Paytm
-
విదేశాల్లోనూ పేటీఎం యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ప్రయాణించే తమ యూజర్లు .. యూపీఐ మాధ్యమంలో చెల్లింపులు జరిపే వెసులుబాటును ఆర్థిక సేవల సంస్థ పేటీఎం అందుబాటులోకి తెచ్చింది. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్‌లోని నిర్దిష్ట ప్రాంతాల్లో దీన్ని వినియోగించుకోవచ్చని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది.షాపింగ్, డైనింగ్ సహా వివిధ అవసరాలకు చెల్లింపుల కోసం ఈ ఫీచరు ఉపయోగపడగలదని పేర్కొంది. రానున్న హాలిడే సీజన్లో తమ యూజర్లు మరింత సౌకర్యవంతంగా విదేశీ ప్రయాణాలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని పేర్కొంది. -
పేటీఎంకు ఎన్పీసీఐ ఊరట
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు ఊరటనిస్తూ కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుమతించింది. నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనలను పాటించడాన్ని బట్టి అనుమతులు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొన్నట్లు ఎక్సే్చంజీలకు ఇచి్చన సమాచారంలో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది. నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు గాను కార్యకలాపాలు నిలిపివేయాలంటూ ఈ ఏడాది జనవరిలో అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను (పీపీబీఎల్) ఆర్బీఐ ఆదేశించడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుమతుల వార్తలతో బుధవారం ఓసీఎల్ షేరు ధర 8 శాతం లాభంతో రూ. 745 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం ఎగబాకింది. -
పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!
కష్టాల్లో కూరుకుపోయిన ఫిక్ టెక్ కంపెనీ పేటీఎంకి భారీ ఊరట లభించింది. కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతినిచ్చింది. ఆగస్ట్‌లో కంపెనీ చేసిన అభ్యర్థన మేరకు ఎన్పీసీఐ అనుమతిని మంజూరు చేసిందని పేటీఎం తెలిపింది.నిబంధనలు పాటించడంలో లోపాల కారణంగా ఎన్పీసీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోకుండా పేటీఎంపై నిషేధించింది. తాజాగా పేటీఎం అభ్యర్థన మేరకు రెగ్యులేటరీ నిబంధనలు, ప్రోటోకాల్స్లను సమీక్షించి కొత్తగా యూజర్లను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతి మాత్రమే.ఇదీ చదవండి: అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!ఆర్బీఐ చర్యల తర్వాత ఇప్పటివరకూ పేటీఎం షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 34 శాతం క్షీణత, నెలవారీ లావాదేవీల వినియోగదారులలో 25 శాతం తగ్గుదలని నివేదించింది. దీని తర్వాత కంపెనీ షేర్లు ఐదు శాతానికి పైగా పడిపోయాయి. -
టాటాకు సంతాపం తెలుపుతూ ట్వీట్.. కాసేపటికే డిలిట్!
రతన్ టాటా మృతిపట్ల సంతాపం తెలుపుతూ పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్ శర్మ చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. టాటా మరణవార్త విని పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా టాటాకు సంతాపం ప్రకటించారు. అయితే తన ట్వీట్లోని చివరి లైన్లపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.‘భవిష్యత్తు తరం వ్యాపారులు టాటా ఇచ్చే సలహాలు, సూచనలను మిస్ అవుతారు. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్ టాటా. సెల్యూట్ సర్.. ఓకే టాటా బైబై’ అని విజయ్‌శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ చివరి లైన్ ‘ఓకే టాటా బైబై’పై నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కాసేపటికే శర్మ ఆ పోస్ట్‌ను తొలగించారు.wtf is the last line pic.twitter.com/dOrIeMQH7c— Shivam Sourav Jha (@ShivamSouravJha) October 10, 2024ఇదీ చదవండి: టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!రతన్ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, టీవీఎస్ మోటార్స్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్, సంజీవ్ గోయెంకా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, కుమారమంగళం బిర్లా, హిందుజా గ్రూప్ చైర్మన్. జీపీ హిందుజా, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఇండిగో) ఎండీ రాహుల్ భాటియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ ఉన్సూకిమ్..వంటి ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. -
'లాభాల్లోకి వస్తాం.. ఇదే మా సంకల్పం': పేటీఎం సీఈవో
న్యూఢిల్లీ: నిర్వహణ లాభం కంటే నికర లాభంపై పేటీఎం దృష్టి సారించినట్టు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈసాప్ (ఉద్యోగులకు స్టాక్స్) వ్యయాలకు ముందు ఎబిట్డా పాజిటివ్ సాధిస్తామని పేటీఎం గతంలో ప్రకటించడం గమనార్హం. ‘‘ఈసాప్కు ముందు ఎబిట్డా కంటే నికర లాభం గురించే చెప్పాలంటూ కంపెనీ బోర్డు సభ్యుడు ఒకరు నాకు సూచించారు. ఇప్పుడు ఈసాప్ వ్యయాలకు ముందు ఎబిట్డా ఒక్కటే కాకుండా, నికర లాభాన్ని నమోదు చేయాలని అనుకుంటున్నాం. ఇదే మా కొత్త సంకల్పం’’అని శర్మ తెలిపారు.పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా వాటాదారులకు ఈ వివరాలు వెల్లడించారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పేటీఎం రూ.840 కోట్ల నష్టాలను నమోదు చేయడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.358 కోట్లుగా ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేయడం తదనంతర పరిణామాలతో కంపెనీల నష్టాలు పెరిగాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంకృత్రిమ మేథ ప్రభావాన్ని ఈ సందర్భంగా శర్మ ప్రస్తావించారు. వివిధ రంగాల్లో ఏఐ ఎన్నో మార్పులకు కారణమవుతోందంటూ.. వచ్చే ఐదేళ్లలో ఆటోమేటెడ్ కార్లు పెరిగిపోవచ్చన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఎదిగిన భారత్, ఏఐ టెక్నాజీలోనూ ఇదే విధంగా అవకాశాలను సొంతం చేసుకోవాలన్నారు. రిస్క్ నిర్వహణలో ఏఐ సాంకేతికతకు పేటీఎం ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు శర్మ చెప్పారు. -
పేటీఎం పేమెంట్స్‌లో పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో (పీపీఎస్ఎల్) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం ఆగస్టు 27న అనుమతులు మంజూరు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. దీంతో పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్సు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు వివరించింది. ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ సేవలను, పేమెంట్ అగ్రిగేటర్ సరీ్వసులను ఒకే కంపెనీ అందించకూడదనే నిబంధన కారణంగా, 2022 నవంబర్‌లో పీఏ లైసెన్సు కోసం పేటీఎం సమరి్పంచిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు సంబంధించిన ప్రెస్ నోట్ 3కి అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రెస్ నోట్ 3 ప్రకారం భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అప్పట్లో పేటీఎంలో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉండేది. తాజాగా మారిన పరిస్థితుల ప్రకారం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రెస్ నోట్ 3 నిబంధనలకు అనుగుణంగా పేటీఎం మరోసారి పీఏ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోనుంది. -
పేటీఎమ్‌కు సెబీ ఝలక్
న్యూఢిల్లీ: పాలనా సంబంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా హెచ్చరికల లేఖను అందుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్(పీపీబీఎల్)తో సంబంధిత పార్టీ లావాదేవీ(ఆర్పీటీ)లను నిర్వహించినట్లు లేఖలో సెబీ పేర్కొంది. అయితే సెబీ నిబంధనలను స్థిరంగా అమలు చేస్తున్నట్లు బీఎస్ఈకి దాఖలు వివరాలలో పేటీఎమ్ తెలియజేసింది. నిబంధనల అమలులో కంపెనీ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా సెబీకి వివరణను సైతం సమర్పించనున్నట్లు పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ వెల్లడించింది. కాగా, సెబీ లేఖ ప్రకారం పీపీబీఎల్, వన్97 కమ్యూనికేషన్స్ సంబంధ ఫైనాన్షియల్ తదితర సమాచారంపై సెబీ పరిశీలన చేపట్టింది. దీనిలో నిబంధనలు పాటించని అంశం గుర్తించింది. ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే ఆర్‌పీటీలలో పేటీఎమ్ లేదా అనుబంధ సంస్థలు పీపీబీఎల్‌తో అధిక లావాదేవీలు చేపట్టినట్లు సెబీ పేర్కొన్నట్లు వన్97 బీఎస్ఈకి తెలియజేసింది. -
పేటీఎమ్ నుంచి సాఫ్ట్‌బ్యాంక్ ఔట్
న్యూఢిల్లీ: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ నుంచి పెట్టుబడుల జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ పూర్తిగా వైదొలగింది. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ పేమెంట్ తదితర సేవలందించే వన్97లో సాఫ్ట్‌బ్యాంక్ 2017లో దశలవారీగా 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 12,525 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. అయితే ఈ పెట్టుబడులపై 10–12 శాతం నష్టానికి పేటీఎమ్ నుంచి పూర్తిగా బయటపడినట్లు తెలుస్తోంది. వెరసి పెట్టుబడులపై 15 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,250 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తొలుత భారీ వాటా సాఫ్ట్‌బ్యాంక్ తొలుత అంటే 2021 పబ్లిక్ ఇష్యూకి ముందు పేటీఎమ్‌లో 18.5 శాతం వాటా పొందింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్(కేమన్) ద్వారా 17.3 శాతం, ఎస్వీఎఫ్ పాంథర్(కేమన్) లిమిటెడ్ ద్వారా మరో 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఐపీవోలో పూర్తి వాటాను ఎస్వీఎఫ్ పాంథర్ 22.5 కోట్ల డాలర్ల(రూ. 1,689 కోట్లు)కు విక్రయించింది. ఈ సమయంలోనే సొంత ప్రణాళికలకు అనుగుణంగా సాఫ్ట్‌బ్యాంక్ 24 నెలల్లోగా మిగిలిన వాటాను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. నిజానికి పేటీఎమ్‌లో వాటాను షేరుకి రూ. 800 సగటు ధరలో సాఫ్ట్‌బ్యాంక్ చేజిక్కించుకుంది. లిస్టింగ్‌లో డీలా ఇష్యూ ధర షేరుకి రూ. 2,150కాగా.. పేటీఎమ్ 9 శాతం తక్కువగా రూ. 1,955 ధరలో లిస్టయ్యింది. తదుపరి ధర పతనమవుతూ వచ్చింది. సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్)ను ఆర్బీఐ నిõÙధించడంతో షేరు ధర మరింత దిగజారింది. ఈ ఏడాది మే 9న చరిత్రాత్మక కనిష్టం రూ. 310ను తాకింది. పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం నేపథ్యంలో గతేడాది(2023–24) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో రూ. 550 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఈ కాలంలో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల భవిష్యత్ అనిశ్చితుల రీత్యా పీపీబీఎల్‌లో రూ. 227 కోట్ల పెట్టుబడుల(39 శాతం వాటా)ను రద్దు చేసింది. ఈ బాటలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 1,422 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అయితే అంతక్రితం ఏడాది(2022–23)లో రూ. 1,776 కోట్లకుపైగా నష్టం వాటిల్లిన విషయం విదితమే. కాగా.. 7 నెలల క్రితం యూఎస్ బిలియనీర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే సైతం పేటీఎమ్ నుంచి నష్టాలకు వైదొలగడం గమనార్హం! షేరుకి దాదాపు రూ. 1,280 ధరలో కొనుగోలు చేసిన బెర్క్‌షైర్ నవంబర్‌లో రూ. 877.3 సగటు ధరలో అమ్మివేసింది. దీంతో రూ. 2,179 కోట్ల పెట్టుబడులకుగాను రూ. 1,371 కోట్లు అందుకుంది.గత వారాంతాన పేటీఎమ్ షేరు బీఎస్ఈలో 2.5 % నష్టంతో రూ. 467 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
పేటీఎంను పూర్తిగా వదిలించుకున్న సాఫ్ట్‌బ్యాంక్
ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం (Paytm) నుంచి జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ నిష్క్రమించింది. సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడి విభాగం సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ (SVF) జూన్ త్రైమాసికంలో సుమారు 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1250 కోట్లు) నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.సాఫ్ట్‌బ్యాంక్ 2017లో పేటీఎం బ్రాండ్ యజమాన్య సంస్థ అయిన 'వన్ 97 కమ్యూనికేషన్స్'లో సుమారు 1.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10-12 శాతం నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించింది. 2021లో పేటీఎం ఐపీఓకి ముందు సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎంలో దాదాపు 18.5 శాతం వాటాను కలిగి ఉంది.సాఫ్ట్‌బ్యాంక్ ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 17.3 శాతం వాటాను, ఎస్వీఎఫ్ పాంథర్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఎస్వీఎఫ్ పాంథర్ ఐపీఓ సమయంలో తన మొత్తం వాటాను రూ.1,689 కోట్లకు అంటే దాదాపు 225 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ పేటీఎంలో తన మిగిలిన 1.4 శాతం వాటాను విక్రయించింది.ఐపీఓ జరిగిన 24 నెలల తర్వాత పేటీఎం నుంచి నిష్క్రమించనున్నట్లు గతంలోనే సాఫ్ట్‌బ్యాంక్ ప్రకటించింది. చెప్పినట్లుగానే ఇప్పుడు బయటకు వచ్చేసింది. అయితే, ఆ సమయంలోనే కంపెనీ నష్టాన్ని అంచనా వేసిందని కంపెనీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. అప్పట్లో సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎం షేర్లను సగటున రూ.800 చొప్పున కొనుగోలు చేసింది. -
'నా బిడ్డ ప్రమాదానికి గురైంది.. ఐసీయూలో ఉంది': పేటీఎం ఫౌండర్
పేటీఎం సంక్షోభం గురించి జేఐఐఎఫ్ ఫౌండేషన్ డే ఈవెంట్లో సంస్థ ఫౌండర్ అండ్ ఎండీ 'విజయ్ శేఖర్ శర్మ' కీలక వ్యాఖ్యలు చేశారు. పేటీఎం ప్రమాదంలో పడి ఇప్పుడు ఐసీయూలో ఉన్న నా కుమార్తె లాంటిదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.పేటీఎం నాకు బిడ్డ లాంటిది. మేము కలిసి ఎదిగాము, లాభాలను చవిచూసాము, ఫ్రీ క్యాష్ కూడా జనరేట్ చేశాము. జీవితంలో నా బిడ్డ ఉన్నతమైన స్థానానికి చేరుతుందని భావించాను, కానీ ఒక ముఖ్యమైన ప్రవేశ పరీక్ష కోసం వెళుతున్నప్పుడు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ఐసీయూలో ఉందని అన్నారు.ఈ ఏడాది ప్రారంభంలో.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కేవైసీ నిబంధనలను పాటించలేదని, తద్వారా మనీ ల్యాండరింగ్ జరిగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావించింది. దీంతో 2024 ఫిబ్రవరి 29 తరువాత కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. డిపాజిట్, క్రెడిట్ సౌకర్యాలు, ప్రీపెయిడ్ అండ్ పోస్ట్-పెయిడ్ ఖాతాలపై టాప్ అప్ చేయకూడదని, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ & యూపీఐ లావాదేవీలు వంటి వాటిని కూడా ఆర్బీఐ నిషేదించింది.పేటీఎంపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది కంపెనీ హోల్డర్లకు కూడా నష్టాన్నే మిగిల్చింది. ఐపీఓలోనే ఈ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. ఆ తరువాత క్రమంగా నష్టాల్లోనే పయనిస్తున్న పేటీఎం ఇప్పుడు కూడా సంక్షోభంలోనే నడుస్తోంది. -
రూ.35లకే పేటీఎం ప్రత్యేక హెల్త్ ప్లాన్.. ప్రయోజనాలు ఇవే..
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ సంస్థ పేటీఎం తమ మర్చంట్ పార్టనర్స్ కోసం ప్రత్యేక హెల్త్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 'పేటీఎం ఫర్ బిజినెస్' యాప్‌లో 'పేటీఎం హెల్త్ సాథీ' అనే ప్రత్యేక హెల్త్ అండ్ ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది.తక్కువ ఖర్చుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడం ద్వారా తమ విస్తారమైన వ్యాపార భాగస్వాముల నెట్‌వర్క్‌కు తోడ్పాటు అందించడానికి పేటీఎం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చొరవ ఒక భాగం. వ్యాపార భాగస్వాముల శ్రేయస్సును పరిరక్షించడం, వారి ఆరోగ్యం, వ్యాపార కొనసాగింపును నిర్ధారించడం 'పేటీఎం హెల్త్ సాథీ' లక్ష్యం.పేటీఎం హెల్త్ సాథీ ప్రయోజనాలునెలవారీ సబ్ స్క్రిప్షన్ పై నెలకు కేవలం రూ.35తో ప్రారంభమయ్యే పేటీఎం హెల్త్ సాథీ తన భాగస్వామ్య నెట్ వర్క్ పరిధిలో అపరిమిత డాక్టర్ టెలీ కన్సల్టేషన్, ఇన్ పర్సనల్ డాక్టర్ విజిట్స్ (ఓపీడీ) వంటి సేవలను అందిస్తోంది.వరదలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, సమ్మెలు వంటి వాటి కారణంగా వ్యాపార అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆదాయ రక్షణ కవరేజీని కూడా ఇది అందిస్తుంది.డాక్టర్ టెలీ కన్సల్టేషన్ సర్వీస్‌తోపాటు ప్రముఖ ఫార్మసీలలో డిస్కౌంట్లు, రోగనిర్ధారణ పరీక్షలలో తగ్గింపులు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.క్లెయిమ్ ప్రాసెస్‌ను కూడా సులభతరం చేసింది. యాప్‌లోనే దీన్ని పూర్తి చేయవచ్చు.'పేటీఎం హెల్త్ సాథీ' పైలట్ సర్వీస్ మే నెలలోనే ప్రారంభమైంది. ఇప్పటికే 3000 మందికి పైగా మర్చంట్ భాగస్వాములు ఉపయోగించుకున్నారు. ఇది విజయవంతం కావడంతో కంపెనీ ఈనెల ప్రారంభంలో తన వ్యాపారులందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా ఎలాంటి విద్యుత్తు బిల్లులు చెల్లించకూడదని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని చెప్పింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో టీజీఎస్పీడీసీఎల్ లేదా ఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఎస్పీడీసీఎల్ పరిధిలో 85 శాతానికి పైగా పవర్ బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (టీపీఏపీ) ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకోసం కొన్ని యూపీఐ ఆధారిత యాప్‌లను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం..బ్యాంకు యాప్‌లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో నమోదవ్వాలి. కానీ చాలా థర్డ్ పార్టీ యాప్‌లకు సేవలందిస్తున్న బ్యాంకులు ఇంకా ఈ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో సదరు చెల్లింపులను నిలిపేస్తున్నాం’ అని తెలిపారు.Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024ఆర్బీఐ నిబంధనలు..జులై 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే చెల్లింపులు చేయాలని పేర్కొంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా యూపీఐ సేవలందించే బ్యాంకులు బీబీపీఎస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దానివల్ల ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే.. వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల్లో బిల్లులు చెల్లించలేరు. ఆ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డుల నుంచి కూడా బిల్లు పేమెంట్ చేయలేరు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్ఫామ్లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు. -
TGSPDCL: ఫోన్‌పే, పేటీఎంలో కరెంటు బిల్లులు చెల్లించకండి
సాక్షి,హైదరాబాద్: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా ఈజీగా విద్యుత్ బిల్లులు చెల్లించే ఛాన్సు ఇక లేదు. ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు యూపీఐ యాపుల్లో పే చేయడం కుదరదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే యూపీఐ పేమెంట్ యాప్స్ ఈ సేవలను నిలిపి వేశాయి. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ రెండింటి ద్వారానే ఈ నెల కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని ఆ సంస్థ ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది. ఒక్క దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థే కాకుండా ఉత్తర తెలంగాణకు సంబంధించిన టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థది అదే పరిస్థితని తెలుస్తోంది. Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024 -
జొమాటో చేతికి ఆ పేటీఎం బిజినెస్.. పురోగతిలో చర్చలు!
పేటీఎంకు సంబంధించిన మూవీ టికెటింగ్ అండ్ ఈవెంట్స్ బిజినెస్‌ను ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో కొనుగోలు చేయబోతోంది. రూ.1,500 కోట్లకు ఈ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు జొమాటో చర్చలు జరుపుతోందని, ఈ చర్చలు పురోగతిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.పేటీఎం ఈవెంట్లు, మూవీ టికెటింగ్ వ్యాపారంపై జొమాటో ఆసక్తి వ్యూహాత్మకంగా సరిపోతుందని, ఆహారం, కిరాణా, వినోదంతో సహా వివిధ కేటగిరీల్లో వినియోగదారుల డిమాండ్‌ను చేజిక్కించుకోవడమే దాని విస్తృత లక్ష్యమని ఈటీ నివేదిక పేర్కొంది. ఈ కొనుగోలు ఖరారైతే క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ (గతంలో గ్రోఫర్స్)ను కొనుగోలు చేసిన తర్వాత జొమాటోకి ఇది రెండో అతిపెద్ద కొనుగోలు అవుతుంది. 2022లో రూ.4,447 కోట్ల విలువైన బ్లింకిట్‌ను జొమాటో కొనుగోలు చేసింది.క్విక్ కామర్స్ విభాగంలో పోటీ పెరిగిన నేపథ్యంలో జొమాటో తన క్విక్ కామర్స్ అనుబంధ సంస్థ బ్లింకిట్ లోకి రూ.300 కోట్లు చొప్పించనుంది. తాజా విడతలో బ్లింకిట్ లో జొమాటో మొత్తం పెట్టుబడులు రూ.2,300 కోట్లకు చేరినట్లు టోఫ్లర్ నుంచి లభించిన ఫైలింగ్స్ ద్వారా వెల్లడైంది. పేటీఎం తన మూవీ, ఈవెంట్స్ టికెటింగ్ బిజినెస్‌కు సంబంధించిన వ్యాపార గణాంకాలను వెల్లడించలేదు. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎం తన మార్కెటింగ్ సేవల వ్యాపారంలో రూ .1,740 కోట్లు వార్షిక అమ్మకాలను నివేదించింది, ఇందులో సినిమా, ఈవెంట్లు, క్రెడిట్ కార్డ్ మార్కెటింగ్, గిఫ్ట్ వోచర్లు ఉన్నాయి. -
పేటీఎంలో ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ మరోమారు ఉద్యోగుల్లో కోత విధించింది. వీరికి ఔట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రెజ్యూమే రూపకల్పనకు సాయం చేయడంతోపాటు ఇంటర్వ్యూకు సన్నద్ధం చేయడం, మెళకువలు నేర్పడం, మార్కెట్లో ఉన్న ఉద్యోగావకాశాలను తెలియజేయడం వంటివి ఔట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ అంటారు. తీసివేతకు గురైన సిబ్బందికి సాయం చేసేందుకు.. మార్కెట్లో నియామకాలు చేపడుతున్న 30 కంపెనీలతో పేటీఎం మానవ వనరుల విభాగం చేతులు కలిపింది. కాగా, ఎంత మందిని తొలగించిందీ అన్న విషయం మాత్రం వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించలేదు. -
లేఆఫ్స్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ
పేటీఎం పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా ప్రకటించింది. లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులకు కొత్త కొలువులు వచ్చేలా కంపెనీ మద్దతు ఇస్తుందని చెప్పింది.కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ మే నెలలో సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను ప్రారంభించారు. సంస్థ ఖర్చులు తగ్గించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. టెక్ కంపెనీకి ప్రధానంగా టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(సాంకేతిక సదుపాయాలు), ఉద్యోగుల వేతనాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి చాలా కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇటీవల పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థలో కొన్ని మార్పులు చేస్తున్నారు. మేనెలలో కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో భాగంగానే తాజాగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు కంపెనీ చెప్పింది. అయితే ఎంతమందిని ఉద్యోగాల్లోనుంచి తొలగించిందో మాత్రం తెలియజేయలేదు.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్విజయ్శేఖర్ శర్మ మే 22న షేర్హోల్డర్లకు రాసిన లేఖలో..‘సంస్థ తన ప్రధాన వ్యాపారాలపై దృష్టి సారిస్తోంది. సంభావ్య తొలగింపులకు(పొటెన్షియల్ లేఆఫ్స్) సిద్ధమైంది. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడుల కారణంగా ఉద్యోగుల ఖర్చులు గణనీయంగా పెరిగాయి’ అని పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగుల ఖర్చులను తగ్గించడం ద్వారా ఏటా రూ.400కోట్లు-రూ.500 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్‌ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (పీజీఐఎల్) సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.దీంతో ఇకపై పీజీఐఎల్ ఇన్సూరెన్స్ నేరుగా తన కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మేందుకు వీలు లేదు. థర్డ్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. అంటే ఇతర ఇన్సూరెన్స్ పాలసీల నిర్వహణ, అమ్మకాలు చేయొచ్చు. జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్సు కోసం దరఖాస్తును ఉపసంహరించుకోవడం ద్వారా మాతృ సంస్థ రూ. 950 కోట్ల నగదును ఆదా చేసుకునేందుకు వీలు అవుతుందని పేటీఎం తెలిపింది. ఆ మొత్తాన్ని పీజీఐఎల్‌లో పెట్టుబడి పెట్టేందుకు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. మరో అనుబంధ సంస్థ పేటీఎం ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం వినియోగదారులకు, చిరు వ్యాపారులకు ఇతర పరిశ్రమలకు ఇన్సూరెన్స్ సేవల్ని అందించడంపై దృష్టి సారిస్తామని తెలిపింది. -
పేటీఎంకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ క్యూ4లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 168 కోట్ల నుంచి రూ. 550 కోట్లకు చేరింది. పేటీఎం బ్రాండ్ కంపెనీ మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లకు పరిమితమైంది. యూపీఐ లావాదేవీలు తదితరాలలో తాత్కాలిక అవరోధాలు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీఎల్)కు శాశ్వత అంతరాయం కారణంగా పనితీరు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంక్ భవిష్యత్ బిజినెస్‌పై అనిశ్చితి కొనసాగనున్న నేపథ్యంలో పీపీబీఎల్‌లో 39 శాతం వాటాకుగాను క్యూ4లో రూ. 227 కోట్ల పెట్టుబడులను రద్దు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లను తాకినట్లు తెలియజేశారు. 2022–23లో రూ. 2,465 కోట్ల టర్నోవర్ సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక గతేడాది నికర నష్టం రూ. 1,422 కోట్లకు చేరగా.. 2022–23లో రూ. 1,777 కోట్ల నష్టం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 369 వద్ద ముగిసింది. -
పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్.. త్వరలోనే లేఆఫ్స్
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ఉద్యోగులకు షాకివ్వనుంది. త్వరలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన కంపెనీలోని షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగులకు చెల్లించే జీతాల ఖర్చులు గణనీయంగా పెరిగాయని, కాబట్టే సంస్థ ఖర్చు తగ్గించేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక పెట్టుబడులు కొనసాగుతుండగా ఉద్యోగుల ఖర్చులను తగ్గించేందుకు కూడా సంస్థ చర్యలు తీసుకుంటుందని, ఈ నిర్ణయంతో సంస్థకు ఏటా రూ. 400-500 కోట్ల వరకు ఆదా అవుతుందని పేటీఎం సీఈఓ చెప్పారు. రాబోయే సంవత్సరానికి, మేం బిజినెస్ సేల్స్ విభాగంతో పాటు రిస్క్ అండ్ కంప్లైయన్స్ ఫంక్షన్లలో పెట్టుబడులు కొనసాగిస్తూనే.. లేఆఫ్స్‌తో ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు.. ఫలితంగా ఏడాదికి రూ.400 నుంచి రూ. 500 కోట్లు ఆదా అవుతుందని మేం ఆశిస్తున్నట్లు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. అంతేకాదు కంపెనీ తన కస్టమర్ కేర్‌ను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోందని, ఆదాయాన్ని పెంచుకుంటూనే ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన కంపెనీ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. -
పేటీఎం కొత్త వ్యూహం
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ఇటీవల తన పేమెంట్స్ బ్యాంక్‌ను రద్దు చేయడంతో తమకు తిరుగులేదని ప్రత్యర్థి కంపెనీలు సంబరపడిపోయాయి. కానీ వాటికి దీటైన సమాధానం ఇస్తూ తిరిగి మార్కెట్లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు పేటీఎం సరికొత్త ప్లాన్ చేసింది. థర్డ్ పార్టీ పేమెంట్ సేవల కోసం ప్రముఖ బ్యాంకులతో జతకట్టింది. యాప్‌లో యూపీఐ లావాదేవీలు చేస్తే ఏకంగా రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించింది.పెద్దనోట్ల రద్దు సమయంలో దాదాపు దేశం అంతటా ఆన్లైన్ పేమెంట్ సేవలందించిన పేటీఎం..క్రమంగా తన సబ్స్రైబర్లను పెంచుకుంది. వారికి మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా పేమెంట్స్ బ్యాంక్‌ను ప్రారంభించింది. యుటిలిటీ బిల్లు చెల్లింపుల నుంచి షాపింగ్ వరకు డబ్బుతో ముడిపడిన చాలా కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. నేరుగా క్రెడిట్‌కార్డులు ఇచ్చే స్థాయికి చేరింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) లావాదేవీల్లో ముందువరుసలో నిలిచింది. టోల్గేట్ల వద్ద ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం తన వినియోగదారులకు ఫ్యాస్టాగ్ సర్వీస్‌ను అందించింది.ఇటీవల కొంతమంది పేటీఎం యూజర్ల ఖాతాల్లో పరిమితులకు మించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఆర్బీఐ అధికారులు తెలిపారు. దాంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తన వినియోగదారులు పేమెంట్స్ బ్యాంక్ ద్వారానే యూపీఐ సేవలు వినియోగించుకునేవారు. ఒక్కసారిగా దాన్ని రద్దు చేయడంతో ప్రత్యర్థి కంపెనీలు ఒకింత సంబరపడిపోయాయి. వాటికి ధీటైన సమాధానం చెబుతూ ఎన్పీసీఐ ద్వారా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) లైసెన్స్‌ను సంపాదించింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్ మోడల్ కింద పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తోంది.బ్యాంకింగ్ సేవలిందిస్తున్న యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్‌లు పేటీఎంకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఉన్న మర్చంట్స్‌కు, కొత్త మర్చంట్స్‌కు యస్ బ్యాంక్ సేవలందిస్తోంది. @paytm యూపీఐ హ్యాండిల్ కలిగిన మర్చంట్ పేమెంట్స్ యస్ బ్యాంక్‌కు రీడైరెక్ట్ అయ్యాయి.ఇదీ చదవండి: ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!మార్కెట్లో తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకునేలా యూజర్లు క్యాష్‌బ్యాంక్ ప్రకటించింది. యూపీఐ లావాదేవీలు చేస్తూ రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందేలా వీలుకల్పిస్తుంది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్‌పేలతో సహా ఇప్పటికే దేశంలో 22 థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి.#Paytm is India’s favourite payment app! 🚀 Now, better with power of 4 banks Get assured Rs 100 cashback on UPI payments using Paytm app. Download now: https://t.co/750WzmXs4E #PaytmKaro @YESBANK @AxisBank @HDFC_Bank @TheOfficialSBI pic.twitter.com/5MpOIj8owT— Paytm (@Paytm) May 3, 2024 -
పేటీఎంకు 'భవేష్ గుప్తా' గుడ్‌బై.. కారణం ఇదే
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'భవేష్ గుప్తా' తన పదవికి రాజీనామా చేశారు. కెరీర్లో విరామం తీసుకోవాలనే వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుప్తా పేర్కొన్నారు.మే 31న కంపెనీ నుంచి ఆయన రిలీవ్ కానున్నారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. గుప్తా ఏడాది చివరి వరకు పేటీఎం కార్యక్రమాలకు మార్గదర్శకత్వం చేస్తూ సలహాదారుగా ఉండే అవకాశం ఉందని సమాచారం.గుప్తా పేటీఎంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించేవారు. కొత్త లావాదేవీలను కొనసాగించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ నిషేధం విధించడం వల్ల ఆయన నేతృత్వంలోని లావాదేవీలన్నీ కూడా ప్రతికూల ప్రభావానికి లోనయ్యాయి.రాకేష్ సింగ్ ఇటీవలే పేటీఎం మనీ లిమిటెడ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈయన గతంలో ఫిస్డమ్లో స్టాక్ బ్రోకింగ్‌కు సీఈఓగా ఉన్నారు. అంతే కాకుండా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అండ్ స్టాండర్డ్ చార్టర్డ్‌లో కీలకమైన పదవులను నిర్వహించినట్లు తెలుస్తోంది.We're excited to announce leadership changes as we double down on our payments & financial services offerings. Strengthening succession planning, Bhavesh Gupta transitions to advisory role while Varun Sridhar becomes CEO of Paytm Services Pvt Ltd. Welcome aboard Rakesh Singh,…— Paytm (@Paytm) May 4, 2024 -
కొత్త సౌండ్‌బాక్స్‌లు ప్రారంభించిన పేటీఎం.. ప్రత్యేకతలివే..
ఫిన్‌టెక్ దిగ్గజ సంస్థ పేటీఎం తమ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు, క్రెడిట్‌కార్డుల కోసం కొత్త సౌండ్‌బాక్స్‌లను తీసుకొచ్చింది. ఈ పరికరాలు మేడ్ఇన్ఇండియా దృక్పథంతో తయారైనట్లు కంపెనీ తెలిపింది. ఈ సౌండ్‌బాక్స్‌లు 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆడియో డివైజ్‌ల బ్యాటరీ లైఫ్ 10 రోజులుంటుందని చెప్పింది. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, ఒడియా, మరాఠీ, తెలుగు, తమిళంతో సహా 11 భాషల్లో నోటిఫికేషన్లను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. సౌండ్‌బాక్స్‌లు లాంచ్ చేసేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో పేటీఎం వ్యవస్థాపకులు, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ..‘కొత్త సౌండ్‌బాక్స్‌లు భారతదేశంలోనే తయారు చేశాం. ఇవి స్పష్టమైన సౌండ్‌ను అందిస్తాయి. భారతీయ పరిస్థితులకు ఇవి బాగా సరిపోతాయి. అధిక శబ్దం వచ్చే పరిస్థితుల్లోనూ పేటీఎం కస్టమర్లకు స్పష్టమైన నోటిఫికేషన్‌ను అందిస్తాయి’ అన్నారు. ఇదీ చదవండి: గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను రద్దు చేసిన తర్వాత యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం థర్డ్‌పార్టీ పేమెంట్ గేట్‌వేల కోసం ప్రయత్నించింది. పేటీఎం వినియోదారులకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ (పీఎస్పీ) బ్యాంక్ హ్యాండిల్స్‌ను మార్చారు. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యెస్ బ్యాంక్‌లతో పేటీఎం పీఎస్పీను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 17న ఈ పీఎస్పీ బ్యాంకులకు కస్టమర్ మైగ్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. -
Surinder Chawla : పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు మరో షాక్!
ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) సీఈఓ పదవికి సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చావ్లా తెలిపారు. మెరుగైన కెరీర్ కోసం అవకాశాలను అన్వేషించాలని ఉద్దేశంతో పీపీబీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించారు. పీపీబీఎల్‌లో చావ్లా జూన్ 26 వరకు కొనసాగనున్నారు. గత ఏడాది జనవరి 9న చావ్లా పేమెంట్ బ్యాంక్‌లో చేరారు. అంతకు ముందు ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్‌గా ఉన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో పాటు ఇతర సంస్థలలో పనిచేసిన చావ్లాకు బ్యాంకింగ్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆరోపణలు పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2024 ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లతో పాటు ఇతర లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ గడువు తేదీని మార్చి 15వరకు పొడిగింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇతర యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్‌పే తరహాలో సేవలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి పీపీబీఎల్ నుంచి విడిపోయిన పేటీఎం ఆర్బీఐ ఆదేశాల మేరకు పీపీబీఎల్ నుంచి పేటీఎం వ్యాపార లావాదేవీలకు స్వస్తి చెప్పింది. బ్యాంక్ బోర్డు స్వతంత్ర చైర్‌పర్సన్‌తో పాటు ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్లతో పునర్నిర్మించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. -
పేటీఎంకు భారీ ఊరట..
-
పేటీఎంకు భారీ ఊరట.. ఇకపై యథావిధిగా ప్రముఖ సేవలు.. కానీ..
పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్‌కు భారీ ఊరట లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) లైసెన్స్‌ను ఇటీవల మంజూరు చేసింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్ మోడల్ కింద ఇకపై పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తుంది. లైనెన్స్‌లో వివరాల ప్రకారం..బ్యాంకింగ్ సేవలిందిస్తున్న యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్‌లు ఇకపై పేటీఎంకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంక్స్‌గా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ఉన్న మర్చంట్స్‌కు, కొత్త మర్చంట్స్‌కు యస్ బ్యాంక్ ఇకపై సేవలందిస్తుంది. అంటే @paytm యూపీఐ హ్యాండిల్ కలిగిన మర్చంట్ పేమెంట్స్ ఇకపై యస్ బ్యాంక్‌కు రీడైరెక్ట్ అవుతాయి. ఇదీ చదవండి: పెళ్లి ఖర్చు తగ్గడానికి బెస్ట్ ప్లాన్..! చాలా డబ్బు ఆదా.. ప్రస్తుతం ఉన్న యూజర్లు, మర్చంట్లు తమ యూపీఐ లావాదేవీలు, ఆటో పే మ్యాండెట్లను ఎలాంటి అవాంతరం లేకుండా వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం వీలు పడుతుందని ఎన్పీసీఐ తెలిపింది. పేటీఎం కూడా కొత్త పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకులకు తమ హ్యాండిళ్లను మైగ్రేట్ చేయాలని సూచించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు, మర్చంట్స్ మార్చి 15లోగా తమ అకౌంట్లను వేరే బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.