Fake Id Card
-
తండ్రి చికిత్స కోసం.. నకిలీ ఐడీ కార్డుతో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లోకి
న్యూఢిల్లీ: నకిలీ ఐడీ కార్డుతో ఓ వ్యక్తి ఢిల్లీ కంటోన్మెంట్‌లోని పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లోకి ప్రవేశించాడు. ఈవిషయాన్ని గుర్తించి అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. వినాయక్ చద్దా అనే వ్యక్తి తన తండ్రికి ఎయిర్ ఫోర్స్ డెంటల్ హాస్పిటల్లో చికిత్స చేయించేందుకు వింగ్ కమాండర్‌గా నటిస్తూ లోపలికి ప్రవేశించాడు. నకిలీ గుర్తింపు కార్డుతో నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అతడిని పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. అతని వద్ద పలువురు రక్షణ సిబ్బంది పేర్లతో నకిలీ గుర్తింపుకార్డులు, లిక్కర్ క్యాంటిన్ కార్డులు ఉన్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకు మద్యం కొనుగోలు చేసేందుకు రక్షణ సిబ్బందికి ఈ కార్డులు ఇస్తారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నకిలీ కార్డులతో సంబంధమున్న సుల్తాన్‌పురికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది. ఇదీ చదవండి.. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు -
నకిలీ ఐడీప్రూఫ్‌తో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
ఖమ్మం: నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ ఐడీలతో పాస్‌పోర్టులు పొంది అక్రమంగా భారత్‌లోకి చొరబడి ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశీయులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ నూర్ నబీ, మహమ్మద్ సాగర్లు నకిలీ ఐడీలతో పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. మరో ఇద్దరు షేక్ జమీర్, మహమ్మద్ అమినూర్ అక్రమంగా భారత్ లో చొరబడి ఖమ్మంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. సాగూరి ఖతూన్ అలియాస్ శిల్ప కొన్ని సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి భారత్ కి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన బోడ రాములుతో సహజీవనం చేస్తోంది. వీరికి 11 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. సాగూరి ఖతూన్.. బంగ్లాదేశ్‌కు వెళ్లి తన సోదరులను ఖమ్మం తీసుకువచ్చింది. ఖమ్మంలో బాల కార్మికులతో సెంట్రింగ్ పని చేయిస్తుండగా పోలీసులకు వీరి విషయం తెలిసింది. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదీ చదవండి: పల్లె కడుపున రాచపుండు! -
మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..
సాక్షి, గన్నవరం/విజయవాడస్పోర్ట్స్/చిట్టినగర్: విజయవాడ వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలో నివసించే పిళ్లా వెంకటరాజేంద్ర గతంలో సివిల్ సప్లయీస్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశాడు. పలు మోసాలకు పాల్పడటంతో ఉద్యోగంలో నుంచి తీసేశారు. జల్సాలకు అలవాటుపడిన అతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరతీశాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసేసిన సివిల్ సప్లయీస్లోనే డెప్యూటీ కలెక్టర్‌గా నకలీ ఐడీ కార్డు సృష్టించాడు. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించాడు. రూ.లక్షల్లో నగదు, ఐఫోన్లు, ఖరీదైన గృహోపకరణాలను సమకూర్చుకున్నాడు. మాయమాటలతో బురిడీ పిళ్లా వెంకటరాజేంద్ర మూడేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తన చేతిలో ఉన్నారని, తన మాట వారి వద్ద వేదవాక్కని నమ్మిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్ట్ ఇప్పించడం చిటికెలో పనంటూ గొప్పలుపోతాడు. ఉద్యోగం కోసం వచ్చిన వారితో ఐ–ఫోన్ కొనిపించుకుంటాడు. ఆ తరువాత నుంచి ఒక్కో విడతలో రూ.2 లక్షల చొప్పున రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తాడు. ఉద్యోగం, కాంట్రాక్టు రాలేదని నిలదీసిన బాధితులను పోలీసుల పేర్లు చెప్పి బెదిరిస్తాడు. కొంత మంది బాధితులకు పోలీసుల పేరుతో ఫోన్ చేయించి బెదిరించిన ఘటనలూ ఉన్నాయి. అతని చేతిలో మోసపోయిన వారిలో సామాన్య ప్రజలతోపాటు కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారని సమాచారం. చదవండి: (కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు) ఎలా పట్టుబడ్డాడంటే.. గన్నవరం సొసైటీ పేటకు చెందిన యామర్తి అరవింద్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ ఏడాది జూన్‌లో అతనికి పిళ్లా వెంకటరాజేంద్ర పరిచయమయ్యాడు. తాను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పౌర సరఫరాల శాఖలో డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నట్లు రాజేంద్ర నమ్మబలికాడు. తమ శాఖలో ఒక టెండర్‌తో పాటు స్టోర్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని అరవింద్‌కు మాయమాటలు చెప్పాడు. వీటి నిమిత్తం ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి అరవింద్ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. అనంతరం పలు దఫాలుగా అరవింద్ నుంచి డిపాజిట్లు, అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా మరో రూ.5.49 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా అరవింద్‌తో రూ.73 వేల విలువైన ఐఫోన్, రూ.36 వేల విలువైన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయించి రాజేంద్ర తీసుకున్నాడు. అయితే తాను చెల్లించిన డబ్బులకు రాజేంద్ర ఎటువంటి రశీదులూ ఇవ్వకపోవడం, కొన్ని రోజులుగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అరవింద్‌కు అనుమానం వచ్చింది. గతంలో రాజేంద్ర చూపించిన డెప్యూటీ కలెక్టర్ ఐడీ కార్డు ఫొటో ఆధారంగా విజయవాడలోని ఆతని ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఈ నేపథ్యంలో మరో రూ.1.50 లక్షలు కావాలంటూ ఫోన్‌చేసిన రాజేంద్రను నమ్మకంగా గన్నవరం పిలిపించి పోలీసులకు అప్పగించారు. రాజేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహాలో రాజేంద్ర కృష్ణా, గుంటూరు జిల్లాలో పలువురిని మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. విజయవాడ చిట్టినగర్‌లో నివాసం ఉంటున్న ఓ పురోహితుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు వసూలు చేశాడని తెలిసింది. నగర పోలీస్‌కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లకు రాజేంద్ర బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 14 మంది బాధితులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. -
ఇకపై ఆ తలనొప్పి ఉండబోదు.. కాలర్ ఎవరోతెలియాల్సిందే..!
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ (అన్ నోన్ నంబర్) బెడదకు త్వరలోనే ముగింపుపడనుంది. తమ మొబైల్ ఫోన్‌కు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడం ఫోన్ వినియోగదారుల హక్కుగా మారనుంది. ట్రూ కాలర్ యాప్‌తో సంబంధం లేకుండానే తమ కాంటాక్ట్ నంబర్ల జాబితాలో లేని నంబరు నుంచి ఫోన్ కాల్ వస్తే అది ఎవరు చేశారో తెలిసిపోనుంది. తద్వారా సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా విధాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూపొందించిన కొత్త టెలికాం విధానం పార్లమెంటులో ఆమోదం పొందగానే అమల్లోకి రానుంది. - సాక్షి, అమరావతి ఫేక్ ఐడీ కార్డులతో కనెక్షన్లు... సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు... దేశంలో అమాంతంగా పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఫేక్ ఐడీ కార్డులతో సిమ్ కార్డులు, ఓవర్ ద టాప్(వోటీటీ) కనెక్షన్లు తీసుకుని దర్జాగా మోసాలకు పాల్పడుతున్నారు. దాదాపు 90శాతం సైబర్ నేరాల ముఠాలు ఇలా ఫేక్ కనెక్షన్లతోనే సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నాయి. ఫేక్ ఐడీ కార్డులతో తీసుకున్న ఫోన్ కనెక్షన్లతోనే ఆడియో, వీడియో, వాట్సాప్ కాల్స్, ఇన్‌స్ట్రాగామ్ మెసేజ్‌లు, యూపీఐ మెసేజ్‌లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయని జాతీయ నేర గణాంకాల (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. వాటిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఆ మొబైల్ కనెక్షన్లు ఫేక్ ఐడీ కార్డులతో తీసుకున్నవి కావడంతో ఆయా చిరునామాల్లో సంబంధిత వ్యక్తులు ఉండటం లేదు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు కొత్త విధివిధానాలను రూపొందించింది. ఈ మేరకు పార్లమెంటుకు ఇప్పటికే నూతన విధాన పాలసీ డ్రాఫ్ట్‌ను సమర్పించింది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనికి ఆమోదముద్ర పడుతుందని భావిస్తున్నారు. కేవైసీ తప్పనిసరి... టెలికాం కంపెనీలు తమ ఖాతాదారుల పూర్తి వివరాలను పరిశీలించి నిర్ధారించుకోవాలి. అందుకోసం బ్యాంకులు చేస్తున్నట్టుగా ‘నో యువర్ కస్టమర్(కేవైసీ) ప్రక్రియను పాటించాలి. తమ కంపెనీ నుంచి మొబైల్ సిమ్ కార్డ్, వోటీటీ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్క ఖాతాదారు సమర్పించిన గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తర్వాతే కనెక్షన్ ఇవ్వాలి. లేదా కనెక్షన్ ఇచ్చిన వారం రోజుల్లోనే ఆ గుర్తింపు కార్డులను పరిశీలించాలి. ఖాతాదారులు సమర్పించిన గుర్తింపు కార్డులు సరైనవి అని నిర్ధారణ అయితే సరే. నిర్ధారణ కాకపోతే వెంటనే ఆ కనెక్షన్లను నిలుపుదల చేయాలి. ఏ సందర్భంలో అయినా సరే పోలీసుల విచారణలో ఫేక్ గుర్తింపు కార్డులతో ఎవరైనా కనెక్షన్ తీసుకున్నారని తెలిస్తే సంబంధిత టెలికాం కంపెనీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫేక్ ఐడీతో తీసుకుంటే కఠిన చర్యలు... ఇక ఫేక్ గుర్తింపు కార్డుతో ఎవరైనా మొబైల్ కనెక్షన్ గానీ, వోటీటీ కనెక్షన్ గానీ తీసుకున్నారని టెలికాం కంపెనీల ‘కేవైసీ’లో వెల్లడైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా ఫేక్ ఐడీ కార్డులతో మొబైల్, వోటీటీ కనెక్షన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించినా వారిపై కేసు నమోదు చేస్తారు. అలా ఫేక్ ఐడీ కార్డుతో కనెక్షన్ తీసుకున్నవారికి రూ.50వేల జరిమానా లేదా ఏడాది జైలు లేదా రెండూ విధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎవరు కాల్ చేస్తున్నారో తెలిసిపోతుంది... నూతన పాలసీ ప్రకారం తమ కాంటాక్ట్ నంబర్ల జాబితాలో లేని నంబరు నుంచి కాల్ వచ్చినా సరే ఆ ఫోన్ చేసింది ఎవరో ఇకపై తెలిసిపోతుంది. ప్రస్తుతం ట్రూ కాలర్ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఆవిధంగా ఎవరు కాల్ చేస్తున్నారో తెలుస్తుంది. కానీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే, ట్రూ కాలర్ యాప్‌తో నిమిత్తం లేకుండానే తమకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడం ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారుడికి హక్కుగా కేంద్రం నూతన పాలసీ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఇందుకోసం మొబైల్ కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని ఆదేశించనుంది. -
ఒకే ఎఫ్ఐఆర్తో రెండు కేసులు, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. సీపీ సీరియస్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఒకే నెంబరుతో రెండు ఎఫ్ఐఆర్ల విషయం పోలీసు డిపార్ట్మెంటులో కలకలం రేపుతోంది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి డీజీపీ కార్యాలయం స్పందించింది. ఈ ఘటనపై తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక పంపాలని కరీంనగర్ పోలీసులను ఆదేశించింది. సీపీ సత్యనారాయణ కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నారని సమాచారం. ఒకే నెంబరుతో రెండు కేసులు నమోదవడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనూ తాము చూడలేదని పలువురు సీనియర్ అధికారులే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఈ విషయం డిపార్ట్మెంటులో సరికొత్త చర్చకు దారితీసింది. మరోవైపు ఘటనపై ఇంటలిజె న్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ డమ్మీ ఎఫ్ఐఆర్ ఎవరిపని? దీన్ని పోలీసులే సృష్టించి బాధితుడిని భయపెట్టారా? లేక బాధితుడే పోలీసులను అప్రతిష్ట పాలు చేస్తున్నాడా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. చదవండి: డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి.. బాధితుడు తనకు ఇచ్చినట్లుగా చెబుతున్న 255/2020 ఎఫ్ఐఆర్ అసలేం జరిగింది..?: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆరెపల్లికి చెందిన నల్లగోపు చంద్రకళ–శ్రీనివాసరావు దంపతులు. మనస్పర్థలతో విడిగా ఉంటున్నారు. తన పేరిట ఉన్న ఇంటిని విక్రయించేందుకు చంద్రకళ సిద్ధపడింది. తన కూతురు పెళ్లికోసమని కొన్న ఇంటిని విక్రయించేందుకు శ్రీనివాసరావు అంగీకరించలేదు. ఈ విషయంలో వీరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ తరువాత ఒకరోజు కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి పిలు పువచ్చింది. మరునాడు కూడా అతన్ని పోలీస్‌స్టేషన్‌కి పిలిపించారు. చేతిలో ఎఫ్ఐఆర్ పెట్టారు. ‘నిన్ను అరెస్టు చేస్తున్నాం. వైద్యపరీక్షలకు పంపుతాం. దాదాపు ఆరునెలల వరకు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని చెప్పడంతో భయపడిపోయిన.. అతను ఇంటి విక్రయానికి అంగీకరించాడు. అప్పుడు దంపతులిద్దరూ రాజీ పడుతున్నామని రాసివ్వడంతో జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని, పిలిచినప్పుడు కోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. తనకు ఎంతకూ న్యాయస్థానం నుంచి పిలుపు రాకపోవడంతో అనుమానంతో శ్రీనివాసరావు తన వద్ద ఉన్న ఎఫ్ఐఆర్ 255/2020 కాపీ వివరాలతో లాయరును ఆశ్రయించారు. అక్కడ అదే నెంబరుతో మరో ఎఫ్ఐఆర్ ఉందని తెలుసుకుని విస్తుపోయాడు. తన ఇంటిని విక్రయించేందుకే.. ఈ వ్యవహారమంతా నడిపించారని గగ్గోలు పెడుతున్నారు. చదవండి: అమెరికా అమ్మాయి.. హనుమకొండ అబ్మాయి అలా ఒకటయ్యారు పోలీసు రికార్డుల్లో ప్రస్తుతం ఉన్న 255/2020 ఎఫ్ఐఆర్ ఏది నిజం.. ఆ రెండు ఇవే..! ఇందుకు సంబంధించిన రెండు ఎఫ్ఐఆర్ కాపీలను ‘సాక్షి’ సంపాదించింది. ఇందులో శ్రీనివాసరావుపై 341,323, 506 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నెంబరు 255/2020 పేరుతో ఎస్సై బి.చంద్రశేఖర్ ఉదయం 11 గంటల సమయంలో కేసు నమోదు చేశారు. అదే సమయంలో నెంబరుపై ఐపీసీ సెక్షన్లు 290, 324తో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మొ గ్దూంపూర్కు చెందిన కేసు నమోదైంది. ఈ కే సును ఎస్సై వి.శ్రీనివాసరావు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసుశాఖ మొదటి ఎఫ్ఐఆర్పై దృష్టి పెట్టింది. బాధితుడు చెబుతున్న ప్రకారం.. నిజంగానే పోలీసులు దాన్ని సృష్టించారా? లేక పోలీసులపై నిందలు వేసేందుకు బాధితుడే ఇదంతా చేస్తున్నాడా? విషయాలను నిర్ధారించుకునే పనిలో పడ్డారు. -
HYD: కళ్యాణిగా మారిన దాసు.. రూ. 50 కోట్ల ఆస్తి.. మాయమాటలు చెప్పి!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫేస్బుక్ ద్వారా పరిచయమై, పెళ్లి పేరుతో ఎర వేసి ఏడాది కాలంలో రూ.కోటి వరకు స్వాహా చేసిన కిలాడి జంటను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. భార్యా భర్తలు కలిసే ఈ నేరం చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. గుంటూరు జిల్లా సత్తుపల్లికి చెందిన వై.దాసు నూజివీడులోని టీటీటీఐ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. కొండాపూర్‌లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడిన ఇతగాడు సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆపై పూర్తిగా రమ్మీకి బానిసగా మారిపోయాడు. 2017 నవంబర్‌లో ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్న జ్యోతిని వివాహం చేసుకున్నాడు. చదవండి: చిక్కడపల్లి సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు ఆపై సత్తుపల్లికి మకాం మార్చి కొంత భూమి లీజుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయినప్పటికీ ఆన్లైన్ రమ్మీ మాత్రం మానలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఈ తరహా జూదాన్ని నిషేధించడంతో క్రికెట్ బెట్టింగ్స్ వైపు మళ్లాడు. వివిధ యాప్‌ల ద్వారా నిత్యం పందాలు కాసేవాడు. ఇతడు బీటెక్ చదువుతున్నప్పుడు కళ్యాణిశ్రీ పేరుతో తాను యువతిగా పేర్కొంటూ ఓ నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. దీని ద్వారా అనేక మంది యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి మోసం చేసేవాడు. ఇలా గతేడాది మేలో బొల్లారం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరిచయమయ్యాడు. తొలత ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా ఇరువురూ చాటింగ్ చేసుకున్నారు. ఆపై ఇరువురూ ఫోన్ నెంబర్లు మార్చుకున్న నేపథ్యంలో చాటింగ్ వాట్సాప్‌లోకి మారింది. కళ్యాణిశ్రీగానే చాటింగ్ చేసిన దాసు బాధితుడికి అనేక మాయమాటలు చెప్పి పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చాడు. చదవండి: అసలే చలికాలం.. రాత్రి గజగజ వణకడమే.. మరి వారి సంగతేంటి? అదును చూసుకుని అసలు కథ మొదలుపెట్టాడు. తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు చాలా ఉన్నాయంటూ చెప్పాడు. వాటి విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటుందని నమ్మించాడు. అనివార్య కారణాల నేపథ్యంలో అవన్నీ తన పేరుతో లేవని చెప్పి..మ్యూటేషన్ ద్వారా ఆస్తులు తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే దాదాపు రూ.కోటి ఖర్చవుతుందని, ఆ మొత్తం ఇచ్చి సహకరించాలని చెప్పాడు. మనకు వివాహమయ్యే లోపు ఈ పని పూర్తి చేయాలన్నాడు. దీంతో బాధితుడు 2020 జూన్ నుంచి ఈ నెల వరకు మొత్తం రూ.కోటికి పైగా కళ్యాణిశ్రీగా చాటింగ్ చేసిన దాసు సూచించిన మూడు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. వీటిలో ఒకటి జ్యోతి పేరుతో ఉంది. అప్పుడప్పుడు బాధితుడికి కాల్స్ చేసిన దాస్ తన భార్య జ్యోతినే కళ్యాణిశ్రీగా మార్చి మాట్లాడించేవాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దీన్ని దర్యాప్తు చేశారు. మంగళవారం భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు బాధితుడి నుంచి కాజేసిన సొమ్ముతో జల్సాలు చేయడంతో పాటు కొంత ఆన్లైన్ బెట్టింగ్స్‌కు వెచ్చించారు. రూ.4 లక్షలు వెచ్చించి సత్తుపల్లిలో భూమి కొన్నారు. జ్యోతి ఈ సొమ్ము వెచ్చించి 12 తులాల బంగారం ఖరీదు చేసిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. -
సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో...
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ దళారీ హితేష్ జోషితో బంగ్లాదేశ్‌కు చెందిన సిరిన అక్తర్ హుస్సేన్‌కు ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఇది ప్రేమగా మారడంతో ఇతడి కోసం ఆమె అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చింది. హైదరాబాద్ నుంచి బోగస్ గుర్తింపు పత్రాలు పొందింది. ఇటీవల ఆ విషయం వెలుగులోకి రావడంతో గుజరాత్ పోలీసులు సిరినను అరెస్టు చేశారు. ఈమెకు ఫోర్జరీ పత్రాలు అందించిన నగరవాసి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందం ఆదివారం సిటీకి చేరుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. చదవండి: ఇక బస్సులపై ప్రకటనలు ఉండవు హితేష్– సిరిన మధ్య 2016లో ఫేస్బుక్ స్నేహం ఏర్పడటంతో ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్స్‌లో ప్రేమించుకున్నారు. తొలుత హితేష్‌ను కలుసుకోవాలని భావించిన సిరిన 2017 మార్చిలో 90 రోజుల విజిట్ వీసాపై భారత్‌కు వచ్చి వెళ్లింది. ఆపై అతడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుని అక్రమ మార్గంలో సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చేసింది. చదవండి: నైపుణ్యానిదే భవిష్యత్తు.. సాధారణ చదువులతో ఉపాధి అంతంత మాత్రమే బంగ్లాదేశ్‌లో ఉన్న దళారుల ద్వారా కోల్‌కతా చేరుకున్న సిరిన అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంది. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యుల ద్వారా గుత్తా సోను బిశ్వాస్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డులు సంపాదించింది. వీటిని తీసుకుని అహ్మదాబాద్ వెళ్లి హితేష్‌ను కలిసింది. 2017 అక్టోబర్ నుంచి అక్కడి సనాతన్ ప్రాంతంలో వీళ్లిద్దరూ సహ జీవనం చేయసాగారు. 2018లో వీరికి ఓ కుమార్తె జన్మించింది. 2020లో సిరిన.. సోను పేరుతో అహ్మదాబాద్ రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టు కూడా పొందింది. దీన్ని వినియోగించి భారతీయురాలిగా బంగ్లాదేశ్ వెళ్లి తన కుటుంబీకులను కలిసి వచ్చింది. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న ఈమె వ్యవహారం హితేష్ మరణంతో బయటకు పడింది. గత నెల ఆఖరి వారంలో హితేష్ అనారోగ్య కారణాలతో కన్నుమూశాడు. ఆపై సిరిన అలియాస్ సోను అతడి తల్లిదండ్రుల ఇంటికి చేరింది. ఆస్తుల పంపకం విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తి వాగ్వాదానికి కారణమైంది. దీంతో ఆవేశానికి గురైన హితేష్ తల్లిదండ్రులు సిరినను ఉద్దేశించి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీ అంటూ దూషించారు. ఈ సమాచారం సనాతల్ పోలీసులకు అందింది. దీంతో పోలీసులు గత వారం సిరినను అరెస్టు చేశారు. సిరినకు సోను పేరుతో ఆధార్, పాన్ కార్డులు తయారు చేసిన ఇచ్చిన నిందితుల కోసం అహ్మదాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఆదివారం హైదరాబాద్ పంపారు. సిరిన కేవలం హితేష్‌పై ఉన్న ప్రేమతోనే ఇలా అక్రమంగా వచ్చిందని, ఈ కేసులో మరే ఇతర కోణం లేదని అహ్మదాబాద్ పోలీసులు చెబుతున్నారు. చట్ట ప్రకారం ఆమె చేసింది నేరం కావడంతో అరెస్టు చేశామని వివరిస్తున్నారు. -
వ్యాక్సినేషన్: చిక్కుల్లో మీరా చోప్రా
ఒకవైపు వ్యాక్సినేషన్ విషయంలో ఏజ్ గ్రూప్ గందరగోళం నడుస్తుండగా, మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్ డోస్‌లను బ్లాక్‌లో అమ్ముకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు తేలికగా వ్యాక్సిన్లు దొరుకుతున్న తీరు.. రోజుల తరబడి, గంటల సేపు లైన్లో క్యూ కడుతున్న వాళ్లకు కోపం తెప్పిస్తోంది. తాజాగా నటి మీరాచోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం.. రాజకీయ విమర్శలకు దారితీసింది. థానే: నటి, మోడల్ మీరా చోప్రా ఈమధ్యే కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆ ఫొటోను ఉంచింది. అయితే ఆమె ఫ్రంట్‌లైన్ వారియర్ కోటాలో ఫేక్ఐడీతో ఈ పని చేసినట్లు తెలిసింది. దీంతో బీజేపీ మండిపడుతోంది. మీరా చోప్రా అలియాస్ నీలా తమిళంతో పాటు తెలుగు, హింది సినిమాల్లో నటించింది. ఆమె థానేలోని పార్కింగ్ ప్లాజా వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర డోస్ వేయించుకుంది. ఓం సాయి ఆరోగ్య కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆమె సూపర్వైజర్గా పని చేస్తున్నట్లుగా ఓ ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. ఇది ముమ్మాటికీ రూల్స్‌ను ఉల్లంఘించినట్లే. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ కోరుతోంది. కాగా, ఈ విచారణపై దర్యాప్తునకు ఆదేశించామని, ఆరోపణలు రుజువైతే మీరా చోప్రాపై క్రిమినల్ చర్యలు తప్పవని థానే మున్సిపల్ కార్పొరేషన్ పీఆర్వో సందీప్ మాల్వీ చెబుతున్నారు. కాగా, తెలుగులో బంగారం, మారో, వాన లాంటి సినిమాల్లో నటించిన మీరా చోప్రా.. పలు తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల ద్వారా గుర్తింపు దక్కించుకుంది. అయితే వ్యాక్సినేషన్‌పై దుమారం చెలరేగడంతో ఆమె తన ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ తొలగించడంతో పాటు మీడియాకు దొరక్కుండా తిరుగుతోందని సమాచారం. A good decision and a good deed should always be acknowledged https://t.co/m08lkynwYi — meera chopra (@MeerraChopra) May 29, 2021 -
Mumbai Local Trains: కరోనా ఆంక్షలు.. నకిలీ కార్డులతో ప్రయాణం
సాక్షి, ముంబై: ముంబై లోకల్ రైళ్లలో సామాన్యులకు అనుమతి నిషేధించడంతో నకిలీ గుర్తింపు కార్డు (ఐడీ)ల బెడద మళ్లీ మొదలైంది. మూడు రోజుల్లోనే నకిలీ ఐడీల ద్వారా ప్రయాణిస్తున్న 35 మందిపై రైల్వే పోలీసుల చర్యలు తీసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. బ్రేక్ ది చైన్‌లో భాగంగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఈ నెల 22వ తేదీ రాత్రి 8 గంటల నుంచి లోకల్ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులు మినహా సామాన్యులకు అనుమతి నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యులతోటు ప్రైవేటు కార్యాలయాల్లో, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇబ్బందుల్లో పడిపోయారు. గత్యంతరం లేక బెస్ట్ లేదా ఆర్టీసీ బస్సులను ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ, రోడ్డు ప్రయాణంతో పోలిస్తే లోకల్ రైలు ప్రయాణం చాలా చౌకగా ఉంటుంది. బెస్ట్, ఆర్టీసీ బస్సుల్లో ఉప నగరాలు, శివారు ప్రాంతాల నుంచి ముంబైకి రాకపోకలు సాగించాలంటే రోజుకు కనీసం రూ.100–250 ఖర్చవుతుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది గిట్టుబాటు కాదు. దీంతో బ్యాంకు, బీఎంసీ, తపాల, అంబులెన్స్ డ్రైవర్ ఇలా వివిధ అత్యవసర విభాగంలోని ఏదో ఒక చోట పనిచేస్తున్నట్లు నకలీ ఐడీ కార్డు తయారు చేయించుకుంటున్నారు. అందుకు స్టేషనరీ షాపులో, ఫోటో స్టూడియోలో కొందరు రూ.50–100 వరకు తీసుకుని అక్రమంగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ నకిలీ ఐడీ కార్డు ద్వారా లోకల్ రైళ్లలో సులభంగా రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, రైల్వే పోలీసులు స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద చేపడుతున్న తనిఖీల్లో 35 మంది పట్టుబడ్డారు. పశ్చిమ మార్గంలో ఇలాంటి వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా 135 మంది టీసీలను నియమించారు. నకిలీ ఐడీ ద్వారా రాకపోకలు సాగించే వారితోపాటు ముఖానికి మాస్క్ లేని వారిని కూడా పట్టుకుంటున్నారు. అక్కడ 80 మందిపై చర్యలు తీసుకుని రూ.1,200 వరకు జరిమానా వసూలు చేశారు. ఇక్కడ చదవండి: రూ.22 లక్షల కారు అమ్మేసి మరీ.. నువ్వు గొప్పోడివయ్యా! ఆ వార్త విని షాకయ్యాం.. మాటలు రావడం లేదు -
మాయగాడు; చదువు బీటెక్.. చోరీల హైటెక్
సాక్షి, గచ్చిబౌలి: బీటెక్ చదివిన పరిజ్ఞానం భవిష్యత్‌కు ఉపయోగించలేదు.. నకిలీ ఐడీ కార్డుల తయారీకి ఉపయోగించి చోరీల బాట పట్టాడు ఓ యువకుడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏడు రాష్ట్రాల్లో చోరీలు చేయడం గమనార్హం. జల్సాలకు అలవాటు పడి అదేపనిగా చోరీలు చేయడం అతడి నైజంగా మారింది. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పులేదు. అద్దెకార్లు, బైక్‌లను చోరీ చేసిన అంతరాష్ట్ర దొంగను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో శుక్రవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. సీసలీ గ్రామం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గుడాటీ మహేష్ నూతన్ కుమార్(27) బీటెక్(ఈఈఈ) 2016లో పూర్తి చేశాడు. భీమవరం టౌన్లో మొబైల్ టెక్నీషన్గా కొద్ది రోజులు పనిచేసి హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేట్‌లో మొబైల్ టెక్నీషన్గా పనిచేస్తూ నకిలీ తాళం చెవిలతో షాపులు తెరిచి చోరీలకు పాల్పడ్డాడు. మలక్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం మళ్లీ భీమవరం వెళ్లాడు. కెమెరా చోరీ చేయడంతో పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాడు. బోల్ట్ టాటా కారు, ల్యాప్‌టాప్, రూ.25 వేల నగదు చోరీ చేయడంతో ఎస్ఆర్నగర్ పోలీసులు మూడు కేసులు నమోదు చేసి 2019 డిసెంబర్లో జైలుకు పంపారు. షేరింగ్ రూమ్‌లో చేరి.. జైలు నుంచి బయటకు వచ్చి పంజాగుట్టలో షేరింగ్ యాప్ ద్వారా గది అద్దెకు తీసుకున్నాడు. రూమ్మేట్ నాగేంద్ర ప్రసాద్‌తో స్నేహంగా మెలిగి రూ.1.60 లక్షల నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ కార్డులు చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. అక్కడి నుంచి జూలైలో బెంగళూర్‌కు వెళ్లి షేరింగ్ రాయల్ బ్రదర్స్‌లో నాగేంద్ర ఆధార్ కార్డును ఎడిట్ చేసి తన ఫొటో పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ అద్దెకు తీసుకున్నాడు. బైక్ జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి, నకిలీ నెంబర్ ప్లేట్లో బుల్లెట్‌పై నేరుగా వైజాగ్ వెళ్లాడు. అక్కడ షేరింగ్ రూమ్‌లో అద్దెకు దిగి రెండు నెలలు ఉన్నాడు. రూమ్ మేట్ చైతన్యకు చెందిన రూ.30 వేల నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తస్కరించి బుల్లెట్‌పై పూణె వెళ్లాడు. షేరింగ్ రూమ్‌లో చేరి సతీష్ అనే వ్యక్తికి చెందిన రూ.1.80 లక్షలు నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చోరీ చేసి హైదరాబాద్‌కు వచ్చి చెంగిచెర్లలో నివాసం ఉన్నాడు. చదవండి: చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..! 2020 అక్టోబర్‌లో కేరళ వెళ్లి కొచ్చిలో సతీష్ ఐడీ కార్డులు ఎడిట్ చేసి జూమ్ కార్స్లో వోక్స్వ్యాగన్ పోలో కారును అద్దెకు తీసుకున్నాడు. జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి, నకిలీ నెంబర్ ప్లేట్‌తో చెంగిచెర్లకు వచ్చాడు. డిసెంబర్లో చెన్నై వెళ్లి రేవ్ కార్స్లో చైతన్య ఐడీ కార్డులు పెట్టి స్విఫ్ట్ కారును అద్దెకు తీసుకొని ఉడాయించారు. 2021 జనవరిలో మైసూర్ వెళ్లి డ్రైవీజీలో సతీష్ ఐడీ కార్డులతో బలేనో కారును అద్దెకు తీసుకొని జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి నకిలీ నంబర్ ప్లేట్‌తో పరారయ్యాడు. అనంతరం కోల్కత్తకు వెళ్లి నాగేంద్ర ప్రసాద్ ఐడీ కార్డులతో రేవ్కార్స్లో ఇన్నోవా క్రిస్టా కారును అద్దెకు తీసుకొని జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి పరారయ్యాడు. ఓఎల్ఎక్స్లో డ్రైవర్ కావాలని ప్రకటన ఇవ్వడంతో తుఫ్రాన్‌పేట్, చౌటుప్పల్ మండల్‌కు చెందిన కిరణ్ సంప్రదించగా అతడి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ ప్రూఫ్‌లు తీసుకున్నాడు. జల్సాలు చేసేవాడు అవి ఎడిట్ చేసి 15 రోజుల క్రితం మాదాపూర్ పీఎస్ పరిధిలో జూమ్ కార్స్లో ఇచ్చి స్విఫ్ట్ కారును చోరీ చేశాడు. చోరీ చేసిన కార్లను 30 నుంచి 40 శాతం ధరకే విక్రయించే వాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు పట్టుబడ్డాడు. సమావేశంలో సైబరాబాద్ ఇన్చార్జి డీసీపీ విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సందీప్, సీఐలె రవీంద్ర ప్రసాద్, నవీన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 9 కేసుల్లో నిందితుడు నిందితుడు మహేష్ నూతన్ కుమార్ ఏడు రాష్ట్రాల్లో 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మాదాపూర్, మహరాణిపేట, శిల్‌పూర్ పీఎస్ వెస్ట్ బెంగాల్, పాలరివట్టం పీఎస్ కొచ్చి, హింజేవాడి పీఎస్ పూణె, రాజాజీనగర్ పీఎస్ బెంగళూర్, అన్నా సాగర్ పీఎస్ తమిళనాడు, హెబ్బల్ పీఎస్ మైసూర్, రామమూర్తినగర్, బెంగళూర్లలో కేసులు నమోదయ్యాయి. ఆరు కేసుల్లో అరెస్ట్ చోరీల కేసుల్లో మలక్‌పేట్, పాలకోడురు, ఎస్ఆర్నగర్లో మూడు కేసుల్లో, మదివాల, బెంగళూర్ పీఎస్ పరిధిలోలో ఆరు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. నిందితుడి నుంచి రూ.70 లక్షల విలువ చేసే ఇన్నోవా క్రిస్టా, వోక్స్వాగన్ పోలో, మారుతి బెలేనో, రెండు స్విఫ్ట్ కార్లు, వెర్నా కారు, రాయల్ ఎన్ఫీల్డ్ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు సెల్ఫోన్లు, ఏడిట్ చేసిన ఐడీ కార్డులు, నకిలీ నెంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే! -
ఫేక్ ఆఫీసర్లు ఓకే.. మరి ఐడీలు ఇచ్చే తలకాయలు ఎక్కడ?
సాక్షి, సిటీబ్యూరో: సీఎం ఓఎస్డీకి పీఏనంటూ ఎర వేసి డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి ఉద్యోగాల వరకు అనేక పేర్లు చెప్పి మోసం చేసిన ఎ.సుధాకర్.. ఐపీఎస్ నుంచి ఎస్ఎస్బీ వరకు వివిధ విభాగాల పేర్లు, అనేక హోదాలు వాడేసి మోసాలకు పాల్పడిన కర్నాటి గురువినోద్‌కుమార్ రెడ్డి.. పెళ్లి పేరుతో అనేక మంది యువతులకు ఎర వేసి, భారీగా వసూలు చేసి మోసం చేసిన నకిలీ ఆర్మీ మేజర్ ముదావత్ శ్రీను నాయక్.. ఈ ముగ్గురూ తమ ‘పని’ పూర్తి చేసుకోవడానికి నకిలీ గుర్తింపుకార్డులు (ఐడీ) సైతం వినియోగించారు. మిగిలిన ఇద్దరి కంటే గత వారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన ఎ.సుధాకర్ ఏడాకులు ఎక్కువే చదివాడు. ఆ ఇద్దరి వద్దా ఒక్కో గుర్తింపు కార్డే లభించగా.. ఇతగాడి వద్ద మాత్రం పీఏ టు సీఎం ఓఎస్డీ (తెలంగాణ సెక్రటేరియేట్) అంటూ మూడు, పోలీసు అధికారి అంటూ నాలుగు, నకిలీ ఓటర్ ఐడీలు మూడు, నకిలీ సెక్రటేరియేట్ ఎంట్రీ కార్డులు మూడు లభించాయి. ఈ నేరగాళ్లను పట్టుకుంటున్న అధికారులు గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చిన వారిని మాత్రం పట్టించుకోవట్లేదు. సొంతంగా సాధ్యం కాదు.. నకిలీ డాక్టర్లుగా అవతారం ఎత్తే మోసగాళ్లకు బోగస్ గుర్తింపు కార్డులతో పెద్దగా పని ఉండదు. అయితే సూడో పోలీసులు, నకిలీ ప్రభుత్వ అధికారులుగా ‘మారే’ వారికి మాత్రం ఆయా పేర్లు, వివరాలతో ఉండే ఫేక్ ఐడీ కార్డుల అవసరం ఉంటుంది. వీటిని ఆయా నేరగాళ్లు అనేక చోట్ల చూపిస్తూ ఉంటారు. ఈ గుర్తింపు కార్డులను ఎవరికి వారుగా తయారు చేసుకోలేరు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వాటిలోనూ అవసరమైన మార్పు చేర్పులు చేసి లామినేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా నేరగాళ్లు ఏదో ఒక దుకాణాన్ని ఆశ్రయించాల్సిందే. వారికి అధిక మొత్తం ఆశ చూపిస్తున్న నేరగాళ్లు తమకు కావాల్సిన కార్డులు తయారు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులకు గుర్తింపు కార్డుల్ని ఆయా విభాగాలే జారీ చేస్తాయి. ఈ విషయం తెలిసినప్పటికీ డబ్బుకు ఆశ పడుతున్న దుకాణాల నిర్వాహకులు నకిలీవి తయారు చేసి ఇస్తున్నారు. ‘స్టాంపుల’పై ఉన్న చర్యలు ఇక్కడేవి? ఉద్యోగార్ధులు, వీసా ప్రాసెసింగ్‌తో పాటు పెళ్లి సంబంధాల కోసమూ అనేక మంది నకిలీ సర్టిఫికెట్లు సేకరిస్తూ ఉంటారు. వీటిని తయారు చేసి ఇచ్చే ముఠాలు నగరంలో అనేకం ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ)లతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులూ ప్రతి ఏటా ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీదారులపై నిఘా ఉంచి దాడులు చేస్తుంటారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీకి నేరగాళ్లు ఆయా స్కూళ్లు, యూనివర్శిటీలు, వృత్తి విద్యా సంస్థల పేర్లతో ఉన్న రబ్బర్ స్టాంపుల్ని వాడతారు. ఫేక్ సర్టిఫికెట్ గ్యాంగ్స్‌ను పట్టుకున్న సందర్భాల్లో పోలీసులు ఈ రబ్బర్ స్టాంపులు తయారు చేసి ఇచ్చిన వారి వివరాలు ఆరా తీస్తారు. వారినీ గుర్తించి అరెస్టు చేస్తుంటారు. భారీ స్థాయిలో నకిలీ పత్రాలతో గ్యాంగ్స్ దొరికినప్పుడు ఈ స్టాంపుల తయారీదారుల్ని పట్టుకోవడానికి టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, సైబర్ క్రైమ్ అధికారులు నగరం, రాష్ట్రం దాటి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ‘సూడోగాళ్లను’ పట్టుకున్నప్పుడు మాత్రం వారికి గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చిన వారి విషయంలో ఇలాంటి చర్యలు ఉండట్లేదు. దీంతో ఫేక్ ఐడీ కార్డుల దందా యథేచ్ఛగా సాగుతోంది. కఠిన చర్యలతోనే అడ్డుకట్ట నకిలీ సర్టిఫికెట్ల తయారీకి అవసరమైన రబ్బరు స్టాంపులు తయారు చేసి ఇవ్వడం ఎంత నేరమో.. నకిలీ గుర్తింపు కార్డులు చేసి ఇవ్వడమూ అంతే నేరం. నకిలీ సర్టిఫికెట్లు/ ఐడీ కార్డుల్ని నేరగాళ్లు ఏ నేరానికి వినియోగిస్తారో దానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్లే తయారీదారుడి మీదా ప్రయోగించాలి. నగరంలో ఏళ్లుగా స్టాంపులు తయారు చేసి ఇస్తున్న వారిపై తీసుకున్న చర్యలను.. గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చే వారిపై తీసుకోవట్లేదు. నకిలీ ఐడీ కార్డులు తయారు చేసే వారిపైనా చర్యలు తీసుకుంటేనే ఈ వ్యవహారాలకు కొంత వరకు అడ్డుకట్ట పడే ఆస్కారం ఉంటుంది. – నగరానికి చెందిన విశ్రాంత డీఎస్పీ -
ఫేక్ ఐడీతో బారికేడ్ దాటేందుకు..
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో బారికేడ్ దాటేందుకు నకిలీ గుర్తింపుకార్డు చూపిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివార్లలో మంగళవారం రాత్రి వీరేందర్ కుమార్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌నంటూ నకిలీ ఐడీని అక్కడి పోలీసులకు చూపాడు. ఆ ఐడీ 1991 ప్రాంతంలో జారీచేసినది కావడంతో అనుమానం వచ్చిన పోలీసులు అప్పటినుంచి ఇంకా కానిస్టేబుల్‌గానే ఎందుకున్నావని, ప్రమోషన్ ఎందుకు రాలేదని పలు ప్రశ్నలు అడిగారు.తాను పనిచేస్తున్న పీఎస్ వివరాలు ఇవ్వాలని కోరారు. దీంతో దిక్కుతోచని వీరేందర్ కుమార్ లాక్డౌన్ ఆంక్షలను తప్పించుకునేందుకే నకిలీ ఐడీతో వచ్చానని అంగీకరించాడు. కుమార్ పేదకుటుంబానికి చెందిన వాడని, కేవలం పదోతరగతి వరకే చదివాడని, వివాహితుడైన కుమార్ నిరుద్యోగి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
కేంద్రం నిఘా నేత్రం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలోని నకిలీ ధ్రువీకరణ పత్రాల అంశంలో పలు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 127 మంది రోహింగ్యాలకు ఆధార్ కార్డుల వ్యవహారం, విదేశీయుల వద్ద భారత పాస్‌పోర్టుల అంశాలు కలకలం రేపడంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. కొందరు స్థానికులు కావాలనే వీరికి ఈ పత్రాలు ఇప్పిస్తున్నారని గుర్తించారు. ఇప్పటికే వారిని గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మ రం చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా సమాచారం సేకరించింది. పాతబస్తీలో అక్రమంగా నివసిస్తోన్న విదేశీయుల అక్రమాలపై కేంద్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి నివేదికలు పంపుతూనే ఉన్నాయి. విదేశీయులు ఈ కార్డులు కలిగి ఉండటం వల్ల దేశభద్రతకు భంగం వాటిల్లడమే కాకుండా, ఈ కార్డులతో పలు దేశాల్లో ఉగ్రచర్యలు, ఆత్మాహుతి దాడులకు పాల్పడితే.. ఆ నింద మన దేశం మోయాల్సి వస్తుందని పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తీవ్రంగా పరిగణిస్తోన్న పోలీసులు యెమన్ దేశస్తుడికి పాస్‌పోర్టు వచ్చిన విషయంపై తెలంగాణ పోలీసులు కూడా సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంలో అంతర్గత విచారణకు ఆదేశించారని సమాచారం. చూడగానే విదేశీయుడు అని తెలిసిపోతున్నా.. యెమన్ దేశస్తుడు ముబారక్‌కు భారత పాస్‌పోర్టు రావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని పాస్‌పోర్టు విచారణకు వెళ్లిన పోలీసు అధికారిని ప్రశ్నించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డబ్బులు తీసుకునే విచారణలో అతనికి అనుకూలంగా రిపోర్టు ఇచ్చి పాస్‌పోర్టు వచ్చేలా సహకరిం చారని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. భారత ధ్రువీకరణ కార్డులతో విదేశాలకు వెళ్లి అక్కడ ఉగ్రచర్యలకు పాల్పడితే.. ఆ నింద మన దేశం మోయాల్సి ఉంటుందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ కార్డులతో పౌరసత్వం వచ్చినట్లు కాదు.. ఆధార్, పాన్, ఓట రు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్న విదేశీయులపై ఇప్పటికే పదుల సం ఖ్యలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసులు పెట్టారు. వీరు ఈ గుర్తింపు కార్డులతో భారతీయులు అయిపోరని స్పష్టం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి అసోంలో స్థిరపడిన పలువురు దాదాపు 15 రకాల భారత ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నా.. వారికి భారత పౌరసత్వం లభించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పాతబస్తీ పరిణామాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా ధ్రువీకరణ పత్రాలెలా తీసుకుంటున్నారంటే?దేశంలో అక్రమంగా చొరబడి నగర శివార్లలో తలదాచుకుంటున్న వేలాది మందికి పాతబస్తీలో పలువురు ఆశ్రయం కల్పిస్తున్నారు. వీరిలో పలువురు కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పరిశ్రమల నిర్వాహకులు ఉన్నారు. వారు తమ ఖార్ఖానాల్లో తక్కువ ధరకు పనిచేసేందుకు వీరిని పెట్టుకుంటున్నారు. రాత్రిపూట సంచరించే సమయంలో, తరచుగా శివారు కాలనీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తున్నప్పుడు ధ్రువీకరణ పత్రాలు అడుగుతుండటం వారికి ఇబ్బందికరంగా మారింది. దీంతో సదరు ఆశ్రయం కల్పించిన నిర్వాహకులే తమ ఇంటి కరెంటు బిల్లులు ఇచ్చి విదేశీయులకు ఓటరు, ఆధార్, పాన్ తదితర ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తున్నారు. పాతబస్తీలో డబ్బులు తీసుకుని పనిచేసే కొందరు ఏజెంట్లు కూడా ఈ తతంగానికి సహకరిస్తున్నారు. దీంతో వీరు సులువుగా అన్ని రకాల ధ్రువీకరణలు పొందుతున్నారు. -
అంగట్లో పౌరసత్వం!
సాక్షి, హైదరాబాద్ : మీకు భారత పౌరసత్వం కావాలా? మీరు ఏ దేశస్తులైనా ఫర్వాలేదు. అంగట్లో ఆధార్, ముంగిట్లో పౌరసత్వం ఇవ్వడానికి మేం రెడీ..! ఇది ప్రస్తుతం మన భాగ్యనగరంలో చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితి. దేశ భద్రతను పణంగా పెట్టి ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఆఖరికి పాస్‌పోర్టు కూడా రూ.10 మొదలుకుని రూ.2 వేలకు అమ్ముతున్న దారుణ స్థితి దాపురించింది. ఇప్పటికే పాతబస్తీలో దాదాపు 400 మంది వరకు అక్రమమార్గంలో ఆధార్‌కార్డులు సంపాదిం చారంటూ డీజీపీ కార్యాలయం కేంద్ర హోం శాఖకు ఇప్పటికే నివేదించింది. అయినా.. ఇలాంటి కేసులు పాతబస్తీలో ప్రతినెలా బయటపడుతూనే ఉండటం గమనార్హం. నిఘా లోపం వల్లే..! హైదరాబాద్‌పై ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెడతారు. గతంలో దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా.. దానికి హైదరాబాద్‌తో ఏదో సంబంధం ఉండటం పరిపాటిగా ఉండేది. ఇటీవల భారత ఆర్మీ లక్ష్యంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ) ప్రయోగించిన హనీట్రాప్.. పాతబస్తీ కేంద్రంగా సాగుతోందని ఢిల్లీలో పోలీసులు గుర్తించి భగ్నం చేసిన విషయం తెలిసిందే. సహజంగానే పాతబస్తీకి విదేశీయుల తాకిడి అధికం. యాత్రికులతో పాటు ఆఫ్రికన్ విద్యార్థులు, మధ్యప్రాచ్య వ్యాపారులు, బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన శరణార్థులు వేలాదిమంది ఇక్కడ తలదాచుకుంటారు. వీరిలో శరణార్థులుగా వచ్చినవారిపై సరైన పోలీసు నిఘా కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 16 వేల మంది శరణార్థులు ఉంటారని అంచనా. అసలు వీరు ఎంత మంది ఉన్నారన్న విషయంపై స్పష్టమైన గణంకాలు కూడా పోలీసుల వద్ద లేవన్న విమర్శలు వినిపించాయి. దీంతో యథేచ్ఛగా గుర్తింపు కార్డులు అడ్డదారిలో సంపాదిస్తున్నారు. అక్రమంగా పాస్‌పోర్టులు.. విదేశీయుల వద్ద పాస్‌పోర్టు లాంటి అత్యున్నత గుర్తింపు కార్డులు ఉండటం పలు అనుమానాలకు బీజం వేస్తోంది. శరణార్థుల డేటా పోలీసుల వద్ద లేకపోవడం వల్లే వారికి సులువుగా పాస్‌పోర్టులు దక్కుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో పోలీసులు కొందరి వేలిముద్రలు, రక్తనమూనాలు తీసుకున్నారు. తర్వాత ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇదే వారికి కలిసి వస్తోంది. వాస్తవానికి బంగ్లాదేశీయులు, మయన్మార్ దేశస్తులు చూడటానికి భారతీయుల్లాగానే ఉంటారు. వీరు బిహార్, ఒడిశా, బెంగాల్ నుంచి వచ్చామని చెబుతూ ఈ కార్డులు పొందుతున్నారు. ఆధార్, పాన్, ఓటర్ కార్డులను సులువుగా నెట్ సెంటర్ల ద్వారా సులువుగా సంపాదిస్తున్నారు. (కొందరు నెట్‌సెంటర్ల నిర్వాహకులు ఓటరు కార్డును రూ.10కే దరఖాస్తు చేస్తున్నారు). తర్వాత పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తున్నారు. కానీ, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన కొందరు ఆఫ్రికా జాతీయుల్లా.. చూడగానే వారు విదేశీయులు అని ఇట్టే చెప్పేలా ఉంటారు. అలాంటి వారికి పాస్‌పోర్టులు రావడం చూసి అవాక్కవుతున్నారు. పాతబస్తీలో మయన్మార్, బంగ్లాదేశ్, యెమెన్ దేశాలకు చెందిన శరణార్థుల్లో చాలామంది అక్రమమార్గంలో పాస్‌పోర్టులు సంపాదించారు. వీరిలో కొందరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకా పట్టుబడని వారు చాలామందే ఉన్నారని సమాచారం. విదేశీయుల డేటా నిరంతరం నిర్వహించకపోవడం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతోందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాస్‌పోర్టు జారీ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. -
‘చావు’ తెలివితేటలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదవశాతు మృతిచెందిన ఐటీ ఉద్యోగుల సెల్‌ఫోన్ నంబర్ ఇంటర్నెట్లో.. లేదంటే వారి కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటారు. నకిలీ ఐడీలతో డూప్లికేట్ సిమ్‌కార్డు పొందుతారు. రూ.లక్షల్లో ప్రీ అప్రూవ్డ్ లోన్ (ముందస్తు ఆమోదిత రుణాలు) తీసుకుంటున్న ఆరుగురు సైబర్ నేరగాళ్ల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.53,95,043 కొల్లగొట్టిన ఈ నయా తరహా చీటింగ్‌కు ఓ ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్‌లో పనిచేసిన పాలపర్తి రఘురాం పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలు వినియోగించి రూ.2,76,000 రుణం పొందిన విషయం.. ఆ తర్వాత రికవరీకి వెళితే అతడు చనిపోయాడన్న విషయం తెలిసిందని ఆ ఫిర్యాదులో పేర్కొనడంతో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ నెల 2న కేసు నమోదుచేశారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ డీసీపీ కవిత, ఏసీపీ శ్రీనివాస్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. నేరచరిత ఇదీ.. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడు వాసి, ప్రధాన నిందితుడు నిమ్మగడ్డ ఫణి చౌదరి ఇంటర్మీడియట్ వరకు చదివి ఒంగోలులోని ఆర్టీఏ కార్యాలయంలో డాటా ఎంట్రీ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే డ్రైవింగ్ లైసెన్స్, ఇతర సర్టిఫికెట్ల కోసం నకిలీ ఓటర్ ఐడీలు, పాన్‌కార్డులు గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో 2011లో నకిలీ వాహన నమోదు పత్రాలు సృష్టించిన కేసులో మాదనన్నపేట పోలీసులు, 2012లో సీసీఎస్ పోలీసులు, 2019 జూన్‌లో అక్రమ కాల్ రూటింగ్ మోసంలో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ, చైతన్యపురిలోనూ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు ఉపయోగించి రూ.91 లక్షలు డ్రా చేసిన కేసులు అతడిపై ఉన్నాయి. నిమ్మగడ్డ ఫణి చౌదరి బంధువు గుంటూరు వాసులు వేణుగోపాల్, క్లాస్మేట్ అయిన పెడవల్లి శ్రీనివాసరావు, స్వరూప్‌నాథ్ చౌదరిలపై కేసులు ఉన్నాయి. స్వరూప్‌నాథ్ చౌదరి స్నేహితుడు కండ్రూ హరీశ్, వీర శంకర్రావులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరగాళ్లతో కలిసి ప్రమాదవశాత్తు మరణించిన ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా నయా మోసాలకు తెరలేపారు. ఈ ముఠాలోని నలుగురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు. నయా మోసమిలా... ప్రమాదవశాత్తు మరణించిన ఐటీ ఉద్యోగుల వివరాలు ఇంటర్నెట్ ఉపయోగించి (మొబైల్ నంబర్, కార్యాలయ స్థలం వంటివి) గూగుల్, ఫేస్బుక్ తదితర సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల ద్వారా నిమ్మగడ్డ ఫణి చౌదరి, మండవ స్వరూప్‌నాథ్ చౌదరిలు సులభంగా తెలుసుకునేవారు. ఈ సెల్‌ఫోన్ నంబర్‌ను సేకరించాక హరీశ్, వేణు గోపాల్ ఫొటోలను ఉపయోగించి శ్రీనివాసరావు నకిలీ ఐడీలు సృష్టించి సెల్‌ఫోన్ నెట్వర్కింగ్ కేంద్రాల్లో సమర్పించి అదే డూప్లికేట్ సిమ్‌కార్డును పొందేవారు. అలా వారి వద్ద రెండు రోజులు సిమ్‌కార్డు పనిచేస్తున్న సమయంలోనే మృతుడు కస్టమర్‌గా ఉన్న బ్యాంక్‌ల నుంచి సంక్షిప్త సమాచారాలు సెల్‌ఫోన్ నంబర్‌కు వచ్చేవి. ఆ విధంగా బ్యాంక్ ఖాతాలను గుర్తించేవారు. ఆ తర్వాత స్వరూప్‌నాథ్ చౌదరి, హరీశ్‌లు ఆయా బ్యాంక్‌లకు వెళ్లి ఏదో ఒక కారణాన్ని సిబ్బందికి చెప్పి మొబైల్‌తో అనుసంధానంగా ఉన్న ఖాతాలను గుర్తిస్తారు. కస్టమర్ ఐడీ, బ్యాంక్ ఖాతాలను సేకరించాక నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి ‘పాస్వర్డ్ మర్చిపోయారా’ అంటూ ఎంపికపై క్లిక్ చేసి జీమెయిల్, ఫోన్ నంబర్ సహాయంతో పాస్‌వర్డ్‌ను మారుస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో మృతుడి ఐటీ ఉద్యోగుల జీమెయిల్స్, ఈమెయిల్స్ ఇంటర్నెట్లో దొరికితే సరి. లేదంటే మొబైల్ స్టోర్, కొన్నిసార్లు బ్యాంక్‌ల్లో ఫోన్ నంబర్ ఇచ్చి తెలుసుకుంటున్నారు. ఇలా వారికి ఈమెయిల్ ఐడీ తెలియగానే పాస్‌వర్డ్‌ను బ్రేక్ చేసి ఆ మెయిల్‌కు గతలలో వచ్చిన రుణాలు, బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుంటారు. ఇలా వీరు ఈమెయిల్‌కు మార్చిన పాస్వర్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవుతారు. ఆ వెంటనే ప్రీ అప్రూవ్డ్ లోన్స్, క్రెడిట్ కార్డుల కోసం అభ్యర్థనలు పంపిస్తున్నారు. అలా ఆయా బ్యాంక్‌ల నుంచి రుణాలు మంజూరు కాగానే ఆ ఖాతా నుంచి వేణుగోపాల్, వీర శంకర్రావుల పేరుమీద తెరిచిన నకిలీ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసేవారు. ఆ తర్వాత బ్యాంక్‌లు, ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునేవారు. అలాగే తమ క్రెడిట్ కార్డుల నుంచి క్యాష్ పాయింట్స్‌లోని వివిధ అకౌంట్లకు బదిలీ చేసుకొని మూడు శాతం కమిషన్ ఇచ్చి డబ్బులు తీసుకునేవారు. మరికొన్ని సందర్భాల్లో మృతుల జీమెయిల్ ఐడీ వివరాలు తెలియకపోతే తాము పొందిన డూప్లికేట్ సిమ్ ద్వారా తమ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ మార్చాలని అభ్యర్థనలు పెట్టి మారాకా నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన ప్రీ అప్రూవ్డ్ రుణాలు పొందేవారు. డెబిట్ కార్డులు కూడా అభ్యర్థన పెట్టి కొరియర్ కార్యాలయం నుంచి ఫోన్‌కాల్ రాగానే అక్కడికెళ్లి హరీశ్, వేణుగోపాల్‌లు నకిలీ గుర్తింపు కార్డులు సమర్పించి తీసుకునేవారు. భవిష్యత్‌లో ఈ మోసాలను నివారించేందుకు రుణాలు మంజూరు చేసే సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని ఆర్బీఐకు లేఖ రాస్తాం. అలాగే సిమ్‌కార్డుల జారీలోనూ సరైన వెరిఫికేషన్ ఉండే విధంగా చూడాలని టెలికామ్ సర్వీసెస్‌కు సూచిస్తామ’ని సీపీ సజ్జనార్ వివరించారు. -
రైల్వే వెబ్సైట్లో నకిలీ ఐడీలు!
లక్ష్మీపురం (గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో గత ఏడాది నుంచి నకిలీ ఐడీలతో టికెట్లు బుక్ చేసి రైల్వే ప్రయాణికులను మోసగిస్తున్న ట్రావెల్ వ్యాపారిని ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ సీఐ సరోజ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. పాత గుంటూరు ప్రాంతానికి చెందిన టి.శివప్రసాద్ సునీతా ట్రావెల్స్ అండ్ డిజిటల్ స్టూడియో పేరుతో ఏడాది క్రితం వ్యాపారం ప్రారంభించాడు. రైల్వే వెబ్సైట్లో 10 నకిలీ ఐడీలను సృష్టించాడు. పండుగల సమయంలోనూ, దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు టికెట్లు బుక్ చేసి వెయిటింగ్ ఉన్నా వాటిని కన్ఫార్మ్డ్ టికెట్లుగా మార్చేవాడు. ఆ టికెట్లను ఐఆర్సీటీసీ కంటే అధిక మొత్తానికి విక్రయించేవాడు. ప్రయాణికులు రైలు ఎక్కిన సమయంలో ఆ టికెట్లు చెల్లేవికాదు. దీనివల్ల ఎంతో మంది మార్గం మధ్యలోనే దిగిపోవడం లేదా జరిమానాలు చెల్లించేవారు. దీనిపై సమాచారం అందుకున్న గుంటూరు డివిజన్ రైల్వే ఆర్పీఎఫ్ సీఐ సరోజ్‌కుమార్ ఏఎస్సై పి.వేణు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సిబ్బందితో కలసి శివప్రసాద్ షాప్‌లో తనిఖీలు చేశారు. శివప్రసాద్ వద్ద ఉన్న రూ.1.75 లక్షల విలువైన 135 రైలు టికెట్లను సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ సరోజ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికులు నకిలీ టికెట్ల విక్రయించేవారి వలలో పడొద్దని, టికెట్టు కొనుగోలు చేశాక పీఎన్ఆర్ నంబర్‌ను సరి చూసుకోవాలని సూచించారు. -
నకిలీ ఐడీతో ఇమ్రాన్‌ను బీజేపీలో చేర్చిన వ్యక్తి అరెస్ట్
అహ్మదాబాద్ : నకిలీ ఐడీలతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, డేరా బాబా, ఆశారాం బాపూలను బీజేపీ సభ్యులుగా చూపిన వ్యక్తిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడు షాపూర్‌కు చెందిన గులాం ఫరీద్ షేక్‌ను అరెస్ట్ చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన నేపథ్యంలో షేక్ ఈ నిర్వాకానికి ఒడిగట్టాడు. నరేంద్రమోదీ.ఇన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎవరైనా ఓ నిర్ధిష్ట నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా చేరే వెసులుబాటు ఉంది. ఇలా చేరిన వారికి వారి పేరుతో వర్చువల్ బీజేపీ సభ్యత్వ ఐడీ, ఫోటోతో సహా సిస్టమ్‌లో జనరేట్ అవుతుంది. కాగా ఫేక్ ఐడీలతో పాకిస్తాన్ ప్రధానితో పాటు, రాం రహీం సింగ్, ఆశారామ్ బాపూలను బీజేపీ సభ్యులుగా చూపుతూ ఆ ఫోటోలను షేక్ షాపూర్ ఏక్తా సమితి అనే వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారు. షేక్‌కు ఫేక్ ఐడీల తయారీలో సహకరించిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అహ్మదాబాద్ పోలీసులు వెల్లడించారు. -
నకిలీ ఏసీబీ అధికారిని చితక్కొట్టిన మహిళ
జంషెడ్పూర్ : నకిలీ అధికారికి ఓ మహిళ చుక్కలు చూపించింది. ఫేక్ ఐడీతో రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చెప్పుతో చితక్కొట్టింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని మ్యాంగోలో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారినంటూ చెప్పి, ఫేక్ ఐడీతో మ్యాంగోలో నివసించే ఓ మహిళను రూ.50 వేలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు జంషెడ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అరుణ్ మెహతా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. -
నకిలీ ఏసీబీని చెప్పుతో చితక్కొట్టింది
-
హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ అరెస్ట్
-
వైద్యుడి పేరుతో అమ్మాయిలకు వల
సాక్షి, సిటీబ్యూరో: వైద్యుడిగా పరిచయం చేసుకుంటూ అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ రామయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన అబ్దుల్లా కూకట్‌పల్లిలోని సిఫా ఎలక్ట్రికల్స్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అతను డేటింగ్ వెబ్సైట్లో వైద్యుడిగా నకిలీ ఐడీ సృష్టించి యువతులు, వివాహితులతో చాటింగ్ చేసేవాడు. అనంతరం వారి ఫొటోలు, వీడియోలు తీసుకొని తన సెల్ఫోన్లో నిక్షిప్తం చేసుకునేవాడు. డాక్టర్ కార్తీక్ రెడ్డి పేరుతో నకిలీ ఐడీ సృష్టించిన అతను నగరంలోని ఓ ప్రధాన ఆస్పత్రిలో అనస్తటిస్ట్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకుని ఓ యువతితో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు చాటింగ్ చేసిన అతను బాధితురాలి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె అతడిని దూరం పెట్టింది. దీనిని గ్రహించిన అబ్దుల్లా నీ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి నీ భర్తతో పాటు కుటుంబసభ్యుల ముందు పరువు తీస్తానంటూ బెదిరించాడు. రూ.4 లక్షలు ఇవ్వడంతో పాటు తన కోరిక తీర్చాలని కోరారడు. దీంతో బాధితురాలు గత నెల 24న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మంగళవారం పుప్పలగూడలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
పోలీసులకే టోకరా.. 18 నెలలు వీఐపీ సేవలు..!
న్యూఢిల్లీ : ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఉద్యోగినంటూ పోలీసులకు టోకరా ఇచ్చి 18 నెలల పాటు రాచమర్యాదలు చేయించుకున్న ఓ యువతి బండారం బట్టబయలైంది. భర్తతో కలిసి ప్రభుత్వ అధికారులను మోసగించినందుకు కటకటాల పాలైంది. ఢిల్లీలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. వివరాలు... సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత ఉద్యోగం పొందాలనుకున్న జోయాఖాన్ (35) ఆ కోరిక నెరవేరక పోవడంతో సరికొత్త మోసానికి తెరలేపింది. ఎలాగూ ఉద్యోగం రాలేదు. కానీ, ఆ జాబ్‌లోని ‘మజా’ ఎంజాయ్ చేద్దామని తన భర్త హర్ష్ ప్రతాప్ (40)తో కలిసి నకిలీలలు చేసింది. ఫేక్ ఐడీ కార్డులు సృష్టించి ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గల నొయిడా, గురుగ్రామ్, మీరట్, ఘజియాబాద్, మోరాదాబాద్‌లో ఎస్కార్ట్, పోలీసు సేవల్ని యథేచ్ఛగా వాడుకుంది. ఎలా బయటపడింది..? ఈ క్రమంలోనే మార్చి 23న గౌతమ్‌బుద్ధ నగర్ (నొయిడా) ఏఎస్పీ వైభవ్ కృష్ణకి ఫోన్ చేసిన ఖాన్ పోలిస్ ఎస్కార్టును పంపడంలో ఆలస్యమవడం పట్ల కోపం ప్రదర్శించింది. తొందరగా పంపించాలని హుకుం జారీ చేసింది. దీంతో ఈ ‘ఉన్నత ఉద్యోగి’ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఏఎస్పీ విచారణ చేపట్టారు. ఖాన్, ప్రతాప్ గుట్టు రట్టు కావడంతో వారు నివాసముంటున్న నొయిడా ఎక్స్టెన్షన్స్ నుంచి గురువారం అరెస్టు చేశారు. జోయాఖాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో న్యూక్లియర్ ఆఫీసర్‌గా, అఫ్గనిస్తాన్‌లో యూఎస్ దౌత్యవేత్తగా నకిలీ ఐడీ కార్డులు కలిగి ఉందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు విలువైన కార్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక అఫ్గనిస్తాన్ తదితర దేశాలతో కూడా జోయాఖాన్ వ్యవహారాలు నడిపించిందా అనే ప్రశ్నలను పోలీసులు ఖండించారు. అదంతా అబద్ధమని అన్నారు. ఇలా టోకరా.. వాయిస్ కన్వర్టర్ యాప్, యూఎస్ సెక్యురిటీ కౌన్సిల్ పేరిట ఫేక్ ఈమెయిల్ ద్వారా ఖాన్ పోలీసులను బురిడీ కొట్టించినట్టు తెలిసింది. ల్యాండ్‌లైన్ ద్వారా ఫోన్ చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి రాలేదని పోలీసులు తెలిపారు. ఇక గతవారం ప్రధాని మోదీ మీరట్‌లో పర్యటించినప్పుడు కూడా ఖాన్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆమె నకిలీ వేషాలను నమ్మిన చాలా మంది ఆమెను ప్రధాని రక్షణ దళంలో సభ్యురాలు అని కూడా అనుకున్నారు. కాగా, ఆమె ల్యాప్‌టాప్‌లో పలువురు రాజకీయ నాయకుల ఫొటోలు ప్రత్యక్షమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె వాట్సాప్, సోషల్ మీడియా చరిత్రను విచారించిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇక నిన్నటి వరకు వీఐపీ సేవల్లో తరించిన ఖాన్, ప్రతాప్ అరెస్టులతో స్థానికులు భయాందోళను గురయ్యారు. పోలీసులు, ఉన్నతాధికారులకే టోకరా ఇచ్చిన ఈ ఘరానా మోసగాళ్లు తమనేం చేసేవారోనని కలవరానికి గురయ్యారు. -
‘రంగస్థలం’లో నకిలీలు
రంగస్థల కళాకారుల గుర్తింపు కార్డుల జారీలో నకిలీ బాగోతం బయట పడింది. నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసు కున్న 34 మందికి అధికారులు గుడ్డిగా కార్డులు జారీ చేసేశారు. నిడమర్రు తహసీల్దారు సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ తతంగాన్ని నడిపించారని తేలింది. పశ్చిమ గోదావరి, నిడమర్రు : నాటక రంగాన్ని వృత్తిగా మార్చుకున్న పేద కళాకారులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలు అందించేందుకు తెలుగుభాషా సాంస్కృతిక వ్యవహారాలశాఖ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఈ కార్డుల జారీలో సంబంధిత శాఖ జిల్లాస్థాయి ఉద్యోగులు కొంతమంది ముఠాగా ఏర్పడి అనర్హులకు వందల కొద్దీ నకిలీ గుర్తింపు కార్డులను జారీ చేసినట్టు తెలుస్తోంది. నాటక రంగానికి ఏమాత్రం పరిచయం లేని అనేకమందికి తహసీల్దారు డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసి రంగస్థల వృత్తి కళాకారులుగా గుర్తింపు కార్డులు జారీ చేశారు. నకిలీ గుర్తింపు కార్డుల వ్యవహారంపై తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు తెలిసింది. నకిలీ కార్డులు వెలుగులోకి ఇలా.. ఈనెల 22న నిడమర్రు మండల వృత్తి కళాకారుల సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక పెదనిండ్రకొలను గ్రామంలో జరిగింది. సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం చేసే విషయంలో కళాకారుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఒక కార్యవర్గం జాబితా, ఉంగుటూరు నియోజకవర్గం కన్వీనర్ చల్లా సూర్యారావు ఒక కార్యవర్గ జాబితాఎవరికి వారే ప్రకటించుకుని ప్రమాణ స్వీకారం చేసి ముగించారు. అయితే ఈఎన్నికకు కళాకారులుగా గుర్తింపు కార్డులతో హాజరైన సభ్యులపై బొడ్డేపల్లి అప్పారావు వర్గానికి అనుమానం కలిగి జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా నిడమర్రు తహసీల్దారు డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసిన నకిలీ ధ్రువీకరణ పత్రాలతో 34 వరకూ తెలుగుభాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖకు దరఖాస్తు చేసినట్టు తెలిసింది. అప్పటి వరకూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు స్వీకరించినట్లు జిల్లా అధికారులు సైతం గమనించకపోవడం గమనార్హం. డిజిటల్ సైన్‌తో నకిలీ ధ్రువీకరణలు ఈ– ఆఫీస్ ద్వారా జారీ చేసే డిజిటల్ సైన్ ముద్ర, ఫైల్ నంబర్‌తో ఈ నకిలీ దందా బహిర్గతమైంది. నిడమర్రు మండలంలోని పలువురు తమని వృత్తి కళాకారులుగా గుర్తించాలని నిడమర్రు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా గ్రామాల పెద్దలను రెవెన్యూ సిబ్బందితో విచారించి అడవికొలను, చానమిల్లి, నిడమర్రు గ్రామాలకు చెందిన 9 మందిని వృత్తి కళాకారులుగా గుర్తించి ఈనెల 9న ఈ– ఆఫీస్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసారు. అయితే ఈ ధ్రువీకరణ పత్రాలపై ఉన్న డిజిటల్ సంతకం ముద్రను స్కానింగ్ చేసి ఫొటోషాప్ ద్వారా మరి కొంతమందికి నిడమర్రు తహసీల్దారు జారీ చేసినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు రూపొందించారు. అయితే తయారు చేసిన నకిలీ ధ్రువీకరణ పత్రాలపై ఒకే ఫైల్ నంబర్ 397 ఉంది. అలాగే స్కానింగ్ చేసిన ముద్ర కావడంతో తేదీ, సమయం మారలేదు. దీంతో ఒక సెకనులో 34 వరకూ ధ్రువీకరణ పత్రాలు ప్రింట్ చేసినట్లు అయ్యింది. ఆగమేఘాల మీద కార్డుల జారీ దరఖాస్తు చేసుకున్న రోజే గుర్తింపు కార్డులను అ«ధికారులు జారీ చేశారు. అలాగే ప్రతి విషయం డిజిటలైజేషన్ జరుగుతన్న తరుణంలో ఇంకా అధికారులు చేతిరాతతో రాసిన గుర్తింపుకార్డులు జారీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ నకిలీ దరఖాస్తులపై ఈనెల 19న దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా పౌరసంబంధాలశాఖ కార్యాలయం ముద్ర ఉంది. అదే రోజు వారందరికి చేతిరాతతో గుర్తింపు కార్డులను సహాయ సంచాలకులు తరఫున కిందిస్థాయి ఉద్యోగి ఇ.రామలింగేశ్వరరావు జారీ చేసినట్లు కార్డుల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై ఇ. రామలింగేశ్వరరావును వివరణ కోరగా ఉన్నత అధికారులు బిజీగా ఉంటే, వారి తరఫున కళాకారుల గుర్తింపు కార్డులు తను జారీ చేసే అధికారం ఉందని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు పరిశీలించకుండానే ఒక మండలం నుంచి ఒకేసారి కొత్త దరఖాస్తులు 34 వచ్చినప్పుడు సదరు జిల్లా అధికారులకు అనుమానం రాకపోవడాన్ని కళాకారులు తప్పపడుతున్నారు. దరఖాస్తులు సమగ్రంగా పరిశీలిస్తే ఈ పొరపాటు జరగదని వారు చెబుతున్నారు. ఒక్కో కార్డుకు రూ.10 వేల వరకూ వసూలుచేసినట్టు తెలుస్తోంది. ఈ నకిలీ ముఠాలోకొంతమంది కళాకారులు, జిల్లా ఉద్యోగులతోపాటు, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు హస్తం ఉన్నట్లు కళా కారుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంగళవారం సహాయ సంచాలకురాలు సుభాషిణికి పిర్యాదు చేసినట్లు సమాచారం. సంతంకం ఫోర్జరీ జరిగితే చర్యలు మండలంలో కళాకారులుగా గుర్తించాలని అందిన దరఖాస్తులపై పూర్తి విచారణ చేసి ఈనెల 9న తొమ్మిది మంది కళాకారులకు గుర్తింపు కార్డుల కోసం ధ్రువీకరణ పత్రాలు ఈ–ఆఫీస్ ద్వారా జారీ చేశాము. అయితే మరి కొంత మంది నా డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసి కొత్తగా కార్డులు పొందినట్లు ఫిర్యాదు అందింది. ఈ మేరకు సంబంధిత శాఖ సహాయక సంచాలకులకు విచారణ చేయాలని రాతపూర్వకంగా తెలియజేశా. అలాగే మీ–సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లపై నిఘా పెట్టాలని గణపవరం సీఐ, నిడమర్రు ఎస్సైలను కోరాను. సంతకం «ఫోర్జరీ జరినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎం.సుందర్రాజు, తహసీల్దారు, నిడమర్రు పేద కళాకారులకు అన్యాయం అనర్హులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం వల్ల నిజమైన వృత్తి కళాకారులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే కళాకారులకు ప్రభుత్వం నుంచి లబ్ధి అరకొరగానే అందుతోంది. ఈ నకిలీలను అరికట్టకపోతే భవిష్యత్‌లో కళాకారులపై ప్రజల్లో చులకన భావం పెరుగుతుంది.– బొడ్డేపల్లి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు, రంగస్థల వృత్తి కళాకారుల సంఘం -
మ్యాట్రిమోని సంబంధం: డాక్టర్‌నంటూ మోసం
ముంబై : పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా ముంబైకి చెందిన ఒక మహిళను వివాహం చేసుకోవాలని భావించాడు. కానీ ఇంతలో సదరు యువతికి నకిలీ డాక్టర్‌పై అనుమానం రావడంతో అతని మోసం బయటపడింది. యువతి చెప్పిన వివరాల ప్రకారం ‘వరుడి కోసం నేను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నా వివరాలను అప్లోడ్ చేశాను. అప్పటి నుంచి నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. వాటిలో ఈ పాకిస్థాన్ అభ్యర్థి కూడా ఉన్నాడు. ఇతనితో నేను ఈ నెల 1 నుంచి వాట్సాప్‌లో మాట్లాడటం ప్రారంభించాను. ఈ క్రమంలో సదరు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి తనను తాను ఇండియాకు చెందిన వైద్యునిగా పరిచయం చేసుకున్నాడు. ఒక కాంట్రాక్ట్‌లో భాగంగా ప్రస్తుతం లండన్‌లో పనిచేస్తున్నానని తెలిపాడు. కాంట్రాక్ట్ పూర్తవగానే ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకే వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టానన్నాడు. నేను అతని అభిరుచుల గురించి అడిగినప్పుడు సరిగ్గా స్పందించలేదు. మరి కొన్ని విషయాల్లో అతని కదలికలు కాస్తా అనుమానాస్పదంగా ఉండటంతో అతను పనిచేస్తున్న ఆస్పత్రి ఫోటోలు పంపించమని అడిగాను. ఫోటోలు చూసిన తర్వాత సదరు ఆస్పత్రికి ఫోన్ చేసి ఇతని గురించి వాకబు చేశాను. కానీ ఆస్పత్రి యాజమాన్యం అటువంటి పేరు గల వ్యక్తి ఎవరూ తమ ఆస్పత్రిలో పనిచేయడం లేదని తెలిపారు. అంతేకాక అతను పంపిన ఫోటోల్లో ఒక దాని మీద ఫోటో స్టూడియో నంబర్ ఉంది. నేను ఆ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, నకిలీ పాక్ డాక్టర్ స్నేహితుడు ఫోన్ లిఫ్ట్ చేశాడు. నేను అతనికి నా మీద అనుమానం రాకుండా నకిలీ డాక్టర్ వివరాలను సేకరించాను. ఫోటో స్టూడియో వ్యక్తి చెప్పిన వివరాలు విన్న తర్వాత నేను షాక్ అయ్యాను’ అన్నారు. ఫోటో స్టూడియో అతను చెప్పిన దాని ప్రకారం సదరు నకిలీ డాక్టర్ చాలా ఏళ్లుగా పాకిస్తాన్లో నివాసం ఉంటున్నాడు. అతనికి ఇంతకు ముందే వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అంతే కాక ఆ వ్యక్తి గతంలో తాను డాక్టర్‌నని చెప్పి చాలా మంది మహిళలని ఇలానే మోసం చేశాడని తెలిసిందన్నారు. అనంతరం నకిలీ డాక్టర్ నాకు ఫోన్ చేసినప్పుడు అతన్ని సూటిగా పాకిస్థాన్‌లో మీది ఏ జిల్లా అని అడగ్గానే అతను ముందు కాస్తా తడబడ్డాడు. కాదని బుకాయించే ప్రయత్నం చేశాడు. చివరకూ అది కూడా కుదరకపోవడంతో నన్ను చంపుతానని బెదిరించాడు. దాంతో నేను పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. అతని మీద కఠిన చర్యలు తీసుకునేంత వరకూ ఈ విషయాన్ని వదిలిపెట్టనని బాధిత మహిళ పేర్కొన్నారు. -
ఒక్కడే... మూడు పేర్లు
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు పేర్లతో ఆధార్ కార్డు, ఓట రు కార్డు, పాన్ కార్డులు తీసుకుని వాటి ద్వారా ఓ వ్యాపారిని మోసం చేసిన సంఘటనలో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేర కు వివరాలిలా ఉన్నాయి... విజయవాడ పాయకాపురం ప్రాంతానికి చెందిన అమృతపూడి రవి అలియాస్ షేక్ రియాజ్ అలియాస్ శంకర్‌రెడ్డి హర్షా ఫార్మా పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేసి తాను మందులు సరఫరా చేస్తానంటూ రామంతపూర్ ఇందిరానగర్‌లో నివసించే వ్యాపారి మేకల సతీష్‌ను నమ్మించాడు. కొద్ది రోజులు మందులు బాగానే సరఫరా చేసిన రవి ముందస్తు పథకం ప్రకారం తాన్వి మెడికల్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా షేక్ రియాజ్ బాబు, శంకర్‌రెడ్డిలను పేర్కొంటూ వారు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తారని రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తే బల్క్‌ఆర్డర్లు బుక్ చేయవచ్చని చెప్పడంతో నమ్మిన సతీష్ ఆ మేరకు డబ్బులు పంపించాడు. అయితే రోజులు గడిచినా డ్రగ్స్ సరఫరా కాకపోవడంతో ఇదేమిటని నిలదీస్తే రవి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ప్రదీప్ బంజారా అపార్ట్మెంట్లో ఉంటున్న అతని సోదరుడి వద్దకు వెళ్లి ఆరా తీయగా రవి ఒక్కడేనని షేక్‌రియాజ్, శంకర్‌రెడ్డి పేర్లతో ఆధార్ కార్డు తయారు చేశాడని తేలింది. తరచూ పేర్లు మారుస్తూ ఎంతో మందిని మోసం చేశాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.