రేషన్‌ కార్డులు తొలగిస్తారని భయపడొద్దు  | YSRCP Minister Anil Kumar Said Do Not Scare About Removing Ration Cards In Nellore | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డులు తొలగిస్తారని భయపడొద్దు 

Published Sat, Aug 31 2019 9:56 AM | Last Updated on Sat, Aug 31 2019 9:56 AM

YSRCP Minister Anil Kumar Said Do Not Scare About Removing Ration Cards In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : రేషన్‌ కార్డులు తొలగిస్తారని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. నగరంలోని 13వ డివిజన్‌ బాలాజీనగర్‌ గ్యాస్‌ గోడౌన్, బ్యాంక్‌ కాలనీ ప్రాంతాల్లో అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ ప్రతి పక్షంలో తాము ఉన్నప్పుడు నగరంలో సిమెంట్‌ రోడ్ల నాణ్యత పాటించడం లేదని పలుమార్లు అభ్యంతరాలు తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో హడావుడిగా ఇష్టాను సారంగా రోడ్లు వేసి రూ.కోట్లు దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో నాసిరకపు పనులు చేసి ప్రస్తుతం రూ.400 కోట్ల అప్పులు మిగిల్చి టీడీపీ నాయకులు వెళ్లారని తెలిపారు.

ఈ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ చేయిస్తామన్నారు. త్వరలో 20 నుంచి 25 శాతం వరకు రికవరీ అయ్యే అవకాశం ఉందన్నారు. 40 నుంచి రూ.60 కోట్ల వరకు వెనక్కి వస్తే నగరంలో నాణ్యత లేకుండా చేసిన పనులు తిరిగి నాణ్యతా లోపం లేకుండా చేయించే అవకాశం ఉంటుందన్నారు. టీడీపీ నాయకులు కొందరు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నా గత ప్రభుత్వం నోరుమెదపకుండా ఉందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకున్న ఇళ్లను తొలగిస్తుంటే మాత్రం ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. నగర నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులెవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే వాటిని సైతం కూల్చేస్తామని స్పష్టం చేశారు.

ఒక వేళ పేదల ఇళ్లు తొలగించాల్సి వస్తే ప్రత్యామ్నాయం చూపిన తరువాతే ఇళ్లను తొలగిస్తామన్నారు. వారిని రోడ్డుపై పడేసే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేయబోదని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఊటుకూరు మాధవయ్య, శేషు, కర్తం ప్రతాప్‌రెడ్డి, కొండారెడ్డి, తేలిమేటి రాజు, శంకర్‌రెడ్డి, రమేష్, మనోజ్, షేక్‌ మాబు, సుబ్బారెడ్డి, దేశయ్య, షేక్‌ షంషాద్, లోకిరెడ్డి వెంకటే శ్వరరెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, గణేశం వెంకటేశ్వర్లు, వేనాటి శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement