్వీసులను మరింత మెరుగుపర్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమలుకు విధి విధానాలను రూపొందించడానికి కన్సల్టెంట్ సర్వీసులను ఐఆర్సీటీసీ వినియోగించుకోనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టెండరు ప్రకటన జారీ చేసింది. ఆతిథ్య, ఇంధన, మౌలిక, వైద్య తదితర రంగాల సంస్థలకు ఈ తరహా డేటా ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నట్లు టెండరు ప్రకటనలో పేర్కొంది. ఉదాహరణకు ట్రావెల్ సంస్థలతో ఈ డేటాను పంచుకుంటే.. ఆయా సంస్థలు తమ సర్వీసులు వినియోగించుకోవాలంటూ ప్రయాణికులకు వివరాలను పంపే అవకాశముంది. ‘‘భారతీయ రైల్వేస్ తన కస్టమర్/వెండార్ యాప్‌లు, అంతర్గత యాప్‌లలో ఉండే డేటాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని హోటల్, ట్రావెల్, బీమా, వైద్యం, ఏవియేషన్ తదితర విభాగాల సంస్థలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం ద్వారా మానిటైజ్ చేయదల్చుకుంది. తద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని .. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సేవలను మరింత మెరుగుపర్చవచ్చని భావిస్తోంది’’ అని వివరించింది. దీనికోసం ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ .. వినియోగదారు డేటాను ఈ విధంగా ఉపయోగించుకోవడంలో గోప్యతా నిబంధనలపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించవచ్చనే అంశంపై తగు సూచనలు చేయాల్సి ఉంటుంది. డేటా ప్రైవసీ విషయంలో చట్టాలు, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను అమలు చేసేందుకు నిబంధనలను క్షుణ్నంగా అధ్యయం చేయా ల్సి ఉంటుంది. ప్రయాణికులు, రవాణా సేవలు ఉపయోగించుకునే కస్టమర్లు మొదలైన వర్గాల ప్రాథమిక డేటాను విశ్లేషించాలి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, అయితే దీన్ని అమలు చేయాలంటూ రైల్వే బోర్డు నుంచి ఒత్తిడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రైవసీకి రిస్కులపై సందేహాలు... ప్రయాణికుల వ్యక్తిగత డేటాను ఇలా ఎవరికిపడితే వారికి ఇవ్వడమనేది వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లయ్యే అవకాశాలు ఉన్నా యని సీయూటీఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అమోల్ కులకర్ణి అభిప్రాయపడ్డారు. సాధారణంగా డేటాను క్రోడీకరించి, ఏ వివరాలు ఎవరివి అనేది బైటపడకుండా గోప్యంగాను, భద్రంగానూ ఉంచాలని ఆయన చెప్పారు. అయితే, గోప్యనీయతను పాటించకుండా ఐఆర్సీటీసీ గానీ ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు డేటాను ఇచ్చిన పక్షంలో ప్రైవసీ హక్కులకు భంగం కలగడంతో పాటు సదరు డేటా దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని కులకర్ణి పేర్కొన్నారు. అయితే, ఇలా డేటాను షేర్ చేసుకోవడం అక్రమం అనేందుకు తగిన చట్టాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ డేటాను షేర్ చేసుకుంటే దాన్ని తాను భద్రంగా ఉంచడంతో పాటు థర్డ్ పార్టీలు కూడా పటిష్టమైన ప్రమణాలు పాటించేలా ఐఆర్సీటీసీ చూడాల్సి ఉంటుందని కులకర్ణి చెప్పారు. రోజుకు 11 లక్షలకు పైగా టికెట్లు.. రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు ఏకైక మార్గంగా ఈ విషయంలో ఐఆర్సీటీసీకి గుత్తాధిపత్యం ఉంది. కంపెనీ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీ ప్లాట్‌ఫాం ద్వారా 43 కోట్ల పైచిలుకు టికెట్లు బుక్ అయ్యాయి. రోజువారీ దాదాపు 63 లక్షల లాగిన్స్ నమోదయ్యాయి. 8 కోట్ల మంది పైగా యూజర్లు ఐఆర్సీటీసీ ఆన్లైన్ సేవలు వినియోగించుకుంటున్నారు. టికెట్ల బుకింగ్స్‌లో దాదాపు 46 శాతం వాటా మొబైల్ యాప్‌దే ఉంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీ దగ్గర భారీ స్థాయిలో ప్రయాణికుల డేటా ఉంటోంది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఆగస్టు 31 వరకు మాత్రమే!
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) కస్టమర్ల బంపరాఫర్ ప్రకటించింది. తమ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. ‘ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ ప్లాన్ 2022’ లో భాగంగా రూ.2022తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని, అయితే ఈ ఆఫర్ ఆగస్టు 31 లోపు రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఏముంది ఈ ప్లాన్‌లో.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌లో.. రూ.2022తో రీచార్జ్ చేసుకుంటే 300 రోజులు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. దీంతో పాటు నెలకు 75GB డేటా కూడా లభిస్తుంది. ఒకవేళ నెలలోపు మీ డేటా పరిమితి నెలలోపు పూర్తయితే స్పీడ్ 40kbps పడిపోతుంది. అలాగే రూ 2399, రూ 2,999 ప్లాన్‌పై అదనంగా మరో 75 జీబీ డేటా ఇస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. కాగా బీఎస్ఎన్ఎల్కు ఊపరి పోసేందుకు ఇటీవలే కేంద్రం కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించడంతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ ప్యాకేజీతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కేంద్రం ఆదేశిస్తూ లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. చదవండి: అలర్ట్: మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు, 75శాతం డిస్కౌంట్.. ఈరోజే లాస్ట్! -
ఎన్డీఏ అంటే ఏమిటో కొత్త అర్థం చెప్పిన రాహుల్
సాక్షి,న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం తమ వద్ద సమాచారం లేదని బదులివ్వడంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం తీరును తప్పుబడుతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ అంటే 'నో డేటా అవైలబుల్' అని సెటైర్లు వేశారు. ఓ జిఫ్ ఇమేజ్ను కూడా జత చేసి ట్వీట్ చేశారు. ' ఆక్సీజన్ కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు. నిరసనలు చేపట్టిన రైతుల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు. కాలినడక వల్ల ఒక్క వలస కూలీ కూడా మరణించలేదు. మూక దాడుల వల్ల ఒక్కరు కూడా మరణించలేదు. ఒక్క జర్నలిస్టును కూడా అరెస్టు చేయలేదు అని నో డేటా అవైలబుల్(ఎన్డీఏ) ప్రభుత్వం ప్రజల్ని నమ్మించాలనుకుంటుంది. డేటా లేదు. సమాధానం లేదు. జవాబుదారీ లేదు' అని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు. ‘No Data Available’ (NDA) govt wants you to believe: • No one died of oxygen shortage • No farmer died protesting • No migrant died walking • No one was mob lynched • No journalist has been arrested No Data. No Answers. No Accountabilty. pic.twitter.com/mtbNkkBoXe — Rahul Gandhi (@RahulGandhi) July 23, 2022 పార్లమెంటు సమావేశాల్లో భాగంగా.. కోవిడ్ వల్ల ఎంతమంది అంగన్వాడీ కార్యకర్తలు చనిపోయారని విపక్షాలు కేంద్రాన్ని శుక్రవారం అడిగాయి. అందుకు తమవద్ద సమాచారం లేదని కేంద్రం బదులిచ్చింది. 2014 నుంచి దేశంలో ఎంత మంది జర్నలిస్టులు అరెస్టయ్యారనే ప్రశ్నకు కూడా తెలియదని సమాధానం చెప్పింది. దీంతో కేంద్రం తీరును విమర్శిస్తూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. చదవండి:మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు -
విధాన నిర్ణయాల్లో డేటాదే కీలక పాత్ర
ముంబై: విధాన నిర్ణయాల పటిష్టతలో గణాంకాల (డేటా) పాత్ర చాలా కీలకమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. తగిన సమాచారంతో విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సూచించారు. ఇందుకు స్పష్టమైన, పారదర్శకమైన డేటా అందుబాటులో ఉండడం అవసరమని అన్నారు. తద్వారా నిర్ణయాధికారుల నుండి తగిన నిర్ణయాలు వెలువడతాయని, మార్కెట్ భాగస్వాములు హేతుబద్ధమైన అంచనాలకు రాగలుగుతారని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ వార్షిక ‘స్టాటిస్టిక్స్ డే’ సదస్సులో ఈ మేరకు గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► పబ్లిక్ పాలసీలో గణాంకాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పారదర్శక, పటిష్ట గణాంకాల పాత్ర మరింత పెరిగింది. ► మునుపెన్నడూలేని విధంగా ఏర్పడిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మానవాళి లక్ష్యాలు, దృక్పధాన్ని పరిశోధిస్తోంది. భారత్‌సహా వివిధ దేశాలలో విధించిన లాక్డౌన్లు... మహమ్మారి వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావాలకు సంబంధించిన డేటా లభ్యత విషయంలో క్లిష్టమైన స్థితిని సృష్టించింది. మునుపెన్నడూ చూడని ఈ సమస్యకు అత్యవసరంగా పరిష్కారాలు కనుగొనడం అవసరం. ► డేటా లభ్యత విషయంలో 2020లో మహమ్మారి మొదటి వేవ్ సమయంలో దేశంలో అనేక వస్తువుల ధరల సేకరణలో అపారమైన ఇబ్బందులు నెలకొన్నాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ► అయితే ఈ పరిస్థితి డేటా సేకరణలో నూతన సాంకేతిక విధానాలను అవలంభించే అవకాశాలనూ మహమ్మారి సృష్టించింది. ఈ నూతన విధానాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే కొత్త డేటా వనరులు అధికారిక గణాంకాల కోసం తాజా అవకాశాలను సృష్టిస్తుండగా, ఇది ఈ విషయంలో డేటా విశ్వసనీయత, క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తుతుండడం మరో ప్రతికూలాంశం. ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ► సరైన డేటా నాణ్యతకు తగిన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, డేటా గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని 2022 ఏప్రిల్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ కాన్ఫరెన్స్’ ఉద్ఘాటించింది. ► విధాన నిర్ణయాలు తీసుకోవడంలో, వాటి ఫలితాలను అంచనా, మదింపు వేయడంలో సెంట్రల్ బ్యాంకులకు గణాంకాలు ఎంతో కీలకం. ఇక్కడ గణాంకాలు సేకరించడం, వాటిని వినియోగించుకోవడం రెండు బాధ్యతలూ సెంట్రల్ బ్యాంకులకు సంబంధించినవే. మహమ్మారి వంటి కల్లోల సమయాల్లో సెంట్రల్ బ్యాంకులు తమ విధానాలు, చర్యల మదింపునకు సంబంధించిన డేటా సమీకరణలో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా అంశాలకు సంబంధించి ఎదురయిన సవాళ్లనూ సెంట్రల్ బ్యాంకులు మహమ్మారి సమయాల్లో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. మహమ్మారి సమయంలో ప్రత్యామ్నాయ సూచీలు, డేటా సమీకరణ వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. భారత్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు ఆర్బీఐ విషయానికి వస్తే, పటిష్ట గణాంకాల సేకరణ, వినియోగ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డేటా ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడంలో ఆర్బీఐ ప్రయత్నాలు, సాంకేతికతపై పెట్టుబడులు, నియంత్రిత సంస్థలతో నిరంతర సంప్రతింపులు మంచి ఫలితాలను అందించాయి. డేటా సర్వే, సేకరణ రీతుల్లో కొంత మార్పుతో పాటు, ఆయా అంశాల్లో మరింత స్థిరత్వం నెలకొల్పడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. డేటా నాణ్యతను నిర్ధారించడానికి పునఃపరిశీలన విధానాలను అవలంభించడం జరుగుతోంది. డేటా సేకరణ, ధ్రువీకరణ, నిర్ణయాల్లో వాటి అనుసంధానం వంటి అంశాల్లో వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టాం. ఆయా అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా మరిన్ని సూచీలు, ఉప సూచీలు, ఇతర గణాంకాలు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. దేశాలు ఉన్నత జీవన ప్రమాణాలను సాధించడానికి ఆయా సూచీలో ప్రయత్నిస్తున్నాయి. బహుళ కోణాలలో దేశాల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికలు, హ్యాపీ ఇండెక్స్‌లు, అసమానత సూచికల వంటివి వాటిని ఈ సందర్భంలో ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా సూచీలను ప్రస్తుతం వివిధ జాతీయ– అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్నాయి. వైశాల్యం, భౌగోళిక వైవిధ్యం దృష్ట్యా భారతదేశానికి ప్రాంతీయ అంశాలను సూచించే జాతీయ సూచికల అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్‌లో మేము సమాచారాన్ని ’ప్రజా ప్రయోజనకరమైన అంశం’గా పరిగణిస్తాము. వివిధ వాటాదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా మన సమాచార నిర్వహణ వ్యవస్థలను క్రమబద్ధం చేయాలని భావిస్తున్నాము. ఆర్బీఐ మరింతగా ప్రత్యామ్నాయ డేటా వనరులపై దృష్టి సారించాలి. ఇప్పటికే ఉన్న డేటా విశ్లేషణాత్మక ఫ్రేమ్‌వర్క్ విధానాలతో వాటిని అనుసంధించడానికి ప్రయత్నం జరగాలి. -
పుట్టిన బిడ్డకు ఆటోమేటిక్‌గా ‘టెంపరరీ’ ఆధార్!
సాక్షి, న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ).. ఇక నుంచి జననం నుంచి మరణం దాకా మొత్తం జీవిత చక్ర సమాచారాన్ని ‘ఆధార్’తో నిక్షిప్తం చేయనుంది. ఇందులో భాగంగా.. రాబోయే రోజుల్లో బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ల పేరిట ఆటోమేటిక్‌గా టెంపరరీ ఆధార్ జారీ చేయనున్నట్లు సమాచారం. పుట్టిన వెంటనే ఆధార్ నెంబర్ పొందే చిన్నారులు.. మేజర్లు అయిన తర్వాత వేలిముద్రలతో ఆ ఆధార్‌ను అప్ డేట్ చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు.. త్వరలోనే రెండు పైలట్ కార్యక్రమాలను మొదలుపెట్టనుంది కేంద్రం. ఇందులో భాగంగానే.. యూఐడీఏఐ తరపున తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2010లో ఆధార్ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా పెద్దలు అందరికీ ఆధార్ జారీ అయింది. ఇక మీదట జన్మించిన దగ్గర్నుంచి, మరణించే వరకు వ్యక్తులకు సంబంధించి అన్ని ముఖ్యమైన వాటికి ఆధార్ ను తప్పనిసరి చేసే యోచనతో యూఐడీఏఐ ఉంది. కారణం? మరణ రికార్డులతోనూ ఆధార్ డేటాను అనుసంధానించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందే విషయంలో దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది ఉద్దేశ్యం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించి.. మరణించిన వారి వివరాలు వెంటనే ఆధార్ డేటా బేస్ లోకి చేరేలా యూఐడీఏఐ చర్యలు తీసుకోనుంది. ‘‘ఇటీవల మరణించిన వారి ఆధార్ యాక్టివ్ గా ఉండడంతో వారి పేరిట పెన్షన్.. ఇంకా ఆటోమేటిక్‌గా జమ అవుతోంది’’ అని సదరు అధికారి తెలిపారు. అలాగే, ఒకే వ్యక్తికి ఒక ఆధార్ మాత్రమే ఉండేలా యూఐడీఏఐ చర్యలు తీసుకుంటోంది. -
ట్విటర్ డీల్: ఈలాన్ మస్క్ మరో బాంబు
సాక్షి, న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, బిలియనీర్ ఈలాన్ మస్క్ మరోసారి ట్విటర్‌కు హెచ్చరిక జారీ చేశాడు. స్పామ్, నకిలీ ఖాతాలపై డేటా అందించకపోతే ట్విటర్ కొనుగోలు డీల్‌ను విరమించుకుంటానంటూ తాజాగా హెచ్చరించాడు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా ట్విటర్‌కు సోమవారం ఒక లేఖ రాశాడు. విలీన ఒప్పందం ప్రకారం ట్విటర్ వివరాలను వెల్లడించడంలో పారదర్శకంగా వ్యవహరించడంలేదని, దీంతో తామడిగిన డేటాను అడ్డుకుంటోందనే అనుమానం మరింత కలుగుతోందని లేఖలో మస్క్ వ్యాఖ్యానించాడు. తాము కోరిన డేటాను నిలిపివేయడం సంస్థ తన సమాచార హక్కులను తీవ్రంగా ప్రతిఘటిస్తోందని, అడ్డుకుంటోందని మస్క్ భావిస్తున్నారని మస్క్ లాయర్లు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘన అని ఈనేపథ్యంలో డీల్ రద్దు చేయడంసహా అన్ని హక్కులు తమకున్నాయని పేర్కొన్నారు. కాబోయే యజమానిగా కంపెనీ వ్యాపార స్వాధీనం, లావాదేవీ ప్రక్రియను సులభతరం చేసుకునేందుకు ట్విటర్ యాక్టివ్ యూజర్ల బేస్ గురించి పూర్తి, ఖచ్చితమైన అవగాహన ఉండాలని లేఖ స్పష్టం చేసింది. ట్విటర్ కొనుగోలు కోసం హెచ్ఎస్ఆర్ చట్టం కింద నిరీక్షణ వ్యవధి ముగిసిందని ట్విటర్ తెలిపిన దాదాపు వారం తర్వాత టెస్లా సీఈవో ఈ లేఖను రాయడం గమనార్హం. మరోవైపు ఈ మస్క్ లేఖపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. కాగా ట్విటర్లో నకిలీ ఖాతాలు మొత్తం యూజర్‌బేస్‌లో 5 శాతం కంటే తక్కువ ఉన్నారో లేదో నిర్ధారించుకునేదాకా 44 బిలియన్ డాలర్ల డీల్‌ను "తాత్కాలికంగా హోల్డ్"లో ఉంచుతున్నట్లు మే 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విటర్ యూజర్లలో 5 శాతం వరకు నకిలీ ఖాతాలున్నాయా? లేదా? అనేది ధృవీకరించుకునేందుకు స్వతంత్ర విశ్లేషణను కోరింది. కంపెనీ చట్టాలు, టెస్టింగ్ మెథడాలజీలు సరిపోతాయని నమ్మడం లేదు కాబట్టి తాను తప్పనిసరిగా ఉండాలనేది మస్క్ డిమాండ్. తాజా లేఖ నేపథ్యంలో ట్రేడింగ్‌లో ట్విటర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. -
వాట్సాప్ డేటాను ఎలా బ్యాకప్ తీసుకోవాలో మీకు తెలుసా!
ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ నుంచి మీకు కావాల్సిన ఫోటోస్‌ని, చాట్స్ సింపుల్ టెక్నిక్స్‌తో బ్యాకప్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఆ బ్యాకప్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వాట్సాప్ చాట్ హిస్టరీ, వాయిస్ మెసేజ్,ఫోటోల్ని,వీడియోల్ని గూగుల్ డ్రైవ్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ పూర్తయితే రీస్టోర్ చేసుకునే సదుపాయం ఉంటుంది. వాట్సాప్ డేటా బ్యాకప్ ఎలా అంటే! స్టెప్1: ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి డ్యాష్ బోర్డ్‌లో త్రీ డాట్స్ మీద క్లిక్ చేయాలి. స్టెప్2: అనంతరం సెట్టింగ్ ఆప్షన్‌లోకి వెళ్లాలి స్టెప్3: సెట్టింగ్‌లో చాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి స్టెప్4: చాట్‌లో చాట్ బ్యాకప్ ఆప్షన్ కనిపిస్తుంది స్టెప్5: చాట్ బ్యాక్ ఆప్షన్లో మీకు గూగుల్ డ్రైవ్ సెట్టింగ్ తో పాటు వీడియో ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్యాకప్ తీసుకోవచ్చు. దీంతో మీ వాట్సాప్ డేటా అంతా మీ మొబైల్‌కు లింకై ఉన్న గూగుల్ అకౌంట్ డ్రైవ్‌లో స్టోర్ అవుతుంది. -
‘డేటా’ నిబంధనలను పాటిస్తున్నాం
న్యూఢిల్లీ: డేటా స్థానికతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన నిబంధనలన్నింటినీ పూర్తిగా పాటిస్తున్నామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) స్పష్టం చేసింది. తమ బ్యాంక్ డేటా అంతా దేశీయంగానే భద్రపరుస్తున్నామని వివరించింది. పర్యవేక్షణపరమైన లోపాల కారణంగా కొత్త ఖాతాలు తెరవొద్దంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ గత వారం ఆదేశించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పీపీబీఎల్ సర్వర్లలోని వివరాలు చైనా సంస్థల చేతుల్లోకి వెడుతున్నాయనే వార్తలతో సోమవారం పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు ఒక్కసారిగా పతనమైంది. ఈ వన్97 కమ్యూనికేషన్స్‌లో చైనా ఆలీబాబా గ్రూప్ సంస్థలకు 31 శాతం వాటాలు ఉన్నాయి. తద్వారా పీపీబీఎల్‌లో కూడా చైనా కంపెనీలకు పరోక్షంగా వాటాలు ఉన్నాయి. -
పేటీఎం యాప్‌లో మరో సరికొత్త ఆప్షన్.. అరచేతిలో ఆరోగ్య చరిత్ర!
హెల్త్ఐడీ క్రియేషన్ కోసం నేషనల్ హెల్త్ అథారిటీతో కలిసి పనిచేయనున్నట్లు వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ప్రకటించింది. దీని ద్వారా యూజర్లు తమ యూనిక్ హెల్త్ ఐడీని పేటీఎం యాప్ ద్వారా క్రియేట్ చేసు కోవచ్చు. భారతీయులందరికీ ఒకే చోట విస్తృత శ్రేణిలో ఉపయోగకరమైన సేవలను అందుబాటులోకి తీసుకు రావాలన్న కంపెనీ ప్రయత్నాలకు అనుగుణంగా హెల్త్ ఐడీ ఆవిష్కారం చోటు చేసుకుంది. ఆండ్రాయిడ్, ఐఒఎస్ యూజర్లకు సంబంధించి హెల్త్ ఐడీల క్రియేషన్ కోసం వీలు కల్పించే అతిపెద్ద వినియోగదారు వేదికగా పేటీఎం నిలిచింది. భారతీయులకు సంబంధించి డిజిటల్ హెల్త్ రికార్డు క్రియేట్ చేసుకునేందుకు భారత ప్రభుత్వ హెల్త్ఐడీ క్రియేషన్ అనేది తప్పనిసరి. ఇది యూజర్లు వారు తమ హెల్త్ డేటాను యాక్సెస్ చేసేందుకు, తమ సమ్మతితో ఇతర ఆరోగ్య సంరక్షణ సంస్థలతో పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ హెల్త్ ఐడీ ద్వారా, యూజర్లు దీర్ఘకాలిక హెల్త్ హిస్టరీని క్రియేట్ చేసుకునేందుకు గాను హెల్త్ ఐడీతో తమ పర్సనల్ హెల్త్ రికార్డ్స్(పిహెచ్ఆర్) ను యాక్సెస్ చేయవచ్చు, లింక్ చేయవచ్చు. రాబోయే ఆరు నెలల్లో 10 మిలియన్లకు పైగా భారతీయులు తమ హెల్త్ ఐడీలు క్రియేట్ చేసుకునేలా చేయడమే కంపెనీ తన లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: ఎయిర్టెల్-టీసీఎస్ 5జీ ప్రయోగం విజయవంతం!) పేటీఎంపై తమ ఐడీలను క్రియేట్ చేసుకునే యూజర్లు తమ ల్యాబ్ రిపోర్ట్ లను పొందవచ్చు, యాప్ పై ఉండే హాస్పిటల్స్ తో టెలికన్సల్టేషన్స్ ను బుక్ చేసుకోవచ్చు. తమ సమాచారాన్ని అంతా కూడా సులభంగా హెల్త్ లాకర్ లో పొందుపర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా పేటీఎం యాప్ లోనే చేయవచ్చు. పేటీఎం మినీ యాప్ స్టోర్ ఒక హెల్త్ స్టోర్ ఫ్రంట్ ను కూడా ఆవిష్కరించింది. ఇది ఆరోగ్యసంరక్షణ రంగంలోని ప్రముఖ సంస్థలను అగ్రిగేట్ చేస్తుంది. దాంతో యూజర్లు టెలికన్సల్టేషన్స్ ను బుక్ చేసుకోవచ్చు, ఫార్మసీల నుంచి ఔషధాలు కొనుగోలు చేయవచ్చు, ల్యాబ్ టెస్ట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య బీమా కొనుగోలు చేయవచ్చు, మెడికల్ రుణాలకు దరఖాస్తు చేయవచ్చు, ఇంకా మరెన్నో చూసుకునే వీలు ఇందులో ఉంది. దీని ద్వారా యూజర్లు తమ ఆరోగ్య పరమైన అన్ని అవసరాల కోసం పేటీఎం యాప్ పై ఆధారపడవచ్చు. గతంలోనే పేటీఎం డిజి లాకర్ ను తన మినీ యాప్ స్టోర్ కు అనుసంధానం చేసింది. యూజర్లు తమ డిజి లాకర్ ను పేటీఎం యాప్ నుంచే రిట్రైవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, సేవ్ / స్టోర్ చేసుకోవచ్చు, నమోది త సంస్థల నుంచి డాక్యుమెంట్ల వెరిఫైడ్ ఎలక్ట్రానిక్ కాపీలను నేరుగా వ్యక్తిగత లాకర్లలోకి పొందవచ్చు, తద్వా రా భౌతిక డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగించుకోవచ్చు. పేటీఎం ద్వారా కోవిడ్-19 టీకాను బుక్ చేసుకున్న యూజర్లు తమ వాక్సీన్ సర్టిఫికెట్లను ఒక్క క్లిక్ తో డిజిలాకర్ కు జోడించుకోవచ్చు. (చదవండి: శాంసంగ్ యూజర్లకు అలర్ట్...! వీటితో జాగ్రత్త..!) -
సింపుల్, డిలీటైన వాట్సాప్ డేటాను ఇలా బ్యాకప్ తీసుకోండి
వాట్సాప్ చాట్ డిలీట్ అయ్యిందా? లేదంటే పొరపాటున డిలీట్ చేశారా? మరేం పర్లేదు. సింపుల్ టెక్నిక్‌తో మీ ఫోన్లో డిలీట్ అయిన వాట్సాప్ చాట్‌ను రీస్టోర్ చేసుకోవచ్చు. అదెలా అంటే..! వాట్సాప్ పరిచయం అక్కర్లేని పేరు. ఫేస్బుక్ కు చెందిన ఈ వాట్సాప్ యాప్‌లో వరల్డ్ వైడ్‌గా ఉన్న యూజర్లు ప్రతి రోజు ఇమేజెస్, ఆడియా, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు యూజర్లను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపిస్తుంటారు. ఆ డేటాను వాట్సాప్ సంస్థ తన సర్వర్లలో నుంచి తొలగిస్తుంది. అయితే ఈ సింపుల్ హ్యాక్‌తో వాట్సాప్‌లో డిలీటైన డేటాను కలెక్ట్ చేసుకోవచ్చు. ముందు చాట్‌ను బ్యాకప్ తీసుకోవాలి డిలీటైన డేటాను రీస్టోర్ చేసుకోవాలి' అంటే ముందుగా మీ వాట్సాప్‌లో వాట్సాప్ డేటా బ్యాకప్ తీసుకోవాలి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే వాట్సాప్ ఓపెన్ చేసి>>సెట్టింగ్‌లోకి వెళ్లాలి>>అందులో చాట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి చాట్‌ను బ్యాకప్‌ను తీసుకోవాలి. అనంతరం ఆ డేటాను బ్యాకప్ తీసుకోవాలంటే గూగుల్ డ్రైవ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అందులో ఫైల్ క్రియేట్ చేసుకొని బ్యాక్ అప్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ వాట్సాప్ డేటా అంతా మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. గూగుల్ డ్రైవ్‌లో మీ వాట్సాప్ డేటా స్టోర్ అవ్వాలంటే గూగుల్ డ్రైవ్‌లో మీ వాట్సాప్ డేటా డీఫాల్ట్‌గా స్టోర్ అవ్వాలి అంటే మీరు ఆటోమెటిక్ బ్యాకప్ ఫీచర్ ఆప్షన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. మీ బ్యాకప్‌ని పునరుద్ధరించడానికి మీరు బ్యాకప్ తీసుకున్న వాట్సాప్ డేటాను చూడాలంటే మీ కంప్యూటర్ లో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ లేదా ఎస్డీ కార్డ్‌ని ఉపయోగించి ఫైల్‌లను ఫోన్‌కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ యాప్‌ను డౌన్లోడ్ చేయండి. ఫైల్ మేనేజర్ యాప్‌లో, మీ లోకల్ స్టోరేజ్ లేదా ఎస్డీకార్డ్ >> వాట్సాప్ >> డేటాబేస్‌లోకి నావిగేట్ చేయండి. మీ డేటా ఎస్డీ కార్డ్‌లో స్టోరేజ్ కాలేదంటే బదులుగా మీరు "ఇంటర్నల్‌స్టోరేజ్ " లేదా "మెయిన్ స్టోరేజ్"లో చూడొచ్చు. చదవండి: వాట్సాప్ మెస్సేజ్‌లతో జర జాగ్రత్త.. లేకపోతే మీ ఖాతా ఖాళీ! -
'ఐ కాంట్ బ్రీత్':ఫేస్బుక్ కు మరో ముప్పు..జూకర్ ఏం చేస్తారో?
ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బెర్గ్ ప్రతిష్ట రోజురోజుకీ మసకబారిపోతుంది. 'భద్రత కంటే లాభాలే ముఖ్యం' అనే మచ్చ జూకర్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హాగెన్ చేసిన ఆరోపణలు, వెలుగులోకి తెచ్చి ఆధారాలు ఆయన్ను మరింత అష్ట దిగ్భందనం చేస్తున్నాయి.'ఐ కాంట్ బ్రీత్' అనే తరహాలో అవి చాలవన్నట్లు తాజాగా ఐర్లాండ్ డేటా ప్రొటెకమిషన్ భారీ జరిమానా విధించింది. యూరోపియన్ కమిషన్ ప్రకారం.. అండర్ యురేపియన్ యూనియన్ - 2018 డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం..ఫేస్‌బుక్‌పై ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ అధికారులు 36 మిలియన్ల యూరోల (ఇండియన్ కరెన్సీలో రూ.3,14,62,56,000.00) ఫైన్ విధించారు. యూరోపియన్ కమిషన్ ప్రకారం.. మొత్తం 44 యూరోపియన్ యూనియన్ దేశాల్లో బిజినెస్ వ్యవహారాల్ని సులభతరం చేసేందుకు 'వన్ స్టాప్ షాప్'తో ఓ యూనియన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. యూరోపియన్ దేశాల్లో బిజినెస్ వ్యవహరాలు నిర్వహించాలంటే ఆ కమిషన్ సభ్యులు చెప్పినట్లుగా వ్యవహరించాలి. లేదంటే కఠిన చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా వన్ స్టాప్ షాప్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్‌పై ఐర్లాండ్ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. ఆస్ట్రియన్ యాక్టివిస్ట్ ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ న్యాయవాది, సామాజిక వేత్త మాక్స్ స్క్రెమ్స్ ఫేస్బుక్ ప్రైవసీ వయోలేషన్ పై ఫైట్ చేస్తున్నారు. తాజాగా ఈయన ఫేస్‌బుక్‌పై డజన్ల కొద్ది ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన డీపీసీ సభ్యులు ఫేస్బుక్ పై 28 మిలియన్ల యూరోల నుంచి 36 మిలియన్ల యూరోల వరకు జరిమానా విధించారు. మరి ఈ ఫైన్‌తో పాటు ఫేస్‌బుక్‌పై పడిన ఆరోపణలనే తుపాన్లను, సునామీలను తట్టుకొని ఏటికి ఎదురీది తన సంస్థను కాపాడుకుంటారో లేదంటే ఇంకేం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం -
ఐటీలో భవిష్యత్ అంతా వీటిదే
న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీలు, సర్వీసులే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వృద్ధికి దోహదపడనున్నట్లు దిగ్గజ సంస్థ విప్రో సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. డేటా, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ వంటి విభాగాలు భారీ స్థాయిలో ఎదిగే అవకాశం ఉందని వివరించారు. ఎక్కడ నుంచి అయినా పనిచేయడం, క్రౌడ్‌సోర్సింగ్ తదితర విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్‌సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్య అంశంగా మారిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. వృద్ధి సాధన దిశగా తమ సంస్థ అయిదు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. కీలక రంగాలపై మరింతగా దృష్టి పెట్టడం, క్లయింట్లతో భాగస్వామ్యాన్ని పటిష్టపర్చుకోవడం, ప్రతిభావంతులైన సిబ్బందిపై ఇన్వెస్ట్ చేయడం, వ్యాపార నిర్వహణ విధానాన్ని సరళతరం చేయడం మొదలైనవి వీటిలో ఉన్నట్లు డెలాపోర్ట్ తెలిపారు. వ్యాపార వ్యూహాల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలతో పాటు భారత్‌లో కూడా ఇతర సంస్థలను కొనుగోలు చేసినట్లు వివరించారు. క్యాప్కో సంస్థ కొనుగోలుతో అంతర్జాతీయంగా ఆర్థిక సేవల మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ఆయన పేర్కొన్నారు.దీనికోసం విప్రో సుమారు 1.45 బిలియన్ డాలర్లు వెచ్చించింది. చదవండి: Gold: డిజిటల్ గోల్డ్‌తో.. లాభాల పంట -
Facebook: కొత్త ఫీచర్ గురించి తెలుసా?!
సాక్షి, ముంబై: గతేడాది ఫేస్బుక్ ప్రైవసీ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆఫ్ - ఫేస్బుక్ పేరుతో తెచ్చిన ఈ ఫీచర్ సాయంతో ఫేస్బుక్ లో యాప్స్, వెబ్ సైట్లు, థర్డ్ పార్టీ సైట్లు షేర్ చేసే డేటాను మీరు కంట్రోల్ చేయవచ్చు. ఆ ఆప్షన్ ను మీరు ఆన్ చేస్తే కంటెంట్ మీ ఫేస్ బుక్ లో డిస్ప్లే అవుతుంది. ఆ డేటా ను మీరు క్లియర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదే ఆప్షన్ ఆఫ్ చేస్తే ఆ డేటా ఫేస్బుక్లో కనిపించదు. అంతేకాదు ఏ కంపెనీకి చెందిన యాడ్స్ ఫేస్బుక్లో కనిపించాలన్నా, లేదా బ్లాక్ చేయాలన్నా అంతా మీ చేతిలోనే ఉంటుంది. దీంతో పాటు మీరు ఫేస్బుక్లో ఏ కంటెంట్‌ను ఎక్కువగా చూస్తున్నారో థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో తెలుసుకోవడం కష్టం. ఆఫ్-ఫేస్ బుక్ ఫీచర్ తో లాభం ఏంటి? ఫేస్బుక్ లో కొన్ని టూల్స్ ను వినియోగించి బిజినెస్ కు సంబంధించిన యాడ్స్, ప్రమోషన్, లేదంటే ఫేస్బుక్ యూజర్ వ్యక్తిగత డేటా తెలుసుకోవచ్చు. అయితే మీరు ఆఫ్ ఫేస్బుక్ టూల్ తో ఏఏ సంస్థలు మీకు బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. మరి ఈ టూల్ ను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం. (Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ!) ఆఫ్-ఫేస్ బుక్ టూల్ ను ఎలా యాక్టివ్ చేసుకోవాలి? • ముందుగా ఫేస్బుక్ సెట్టింగ్ అండ్ ప్రైవసీ ఆప్షన్ లోకి వెళ్లాలి. • ఆ తరువాత సెట్టింగ్ పై క్లిక్ చేయండి. • సెట్టింగ్ పై క్లిక్ చేసిన వెంటనే “యువర్ ఫేస్ బుక్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. • ఆ తరువాత ఆఫ్ ఫేస్బుక్ యాక్టివిటీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి మీరు మీ ఆఫ్ ఫేస్బుక్ టూల్ ని యూజ్ చేసి ఇక పై మీ ఫేస్బుక్లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలో డిసైడ్ చేయోచ్చు. అంతేకాదు మీరు ఫేస్బుక్ లో చూసిన కంటెంట్ హిస్టరీని డిలీట్ చేయోచ్చు. ఆఫ్ ఫేస్ బుక్ ఫీచర్ ను ఆపేస్తే ఏమవుతుంది? ఆఫ్ ఫేస్బుక్ ఫీచర్ ను ఆఫ్ చేస్తే వెబ్ సైట్లు, యాప్స్, ఇతర థర్డ్ పార్టీ టూల్స్ ఫేస్ బుక్ లో మీరు ఏ కంటెంట్ చూస్తున్నారో కనిపెట్టలేవు. ఫేస్బుక్ సైతం మీరు ఏం కంటెంట్ చూస్తున్నారో గుర్తించలేదు. దీంతో పాటు యాడ్స్ కూడా మీ ఫేస్ బుక్ లో డిస్ ప్లే కావు. (కావాలనుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు!) మీరు యాపిల్ సంస్థ డివైజెస్ ను వినియోగిస్తున్నారా? అయితే ఇటీవల యాపిల్ సంస్థ iOS 14.5 అప్ డేట్ ను విడుదల చేసింది. దీని సాయంతో ఫేస్ బుక్ లో మీ వ్యక్తిగత సమాచారాన్ని, లేదంటే డిస్ ప్లే అవుతున్న పలు కంపెనీల యాడ్స్ , మీరు చూసే కంటెంట్‌ను వ్యాపారం నిమిత్తం ఇతర కంపెనీలకు షేర్ చేయడం అసాధ్యం అవుతుంది. (Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!) -
చిన్న ఎస్ఎంఎస్తో ఆధార్ డేటాను రక్షించుకోండి
ప్రస్తుతం మన దేశంలో 5 ఏళ్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును కలిగి ఉండటం తప్పనిసరి. ఇది ఒక ఐడీ ప్రూఫ్ లాగా మాత్రమే కాకుండా, చిరునామా గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. విద్య, ఉద్యోగ, ప్రభుత్వ పథకాల కోసం ఈ కార్డు తీసుకోవడం తప్పనిసరి. అందుకే మన దేశంలో ఈ కార్డుకు ఉన్న మరే ఇతర కార్డుకు లేదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆధార్ నెంబర్ ఇతరులకు తెలిస్తే మీ వివరాలు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారు అసాంఘిక శక్తుల కోసం మీ నెంబర్ కోసం ఉపయోగిస్తే మీరు పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి ఫీచర్స్‌ని అందిస్తోంది. మీ ఆధార్ కార్డు ఎక్కడైనా పోతే మీరు వెంటనే మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేయొచ్చు. దీని ద్వారా ఎవరైనా మీ ఆధార్ నెంబర్‌ను ఎవరు ఉపయోగించలేరు. అలాగే లాక్ చేసిన ఆధార్‌ను ఆన్-లాక్ కూడా చేయవచ్చు. వీటి కోసం మీరు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ సహయంతో సులభంగా లాక్ చేయవచ్చు. మొదట మీరు మీ మొబైల్ నెంబర్ నుంచి GETOTPAadhaar NUMBER-last-4-digits టైపు చేసి 1947కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, తర్వాత మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని LOCKUIDAadhaar NUMBER-last 4-digitsOTP-6-digits అని టైపు చేసి మళ్లీ 1947కి మెసేజ్ చేస్తే మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఉదాహరణకు ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు 9123 అనుకుంటే GETOTP 9123 అని టైప్ చేయాల్సి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీ 012345 అనుకుంటే LOCKUID 9123 012345 ఈ ఫార్మాట్లో ఎస్ఎంఎస్ టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు. మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఇక మీ ఆధార్ నెంబర్‌ను ఆథెంటికేషన్ కోసం ఎవరూ వాడలేరు. అలాగే, ఆన్-లాక్ చేయాలంటే వర్చువల్ ఐడీ సహాయంతో చేయవచ్చు. చదవండి: కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే -
ఎయిర్ ఇండియా లో హ్యాకింగ్ కలకలం
-
ఎయిరిండియాలో భారీ సైబర్ అటాక్..
న్యూఢిల్లీ: ఎయిరిండియాలో భారీ సైబర్ అటాక్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పాసింజర్లకు సంబంధించి క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్ట్ డేటా హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన డేటా లీకైనట్లు ఎయిరిండియా వర్గాల సమాచారం. 2011 ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి 2021 వరకు డేటా హ్యాక్ అయినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. హ్యాక్ ఆయన డేటాలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సమాచారం ఉన్నట్లు సమాచారం. చదవండి: 18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ -
వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు
సాక్షి న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సెకండ్‌వేవ్‌లో ఉధృతి ఆందోళన కరంగా సాగుతోంది. ఎక్కడ చూసినా ఆసుపత్రులలో మందులు, బెడ్లు దొరకక, వెంటిలేటర్ల కొరతతో కరోనా రోగులు అల్లాడిపోతున్నారు. చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కరోనా ప్రభావిత రాష్ట్రాలు, డిల్లీ, మహారాష్ట పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కోవిడ్ టీకా తీసుకున్న తరువాత చోటు చేసుకుంటున్నఘటనలు, కొన్ని విషాదకర వార్తలతో అనేక భయాందోళలను నెలకొన్నాయి. దీంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలామంది వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంచలన డేటాను విడుదల చేసింది. టీకాలు వేసిన తరువాత ప్రజలు వ్యాధి బారిన పడుతున్నప్పటికీ, వ్యాధి తీవ్రంకాకుండా నిరోధిస్తుందని ఐసీంఆర్ డేటా తేల్చంది. అయితే కోవిడ్ టీకా తీసుకున్న తరువాత వైరస్ సోకుతున్న వారి నిష్పత్తి సామాన్య ప్రజలలో చాలా తక్కువగా ఉందని ఈ డేటా తెలిపింది. టీకా మొదటి లేదా రెండవ మోతాదు తీసుకున్న చాలా రోజుల తరువాత కోవిడ్ -19 బారిన పడిన వ్యక్తుల డేటాను ఐసిఎంఆర్ నిపుణుల బృందం వెల్లడించింది. (కరోనా సెకండ్ వేవ్ మోదీ మేడ్ డిజాస్టర్: దీదీ ఫైర్) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు 1.1 కోట్ల మందికి భారత్ బయోటెక్ కోవాక్సిన్ అందించారు. కోవాక్సిన్ రెండవ మోతాదు తీసుకున్న వారిలో దాదాపు 0.04 శాతం మంది కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. సుమారు 93 లక్షల మంది తమ మొదటి మోతాదును, సుమారు 17 లక్షల మంది రెండవ మోతాదును పొందారు. మొదటి మోతాదు పొందిన 93 లక్షలమందిలో 4,208 మందికి, రెండవ షాట్ తీసుకున్న 17 లక్షలలో, 695 మంది మాత్రమే కరోనా సోకిందన్నారు. అలాగే సీరం ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ రెండవ మోతాదు తీసుకున్న తరువాత పాజిటివ్ పరీక్షించిన వారి శాతం 0.03 శాతంగా ఉంది. దాదాపు 10 కోట్ల మంది కోవిషిల్డ్ మొదటి మోతాదును స్వీకరించగా వీరిలో 17,145 మంది తొలి డోసు తర్వాత 1.5 కోట్లకు పైగా ప్రజలకు రెండవ మోతాదు ను తీసుకోగా, వీరిలో, 5,014 మంది పాజిటివ్ పరీక్షించారు. కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించారు. పాజిటివ్ పరీక్షించే వ్యక్తుల నిష్పత్తి మొదటి మోతాదు తర్వాత 0.02 శాతం, రెండవ మోతాదు తర్వాత 0.03 శాతంగా ఉంది. అలాగే కరోనా టీకా తీసుకున్న తరువాత ప్రతి 10,000 జనాభాకు 2-4 మందికి మాత్రమే కోవిడ్-19 సోకుతోందనీ, ఆ తర్వాత వ్యాధి బారినపడే వారి శాతం చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె పాల్ అన్నారు. (కరోనా బారిన మరో కేంద్ర మంత్రి) కోవిషీల్డ్ 70 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉండగా, కోవాక్సిన్ తన 3 వ దశ ట్రయల్స్‌లో 81 శాతం మధ్యంతర సామర్థ్యాన్ని చూపించిందని వెల్లడించారు. రెండవ మోతాదు తీసుకున్న 10-15 రోజుల తరువాత మాత్రమే తగినంత యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని నిపుణులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపు 87 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు, 79 శాతం మంది ఫ్రంట్ లైన్ కార్మికులు తమ మొదటి మోతాదు కోవిడ్ -19 వ్యాక్సిన్లను స్వీకరించారని చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, బుధవారం ఉదయం నాటికి 130 మిలియన్ల టీకాలను అందించారు. (ఉన్నట్టుండి పేలిన ఫోన్, జనం హడల్: వైరల్ వీడియో) #IndiaFightsCorona: 📍Post Vaccination break through infection (As on 20th April, 2021). - DG, @ICMRDELHI #We4Vaccine #LargestVaccinationDrive #Unite2FightCorona pic.twitter.com/xMNpyfxyBb — #IndiaFightsCorona (@COVIDNewsByMIB) April 21, 2021 -
కొడితే సిక్సే.. సింగిల్స్ అసలు తీయరేమో
వాషింగ్టన్: జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. కొడితే సిక్సే కొట్టాలని బ్యాట్స్మెన్లు ఫిక్స్ అయ్యే రోజులు వస్తాయని, సింగిల్స్‌కు కాలం చెల్లే రోజులు దగ్గరలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బ్యాట్‌కు బంతికి మధ్య జరిగే పోటీని గణాంకాలు నడిపించనున్నాయని జోస్యం చెప్పాడు. ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలను గణాంకాలు ఎంతగానో ప్రభావితం చేస్తాయని, బేస్‌బాల్ తరహాలో క్రికెట్లో సైతం గణాంకాలే కీలమని ఆయన పేర్కొన్నాడు. క్రికెట్లో గణాంకాలపై నిర్వహించిన సదస్సులో ద్రవిడ్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్, ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి ఇషా గుహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ఆటగాళ్ల సాధన దగ్గర నుండి ఫిట్నెస్, బౌండరీలు, సిక్సర్లు లాంటి మరెన్నో అంశాల్లో డేటా చాలా ఉపయోగపడుతుందని వివరించాడు. బాస్కెట్ బాల్లోని 3 పాయింట్ రెవల్యూషన్ తరహాలోనే క్రికెట్లో కూడా డేటా ప్రయోజనాలుంటాయని స్పష్టం చేశారు. టీ20ల్లో ప్రతి బంతికీ ప్రాముఖ్యత ఉంటుందని, కొత్త కుర్రాళ్లు మెరుగైన సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యర్థి బలాబలాలను విశ్లేషించుకొని మరీ ప్రతిదాడి చేస్తున్నారని, ఇందుకు వారు డేటాను బాగా వినియోగించుకుంటున్నారని ఇషా గుహ తెలిపారు. క్రీడల్లో సందిగ్ధం నెలకొనప్పుడు డేటా ఎలా ఉపయోగపడుతోందో అన్న అంశాన్ని గ్యారీ కిర్‌స్టెన్ వివరించారు. చదవండి: ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.. -
వాహన విస్ఫోటం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వాహన విస్ఫోటం దిశగా సాగుతోంది. గత ఐదేళ్లలో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతూ ప్రస్తుతం గరిష్టస్థాయికి చేరుకుంది. తాజాగా రవాణా శాఖ ప్రభుత్వానికి సమర్పించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 1,37,47,534 వాహనాలున్నాయి.15 ఏళ్ల కింద రాష్ట్రంలో వాహనాల సంఖ్య కంటే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం లో 83 లక్షల కుటుంబాలు ఉండగా, వాహనాలు 1.37 కోట్లకు చేరాయి. ఈ సంఖ్య మరింత వేగంగా పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 9 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి చేరుతున్నాయి. కోవిడ్ వల్ల గత ఏడాది నుంచి ఆ సంఖ్య కొంత తగ్గగా, వచ్చే సంవత్సరం ఏకంగా 12 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపైకి వస్తాయని అంచనా. ఐదేళ్ల కిందట కోటి..సరిగ్గా ఐదేళ్ల కిందట రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటి మార్కును చేరింది. ఇప్పుడా సంఖ్య కోటిన్నరకు చేరువవుతోంది. మరో నాలుగేళ్లలో 2 కోట్లను మించుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం వాహనాల్లో బైక్‌ల వాటా ఏకంగా 74.25 శాతం. ప్రస్తుతం రాష్ట్రంలో 1.02 కోట్ల బైక్‌లు ఉన్నాయి. గతంలో గ్రామాల్లో ప్రతి ఇంట్లో సైకిల్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని బైక్ ఆక్రమించింది. హైదరాబాద్ సహా పట్టణాల్లో కచ్చితంగా ఇంటింటా బైక్ ఉండాల్సిందే. గతంలో పండ్లు, పూలు విక్రయించేవారు సైకిళ్లను వినియోగించేవారు. రెండేళ్ల నుంచి వారు మోపెడ్లను వినియోగించటం ప్రారంభించారు. కొన్ని మోపెడ్ తయారీ సంస్థలు వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నాయి. నెలకు 55 వేల బైక్‌లు.. ప్రతినెలా సగటున 55 వేల నుంచి 60 వేల వరకు బైక్‌లు అమ్ముడవుతున్నాయి. ఇక కార్ల కొనుగోలు కూడా బాగానే పెరిగింది. మధ్యతరగతి వారు ప్రస్తుతం కారును అవసరంగా భావించే పరిస్థితి వచ్చింది. లోన్ పద్ధతిలో కార్లను విక్రయిస్తున్నారు. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కార్ల తయారీ సంస్థలు తక్కువ ధరలో వచ్చే కార్ల మోడళ్లను పెద్ద సంఖ్యలో పవేశపెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యక్తిగత కార్ల సంఖ్య 17 లక్షలకు చేరువైంది. ప్రస్తుతం ప్రతి నెలా 12 వేల నుంచి 16 వేల వరకు కార్లు అమ్ముడవుతున్నాయి. కోవిడ్ కాలంలోనూ అదే తీరు.. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో చాలాకుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. కానీ వాహనాలు కొనే విషయంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. కరోనా వల్ల ఇతరులతో కలసి ప్రయాణించేందుకు భయపడ్డ జనం.. సొంత వాహనం ఉండాలన్న అభిప్రాయంతో వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపారు. లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్న 2 నెలలు కాకుండా.. మిగతా నెలల్లో వాహనాల కొనుగోలు భారీగానే సాగింది. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు కోవిడ్ భయం ఎక్కువగానే ఉంది. ఆ 7 నెలల్లో రాష్ట్రంలో 4,39,188 ద్విచక్రవాహనాలు అమ్ముడుపోయాయి. ఏడాది ముందు ఇదే సమయంలో 4.6 లక్షలు అమ్ముడయ్యాయి. 2019 నవంబర్‌లో రాష్ట్రంలో 72 వేల ద్విచక్రవాహనాలు అమ్ముడుపోగా, గత నవంబర్‌లో 75 వేలు విక్రయమయ్యాయి. 2019 డిసెంబర్లో 52 వేలు అమ్ముడైతే, గత డిసెంబరులో 53 వేలు అమ్ముడయ్యాయి. ఇక ఆ 7 నెలల్లో రాష్ట్రంలో 89,345 కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ సంఖ్య 89,837గా ఉంది. 2019 నవంబర్‌లో 12,045 కార్లు అమ్ముడుకాగా, గత నవంబర్‌లో 13,852 అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్లో 17,135 అమ్మితే, 2020 డిసెంబర్లో 17,506 విక్రయమయ్యాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 2019 సంవత్సరంతో పోలిస్తే ఎక్కువే వాహనాలు అమ్ముడవటం విశేషం. ఈ మూడు నెలల్లో సగటున నెలకు 75 వేల బైక్‌లు అమ్ముడు కాగా, కార్లు 18 వేల చొప్పున అమ్ముడయ్యాయి. ఉధృతంగా సెకండ్‌హ్యాండ్ వాహనాల విక్రయం.. సెకండ్‌హ్యాండ్ వాహనాల అమ్మకాలు గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. కోవిడ్ సమయంలో అల్పాదాయ వర్గాలు సెకండ్ హ్యాండ్ వాహనాల వైపు దృష్టి సారించారు. 2019లో జూలై నుంచి డిసెంబర్ వరకు 1.1 లక్షల బైక్‌లు చేతులు మారగా, 2020లో ఏకంగా 1,51,877 అమ్ముడయ్యాయి. కార్ల విషయంలో ఆ సంఖ్య 77 వేలు, 99,807గా ఉండటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో వాహనాల సంఖ్య ఇలా.. ద్విచక్ర వాహనాలు: 1,02,12,380 వ్యక్తిగత కార్లు: 16,69,490 మోటార్ క్యాబ్: 1,15,857 సరుకు రవాణా వాహనాలు: 5,45,653 ట్రాక్టర్, ట్రెయిలర్స్: 5,94,677 ఆటో రిక్షా: 4,41,135 స్టేజీ క్యారేజీ వాహనాలు: 18,462 విద్యాసంస్థల బస్సులు: 27,883 మ్యాక్సీ క్యాబ్: 31,070 కాంట్రాక్ట్ క్యారేజీ వాహనాలు: 9,063 ప్రైవేటు సర్వీస్ వెహికిల్స్: 2,942 ఈ–రిక్షా కార్ట్: 208 ఇతర వాహనాలు: 78,714 -
కీలక మైలురాయి చేరిన ఇస్రో
బెంగళూరు: కమ్యూనికేషన్ వ్యవస్థలో ఇస్రో మరో మైలురాయిని చేరింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తొలిసారిగా 300 మీటర్ల దూరంలో ఫ్రీ-స్పేస్ క్వాంటం కమ్యూనికేషన్‌ను విజయవంతంగా ప్రదర్శించిందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో క్వాంటం కమ్యూనికేషన్ రంగంలో గణనీయమైన కృషి చేసిన యూఎస్, యూకె, కెనడా, చైనా, జపాన్ వంటి ఇతర దేశాల సరసన భారతదేశం చేరింది. సాంకేతికంగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించడంలో భారత్ మరోసారి తన సత్తా చాటింది. క్వాంటం టెక్నాలజీని ఉపయోగించి ఉపగ్రహ డేటా లీక్ అవ్వకుండా సురక్షితంగా సమాచార వినిమయం జరపడంలో ప్రధాన మైలురాయి అని ఇస్రో తెలిపింది. స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. శాటిలైట్ బేస్డ్ క్వాంటం కమ్యూనికేషన్ (ఎస్బీక్యూసీ)ని ప్రదర్శించాలనే లక్ష్యంలో ఇస్రో ప్రధాన పురోగతి సాధించింది. అసలు ఏంటి ఈ క్యాంటం కమ్యూనికేషన్...? సాధారణంగా మనందరికీ తెలిసే ఉంటుంది. రెండు వ్యవస్ధల మధ్య డేటా కమ్యూనికేషన్ కోసం ఒక నిర్ధిష్టమైన పౌనపున్యాన్ని(బాండ్) ఉపయోగిస్తారు. ఈ సమయంలో మనం పంపించే డేటాలో ఏంతో కొంత లీక్ అవ్వవచ్చును. క్వాంటం కమ్యూనికేషన్స్‌లో క్వాంటం మెకానిక్స్ ఉపయోగించి సమాచార వినిమయం చేస్తారు. సమాచార వినిమయంలో భాగంగా రెండు వ్యవస్థల మధ్య డేటాను ట్విన్ ఫోటాన్ రూపంలో జరుపుతారు. ఈ విధంగా సమాచారాన్ని వినిమయం చేస్తే ఎలాంటి డేటా చౌర్యం జరగదు. క్వాంటం కీ- డిస్ట్రిబ్యూషన్ ఒక రహస్య కీని ఉత్పత్తి చేయడానికి, పంపిణీ చేయడానికి అనుమతిస్తుంది, ఇది సందేశాన్ని ఎన్‌క్రీప్ట్, లేదా డీక్రిప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి చాలా కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి. -
బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ : 2000 జీబీ డేటా
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. అధిక వేగం, భారీ డేటాను అందించే ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది. సూపర్ స్టార్ 2 ప్లాన్‌గా పిలిచే బ్రాడ్ బ్యాండ్ రూ . 949 ప్లాన్‌లో తాజాగా 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2000 జీబీ వరకు డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 10 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల ధర రూ .777 నుండి రూ .16999 వరకు ఉండగా ఎఫ్టిటిహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను మార్చి 31, 2021 వరకు ఉచితంగా ఇన్స్టాల్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ ప్లాన్లను మార్చి 1 న సవరించింది. ఇందులో హై స్పీడ్,అధిక డేటా అందిస్తోంది. ఈ కొన్నిప్లాన్ల రేటు మార్చలేదు కానీ పేర్లను మార్చింది. సూపర్ స్టార్ 2 ప్లాన్ అని కూడా పిలిచే ఈ ప్లాన్లు ఇలా ఉంటాయి. రూ .1000 లోపు ప్లాన్స్ రూ. 777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: దీన్ని ఇపుడు ‘ఫైబర్ టీబీ ప్లాన్‌గా మార్చింది. ఇందులో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ డేటా లభ్యం. రూ 779 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్‌ను ఎందుకు మార్చలేదో స్పష్టంగా తెలియదు. ఇది యథాతథంగా ఉంది. రూ 849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1500 జీబీ డేటా రూ .949 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2000 జీబీ డేటా రూ .2500 లోపు ప్లాన్స్ రూ .1277 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3300 జీబీ వరకు డేటా రూ. 1999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 4500జీబీ వరకు డేటా రూ .2499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 300ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5500 జీబీ వరకు డేటా టాప్-టైర్ ప్లాన్ల ధరలు రూ. 4499, రూ .5999, రూ .999, రూ .16,999గా ఉంటాయి. ఇందులో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 6500, 8000, 12000, 21000 జీబీ వరకు డేటా అందిస్తుంది. -
ఉద్యోగాలు తిరిగొస్తున్నాయ్!
సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి పథకం(ఈపీఎఫ్)లో 2020 డిసెంబర్లో కొత్తగా 12.53 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2020 నవంబర్‌లో కొత్త సభ్యులు 8.70 లక్షల మందితో పోలిస్తే 40 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2017 సెప్టెంబర్ నుంచి 2020 డిసెంబర్ వరకు ఈపీఎఫ్ పథకంలో 3.94 కోట్ల మంది సభ్యులుగా నమోదైనట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అదే విధంగా కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ)లోకి 2020 డిసెంబర్ నెలలో 12.06 లక్షల మంది నూతన సభ్యులుగా నమోదయ్యారు. అంతకుముందు నెలలో (2020 నవంబర్) సభ్యుల నమోదు 9.48 లక్షలతో పోలిస్తే పెరిగింది. 2017 సెప్టెంబర్ నుంచి 2020 డిసెంబర్ వరకు ఈఎస్ఐసీలో 4.63 లక్షల మంది కొత్తగా చేరినట్టు ఎన్ఎస్వో నివేదిక తెలియజేసింది. ఈపీఎఫ్‌తో పాటు పలు సామాజిక భద్రతా పథకాల్లో నూతన సభ్యుల నమోదు గణాంకాల ఆధారంగా ఎన్ఎస్వో ఈ నివేదికను రూపొందించింది. 2018 ఏప్రిల్ నుంచి ఎన్ఎస్వో వివరాలను విడుదల చేస్తూ వస్తోంది.(రిటైల్ రుణ గ్రహీతలకు కష్ట కాలమే!) -
ఫేస్బుక్ యూజర్లకు షాకింగ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. 500 మిలియన్లకు పైగా వినియోగదారుల ఫోన్ నంబర్లు ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో బోట్ ద్వారా అమ్ముడవుతున్నాయి. ఇది 2019 లో ఫేస్బుక్లో లీక్ అయిన ఒక పాచ్ ద్వారా విషయం వెలుగులోకి వచ్చినట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వినియోగదారుల గోప్యత, సెక్యూరిటీపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మదర్‌బోర్డులోని ఒక నివేదిక ప్రకారం, 533 మిలియన్ యూజర్ల ఫోన్ నంబర్లు బహిర్గతమైనాయి. ఇందులో సుమారు 6 లక్షల మంది భారతీయ వినియోగదారుల మొబైల్ నెంబర్లు చోరీకి గురయ్యాయి. యూజర్‌కు చెందిన ఒక్కో ఫోన్ నంబర్ 20 డాలర్ల చొప్పున అమ్ముడు పోయింది. ఆటోమేటెడ్ టెలిగ్రామ్ బాట్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఫోన్ నెంబర్ల విక్రయిస్తున్నట్టు మదర్‌బోర్డు రిపోర్ట్ చేసింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అలోన్ గాల్ దీనికి సంబందించిన సమాచారంపై అప్రమత్తం చేశారని నివేదిక తెలిపింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాలకు ఫేస్బుక్ వినియోగదారులు ప్రభావితమయ్యారని అలోన్ వెల్లడించారు. బల్క్‌గా 10,000 నెంబర్లకుగాను 5,000 డాలర్లకు విక్రయిస్తున్నారన్నారు. ఈ డేటా బేస్ విక్రయం చాలా అందోళన కలిగించే పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఆయన షేర్ చేశారు. డేటా కొంచెం పాతదే అయినప్పటికీ, ఇప్పటికే ఫోన్ నంబర్లు చోరీ అయినవారి సైబర్ సెక్యూరిటీ , గోప్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే యూజర్లు తమ ఫోన్ నంబర్లను చాలా అరుదుగా మారుస్తారనీ, సాధారణంగా రెండు లేదా మూడు సంవత్సరాల వ్యవధిలో మార్చే అవకాశం లేదని ఆయన గుర్తుచేశారు. మరోవైపు అటు ఫేస్బుక్ గానీ, ఇటు టెలిగ్రామ్ గానీ ఈ నివేదికపై అధికారికంగా ఇంకా స్పందించలేదు. కాగా వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ విధానంపై యూజర్లు మండిపడున్నారు. మరోవైపు వాట్సాప్, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌ను దేశంలో నిషేధించాలని కోరుతూ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా సీఏఐటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో పలు దేశాలు అమలు చేస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. వినియోగదారుల డేటా విక్రయంపై ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు తాజా పరిణామంతో మరిన్ని చిక్కులు తప్పవు. In early 2020 a vulnerability that enabled seeing the phone number linked to every Facebook account was exploited, creating a database containing the information 533m users across all countries. It was severely under-reported and today the database became much more worrisome 1/2 pic.twitter.com/ryQ5HuF1Cm — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) January 14, 2021 -
ఆన్లైన్.. ప్రతీక్షణం లక్షల పోస్టులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావిత మయ్యాయి. అదేసమయంలో డేటా వినియోగం అనివార్యంగా మారింది. 2020 ఏప్రిల్ తరువాత.. కోవిడ్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ఇంటర్నెట్ ఆధారిత సేవలను అనివార్యం చేసింది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వైద్యం, ఆర్థిక, సామాజిక రంగాలన్నీ ఇంటర్నెట్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 15%లోపు ప్రజలు వర్క్‌ఫ్రమ్ హోం చేసేవారు. కానీ, లాక్డౌన్ దెబ్బకు ఇది 50% దాటింది. ఇక రోజువారీ జీవితంలోనూ యాప్స్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. ఆన్ లైన్ కొనుగోళ్లు, నగదు చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు, షాపింగ్, బుకింగ్స్, వినోదం, సందేశం, సంగీతం, సంప్రదింపులు, సమావేశాలు, శిక్షణ ఇలా ప్రతీది డేటా ఆధారంగానే నడుస్తున్నాయి. ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో టైం జోన్ ఉంటుంది. మనకు పగలైతే, మరో దేశంలో రాత్రి. డేటా ఆధారిత సేవలు పెరిగిపోతుండటంతో మనుషులు నిద్రపోయినా.. డేటా మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ప్రతీ సెకనుకు అనేక లక్షల ఆర్డర్లు, క్లిక్స్, అప్లోడ్సే నిదర్శనం. లాక్డౌన్ తర్వాత డేటా వినియోగం ఎలా పెరిగిందో డోమో అనే అమెరికాకు చెందిన క్లౌడ్ సంస్థ అధ్యయనం చేసింది. డేటా నెవ ర్ స్లీప్స్ 8.0 పేరిట తన తాజా అధ్యయనం ఫలితాలను విడుదల చేసింది. ప్రతీ నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అప్లోడ్స్ జూమ్ మీటింగులు : 2,08,333 ఫేస్బుక్ అప్లోడ్స్ : 1,47,000 వాట్సాప్ షేర్లు : 4,16,66,667 మొబైల్ యాప్‌ల కోసం వెచ్చించిన మొత్తం : 3805 యూఎస్ డాలర్లు వీడియోకాల్స్ : 13,88,889 అమెజాన్ ఆర్డర్లు : 6,659 ఇన్స్టాగ్రామ్ 1,38,889 స్పాటిఫై : 28 మ్యూజిక్ ట్రాకులు టిక్‌టాక్ డౌన్లోడ్స్ : 2,704 లింక్డ్ఇన్ దరఖాస్తులు : 69,444 ఫేస్బుక్లో షేర్లు : 1,50,000 మైక్రోసాఫ్ట్ టీమ్ వినియోగం : 52,083 ఆన్లైన్లో వినియోగదారులు వెచ్చించిన మొత్తం : 10,00,000 అమెరికా డాలర్లు ట్విట్టర్ కొత్త వినియోగదారులు : 319 మంది యూట్యూబ్ అప్లోడ్స్ : 500 గంటలు ఇన్స్టాగ్రామ్ పోస్టులు : 3,47,222 నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన వీడియోలు : 4,04,444 గంటలు 457 కోట్లకు చేరిన వినియోగదారులు.. ఏటేటా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండగా...అదికాస్తా లాక్‌డౌన్‌తో మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 59% మంది అంటే 457 కోట్ల మంది డేటా ఆధారిత సేవలు పొందుతున్నారు. 2019 జనవరితో పోలిస్తే డేటా వినియోగంలో 6% వినియోగం పెరిగిందని ‘డోమో’తెలిపింది. సంవత్సరం డేటా వినియోగదారులు కోట్లలో 2014 300 కోట్లు 2016 340 కోట్లు 2018 430 కోట్లు 2020 450 కోట్లు -
ఓటర్ల డేటా సేఫ్
సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల డేటా లీకైందని పలు రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ తోసిపుచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారం, అనవసరంగా ప్రజల మెదళ్లలో అనుమానాలు రేకెత్తించడానికి చేసిన ఆకతాయి చర్యేనని కొట్టిపారేశారు. తన కార్యాలయం నుంచి ఏ డేటా లీక్ కాలేదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లలో డేటాను సురక్షితంగా భద్రపరిచామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో అంతర్గత అధ్యయనం నిర్వహించామని, ఎక్కడా డేటా బ్రీచ్ జరగలేదని తేలిందన్నారు. పట్టభద్రుల ఓటర్ల డేటా లీకు వివాదంపై బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివాదానికి కారణమేంటి? ‘మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో మీరు చోటు సంపాదించారని తెలపడానికి నేను చాలా సంతోషిస్తున్నా.. మెరు గైన సమాజం కోసం పనిచేయడానికి నాకు మీరు మరోసారి అవకాశం, దీవెనలు అందించాలి’అని పేర్కొంటూ బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు ఓటర్లకు ఎస్ఎంఎస్లు పంపడంవివాదాస్పదమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ల చిరునామా, ఫోన్ నంబర్లుండవు. ఓటరు నమోదులో భాగంగా దరఖాస్తుదారుల నుంచి ఎన్నికల సంఘం ఫోన్ నంబర్లు, చిరునామాలు స్వీకరించింది. ఎన్నికల సంఘం నుంచి ఓటర్ల డేటా లీకైందని ఆరోపిస్తూ పలు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌తో పాటు సీఈఓ కార్యాలయానికి ఫిర్యాదులు చేశాయి. ఈసీ అనుమతిస్తే ఇస్తాం..: శశాంక్ గోయల్ ‘కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా/తుది జాబితాల్లో ఓటర్ల చిరునామాలుండవు. అయితే, ముసాయిదా జాబితాలోని ఓటర్లలో ఎంత మంది నిజమైన ఓటర్లున్నారు? ఎంత మంది బోగస్ ఓటర్లున్నారు? అని క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపడానికి వారి చిరునామాలు ఇవ్వాలని కొన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను నేరుగా కలుసుకోవడానికి, సందేశాలు పంపడానికి వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని మరికొన్ని పార్టీలు సైతం కోరాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తే రాజకీయ పార్టీలకు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తాం. లేకుంటే లేదు. ఓటర్ల జాబితా ఫార్మాట్ మార్చి చిరునామా సైతం పొందుపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటేనే ఓటర్ల జాబితాలో చిరునామాలు పెట్టగలం. లేకుంటే లేదు..’అని శశాంక్ గోయల్ పేర్కొన్నారు. అందులో రహస్యం ఏమీ లేదు.. ‘ఎస్ఎంఎస్లు అందరూ పంపుతారు. ఇందులో తప్పేముంది. ఎన్నికల సంఘంతో దీనికి ఏ సంబంధం లేదు. దీనిపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చారు. ఇందులో కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ద్వారా సీఈఓ వెబ్సైట్ నుంచి ఓటర్ల చిరునామాలు తీసుకున్నాం. జాబితా ఇస్తే మొత్తం సమాచారాన్ని ఇచ్చే ప్రైవేటు సంస్థలు సైతం ఉన్నాయి’ – ఎన్.రాంచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్సీ -
వలసలపై డేటా భేష్!
దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికెళ్లే వలస కార్మికులు, ఇతరుల డేటా రూపొందించడానికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సంకల్పించడం మంచి పరిణామం. ఈ డేటా రూప కల్పన కోసం ఇతర మంత్రిత్వ శాఖల సహాయసహకారాలు తీసుకోవాలని కార్మిక శాఖ నిర్ణయిం చింది. వచ్చే జూన్‌కు డేటా సిద్ధమవుతుందని చెబుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభుత్వా లకూ, పౌరులకూ చాలా గుణపాఠాలు నేర్పింది. వలస వచ్చేవారి విషయంలో ఖచ్చితమైన డేటా వుండాలని అంతక్రితం ఏ ప్రభుత్వమూ అనుకోలేదు. కానీ లాక్డౌన్ అమలు ప్రారంభించాక ఆ వివరాలు లేకపోవడం ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో అనుభవపూర్వకంగా అర్థమైంది. వలస కార్మికుల్లో అత్యధికులు అసంఘటిత రంగంలో వుంటారు. లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించి, రవాణా సౌకర్యాలు నిలిపేయడంతో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికులను, కూలీలను పనిలో పెట్టుకున్నవారే లాక్డౌన్ ఎత్తేసేవరకూ వారి బాగోగులు పట్టించుకోవాలని కేంద్రం సూచిం చినా కొద్దిమంది మినహా అత్యధికులు పట్టించుకోలేదు. పైగా వారికి ఇవ్వాల్సిన బకాయిలు ఎగ్గొట్టిన ఘనులు కూడా వున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన సాయమైనా, ఇటు స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయమైనా అందనివారెందరో వున్నారు. ఉన్నచోటే వుంటే ఆకలిదప్పులతో చనిపోవడం ఖాయమన్న నిర్ణయానికొచ్చినవారు కుటుంబాలతో సహా స్వస్థలాలకు నడక మొదలుపెట్టారు. అలా వెళ్లినవారి సంఖ్య కోటి పైమాటేనని కార్మిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఉపాధి హామీ, ఒకే దేశం–ఒకే రేషన్‌వంటి పథకాల కోసం... ఈపీఎఫ్, ఈఎస్ఐ తదితర ప్రయోజనాలు వర్తింపజేయడానికి డేటా సేకరిస్తారు. అలాగే ఆధార్ డేటా సరేసరి. ఇలా భిన్న రంగాలకు చెందిన ప్రభుత్వ విభాగాలు సేకరించే డేటాను సమన్వయపరిస్తే అది కొంతవరకూ ఉపయోగపడొచ్చు. అలాగే ఒక రాష్ట్రం నుంచి వేరేచోట్లకు వెళ్లేవారు రిజిస్టర్ చేసుకోవడానికి అనువైన విధానాన్ని రూపకల్పన చేయాలి. మన దేశంలో వలస కార్మికులు ఎంతమంది వుంటారన్న విషయంలో స్పష్టమైన గణాంకాలు లేవు. వలస కార్మికుల సంఖ్య 45 కోట్ల వరకూ వుండొచ్చని 2011 జనాభా లెక్కలు తేల్చాయి. మన దేశంలో ఏటా సగటున 4.5 శాతం మేర అంతర్గత వలసలు పెరుగుతుంటాయని ప్రపంచ ఆర్థిక ఫోరం నివేదిక అంచనా వేసింది. ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచే వేరే రాష్ట్రాలకు వలసలుంటాయి. వీరంతా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలకు వెళ్తుంటారని 2017నాటి ఆర్థిక సర్వే తెలిపింది. తాము వున్నచోట ఉపాధి లేకపోవడం, తక్కువ వేతనాలు లభించడం, కరువుకాటకాలు తలెత్తటం, మెరు గైన వైద్య సౌకర్యాలు కొరవడటం, శాంతిభద్రతలు లేకపోవటం వగైరా సమస్యల వల్ల చాలామంది వలసపోవడానికి సిద్ధపడతారు. తమ ప్రాంతం, భాష కానిచోట మనుగడ సాగించడం కష్టమని తెలిసినా వారికి అంతకన్నా గత్యంతరం వుండదు. కుటుంబాల్లోని పిల్లలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు లభించాలంటే... కనీసం బ్యాంకు ఖాతా ప్రారంభించాలంటే ఏదో రకమైన గుర్తింపు కార్డు వుండాలి. చాలా సందర్భాల్లో అది అసాధ్యమవుతుంది. దేశంలోని వలస కార్మికుల్లో 22 శాతంమందికి ఎలాంటి గుర్తింపు కార్డు వుండదని 2011లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. భాష రాకపోవటం వల్ల, స్థానికులు కాకపోవటం వల్ల వారికి పనులు చూపించే దళారులు వలస కార్మికులను నిలువుదోపిడీ చేస్తుంటారు. మెరుగైన వేతనాలు, ఇతరత్రా ప్రయోజనాలు రాబట్టు కోవటం వలస కార్మికులకు సులభం కాదు. పనిచేసేచోట సమస్యలేర్పడితే వారిని ఆదుకునే వారుండరు. వలస కార్మికులు సృష్టించే సంపద తక్కువేమీ కాదు. మహా నగరాల్లో ఆకాశాన్నంటే భవంతుల నిర్మాణం మొదలుకొని చిన్న చిన్న పారిశుద్ధ్య పనుల వరకూ అన్నింటా వారి ప్రమేయం వుంటుంది. అయినా ఇన్ని దశాబ్దాలుగా వారికి సంబంధించిన సమగ్రమైన డేటా ప్రభుత్వాల దగ్గర లేదు. ఇది వలస కార్మికులకు, కూలీలకు మాత్రమే కాదు... ప్రభుత్వాలకు సైతం సమస్యే. ఏ ప్రాంతంలో జనాభా సాంద్రత ఎంతవుందో నిర్దిష్టమైన అంచనా కొరవడటంతో మంచినీరు, డ్రయి నేజ్ వంటి సౌకర్యాల అమలు తలకిందులవుతుంది. వారికి సరైన వేతనాలు లభిస్తున్నాయో లేదో, వారి సంక్షేమానికి ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలేమిటో నిర్ధారించుకోవడం అసాధ్యమవుతుంది. వలస కార్మికులకు కూడా కార్మిక చట్టాలు వర్తిస్తాయి. వాటికింద నిర్దిష్టమైన పనిగంటలు, వేతనం, ఇతర భత్యాలు అందాలి. అలాగే వారికి తగిన ఆవాసం, వైద్య సౌకర్యాలు కల్పించాలి. అనుకోని ప్రమాదం సంభవించినా, ఉన్నట్టుండి పని నుంచి తొలగించినా, మరెలాంటి సమస్య తలెత్తినా ఫిర్యాదు చేసే హక్కు వారికుంటుంది. వలస కార్మికుల ఉపాధి, పని పరిస్థితుల క్రమబద్ధీకరణ కోసమంటూ 1979లో చట్టం తీసుకొచ్చారు. దానికి మరింత పదును పెడుతూ 2011లో సవరణలు చేశారు. ఆ చట్టంకింద అయిదుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది ఇతర రాష్ట్రాలవారిని పనిలో పెట్టుకునే కాంట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అలాగే వలస కార్మికులకు సంబంధించిన రిజిస్టర్ నిర్వహిస్తూండాలి. కానీ ఈ చట్ట నిబంధనలు ఎలా అమలవుతున్నాయో చూసేవారు కరువయ్యారు. అందుకే లాక్డౌన్ అనంతర పరిస్థితులపై ప్రభుత్వాలకు అంచనా లేకుండా పోయింది. ఇప్పుడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా సేకరణకు నడుం కట్టింది గనుక అలాంటి సమస్యలు తీరుతాయని ఆశించాలి. వలస కార్మికుల సామాజిక భద్రతకు, సంక్షేమానికి తగిన చర్యలు తీసుకొనేందుకు ఈ డేటా తోడ్పడాలి. అలాగే వలస కార్మికులకు సంబంధించిన నిర్వ చనం అన్ని చట్టాల్లోనూ ఒకేలా లేదు. ఆ లోపాన్ని కూడా సరిచేయాలి. డేటా ఆధారంగా గుర్తింపు కార్డులు జారీచేసి, వలస కార్మికులకు సకల ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకొచ్చేలా చర్యలు తీసుకోవాలి. -
కోవిడ్, సైబర్ దాడులు, సమాచార మోసాలు..
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్, సైబర్ దాడులు, సమాచార మోసాలు ప్రధాన ముప్పుగా భారత కంపెనీలు భావిస్తున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అంతర్జాతీయ ఇన్సూరెన్స్ బ్రోకర్ మార్స, రిస్క్ మేనేజ్మెంట్ సొసైటీ రిమ్స్ చేపట్టిన ఈ అధ్యయనంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు, సీనియర్ రిస్క్ నిపుణులు 231మంది పాలుపంచుకున్నారు. అధ్యయనం ప్రకారం.. సాధారణ స్థితికి చేరుకోవడంతోపాటు మహమ్మారి కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కోగలమన్న గొప్ప ఆశావాదం కంపెనీల్లో ఉంది. సైబర్ దాడులు, సమాచార మోసాలు భారత్‌లో రిస్క్ ప్రొఫెషనల్స్ ముందున్న ప్రధాన ఆందోళన. 63 శాతం మంది కోవిడ్, 56 శాతం సైబర్ దాడులు, 36 శాతం సమాచార మోసాలు, దొంగతనం, 33 శాతం అత్యవసర మౌలిక వసతుల విఫలం, 31 శాతం ఆర్థిక సంక్షోభం, 25 శాతం మంది తీవ్రమైన వాతావరణ సంఘటనలు ప్రధాన ముప్పుగా తెలిపారు. మహమ్మారి కారణంగా కార్యాలయం వెలుపల పని చేయడం తప్పనిసరి అయిందని, దీంతో సైబర్ దాడులకు గురయ్యే అవకాశాలు పెరిగాయని 85 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్
దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. యూజర్లకు ఉచితంగా 11జీబీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎయిర్టెల్ కొత్త 4జీ కస్టమర్లకు లేదా 4జీకి అప్‌గ్రేడ్ అయ్యే వినియోగదారులకు డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది. (చదవండి: సోషల్ మీడియాలో ఇలాంటివి పోస్ట్ చేయకండి) టెలికాం దిగ్గజం కొత్త ఎయిర్టెల్ 4జీ కస్టమర్లకు అందించే 5 జీబీ ఉచిత డేటాను పొందాలంటే యూజర్లు ‘ఎయిర్టెల్ థాంక్స్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎయిర్టెల్ కొత్త 4జీ కొనుగోలు చేసిన లేదా 4జీకి అప్ గ్రేడ్ అయ్యి ఉంటే, మీరు మీ కొత్త మొబైల్ నంబర్‌తో ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ప్రీపెయిడ్ ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిర్టెల్ 5 జీబీ ఉచిత డేటాను1 జీబీ కూపన్ల రూపంలో అందిస్తోంది. ఈ డేటా అనేది 72 గంటల్లో కొత్త 4జీ కస్టమర్ ఖాతాకు ఈ డేటా జమ అవుతుంది. ఉచిత 5జీబీ డేటాను పొందడానికి మీరు కొత్త మొబైల్ నంబర్‌ను యాక్టివేట్ చేసిన 30 రోజుల్లోపు ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఐదు కూపన్లు వస్తే యాప్‌లోని మై కూపన్స్ సెక్షన్‌కు వెళ్లి వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1జీబీ డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్ అయిన 90 రోజుల్లోగా రిడీమ్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోకుంటే 5జీబీ డేటాకు బదులు 2జీబీ డేటా వస్తుంది. అలాగే ఎయిర్టెల్ తన వినియోగదారులు ఎవరైతే అన్లిమిటెడ్ ప్యాకేజీని తీసుకుంటారో వారికీ ఉచితంగా 6జీబీ డేటా వరకు అందిస్తుంది. 84 రోజుల కాలపరిమితితో రూ.598 అంతకంటే ఎక్కువ మొత్తం ప్యాకేజీని ఎంచుకునే కస్టమర్లకు 6జీబీ డేటాని ఉచితంగా ఇస్తుంది. ఇది కూడా ఒకే సారి లభించదు. ఈ 6జీబీ డేటా కూడా కూపన్ల రూపంలో వస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇటీవల కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ తాజాగా డేటా రోల్ఓవర్ సదుపాయంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లందించే కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డిసెంబర్ 1, 2020 నుంచి దేశవ్యాప్తంగా వీటిని లాంచ్ చేయనున్నామని తెలిపింది. రూ.199 రూ .798, 999 రూపాయల ధరతో మూడు కొత్త ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ తీసుకురాబోతోంది. ఈ ప్లాన్లలో అపరిమిత కాలింగ్, డేటా, డేటా రోల్ ఓవర్, ఫ్యామిలీ యాడ్-ఆన్ లాంటి ప్రయోజనాలు అందించనుంది ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో పాటు, బీఎస్ఎన్ఎల్ రెండు యాడ్-ఆన్ ప్లాన్లను రూ .150 రూ.250 లకు తీసుకొస్తోంది. ఇవి వరుసగా 40 జీబీ డేటా 70 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నాయి. రూ 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: 300 నిమిషాల ఉచిత ఆఫ్-నెట్ కాల్లతో అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 75 జీబీ వరకు రోల్ఓవర్ ప్రయోజనాలతో 25 జీబీ డేటాను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్ కూడా ఇస్తుంది. యాడ్ ఆన్ ఫ్యామిలీ సదుపాయం లేదు. రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ సదుపాయం.150 జీబీ వరకు రోల్ఓవర్ ప్రయోజనాలతో 50 జీబీ డేటాను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్ సదుపాయం.అలాగే ఇద్దరుకుటుంబ సభ్యులకు ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా ఇస్తుంది. ఈ యాడ్-ఆన్‌లో అపరిమిత వాయిస్ సౌకర్యం, 50 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రోల్ఓవర్ ప్రయోజనాలతో 75 జీబీ డేటాను 225 జీబీ వరకు ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్లు, 3 ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా ఇస్తుంది. ఇందులో రోజుకు అపరిమిత వాయిస్ సౌకర్యం, 75 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభ్యం. -
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. పలు గ్రూపులు, వ్యక్తుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న మెసేజ్‌లను, ఫోటోలను, వీడియోలు తదితర కంటెంట్‌ను డిలీట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్లంకదా. తాజాగా ఇలాంటి జంక్ మోసేజెస్ను సులువుగా తొలగించేందుకు వీలుగా ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు తమ ఫోన్లలో స్టోరేజ్ డాటాను పెంచుకోవచ్చని వాట్సాప్ వెల్లడించింది. వినియోగదారులకు ఉపయోగపడే విదంగా స్టోర్ మేనేజ్మెంట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తద్వారా పలుసార్లు ఫార్వార్డ్ చేసిన, అనవసరమైన వీడియోలను, ఫొటోలను క్లీన్ చేసుకునేందుకు మరింత సులభం తొలగించుకోవచ్చు. 5ఎంబీ కంటే ఎక్కువ సైజులో ఉన్న ఫైలును గుర్తిస్తుంది. పరిమాణంలో ఫైల్ సైజ్‌ను బట్టి విడివిడిగా చూపిస్తుందని, దాని ద్వారా అవసరమైన వాటిని, అనవసరమైన వాటిని వినియోగదారులు త్వరగా గుర్తించగలుగుతారని సంస్థ చెప్పింది. అంతేకాకుండా ఒకటి లేదా చాలా వాటిని డిలీట్ చేయడానికి ముందు ఒకసారి చూసుకునే వెసులుబాటును కల్పిస్తుందని అన్నారు. అయితే ఈ ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ఈ వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజి అండ్ డేటాలో ఈ ఫీచర్ కనిపిస్తుందని సంస్థ తెలిపింది. ఇప్పటివరకూ వాట్సాప్ ‘స్టోరేజ్ యూసేజ్’ విభాగం కింద చాట్లు కనిపించేవి. తాజా ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఇంటర్ఫేస్మీద ఒక బార్మీద కనిపిస్తుంది. ఇందులో మీడియా కంటెంట్ ద్వారా ఎంత స్టోరేజ్ వినియోగించాం అనేది చూపిస్తుంది. అలాగే చాలాసార్లు ఫార్వార్డ్ చేయబడిన మీడియా ఫైళ్ళను ప్రత్యేకంగా చూపిస్తుంది. దీంతో అలాంటి ఫైళ్ళను సులభంగా గుర్తించి డిలీట్ చేయడానికి సహాయపడుతుంది. -
ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఎన్డీఏ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్’ అంటూ ఎద్దేవా చేశారు. వలస కార్మికులు, రైతు ఆత్మహత్యలు, కోవిడ్ -19, ఆర్థిక వ్యవస్థపై డాటా లేదు అంటూ శశిథరూర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. (చదవండి: అవి రైతుల పాలిట మరణ శాసనాలే!) ఈ మేరకు ‘ది నేమ్ ఛేంజర్స్’ అనే కార్టూన్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు థరూర్. దీనిలో మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షాలు ‘నో డాటా అవైలబుల్’ అనే ప్లకార్డులు పట్టుకున్నట్లు ఉన్న కార్టూన్ని ట్వీట్ చేశారు. దాంతో పాటు ‘వలస కార్మికులకు సంబంధించి నో డాటా.. రైతు ఆత్మహత్యల గురించి నో డాటా..ఆర్థిక ఉద్దీపనపై తప్పుడు డాటా, కోవిడ్ -19 మరణాలపై సందేహాస్పద డాటా, జీడీపీ వృద్ధిపై మేఘావృత డాటా. ఈ ప్రభుత్వం ఎన్డీఏ అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుంది’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్) No #data on migrant workers, no data on farmer suicides, wrong data on fiscal stimulus, dubious data on #Covid deaths, cloudy data on GDP growth — this Government gives a whole new meaning to the term #NDA! pic.twitter.com/SDl0z4Hima — Shashi Tharoor (@ShashiTharoor) September 22, 2020 వ్యవసాయ రంగంలో సంభవించే ఆత్మహత్యలు, అందుకు గల కారణాలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎలాంటి డాటా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో శశి థరూర్ ఈ ట్వీట్ చేశారు. అంతేకాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి డాటా లేదని నివేదించాయని తెలిపారు. ఈ పరిమితి కారణంగా, వ్యవసాయ రంగంలో ఆత్మహత్యకు గల కారణాలపై జాతీయ సమాచారం ఆమోదించడం కానీ విడిగా ప్రచురించడం కానీ జరగలేదు’ అని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో మరణించిన వలసదారుల సంఖ్యపై తమ దగ్గర ఎలాటి డాటా లేదని గతంలో పార్లమెంటులో ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్ : జీ5 ప్రీమియం ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. 289 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను మళ్లీ లాంచ్ చేసింది. ఇందులో రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటాను అందివ్వనుంది. అపరిమిత కాలింగ్ సదుపాయాన్నిఅందిస్తున్న ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. దీంతో పాటు 28 రోజుల పాటు జీ5 ప్రీమియం సభ్యతాన్ని ఉచితంగా అందించనుంది. (జియోమీట్‌కు పోటీ :ఎయిర్టెల్ త్వరలోనే) 289 రూపాయల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జి చేసే వినియోగదారులకు జీ 5 ప్రీమియంతోపాటు, అపరిమిత లోకల్, ఎస్టిడి, రోమింగ్ కాల్స్ ఉచితం. రోజుకు 1.5జీబీ హై-స్పీడ్ డైలీ డేటా రోజుకు 100 ఎస్ఎంఎస్ సందేశాలు 28 రోజులు పాటు లభిస్తాయి. అలాగే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం చందాతో 400 కి పైగా లైవ్ టివి ఛానెల్స్ ను ఎంజాయ్ చేయవచ్చు. షా అకాడమీ ద్వారా వింక్ మ్యూజిక్ యాక్సెస్, ఉచిత ఆన్లైన్ కోర్సులు కూడా లభ్యం. అలాగే 79 టాప్-అప్ వోచర్ ను ఎయిర్టెల్ తీసుకొచ్చింది. దీని ద్వారా జీ 5 ప్రీమియం సభ్యత్వాన్ని 30 రోజుల పాటు అందివ్వనుంది. కాగా 2018 లో, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు ఒక జీబీ డేటాతో 289 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 48 రోజుల పాటు చెల్లుబాటయ్యేలా ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. అదే పీపెయిడ్ ప్లాన్ ను తాజా ప్రయోజనాలతో తీసుకొచ్చింది. -
ఆరోగ్య సేతు: మీ అకౌంట్ డిలీట్ చేయాలా..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం తీసుకు వచ్చిన ఆరోగ్య సేతు యాప్‌లో వినియోగదారులు తమ అకౌంట్‌ను తొలగించేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. అంతేగాక ఆరోగ్య సేతు యాప్‌లో వినియోగదారుని మొత్తం డేటాను కూడా డిలీట్ చేసేందుకు అనుమతిచ్చింది. అకౌంట్ డిలీట్ చేసిన 30 రోజులకు యాప్ నుంచి డేటా తొలగించడతుంది. అయితే అకౌంట్‌ను తొలగించడం వలన కేవలం ఫోన్ నుంచి మాత్రమే డేటా డిలీట్ అవుతుంది. ఇది ప్రభుత్వ సర్వర్ల నుంచి తీసివేసే వరకు వేచి ఉండాల్సిందే. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత యాజమానులకు) కాగా ఆరోగ్య సేతులో వినియోగదారుడు తనకు కరోనా సోకిందా అన్న విషయంతోపాటు చుట్టుపక్కల కరోనా రోగి ఉన్నట్లయితే ఆ విషయాన్ని కూడా తెలుసుకునేందుకు దోహదపడుతుంది. జీపీఎస్, బ్లూటూత్‌లో రూపొందించిన ఈ కరోనా ట్రాకింగ్ యాప్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇటీవల బ్లూటూత్ కాంటాక్ట్స్ ఆధారంగా ప్రమాద స్థాయిని అంచనా వేసే లక్షణాన్ని కూడా ఆరోగ్యా సేతు డెవలపర్లు పొందుపరిచారు. తాజాగా ఆరోగ్య సేతులో హెల్త్ డేటాను ఇతర హెల్త్ యాప్‌లలో షేర్ చేసేందుకు కొత్త అప్డేట్ను తీసుకువచ్చింది. అయితే ఈ మార్పులన్నీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ వినియోగదారులు ఈ సదుపాయాన్ని త్వరలో పొందనున్నారు. (సాహో.. ఆరోగ్య సేతు..!) అకౌంట్ డిలీట్ చేసే విధానం యాప్‌లో ఎడమవైపు ఉన్న యూజర్ ఐకాన్‌ను క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్‌ను రూపొందించడం. స్కాన్ చేయడం, ప్రభుత్వంతో డేటాను భాగస్వామ్యం చేయడం, కాల్ హెల్ప్‌లైన్ (1075), సెట్టింగ్ ఆప్షన్లు కన్పిస్తాయి. వీటిలో సెట్టింగ్‌ను క్లిక్ చేసి డిలీట్ మై అకౌంట్‌పై నొక్కాలి. అప్పుడు అకౌంట్‌ను డిలీట్ చేస్తే ఏం అవుతుందో చూపిస్తుంది. దాన్ని ఓకే చేసి మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీంతో యాప్‌లో మీ అకౌంట్ డిలీట్ అవుతోంది. (ఆరోగ్య సేతు ఉంటేనే ఏపీ సచివాలయంలోకి..) -
భారతీయులు డేటా ఎక్కడ ఉందో చెప్పిన టిక్‌టాక్!
బీజింగ్: దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భద్రతకు ముప్పుగా ఉన్నాయనే కారణంతో 59 చైనా యాప్స్‌ను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. వీటిలో షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి ఉపయోగపడే టిక్‌టాక్ ఒకటి. చాలా మంది ఈ టిక్‌టాక్ ద్వారా వీడియోలు తీసి పాపులారిటి సంపాదించుకున్నారు. టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్ మాట్లాడుతూ, చైనా ఎప్పుడు భారతీయులు డేటా గురించి అడగలేదని, దీనికి సంబంధించి కంపెనీకి ఎప్పుడూ ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థనలు రాలేదని తెలిపారు. ( చైనా.. యాప్స్.. ఓ సర్వే) అయితే భారతీయులకు సంబంధించిన డేటా అంతా సింగపూర్‌లో ఉన్న సర్వర్లలో ఉందని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ లిమిటెడ్ తెలిపింది. అలాగే ఈ సంస్థ భారతదేశంలోనూ డేటా సెంటర్లను నిర్మించాలనుకుంటుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్ లేఖ ద్వారా ఇండియా కు తెలిపారు. (‘బ్యాన్ టిక్‌టాక్’ అమెరికాలోనూ..!) -
కరోనాపై కప్పదాట్లు ప్రమాదకరం
సమృద్ధికరమైన డేటా అనేది వైరస్ ప్రమాదం గురించి మరింత నిర్దిష్టంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. అలాగే వైరస్‌ని ఎదుర్కోవడంలో మన వనరులను సమర్థంగా ఉపయోగించడానికి కూడా దీనివల్ల వీలవుతుంది. దీనికి అవసరమైనది ఏమిటంటే వైరస్ వ్యాప్తి గురించిన డేటాను సమర్థంగా సేకరించడం, ప్రజలకు ఉపయోగపడేలా దాన్ని సంఘటితం చేయడమే. కోవిడ్ –19 ఇన్ఫెక్షన్లు సోకిన ప్రతి క్లస్టర్‌కు సంబంధించిన కచ్చితమైన ప్రదేశం వివరాలను సింగపూర్ వంటి దేశాలు నివేదించాయి. అమెరికాలోని గోప్యతా ప్రచారకర్తలు దీన్ని వ్యతిరేకించవచ్చు. కానీ సాంక్రమిక వ్యాధి విజ్ఞాన శాస్త్రానికి ఎలాంటి వ్యక్తిగత సమాచారం అవసరం లేదు. ప్రతి దేశం కోవిడ్ 19కి సంబంధించి తమదైన మార్గంలో డేటా సేకరిస్తుండటం ఒక సవాలులాంటిది. పందొమ్మిదో శతాబ్దికి చెందిన శస్త్రచికిత్స వైద్యుడు, సాంక్రమిక రోగ విజ్ఞాన శాస్త్రవేత్త జాన్ స్నో కలరా వ్యాప్తికి మూల కారణం గాలి కాదని, నీటి ద్వారా అది వ్యాప్తి చెందుతోందని కనుగొన్నాడు. కలరా రోగులు నీరు ఎక్కడినుంచి తెచ్చుకుంటున్నారు అనే సాధారణ ప్రశ్న వేయడం ద్వారా ఆయన కలరా మూలకారణం గుట్టు బయటపెట్టేశాడు. ఇప్పుడు సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్నాం. కానీ మనం సరికొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల గురించి మన ప్రజారోగ్య శాఖలు రోజువారీగా సేకరిస్తున్న డేటా అధ్యయనానికి అలనాటి భూతవైద్య సంబంధ ఉపకరణాలనే అన్వయిస్తున్నాం. నాతో పనిచేస్తున్న ప్రజారోగ్య విభాగం ప్రొఫెసర్ సాంక్రమిక రోగ విజ్ఞాన శాస్త్రం అంటే రోగ కారణాలను అధ్యయనం చేసే శాస్త్రం అని నిర్వచించాడు. గతేడాది చివరలో ఆవిర్భవించిన కరోనా వైరస్ వ్యాధికి తక్షణ కారణాలు ఉన్నాయి. వాటి వెనుక అనేకానేక సమస్యలున్నాయి. ఒక ఇన్ఫెక్షన్ ఎక్కడ, ఎలా మొదలవుతోంది వంటి కారణాలను అర్థం చేసుకోవడం అనేది ఏ వ్యాధి నిరోధానికైనా కీలకం అవుతుంది. అతిపెద్ద ప్రమాదానికి కారణమయ్యే ప్రదేశం గురించిన మెరుగైన వాస్తవాలను కనుగొంటే అది తక్కువ ప్రమాదం ఉండే వ్యాధి చర్యలపై ప్రజలు మరింత ఆత్మవిశ్వాసంతో ఉండటంలో తోడ్పడుతుంది. ఈ సమాచారం వ్యాధి నిరోధంపై ఎక్కడ గురిపెట్టాలనే విషయంలో ప్రజారోగ్య అధికారులకు ఉపకరిస్తుంది. సరైన సమాచారం కీలకం ఎందుకంటే వైరస్ అనేది ఎలాంటి లక్షణాలు లేని ప్రజల ద్వారా సులభంగా వ్యాప్తి చెందుతుంది. కేవలం కొన్ని ప్రాంతాలు లేక చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే మనం కోవిడ్–19 ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేం. కానీ వ్యాధి సోకడం, అది వ్యాప్తి చెందడం అనేది ప్రతిచోటా, ప్రతి సమయంలో, ప్రతి ఒక్కరికీ ఒకేలా వర్తించడం లేదు. సాంక్రమిక వ్యాధిగా పరిణమిస్తున్న కొద్దీ స్థానికంగా వైరస్ వ్యాప్తి చెందడం పెరుగుతుందని మనం ఊహించవచ్చు. వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల గురించి మనం ఇప్పటికే చాలా విని ఉన్నాం. నర్సింగ్ హోమ్స్, మాంసం ప్యాక్ చేసే ప్లాంట్లు, సంగీత కార్యక్రమాలు, కారాగారాలు వంటి చోట్ల సాంక్రమిక వ్యాధులు బాగా ప్రబలుతున్నట్లు సమాచారం ఉంది కూడా. అంటే నిర్దిష్టంగా కొన్ని ప్రాంతాలు మరింత ప్రమాదకరంగా ఉంటున్నాయి. ఇంతవరకు వైరస్ ఎక్కడ పుట్టి వ్యాప్తి చెందుతుందనే విషయంపై అంచనాలు వేస్తున్నాం. కానీ ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడం ద్వారానే సాంక్రమిక రోగ విజ్ఞాన శాస్త్రం సమర్థంగా వ్యవహరించగలదు. వైరస్‌కి సంబంధించిన రిస్క్ ఎక్కడుంది అనే అంశంపై అనిశ్చితి వ్యాధిపై కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది. ఇటీవలే చికాగో విశ్వవిద్యాలయం అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన పోల్ టెస్టు ప్రకారం సగంమందికి పైగా అమెరికన్లు హెయిర్ కట్ చేసుకోవాలన్నా, షాపింగ్‌కు వెళ్లాలన్నా, మిత్రులను కలుసుకోవాలన్నా భయపడిపోతున్నారని తెలిసింది. వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదం సంభవించే ప్రాంతాల గురించి మెరుగైన వాస్తవాలను కనుగొంటే తక్కువ ప్రమాదం కలిగే చర్యల పట్ల జనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. ప్రతి కోవిడ్ –19 కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైన డేటాను సేకరిస్తున్నాయి. కానీ ఇంతవరకు, రిస్క్ ఎక్కడ ఎక్కువగా ఉందని చెప్పడానికి ఈ సమాచారాన్ని పెద్దగా ఉపయోగించటం లేదు. పశ్చిమ దేశాల్లో లైసెన్స్ ఉన్న నర్సింగ్ హోమ్లనుంచి అనేక కోవిడ్ –19 కేసులు, మరణాల గురించి నివేదికలు వచ్చాయి. విభిన్నమైన జీవన, పని పరిస్థితులు వైరస్ వ్యాప్తికి ఎలా దోహదం చేస్తున్నాయనే విషయాన్ని రాష్ట్రాలు, దేశాలు, వ్యాధి నియంత్రణ కేంద్రాలు సరిగ్గా చెప్పడం లేదు. పని సంబంధిత సంక్రమణ పనికి సంబంధించిన స్థలాల్లో వ్యాధి సంక్రమణ తొలి దశ వైరస్ వ్యాప్తిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆసియాలో జరిగిన ఒక అధ్యయనం కనుగొంది. ఆరోగ్య సంరక్షణ పని, డ్రైవింగ్, రిటైల్ అమ్మకాలు వైరస్ వ్యాప్తికి వీలుకలిగించే ప్రమాదకరమైన కారణాలుగా ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఆసియా ఖండంలో ఆరు విభిన్న దేశాల నుంచి సేకరించిన కేసుల డేటాను పరిశోధకులు సమగ్రంగా విశ్లేషించిన ఫలితంగానే ఈ అధ్యయనం సాధ్యమైంది. ఒక వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు, వారి పని, ఇటీవల వారు ప్రయాణించినప్పుడు ఇప్పటికే వైరస్ సంక్రమించిన వ్యక్తులతో సంబంధంలోకి వచ్చారా వంటి వివిధ అంశాలకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని వైద్యులు క్రోడీకరించి కేసు రిపోర్టు పత్రాలను నింపారు. వైరస్ కాంటాక్టుల జాడ పసిగట్టి చెబుతున్న వారి పని మరిన్ని అదనపు అంశాలను అందిస్తోంది. కాంటాక్ట్ ట్రేసర్ల ప్రధానమైన పని క్వారంటైన్లో ఉన్న వ్యాధిసోకిన వ్యక్తి కాంటాక్టుల సమాచారాన్ని కనుగొనడమే. ఎంతమందికి వైరస్ సోకింది, వైరస్ సోకిన వ్యక్తులు ఎంత వేగంగా మన మధ్య సంచరిస్తున్నారు అనే అంశాలకు సంబంధించి ట్రేసర్ల పని నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే ప్రజలు కూడా ఎక్కడ, ఎలా వైరస్‌తో కాంటాక్ట్ అయ్యారు అనే అంశంపై ట్రేసర్లు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. వైరస్ ఎక్కడ సోకింది, ఇంటిలోనా, బార్లోనా, చర్చిలోనా, స్కూల్లోనా, సరుకుల దుకాణంలోనా, ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్లోనా, ప్రజలు కలిసి భోజనం పంచుకున్నారా, కలిసి పనిచేశారా లేక పార్కులో పక్కపక్కనే నడిచారా అనే అంశాలను ట్రేసర్లు తెలుసుకోవచ్చు. వైరస్ ప్రమాదాలను అర్థం చేసుకోవడం సమృద్ధికరమైన డేటా అనేది వైరస్ ప్రమాదం గురించి మరింత నిర్దిష్టంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. అలాగే వైరస్‌ని ఎదుర్కోవడంలో మన వనరులను సమర్థంగా ఉపయోగించడానికి కూడా దీనివల్ల వీలవుతుంది. దీనికి అవసరమైనది ఏమిటంటే వైరస్ వ్యాప్తి గురించిన డేటాను సమర్థంగా సేకరించడం, ప్రజలకు ఉపయోగపడేలా దాన్ని ఆర్గనైజ్ చేయడమే. కోవిడ్ –19 ఇన్ఫెక్షన్లు సోకిన ప్రతి క్లస్టర్‌కు సంబంధించిన కచ్చితమైన ప్రదేశం వివరాలను సింగపూర్ వంటి దేశాలు నివేదించాయి. అమెరికాలోని గోప్యతా ప్రచారకర్తలు దీన్ని వ్యతిరేకించవచ్చు. కానీ సాంక్రమిక వ్యాధి విజ్ఞాన శాస్త్రానికి ఎలాంటి వ్యక్తిగత సమాచారం అవసరం లేదు. ప్రతి దేశం కోవిడ్– 19కి సంబంధించి తమదైన మార్గంలో డేటా సేకరిస్తుండటం ఒక సవాలులాంటిది. ఒకే భాషలో, రియల్ టైమ్‌లో బహిరంగంగా అందుబాటులో ఉండే సమాచారం మనకు అవసరం. స్వజాతీయతపై మెరుగైన సమాచారం కోసం పిలుపునివ్వడం అమెరికాలో కొన్ని నెలల క్రితమే ప్రారంభమైంది. వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) డైరెక్టర్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ ఆయా దేశాలు మరిన్ని వాస్తవాలను నివేదించాల్సి ఉందని కోరారు. అయితే ఈ అదనపు వాస్తవాలను ఆగస్టు నెల వరకు పంపాలని ఆయన చెప్పారు. ప్రతి ఉపయోగకరమైన సమాచారాన్ని సేకరిస్తారని భావిద్దాం. ఆగస్టు వరకు సమయం ఇవ్వడం అంటే మరీ ఎక్కువ. ఈ డేటా విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్గనైజ్ చేసి, పంచుకోవడం మన ముందున్న సులభమైన సవాళ్లలో ఒకటి. మనం సరికొత్త వెంటిలేటర్‌ను కనుగొనడం లాంటిది కాదు. కోవిడ్–19 ఎలా, ఎక్కడ వ్యాప్తి చెందుతోంది అనే అంశాన్ని అర్థం చేసుకోవడానికి, 19వ శతాబ్దంలో జాన్ స్నోలాగా మురికి గుంటల్లో వ్యాధికారకాన్ని వెతకాల్సిన అవసరం మనకు ఉండకపోవచ్చు. కానీ భద్రతవైపు అడుగేయడంలో అది మనకు తగిన మార్గదర్శకాలను అందిస్తుంది. అమెరికా ఆరోగ్య విభాగాలు ఇలాంటి డేటాను నెలలక్రితమే సేకరిస్తూ వచ్చాయి. ఈ డేటాను మొత్తంగా ఒకచోటికి చేర్చి ఉపయోగించడానికి ఇదే సరైన తరుణం. కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఇప్పటికి నాలుగు నెలలు కావస్తోంది. ఇప్పటికీ అతి చిన్న స్థాయిలో డేటాను మాత్రమే వెల్లడి చేయడం అవమానకరమైందిగానే చూడాలి. విస్తృతస్థాయిలో డేటాను వెల్లడించి ఉంటే ప్రజలు తమ భద్రతపై మరింత ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. కరోనా వైరస్ ఎక్కడినుంచి వ్యాప్తి చెందుతోంది అనే విషయంపై డేటాను పంచుకుని ఉంటే ప్రజలు తమ సొంత బాధ్యతగా కూడా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండేవారు. గోప్యత పేరుతో వైరస్ వ్యాప్తికి చెందిన ముఖ్యమైన డేటాను బహిరంగపర్చనట్లయితే మరింత నష్టం తప్పదని గ్రహించాలి. రాజీవ్ భాటియా వ్యాసకర్త, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడిసిన్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సటీ -
షాకింగ్ న్యూస్; షావోమి వివరణ
సాక్షి, హైదరాబాద్: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అవసరానికి మించి సేకరిస్తున్నట్టు వస్తున్న వార్తలను షావోమి ఇండియా తోసిపుచ్చింది. డేటా గోప్యత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. షావోమి ఇండియా మొత్తం డేటాను రెండేళ్ల క్రితం స్థానిక సర్వర్లకు తరలించినట్టు వెల్లడించింది. వినియోగదారుల స్పష్టమైన అనుమతి లేకుండా డేటాను తాము సేకరించడం లేదని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ ట్విటర్ ద్వారా తెలిపారు. తమ దగ్గరున్న సమాచారాన్ని సురక్షితంగా ఉంటుందని, బయటకు వెల్లడించే అవకాశం లేదన్నారు. ఇండియా డేటా ఇండియాలోనే ఉంటుందని స్పష్టం చేశారు. షావోమి తన కంపెనీ ఫోన్ల ద్వారా ఎక్కువగా యూజర్ డేటాను సేకరిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు మనుకుమార్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. (మొబైల్ డేటాతో ‘కరోనా’ గుర్తింపు!) ‘ఇంటర్నెట్ సంస్థగా షావోమి వినియోగదారుల సమాచార రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. డేటా గోప్యతలో ప్రపంచంలోని ఇతర ప్రముఖ బ్రౌజర్ల మాదిరిగానే ఎంఐ బ్రౌజర్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తుంది. ఇది వినియోగదారుల నుంచి స్పష్టమైన అనుమతి లేదా సమ్మతి లేకుండా వారి డేటాను సేకరించదు. మా దగ్గరున్న సమాచారాన్ని పూర్తి సురక్షితంగా ఉంటుంది. రహస్య మోడ్‌లో బ్రౌజ్ చేసిన వాటిని ఎంఐ బ్రౌజర్ ఎప్పటికీ గుర్తించలేదు. లాగిన్ అయిన వినియోగ డేటా మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు ఏదైనా వెబ్సైట్ పని చేయకపోతే లేదా నెమ్మదిగా ఉంటే మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగ్గా, వేగంగా చేయడానికి రహస్య డేటా ఉపయోగించబడుతుంది. ఇది ఇతర బ్రౌజర్ చేసే మాదిరిగానే ఉంటుంది. ఎంఐ బ్రౌజర్‌తో సహా షావోమి స్మార్ట్ఫోన్లు, వాటిలోని డీఫాల్ట్ యాప్‌లు.. భద్రత, గోప్యతపరంగా సురక్షితమైనవని ప్రఖ్యాత అంతర్జాతీయ థర్డ్ పార్టీ కంపెనీలు ట్రస్ట్ఆర్క్, బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ (బిఎస్ఐ) ధ్రువీకరించాయి. ఎంఐ బ్రౌజర్, ఎంఐ క్లౌడ్‌లోని భారత వినియోగదారుల డేటా అంతా ఇండియాలోని ఏఎస్‌డబ్ల్యూ సర్వర్లలో స్థానికంగా నిల్వ చేయబడుతుంద’ని మనుకుమార్ జైన్ వివరించారు. -
కరోనా ఎఫెక్ట్ : డేటాకు పెరిగిన డిమాండ్..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఇంటి నుంచే పని చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో డేటాకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ 10 శాతం పైగా పెరిగిందని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా డాంగల్స్‌కూ డిమాండ్ రెట్టింపవడంతో రిటైలర్లు స్టాక్ తెప్పించేందుకు వారం సమయం కోరుతున్నారు. ఇంటర్నెట్ ట్రాఫిక్ 10 శాతం పెరిగిందని తమ టెలికాం సభ్యుల నుంచి సమాచారం అందిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మ్యాథ్యూస్ వెల్లడించారు. ట్రాఫిక్ అనూహ్యంగా పెరగడంతో నెట్‌వర్క్‌లు స్తంభించే అవకాశం లేదని ఆయన తెలిపారు. డేటా డిమాండ్ పెరిగిన ఫలితంగా సమస్యలు ఎదురుకాబోవని.. నెట్వర్క్స్ అన్నీ తగిన సామర్థ్యంతో కూడుకని ఉన్నాయని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. మరోవైపు రిలయన్స్ జియో వంటి టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ కస్టమర్లకు వారి మొబైల్స్‌లో డేటా కెపాసిటీని డిమాండ్‌కు అనుగుణంగా పెంచుతున్నాయి. టాప్‌అప్స్‌కు సరికొత్త టారిఫ్ ప్యాకేజ్‌ను జియో ఇటీవల లాంఛ్ చేసింది. రూ 21 టాప్అప్ చేయిస్తే అంతకుముందు 1 జీబీ స్ధానంలో 2జీబీ డేటా, 200 నిమిషాల ఇంటర్నెట్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక భారతి ఎయిర్టెల్ హోం బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు వీలుగా వేగవంతమైన, అధిక డేటా ప్లాన్స్‌ను వర్తింపచేస్తోందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్ నిరోధించేందుకు ప్రభుత్వ సూచనలతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో బ్రాడ్‌కాస్టింగ్, ఓటీటీ కంపెనీలు కూడా అత్యధిక వ్యూయర్లను, సబ్‌స్ర్కైబర్లను పొందుతున్నాయి. చదవండి : జనతా కర్ఫ్యూ: ఇటలీ నుంచి 263 మంది -
జియో కొత్త రీచార్జ్ ప్లాన్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. 336 రోజుల చెల్లుబాటుతో రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత జియో-టు-జియో కాలింగ్, ల్యాండ్‌లైన్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే జియోయేతర కాలింగ్‌కు 12,000 నిమిషాల టాక్‌టైం లభించనుంది. దీంతోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్ సందేశాలు ఉచితం. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ వుంటుంది. రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియోతోపాటు, గూగుల్ పే , పేటీఎమ్‌తో సహా వివిధ థర్డ్ పార్టీ రీఛార్జ్ ఛానెళ్ల ద్వారా కూడా తాజా ప్లాన్ అందుబాటులో ఉంది. మరోవైపు గత ఏడాది డిసెంబర్లో పరిమిత కాల ఆఫర్‌గా 365 రోజుల వాలిడిటీతో తీసుకొచ్చిన "2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్" రూ. 2,020 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించింది. దీంతో పాటు తన యాప్ లో కొన్ని ప్లాన్ల కేటగిరీలను కూడా జియో మార్చడం గమనార్హం. -
ఈ–స్కూటర్‌తో డేటా హ్యాక్!
హూస్టన్: ఎలక్ట్రానిక్–స్కూటర్లను హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన టెక్సాస్ యూనివర్సిటీ నిపుణులు తాజా పరిశోధన ద్వారా వెల్లడించారు. ఇందులో భారతీయ నిపుణులు పాల్గొన్నారు. వాహనదారుల గోప్యతకు సంబంధించిన వివరాలను ఈ–స్కూటర్ల ద్వారా హ్యాక్ చేయొచ్చని వీరు చెబుతున్నారు. ఈ–స్కూటర్లను మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసినపుడు.. రెండింటి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. దీంతో ఆ వాహనం ప్రయాణించే ప్రాంతం, ఎంత దూరం తిరిగింది వంటి వివరాలు ఫోను, వాహనాల్లో నిక్షిప్తం అవుతాయి. ఇదే హ్యాకర్లకు అవకాశం కల్పిస్తోందని వారు తెలిపారు. ఈ వివరాల ద్వారా వాహనదారులు తరచుగా తిరిగే మార్గాలను, వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఉండే లొకేషన్ వంటి వివరాలను హ్యాకర్లు తెలుసుకుంటారని చెప్పారు. సైబర్ సెక్యూరిటీని పటిష్టంగా ఉండేలా మోటారు వాహనాల కంపెనీలు తమ వాహనాలను తయారు చేయాలని వారు సూచించారు. -
వరవరరావు హార్డ్‌డిస్క్ డేటా రికవరీ కోసం..
పుణే: ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఇంట్లో స్వాధీనంచేసుకున్న హార్డ్‌డిస్క్‌లోని డేటా రికవరీ కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సాయం తీసుకోవాలని పుణే పోలీసులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టులో వరవరరావు ఇంట్లో సోదాల్లో లభ్యమైన హార్డ్‌డిస్క్‌లో ఏముందో తెల్సుకునేందుకు నాలుగు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపినా ఫలితం లేదు. తొలుత పుణేలోని ల్యాబొరేటరీకి పంపగా, నిపుణులు హార్డ్ డిస్క్‌లోని డేటాను రికవరీ చేయలేకపోయారని ఓ అధికారి చెప్పారు. తర్వాత ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినా అక్కడి నిపుణులు డేటా సంపాదించలేకపోయారు. గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల నిపుణులు రికవరీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ‘సాంకేతికతలో ఎఫ్‌బీఐ చాలా పురోగతి చెంది ఉంటుంది. అందుకే ఎఫ్‌బీఐకి హార్డ్ డిస్క్ పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర హోం శాఖ ఇచ్చింది’అని ఆ అధికారి చెప్పారు. -
వాట్సాప్‌లో గ్రూపులను టార్గెట్ చేసే బగ్
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లోని వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేసే బగ్‌ను తాము గుర్తించినట్లు వాట్సాప్ వెల్లడించింది. దీని బారిన పడకుండా ఉండేందుకు తాజా వెర్షన్ 2.19.58కు అప్డేట్ చేసుకోవాలని మంగళవారం సూచించింది. బగ్ కారణంగా గ్రూపుల్లోని మెసేజులు శాశ్వతంగా డిలీట్ అవుతున్నాయని తెలిపారు. హ్యాకర్లు వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించి వెబ్ డీబగ్గింగ్ టూల్ ద్వారా గ్రూపుల్లో ప్రత్యేక పారామీటర్లు ఉన్న సందేశాలు పంపుతున్నారని తెలిపారు. దీనివల్ల గ్రూప్ క్రాష్ అయ్యి పనిచేయడం ఆగిపోతోందని వాట్సాప్ ప్రొడక్ట్ వల్నెరబిలిటీ రీసెర్చ్ చెక్ పాయింట్స్ హెడ్ ఓడెడ్ వనును తెలిపారు. అయితే ఈ హ్యాకింగ్ ప్రక్రియను సాగించే హ్యాకర్లు ఆయా గ్రూపుల్లో సభ్యులై ఉంటారని చెప్పారు. ఈ బగ్‌కు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో వినియోగదారులు వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తోందన్నారు. -
దారుణంగా పడిపోయిన ఉద్యోగాల కల్పన
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమందగమనం, వినియోగదారుల డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో మరో షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. జూలై మాసంతో పోలిస్తే, ఆగస్టుమాసంలో ఉద్యోగాల కల్పన దారుణంగా పడిపోయింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) పేరోల్ డేటా ప్రకారం ఆగస్టులో సుమారు 13 లక్షల ఉద్యోగ అవకాశాలు మాత్రం రాగా, అంతకుముందు నెలలో (జూలై) ఈ సంఖ్య 14.49 లక్షలు. 2018-19లో ఇఎస్ఐసితో కొత్త చందాదారుల స్థూల నమోదు 1.49 కోట్లు అని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) ఒక నివేదికలో తెలిపింది. 2017 సెప్టెంబర్ నుండి 2019 ఆగస్టు వరకు సుమారు 2.97 కోట్ల మంది కొత్త చందాదారులు ఈ పథకంలో చేరినట్లు కూడా నివేదిక వివరించింది. ఇఎస్ఐసీ, రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌వో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించే వివిధ సామాజిక భద్రతా పథకాల్లో చేరిన కొత్త చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన్ఎస్ఓ నివేదికను రూపొందిస్తుంది. సెప్టెంబర్ 2018 నుండి ప్రారంభమయ్యే కాలాన్ని కవర్ చేస్తూ ఏప్రిల్ 2018 నుండి ఈ మూడు సంస్థల పేరోల్ డేటా లేదా కొత్త చందాదారుల డేటాను విడుదల ఎన్ఎస్ఓ చేస్తోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 వరకు ఇఎస్ఐసీ లో కొత్త నమోదులు 83.35 లక్షలుగా ఉందని నివేదిక చూపించింది. ఈ ఏడాది జూలైలో 11.71 లక్షలతో పోలిస్తే ఆగస్టులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) తో 10.86 లక్షల కొత్త ఉద్యోగాలు మాత్రమే నమోదయ్యాయి. 2018-19లో నికర ప్రాతిపదికన 61.12 లక్షల మంది కొత్త చందాదారులు ఇపిఎఫ్ఓ నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకాలలో చేరారు. అదేవిధంగా, నికర కొత్త నమోదులు (సెప్టెంబర్ 2017 - మార్చి 2018 వరకు) 15.52 లక్షలు. కాగా సెప్టెంబర్ 2017 - 2019 ఆగస్టులో ఇపీఎఫ్ పథకంలో చేరిన కొత్త చందాదారులు సుమారు 2.75 కోట్ల మంది. చందాదారుల సంఖ్య వివిధ వనరుల నుండి వచ్చినందున, ఈ అంచనాలు సంకలితం కాదని ఎన్ఎస్ఓ నివేదిక పేర్కొంది. -
భారత్ చేతిలో స్విస్ ఖాతాల సమాచారం..
సాక్షి, న్యూఢిల్లీ : నూతన సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగుణంగా స్విస్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో భారతీయుల ఖాతాల వివరాలకు సంబంధించిన తొలి సమాచారాన్ని భారత్ అందుకుంది. విదేశాల్లో దాగిన నల్లకుబేరుల బ్లాక్‌మనీ వెలికితీసే ప్రక్రియలో ఇది భారీ ముందడుగుగా భావిస్తున్నారు. భారత్‌తో పాటు 75 దేశాలు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ర్టేషన్ (ఎఫ్‌టీఏ) నుంచి ఈ తరహా సమాచారాన్ని పొందుతాయని ఎఫ్‌టీఏ ప్రతినిధి వెల్లడించారు. ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఇఓఐ) ఫ్రేమ్‌వర్క్ కింద స్విట్జర్లాండ్ నుంచి భారత్ తమ ఖాతాదారుల వివరాలపై సమాచారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్విస్ బ్యాంకుల్లో 2018లో చురుకుగా ఉన్న భారతీయుల ఖాతాలు, క్లోజయిన ఖాతాల వివరాలను కూడా తాజా సమాచారంలో పొందుపరిచారు. 2020 సెప్టెంబర్‌లో తదుపరి సమాచార మార్పిడి జరుగుతుందని ఎఫ్‌టీఏ ప్రతినిధి తెలిపారు. ఎఫ్‌టీఏ మొత్తంమీద 75 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకోగా, వారి నుంచి 24 లక్షల ఖాతాల సమాచారాన్ని సేకరించింది. ఈ డేటాలో బ్యాంకు ఖాతాదారు పేరు, ఖాతా సంఖ్యతో పాటు ఖాతాదారుని అడ్రస్, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య సహా బ్యాంకు, ఆర్థిక సంస్థ పేరు ఖాతాదారు ఖాతాలో ఉన్న నిధుల వివరాలు, క్యాపిటల్ ఇన్కమ్ వంటి పలు వివరాలు ఉంటాయి. ఆ గుట్టు తెలిస్తే.. భారత్‌కు స్విస్ బ్యాంకుల నుంచి లభించిన వివరాలతో అనధికార సంపద పోగేసిన వారిపై గట్టి చర్యలు చేపట్టేందుకు వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఖాతాలకు సంబంధించి డిపాజిట్లు, నగదు బదిలీ, పెట్టుబడుల ద్వారా రాబడులు వంటి కీలక సమాచారం వెల్లడవడంతో నల్ల కుబేరుల గుట్టుమట్లు దర్యాప్తు అధికారులకూ కీలక ఆధారాలుగా మారనున్నాయి. కాగా స్విస్ యంత్రాంగం అందించిన సమాచారం ఎక్కువగా భారత వాణిజ్యవేత్తలు, అమెరికా=బ్రిటన్ సహా ఆఫ్రికా దేశాల్లో స్ధిరపడిన ఎన్ఆర్లకు చెందినవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నల్లధనంపై ఉక్కుపాదం మోపాలని పలు దేశాలు నిర్ణయించిన క్రమంలో పలువురు భారతీయులు ఇప్పటికే స్విస్ సహా విదేశీ బ్యాంకుల్లో తమ ఖాతాలను మూసివేశారనే ప్రచారం సాగుతోంది. -
అంబానీపై ఫేస్బుక్ ఫైర్
న్యూఢిల్లీ: డేటా విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటనకు కౌంటర్‌గా అన్నట్టు ఫేస్బుక్ భిన్నంగా స్పందించింది. డేటా అన్నది కొత్త చమురు కాదని, దీన్ని ఒక దేశం పరిధిలోనే నిల్వ చేయరాదని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్‌క్లెగ్ వ్యాఖ్యానించారు. భారత్ వంటి దేశాలు డేటాను ఓ పరిమిత వస్తువుగా నిలిపివేయకుండా, సాఫీగా దేశ సరిహద్దులు దాటి వెళ్లేందుకు అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ‘‘జాతి భద్రత దృష్ట్యా భారత్ వంటి దేశాలకు డేటాను పంచుకోవడం ఇప్పుడు కీలకం. ఎందుకంటే తీవ్ర నేరాలు, ఉగ్రవాదాన్ని తుదముట్టించే లక్ష్యంతో అంతర్జాతీయ డేటాను పంచుకునేందుకు భారత్ గొప్ప చర్యలనే చేపట్టింది’’ అని క్లెగ్ గుర్తు చేశారు. డేటాను దేశీయంగానే నిల్వ చేయాలని, ఇందుకు అన్ని కంపెనీలు చేర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. హక్కులను గౌరవించాలి.. ‘‘తమ డేటాకు ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తుల హక్కులను గౌరవించాలి. పోటీని, ఆవిష్కరణను ప్రోత్సహించాలి. ప్రతీ ఒక్కరు డేటాను పొందే దిశగా దాన్ని అందుబాటులో ఉంచాలి. ఈ దిశగా ఇంటర్నెట్కు భారత్ కొత్త నిర్వచనం చెప్పాలి’’ అని నిక్‌క్లెగ్ అన్నారు. డేటాను ‘న్యూ ఆయిల్’ (కొత్త ఇంధనం) అని, సామాజిక మాధ్యమ వేదికలు, ఇంటర్న్‌పై భారత యూజర్ల డేటాను కాపాడాల్సి ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవలే వ్యాఖ్యానించారు. ‘‘దేశ డేటాను భారత వ్యక్తులే కలిగి ఉండడం, నియంత్రించడం చేయాలి. అది దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్లు కాదు’’ అని అంబానీ పేర్కొన్నారు. ‘‘భారత్‌లో చాలా మంది, అలాగే ప్రపంచ వ్యాప్తంగా డేటాను కొందరు కొత్త ఆయిల్గా భావిస్తున్నారు. దేశం పరిధిలోనే భారీ చమురు నిల్వలను కలిగి ఉండొచ్చు. ఇది కచ్చితంగా సంపదను పెంచుతుంది. కానీ, ఈ విధమైన పోలిక పొరపాటే అవుతుంది’’ అని క్లెగ్ గురువారం ఓ మీడియా సంస్థకు తెలిపారు. ‘‘నిలిపి ఉంచడం వల్ల డేటాకు విలువ రాదు. దాన్ని స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అనుమతించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించాలి’’ అని ఆయన సూచించారు. -
సినీ నటి డాటా చోరీ
బంజారాహిల్స్: తనకు తెలియకుండా కీలకమైన డాటా చోరీ చేశాడంటూ ఓ సినీ నటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్ కాలనీలో ఉంటున్న సినీ నటి, సామాజిక కార్యకర్త రాధాప్రశాంతికి గత నాలుగేళ్లుగా ప్రముఖ డిజైనర్ లక్ష్మి అనే మహిళతో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో లక్ష్మి తన కుమారుడు చక్రితో కలిసి చీరల డిజైన్లు చూపడానికి ఇటీవల రాధాప్రశాంతి ఇంటికి వచ్చింది. మే 13న ఆమె ఇంటికి వచ్చిన చక్రి తన ల్యాప్‌టాప్‌లోని చీరల డిజైన్లు రాధాప్రశాంతి సెల్ఫోన్లోకి పంపుతానని చెప్పగా వాట్సాప్ ద్వారా పంపాలని ఆమె సూచించింది. తన సెల్‌ఫోన్ పని చేయడం లేదని చెప్పిన అతను ఆమె సెల్‌ఫోన్ తీసుకొని గంటన్నర తర్వాత తిరిగి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆమె తన సెల్ఫోన్లో చూసుకోగా అందులో ఎలాంటి డిజైన్లు కనిపించలేదు. దీంతో చక్రికి ఫోన్ చేయగా వస్తానని చెప్పి తప్పించుకున్నాడు. అతడి తల్లికి ఫోన్ చేయగా ఆమె నుంచి సరైన సమాధానం లేదు. దీనికితోడు లక్ష్మి జీఎస్టీ కార్డు ఇస్తానని ప్రశాంతికి చెందిన బ్యాంకు వివరాలు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, రూ. 25 వేల నగదును తీసుకుంది. తన కుమారుడిని తీసుకొని వస్తానని చెప్పిన ఆమె ఇప్పటి వరకు రాకపోగా తన జీమెయిల్లోని డాటా మొత్తం కనిపించడం లేదని అందు లో ఫేస్బుక్లో ఉండాల్సిన ముఖ్యమైన ఫొటోలు లేవని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటితో పాటు ముఖ్యమైన ఫైళ్లు కనిపించడం లేదని లక్ష్మితో పాటు ఆమె కుమారుడు చక్రిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు. -
గూగుల్‌పై ఫ్రాన్స్‌లో దావా
ప్యారిస్: అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్‌లో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా క్లాస్ యాక్షన్ దావా నమోదైంది. కఠినతరమైన యూరోపియన్ యూనియన్ డేటా భద్రత చట్టాలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలపై వినియోగదారుల హక్కుల సంస్థ యూఎఫ్‌సీ–క్యూ కొయిసర్ గ్రూప్ ఈ దావా వేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఆధారిత ఫోన్లు, ట్యాబ్‌లు మొదలైన డివైజ్‌లను ఉపయోగించే యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ మోసపూరితంగా దొంగిలిస్తోందని, దీన్ని అరికట్టే లక్ష్యంతోనే క్లాస్ యాక్షన్ సూట్ వేశామని యూఎఫ్‌సీ గ్రూప్ ప్రెసిడెంట్ అలెయిన్ బెజోట్ తెలిపారు. ఒకవేళ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో ఫ్రాన్స్‌లో 2.8 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఒక్కొక్కరికీ 1,000 యూరోల దాకా పరిహారం లభించే అవకాశాలున్నట్లు వివరించారు. ఇప్పటిదాకా 200 మంది పైగా ఈ దావాలో చేరినట్లు బెజోట్ చెప్పారు. ఈ ఏడాది జనవరిలోనే ఫ్రాన్స్‌కి చెందిన డేటా నియంత్రణ సంస్థ సీఎన్ఐఎల్.. గూగుల్‌పై 50 మిలియన్ యూరోల జరిమానా విధించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో వినియోగదారులకు విధించే అభ్యంతరకరమైన నిబంధనలు తొలగించాలంటూ ప్యారిస్ జిల్లా స్థాయి కోర్టు కూడా గూగుల్‌ను ఆదేశించింది. గూగుల్ మ్యాప్స్‌లో మరో భద్రతా ఫీచర్ .. గూగుల్ మ్యాప్స్ తాజాగా భారత్‌లో ‘స్టే సేఫర్’ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. వాహనం దారి తప్పితే వెంటనే యూజర్లను హెచ్చరించడం ఇందులో ప్రత్యేకత. ఈ ఫీచర్ ద్వారా.. ప్రయాణికులు తమ ట్రిప్ గురించిన వివరాలు ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులు, మిత్రులకు లైవ్‌లో అందజేయొచ్చని గూగుల్ పేర్కొంది. గూగుల్ మ్యాప్స్ యాప్‌లో వెళ్లాల్సిన గమ్యస్థానం, మార్గం గురించి సెర్చి చేసిన తర్వాత ’గెట్ ఆఫ్–రూట్ అలర్ట్స్’ ఆప్షన్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా ఈ సేవలు పొందవచ్చని వివరించింది. ఒకవేళ డ్రైవర్ గూగుల్ మ్యాప్ సూచించిన రూటుకు భిన్నంగా దాదాపు అర కిలోమీటరు మేర వాహనాన్ని దారి మళ్లించిన పక్షంలో వెంటనే ప్రయాణికుల ఫోన్‌కు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. -
చెల్లింపుల డేటా భారత్‌లోనే ఉండాలి
ముంబై: డేటా లోకలైజేషన్ నిబంధనలపై రిజర్వ్ బ్యాంక్ స్పష్టతనిచ్చింది. పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థలు (పీఎస్వో) చెల్లింపుల లావాదేవీల డేటా మొత్తం భారత్‌లోని సిస్టమ్స్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అవసరమైతే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేయొచ్చని... కానీ దాన్ని 24 గంటల్లోగా భారత్‌కు మార్చాల్సి ఉంటుందని, విదేశీ సర్వర్ల నుంచి తొల గించాల్సి ఉంటుం దని తేల్చిచెప్పింది. చెల్లింపుల డేటాను భారత్‌లోనే భద్రపర్చాలన్న (డేటా లోకలైజేషన్) నిబంధనల మీద పీఎస్వోలు లేవనెత్తిన సందేహాలు నివృత్తి చేస్తూ ఆర్బీఐ ఈ మేరకు వివరణ ఇచ్చింది. -
మన డేటా మన దగ్గరే ఉండాలి..
న్యూఢిల్లీ: దేశీ యూజర్ల డేటా... మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడాలని, ఇతర దేశాల్లో దీన్ని భద్రపర్చడం శ్రేయస్కరం కాదని ఈ–కామర్స్ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఈ–కామర్స్‌లో విదేశీ పత్య్రక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్‌తో సోమవారం సమావేశమైన వివిధ డిజిటల్ కామర్స్ కంపెనీల ప్రతినిధులు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ దేశీ వినియోగదారుల డేటాను దేశ ప్రయోజనాలకు తోడ్పడేలా ఉపయోగించాలని తెలిపారు. మరోవైపు, దేశీ ఈకామర్స్ కంపెనీలకు, విదేశీ ఈ కామర్స్ సంస్థలకు నిబంధనలు వేర్వేరుగా ఉండటం వల్ల కంపెనీలు సమాన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాయని మరో డిజిటల్ కామర్స్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. విదేశీ సంస్థల నుంచి దేశీ కంపెనీలకు పొంచి ఉన్న ముప్పు, అందరికీ సమాన అవకాశాల కల్పన, వివక్షపూరిత విధానాలు మొదలైన అంశాలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి. తదుపరి మరింత వివరాలేమైనా ఇవ్వదల్చుకుంటే వచ్చే వారం తెలియజేయాలంటూ మంత్రి ఈ–కామర్స్ సంస్థల వర్గాలకు సూచించారు. జాతీయ ఈ–కామర్స్ విధానాన్ని ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాలతో మంత్రి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
డేటా భద్రతకు ‘గూగుల్’ నూతన ఫీచర్లు
న్యూఢిల్లీ: యూజర్ల సమాచార గోప్యత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం అధునాతన ఫీచర్ల పెంపు విషయంలో అత్యుత్తమ ప్రైవసీ సెట్టింగులను ఏకంగా రెట్టింపు చేసినట్లు వివరించింది. ఈ అంశంపై సంస్థ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ కీత్ ఎన్రైట్ మాట్లాడుతూ.. ‘డేటా వినియోగంపై యూజర్లకు మాత్రమే పూర్తి అధికారం ఉండేలా ఫీచర్లను పెంపొందించాం. భద్రత పెంపు కోసం భారీ మొత్తంలో పెట్టుబడిపెట్టాం’ అని వివరించారు. క్రోమ్‌లో మరిన్ని మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఆధార్ డేటాను ఈ-ప్రగతికి లింక్ చేశారు
-
ఇవేం నిబంధనలు!!
న్యూఢిల్లీ: భారత్ ప్రతిపాదిత డేటా లోకలైజేషన్ నిబంధనలు, ఈ–కామర్స్ విధాన ముసాయిదాలోని ప్రతిపాదనలను అమెరికా ఆక్షేపించింది. ఇవి అత్యంత వివక్షాపూరితంగాను, వాణిజ్యాన్ని దెబ్బతీసేవిగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. 2019లో విదేశీ వాణిజ్యానికి ప్రతిబంధకాలు అంశంపై అమెరికా వాణిజ్య విభాగం (యూఎస్టీఆర్) రూపొందించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. ‘భారత్ ఇటీవలే డేటాను స్థానికంగా భద్రపర్చాలని (లోకలైజేషన్) నిబంధనలను ప్రతిపాదించింది. ఇలాంటి వాటివల్ల డేటా ఆధారిత సేవలు అందించే సంస్థలు అనవసరంగా, వృథాగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా మెరుగైన సేవల ప్రయోజనాలను స్థానిక సంస్థలు పొందనీయకుండా చేస్తుంది. సీమాంతర డేటా వినియోగంపై ఆంక్షలు విధించడం వివక్ష చూపడమే అవుతుంది. ఇవి అమెరికా, భారత్ మధ్య డిజిటల్ వాణిజ్యానికి తీవ్ర ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉంది. ఈ–కామర్స్ విధానం ముసాయిదాలో ఇలాంటి విచక్షణాపూరిత, వాణిజ్యాన్ని దెబ్బతీసే నిబంధనలను భారత్ పునఃసమీక్షించాలని అమెరికా భావిస్తోంది‘ అని నివేదిక పేర్కొంది. చెల్లింపుల సమాచారం అంతా భారత్‌లోనే స్థానికంగా భద్రపర్చాలన్న నిబంధన వల్ల పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ వ్యయాలు పెరిగిపోతాయని, అంతర్జాతీయంగా సేకరించిన డేటాను ఒకే దగ్గర భద్రపర్చుకుని, వినియోగించుకునే విదేశీ సంస్థలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదిక తెలిపింది. దేశీయంగా డేటా, ఇన్ఫ్రా అభివృద్ధి, ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్, నియంత్రణపరమైన సవాళ్ల పరిష్కారం, దేశీ డిజిటల్ ఎకానమీకి ఊతమివ్వడం తదితర అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వం ప్రత్యేక ఈ–కామర్స్ విధానం ముసాయిదా రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపైనే అమెరికా తాజాగా స్పందించింది. భారత్‌లో భారీ టారిఫ్‌లు.. ఇక భారత వాణిజ్య విధానాలపై కూడా నివేదికలో అమెరికా విమర్శలు గుప్పించింది. పలు అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యంత భారీగా సుంకాలు విధిస్తోందని పేర్కొంది. పూలపై 60 శాతం, రబ్బర్‌పై 70 శాతం, ఆటోమొబైల్స్‌పై 60 శాతం, మోటార్‌సైకిల్స్‌పై 50 శాతం, కాఫీ మొదలైనవాటిపై 100 శాతం, ఆల్కహాలిక్ బెవరేజెస్‌పై 150 శాతం దిగుమతి సుంకాలు విధిస్తోందని పేర్కొంది. అంతేగాకుండా వాణిజ్యానికి అవరోధాలు కల్పించేలా కొన్ని వైద్యపరికరాల ధరలను నియంత్రించడం, ఇథనాల్ దిగుమతులపై ఆంక్షలు విధించడం వంటివి కూడా చేస్తోందని ఆరోపించింది. ఈ–కామర్స్ ముసాయిదాతో డిజిటల్ లక్ష్యాలకు విఘాతం ఐఏఎంఏఐ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో 2022 నాటికల్లా 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి విఘాతం కలిగించేదిగా ఈ–కామర్స్ విధాన ముసాయిదా ఉందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. దీనివల్ల ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. డేటా, ఇన్ఫ్రా అభివృద్ధి, ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్, నియంత్రణ నిబంధనలపరమైన సవాళ్లు, దేశీ డిజిటల్ ఎకానమీ వృద్ధికి తీసుకోదగిన చర్యలు మొదలైన వాటికి సంబంధించి రూపొందించిన జాతీయ ఈ–కామర్స్ విధాన ముసాయిదాపై పరిశ్రమవర్గాల స్పందన కోరిన మీదట ఐఏఎంఏఐ తాజా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ‘డేటా లోకలైజేషన్ తప్పనిసరి చేయడం, ఈ–కామర్స్ పరిధిలోకి డిజిటల్ అడ్వర్టైజింగ్.. ఆన్లైన్ స్ట్రీమింగ్ మొదలైనవన్నీ చేర్చడం, డిజిటల్ సేవల్లోకి విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించే అవకాశాలు మొదలైనవాటి వల్ల ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీని నిర్మించాలంటే ఇవే చాలా కీలకం‘ అని పేర్కొంది. -
ఐటీగ్రిడ్స్ స్కాం: అధికారుల్లో టెన్షన్.. టెన్షన్
సాక్షి, అమరావతి: ఏపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్ స్కాంపై అధికారుల్లో టెన్షన్ నెలకొంది. డేటాచోరీ స్కాం బయటకు రావడంతో ఎవరి గుట్టు బయటపడుతోందోనని ఆందోళన చేందుతున్నారు. దీనిలో అధికారులు పాత్ర ఉందా? లేక ఉద్యోగుల పాత్రనా? అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. రియల్ టైం గవర్నెన్స్, 1100, ప్రజాసాధికార సర్వే డేటా వంటి సంస్థలపై పలు అనుమానాలు వ్యక్తమతున్నాయి. ప్రభుత్వం వాటిలో ముఖ్యమైన పౌరసమాచారాన్ని భద్రపరిచింది. ప్రభుత్వం పథకాల అర్హులను గుర్తించేందుకు గతంలో లబ్దిదారుల ఓటరు కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను ప్రభుత్వం సేకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడా సమాచారం చోరీకి గురైందన్న ఆరోపణలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి. డేటా చోరీ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి లోకేష్ టీం ప్రమేయంపైనా టీడీపీలో చర్చజరుగుతోంది. -
పెరుగుతున్న బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు
న్యూఢిల్లీ: దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. డేటా వినియోగం భారీగా వృద్ది చెందుతోందని, ఈ ఏడాది ఆగస్టులో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 46.36 కోట్లకు పెరిగిందని టెలికం డిపార్ట్మెంట్(డీఓటీ) తెలిపింది. అంతకు ముందటి నెల జూలైలో ఉన్న వినియోగదారుల సంఖ్య(46 కోట్లు)తో పోల్చితే 0.74 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. డాట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ∙ఈ ఏడాది జూలైతో పోల్చితే ఆగస్టులో మొత్తం ఫోన్ వినియోగదారుల సంఖ్య 97.3 లక్షలు పెరిగి 118.9 కోట్లకు చేరింది. వీరిలో వైర్‌లైన్ ఫోన్ వినియోగదారుల వృద్ధి అంతంతమాత్రంగా ఉండగా, వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 0.84 శాతం వృద్ధిచెంది 116.7 కోట్లకు ఎగసింది. ∙ఈ ఆగస్టులో మొత్తం ఫోన్ కనెక్షన్లు అధికంగా ముంబైలో పెరిగాయి. ముంబైలో 19.35 లక్షల ఫోన్ కనెక్షన్లు పెరిగాయి. -
అభ్యర్థుల ప్రొఫైల్
ఒకరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చి అదే బాటలో రాణిస్తుంటే.. మరికొందరు ఎలాంటి అనుభవం లేకున్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చి తమ చరిష్మా చూపించారు. అతిచిన్న వయస్సులోనే క్యాబినెట్ హోదా పొందినవారూ ఉన్నారు. ఇ లా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్రరాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా వారి ప్రొఫైల్స్ ఇవే.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రొఫైల్ పేరు : పరిగె శ్రీనివాస్‌రెడ్డి తల్లిదండ్రులు : పరిగె రాజారెడ్డి, పాపమ్మ వయస్సు : 10–02–1950 కులం : రెడ్డి (ఓసి) విద్యార్హత : ఇంజనీరింగ్ (బీఈ–డిస్కంటిన్యూ) స్వగ్రామం : పోచారం (బాన్సువాడ మండలం) కుటుంబం : భార్య పుష్ప, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె (రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి) రాజకీయ ప్రస్థానం: 1978లో దేశాయిపేట సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నిక 1989లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి బాలాగౌడ్ చేతిలో ఓడిపోయారు. 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక 1993–1997లో టీడీపీ జిల్లా కన్వీనర్‌గా పదవీ బాధ్యతలు 1994లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నిక 1998లో గహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు 1999లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నిక 1999–2000 భూగర్భ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు 2001–02 గ్రామీణ, పంచాయతిరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు 2004లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. 2005 నుంచి 07 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక 2009లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌పై గెలుపు 2011లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థిపై 23వేల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నాలుగేళ్ల, 3 నెలలు కొనసాగారు. కాసుల బాల్‌రాజ్ బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసుల బాల్‌రాజ్ ప్రొఫైల్ పేరు : కాసుల బాల్‌రాజ్ తల్లిదండ్రులు : కాసుల బాబురావు వయస్సు : 01–01–1960 కులం : మున్నూరు కాపు విద్యార్హత : ఎస్ఎస్సి స్వగ్రామం : బాన్సువాడ రాజకీయ ప్రస్థానం: 1984– మున్నూరు కాపు సంఘంయువజన అధ్యక్షుడు. 1985 నుంచి 1990–యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు 1990 నుంచి 1998వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు 1992 నుంచి 1995 వరకు మార్కెట్ కమిటి అధ్యక్షులు–బాన్సువాడ 1995 నుంచి 2001 వరకు బాన్సువాడ సర్పంచ్ 22–7–2006 నుంచి 17–8–2008వరకు బాన్సువాడ ఎంపిపి 2009లో ప్రజా రాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బాన్సువాడ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి 6వేల ఓట్లు సాధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో 23వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి ప్రొఫైల్ పూర్తి పేరు : పొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డి తండ్రి పేరు : సురేందర్‌రెడ్డి తల్లి పేరు : అరుణ భార్య : అనన్య రెడ్డి స్వగ్రామం : కోమన్‌పల్లి, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా ప్రస్తుత నివాసం : విల్లా నెంబర్ : 177, అపమ ఫామ్ మిడోస్ కోంపల్లి, హైదరాబాద్ పిల్లలు : హృదయ్, అన్వి విద్యార్హత : బీటెక్ (ఈఈఈ) వృత్తి : రియల్ ఏస్టేట్ వ్యాపారం, బిల్డర్ నిర్వహించిన పదవులు : టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రత్యేకతలు : టీఆర్ఎస్ పార్టీ 13వ ఆవిర్భావ సభను 2013 ఏప్రిల్‌లో ఆర్మూర్‌లో నిర్వహించిన ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి వ్యాపార భాగస్వామిగా, మిత్రునిగా గుర్తింపు ఉంది. గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న గంపగోవర్ధన్ ప్రొఫైల్ అభ్యర్థి పేరు : గంప గోవర్ధన్ స్వస్థలం : బస్వాపూర్, భిక్కనూరు మండలం రాజకీయ ప్రస్థానం : 1987లో బస్వాపూర్ సింగిల్‌విండో చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. భిక్కనూరు మండల టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు. 1994 లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో టిక్కెట్ దక్కలేదు. ఆయన స్థానంలో యూసుఫ్‌అలీకి టీడీపీ టిక్కెట్ రావడంతో స్తబ్ధుగా ఉన్నారు. 1999 నుంచి 2000 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీడీపీ అ«ధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. 2004లో కామారెడ్డి స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. దీంతో టీడీపీ అభ్యర్థిగా ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి షబ్బీర్‌అలీపై విజయం సాధించారు. 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2014 లో మరోసారి టీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రభుత్వవిప్‌గా అసెంబ్లీ రద్దు వరకు పనిచేశారు. గడ్డం ఆనంద్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం ఆనంద్‌రెడ్డి ప్రొఫైల్ పేరు : గడ్డం ఆనంద్‌రెడ్డి తండ్రి పేరు : గడ్డం గంగారెడ్డి తల్లి పేరు : గడ్డం లక్ష్మీకాంతమ్మ భార్య పేరు : ఇందిరా రెడ్డి పిల్లలు : శిల్పారెడ్డి, కావ్యరెడ్డి చదువు : డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీర్ రాజకీయ ప్రస్థానం : 2008 లో డిచ్పల్లి నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. 2014లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రొఫైల్ పూర్తి పేరు : ఆశన్నగారి జీవన్‌రెడ్డి తండ్రి పేరు : వెంకట రాజన్న తల్లి పేరు : రాజాబాయి భార్య : రజితరెడ్డి స్వగ్రామం : జాన్కంపేట్, వేల్పూర్ మండలం, బాల్కొండ ప్రస్తుత నివాసం : ఇంటి నెం: 4–70/8/డీ/8, వెంకటేశ్వర కాలనీ, మామిడిపల్లి, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ పిల్లలు : అనౌషికారెడ్డి, అనణ్యరెడ్డి విద్యార్హత : ఎంఏ (రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ వృత్తి : వ్యవసాయం, వ్యాపారం, న్యాయవాది తమ్ముడు : రాజేశ్వర్‌రెడ్డి చెల్లెలు, బావ : కరుణ, శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన పదవులు : టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ నియోజకవర్గం ఇన్చార్జి. నిర్వహించిన బాధ్యతలు : 2014–2018 వరకు ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రత్యేకతలు : టీఆర్ఎస్ 13వ ఆవిర్భావ సభను 2013 ఏప్రిల్‌లో ఆర్మూర్‌లో నిర్వహించారు. 2014లో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిపై సుమారు 13 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న మహ్మద్‌అలీ షబ్బీర్ ప్రొఫైల్ అభ్యర్థి : మహ్మద్‌అలీ షబ్బీర్ స్వస్థలం : మాచారెడ్డి, (కామారెడ్డిలో స్థిరపడ్డారు) పుట్టిన తేది : 15–02–1957 రాజకీయ ప్రస్థానం : షబ్బీర్‌అలీ 1970లో ఎన్ఎస్యూఐ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తక్కువ కాలంలో ఎన్ఎస్యూఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. 1987లో మాచారెడ్డి మండలం ఎంపీపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గడ్డం రాజిరెడ్డి చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయారు.1989లో కామారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో 31 ఏళ్లకే మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ అభ్యర్థి గంపగోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. 1999లో టీడీపీ అభ్యర్థి యూసుఫ్‌అలీ చేతిలో ఓటమి చెందారు. 2004లో బీజేపీ అభ్యర్థి మురళీధర్‌గౌడ్ పై భారీ మెజార్టీతో గెలుపొంది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో టీడీపీ అభ్యర్థి గంపగోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. 2010లో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్ చేతిలో మరోసారి ఓటమి చెందారు. ప్రస్తుతం కామరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రేకులపల్లి భూపతి రెడ్డి రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ప్రొఫైల్ ఇది.. పేరు : డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తండ్రి పేరు : ఆర్.రాజారెడ్డి తల్లి పేరు : లక్ష్మీ నర్సమ్మ భార్య పేరు : వినోదిని. పిల్లలు : శ్రీనిత్రెడ్డి (కుమారుడు). పుట్టిన తేదీ : 12/02/1964 చదువు : ఎంఎస్ ఆర్థో స్వగ్రామం : జలాల్పూర్, నిజామాబాద్ రూరల్ మండలం ప్రస్తుత నివాసం : మారుతినగర్, కంఠేశ్వర్, నిజామాబాద్ 1995లో నగరం ఖలీల్వాడీలో తిరుమల ఆర్థోపెడిక్ నర్సింగ్ హోం ప్రారంభించారు. 2001లో ఐఎంఏ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక 2001 టీఆర్ఎస్లో చేరిక 2002లో టీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్‌చార్జీగా నియామకం. 2002లో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవ ఎన్నిక 2018లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రొఫైల్ పేరు : పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తండ్రి : గంగారెడ్డి తల్లి : రుక్మవ్వ నివాసం : నవీపేటలోని సిరన్‌పల్లి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పుట్టిన తేది : 02–08–1950 విద్యాభ్యాసం : డిగ్రీ బీఏ భాషలు : తెలుగు సతీమణి పేరు : సుచరిత పిల్లలు : రాధిక, రచన, రజిత్‌రెడ్డి కుటుంబం నేపథ్యం : సాధారణ రైతు కుటుంబం చేపట్టిన పదవులు : 1986–87లో సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ డెలిగెట్గా పని చేశారు. 1989లో బోధన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి కొత్త కొత్త రమాకాంత్ చేతిలో ఓటమి చెందారు. 1994లో ఎమ్మెల్యే టిక్కెట్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి పార్టీ అధిష్టానం సూచన మేరకు పోటీ నుంచి నిష్క్రమించారు. 1999, 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2006 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్ర వైద్య విద్యాశాఖ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్ చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉంటున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి బయోడేటా.. పేరు : బాజిరెడ్డి గోవర్థన్ తండ్రి పేరు : బాజిరెడ్డి దిగంబర్ పుట్టిన తేదీ : 17/02/1954 చదువు : బీఏ స్వగ్రామం : సిరికొండ మండలం చీమన్‌పల్లి ప్రస్తుత నివాసం : వాసవి స్కూల్ సమీపంలో, మహాలక్ష్మినగర్, నిజామాబాద్ పదవులు.. 1973 లో పోలీస్ పటేల్ 1981లో సర్పంచ్ 1987– 1990లో మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) 1994–2004లో ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరక్టర్ 1994లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1999–2004లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నిక 2004–2008లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నిక 2009లో బాన్సువాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు 2014లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నిక బిగాల గణేశ్ గుప్తా నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్త ప్రొఫైల్ పూర్తి పేరు : బిగాల గణేశ్‌గుప్తా భార్యపేరు : లత పుట్టిన ఊరు : మాక్లూర్ పిల్లలు : ఇద్దరు కుమార్తెలు(రిది, రియ) పుట్టిన సంవత్సరం : 17/04/1970 తండ్రిపేరు : కృష్ణమూర్తిగుప్తా తల్లిపేరు : సువర్ణమాల రాజకీయం : 2009లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ ,2014లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నిక మాట్లాడే భాషలు : తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, కనడ, ఉర్దూ తమ్ముడు : మహేశ్ బిగాల చెల్లెళ్లు : రాణి, వాణి స్కూల్ విద్యాభాస్యం : జెడ్పీహెచ్ఎస్(మాక్లూర్) ఇంటర్ విద్య : సీఎస్ఐ కళాశాల(నిజామాబాద్) ఉన్నత విద్య : బీఈ సివిల్ గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల(బీదర్) బిగాల గణేశ్‌గుప్తా తాత బిగాల గంగారాం మాక్లూర్ గ్రామానికి 1961లో మొట్టమొదటి గ్రామ సర్పంచ్ పనిచేశారు. -
కూల్‌డ్రింక్ కన్నా 1జీబీ డేటా చౌక..
టోక్యో : భారత్‌లో డిజిటల్ మౌలిక వసతులు వేగంగా విస్తరిస్తునన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. జపాన్ పర్యటన సందర్భంగా ప్రదాని మోదీ దేశంలో కూల్‌డ్రింక్ కంటే 1జీబీ డేటా చౌకగా లభిస్తోందని అన్నారు. ఇండో-జపాన్ వార్షిక సదస్సులో భాగంగా సోమవారం ప్రధాని పలువురు జపాన్ నేతలతో భేటీలతో పాటు భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ శరవేగంతో పురోగమిస్తున్నాయని చెప్పుకొచ్చారు. 2022 నాటికి భారత్‌లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ లక్ష డాలర్లకు పెరిగి పది లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. గ్రామాలకు సైతం బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ చేరువైందని, దేశంలో 100 కోట్ల మొబైల్ వినియోగదారులున్నారని చెప్పారు. అందుబాటు ధరలో లభిస్తున్న డేటాతో సేవల సరఫరా సులభంగా మారిందన్నారు. మార్షల్ ఆర్ట్స్‌కు పెట్టింది పేరైన జపాన్‌లో కబడ్డీ, క్రికెట్‌ను పరిచయం చేసిన భారత సంతతి సేవలను ఆయన ప్రశంసించారు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త వార్షికప్లాన్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ప్రధానంగా రిలయన్స్ జియోకు కౌంటర్‌గా కొత్త వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1097ల విలువైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో మొత్తం 25జీబీ డేటాను, అన్లిమిటెడ్ కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. వాలిడిటీ 365 రోజులు. ప్రస్తుతానికి కోలకతా సర్కిల్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. జనవరి 6, 2019వరకు ఈ వార్షికప్లాన్ లభ్యం కానుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. జియో రూ.1699 ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ డేటా చొప్పున సంవత్సరమంతా డేటా ఉచితం. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్,రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తోంది. -
ఇక డేటా పక్కా లోకల్!
సాక్షి, హైదరాబాద్: డేటా లోకలైజేషన్.. వినియోగదారుల సమాచారమంతా దేశీయంగా నిల్వ చేసే ప్రక్రియ.. ఇందుకు పేమెంట్ కంపెనీలకు ఆర్బీఐ విధించిన గడువు సోమవారంతో పూర్తయింది. ఈ గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని బహుళ జాతి సంస్థలు కోరినా కేంద్రం మాత్రం తిరస్కరించింది. దీంతో అంతర్జాతీయ కంపెనీల్లో గుబులు పెరిగిపోయింది. ఇక మీదట దేశ పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా భారత్ భూభాగంలోని సర్వర్లలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల భారత్‌లోని అమెరికా వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన పెరిగిపోతోంది. గతంలో కొన్ని టెక్ సంస్థలు డేటా లోకలైజేషన్ నిబంధనలు సరికావని, వాటిని సడలించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఇప్పుడు అమెరికా సెనేటర్లు జాన్ కార్నిన్, మార్క్ వార్నర్ కూడా దీనికి వ్యతిరేకంగా గళమెత్తారు. ‘డేటాను స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధనల వల్ల భారత్‌లో వ్యాపారాలు చేయడం కష్టమవుతుంది. పౌరుల సమాచారం గోప్యంగా ఉంచేందుకు కంపెనీలన్నీ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నపుడు డేటాను నిల్వచేసే సర్వర్లు ఎక్కడున్నా నష్టమేంటి?’అంటూ ఆ సెనేటర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తుందని వారు హెచ్చరించారు. డేటా లోకలైజేషన్ అంటే వివిధ రకాలైన ఆర్థిక సంస్థలు, చెల్లింపు సంస్థలు, వినియోగదారులతో వ్యవహారాలు ముడిపడే ఇతర సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వినియోగదారుల సమాచారం వేరే దేశంలోని సర్వర్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత గాల్లో దీపంలా మారింది. సమాచార భద్రత ముసాయిదా బిల్లులో భాగంగా డేటాను దేశీయంగా ఉండే సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలన్న సూచనలు ఉన్నాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రూపొందించిన వ్యక్తిగత సమాచార భద్రత బిల్లులో అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించే పనిలో కేంద్రం ఉంది. అది చట్టరూపం దాల్చేలోగానే డేటాను లోకలైజ్ చేయాలన్న ఉద్దేశంతో 6 నెలల కింద ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించింది. గ్లోబల్ డిజిటల్ పేమెంట్ కంపెనీలన్నీ దేశీయంగా సమాచారాన్ని నిల్వ చేయాలంటూ అక్టోబర్ 15వరకు గడువు విధించింది. కంపెనీల దారెటు ? అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు కంపెనీలైన వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఫేస్బుక్, పేపాల్, మాస్టర్‌కార్డు, గూగుల్ వంటి సంస్థలపై ఈ లోకలైజేషన్ ప్రభావం పడుతుంది. అయితే ఆర్బీఐ నిబంధనల్ని పాటిస్తూ స్థానికంగా వినియోగదారుల సమాచారాన్ని నిల్వ చేసే ప్రక్రియ వాట్సాప్ పూర్తి చేయగా, గూగుల్ అంగీకరించింది. దేశంలోని మొత్తం 80 పేమెంట్స్ సర్వీసుల్లో 64 కంపెనీలు డేటా లోకల్‌గా నిల్వ చేయడానికి సిద్ధమని ప్రకటించాయి. మరో 16 సంస్థలు గడువు కోరాయి. అమెజాన్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు మాత్రం డేటా లోకలైజేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ కంపెనీలపై భారం ఎలా? డేటా నిల్వ చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలన్నీ భారత్‌లో కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మౌలిక సదుపాయాల కల్పనకే భారీగా ఖర్చు అవుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్రాలు ఉండటం వల్ల అదే పని తిరిగి చేయాల్సి వస్తుంది. మానవ వనరుల్ని భారత్‌లో వినియోగించాల్సి రావడం కూడా ఆ కంపెనీలకు అదనపు భారమే. చెల్లింపు సంస్థలు మాత్రమే కాకుండా, అన్ని రకాల కంపెనీలు వినియోగదారుల సమాచారాన్ని స్థానికంగా నిల్వ చేయడం వల్ల మార్కెటింగ్ వ్యూహాలను రచించేందుకు వినియోగదారుల సమాచార సేకరణ సంక్లిష్టంగా మారుతుంది. దేశీయంగా వరం ఎలా? అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక మోసాలు, అక్రమాలు జరిగినప్పుడు భద్రతా సంస్థలకి సమాచార సేకరణ సులభమవుతుంది. డేటా అనలిస్టులు,సైంటిస్టుల వంటి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. భారత్‌లో పేమెంట్ స్టార్టప్ కంపెనీలకు ఇదో పెద్ద వరం. వ్యాపారాల నిర్వహణలో ఇతర అంతర్జాతీయ సంస్థలతో సమాన అవకాశాలు లభిస్తాయి. ఆర్బీఐ వేచి చూసే ధోరణి డేటా లోకలైజేషన్ అంశంలో పలు గ్లోబల్ పేమెంట్ కంపెనీలు గడువు పెంచాలని కోరినా ఆర్బీఐ నిరాకరించింది. 6 నెలల సమయం ఇచ్చామని, ఇక ఇచ్చే పని లేదని తేల్చి చెప్పింది. భారత్‌లో ఇప్పటికీ సెంటర్లు ఏర్పాటు చేయని కంపెనీలు క్లౌడ్ విధానం ద్వారా సమాచారాన్ని నిల్వ చేసి, అతి త్వరలోనే భారత్ సెంటర్లకి మార్చాలని సూచించింది. అంతవరకు కంపెనీలపై వేచి చూసే ధోరణి అవలంబించాలని నిర్ణయించింది. -
ఇక డేటా అంతా లోకల్
డేటా లోకలైజేషన్.. వినియోగదారుల సమాచారాన్నంతటినీ దేశీయంగా నిల్వ చేసే ప్రక్రియ.. ఇందుకోసం పేమెంట్ కంపెనీలకు ఆర్బీఐ విధించిన గడువు సోమవారంతో పూర్తయింది. ఈ గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని బహుళ జాతి సంస్థలు కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో అంతర్జాతీయ కంపెనీల్లో గుబులు పెరిగిపోయింది. ఇక మీదట పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నయినా భారత్ భూభాగంలోని సర్వర్లలోనే ఏ కంపెనీలైనా నిల్వ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల భారత్‌లోని అమెరికా వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన పెరిగిపోతోంది. గతంలో కొన్ని టెక్ సంస్థలు డేటా లోకలైజేషన్ నిబంధనలు సరికావని, వాటిని సడలించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా సెనేటర్లు జాన్ కార్నిన్, మార్క్ వార్నర్ కూడా దీనికి వ్యతిరేకంగా గళమెత్తారు.‘‘డేటాను స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధనల వల్ల భారత్‌లో వ్యాపారాలు చేయడం కష్టమవుతుంది. పౌరుల సమాచారం గోప్యంగా ఉంచడానికి కంపెనీలన్నీ పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పుడు డేటాను నిల్వ చేసే సర్వర్లు ఎక్కడ ఉంటే వచ్చే నష్టమేమిటి’’ అంటూ ఆ సెనేటర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ అంశంలో అమెరికా, భారత్ ప్రజా ప్రతినిధుల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. లేదంటే విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తుందని వారు హెచ్చరించారు. అంతర్జాతీయ కంపెనీలపై భారం ఎలా ? అంతర్జాతీయ కంపెనీలన్నీ డేలా నిల్వ చేయడం కోసం భారత్‌లో కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు తడిసి మోపెడైపోతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్రాలు ఉండడం వల్ల అదే పని తిరిగి చేయాల్సి వస్తుంది. మానవ వనరుల్ని భారత్‌లో వినియోగించాల్సి రావడం కూడా ఆ కంపెనీలకు అదనపు భారమే కేవలం చెల్లింపు సంస్థలు మాత్రమే కాకుండా, ఇతరత్రా అన్ని రకాల కంపెనీలు వినియోగదారుల సమాచారాన్ని స్థానికంగా నిల్వ చేయడం వల్ల మార్కెటింగ్ వ్యూహాలను రచించడం కోసం వినియోగదారుల సమాచార సేకరణ సంక్లిష్టంగా మారుతుంది. దేశీయంగా వరం ఎలా ? అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక మోసాలు, అక్రమాలు జరిగినప్పుడు భద్రతా సంస్థలకి సమాచార సేకరణ సులభమవుతుంది. డేటా అనలిస్టులు,సైంటిస్టుల వంటి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. భారత్‌లో పేమెంట్ స్టార్టప్ కంపెనీలకు ఇదో పెద్ద వరం. వ్యాపారాల నిర్వహణలో ఇతర అంతర్జాతీయ సంస్థలతో వాటికీ సమాన అవకాశాలు లభిస్తాయి. డేటాలో కలైజేషన్ అంటే వివిధ రకాలైన ఆర్థిక సంస్థలు, చెల్లింపు సంస్థలు, వినియోగదారులతో వ్యవహారాలు ముడిపడే ఇతర సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ వినియోగదారుల సమాచారం ఏ అమెరికాలోనో, ఐరోపాలోని సర్వర్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భద్రత గాల్లో దీపంలా మారింది. సమాచార భద్రతా ముసాయిదా బిల్లులో భాగంగా డేటాను దేశీయంగా ఉండే సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలన్న సూచనలు ఉన్నాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రూపొందించిన వ్యక్తిగత సమాచార భద్రతా బిల్లులో అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించే పనిలో కేంద్రం ఉంది. అది చట్టరూపం దాల్చేలోగానే డేటాను లోకలైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆరు నెలల క్రితం ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించింది. గ్లోబల్ డిజిటల్ పేమెంట్ కంపెనీలన్నీ దేశీయంగా సమాచారాన్ని నిల్వ చేయాలంటూ అక్టోబర్ 15వరకు గడువు విధించింది. కంపెనీల దారెటు ? అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు కంపెనీలైన వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఫేస్బుక్, పేపాల్, మాస్టర్‌కార్డు, గూగుల్ వంటి సంస్థలపై ఈ లోకలైజేషన్ ప్రభావం పడుతుంది. అయితే ఆర్బీఐ నిబంధనల్ని పాటిస్తూ స్థానికంగా వినియోగదారుల సమాచారాన్ని నిల్వ చేసే ప్రక్రియ వాట్సాప్ పూర్తి చేస్తే, అలా చేయడానికి గూగుల్ అంగీకరించింది. దేశంలోని మొత్తం 80 పేమెంట్స్ సర్వీసుల్లో 64 కంపెనీలు డేటా లోకల్‌గా నిల్వ చేయడానికి సిద్ధమని ప్రకటించాయి. మరో 16 సంస్థలు గడువు కోరాయి. అమెజాన్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు మాత్రం డేటా లోకలైజేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల అమెరికా, భారత్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత క్షీణిస్తాయంటూ ఆ సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు చేశాయి. ఆర్బీఐ వేచి చూసే ధోరణి డేటా లోకలైజేషన్ అంశంలో పలు గ్లోబల్ పేమెంట్ కంపెనీలు గడువు పెంచాలని కోరినప్పటికీ ఆర్బీఐ నిరాకరించింది. ఆరు నెలల సమయం ఇచ్చామని, ఇక ఇచ్చే పని లేదని తేల్చి చెప్పింది. భారత్‌లో ఇప్పటికీ సెంటర్లు ఏర్పాటు చేయని కంపెనీలు క్లౌడ్ విధానం ద్వారా సమాచారాన్ని నిల్వ చేసి, అతి త్వరలోనే భారత్ సెంటర్లకి మార్చాలని సూచించింది. అంతవరకు కంపెనీలపై వేచి చూసే ధోరణి అవలింబించాలని నిర్ణయించింది. -
సమాచార నిల్వపై మోదీకి అమెరికా సెనెటర్ల లేఖ
వాషింగ్టన్: టెక్నాలజీ కంపెనీలు భారత వినియోగదారుల సమాచారాన్ని భారత్‌లోనే నిల్వ చేయాలన్న నిబంధనపై సానుకూల వైఖరిని అనుసరించాలని ప్రధాని మోదీని కోరుతూ ఇద్దరు అమెరికా సెనెటర్లు లేఖ రాశారు. ఈ నిబంధన కారణంగా అమెరికా సంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల నేతలు జాన్ కోర్నిన్, మార్క్ వార్నర్‌లు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలాగైతే కంపెనీలు భారత్‌లో సమర్థంగా వ్యాపారం చేయలేవనీ, అదే జరిగితే భారత ఆర్థిక లక్ష్యాల సాధనకు ఆటంకాలు ఎదురవుతాయని హెచ్చరించారు. భారత్‌లోనే సమా చారాన్ని నిల్వ చేసినంత మాత్రాన భారతీయుల డేటాకు భద్రత ఏమీ లభించదని అభిప్రాయపడ్డారు. -
భారత్‌లోనే పేమెంట్స్ డేటా స్టోరేజి: వాట్సాప్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా చెల్లింపుల సంబంధిత డేటాను భారత్‌లోనే భద్రపర్చేలా (డేటా లోకలైజేషన్) తగు వ్యవస్థను రూపొందించుకున్నట్లు మొబైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా పది లక్షల మందితో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందరికీ దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాట్సాప్‌నకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 130 కోట్ల మంది యూజర్లు ఉండగా అందులో 20 కోట్ల మంది యూజర్లు భారత్‌లోనే ఉన్నారు. చెల్లింపు సేవలు అందించే సంస్థలన్నీ తత్సంబంధిత డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలంటూ ఆదేశించిన రిజర్వ్ బ్యాంక్ ఇందుకోసం అక్టోబర్ 15 దాకా గడువునిచ్చింది. దీనికి అనుగుణంగానే వాట్సాప్ తాజా ప్రకటన విడుదల చేసింది. -
వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది..!
సాక్షి,సిటీబ్యూరో: దాదాపు పదిరోజులుగా నిలిచిపోయిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆన్లైన్ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి హెచ్ఎండీఏ సంస్థకు చెందిన అధికారి జీమెయిల్‌కు వచ్చిన మాల్వేర్ను నొక్కారు. దీంతో సంస్థ సర్వర్లలోకి వైరస్ ప్రవేశించి ఆవి పనిచేయడం మానేశాయి. అంతేకాకుండా డేటా సైతం ఎన్‌క్రిప్ట్ అయింది. దీంతో డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్), లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల వివరాలు తెరుచుకోలేదు. దీంతో ఆయా సేవలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో అధికారుల్లోనూ, అటు దరఖాస్తుదారుల్లోనూ ఆందోళన మొదలైంది. కొన్ని రోజులు కంప్యూటర్లతో కుస్తీ పట్టిన ఇక్కడి అధికారులు సమస్యను పరిష్కరించలేకపోవడంతో స్టేట్ డేటా సెంటర్లోని సెక్యూరిటీ ఆపరేటర్ సెంటర్‌ను సంప్రదించారు. ఆన్లైన్లో తెరుచుకోలేని అన్ని దరఖాస్తుల ఎన్క్రిప్ట్లను అక్కడికి పంపించగా.. పరిశోధించిన అధికారులు చివరకు వాటికి సాంకేతిక పరిష్కారం కనుగొని డేటాను తిరిగి రాబట్టారు. దీంతో హెచ్ఎండీఏ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సర్వర్లలోని హెచ్ఎండీఏ డీపీఎంఎస్, ఎల్ఆర్ఎస్ డేటా భద్రంగా ఉండడంతో దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సోమవారం ఉదయం 9.30 నుంచి ఎప్పటిలాగే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ఆదివారం ప్రకటించారు. కొన్ని రోజులుగానిలిపివేసిన సేవలు పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకున్నామని, సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ కూడా చేశామని ఆయన తెలిపారు. మేల్కోకుంటే మళ్లీ మాల్‘బేర్’.. హెచ్ఎండీఏ అధికారి మెయిల్‌కు వచ్చిన మాల్వేర్ వైరస్ మొత్తం సంస్థ పనిపై తీవ్ర ప్రభావం చూపించింది. దాదాపు పది రోజుల పాటు సంస్థ సేవలు నిలిపివేయాల్సి వచ్చింది. అన్లైన్ ఫైళ్లు కరప్ట్ కాకుండా ఉండేందుకు డీపీఎంఎస్ సేవలు అందిస్తున్న సాఫ్టెక్ సంస్థతో పాటు ఐటీ అధికారులు యాంటీ వైరస్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంపై దృష్టి సారించాలి. అలాగే సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలు, సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న మోసాలపై హెచ్ఎండీఏ సిబ్బందిని జాగృతి చేయాల్సిన అవసరముందని నిపుణులు అంటున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పంపిన మాల్వేర్ వైరస్‌తో ఇప్పటిలా హెచ్ఎండీఏ ఆన్లైన్ సేవలన్నీ నిలిపివేయాల్సిన పరిస్థితి మళ్లీ రాకుండా సమూల చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఐటీ అధికారులతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులతో హెచ్ఎండీఏ సిబ్బందికి సైబర్ నేరాలపై అవగాహన కలిగించాలని హెచ్ఎండీఏ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలు.. మాల్వేర్ దెబ్బతో హెచ్ఎండీఏ సిబ్బంది ఇంటర్నెట్ను విచ్చలవిడిగా వినియోగించడంపై ఆంక్షలు విధించినట్టు తాజాగా సమాచారం. ఫేస్బుక్, అర్కుట్, ట్విట్టర్ వంటి సేవలను పూర్తిగా నిషేధించారు. అధికారిక పనుల కోసం మాత్రం ‘హెచ్ఎండీఏ.జీఓవీ.ఇన్’ పేరు వచ్చేలా సిబ్బంది అందరికీ మెయిల్స్ క్రియేట్ చేసి వాటి ద్వారానే పనులు చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జీమెయిల్స్ కూడా ఇష్టమొచ్చినట్టుగా ఉపయోగించవద్దని ఆదేశించారు. వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది..! దాదాపు పదిరోజుల పాటు హెచ్ఎండీఏ ఆన్లైన్ సేవలను స్తంభింపజేసిన ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంపై హెచ్ఎండీఏ ఐటీ అధికారులు దృష్టి సారించారు. రష్యా, రొమేనియా, పాకిస్థాన్, హాంకాంగ్ తదితర దేశాల్లో మాల్వేర్ కోడ్ రాసి మెయిల్స్ చేస్తూ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల సేవలను స్తంభింపచేయడం పరిపాటిగా మారింది. అయినా మాల్వేర్(వైరస్) మెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందన్న కోణంలో తెలుసుకునే పనిలో పడ్డారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ మెయిల్ ఎవరు పంపించారనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని సిబ్బంది అంటున్నారు. ఇక్కడివారే కావాలని పంపించారా, లేదంటే ఇతర దేశాల నుంచి వచ్చిందా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. -
ప్రముఖ డేటా సంస్థలో భారీ ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: యూకే ఆధారిత డేటా డెవలపర్ డన్ హంబీ కంపెనీ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న నెలల్లో భారతదేశంలో మరింత మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రపంచ రిటైల్ వ్యాపారం రంగంలో భారత్ ప్రకాశవంతమైన ప్రదేశంగా ఉన్నందున ఈ సంస్థ తన గ్లోబల్ వినియోగదారులను పెంచుకుందని డన్హంబీ చీఫ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్షన్ ఆఫీసర్ డేవిడ్ జాక్ తెలిపారు. 25 శాతం కన్నా ఎక్కువ వృద్ధిని సాధించిందన్నారు. రానున్న నెలల్లో భారతదేశంలో తమ టాలెంట్ పూల్‌ను మరింత పెంచుతామని ఆయన అన్నారు. జనాభా పరిమాణం, రిటైల్ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ భారీ అవకాశాలను కలిగి ఉందని డేవిడ్ జాక్ చెప్పారు. -
జియో న్యూ స్కీం: మోర్ డేటా, మోర్ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో మరో కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. 799 రూపాయల ప్రీపెయిడ్ ప్యాక్‌ను జియో కస్టమర్లకు అందబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో రోజుకు 6.5జీబీ డేటాను అందిస్తోంది. రూ. 799 ప్రీపెయిడ్ ప్లాన్‌పై జియో యూజర్లు 182 జీబీ హై-స్పీడ్ 4జీడేటాను పొందవచ్చని జియో విడుదల చేసిన ఒక ప్రకటన లో వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం రూ. 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లానన్పై అదనపు డేటా ప్రయోజనాలను అదిస్తున్నది. 28 రోజులు వాలిడిటీతో రోజుకు 6.5జీబీ హై-స్పీడ్ 4 జి డేటా ఉచితం. ఇంకా అన్లిమిటెడ్ కాల్స్, 100ఎస్ఎంఎస్లు ఉచితం. జూన్ 30వరకు ఈ ప్లాన్ రీచార్జ్‌కు అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. అంతేకాదు 300 రూపాయలు, ఆపైన రీచార్జ్‌లపై 100 డిస్కౌంట్‌ను, రూ.300లోపు రీచార్జ్‌లపై 20శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. అయితే రూ. 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వాస్తవంగా 28 రోజుల వ్యవధిలో రోజుకు 5జీబీ డేటా చొప్పున 140జీబీ డేటాను అందిస్తుంది. తాజా రివ్యూ అనంతరం రోజుకు 1.5 జీబీ డేటా అదనంగా ఆఫర్ చేస్తోందన్నమాట. కాగా రూ.149, రూ.349, రూ. 399, రూ. 449 తదిర రీచార్జ్‌ప్లాన్లపై రోజుకు వాస్తవంగా అందిస్తున్న 4 జీజీ డేటా ఆఫర్‌ను పెంచిన సంగతి తెలిసిందే. -
జియోకి కౌంటర్ : బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర ప్రకటించింది. ఫిపా వరల్డ్ కప్ 2018 నేపథ్యంలో జియోకు పోటీగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. స్పెషల్ డేటా ఎస్టీవీ రూ.149 కే అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రోజుకు 4 జీబీ మొబైల్ డేటా ఫ్రీ అందిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ ఫుట్‌బాల్ ప్రపంచ్ కప్ పోటీ సందడి మొదలైన నేపథ్యంలో క్రీడాభిమానులకోసం ఈ స్పెషల్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఈ భారీ డేటాతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు లభిస్తాయి. జూన్ 14 నుండి జూలై 15వతేదీ ఈ ప్లాన్ (ఫిఫా వరల్డ్ కప్ జరిగే చివరి తేదీ) అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కాగా జియోలో రూ.149 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుండగా, దీనికి అదనంగా తాజాగా రోజూ మరో 1.5 జీబీ డేటాను జియో ప్రారంభించింది. దీంతో ఈ ప్లాన్‌లో జియో కస్టమర్లకు రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ ఆఫర్ చేస్తోంది. -
టెక్ దిగ్గజాలకు పెరుగుతున్న బీపీ..!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి టెక్ దిగ్గజాలకు షాకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డేటా గోప్యతపై ఇటీవల వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో కొత్త నిబంధనలతో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టెక్ దిగ్గజాల నియంత్రణకోసం మాజీ జడ్జ్ బీఎన్ శ్రీకృష్ణ(77) కొత్త డేటాగోప్యతా చట్టాలను రూపొందించారు. సమాచార పరిరక్షణ కుద్దేశించిన నియయాలు, నిబంధనలను రూపొందించేందుకు నియమించిన కమిటీ త్వరలోనే తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇటీవల ఫేసబుక్‌లో లక్షల కొద్దీ యూజర్ల డేటా లీక్ అయిన నేపథ్యంలో ఆయన ప్రతిపాదనలకు ప్రాధాన్యత చేకూరనుంది. జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని 10మంది సభ్యులుగల ఈ కమిటీ ప్రైవసీ పరిరక్షణకు కొత్త నియమ నిబంధలను రూపొందించింది. వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగమేనా అనే అంశంపై విచారణ జరుపుతున్న 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ వివరాలను సమర్పించనుంది. శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా ప్రతిపాదనలు డేటా ఉల్లంఘనకు చెక్ పెట్టనున్నాయని భావిస్తున్నారు. ఈ నివేదికలో డేటా ఫెయిర్ యూజ్ తదితరాలను పరిశీలించినట్టు సమాచారం. వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు బదిలీ చేయగలవా,గోప్యతా సమాచారం పై సంస్థల జవాబుదారీతనం, డేటా ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన కళిన చర్యలు తదితర అంశాలను నిర్వచించింది. అలాగే ఈయూలోని జీపీడీఆర్ మాదిరిగా వినియోగదారులు తమ సొంత సమాచారాన్ని యాక్సెస్ చేయగలరో లేదో కూడా శ్రీకృష్ణ కమిటీ నిర్ధారిస్తుంది. మరోవైపు మానవుల్లో బీపీ, సుగర్లను నిరంతరం మానిటర్ చేసుకుంటూ నియంత్రణలో ఉంచుకున్నట్టే డేటాపై కూడా నియంత్ర ఉండాలని శ్రీకృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలకు ఇక దడ మొదలైనట్టే! -
‘ఫేస్బుక్ డేటా’ దెబ్బతో దివాలా!
న్యూయార్క్: ఫేస్బుక్ యూజర్ల వివరాలను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా.. అమెరికాలో దివాలా పిటీషన్ వేసింది. దీనికి సంబంధించి దాఖలు చేసిన పత్రాల ప్రకారం కంపెనీ ఆస్తులు సుమారు 1– 5 లక్షల డాలర్ల మధ్య ఉంటాయి. రుణాలు 10 లక్షలు– కోటి డాలర్ల మధ్య ఉన్నాయి. బ్రిటన్‌లోనూ దివాలా పిటీషన్ వేయనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం కారణంగా తమ వ్యాపారం దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి అనుకూల ఫలితాలు వచ్చేలా.. లక్షల సంఖ్యలో ఫేస్బుక్ యూజర్ల డేటాను దుర్వినియోగం చేసిందంటూ కేంబ్రిడ్జ్ అనలిటికాపై ఆరోపణలున్నాయి. -
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
సాక్షి, ముంబై: భారతీ ఎయిర్టెల్ తాజాగా కొత్త డేటా ప్లాన్లను ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది . టెలికాం కంపెనీ వెబ్సైట్ ప్రకారం రెండు ప్లాన్లను లాంచ్ చేసింది . రూ. 49 , రూ. 92 ప్లాన్లను ప్రారంభించింది. అందుబాటు ధరలో, హైస్పీడ్ డేటాను వినియోగదారులకు అందించే లక్ష్యంగా వీటిని ప్రారంభించింది. రూ.49 ప్యాక్ ప్రామాణికత ఒక రోజు. ఇందులో 3జీబీ హై స్పీడ్ డేటా. మరొక ప్లాన్ రూ. 92 ప్యాక్ 7 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. 6జీబీ డేటా అందిస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ అధిక-వేగ డేటాను ఆఫర్ చేస్తుంది. డేటా వినియోగంపై రోజువారీ నిబంధన ఏదీ లేదు. అంటే ఏడు రోజుల్లోనూ ఎపుడైనా 6జీబీ డేటా వాడు కోవచ్చు. -
ఎయిర్టెల్ కొత్త ప్రిపెయిడ్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ సరికొత్త ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా రిలయన్స్ జియో భారతదేశంలో టాప్ టెలికాం ఆపరేటర్‌గా దూసుకుపోతున్నతరుణంలో జియోను నిలువరించే ప్లాన్లలో భాగంగా ఈ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే డేటా టారిఫ్ప్లాన్లనుంచి తన ఫోకస్‌ను హలో ట్యూన్స్ సెగ్మెంట్ వైపు మళ్లించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉచిత డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఉచిత హలో ట్యూన్లను కూడా అందిస్తుంది. ఇటీవల ప్రకటించిన రూ.219 ప్లాన్ తరహాలోనే మరో కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. టెలికాం టాక్ నివేదిక ప్రకారం రూ. 129 రీఛార్జ్ కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్లిమిటెడ్కాలింగ్ , రోజుకు 1జీబీ 4 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. దీనికి అదనంగా ఎయిర్టెల్ హలో ట్యూన్స్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ 28 రోజులు వాలిడిటీ. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
6 నెలల్లో 22 లక్షల కొత్త కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని మోదీ సర్కార్‌పై విపక్షాలు, విమర్శకులు విరుచుకుపడుతున్న వేళ ప్రభుత్వానికి తీపికబురు అందింది. గత ఆరు నెలల్లో ( ఫిబ్రవరి 28 వరకూ) దేశంలో దాదాపు 22 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఈపీఎఫ్ఓ, ఎన్‌పీఎస్‌లు జారీ చేసిన తాజా పేరోల్ జాబితా వెల్లడించింది. ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం 31 లక్షల మంది ఉద్యోగులు కొత్తగా ఖాతా తెరిచారని..వీరిలో 18.5 లక్షల మంది 18-25 సంవత్సరాల వయసు వారున్నారని, వీరంతా కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారని అంచనా. ఇక 3.5 లక్షల మంది కేంద్ర ఇతర ప్రభుత్వ ఉద్యోగులు నూతన ఖాతాలు తెరిచారని ఈ రెండింటినీ కలుపుకుని దేశంలో కొత్తగా 22 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని తేలింది. ఈపీఎఫ్ఓ, ఎన్‌పీఎస్‌తో పాటు ఉద్యోగుల ఆరోగ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) సైతం గణాంకాలను వెల్లడింది. గత ఆరునెలల్లో ఈఎస్ఐసీ కొత్తగా 18-25 సంవత్సరాల వయసున్న 8.3 లక్షల మందికి బీమా కల్పించినట్టు ప్రకటించింది. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా వీరు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారని వెల్లడైతే గత ఆరునెలల్లో 30 లక్షల మందికి పైగా ఉపాధి లభించినట్టువుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. -
గూగుల్ ప్లే యాప్స్‌పై సంచలన రిపోర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఫేస్బుక్ డేటా లీక్ వ్యవహారం యూజర్లలో అనేక సందేహాలను ,భయాలను రేకెత్తించగా తాజాగా ఓ సంచలన రిపోర్టు యూజర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గూగుల్ పిల్లలను గోప్యతా చట్టాలను ఉల్లఘింస్తోందనే ఆరోపణలుమరోసారి చెలరేగాయి. గూగుల్‌కు చెందిన 3వేలకు పైగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఉచిత యాప్స్‌లో వినియోగదారుల వ్యక్తగత వివరాలను అక్రమంగా ట్రాక్ అవుతోంది. ముఖ్యంగా బాలల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తోంది. అమెరికా ఫెడరల్ చట్టంలోని పిల్లల ఆన్లైన్ గోప్యతా రక్షణ చట్టం ( చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్)కు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకునేందుకు నిర్వహించిన ఒక ఇండిపెండెంట్ సర్వే ఈ షాకింగ్ అంశాలను వెల్లడించింది. ఒక నూతన ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఈ పరిశోధన నిర్వహించినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నేషనల్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ (ఐసిఎస్ఐ) నివేదించిన సమాచారం ప్రకారం, పరిశోధనలో భాగంగా గూగుల్ ప్లేలోని మొత్తం 5,855 ఆండ్రాయిడ్ యాప్స్‌ను పరిశీలించింది. వీటిలో సగానికి (3,337) పైగా ఫ్యామిలీ, పిల్లల యాప్స్ అమెరికా గోప్యతా చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా తస్కరిస్తున్నాయని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సుమారు 256 యాప్స్ 13 సంవత్సరాల లోపు పిల్లల లొకేషన్ డేటాను కూడా సేకరించిందట. ఇంత కీలకమైన వ్యక్తిగత వివరాలను సేకరించడం ఆందోళన కలిగించే అంశమని రిపోర్టు పేర్కొంది. వీటిలో పేర్లు, ఇమెయిల్, చిరునామాలు, ఫోన్ నంబర్లు లాంటివి ఉన్నాయని ఇండిపెండెంట్ నివేదిక పేర్కొంది. అయితే దీనిపై స్పందించేందుకు గూగుల్ ప్రతినిధులు అందుబాటులో లేరని తెలిపింది. గూగుల్‌కు చెందిన వీడియో ప్లాట్‌ఫాం యూ ట్యూబ్ ఉద్దేశపూర్వకంగా పిల్లల డేటాను సేకరిస్తూ కోపా నిబంధలను ఉల్లంఘింస్తోందంటూ 20కిపైగా కన్జ్యూమర్ ఎడ్వకసీ గ్రూప్స్ ఆరోపణల నేపథ్యంలో ఈ అధ్యయనం చేసింది. -
ఎయిర్టెల్ కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త కొత్త టారిఫ్‌లతో రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో పోటీ పడుతున్నాయి. డేటా ప్రయోజనాలను అందించడంలో టెలికాం ఆపరేటర్లు జోరుగా కదులుతున్నాయి. తాజాగా ఎయిర్టెల్ కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా జియో, బీఎస్ఎన్ఎల్కు దీటుగా రూ. 499 ధరలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించింది. తాజాగా లాంచ్ చేసిన రూ. 499 ప్లాన్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. యూజర్లు అన్ లిమిటెడ్, లోకల్, రోమిండ్ కాల్స్ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్ 82 రోజులు చెల్లుతుంది. దీని అర్థం, ఎయిర్టెల్ మొత్తం 164జీబీ డేటాను అందిస్తుందన్నమాట. బీఎస్ఎన్ఎల్ రూ.248కే 51 రోజుల పాటు రోజూ 3జీబీ డేటా ఆఫర్ ప్రకటించగా, జియో మాత్రం రూ.251 ప్లాన్ లో రోజూ 2జీబీ డేటాను 51 రోజుల పాటు అందిస్తున్న సంగతి తెలిసిందే. -
జియో ఎంట్రీ : వేల కోట్లు ఆదా!!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో వల్ల కన్సూమర్లకు వార్షికంగా రూ.65,000 కోట్లమేర ఆదా అయ్యి ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటీవ్నెస్ (ఐఎఫ్‌సీ) తాజాగా తన నివేదికలో పేర్కొంది. ‘జియో చౌక ధరల్లో డేటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. సగటున చూస్తే జీబీ డేటా ధర రూ.152 నుంచి రూ.10లకు తగ్గింది. డేటా ధరల్లో గణనీయమైన తగ్గుదల సమాజంలో కొందరు తొలిసారి డేటాను వినియోగించడానికి దోహదపడింది. ఇంటర్నెట్ను అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మా గణాంకాల ప్రకారం.. జియో ఎంట్రీ వల్ల కన్సూమర్లకు వార్షికంగా రూ.65,000 కోట్లు ఆదా అయ్యి ఉంటుంది’ అని ఐఎఫ్‌సీ వివరించింది. ఇంటర్నెట్ విస్తరణ పెరుగుదల వల్ల తలసరి జీడీపీలో వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ‘ఇండియన్ టెలికం మార్కెట్లోకి జియో ప్రవేశించిన దగ్గరి నుంచి పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి’ అని ఐఎఫ్‌సీ తెలిపింది. -
1000జీబీ ఎయిర్టెల్ బోనస్ డేటా
బ్రాడ్‌బ్యాండు యూజర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ తన బిగ్ బైట్ ఆఫర్‌ను 2018 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. దీని కింద బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు అదనంగా 1000జీబీ వరకు బోనస్ డేటా లభించనుంది. తొలిసారి ఈ ఆఫర్ 2017 మేలో లైవ్‌లోకి వచ్చింది. 2018 మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసింది. కానీ ఈ ఆఫర్‌ను అక్టోబర్ వరకు పొడిగించనున్నట్టు ఎయిర్టెల్ తాజాగా ప్రకటించింది. ఈ ఆఫర్ ఎయిర్టెల్ రూ.1099, రూ.1299 ప్లాన్లపై అందుబాటులో ఉంటుంది. బేస్ ప్లాన్‌పై ఎంత స్పీడులో డేటా లభిస్తోందో, బోనస్ డేటా కూడా అదే నెట్ స్పీడును యూజర్లకు అందుబాటులో ఉంటుంది. అదనపు డేటాను ప్రతి నెలా క్యారీ ఫార్వర్డ్ చేయనున్నామని, అలా 2018 అక్టోబర్ 31 వరకు లేదా డేటా ముగిసే వరకు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్ ధరలు రీజన్ రీజన్‌కు వేరువేరుగా ఉన్నాయి. ఢిల్లీ యూజర్లకైతే రూ.1099 ప్లాన్‌పై 250జీబీ అదనపు డేటాతో పాటు 1000జీబీ బోనస్ డేటా లభిస్తోంది. 100 ఎంబీపీఎస్ స్పీడులో ఈ డేటాను ఎంజాయ్ చేసుకోవచ్చు. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను కూడా యూజర్లు వినియోగించుకోవచ్చు.రెండో ఎయిర్టెల్ ప్లాన్ రూ.1299 కింద అపరిమిత కాల్స్‌ను, 250జీబీ బ్రాడ్‌బ్యాండ్ డేటాను, 1000జీబీ బోనస్ డేటాను యూజర్లు పొందుతారు. దీని స్పీడు కూడా 100ఎంబీపీఎస్. ఈ 1000 బోనస్ డేటాను పొందడమెలా? ఈ ఆఫర్‌ను పొందడానికి పేజీని విజిట్ చేసి, ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీ వివరాలను నమోదు చేయాలి. ఒక్కసారి ఆ ప్రక్రియంతా అయిపోయిన తర్వాత, అదనపు డేటా ఏడు రోజుల తర్వాత బేస్ ప్లాన్‌కు యాడ్ అవుతుంది. ఈ ఆఫర్ పొండానికి రెండు ప్లాన్లలో(రూ.1099, రూ.1299) ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
అవాస్తవ కథనాలపై లీగల్ చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ గోప్యత విషయంలో మీడియాల్లో వస్తున్న కథనాలపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) స్పందించింది. అసత్య కథనాలను, అవాస్తవాలను ప్రసారం చేసినా, ప్రచురించినా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జెడ్డీ నెట్ అనే వ్యాపార సంబంధిత వెబ్సైట్.. ఆధార్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆధార్ వ్యవస్థ పటిష్టంగా లేదని.. వినియోగదారుల వ్యక్తిగత విషయాలతోపాటు బ్యాంక్ వివరాలను కూడా సులువుగా బుట్టదాఖలు చేసే పద్ధతులు ఉన్నాయని.. అందుకు ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు సరిపోతాయంటూ పేర్కొంది. గతంలో ఇలాంటి వ్యవహారాలు(ఏజెంట్ల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ల ద్వారా, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా లీక్ కావటం) వెలుగులోకి వచ్చినప్పుడు వాటిని సరిచేసినట్లు ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ, ఇప్పటికీ అది ఆగలేదని జెడ్డీ నెట్ కథనం తెలిపింది. దీనిపై యూఐడీఏఐ స్పందించింది. ఆధార్ గోప్యతపై ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆధార్ సమాచారం అత్యంత సురక్షితంగా ఉందని.. సూపర్ కంప్యూటర్ నుంచి ఆధార్ సమాచారాన్ని తస్కరించాలంటే వందల కోట్ల సంవత్సరాలకు పైగా పడుతుందని పేర్కొంది. కాగా, ఆధార్ డేటా భద్రతపై సుప్రీం కోర్టులో ప్రజంటేషన్ ఇచ్చిన యూఐడీఏఐ 2048-ఎన్క్రిప్షన్ కీ సిస్టమ్‌లో భద్రంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఫేస్బుక్ డేటా స్కామ్.. మరో బాంబు
న్యూయార్క్ : ఫేస్బుక్ సమాచార గోప్యత విషయంలో మరో బాంబు పేలింది. సోషల్ మీడియా దిగ్గజం ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెడుతుందని వైట్‌హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బన్నొన్ తెలిపారు . గురువారం ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ‘సందేహమే లేదు. ఫేస్బుక్ తన ఖాతాదారులా డేటాను అమ్మేసుకుంది. ఇది అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అందుకే దాని వ్యాపారం, మార్కెట్లో దాని షేర్ల విలువ ఇప్పుడు అంత స్థాయిలో ఉంది’ అని తెలిపారు. అయితే రాజకీయ సంబంధిత డేటా చోరీ అంశంపై మాత్రం తనకు స్పష్టత లేదని.. కాబట్టి ఆ అంశంపై స్పందించబోనని బన్నొన్ తెలిపారు. ఇక సదస్సు ముగిశాక బయటకు వచ్చిన ఆయన ది గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ.. కేంబ్రిడ్జ్ ఎనలైటికా(ట్రంప్ ప్రచారం కోసం పనిచేసిన డేటా విశ్లేషణ సంస్థ) యూఎస్ ఓటర్ల డేటాను అమ్ముకుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కేంబ్రిడ్జ్ ఎనలైటికా(సీఏ) మాతృక సంస్థ ఎస్సీఎల్(బ్రిటన్‌కు చెందిన సంస్ధ) సుమారు 50 మిలియన్ల ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో బన్నొన్ హస్తం కూడా ఉందంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ట్రంప్ మాజీ కార్యదర్శి, కేంబ్రిడ్జ్ అనలైటికా మాజీ ఉపాధ్యక్షుడు అయిన బన్నొన్.. గతంలో ‘ఫైర్ అండ్ ఫ్యూరీ : ఇన్సైడ్ ద ట్రంప్ వైట్ హౌజ్’ పుస్తకం ద్వారా అధ్యక్ష భవన సమాచారాన్ని బహిర్గత పరచటంతోపాటు.. అవినీతి, అసమర్థత పాలన అంటూ అధ్యక్షుడు ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. -
జుకర్ బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ : కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) సేవలను ఉపయోగించుకున్నట్లు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు బుధవారం పరస్పరం పార్లమెంట్లో ఆరోపణలు చేసుకున్నాయి. ఫేస్బుక్ నుంచి సేకరించిన అమెరికా ఓటర్ల డేటాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఉపయోగించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంలోనే మన కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ జోక్యం చేసుకొని ఫేస్బుక్ ప్రొఫైల్‌ను భారత్‌లో అనుమతిస్తామని, అయితే ఇలా ఖాతాదారుల డేటాను ఇతరులకు అందజేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అవసరమైతే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తామని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులను మనం తాటాకు చప్పుళ్లు చేయడం అని చెప్పవచ్చు. దేశంలో తగినన్ని క్రిమినల్ చట్టాలు ఉన్నప్పటికీ విదేశాలకు పారిపోయిన నేరస్థులు నీరవ్ మోదీ, లలిత్ మోదీలను భారత్‌కు రప్పించలేక పోతున్నాం. ఇక భారతీయుల డేటా పరిరక్షిణకు దేశంలో తగిన చట్టాలే లేనప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ లాంటి వారిని భారత్‌కు రప్పిస్తామంటూ హెచ్చరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి! పైగా ఇదే మంత్రిగారి ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఇటీవల ‘ప్రైవసీ’ ప్రాథమిక హక్కు కాదని వాదించింది. కేవలం ఐదు వందల రూపాయలకు ఆధార్ కార్డు వివరాలు ఎవరికైనా అందుబాటులో ఉండే ఈ దేశంలో పౌరుల వ్యక్తిగత వివరాలకు భద్రత ఎంతో ఊహించవచ్చు! కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన ఒకే ఒక ఐటీ సమాచార చట్టం కింద పౌరుల వ్యక్తిగత డేటాకు భద్రతను కల్పిస్తోంది. ఇది కూడా కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఫేస్బుక్ వ్యక్తం చేసే అభిప్రాయలలాంటివాటికి భద్రత ఉండదు. ఈ చట్టం కింద భద్రంగా ఉంచాల్సిన అంశాలు 1. పాస్వర్డ్ 2. ఆర్థిక సమాచారం అంటే, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆర్థిక చెల్లింపు సాధనాలు 3. ఆరోగ్య పరిస్థితి 4. వైద్య రికార్డులు, హిస్టరీ 5.లైంగిక దక్పథం. 6. బయోమెట్రిక్ సమాచారం. ఈ ఆరు అంశాలకు తగిన భద్రత కల్పించాలని, అందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందిగానీ ఈ అంశాలను తస్కరించిన వారికి, అందుకు సహకరించిన వారికి ఎలాంటి శిక్షలు విధించాలో లేదు. బిహార్ ఎన్నికల్లో ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఇదే కేంబ్రిడ్జి సంస్థ, ఫేస్బుక్లో భారతీయుల వివరాల డేటాను ఉపయోగించుకుంది. అలాంటప్పుడు ఈ 2000–ఐటీ చట్టం కింద భారత ప్రభుత్వం జూకర్ బర్గ్‌ను భారత్‌కు రప్పించగలదా? అన్నది కోటి రూకల ప్రశ్న. -
బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్స్
సాక్షి, హైదరాబాద్ : వినియోగదారుల సౌకర్యార్థం బీఎస్ఎన్ఎల్ పలు ఆఫర్లు ప్రకటించింది. ఇందులో ఎస్టీవీ-99, ఎస్టీవీ-319, ప్లాన్-999, ప్లాన్-949, డేటా ఎస్టీవీ-7 ప్లాన్లు ఉన్నాయి. ఎస్టీవీ-319, 99 ప్లాన్లు ఇవాళ్టి (మంగళవారం) నుంచి అందుబాటుకి వస్తాయి. ప్లాన్ 999, 949లు ఈ నెల 15 నుంచి, డేటా ఎస్టీవీ-7 ప్లాన్ ఈ నెల 17 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వీటితో పాటు ఎస్టీవీ-26, ట్రిపుల్ ఏస్-333, బీఎస్ఎన్ఎల్ చౌక-444, ఇంటర్నేషనల్ వైఫై ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ నెల 10 నుంచి యూఏఈ, యూఎస్ఏలకు ఇంటర్నేషనల్ రోమింగ్ సౌకర్యాన్ని సైతం కల్పించినట్లు పేర్కొంది. ఈ నెల 19 (సోమవారం) నుంచి 28 వరకు సంస్థ స్టోర్లలో మెగా సిమ్ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఉచితంగా 3జీ సిమ్‌లను అందజేయడంతో పాటు ప్రతి రూ.110 రీచార్జ్‌తో ఫుల్ టాక్‌టైమ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. -
వొడాఫోన్ ఆ ప్లాన్‌పై 30జీబీ డేటా
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు వొడాఫోన్ ఇండియా కూడా తన ప్లాన్లను అప్‌గ్రేడ్ చేస్తోంది. తన పోస్టు పెయిడ్ సబ్స్క్రైబర్ల కొత్త రెడ్ ప్లాన్‌ను వొడాఫోన్ అప్డేట్ చేసింది. ఈ కొత్త వొడాఫోన్ ప్లాన్ రూ.399 కింద నెలకు 30జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, నేషనల్ రోమింగ్, 100 ఎస్ఎంఎస్లు కస్టమర్లకు లభించనున్నాయి. వొడాఫోన్ ప్లే సర్వీసు ద్వారా రూ.4000 విలువైన మూవీలకు ఉచిత యాక్సస్ లభించనుంది. నాలుగు నెలల పాటు 3500 ఈ-మ్యాగజైన్లను చదువుకునేలా మ్యాగ్‌జటర్ సబ్‌స్క్రిప్షన్‌ను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది. ఇతర ప్లాన్స్ మాదిరిగానే కొత్త రూ.399 వొడాఫోన్ రెడ్‌ప్లాన్ అపరిమిత కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవాలి. తొలుత వొడాఫోన్ రెడ్ సబ్స్క్రైబర్లు రూ.399 ప్లాన్‌ను పొందడానికి తమ మొబైల్ హ్యాండ్సెట్ల నుంచి 199కి కాల్ చేయాల్సి ఉండేది. అయితే అధికారిక వొడాఫోన్ సైట్ మాత్రం ఈ కొత్త ప్లాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంది. ప్రస్తుత ప్లాన్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, జార్ఖాండ్, జమ్ము అండ్ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ సర్కిళ్లలో అందుబాటులో లేదు. గతేడాది నవంబర్‌లో వొడాఫోన్ తన పోస్టు పెయిడ్ సబ్స్క్రైబర్లకు ఈ రూ.399ల రెడ్ బేసిక్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అప్పుడు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్కమింగ్, 10జీబీ డేటాను ఆఫర్ చేసేంది. ఎలాంటి అదనపు ప్రయోజనాలను అందించలేదు. అనంతరం ఈ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసి డేటా పరిమితిని 20జీబీకి పెంచింది. ప్రస్తుతం ఈ డేటాను మరో 10జీబీ పెంచి, 30జీబీ చేసింది. జియో తన రూ.309 పోస్టు పెయిడ్ప్లాన్పై 30జీబీ డేటాను, ఎయిర్టెల్ తన రూ.399 మైఇన్ఫినిటీ పోస్టుపెయిడ్ ప్లాన్‌పై 20జీబీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. -
మరోసారి సత్తా చాటిన జియో
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం రిలయన్స్ జియో మరోసారి తన సత్తాను చాటుకుంది. 4జీ నెట్వర్క్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. వరుసగా 11వ సారి కూడా జోరును సాగించిన జియో నవంబర్‌లో నెలలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, వొడాఫోన్లకు భారీ నిరాశను మిగిల్చింది. ఆరంభం నుంచి కస్టమర్లకు ఆఫర్లను అందించడంలో దూకుడును ప్రదర్శించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు హైస్పీడ్ డేటాను అందివ్వడంలో మళ్లీ టాప్ లో నిలిచిందనీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా సేకరించిన గణాంకాల ప్రకారం నవంబరు నెలలో దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం సంస్థలు అందించిన డేటా స్పీడ్‌లో జియో మొదటి స్థానంలో నిలిచింది. ట్రాయ్ డేటా నవంబరు 2017 నాటికి 25.6 ఎంబీపీఎస్ వేగంతో 4జీ సర్వీసు ప్రొవైడర్ల జాబితాలో రిలయన్స్ జియో మొదటిస్థానంలో నిలిచింది. జియోకు సన్నిహిత ప్రత్యర్థి వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్, భారతీ ఎయిర్టెల్ 9.8 ఎంబీపీఎస్, ఐడియా సెల్యూలార్ 7 ఎంబీపీఎస్ వేగాన్ని అందించాయి. అప్లోడ్ వేగంలో ఐడియాను వెనక్కినెట్టి వోడాఫోన్ నవంబరులో 6.9 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది. ఆ తరువాతి స్థానాల్లో ఐడియా(6.6 ఎంబీపీఎస్), జియో( 4.9 ఎంబీపీఎస్) నిలిచాయి. ఎయిర్టెల్ 4 ఎంబీపీఎస్ వేగాన్ని మాత్రమే నమోదు చేసింది. -
విదేశాలకు మొబైల్ ఫోన్ డేటా లీకేజి వాస్తవమే
న్యూఢిల్లీ : విదేశాలకు మొబైల్ ఫోన్ డేటా లీకేజీ వాస్తవమేనని రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా సమాధానమిచ్చారు. అయితే లీకవుతున్న సమాచారం ఎలాంటిదో కనిపెట్టడం కష్టమని మనోజ్ సిన్హా శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ..మొబైల్ ఫోన్ల ద్వారా విదేశాలకు సమాచారం లీక్ అవుతున్నట్లుగా కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ వార్తలపై వెంటనే స్పందించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగిందన్నారు. మొబైల్ ఫోన్ల భద్రత, రక్షణ కోసం ఫోన్ల తయారీ సంస్థలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయి..ఆయా ఫోన్ల ఆర్కిటెక్చర్, ఫ్రేమ్ వర్కు తదితర వివరాలను సమర్పించాలని మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను కోరినట్లు మంత్రి తెలిపారు. మొబైల్ డేటా విదేశాలకు లీకవుతున్నట్లు వార్తలు వెలువడిన తర్వాత తమ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండర్డైజేషన్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ విభాగం దీనిపై లోతుగా పరిశీలన జరిపిందని చెప్పారు. మొబైల్ ఫోన్ల నుంచి షేర్ అవుతున్న డేటా సంకేత సంక్షిప్త సందేశం (ఎన్‌క్రిప్ట్) రూపంలో ఉంటున్నందున అది ఎలాంటి సమాచారమో కనిపెట్టడం కష్టమవుతోందని మంత్రి చెప్పారు. ఈ డేటా కేవలం తమ ప్రతిభా సామర్థ్యాలను మరింతగా పెంపొందిచుకోవడం కోసం మాత్రమే వినియోగిస్తున్నట్లుగా ఆయా కంపెనీలు చెబుతున్నాయని మంత్రి వివరించారు. -
వాటికి పోటీగా ఐడియా కొత్త ప్లాన్
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తరువాత మరో టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను. ప్రకటించింది. ఎయిర్టెల్, జియో రీచార్జ్ ప్లాన్ తరహాలోనే ఈ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను వెల్లడించింది.రూ. 93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకి 1 జీబీ 3జీ డేటా అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 10 రోజులు. ఐడియా వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఆఫర్ చేస్తోంది. అయితే రోజుకు 250 నిమిషాలు , వారానికి వెయ్యి నిమిషాల టాక్ టైం వరకే ఈ ఉచిత ఆఫర్ పరిమితం. ఈ పరిమితి దాటిన తరువాత సెకనుకు 1 పైసా వసూలు చేస్తుంది. అయితే ఉచిత ఎస్ఎంఎస్లు, రోమింగ్స్ కాల్స్ లాంటి ప్రయోజనాలు లేవీ లేవు. అలాగేరూ. 93 ప్రీ పెయిడ్ ప్లాన్ ఎంపిక చేసిన నెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాణిజ్యేతర వినియోగం కోసం మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. కాగా ఎయిర్టెల్ రూ.93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా 10 రోజుల పాటు 3జీ / 4జీ డేటా 1జీబీ అందిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. జియో కూడా రూ.98ల ప్రీపెయిడ్ రీఛార్జి ప్రణాళికలో 14 రోజుల వ్యవధిలో 2.1జీబీ 4జీ డేటాను 140 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా అందిస్తుంది. -
ఆయిల్ మాత్రమే కాదు ..కొత్త సాయిల్ కూడా డేటానే
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం పరిశ్రమ నష్టాలకు జియోను నిందించొద్దని ప్రముఖ వ్యాపారవేత్త ,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ తనకు ప్రత్యర్థి కాదని, స్నేహితుడని ప్రకటించారు. వ్యాపారంలో సాహసాల ఫలితంగానే లాభనష్టాలు వస్తాయని.. ఏది ఏమైనా కస్టమర్లు ప్రధానమని చెప్పుకొచ్చారు. దేశం పురోగతి చెందుతుందా, వినియోగదారుడికి ప్రయోజనం కలుగుతుందా అనేదే కీలకమన్నారు. హెచ్‌టీ లీడర్షిప్ సమ్మిట్ 2017 లో ముకేష్ అంబానీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో 'డిజిటల్ హరిత విప్లవం' రావాలన్నారు. ఈ నేపథ్యంలో 58,000 కళాశాలలు, 700 విశ్వవిద్యాలయాలు , 19 లక్షల పాఠశాలలు డిజిటల్‌గా అనుసంధానంకానున్నాయన్నారు. దేశంలో జియో ఎంట్రీతో డేటా సేవల స్వరూపమే మారిపోయిందన్నారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఎదిగిందని ఆయన వెల్లడించారు. ఇపుడు దేశానికి ఆయిల్ సాయిల్ డేటా అని చెప్పారు. అలాగేతన మిత్రుడు నందన్‌నీలేకని సృష్టించిన బయోమెట్రిక్ ఆధార్ ప్రపంచంలోనే అత్యంత భద్రమైన వ్యవస్థగా నిలిచిందని ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని ముఖేశ్ అంబానీ అన్నారు. 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ రెట్టింపై 5 ట్రిలియన్ డాలర్లను చేరుకుంటుందన్నారు. ‘2004లో భారత ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లుగా ఉంది. వచ్చే 20ఏళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అప్పుడే తాను అంచనా వేశాననీ, ప్రస్తుత ప్రగతి చూస్తుంటే అంతకంటే ముందే ఆ లక్ష్యాన్ని భారత్ చేరుకుంటుంది.వచ్చే పదేళ్లలో 7 ట్రిలియన్ డాలర్లకు కచ్చితంగా చేరగలం మనీ.. 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల సమీపానికి ఎదుగుతామని అంబానీ వెల్లడించారు. -
ఎయిర్టెల్ అన్ యూజ్డ్ డేటా మాయ..చార్జీల బాదుడు
సాక్షి, హైదరాబాద్: ఉచిత ఆఫర్లు, డాటా ప్రయోజనాలు అంటూ ఊదర గొట్టే టెలికాం ఆపరేటర్లు.. అంతిమంగా వినియోగదారుల నెత్తిన టోపీ పెడుతున్నాయి. దీనికి తాజా పరిణామాలే ఓ ఉదాహరణ. ఒకవైపు టెలికాం మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన రిలయన్స్ జియో టారిఫ్ రివ్యూలతో చార్జీల బాదుడుకు దిగింది. దీంతో మొబైల్ యూజర్లు భగ్గుమంటున్నారు. మరోవైపు ఈ బాదుడులో దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ కూడా తక్కువేమీ తినలేదు....అన్ యూజ్డ్ డేటా క్యారీ ఫార్వార్డ్ అంటూ.. మెసేజ్‌లతో కస్టమర్లను మభ్యపెడుతూ.. భారీ ఎత్తున చార్జీలను వడ్డిస్తోందన్న ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుడి అనుభవం ఈ ఆరోపణలను మరింత బలపరుస్తోంది. అన్ యూజ్డ్ డాటా 4.14 జీబీ ఈ నెలకు యాడ్ అయినట్టుగా ఎయిర్ టెల్ నుంచి ఆ వినియోగదారుడికి అక్టోబర్ 17న రెండు సార్లు మెసేజ్ వచ్చింది. ఎయిర్ టెల్ అఫీషియల్ యాప్ లోనూ డాటా యాడ్ అయినట్టుగా చూపించింది. అయితే కేవలం రెండు రోజుల్లో అన్ బిల్డ్ బిల్లు మాత్రం 302గా చూపించడంతో విస్తుపోవడం కస్టమర్ వంతైంది. ఇదే విషయంపై కస్టమర్ కేర్ ను సంప్రదిస్తే మీకు ఎలాంటి డాటా ప్యాక్ లేదు. డాటా యూజ్ చేసినందుకే బిల్ పడిందన్న సమాధానం ఇచ్చింది. మరి ఎయిర్ టెల్ నుంచి మెసేజ్ ఎందుకు వచ్చింది.. యాప్ లో డాటా ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోందని ప్రశ్నిస్తే.. షరా మామూలుగానే సర్వర్ ప్రాబ్లం అనే సమాధానం రావడంతో సదరు ఎయిర్టెల్ యూజర్ మండి పడుతున్నారు. వాడని సేవలకు తానెందుకు భారాన్ని భరించాలని, తన లాంటి వినియోగదారులు ఇంకా ఎంతమంది ఉన్నారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వినియోగదారుల నుంచి అక్రమంగా చార్జీలను గుంజడం అన్యాయని, తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్మార్ట్‌ఫోన్, డాటా యూసేజ్ నిత్యావసరంగా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో వినియోగదారులనుంచి అక్రమంగా అనధికారిక అధిక ఫీజులు వసూలు చేయడం నేరమని నిపుణులు పేర్కొన్నారు. వీటిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉంటూ, న్యాయపోరాటం చేయాలని సూచిస్తున్నారు. -
జియోకి కౌంటర్:ఎయిర్టెల్ సూపర్ ప్లాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా జియో తాజా ఆఫర్కుపోటీగా సరికొత్త రీచార్జ్‌ప్లాన్లను లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ చందాదారుల కోసం ఈ కొత్త పథకాలను ప్రారంభించింది.. రూ.399 రీచార్జ్‌పై అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందించేలా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇదిరిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన రూ.399 ఆఫర్‌ను పోలి వుండడం గమనార్హం. అలాగే రూ.149 ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్టెల్ టు ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, రూ. 399రీఛార్జ్ ప్యాక్ అందరి వినియోగదారులకు అందుబాటులో లేదు. ఈ రీఛార్జ్ ప్యాక్ లభ్యతపై కస్టమర్ కేర్‌ను సంప్రదించి ,ఆఫర్ లభ్యతపై చెక్ చేసుకోవాలి. అంతేకాదు ఎయిర్టెల్ పే మెంట్ బ్యాంకులో ఖాతాను తెరిచిన కస్టమర్లకు రూ.349 రీచార్జ్‌పై 10శాతం క్యాష్ బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా జీయో రీచార్జ్ప్యాక్లను అందుబాటులోకి తెస్తే జియోకి కౌంటర్‌గా ఎయిర్ టెల్ మరిన్ని ఇతర ప్రణాళికలను ప్రారంభించింది. రూ. 8 ప్లాన్: నిమిషానికి 30 పైసలతో స్థానిక + ఎస్టీడీ కాల్స్ 56 రోజులు వాలిడిటీ, రూ. 40 ప్లాన్: అన్లిమిటెడ్ వాలిడిటీతో రూ. 35 టాక్ టైం. రూ. 60 ప్లాన్: అన్ లిమిటెడ్ వాలిడిటీతో రూ.58 టాక్ టైం. రూ. 5 ప్లాన్: 4జీబీ 3జీ / 4జీ డేటా, వాలిడిటీ 7 రోజులు 4జీ సిమ్ చెల్లుబాటు అయ్యే లా వన్ టైం రీచార్జ్ రూ. 199 ప్లాన్: అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, 1Gజీబీ 2జీ / 3జీ/ 4జీ డేటా, 28 రోజుల వాలిడిటీ మరోవైపు మరికొద్ది రోజుల్లో జియో 4జీ ఫోన్లు కస్టమర్ల చేతికి రానున్నాయి. ఇప్పటికే లక్షలమంది ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నారు. దీంతో ఎయిర్టెల్ సైతం రూ.2500కు ఫీచర్ ఫోన్ తీసుకొచ్చేందుకు యోచిస్తున్న సంగతి తెలిసిందే. -
మొబైల్ కంపెనీలకు భద్రతా ప్రమాణాలు
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ కంపెనీల నుంచి వ్యక్తిగత, ఆర్థిక సమాచారం చోరీకి గురవుతుందన్న ఆందోళనలతో ఫోన్ తయారీ కంపెనీలకు ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను జారీ చేయనుంది. చైనా కంపెనీల విషయంలో మరింత అప్రమత్తత కోసం ప్రభుత్వం మొబైల్ తయారీ కంపెనీలకు కఠిన భద్రతా, ప్రైవసీ మార్గదర్శకాలు, ప్రమాణాలను నిర్థేశించనుంది. మొబైల్ యూజర్ల డేటాను పరిరక్షించేలా రానున్న కొద్దివారాల్లో ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్‌ను ప్రకటిస్తుందని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మొబైల్ ఫోన్ల నుంచి సమాచార చోరీని అరికట్టేందుకు త్వరలో కఠిన ప్రమాణాలు, మార్గదర్శకాలను జారీ చేస్తామని, ఇది చాలా సీరియస్ అంశమని ఓ సీనియర్ అధికారి తెలిపారు. భారత్‌లో ఆన్లైన్ కార్యకలాపాలకు అత్యధికులు మొబైల్ డేటాపైనే ఆధారపడుతుండటంతో ఇంటర్నెట్ యాక్సెస్ నేపథ్యంలో డేటా చోరీ ఆందోళనకర అంశంగా ముందుకొస్తోంది. మరోవైపు దేశంలో అమ్ముడవుతున్న ఫోన్లలో అత్యధికంగా చైనా కంపెనీలవే కావడం గమనార్హం. ముఖ్యంగా చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత సమాచారంతో రిస్క్ చేయలేమని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. -
6 రెట్ల డేటా ఫ్రీ: ప్రత్యర్థులకు దడదడే
న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రత్యర్థి కంపెనీలు, ప్రయివేటు కంపెనీలకు షాకిచ్చే సంచలన ఆఫర్‌తో ముందుకువచ్చింది. తన పోస్ట్‌పెయిడ్ ఖాతాదారులకు దాదాపు 6 రెట్ల డేటాను ఆఫర్ చేస్తోంది. జూలై1 నుంచి ప్రీపెయిడ్ కస్టమర్లకోసం మరింత ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించింది. తమ కొత్త ప్లాన్స్‌లో ఆరు రెట్ల డేటా ప్రయోజనాలను అందించనున్నామని బిఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.99 ప్లాన్‌లో ఇకపై 250ఎంబీ డేటా ఫ్రీ, ఇంతకు ముందు ఉచిత డేటా సదుపాయం లేదు. రూ.225 ప్లాన్‌లో 1 జీబీ డేటా ఉచితం. ఇంతకు ముందు ఇది 200 ఎంబీ మాత్రమే. రూ.799 ప్లాన్ లో ఇకపై 3 జీబీ స్థానంలో 10జీబీడేటా అందిస్తుంది. దీంతోపాటు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం. వినియోగదారులకు సరసమైన మరియు సమర్థవంతమైన సేవలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని సంస్థ డైరెక్టర్ ఆర్.కె. మిట్టల్ చెప్పారు. భారత టెలికాం పరిశ్రమలో ప్రస్తుత ధోరణిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. -
డేటా అమ్ముతాం రండి!
► వాన్నాక్రై సృష్టికర్తల ప్రతిపాదన ► నెలకింత చెల్లించండని బ్లాగ్ పోస్ట్ ► జూలైలో డేటా విడుదల! సాక్షి నాలెడ్జ్ సెంటర్: వాన్నాక్రై గుర్తుందా? వందల దేశాల్లోని కంప్యూటర్లను, వాటిలోని సమాచారాన్ని సీజ్ చేసి మరీ డబ్బులు డిమాండ్ చేసిన ఈ ర్యాన్సమ్వేర్ సృష్టికర్తలు షాడో బ్రోకర్స్ మరో సంచలనానికి తెరలేపారు. అగ్రరాజ్యం అమెరికా తాలూకూ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) మొదలుకుని అనేక మందికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని.. నెలకింత అని సబ్స్క్రిప్షన్ ఫీజు కడితే దాన్ని అందరికీ ఇచ్చేస్తామని ప్రకటించారు. షాడో బ్రోకర్స్ తాజా ప్రతిపాదనకు ఎంత మంది స్పందిస్తారో? ఎలాంటి సమాచారం బయటకొస్తుందో ప్రస్తుతానికి సస్పెన్స్. కాకపోతే వాన్నాక్రై కంటే ముందు ఈ హ్యాకర్ల బృందం నడిపిన వ్యవహారం మాత్రం ఆసక్తికరమైందే. అదేమిటో మీరే చూడండి. వాన్నాక్రై ర్యాన్సమ్వేర్ ప్రపంచ దేశాలను వణికించేందుకు చాలా నెలల ముందే.. కచ్చితంగా చెప్పాలంటే గత ఆగస్టులోనే షాడో బ్రోకర్స్ ఓ ప్రకటన చేసింది. ప్రపంచం మీద కన్నేసేందుకు ఎన్ఎస్ఏ సిద్ధం చేసిన కొన్ని టూల్స్ తమ వద్ద ఉన్నాయని.. ఆన్లైన్ వేలం ద్వారా వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చని అప్పట్లో ప్రకటించింది. కానీ వేలానికి పది లక్షల బిట్‌కాయిన్స్ చెల్లించాల్సి ఉండటంతో పెద్దగా స్పందన రాలేదు. దీంతో షాడో బ్రోకర్స్ తర్వాతి నెలల్లో నాలుగు సెట్ల హ్యాకింగ్ టూల్స్ విడుదల చేసింది. వాన్నాక్రై వెనుక ఉన్న ఎటర్నల్ బ్లూ వీటిల్లో ఒకటి. మిగిలిన మూడింటి పరిస్థితి ఏమిటి? వాటినెవరైనా వాడుతున్నారా? ఇదే నిజమైతే వాటి ప్రభావమేమిటి? అన్నది రానున్న కాలంలో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంచితే.. తాజాగా గత నెలలోనే షాడో బ్రోకర్స్ ఒక బ్లాక్ ద్వారా నెలవారీ సబ్స్క్రిప్షన్ మోడల్ తాలూకూ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. భారీ ఎత్తున సమాచారం(బ్యాంక్ అకౌంట్ల వివరాలు మొదలుకుని.. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు ఏమైనా కావచ్చు) కావాలనుకునే వారు అందుకోసం 20 వేల డాలర్ల విలువ చేసే జెడ్ క్యాష్ డిజిటల్ క్రిప్టో కరెన్సీ చెల్లించాల్సి ఉంటుంది. వంద జెడ్క్యాష్ కాయిన్లకు సమానమైన ఈ మొత్తాన్ని చెల్లించిన తర్వాత వచ్చే జూలైలో రెండు దఫాలుగా సబ్స్క్రైబర్లు అందరికీ ఈ సమాచారం అందుతుంది. ఆ సమాచారంతో వాళ్లేం చేసుకుంటారో తమకు సంబంధం లేదని షాడో బ్రోకర్స్ అంటున్నా.. కొనుక్కునే వారు కచ్చితంగా బ్లాక్‌మెయిలింగ్, లేదా చోరీ వంటి అక్రమ మార్గాలకు పాల్పడతారన్నది గ్యారెంటీ! బిట్ కాయిన్లకు బదులుగా జెడ్క్యాష్ కాయిన్లను వాడటంపై కూడా షాడో బ్రోకర్స్ ఓ వివరణ ఇచ్చింది. అమెరికా రక్షణ శాఖకు చెందిన డార్పా, ఇజ్రాయెల్ కలసి సృష్టించిన ఈ జెడ్ క్యాష్ కాయిన్లు బిట్కాయిన్ల కంటే సురక్షితమైనవని అంటోంది. మిగలిన సంగతులు ఎలా ఉన్నప్పటికీ ఎటర్నల్ బ్లూ లాంటి మరిన్ని టూల్స్ కూడా ఈ సమాచారంలో ఉంవచ్చన్న అంశం మాత్రం సైబర ప్రపంచాన్ని కలవర పరిచేదే!