
సాక్షి, నెల్లూరు : ఏటీఎమ్ సెంటర్లలో వృద్ధులను ఏమార్చి స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా క్లోనింగ్‌కు పాల్పడిన ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు సుమారు 14 రాష్ట్రాలలో వెయ్యికి పైగా నేరాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సందీప్ కుమార్, మంజీత్, దయానంద్‌లు హర్యానా రాష్ట్రానికి చెందిన వారని, ఇప్పటికే వీరిపై 49పైగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో నేరాలకు పాల్పడినట్లు నిందితులు ఆంగీకరించారని, వారి నుంచి రూ. 7.5 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్ టాప్, నకిలీ ఏటీఎమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment