Delhi Man
-
నెట్టింట్లో చర్చకు దారితీసిన ట్వీట్
ఢిల్లీకి చెందిన 'కుశల్ అరోరా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో చేసిన పోస్ట్ నెట్టింట్లో చర్చకు దారి తీసింది. నా వయసు 23 సంవత్సరాలు. ఏడాదికి 500000 డాలర్లు (రూ.4.2 కోట్లు కంటే ఎక్కువ) సంపాదిస్తున్నాను. నా వయసులోని విద్యార్థులు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా సోషల్ ఈవెంట్స్ మిస్ అయ్యాను. ఎన్నో వైఫల్యాలను చూశాను. అయినా నేను దీనినే ఎంచుకున్నాను. మీరు కూడా మీ కలల జీవితాన్ని నిర్మిస్తున్నారా? అని ప్రశ్నించారు.కుశాల్ అరోరా త్యాగాలు అతన్ని ఆర్థికంగా విజయం సాధించేలా చేశాయి. కానీ ఇవి కొందరికి స్ఫూర్తిగా నిలిచినప్పటికీ.. మరికొందరికి నచ్చలేదు. యువతరం మీద అనవసరమైన ఒత్తిడి సృష్టిస్తున్నాడని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అతనిని నిందించడం మొదలుపెట్టారు. డబ్బు మీద వ్యామోహం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు.నువ్వు నీ జీవితాన్ని గడిపావు, వాళ్ళు బ్రతుకుతున్నారు. అందరూ ఎక్కువ సంపాదించాలని కలలు కంటారు. కానీ దానినే ఫ్యాన్సీగా మార్చుకోవడం మానేయండి. మీరు కష్టపడి పనిచేస్తే.. డబ్బు వచ్చింది. దానితో జీవించండి. దీనిని ఇతరులకు ఆపాదించడం మానేయండి.. అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులునేను ఆ వయసులో పార్జీలు చేసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. మీరు పాటించిన విధానాలు అందరికి పనిచేస్తాయని అనుకోవద్దని మరొకరు అన్నారు. ఒక ట్వీట్‌పై అరోరా స్పందిస్తూ.. నేను 19 సంవత్సరాల వయసులోనే నా ప్రయాణం మొదలుపెట్టాను. నా వ్యాఖ్యలు యువతపై ఒత్తిడి తీసుకువస్తాయి అనుకుంటే సంతోషంగా మ్యూట్ చేయండి. కానీ నా లక్ష్యం యువతలో ప్రేరణ కల్పించడమే అని పేర్కొన్నారు.I'm 23yrs old earning over $5,00,000 annually.When students of my age were partying & chilling, I was:- Having sleepless nights working- Missing social events- Dealing with failures/rejection- Losing work-life balanceBut I chose that. Are you building your dream life?— Kushal Arora (@digitalkushal) October 16, 2024 -
దొంగతనం కోసం వెళ్తే చివరికి ఎముకలే మిగిలాయి..
నాంపల్లి: ఈ నెల 5న అదృశ్యమైన ఓ కారు డ్రైవరు బీదరు అడవుల్లో శవమయ్యాడు. కుటుంబసభ్యులకు శవం కాకుండా ఎముకలు మాత్రమే లభించాయి. చెట్ల పొదల్లో లభ్యమైన శవాన్ని అడవి పందులు పీక్కు తిన్నాయి. అంత్యక్రియలకు ఎముకలు తప్ప ఏ ఇతర శరీర భాగాలు దొరకలేదు. చివరకు వాటినే తెచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ విషాదకరమైన సంఘటన నాంపల్లి పోలీసు స్టేషన్లో జరిగింది. ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా తెలిపిన మేరకు.. ఢిల్లీకి చెందిన శివకుమార్(28), బీదర్‌కు చెందిన ఇంతియాజ్ ఖనమ్ (24) ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని ఢిల్లీకి మకాం మార్చారు. ఉపాధి కోసం నేరాలబాట పట్టారు. ఈ నెల 4న రైలులో హైదరాబాదుకు చేరుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని శ్రీసాయి లాడ్జిలో బస చేశారు. కార్లను అద్దెకు తీసుకుని స్క్రాబ్‌కు వేసి సొమ్ముచేసునేందుకు పథకాన్ని రచించారు. ఈ నెల 5న నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ కారును అద్దెకు తీసుకున్నారు. డ్రైవర్ అస్లం ఖాన్(48)తో కలిసి బీదర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో రవి అనే స్నేహితుడిని శివకుమార్ కారులో తీసుకెళ్లారు. మణ్యకెళ్లి అడవిలో డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న శివకుమార్ వైరుతో డ్రైవర్ అస్లం ఖాన్ గొంతుకు వేసి బిగించి హత్యచేశారు. ఇందుకు రవి, ఇంతియాజ్ ఖనమ్ సహకరించారు. మృతదేహాన్ని చెట్ల పొదల్లో వదలి నిందితులు కారును బీదరులోని ఓ స్క్రాబ్ దుకాణం యజమానికి రూ.14వేలకు అమ్మేశారు. తిరిగి నగరానికి వచ్చారు. నాంపల్లి టిప్పుఖాన్ సరాయిలో నివాసం ఉండే అస్లం ఖాన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలు, లాడ్జిలో లభించిన ఆధారాలను సేకరించిన పోలీసులు చివరికి ఎంజీబీఎస్ దగ్గర నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నేరాన్ని చేసినట్లుగా విచారణలో ఒప్పుకోవడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మార్ఫ్డ్ చిత్రాలతో.. 100 మంది మహిళలను
న్యూఢిల్లీ: మహిళల సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్ ఫోటోలను డౌన్లోడ్ చేసి.. వాటిని మార్ఫ్ చేసి.. ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోన్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నోయిడాకు చెందిన సుమిత్ ఝా(26) అనే వ్యక్తి మహిళల సోషల్ మీడియా అకౌంట్ నుంచి వారి ప్రొఫైల్ పిక్చర్స్ డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫ్ చేసేవాడు. తర్వాత సేమ్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. ఆ ఫోటోలను సదరు మహిళలకి పంపి.. అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు. ఇలా దాదాపు 100 మహిళలను బ్లాక్మెయిల్ చేశాడు. ఈ క్రమంలో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఓ మహిళను కూడా బెదిరించేందుకు ప్రయత్నించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంతో మిగతా బాధితుల గురించి తెలిసింది. (చదవండి: ఉరితాడు కోసి.. ఊపిరి పోసి) ఈ సందర్భంగా ఓ పోలీసాఫీసర్ మాట్లాడుతూ.. ‘నిందితుడు పోలీసులకు దొరకకుండా ఉండటం కోసం వాట్సాప్ ద్వారా వీఓఐపీ కాల్స్, వేరే యాప్స్ ద్వారా బెదిరింపులకు దిగేవాడు. ఇక సదరు బ్యాంక్ ఎంప్లాయ్ ఫిర్యాదుతో సర్వీస్ ప్రొవైడర్ రిపోర్ట్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సేకరించి నిందితుడిని గుర్తించగలిగాము. మంగళవారం అతడిని అరెస్ట్ చేశాం ’ అని తెలిపారు. ఇక నిందితుడిని గతంలో ఇదే నేరం కింద చత్తీస్‌గఢ్, నోయిడాలో రెండు సార్లు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
స్పానిష్ ఫ్లూ నుంచి కరోనా దాకా..
న్యూఢిల్లీ: 106 సంవత్సరాల వృద్ధుడి అపూర్వమైన విజయగాథ ఇది. 1918లో నాలుగేళ్ల వయసులో స్పానిష్ ఫ్లూ బారినపడి కోలుకొని, మళ్లీ 102 ఏళ్ల తర్వాత 106 ఏళ్ల వయసులో కరోనా మహమ్మారిని జయించాడు. ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకొని, నెల రోజుల క్రితం రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన భార్య, కుమారుడు, కుటుంబంలోని మరో వ్యక్తి కంటే ఆయనే ముందుగా కోలుకున్నాడు. ఢిల్లీలో ఇలా రెండు మహమ్మారులను జయించిన వ్యక్తి బహుశా ఈయనొక్కడే కావొచ్చని అధికారులు తెలిపారు. వృద్ధుడి కుటుంబ సభ్యులు కూడా కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. 102 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూప్రపంచాన్ని వణికించింది. అప్పటి జనాభాలో మూడింట రెండొంతుల మంది ఈ వైరస్ బారినపడ్డారు. -
రూ.15 వేల బండికి జరిమానా రూ.23 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త మోటార్ వాహన చట్టం నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపెట్టడం ఖాయం. గుర్‌గ్రామ్‌లో చోటు చేసుకున్న ఉదంతం ఒకటి ఈ విషయాన్ని తేట తెల్లం చేసింది. నాలుగు రాష్ట్రాలు (తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్) మినహా దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ప్రకారం భారీ జరిమానాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా హెల్మెల్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, కాలుష్య నియంత్రణ.. ఇలా ఏ సర్టిఫికెట్ లేకపోయినా వాహనదారుడు పది రెట్లకు మించి భారీ మూల్యం చెల్లించాల్సిందే. దినేష్ మదన్ తాజా అనుభవం గురించి తెలుసుకుందాం.. దినేష్‌కు కొత్త ట్రాఫిక్ నిబంధనల కింద ఏకంగా రూ.23,000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే.. లైసెన్స్, ఆర్సీ డాక్యుమెంట్స్ లేవు.. దీంతో పాటు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు భారీ జరిమానా విధించారు. హెల్మెట్ లేదని బండి ఆపి, సర్టిఫికెట్లు లేవంటూ భారీ ఫైన్ విధించారని, వాట్సాప్‌లో లెసెన్స్ కాపీని చూపించినా అంగీకరించలేదని దినేష్ వాపోయాడు. హోండా యాక్టివా బైక్‌ను సెకండ్ హ్యాండ్లో రూ.15వేలకు కొన్నాను. ఇపుడు దీనికి రూ. 23 వేల జరిమానా చూసి షాకయ్యానంటున్నాడు దినేష్. బండికి సంబంధించిన కాగితాలన్నీ ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పాడు. అయితే హెల్మెట్ ధరించనందుకు గాను వెయ్యి రూపాయల ఫీజును తీసుకొని, తన బండి తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నాడు. అంతేకాదు.. ఇక మీదట అన్ని నిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తానని తెలిపాడు. అయితే రూల్ ఈజ్ రూల్ అంటున్నారు అధికారులు. లైసెన్స్ లేని డ్రైవింగ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేదు, ఎయిర్ పొల్యూషన్ నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ లేని డ్రైవింగ్... ఈ నిబంధనల ఉల్లంఘనల కింద జరిమానా విధించామని వెల్లడించారు. చదవండి : 'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్లే! -
అమ్మా, నాన్నా.. అక్కడకొచ్చి నా శవం తీసుకెళ్లండి..!!
న్యూఢిల్లీ : స్నేహితులతో కలిసి బర్త్‌డే పార్టీకి వెళ్లిన కొడుకు అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. మరికాపట్లో ఇళ్లు చేరుతానని చెప్పిన తమ కుమారుడు హర్ష్ కందేల్వాల్ (26) నుంచి ఊహించని మెసేజ్ రావడంతో ఆ తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ‘అమ్మా నాన్నా నన్ను క్షమించండి. నా స్కూటర్, మనీ పర్స్, ఇతర వస్తువులు ఐటీవో బ్రిడ్జి దగ్గర ఉంటాయి తీసుకోండి. నా శవం బ్రిడ్జి కింద ఉంటుంది స్వాధీనం చేసుకోండి’అని వాట్సాప్‌లో సందేశమిచ్చాడు. ఊహించని షాక్‌తో తల్లిదండ్రులు హుటాహుటిన ఐటీవో బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు. అతను చెప్పినట్టే అక్కడ స్కూటర్, పర్స్ ఉన్నాయి. కానీ, హర్ష్ కనబడలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు పెట్టారు. వాట్సాప్ మెసేజ్ గురించి తెలుసుకున్న పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. వట్టి బెదిరింపులే కావచ్చునని అనుకున్నారు. అయితే, జూన్ 30న నుంచి కనిపించకుండా పోయిన హర్ష్ యమునా నది తీరంలో జూలై 3న శవమై తేలాడు. ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించేవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ శవం నాలుగు రోజుల క్రితం కనిపించకుండాపోయన హర్ష్దే అని గుర్తించారు. నలుగురు స్నేహితులతో కలిసి ఫ్రెండ్ భార్య పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన తమ కొడుకు హత్యకు గురయ్యాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి చాందినీచౌక్‌లో నివాసముండే హర్ష్ ఓ ఆన్లైన్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. హత్యేకేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. -
ప్రపోజ్ చేశాడు.. వెంటనే వద్దన్నాడు
-
ప్రపోజ్ చేశాడు.. వెంటనే వద్దన్నాడు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఈసీ మొదలు సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు ఓటు ఆవశ్యకత గురించి చెప్పడమే కాక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలంటూ తెగ ప్రచారం చేశారు. అయితే వీరి ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపిందో తెలీదు కానీ ఓ ఢిల్లీ యువకుడు చేసిన ప్రయత్నం మాత్రం నెటిజన్లను ఆలోచనలో పడేయడమే కాక ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. డాక్టర్ అంగద్ సింగ్ చౌదరీ అనే వ్యక్తి తన ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేవిధంగా ఉంది. వీడియోలో ఓ యువకుడు.. తాను ఇష్టపడిన అమ్మాయికి.. తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు. కానీ ఆమె తిరస్కరిస్తుందేమో అనే ఆలోచనతో వెనకడుగు వేస్తుంటాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెప్తాడు. అందుకు వారు ‘ఎక్కువగా ఆలోచించకు. వెళ్లి నీ ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పమ’ని సలహా ఇస్తారు. ధైర్యం కూడగట్టుకున్న ఆ యువకుడు.. యువతి దగ్గరకు వెళ్లి.. మోకాళ్ల మీద కూర్చుని.. తన ప్రేమను తెలియజేస్తాడు. అందుకు ఆమె కూడా అంగీకరిస్తుంది. దాంతో ప్రేమించిన యువతి చేతికి ఉంగరం తొడగడానికి ఆమె చేతిని అందుకుంటాడు. కానీ వెంటనే ఆ ఆలోచనని విరమించుకుంటాడు. తాను ఆమెకి సరి జోడు కాదు.. మన్నించమని కోరతాడు. రెండు సెకన్ల ముందే తనను పెళ్లి చేసుకోమని కోరిన వ్యక్తి ఇంత సడెన్‌గా ఇలా మాట్లాడటంతో సదరు యువతి ఆశ్చర్యపోతుంది. కారణం అడుగుతుంది. అందుకు ఆ యువకుడు ఆమె చూపుడు వేలును చూపించి.. ఓటు వేయలేదని చెప్తాడు. అంతేకాక ‘దేశాన్ని ప్రేమించలేని వ్యక్తి.. తనను ఎలా ప్రేమిస్తుంద’ని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతాడు. సింపుల్‌గా చాలా మంచి సందేశం ఇచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Che Guevara: “At the risk of seeming ridiculous, let me say that the true revolutionary is guided by a great feeling of love. It is impossible to think of a genuine revolutionary lacking this quality.” Indian Tik Tok: pic.twitter.com/dlF5MWzIbd — Dr. Angad Singh Chowdhry (@angadc) May 5, 2019 -
ఇంటికి వచ్చి.. ఆధార్‌కార్డు అడిగాడు!
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో రాజకీయాలకు సంబంధించిన పోస్ట్‌లు పెడుతున్నారా, అయితే మీ ఇంటికి ఎఫ్బీ ప్రతినిధి రావొచ్చు. సదరు పోస్ట్ మీరే పెట్టారా, లేదా అనేది ధ్రువీకరించుకోవడానికి ఫేస్బుక్ ప్రతినిధి మీ తలుపు తట్టొచ్చు. రాజకీయ పోస్ట్ పెట్టిన ఢిల్లీవాలా ఇంటికి ఎఫ్బీ ప్రతినిధి వచ్చి ఆరా తీసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఫేస్బుక్ ప్రతినిధి తనింటికి వచ్చి ఆధార్‌కార్డు అడిగినట్టు ‘ఐఏఎన్ఎస్’ వార్తా సంస్థతో ఢిల్లీవాసి ఒకరు చెప్పారు. ‘పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీసులు వచ్చినట్టుగా ఫేస్బుక్ ప్రతినిధి మా ఇంటికి వచ్చారు. ఫేస్బుక్లో రాజకీయాలకు సంబంధించిన పోస్ట్ పెట్టింది నేనో, కాదో తెలుసుకునేందుకు నా ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు చూపించాలని అడిగారు. ఫేస్బుక్ ప్రతినిధి నేరుగా మా ఇంటికి రావడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి ఘటన ఎక్కడా జరిగినట్టు నేను వినలేదు. యూజర్ ప్రైవసీ మాటేంటి? ప్రభుత్వం తరుపున ఇదంతా చేస్తున్నారా’ అని ఆయన ప్రశ్నించారు. తన పేరు, వివరాలు వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు తాము పంపిన ఈ-మెయిల్స్‌కు ఫేస్బుక్ స్పందించలేదని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ తెలిపింది. తమ ప్రతినిధిని పంపించి యూజర్ వివరాలు ప్రత్యక్షంగా తనిఖీ చేయడం ప్రైవసీ ఉల్లంఘన కిందకు వస్తుందని సైబర్ లా నిపుణుడు, సుప్రీంకోర్టు న్యాయవాది పవన్ దుగ్గల్ తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని వివరించారు. ఈ వ్యవహారంలో 2000 ఐటీ చట్టప్రకారం ఫేస్‌బుక్‌పై దావా వేయొచ్చని వెల్లడించారు. -
ఛీ.. వీడసలు మనిషేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కుమార్తెను రేప్ చేశాడని, ఆమెను దెబ్బలు కొట్టాడనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు మంగోల్‌పురిలో నివసించే ఓ వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు తన కూతురుపై 2008 నుంచి లైంగిక అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. తండ్రి తనకు మొబైల్లో బ్లూఫిల్మ్‌లు చూపించి అత్యాచారం జరిపేవాడని, ఆయన వల్ల తాను 2011లో, 2013లో గర్భవతి అయ్యానని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఒకసారి మందు తాగించి గర్భస్రావం చేశాడని, మరోసారి కడుపుపై తన్ని గర్భస్రావమయ్యేలా తన తండ్రి చేశాడని ఆమె తెలిపింది. మొదట అర్థం కాలేదు... మొదట తనకు తండ్రి చేసే అకృత్యం అర్థం కాలేదని, కానీ జ్ఞానం వచ్చాక ఆయనను వ్యతిరేకించడం మొదలుపెట్టానని బాధితురాలు తెలిపింది. కానీ తండ్రి తన వ్యతిరేకతను ఖాతరు చేయలేదని, తల్లి అడ్డం చెప్పడంతో ఇంట్లో గొడవలు జరిగాయని ఆమె తెలిపింది. తన మాట వినకుంటే కూతురు జననాంగాలలో కత్తి లేదా పగిలిన మద్యం సీసా పెడతానని తండ్రి బెదిరించేవాడని, తండ్రి బెదిరింపులతో తల్లి కూడా నోరు మూసుకునేదని ఆమె తెలిపింది. ఇంట్లో గొడవలు కాకూడదనే అభిప్రాయంతో తండ్రి చేసే అకృత్యాల గురించి తల్లికి చెప్పడం మానేశానని బాధితురాలు తెలిపింది. తాను గట్టిగా వ్యతిరేకించినప్పుడు తండ్రి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండేవాడని, ఆ తరువాత మళ్లీ అత్యాచారాలకు పాల్పడేవాడని బాధితురాలు పేర్కొంది. తన స్నేహితులతో గడపమని తండ్రి తనపై ఒత్తిడి తెచ్చేవాడని ఆమె తెలిపింది. తండ్రి అకృత్యాలను భరించలేక ఒకసారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని, కానీ తల్లి తన ప్రాణాలు కాపాడిందని ఆమె తెలిపింది. ఫేస్బుక్ ఫ్రెండ్ సాయంతో... చివరకు బాధితురాలు తన ఫేస్బుక్ ఫ్రెండ్ సహాయాన్ని కోరింది. 2015లో ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్‌కు తన గోడు వెళ్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. తన తండ్రి నుంచి తనకు విముక్తి లభించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆమె తన ఫ్రెండ్‌కు జూలై 25న తెలిపింది. ఫేస్బుక్ ప్రెండ్ సహాయంతో బాధితురాలు ఇంట్లోంచి పారిపోయి నాగ్‌పూర్ చేరుకుంది. కొన్ని రోజులు అక్కడ ఉన్న తరువాత చైల్డ్ లైన్‌పై ఫిర్యాదు చేసింది. నాగ్‌పూర్ పోలీసులు కేసును ఢిల్లీకి బదిలీ చేశారు. సెప్టెంబర్ 30న పాలం పోలీసు స్టేషన్లో నిందితునిపై కేసు నమోదైంది. పోలీసులు ఇంకా నిందితుడిని అరెస్టు చేయలేదు. బాధితురాలికి 17 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆమె 12వ తరగతి చదువుతోందని చెబుతున్నారు. -
ఆవేశంలో యాసిడ్ తాగి ఆత్మహత్య!
న్యూఢిల్లీ : భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. కుటుంబంపై యాసిడ్ దాడికి పాల్పడి చివరికి తాను సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీలోని కర్వాల్ నగర్లో శనివారం చోటుచేసుకుంది. 40 ఏళ్ల వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి స్థానికంగా నివాసం ఉండేవాడు. గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు ఏదో విషయంపై గొడవ పడేవారు. ఈ క్రమంలో మరోసారి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొచ్చాయి. దీంతో ఆవేశంగా బయటకు వెళ్లిపోయిన భర్త యాసిడ్ బాటిల్స్ కొని నేరుగా ఇంటికొచ్చాడు. తొలుత భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డ అతడు తర్వాత ఇద్దరు కుమార్తెలపై కూడా యాసిడ్ పోశాడు. ఆపై ఆ వ్యక్తి యాసిడ్ తాగి బలవన్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి భర్త చనిపోయాడు. ఆ వ్యక్తి భార్య 40 శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో ఉండగా.. వారి కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జీటీబీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
అకౌంట్లోకి 10 కోట్లు, డ్రా చేసుకోవడానికి వెళ్తే..
న్యూఢిల్లీ : రాజధాని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఒక్కసారిగా మిలీనియర్ అయిపోయాడు. అనుకోకుండా ఆయన బ్యాంకు అకౌంట్లోకి రూ.9,99,99,999 నగదు వచ్చి చేరింది. అంటే దాదాపు రూ.10 కోట్లన్నమాట. వివరాల్లోకి వెళ్తే.. వినోద్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలో మొబైల్ షాపు నడుపుతున్నాడు. అతని అకౌంట్లోకి రూ.9,99,99,999 నగదు క్రెడిట్ అయినట్టు వినోద్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చింది. ఒక్కసారిగా అతని అకౌంట్లోకి ఇంత నగదు వచ్చి చేరడంతో, వినోద్, అతని కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. లక్షాధికారి హోదాతో మురిసిపోయిన వినోద్, ఈ నగదును విత్‌డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్లాడు. కానీ ఆ ఆనందమంతా సెకన్లలో ఆవిరైపోయింది. అతని అకౌంట్ బ్లాక్ అయినట్టు ఏటీఎం చూపించింది. వినోద్, తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని జహంగిర్‌పురి ఏరియాలో నివాసముంటున్నాడు. జహంగ్పురిలోని ఎస్బీఐ బ్రాంచులో అతను సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వినోద్‌కు ఈ ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చింది. తొలుత ఇదేదో మెసేజ్ అని భావించిన వినోద్, తర్వాత ఆ మెసేజ్‌ను అతని స్నేహితులు, కుటుంబసభ్యులకు చూపించాడు. ఆ మెసేజ్ చూసిన వారు, నిజంగానే వినోద్ ఖాతాలో రూ.9,99,99,999 కోట్లు క్రెడిట్ అయినట్టు చెప్పారు. దీంతో తాను ఒక్కసారిగా లక్షాధికారి అయిపోయినట్టు తెలుసుకున్నాడు. వెంటనే ఏటీఎం వద్దకు పరిగెత్తాడు. కానీ లక్షాధికారి అయిపోయాయనే ఆనందం వినోద్‌కు క్షణాల్లో ఆవిరై పోయి, అకౌంట్ బ్లాక్ అయినట్టు తెలిసింది. ఈ సంఘటనపై నేడు వినోద్ బ్రాంచు మేనేజర్‌ను కలిసినట్టు తెలిసింది. తన అకౌంట్‌ను అన్‌బ్లాక్ చేసుకోవడానికి ఓ అప్లికేషన్ కూడా సమర్పించినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. -
అమెజాన్‌కు భారీ కన్నం.. లక్షల్లో టోకరా..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్‌కు ఓ 21 ఏళ్ల యువకుడు భారీ మొత్తంలో కన్నం పెట్టాడు. ఏకంగా లక్షల్లో అమెజాన్‌ను మోసం చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. తాను ఆర్డర్ చేసిన ప్రతిసారి ఖాళీ బాక్స్ మాత్రమే వచ్చిందని నమ్మబలికి దాదాపు రూ.50లక్షలు రిఫండ్ పొందాడు. ఈ తంతును గమనించిన అమెజాన్ చివరకు అసలు విషయం తెలుసుకోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శివమ్ చోప్రా (21) అనే యువకుడు ఒక్క ఏప్రిల్, మే నెలలో అమెజాన్‌లో ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేశాడు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 166 ఫోన్లు. ప్రతి ఫోన్ కూడా చాలా ఖరీదైనది. అయితే, తాను కొనుగోలు చేసిన ప్రతిసారి ఖాళీ డబ్బా మాత్రమే వచ్చిందని, అందులో ఫోన్ తప్పా వేర్వేరు వస్తువులు వచ్చాయని కొన్న ఫోన్లు కొట్టేయడం ఖాళీ బాక్స్‌లు చూపించడం చేశాడు. అలా అమెజాన్‌కు చెల్లించిన డబ్బును తిరిగి పొందాడు. తొలిసారి మార్చిలో అతడికి ఈ ఆలోచన వచ్చిందని దాంతో తొలుత రెండు ఫోన్లు కొనుగోలు చేసి ట్రయల్ వేశాడని, అనుకున్నట్లుగానే అతడికి రిఫండ్ రావడంతో అదే తంతు కొనసాగించాడని వివరించారు. ఆపిల్, సామ్సంగ్, ఒన్ ప్లస్ ఇలా ఖరీదైన ఫోన్లు కొనడం వాటిని ఓఎల్ఎక్స్, గఫర్ మార్కెట్లో, ఢిల్లీలోని మొబైల్ షాపుల్లో అమ్మడంవంటివి చేసి దాదాపు రూ.50లక్షల అక్రమంగా సంపాధించాడు. దీంతోపాటు ఇతడికి ఓ వ్యక్తి కూడా సహాయం చేశాడు. సచిన్ జైన్ అనే ఆ వ్యక్తి ఓ టెలికమ్ స్టోర్ ఓనర్. అతడు ఒక్కో ఫోన్ నెంబర్‌కు రూ.150తీసుకుంటూ మొత్తం 141 సిమ్ కార్డులను వేర్వేరు పేర్లమీద అందించాడు. ఇలా ఆయా నెంబర్లతో ఆర్డర్లిచ్చి అమెజాన్‌ను బోల్తా కొట్టించగా చివరికి అతడి ఆటకట్టయి పోలీసులకు చేతికి చిక్కాడు. -
ఉద్యోగం పేరుతో.. ఆర్నెళ్లు రేప్ చేశాడు
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానని ఉజ్బెకిస్థాన్‌కు చెందిన యువతి (22)ని రప్పించి, ఆమెను మోసం చేసి ఆర్నెళ్ల పాటు లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి చెందిన సోను అలియాస్ సుమిత్ అనే వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా ఉజ్బెక్ యువతి పరిచయమైంది. గుర్గావ్కు చెందిన ఓ ఐటీ కంపెనీలో తాను సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్టు పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలకడంతో ఆమె భారత్‌కు వచ్చింది. ఆర్నెళ్ల క్రితం ఢిల్లీకి వచ్చిన ఉజ్బెక్ యువతిని ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకుని, మెహ్రౌలీకి తీసుకెళ్లాడు. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఆమె నుంచి పాస్‌పోర్టు, డబ్బు తీసుకున్నాడు. ఆమెను ఓ ప్రాంతంలో ఉంచి, ఆరు నెలల పాటు దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్యపరీక్షలకు పంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోనే 15 రోజుల క్రితం ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మరో మహిళపై పార్టనర్ మరో నలుగురితో కలసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. -
కుక్క కాళ్లను.. రంపంతో కోసేశాడు!
వీధికుక్క తనను కరిచిందన్న కోపంతో ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి దాని కాళ్లను రంపంతో కోసిపారేశాడు. అయితే, ఈ నేరానికి అతడికి గరిష్ఠంగా 50 రూపాయల జరిమానా మాత్రమే పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. రెండు నెలల వయసున్న కుక్కపిల్ల ప్రమోద్ అనే నిరుద్యోగి ఇంట్లోకి ప్రవేశించింది. అతడు ఎప్పుడూ తాగి ఉంటాడని ఇరుగుపొరుగులు చెప్పారు. ప్రమోద్ కుక్కపిల్లను పిలిచి, దానికి కొంత ఆహారం కూడా వేశాడు. అయితే, ఆహారం తీసుకోవాలన్న తొందరలో.. ఆ కుక్కపిల్ల అతడి కాళ్లమీద తన ముందరి కాళ్లతో కొద్దిగా గీరింది. వెంటనే అతడికి కోపం వచ్చి, రంపం తీసుకుని దాన్ని ముందుగా కట్టేసి, ఒక ముందు కాలు, ఒక వెనక కాలు కోసేశాడని జంతువుల హక్కుల కార్యకర్త గౌరవ్ శర్మ ఆరోపించారు. ప్రమోద్ ఇంటి సమీపంలో ఉండే ఓ బాలిక అతడి క్రూరత్వం గురించి తనకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం తెలిసిందని గౌరవ్ అన్నారు. కుక్కపిల్లను రక్షించడానికి తాను అక్కడకు వెళ్లగా, ప్రమోద్ భార్య జరిగిన విషయం మొత్తాన్ని వివరించిందన్నారు. కొన్ని నెలల క్రితం ప్రమోద్ ఒక కోతిని ఇంటికి తీసుకొచ్చి, తర్వాత దాన్ని నరికేశాడని కూడా ఆమె ఆరోపించింది. అయితే ఆ విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. తన భర్త ఎప్పుడూ తాగేస్తాడని, తనను, తన ఆరుగురు పిల్లలను చిత్రహింసలు పెడతాడని కూడా అతడి భార్య ఆరోపించింది. కొన్నిసార్లు వాళ్లను తలకిందులుగా వేలాడేస్తాడని చెప్పింది. ఆమె ఆరోపణల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అతడిని పోలీసులు అరెస్టుచేసి తీసుకెళ్లారు. ఇంతకుముందే ప్రమోద్ మీద ఒక గృహహింస కేసు నమోదైంది. -
ఫేస్బుక్ ప్రేమ.. ఆమెను నాశనం చేసింది
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లో పరిచయమైన ఉజ్బెక్ మహిళను ప్రేమ పేరుతో రప్పించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి, బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపాడు. నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో వసంత్‌కుంజ్ ప్రాంతానికి చెందిన అల్తాఫ్ అలియాస్ రాజు (34)కు ఉజ్బెక్‌కు చెందిన ఓ యువతి (23) గతేడాది మేలో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. అల్తాఫ్ తరచూ ఆమెతో చాటింగ్ చేస్తూ ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. భారత్‌కు వస్తే ఇద్దరూ కలసి వ్యాపారం చేసుకోవచ్చని ఆశ చూపాడు. దీంతో అతని మాటలు నమ్మి ఆమె ఢిల్లీకి వచ్చింది. ఉజ్బెక్ యువతిని ఓ హోటల్లో ఉంచిన అల్తాఫ్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి.. దేశం విడిచి పారిపోతే వీటిని ఆన్లైన్లో పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత ఉజ్బెక్ యువతిని తన భార్య అంజలికి పరిచయం చేశాడు. అల్తాఫ్, అతని భార్య ఆమె పాస్ పోర్టు, డబ్బు లాక్కుని బంధించారు. ఉజ్బెక్ యువతిని బలవంతంగా వ్యభిచారవృత్తిలోకి దింపి, ఆమె దగ్గరకు విటులను పంపేవారు. గత శనివారం వీరి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు వసంత్‌కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అంజలిని అరెస్ట్ చేయగా, అల్తాఫ్ పరారీలో ఉన్నాడు. అతనిపై గతంలో క్రిమినల్ కేసులు నమోదైనట్టు పోలీసులు చెప్పారు. అల్తాఫ్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
ఎఫ్బీ ఫ్రెండ్ తో వాలెంటైన్స్ డేకు వెళ్లి!
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన స్నేహితురాలితో ప్రేమికుల రోజును జరుపుకోవడానికి వెళ్లిన ఓ యువకుడు దారుణంగా హతమయ్యాడు. ఇద్దరు వ్యక్తులు అతన్ని నాలుగు అంతస్తుల బంగ్లా నుంచి తోసివేసి చంపేశారు. గుర్గావ్లోని సుశాంత్ లోక్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ హత్య ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రించేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే యువకుడి స్నేహితురాలు పోలీసుల ముందు నోరు విప్పడంతో అసలు రహస్యం వెలుగులోకి వచ్చింది. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఈశ్వర్ అలియాస్ నిషాంత్ ఫేస్బుక్లో పరిచయమైన యువతితో ఏడు నెలలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు సందర్భంగా గుర్గావ్కు రావాలని ఆ యువతి నిషాంత్‌ను కోరింది. గుర్గావ్లోని హుడా సిటీ సెంటర్ వద్ద ఇద్దరు కలుసుకున్నారు. ఆ తర్వాత సుశాంత్ లోక్ ఏరియాలోని ఓ నాలుగంతస్తుల భవనంలోకి వెళ్లారు. అక్కడ వారిద్దరిని చూసిన యువతి భావ రమేశ్ (30), అతని డ్రైవర్ అనిల్ కుమార్ (25) ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే నిషాంత్‌పై వాళ్లు దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. ఆ తర్వాత అతన్ని బాల్కనీ నుంచి కిందకు తోసేసి చంపేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు. -
అనుమానంతో కొట్టి చంపాడు
ఢిల్లీ: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను దారుణంగా కొట్టి చంపేశాడో ఓ భర్త. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో అమానుషం చోటు చేసుకుంది. షరాఫత్(33) భార్య కవిత(32) పై అనుమానంతో నిత్యం వేధించేవాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. అది తీవ్ర వాగ్వాదంగా మారటంతో ఆగ్రహంతో షరాఫత్ చేతికందిన పెనం(తవా) తీసుకుని భార్యపై దాడి చేశాడు. ముఖంపైన, తలపైన విచక్షణా రహితంగా కొట్టాడు. అంతే ఆమె రక్తమడుగులో కుప్పకూలిపోయింది. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మంచం కింద ఉండే సొరుగులో కుక్కేసాడు. అనంతరం తన ముగ్గురు పిల్లలతో సహా సొంత ఊరికి ఉడాయించాడు. పొరుగు వారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు షరాఫత్‌ను విచారించగా, అతగాడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడి అరెస్ట్ చేసి, భార్య ప్రాణాలు తీసేందుకు వాడిన పెనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి షరాఫత్‌ను తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.