
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్ నేపథ్యంలో బారికేడ్ దాటేందుకు నకిలీ గుర్తింపుకార్డు చూపిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివార్లలో మంగళవారం రాత్రి వీరేందర్ కుమార్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌నంటూ నకిలీ ఐడీని అక్కడి పోలీసులకు చూపాడు. ఆ ఐడీ 1991 ప్రాంతంలో జారీచేసినది కావడంతో అనుమానం వచ్చిన పోలీసులు అప్పటినుంచి ఇంకా కానిస్టేబుల్‌గానే ఎందుకున్నావని, ప్రమోషన్ ఎందుకు రాలేదని పలు ప్రశ్నలు అడిగారు.తాను పనిచేస్తున్న పీఎస్ వివరాలు ఇవ్వాలని కోరారు. దీంతో దిక్కుతోచని వీరేందర్ కుమార్ లాక్‌డౌన్ ఆంక్షలను తప్పించుకునేందుకే నకిలీ ఐడీతో వచ్చానని అంగీకరించాడు. కుమార్ పేదకుటుంబానికి చెందిన వాడని, కేవలం పదోతరగతి వరకే చదివాడని, వివాహితుడైన కుమార్ నిరుద్యోగి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment