ఢిల్లీకి చెందిన 'కుశల్ అరోరా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో చేసిన పోస్ట్ నెట్టింట్లో చర్చకు దారి తీసింది. నా వయసు 23 సంవత్సరాలు. ఏడాదికి 500000 డాలర్లు (రూ.4.2 కోట్లు కంటే ఎక్కువ) సంపాదిస్తున్నాను. నా వయసులోని విద్యార్థులు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా సోషల్ ఈవెంట్స్ మిస్ అయ్యాను. ఎన్నో వైఫల్యాలను చూశాను. అయినా నేను దీనినే ఎంచుకున్నాను. మీరు కూడా మీ కలల జీవితాన్ని నిర్మిస్తున్నారా? అని ప్రశ్నించారు.
కుశాల్ అరోరా త్యాగాలు అతన్ని ఆర్థికంగా విజయం సాధించేలా చేశాయి. కానీ ఇవి కొందరికి స్ఫూర్తిగా నిలిచినప్పటికీ.. మరికొందరికి నచ్చలేదు. యువతరం మీద అనవసరమైన ఒత్తిడి సృష్టిస్తున్నాడని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అతనిని నిందించడం మొదలుపెట్టారు. డబ్బు మీద వ్యామోహం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు.
నువ్వు నీ జీవితాన్ని గడిపావు, వాళ్ళు బ్రతుకుతున్నారు. అందరూ ఎక్కువ సంపాదించాలని కలలు కంటారు. కానీ దానినే ఫ్యాన్సీగా మార్చుకోవడం మానేయండి. మీరు కష్టపడి పనిచేస్తే.. డబ్బు వచ్చింది. దానితో జీవించండి. దీనిని ఇతరులకు ఆపాదించడం మానేయండి.. అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు
నేను ఆ వయసులో పార్జీలు చేసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. మీరు పాటించిన విధానాలు అందరికి పనిచేస్తాయని అనుకోవద్దని మరొకరు అన్నారు. ఒక ట్వీట్‌పై అరోరా స్పందిస్తూ.. నేను 19 సంవత్సరాల వయసులోనే నా ప్రయాణం మొదలుపెట్టాను. నా వ్యాఖ్యలు యువతపై ఒత్తిడి తీసుకువస్తాయి అనుకుంటే సంతోషంగా మ్యూట్ చేయండి. కానీ నా లక్ష్యం యువతలో ప్రేరణ కల్పించడమే అని పేర్కొన్నారు.
I'm 23yrs old earning over $5,00,000 annually.
When students of my age were partying & chilling, I was:
- Having sleepless nights working
- Missing social events
- Dealing with failures/rejection
- Losing work-life balance
But I chose that. Are you building your dream life?— Kushal Arora (@digitalkushal) October 16, 2024
Comments
Please login to add a commentAdd a comment