arest
-
హిమాచల్ పోలీసుల అకృత్యం
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రి దాటాక తాము అడిగిన మద్యం, ఆహారం ఇవ్వలేదన్న అక్కసుతో రిసార్ట్ మేనేజర్‌ను పోలీసులు కొట్టి చంపేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రిసార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు, నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిదాటాక పర్వతమయ పర్యాటక ప్రాంతం డల్హౌసీ దగ్గర్లోని బనీఖేత్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో తాము అడిగిన భోజనం, మద్యం ఏర్పాట్లు చేయాలని రిసార్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాత్రి సమయంలో తాము చేయాల్సిన ‘సర్వీస్’సమయం మించిపోయిందని, ఇప్పుడు నిబంధనలు ఒప్పుకోవని, ఈ సమయంలో సర్వీస్ చేయడం కుదరని అక్కడి రిసెప్షనిస్ట్ సచిన్ చెప్పాడు. దీంతో పట్టరాని ఆవేశంతో కానిస్టేబుల్స్ అనూప్, అమిత్‌లు రిసెప్షనిస్ట్‌ను చితకబాదారు. ఇదంతా చూసిన రిసార్ట్ మేనేజర్ రాజీందర్ హుటాహుటిన అక్కడికొచ్చి కానిస్టేబుళ్లను నిలువరించబోయారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కానిస్టేబుళ్లు రాజీందర్పైనా దాడికి తెగించారు. ఈ దాడిలో రాజీందర్ అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో కానిస్టేబుళ్లు పూటుగా మద్యం తాగి ఉన్నారని వార్తలొచ్చాయి. విషయం తెల్సుకున్న స్థానికులు వెంటనే చంబా–పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజీందర్ మృతికి కారణమైన కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్‌చేశారు. ఇద్దరినీ విధుల నుంచి తప్పించి దర్యాప్తు మొదలుపెట్టామని చంబా ఎస్పీ గురువారం చెప్పారు. తీవ్రంగా గాయపడిన రిసెప్షనిస్ట్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. -
మెక్సికో డ్రగ్ లార్డ్ అరెస్ట్
వాషింగ్టన్: మెక్సికోలో మాదకద్రవ్యాల వ్యాపారంతో వేలకోట్ల రూపాయల నేరసామ్రాజ్యాన్ని విస్తరించిన డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడా గార్షియా ఎట్టకేలకు అమెరికా పోలీసులకు చిక్కాడు. 76 ఏళ్ల జంబాడా వాస్తవానికి విమానంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా అతనికి తెలీకుండా చాకచక్యంగా ప్రైవేట్ విమానాన్ని అమెరికాలో ల్యాండ్ చేశారు. గురువారం టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసో సిటీ శివారులోని చిన్న ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన అదే విమానంలో ఉన్న డ్రగ్ లార్డ్ ఎల్‌చాపో కుమారుడు జోక్విన్ ‘ఎల్ చాపో’ గుజ్మాన్(38)నూ పోలీసులు అరెస్ట్‌చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. దశాబ్దాలుగా జంబాడా అరెస్ట్‌కోసం అమెరికా ప్రయతి్నస్తోంది. అతని జాడ చెప్తే రూ.125 కోట్ల నజరానా ఇస్తామని గతంలో ప్రకటించింది. ‘అమెరికాలోకి వందల కోట్ల డాలర్ల విలువైన ఫెంటానిల్, మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ అమెరికా యువతను మాదకద్రవ్యాల మత్తులో ముంచేసిన నేరానికి వీరికి కఠిన శిక్ష పడనుంది’ అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ అన్నారు. రియల్ఎస్టేట్ వ్యాపార నిమిత్తం వెళ్తున్నామని అబద్దం చెప్పి జంబాడాను జోక్విన్ గుజ్మానే విమానం ఎక్కించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అత్యంత హింసాత్మక, శక్తివంత ‘ సినోలా కార్టెల్’ మాదకద్రవ్యాల అక్రమ తయారీ, ఎగుమతికి ప్రపంచ కేంద్రస్థానంగా నిలిచే మెక్సికోలో అత్యంత హింసాత్మక, శక్తివంతమైన డ్రగ్స్ ముఠాల్లో సినోలా కార్టెల్ కూడా ఒకటి. దీనిని ఎల్ చాపో గుజ్మాన్, జంబాడా, మరొకరు సంయుక్తంగా స్థాపించి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా అమ్మడం మొదలెట్టారు. వందల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగిన జాక్విన్ అర్చివాల్డో గుజ్మాన్ లోయెరా (ఎల్‌చాపో)ను 2019లో మెక్సికో ప్రభుత్వం అరెస్ట్‌చేసి అమెరికాకు అప్పగించడంతో అక్కడే జీవితకాలకారాగార శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో ఎల్ చాపో కుమారులు రంగంలోకి దిగి అక్రమ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. అమెరికా సహా విదేశాలకు సరకు అక్రమ రవాణా మొత్తం జంబాడా కనుసన్నల్లో జరుగుతోంది. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠా సభ్యులు చిక్కితే వారి తల నరకడం, చర్మం ఒలిచేయడం, శరీరాన్ని ముక్కలుగా నరకడం వంటి హేయమైన నేరాలకు పాల్పడటం అక్కడి ముఠాలకు మామూలు విషయం. -
పాక్‌లో లాడెన్ సన్నిహితుడి అరెస్ట్
లాహోర్: అల్ ఖైదా సీనియర్ నేత, ఒసా మా బిన్ లాడెన్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న అమీనుల్ హక్‌ను పాక్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అరెస్ట్ చేసింది. దేశంలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు అతడు చేస్తున్న ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోగలిగామని ఉగ్రవాద వ్యతిరేక విభాగం డీఐజీ ఉస్మాన్ అక్రమ్ చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాత్ జిల్లా సరాయ్ ఆలంగిర్ పట్టణంలో దాగున్న అతడిని పట్టుకున్నట్లు అక్రమ్ తెలిపారు. ఉగ్రవాదంపై జరుపుతున్న పోరాటంలో ఇదో కీలక విజయమని పేర్కొన్నారు. -
ఇటలీలో 33 మందితో వెట్టి చాకిరీ.. సూత్రధారులైన ఇద్దరు
రోమ్: ఇటలీలోని వెరోనా ప్రావిన్స్‌లో వ్యవసాయ క్షేత్రాల్లో 33 మంది భారతీయులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఆరోపణలపై సూత్రధారులైన ఇద్దరు భారతీయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4.33 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు లెక్కలు చూపుతూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే ప్రావిన్స్‌లో తోటల్లో పనిచేసే సత్నాం సింగ్ అనే భారతీయుడు ఇటీవల ప్రమాదవశాత్తూ చేతి కోల్పోగా యజమాని అతన్ని రోడ్డు పక్కన వదిలేయడం, వైద్య సాయం ఆలస్యమై మరణించడం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రధాని మెలోనీ కూడా దీన్ని ఖండించారు. ఈ ఘటనతో ఇటలీ వ్యవసాయ క్షేత్రాల్లో అనధికారికంగా పనిచేసే భారతీయ కారి్మకుల దుస్థితి వెలుగులోకి వచి్చంది. సుమారు 2 లక్షల మంది భారతీయులు ఇటలీలోని వ్యవసాయ క్షేత్రాల్లో మగ్గిపోతున్నారని విదేశాంగ శాఖ అంచనా. -
నీట్ పేపర్ లీకేజీ నిజమే
పట్నా: బిహార్‌లో చోటుచేసుకున్న నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పేపర్ లీక్ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్‌కు ఒక్క రోజు ముందు ప్రశ్నపత్రంతోపాటు సమాధానాల ‘కీ’ని సైతం అభ్యర్థులకు అందజేసి, పరీక్షకు సిద్ధం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో బిహార్ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నలుగురు నీట్ అభ్యర్థులు అనురాగ్ యాదవ్, శివానందన్, అభిõÙక్, ఆయుష్ రాజ్, ఇద్దరు లీకేజీ ముఠా సభ్యులు నితీశ్, అమిత్ ఆనంద్‌తోపాటు ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ యాదవేందు ఉన్నారు. ఈ యాదవేందు మేనల్లుడే అనురాగ్æ. విచారణలో నిందితులు ఏం చెప్పారో వారి మాటల్లోనే... ‘‘బిహార్ దానాపూర్ టౌన్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికిందర్ ప్రసాద్ యాదవేందు మమ్మల్ని సంప్రదించాడు. మేనల్లుడు అనురాగ్‌సహా నలుగురికి ప్రశ్నపత్రం ఇచి్చ యాదవేందు నుంచి రూ.32 లక్షలు తీసుకున్నాం’’ – నితీశ్, అమిత్, ‘‘ అమిత్, నితీశ్ ప్రశ్నపత్రం, కీ అందజేశారు. పరీక్షకు సిద్ధం కావడానికి సహకరించారు’ – అనురాగ్, నీట్ అభ్యర్థి ‘‘యాదవేందు అంకుల్ మే 4న ఓ ఇంటికి రమ్మని చెప్పాడు. అక్కడ నితీశ్, అమిత్ ప్రశ్నపత్రం ఇచ్చి నన్ను పరీక్షకు సిద్ధం చేశారు’’ – శివానందన్ కుమార్, నీట్ అభ్యర్థి ‘‘నీట్ ప్రశ్నపత్రం కోసం యాదవేందుకు రూ.40 లక్షలు చెల్లించాం’’ –అవదేశ్, అభిషేక్ కుమార్ తండ్రి ‘‘యాదవేందు రూ.40 లక్షలు తీసుకున్నాడు’’ నీట్ అభ్యర్థి ఆయుష్ రాజ్ తండ్రి ‘‘రాజస్తాన్‌లోని కోటాలో శిక్షణ పొందుతున్న నా మేనల్లుడు అనురాగ్ యాదవ్ నా సోదరి రీనా కుమారితో కలిసి నీట్ పరీక్ష రాయడానికి పాట్నా వచ్చాడు. వారికి పాటా్నలో ప్రభుత్వ అతిథి గృహంలో నేనే బస ఏర్పాట్లు చేశా. నీట్ పరీక్ష రాయడానికి నా మేనల్లుడు సహా నలుగురి అభ్యర్థులకు సహకరించా. నలుగురికి ప్రశ్నపత్రాలు సమకూర్చా. ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల చొప్పున డిమాండ్ చేశా. నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ రూ.32 లక్షల చొప్పున తీసుకున్నారు’’ – యాదవేందు, ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ తేజస్వీ యాదవ్ సహాయకుడి హస్తం! ప్రభుత్వ అతిథి గృహంలో అనురాగ్ యాదవ్, ఆయన తల్లికి బస ఏర్పాట్ల వెనుక బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గెస్టు హౌస్ బిల్లులను పరిశీలించగా, అందులో మంత్రిజీ అని ఉంది. తేజస్వీ యాదవ్ వ్యక్తిగత సహాయకుడైన ప్రీతమ్ కుమార్ ఈ గెస్టు హౌస్‌ను బుక్ చేసేందుకు యాదవేందుకు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం తెలిపింది. సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది. 2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు ఏఎన్సీ వివరించింది. -
సునీత.. మరో రబ్డీ అయ్యేనా...?!
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కసారిగా భారీ కుదుపుకు లోనైంది. చాన్నాళ్లుగా ఊహిస్తున్నదే అయినా, ఆప్‌లో నాయకత్వ లేమిని ఈ పరిణామం బట్టబయలు చేసింది. మద్యం కేసులోని ఇతర నిందితుల్లా కేజ్రీవాల్ కూడా దీర్ఘకాలం పాటు జైలుకే పరిమితమైతే ఆప్ పరిస్థితేమిటన్న ప్రశ్నకు బదులుగా ఆయన భార్య సునీత పేరు తెరపైకి వస్తోంది. భర్త స్థానంలో ఆప్ పగ్గాలతో పాటు ఢిల్లీ సీఎం బాధ్యతలనూ ఆమె చేపట్టవచ్చంటూ ఊహాగానాలు విని్పస్తున్నాయి. సోషల్ మీడియాలో అందుకు అనుకూల, వ్యతిరేక వాదనలు జోరుగా సాగుతున్నాయి... 1997లో నాటి బిహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో జైలుపాలు కావడంతో భార్య రబ్డీదేవిని ముఖ్యమంత్రిని చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అచ్చం అలాగే సునీత కూడా రాజకీయ అరంగేట్రం చేయవచ్చంటూ ఊహాగానాలు విని్పస్తున్నాయి. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ శనివారం ప్రజలనుద్దేశించి పంపిన వీడియో సందేశాన్ని పార్టీ నేతలకు బదులు సునీత చదివి విని్పంచడం ఇందుకు సంకేతమంటూ జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ సందర్భంగా ఆమె కేజ్రీవాల్ కురీ్చలో కూర్చోవడం యాదృచ్చికమేమీ కాదని కూడా అంటున్నారు. అరవింద్, సునీత ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులే. శిక్షణ సందర్భంగా ఏర్పడ్డ సాన్నిహిత్యం పెళ్లికి దారితీసింది. ముందుగా కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేసి హక్కుల కార్యకర్తగా మారారు. రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టారు. ఆయన సీఎం అయ్యాక సునీత కూడా ఐఆర్ఎస్కు రాజీనామా చేశారు. అప్పుడప్పుడు భర్తతో పాటు పార్టీ ప్రచారంలో పాల్గొనడం, ఆప్ ఎన్నికల విజయాలపై స్పందించడం తప్ప రాజకీయంగా చురుగ్గా ఉన్నది లేదు. పారీ్టలో కూడా ఆమె ఎలాంటి పదవిలోనూ లేరు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సందేశాన్ని ఆప్ నేతలు కాకుండా సునీత చదివి విని్పంచడం ఒక్కసారిగా ఊహాగానాలకు తావిచ్చింది. వాటిపై మిశ్రమ స్పందనలూ వస్తున్నాయి. ‘‘సునీతకు పగ్గాలప్పగిస్తే సానుభూతి కూడా ఆప్‌కు కలిసొస్తుంది. కష్టకాలం నుంచి పార్టీని ఆమె బయట పడేస్తారు. కీలకమైన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ లోటును కూడా భర్తీ చేస్తారు’’ అని కొందరంటున్నారు. భర్త తరఫున ఆయన సందేశాన్ని విని్పంచినంత మాత్రాన రాజకీయాల్లోకి వస్తారని అనుకోలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఆమె కూర్చున్నది సీఎం కుర్చీ ఏమీ కాదు. తమ నివాసంలో కేజ్రీవాల్ మీడియాతో భేటీ అయ్యే కురీ్చలో కూర్చున్నారంతే. దాన్ని అధికార మార్పిడికి సంకేతంగా చూడటం సరికాదు’’ అన్నది వారి వాదన. సునీత రాజకీయ ఎంట్రీ వార్తలపై ఆప్ మౌనం వహిస్తోంది. ఆప్ నేతల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాత్రమే దీనిపై పెదవి విప్పారు. ఆయన కూడా ఈ విషయమై తనకెలాంటి సమాచారమూ లేదని చెప్పడంతోనే సరిపెట్టారు. బీజేపీ మాత్రం అప్పుడే ముందస్తు విమర్శలతో హోరెత్తిస్తోంది. ఆప్ నాయకత్వ రేసులో చివరికి కేజ్రీవాల్ భార్య కూడా చేరారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ గతంలో చేసిన వాగ్దానాలను వరుసబెట్టి తుంగలో తొక్కుతుంటే సునీత ఎక్కడున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐసిస్‌తో లింకులు.. గువాహటి ఐఐటీ విద్యార్థి అరెస్ట్
గువాహటి: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గువాహటి–ఐఐటీకి చెందిన తౌసిఫ్ అలీ ఫరూకీ అనే విద్యారి్థని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ బయోసైన్స్ నాలుగో సంవత్సరం చదువుకుంటున్న ఇతడిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పక్కా ఆధారాలు దొరకడంతో శనివారం అరెస్ట్ చేసినట్లు అస్సాం పోలీస్ టాస్‌్కఫోర్స్ ఐజీ పార్థసారధి మహంతా చెప్పారు. కోర్టు అతడిని 10 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చిందన్నారు. ఢిల్లీలోని బాట్లా ప్రాంతానికి చెందిన అతడు ఐసిస్‌లో చేరేందుకు వెళ్తుండగా కామ్రూప్ జిల్లా హజో వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచి్చన ఐసిస్ భారత్ చీఫ్ హారిస్ ఫరూకీ, అతడి అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రేహాన్‌లను ధుబ్రి జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఐజీ వివరించారు. అయితే, గువాహటి ఐఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తనకు సమాచారం ఇచి్చనట్లు హోం శాఖ బాధ్యతలు కూడా చూసుకుంటున్న సీఎం హిమాంత బిశ్వ శర్మ చెప్పారు. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే దొరికారని, తప్పించుకుపోయిన మరో విద్యార్థిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఉగ్రవాదం వైపు ప్రేరేపితులైన వీరి గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు సీఎం చెప్పారు. -
Delhi liquor scam: 31న విపక్షాల మహా ర్యాలీ
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు చేతులు కలుపుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావంగా ఈ నెల 31న తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాలతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో మహా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారంతా కేజ్రీవాల్ ఆరెస్టు పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది కేవలం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన సమస్య కాదు. ప్రతిపక్షాలన్నీ బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తులు మొదట విపక్షాలను డబ్బుతో కొనేయాలని చూస్తున్నారు. మాట వినకపోతే ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు. అయినా లొంగకపోతే తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఇలాగే అరెస్టు చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పైనా గురిపెట్టారు’’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారని, ఆప్ కార్యాలయాన్ని సీజ్ చేశారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని చెప్పారు. కేవలం రాజకీయ సభ కాదు ఢిల్లీలో ఈనెల 31న జరిగే మహా ర్యాలీ కేవలం రాజకీయ సభ కాదని, కేంద్రంలోని నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా వినిపించే గొంతుక అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరి్వందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి పక్షాలకు అండగా నిలుస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడులను సహించబోమని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ స్పష్టం చేశారు. -
రాత్రంతా లాకప్‌లో..
న్యూఢిల్లీ: ఆప్ సారథి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీలో తొలి రాత్రి భారంగా గడిచింది. లాకప్ రూములో ఉంచి మంచం లేకుండా పరుపు, దుప్పటి మాత్రం ఇచ్చారు. ఏసీ సదుపాయం కల్పించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో గురువారం సాయంత్రం నుంచి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో గంటల తరబడి ప్రశ్నించిన ఈడీ అధికారులు, రాత్రి 11 గంటల ప్రాంతంలో అరెస్టు చేయడం తెలిసిందే. రాత్రి భోజనం అనంతరం ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కేజ్రీని లాకప్ గదికి తరలించారు. అక్కడ ప్రత్యేక సదుపాయాలేవీ కలి్పంచలేదు. కేజ్రీవాల్ పెద్దగా నిద్ర పోకుండా భారంగానే గడిపినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం చాయ్, అల్పాహారం అందించారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ ఇన్సులిన్ తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. కాసేపటికి కాఫీ ఇచ్చారు. తర్వాత కోర్టులో హాజరు పరిచారు. నిర్బంధంలో సీఎం కుటుంబం: ఆప్ మంత్రుల ధ్వజం కేజ్రీవాల్ కుటుంబాన్ని కలిసేందుకు ఆయన నివాసంలోనికి పోలీసులు అనుమతించడం లేదంటూ ఆప్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ‘‘సీఎం కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రిని, అరెస్ట్‌తో కుంగిపోయిన కుటుంబాన్ని ఓదార్చనివ్వరా? ఇందుకు ఏ చట్టం అనుమతినిచ్చింది? హౌజ్ అరెస్ట్‌ను ఆపేయండి’’ అంటూ నినదించారు. అధికారం కోసమే అరెస్టు: కేజ్రీవాల్ భార్య తన భర్తను అక్రమంగా అరెస్టు చేసి ఢిల్లీ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని కేజ్రీవాల్ భార్య సునీత మండిపడ్డారు. ఢిల్లీలో అధికారం దక్కించుకోవాలన్న ఆరాటంతోనే అరెస్టు చేశారంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రశ్నించేవారిని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. -
Mahadev app case: సీఎం బఘేల్‌కు డబ్బు పంపలేదు
రాయ్‌పూర్: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్‌చేసిన నగదు కొరియర్ ఆసిమ్ దాస్ తాజాగా మాటమార్చాడు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్ల నగదు పంపించారని విచారణలో అతడు అంగీకరించాడని ఈడీ వెల్లడించడం తెల్సిందే. ఆసిమ్ తన లాయర్ షోయబ్ అల్వీ ద్వారా మరో వాంగ్మూలమిస్తూ ఈడీ డైరెక్టర్, ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ‘‘ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు. వాస్తవానికి సీఎం బఘేల్సహా ఏ రాజకీయనేతకూ నేను డబ్బులు అందజేయలేదు. ఈడీ అధికారులు ఇంగ్లిష్‌లో ఉన్న వాంగ్మూలంపై బలవంతంగా నా సంతకం చేయించుకున్నారు. నాకు ఇంగ్లిష్ రాదు. ఎవరో వచ్చి డబ్బు సంచులు కారులో పెట్టి వెళ్లిపోయాడు. డబ్బుతో నేను హోటల్రూమ్కి వెళ్లగానే ఈడీ అధికారులొచ్చి అరెస్ట్‌చేశారు. కేసులో నన్ను కావాలనే ఇరికించారని నాకప్పుడు అర్ధమైంది’’ అని దాస్ వివరించారు. -
మాజీ డ్రైవరే హంతకుడు
బనశంకరి: బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన గనులు, భూవిజ్ఞాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ ప్రతిమ (40) హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. చామరాజనగర జిల్లా మహదేశ్వరబెట్టలో దాగిన అతన్ని బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీసులు గాలించి నిర్బంధించారు. ఉద్యోగం నుంచి తీసేశారనే ద్వేషంతో ఆమె మాజీ కారుడ్రైవరు కిరణ్ ఈ హత్యకు పాల్పడినట్లు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద సోమవారం తెలిపారు. కిరణ్ (32) స్వస్థలం బెంగళూరు కోణనకుంటె. కొన్ని సంవత్సరాలుగా ప్రతిమ ఆఫీస్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజుల కిందట ఒక యాక్సిడెంట్ చేయడంతో పాటు అక్రమ గనులపై దాడుల సమాచారం ముందుగానే గనుల యజమానులకు లీక్ చేసేవాడు. దీంతో ప్రతిమ అతడిని 10 రోజుల కిందటే ఉద్యోగం నుంచి తీసేయించారు. -
బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే మోదీతో కేసీఆర్‌కు లోపాయికారీ ఒప్పందం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీతో లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. జాగో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం రూ.60 వేల కోట్ల వరకు దోపిడీ చేసినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకే జాగో తెలంగాణ పేరుతో ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి చైతన్యం చేస్తున్నామని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేసి గల్లీకొక బెల్టు షాపు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో విధ్వంసకర పాలన సాగుతోందని, ఇసుక, మట్టి, ల్యాండ్, లిక్కర్ మాఫియాలు చెలరేగుతున్నాయని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భయంకరమైన అవినీతి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వి నర్ రాఘవాచారి మాట్లాడుతూ పాలమూరు జిల్లా తెలంగాణ ఉద్యమకాలంలో ఎలా ఉందో ప్రస్తుతం అలాగే ఉందని, వలసలు ఏమాత్రం ఆగలేదన్నారు. పాలమూరు రాజకీయ నేతల బానిసత్వం కూడా పోలేదన్నారు. సమావేశంలో జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధులు ఖలీదా ఫరీ్వన్, ప్రొఫెసర్ వినాయకరెడ్డి, ప్రొఫెసర్ పద్మజాషా, జావిద్ ఖాద్రి పాల్గొన్నారు. -
అమెరికాలో పోలీసుల అదుపులో 17 మంది ‘వాంటెడ్’ సిక్కులు
వాషింగ్టన్: అమెరికాలో 11 కాల్పుల ఘటనలకు సంబంధించి 17 మంది సిక్కులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ బ్రోకెన్ స్వోర్డ్ పేరుతో 20కి పైగా ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో మెషీన్ గన్, ఏకే–47లు సహా 42 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన మాఫియా సభ్యులని అధికారులు చెప్పారు. వీరు పలు హత్యా ఘటనలకు సంబంధించి భారత్ పంపిన వాంటెడ్ జాబితాలో ఉన్నారన్నారు. హింసాత్మక ఘటనలు, కాల్పులతోపాటు ఐదు హత్యాయత్నం ఘటనలతోనూ వీరికి ప్రమేయం ఉందన్నారు. -
ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసిన ఈడీ
న్యూఢిల్లీ: దేశంలో అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసింది. వీరిలో పలు కార్పొరేట్ సంస్థల డైరెక్టర్లున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు ఈ మేరకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ‘‘కార్పొరేట్ మోసాలకు సంబంధించి స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులపై ఈడీ కేసులు పెట్టింది. రూ.33,862.20 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. వీటిలో రూ.15,113 కోట్ల ఆస్తులను ప్రభుత్వ బ్యాంకులు అధీనంలోకి తీసుకున్నాయి. ఈడీ అప్పగించిన ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం విక్రయించి రూ.7,975.27 కోట్లు ఆర్జించింది’’ అని మంత్రి వివరించారు. -
నిఘా ఆరోపణలతో వాల్‌స్ట్రీట్ జర్నల్ విలేకరి అరెస్ట్
మాస్కో: ఉక్రెయిన్ యుద్ధంతో బద్ధశత్రువులుగా తయారైన అమెరికా, రష్యాల సంబంధాలు మరింత క్షీణించే పరిణామం ఒకటి సంభవించింది. రష్యాలో విలేకరిగా విధులు నిర్వర్తిస్తున్న అమెరికాకు చెందిన అంతర్జాతీయ వార్తాపత్రిక ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’కు చెందిన ఇవాన్ గెర్‡్షకోవిచ్ను రష్యా నిఘా సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ) అరెస్ట్‌చేసింది. రహస్య పత్రాలను సేకరించేందుకు ప్రయత్నించాడని అతనిపై అభియోగాలు మోపింది. ‘అమెరికా ఆదేశాలతోనే నిషేధిత ప్రాంతంలోని తమ సైనిక పారిశ్రామికవాడలోని ఒక సంస్థకు చెందిన రహస్య పత్రాలను సేకరించడంలో ఇవాన్ బిజీగా ఉన్నాడు. అందుకే అరెస్ట్‌చేశాం’ అని ఎఫ్ఎస్బీ గురువారం ప్రకటించింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ మాస్కో బ్యూరోలో కరస్పాండెంట్‌గా పనిచేసే ఇవాన్ ఉక్రెయిన్, రష్యా, ఇతర సోవియట్ యూనియన్ దేశాల్లో వార్తల కవరేజీ విధులు నిర్వర్తిస్తున్నాడు. రష్యా మోపిన నేరం రుజువు అయితే గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తమ విలేకరి అరెస్ట్‌ను వార్తాసంస్థ తీవ్రంగా ఖండించింది. కోల్డ్ వార్ తర్వాత అమెరికా రిపోర్టర్‌ను రష్యా అరెస్ట్చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇవాన్‌ను ఏ తేదీలో అరెస్ట్చేసిందీ ఎఫ్ఎస్బీ వెల్లడించలేదుగానీ ఉరాల్ పర్వతాల దగ్గర్లోని ఎకటిన్బర్గ్ నగరంలో అతడిని అరెస్ట్‌చేసినట్లు తెలుస్తోంది. ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా జైళ్లలో ఉన్న రష్యా ఆయుధ మధ్యవర్తి విక్టర్ బౌట్‌ను, డబ్ల్యూఎన్బీఏ స్టార్ బ్రిట్నీ గ్రీనర్ను రష్యా, అమెరికాలు మార్చుకున్న విషయం విదితమే. -
పుతిన్ అరెస్ట్ అవుతారా?.. బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాదికి పైగా ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్నారు. బాంబులు, ఫిరంగులు, క్షిపణులతో దారుణ కాండ సాగిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా, పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అన్న ధోరణిలో పోతున్నారు. అలాంటి సమయంలో ఐసీసీ ఆయనపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ వారెంట్లతో పుతిన్‌ను అరెస్ట్ చేయొచ్చా ? మాస్కో చెబుతున్నట్టుగా అ వారెంట్లు చిత్తు కాగితాలతో సమానమా? ► పుతిన్‌పైనున్న ఆరోపణలేంటి? ఉక్రెయిన్‌లో ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లల్ని చట్టవిరుద్ధంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి రష్యాకి దాదాపుగా 16,221 మంది తరలివెళ్లారని ఐక్యరాజ్య సమితి విచారణలో తేలింది. ఈ పిల్లల్ని తాత్కాలికంగా తరలిస్తున్నట్టు బయటకి చెబుతున్నారు. కానీ ఆ చిన్నారుల్ని రష్యాలో పెంపుడు కుటుంబాలకు ఇచ్చేసి వారిని శాశ్వతంగా రష్యా పౌరుల్ని చేస్తున్నారు. దీంతో ఉక్రెయిన్‌లో మిగిలిపోయిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది. ఇలా పిల్లల్ని తరలించడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం యుద్ధ నేరం కిందకే వస్తుంది. పిల్లల్ని తరలిస్తున్న సైనికుల్ని, ఇతర అధికారుల్ని నియంత్రించలేకపోయిన పుతిన్ యుద్ధ నేరస్తుడేనని ఐసీసీ చెబుతోంది. పుతిన్‌తో పాటుగా రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా లోవా బెలోవా కూడా సహనిందితురాలుగా ఉంది. ► పుతిన్ అరెస్ట్ అవుతారా? పుతిన్ సొంత దేశంలో అపరిమితమైన అధికారాలను అనుభవిస్తున్నారు. రష్యాలో ఉన్నంత కాలం ఆయన సేఫ్. ఐసీసీకి సొంత పోలీసు బలగం లేదు. ఏ పని చెయ్యాలన్నా సభ్యదేశాలపైనే ఆధారపడుతుంది. రష్యాను వీడి పుతిన్ వేరే దేశానికి వెళితే ఐసీసీ అరెస్ట్ చేయొచ్చు. ఈ అరెస్ట్ వారెంట్ల జారీతో ఆయన విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఏర్పడ్డాయి. అయితే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించడం తెలిసిందే. ఐసీసీ నోటీసులతో అంతర్జాతీయ సమాజం కూడా ఇక పుతిన్ కదలికలను నిశితంగా గమనిస్తుంది కాబట్టి ఆయన వేరే దేశం వెళితే మాత్రం అరెస్ట్ కాక తప్పకపోవచ్చు. ► విచారణ ఎదుర్కొంటారా? పుతిన్ విచారణకు కొన్ని అడ్డంకులున్నాయి. ఐసీసీని రష్యా గుర్తించడంలేదు. అమెరికా, రష్యా వంటి దేశాలు ఇందులో సభ్యులు కావు. ఐసీసీ విచారణ పరిధిని అగ్రరాజ్యం అమెరికా కూడా ఆమోదించడం లేదు. మరో అడ్డంకి ఏమిటంటే ఐసీసీ వాద, ప్రతివాదులిద్దరూ హాజరైతే తప్ప విచారణ కొనసాగించదు. ఎవరైనా విచారణకు గైర్హాజరైతే విచారణ ముందుకు సాగదు. పుతిన్‌ను విచారించాలంటే ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన దేశాల్లో విచారణ చేయొచ్చు. పుతిన్‌ను అలా వేరే దేశానికి తీసుకురావడం అసాధ్యం. ► ఉక్రెయిన్ యుద్ధంపై ప్రభావం ఎంత? ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న అరాచకాలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని మరోసారి పుతిన్‌కు స్పష్టంగా తెలిసేలా, అంతర్జాతీయ సమాజం దీనిపై ఆగ్రహంగా ఉందని సంకేతాలు ఇచ్చేలా ఈ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. అయితే రష్యా ఈ వారెంట్లను లెక్క చేయలేదు. తాము ఐసీసీని గుర్తించడం లేదు కాబట్టి ఆ వారెంట్లు చిత్తు కాగితంతో సమానమని మాస్కో పెద్దలు వ్యాఖ్యానించారు. పుతిన్ అధికార ప్రతినిధి ఒకరు ఈ వారెంట్లు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఐసీసీని ఏ మాత్రం పట్టించుకోని పుతిన్ ఈ వారెంట్లకి భయపడి ఉక్రెయిన్ అంశంలో వెనకడుగు వేస్తారని అనుకుంటే పొరపాటేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా ఏ దేశాల నేతలను శిక్షించారు? ► అరాచకాలు సృష్టించిన జర్మనీ నాజీ నాయకుల్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూరెంబర్గ్, టోక్యో ట్రైబ్యునళ్లలో విచారించి శిక్షించారు. నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు కుడిభుజంగా చెప్పుకునే రుడాల్ఫ్ హెస్కి జీవిత ఖైదు పడింది. ► బోస్నియా, రువాండా, కాంబోడియా దేశాల నాయకుల్ని కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లలో విచారించారు ► 1990లో యుగోస్లోవియా ముక్కలైనప్పుడు అక్కడ హింసాకాండను ప్రేరేపించిన ఆ దేశాధ్యక్షుడు స్లొబోదాన్ మిలోసెవిచ్‌ను ఐక్యరాజ్యసమితి హేగ్‌లో విచారించింది. తీర్పు వచ్చేలోపే ఆయన జైల్లో గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో ఏకంగా 90 మందికి శిక్ష పడింది. ► అత్యాచారాలను ప్రేరేపించిన లైబీరియా మాజీ అధ్యక్షుడు చార్లెస్ టేలర్‌కు 50 ఏళ్ల కారాగార శిక్ష విధించారు ► చాడ్ దేశం మాజీ నియంత హిస్సేని హాబ్రేకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ► ఐసీసీ ఏర్పాటయ్యాక 40 మందిపై నేరారోపణలు రుజువయ్యాయి. వీరంతా ఆఫ్రికా దేశాలకు చెందినవారు. ఏమిటీ ఐసీసీ? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) 1998లో ‘‘రోమ్ స్టాచ్యూట్’’ ఒప్పందం కింద ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది. అంతర్జాతీయ సమాజంపైనా, మానవత్వంపైన జరిగే తీవ్రమైన నేరాలు, మారణహోమాలు, యుద్ధనేరాలను విచారించి శిక్షలు విధిస్తుంది.రెండో ప్రపంచ యుద్ధం సమయంలో న్యూరెంబర్గ్ విచారణ తరహాలోనే ఐసీసీ ఏర్పాటైంది. ప్రస్తుతం బ్రిటన్, జపాన్, అఫ్గానిస్తాన్, జర్మనీ సహా 123 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నా యి. రష్యా, అమెరికా దీనిని గుర్తించలేదు. అదే విధంగా భారత్, చైనా కూడా సభ్యత్వాన్ని తీసుకోలేదు. తీవ్రమైన నేరాల విషయాల్లో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలు విచారణలో విఫలమైతే ఐసీసీ జోక్యం చేసుకుంటుంది. -
Imran Khan: తోషఖానా టు బందీఖానా! ఇమ్రాన్ అరెస్టయితే అంతర్యుద్ధమా?
పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తోషఖానా కేసులో తనపైనున్న నాన్‌బెయిలబుల్ వారెంట్లను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఇమ్రాన్ తనంతట తాను లొంగకపోతే మార్చి 18లోగా అరెస్ట్ చేసి కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని సెషన్స్ న్యాయమూర్తి జఫర్ ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేయాలని ఆదేశించామని మళ్లీ వారెంట్ల రద్దు పిటిషన్ ఎందుకు వేశారని న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. దీంతో ఇమ్రాన్ ఎదుట ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. శనివారం నాడు ఆయన అరెస్ట్ కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడానికి 10 రోజుల క్రితం పోలీసులు ప్రయత్నించినప్పట్నుంచి పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. పోలీసులు ఇమ్రాన్ నివాసానికి వెళ్లిన ప్రతీసారి ఆయన ఇంట్లో లేకపోవడం, కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ ఘర్షణకు దిగడం సర్వసాధారణంగా మారింది. ఏమిటీ తోషఖానా కేసు..? తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. 1974లో ఇది ఏర్పాటైంది. ప్రభుత్వ అధికారులకొచ్చే కానుకల్ని ఇందులోనే ఉంచుతారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవిని చేపట్టాక తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించారు. అంతేకాదు తనకు వచ్చిన కానుకల్ని ఎంతో కొంత ధర ఇచ్చి తోషఖానా నుంచి తీసుకొని వాటిని తిరిగి అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా 101 కానుకలు వచ్చాయి. 2018, సెప్టెంబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన వాటికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్ తీసుకున్నారని నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ముకున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు లేదు. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఏమంటోంది? ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా కేసు రిజిస్టర్ అయిన రెండు నెలల తర్వాత పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ ఆ కానుకల్ని అమ్ముకోవడం చట్ట వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఎంతో కొంత ధర చెల్లించి ఆయన ఆ కానుకల్ని తన సొంతం చేసుకున్నారని చెప్పింది. అయితే ఆయన అనైతికంగా ఈ పని చేస్తూ తప్పు దారి పట్టించే ప్రకటనలు చేశారంటూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌పై అయిదేళ్ల నిషేధం విధించింది. 37 కేసులు ఇమ్రాన్‌ఖాన్‌పై తోషఖానాతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 37 కేసులు నమోదయ్యాయి. ► పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) ప్రధాన ఎన్నికల అధికారి సికందర్ సుల్తాన్ రజాకు వ్యతిరేకంగా ఇమ్రాన్‌తో పాటు పీటీఐ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఒక కేసు నమోదైంది ► ఎన్నికల కమిషన్ అయిదేళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ అనర్హత వేటు వేసినప్పుడు ఈసీపీ కార్యాలయం ఎదుట నిరసనలు నిర్వహించడంపై కేసు దాఖలైంది ► పాకిస్తాన్ ఫారెన్ ఎక్స్ఛ్ంజ్ యాక్ట్ నియమాలను ఉల్లంఘిస్తూ విదేశాల నుంచి ఆర్థిక లావాదేవీలు నడిపారన్న ఆరోపణలపై కేసు ► పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ని ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించినందుకు కేసు ► పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేత మొహ్సిన్ షానావజా రంజా ఇమ్రాన్ ఆదేశాల మేరకే తనను పోలీసులు కొట్టి చంపడానికి వచ్చారంటూ హత్యా యత్నం కేసు పెట్టారు అరెస్టయితే అంతర్యుద్ధం తప్పదా..? ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయితే పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాను అరెస్ట్ అయితే ఏం చెయ్యాలన్న దానిపైనా ఇమ్రాన్ పక్కా ప్రణాళికతోనే ఉన్నారు. దానిని సరైన సమయంలో బయటపెడతానని ఆయన చెబుతున్నారు. తమ నేతపై చెయ్యి వేస్తే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆత్మాహుతి దాడులకి దిగుతామని ఇప్పటికే పార్టీ నాయకులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వానికి పీటీఐ కార్యకర్తల సవాల్ ఎదుర్కోవడం కూడా క్లిష్టంగా మారింది. మరోవైపు పంజాబ్ ర్యాలీలో ఇమ్రాన్‌పై దాడి జరిగిన దగ్గర్నుంచి ఆయనను హత్య చేస్తారన్న ఆందోళనలూ ఉన్నాయి. తనపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన ఇప్పటివరకు కోర్టు ఎదుట కూడా హాజరు కాలేదు. ప్రభుత్వ పెద్దలే తనను హత్య చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారంటూ ఇమ్రాన్ తనకు అనుమానం ఉన్న వారందరి పేర్లు వెల్లడిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తనని జైలుకు పంపినా, చంపేసినా ప్రభుత్వంపై పోరాటం ఆపవద్దంటూ అనుచరుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డీసీఎంను రీ డిజైన్ చేసి గంజాయి సరఫరా
నాగోలు: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు నిందితుల్లో నలుగురిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటిన్నర విలువ చేసే 400 కేజీల గంజాయి, కారు, డీసీఎం, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్బీనగర్లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన భానోత్ వీరన్న, శ్రీశైలానికి చెందిన కర్రే శ్రీశైలం, హైదరాబాద్‌కు చెందిన కేతావత్ శంకర్‌నాయక్, వరంగల్ జిల్లాకు చెందిన పంజా సురయ్యతో పాటు మురో ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గంజాయిని డీసీఎంలో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. డీసీఎం వాహనాన్ని రీ–డిజైన్ చేసి దాని కింద గంజాయిని దాచిపెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ముఠా సభ్యులు పలుమార్లు ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేశారు. ఈ క్రమంలో ఏపీలో కృష్ణదేవి పేట నుంచి డీసీఎంలో 400 కిలోల గంజాయి లోడ్ చేసుకుని అక్కడ నుంచి బయలు దేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి డీసీఎం ముందు కారులో ఇద్దరు వ్యక్తులు పైలట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పక్కా సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు శనివారం ఉదయం డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వలిగొండ–చౌటుప్పల్ చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని, కారు, లారీ, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐలు మల్లికార్జున్‌రెడ్డి, మహేష్, మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
చైనాలో ఉక్కుపాదం!
బీజింగ్: చైనాలో జీరో కొవిడ్ పాలసీపై దేశవ్యాప్తంగా తీవ్ర రూపు దాల్చిన ఆందోళనలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న తీరుతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉలిక్కిపడింది. వాటిని తక్షణం కట్టడి చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగింది. నిరసనలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులను పోలీసులు భారీ సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తక్షణం డిలీట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. లేదంటే నిర్బంధం తప్పదంటూ బెదిరిస్తున్నారు. ఆదివారం షాంఘైలో నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్టు ఎడ్ లారెన్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సందర్భంగా ఆయన్ను విచక్షణారహితంగా కొట్టడంతో పాటు తన్నారని బీబీసీ ఆరోపించింది. కొద్ది గంటల నిర్బంధం అనంతరం వదిలేశారు. ఆయన్ను పోలీసులు హింసించడం అవాస్తవమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లీ జియాన్ అన్నారు. తమ జీరో కోవిడ్ విధానం సరైందంటూ సమర్థించుకున్నారు. మీడియా చెబుతున్న స్థాయిలో నిరనసలు జరగడం లేదంటూనే, ‘‘జనాల్లో కాస్తంత వ్యతిరేకత ఉండొచ్చు. అందుకే క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా జీరో కొవిడ్ విధానంలో మార్పులు తెస్తున్నాం’’ అని అంగీకరించారు. మరోవైపు కరోనా ఆంక్షలపై దేశమంతటా జనాగ్రహం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్, దేశంలో అతి పెద్ద నగరం షాంఘైతో పాటు పలు నగరాల్లో ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ వీధుల్లోకి వచ్చి ఆంక్షలపై గళమెత్తుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై అణచివేత చర్యలకు దిగొద్దని చైనాకు ఐక్యరాజ్యసమితి హితవు పలికింది. వారి హక్కులను గౌరవించాలని సూచించింది. మళ్లీ 40 వేల కేసులు మరోవైపు సోమవారం చైనాలో 39,452 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బీజింగ్‌లో వరుసగా ఐదో రోజూ 4,000 కేసులొచ్చాయి. లాక్డౌన్లు, సరకు రవాణా ఆంక్షల కారణంగా ప్రస్తుతం 41.2 కోట్ల మంది ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నట్లు బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనావేసింది. వైట్ పేపర్ రివల్యూషన్ దేశంలో తమకు ఏ మాత్రమూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని చెప్పేందుకు చైనా యువత, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు ప్రతీకాత్మకంగా తెల్ల కాగితాలను ప్రదర్శిస్తున్నారు. ‘వైట్ పేపర్ రివల్యూషన్’ పేరుతో ఇది దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. అలెక్స్ డిమినార్‌ను ఓడించి 122 ఏళ్ల డేవిస్‌కప్ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్ అందించాడు. 2019లో కెనడా ఫైనల్‌కు చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. -
తండ్రిని బతికించుకునేందుకు... చిన్నారిని బలివ్వబోయింది!
న్యూఢిల్లీ: మూఢ నమ్మకాల మాయలో ఓ పాతికేళ్ల మహిళ ఒక పసికందునే బలివ్వబోయిన దారుణం ఢిల్లీలో వెలుగుచూసింది. ఇటీవల కన్నుమూసిన తండ్రి నవజాత మగ శిశువును బలిస్తే బతికొస్తాడని ఎవరో చెప్పడంతో ఇంతటి ఘోరానికి పాల్పడబోయింది. మామ్‌రాజ్ మొహల్లా దగ్గర నివసించే దంపతులకు రెండు నెలల బాబున్నాడు. శ్వేత అనే పాతికేళ్ల మహిళ వారితో పరిచయం పెంచుకుంది. ఎన్జీవోలో పనిచేస్తానని, పిల్లాడికి ఉచితంగా మందులిస్తానని నమ్మబలికి ఇంటికి రోజూ వచ్చిపోతూ దగ్గరైంది. బుధవారం పిల్లాడిని సరదాగా తిప్పుతానంటూ బయటకు తీసుకెళ్లింది. వెంట వచ్చిన పసికందు బంధువుకు క్రూల్డ్రింక్లో మత్తుమందు కలిపిచ్చి వదిలించుకుని బాబుతో పరారైంది. బంధువు బాబు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా శ్వేత జాడ కనిపెట్టారు. ఆమెను అరెస్ట్‌చేసి పసికందును తల్లిదండ్రులకు అప్పజెప్పారు. బాలున్ని కాపాడుతూ కేసును 24 గంటల్లోపే చేధించిన పోలీసులకు ప్రశంసలు దక్కాయి. -
దేశంలో అలాంటి అరెస్టులే అత్యవసర సమస్యలు: సీజేఐ
జైపూర్: దేశంలో తొందరపాటు, విచక్షణారహితంగా చేసే అరెస్టులు, బెయిల్ పొందటంలో ఇబ్బందులు, ట్రయల్స్‌లో దీర్ఘకాలం జైలులో ఉంచటం వంటివి ప్రస్తుతం అత్యవసర సమస్యలుగా పేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీల సమక్షంలో మాట్లాడారు. ఏ కేసును చూపకుండానే భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలోని ప్రక్రియ ప్రజలకు శిక్షగా అభివర్ణించారు. 'సవాళ్లు చాలా ఉన్నాయి. మన నేర న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రక్రియ ఒక శిక్షగా మారింది. తొందరపాటు, విచక్షణారహితంగా చేసే అరెస్టుల నుంచి.. బెయిల్ పొందటంలో ఇబ్బంది, ట్రయల్స్‌లో ఉన్న వారు ఎక్కువ కాలం జైలులో ఉండటం వరకు ఇవన్నీ అత్యవసర సమస్యలే. నేర న్యాయ వ్యవస్థ పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం. పోలీసులకు శిక్షణ ఇవ్వటం, జైలు వ్యవస్థను ఆధునికీకరించటం వంటి వాటితో పరిపాలన సామర్థ్యాన్ని పెంచవచ్చు.' అని పేర్కొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఈ సమస్యలపై నాల్సా(నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ), లీగల్ సర్వీసెస్ అథారిటీలు దృష్టి సారించి ఏ విధంగా పరిష్కరించవచ్చో చూడాలన్నారు. జైళ్లలో మగ్గుతున్న వారిని త్వరితగతిన విడుదల చేసేందుకు 'బెయిల్ యాక్ట్' తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం ఆ వాదనలను జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారకూడదు.. రాజకీయ వ్యతిరేకత అనేది శత్రుత్వం, శాసన పనితీరు నాణ్యతపై ప్రభావం చూపే విధంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారకూడదని సూచించారు. ఇటీవల అలాంటి సంఘటనలు వెలుగు చూశాయని, అవి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం సూచనలు కావన్నారు. ఇదీ చదవండి: Vice President Election 2022: వీడిన సస్పెన్స్.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ -
మహారాష్ట్రలో కెమిస్ట్ దారుణ హత్య
నాగపూర్: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో దారుణం జరిగింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశాడన్న కారణంతో 54 ఏళ్ల కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు కొల్హేను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. జూన్ 21న ఈ సంఘటన జరిగిందని, ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్టు చేశామని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తీసింగ్ శనివారం తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ (32)ను నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కంటే వారం ముందే ఉమేశ్ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచినందుకు కన్హయ్యలాల్‌ను ఇద్దరు వ్యక్తులు పొడిచి చంపేసిన సంగతి తెలిసిందే. ఉమేశ్ అమరావతి సిటీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్‌ల్లో ఒక పోస్టును షేర్ చేశాడని పోలీసులు చెప్పారు. సదరు గ్రూపుల్లో అతడి కస్టమర్లతోపాటు కొందరు ముస్లింలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉమేశ్‌పై కక్ష పెంచుకున్న ఇర్ఫాన్ ఖాన్ అతడిని హత్య చేయాలని పథకం రచించాడని, ఇందుకోసం ఐదుగురిని రంగంలోకి దింపాడని తెలిపారు. హత్య చేస్తే రూ.10,000 ఇస్తానని, పోలీసులకు దొరక్కుండా పారిపోవడానికి కారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడని వివరించారు. జూన్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దుకాణం మూసివేసి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఉమేశ్‌ను మెడపై పదునైన కత్తితో నరికి, హత్య చేశారని వెల్లడించారు. నిందితులంతా కూలీలు.. ఉమేశ్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ ఖాన్, ముదాసిర్ అహ్మద్(22), షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫిక్(24), షోయబ్ ఖాన్(22), అతీబ్ రషీద్(22)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. వీరంతా అమరావతి వాసులేనని, రోజు కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య దృశ్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అమరావతికి ఎన్ఐఏ బృందం అమరావతిలో కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు హత్యపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. ఉమేశ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్ఐఏ బృందం శనివారం అమరావతికి చేరుకుంది. ఆదివారం నుంచి దర్యాప్త చేపట్టనుంది. మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) టీమ్ కూడా ఔరంగబాద్ నుంచి అమరావతికి వచ్చింది. ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్ హత్యపై ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. కన్హయ్య కుటుంబానికి రూ.కోటి విరాళంగా సమకూర్చి అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. -
Secunderabad Agnipath Protest: విధ్వంసం పై కొనసాగుతున్న దర్యాప్తు
-
జగ్గారెడ్డిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు
-
బుల్డోజర్లు, కూల్చివేతలు
లక్నో/కోల్‌కతా/రాంచీ: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో రెండు రోజులుగా అల్లర్లు చెలరేగిన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రశాంతత నెలకొంటోంది. చాలా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఎత్తేసి, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నారు. బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత సువేందును అధికారులు అడ్డుకున్నారు. యూపీలో అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న వారి అరెస్టులు, అనుమానితుల ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాంచీలో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌కు మహారాష్ట్రలోని భివాండీ పోలీసులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం పలు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లను బీజేపీ అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఖండించింది. వాటిలో పాల్గొన్న వారిని ఇస్లాం నుంచి వెలి వేయాలని మంచ్ వ్యవస్థాపకుడు, ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ డిమాండ్ చేశారు. దేశంలో పెరుగుతున్న విద్వేష ప్రసంగాలు, ఇస్లాం విద్వేష ఘటనలపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ నేత శిశిథరూర్ అన్నారు. యూపీలో బుల్డోజర్లు యూపీలో శుక్రవారం నాటి అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న వారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సహరన్‌పూర్‌లో రాళ్లు రువ్వి న ఘటనలకు సూత్రధారిగా అనుమానిస్తూ ఇద్దరి ఇళ్లను అధికారులు శనివారం నేలమట్టం చేయడం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌లో రాళ్లు రువ్విన ఘటనల్లో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జావెద్ అహ్మద్ అనుమతుల్లేకుండా కట్టిన ఇంటిని ఆదివారం బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ‘శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది. చట్ట వ్యతిరేక చర్యలకు దిగేవారు దీన్ని గుర్తుంచుకోవాలి’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. అల్లర్లకు సంబంధించి మొత్తం 316 మందిని అరెస్ట్ చేశారు. బెంగాల్లో హైడ్రామా శుక్రవారం అల్లర్లకు సంబంధించి బెంగాల్‌లోని ముర్షిదాబాద్, హౌరా జిల్లాలకు చెందిన 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. పూర్బ మేదినీపూర్ జిల్లాలోని తామ్లుక్‌లో ఆదివారం ఉదయం హైడ్రామా నడిచింది. హౌరాలోని అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకున్నారు. రెండు గంటల అనంతరం నేరుగా కోల్‌కతాకు వెళ్లాలన్న షరతుతో ఆయన్ను వదిలేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. హింసకు పాల్పడినట్లు గుర్తించిన 22 మందితోపాటు, గుర్తు తెలియని వేలాది మందిపై 25 కేసులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో 144వ సెక్షన్ ఎత్తివేశారు. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. కశ్మీర్‌లోని పలు పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. -
కాన్పూర్ హింస..800 మందిపై కేసులు
కాన్పూర్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు 800 మందికి పైగా కేసులు నమోదు చేశారు. వీరిలో 24 మందిని అరెస్ట్ చేసి, 12 మందిని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర వీడియో రికార్డింగ్‌ల ఆధారంగా హింసకు పాల్పడిన 36 మందిని గుర్తించామని కాన్పూర్ పోలీస్ కమిషనర్ వీఎస్ మీనా వెల్లడించారు. బేకన్‌గంజ్ ఎస్‌హెచ్‌వో నవాబ్ అహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ అసిఫ్ రజా ఫిర్యాదుల వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఘర్షణలకు సూత్రధారిగా అనుమానిస్తున్న మౌలానా మొహమ్మద్ అలీ(ఎంఎంఏ)జౌహార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా గ్రూప్ చీఫ్ హయత్ జఫర్ హస్మితోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తదితర సంస్థలతో లింకులున్నట్లు తేలితే కఠినమైన జాతీయ భద్రతా చట్టంతోపాటు గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కమిషనర్ మీనా వెల్లడించారు. విదేశీ నిధులు అందాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కుట్రదారుల ఆస్తులను జప్తు చేస్తామన్నారు. ఇటీవల ఓ టీవీలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ నేత నూపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ శుక్రవారం కాన్పూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొందరు దుకాణాలను మూసివేయించేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులు సహా మొత్తం 40 మంది గాయపడ్డారు. -
అమ్నీషియా పబ్ కేసు: ఇంట్లో డ్రాప్ చేస్తామంటూ బాలికను కారులో తీసుకెళ్లిన నిందితులు
-
నా భార్యను చంపేశాను.. డయల్ 100కు ఫోన్ చేసి..
అర్ధరాత్రి దాటింది. ఊళ్లన్నీ నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో ఓ వ్యక్తి 100 నంబర్‌కు ఫోన్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన పోలీసులతో ‘నా భార్యను చంపేశాను. నన్ను తీసుకెళ్లండి’ అంటూ చెప్పాడు. విన్న పోలీసులకు ఓ క్షణం ఏమీ అర్థం కాలేదు. ఆకతాయిలు ఎవరైనా ఫోన్ చేశారా..? నిజంగానే హత్య జరిగిందా..? అని ఆలోచించారు. ఏమై ఉంటుందో అని అవతలి వ్యక్తి చెప్పిన అడ్రస్‌కు వెళ్లి చూసి నిశ్చేషు్టలయ్యారు. నిద్రపోతున్న భార్యను గొంతు నులిమి చంపేసిన ఓ ప్రబుద్ధుడు తాపీగా పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలం పూడివలసలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం పూడివలస గ్రామానికి చెందిన జరుగుళ్ల రామా రావు (ఆనంద్ పాల్) భార్య నాగరత్నం(45)ను మంగళవారం రాత్రి హత్య చేశాడు. రామారావు పాస్టర్‌గా పనిచేస్తున్నారు. నాగరత్నం ఫరీదుపేట సచివాలయం ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. పూడివలసలో నివాసం ఉంటూ ఫరీదుపేట రాకపోకలు సాగిస్తుంటారు. రామారావు రోజూ భార్యను బైక్‌పై సచివాలయం వద్ద దించి సాయంత్రం పూట మళ్లీ ఇంటికి తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని రోజులుగా రామారావు ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయనకు సాయంత్రం అయితే కనిపించదు. తొమ్మిదేళ్ల కిందట పెళ్లి చేసుకున్న వీరికి ఆరేళ్ల రాజ్‌కుమార్ పాల్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలలుగా ఈ దంపతుల మధ్య మనస్ఫర్థలు తలెత్తాయి. చీటి కీ మాటికీ గొడవలు పడడం ప్రారంభించారు. నాగరత్నంను కన్నవారింటికి వెళ్లవద్దని రామా రావు చెబుతుండేవాడు. అయినా ఆమె టెక్కలి సమీపంలోని నందిగాంలోని కన్నవారికి వెళ్లడంతో అప్పట్లో ఓ సారి చేయి చేసుకున్నాడు కూడా. తన మాట వినడం లేదని తరచూ ఆమెపై ఆంక్షలు పెట్టేవాడు. దీంతో కుటుంబ కలహాలు పెచ్చుమీరాయి. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గంటల కొద్దీ వాదించుకున్నాక.. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్న భార్యను రామారావు గొంతు నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక క్రైమ్ స్టాపర్ 100కు ఫోన్ చేసి తాను భార్యను చంపేశానని, తనను తీసుకోపోవాలని తానే సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంశయిస్తూనే సంఘటన స్థలానికి వచ్చారు. ఇంటిలోకి వెళ్లి చూస్తే నాగరత్నం మృతదేహం మంచంపై పడి ఉంది. దీంతో హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. శవ పంచనామా నిర్వహించి అనంతరం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పాపం కుమారుడు.. రాత్రి పడుకున్నప్పుడు పక్కనే ఉన్న అమ్మ ఉదయానికి మృతదేహంగా మారడంతో కుమారుడు రాజ్‌కుమార్ కన్నీరుమున్నీరయ్యాడు. అమ్మ కావాలంటూ గుక్కపట్టి ఏడిచాడు. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లి గారాబంగా పెంచుకుంది. అమ్మ హత్యకు గురి కావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో కుమారుడి పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. ప్రస్తుతం అతడిని అమ్మమ్మ, తాతయ్యలు తీసుకువెళ్లారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని నందిగాం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్..
Youtuber Karthik Gopi Nath Arrested For Cheating Rs 44 Lakh: ఆలయాల పునరుద్ధరణ పేరుతో రూ. 44 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన యూట్యూబర్, బీజేపీ మద్దతుదారుడు కార్తీక్ గోపీనాథ్‌ను ఆవడి పోలీసులు సోమవారం (మే 30) అరెస్టు చేశారు. ఆవడిలో స్టూడియాతోపాటుగా యూట్యూబ్ చానల్‌ను కార్తీక్ నడుపుతున్నాడు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన కార్తీక్‌పై దేవదాయ శాఖ కన్నెర్ర చేసింది. పెరంబలూరులో రెండు ఆలయాల పునరుద్ధరణ కోసం అంటూ.. కార్తీక్ విరాళాల్ని సేకరించాడు. ఇందులో ఒకటైన మదుర కాళి అమ్మన్ ఆలయం దేవదాయశాఖ పరిధిలో ఉంది. కాగా అనుమతి లేకుండా వసూళ్లకు పాల్పడినందుకు సంబంధిత అధికారులు ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు రూ. 44 లక్షల మేరకు వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో కార్తీక్‌ను అరెస్టు చేశారు. అంబత్తూరు కోర్టు అతనికి జూన్ 13 వరకు రిమాండ్‌కు విధించింది. చదవండి:👇 తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్ అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చిక్కుల్లో మరో ఐఏఎస్..: ఇంజనీర్లపై బూతులు, అరెస్టు
శ్రీనగర్: కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఢిల్లీలో స్టేడియాన్నే ఖాళీ చేయించి, చివరికి శంకరగిరి మాన్యాలు పట్టిన ఓ ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకాన్ని మర్చిపోకముందే అలాంటిదే మరో ఉదంతం తెరపైకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కుడి భుజంగా చెప్పే ఐఏఎస్ అధికారి నితేశ్వర్ కుమార్ తమను అకారణంగా బూతులు తిట్టడమే గాక అక్రమంగా అరెస్టు చేయించారంటూ సీపీడబ్ల్యూడీ ఇంజనీర్లు ఆరోపించారు. అమర్నాథ్ ఆలయ బోర్డు సీఈఓ అయిన నితేశ్వర్ మే 25న స్థానిక నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘‘పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఆ సందర్భంగా ఇంజనీర్లపై ఆయన అకారణంగా ఆగ్రహించారు. సంయమనం కోల్పోయి నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా తన వెంట ఉన్న ఎస్పీని ఆదేశించి ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు కూడా చేయించారు’’ అని ఇంజనీర్లు చెప్పారు. నితేశ్వర్ తీరును సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆయనను అరెస్టు చేయాలని కోరుతూ కేంద్ర హౌజింగ్ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి లేఖ రాసింది. -
అమలాపురం ఘటన కేసులో టీడీపీ,జనసేన నేతల అరెస్ట్
-
జ్ఞానవాపి మసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. హిస్టరీ ప్రొఫెసర్ అరెస్ట్
వారణాసిలోని జ్ఞానవాపి మసీదుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జ్ఞాన్వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగిన విషయం తెలిసిందే. ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమని బెంచ్.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు.. ట్రయల్ జడ్జి కంటే అనుభవం ఉన్న జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో జ్ఞాన్వాపి మసీదు విషయంపై ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ హిస్టరీ సబ్జెక్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్ సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో..‘‘దేశంలో మీరు దేని గురించి మాట్లాడినా.. అది మరొకరి సెంటిమెంట్‌ను దెబ్బతిస్తుంది. ఇది కొత్తేమీ కాదు. నేను చరిత్రకారుడిని, అనేక పరిశీలనలు చేశాను. నా పరిశీలనలో నేను అన్వేషించిన వాటి గురించి రాశాను. నన్ను నేను రక్షించుకుంటాను’’ అని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ లాయర్ వినీత్ జిందాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ కింద ప్రొఫెసర్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ సైబర్ పోలీసులు తెలిపారు. ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నట్లు లాయర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జ్ఞాన్వాపి మసీదు సమస్యపై తాను కామెంట్స్ చేసిన తర్వాత తన 20 ఏళ్ల కుమారుడికి ఫేస్బుక్ మెసెంజర్లో బెదిరింపులు వస్తున్నాయని రతన్ లాల్ తెలిపారు. లాల్ తన టీచింగ్ ఉద్యోగంతో పాటు, దళిత సమస్యలపై దృష్టి సారించే ‘అంబేద్కర్నామా’ అనే న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు.. రతన్ లాల్ అరెస్ట్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా.. ‘‘ప్రొఫెసర్ రతన్ లాల్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగబద్ధమైన అభిప్రాయం, భావ వ్యక్తీకరణ హక్కు ఆయనకు ఉంది.’’ అంటూ దిగ్విజయ్ కామెంట్స్ చేశారు. I strongly condemn Prof Ratn Lal’s arrest. He has the Constitutional Right of opinion and expression. @INCIndia https://t.co/gupumAwuXr — digvijaya singh (@digvijaya_28) May 21, 2022 ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదు పిటిషన్: వీడిన సస్పెన్స్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు -
పాక్ మహిళ హనీట్రాప్.. భారత ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఏం చేశాడంటే..
దేశంలో ఇప్పటికి ఎన్నో హనీట్రాప్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో హనీట్రాప్ ఉదంతం కలకలం సృష్టించింది. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ.. భారత వైమానిక దళానికి చెందిన అధికారిని హనీట్రాప్ చేసింది. దీంతో సదరు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. పాక్‌కు చెందిన మహిళ హనీ ట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మపై ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు.. సోషల్ మీడియాలో శర్మను పాక్ మహిళ ట్రాప్ చేసినట్టు గుర్తించారు. దేవేంద్ర శర్మను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శర్మ ద్వారా దేశ భద్రతకు సంబంధించిన వివరాలు లీక్ అవుతున్నట్టు తెలుసుకున్నారు. మే 6న కస్టడీలోకి తీసుకోగా.. మే 12న (గురువారం) విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ విచారణలో భాగంగా శర్మ నుంచి ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, దేవేంద్ర శర్మ.. ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో శర్మను సర్వీస్ నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వైద్యుల నిర్వాకం.. బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి.. -
వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ చీటర్ వంశీకృష్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా.. సోమవారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, ఉద్యోగాల పేరిట వంశీకృష్ణ దాదాపు రూ. 5కోట్ల వరకు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో 500 మంది యువతులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఆన్లైన్లో వితంతువులు, విడాకులు పొందిన మహిళలనే వంశీకృష్ణ టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేవాడు. అయితే, వంశీకృష్ణ.. స్కీంల పేరుతో అటు ప్రజా ప్రతినిధులను సైతం మోసం చేశాడనే ఆరోపణలున్నాయి. -
కాబోయే భర్తే కదా అని దగ్గరైంది.. ఆ తర్వాత సీక్రెట్ ఫొటోలు..
శృంగవరపుకోట రూరల్: ప్రేమ పేరుతో సహోద్యోగినిని లోబరుచుకుని.. పెళ్లికి నిరాకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విజయనగరం ఏఎస్పీ అనిల్ పులిపాటి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.కోట మండలం వేములాపల్లి గ్రామానికి చెందిన శీరెడ్డి నవీన్ మండలంలోని ముషిడిపల్లి గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిని ప్రేమిస్తున్నానంటూ చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా నవీన్ చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాధిత యువతి అడిగితే, ఇంటి నిర్మాణం జరుగుతోందని.. పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పించుకున్నాడు. అలాగే ఇంటి నిర్మాణానికి నగదు అవసరమని, కట్నం కావాలని యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి తండ్రి గట్టిగా నిలదీస్తే మొదట్లో మహిళా ఉద్యోగినితో తీసుకున్న అభ్యంతరకర ఫోటోలను అతని ఫోన్‌కు పంపించాడు. దీంతో నవీన్‌పై బాధిత యువతి ఎస్.కోట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు నవీన్‌ను అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. సీఐ ఎస్. సింహాద్రినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు జె.తారకేశ్వరరావు, జి.లోవరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: విందు కోసం ఆహ్వానిస్తే.. ఆమె లవర్ ఎంత పని చేశాడు.. -
నిమిషాల్లోనే... రూ. 2 లక్షల కోట్లు హుష్
న్యూఢిల్లీ: ‘మా అరెస్టయ్యారు’ అంటూ వచ్చిన ఒక వార్త మంగళవారం అలీబాబా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో కంపెనీ మార్కెట్ విలువ ఉదయం సెషన్లో నిమిషాల వ్యవధిలోనే 26 బిలియన్ డాలర్ల మేర (రూ.2 లక్షల కోట్లు/ మార్కెట్ విలువలో 10%) తుడిచిపెట్టుకుపోయింది. మా అరెస్ట్‌కు సంబంధించి ఆ తర్వాత స్పష్టత రావడంతో పడిన షేరు కోలుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసింది. మా అంటే అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా అని పొరపడ్డారు ఇన్వెస్టర్లు. ప్రముఖ వ్యాపార వేత్త అయిన జాక్‌మా గ్రూపు కంపెనీలపై చైనా సర్కారు 2020 నుంచి ఉక్కుపాదం మోపడం తెలిసిందే. ఒక వ్యక్తి శక్తిగా మారకూడదన్న విధానాన్ని అక్కడి కమ్యూనిస్ట్ సర్కారు పాటిస్తోంది. దీంతో నాటి నుంచి జాక్‌మా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు వచ్చింది లేదు. ఈ క్రమంలో మా అరెస్ట్ అంటూ వార్త రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇది వార్తా కథనం.. చైనా అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం (మే 3) ఒక వార్తను ప్రచురించింది. జాతీయ భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఐటీ డైరెక్టర్ మా అనే వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. జాక్‌మా ఈ కామర్స్ కంపెనీ అలీబాబా ప్రధాన కేంద్రం కూడా అదే పట్టణంలో ఉండడం గమనార్హం. ఇన్వెస్టర్లు పొరపడడానికి ఇది కూడా ఒక అంశమే. ‘‘విదేశీ శక్తులతో చేతులు కలిపి, రాష్ట్రాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినట్టు అనుమానాలపై ఇంటి పేరు ‘మా’ కలిగిన వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో స్టేట్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది’’అంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. దీంతో నిమిషాల్లోనే అలీబాబా షేరు హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 9.4% పడిపోయింది. అదే రోజు గ్లోబల్ టైమ్స్ అదే అంశానికి సంబంధించి మరో కథనాన్ని ప్రచురించింది. అరెస్ట్ అయిన వ్యక్తి పేరులో 3 అక్షరాలు ఉన్నట్టు పేర్కొంది. అరెస్ట్ అయిన వ్యక్తి స్థానిక ఐటీ కంపెనీలో హార్డ్‌వేర్ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు, 1985లో జన్మించినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షేరు రికవరీ అయింది. కాకపోతే పడినప్పుడు కంగారుతో అమ్ముకున్నవారే నిండా నష్టపోయారు. అలీబాబా గ్రూపు అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకడైన జాక్‌మా 2020 నవంబర్ నుంచి కనిపించింది లేదు. చైనా జాతీయ బ్యాంకులపై ఆయన విమర్శలు చేశాక సర్కారు ఆయన్ను నిర్బంధించిందన్న వార్తలూ వచ్చాయి. -
గర్ల్‌ఫ్రెండ్ ఫిర్యాదుతో సీరియల్ నటుడి అరెస్ట్.. ఎందుకంటే ?
Odia Serial Actor M Suman Kumar Arrested For Cheating Girlfriend Case: సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన హీరోయిన్లు చాలానే ఉన్నారు. ఇటీవల కాలంలో వారు ఒక్కొక్కరిగా వారికి జరిగిన అన్యాయాలను బయటపెడుతున్నారు. అలాగే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న పెద్ద పెద్ద మేల్ సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. తాజాగా ఒక టీవీ సీరియల్ నటుడు ప్రేమ, పెళ్లి పేరు చెప్పి శారీరకంగా లొంగదీసుకుని, మోసం చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఒడియా టీవీ సీరియల్లో నటించే ఎం సుమన్ కుమార్‌ను భువనేశ్వర్‌లోని పహాలా పోలీసులు ఆదివారం (ఏప్రిల్ 24) అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ అమ్మాయిని మోసం చేశాడనే ఆరోపణలతో సుమన్ కుమార్‌పై కేసు నమోదు అయింది. నటుడు ఎం సుమన్ గత రెండేళ్లుగా అమ్మాయితో సంబంధం కొనసాగిస్తున్నట్లు బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశాంత్ దే తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకున్నాడన్నారు. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ముఖం చాటేశాడని ఆయన పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 376 (2) (ఎన్), 420, 294, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. చదవండి: ఆ నటుడికి 61 ఏళ్లు.. రెండేళ్ల వివాహ బంధానికి విడాకులు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అమ్మాయిపై దాడి.. రెండోసారి అరెస్టయిన హీరో..
The Flash Hero Ezra Miller Arrested For Second Time In Assault Case: సూపర్ హీరో పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ హీరో ఎజ్రా మిల్లర్. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 'ది ఫ్లాష్' హీరో అంటే మాత్రం సినీ ప్రియులు టక్కున గుర్తు పట్టేస్తారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ ప్రొడ్యూస్ చేసిన 'జస్టీస్ లీగ్' చిత్రంలోని ఓ పాత్ర పేరే 'ది ఫ్లాష్'. ఈ క్యారెక్టర్లో నటించిన ఎజ్రా మిల్లర్ సినీ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ప్రస్తుతం ఈ హీరో న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. పహోవాలోని ఒక ప్రైవేట్ నివాసంలో ఓ పార్టీలో జరిగిన సంఘటనపై నమోదైన కేసులో మంగళవారం (ఏప్రిల్ 19) మిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 19న ఉదయం ఒంటి గంటకు ఒక ప్రైవేట్ పార్టీ జరిగింది. ఆ పార్టీలో ఓ 26 ఏళ్ల మహిళ మిల్లర్‌ను అక్కడి నుంచి వెళ్లమని కోరింది. దీంతో కోపోద్రిక్తుడైన మిల్లర్ ఆమెపై కుర్చీ విసరగా.. ఆమె తలకు దెబ్బ తగిలింది. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదుతో మిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై ఉదయం 4 గంటలకు విడుదల చేశారు. అయినప్పటికీ ఆ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని పోలీసులు తెలిపినట్లు సమచారం. ఇదిలా ఉంటే ఇదివరకూ కూడా మిల్లర్ ఇలాగే అరెస్ట్ అయ్యాడు. చదవండి: ఇప్పటికే 9 మంది భార్యలు, మరో ఇద్దరు కావాలట.. ఆ కోరిక తీర్చుకోవాలట మార్చి 28న హవాయిలో ఉన్న హోనోలులులోని ఒక బార్లో 23 ఏళ్ల మహిళా సింగర్‌తో అసభ్యంగా ప్రవర్తించడం, ఓ వ్యక్తిపై దాడికి ప్రయత్నించిన కారణంగా ఎజ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 500 డాలర్ల ఫైన్‌తో విడుదల చేశారు. ఇది జరిగి నెల గడవకముందే మరోసారి అరెస్టయ్యాడు ఈ ఫ్లాష్ హీరో. ఎజ్రా మిల్లర్ హ్యారీపోటర్ సిరీస్‌కు ప్రీక్వేల్గా తెరకెక్కిన 'ఫెంటాస్టిక్ బీస్ట్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్ డోర్' సినిమాతో వరల్డ్‌వైడ్‌గా గుర్తింపు పొందాడు. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. -
ఏడాదిగా వివాహేతర సంబంధం.. పిక్నిక్ పేరుతో ఆమెను అక్కడికి పిలిచి..
భోపాల్: సమాజంలో యువతులు, మహిళలపై రోజురోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొందరు మృగాలు నమ్మించి మహిళలను లొంగదీసుకుంటున్నారు. పిక్నిక్ పేరుతో ఓ మహిళను వంచించి చివరకు ఆమెకు విషం తాగించి.. బాధితురాలు చావుకు ముగ్గురు కారణమయ్యారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ(28)తో షాదబ్ ఉస్మాన్ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఏడాదిగా వారి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. కాగా, పిక్నిక్ పేరుతో ఆమెను.. నిందితుడు షాదోల్ జిల్లాలోని క్షీర్సాగర్ తీసుకెళ్లాడు. అక్కడికి ఉస్మాన్ స్నేహితులు రాజేష్ సింగ్, సోనూ జార్జ్ సైతం వచ్చారు. ఈ క్రమంలో వారు ఫుల్‌గా మద్యం సేవించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పైశాచికత్వంతో బలవంతంగా ఆమెకు విషం తాగించారు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆమె చనిపోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నివేదికలో ఆమెపై లైంగిక దాడి చేసి, విష ప్రయోగం జరిగినట్టు వైద్యులు తేల్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించారు. -
అవినీతిపరుడి కోసం టీడీపీ తాపత్రయపడుతోంది: మంత్రి కొడాలి నాని
-
ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్లు సంపాదించాడు: మంత్రి కొడాలి నాని
-
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్.. టీడీపీలో మొదలైన హైటెన్షన్
-
గెయిల్ డైరెక్టర్ రంగనాథన్ అరెస్ట్
న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్‌గేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్‌ను ఇరువులు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్ఐఆర్ తెలిపింది. సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్ సహాయకుడు ఎన్ రామకృష్ణన్ నాయర్ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో రంగనాథన్, నాయర్లతోపాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్‌కు చెందిన సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్‌కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. -
పెంపుడు కుక్కకు బర్త్‌డే పార్టీ... లాకప్‌లో యజమానులు
అహ్మదాబాద్: ముచ్చట పడి పెంచుకున్న కుక్కకు ఘనంగా పుట్టినరోజు చేయాలనుకున్నారు. బంధుమిత్రులను పిలిచి కేక్ కట్ చేసి హంగామా చేశారు. అదే వారిని చిక్కుల్లో పడేసింది. అహ్మదాబాద్‌కు చెందిన చిరాగ్ పటేల్, ఉర్విష్ పటేల్‌లు సోదరులు. క్రిష్ణానగర్ ప్రాంత వాసులు. శుక్రవారం రాత్రి తమ ఫ్లాట్‌లో అబ్బీ (కుక్క పేరు... ఇండియన్ స్పిట్జ్ జాతికి చెందినది)కి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. జానపద గాయకుడితో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. పెద్దసంఖ్యలో అతిథులు హాజరుకావడంతో కోవిడ్–19 ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన వీరిపై పోలీసులు కన్నెర్ర చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి చిరాగ్, ఉర్విష్లపై కేసు కట్టి అరెస్టు చేశారు. దగ్గరుండి పార్టీ ఏర్పాట్లు చూసిన వీరి మిత్రుడు దివ్వేశ్ మెహారియాను జైల్లో వేశారు. -
ఇళ్లు కొనుగోలు పేరుతో రూ.8 లక్షలు కాజేసి వ్యక్తి పరార్!
పాయకాపురం(విజయవాడరూరల్): ఇంటి కొనుగోలు పేరుతో డబ్బులు తీసుకొని పరారైన వ్యక్తిపై నున్న పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. శాంతినగర్‌లో నివసించే కసుకుర్తి అనంతలక్ష్మి టైలర్‌గా పనిచేస్తుంది. ఆమె భర్త ఆర్టీసీ డ్రైవర్. వీరి ఇంట్లో అద్దెకుండే కుడుముల పాండురంగారావు అనే వ్యక్తి ఇల్లు కొనాలని అనంతక్ష్మి వద్ద రూ.8 లక్షల 60 వేలు తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చి నెల రోజులు గడిచినా తిరిగి చెల్లించకపోవడంతో దంపతులు నిలదీశారు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పాండురంగారావు పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు పేకాటరాయుళ్ల అరెస్టు.... నున్న గ్రామం గొల్లవాని కుంట వద్ద పేకాడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి రూ.1960 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. గాయపర్చిన వ్యక్తి పై కేసు.... చికెన్ పకోడి తింటున్న వ్యక్తి పిలిచిన వెంటనే రాలేదని కోపం వచ్చిన మరో వ్యక్తి రాయితో గాయపర్చినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. పైపులరోడ్డు సెంటర్లో ఆటోలకు టేప్ రికార్డులను బిగించే పనిచేసుకుంటున్న షేక్ ఖాదర్ 4వ తేదీన ఓ బండి వద్ద చికెన్ పకోడి తింటున్నాడు. మణి అనే వ్యక్తి ఖాదర్‌ను పిలిచి ఏంట్రా పిలిచిన వెంటనే రావేంటని రాయితో తల పై మోదాడు. గాయమైన ఖాదర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడు మణిపై కేసు నమోదు చేశారు. చదవండి: Inspirational Story: 26 ఏళ్ల కొడుకును వీపుపై మోస్తూ ప్రపంచ పర్యటన చేస్తున్న తల్లి! -
కాళీచరణ్ అరెస్ట్
రాయ్‌పూర్: మహాత్మాగాంధీపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ సాధువు కాళీచరణ్ మహరాజ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తమ రాష్ట్రం నుంచి అనుమతి లేకుండా ఆయన్ను అరెస్ట్ చేయడం అంతర్రాష్ట్ర ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనంటూ మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కాళీచరణ్ మహరాజ్ అలియాస్ అభిజీత్ ధనంజయ్ సరాగ్ను ఖజురహోకు 25 కిలోమీటర్ల దూరంలోని బాగేశ్వర్ధామ్లోని ఓ అద్దె ఇంట్లో మారుపేరుతో ఉండగా గురువారం వేకువజామున అదుపులోకి తీసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీని అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు సంతోషిస్తున్నారా, లేక విచారిస్తున్నారా తెలపాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళీచరణ్‌ను గురువారం రాత్రి కోర్టులో హాజరుపరచగా రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ పోలీసుల చర్య తీవ్ర అభ్యంతరకరమని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభు త్వం అంతర్రాష్ట్ర ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఆదివారం రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో కాళీచరణ్ మాట్లాడుతూ.. ‘రాజకీయాలు చేసి దేశాన్ని కబళించడమే ఇస్లాం లక్ష్యం. మన కళ్లముందే 1947లో దేశ విభజన జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయాయి. గాంధీని తు పాకీతో కాల్చి చంపిన నాథూరాం గాడ్సేకి సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు పశ్చాత్తాప పడటం లేదని, గాంధీని ద్వేషిస్తానని సర్దార్ పటేల్ ప్రధాని కాకుండా గాంధీయే అడ్డుపడ్డారని కూడా ప్రకటన చేశారు. కాళీచరణ్‌పై మహారాష్ట్రలోనూ పలు కేసులు నమోదయ్యాయి. -
పొరుగింటి లాయర్‌పై కక్షతో..
న్యూఢిల్లీ: పొరుగింట్లో ఉండే లాయర్‌పై కక్ష పెంచుకుని, అతడిని చంపేందుకు ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన డీఆర్డీవో (రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ) సీనియర్ శాస్త్రవేత్త ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఆర్డీవో సీనియర్ సైంటిస్ట్ భరత్ భూషణ్ కటారియా (47), లాయర్‌గా పనిచేసే అమిత్ వశిష్ట్ స్థానిక అశోక్ విహార్ ఫేజ్–1 భవనంలోని వేర్వేరు అంతస్తుల్లో నివసిస్తున్నారు. పాత తగాదాలున్న వీరిద్దరూ పరస్పరం పలు కేసులు పెట్టుకున్నారు. అయితే, లాయర్ వశిష్ట్‌ను చంపాలని కటారియా ప్రణాళిక వేశాడు. మార్కెట్లో సులువుగా దొరికే రసాయనాలను వాడి టిఫిన్ బాక్స్ బాంబు తయారు చేశాడు. ఈ నెల 9వ తేదీన కటారియా లాయర్ మాదిరి దుస్తులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా రోహిణి కోర్టు భవనంలో వశిష్ట్ హాజరయ్యే కోర్ట్ నంబర్ 102లో బాంబున్న బ్యాగ్‌ను వదిలేసి వచ్చాడు. కానీ, సరిగ్గా అమర్చని కారణంగా బాంబు బదులు డిటొనేటర్ మాత్రమే పేలింది. దీంతో ఒకరు గాయపడ్డారు. దర్యాప్తు చేపట్టిన విచారణ బృందాలు..ఘటన జరిగిన రోజున కోర్టు సీసీ ఫుటేజీని పరిశీలించి కటారియానే బాధ్యుడిగా తేల్చాయి. బాంబు తయారీలో వాడిన సామగ్రి, రసాయనాలు, రిమోట్ తదితరాలు కటారియా ఇంట్లో లభించాయి. ఈ మేరకు శాస్త్రవేత్త భరత్ భూషణ్ కటారియాను శనివారం అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. -
తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్టయ్యారు. సాయికుమార్‌తో కలిసి డిపాజిట్లు గోల్మాల్ చేసిన కృష్ణారెడ్డిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్లూ పరారీలో ఉన్న కృష్ణారెడ్డి.. తన వాటాగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు -
యూపీలో బాలికపై ఐదేళ్ల పాటు అత్యాచారం..
లలిత్పూర్: ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో లలిత్పూర్ జిల్లా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు తిలక్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) దీపక్ అహిర్వార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. తనపై ఐదేళ్లపాటు అత్యాచారం చేశారంటూ బాధితురాలు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సహా మొత్తం 25 మందిపై ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 12న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో బాలిక తండ్రి, మామ కూడా ఉన్నారు. శుక్రవారం మీర్జాపూర్లో తిలక్ యాదవ్, దీపక్ అహిర్వార్‌తో పాటు మహేంద్ర దూబే అనే ఇంజనీర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం కేసులో తమ పార్టీ నేత అరెస్టు కావడంతో సమాజ్‌వాదీ పార్టీ లలిత్పూర్ జిల్లా పార్టీ యూనిట్‌ను రద్దు చేసింది. -
రెండేళ్ల దళిత బాలుడు... ఆలయంలోకి ప్రవేశించాడని జరిమానా
కొప్పాల్: ఆధునిక యుగంలోనూ కుల వివక్ష యథాతథంగా కొనసాగుతోందనడానికి ఇది మరో నిదర్శనం. రెండేళ్ల దళిత బాలుడు ప్రవేశించడం వల్ల గ్రామంలోని హనుమాన్ ఆలయం మైలపడిందని, దాన్ని శుద్ధి చేయడం కోసమంటూ బాలుని కుటుంబానికి రూ.25వేల జరిమానా విధించారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో మియాపూర్ గ్రామంలో ఈ నెల 4వ తేదీన ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌చేశారు. మియాపూర్‌లో చెన్నదాసరి కులానికి చెందిన చంద్రశేఖర్‌కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ నెల 4న అతడి పుట్టినరోజు కావడంతో హనుమంతుడి ఆశీస్సుల కోసం గుడికి తీసుకెళ్లాడు. చంద్రశేఖర్‌తోపాటు కుటుంబ సభ్యులంతా గుడి బయటే ఉండిపోయారు. బాలుడు లోపలికి వెళ్లొచ్చాడు. ఇది గమనించిన ఆలయ పూజారులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. 11న పంచాయితీ పెట్టారు. హనుమంతుడి› ఆలయాన్ని శుద్ధి చేయడానికి జరిమానా కింద రూ.25,000 చెల్లించాలని బాలుని తండ్రిని ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ బాలచంద్ర సంగనాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో పోలీసుల సమక్షంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చెన్నదాసరితో సహా అన్ని కులాల ప్రజలు పాల్గొన్నారు. -
‘ఇస్లామిక్ స్టేట్’ ప్రేరణతో ఉగ్ర ఉచ్చులోకి..
న్యూఢిల్లీ/చెన్నై: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రేరణతో భారత్‌లోనూ ముష్కరులు పెచ్చరిలి్లపోతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ఉగ్రవాద దాడులు, కుట్ర, నిధుల అందజేతకు సంబంధించిన 37 కేసుల్లో ఇప్పటిదాకా 168 మందిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. 31 కేసుల్లో చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేశామని తెలిపింది. నిందితుల్లో ఇప్పటిదాకా 27 మందిని న్యాయస్థానాలు దోషులుగా తేల్చాయని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ముఠా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఆమాయక యువతపై వల విసురుతోందని, భారత్‌లో తన భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం పట్ల ఆకర్షితులైన వారిని విదేశాల నుంచే సోషల్ మీడియా వేదికల ద్వారా సంప్రదించి ఉచ్చులోకి లాగుతున్నారని తెలిపారు. తమిళనాడులో ఒకరి అరెస్టు ఇస్లామిక్ స్టేట్, హిజ్‌్బ–ఉత్–తహ్రీర్ ఉగ్రవాద సంస్థల సిద్ధాంతాలు, భావజాలాన్ని ఫేస్బుక్ ద్వారా వ్యాప్తి చేస్తున్నారన్న సమాచారంతో తమిళనాడులో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం రాష్ట్రంలో రెండు చోట్ల సోదాలు నిర్వహించి ఒకరిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. తిరువారూర్ జిల్లాలో బవా బహ్రుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. -
సామాన్యుడి ముసుగులో ఉగ్రదందా!
మనం రోజూ పండ్లు కొనే వ్యక్తి పచి్చనెత్తురు తాగే ఉగ్రవాదని, మనకు రోజూ ఎదురయ్యే ఎంబీఏ నిరుద్యోగి ఎంతకైనా తెగించే టెర్రరిస్టని ఎవరైనా ఊహించగలరా! సరిగ్గా ఈ పాయింటును పట్టుకొని పాక్ ఐఎస్ఐ కుటిల కుట్రకు పాల్పడింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతీయ సమాజంలో సాధారణ జీవనం గడపమని పంపింది, అవకాశం చూసి విధ్వంసాలకు పాల్పడేలా ప్లాన్ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసుల పుణ్యమా అని ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాల సందర్భంగా భారీ విధ్వంసాలకు ప్రణాళిక రచించిన ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు తెలుస్తున్నాయి. అరెస్టయిన వారంతా కరడు కట్టిన టెర్రరిస్టులమని వారి ఇరుగుపొరుగు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం సాధారణ జీవనం గడుపుతూ సమాజంలో కలిసిపోయారు. అదును చూసి పెట్రేగాలని ఆలోచించారు కానీ చివరకు దొరికిపోయారు. వీరిలో యూపీకి చెందిన జీషన్ ఖమర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. కరోనా లాక్డౌన్ సందర్భంగా భారత్‌కు తిరిగివచ్చి ఖర్జూరాలమ్మే వ్యాపారం ఆరంభించాడు. లక్నోకు చెందిన మొహ్మద్ అమీర్ జావెద్, జీషన్‌కు దగ్గర చుట్టం. జెడ్డాలో చాలా సంవత్సరాలు గడిపాడు. భారత్‌కు వచ్చాక మతబోధకుడి అవతారం ఎత్తాడు. అబూ బకర్ సైతం జెడ్డా నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడ్డాడు. దీయోబంద్లోని ఒక మదర్సాలో చదువుకున్నాడు. కుట్రలో కీలకమైన మూల్‌చంద్ అలియాస్ లాలాకు డీ కంపెనీ (దావూద్ ఇబ్రహీం దందా)తో దగ్గర సంబంధాలున్నాయి. కానీ బయటకు మాత్రం రైతుగా కనిపించేవాడు. ఇక ఒసామా సమీ కుటుంబం డ్రైఫ్రూట్ బిజినెస్‌లో ఉంది. ఇతను చాలాసార్లు మధ్యాసియా దేశాలకు వెళ్లి వచ్చాడు. మస్కట్ నుంచి పాకిస్తాన్‌కు జలమార్గంలో చేరుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన జాన్ మహ్మద్ షేక్ అలియాస్ సమీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ముంబైలో నివశిస్తున్న ఇతనికి ఇద్దరు కూతుర్లున్నారు. పోలీసులు అరెస్టు చేసేవరకు వీరి గురించి పక్కింటివారికి కూడా తెలియదంటే ఎంత పకడ్బందిగా వ్యవహరించారో అర్ధం అవుతోంది. డీ కంపెనీతో లింకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిర్వహించే ముఠాతో అరెస్టయిన వారికి దగ్గర సంబంధాలున్నాయి. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాగా, దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సమీర్ దగ్గరవాడు. అంటే వీరికి డీ కంపెనీతో పాటు పాక్ అండదండలు కూడా ఉన్నట్లు అర్థమవుతోందని పోలీసులు చెప్పారు. పాక్‌లో ఉంటున్న అనీస్ ఆదేశాల ప్రకారం సమీర్ పేలుడు పదార్ధాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించాలని ప్లాన్ చేశారు. గతేడాది ముంబై పోలీసులు ఫజుల్ రహమన్ ఖాన్ అలియాస్ ముజ్జుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని ఒక వ్యాపారవేత్తను చంపమని వీరికి అనీస్ ఆదేశాలిచ్చాడు. దావూద్ అనుచరుడు ఫహీమ్ మాచ్మచ్కు ముజ్జు సన్నిహితుడు. అతనితో పనిచేసేవారు, కిరాయి హంతకుల గురించిన సమాచారాన్ని పోలీసులు మజ్జు నుంచి రాబట్టారు. ఇతని విచారణలోనే జాన్ మహ్మద్ పేరు బయటపడింది. అప్పటినుంచి ఇతని కదలికలపై పోలీసులు కన్నేసి ఉంచారు. కానీ జాన్ సాధారణ డ్రైవర్‌గా గడుపుతున్నట్లు నటించడంతో ఎలాంటి ఉగ్రకుట్ర గురించి తొలుత బయటపడలేదు. గతనెల ఫహీమ్ మరణించిన తర్వాత అనీస్ ఇతనికి నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఆరంభించాడు. దీంతో ఇతని గుట్టు రట్టయింది, అప్పటివరకు ముంబైలో స్లీపర్ సెల్‌గా జాన్ పనిచేస్తున్నాడని, గ్యాంగుకు ఆయుధాలు సరఫరా చేసేవాడని తెలిసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో మొత్తం ఉగ్ర కుట్ర బయటపడింది. యూపీపై కన్ను యూపీలో వరుస పేలుళ్లను జరిపాలని ప్లాన్ చేశారు. ప్రయాగ్ రాజ్‌లో ఒక ఐఈడీ(పేలుడు పదార్ధం)ని టెర్రరిస్టులు అమర్చారని పోలీసులకు తెలిసింది. కచ్చితంగా ఎక్కడ ఈ బాంబు పెట్టారో తెలియకపోవడంతో ఆందోళన అధికమైంది. దీనికితోడు యూపీలో వీఐపీల రాకపోకలు అధికంగా ఉండడంతో సోదాలు నిర్వహించడం, దర్యాప్తు చేయడం ఎంతో కష్టమయ్యాయని పోలీసులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేడితో రాష్ట్రంలో హడావుడి పెరిగింది. ఈ నేపథ్యంలో బాంబున్న ప్రదేశాన్ని కనుగొనడం సముద్రంలో సూదిని వెతికినట్లయింది. దీనికితోడు టెర్రరిస్టులు తప్పించుకోవడానికి అనువుగా నేపాల్ బోర్డర్‌ను ఆనుకొనే యూపీ ఉంది. కానీ ముమ్మర సోదాలు, లోతైన విచారణతో ఎట్టకేలకు బాంబు లొకేషన్ కనుగొని దాన్ని నిర్వీర్యం చేశారు. ఆపరేషన్ తొలిదశలోనే ఉగ్రవాదులు పట్టుబడడంతో ఎంతో ప్రాణనష్టాన్ని నివారించినట్లయింది. అయితే పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇదే చివరిసారి కాదని, అప్రమత్తతే దేశానికి రక్ష అని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
యువతికి వేరొకరితో నిశ్చితార్థం.. వాట్సాప్‌లో అశ్లీల ఫొటో
హోసూరు(కర్ణాటక): తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతికి వేరొకరితో నిశ్చితార్థం జరగడంతో ఆమెఫొటోను అశ్లీలంగా చిత్రించి వాట్సప్‌లో ఉంచిన యువకున్ని బేరికె పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరు తాలూకా బి. ముదుగానపల్లి గ్రామానికి చెందిన నరేష్కుమార్(25) హోసూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి ఇంటికి వెళ్లి పిల్లను అడిగారు. తల్లిదండ్రులు నిరాకరించి మరో యువకుడితో నిశ్చితార్థం చేశారు. ద్వేషం పెంచుకున్న నరేష్కుమార్ ఆ యువతి ఫొటోను అసభ్యంగా చిత్రీకరించి ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి వాట్సప్ ద్వారా పంపాడు. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నరేష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఇవీ చదవండి భర్తను చంపి.. బాత్రూంలో పాతిపెట్టి 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే! -
పోలీసులకు చుక్కలు చూపించిన నటి, వీడియో వైరల్
ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేం మీరా మీథున్‌ను చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులు శనివారం కేరళలో అరెస్టు చేశారు. ఇటీవల దళితులపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మీరాను వెంటనే అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అంతేగాక దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విడుదలై చిరుతైగళ్ కట్చి పార్టీ ఉప కార్యదర్శి వన్నీయరసు మీరాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మీరా మీథున్‌పై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆమెకు సమాన్లు జారీ చేశారు. దీనిపై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన వివరణ ఇవ్వాలని మీరాకు పోలీసులు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులపై ఆమె స్పందిస్తూ.. పోలీసులు తనను అరెస్ట్ చేయలేరని.. కలలో మాత్రమే అది జరుగుతుందని.. సాధ్యమైతే అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు సవాల్ విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేరళలో తలదాచుకున్న ఆమెను నిన్న అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అరెస్టు చేసే సమయంలో మీరా మీథున్ రచ్చ రచ్చ చేసిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఇక్కడ ఆడవాళ్లకు రక్షణ లేదా? పోలీసులు చార్చర్ చేస్తున్నారు.. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించండి’ అంటూ అరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేగాక ప్రతి ఒక్కరు, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది. ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ..ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by @Thiruma_official (@thol.thirumavalavan) -
ఈసీ వెబ్సైట్ హ్యాక్
సహరాన్పూర్/న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి అందులో 10 వేలకు పైగా ఫేక్ ఓటర్ ఐడీలను తయారు చేసిన విపుల్ సైని(24)ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) డిగ్రీ కలిగిన విపుల్ మూడు నెలల్లో 10 వేల ఫేక్ ఐడీలను క్రియేట్ చేసినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్మాన్ మాలిక్ అనే వ్యక్తి ఈ పనులు చేయించినట్లు తెలిసిందన్నారు. ఒక్కో ఐడీ కార్డుకు రూ. 100–200 చొప్పున విపుల్ తీసుకున్నట్లు తేలింది. అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ. 60 లక్షలను సీజ్ చేశారు. -
అవంత గ్రూప్ ప్రమోటర్ థాపర్ అరెస్ట్
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసులో అవంత గ్రూప్ ప్రమోటర్, వ్యాపారవేత్త థాపర్ అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. ఈడీ ప్రకటన ప్రకారం 60 సంవత్సరాల థాపర్ అక్రమ ధనార్జన నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద మంగళవారం రాత్రి అరెస్టయ్యారు. అంతకుముందు ఢిల్లీ, ముంబైల్లో ఆయన వ్యాపారాలకు సంబంధించి పలు కార్యాలయాలపై ఈడీ దాడులు జరిపింది. ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకులు రాణా కపూర్, ఆయన భార్య బిందు అక్రమ ధనార్జన కేసులో ధాపర్ ప్రమోటర్‌గా ఉన్న అవంత రియల్టీ పాత్ర కూడా ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా చేసుకుని ఈడీ ఈ కేసు విచారణ జరుపుతోంది. అవంత రియల్టీకి రుణ సౌలభ్యతల్లో రాయితీలు, సడలింపులు, మినహాయింపుల పొడిగింపు, అదనపు రుణ అడ్వాన్స్‌లు వంటి అంశాల్లో తీవ్ర స్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ ధనార్జన, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు జరిగినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ పేర్కొంటోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తదితర బ్యాంకుల్లో రూ.2,435 కోట్ల మోసానికి పాల్పడినట్లు థాపర్‌సహా పలువురిపై సీబీఐ గత నెల్లో ఒక కేసులో నమోదుచేసింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ మోసపూరిత కేసులో విచారణలో భాగంగా ఈ కేసు నమోదయ్యింది.. -
HYD : ఫేక్ వెబ్ సైట్లు క్రియేట్ చేస్తున్న ముఠా అరెస్ట్
-
పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికూతురు సుహాసిని
-
అదృష్ట పాములంటు విక్రయం .. స్నేక్ గ్యాంగ్ అరెస్ట్ : గుంటూరు
-
కమెడియన్ భార్తీ సింగ్ అరెస్ట్
ముంబై: కమెడియన్ భార్తీ సింగ్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబైలో అరెస్టు చేసింది. శనివారం ఉదయం భార్తీ సింగ్ నివాసం లోఖండావాలా కాంప్లెక్స్‌తోపాటు కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె నివాసంలో స్వల్ప మొత్తంలో 86.5 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో ఆమెతోపాటు, భర్త హర్ష లింబాచియాను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లి, ప్రశ్నించారు. విచారణ అనంతరం భార్తీ సింగ్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నటుడు సుశాంత్ సింగ్ మృతికి, డ్రగ్స్‌కు సంబంధంపై విచారణ జరుపుతున్న ఎన్సీబీ ఇటీవల పలువురు సినీ రంగ ప్రముఖులు, సరఫరా దారులను ప్రశ్నించడంతోపాటు కొందరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాదారు ఒకరు తెలిపిన సమాచారం ఆధారంగా భార్తీ సింగ్ ఇంటితోపాటు ముంబైలోని మరో రెండు ప్రాంతాల్లో సోదాలు జరిపామని ఎన్సీబీ అధికారి ఒకరు చెప్పారు. గంజాయిని వాడినట్లు భార్తీ సింగ్ దంపతులు అంగీకరించారని కూడా ఆయన వెల్లడించారు. భార్తీని నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశామనీ, లింబాచియా నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్నారు. చట్ట ప్రకారం..వెయ్యి గ్రాముల వరకు గంజాయి దొరికితే చిన్న మొత్తంగానే పరిగణిస్తారు. ఈ నేరానికి 6 నెలల జైలు శిక్ష లేదా 10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, భార్తీ సింగ్ టీవీల్లో పలు కామెడీ, రియాల్టీ షోల్లో పాల్గొన్నారు. -
అస్సాంలో జేఈఈ టాపర్ అరెస్టు
గువాహటి: తన బదులు మరొకరితో పరీక్ష రాయించి, అస్సాంలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–మెయిన్‌లో టాపర్‌గా నిలిచిన నీల్ నక్షత్ర దాస్‌ను అరెస్టు చేసినట్లు గువాహటి పోలీసులు బుధవారం తెలిపారు. ఈ పరీక్షలో నక్షత్ర దాస్ 99.8 శాతం పర్సంటైల్ సాధించి, అస్సాం రాష్ట్రంలో టాపర్‌గా నిలిచాడు. అతడు మరొకరితో పరీక్ష రాయించినట్లు విచారణలో తేలింది. అంటే కష్టపడి చదవకుండానే, పరీక్షకు హాజరు కాకుండానే టాప్ ర్యాంకు కొట్టేశాడన్నమాట. ఈ విషయంలో నక్షత్ర దాస్‌కు అతడి తండ్రి డాక్టర్ జ్మోతిర్మయి దాస్, పరీక్ష కేంద్రం నిర్వాహకులు హేమేంద్రనాథ్ శర్మ, ప్రాంజల్ కలితా, హీరూలాల్ పాఠక్ సహకరించినట్లు విచారణలో బయటపడింది. తన కుమారుడు నక్షత్రదాస్కు టాప్ ర్యాంకు రావడానికి తండ్రి జ్యోతిర్మయి దాస్ దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. -
ఆలయ పూజారి దారుణ హత్య
జైపూర్: రాజస్తాన్‌లో ఆలయ భూముల కబ్జాను అడ్డుకుంటున్న ఓ పూజారిని దారు ణంగా హత్య చేసిన ఘటన బుధవారం జరిగింది. కరౌలీ జిల్లాలోని బుక్నా గ్రామంలో ఆలయ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. ఆలయ పూజారి బాబూలాల్ వైష్ణవ్ ఎప్పటికప్పుడు దాన్ని అడ్డుకునేవారు. ఆయన ఉంటే తమ ఆటలు సాగవనే కక్షతో కబ్జాదారులు పూజారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన పూజారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ చెప్పారు. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేశామన్నారు. ఆలయ పూజారి హత్యకు గురికావడం దురదృష్టకరమని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. పూజారి హత్యోదంతంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాజస్తాన్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూర్ణియా విమర్శించారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో నేరగాళ్లు చెలరేగిపోతున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ రాజకీయ పర్యటనలు చేయడం బదులు రాజస్తాన్‌లో జరుగుతున్న ఘోరాలపై అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో దారుణంగా విఫలమైందని జవదేకర్ విమర్శించారు. పూజారి ప్రాణాలను బలిగొన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాజా ఘటనపై బీజేపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. -
యూపీలో నలుగురు పీఎఫ్ఐ సభ్యులు అరెస్ట్
లక్నో: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నాయని ఒక కేరళ జర్నలిస్టు, ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గతంలో యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పీఎఫ్ఐని నిషేధించిన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన దళిత బాలిక హత్యాచార ఘటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి హాథ్రాస్‌కు కారులో వెళ్తున్న ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్,అతిక్ ఉర్ రెహ్మాన్, మసూద్ అహ్మద్, ఆలంగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, లాప్టాప్, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుత సమయంలో యూపీలో శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చదవండి: (హథ్రాస్ ఘటన.. రూ.50 లక్షలు ఇస్తామన్నారట!) అదే విధంగా వారికి పీఎఫ్ఐ అనుబంధ సంస్థ అయిన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( సీఎఫ్) కూడా సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ హాథ్రస్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని కవర్ చేయడానికి ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లారని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన నిరసనలకు పీఎఫ్ఐకి సంబంధాలున్నాయని యూపీ ప్రభుత్వం పీఎఫ్ఐని నిషేధించిన విషయం తెలిసిందే. -
యూట్యూబ్ వీడియో చూసి బ్యాంకు దోపిడీ
భువనేశ్వర్ : లాక్డౌన్ నష్టాలను పూడ్చుకునేందుకు రెడీమేట్ బట్టల వ్యాపారం చేసే 25 ఏళ్ల వ్యక్తి తాను రుణం తీసుకున్న బ్యాంకుల్లోనే దోపిడీకి పాల్పడిన ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. యూట్యూబ్ వీడియోలను చూస్తూ నిందితుడికి ఈ ఐడియా వచ్చిందని, బొమ్మ తుపాకీని ఉపయోగించి రెండు బ్యాంకుల్లో దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. రెండు బ్యాంకుల్లో 12 లక్షల రూపాయలను నిందితుడు దోచుకోగా అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడి నుంచి 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ సమీపంలోని తంగిబంట గ్రామానికి చెందిన సౌమ్యరంజన్ జెనా అలియాస్ తులు భువనేశ్వర్‌లోని ఐఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గతనెల దోపిడీకి పాల్పడ్డాడని నగర పోలీస్ కమిషనర్ సుధాంషు సారంగి తెలిపారు. నిందితుడు సెప్టెంబర్ 7న ఇన్ఫోసిటీ ప్రాంతంలోని ఐఓబీలో 12 లక్షల రూపాయలు దోపిడీ చేశాడని, సెప్టెంబర్ 28న బ్యాంక్ ఆఫ్ ఇండియా బరిముంద బ్రాంచ్‌లో దోపిడీకి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. నిందితుడి నుంచి 10 లక్షల రూపాయల నగదు, బొమ్మ తుపాకీ, ఓ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జెనా హెల్మెట్ ధరించి బ్యాంక్‌లో కొద్దిమందే ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించి నగదు తనకు అప్పగించాలని బొమ్మ తుపాకితీ బెదిరించాడని, బ్యాంకు లూటీకి స్కూటీపై వస్తాడని పోలీసులు చెప్పారు. బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి పాల్పడిన తర్వాత నిందితుడు బుల్లెట్స్, గన్ను కొనుగోలు చేశాడని చెప్పారు. చదవండి : ప్రేమ కోసం సైకిల్‌పై వేల కిమీ ప్రయాణం.. చివరికి! కాగా, రెండు బ్యాంకుల్లో నిందితుడికి ఖాతాలున్నాయని, ఆయా బ్యాంకుల నుంచి 19 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంకును దోచిన అనంతరం తాను తీసుకున్న రుణంలో కొంత భాగం చెల్లించేందుకు నిందితుడు బ్యాంకుకు వచ్చినట్టు గుర్తించారు. బ్యాంకు రుణంతో వ్యాపారం ప్రారంభించిన నిందితుడు 9 నుంచి 10 లక్షల టర్నోవర్ సాధించినా లాక్డౌన్ సమయంలో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. లాక్డౌన్ సమయంలో ఒడిషాలో పలుచోట్ల బ్యాంకులు, ఏటీఎంలో చోరీలు అధికమయ్యాయి. గత నెలలో కాంజీహార్ పట్టణంలో ఓ వ్యాపారి బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయలు దోపిడీ చేశాడు. ఈ ఏడాది మేలో భువనేశ్వర్‌లో 9వ తరగతి చదివే బాలుడు యూట్యూబ్ వీడియోలో చూపిన విధంగా ఏటీఎంను పగులగొట్టేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. -
రాహుల్ గాంధీ అరెస్ట్
నోయిడా: హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు కాలినడకన వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను గురువారం గ్రేటర్ నోయిడాలోని యమున ఎక్స్‌ప్రెస్ వే పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని దగ్గర్లోని ఒక గెస్ట్‌హౌజ్‌కు తీసుకువెళ్లి, కాసేపైన తరువాత విడిచిపెట్టారు. హాథ్రస్‌కు శాంతియుతంగా, కాలినడకన వెళ్తున్న రాహుల్, ప్రియాంకను, పలువురు ఇతర నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ప్రకటించింది. అంతకుముందు, హాథ్రస్‌కు వెళ్లేందుకు బయల్దేరిన రాహుల్, ప్రియాంకల వాహన శ్రేణిని యూపీ పోలీసులు పరి చౌక్ వద్ద అడ్డుకున్నారు. దాంతో, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలి నడకన 150 కిమీల దూరంలోని హాథ్రస్‌కు వెళ్లాలని రాహుల్, ప్రియాంక నిర్ణయించారు. పాదయాత్రగా వెళ్తున్న రాహుల్‌ను పోలీసులు అడ్డుకుంటున్న క్రమంలో.. ఆయన కిందపడ్డారు. ‘మీరు హిందూ మత రక్షకులమని చెప్పుకుంటారు. ఒక తండ్రి తన కూతురి చితికి నిప్పంటించనివ్వకూడదని, అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులను పాల్గొననివ్వకూడదని ఏ గ్రంథంలో రాసి ఉంది?’ అని యోగి ఆదిత్యనాథ్‌పై ప్రియాంకగాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల పర్యటన నేపథ్యంలో హాథ్రస్ జిల్లాలో అధికారులు 144 సెక్షన్ విధించారు. జిల్లా సరిహద్దులను మూసేశారు. రాహుల్, ప్రియాంకలతో పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన తీరును ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఖండించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందువల్లనే రాహుల్, ప్రియాంకలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, దాంతో ఐపీసీ సెక్షన్ కింద వారిపై కేసు నమోదు చేశామని గౌతమబుద్ధ నగర్ కమిషనర్ లవ్ కుమార్ వెల్లడించారు. తర్వాత రాహుల్‌తో మాట్లాడుతున్న ప్రియాంక -
మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపు : యువకుడి అరెస్ట్
చెన్నై : తనతో సెక్స్ చాట్ చేయాలంటూ బాలికను బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు గురిచేసిన యువకుడి ఉదంతం కన్యాకుమారిలో వెలుగుచూసింది. బాలికను బెదిరించి లైంగిక వేధింపులకు గురిచేసిన 17 ఏళ్ల యువకుడిని సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక మార్ఫింగ్ ఫోటోలను చూపి యువకుడు ఆమెను బెదిరించాడు. ఇన్‌స్టాగ్రాంలో బాలికతో పరిచయం పెంచుకున్న యువకుడు మార్ఫింగ్ ఫోటోలను చూపి తనతో సెక్స్ చాట్ చేయాలని పలమార్లు బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలికకు పంపిన మెసేజ్‌ల్లో తనతో సెక్స్ చాట్ చేయాలని నిందితుడు కోరాడు. తన మాట వినకుంటే మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. పోలీసులు నిందితుడి ఇన్స్టాగ్రాం ఖాతా వివరాల ఆధారంగా అతడిని ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కన్యాకుమారిలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు చెన్నైలోని జువెనిల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు గతంలోనూ ఇలాగే ప్రవర్తించగా పోలీసులు హెచ్చరించి వదిలివేశారని దర్యాప్తులో వెల్లడైంది. చదవండి : బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశారు.. -
పీసీసీ చీఫ్ ఉత్తమ్, రేవంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ హత్యాచార ఘటనకు నిరసనగా ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ప్రయత్నాలను పోలీసులు అడ్డగించారు. ఇక అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై యూపీ పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతల రాకపై సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ నిర్వహించగా, ఆ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్ వైపు దూసుకెళ్లారు. రాహుల్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటాపోటీ ప్రదర్శనలతో గాంధీభవన్, బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్ గాంధీని యూపీ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. చదవండి : నిరంతరం ప్రజల్లో ఉండాలి -
హథ్రాస్ హైటెన్షన్ : రాహుల్ అరెస్ట్
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటనపై ఆందోళనలు మిన్నంటాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం మధ్యాహ్నం పాదయాత్రగా వెళుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రనేతల అరెస్ట్‌తో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు తోసివేశారు : రాహుల్ హథ్రాస్‌కు పాదయాత్రగా వెళుతున్న తమ పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. యమున ఎక్స్‌ప్రెస్ వేపై తమను పోలీసులు అడ్డగించి తనను తోసివేస్తే కిందపడ్డానని రాహుల్ పేర్కొన్నారు. కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే రోడ్డుపై నడవాలా అని రాహుల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కరోనా వైరస్ మార్గదర్శకాల ప్రకారం హత్రాస్‌కు వెళ్లకుండా నేతలను నిలువరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంతకుముందు రాహుల్, ప్రియాంక రాక సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హథ్రాస్‌కు చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసేందుకు వారికి పోలీసు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పర్యటనకు వీలేదని రాహుల్, ప్రియాంకను రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత హైటెన్షన్ నెలకొంది. తాజా పరిణామాలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ కరువైందని, యోగీని వెంటనే సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని రాష్ట్రపతి పాలన విధించాలని మాయావతి కోరారు. కాగా యూపీలోని హథ్రాస్‌లో పొలం పనులకు వెళ్లిన దళిత యువతిపై దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ ఢిల్లీ ఆస్పత్రిలో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. హథ్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. చదవండి : బాధితురాలికి చిత్రహింసలు -
నగదుకు నకిలీ గౌరవ డాక్టరేట్
మైసూరు: అదో పెద్ద హోటల్. సమావేశ గదిలో కోలాహలం. కొందరు స్నాతకోత్సవ గౌన్లు ధరించి.. డాక్టరేట్లు అందుకోబోతున్నామనే ఆనందంలో ఉన్నారు. ఇంతలో పోలీసులొచ్చారు. ముగ్గురిని అరెస్ట్‌చేశారు. అక్కడి నకిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ అనే నకిలీ వర్సిటీ పేరుతో దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మైసూర్లో ఓ హోటల్‌పై దాడిచేశారు. ఔత్సాహికుల నుంచి భారీగా డబ్బు తీసుకుని నకిలీ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నట్లు నంబియార్, శ్రీనివాస్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆ సమయంలో హోటల్లో సుమారు 142 మందికి గౌరవ డాక్టరేట్ పట్టాలిస్తున్నారు. -
భర్తపై ప్రముఖ నటి ఫిర్యాదు, అరెస్ట్
పనాజీ : వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే నటి పూనం పాండే మరో వివాదంతో ముందుకొచ్చారు. తన భర్త తనను లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని పూనం ఇచ్చిన ఫిర్యాదుపై ఆమె భర్త సామ్ బాంబేను గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పూనం ప్రస్తుతం దక్షిణ గోవాలోని కనకోనా గ్రామంలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొంటున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ఈ నెల 1న పూనమ్ పాండే పెళ్లి చేసుకున్నారు. తన భర్త సాం బాంబే తనను వేధిస్తున్నారని, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారని పూనం పాండే సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారని, వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశామని కనకోనా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ తుకారాం చవాన్ చెప్పారు. కేసు నమోదు చేసి బాధితురాలిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. మోడల్ నుంచి నటిగా ఎదిగిన పూనం ఈనెల 10న తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిస్టర్ అండ్ మిసెస్ బాంబే అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చిన పూనం ఇంతలోనే భర్తపై ఫిర్యాదు చేయడం, శాం బాంబేను పోలీసులు అరెస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇక మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. దీని కారణంగానే సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ సంపాదించారు. జూలై 27న బాయ్‌ప్రెండ్ సామ్‌తో పూనమ్ నిశ్చితార్థం చేసుకున్నారు. చదవండి : ఏడడుగులు వేసిన వేళ -
డ్రగ్స్‌తో బాలీవుడ్ డ్యాన్సర్ పట్టివేత
యశవంతపుర: మత్తు పదార్థాలను తరలిస్తున్న బాలీవుడ్‌కు చెందిన నటుడు కిశోర్ శెట్టిని మంగళూరులో సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్లో ఎబీసీడీ అనే సినిమాలో నటించిన కిశోక్శెట్టి ఒక డ్యాన్సర్. బాలీవుడ్లో సంచలనం రేకెత్తించిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి, డ్రగ్స్ లింక్‌పై ముమ్మర దర్యాప్తు నేపథ్యంలో కిశోర్‌శెట్టి పోలసులకు చిక్కాడు. కిశోర్ మిత్రుడు ప్రతీక్‌శెట్టిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణి ద్వివేది బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదాపడింది. -
రూ.2వేల నోట్లు రద్దయ్యాయంటూ వ్యాపారికి టోకరా!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లను రద్దు చేయబోతోందంటూ ఓ వ్యాపారిని నమ్మించి రూ.2 లక్షలు కొట్టేసిన కేటుగాడిని పోలీసులు అరెస్టు చేసిన ఉదంతం యూపీలో వెలుగుచూసింది. ప్రభుత్వం కొత్త రూ.వెయ్యి నోట్లను ముద్రించిందని వ్యాపారిని నిందితుడు నమ్మబలకడంతో బాధితుడు... రూ.2 లక్షలు(రూ.2 వేల నోట్లు) ఇచ్చి ఆర్బీఐ ముద్రించిన కొత్త వెయ్యి నోట్లు ఇవ్వాలని కోరాడు. ఆ డబ్బుతో నిందితుడు ఉడాయించినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీలోని లాహోరీ గేట్ నయా బజార్‌లోని ఓ షాపు వద్దకు వచ్చిన నిందితుడు తన మాటలతో దుకాణ యజమానిని నమ్మించాడు. చదవండి : మహిళా జర్నలిస్ట్ సాహసం.. నిందితుడి మాటలు నమ్మిన వ్యాపారి రూ.2 లక్షలు విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవాలని నిర్ణయించారు. తన వద్ద పని చేసే విష్ణుదత్ అనే వ్యక్తికి నగదు అప్పగించి ఆ అజ్ఞాత వ్యక్తితో వెళ్లమని సూచించారు. అనంతరం ఇద్దరూ కలిసి స్కూటీపై బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక విష్ణుదత్ నుంచి నగదు ఉన్న బ్యాగును ఆ వ్యక్తి తీసుకున్నాడు. ఓ భవనాన్ని చూపించి అందులోకి వెళ్లి రూ.వెయ్యి నోట్లను తీసుకోవాల్సిందిగా సూచించాడు. లోపలికి వెళ్లిన విష్ణుదత్‌కు అక్కడ ఎవరూ కనిపించలేదు. బయటకు వచ్చి చూస్తే... డబ్బుతో సహా ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉడాయించినట్టు గుర్తించాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘరానా మోసం వెలుగుచూసింది. వ్యాపారి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్కూటర్ నంబర్ ఆధారంగా సీసీ ఫుటేజీల సాయంతో నిందితుడిని అజయ్ శర్మ(55)గా గుర్తించారు. యూపీలోని షహీదాబాద్ లోని అతని ఇంటి వద్ద పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల రూపాయల నగదుతో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. నిందితుడు ఇటీవల పేకాటలో లక్షల రూపాయలు కోల్పోయినట్టు డీసీపీ ఆల్ఫెన్స్ వెల్లడించారు. ఆ నగదును తిరిగి రాబట్టుకునేందుకే నేరానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. -
శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కలకలం
సాక్షి బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో శాండల్‌వుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) శుక్రవారం ఒక అడుగు ముందుకు వేసింది. యలహంకలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసింది. రెండు రోజుల క్రితమే నటి రాగిణి సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. రవి శంకర్ ఇచ్చిన సమాచారంతో రాగిణిని గురువారం విచారణకు రావాలని నోటీసులిచ్చారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, సోమవారం విచారణకు వస్తానని లాయర్ ద్వారా రాగిణి సమాధానం పంపారు. ఈ నేపథ్యంలో కోర్టు ద్వారా సెర్చ్వారంట్తో పోలీసులు శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఆమె ఇంటిపై దాడి చేసి, సోదాలు జరిపారు. అనంతరం రాగిణిని విచారణ నిమిత్తం సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కాగా, శుక్రవారం సాయంత్రం రాగిణిని అరెస్టు చేసినట్లు సీసీబీ ప్రకటించింది. రాగిణి పెట్టుకున్న ముందస్తు బెయిల్‌పై విచారణను 7వ తేదీకి ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఇటీవల ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. వీరు వెల్లడించిన సమాచారంతో దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్‌ను సీసీబీ పోలీసులు విచారించగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో సుమారు 15 మంది సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. -
సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది. ముంబై బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారులు మాట్లాడుతూ, ‘అతనికి శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉంది. షోవిక్ చక్రవర్తి (రియా చక్రవర్తి సోదరుడు) సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి’ అని తెలిపారు. శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్‌గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్‌గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించడాని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్‌తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు రియా చక్రవర్తి తల్లిదండ్రులను బుధవారం విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా రియా తల్లిదండ్రులు సీబీఐ ముందు హాజరయ్యారు. ఇక గతవారం రియా తమ్ముడు షోవిక్‌ను కూడా విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ డబ్బును కాజేసి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు అంటూ సుశాంత్ కుటుంబసభ్యులు రియా కుటుంబ సభ్యులందరిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక రియాను సీబీఐ అధికారులు నాలుగు రోజులలో 35 గంటల పాటు విచారించారు. చదవండి: ‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’ -
డాక్టర్ యోగిత హత్య కేసు నిందితుడు అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన డాక్టర్ యోగిత గౌతమ్(25) హత్య కేసులో అనుమానితుడిగా గుర్తించిన ఒక వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగంలో యోగిత గౌతమ్ వైద్యురాలిగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె సీనియర్ డాక్టర్ అయిన ఒక వ్యక్తి యోగితను పెళ్లి చేసుకుంటానని సంవత్సరం నుంచి వేధిస్తున్నాడని ఆమె తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి యోగిత సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గురువారం అతనిని అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి యోగిత కనిపించపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె హత్యకు గురయినట్లు తెలిసింది. యోగిత మృతదేహం బమ్రోలి అహిర్ ప్రాంతంలో లభ్యమయ్యింది. ఆమె తలపై బలమైన రాడ్‌తో కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. आगरा के एसएन मेडिकल कॉलेज में एक महिला डॉक्टर के अपहरण एवं हत्या की घटना दुखद है. भाजपा के राज में प्रदेश की नारी न तो शहरों में सुरक्षित है, न बस्ती, न गाँव में. प्रतीत होता है कि अब उप्र में अपराध ही सत्ताधीश बन गया है. pic.twitter.com/c4yBN5jQf4 — Akhilesh Yadav (@yadavakhilesh) August 20, 2020 ఈ విషయంలో పోలీసులు నిందితుడిని ప్రశ్నించగా యోగితతో ఏడు సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నట్లు చెప్పాడని, మరింత లోతుగా దర్యాప్తు చేయగా నిందితుడు పోలిక లేని సమాధానాలు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ డాక్టర్ యోగిత గౌతమ్ హత్య పట్ల విచారం వ్యకం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పట్టణాలలో, నగరాలలో , చివరికి పల్లెల్లో కూడా మహిళలకు రక్షణ లేకండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటేనే క్రైమ్ ఉత్తరప్రదేశ్‌ని పాలిస్తున్నట్లు అర్థమవుతుంది అంటూ ట్వీట్ చేశారు. చదవండి: వైద్య విద్యార్థిని కిడ్నాప్, దారుణ హత్య -
మనీల్యాండరింగ్ కేసులో చైనీయుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్‌తో పాటు హవాలా లావాదేవీల్లో నకిలీ చైనా కంపెనీల ప్రతినిధిగా అక్రమాలకు పాల్పడుతున్న చైనా దేశీయుడు లూ సాంగ్‌ను ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాగా గూఢచర్య ఆరోపణలపై 2018లో లూ సాంగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు వెల్లడైంది. చార్లీ పెంగ్‌గా భారత్‌లో చెలామణి అవుతున్న లూ సాంగ్‌ను సెప్టెంబర్ 2018లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. చైనా తరపున నిందితుడు గూఢచర్యం సాగించడంతో పాటు మనీల్యాండరింగ్, హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారత పాస్‌పోర్ట్‌ను సులభంగా సంపాదించవచ్చనే ఉద్దేశంతో నిందితుడు గతంలో మణిపురి యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసింది. చార్లీ పెంగ్‌కు భారత్‌లో హవాలా లావాదేవీలు, మనీల్యాండరింగ్‌కు పాల్పడే క్రిమినల్ గ్యాంగులతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు దేశంలో గుట్టుచప్పుడుగా మనీ ఎక్స్ఛేంజ్ సేవలను అందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ఐటీ అధికారులు ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, చైనా జాతీయులు 40కి పైగా బ్యాంకు ఖాతాలను సృష్టించి రూ 1000 కోట్లు పైగా వాటిలో జమచేశారని భావిస్తున్నారు. దేశంలో చైనా పెట్టుబడులపై కఠిన నిబంధనలు విధించి, 59 చైనా యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. చదవండి : చైనా ఎంట్రీతో ఇక అంతే.. -
‘చెల్లని చెక్కుతో లగ్జరీ కారు కొన్నాడు’
వాషింగ్టన్ : రూ కోటి విలువైన పోర్షే లగ్జరీ కారును నకిలీ చెక్‌తో కొనుగోలు చేసిన వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన వెలుగుచూసింది. తన ఇంట్లోని కంప్యూటర్లో ప్రింట్ చేసిన చెక్‌తో పోర్షే కారును కొనుగోలు చేయడంతో పాటు రోలెక్స్ వాచీలను నకిలీ చెక్‌లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ గతవారం కాసీ విలియం కెల్లీ (42) పట్టుబడ్డాడు. వాల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం కెల్లీ డెస్టిన్‌లోని పోర్షే డీలర్షిప్ వద్ద జులై 27న 1,39,203 డాలర్ల నకిలీ చెక్‌ను ఇచ్చి దర్జాగా పోర్షే 911 టర్బోను తీసుకువెళ్లాడు. ఆయన ఇచ్చిన చెక్ చెల్లకపోవడంతో డీలర్ ఒకలూసా కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. చెల్లని చెక్కు ఇచ్చి పోర్షే కారులో చెక్కేసిన కెల్లీ ఆ కారుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అదే కారులో మిరమర్ బీచ్‌లో ఓ నగల దుకాణానికి వెళ్లి 61,521 డాలర్లకు మరో నకిలీ చెక్ ఇచ్చి మూడు రోలెక్స్ వాచీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే చెక్ నగదుగా మారే వరకూ వాచ్‌లను జ్యూవెలర్ తన వద్దే ఉంచుకున్నారు. చెక్ చెల్లకపోవడంతో జ్యూవెలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ చెక్‌లతో మోసగించిన కెల్లీని పోలీసులు అరెస్ట్ చేయగా తన ఇంట్లో కంప్యూటర్ నుంచి ఈ చెక్కులను ప్రింట్ చేశానని అంగీకరించాడు. కెల్లీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని వాల్టన్ కౌంటీ జైలుకు తరలించారు. చదవండి : పోర్షే కయన్ కూపే @ 1.32 కోట్లు -
నటుడి కుమార్తెకు బెదిరింపులు, అరెస్ట్
ముంబై: బాలీవుడ్ నటుడి కుమార్తెను బెదిరించిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ప్రైవేట్ ఫోటోలు తన దగ్గర ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ దిగడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశాడు. మొదట డబ్బులు ఇచ్చిన యువతి తరువాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని ముంబైలోని మలాద్ నివాసి కుమైల్ హనీఫ్ పఠానిగా గుర్తించారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) లోని వివిధ సెక్షన్ల కింద, సమాచార సాంకేతిక చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలు చదువుకుంటున్నకాలేజీలోనే నిందితుడి సోదరి కూడా చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు పర్సనల్ ఫోటోలు పెట్టి బెదిరించినట్లు నటుడి కుమార్తె తెలిపింది. ఇంకా తన దగ్గర ఫోటోలు ఉన్నట్లు చెప్పి ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంతో తల్లిదండ్రులకు విషయాన్నిచెప్పినట్లు బాధితురాలు తెలిపింది. నిందితుడికి రూ.20 వేల వరకు ఇచ్చినట్లు బాధితురాలు చెప్పింది. చదవండి: జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్ -
లవ్ జిహాద్ : పేరు మార్చుకుని వలపు వల
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో కలకలం రేపిన లవ్ జిహాద్ కేసులో నిందితుడు షంషద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీ పోలీసులు గురువారం మీరట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. షంషద్ నుంచి పోలీసులు ఓ పిస్టల్, లైవ్ బుల్లెట్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల్లీ కూతుళ్లను దారుణంగా హతమార్చి మీరట్‌లోని వారి ఇంట్లో పాతిపెట్టిన కేసులో షంషద్ నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... షంషద్ తన పేరు మార్చుకుని హిందూ యువకుడిగా నమ్మబలుకుతూ ప్రియ అనే యువతితో సహజీనవం చేయడంతో పాటు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో షంషద్ తన పేరు అమిత్ అంటూ ప్రియను నమ్మించాడు. ఐదేళ్లుగా ప్రియతో కాపురం చేస్తున్నాడు. అయితే షంషద్ ముస్లిం అని తెలిసిన తర్వాత ప్రియ అతనితో పలుమార్లు ఘర్షణకు దిగింది. షంషద్, ప్రియలు ఇదే విషయమై తరచూ గొడవపడే క్రమంలో మార్చి 28న ప్రియ ఆమె కుమార్తె కశిష్‌లను అతడు దారుణంగా హత్య చేశాడు. మృతదేహాలను వారి ఇంట్లోనే పాతిపెట్టాడు.ఇక మూడు నెలలుగా ప్రియ ఆచూకీ తెలియకపోవడంతో ఆమె స్నేహితురాలు చంచల్ స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగుచూసింది. జంట హత్యల కేసులో షంషద్‌ను ప్రశ్నించిన పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళుతుండగా నిందితుడు పారిపోయాడు. మీరట్‌లో గురువారం పట్టుబడిన షంషద్‌పై పోలీసులు 25,000 రివార్డు ప్రకటించారు. కాగా ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న షంషద్ మొదటి భార్యను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.చదవండి : లవ్ జిహాద్‌కు నిర్వచనం లేదు