రతన్ టాటా మృతిపట్ల సంతాపం తెలుపుతూ పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్ శర్మ చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. టాటా మరణవార్త విని పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా టాటాకు సంతాపం ప్రకటించారు. అయితే తన ట్వీట్‌లోని చివరి లైన్లపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.
‘భవిష్యత్తు తరం వ్యాపారులు టాటా ఇచ్చే సలహాలు, సూచనలను మిస్ అవుతారు. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్ టాటా. సెల్యూట్ సర్.. ఓకే టాటా బైబై’ అని విజయ్‌శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ చివరి లైన్ ‘ఓకే టాటా బైబై’పై నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కాసేపటికే శర్మ ఆ పోస్ట్‌ను తొలగించారు.
wtf is the last line pic.twitter.com/dOrIeMQH7c
— Shivam Sourav Jha (@ShivamSouravJha) October 10, 2024
ఇదీ చదవండి: టోల్‌ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!
రతన్ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, టీవీఎస్ మోటార్స్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ చైర్మన్, సంజీవ్ గోయెంకా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, కుమారమంగళం బిర్లా, హిందుజా గ్రూప్ చైర్మన్. జీపీ హిందుజా, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ (ఇండిగో) ఎండీ రాహుల్ భాటియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ ఉన్సూకిమ్..వంటి ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment