హెల్త్ఐడీ క్రియేషన్ కోసం నేషనల్ హెల్త్ అథారిటీతో కలిసి పనిచేయనున్నట్లు వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ప్రకటించింది. దీని ద్వారా యూజర్లు తమ యూనిక్ హెల్త్ ఐడీని పేటీఎం యాప్ ద్వారా క్రియేట్ చేసు కోవచ్చు. భారతీయులందరికీ ఒకే చోట విస్తృత శ్రేణిలో ఉపయోగకరమైన సేవలను అందుబాటులోకి తీసుకు రావాలన్న కంపెనీ ప్రయత్నాలకు అనుగుణంగా హెల్త్ ఐడీ ఆవిష్కారం చోటు చేసుకుంది. ఆండ్రాయిడ్, ఐఒఎస్ యూజర్లకు సంబంధించి హెల్త్ ఐడీల క్రియేషన్ కోసం వీలు కల్పించే అతిపెద్ద వినియోగదారు వేదికగా పేటీఎం నిలిచింది.
భారతీయులకు సంబంధించి డిజిటల్ హెల్త్ రికార్డు క్రియేట్ చేసుకునేందుకు భారత ప్రభుత్వ హెల్త్ఐడీ క్రియేషన్ అనేది తప్పనిసరి. ఇది యూజర్లు వారు తమ హెల్త్ డేటాను యాక్సెస్ చేసేందుకు, తమ సమ్మతితో ఇతర ఆరోగ్య సంరక్షణ సంస్థలతో పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ హెల్త్ ఐడీ ద్వారా, యూజర్లు దీర్ఘకాలిక హెల్త్ హిస్టరీని క్రియేట్ చేసుకునేందుకు గాను హెల్త్ ఐడీతో తమ పర్సనల్ హెల్త్ రికార్డ్స్(పిహెచ్ఆర్) ను యాక్సెస్ చేయవచ్చు, లింక్ చేయవచ్చు. రాబోయే ఆరు నెలల్లో 10 మిలియన్లకు పైగా భారతీయులు తమ హెల్త్ ఐడీలు క్రియేట్ చేసుకునేలా చేయడమే కంపెనీ తన లక్ష్యంగా పెట్టుకుంది.
(చదవండి: ఎయిర్‌టెల్-టీసీఎస్ 5జీ ప్రయోగం విజయవంతం!)
పేటీఎంపై తమ ఐడీలను క్రియేట్ చేసుకునే యూజర్లు తమ ల్యాబ్ రిపోర్ట్ లను పొందవచ్చు, యాప్ పై ఉండే హాస్పిటల్స్ తో టెలికన్సల్టేషన్స్ ను బుక్ చేసుకోవచ్చు. తమ సమాచారాన్ని అంతా కూడా సులభంగా హెల్త్ లాకర్ లో పొందుపర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా పేటీఎం యాప్ లోనే చేయవచ్చు. పేటీఎం మినీ యాప్ స్టోర్ ఒక హెల్త్ స్టోర్ ఫ్రంట్ ను కూడా ఆవిష్కరించింది. ఇది ఆరోగ్యసంరక్షణ రంగంలోని ప్రముఖ సంస్థలను అగ్రిగేట్ చేస్తుంది. దాంతో యూజర్లు టెలికన్సల్టేషన్స్ ను బుక్ చేసుకోవచ్చు, ఫార్మసీల నుంచి ఔషధాలు కొనుగోలు చేయవచ్చు, ల్యాబ్ టెస్ట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య బీమా కొనుగోలు చేయవచ్చు, మెడికల్ రుణాలకు దరఖాస్తు చేయవచ్చు, ఇంకా మరెన్నో చూసుకునే వీలు ఇందులో ఉంది. దీని ద్వారా యూజర్లు తమ ఆరోగ్య పరమైన అన్ని అవసరాల కోసం పేటీఎం యాప్ పై ఆధారపడవచ్చు.
గతంలోనే పేటీఎం డిజి లాకర్ ను తన మినీ యాప్ స్టోర్ కు అనుసంధానం చేసింది. యూజర్లు తమ డిజి లాకర్ ను పేటీఎం యాప్ నుంచే రిట్రైవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, సేవ్ / స్టోర్ చేసుకోవచ్చు, నమోది త సంస్థల నుంచి డాక్యుమెంట్ల వెరిఫైడ్ ఎలక్ట్రానిక్ కాపీలను నేరుగా వ్యక్తిగత లాకర్లలోకి పొందవచ్చు, తద్వా రా భౌతిక డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగించుకోవచ్చు. పేటీఎం ద్వారా కోవిడ్-19 టీకాను బుక్ చేసుకున్న యూజర్లు తమ వాక్సీన్ సర్టిఫికెట్లను ఒక్క క్లిక్ తో డిజిలాకర్ కు జోడించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment