
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్‌కు ఓ 21 ఏళ్ల యువకుడు భారీ మొత్తంలో కన్నం పెట్టాడు. ఏకంగా లక్షల్లో అమెజాన్‌ను మోసం చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. తాను ఆర్డర్ చేసిన ప్రతిసారి ఖాళీ బాక్స్ మాత్రమే వచ్చిందని నమ్మబలికి దాదాపు రూ.50లక్షలు రిఫండ్ పొందాడు. ఈ తంతును గమనించిన అమెజాన్ చివరకు అసలు విషయం తెలుసుకోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శివమ్ చోప్రా (21) అనే యువకుడు ఒక్క ఏప్రిల్, మే నెలలో అమెజాన్‌లో ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేశాడు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 166 ఫోన్లు. ప్రతి ఫోన్ కూడా చాలా ఖరీదైనది.
అయితే, తాను కొనుగోలు చేసిన ప్రతిసారి ఖాళీ డబ్బా మాత్రమే వచ్చిందని, అందులో ఫోన్ తప్పా వేర్వేరు వస్తువులు వచ్చాయని కొన్న ఫోన్లు కొట్టేయడం ఖాళీ బాక్స్‌లు చూపించడం చేశాడు. అలా అమెజాన్‌కు చెల్లించిన డబ్బును తిరిగి పొందాడు. తొలిసారి మార్చిలో అతడికి ఈ ఆలోచన వచ్చిందని దాంతో తొలుత రెండు ఫోన్‌లు కొనుగోలు చేసి ట్రయల్ వేశాడని, అనుకున్నట్లుగానే అతడికి రిఫండ్ రావడంతో అదే తంతు కొనసాగించాడని వివరించారు. ఆపిల్, సామ్‌సంగ్, ఒన్ ప్లస్ ఇలా ఖరీదైన ఫోన్లు కొనడం వాటిని ఓఎల్‌ఎక్స్, గఫర్ మార్కెట్‌లో, ఢిల్లీలోని మొబైల్ షాపుల్లో అమ్మడంవంటివి చేసి దాదాపు రూ.50లక్షల అక్రమంగా సంపాధించాడు. దీంతోపాటు ఇతడికి ఓ వ్యక్తి కూడా సహాయం చేశాడు. సచిన్ జైన్ అనే ఆ వ్యక్తి ఓ టెలికమ్ స్టోర్ ఓనర్. అతడు ఒక్కో ఫోన్ నెంబర్‌కు రూ.150తీసుకుంటూ మొత్తం 141 సిమ్ కార్డులను వేర్వేరు పేర్లమీద అందించాడు. ఇలా ఆయా నెంబర్లతో ఆర్డర్‌లిచ్చి అమెజాన్‌ను బోల్తా కొట్టించగా చివరికి అతడి ఆటకట్టయి పోలీసులకు చేతికి చిక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment