సాక్షి,బెంగళూరు: నకిలీ ఈ మెయిల్ ఐడీలతో ఆన్‌లైన్ సంస్థను మోసగిస్తున్న ముగ్గురు యువకులను శుక్రవారం ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన వెంకటేశ్, ఆనంద్, శశికుమార్ యువకులు నకిలీ చిరునామాలతో నకిలీ ఈమెయిల్ ఐడీలు సృష్టించి అమేజాన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేసేవారు. వస్తువులు అందుకున్న రెండు రోజుల అనంతరం సంస్థ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి తమకు ఖాళీ బాక్స్ వచ్చిందని కంపెనీకి తెలిపేవారు.
డబ్బులు తిరిగి చెల్లించాలని లేదంటే కోర్టుకు వెళతామంటూ బెదిరంచడంతో సంస్థ నిందితులకు డబ్బులు చెల్లించింది. నిందితులు ఇలా పదుల సార్లు వంచనకు పాల్పడి సుమారు రూ.3.17లక్షల విలువ చేసే మొబైళ్లను పొందారు. మోసాన్ని పసిగట్టిన సంస్థ ప్రతినిధులు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment