nellor
-
విరాళాలతో అన్నా క్యాంటీన్ల నిర్వహణా?.. సిగ్గుచేటు: కాకాణి
సాక్షి, నెల్లూరు: ప్రజా వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధర్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన బాబు.. ఇప్పుడేమో ఆ హామీలు అమలు చేయడంపై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు విధానాలు ఇలానే ఉంటాయని ప్రజలకు మరోసారి క్లియర్‌గా అర్థమైందని దుయ్యబట్టారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ హామీలపై బాబు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు.ఈ మేరకు గురువారం నెల్లూరులో కాకాణి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించని సీఎం చంద్రబాబు, తానేమీ మారలేదని మరోసారి రుజువు చేశారని.. టెర్రరిజం గురించి, నియంత పాలన గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే, దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.రాజధాని అమరావతి విషయంలో ప్రజల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ ధనదాహంతో ఆలోచించారని కాకాణి తేల్చి చెప్పారు. రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లంటూ పదే పదే అబద్ధాలు చెప్పిన చంద్రబాబు, దమ్ముంటే వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే, టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడి చేస్తున్నారన్న కాకాణి, ఏకంగా 40 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌యార్డుల నుంచి మాయం చేశారని ఆరోపించారు. తల్లికి వందనం అంటూ ఈ ఏడాదికి ఎగనామం పెట్టిన పథకానికి స్వాతంత్య్ర దినోత్సవాన శకటం ప్రదర్శించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఊసెత్తని చంద్రబాబు, రెడ్ బుక్ పాలనకే మొగ్గు చూపుతాం అన్న సంకేతాలివ్వడం దారుణమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఒక్క మంచి పని చేయని చంద్రబాబు, ఇప్పుడు కూడా 16 మంది సీనియర్ ఐపీఎస్‌లను వేధిస్తున్నారని, ఇది సీఎం అనైతిక పాలనకు పరాకాష్ట అని అభివర్ణించారు. ఇదే పంథాలో కొనసాగితే చంద్రబాబు నుంచి ప్రజలు స్వాతంత్య్రం తెచ్చుకునే పరిస్థితి త్వరలోనే వస్తుందని కాకాణి హెచ్చరించారు. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేసిన మాజీ మంత్రి, వాటన్నింటికీ పచ్చ రంగు ఎందుకు వేశారని నిలదీశారు. ఇంకా.. ఆ క్యాంటీన్లలో పెద్ద పెద్ద ఫొటోలు నీవి, విరాళాలు ప్రజలవా? అని చంద్రబాబును ప్రశ్నించారు. పథకాలు ఎత్తేసి, పేదవాడికి పప్పన్నం పెడుతున్నారని.. దాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారన్న కాకాణి, అది కూడా ప్రభుత్వ సొత్తుతో కాకుండా విరాళాలతో చేయడం విడ్డూరమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా మరోసారి పవన్‌కళ్యాణ్ తన ఆజ్ఞానాన్ని చాటారని మాజీ మంత్రి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2017లో జరిగిన సుగాలి ప్రీతి కేసును, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ముచ్చుమర్రి బాలిక కేసును.. గత జగన్‌గారి ప్రభుత్వానికి ఆపాదించారని గుర్తు చేశారు. తాను ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నానన్న విషయాన్ని పవన్ మర్చారని కాకాణి గోవర్థన్‌రెడ్డి చురకలంటించారు. -
Maha Shivratri: మళ్ళీ రావు ఆ బంగారు రోజులు..
మాది నంద్యాల. అనగనగా రోజుల్లో కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారుట. 14వ శతాబ్దంలో నందన అనే మహారాజు గారు మా మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేరొచ్చిందని కాల క్రమేణా అదే నంద్యాలగా రూపాంతరం చెందిందని అంటారు. చుట్టూ నవనందులు ఉన్నా మాకు మహనంది మీదే మక్కువ ఎక్కువ. ఒక్క రోజు సెలవు దొరికితే చాలు "పొదామా అంటే, పోదామా" అనుకుంటూ మేము పిల్లలమంతా అద్దె సైకిల్లు తీసుకుని పొద్దున మహనందికి తయారు. పోయి పెద్ద కోనేరులో ఈతలు కొట్టి అలిసి పోయి, సేద తీరడానికి చిన్న కోనేరులో ఈతలు కొట్టి తేరుకుని సాయంత్రానికంతా తిరిగి ఇళ్ళు చేరుకునేవాళ్లం. ఈతల మధ్యలో సమయం దొరికితే మహనందీశ్వరుణ్ణి కూడా దర్శించుకుని దండం పెట్టుకునేవాళ్లం. మీరు ఈ మాట ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దండం పెట్టుకునేవాళ్లం అన్నాను అంతే కానీ కొరికలు కోరుకునే వాళ్లం అనలేదు. దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికని, కోరికలు తీర్చుకోడానికే దేవుడుకి దండం పెట్టుకోవాలని మేము నేర్చుకోలేదు. ఒకరోజు గుడిలోకి వెళ్ళి నేనూ, నా ఫ్రెండు శంకర్ దండం పెట్టుకున్నాక.. శంకర్ కిందికి వంగి దేవుడి పళ్ళెంలో ఉన్న నోట్లని గుప్పిట నిండుగా పట్టుకుని ఆక్కడి నుండి పారిపోయాడు. నాకు కూడా అక్కడ ఉన్న ఒక అయిదురూపాయల నోటు టెంప్ట్ చేసింది కానీ , తీసుకోలేకపోయాను. అందుకు నా మీద దేవుడికి కోపం వచ్చి చేతకాని నన్ను ఆర్టిస్ట్ కమ్మని శపించి, ధైర్యం, చాకచక్యం పుష్కలంగా ఉన్న శంకర్‌ను ప్రముఖ పొలిటీషియన్ కమ్మని వరమిచ్చాడు. గుడిలో పులిహోర మాత్రం ఇద్దరికీ సమానంగా ఇచ్చాడు. శివుడు మా ప్రాంతపు ఎక్కువ దేవుడు. మా నూనెపల్లె నడిబొడ్డున శివాలయం ఉంది. తెల్లవారిన దగ్గర నుంచి "బ్రహ్మమురారి సురార్చిత లింగం | నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం | తత్-ప్రణమామి సదాశివ లింగమ్ |" అని ఎప్పుడూ వినపడుతూనే ఉండేది. అప్పుడు నేనూ, నావంటి నూనెపల్లె పిల్లలం కలిసి శివాలయం ముందు నుండి ఆటలాడుతూ పరిగెడుతూ బ్రహ్మమురారి సురార్చిత లింగం అని పాడుకుంటూ మంచి నీళ్ళ బాయి దగ్గర మలుపు తిరగగానే మసీదు నుంచి అజాన్ రాగానే అల్లాహు అక్బర్ | అష్-హదు అన్-లా ఇలాహ ఇల్లల్లాహ్| అష్-హదు అన్న ముహమ్మద అర్-రసూల్ అల్లాహ్| హయ్యా అలస్-సలాహ్| హయ్యా అలల్-ఫలాహ్| అల్లాహు అక్బర్. అని ముగింపు పాడుకునేవాళ్లం. ఆ రోజుల్లో మీరెవరు అని అంటే మేము నూనెపల్లె వాళ్లం అని మాత్రమే మా ప్రవర. మాది నిజానికి ప్రకాశం జిల్లా. మా జేజి నాయన తన కుటుంబాన్ని తీసుకుని బ్రతుకు తెరువుకోసం నూనెపల్లె చేరినపుడు ఆయనని వెల్ కం టు నూనెపల్లె అని స్వాగతించింది మా ఊరి మహాదేవుడు శివుడు, తన గుడి అరుగు మీద స్థలం చూపి నువ్వు ఇక్కడ టైలరింగ్ చేసుకోవచ్చబ్బా! అన్నాట్టా. మా పెద్దల బ్రతుకు గిర్రున తిరగడానికి కుట్టు మిషన్ చక్రం కదిలింది ఈ శివాలయం గుడి నీడ నుండే. మామూలుగా పండగలన్నీ ఉదయపు సంబరాలయితే ఒక్క మహా శివరాత్రి మాత్రం సాయంత్రం నుండి మొదలయ్యే ఉత్సాహం. ప్రతి పండగకు ముందు పిల్లలమంతా కూడి రాబోయే పండగ గురించి ఎన్నెన్ని విశేషాలు చెప్పుకునే వాళ్లమో! లెక్కే లేదు. అప్పుడు మా చొక్కాకు ఒక జేబు, నిక్కరకు రెండు జేబులు ఉన్నా ఆ మూడు జేబుల నిండా కబురులు తరగని అక్షయ నిధుల్లా పోటెత్తేవి. అప్పుడు మా ఊరి రోడ్లు ఎప్పుడూ ఎద్దుల బళ్లతోనూ, గుర్రపు జట్కాలతోనూ , రిక్షాల మూడు చక్రాలతోనూ, సైకిల్ బెల్లులతోనూ, సైడ్, సైడ్ జరుగు జరుగు అని హెచ్చరిస్తూ కదిలేవి. ఒకటీ రెండు బస్సులు ఉన్నా, అవి ఎప్పుడో ఒకప్పుడు వస్తూ పోతూ ఆగుతూ కదులుతూ ఉండేవి. ఆ రోజుల్లో ప్రతి పండగకు మా ఊరి శివాలయం ముందు పందిరి కట్టి హరికథలు నడుస్తూ ఉండేవి. మామూలు రోజుల్లో చీకటి పడగానే త్వరగా నిద్రపోయే ఊరి రహదారులు పండగ రోజుల్లో మాత్రం తెల్లవార్లూ మేలుకుని ఉంటాయి. కథలు చెప్పడానికి వచ్చిన హరిదాసు గారి కథా గమనాన్ని, మృదుమధురమైన గానాన్ని, కాలి అందియలు ఘల్లు మనడాన్ని, చేతిలోని చిడతలు ఝల్లు మనడాన్ని, ఆ పిట్టకథలను, ఆ వేదాంత చర్చను, మధ్య మధ్యలో పాపులర్ సినిమాల పాటల చమత్కారపు పేరడీలను ఊరు ఊరంతా, దారి దారంతా గడ్డం క్రింద చేయిపెట్టుకుని అలా కళ్ళప్పగించి చూస్తూ, వింటూ ఉండేది. ఈ హరి కథల కోసమని చీకటిపడే సమయానికంతా ఊరిని, దారిని బందు పెట్టేవారు. ఇక ఆ రాత్రి ఆ దారిన ఒక వాహనం నడవదు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక్క సైకిలు చక్రమూ తిరగదు. ఊరి జనం అంతా చేతికందిన చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు పట్టుకుని రోడ్దుని ఆక్రమించుకునేవారు. అందరికన్నా ముందు అక్కడికి చేరుకునేది నావంటి పిల్లలు. వారి వారి అమ్మా నాయనల కోసమో, అవ్వా తాతల కోసం కాదు. స్కూలు, ట్యూషన్ క్లాస్మెంట్ కోసమని, ప్రాణ స్నేహితుల కోసమని తగు మాత్రం స్థలం రిజర్వు చేసి పెట్టేవారు. ఎన్నయినా చెప్పండి మళ్ళీ రావు ఆ బంగారు రోజులు. ఆకాశానికి నక్షత్రాలు పూచే ఆ సాయంకాలాలు, అరచేతుల్లో గాజు మొబైల్ అద్దాలకు బదులు దేవుడు రాసిన గీతలు కనపడే రోజులు మరిక లేవు. ఇవన్నీ మామూలు రోజుల్లోని పండగల సాయంకాలాల గుడి బయటి దృశ్యాలు. హరికథల పండగ రోజుల్లో బాగా నిద్ర అనిపిస్తే ఇంటికి రావచ్చు. శివరాత్రి సంగతి వేరు. శివరాత్రి రోజున శివాలయం బయట రోడ్డుకి అడ్డంగా పెద్ద తెల్లని తెర కట్టేవారు. తెరకి అటూ ఇటూ జనం కూర్చునేవారు. చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు మామూలే. పిల్లలు ముందు గానే వచ్చి స్థలం రిజర్వు చేసి పెట్టడమూ మామూలే. ఆ రాత్రి శివాలయం ముందు మూడు ఆటలు సినిమాలు వేసేవారు. పౌరాణిక సినిమాలే వేసేవారు. మూడు సినిమాలలో ఒక సినిమా మాత్రం దక్షయజ్ఞం ఖచ్చితంగా ఉండేది. 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ కూడా తప్పకా ఉండేది. మేము ఆ సినిమాని ఉప్మా, చట్ని, గారె, సాంబారుల కథ అని పిలుచుకుని, గట్టిగా నవ్వి ఆపై కళ్ళు మూసి దేవుడికి దండం పెట్టుకుని లెంపలు వేసుకునేవాళ్లం ఆ శివరాత్రి రాత్రులలో, ముఖ్యంగా దక్షయజ్ఞం సినిమా చూస్తున్నప్పుడు మా ఊరి శివాలయంలో ఉండే ఆ చంద్రచూడుడు, చంద్రశేఖరుడు, విషకంఠుడు, పినాకపాణి , మహాశివుడు క్లైమాక్స్ లో గుడి లోపలినుండి ఆ ఫలాన తెరమీదకు వచ్చి నందమూరి రామారావు ఒంటి మీదికి పూని శివతాండవం చేయిస్తాడు చూడు! తీవ్ర దుఃఖంతో, మహా కోపంతో, తన జూట నుండి ఒక కేశాన్ని పెరికి నేలకేసి కొడితే ఆ వెంట్రుక నుండి ఆయన పెద్ద కొడుకు వీరభద్రుడు పుట్టుకొస్తాడు చూడు. అది మాకు శివరాత్రి అంటే. ఆ ఒక్క దృశ్యం చూడడం కోసమే కదా సంవత్సరమంతా వేచి వేచి శివరాత్రి జాగారం చేసేది. ఈ రోజుల్లో లాగా ఏ క్షణన కావాలిస్తే ఆ క్షణాన కళ్ళముందుకి నర్తనశాలలు, పాండవ వనవాసాలు, వినాయక విజయాలు వచ్చే కాలం కాదు కదా. ఆ రోజుల్లో ప్రతి అనుభవానికి ఒక గొప్ప విలువ ఉండేది. లిప్త పాటు అదృష్టాల్ని ఒడిసిపట్టుకుని బ్రతుకు పుస్తకంలో మెరుపుల నెమలీకలా దాచుకుని తీరాల్సిందే. పండగ పూట సినిమాలు చూస్తూ జాగారం చెయడమేమిటి కలికాలం అని పెద్ద తరం వాళ్ళు విసుక్కుంటున్నా సరే, దారి మీద మూడాటల తెర ఆడుతూనే ఉండేది. సినిమా టాకీసులలో రాత్రి మూడాటలు ఆడుతూనే ఉండేవి, గుళ్ళల్లో పూజలు, అవధూతల ఆశ్రమాల్లో భజనలు కొనసాగుతూనే ఉండేవి. ఏదో ఒక రకంగా, ఒక రూపంగా భక్తి అనేది కళ్ల మీదికి నిదుర మూత వాలకుండా కాపాడుతూ ఉండేది. ఒక రాత్రి ముగిసేది. ఆ తరువాతి పగటిని రాత్రిలా జనం అంతా నిద్రపోయేవారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వచ్చే జాగారపు యామిని ప్రస్తుతం మరణించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో జనం మెలకువగానే ఉంటున్నారు. పగళ్ళు నిద్రపోతూనే ఉంటున్నారు. శివుడికి ఒకరోజు, రాత్రికి ఒక కాలం, సినిమాకి ఒక వారం అంటూ ఏమీ ఉండటం లేదు. శివరాత్రికి చలికాలం శివ శివ అని పారిపోతుంది అనేవారు. చలికాలం రాకముందే చలి పారిపోయే కాలం వచ్చినట్లుంది. భస్మాసురుడికి భయపడి శివుడు పరుగులెత్తాడు అని అనుకునేవారు. అసురుడి దాకా ఎందుకు మామూలు మనిషికి భయపడే చూసే పరమశివుడు ఎప్పుడో పారిపోయినట్లుగా అనిపిస్తుంది. నాకు మాత్రం ఆలయాలు ఉన్నాయి కానీ, దేవుడులు అక్కడ ఉండటం లేరేమో అని గట్టి నమ్మకమే ఉంది. పండగ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది కానీ, అనుభవాలు మిగలడం లేదు నిన్నటి రాత్రికి ఈ శివరాత్రికి తేడా కనపడ్డం లేదు. మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు. మద్రాసులో బతికిన కాలేజీ, చచ్చిన కాలేజీ అనేవి ఉన్నాయని. ఇప్పుడు నేను రాసుకున్నదంతా చచ్చిపోయిన మా నూనెపల్లె కథ, ఒక వదలని దుఃఖపు గీతి రాత. -
పెద్దారెడ్డి టాక్స్ : సీటీ సిరగతాదేమో జాగర్త సిన్నీ!
ఓర్నాయనో.. అబ్బయ్యా సిన్నీ! మీ అన్నకి సెంద్రబాబు సీటీ సించేసే సరికి నీకు మహా కుశాలగా ఉన్నట్టుండాదే అబ్బయ్యా! ఇన్నేళ్లు సెంద్రబాబుకి ఊడిగం జేసిన మీ అన్నయ్యని మెడ బట్టుకోని బయటకి గెంటేసిన తర్వాత.. రాజ్జెమంతా నీదే అయిపోతాదని మురిసిపోతా వున్నట్టుండావు గదా. అప్పుడే నీకు ఎంపీ టిక్కెట్టు ఇచ్చేసినట్టు.. నువ్వు సైకిలెక్కి లగెత్తుకోని డిల్లీలో పార్లమెంటుకు పోయినట్టు కళ్లముందు సెవెంటీ ఎమ్మెమ్ములో కనిపిస్తా వున్నట్టుండాది గదా! అంతేలే అబ్బయ్యా.. యీ మాదిర్తో అరసేతిలో సొర్గాన్ని జూపించకపోతే.. ఆ సెంద్రబాబు మాత్తరం పార్టీని ఎట్టా నడుపుకుంటాళ్లే? యీ కలలు కొంచిం కట్టిపెట్టి.. నా మాటలు కొంచిం జాగర్తగా ఆలకించుకో అబ్బయ్యా! మీ అన్నకైనా నెత్తిన పదేళ్లు కిరీటం నిలబడినాది. నీ కాడికి వొస్తే.. అసలు ఎలచ్చను గంట మోగడానికి ముందుగాలే.. నీ సీటీ సిరిగిపొతాదేమో అని అనుమానంగా వుండాదబ్బయ్యా.. ఎట్టాగంటవా? అదే జెప్పబోతన్నా.. రొవ్వంత జాగర్తగా యినుకో! సెంద్రబాబు మీ అన్న నాని మీద పగబట్టినట్టుగా గెంటేసినాక ఏదో జగనన్న పంచన జేరినాడనుకో. అదాటుగా నువు సీన్లోకి బలే ఎంట్రీ ఇచ్చినావబ్బయ్యా! మా అన్న రెండు సార్లు గెలిస్తే.. అసలు ఆ ఎలచ్చన్లలో పన్జేసి గెలిపించింది నేనే అంటావుంటివి. ఏమోనబ్బా.. మా నెల్లూరు మీ బెజవాడకి శానా దూరం గదా. అందుకేగావాల నీ పేరు యిదివరలో యినబడలా! సరే, ‘గెలుపు అనే బిడ్డకి శానా మంది నాయినలుంటారని’ ఇంగ్లీసులో ఓ సామెతుండాదిలే. ఆ మాదిరిగా మీ అన్నయ్య గెలిస్తే అంతా నీ పెతాపమే అని జెప్పుకుంటా వుండావు. ఓకే! అన్నయ్యని బయటకి పంపేయగానే.. సెంద్రబాబుకు వత్తాసు ఏసుకోని శానా దుడుకు మాటలు అంటావుండావు. మీ అన్న నానికి అంత సీన్లేదని అంటావుండావు. ఆయన లేడు గనక.. బెజవాడ సీటుని నీ సేతుల్లో యేలుకో తమ్ముడా అని సెంద్రబాబు అనబోతాడని నీకు ఆసె గదా. ఆయన గొప్పదనం గూడా యిట్టాంటి ఆసెలు పుట్టించడమే గదా? మరైతే సీక్రేటు జెప్తా యిను.. సుజనా సౌదరి అనే పెద్దమడిసి నీకు ఎరుకే గదా! మీ సెంద్రబాబు తోలితేనే గదా ఆయన పొయ్యి పువ్వు పార్టీలో గూసోని ఆణ్నించి రాజకీయం జేస్తన్నాడు. ఆయనకీ సెంద్రబాబుకీ ఉండే బందం పైకి కనపడకపొయినా సరే.. ఫెవికాల్తో అతికించినదానికంటె గట్టిదేననే సంగతి నీగ్గూడా తెలుసు గదా. మరి తాజా తాజా కబుర్లు నీ సెవిలో పడినాయో లేదో! ఆ సుజనా సౌదరి అనే పెద్దమడిసి బెజవాడ ఎంపీ సీటు మీద కన్నేసినాడంట. ఎటూ పువ్వు పార్టీలో ఉన్నాడు గాబట్టి.. పువ్వు టిక్కెట్టు మీదనే పోటీ జేస్తాడనుకో… నీకు యిప్పుటికిప్పుడు అడ్డం రాబోయేదేమీ లే. కాపోతే.. పువ్వుతో సైకిలుకి, గాజుగ్లాసుకి ముడిపడతాదేమో అని కూడా ఆయనే లీకులు వదలతండాడు అబ్బయ్యా సిన్నీ! యినుకున్నావా?? అదేగానీ జరిగిందనుకో.. ఎంపీల వరకు గెలిసే సీట్లే గావాలని పువ్వు పార్టీవోళ్లు ఫిటింగు బెట్టకుండా వుంటారా? ఆముడి పడినా బెజవాడ పువ్వుకే సమర్పయామి అయిపోతాది. అప్పుడిక నీ బతుకు మూడుజెండాలు బుజాన యేస్కోని మళ్లీ వూరంతా తిరగతా వుండడమే. నీకొక దారీ దిక్కూ యెప్పుటికి దక్కతాదో యెవురికెరుక అబ్బయ్యా! ఒకేళ- పువ్వుతో సైకిలుకు ముడిపడలేదే అనుకో.. నీ బతుకు యింకా కనాగస్టంగా అయిపోతా దబ్బయ్యా! సెంద్రబాబు ఒక సేత్తో నీకు టికెటిస్తాడనుకుందాం. రెండో సేత్తో- రెండో కంటికి తెలీకుండా నీ యెనకాల గొయ్యి కూడా తవ్విపెడతాడు! గోయిందా గోయింద! ‘సీసీ.. అట్టా యెందుకు జేస్తాడు’ అని గీర మాటలు మాటాడబోక నాయినా! అదే మరి సెంద్రబాబు మంత్రాగం. నీలాంటోడు ఆయన్ని నమ్ముకోని యెప్పుటికీ యీ పంచనే పడుంటాడు. కానీ.. పువ్వు పార్టీలోకి సెంద్రబాబు సొరబెట్టిన సుజనా సౌదరి లాంటి పెద్దమడిసి గెలిస్తే.. ఢిల్లీలో గూసోని బాబు గారి పన్లన్నీ గుట్టుసప్పుడు గాకుండా సక్కబెడతా వుంటాడు గదా! అదొక్కటే యేముండాదిలే. లోపల్లోపల ఆ సౌదరికీ- సెంద్రబాబుకీ యెన్నిన్ని లుకలుకల బందాలుండాయో నేను నీకు జెప్పాల్నా అబ్బయ్యా..! నెల్లూరోణ్ని- నాకంటే.. బెజవాడోడివి- నీకే యిట్టాంటి లోగుట్టు కతలు మాబాగా తెలస్తాయి. కాదంటావా? కాబట్టి నాయినా సిన్నీ! అన్నియ్య పొయినాడని.. యిక రాజ్జెమంతా నువ్వే యేలుకోవచ్చునని మురిసిపోబాక. మిడిసిపడబోక. ‘యెన్నాల్లో యేసిన వుదయం.. ఇయ్యాలే ఎదురవుతోంటే..’ అని సాంగులూ గట్రా యేసుకోని పండగజేసుకోబాక. సెంద్రనీతి రాజకీయాల్లో యింకా యెన్నెన్ని టర్నింగులుండాయో.. యెన్నెన్ని లోయలుండాయో.. నీ కలలబండి యేడ కూలిపోబోతాదో.. తెలవదు గదా! అందుకే రొవ్వంత జాగర్తగా పో అబ్బయ్యా! యింకా నాకు తిరుగు లేదని యిసురుకుంటా తిరిగినావనుకో.. అన్నకు జేసిన మాదిరిగానే సెంద్రబాబు నీ సీటీ గూడా అవలీలగా సించేయగల్డు! ✍️నెల్లూరు పెద్దారెడ్డి -
ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు..
-
నెల్లూరు శివాలయంలో శివరాత్రి సంబరాలు
-
Nellore: స్పా ముసుగులో వ్యభిచారం.. 14 మంది అరెస్ట్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఆరుగురు యువతులు, ఆరుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Hyderabad: ‘దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది.. నన్ను పెళ్లి చేసుకో’
సాక్షి, హైదరాబాద్: నేను ఖయామత్ బంధిష్‌ను (దుష్టశక్తులు ధరికి రాకుండా కాపాడే గొప్ప శక్తిమంతుడిని) అంటూ మాయమాటలు చెప్పి యువతులను వశపరుచుకుంటున్న బాబా ముసుగులో ఉన్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్‌హౌస్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. లంగర్‌హౌస్ ఎండీలైన్స్‌లో నివాసముండే 18 సంవత్సరాల యువతి గత 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ప్రాంతాల్లో వైద్యం కోసం తిరిగినా ఫలితం లేకపోవడంతో కొందరి సలహా మేరకు నెల్లూరులోని ఓ దర్గాకు చేరారు. నెల్లూరు ఏసుపాలెం గ్రామంలోని రెహమతుల్లా దర్గా ప్రధాన నిర్వాహకుడు హాతీష్పాషా బాబాను(52) రెండేళ్ల క్రితం కలిసి సమస్యను తెలిపారు. మంత్రశక్తులతో నయం చేస్తానంటూ నిమ్మకాయలు, కాగితాలు ఇచ్చి పంపేవాడు. నిత్యం వైద్యం, మంత్రం కోసం నెల్లూరు వెళ్లిన బాధితులకు హతీష్ బాబా రెండు నెలలుగా ఈ అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. తాను ఖయామత్ బంధిస్తానని తనను పెళ్లి చేసుకుంటే సమస్యలు పోవడమే కాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు దరిదాపులోకి రావని తెలిపాడు. నమ్మిన తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకొని ఈ నెల 11న రాత్రి టోలీచౌకీలోని ఫంక్షన్హాల్లో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పాషా బాబా వివాహసమయానికి ముందు అనారోగ్యం అంటూ ఆస్పత్రిలో చేరి బాధితురాలి కుటుంబీకుల ఫోన్లకు స్పందిచట్లేదు. దీంతో భాదితులు లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా నెల్లూరుకు చెందిన బాబా మంత్రాలు, భూతవైద్యం పేరుతో ఇప్పటికే ఏడుగురు యువతులను పెళ్లిచేసుకొని పలువురిని మోసం చేసి.. మరి కొందరి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిసింది. ఇతనిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. చదవండి: పంజగుట్టలో అర్ధరాత్రి గ్యాంగ్ హల్చల్.. యువకుడిపై 15 మంది దాడి -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారి పనుల్లో నిమగ్నమైన కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఘటనా స్థలిలోనే ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందగా మృతుల సంఖ్య అయిదుకి చేరింది. మిగతా వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు అసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు ప్రమాదాన్ని గమనించి ఆగిపోయారు. ప్రమాదంపై చలించిపోయిన ఎంపీ క్షతగాత్రులను తరలించే చర్యలు చేపట్టారు. యాక్సిడెంట్ జోన్‌గా ఉన్న మోచెర్ల వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని భరోసానిచ్చారు. చదవండి: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ -
సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం
-
నెల్లూరు: బాలిక గొంతుకోసిన ఘటనలో కామాంధుడి అరెస్ట్
సాక్షి, నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నక్కల కాలనీలో బాలిక గొంతుకోసి, యాసిడ్ పోసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నాగరాజుగా గుర్తించిన పోలీసులు.. బాధితురాలికి దగ్గరి బంధువు అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఇంట్లో ఎవరూలేని సమయంలో 14ఏళ్ల బాలికపై నాగరాజు అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాలిక నోరు, ముఖంపై పోశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. చదవండి: విషాదం.. కొడుకును నడుముకు కట్టుకుని.. చెరువులో దూకిన తల్లి మంత్రి పరామర్శ చెముడుగుంటలో దుండగుడి చేతిలో గాయపడి నెల్లూరులోని అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతున్న మైనర్‌ను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఆడబిడ్డలపై కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాలికకు సొంత ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే చెన్నైకు తరలిస్తామన్నారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అధికారుల పరామర్శ దుండగుడి చేతిలో గాయపడిన మైనర్‌ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఎస్పీ సీహెచ్ విజయారావు, నెల్లూరు కమిషనర్ హరిత, ఆర్డీఓ మలోలా, డీఎస్పీ హరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో మాట్లాడి బాలికకు మెరుగైన వైద్యం అందిం చేందుకు అపోలోకు తరలించామని గిరిధర్‌రెడ్డి తెలిపారు. -
Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు
ఆమెకు చూపు సరిగా లేదు. కాని అద్భుతంగా వండుతుంది. ఇలా వండమని యూ ట్యూబ్‌లో వంటలు చేస్తూ అందరినీ అభిమానులుగా మార్చుకుంది. ఒకరు కాదు... ఇద్దరు కాదు రెండున్నర లక్షల మంది సబ్స్క్రయిబర్లతో స్టార్‌గా వెలుగుతున్న తెలుగు చెఫ్ బొడ్డు నాగలక్ష్మి. ఈమె వీడియోలు చూశారా మీరు? ‘అందరికీ నమస్తే. నేను నాగలక్ష్మి, ఈమె కవిత. మేమిద్దరం వదిన మరదళ్ళం’ అని మొదలవుతుంది నాగలక్ష్మి చేసే వీడియో. నిజానికి ఆమె చేసేది జంట వీడియో. ప్రతి వీడియోలోనూ వదిన కవిత ఉంటుంది. ఇద్దరి పేరు మీద ‘కవిత నాగ వ్లోగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ఉంది. 2020 వ సంవత్సరం సెప్టెంబర్‌లో మొదలైన చానల్ రెండేళ్ల లోపే రెండున్నర లక్షల సబ్స్క్రయిబర్లను సాధించింది. నాగలక్ష్మికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తోంది. ఇంతచేసి నాగలక్ష్మికి చూపు లేదు. కాని అది ఆమె విజయానికి అడ్డంకి కాలేదు. బతికిన పసిగుడ్డు నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన రైతు కృష్ణారెడ్డి ఆఖరు కూతురు నాగలక్ష్మి. పుట్టుకతోనే చూపు లేదు. పురిట్లో చూసిన బంధువులు ‘ఎందుకు కృష్ణారెడ్డి అవస్థ పడతావు. వడ్లగింజ వేసెయ్’ అని సలహా ఇచ్చారు. కాని నాగలక్ష్మి తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుంది. ‘చూపులేకపోతే నా బిడ్డ కాకుండా పోతుందా’ అంది. వయసు పెరిగాక అర్థమైన విషయం ఏమిటంటే నాగలక్ష్మికి ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడికన్ను ఏదైనా వస్తువు దగ్గరగా పెట్టుకుంటే 5 శాతం కనిపిస్తుంది. అంటే ఆమె కుడికన్ను చాలా కొద్దిగా అతి దగ్గరి వస్తువులు (రెండు అంగుళాల దూరంలో) ఉంటే చూస్తుంది. అయినా సరే నాగలక్ష్మి బెదరలేదు. ఐదు వరకు బడికి వెళ్లింది. ఆ తర్వాత ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉండిపోయింది. నీళ్లు మోయడం మామూలు పనులు చేయడం చూపు లేకపోయినా అడుగుల అంచనాను బట్టి అలవాటు చేసుకుంది. కాని సమస్యలు ఆమెను వదల్లేదు. తల్లి వియోగం 18 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. అప్పటికి అక్కకు పెళ్లయి వెళ్లిపోవడంతో ఇంటిలో వంట పని నాగలక్ష్మి బాధ్యత అయ్యింది. తండ్రికి, అన్నయ్యకు ఆమే వండి పెట్టాల్సి వచ్చింది. కాని అన్నం వండటం తప్ప నాగలక్ష్మికి ఏమీ రాదు. అప్పుడు పక్కనే ఉండే ఒక అవ్వ ఆమెకు సాయం చేసింది. ‘నువ్వు వండుతూ ఉండు. నేను పక్కన ఉండి సలహా ఇస్తుంటాను’ అని పక్కన ఉండి వంట నేర్పించింది. ఆ అవ్వకు బాగా వండటం వచ్చు. అది నాగలక్ష్మికి కూడా వచ్చేసింది. అయినప్పటికీ ఇంట్లో ఆడతోడు లేకపోవడం వల్ల శారీరకంగా మానసికంగా వచ్చే ఇబ్బందులకు తోడు కోసం నాగలక్ష్మి బాధలు పడింది. అయితే ఆమె అన్న ఆదిరెడ్డి వివాహం చేసుకుని ప్రకాశం జిల్లాకు చెందిన బోండాల కవితను కోడలిగా తేవడంతో ఆమె జీవితానికి పెద్ద ఆసరా దొరికింది. యూట్యూబ్ ప్రయోగాలు 2018లో నాగలక్ష్మి అన్న ఆదిరెడ్డి యూట్యూబ్ చానల్ ప్రారంభించి ‘బిగ్‌బాస్’ షో మీద కామెంటరీ చెప్పేవాడు. ఆ వీడియోలు హిట్ అయ్యి అతనికి పేరు వచ్చింది. ఆ సందర్భంలో ఒకరోజు నాగలక్ష్మి చేత సరదాగా కామెంటరీ చెప్పిస్తే ఆ వీడియో అందరూ బాగుందన్నారు. అప్పటికి నాగలక్ష్మికి సీరియల్స్ పిచ్చి బాగా ఉండేది. టీవీలో సీరియల్స్‌ను చూసేది (వినేది). ఫోన్లో అయితే కంటికి దగ్గరగా పెట్టుకుంటే సీరియల్ బూజరగా కనిపిస్తుంది. అందువల్ల ఆదిరెడ్డి ఆమె చేత ‘సీరియల్ పిచ్చి’ అనే షో చేయించాడు. కాని దానికి పెద్ద స్పందన రాలేదు. కాని 2020లో లాక్డౌన్ సమయంలో నాగలక్ష్మి, కవిత కలిసి వంట వీడియోలు మొదలెట్టారు. ఇద్దరూ మంచి మాటకారులు కావడంతో రెండు రోజుల్లోనే 10 వేల మంది సబ్స్క్రయిబర్లు వచ్చారు. ‘కవిత నాగ వ్లోగ్స్’ అలా మొదలైంది. జామకాయ రోటి పచ్చడి నెల్లూరు పప్పుచారు తనకు చూపు లేదని ఈసురోమనడం నాగలక్ష్మి స్వభావంలో లేదు. ప్రతి వీడియోలో వదినతో కలిసి హుషారుగా కబుర్లు చేస్తుంది. చూపున్నట్టే వంటగదిలో కదలుతూ వంట చేస్తుంది. వదిన మరదలు కలిసి స్థానిక వంటలు రకరకాలుగా చేస్తూ భారీగా అభిమానులను కూడగట్టుకున్నారు. నాగలక్ష్మి చేసే పప్పుచారుకు పెద్ద గిరాకీ ఉంది. అలాగే చుక్కకూర పచ్చడి వీడియో పెద్ద హిట్ అయ్యింది. పచ్చి జామకాయ రోటి పచ్చడి కూడా ఈమె రుచి చూపించింది. చపాతీ లడ్డు మరో వెరైటీ. నెల్లూరు చేపల పులుసును అథెంటిక్‌గా చేసి చూపిస్తుంది. ‘నేను నూనె ఎక్కువ వేశానని ఒక్కరు కూడా అనరు. అంత సరిగ్గా వేస్తాను’ అంటుంది నాగలక్ష్మి. రకరకాల కామెంట్లు నాగలక్ష్మి వీడియోలకు 40 ఏళ్లు దాటిన అభిమానులు ఎక్కువ. అయితే ఈ వదిన మరదళ్ల మధ్య కూడా తంపులు పెట్టడానికి అన్నట్టు వీడియోల కింద కొందరు కామెంట్లు పెట్టారు. వీరు విడిపోయారని కూడా అన్నారు. కాని వదిన మరదళ్లు కలిసి వీడియోలు చేస్తూనే ఉన్నారు. తమ ఇంట్లో జరిగే ప్రతి విశేషాన్ని దాపరికం, శషభిషలు లేకుండా వ్యూయెర్స్తో పంచుకోవడమే వీరి వీడియోలలో విశేషం. ‘చిన్న చిన్న సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునేవారి వార్తలు వింటుంటాను. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవాలనేదే నా సలహా’ అని నాగలక్ష్మి అంటుంది. తన సంపాదన నుంచి సోనూసూద్ ఫౌండేషన్‌కు, సిఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేసింది నాగలక్ష్మి. అపజయం ఆమె కంట పడలేదు. ఆమె తన ప్రతి అడుగులోనూ వినేది గెలుపు పిలుపునే. -
కాలనీలపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నానాటికీ విస్తరిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. 20వ డివిజన్లోని ఇస్కాన్ సిటీలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో రోడ్డు సమస్యను ఆయనకు స్థానికులు తెలియజేశారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణానికి మేయర్ స్రవంతితో కలిసి శంకుస్థాపనను చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పారు. ఆయా కాలనీల అభివృద్ధికి కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ మహేష్, నేతలు శ్రీనివాసరావు, మల్లికార్జున్‌యాదవ్, ఖాదర్‌బాషా, రమణయ్య, రవి, వెంకటరమణయ్య, విఠల్, డేవిడ్‌రాజు, కవిత, తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఎంపీడీఓల కల నెరవేరిన వేళ.. కొత్త పోస్టుల్లో చేరిక -
భార్యను తీసుకొని ఆసుపత్రికి వెళితే.. కారుతో డ్రైవర్ ఉడాయింపు
సాక్షి, నెల్లూరు: కారుతో ఉడాయించిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. ఆత్మకూరులో లైన్మెన్గా పనిచేస్తున్న అదే మండలం అప్పారావుపాళేనికి చెందిన పెంచలయ్యకు హ్యుండయ్ వెన్యూ కారు ఉంది. యాక్టింగ్ డ్రైవర్‌గా అప్పారావుపాళేనికి చెందిన బాలకృష్ణ పనిచేసేవారు. డయాలసిస్ నిమిత్తం పెంచలయ్య, ఆయన భార్యను ఆస్పత్రికి కారులో సోమవారం తీసుకొచ్చారు. వారు ఆస్పత్రి లోపలికి వెళ్లగా, అదునుగా భావించిన బాలకృష్ణ కారుతో ఉడాయించాడు. రాత్రి ఏడు గంటలకు బయటకొచ్చిన పెంచలయ్య ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బెంగళూరు సమీపంలోని టోల్‌ప్లాజాను కారు దాటినట్లు పెంచలయ్య ఫోన్‌కు మంగళవారం ఉదయం మెసేజ్ వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్కే బీచ్‌లో వివాహిత అదృశ్యం.. భర్త కళ్లుగప్పి ప్రియుడితో..
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన వివాహిత అదృశ్యం వెనుక పక్కా ప్లాన్ బయటపడింది. సోమవారం ఆర్కే బీచ్‌లో కనిపించకుండా పోయిన వివాహిత సాయిప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. ఆమె ఆఖరి ఫోన్‌కాల్‌ను పోలీసులు కావలిలో ట్రేస్ చేశారు. ప్రియుడితో కలిసి సాయిప్రియ రైల్లో నెల్లూరు జిల్లాకు పరారైనట్లు తేలింది. సాయిప్రియ అదృశ్యమైన సమయంలో బీచ్ రోడ్లోనే ఆమె ప్రియుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే భర్తను బురిడి కొట్టించి లవర్ సాయితో పరారైనట్లు బయటపడింది. చదవండి: బీచ్‌లో గల్లంతయ్యిందా..? లేక ఇంకేమైనా జరిగిందా..? అసలేం జరిగిందంటే చిరిగిడి సాయి ప్రియ, శ్రీనివాస్ భార్యభర్తలు. కానీ సాయి ప్రియ కొంతకాలంగా రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లింది. శ్రీనివాస్ ఫోన్లో మెసెజ్‌లు చూస్తుండగా.. అలలు దగ్గరకు వెళ్తానని చెప్పింది. దీన్నే అవకాశంగా భావించిన సాయిప్రియ రాత్రి 7.30 గంటల సమయంలో ప్రియుడితో కలిసి బీచ్ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని కంగారు పడిన శ్రీనివాస్ వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పక్కా స్కెచ్ ప్రమాదవశాత్తు సాయిప్రియ సముద్రంలో పడిపోయి ఉంటుందని భావించిన అధికారులు.. వివాహిత ఆచూకీ కోసం సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ముందుగా గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నావీ సాయం కోరారు. దీంతో రెడు కోస్ట్ గార్డ్ షిప్‌లతో పాటు ఓ హెలికాప్టర్‌తో సముద్రం మొత్తం గాలించారు. అయినా జాడ దొరకలేదు. అయితే చివరకు అమ్మాయి సముద్రంలో గల్లంతు కాలేదని, ప్రియుడితో కలిసి నెల్లూరుకు చెక్కేసినట్లు తేలింది. ఎంతోమందిని టెన్షన్ పెట్టిన సాయిప్రియ మిస్సింగ్ చివరకు డ్రామాగా తేలడంతో అందరూ విస్తుపోయారు. -
థాంక్యూ సీఎం సార్ అంటూ ర్యాలీ చేసిన నెల్లూరు సచివాలయ ఉద్యోగులు
-
రూ.3.14 కోట్ల మద్యం బాటిళ్లు ధ్వంసం.. రోడ్డు రోలర్‌తో తొక్కించి
సాక్షి, నెల్లూరు: మద్యం అక్రమరవాణా, అనధికార విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా సెబ్, పోలీసు అధికారులు దాడులు చేశారు. మూడు సంవత్సరాల్లో రూ.3.14 కోట్ల అక్రమ మద్యాన్ని స్వా«దీనం చేసుకుని వందలాది మందిని కటకటాల వెనక్కి పంపారు. వరుస దాడులతో అక్రమ రవాణా తగ్గుముఖం పడుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. జిల్లా పోలీçసు బాస్‌ల పర్యవేక్షణలో సెబ్ అధికారులు, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్రమ రవాణాకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో కాపు కాసి దాడులు చేస్తున్నారు. కార్లు, బస్సులు, కంటైనర్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్న పొరుగు మద్యంతోపాటు డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వా«దీనం చేసుకుని నిందితులను కటకటాల వెనక్కి పంపుతున్నారు. పక్కాగా.. మూడేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా సెబ్, పోలీసులు 2,744 కేసులు నమోదు చేసి (ఎన్డీపీఎల్, డీపీఎల్) రూ 3,14,37,980 విలువ చేసే 74,547 మద్యం బాటిళ్ల (15,719 లీటర్ల)ను స్వా«దీనం చేసుకున్నారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీలక్ష్మి పూర్తిస్థాయిలో అక్రమ మద్యం కట్టడికి చర్యలు తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత నేరస్తులను బైండోవర్ చేయడంతోపాటు పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తున్నారు. వరుస దాడులు, సెబ్, పోలీసు అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలవడంతోపాటు అక్రమ రవాణా, అనధికార విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మాకివ్వండి సారూ.. పట్టుబడిన మద్యంను ధ్వంసం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ అధికారులు మంగళవారం కొత్తూరు టాస్‌్కఫోర్స్ కార్యాలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను రోడ్డురోలర్లతో తొక్కించారు. దీంతో ఆ ప్రాంతమంతా మద్య ప్రవాహంతో నిండిపోయింది. మద్యం బాటిళ్లను చేస్తున్నారన్న ధ్వంసం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు, మందుబాబులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డురోలర్లతో తొక్కించే బదులుగా తమకివ్వండి సారూ.. కొందరు అక్కడ విధుల్లో ఉన్న సెబ్, పోలీసు సిబ్బందిని బతిమిలాడారు. వారు నిరాకరించడంతో వెళ్లిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నెల్లూరు ఉప ఎన్నిక.. ముగిసిన ప్రచార పర్వం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. దీంతో నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. 23న జరగనున్న పోలింగ్‌పై అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఎన్నికల విధుల్లో 1300 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 279 పోలింగ్ బూత్‌లను అధికారులను ఏర్పాటు చేయనున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
Andhra Pradesh: ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీ ఏర్పడిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 6. నామినేషన్ల పరిశీలన జూన్7న. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 9. జూన్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 28న ఉప ఎన్నికల షెడ్యూల్ ముగుస్తుంది. కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉప ఎన్నిక జరిగే స్థానాలు ►ఉత్తర ప్రదేశ్: రెండు ఎంపీ స్థానాలు (రాంపూర్, అజాంఘర్) ►పంజాబ్: ఒక ఎంపీ స్థానం (సంగ్రూర్) ►త్రిపుర: నాలుగు అసెంబ్లీ స్థానాలు (అగర్తల, టౌన్ బోర్డోవళి, సుర్మా, జుబరాజ్‌నగర్) ► ఆంధ్రప్రదేశ్: ఒక అసెంబ్లీ స్థానం (ఆత్మకూరు) ►ఢిల్లీ: ఒక అసెంబ్లీ స్థానం (రాజిందర్ నగర్) ►జార్ఖండ్: ఒక అసెంబ్లీ స్థానం (మాందార్) -
మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి
మర్రిపాడు: మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నేతగా మేకపాటి విక్రమ్‌రెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మెట్టప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం కృషి చేస్తోందన్నారు. మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్–1, 2తో పాటు ఈ ప్రాంతంలో విద్య, వైద్యానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గ్రామాల వారీగా నాయకులను విక్రమ్‌రెడ్డికి పరిచయం చేయించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఇన్చార్జి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను నిరంతరం అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకు ముందుగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డిలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కేతా వేణుగోపాల్‌రెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, బోయళ్ల పద్మజారెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్, సొసైటీ చైర్మన్ యర్రమళ్ల చిన్నారెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, నారపరెడ్డి సుబ్బారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
కన్నీరు పెట్టిన సంగం కాలనీ.. మీడియా అత్యుత్సాహం
సంగం దళితకాలనీ కన్నీరుమున్నీరైంది. ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్నారులు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో పడి మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు కళ్లముందే ఉన్న ఆ చిన్నారులు అంతలోనే విగతజీవులు కావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. తమ బిడ్డలను ఉన్నంతలో ఉన్నతంగా చదివించాలని తపన పడుతున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చారు. సాక్షి, నెల్లూరు: ఇద్దరు చిన్నారులను కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ మింగేసింది. అప్పటి వరకు తమ కళ్లముందు తిరుగాడిన శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) చిన్నారులు విగతజీవులు కావడంతో దళితవాడ గొల్లుమంది. సంగం గ్రామం దళితవాడకు చెందిన దారా వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెల తర్వాత శ్రీరామ్ (8) జన్మించాడు. వెంకటేశ్వర్లు తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శ్రీరామ్‌ను ఉన్నతంగా చదివించాలని బెంగళూరులో కాపురం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. పని ఉండడంతో మంగళవారం వెంకటేశ్వర్లు, తన కుమారుడు శ్రీరామ్‌తో కలిసి స్వగ్రామం సంగం వచ్చారు. సంగం దళితవాడకు చెందిన గడ్డం ఆదినారాయణమ్మ ఒకగానొక్క కుమారుడు ఈశ్వర్. అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీరామ్, ఈశ్వర్, మరో చిన్నారి యక్షిత బహిర్భూమికని సమీపంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకొని కాలువలోకి దిగిన శ్రీరామ్, ఈశ్వర్ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలు బయటకు తీయడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. అప్పుడే అన్నంపెట్టి వచ్చా నా కుమారుడు ఈశ్వర్ బడికెళ్లి ఉంటే 11 గంటల సమయంలో వెళ్లి భోజనం పెట్టి వచ్చానని గంట వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. ఒక్కగానొక్క మగబిడ్డను దేవుడు దూరం చేశాడంటూ కన్నీరుమున్నీరు అయింది. – ఆదినారాయణమ్మ, ఈశ్వర్ తల్లి తల్లికి ఏమని చెప్పను బెంగళూరు నుంచి నేను, నా కొడుకు మంగళవారం వచ్చాం. నా భార్య, కూతుర్లు బెంగళూరులోనే ఉన్నారు. ఈ వార్తను నా భార్యకు ఎలా చెప్పాలంటూ కన్నీరు పెట్టుకోవడంతో అందరిని కలిచివేసింది. – దారా వెంకటేశ్వర్లు, శ్రీరామ్ తండ్రి మీడియా అత్యుత్సాహం.. ఇదిలా ఉండగా కనిగిరి రిజర్వాయర్ చిన్నారుల మృతి ఘటనపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. మృతి చెందిన ఈశ్వర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లగా.. కొన ఊపిరితో ఉన్న శ్రీరాంను 108 లో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ శ్రీరాం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీరాం మృతదేహాన్ని తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌ను మాట్లాడగా.. ఆలస్యం కావటంతో బాలుడి తండ్రి కొడుకు మృతదేహాన్ని బైక్‌పైనే ఇంటికి తీసుకెళ్లాడు. అయితే మరో రుయా ఘటన అంటూ కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో తప్పుగా ప్రచురించాయి. దీనిపై స్పందించిన పోలీసులు మరో రుయా అంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. -
ఇప్పటికే 2 నెలలు ఆలస్యం.. మామిడి ప్రియులకు చేదు వార్త
మధుర ఫలంగా పేరుగాంచిన మామిడి.. వరుస సీజన్లో రైతులకు చేదు అనుభావాలను మిగిల్చుతోంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే రెండు నెలలు ఆలస్యంగా కాయలు వస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడి మాత్రం రావడం లేదు. దీంతో అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన ఉలవపాడు మామిడి రైతులు తీవ్రనష్టాలు చవిచూసే ప్రమాదం ఏర్పడింది. సాక్షి, నెల్లూరు : జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు మండలాలతో పాటు, కావలి, ఆత్మకూరు, పొదలకూరు, కలిగిరి, సైదాపురం వంటి ప్రాంతాల్లో దాదాపు 12,800 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో ఒక్క ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే 7,500 హెక్టార్ల వరకు సాగు ఉంది. ఈ ప్రాంతంలో పండే బంగినపల్లి, తోతాపురి, చెరుకు రసాలు, బెంగళూరు కాయలు వంటి మామిడి రకాలకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్నాయి. ప్రతి ఏడాది వేల టన్నుల కాయలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. దాదాపు రెండు, మూడు నెలలపాటు సీజన్ జోరుగా సాగుతుంది. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా సరైన ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఎగుమతులపై దిగుబడి గణనీయంగా ప్రభావం చూపుతోందని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతంత మాత్రంగా కాయలు వచ్చిన మామిడిచెట్టు ప్రతికూల వాతావరణంతోనే.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధిక వర్షాలు కురవడంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. అధిక వర్షాల వల్ల పూతరావడం దాదాపు నెల రోజుల ఆలస్యమైంది. వచ్చిన పూత కూడా సక్రమంగా నిలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిందె శాతం తగ్గిపోయి కేవలం 30 శాతం పిందె మాత్రమే తోటల్లో వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని తోటల్లో పిందెలు రాని దుస్థితి నెలకొంది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా వాతావరణ పరిస్థితులు సక్రమంగా అనుకూలిస్తే ఒక ఎకరా తోటలో నాలుగు టన్నుల వరకు కాయలు వచ్చే అవకాశం ఉంది. కాని ఈ ఏడాది ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల కాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బాగా దిగుబడి వచ్చిందనుకుంటే రెండు టన్నులు మించి రాదని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎకరాకు దాదాపు రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడిని రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ధరలు ఫర్వాలేదు... రాష్ట్ర వ్యాప్తంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఈ మేరకు ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి రకం మామిడి టన్ను రూ.70 వేలు మార్కెట్లో పలుకుతోంది. ఈ రేటు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. అయితే డిమాండ్‌కు తగ్గట్లు కాయలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు రెండు టన్నుల లెక్కన రైతుకు దిగుబడి తగ్గినా ప్రస్తుత రేటు ప్రకారం దాదాపు రూ.1.40 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ ఏడాది మామిడి రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధిక వర్షాలతో పూత సరిగ్గా రాలేదు అధిక వర్షాల వల్ల ఈ ఏడాది మామిడిపూతపై తీవ్ర ప్రభావం పడింది. పూత సరిగ్గా రాలేదు. వచ్చిన పూతలో కూడా కేవలం 30 శాతం మాత్రమే పిందె వచ్చింది. దీని వల్ల దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. ఒక ఎకరా తోటలో ఒక టన్ను నుంచి టన్నునర కాయలు మాత్రమే దిగుబడి వస్తోంది. ప్రఖ్యాతిగాంచి ఉలవపాడు మామిడి రైతులకు ఇది నష్ట కలిగించే అంశమే. – బ్రహ్మసాయి, ఉద్యానవనశాఖ అధికారి ఎగుమతులపై ప్రభావం కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు ప్రాంతాల్లో పండే మామిడికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. దాదాపు మూడు నెలలపాటు ఉలవపాడు కేంద్రంగా మామిడి వ్యాపారం జోరుగా సాగుతోంది. మార్చి, ఏప్రిల్, మే మాసాలు ఈ వ్యాపారానికి చాలా కీలకం. కాని ఈ ఏడాది ఇప్పటివరకు మార్కెట్లోకి కాయలు రాని పరిస్థితి ఉంది. ఇది ఉలవపాడు నుంచి జరిగే మామిడి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది విదేశాలకు దాదాపుగా ఎగుమతులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా ఉదే పరిస్థితి ఉంది. కరోనా ఆంక్షల వల్ల స్లాట్లు దొరక్క విదేశాలకు ఎగుమతులు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం కాయలు లేకపోవడంతో దేశీయంగానే అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది 40 నుంచి 50 వేల టన్నుల వరకు మామిడి దిగుబడి ప్రాంతం నుంచి వస్తే, వీటిలో 10 వేల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతులు ఉండేవని అధికారులు వెల్లడిస్తున్నారు. -
ఏం కష్టం వచ్చిందో ఏమో.. పుట్టింటికి వచ్చి మరీ వివాహిత..
సాక్షి, నెల్లూరు రూరల్: ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఓ వివాహిత పుట్టింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరురూరల్ పరిధిలోని పెద్దచెరుకూరులో గురువారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు స్థానికుడైన పులి దేవదానం కెనరా బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి రెండో కుమార్తె సురేడ్డి కీర్తన(30)కు రాజా అనే వ్యక్తితో వివాహమైంది. రాజా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. వీరికి కుమారుడు శ్రీఫల్, కుమార్తె శ్రీషా ఉన్నారు. వీరు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. బుధవారం కీర్తన హైదరాబాద్ నుంచి పెద్దచెరుకూరులోని తండ్రి వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం కీర్తన ఇంటి మిద్దెపైన ఉన్న బెడ్రూంకు వెళ్లింది. కుటుంబసభ్యులు గది వద్దకు వెళ్లి కీర్తనను పిలవగా ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కీర్తనను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే కీర్తన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చదవండి: ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో.. రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే.. -
గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు
-
మంత్రి గౌతమ్ రెడ్డి కన్నుమూత.. నెల్లూరు ఫంక్షన్లో చివరి ఫోటో
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ చిరునవ్వుతో పూర్తిగా ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మరణించారంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: మేకపాటి గౌతమ్‌రెడ్డి.. ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి కోసమే మంత్రి మేకపాటి గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న తరువాత ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. రావడం వెంటనే నిన్న రాత్రి నెల్లూరులో ఒక నిశ్చితార్థం కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ బంధువులతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోలో కూడా చాలా సరదాగా కనిపిస్తున్నారు. ఇదే గౌతమ్ రెడ్డి దిగిన చివరి ఫోటోగా భావిస్తున్నారు. ఫంక్షన్ తరువాత తిరిగి హైదరాబాద్‌లోని ఇంటికెళ్లిపోయారు. తెల్లవారేసరికి, గౌతమ్‌రెడ్డికి గుండెపోటు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. చదవండి: Mekapati Goutham Reddy: తండ్రికి తగ్గ తనయుడు.. ఒకే ఒక్కడు.. -
సముద్రం ఒడ్డున సైకత చిత్రం.. సీఎం జగన్ నుంచి బిపిన్, లతామంగేష్కర్, మోదీ వరకు
ముఖ్య ఘటనలు జరగడం, ప్రత్యేక దినోత్సవం వచ్చిందంటే చాలు సింహపురి గడ్డపై సముద్రం ఒడ్డున సైకత చిత్రం వెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో మొదలుపెట్టి మొన్న భారతదేశ త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, నిన్న గానకోకిల లతామంగేష్కర్ మరణం వరకు ఎందరో ప్రముఖుల సైకత చిత్రాలు సముద్రం ఒడ్డున వెలిశాయి. గడచిన పన్నెండేళ్లుగా 284 చిత్రాలను రూపొందించి ఎన్నో ప్రశంసలు, మరెన్నో అవార్డులను అందుకున్నాడు మంచాల సనత్‌కుమార్. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సనత్‌కుమార్ బీఎస్సీ పూర్తి చేశాడు. చిన్నప్పుడు ఇసుకలో బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్న సనత్ ఎదిగిన తర్వాత తన ఆలోచనలు సైకత చిత్రాల వైపు మళ్లాయి. జీవ వైవిధ్యం, సేవ్ ఓషన్, స్టాప్ టెర్ర రిజం, కాలుష్య నియంత్రణ, ఫ్లెమింగో పక్షుల సంరక్షణ...ఇలా అనేక సామాజిక స్పృహ కల్గించే సైకత చిత్రాలను రూపొందించాడు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సైకతశిల్పాల రూపేణా వివరించాడు. ఎప్పటికైనా సైకత చిత్రాలు వేయడంలో అంతర్జాతీయ పోటీలలో పాల్గోని ప్రతిభ చూపెట్టాలనే లక్ష్యంతో పుష్కర కాలంగా సనత్‌కుమార్ పయనిస్తున్నాడు. విద్యార్థులకు సైకత చిత్రాలు వేయడంలో మెలకువలు నేర్పిస్తూ ఇప్పటి వరకు రెండు వేల మందికి ‘సాండ్ ఆర్ట్ ట్రైనింగ్’ ఇచ్చాడు. మైపాడు బీచ్‌లో 2017లో వంద మంది విద్యార్థులతో ఏకకాలంలో 1186 జాతీయ జెండా సైకత చిత్రాలను తయారు చేయించాడు. దాంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అండగా సైకత శిల్పాలను ప్రదర్శిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై నూతనశకం ఆరంభమంటూ (న్యూ ఎరా బిగినింగ్ ఇన్ ఎడ్యుకేషన్) సైకత చిత్రం వేశాడు. బతుకులు మార్చే గుడి అమ్మ ఒడి, రక్షాబంధన్ రోజున దిశాయాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ సైకత చిత్రాలు తయారు చేశాడు. – మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి, నెల్లూరు -
టీడీపీ వర్గీయుల మరో వికృతక్రీడ.. ఒడిశా బాలికపై అత్యాచారం, హత్య?
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): టీడీపీ వర్గీయుల వికృత క్రీడకు మరో బాలిక బలైపోయింది. విజయవాడలో ఓ టీడీపీ నాయకుడి దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఉదంతం మరువక మునుపే జిల్లాలోని చేజర్ల మండలం పుట్టుపల్లి పంచాయతీ కొట్టాలు గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడికి చెందిన ఇటుక బట్టీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇటుక బట్టీల వద్ద పనిచేయడానికి వచ్చిన ఓ కుటుంబంలోని బాలిక (17) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మృతి సమాచారం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా శవదహనం చేయడం స్థానికంగా వ్యక్తమవుతున్న అనుమానాలకు బలం చేకూరుతోంది. సేకరించిన విశ్వసనీయ సమాచారం మేరకు.. కొట్టాలు గ్రామంలో స్థానిక మాజీ సర్పంచ్, టీడీపీ నేత ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఒడిశాకు చెందిన పలువురు కూలీలు కొన్ని నెలలుగా ఇక్కడ పని చేస్తున్నారు. అయితే మృతి చెందిన బాలిక ఇక్కడ మేనమామ, బాబాయిలతో కలిసి ఉంటుంది. తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లో ఉంటూ అక్కడి ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్నారు. క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ బాలిక (17) అనారోగ్యానికి గురైందంటూ తొలుత ఆత్మకూరు, అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇటుక బట్టీల నిర్వాహకుడు వైద్యం చేయించాడు. అయితే శుక్రవారం రాత్రి ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ) అయినప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆ టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు సమాచారం. ఫిర్యాదు చేస్తే పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయాలు బట్టబయలు అవుతాయనే ఉద్దేశంతో బాలిక బంధువులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బాధితుల సంప్రదాయాలకు భిన్నంగా నెల్లూరు బోడిగాడితోటలో శనివారం బాలిక మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు. ఆనవాళ్లు లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంలో సదరు టీడీపీ నేత సఫలీకృతుడయ్యారని స్థానికులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది.. బాలిక అందంగా ఉంటుంది. దీంతో అక్కడే పని చేసే స్థానిక యవకులు బాలికపై కన్నేసినట్లు సమాచారం. బాలికపై లైంగికదాడికి పలుమార్లు విఫలయత్నం చేశారు. బుధవారం రాత్రి కొందరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడడంతో ప్రతిఘటనలో గాయపడినట్లు గ్రామంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలిక గాయపడి, చనిపోయేంత వరకూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం సాయంత్రం తల్లిదండ్రులు సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. ఆ తర్వాత హడావుడిగా వారి సంప్రదాయాలకు భిన్నంగా దహనక్రియలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆదివారం బాలిక తండ్రికి ఇటుక బట్టీ యజమాని రూ.30 వేలు నగదు ఇచ్చినట్లు సమాచారం. బాలిక మృతిపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో ఆదివారం గ్రామానికి చేరుకుని మొక్కుబడిగా విచారణ జరిపారు. బాలికకు ఫిట్స్‌తో మృతి చెందిందని జిల్లా లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోలీస్ కేసు కూడా లేదు.. బాలిక గాయపడితే పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. వాస్తవానికి ఇది మెడికో లీగల్ కేసు. పోలీసులు ఈ వ్యవహారంపై అనుమానాస్పద మృతిగా తొలుత కేసు నమోదు చేయాల్సి ఉంది. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా ఈ ప్రక్రియలు జరగలేదు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారి తరఫున పట్టించుకునే నాథుడు లేకపోవడంతో సదరు టీడీపీ నేత అందరి నోర్లను నోట్లతో నొక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై ప్రచారం జరగడం ఐసీడీఎస్, కార్మికశాఖ, పోలీసులు బాధితులు నివాసం ఉండే ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారిని భయపెట్టి ఎలాంటి విషయాలు బయటకు పొక్కకుండా సదరు టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బాలిక తండ్రి లోచన్ మాంజీని మీడియా ప్రతినిధులు అడిగితే.. తన కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై లోతుగా విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. -
నెల్లూరు ఆనందయ్యకు నోటీసులు జారీ
-
కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?
-
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
-
ఆ పార్టీలకు ఓటేసినా ఉపయోగం లేదు: మంత్రి అనిల్ కుమార్
-
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది
-
టీడీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు
-
17 నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికల్లోనూ విజయ పరంపర కొనసాగాలని మంత్రులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అందరూ సమష్టిగా పని చేయడం ద్వారా జైత్రయాత్రను కొనసాగించాలని సూచించారు. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో ప్రజలు వైఎస్సార్సీపీని గెలిపించి అఖండ విజయాన్ని అందించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం.. సంక్షేమ పథకాల ఫలాలను అందించడం.. అభివృద్ధిని చేతల్లో చూపడం ద్వారా ప్రజలకు చేరువయ్యామని చెప్పారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు తోడు నీడగా నిలిచామన్నారు. అందుకే మునిసిపల్, పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో జనం ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ వైఎస్సార్సీపీకి తిరుగులేని విజయాలను అందించారని చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మునిసిపాలిటీలకు నిర్వహించే ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు సాధించాలని మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో అజెండా ముగిశాక.. అధికారులు నిష్క్రమించిన అనంతరం రాష్ట్రంలో తాజా పరిణామాలపై సీఎం వైఎస్ జగన్ మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. ఎయిడెడ్ స్కూళ్లపై, గంజాయిపై టీడీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రులు ప్రస్తావించగా.. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నవంబర్ 17 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ కుట్రలను బహిర్గతం చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. -
YSRCP :దెబ్బకి ఎన్నికలంటే బెంబేలెత్తిపోతున్న టీడీపీ
-
బయటికి వస్తే అరెస్ట్ చేస్తాం
-
నెల్లూరు నగరంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటన
-
నెల్లూరు: మహిళతో డాక్టర్ వివాహేతర సంబంధం.. వీడియో వైరల్
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఓ వివాహేతర సంబంధం రచ్చకెక్కింది.. నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లపాటు ఈ ఎఫైర్ కొనసాగింది. అయితే ఇటీవల మహిళను డాక్టర్ బాలకోటేశ్వరరావు దూరం పెడుతున్నాడు. దీంతో సదరు మహిళ.. తన ఎందుకు రావడం లేదని అతని ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. డాక్టర్, మహిళ మధ్య మాటామాటా పెరిగి ఇరువురు పరస్పర దాడులకు దిగారు. కోపంతో చెలరేగిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది. అందరూ చూస్తుండగానే రోడ్డుపై పరస్పరం కొట్టుకున్నారు. అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా! చేపలు, రొయ్యలు, పీతలు.. ఇక మన దరికే ‘మీనం’! -
రియాల్టర్ హత్య: పరుష పదజాలమే ప్రాణం తీసిందా?
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్పీ ప్రాంతానికి చెందిన రియల్టర్ విజయభాస్కర్‌రెడ్డి కిడ్నాప్, దారుణ హత్యకు సంబందించి గురూజీ విషయమై ఆయన వాడిన పరుష పదజాలమే కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ ఆర్మీ ఉద్యోగి నాగర్ కర్నూల్‌కు చెందిన మల్లేష్, విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధాకర్‌బాబు, హైదరాబాద్ బోరబండకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రావణ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణంరాజులను సోమవారం వరకు విచారించనున్నారు. ఈ కేసులో సూత్రధారిగా అనుమానిస్తున్న త్రిలోక్‌నాథ్ అలియాస్ గురూజీ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. తమ కస్టడీలో ఉన్న నిందితుల ద్వారా అతడి కదలికలకు సంబంధించిన వివరాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్వయంగా శుక్రవారం కేపీహెచ్‌బీ ఠాణాకు వచ్చి విచారణను పర్యవేక్షించారు. విజయభాస్కర్ హత్య కారణాలను అన్వేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన గురూజీ మూలికా వైద్యంలో సిద్ధహస్తుడని, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేసేవాడని నిందితులు వెల్లడించారు. గురూజీకి రెండు రాష్ట్రాల్లోను భక్తులు ఉన్నారని, ఎక్కువ మంది ఆయన వద్దకు వైద్యం కోసం వచి్చన వారేనని చెప్పారు. ఆయనతో సన్నితంగా ఉండే విజయభాస్కర్‌రెడ్డి గురూజీని విమర్శిస్తుండటంతో పాటు పరుషపదజాలం వాడేవారని నిందితులు చెప్పినట్లు తెలిసింది. కొన్ని లావాదేవీల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయన్నారు. గొడవలు వద్దంటూ సర్ధిచెప్పేందుకు గత నెల 20న విజయభాస్కర్‌రెడ్డి ఉంటున్న హాస్టల్‌కు వెళ్లినట్లు తెలిపారు. అయితే విజయభాస్కర్‌రెడ్డి నిందితులతో పాటు వారి కుటుంబీకులను కించపరిచేలా మాట్లాడటంతోనే కిడ్నాప్, హత్యకు దారితీసినట్లు వెల్లడించారని తెలుస్తోంది. నిందితుల కస్టడీ ముగిసిన తర్వాతే మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అప్పటివరకూ ఏమీ చెప్పలేమని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
రియల్టర్ భాస్కర్‌రెడ్డి హత్య కేసులో విచారణ
సాక్షి, హైదరాబాద్: నెల్లూరుకు చెందిన రియల్టర్ భాస్కర్‌రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్య కేసులో కీలక సూత్రధారి అయిన త్రిలోక్‌నాథ్ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుని కోసం బెంగళూరు, చెన్నై, ఏపీలో పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్ఎంపీ డాక్టర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయిఏ హత్య వెనుక అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాబా అక్రమాలను ప్రశ్నించినందుకే హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ డబ్బు, గుప్త నిధుల వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి గత నెల కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి వ్యాపారి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలంగా విజయ్‌భాస్కర్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. నలుగురు కలిసి భాస్కర్‌ను హత్య చేసినట్లు బయటపడింది. మాజీ సైనికోద్యోగి మల్లేశ్ కుమారుడు భాస్కర్ ఉండే హాస్టల్లో చేరి నమ్మకంగా ఉంటూ ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. స్పృహ కోల్పోయిన విజయ్ను కొందరు కారులో తీసుకెళ్లి శ్రీశైలంలోని సున్నింపెట వద్ద కాటికాపరిని బెదిరించి మృతదేహాన్ని ఖననం చేయించారు. -
HYD: స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్, హత్య.. కుట్రలో ప్రముఖ గురూజీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి వ్యాపారి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన విజయ్‌భాస్కర్ కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. కేపీహెచ్‌బీ ఠాణా వెనకవైపు ఓ హాస్టల్లో ఉంటున్నాడు. గత నెల 20 నుంచి విజయ్‌భాస్కర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో ఆయన అల్లుడు జయ సృజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలంగా విజయ్‌భాస్కర్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజుతోపాటు మరొకరు.. మొత్తం నలుగురు కలిసి భాస్కర్‌ను హత్య చేసినట్లు బయటపడింది. మాజీ సైనికోద్యోగి మల్లేశ్ కుమారుడు భాస్కర్ ఉండే హాస్టల్లో చేరి నమ్మకంగా ఉంటూ ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. స్పృహ కోల్పోయిన విజయ్ను కొందరు కారులో తీసుకెళ్లి శ్రీశైలంలోని సున్నింపెట వద్ద కాటికాపరిని బెదిరించి మృతదేహాన్ని ఖననం చేయించారు. వీరి తీరుపై అనుమానంతో మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కాటికాపరి తన సెల్ఫోన్లోఫోటో తీసి ఉంచుకున్నాడు. కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ గురూజీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఇటీవల ఈ గురూజీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ ప్రముఖుడి స్థలంలో వెలికి తీసిన విలువైన లోహాన్ని విదేశీ కంపెనీకి విక్రయించడం కోసం పలువురు భక్తుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. విజయ్‌రెడ్డితోపాటు ఆయనకు తెలిసిన వారు కూడా పెద్ద మొత్తంలో డబ్బులిచనట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి నిధులొస్తాయంటూ కాలయాపన చేస్తున్నాడనే అనుమానంతో విజయ్ తన డబ్బు కోసం గురూజీపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దీంతో విజయ్‌పై గురూజీ కోపం పెంచుకొని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్‌లో స్థిరాస్థి వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. విజయ్‌భాస్కర్ హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు -
రోడ్డుపై గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు..
నెల్లూరు: మనలో చాలా మందికి చాక్లెట్లంటే చాలా ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాక్లెట్‌ను ఇష్టంతో తింటుంటారనే విషయం తెలిసిందే. అయితే, ఒక్కొసారి స్నేహితులు.. ప్రేమికుల మధ్య ఏదైన చిరుకోపాలు వచ్చినప్పుడు చాక్లెట్లు ఇచ్చి వారి మనస్సును కూల్ చేసేస్తారు. అందుకే, ప్రేమికుల దినోత్సవానికి ముందు లవర్స్ చాక్లెట్డేను కూడా జరుపుకుంటారు. అయితే, ఇలాంటి చాక్లెట్లు రోడ్డుపై గుట్టలు గుట్టలుగా పడికనిపించాయి. వివరాలు.. నెల్లూరులోని ఏసీ నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు.. రోడ్డు పక్కన చాక్లెట్లు, ప్రోటిన్ పౌడర్లను కుప్పలుగా పారేశారు. అయితే, వీటిని కొందరు స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు, యువకులు తమ బ్యాగులలో నింపుకొవడానికి ఎగపడ్డారు. ఈ క్రమంలో వారు ఇంటికి వెళ్లి చూడగా.. ఆ చాక్లెట్లు కాలం చెల్లినవిగా గుర్తించారు. అయితే, ఈ సంఘటనతో షాక్‌కు గురైన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పారిశుద్ధ్య అధికారులు చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
నెల్లూరులో ఇసుక దుమారం: రైతులపై టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని సర్వేపల్లిలో టీడీపీ నేతల పర్యటనను రైతులు అడ్డుకున్నారు. ఇసుక అక్రమ మైనింగ్ ఎక్కడ జరిగిందో చూపించాలని టీడీపీ నేతలను రైతులు నిలదీశారు. తమ పొలాలకు సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి మట్టిని తోలుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే, టీడీపీ ఎందుకు అడ్డుకుంటుందని రైతులు ప్రశ్నించారు. అయితే ప్రశ్నించిన రైతులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతలను అడ్డుకోబోయిన దళిత సర్పంచ్‌పై దౌర్జన్యానికి దిగారు. కాగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇసుక దుమారం రేగింది. పెన్నా ఇసుక రీచ్ నుంచి అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీ చేశారని టీడీపీ ఆరోపించడంతో పెన్నా ఇసుక రీచ్‌లో అఖిలపక్షం పర్యటించింది. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అఖిలపక్ష సమావేశ౦ ఏర్పాటు చేసి.. పేదల ఇండ్ల స్థలాల్లో తువ్వ ఇసుక నింపామని అన్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని అఖిలపక్షాన్ని మంత్రి కోరారు. పెన్నా నదిలో ఇసుక తీసిన గుంటలను పరిశీలించిన అఖిలపక్షం నేతలు.. జీరో వాల్యూ ఇసుక మాత్రమే జగన్నన్న కాలనీల ఫిల్లింగ్ కి తరలించారని స్పష్టం చేశారు. టీడీపీ మాత్రం అదే మొండి ఆరోపణలు వినిపిస్తోందని, ఒక దశలో టీడీపీ నేతల వైఖరి పట్ల మిగిలిన పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వివాదం చేయడం కోసమే ఆరోపణలు చేయవద్దని టీడీపీ నేతలకు సూచించారు. చదవండి: 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు -
ఆనందయ్య మందుపై త్వరగా నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధం పంపిణీ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆనందయ్య ఔషధంపై పరీక్షలు చేస్తున్నామంటూ జాప్యం చేయడం సరికాదంది. ఆనందయ్య ఔషధం తయారీ, దానికి అనుమతులు, పంపిణీ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేశ్, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణ పట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కోవి డ్ మందు పంపిణీలో జోక్యం చేసుకోకుండా అధికా రుల ను ఆదేశించాలని, ఆ మందు పంపిణీకి తక్షణమే అనుమ తులిచ్చేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పి.మల్లి కార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గురువారం జస్టిస్ రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ జోక్యం చేసుకుంటూ.. ఆనందయ్య మందు నమూనాలను ఆయుష్ విభాగం ల్యాబ్‌కు పంపిందని, ఈ నెల 29న నివేదిక అందుతుందని చెప్పారు. ఈ మందు ప్రజా వినియోగానికి అనువైనదని తేలితే పంపిణీకి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం తయారీదారు దరఖాస్తు చేసుకుంటే ఆ ఔషధాన్ని పరీక్షించి, ప్రజా వినియోగానికి యోగ్యమైనదిగా భావిస్తే పంపిణీకి అనుమతినిస్తామని చెప్పారు. ఆనందయ్య మందువల్ల దుష్ప్రభావాలు లేవని మీడియాలో ప్రచారమే తప్ప అధికారిక నివేదిక ఏదీ లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. సాంకేతిక అంశాల జోలికి వెళ్లొదని స్పష్టం చేసింది. ఆనందయ్య ఔషధానికి ఎవరు అనుమతులు ఇవ్వాలి? ఆ మందును ప్రజలకు ఇవ్వొచ్చా? లేదా? అన్న విషయాలను తదుపరి విచారణలో తమముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫార్ములా చెప్పాలని అధికారులు బెదిరిస్తున్నారు మరోవైపు.. తన ఔషధంలో ఉపయోగించే పదార్థాలు, ఫార్ములా చెప్పాలని నెల్లూరు జిల్లా అధికారులు బెదిరిస్తున్నారని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, తనకు భద్రత కూడా కల్పించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణను కూడా ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది. -
దారుణం: తిట్టవద్దని వారించినందుకు వ్యక్తిపై దాడి..మృతి!
నెల్లూరు: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తాగి దారిన పోయేవారిని తిట్టవద్దన్నందుకు ఓ వ్యక్తి పై మూకుమ్మడిగా దాడి చేసి, హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు ఉమ్మారెడ్డి గుంట లో మే1వ తేదీన జరిగిన దాడి లో తీవ్రగాయాల పాలైన అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికంగా ఉండే జి.దిలీప్ తప్ప తాగి దారిన పోయే స్థానికులను దూషించేవాడు. స్థానికంగా ఉండే అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు అలా తిట్టకూడదని వారించడంతో, అతనిపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దిలీప్, చక్రి, ప్రభు, యాలయ్య, ఆశా మురళి, కార్తీక్, ప్రకాష్ తో మరికొంత మంది కలిసి కొండాయపాలెం గేట్ పక్కనే ఉన్న అన్నపు రెడ్డి వేంకటేశ్వర్లు పై కత్తులు, రాడ్లు, కర్రలతో ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఇంట్లో మహిళలు,చిన్నపిల్లలు ఉన్నారనే విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. అన్నపు రెడ్డి వేంకటేశ్వర్లునీ కత్తులతో పొడిచి,రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అతణ్ణి స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 4గంటలకు మరణించాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా సెక్రటరి మాదాల వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. చదవండి:పనివాడే నిందితుడు -
భార్య ఫై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భర్త
-
కరోనా సోకిందని కుటుంబాన్ని నిర్బంధించిన అపార్ట్ మెంట్ వాసులు
-
ఇచ్చినవే కావు ,ఇవ్వని హామీలను నెరవేర్చిన వ్యక్తి సీఎం జగన్
-
ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది:గురుమూర్తి
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ :నెల్లూరు జిల్లా
-
ప్రజల అండ ,ఆశీస్సులు నాపైన ఉండాలి :గురుమూర్తి
-
నెల్లూరు కలెక్టరేట్ లో నామినేషన్ వేయనున్న గురుమూర్తి
-
దట్టమైన సుడిగాలిలో క్రికెట్
సాక్షి, నెల్లూరు : ఒకప్పుడు సుడిగాలిని చూస్తే .. బెంబేలెత్తిపోతేవారు. సుడిగాలి రాగానే దెయ్యాలు భూతాలు అంటూ భ్రమ పడేవారు. కొంతమంది సుడిగాలి కనపడగానే దేవుళ్ళ పేర్లు తలుచుకొని ధైర్యం తెచ్చుకునే వాళ్ళు. అయితే నెల్లూరు నగరంలో అలాంటి సుడిగాలిలో యువకులు క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. స్థానిక వీఆర్సీ కాలేజి గ్రౌండ్లో బుధవారం భారీ సుడిగాలి ఒకటి చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడే క్రికెట్ ఆడుతున్న యువకులు దాన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఓ యువకుడైతే దట్టమైన ఇసుకపొరతో సుడులు తిరుగుతున్న సుడిగాలి మధ్యన బ్యాట్ పట్టుకు నిలబడి ఎంజాయ్ చేశాడు. -
ఫిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు : దేశంలోని సామాన్య ప్రజల అభివృద్ధి కోసం భారత మాజీ ప్రధానమంత్రి దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎన్నో సంస్కరణలు చేపట్టారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజల హక్కులు.. దేశాభివృద్ధి కోసం మాట్లాడేవారని గుర్తుచేశారు. అటల్ తీసుకుని వచ్చిన సంస్కరణలతో దేశానికి ప్రపంచంలో ఎంతో గుర్తింపు వచ్చిందని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ పార్లమెంట్ అనుభవం గడించిన ప్రధాని వాజ్‌పేయీదని, ఆయన చరిత్రను ప్రతి యువకుడు అధ్యయనం చేయాలని సూచించారు. అటల్, అద్వానీ లాంటి ఇద్దరు గొప్ప నేతల మధ్య తాను కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. న్యూక్లియర్ పరీక్షల అనంతరం పార్లమెంట్లో ఒక్క ఓటు తేడాతో రాజీనామా చేశారని గుర్తుచేశారు. శనివారం నెల్లూరులో పర్యటించిన వెంకయ్య నాయుడు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. వందేమాతరం అంటూ నినాదాలు చేస్తే జాతీయవాదం కాదని, దేశహితమే జాతీయ వాదమని వ్యాఖ్యానించారు. ‘చర్చలు జరపడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించవచ్చని మన రాజ్యాంగం చెబుతోంది. ప్రస్తుత నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ, వాటిని అమలు చేయడం మరుస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల తీరుపై ప్రజల్లో నమ్మకం పోతుంది. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకులు శారీరక దాడులకు పాల్పుడటం దురదృష్టకరం. ప్రభుత్వం ప్రతిపాదించినా.. ప్రతిపక్షాలు వ్యతిరేఖించినా.. ఏం చేయాలన్నది చట్టసభకు వదిలేయాలి. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగంను అపహాస్యం చేస్తున్నాయి. ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్‌లోనే చెప్పాను. దీనిపై రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి. అదిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఆ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. తాత్కాలిక ఉపయోగం కంటే దీర్ఘకాలిక అవసరాల కోసం రాజకీయాలు చేయాలి.’ అని అన్నారు. -
నిప్పులు కక్కుతూ నింగిలోకి..
సాక్షి,అమరావతి/శ్రీహరికోట(సూళ్లూరుపేట ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–50 ఉపగ్రహ వాహక నౌకను గురువారం సాయంత్రం 3.41 గంటలకు విజయవంతంగా ప్రయోగించి ఈ ఏడాది రెండో విజయాన్ని అందుకుంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 20.11 నిమిషాల వ్యవధిలో 1,410 కిలోలు బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహంలో కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరు సమీపంలోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం వారు అదుపులోకి తీసుకున్నారు. ఉపగ్రహానికి ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా వెంటనే విచ్చుకున్నట్టు వారు చెప్పారు. 320 టన్నుల బరువుతో ప్రయాణం 44.4 మీటర్ల పొడవు గల పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది. కౌంట్‌డౌన్ ముగిసే సమయం దగ్గర పడడంతో మిషన్ కంట్రోల్ రూమ్‌లో శాస్త్రవేత్తలు టెన్ నుంచి వన్ దాకా అంకెలు చెబుతూ జీరో రాగానే మంచు తెరలతో కూడిన మబ్బులను చీల్చుకుంటూ పీఎస్ఎల్వీ సీ–50 ఉపగ్రహ వాహకనౌక విజయవంతంగా నింగి వైపునకు దూసుకెళ్లింది. అది ఒక్కో దశను విజయవంతంగా దాటి వెళుతుంటే శాస్త్రవేత్తల వదనాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ రూంలోని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ సంతోషంగా లేచి సహచర శాస్త్రవేత్తలతో కరచాలనం చేశారు. విజయ పరంపర: ఇస్రోకు బ్రహ్మాస్త్రం లాంటి పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ 52వ సారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయబావుటా ఎగురవేసింది. షార్ నుంచి 77వ ప్రయోగం, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 52 ప్రయోగాలు జరగ్గా.. 50 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. గగన్‌యాన్–01 ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం 2021 ప్రారంభంలో పీఎస్ఎల్వీ సీ–51 ప్రయోగాన్ని ఫిక్సల్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆనంద్ అనే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం, యూనిటిశాట్ అనే ఉపగ్రహాన్ని పంపనున్నట్టు చెప్పారు. స్పేస్ కిడ్స్ ప్రోగ్రాం కింద దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసే ఉపగ్రహాలను పంపిస్తామని చెప్పారు. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు చంద్రయాన్–3, సూర్యుడిపైనా పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్–01 గ్రహాంతర ప్రయోగాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ తర్వాత గగన్‌యాన్–01 పేరుతో మానవ సహిత ప్రయోగానికీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) పేరుతో సరికొత్త ప్రయోగాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అనంతరం ప్రయోగాన్ని విజయంతం చేసేందుకు కృషిచేసిన మిషన్ టీం, శాటిలైట్ టీంలను అభినందించారు. పీఎస్ఎల్వీ సీ–50 ద్వారా ప్రయోగించిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) ఉపగ్రహం సేవలు ఎంతో మెరుగ్గా ఉంటాయన్నారు. 11 ఏళ్ల కిందట ప్రయోగించిన జీశాట్–12 స్థానంలో ఈ ఉపగ్రహం సేవలందిస్తుందని తెలిపారు. సీఎంఎస్–01 ఉపగ్రహాన్ని విజయవంతంగా సబ్ జీటీవో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టామని, శుక్రవారం నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు సార్లు మండించి సబ్ జీటీవో ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతామన్నారు. ఈ ప్రక్రియ నాలుగు రోజుల పాటు నిర్వహించి 21వ తేదీన భూమికి 36 వేల కి.మీ ఎత్తులోని జియో ఆర్బిట్‌కు పంపిస్తామని శివన్ వివరించారు. ప్రయోగంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, పలు సెంటర్ల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు.. పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినదందనలు తెలిపారు. భారీ ప్రయోగాలే లక్ష్యం : ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఈ ఏడాది కోవిడ్–19 పరిస్థితుల దృష్ట్యా 8 నెలల పాటు ప్రయోగాలన్నింటికీ బ్రేక్ పడ్డాయని, ప్రస్తుతం ఆ పరిస్థితులను అధిగమించి రెండు ప్రయోగాలను విజయ వంతం చేయగలిగామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ చెప్పారు. 2021 సంవత్సరం స్పేస్ రీఫామ్ ఇయర్‌గా ఉంటుం దని తెలిపారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–50 ప్రయోగం విజయవంతం కావడంతో ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రసంగించారు. -
రోడ్డు ప్రమాదం.. పదిమంది మృతి
జైపూర్ : రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొని 10 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికుల సహాయంతో అస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వాహనాల అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు: నాయుడుపేట స్వర్ణముఖి వంతెనపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో చిన్నారి నదిలో పడి గల్లంతు అయ్యారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఫైర్ సిబ్బంది సైతం సహాయ చర్యల్లో పాల్లొంది. మృతులు విశాఖకు చెందిన సాయి, త్రినాథ్‌లుగా గుర్తించారు. మేనకూరు లోని గ్రీన్ టెక్ పరిశ్రమలో ఉద్యోగులుగా తెలుసింది. -
నివర్ తుఫాన్: 26 విమానాలు రద్దు..
సాక్షి, చెన్నై : నివర్ తీవ్ర తుఫాను ప్రభావంతో తమిళానాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయంలో 26 విమానాలను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఏటీఆర్ చిన్న విమానం, చెన్నై విమానాశ్రయంలోని టుటికోరిన్, ట్రిచీతోపాటు సేలంకు 12 విమానాలు ఇప్పటికే రద్దు చేశారు. మామల్లపురం చుట్టుపక్కల తీరప్రాంత ప్రజలు, ఫిషింగ్ ప్రాంత ప్రజల భద్రత కోసం అధికారులు ఎత్తైన మైదానాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఉపయోగించే పడవలు, ఫిషింగ్ నెట్స్ యంత్రాలను 30 మీటర్ల దూరంలో అధికారులు సురక్షితంగా ఉంచారు. తిరుపోరూర్లోని, తిరుక్కలుక్కున్ పరిసరాల్లోని ఉన్న 23 సరస్సులు, 23 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కోయంబత్తూరులో సముద్రంలో అయిదు అడుగుల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. నిండుకుండను తలపిస్తున్న స్వర్ణముఖి నెల్లూరు : నెల్లూరు జిల్లా వాకాడులోని వైఎస్సార్ స్వర్ణముఖి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది. నివర్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వరద నీరు, తెలుగు గంగ నుంచి నీటిని విడుదల చేయడంతో స్వర్ణముఖి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. స్వర్ణముఖి నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారేజి నీటితో స్వర్ణముఖి పరిధిలోని చెరువులు మొత్తం నిండాయని బ్యారేజ్ అధికారులు తెలిపారు. గతంలో బ్యారేజీ కుడికాలువకు గంగన్న పాలెం వద్ద తెగిపోవడంతో ఆ ప్రాంతం ముందస్తుగా కట్టకు మరమ్మతులు చేస్తున్నారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల భారీగా కురుస్తున్న వర్షాలతో సముద్రంలోకి వేటకి వచ్చిన 124 తమిళనాడు బోటులు పొర్టులో పార్కింగ్ చేశారు. (నివర్ ఎఫెక్ట్: ఏపీలో కుండపోత వర్షాలు) -
నివర్ ఎఫెక్ట్: ఏపీలో కుండపోత వర్షాలు
సాక్షి, నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను కారణంగా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కోట, వాకాడు, చిట్టుమూడు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావంతో రహదారులపై చెట్లు విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో చెరువులన్ని నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చదవండి: తీవ్రరూపం దాల్చిన నివర్ తుఫాన్ అతి తీవ్ర తుఫానుగా మారనున్న నివర్ నైరుతి బంగాళాఖాతంలో నివర్ తుపాను ప్రభావం కొనసాగుతుంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కిలోమీటర్లు దూరంలో పుదుచ్చేరికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర తుపానుగా కొనసాగుతున్న నివర్ మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాను కరైకల్- మహాబలిపురం మధ్య ఈ అర్థరాత్రి లేదా రేపు ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ఈ అర్ధ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. చదవండి:నివర్ తుపాను.. అప్రమత్తంగా ఉందాం సాక్షి, వైఎస్సార్ కడప : నివర్ తుపాను వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఎస్పీ కార్యాలయ ఆవరణంలో ట్రయిల్ రన్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు 'నివర్' తుపానును ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సంసిద్ధంగా మూడు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్లో ఒక రెస్క్యూ బృందం ఏర్పాటు చేసినట్లు, బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, తాళ్లను ఏఆర్ పోలీసు అధికారులు అందజేశారు. (చదవండి: తిరుమలపై ‘నివర్’ ప్రభావం) సాక్షి, చిత్తూరు : నివర్ తుపాను ప్రభావం జిల్లాపై కూడా ఉండటంతో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురు గాలులతోపాటు బారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దాదాపు 68 చెరువుల వద్ద అధికారులను అలెర్ట్ చేశామన్నారు. 16 సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించినట్లు, నిరాశ్రయులకు పాఠశాల భవనాలలో అసరా కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. అధిక వర్షపాతమున్న ప్రాంతాలలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. నివర్ తుపాను ప్రభావం నేపథ్యంలో వరదయ్యపాలెం మండలంలో 100 మంది నిరాశ్రయులైన గిరిజనులను ముందస్తుగా గుర్తించి పునరావాస కేంద్రంలకు తరలించినట్లు తెలిపారు. నివర్ తుపానుతో రేణిగుంటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మల్లెమడుగు రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, ఆత్మకూరు: వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్యే కడతేర్చినట్లు దర్యాప్తులో తేల్చారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. ఆత్మకూరు మండలం దేపూరు ఎస్సీ కాలనీకి చెందిన కటారి వెంకటేశ్వర్లు(37), వెంకట సుబ్బమ్మ దంపతులు. జీవాలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వెంకట సుబ్బమ్మ తన సమీప బంధువైన కొలకాని పెంచలయ్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా భర్త పలుమార్లు మందలించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. చదవండి : ప్రేయసి మోసం, ప్రణయ్ ఆత్మహత్య ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం వెంకటసుబ్బమ్మ, పెంచలయ్య గ్రామం విడిచి వెళ్లి ఆత్మకూరులో సహజీవనం సాగించారు. ఇటీవల విడిపోయి తిరిగి ఎవరిళ్లకు వారు చేరుకున్నారు. అయితే తిరిగి మళ్లీ వారిద్దరూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని వెంకటేశ్వర్లు గమనించి హెచ్చరించాడు. దీంతో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య కడతేర్చేందుకు ప్రణాళిక వేసింది. ఈ నెల 9న వెంకటేశ్వర్లు జీవాలకు మేత కోసం పొలాల్లోకి వెళుతుండగా గమనించి ప్రియుడితో కలిసి తోట దారి వద్ద తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత ఎలాంటి అనుమానం రాకుండా నిందితులు గ్రామానికి చేరుకున్నారు. ఈ నెల 11న గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిజాలు వెలుగు చూడడంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఎస్సైలు ఎం రవినాయక్, సీ సంతోష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడు..! ఆడుకునేందుకు వెళ్లి.. విద్యుదాఘాతానికి బాలుడి బలి కోట: స్థానిక అరుంధతీయ కాలనీలో దీపావళి పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోవడం అందర్ని కలచి వేసింది. కోట ఇన్చార్జి ఎస్సై భోజ్యానాయక్ వివరాల మేరకు..అరుంధతీయ కాలనీకి చెందిన గోనిపాక కోటమ్మ కుమారుడు కిషోర్(11) తన స్నేహితులతో కలిసి కోటక్రాస్రోడ్డు వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడ హరిహర రైస్‌మిల్లు సమీపంలో ఎత్తుగా ఉన్న వడ్ల పొట్టు వద్ద ఆడుకుంటున్న సమయంలో 11కేవీ విద్యుత్‌వైర్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడు. బాలుడి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా, తల్లి అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందడంతో ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలుడి బంధువులు ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన హరిహర రైస్‌మిల్లు వద్ద ఆదివారం మృతదేహంతో ధర్నాకు దిగారు. రైస్‌మిల్లు యాజమాన్యం 11కేవీ విద్యుత్ వైర్లు తగిలేంత వరకు వడ్ల పొట్టును పోయడం..పొట్టులో విద్యుత్‌వైర్లు కూరుకుపోయి కనిపించకుండా ఉండడంతో ప్రమాదం జరిగిందన్నారు. రైస్‌మిల్లు యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని పట్టుబట్టారు. దీంతో ఇన్చార్జి ఎస్సై భోజ్యానాయక్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. మోటార్ వేస్తుండగా.. నెల్లూరు(క్రైమ్): విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన సప్తగిరిలేఅవుట్లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు..సప్తగిరి లేఅవుట్లో పీ బాలంకిరెడ్డి (48), సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 14న ఉదయం సంపులోని వర్షపునీటిని తోడేందుకు బాలంకిరెడ్డి సెల్లార్‌లోని మోటార్ వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బాలంకిరెడ్డి విద్యుదాఘాతానికి గురవగా కుటుంబ సభ్యులు హుటాహుటిన బొల్లినేని(కిమ్స్) ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు వేదాయపాళెం ఎస్సై ఎం పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేçస్తున్నారు. సముద్రంలో మునిగి యువకుడి మృతి ఇందుకూరుపేట: సముద్రంలో మునిగి బెంగళూరుకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన మైపాడు బీచ్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రిషిశెట్టి తన కుటుంబ సభ్యులు ఆరుగురితో కలిసి కారులో తీర్థయాత్రలకు బయలుదేరారు. నెల్లూరు జిల్లాలోని పలు ఆలయాలను దర్శించుకున్న వీరు సేదతీరేందుకు మైపాడు బీచ్‌కు ఆదివారం చేరుకున్నారు. అందరూ కలిసి సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో రిషిశెట్టి పెద్దకుమారుడు కిరణ్ ఆర్ శెట్టి(21)కు ఈత వచ్చి ఉండడంతో సముద్రంలో కొద్దిగా లోపలకు వెళ్లాడు. సముద్రం కసురు మీద ఉండడంతో అలల తాకిడికి నీటి మునిగి గల్లంతయ్యారు. కొద్దిసేపటి తరువాత విగతజీవిగా ఒడ్డుకు కొట్టుకురావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇందుకూరుపేట ఎస్సై నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరాతీశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు తరలించారు. -
మహిళ ఆత్మహత్య; అత్తారింటిపై 5 పేజీల లేఖ
సాక్షి, నెల్లూరు : చేజర్ల మండలం చీర్లవారికండ్రిక గ్రామంలో శనివారం విషాదం అలుముకుంది. అత్తారింటి వేధింపులు భరించలేక సునీత అనే 28 సంవత్సరాల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తలూరు సమీపంలో చెక్ డ్యాంలో దూకి అర్థాంతరంగా తనువు చాలించింది. అయితే అత్తారింటి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సునీత తన డైరీలో అయిదు పేజీల లేఖ రాసింది. చదవండి: భార్య ఉపవాసం.. భర్త ఆత్మహత్య -
‘రైతుల కోసమే సీఎం జగన్ నిర్ణయం’
సాక్షి, నెల్లూరు : రైతుల ప్రయోజనం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. నెల్లూరులో రైతులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాయింట్ కలెక్టర్‌ను నోడల్ అధికారిగా నియమించి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. జిల్లాలోని గోదాములలోని బియ్యాన్ని ఇతర జిల్లాలకు పంపుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు గడువును పెంచేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృషి చేశారని, కేంద్ర బృందం పర్యటన తర్వాత పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. (ఇకపై జిల్లాకు మరింత దగ్గరగా..) -
జాబ్ కోసం ఫేక్?
సాక్షి, నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్యారోగ్య శాఖలో నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి అధికారులు శ్రీకారం చుట్టారు. కాగా కొందరు ఫేక్ మార్కుల జాబితాలతో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎలా వచ్చాయి? మొదటిసారి ప్రకటించించిన జాబితాలో ఓ అభ్యర్థికి 1014 మార్కులున్నట్లుగా చూపారు. ఫైనల్ మెరిట్ జాబితాలో 811 మార్కులని ఉంది. అలాగే ప్రొవిజనల్ మెరిట్ జాబితాలో 65, 73, 76, 93 ఇలా ఓ పదిమందికి సంబంధించిన ర్యాంకులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నర్సింగ్ కోర్సులో తక్కువ మార్కులు వచ్చినా ప్రకటించిన ప్రొవిజనల్ జాబితాలో ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయని పలువురు అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అభ్యంతరాలు స్వీకరించినా సోమవారం ఫైనల్ మెరిట్ జాబితాను ప్రచురించామని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆ జాబితాను వెబ్సైట్లో ఉంచామన్నారు. ఒక్కసారిగా.. ఏమి జరిగిందో గానీ మార్కుల జాబితాలో పైన పేర్కొన్న పలువురి ర్యాంకులు తలకిందులయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా లిస్ట్‌ను మార్పు చేశారు. అప్పటివరకు ఎక్కువ మార్కులు పొంది, మెరిట్ లిస్ట్‌లో ముందు వరుసలో ఉన్న కొందరికి తక్కువ మార్కులు చూపిస్తూ రెండో జాబితాను వెబ్సైట్లో ప్రదర్శించారు. దీంతో ర్యాంకుల పరంగా ఒక్కసారిగా వారు వెనక్కు వెళ్లిపోయారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టామన్నారు. ఒకరికి పొరపాటున మార్కులు ఎక్కువ పడ్డాయని వాటిని సరి చేశామన్నారు. మరో ఏడుగురి సర్టిఫికెట్లæపై సందేహాలున్నాయన్నారు. ఇదిలా ఉండగా డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు వైద్యవిధాన పరిషత్‌లోని (ఏపీవీపీ) పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఏపీవీపీలోని పోస్టుల్లో కూడా తమ నర్సింగ్ కోర్సులో ఎక్కువ మార్కులు పొందినట్లుగా చూపారు. ఇదే అభ్యర్థుల జాబితాను ప్రస్తుతం పరిశీలిస్తే డీఎంహెచ్ఓ పోస్టులకు సంబంధించి ప్రదర్శించిన జాబితాలో తక్కువ మార్కులు ఉండడం.. ఏపీవీపీ పోస్టుల్లో ఎక్కువ మార్కులుండడాన్ని చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయమై డీసీహెచ్ చెన్నయ్యను వివరణ కోరగా నర్స్ పోస్టు కోసం ఒకరు దరఖాస్తు చేసిన మార్కుల జాబితాపై ఫిర్యాదు అందిందన్నారు. దానిని పరిశీలించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరగా ఆమె ఈ రోజు వస్తానని చెప్పి రాలేదన్నారు. దీనిని బట్టి చూస్తే ఆమెది ఫేక్ మార్కుల జాబితా అయి ఉండవచ్చన్నారు. ఉద్యోగాల్లో చేర్చుకునేప్పుడు అన్ని మార్కుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేసినట్లుగా తేలితే వారిపై చర్యలు చేపడతామన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం -
దేవినేని ఉమాకు మంత్రి అనిల్ సవాల్
సాక్షి, నెల్లూరు : కృష్ణానదిపై తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్‌పై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఎందుకు నోరుమెదపడంలేదని నిలదీశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ మాట్లాడుతూ.. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా మంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా ఎంత నీరు తీసుకువచ్చారో తేలుద్దామా అని సవాలు విసిరారు. దేవినేని ఉమా నిత్యం అబద్దాలు చెబుతూనే ఉంటారని, అన్ని ప్రాజెక్టులు తామే కట్టామని గొప్పులు చెబుతున్నారని మండిపడ్డారు. (అక్రమం.. అడ్డుకోండి: సీఎం కేసీఆర్) పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని తొలుత పెంచింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, దానిని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని మంత్రి అనిల్ పేర్కొన్నారు. కృష్ణా నది వరద నీటిని పూర్తిగా ఉపయోగించుకుని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలంతా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో మొదటిసారిగా వైఎస్ జగన్నేతృత్వంలో సోమశిలలో 78 టీఎంసీల నీటిని నిల్వ చేసి చూపించామని తెలిపారు. టీడీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులు కనీసం చేయలేదని, నిత్యం మాటలతోనే కాలయాపన చేశారని మండిపడ్డారు. -
చేయి తడిపితే చాలు.. ఏ భూమైనా..
జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి హద్దే లేకుండా పోయింది. చేయి తడిపితే చాలు నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినందుకు సబ్రిజిస్ట్రార్లు భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నారు. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతల సహకారంతో అక్రమ రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఒక టీడీపీ ఎమ్మెల్సీ ప్రోద్బలంతో రూ.10 కోట్ల విలువజేసే భూమిపై న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం వెనుక రూ.కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కోవూరు మేజర్ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 295లో 3.30 ఎకరాలు భూమి ఉంది. ఆ గ్రామంలో అగర్వాల్ నారాయణదాసుకు సంబంధించిన ఆస్తి ఉంది. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వారసులుగా ఉన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ భూమి ప్రస్తుతం మార్కెట్‌ధర రూ.10 కోట్లుగా ఉంది. ఈ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. ఎలాగైనా ఆ భూమిని కారుచౌకగా కొట్టేయాలని పథకం వేసిన టీడీపీ నేత అగర్వాల్ నారాయణ దాసుకు చెందిన ఓ కుమార్తె పద్మాబాయ్ ఆరుగురు పిల్లలను వారసులుగా చూపించి ఆ భూమిని 2010లో జీపీ (జనరల్ పవరాఫ్ పట్టా) కమ్ సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు. కానీ ఆ భూమికి ఇంకా వారసులు చాలా మంది ఉన్పప్పటికీ ఒక కుమార్తె పిల్లల చేత అక్రమంగా జీపీ చేయించుకుని భూమిని సొంతం చేసుకునేలా పథకం వేశారు. ఆ భూమిని ఇతరులు కొనుగోలు చేయకుండా అప్పటి జిల్లా తెలుగు యువత నేతతో కుమ్మక్కై న స్థానిక టీడీపీ నేత మాస్టర్‌ప్లాన్ వేసి సేల్ అగ్రిమెంట్ చేశారు. ఆ ఇద్దరు మధ్య వివాదం ఉన్నట్లు సృష్టించి జిల్లా జడ్జి కోర్టులో ఇంజక్షన్ అర్డర్ తెచ్చారు. అయితే వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆర్.శేఖర్‌బాబు అలియాస్ యల్లారెడ్డి కూడా పద్మాబాయ్ అక్క సుందరాబాయ్ పిల్లల చేత ఆ భూమిలో సగభాగం 1.67 సెంట్లు భూమిని సేల్ డీడ్‌ను 2013లో చేయించుకున్నాడు. దీంతో వారి మధ్య భూ వివాదం తలెత్తింది. న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న ఆ భూమిని నిషేధిత జాబితాలో ఉంచాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టారు. న్యాయస్థానం ఉత్తర్వులున్నా.. కోవూరుకు చెందిన 295 సర్వే నంబర్‌పై జిల్లా ఐదో జిల్లా జడ్జి కోర్టులో ఆ భూమిని ఎవరూ క్రయ, విక్రయాలు చేయకూడదని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కానీ 2012 డిసెంబర్ 26వ తేదీన అప్పటి కోవూరు సబ్‌రిజిస్ట్రార్ కె.శోభమ్మ 30 అంకణాలను డాక్యుమెంట్ నంబరు 2327–2012 రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటికే ఆ భూమిపై న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లినా ఆ సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో నమోదు చేయకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసింది. మరో ఏడాది పాటు 2013 డిసెంబర్ వరకు కోర్టు ఉత్తర్వులు ఉన్న ఆ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చకుండా కావాలనే జాప్యం చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. ఆపై అదే భూమిని నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాగేశ్వరరావు సబ్‌రిజిస్ట్రార్ కూడా 4159–2013, 4409–2013, 4410–2013 డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే జీïïపీఏ కమ్ సేల్ చేసిన వ్యక్తి అగర్వాల్ రామ్ ప్యారీ అనే వ్యక్తి మరణించాడు. జీపీఏ చేసిన వ్యక్తి చనిపోతే జీపీ కమ్ సేల్ అగ్రిమెంట్ ఆటోమేటిక్‌గా రద్దు అయిపోయింది. కానీ ఇవేమీ పట్టించుకోని సబ్ రిజిస్ట్రార్ మాత్రం భారీగా ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేశాడు. అలాగే అదే సర్వే నంబరును అల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ సింహాద్రినాయుడు డాక్యుమెంట్ నంబర్లు 823–2013, 824–2013, 825–2013, అలాగే నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్లు 822–2014, 823–2014, 1540–2014, 3306–2014, 3854–2014, 3855–2014గా రిజిస్ట్రేషన్ చేశారు. 2013లో నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న నాగేశ్వరరావు 2015లో కోవూరు సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో కూడా డాక్యుమెంట్ నంబర్లు 361–2015, 362–2015, 458–2015,1661–2015, 1686–2015గా మరోసారి రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 2014లో స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న నందకిశోర్ కూడా అదే సర్వే నంబర్‌ను డాక్యుమెంట్ నంబర్లు 4202–2014, 4203–2014గా రిజిస్ట్రేషన్ చేశారు. టీడీపీ హయాంలో నివేదకలు తొక్కిపెట్టి.. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి భారీగా లబ్ధిపొందిన ఆ ఐదుగురు సబ్రిజిస్ట్రార్లపై శేఖర్‌బాబు అలియాస్ ఎల్లారెడ్ది ఫిర్యాదు మేరకు టీడీపీ హయాంలో పలుమార్లు విచారణ చేపట్టి నివేదిక తొక్కిపెట్టారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ అండతో నివేదికలను తొక్కి పెట్టి చర్యలు తీసుకోలేకపోయారు. ఈ అవినీతి బాగోతం వెనుక గతంలో రిజిస్ట్రేషన్‌శాఖ జిల్లా డీఐజీగా పనిచేసిన అధికారితోపాటు అప్పటి నెల్లూరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హస్తం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. దీంతో గత ఐదేళ్ల పాటు కేవలం విచారణ పేరుతో కాలయాపన చేశారు. న్యాయం కోసం లోకాయుక్తకు ఫిర్యాదు టీడీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు ఎల్లారెడ్డి న్యాయం కోసం లోకాయుక్తను ఆశ్రయించాడు. గతంలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మునిశంకరయ్య అక్రమ రిజిస్ట్రేషన్లపై వాస్తవ నివేదిక ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదని, గత ఐదేళ్లగా విచారణ పేరుతో కాలయాపన చేస్తూ అవినీతికి ఉన్నతాధికారులు కొమ్ముకాస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో లోకాయుక్త వాస్తవ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో మరోసారి విచారణ అవినీతి రహిత పాలనలో ముందుకెళ్తున్నా ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి అధికారులపై మరోసారి విచారణకు ఆదేశించారు. రెండు నెలలుగా విచారణ చేపట్టిన అధికారులు ఐదుగురు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది వాస్తవమే అన్నట్లు నిర్ధారించి నివేదిక తయారు చేశారు. -
ఉమాకు కొత్త బట్టలు పెడతా: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు : చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. దమ్ముంటే ఈ విషయంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనిల్ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడి చేశారని, పోలవరం పేరుతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 35 శాతం కూడా పోలవరం పనులు చేయకుండా.. కాంక్రీటులో గిన్నిస్ రికార్డులు వచ్చాయని దుష్ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.. అదే విధంగా టీడీపీ నేత దేవినేని ఉమాపై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని.. దానికి దేవినేని ఉమాను కూడా ఆహ్వానిస్తామని.. కొత్త బట్టలు కూడా పెడతామని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్‌లో వెయ్యి కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదా చేశారని, తమ దోపిడి వ్యవహారం బయటకు వస్తుండటంతో తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తర కుమారుడు అంటే ఎవరో అందరికీ తెలుసని, ఆడా.. మగా కానీ ఉమా.. తనపై విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ‘నేను ఏం చదువుకున్నానో అందరికీ తెలుసు.. నువ్వు ఎవరిని చంపి రాజకీయాల్లోకి వచ్చావో తెలుసుకో’ అంటూ ఉమాపై విరుచుకుపడ్డారు. -
‘ఆ భూములు రైతులకు ఇవ్వడమే సముచితం’
సాక్షి, నెల్లూరు : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో వేలాది కటుంబాలు సంతోషిస్తున్నాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ఈ సారి శాసనసభ సమావేశాలు ఫలప్రదమయ్యాయన్నారు. సమావేశాల్లో 16 చట్టాలను ప్రభుత్వం తీసుకుని రావడమే కాకుండా వాటిపై పూర్తి స్థాయిలో చర్చ జరగడం హర్షనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను విభజించడం వల్ల వారికి మరింత ప్రయోజనం కలగనుందన్నారు. చంద్రబాబు రాజధానికి 40 వేల ఎకరాలు సేకరించి.. ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేవలం ఒక వర్గం ప్రయోజనాలను కాపాడేందుకే ప్రయత్నించారని మండిపడ్డారు. రైతుల భూములను బలవంతంగా లాక్కొని, టీడీపీ నేతలకు అప్పగించారని ఆరోపించారు. రైతులకు చెందిన అసైన్మెంట్ భూములను వారికే ఇవ్వడం సముచితమన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన సంస్కారానికి నిదర్శనమని అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడిండ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అన్నీ తాత్కాలిక భవనాలు కట్టారని, ప్రజలు కూడా ఆయనను తాత్కాలిక ముఖ్యమంత్రిగా భావించి గత ఎన్నికల్లో తొలగించారని దుయ్యబట్టారు. -
అర్హత లేకపోయినా కొలువులు
సాక్షి, నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పాలన వ్యవహారాలు, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన ఉన్నతాధికారులే అక్రమ బాట పట్టారు. యూజీసీ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టారు. అధ్యాపకుల కొరత ఉన్న చోట రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలనే ఆదేశాలను పక్కదోవ పట్టించారు. అర్హత లేకపోయినా అప్పటి ప్రభుత్వ పెద్దలు, వర్సిటీ ఉన్నతాధికారులు కలిసి తమకు ఇష్టమున్న వారిని అవుట్సోర్సింగ్ కింద నియమించారు. ఈ తరుణంలో అక్రమ మార్గంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు పొందిన రిటైర్డ్ ఉద్యోగుల ఉద్వాసనకు నూతన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గత నెల 18న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జరిగి నెల కావస్తున్నా వర్సిటీ ఉన్నతాధికారులు వారిని తొలగించేందుకు ఇష్టపడటం లేదు. వారి అస్మదీయులను కాపాడుకునేందుకే ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలుగా నియామకాలు వర్సిటీలో నియామకాలు చేపట్టాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. వర్సిటీలో ఏయే పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారో బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంది. దీన్ని వర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చాలి. అర్హులను గుర్తించి వారిని విధుల్లోకి తీసుకోవాలి. అయితే విక్రమ సింహపురి వర్సిటీలో ఈ నిబంధనలను పాటించకుండా అడ్డగోలుగా నియామకాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దలు, వర్సిటీ ఉన్నతాధికారులు కలిసి తమ అనుయాయులను నియమించుకున్నారు. వర్సిటీలో బోధనకు విశ్రాంత ఉద్యోగులను తీసుకోవాలని ఇచ్చిన జీఓను పక్కదారి పట్టించారు. సాధారణంగా వర్సిటీలో బోధనకు విశ్రాంత ప్రొఫెసర్లను తీసుకోవాల్సి ఉంది. అయితే అప్పటి ఉన్నతాధికారులు కేవలం డిగ్రీ అధ్యాపకులుగా పనిచేస్తూ రిటైరైన వారిని వర్సిటీలోకి తీసుకున్నారు. వీరిలో 70 ఏళ్లు పైబడిన వారూ ఉండటం గమనార్హం. దీంతో పాటు భార్య, భర్తలకు అర్హత లేకపోయినా అవుట్సోర్సింగ్ కింద అప్పటి వర్సిటీ ఉన్నతాధికారులు విధుల్లోకి తీసుకున్నారు. వర్సిటీలో ప్రస్తు తం 15 మంది వరకు ఉన్నట్లు సమాచారం. కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే విశ్రాంత ప్రొఫెసర్లు ఉన్నారని తెలిసింది. వీరితో పాటు నాన్ టీచింగ్ కింద నిబంధనలను పాటించకుండా నియమించారు. వీరు ప్రతి నెలా పింఛన్‌తో పాటు యూనివర్సిటీ నుంచి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం పొందుతున్నారు. ఉత్తర్వులను పెడచెవిన పెట్టారు అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న విశ్రాంత టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను తొలగించాలని గత నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా నేటికీ విక్రమ సింహపురి యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వర్సిటీ ఉన్నతాధికారులకు సంబంధించిన వ్యక్తులు కావడంతో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపులో తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగుల కనుసన్నల్లోనే పాలన అవుట్సోర్సింగ్ కింద నియమితులైన విశ్రాంత ఉద్యోగుల కనుసన్నల్లోనే విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలన, వ్యవహారాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ప్రధానంగా నాన్ టీచింగ్‌లో పనిచేస్తున్న విశ్రాంత ఉద్యోగులు వర్సిటీ వీసీతో పాటు రిజి్రస్టార్లను శాసిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వర్సిటీ అడ్మిని్రస్టేషన్లో వీరి పాత్ర ప్రముఖంగా ఉంటుంది. వీరు చెప్పిందే అక్కడ జరుగుతోంది. వీరికి గత ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతో యూనివర్సిటీలో చక్రం తిప్పారు. వీరితో పాటు టీచింగ్ కేటగిరీల్లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు కూడా వర్సిటీ పాలన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. -
నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం
-
నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, నెల్లూరు : జిల్లా కేంద్రంలోని ఓ భవనంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నబజారు ప్రాంతంలోని శ్రీ కనకదుర్గా మెటల్ ఎంటర్ ప్రైజెస్ గోదాంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ గల ప్లాస్టిక్ సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని వారిని ఖాళీ చేయిస్తూ..రాత్రి నుంచి మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, కలెక్టర్ శేషగిరి బాబు, ఇతర అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాలినేని
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా విద్యుత్‌శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమించారు. మొన్నటి వరకు హోంమంత్రి మేకతోటి సుచరిత జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. ఆమె స్థానంలో జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌ను కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించారు. -
కుప్పకూలిన భవనం
సాక్షి,కావలి(నెల్లూరు) : పట్టణంలో సుమారు 90 ఏళ్ల నాటి కాలం చెల్లిన శిథిల భవనం శనివారం రాత్రి కుప్పకూలిపోయింది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శిథిల భవనం కూలిన వేళ రాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. పగలు కూలిపోయి ఉంటే పరిస్థితి ఊహకే అందడం లేదు. దేశానికి స్వాతంత్రం రాక ముందే నిర్మించి ఈ భవనం శిథిలమైపోయింది. ఈ భవనంలో పండ్లు, పూలు అమ్మకాలు చేసే వ్యాపారులు ఉంటారు. నిత్యం ఈ భవనం వద్ద కొనుగోలుదారులు కిక్కిరిసి ఉంటారు. ట్రంక్‌రోడ్డులోని నిత్యం జనాలతో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కూడలి ప్రాంతంలోనే ఈ శిధిల భవనం ఉండడం గమనార్హం. శిథిలమైన ఈ భవనం ఏ క్షణమైనా కూలిపోవచ్చని మునిసిపాలిటీ అధికారులు 2013లోనే గుర్తించారు. అయితే 2015లో మునిసిపాలిటీ అధికారులు ఈ కాలం చెల్లిన భవన యజమాని నల్లూరి రమేష్‌కు నోటీసులు జారీ చేసి, కూల్చేయాలని తెలియజేశారు. అయితే భవన యజమాని ఈ భవనాన్ని పండ్లు, కూరగాయలు అమ్మకాలు చేసే వారికి అద్దెకు ఇచ్చాడు. కేవలం అద్దెలకు కక్కుర్తి పడిన భవన యజమాని నల్లూరి రమేష్‌తో మునిసిపాలిటీ అధికారులు అమ్యామ్యాలతో చేతులు తడుపుకుని, ఇక ఈ భవనం వైపు కన్నెత్తి చూడడం మానుకొన్నారు. ఇలా ఆరేళ్లుగా మునిసిపాలిటీ ఈ కాలం చెల్లిన శిథిల భవనం సంగతిని పట్టించుకోకపోవడంతో, భవన యజమాని నల్లూరి రమేష్ అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కూడలిలో ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చి సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలో భవనం కుప్ప కూలిపోయింది. శిథిలమైన భవనం కూలిపోగా, మిగిలిన భవనంతోనే పండ్లు అమ్మకాలు చేసే వారితో వ్యాపారాలు చేయిస్తూ అద్దె రాబడిని శిథిల భవన యజమాని కొనసాగిస్తున్నాడు. రద్దీగా ఉన్న వాణిజ్య ప్రదేశంలో శిథిలమైపోయిన కాలం చెల్లిన భవనం కూలిపోతే వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన మునిసిపాలిటీ, ఆ దిశగా అడుగులు వేయడానికి కూడా ఇష్టపడలేదు. కేవలం భవన యజమాని విదిల్చే కాసులకు కక్కుర్తిపడి మునిసిపాలిటీ ప్రజల ప్రాణాలకు ముప్పుతో ముడిపడి ఉన్న కాలం చెల్లిన భవనాన్ని తొలిగించేందుకు చర్యలు తీసుకోవలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు
సాక్షి, వెంకటాచలం(నెల్లూరు) : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ)లో సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబుతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. సభా వేదికను పరిశీలించిన తరువాత వీఎస్‌యూ సెమినార్ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించనుండటంతో ఆ పథకం లబ్ధిదారులు, వలంటీర్లు సభకు తరలివచ్చేలా చూడాలని అధికారులకు సూచించామని కలెక్టర్ శేషగిరిబాబు చెప్పారు. సభావేదిక వద్ద ఏర్పాట్లను అధికార సిబ్బందితో త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతాంగం ఎక్కువగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం రైతులకు గర్వకారణమన్నారు. నవరత్నాలలో ప్రతిష్టాత్మకమైన రైతు భరోసాను నెల్లూరు నుంచే ప్రారంభించాలనుకోవడం జిల్లాపై వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానాన్ని చాటిచెప్పుతుందన్నారు. రైతులు, ప్రజలు అంతా కలిసి 50 వేలమందికి పైగా రైతు భరోసా కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా చిన్నపొరపాట్లు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. అధికారయంత్రాంగం, జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ సమష్టి కృషితో సీఎం జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్రెడ్డికి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. రబీ సీజన్‌కు ముందు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ శీనానాయక్, వీఎస్‌యూ రిజిస్ట్రార్ అందె ప్రసాద్, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలుకుదాం సభ్యుడు మందల వెంకటశేషయ్య పాల్గొన్నారు. -
హోంగార్డులు ఇక ఖుషీ.. ఖుషీగా
సాక్షి, నెల్లూరు : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా హోంగార్డ్స్ దినసరి వేతనాలను పెంచుతూ జీఓ జారీ చేశారు. ఎన్నికల ప్రచార సభలో మీ సమస్యలను ‘నేను విన్నాను.. మీకు నేనున్నానంటూ’ వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు సిబ్బందికి భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీక్లి ఆఫ్ అమలు చేయడంతో పాటు హోంగార్డులకు మెరుగైన వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇచ్చిన హామీల అమలు దిశగా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూన్‌లో వీక్లీ ఆఫ్‌ను అమల్లోకి తీసుకు వస్తూ జీఓ జారీ చేశారు. తాజాగా శనివారం హోంగార్డ్స్ దినసరి వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కు పెంచుతూ జీఓ విడుదల చేశారు. ముఖ్యమంత్రి చర్యలతో హోంగార్డుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ ముక్త కంఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో 769 మంది హోంగార్డులు ఉన్నారు. వీరిలో 617 మంది పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తుండగా 157 మంది డిప్యుటేషన్‌పై ఆర్టీసీ, జైళ్లు, విజిలెన్స్, ట్రాన్స్‌కో, ఎఫ్‌సీఐ, ఏసీబీ, దూరదర్శన్, ఆర్టీఓ, అగ్నిమాపకశాఖ తదితర శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖలో పని చేస్తున్న హోంగార్డులు పోలీసులతో సమానంగా సేవలందిస్తున్నారు. అయితే వీరికిచ్చే జీతం అంతంత మాత్రంగానే ఉండేది. గత ప్రభుత్వాలు వీరికి నామ మాత్రంగా వేతనాలు పెంచడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. పెరిగిన జీతాలు సైతం కాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. దీంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. పెరిగిన అవసరాలకు సరిపడా వేతనాలు పెంచాలని పలు దఫాలుగా గత ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండాపోయింది. హామీని నెరవేర్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర, ఎన్నికల ప్రచారంలో హోంగార్డులు తమ సమస్యలను అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారి సాధక బాధలను విన్న ఆయన నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రి శనివారం హోంగార్డుల దినసరి వేతనాన్ని రూ.710కు పెంచుతూ జీఓ జారీ చేశారు. పెరిగిన వేతనాలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు నెలకు సగటున రూ.18,000 వేతనం హోంగార్డులకు వచ్చేది. తాజా పెంపుతో (30 రోజులకు) రూ. 21,300 రానుంది. వేతన పెంపుపై హోంగార్డుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రుణపడి ఉంటాం మా సాధక బాధలు విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెరుగైన వేతనాలు అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వేతనాన్ని రూ.710కు పెంచుతూ జీఓ విడుదల చేసి మాటతప్పని మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేశారు. హోంగార్డులందరూ ఆయనకు రుణపడి ఉన్నారు. – పి. శరత్‌బాబు, హోంగార్డు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు దినసరి వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీఓ విడుదల చేయడం హర్షణీయం. ముఖ్యమంత్రి చర్యలపై హోంగార్డులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు జిల్లా హోంగార్డుల తరఫున కృతజ్ఞతలు – ఆర్ సునీల్‌కుమార్, హోంగార్డు -
15న నెల్లూరులో రైతు భరోసా ప్రారంభం
సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభం కాబోతున్నది. నెల్లూరు నగర సమీపంలోని కాకుటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. తొలుత ఆయన ఆరోజు ఉదయం 10.30గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణం చేరుకుంటారు. ఆ తరువాత కౌలు రైతులకు కార్డుల పంపిణీ అనంతరం రైతులకు వైఎస్సార్ రైతుభరోసా చెక్కులను పంపిణీ చేసి అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు వైస్సార్సీపీ నేతలు,అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. -
15న నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో ‘రైతు భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ..అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ లింక్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు. రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలుగు గంగ అధికారులతో చర్చించి.. తెలుగు గంగ పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. -
నెల్లూరులో హర్యానా దొంగల ముఠా అరెస్టు
సాక్షి, నెల్లూరు : ఏటీఎమ్ సెంటర్లలో వృద్ధులను ఏమార్చి స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా క్లోనింగ్‌కు పాల్పడిన ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు సుమారు 14 రాష్ట్రాలలో వెయ్యికి పైగా నేరాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సందీప్ కుమార్, మంజీత్, దయానంద్‌లు హర్యానా రాష్ట్రానికి చెందిన వారని, ఇప్పటికే వీరిపై 49పైగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో నేరాలకు పాల్పడినట్లు నిందితులు ఆంగీకరించారని, వారి నుంచి రూ. 7.5 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్ టాప్, నకిలీ ఏటీఎమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. -
ఫిర్యాదు చేసిన 72 గంటల్లోనే సమస్య పరిష్కారం
సాక్షి, నెల్లూరు(మర్రిపాడు) : మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యమని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కంపసముద్రంలో సోమవారం ఆయన పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ గ్రామాన్ని గతంలో దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే వాటిని కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామంలో అందరూ ఐక్యమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ వస్తుందని, ఏ సమస్య వచ్చినా ఫిర్యాదు చేసిన 72 గంటల్లోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా ఆత్మకూరులోని తమ కార్యాలయంలో ఎంజీఆర్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎంజీఆర్ హెల్ప్‌లైన్ ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యాయని ఓఎస్డీ చెన్నయ్య చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎంజీఆర్ హెల్ప్‌లైన్‌కు చెప్పాలన్నారు. గ్రామాల్లో కక్షలు లేకుండా అందరూ కలసి మెలసి ఐక్యంగా ఉండాలన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యాలయం సచివాలయంగా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఈశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు చెన్ను శ్రీధర్‌రెడ్డి, యర్రమళ్ల చిన్నారెడ్డి, గోపవరం కాంతారెడ్డి, బాబునాయుడు, కొండ్రెడ్డి రమణారెడ్డి, హజరత్ రెడ్డి, చిన్నమాచనూరు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల అత్యుత్సాహం
సాక్షి, నెల్లూరు(కలిగిరి) : మండలంలోని భట్టువారిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించి తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన బలం లేకపోయినప్పటికీ ఎలాగైనా ఎన్నికను నిలిపివేయాలని అత్యుత్సహం చూపారు. పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం 47 ఓట్లు ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు ఎం.ప్రభాకరరావు, కానిస్టేబుల్ గోపీ సమక్షంలో ఓటర్లను పేరుపేరునా పిలిచారు. ఓ వర్గానికి అనుకూలంగా ఉన్న వారు 30 మంది ఎన్నికలు నిర్వహించే గదిలోకి వెళ్లారు. టీడీపీ నాయకుల వద్ద ఉన్న 17 మందిని పాఠశాల ఆవరణలోనే ఒక్క పక్కన ఉంచి లోపలికి పంపలేదు. సరిపడా కోరం ఉండడంతో హెచ్ఎం ఎన్నికను ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నాయకులు అక్కడి చేరుకొని ఎన్నికను అడ్డుకొని రసాభాస చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఎస్సై పి.ఆదిలక్ష్మి అక్కడి చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్న టీడీపీ నాయకులను మందలించారు. పాఠశాల ఆవరణలో నుంచి ఇరువర్గాలను బయటకు పంపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుండడంతో ఎస్సై ఆదిలక్ష్మి విధి నిర్వహణలో వేరే గ్రామానికి వెళ్లగా టీడీపీ నాయకులు మరలా ఎన్నికలను నిలిపివేయడానికి కుటిల యత్నాలు మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న ఎస్సై మరలా పాఠశాల వద్దకు చేరుకొని టీడీపీ నాయకులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పాఠశాల ఎన్నికల్లో జ్యోకంగా చేసుకోవడం సరికాదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మందలించారు. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షించి ఎన్నికలను ప్రశాంతంగా ముగించారు. చైర్మన్‌గా ఆదినారాయణమ్మ గెలుపొందగా, వైస్ చైర్మన్‌గా పెసల శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కొలువుల కల.. నెరవేరిన వేళ
నిరుద్యోగుల్లో ఉద్యోగాల ఆనంద కేళి. సర్కార్ కొలువుల కోసం ఏళ్లతరబడి నిరీక్షించిన నిరుద్యోగుల కల.. నెరవేరిన వేళ. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే నవరత్నాల అమలులో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రతిష్టాత్మకంగా గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టారు. సాక్షి, నెల్లూరు : గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక తుది ఘట్టానికి చేరింది. నోటిఫికేషన్ ప్రక్రియ నుంచి నియామక పత్రాల వరకు అంతా పారదర్శకంగా జరుగుతోంది. ఫలితాలు విడుదలైన తర్వాత అర్హత జాబితా వరకూ అంతా పక్కాగా సిద్ధం చేశారు. అభ్యర్థులకు ఎలాంటి నష్టం కలుగకుండా ఉండేందుకు అధికారులు రోస్టర్, రిజర్వేషన్లను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు. 19 శాఖలకు చెందిన అధికారులు తమ, తమ శాఖల పరిధిలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలను తనిఖీ చేసుకుని జాబితాను సిద్ధం చేసుకున్నారు. కలెక్టర్ శేషగిరిబాబు, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. తొలి రోజు నగరంలోని రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అర్హులైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపించారు. మొత్తం 7,814 గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. తొలి రోజు 1,400 పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేయనున్నారు. 1.1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్‌లెటర్లు పంపించారు. జిల్లాలో 665 గ్రామ సచివాలయాలకు 7,814 పోస్టులకు గాను 1,17,138 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. నియామక ప్రక్రియ అంతా జిల్లా పరిషత్ కార్యాలయం కేంద్రంగా జరుగుతోంది. మంగళవారం నుంచి మూడు రోజులు (24, 25, 26 తేదీలు) పాటు ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు మేరకు జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి అన్ని శాఖల అధికారులతో సోమవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు రోస్టర్, రిజర్వేషన్ల ప్రక్రియను ఒకటికి, రెండు సార్లు తనిఖీ చేసుకుని జాబితాను సిద్ధం చేసుకుని ధ్రువపత్రాల తనిఖీ సెంటర్లకు వెళ్లాలని సూచించారు. రోస్టర్‌తో మెరిట్ జాబితాను సిద్ధం చేసేందుకు జిల్లా యంత్రాంగం నాలుగు రోజుల నుంచి కసరత్తు చేస్తోంది. హెల్ప్ డెస్క్ ఏర్పాటు జెడ్పీ కార్యాలయంలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇద్దరు సిబ్బందిని నియమించారు. గ్రామాల నుంచి వచ్చే వారి సందేహాలను ఆ సిబ్బంది తీరుస్తూ ధ్రువపత్రాల పరిశీలినకు వెళ్లాల్సిన సెంటర్, అడ్రసు, తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లను వివరిస్తున్నారు. రెండు కేంద్రాల్లో తొలి రోజు మంగళవారం 6 రకాల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ్ర«ధువ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. రెండు పూటలా ఈ పరిశీలన జరుగుతోంది. నెల్లూరు నగరం దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలను , ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సర్వోదయ కళాశాలలో పరిశీల కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఆరు శాఖలకు.. తొలి రోజు విలేజ్ సెరికల్చరల్ అసిస్టెంట్, గ్రామ మత్స్య సహాయకులు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ధ్రువపత్రాల పరిశీలిన జరుగుతుంది. వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించి సర్వోదయ కళాశాలలో పరిశీలన జరుగుతోంది. ఇదిలా ఉండగా సెరికల్చర్ శాఖలో కేవలం ఇద్దరికే పోస్టులు దక్కనున్నాయి. వీరి హాల్ టికెట్ నంబర్లు 190916000058, 190516000111. గ్రామ మత్స్య శాఖ సహాయకులకు సంబంధించి 68 మందిని, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగంలో 165 మందికి, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించి 82 మందికి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. వీరందరికీ దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అర్హతల పత్రాలు పరిశీలిస్తారు. సర్వోదయ కళాశాలలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుల్లో 147 మందికి, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుల్లో 154 మందికి ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న సర్వోదయ కళాశాలలో అభ్యర్థుల ధ్రువ పత్రాలను పరిశీలిస్తారు. ఉదయం 10 గంటల నుంచే ఈ ప్రక్రియ జరుగుతోంది. ⇒ శనివారం రాత్రి అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను ఆన్లైన్లో ఉంచారు. సోమవారం ఆన్లైన్లో ఉంచిన మెరిట్ లిస్ట్‌ను జెడ్పీ, హాజరు కావాల్సిన కేంద్రాల వద్ద నోటిస్‌బోర్డులో పెట్టారు. ఆదివారం నుంచే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని అభ్యర్థులకు సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్‌ను పంపారు. ఈ మెయిల్ ఉన్న వారికి మెయిల్లో సైతం సమాచారం పంపారు. ⇒ ఈ పరిశీలనకు సకాలంలో ఎవరైనా హాజరు కాలేకపోతే ఇంకొక అవకాశం కల్పిస్తారు. ⇒ అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారుల నుంచి పొందడంలో ఆలస్యమైతే అలాంటి వారు ఈ రెండో చాన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ⇒ హాజరయ్యే అభ్యర్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, నీడ కోసం షామియానాలు తదితర కనీస వసతులు కేంద్రాల వద్ద కల్పించారు. 25వ తేదీన.. నెల్లూరు(పొగతోట): 25వ తేదీన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల (గ్రేడ్–2) ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 26న కాకుండా 25వ తేదీన జరుగుతుందని వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి సోమవారం తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి 25న ఉదయం 9.00 గంటలకు పీఎన్ఎం హైస్కూల్ జెండావీధిలో పరిశీలనకు హాజరుకావాలని తెలిపారు.అలాగే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లకు ఈ నెల 25వ తేదీ ఉదయం 10.00 గంటలకు సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హర్టికల్చర్ ఏడి కే ప్రదీప్‌కుమార్ తెలిపారు. 26న ఎడ్యుకేషన్, వెల్ఫేర్ పోస్టులకు నెల్లూరు(వేదాయపాళెం): సచివాలయ పోస్టుల నోటిఫికేషన్ పరీక్షల్లో ఎడ్యుకేషన్, వెల్ఫేర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సర్వోదయ కళాశాలలో ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంఘిక శాఖ ఉప సంచాలకులు బి.జీవపుత్రకుమార్ తెలిపారు. కొండాయపాళెం గేటు సెంటర్లోని డీడీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సోమవారం సర్టిఫికెట్ల పరిశీలనపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు సర్టిఫికెట్లను పరిశీలన కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణి కె.రాజేశ్వరి, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి విద్యారాణి, సహాయ సంక్షేమాధికారులు నరసారెడ్డి, లక్ష్మీ ప్రసూన, తేజోవతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకే.. నెల్లూరు(పొగతోట) : గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు రోస్టర్‌తో మెరిట్ జాబితాను సిద్ధం చేశామని కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం నుంచి గురువారం వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుందని వివరించారు. ప్రస్తుతానికి మొదటి రోజు హాజరుకావాల్సిన వారి మెరిట్ జాబితాలను సిద్ధం చేశామని, అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారమిచ్చామని వెల్లడించారు. ఇప్పటి వరకు 8 శాఖల మెరిట్ జాబితాలు సిద్ధమయ్యాయని వివరించారు. బుధవారం పరిశీలనకు హాజరుకావాల్సిన అభ్యర్థులకు మంగళవారం ఉదయం ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందజేస్తామని తెలిపారు. శాఖల వారీగా రోస్టర్‌తో మెరిట్ జాబితాను సిద్ధం చేశామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విషయాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. జెడ్పీ కార్యాలయ కేంద్రంగా కసరత్తు జరుగుతోందన్నారు. తొలుత జెడ్పీ కార్యాలయంలో రోస్టర్ ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులు వారి సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి, అనంతరం ప్రింట్ తీసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు సకాలంలో అందజేసేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల మెరిట్ జాబితాను జెడ్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. -
దక్షిణ కొరియా బృందంతో మంత్రి గౌతంరెడ్డి భేటీ
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై దక్షిణ కొరియా ప్రతినిధుల బృందంతో వాణిజ్య,సమాచార శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చర్చలు జరిపారు. రాబోయే ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన రంగాన్ని ప్రభుత్వం ఏవిధంగా అభివృద్ధి చేయానుకుంటుందో బృందానికి వివరించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పాలసీని తీసుకురానున్నామని, త్వరలో రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీల ఏర్పాటుకు సంబంధించిన పాలసీలను విడుదల చేస్తామని అన్నారు. విశాఖలో ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఇక నదులపై అత్యాధునిక హంగులతో ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణ కొరియా బృందం ఆసక్తిని చూపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. -
నెల్లూరులో కోలాహలంగా రొట్టెల పండుగ